Lakshmi Lehr: అదీ స్టయిల్‌ అంటే! సింపుల్‌ అండ్‌ కంఫర్టబుల్‌ అన్నమాట! | All About Glamour And Style With Celebrity Stylist Lakshmi Lehr Success Story | Sakshi
Sakshi News home page

Lakshmi Lehr: అదీ స్టయిల్‌ అంటే! సింపుల్‌ అండ్‌ కంఫర్టబుల్‌ అన్నమాట!

Published Sun, Aug 18 2024 12:41 AM | Last Updated on Sun, Aug 18 2024 12:41 AM

All About Glamour And Style With Celebrity Stylist Lakshmi Lehr Success Story

అందుబాటులో ఉన్న వనరులతోనే అద్భుతాలను క్రియేట్‌ చేసేవాళ్లను నేర్పరులు అంటారు. ఆ కేటగరీలో లక్ష్మీ లెహర్‌ను చేర్చొచ్చు. పర్‌ఫెక్షన్‌ కోసం ప్రపంచంలో ఉన్న ద బెస్ట్‌ని ఆర్డర్‌ చేయదు. కళ్ల ముందున్న వాటితోనే ప్రపంచానికి ద బెస్ట్‌ని చూపిస్తుంది. అందుకే ఆమె సెలబ్రిటీ స్టయిలిస్ట్‌ అయింది.

లక్ష్మీ ముంబై నివాసి. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ గ్రాడ్యుయేషన్‌ తర్వాత పలు ఫ్యాషన్‌ పత్రికల్లో పనిచేసింది. ప్రాక్టికల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ కోసం ప్రముఖ సెలబ్రిటీ స్టయిలిస్ట్‌ అనాయితా శ్రాఫ్‌ స్టయిలింగ్‌ కంపెనీ ‘స్టయిల్‌ సెల్‌’లో చేరింది. ఆమె సృజనకు, పనితీరుకు అనాయితా ఇంప్రెస్‌ అయింది. ఆమె స్థాయి స్టార్‌ స్టయిలింగ్‌ అని గ్రహించింది. లక్ష్మీని సెలబ్రిటీ సర్కిల్‌కి పరిచయం చేసింది. ముందుగా.. కరీనా కపూర్‌ ఎయిర్‌ పోర్ట్‌ అపియరెన్స్‌కి స్టయిలింగ్‌ చేసింది లక్ష్మీ. ఆ కూల్‌ లుక్స్‌కి.. కరీనాను క్యాప్చర్‌ చేయడానికి ఫాలో అయిన పాపరాట్సీ ఫిదా అయిపోయారు.

కరీనా ఫ్యాన్స్‌ అయితే క్రేజీ.. చెప్పక్కర్లేదు. ఆ స్టయిల్‌ని కరీనా కూడా కంఫర్ట్‌గా ఫీలై.. స్పెషల్‌ అకేషన్స్‌కి ఆమెను స్టయిలిస్ట్‌గా అపాయింట్‌ చేసుకుంది. లక్ష్మీ స్టయిలింగ్‌ని కియారా ఆడ్వాణీ, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్, జాన్వీ కపూర్, ఆలియా భట్, సారా అలీ ఖాన్, అనన్యా పాండే, శ్రద్ధా కపూర్, రశ్మికా మందన్నా, సమంత, పూజా హెగ్డేలూ కోరుకున్నారు.

ఆ సెలబ్రిటీల క్యాజువల్‌ లుక్‌ నుంచి రెడ్‌ కార్పెట్‌ వాక్స్, కార్పొరేట్‌ ఈవెంట్స్, ఎండార్స్‌మెంట్స్, సినిమా ప్రమోషన్స్, ఫంక్షన్స్, పెళ్లిళ్లు.. అంతెందుకు వాళ్లు గడపదాటాలంటే చాలు లక్ష్మీ వాళ్లను స్టయిలింగ్‌ చేయాల్సిందే! అంత డిమాండ్‌లో ఉంది ఆమె. సెలబ్రిటీ ఒంటి తీరు, బాడీ లాంగ్వేజ్‌ని బట్టి స్టయిలింగ్‌ చేస్తుంది లక్ష్మీ. సింపుల్‌ చేంజెస్‌తోనే వైబ్రెంట్‌గా కనిపించేలా వాళ్లను మారుస్తుంది. ఫిమేల్‌ సెలబ్రిటీలే కాదు మేల్‌ సెలబ్రిటీలూ ఆమెకు ఫ్యాన్సే! వాళ్లలో రితిక్‌ రోషన్‌ ముందుంటాడు. తర్వాత సైఫ్‌ అలీ ఖాన్‌. ఆ ఇద్దరికీ లక్ష్మీ స్టయిలింగ్‌ చేస్తోంది.

స్టయిల్‌ అంటే సెల్ఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌! 
స్టయిలింగ్‌ కోసం ప్రపంచ బ్రాండ్స్‌ అన్నిటినీ వార్డ్‌రోబ్‌లో నింపక్కర్లేదు. ఉన్న రెండు జతలతో కూడా స్టయిల్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు. అయితే మనకు ఏది నప్పుతుంది.. ఏది సౌకర్యంగా ఉంటుందనే స్పృహ ఉండాలి. అంతేకాదు మనమున్న చోటునూ దృష్టిలో పెట్టుకోవాలి. నలుగురిలో కలసిపోయినట్టు ఉంటూనే మన ప్రత్యేకతతో మెరిసిపోవాలి. అదీ స్టయిల్‌ అంటే! సింపుల్‌ అండ్‌ కంఫర్టబుల్‌ అన్నమాట. నేను స్టయిలింగ్‌ చేసిన సెలబ్రిటీల్లో నాకు.. కరీనా, జాక్వెలిన్, సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్‌లు అంటే చాలా ఇష్టం! – లక్ష్మీ లెహర్‌

ఇవి చదవండి: ధైర్యసాహసాలు అనగానే మరో ఆలోచనే.. చమేలీ.. ఓ ధీశాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement