Hyderabad: Wardrobe Full Of Money Found After An IT Raid - Sakshi
Sakshi News home page

#trending: బీరువాలో ఇలాంటి దృశ్యం చూశారా..?!

Published Tue, Oct 12 2021 12:26 PM

Wardrob Full Of Money Found After An IT Raid On A Pharma Company In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలోని పలు కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఫార్మ కంపెనీలో జరిపిన సోదాలో ఐటీ అధికారులు 142.87కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కంపెనీకి సంబంధించి మొత్తం 16 బ్యాంకు లాకర్లతో పాటు.. ఇప్పటి వరకు లెక్కల్లో చూపని 550 కోట్ల రూపాయల ఆదాయం గుర్తించినట్లు ఐటీ శాఖ వెల్లడించింది.

ఈ దాడులకు సంబంధించి ఓ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకు ఆ ఫోటోలో ఏం ఉందంటే బీరువా. బట్టలు పెట్టుకునే బీరువా ఫోటో వైరల్‌ కావడం ఏంటంటే.. మనలాంటి సామాన్యులు బీరువాలో బట్టలు పెడతారు.. కానీ సదరు ఫార్మా కంపెనీ బీరువాను డబ్బు కట్టలతో నింపింది. ఎక్కడా కొంచెం కూడా ఖాళీ లేకుండా డబ్బు కట్టలను బీరువా నిండ పేర్చింది. 
(చదవండి: Hyderabad: ప్రముఖ ఫార్మా కంపెనీలో సోదాలు.. రూ.142 కోట్లు సీజ్‌)

ఈ ఫోటో చూసిన నెటిజనులు వార్నీ మా బీరువాలో బట్టలు సర్దిని తరువాత కూడా చాలా ఖాళీ ప్లేస్‌ ఉంటుంది.. ఇదేందిరా నాయనా ఇన్ని డబ్బు కట్టలు.. అబ్బ ఒక్క కట్ట నాకు దొరికితే లైఫ్‌ సెటిల్‌ అవుతుంది.. నోట్ల రద్దు ఫలించలేదు.. నోట్ల రంగు ఆకారం మారింది అంతే.. అరే 2000 రూపాయల నోట్లు వాడి ఉంటే.. 75 శాతం జాగా మిగిలేది.. మరిన్ని డబ్బులు దాచుకోవడానికి అవకాశం ఉండేది అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజనులు. 

చదవండి: శశికళకు మరో భారీ షాక్‌: రూ.వంద కోట్ల ఆస్తులు సీజ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement