ముంబై: లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. మొత్తం 20 కేసుల్లో 12.74 కిలోల బంగారాన్ని ముంబై కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారంతోపాటు ఖరీదైన నాలుగు ఐఫోన్లను (15 ప్రో ఫోన్లను) కూడా స్వాధీనం చేసుకున్నారు.
బంగారాన్ని లోదుస్తులు, వాటర్ బాటిల్స్, బట్టలు, ముడి అభరణాలు, బంగారు కడ్డీలు, శరీరంపై దొంగచాటుగా దాచి తరలిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన బంగారం, ఐఫోన్ల విలువ సుమారు రూ.8.37 కోట్లకుపైమాటే ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు.. ఐదుగురు ప్రయాణికుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
Officials of Mumbai Customs at Chhatrapati Shivaji Maharaj International Airport have seized goods worth a total of Rs 8.37 crores including 12.74 Kg Gold across 20 cases. Gold was found concealed in various forms like gold dust in wax and gold layered cloths, crude jewellery and… pic.twitter.com/4OQlYsATIE
— ANI (@ANI) May 4, 2024
Comments
Please login to add a commentAdd a comment