పురుషులతో తామేమీ తక్కువ కాదంటూ చిన్నవయసులో మహిళా పారిశ్రామికవేత్తలుగా పలువురు యువతులు ముందుకు వస్తున్నారు. తమ అభిరుచికి తగ్గట్టు, ఆధునిక శైలిని అవగాహన చేసుకుంటూ వ్యాపారంలో రాణిస్తున్న వారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో దుస్తుల బ్రాండ్‌తో కోట్లు సంపాదిస్తున్న పరి పూనమ్ చౌదరి ఒకరు. ఆమె సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం!
ఫ్యాషన్ పరిశ్రమ ఎప్పుడూ డైనమిక్‌గా ఉండాలి. వినియోగదారుల ప్రాధాన్యతలే మార్కెట్‌కు ప్రాణం. యుక్తవయసులో ఉన్నప్పటినుంచి పరికి మహిళలను ఆకట్టుకునే ఫ్యాషన్, అందమైన దుస్తులను తయారు చేయడం అంటే ఇష్టం. 13 ఏళ్లకు సొంతంగా తనకుంటూ ఒక బ్రాండ్‌ఉండాలనే ఆలోచన మొదలైంది. ఆ పట్టుదలే 23 ఏళ్లకే దేశంలోనే అత్యంత ప్రియమైన దుస్తుల బ్రాండ్ బునాయ్‌కు నాంది పలికింది. సొంత వ్యాపారాన్ని ప్రారంభించి, అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ రాణిస్తోంది.
బునాయ్ ఏర్పాటు, సక్సెస్
సుమారు 5-6 సంవత్సరాలు ఇతర సంస్థలకు పనిచేసినఅనుభవంతో 2016లో పరి చౌదరి కేవలం ముగ్గురితో కలిసి బునాయ్‌ని లాంచ్ చేసింది. అప్పటినుంచి ఆ టీమ్ అలా పెరుగుతూ వందలాదిమందికి చేరింది. కేవలం 50 వేల పెట్టుబడితో కుర్తా సెట్లు, లెహంగాలు లాంటివాటితో వ్యాపారాన్ని మొదలు పెట్టింది. రాజస్థానీ, జైపూర్, డిజైన్స్, చందేరి నుండి ఎంబ్రాయిడరీ దాకా వివిధ రకాల ఫ్యాబ్రిక్‌లను అందిస్తూ, బునాయ్ నైట్‌వేర్, ఇతర యాక్సెసరీస్, జ్యెయల్లరీని జోడించింది. హ్యాండ్-బ్లాక్ ప్రింటెడ్, హ్యాండ్-డైడ్, హ్యాండ్‌పెయింటెడ్, ఆకర్షణీయంగా అందమైన డిజైన్‌లు, సిగ్నేచర్ స్టైల్ కలర్స్, కాటన్ ఫ్యాబ్రిక్ ఇలాంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఆదరణ పొందింది. ఆధునిక శైలి, సంప్రదాయకళను మిళితం చేస్తూ స్టైలిష్ ఫ్యాషన్ ప్రపంచంలో బునాయ్‌ను పరుగులు పెట్టిస్తోంది. అంతేనా క్లాసిక్ బట్టల నుండి హెయిర్, స్టైలిష్ హోమ్ డెకార్ దాకా మంచి నాణ్యత ,స్టైల్‌ని ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ‘బునాయ్’ వినపడేలా చేసింది.
2021లో 12 కోట్టుగా ఉన్న బునాయ్ ఆదాయం కాస్త 2022లో 35 కోట్లకు పెరిగిందంటేనే ఈ బ్రాండ్‌కు లభించిన ఆదరణను అర్థం చేసుకోవచ్చు. ఇండోర్, జైపూర్‌లో రెండు స్టోర్లను కూడా ప్రారంభించారుబునాయ్ 800 విభిన్న ఉత్పత్తులతో దాదాపు 90K కస్టమర్ల బేస్‌తో రాణిస్తోంది. సోనాక్షి సిన్హా, భూమి పెడ్నేకర్, శివలీకా ఒబెరాయ్, రిధి డోగ్రా, దివ్యాంక త్రిపాఠి లాంటి ప్రముఖులు బునాయ్ స్టైల్స్ ఫ్యాన్స్. అంతేకాదు అనేక బెస్ట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ , బిజినెస్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది పరి చైదరి.
స్థానిక కళాకారులచేత,రాజస్థానీ సంస్కృతి మూలాలతో ముడిపడి ఉన్న ప్రాంతాల ద్వారా ఉత్తమంగా తయారు చేస్తాం. అన్నీ ఉత్పత్తులు ప్రేమతో చేతితో తయారు చేసినవే. మెటీరియల్ నాణ్యతలో కూడా రాజీలేదు. ఫెయిర్‌ట్రేడ్, హెరిటేజ్, మేడ్ ఇన్ ఇండియా,సుస్థిరత ,మహిళా సాధికారత ఇవే తమ కంపెనీ బలం - పరి పూనం చౌదరి
పరి చౌదరి విద్య
పరి జైపూర్‌లోని నీర్జా మోడీ స్కూల్‌లో తన పాఠశాల విద్యను, ఆ తరువాత, IIS విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందింది. ఫ్యాషన్/అప్పరల్ డిజైన్ చ విజువల్ ఆర్ట్స్ & స్టిల్ ఫోటోగ్రఫీలో నైపుణ్యం సాధించింది.
2019లో ఉన్నత చదువుల కోసం యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్ లండన్‌కు వెళ్లింది. ఇక్కడే ఈమె వ్యాపార ఆలోచనలకు మరింత పదును ఏర్పడింది. లగ్జరీ బ్రాండ్‌లకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, ఫ్యాషన్ మీడియా స్టైలింగ్ , ఫ్యాషన్ కొనుగోలు మరియు అమ్మకాలపై దృష్టి సారించింది. బునాయ్ ప్రారంభించే ముందు దాదాపు 3 సంవత్సరాలు అర్బన్ విమెన్ కంపెనీలో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా పనిచేసింది. ఫ్యాషన్ ప్రపంచంలో తన అనుభవం ఇతరులకు ఉపయోగపడాలని, ప్రతిభ , వాస్తవికత మధ్య అంతరాన్ని తగ్గించడంలో సహాయపడాలని కోరుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment