
వేసవిలో వివాహ వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. కాలానికి తగినట్టు డ్రెస్సింగ్ ఉండాలి. అలాగని లుక్‌లో రిచ్‌నెస్ ఏ మాత్రం తగ్గకూడదు. ఎంపిక పెద్ద టాస్క్. సీజన్‌కి తగినట్టు సౌకర్యంగా ఉండేలా,
అందరిలో ప్రత్యేకంగా కనిపించేలా ఉండాలంటే మనదైన స్టైల్ స్టేట్‌మెంట్‌ను చూపించాలి.
వేసవిలో ఉక్కపోతలో డ్రెస్సింగ్ స్టైల్స్ ఆహ్లాదంగా... ఆకట్టుకునేలా ఉండాలి. మిగతా సీజన్‌లో ఎంత బ్రైట్ కలర్స్‌ని ఎంపిక చేసుకున్నా,.. సమ్మర్‌లో మాత్రం పేస్టల్ కలర్స్‌కి మంచి డిమాండ్ ఉంటుంది. వీటికే కాంట్రాస్ట్ బ్లౌజ్‌లు, లైట్‌షేడ్స్ ఉన్నవి, అవి కూడా హెవీ వర్క్‌తో కాకుండా ఉన్నవి ఎంపిక చేసుకోవాలి.
ఫ్లోరల్స్... ఎంగేజ్‌మెంట్, రిసెప్షన్ వంటి వేడుకలకు లెహంగా అయినా, వివాహ వేడుకకు శారీ అయినా ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్నవి ఎంపిక చేసుకోవడం వల్ల అకేషన్ కాస్తా ఆహ్లాదంగా మారిపోతుంది. పేస్టల్, గోల్డ్, సిల్వర్ కలర్స్‌లో ఉన్నా ఫ్లోరల్స్‌తో ఉన్న లైట్ వెయిట్ పట్టు చీరలకు, మరో డిజైనర్ పల్లూని జత చేసి వధువు, ఆమె తరపు స్నేహితులు.. మహారాణీ స్టైల్‌ని ఎంపిక చేసుకోవచ్చు.
ఇండో వెస్ట్రన్... మన హ్యాండ్లూమ్ పట్టు చీరల్లోనూ లైట్ వెయిట్‌వి ఎంపిక చేసుకోవాలి. వాటికి పూర్తి కాంట్రాస్ట్ బెలూన్ స్లీవ్స్, స్లీవ్‌లెస్, యునిక్‌గా ఉండే బ్లౌజ్ డిజైన్స్ సరైన ఎంపిక అవుతుంది. శారీ గ్రాండ్‌నెస్ అంతా బ్లౌజ్ డిజైన్‌లో చూపించవచ్చు హెవీ ఎంబ్రాయిడరీ అవసరం లేకుండానే.
లినెన్ అండ్ కాటన్ స్టైల్... వొవెన్ బార్డర్ ఉన్నవి, లినెన్స్, కాటన్స్‌ని ఉపయోగించి కూడా తమదైన స్టైల్ స్టేట్‌మెంట్‌తో ఈ సీజన్ వేడుకలో పాల్గొనవచ్చు. కాంట్రాస్ట్ స్టైలిష్ బ్లౌజులు, మనవైన సంప్రదాయ ఎంబ్రాయిడరీ డిజైన్లు ఉన్న ప్లెయిన్ శారీస్‌ను కూడా ఈ వేడుకలకు ఎంచుకోవచ్చు. వీటితోపాటు చందేరీ స్టైల్స్‌తోనూ గ్రాండ్‌లుక్‌ను తీసుకురావచ్చు.
ఆభరణాల ఎంపిక... ముత్యాలు, పచ్చలు, ఇతర బీడ్స్‌తో చేసిన లేయర్డ్ జ్యువెలరీ ఈ వేసవికి సరైన ఎంపిక అవుతుంది. వీటి వల్ల చెమటతో పెద్ద ఇబ్బంది ఉండదు. పైగా, ధరించిన డ్రెస్‌కు హైలైట్‌గా నిలుస్తాయి.
(చదవండి: ఏ క్షణమైనా గుండెపోటు తప్పదనుకున్నా..! కాలమిస్ట్ శోభా డే కుమార్తె వెయిట్ లాస్ స్టోరీ)