wardrobe
-
Fashion: లైట్ కలర్స్‌తో.. లగ్జరీ లుక్!
తమ క్రియేటివ్ డిజైన్స్‌తో ఇతరులను అందంగా చూపే ఫ్యాషన్ డిజైనర్లు తమ కోసం వార్డ్ రోబ్‌ను ఎంత ఘనంగా తీర్చిదిద్దుకుంటారు. ఈ విషయమై హైదరాబాద్‌లో మోడల్స్‌కి, ఫ్యాషన్ షోల కోసం డిజైన్స్ క్రియేట్ చేసే హేమంత్ సిరి ‘లెస్ ఈజ్ క్లాసీ’ అంటూ సింపుల్‌గా ఉండే తన వార్డ్ రోబ్‌ను పరిచయం చేస్తున్నారు. ‘‘చిన్నప్పటి నుంచి చేనేతలు అంటే బాగా ఇష్టం ఉండేది. దీంతో మా అమ్మ, అమ్మమ్మల చీరలను నాకు అనువుగా డిజైన్ చేసుకునేదాన్ని. నేను డిజైన్ చేసిన దుస్తులను వేసుకున్నవారు అందంగా కనిపించాలనే తపన ఎప్పుడూ ఉంటుంది. అయితే, నన్ను నేను కూడా బెస్ట్‌గా చూసుకోవాలి. నా విషయానికి వచ్చేసరికి కొన్ని ఎక్స్పర్మెంట్స్తో ΄ాటు సౌకర్యంగా ఉండేలా చూసుకుంటాను. మోడల్స్‌కి, ఫ్యాషన్ షోస్ కోసం డిజైన్ చేయడంలో ఫ్యాబ్రిక్, కలర్స్ మీద ప్రత్యేక దృష్టి పెడతాను. నాకోసం అయితే ఇండోవెస్ట్రన్ లుక్ ఉండేలా చూసుకుంటాను. కొంచెం ్ర΄÷ఫెషనల్గా ఉండాలి అనుకుంటే హ్యాండ్లూమ్ శారీస్ ఎంచుకుంటాను.లెస్ ఈజ్ క్లాసీ..ఏదైనా ఈవెంట్‌కి వెళ్లాలి అనుకుంటే ముందు నన్ను నేను తెలుపు, క్రీమ్ కలర్ డ్రెస్‌లో ఊహించుకుంటాను. అంతేకాదు, ఆర్గానిక్ కలర్స్, ఆర్గానిక్ ఫ్యాబిక్స్ర్తో సింపుల్‌గా ఫార్మల్ లుక్‌ని ఇష్టపడతాను. హెవీ శారీస్ అయినా సరే సింపుల్‌గా ఉండే బ్లౌజ్‌నే ఉపయోగిస్తుంటాను. లెస్ ఈజ్ క్లాసీ అనిపించేలా ఉంటాను.లగ్జరీ కలర్స్..పేస్టల్ కలర్స్‌లో లైట్ క్రీమ్, పింక్, గోల్డ్.. ఇష్టపడతాను. ఈ రంగులు ఒక లగ్జరీ లుక్‌తో ఆకట్టుకుంటాయి. క్రీమ్ లేదా ఐవరీ అంటేనే లగ్జరీ కలర్స్. లైట్ బ్లూ, లైట్ గ్రీన్.. వంటివి డే ఫంక్షన్స్‌కి, లైట్ సిల్వర్, లైట్ క్రీమ్ డ్రెస్సులు, శారీస్ నైట్ ఈవెంట్స్‌కి వాడతాను.ప్రయాణాల్లో సౌకర్యం..ఖ΄్తాన్స్ ఎక్కువ సౌకర్యంగా ఉంటాయి. పలాజోలు, జీన్స్, లైట్, ఫ్లోరల్ కలర్ నీ లెంగ్త్ ఫ్రాక్స్ని ఉపయోగిస్తాను.బొట్టుతో గుర్తింపు..నా పర్సనల్ స్టైలింగ్‌లో బొట్టు సిగ్నేచర్ అయిపోయింది. ముందు స్టికర్స్ వాడేదాన్ని. ఆర్గానిక్ కలర్స్పైన గ్రిప్ వచ్చాక కుంకుమ తయారు చేసుకుని, వాడుతున్నాను. వివాహవేడుకల వంటి ఎంత పెద్ద ఈవెంట్ అయినా సింపుల్ జ్యువెలరీనే ఉపయోగిస్తాను’’ అని వివరించారు ఈ డిజైనర్. – నిర్మలారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధిఇవి చదవండి: డ్యాన్సింగ్ సిటీ.. హిప్హాప్ స్టెప్స్.. -
Fashion: మై వార్డ్రోబ్: క్రియేటివ్‌గా.. హుందాగా..!
మైండ్, బాడీ ఫిట్‌గా ఉంటే డ్రెస్సింగ్ కూడా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తుంది. ‘జిమ్‌లో వర్కవుట్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే, మన వార్డ్రోబ్ మైండ్ ఎక్సర్సైజ్’ అంటున్నారు హైదరాబాద్ వాసి ఫిట్నెస్ ట్రైనర్ అనుప్రసాద్. జిమ్వేర్తో పాటు రెగ్యులర్, పార్టీవేర్ విషయంలో తీసుకునే స్పెషల్ కేర్ గురించి అనుప్రసాద్ మాటల్లో...‘‘ఉదయం ఏ డ్రెస్ వేసుకోవాలనేది ప్రతిరోజూ ఆలోచించేలా చేస్తుంది. అందుకే, క్యాజువల్ వేర్‌గా కొన్ని, సందర్భానుసారంగా వార్డ్రోబ్ను సెట్ చేసుకుంటాను. సాధారణంగా తక్కువ డబ్బులతో డ్రెస్ ఎంపిక చేసుకొని, రిచ్‌గా ఉండేలా కనిపించడానికి ప్లాన్ చేస్తుంటాను. ఇండోవెస్ట్రన్ డ్రెస్‌తోనూ హుందాతనాన్ని, మన సంస్కృతిని ప్రతిబింబిస్తూ స్టైల్‌గా కనిపించవచ్చు. పెయింటింగ్స్ వేస్తుంటాను కాబట్టి కలర్ కాంబినేషన్స్ విషయంలో అవగాహన ఉంది. చాలా వరకు మ్యాచింగ్ గురించి ఆలోచన చేయను. శారీస్ మీదకు కాంట్రాస్ట్, క్రాప్‌టాప్స్, ష్రగ్స్ కూడా సెట్ చేస్తాను. కాటన్స్కి ఎక్కువ ్రపాధాన్యత ఇస్తాను. బెస్ట్ డ్రెస్డ్ అవార్డ్..మిసెస్ ఇండియా తెలంగాణ బెస్ట్ డ్రెస్డ్ ఈవెంట్ (2019)కి క్రియేటివ్‌గా ఆలోచించాలనుకున్నాను. శారీ, బ్లౌజ్‌కి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ, బోనాలు.. మొదలైనవాటితో నేనే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేశాను. ఆ శారీనే కట్టుకున్నాను. రెండు వేల రూపాయల్లో ఆ శారీని తయారుచేసి, ప్రదర్శించి, అవార్డు దక్కించుకున్నాను.పూసలు గుచ్చి..లంగా ఓణీ, పట్టు చీరలు సంప్రదాయ వేడుకల సందర్భాలలో కట్టుకుంటాను. దీంట్లోనే ప్రత్యేకంగా కనిపించాలంటే బ్లౌజ్ సింగిల్ హ్యాండ్‌కి పూసల హారాలు లేయర్లు గుచ్చి, నాట్ చేస్తాను. దాదాపు నెలకు మూడు, నాలుగు ఈవెంట్లకు హాజరవుతుంటాను. అందుకు కొత్తదనం, నిండుదనం ఉండేలా ప్లాన్ చేసుకుంటాను.జిమ్ టీ షర్ట్స్..శారీస్‌కు సాధారణ బ్లౌజులే కాదు జిమ్‌కు వేసుకునే టీ షర్ట్స్ కూడా వాడతాను. బ్లాక్ క్రాప్‌టాప్ కాటన్ శారీకి వాడతాను. మంచి కలర్ కాంబినేషన్స్ ఉండేలా, సింపుల్ లుక్‌ని క్రియేట్ చేస్తాను. జిమ్‌లో మన కదలికలకు తగ్గినట్టు ఫ్లెక్సిబుల్ డ్రెస్ ఉండాలి. క్వాలిటీ కూడా చూడాలి. క్యాజువల్ వేర్‌గా జీన్స్, టీషర్ట్స్ మాత్రమే కాదు లాంగ్ స్కర్ట్స్ కూడా ఉపయోగిస్తాను.టై అండ్ డై చేస్తాను..వైట్ కాటన్ మెటీరియల్ తెప్పించుకొని, టై అండ్ డై టెక్నిక్‌తో కొత్త డిజైన్స్ సృష్టిస్తుంటాను. ఒక శారీకైతే వేరుశనగ గింజలను ముడివేసి, పెయింట్ చేశాను. త్రీడీ పెయింటింగ్స్ చేస్తుంటాను. ఏ వేస్ట్ మెటీరియల్ ఉన్నా దానిని అందంగా క్రియేట్ చేస్తాను. ఇండిపెండెంట్స్ డే వంటి అకేషన్స్‌కి ఎంచుకున్న శారీకి క్రాప్‌టాప్‌తో మ్యాచ్ చేశాను.జ్యువెలరీ తయారీ..తక్కువ ధరలో జ్యువెలరీ ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది. కొంచెం సమయం కేటాయిస్తే చాలు అలాంటి ఫ్యాషన్ జ్యువెలరీని మనమే ఇంకా తక్కువ ధరలో తయారుచేసుకోవచ్చు. బెల్ట్‌తో మరో స్టైలిష్ లుక్ వచ్చేలా చూసుకుంటాను. అలా.. క్లే జ్యువెలరీ, థ్రెడ్ జ్యువెలరీ నేనే తయారు చేసుకుంటాను’’ అని వివరించారు ఈ ఫిట్నెస్ ట్రైనర్.ఇవి చదవండి: 'శ్రుతి' తప్పిన ప్రకృతి.. కనురెప్పనూ కాటేసింది! -
Kadali: మై వార్డ్రోబ్.. కలర్ఫుల్గా.. కడలి అలలా!
‘కొత్త డ్రెస్ వేసుకుంటే ఆ రోజంతా హుషారుగా అనిపిస్తుంటుంది. అందుకే ఉదయం లేస్తూనే ఆ రోజు వేసుకోదగిన డ్రెస్ గురించి ప్లానింగ్ చేసుకుంటాను’ అంటోంది రచయిత్రి, సాంగ్ రైటర్ కడలి. ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చి సాహిత్యం, సినిమాల్లో కృషి చేస్తున్న కడలి పాఠకులకు పరిచితమే. ‘రైటర్ అంటే కాటన్స్ మాత్రమే వేసుకోవాలనేం ఉండదు. కంఫర్ట్‌గా ఉండే డ్రెస్సులు ఏవైనా వేసుకోవచ్చు. అందుకే నా వార్డ్‌రోబ్‌లో అన్నీ మోడ్రన్, కలర్‌ఫుల్ డ్రెస్సులు ఉంటాయి’ అంటోంది కడలి.‘‘మన వార్డ్రోబ్ మనకు ఒక అద్దం లాంటిది. ఈ విషయం చెప్పడానికి నేను రాసిన ఒక కథను పరిచయం చేయాలి. ఆ కథలో ఒక యంగ్ అమ్మాయి హీరోయిన్ అవ్వాలనుకుంటుంది. కానీ చుట్టూ రకరకాల మాటలతో డిప్రెస్ అయ్యి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. రైలు పట్టాల దగ్గరకు వెళ్లి అక్కడ జరిగిన ఒక సంఘటనతో ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. అద్దంలో తన ముఖం చూసుకొని అందంగా తయారవ్వాలనుకుని కళ్లకు కాటుక పెట్టుకుంటుంది. తర్వాత జీవితంపై ఆశతో స్వీయప్రేరణతో తనను మెరుగు చేసుకుంటుంది ఆ కథలో. అంటే మనం ఎలా ఉండాలో మన చుట్టూ ఉన్నవారు డిసైడ్ చేయరు. మనకు మనమే నిర్ణయించుకోవాలి.నాకు నేను ప్రేరణగా!నేను షార్ట్స్ కూడా వేసుకుంటాను. బట్టలను బట్టి ఒక అమ్మాయి వ్యక్తిత్వాన్ని ఎలా జడ్జ్ చేస్తారో ఇప్పటికీ అర్ధం కాదు. అందుకే కొన్ని సభలకు టీ షర్ట్స్, జీన్స్ వేసుకెళతాను. ఈ అమ్మాయా రైటర్ రా?! అని ఆశ్చర్యపోయేవారున్నారు. ఏది సౌకర్యంగా ఉంటుందో అది వేసుకున్నంత మాత్రాన వ్యక్తిత్వానికి మార్కులు వేయకూడదు. ఎవరైనా అలా అన్నా నేను పట్టించుకోను. మీటింగ్ సందర్భాలలో కుర్తీస్ వేసుకుంటాను. రెడీ అవ్వాలి అనిపిస్తే మాత్రం ఏ మాత్రం రాజీ పడను. కాన్ఫిడెంట్‌గా ఉండాలి..నా మనసుకు నచ్చిన డ్రెస్ వేసుకుంటాను కాబట్టి కాన్ఫిడెంట్‌గా కూడా ఉంటాను. నా స్నేహితుల జాబితాలో ఫ్యాషన్ డిజైనర్లు ఉన్నారు. వారి డిజైన్స్ నాతో ట్రై చేస్తుంటారు. వాటిలో నచ్చినవి తీసుకుంటాను.అమ్మ చీరలను కొత్తగా!అమ్మ కట్టుకునే చీరలు చూసి నాకూ అలా చీరలు కట్టుకోవాలనిపిస్తుంది. మా అమ్మకు మూడు బీరువాల చీరలున్నాయి. రెగ్యులర్ చీరలు తప్ప వాటిని కట్టుకోదు. దీంతో అమ్మ చీరలను నేను కట్టుకుంటుంటాను. ‘అంచు చీరలు నీవేం కట్టుకుంటావు, పెద్దదానిలా’ అంటుంది. కానీ, బ్లౌజ్ డిజైన్‌తో స్టైలిష్ లుక్ తీసుకువస్తాను. దీంతో అమ్మ కూడా ఆశ్చర్యపోతూ ‘చాలా బాగుంది’ అని కితాబు ఇచ్చేస్తుంది. పండగలు, కుటుంబ ఫంక్షన్లు, వేడుకలకు సందర్భానికి తగినట్టు లంగాఓణీలు, పట్టుచీరలు అన్నీ ప్రయత్నిస్తాను.భిన్నంగా ఉండాలని..రచయిత్రి అనగానే ముతక చీరలు, కళ్లద్దాలు ఉండాలని చాలా మంది అనుకునేవారు. కానీ, నా వార్డ్రోబ్ మాత్రం వాటన్నింటికన్నా భిన్నం. రచయిత్రులు అంటే ఇలాగే ఉండాలి అనే ఆలోచనల్లోనుంచి ఒక మార్పు తీసుకురావాలని బుక్ లాంచింగ్ వంటి కార్యక్రమాలకు జీన్స్, టాప్స్ ట్రై చేస్తుంటాను. ప్రతీ రోజూ కొత్తగా ఉండాలనుకుంటాను. ఏ డ్రెస్ వేసుకొని రెడీ అవుతామో ఆ రోజు ఆ డ్రెస్ ప్రభావం మన మీద ఉంటుంది.ఫ్యాషన్ షోలు..దేశ, విదేశాల్లోనూ ఫ్యాషన్ షోలు నడుస్తుంటాయి. వాటిలో ప్రసిద్ధ డిజైనర్లు సీజన్‌ని బట్టి కలర్, డిజైన్ థీమ్‌ని పరిచయం చేస్తుంటారు. వాటి కోసం ఆన్లైన్ సెర్చింగ్‌తో పాటు, ఫ్యాషన్ మ్యాగజీన్స్ కూడా చూస్తుంటాను. ఆ కలర్ డ్రెస్ కాంబినేషన్స్ నేనూ ప్రయత్నిస్తుంటాను. ఎక్కువగా మాత్రం బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ఇష్టపడతాను. ఆ కాంబినేషన్ డ్రెస్సులు కూడా చాలానే ఉన్నాయి నా దగ్గర’’ అంటూ వార్డ్రోబ్ విశేషాలను షేర్ చేసుకుంది. – నిర్మలారెడ్డి -
Fashion: కొన్ని మార్పులే.. కొత్తగా!
‘మనం ఎలా ఉంటున్నామో మన వార్డ్రోబ్ మనకే పరిచయం చేస్తుంది అందుకే, పర్ఫెక్ట్ ప్లాన్ కంపల్సరీగా ఉండాల్సిందే. అలాగని ఎప్పుడూ షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న వాటినే కొద్దిపాటి మార్పులతో మనదైన బడ్జెట్లో స్టయిలిష్ లుక్‌తో మార్కులు కొట్టేసేలా డిజైన్ చేసుకోవాలి. సందర్భానుసారమే కాదు సీజన్‌ని బట్టి కూడా ఎంపిక ఉండాలి..’ అంటూ తన వార్డ్రోబ్ ముచ్చట్లను మనతో పంచుకుంటున్నారు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంటున్న సుమిత కందిమళ్ల.కొన్ని మార్పులే.. కొత్తగా!ఓల్డ్ శారీస్‌తో న్యూ లుక్ ఈ రోజుల్లో ఒక మంచి డిజైన్ ఘాగ్రా కొనాలంటే చాలా ఖర్చు. అందుకని, అదే మోడల్స్‌లో అంతే లుక్‌తో ఉండే తక్కువ రేట్ లెహంగాలు ఆన్లైన్ వేదికలపై వెతికి తీసుకుంటాను. పాతికేళ్ల క్రితం ఉన్న చీరలను రీయూజ్ చేయాలనే ఆలోచనతో చుడీదార్స్, లెహంగాలను డిజైన్ చేయిస్తుంటాను. చేనేతలకు పేరొందిన ్రపాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి స్థానిక మార్కెట్లో షాపింగ్ చేస్తాను. దీని వల్ల తక్కువ బడ్జెట్లో అనుకున్నవి లభిస్తాయి.డిజైన్స్‌కి ముందుగా డ్రాయింగ్..శారీస్‌ను బట్టి బ్లౌజ్ డిజైన్స్ నాకేవి బాగుంటాయో ఒక పేపర్ మీద డ్రా చేసుకుంటాను. ఆ తర్వాత ఎప్పుడూ కుట్టించే టైలర్ దగ్గర ఇస్తాను. మనం ఉండే ప్లేస్, వాతావరణాన్ని బట్టి కూడా స్టైల్ మార్చుకోవాల్సి ఉంటుంది. నైట్ పార్టీ అయితే షిమ్మర్, గ్లిట్టర్ లైట్ వెయిట్ డ్రెస్సులను ఎంపిక చేసుకుంటాను. వేసవిలో కంచిపట్టు కాకుండా బెనారస్, షిఫాన్స్ని ఎంపిక చేసుకుంటాను. పూజలు అంటే పట్టు చీరలు సహజమే. పెళ్లి, రిసెప్షన్ వంటివాటికి చీరలు కట్టినా హెయిర్‌స్టైల్స్‌లో మార్పులు చేసుకుంటాను. జ్యువెలరీని కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తుంటాను. వీటికి తగినట్లుగా డిజైనర్ బ్యాగ్స్, సన్‌గ్లాసెస్, వాచీ కలెక్షన్స్ యూజ్ చేస్తాను.కలర్స్.. కాంట్రాస్ట్..ఎప్పుడూ ఒకే తరహా వేస్తే డ్రెస్సింగ్ అయినా, కలర్ కాంబినేషన్స్ అయినా బోర్‌గా అనిపిస్తుంది. కొన్నిసార్లు గ్రీన్ షేడ్స్‌లో కావాలనుకుంటే మోనోక్రోమ్ లుక్‌లో ప్లాన్ చేసుకుంటాను. ఒక్కోసారి పూర్తిగా కాంట్రాస్ట్ వేసుకుంటాను. నా డ్రెస్సింగ్ లేదా మేకప్‌లో ఏమైనా చేంజెస్ కోసం మా అమ్మాయిల సూచనలూ తీసుకుంటాను. బర్త్ డే పార్టీలకు పూర్తిగా వెస్ట్రన్ వేర్, డే టైమ్ అయితే నీ లెంగ్త్, ఈవెనింగ్ అయితే షార్ట్స్ కూడా ప్లాన్ చేసుకుంటాను. కొన్నింటిని డెనిమ్, లెదర్ జాకెట్స్‌తో కవర్ చేసేవీ ఉంటాయి.ముగ్గురం... డిఫరెంట్‌గా!నాకు ఇద్దరూ అమ్మాయిలే కాబట్టి నాతోపాటు వారికీ అన్నీ సెట్ చేయాల్సిందే. చాలావరకు ఫ్యామిలీ కాంబినేషన్ సేమ్ కలర్ థీమ్ అంటుంటారు. కానీ, ఒక్కొక్కరు ఒక్కో స్కిన్ టోన్‌లో ఉంటారు. వారికి నచ్చిన కలర్ కాంబినేషన్స్ తీసుకొని ప్లాన్ చేస్తాను. ఒకరిని ట్రెడిషనల్‌గా, మరొకరిని ఫ్యాన్సీగా తయారు చేస్తాను. నేను వారికి భిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటాను.ఒకరికి బ్రేస్లెట్స్ ఇష్టం, మరొకరికి రింగ్స్ ఇష్టం. నాకు గాజులు బాగా ఇష్టం. ఒకరు బ్రేస్లెట్ ధరిస్తే, మరొకరు పది, పదకొండు రింగ్స్ పెట్టుకుంటారు. ఇంకొకరు బ్యాంగిల్స్ ఎక్కువగా వేసుకుంటారు.తిరుపతికి వెళితే అక్కడి నుంచి రకరకాల గాజులు కొనుక్కొస్తాను. డ్రెస్‌కు తగినట్టు గాజులు అలా సెట్ చేస్తాను. ప్రతి ఫంక్షన్స్‌కి 2–3 రోజుల ముందే ప్రతిదీ సెట్ చేసి ఉంచుతాను.ఆల్‌టైమ్ ఫేవరెట్..మగ్గం వర్క్‌లో థ్రెడ్ వర్క్ కన్నా జర్దోసి వర్క్ చాలా ఇష్టం. అందుకే, వెల్వెట్ మీద హెవీ వర్క్ చేయించాను. ఇది ఎప్పటికీ ట్రెండ్‌లో ఉంటుంది. వెల్వెట్ లెహంగాకి ఎంబ్రాయిడరీ చేయించాను. దానికి బ్లౌజ్ మారుస్తుంటాను. మగ్గం వర్క్‌లో క్వాలిటీ మాత్రం మిస్ కాకూడదు.పాతదైనా ప్రత్యేకమే..మా అమ్మమ్మ చీరల్లో నుంచి నా దగ్గరకు ఒక గద్వాల కాటన్ శారీ వచ్చింది. అప్పటి నేత ఇప్పటికీ బాగుంటుంది. దానిని కూడా డిజైనర్ బ్లౌజ్‌తో ఫంక్షన్స్‌కి కట్టుకుంటాను. ఏ చీర కొన్నా నా తర్వాత నా పిల్లలకు ఆ చీరలు వెళ్లేలా ప్లాన్ చేసుకుంటాను. నా పెళ్లప్పుడు కొన్న కోటా చీర ఇప్పటికీ కట్టుకుంటాను. -
Fashion: మనుసుకు నచ్చిన రంగులు.. కలర్ – కంఫర్ట్!
‘మనసుకు నచ్చిన రంగులు ఉండాలి. ట్రెండ్‌కు తగినట్టు ఉండాలి. స్పెషల్ లుక్ అనిపించాలి. అన్నింటికి మించి సౌకర్యంగా ఉండాలి’అంటూ ఎంచుకునే డ్రెస్సింగ్ విషయంలో తీసుకునే జాగ్రత్తల గురించి హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఉంటున్న నిఖితారెడ్డి తన వార్డ్రోబ్ ముచ్చట్లను ఈ విధంగా పంచుకున్నారు.ఐదేళ్ల లోపు పిల్లలకు ఎంబ్రాయిడరీ డ్రెస్సులు ఆన్లైన్లో చాలా డిజైన్స్ వస్తున్నాయి. నా శారీ కలర్ లేదా పార్టీ థీమ్ కలర్‌ని బట్టి వాటిని ఎంపిక చేసుకుంటాను. పాప వేసుకున్న పింక్ కలర్ లెహంగా, దుపట్టా అలా ప్లాన్ చేసిందే. పట్టు డ్రెస్సులు మాత్రం మెటీరియల్ తీసుకొని, స్టిచింగ్ చేయిస్తాను.కలర్ కాంబినేషన్స్..నా ఫేవరెట్ కలర్స్ ఆరెంజ్, పింక్. దీంతో నా వార్డ్‌రోబ్‌లో ఈ కలర్ కాంబినేషన్ డ్రెస్సులు ఎక్కువ చేరుతుంటాయి. అయితే, ఒకే విధంగా కాకుండా డిఫరెంట్ కాంబినేషన్స్‌లో ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. చుడీదార్ ఎంపిక చేసుకున్నా ఒక చిన్న ఆరెంజ్ ఎలిమెంట్ అయినా ఉండాలి. ఇదే కాంబినేషన్లో బేబీ షవర్ సమయంలో మా ఫ్యామిలీ షూట్‌కి పట్టుచీర, కుర్తా పైజామా సెట్ ఆరెంజ్ కాంబినేషన్ ఉండేలా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నాం.సెలబ్రిటీ స్టయిల్..ఆరెంజ్ శారీ స్టైల్లో నటి అదితీరావు హైదరీ ఫొటో సోషల్ మీడియా లో చూశాను. నాకు బాగా నచ్చింది. ఆ విధంగా ఉండాలని ఆరెంజ్ శారీ, బ్లౌజ్ మెటీరియల్ అన్నీ సొంతంగా ఎంపిక చేసుకుని, డిజైన్ చేయించుకున్నాను. ముత్యాలు, పచ్చలు, కుందన్స్ కాంబినేషన్ జ్యువెలరీని దానికి సెట్ చేశాను.మిక్స్ అండ్ మ్యాచ్..పెళ్లి సమయంలో తీసుకున్న చీరలు, అమ్మవాళ్లు కానుకగా ఇచ్చినవి.. ప్రత్యేక సందర్భాలలో వేసుకోవడానికి బ్లౌజ్ డిజైన్స్ ద్వారా మార్పులు చేస్తుంటాను. కానీ, చాలా వరకు ఏ డ్రెస్ సెట్ ఎలా ఉంటే అలాగే వేసుకోవాలనుకుంటాను. పెద్దగా మిక్స్ అండ్ మ్యాచ్ చేయను.థీమ్ పార్టీలు..ముందుగా కంఫర్ట్‌గా ఉండే డ్రెస్సులకే ్రపాధాన్యత ఇస్తాను. ఇప్పుడు మదర్ డాటర్ కాంబినేషన్ సెట్స్ వస్తున్నాయి. వాటిని ప్లాన్ చేస్తాను. అలాగే, పాపకు నాకు బర్త్ డే గిఫ్ట్స్ డ్రెస్సులు వస్తుంటాయి. వాటిని చిన్న మార్పులతో థీమ్డ్ పార్టీలకు ప్లాన్ చేస్తాను.ఎంబ్రాయిడరీ.. క్వాలిటీ ఫస్ట్..ఫ్లోరల్ ప్రింట్స్ స్టోర్స్‌లోనూ ఆన్‌లైన్‌లోనూ మార్కెట్లో ఎంపిక చేసుకుంటాను. కానీ, ఎంబ్రాయిడరీ అయితే కొన్ని ప్రత్యేకమైన చోట్లనే బాగుంటాయి. డిజైన్ పరంగానూ, క్వాలిటీ పరంగానూ బాగున్నవి అయితేనే ఎంబ్రాయిడరీ డ్రెస్సులను ఎంపిక చేసుకుంటాను.ఫ్లోరల్స్..దగ్గరి బంధువుల పెళ్లిలో ప్రతిదీ వేడుకగా ఉండాల్సిందే. ముఖ్యంగా సంగీత్, హల్దీ, రిసెప్షన్.. వంటి వేడుకలకు వైవిధ్యంగా ఉండాలి. హల్దీ ఫంక్షన్ కోసం రెడీ అవ్వడానికి ఫ్లోరల్ డిజైన్స్, ఫ్లోరల్ జ్యువెలరీ బాగుంటుంది. ఇందుకు ఆన్లైన్ మార్కెట్లోనూ మంచి మంచి మోడల్స్ లభిస్తున్నాయి. ఫ్లోరల్ డిజైన్స్ అలా ఎంపిక చేసుకుని తీసుకున్నవే. మా కజిన్ హల్దీ ఫంక్షన్‌కి డ్రెస్ ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. వెస్ట్రన్ స్టయిల్..బ్లాక్ థీమ్డ్ డ్రెస్‌ను న్యూ ఇయర్ సందర్భంగా, కజిన్స్‌తో బర్త్డేస్కు వెళ్లాలంటే మోడర్న్‌గా ఉండేవి ప్లాన్ చేసుకుంటాను.ప్రయాణాలకు ఒక స్టయిల్..ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎగ్జిబిషన్స్ స్టాల్స్ పెడుతుంటారు. వాటిలో లాంగ్ ఆరెంజ్ ఫ్రాక్ ఎంపిక చేసుకున్నాను. ఇలాంటివి టూర్స్‌కి వెళ్లినప్పుడు వేసుకుంటాను. వాటిల్లో ఫొటోస్ కూడా బ్రైట్‌గా వస్తాయి. అలాగే, లాంగ్ ఫ్రాక్స్లోనే డిఫరెంట్ మోడల్స్ ఉండేలా చూసుకుంటాను. -
Lakshmi Lehr: అదీ స్టయిల్ అంటే! సింపుల్ అండ్ కంఫర్టబుల్ అన్నమాట!
అందుబాటులో ఉన్న వనరులతోనే అద్భుతాలను క్రియేట్ చేసేవాళ్లను నేర్పరులు అంటారు. ఆ కేటగరీలో లక్ష్మీ లెహర్‌ను చేర్చొచ్చు. పర్ఫెక్షన్ కోసం ప్రపంచంలో ఉన్న ద బెస్ట్‌ని ఆర్డర్ చేయదు. కళ్ల ముందున్న వాటితోనే ప్రపంచానికి ద బెస్ట్‌ని చూపిస్తుంది. అందుకే ఆమె సెలబ్రిటీ స్టయిలిస్ట్ అయింది.లక్ష్మీ ముంబై నివాసి. ఫ్యాషన్ డిజైనింగ్ గ్రాడ్యుయేషన్ తర్వాత పలు ఫ్యాషన్ పత్రికల్లో పనిచేసింది. ప్రాక్టికల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం ప్రముఖ సెలబ్రిటీ స్టయిలిస్ట్ అనాయితా శ్రాఫ్ స్టయిలింగ్ కంపెనీ ‘స్టయిల్ సెల్’లో చేరింది. ఆమె సృజనకు, పనితీరుకు అనాయితా ఇంప్రెస్ అయింది. ఆమె స్థాయి స్టార్ స్టయిలింగ్ అని గ్రహించింది. లక్ష్మీని సెలబ్రిటీ సర్కిల్‌కి పరిచయం చేసింది. ముందుగా.. కరీనా కపూర్ ఎయిర్ పోర్ట్ అపియరెన్స్కి స్టయిలింగ్ చేసింది లక్ష్మీ. ఆ కూల్ లుక్స్‌కి.. కరీనాను క్యాప్చర్ చేయడానికి ఫాలో అయిన పాపరాట్సీ ఫిదా అయిపోయారు.కరీనా ఫ్యాన్స్ అయితే క్రేజీ.. చెప్పక్కర్లేదు. ఆ స్టయిల్ని కరీనా కూడా కంఫర్ట్‌గా ఫీలై.. స్పెషల్ అకేషన్స్‌కి ఆమెను స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకుంది. లక్ష్మీ స్టయిలింగ్‌ని కియారా ఆడ్వాణీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, జాన్వీ కపూర్, ఆలియా భట్, సారా అలీ ఖాన్, అనన్యా పాండే, శ్రద్ధా కపూర్, రశ్మికా మందన్నా, సమంత, పూజా హెగ్డేలూ కోరుకున్నారు.ఆ సెలబ్రిటీల క్యాజువల్ లుక్ నుంచి రెడ్ కార్పెట్ వాక్స్, కార్పొరేట్ ఈవెంట్స్, ఎండార్స్మెంట్స్, సినిమా ప్రమోషన్స్, ఫంక్షన్స్, పెళ్లిళ్లు.. అంతెందుకు వాళ్లు గడపదాటాలంటే చాలు లక్ష్మీ వాళ్లను స్టయిలింగ్ చేయాల్సిందే! అంత డిమాండ్‌లో ఉంది ఆమె. సెలబ్రిటీ ఒంటి తీరు, బాడీ లాంగ్వేజ్‌ని బట్టి స్టయిలింగ్ చేస్తుంది లక్ష్మీ. సింపుల్ చేంజెస్తోనే వైబ్రెంట్‌గా కనిపించేలా వాళ్లను మారుస్తుంది. ఫిమేల్ సెలబ్రిటీలే కాదు మేల్ సెలబ్రిటీలూ ఆమెకు ఫ్యాన్సే! వాళ్లలో రితిక్ రోషన్ ముందుంటాడు. తర్వాత సైఫ్ అలీ ఖాన్. ఆ ఇద్దరికీ లక్ష్మీ స్టయిలింగ్ చేస్తోంది.స్టయిల్ అంటే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్! స్టయిలింగ్ కోసం ప్రపంచ బ్రాండ్స్ అన్నిటినీ వార్డ్‌రోబ్‌లో నింపక్కర్లేదు. ఉన్న రెండు జతలతో కూడా స్టయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే మనకు ఏది నప్పుతుంది.. ఏది సౌకర్యంగా ఉంటుందనే స్పృహ ఉండాలి. అంతేకాదు మనమున్న చోటునూ దృష్టిలో పెట్టుకోవాలి. నలుగురిలో కలసిపోయినట్టు ఉంటూనే మన ప్రత్యేకతతో మెరిసిపోవాలి. అదీ స్టయిల్ అంటే! సింపుల్ అండ్ కంఫర్టబుల్ అన్నమాట. నేను స్టయిలింగ్ చేసిన సెలబ్రిటీల్లో నాకు.. కరీనా, జాక్వెలిన్, సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్లు అంటే చాలా ఇష్టం! – లక్ష్మీ లెహర్ఇవి చదవండి: ధైర్యసాహసాలు అనగానే మరో ఆలోచనే.. చమేలీ.. ఓ ధీశాలి! -
తక్కువ బడ్జెట్లో బెటర్లుక్.. హుందాగా... కంఫర్ట్‌గా!
‘‘జాబ్, స్కూల్‌కి వెళ్లే ఇద్దరు పిల్లలు, ఫ్యామిలీతో టైమ్ అసలు సరిపోదు. అయితే మనకోసం మనం కొంచెం టైమ్ అయినా ఉండేలా చూసుకోవాలి అనుకుంటాను. నలుగురిలోకి వెళ్లినప్పుడు ప్రత్యేకంగా కనిపించడానికి, అదే విధంగా నా బడ్జెట్ ప్రకారం డ్రెస్సింగ్ ఉండేలా ఎంపిక చేసుకుంటాను.వేడుకలకు, ప్రత్యేక రోజుల్లో రెడీ అవడానికి ప్రతీ ఒక్కరూ తమదైన ప్టైటల్ని డ్రెస్సింగ్‌లో చూపుతుంటారు. హైదరాబాద్ ఎల్.బినగర్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని చందనామారం తన డ్రెస్సింగ్ గురించీ, వార్డ్రోబ్ విషయాలను ఈ విధంగా షేర్ చేసుకున్నారు. హుందాగా...ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు డిగ్నిఫైడ్గానూ, కంఫర్ట్గానూ ఉండేలా చూసుకుంటాను. అందుకు కుర్తీలు, జీన్స్ ఉంటాయి. వీటిలోనే మిక్స్ అండ్ మ్యాచ్‌కి ట్రై చేస్తుంటాను.డిజైనర్ శారీస్..రిసెప్షన్ వంటి వేడుకలకు డిజైనర్ శారీస్‌ను ఎంచుకుంటాను. జనరల్‌గా మార్కెట్లో వస్తున్న ట్రెండ్స్‌ను కూడా ఫాలో అవుతుంటాను. వీటిలో నాకు ఎలాంటి ఔట్ఫిట్ అయితే బాగుంటుందో చెక్ చేస్తుంటాను. స్టిచింగ్కు సంబంధించినప్పుడు ఇన్‌స్టా పేజీలు కూడా చూస్తుంటాను. అలాంటి డిజైన్స్ చేయమని బొటిక్స్లో చెబుతుంటాను. శారీకి తగినట్టు బ్లౌజ్ సెట్ చే యడానికి డిజైనర్ హెల్ప్ తీసుకుంటాను.తక్కువ బడ్జెట్లో బెటర్లుక్..పెళ్లి, ఇంట్లో పండగలు వంటి సందర్భాలలో మనదైన సంప్రదాయ కట్టునే ఇష్టపడతాను. దీనికోసం ఎక్కడైనా శారీస్ కలెక్షన్ గురించి కూడా తెలుసుకుంటాను. కొన్నిచోట్ల నచ్చినా బడ్జెట్ మించి ఉంటే తీసుకోను. అయితే, అవే మోడల్స్‌లో మరో చోట ఒకటికి బదులు రెండు చీరలు వచ్చేలా ఎంపిక చేసుకోవడం గురించి ఆలోచిస్తుంటాను. తక్కువ బడ్జెట్లో మంచి డ్రెస్సింగ్ ఉండేలా చూసుకుంటాను. సాధారణంగా ఎక్కువ డబ్బులు పెట్టి కొన్న చీరలు, డ్రెస్సులు వేసుకుంటే నలుగురిలో వెళ్లినప్పుడు మన అప్పిరియన్స్ బాగుంటుంది అనుకుంటారు. కానీ, తక్కువ బడ్జెట్లో బెటర్‌గా కనిపించేలా ΄్లాన్ చేసుకోవడం మంచిది’’ అని వివరిస్తున్నారు ఈ ఉద్యోగిని.నోట్: మీరూ మీ వార్డ్రోబ్ లేదా మీ అమ్మాయి వార్డ్రోబ్ గురించి, డ్రెస్సింగ్ విషయంలో తీసుకుంటున్న విశేషాల గురించి ఫొటోలతో సహా ‘సాక్షి’ ΄ాఠకులతో పంచుకోవచ్చు. బాగున్న వాటిని మై వార్డ్రోబ్ శీర్షికన ప్రచురిస్తాం. మా చిరునామా: మై వార్డ్రోబ్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ –34. sakshifamily3@gmail.com -
Fashion Tips: వర్షాకాలంలో ఈ దుస్తులు అస్సలు వద్దు! ఇవి వాడితే బెటర్!
Comfortable Wardrobe Ideas For Monsoon: అసలే ముసురు. అలాగని వెచ్చగా ఇంట్లో మునగదీసుకుని పడుకుందామంటే చదువులెలా సాగుతాయి? ఉద్యోగాలెలా చేస్తాం? రెయిన్ కోటు తగిలించుకునో గొడుగేసుకునో బయటికి వెళ్లక తప్పదు. అయితే మనం ధరించే దుస్తులు మాత్రం వానకు తగ్గట్టు లేకపోతే అసౌకర్యం తప్పదు మరి. అలాకాకుండా ఈ వానలకు ఎలాంటి దుస్తులయితే బాగుంటుంది, యాక్సెసరీస్ ఏవి బాగుంటాయి... చూద్దాం. వర్షాకాలంలో యువతరం బట్టల గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఇక కాలేజీకి వెళ్లే విద్యార్ధులకు దీని పట్ల మరింత శ్రద్ధ అవసరం. ఎండల్లో పల్చని రంగులు వాడినప్పటికీ ఇప్పుడు ముదురు రంగులు వాడటం ఉత్తమం. ఎందుకంటే వాతావరణం డల్‌గా ఉంటుంది కాబట్టి ముదురు రంగు దుస్తులు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అలాగని భారీగా ఉండకూడదు. తేలికపా వి అయితేనే మంచిది. వాటిలో తెలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం ఈ కాలంలో ఎంతో శ్రేయస్కరం ఇవి బాగుంటాయి! ►కాటన్, సింథటిక్ ఫ్యాబ్రిక్ వంటి దుస్తులను వాడటం మంచిది. ►సాయంకాలం సమయంలో ఫ్రాక్స్, అనార్కలీ బాగుంటాయి. ►స్కిన్ టైట్, లెగ్గింగ్స్ కూడా బాగుంటాయి. ►అదే విధంగా చీరలు, చుడిదార్లు ధరించే వారు శాండిల్స్, షూస్ వంటి వాటిని వేసుకుంటే మంచిది. ►హ్యాండ్ బ్యాగులు చిన్న సైజులో కాకుండా, కాస్త పెద్దవిగా ఉన్నవి అయితేనే నయం. ఇవి వద్దు! ఇలా చేస్తే మేలు! ►మరో విషయం ఏమిటంటే... వర్షాకాలం లో పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెంట్గా ఉండే దుస్తులకు దూరంగా ఉండటం ఉత్తమం. ►బట్టలు పొడిగా వుంచుకోవాలి. తడి వల్ల బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది. అందుకే ఎక్కువసేపు తడిగా వుండకూడదు. ►తెలుపు రంగు బట్టలకు మురికి పట్టిందంటే తొందరగా వదలదు. ►ఏ చిన్న మరక పడ్డా అల్లంత దూరానికి కూడా కనిపించి అసహ్యంగా వుంటుంది కాబట్టి ముదురు రంగు బట్టలు వాడితే మంచిది. ►ముసురు తగ్గాక దుప్పట్లు, రగ్గులు, బొంతలు, దిళ్లు, పరుపులు, మందపాటి బట్టలను కాసేపు అలా ఎండలో వేస్తే బావుంటాయి. వాసన కూడా రాదు. ►శరీరం ఎప్పుడూ సాధారణ ఉష్ణోగ్రతలో వుండేలా చూసుకోవాలి. ►శరీర ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు క్రిములు దాడి చేసే ప్రమాదం ఎక్కువ. ►వానాకాలం అన్నాళ్లూ బయటికెళ్లేటప్పుడు గొడుగు/రెయిన్‌కోట్ వెంట వుండాలి. ►వర్షాకాలంలో ఎక్కువగా మేకప్ వేసుకోకపోవడమే మంచిది. జీన్స్ అసలే వద్దు! ►ఈ కాలంలో జీన్స్ జోలికి వెళ్లకూడదు. మరీ ముఖ్యంగా టైట్ జీన్స్ అసలు వద్దు. ►అలాగే వర్షాకాలంలో స్లిప్పర్స్ కంటే షూ వాడడం బెటర్. లేదంటే శాండిల్స్ అయినా ఫరవాలేదు. ►స్లిప్పర్స్ వేసుకుంటే మాత్రం బట్టలపై బురద మరకలు పడి అసహ్యంగా కనిపిస్తాయి. ►అంతేకాకుండా బురదగా ఉన్న ప్రదేశంలో చెప్పులు వేసుకుని నడిస్తే జారిపడే అవకాశం ఉంది. చదవండి: Nazriya Nazim Saree Cost: నజ్రియా ధరించిన ఈ చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! స్పెషాలిటీ? -
పార్ట్‌టైం జాబ్‌తో నెలకు 50వేల సంపాదన.. ఎలానో తెలుసా?
ఉద్యోగం చేసి జీతం సరిపోకపోతే, అదనపు సంపాదన కోసం పలువురు పార్ట్‌టైం ఉద్యోగం చేస్తుంటారు. పార్ట్ టైం ఉద్యోగాలు కొన్ని కష్టంగా ఉంటే.. మరికొన్ని మాత్రం ఆడుతు పాడుతు చేసివిగా ఉంటాయి. పార్ట్ ఉద్యోగాలు కొన్ని.. ఫన్నీగా అనిపించినా ఆదాయం మాత్రం భారీగా ఉంటుంది. తాజాగా ఓ యువతి పార్ట్ ఉద్యోగం చేసి నెలకు రూ.50వేలు సంపాదిస్తోంది. ఆ పార్ట్ టైం ఉద్యోగం ఏంటో తెలుసా? బట్టలు సర్దడం. అదేంటని ఆశ్చర్య పోతున్నారా? మీరు విన్నది నిజమే.. విదేశాల్లో వార్డ్‌రోబ్‌లో బట్టలు సర్దుకుంటారు. వాటిని సర్దుకునే టైమ్‌లేని వాళ్లు.. ఇతరులతో ఆ పని చేయించుకొని డబ్బు ఇస్తారు. ఇంగ్లండ్‌లోని లైసెస్టర్‌కు చెందిన ఎల్లా అనే ఓ యువతి.. అదనపు డబ్బు కోసం ఓ పార్ట్ టైం జాబ్ వెతుక్కుంది. అదే వార్డ్‌రోబ్‌లో బట్టల్న సర్దడం.. కలర్లు, బట్టల రకాలను బట్టీ సర్దడం. బట్టలను అందంగా వార్డ్‌రోబ్‌లో సర్దడం కూడా ఓ రకమైన ఆర్ట్. పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ.. మంచి నైపుణ్యం సంపాదించింది ఆమె. బట్టలు సర్దడం కోసం ఎల్లా గంటకు 1500 నుంచి 2000 ఛార్జ్ వేస్తుంది. ఆమె పనితీరు కస్టమర్లకు నచ్చడంతో.. పార్ట్‌టైం ఉద్యోగంతోనే ఎల్లా వేలకువేలు సంపాదిస్తోంది. ప్రస్తుతం ఆమెకు 20 మంది వరకు రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. ఇలా బట్టలు సర్ది.. ఎల్లా ప్రస్తుతం నెలకు 50వేల దాకా ఆదాయాన్ని వెనకేస్తోంది. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో.. ఇలా కూడా సంపాదిస్తారా! అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
#trending: బీరువాలో ఇలాంటి దృశ్యం చూశారా..?!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పలు కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఫార్మ కంపెనీలో జరిపిన సోదాలో ఐటీ అధికారులు 142.87కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కంపెనీకి సంబంధించి మొత్తం 16 బ్యాంకు లాకర్లతో పాటు.. ఇప్పటి వరకు లెక్కల్లో చూపని 550 కోట్ల రూపాయల ఆదాయం గుర్తించినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. ఈ దాడులకు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకు ఆ ఫోటోలో ఏం ఉందంటే బీరువా. బట్టలు పెట్టుకునే బీరువా ఫోటో వైరల్ కావడం ఏంటంటే.. మనలాంటి సామాన్యులు బీరువాలో బట్టలు పెడతారు.. కానీ సదరు ఫార్మా కంపెనీ బీరువాను డబ్బు కట్టలతో నింపింది. ఎక్కడా కొంచెం కూడా ఖాళీ లేకుండా డబ్బు కట్టలను బీరువా నిండ పేర్చింది. (చదవండి: Hyderabad: ప్రముఖ ఫార్మా కంపెనీలో సోదాలు.. రూ.142 కోట్లు సీజ్) ఈ ఫోటో చూసిన నెటిజనులు వార్నీ మా బీరువాలో బట్టలు సర్దిని తరువాత కూడా చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది.. ఇదేందిరా నాయనా ఇన్ని డబ్బు కట్టలు.. అబ్బ ఒక్క కట్ట నాకు దొరికితే లైఫ్ సెటిల్ అవుతుంది.. నోట్ల రద్దు ఫలించలేదు.. నోట్ల రంగు ఆకారం మారింది అంతే.. అరే 2000 రూపాయల నోట్లు వాడి ఉంటే.. 75 శాతం జాగా మిగిలేది.. మరిన్ని డబ్బులు దాచుకోవడానికి అవకాశం ఉండేది అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజనులు. చదవండి: శశికళకు మరో భారీ షాక్: రూ.వంద కోట్ల ఆస్తులు సీజ్ -
అవునా! క్లాత్‌తోనా!!
వార్డ్‌రోబ్‌లో కొన్నాళ్లుగా వదిలేసిన డ్రెస్సులు, స్కార్ఫ్‌లు, దుపట్టాలు మొదలైనవి చెక్కుచెదరకుండా అలాగే పడి ఉంటాయి. లేదంటే డ్రెస్ కుట్టగా మిగిలిన అదనపు క్లాత్‌లు, గిఫ్ట్ ప్యాక్‌లకు వచ్చే రంగు రంగుల రిబ్బన్లు చెత్తబుట్టలోకి చేరుతుంటాయి. కొంచెం సృజన, మరికొంచెం ఆసక్తి జోడిస్తే ఖాళీ సమయంలో ఇలాంటి అందమైన ఆభరణాలను ఎన్నో రూపొందించుకోవచ్చు. రిబ్బన్ మెటీరియల్‌తో గులాబీలుగా చుట్టి కుట్టాలి. వీటికి ముత్యాలు, చీర రంగుకు మ్యాచ్ అయ్యే పూసల దండను జత చేర్చితే ఇలా అందమైన కంఠాభరణం సిద్ధం.రంగు రంగు క్లాత్‌ను తీసుకొని దానిని పొడవుగా కత్తిరించి, జడను అల్లిన విధంగా రెండు మూడు వరసలుగా అల్లాలి. ఒక వరుసకు ఉడెన్ బీడ్స్ జత చేస్తే ఆధునిక అమ్మాయిలు ఇష్టపడే నెక్ జూవెల్రీ రెడీ. పసుపు, నారింజ, పచ్చ కాటన్ క్లాత్‌లను చుట్టి, మధ్య మధ్య మరో దారంతో ముడులు వేయాలి. ఒక వరస జడలా క్లాత్‌తో అల్లాలి. వీటికి కలంకారీ బెల్ట్‌ను జతచేయాలి. మోడ్రన్ డ్రెస్‌ల మీదకు ఆకర్షణీయంగా ఉంటుంది. పట్టు, బెనారస్ చీరల అంచు లేదా జాకెట్టు కుట్టగా మిగిలిన ఫ్యాబ్రిక్‌తో ఈ అందమైన లాకెట్‌ను రూపొందించవచ్చు. ఇందుకు రెండు రంగుల ఫ్యాబ్రిక్, పెద్ద డ్రెస్ బటన్, పూసలు జత చేసి ఈ అందమైన లాకెట్‌ను రూపొందించవచ్చు.రంగుమారిన ప్లాస్టిక్, ఉడెన్ గాజులకు ఇలా రంగు దారాలతోనూ, బట్ట ముక్కలతో గ్లూతో అతికిస్తూ చుడితే నాజూకు చేతులను ఆకర్షణీయంగా మార్చేస్తాయి. -
బిస్కట్ల కోసం బీరువాలోనే ప్రాణాలొదిలింది!
ఆ బామ్మకు తీపి అంటే ప్రాణం. కానీ షుగర్ వ్యాధి ఉంది. తీపి తింటే ఆమె ఆరోగ్యానికి ముప్పు. అందుకే ఆమె కొడుకు ఆమెకు ఇష్టమైన బిస్కట్లను అందకుండా దాచిపెట్టాడు. ఓ బీరువాలో వాటిని ఉంచాడు. అయినా ఆ బామ్మ మనస్సు చంపుకోలేదు. బిస్కట్లను వెతికే క్రమంలో బీరువాలో ఇరుక్కుపోయింది. బిస్కట్లు అందాయో లేదో కానీ గాలి మాత్రం అందలేదు. ఊపిరి అందాక బీరువాలోనే ప్రాణాలొదిలేసింది. ఈ విషాద ఘటన ఈశాన్య ఇటలీలోని ఉడిన్లో ఈ ఘటన జరిగింది. కొడుకు దాచిపెట్టిన బిస్కట్లను వెతుకుతూ 84 ఏళ్ల వృద్ధురాలు బీరువాలో ఇరుక్కుపోయింది. శరీరబరువు కారణంగా బీరువాలోని దుస్తుల్లో మధ్య నలిగిపోయిన ఆమె చివరకు శ్వాస ఆడక ప్రాణాలు వదిలింది. స్థానిక అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆమె మృతదేహాన్ని బీరువాలోంచి వెలికి తీశారు. ఈ ఘటన స్థానికంగా ఉన్నవారిని కలిచివేసింది. -
మిషెల్ ఒబామా బట్టల బిల్లు కట్టేదెవరు?
మామూలుగానే అమెరికా అధ్యక్షుడి భార్యలు భలే హై ప్రొఫైల్ గా ఉంటారు. సందర్భోచిత దుస్తులతో దర్శనమిస్తారు. వాళ్ల స్టయిల్, వేసుకున్న దుస్తుల గురించి ఫాషన్ మాగజైన్ల నుంచి టాబ్లాయిడ్ల దాకా తెగ చర్చిస్తారు. ఇక ఒబామా శ్రీమతి మిషెల్ దుస్తుల గురించి చెప్పనే అక్కర్లేదు. ఆమె 'మోస్ట్ స్టైలిష్ ఫస్ట్ లేడీ' గా ఇప్పటికే పేరొందారు. గంటకో స్కర్టు, గడియకో గౌను తో ఆమె దర్శనమిచి, కెమెరామెన్లకు బోలెడంత పనిపెట్టారు. అయితే ఆమె దుస్తుల ఖర్చు ఎవరు భరిస్తారు? ఆమెకు జీతం లేదు. వార్డ్ రోబ్ అలవెన్స్ కూడా లేదు. అయితే ఆమె దుస్తుల ఖర్చు ఆమే భరిస్తారు. మామూలుగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఫస్ట్ లేడీకి దుస్తులు గిఫ్ట్ ఇవ్వడమూ జరుగుతుంది. కానీ వాడిన తరువాత వాటిని వెంట తీసుకెళ్లడానికి వీలుండదు. అమెరికన్ జాతీయ వస్తు సంగ్రహాలయానికి పంపించాలి. అక్కడే వాటిని భద్రపరచి ఉంచుతారు.