రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం | Rs 170 crore-wealth seized in 72-hour tax raids at Maharashtra finance firms | Sakshi
Sakshi News home page

రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం

Published Fri, May 17 2024 5:46 AM | Last Updated on Fri, May 17 2024 5:46 AM

Rs 170 crore-wealth seized in 72-hour tax raids at Maharashtra finance firms

మహారాష్ట్రలో ఐటీ సోదాలు 

ముంబై: మహారాష్ట్రలోని నాందేడ్‌ పట్టణంలో ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) 72 గంటలపాటు నిర్వహించిన సోదాల్లో రూ.170 కోట్ల విలువైన సొత్తు లభ్యమైంది. పట్టణంలోని భండారీ ఫైనాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఆదినాథ్‌ అర్బన్‌ మలీ్టస్టేట్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంకు కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఈ నెల 10వ తేదీన సోదాలు ప్రారంభించారు. 12వ తేదీ ఈ సోదాలు ముగిశాయి. 

వందలాది మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. రూ.14 కోట్ల నగదు, 8 కిలోల బంగారం సహా మొత్తం రూ.170 కోట్ల విలువైన సొత్తు స్వా«దీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నగదును లెక్కించడానికి 14 గంటలు పట్టినట్లు సమాచారం. పెద్ద ఎత్తున పన్ను ఎగవేసినట్లు భండారీ ఫైనాన్స్, ఆదినాథ్‌ బ్యాంకుపై ఆరోపణలున్నాయి. నాందేడ్‌ టౌన్‌లో ఈ స్థాయిలో ఐటీ సోదాలు జరగడం, భారీగా సొమ్ము దొరకడం ఇదే మొదటిసారి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement