seize
-
ఫిషింగ్ బోట్లలో వందల కిలోల డ్రగ్స్.. పట్టుకున్న నేవీ
ముంబయి: అరేబియా సముద్ర జలాల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. సముద్రంలో రెండు ఫిషింగ్ బోట్లలో ఏకంగా 500 కిలోల డ్రగ్స్‌ను అక్రమరవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు ఇండియన్ నేవీ తెలిపింది. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో శుక్రవారం నేవీ ఒక పోస్టు చేసింది.‘శ్రీలంకకు చెందిన రెండు ఫిషింగ్ బోట్లలో అక్రమరవాణా చేస్తున్న 500 కిలోల డ్రగ్స్‌ను ఇండియన్ నేవీ సీజ్ చేసింది. శ్రీలంక నేవీ,ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఎప్పికప్పుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించిన ఇండియన్ నేవీ డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న బోట్లను అడ్డుకుంది.డ్రగ్స్ ఉన్న బోట్లను గుర్తించడానికి విస్తృత ఏరియల్ సెర్చ్ నిర్వహించాం. డ్రగ్స్ రవాణా చేస్తున్న రెండు బోట్లను, అందులో ఉన్న సిబ్బందిని శ్రీలంకకు అప్పగించాం’అని ఇండియన్ నేవీ ట్వీట్లో తెలిపింది. ఈ ఆపరేషన్ డ్రగ్స్ రవాణాను అరికట్టడంలో భారత్,శ్రీలంక మధ్య ఉన్న పటిష్ట సంబంధాలను తెలియజేస్తోందని పేర్కొంది. Narcotics Seizure - Combined Operation b/n #IndianNavy & @srilanka_navy.Based on information received from #SrilankaNavy regarding probable narcotics smuggling by Sri Lankan flagged fishing vessels, the @indiannavy swiftly responded through a coordinated operation to localise &… pic.twitter.com/dkpzNQonTF— SpokespersonNavy (@indiannavy) November 29, 2024 -
ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఇసుక టిప్పర్లు సీజ్
ప్రొద్దుటూరు క్రైం: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు సమీపంలో కుందూనది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 8 టిప్పర్లు, జేసీబీని రూరల్ పోలీసులు సీజ్ చేశారు. జేసీబీ సాయంతో పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు శుక్రవారం వేకువజామున దాడులు చేశారు. 8 టిప్పర్లు, జేసీబీని పోలీసులు సీజ్‌చేసి స్టేషన్‌కు తరలించారు. సీజ్ చేసిన టిప్పర్లు, జేసీబీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి చెందినవిగా భావిస్తున్నారు. టిప్పర్లపైన ఎన్‌వీఆర్‌ఆర్ అని పెద్ద అక్షరాలతో పేర్లు వేయించి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. టిప్పర్లు, జేసీబీని వదిలేయాలని పోలీసుల మీద తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో కొన్నిరోజుల నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. దాడుల్లో రూరల్ ఎస్ఐలు మహమ్మద్ రఫి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రెండు ఇసుక ట్రాక్టర్ల స్వా«దీనం పెన్నానది పరీవాహక ప్రాంతంలో రెండు ఇసుక ట్రాక్టర్లను రూరల్ పోలీసులు సీజ్ చేశారు. రామాపురం, పెద్దశెట్టిపల్లె గ్రామాల వద్ద ట్రాక్టర్లను స్వా«దీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
నల్లచెరువు: శ్రీసత్యసాయి జిల్లా, నల్లచెరువు మండలం, పెద్దయల్లంపల్లి వద్ద శనివారం రాత్రి 13 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్రరెడ్డి ఆదేశాల మేరకు పెద్దయల్లంపల్లి జాతీయరహదారిపై అటవీశాఖ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో మదనపల్లి నుంచి కదిరి వెళ్తున్న కారును గుర్తించారు.అధికారులు వాహనాలను తనిఖీ చేస్తున్నారని గమనించిన ఇద్దరు దుండగులు కొద్దిదూరంలో కారు ఆపి పరారయ్యారు. అధికారులు కారును తనిఖీ చేయగా.. 13 ఎర్రచందనం దుంగలు లభించాయి. వీటి విలువ రూ.2 లక్షలకు పైగానే ఉంటుందని తెలిపారు. వాహనం నంబర్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తనిఖీల్లో డిప్యూటీ రేంజ్ అధికారి రామచంద్ర నాయక్, సెక్షన్ అధికారి రామచంద్రారెడ్డి, ఎఫ్‌బీఓలు నాగరాజు, హరిప్రసాద్, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
ముంబై ఎయిర్‌పోర్టులో 12 కోట్ల విలువైన బంగారం, ఐఫోన్లు సీజ్
ముంబై: లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. మొత్తం 20 కేసుల్లో 12.74 కిలోల బంగారాన్ని ముంబై కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారంతోపాటు ఖరీదైన నాలుగు ఐఫోన్లను (15 ప్రో ఫోన్లను) కూడా స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని లోదుస్తులు, వాటర్ బాటిల్స్, బట్టలు, ముడి అభరణాలు, బంగారు కడ్డీలు, శరీరంపై దొంగచాటుగా దాచి తరలిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన బంగారం, ఐఫోన్ల విలువ సుమారు రూ.8.37 కోట్లకుపైమాటే ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు.. ఐదుగురు ప్రయాణికుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.Officials of Mumbai Customs at Chhatrapati Shivaji Maharaj International Airport have seized goods worth a total of Rs 8.37 crores including 12.74 Kg Gold across 20 cases. Gold was found concealed in various forms like gold dust in wax and gold layered cloths, crude jewellery and… pic.twitter.com/4OQlYsATIE— ANI (@ANI) May 4, 2024 -
లోక్‌సభ ఎన్నికల్లోనే రికార్డు.. రోజుకు రూ. 100 కోట్లు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో భారీగా డబ్బు పట్టుబడుతోంది. దేశ చరిత్రలోనే తొలిసారి రికార్టు స్థాయిలో అక్రమంగా తరలిస్తున్న సొమ్ము అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. మార్చి 1 నుంచి వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.4,658 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ 45 రోజుల్లో కోట్ల నగదుతోపాటు డ్రగ్స్, ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు పేర్కొంది. మొత్తం సొత్తులో రూ.395.39 కోట్ల నగదు, రూ.489.31 కోట్ల విలువైన మద్యం, రూ.2,068.85 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ.562.10 కోట్ల విలువైన లోహాలు, ఓటర్లకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచిన రూ.1,142.49 కోట్ల విలువైన కానుకలు ఉన్నట్లు తెలిపింది. ఇంత పెద్ద మొత్తంలో సొత్తు స్వాధీనం చేసుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని ప్రకటించింది. మార్చి 1 నుంచి ఇప్పటివరకు రోజుకు సగటున రూ.100 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకుసీజ్ అయిన రూ.778 కోట్లతో రాజస్థాన్ తొలి స్థానంలో ఉండగా.. అత్యల్పంగా లద్ధాఖ్‌లో రూ.11,580 మాత్రమే పట్టుబడింది. 2019 ఎన్నికల సమయంలో రూ.3,475 కోట్ల సొత్తు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు మార్చి 1 నుంచి ఏప్రిల్ 13 మధ్యకాలంలోనే గత ఎన్నికల కంటే 33.85% ఎక్కువ సొత్తు చేజిక్కించుకున్నట్లు పేర్కొంది. -
ఒక్క ఫోన్ కాల్.. భారీగా దొరికిన నగదు
చెన్నై, సాక్షి: తమిళనాడు తిరుచిరాపల్లిలోని ఎత్తరై గ్రామంలోని ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు రూ. 1 కోటి నగదును స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో లోక్‌సభకు పోలింగ్‌కు ముందు ఒకే ఇంట్లో అదీ కూడా ఓ గ్రామంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడం గమనార్హం. తిరుచిరాపల్లిలోని ఎత్తరై గ్రామంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఓ ఇంట్లోకి ప్రవేశించి సోదాలు నిర్వహించారని, ఒక బ్యాగ్‌లో నింపిన మొత్తం రూ.1 కోటి కరెన్సీ నోట్లు దొరికాయని జిల్లా కలెక్టర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. తిరుచ్చి జిల్లా కలెక్టరేట్లోని ఎలక్షన్ కంట్రోల్ రూంకి ఫోన్ కాల్ వచ్చిందని, ఫలితంగా నగదు రికవరీ అయ్యిందని ఆయన చెప్పారు. ఓ ఇంట్లో కరెన్సీ నోట్లు భద్రపర్చినట్లు సమాచారం అందడంతో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు గ్రామానికి వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో నగదును ఇంట్లో ఎవరు ఉంచారు.. ఎన్నికలలో ఓటర్లకు పంచేందుకే ఈ డబ్బును సిద్ధం చేశారా అనే కోణంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారణ జరుపుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
జియో మాల్‌పై పోలీసుల దాడి: లగ్జరీ కార్లు సీజ్.. స్టోరీ ఏంటంటే?
విలాసవంతమైన జీవితానికి, ఖరీదైన కార్లకు పెట్టింది పేరు రిలయన్స్ అధినేత బిలియనీర్ అంబానీ కుటుంబం. తాజాగా ముఖేష్ అంబానీకి చెందిన జియో వరల్డ్ డ్రైవ్ మాల్‌పై పోలీసుల దాడి వార్తల్లో నిలిచింది. ఈ మాల్లో 41 ఖరీదైన కార్లతో పాటు ఫెరారీస్, లంబోర్గినీ లాంటి లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఏం జరిగిందంటే..? టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం అంబానీకి చెందిన మాల్ పార్కింగ్ స్థలంలో ముంబై పోలీసులు 41 ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో ఫెరారీ, లంబోర్ఘిని, పోర్షెస్ తదితర అత్యాధునిక లగ్జరీ కార్లు ఉన్నాయి. భారతదేశంలోని అతిపెద్ద మాల్స్‌లో ఒకటి ముఖేష్ అంబానీకి చెందిన జియో వరల్డ్ డ్రైవ్ మాల్ దేశంలోనే యాపిల్ స్టోర్ ఉన్న తొలి మాల్ కూడా ఇదే. తాజా వార్తలపై రిలయన్స్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియా సంస్థ నిర్వహించిన ఈవెంట్, ర్యాలీకిగా ను ముంబై పోలీసుల ముందస్తు అనుమతి పొందలేని కారణంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారని సమాచారం. అయితే ఈ కారు అంబానీ కుటుంబంలోని ఏ ఒక్కరికీ చెందకపోవడం గమనార్హం. ముంబైలో జనవరి 23 నుంచి ఫిబ్రవరి 6 వరకు నిషేధ ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. అయినప్పటికీ రిపబ్లిక్ డే రోజున నిర్వహించిన ర్యాలీలో ఫెరారీలు, లంబోర్గినిలు, పోర్షెస్, మెక్లారెన్స్, బిఎమ్‌డబ్ల్యూలు, జాగ్వార్లు, ఆడి, మెర్సిడెస్‌తో సహా 100కి పైగా కార్లు పాల్గొన్నాయని అంచనా. దీంతో పబ్లిక్ సర్వెంట్ అండ్ మహారాష్ట్ర పోలీస్ యాక్ట్ 1951 ద్వారా సక్రమంగా ప్రకటించిన ఆర్డర్‌ను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు కార్ల యజమానులపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రూ.4.55 కోట్ల బంగారం పట్టివేత
జహీరాబాద్/సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సరిహద్దులో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నట్లు చిరాగ్పల్లి ఎస్ఐ నరేష్ తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడ్గి గ్రామ శివారులో 65వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్ పోస్టు వద్ద కేంద్ర బలగాలతో కలిసి పోలీసులు తనిఖీలు చేపట్టారు. గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న స్కార్పియో వాహనంలో 6,986 గ్రాముల బంగారు నగలను స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4.55 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు, హైదరాబాద్‌లో శుక్రవారం చేసిన తనిఖీల్లో రూ. 2,56,84,671 నగదును సీజ్ చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఒక ప్రకటనలో తెలిపారు. -
78,678 బాక్స్‌ల బీర్ల వృథా.. ఆ ఒక్క పని చేసుంటే ఇలా జరిగేది కాదు
మైసూరు: మైసూరు జిల్లాలోని నంజనగూడులో ఉన్న యునైటెడ్ బ్రువరీస్ కర్మాగారంలో తయారవుతున్న బీరు నాణ్యత ప్రశ్నార్థకమైంది. జిల్లా అబ్కారీ అధికారులు సుమారు రూ. 25 కోట్ల విలుచ చేసే 78,678 బాక్స్‌ల బీర్లను సీజ్ చేశారు. ఈ కంపెనీ తయారుచేసే ప్రముఖ బీర్ల సీసాల్లో అవక్షేపం పేరుకుపోయిందని, ఇటువంటి బీర్లను తాగరాదని తెలిపారు. జూలై 15వ తేదీన ఈ సీసాలు నింపారని తెలిపారు. కొన్ని సీసాల్లో గసి పేరుకుపోయినట్లు మందుబాబుల ద్వారా తెలుసుకున్న అధికారులు బీర్ల శాంపిళ్లను తీసుకుని ల్యాబ్‌కు పంపించారు. దీనిపై ఆగస్టు 2వ తేదీన నివేదిక రాగా, ఈ బీర్లు తాగడానికి పనికిరావని అందులో హెచ్చరించారు. దాంతో ఆ బ్యాచ్‌లో సిద్ధమైన 78,678 పెట్టెల బీర్లను సీజ్ చేశారు. ఇవి అప్పటికే మద్యం షాపులకు వెళ్లిపో గా మళ్లీ వెనక్కి తెప్పించినట్లు తెలిపారు. సీసాల్లోకి నింపేముందు బీర్‌ను సక్రమంగా ఫిల్టర్ చేయకపోతే అవక్షేపం చేరుకుంటుందని చెప్పారు. చదవండి ఫోన్ ఛార్జింగ్‌పై బాస్ ఆగ్రహం.. టాయిలెట్ ఫ్లష్ చేయద్దంటున్న నెటిజన్లు! -
కండల పిచ్చి.. సూదిగుచ్చి..
నగర యువతలో పెరుగుతున్న కండల పిచ్చి వారిని పెడదారి పట్టిస్తోంది. వేగంగా ఆరు పలకల శరీరాకృతిని సొంతం చేసుకొనేందుకు ప్రమాదకర సూదిమందులను తీసుకుంటుండటం అందరినీ కలవరపెడుతోంది. మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ జిమ్‌లో 400 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను సోమవారం డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులు, పోలీసులతో కలిసి సీజ్ చేయడం, జిమ్ ట్రైనర్ నితీశ్, అతని స్నేహితులు సొహైల్, రాహుల్‌లను అరెస్ట్ చేయడం యువతలో మజిల్ మేనియాకు.. ఈ ఇంజక్షన్ల విచ్చలవిడి విక్రయాలకు అద్దం పడుతోంది. – సాక్షి, హైదరాబాద్ కండల కోసం తహతహలాడే వారే టార్గెట్... సాధారణంగా పోటీలలో పాల్గొనే బాడీ బిల్డర్లు ఇంజక్షన్లను ఎంచుకుంటారు. గంటల తరబడి మజిల్ బిల్డింగ్ వర్కవుట్స్ చేయడానికి, పోటీల సమయానికి మజిల్స్ బాగా కనిపించేందుకు వాటిని వినియోగిస్తారు. అయితే అసాధారణ మార్గాల ద్వారా శరీరాన్ని బిల్డప్ చేయాలనే తపన ఉన్న యువకులకు కొన్ని జిమ్లలోని కోచ్‌లు ఈ ఇంజెక్షన్లు సిఫారసు చేస్తున్నారు. తక్కువ సమయంలోనే మంచి శరీరాకృతిని పొందుతారని చెబుతూ జిమ్‌ల యజమానులు ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కోటి సుమారు రూ. 300 పలికే ఇంజక్షన్‌ను కనీసం రూ. 1,500 నుంచి రూ. 2,000 వరకూ పెంచి అమ్ముతున్నారని సమాచారం. ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న వారిలో జిమ్ ట్రైనర్ల నుంచి ఫార్మా, మెడికల్ రిప్రజెంటేటివ్స్ దాకా ఉన్నారు. డిమాండ్‌నుబట్టి పుణే, ఢిల్లీ వంటి నగరాల నుంచి కూడా ఇంజక్షన్లను వారు దిగుమతి చేసుకుంటున్నారు. వినియోగం... ప్రాణాంతకం ఈ ఇంజక్షన్లు యాంటిహైపోటెన్సివ్స్ అనే మందుల శ్రేణిలో భాగంగా వైద్యులు చెబుతున్నారు. వాటిని సాధారణంగా లోబీపీ చికిత్సలో భాగంగా వినియోగిస్తామని... రోగి రక్తపోటును సాధారణ స్థితికి చేర్చడానికి ఆపరేషన్ థియేటర్లలో సర్జరీల సమయంలో వినియోగిస్తామని వైద్యులు అంటున్నారు. ఇది ఒక వ్యక్తి గుండె స్పందనను ఆకస్మికంగా పెంచేందుకు కూడా కారణమవడంతో అది కఠినమైన వర్కవుట్స్ చేసేందుకు ఉ్రత్పేరకంగా పనిచేస్తుందని వివరించారు. అయితే పర్యవేక్షణ లేని మెఫెంటెర్మైన్ ఇంజక్షన్ల వినియోగం వల్ల యువకుల్లో సైకోసిస్ లక్షణాలు పెరిగిపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటిని దీర్ఘకాలం వాడితే అలవాటుగా మారి చర్మంపై దద్దుర్లు, రక్తపోటులో హెచ్చుతగ్గులు, శ్వాస ఆడకపోవడం, నిద్రలేమి, వికారం, వాంతులు, దృష్టి లోపాలు, భ్రాంతులు.. చివరకు గుండెపోటుకు కూడా సంభవించొచ్చని స్పష్టం చేస్తున్నారు. -
రూ.12 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత.. సముద్రంలో 134 సంచుల్లో తరలిస్తుండగా..
కొచ్చిన్: భారత సముద్ర జలాల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.12 వేల కోట్ల విలువైన సుమారు 2,500 కిలోల మెథాంఫెటమైన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్(ఎన్సీబీ) స్వాధీనం చేసుకుంది. కేరళ తీరంలోని భారత సముద్ర జలాల్లో సంచరిస్తున్న ఓ ఓడ నుంచి ఈ మత్తు పదార్థం ఉన్న 134 సంచులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్(ఆపరేషన్స్) సంజయ్ కుమార్ సింగ్ శనివారం మీడియాకు తెలిపారు. అఫ్గానిస్తాన్ నుంచి అక్రమంగా తరలించే డ్రగ్స్‌ను పట్టుకునేందుకు ఆపరేషన్ సముద్రగుప్త్ పేరుతో నేవీ, ఎన్సీబీ కలిసి చేపట్టిన ఆపరేషన్‌లో ఒక పాకిస్తానీని అదుపులోకి తీసుకున్నామన్నారు. అఫ్గానిస్తాన్ నుంచి డ్రగ్స్‌తో బయలుదేరిన భారీ ఓడ ఒకటి మక్రాన్ తీరం వెంబడి పాక్, ఇరాన్‌ల మీదుగా డ్రగ్స్‌ను చిన్న పడవల్లోకి పంపిణీ చేసుకుంటూ వస్తోందని చెప్పారు. మట్టన్‌చెర్రీ వద్ద ఈ ఓడను అడ్డగించినట్లు వెల్లడించారు. భారత్, శ్రీలంక, మాల్దీవులకు డ్రగ్స్‌ను చేరవేయడమే స్మగ్లర్ల లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు 3,200 కిలోల మెథాంపెటమైన్, 500 కిలోల హెరాయిన్, 529 కిలోల హషిష్‌ను పట్టుకున్నట్లు తెలిపారు. చదవండి: గగన్‌యాన్.. క్రూమాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టం ఆపరేషన్ విజయవంతం -
కర్ణాటక ఎన్నికల్లో విచ్చలవిడిగా మద్యం, డబ్బు.. ఎన్ని కోట్లు దొరికాయంటే?
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. మద్యాన్ని ఏరులై పారిస్తున్నాయి. విచ్చలవిడిగా డబ్బు పంచిపెడుతున్నాయి. కొందరికి డ్రగ్స్ కూడా సరఫరా చేస్తున్నాయి. ఎన్నికల సంఘం చేసిన విస్తృత సోదాల్లో మొత్తం రూ.375 కోట్లు విలువ చేసే మద్యం, డ్రగ్స్, నగదు, వస్తువులు పట్టుబడ్డాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు విడుదల చేసిన అధికారిక గణాంకల ప్రకారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు ఎన్ని కోట్లు సీజ్ అయ్యాయంటే.. ►నగదు రూ.147.46 కోట్లు ►దొరికిన మద్యం విలువ రూ.83.66 కోట్లు ►దొరికిన డ్రగ్స్ విలువ రూ.23.67 కోట్లు ►దొరికిన వస్తువుల విలువ రూ.96.6 కోట్లు ►ఉచితంగా పంపిణీ చేసిన వాటి విలువ రూ.24.21 కోట్లు దీంతో ఎన్నికల సంఘం సోదాల్లో ఇప్పటివరకు మొత్తం రూ.375.61 కోట్లు పట్టుబడినట్లయింది. అధికారికంగా సీజ్ చేసిన మొత్తమే ఇన్ని కోట్లు ఉంటే.. ఇక అనధికారంగా ఎంత ఖర్చు చేసి ఉంటారనే అంశం చర్చనీయాంశమైంది. కాగా.. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రూ.83.93 కోట్లు పట్టుబడితే ఈసారి ఆ మొత్తం నాలుగు రెట్లకు పైగా పెరగడం గమనార్హం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10న(బుధవారం) జరగనుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మే 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. చదవండి: యాద్గిర్... బరాబర్.. కల్యాణ కర్ణాటకలోని గ్రామీణ జిల్లాలో రసవత్తర పోరు -
కర్ణాటక ఎన్నికలు: బడా నిర్మాత కారులో రూ.39 లక్షల వెండి వస్తువులు సీజ్!
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల కమీషన్ ఇప్పటికే ఎన్నికల్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను కూడా ముమ్మరం చేసింది. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు అధికారులు జరుపుతున్న తనిఖీల్లో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌కు చెందిన కారులో వెండి వస్తువులను అధికారులు సీజ్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ మారింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని దావంగెరె శివార్లలోని హెబ్బలు టోల్ సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద ఓ బీఎండబ్ల్యూ కారులో లక్షలు విలువైన వెండి వస్తువులను ఈసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐదు బాక్సల్లో వెండి వస్తువులను ఉంచి ఐదు చెన్నై నుంచి ముంబయి తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ కారులోని వ్యక్తులు సరైన పత్రాలు చూపించకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 66 కేజీల వెండి గిన్నెలు, స్పూన్లు, ప్లేట్లు ఉండగా.. వాటి విలువ సుమారు రూ.39లక్షల పైనే ఉండచ్చని అధికారులు పేర్కొన్నారు. డ్రైవర్ సుల్తాన్ ఖాన్ తో పాటు కారులో ఉన్న హరిసింగ్ పై దావణగెరె రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో, కారు బోనీ కపూర్‌కు చెందిన బేవ్యూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రిజిస్టర్ చేసినట్లు అధికారులు కనుగొన్నారు. హరి సింగ్‌ను విచారించగా.. ఆ వస్తువులు బోనీ కపూర్ కుటుంబానికి చెందినవేనని చెప్పినట్లు సమాచారం. ఆ వస్తువులకు సరైన పత్రాలు చూపించని కారణంగానే వాటిని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆ వస్తువులు బోనీ కపూర్ కుటుంబానికి చెందినవేనా? కాదా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
క్యూనెట్ స్కాంపై ఈడీ కొరడా.. రూ.137 కోట్ల విలువైన ఆస్తులు జప్తు
సాక్షి, హైదరాబాద్: క్యూనెట్ స్కాంకు సంబంధించి వీహాన్ డెరెక్ట్ సెల్లింగ్ సంస్థపై ఈడీ కొరడా ఝులిపించింది. ఈ కంపెనికీ చెందిన రూ.137కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. హైదరాబాద్, బెంగళూరులోని 8 భవనాలను జప్తు చేసింది. సైబరాబాద్‌లో నమోదైన కేసు విచారణలో భాగంగా ఈమేరకు హైదరాబాద్ విభాగం ఈడీ చర్యలు తీసుకుంది. 58 బ్యాంకు ఖాతాలను కూడా సీజ్ చేసింది. దేశవ్యాప్తంగా క్యూనెట్‌పై మొత్తం 38 చోట్ల కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోనూ 9 కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ దాడులు చేసి కఠిన చర్యలు తీసుకుంది. చదవండి: పేపర్ లీక్ వ్యవహారంలో మరో ట్విస్ట్! -
'ఎన్నిసార్లు ఇలానే చేస్తారు.. స్క్రిప్ట్ రైటర్, డైలాగ్ రైటర్‌ను మార్చుకోండి'
పాట్నా: జాబ్ ఫర్ ల్యాండ్ స్కాంకు సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబసభ్యుల ఇళ్లపై ఈడీ దాడులు చేసిన ముడు రోజలు తర్వాత తేజస్వీ యాదవ్ స్పందించారు. ఈ సోదాల్లో రూ.కోట్ల నగదు, బంగారు ఆభరణాలు సీజ్ చేసినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఈ స్కాం ద్వారా పొందిన రూ.600 కోట్లు విలువ చేసే ఆస్తులను గుర్తించినట్లు ఈడీ చేసిన ప్రకటన పచ్చి అబద్దమన్నారు. ఈడీ అధికారులు తన ఢిల్లీ నివాసంలో అరగంటలోనే సోదాలు పూర్తి చేశారని తేజస్వీ చెప్పారు. ఈ సమయంలో తన సోదరీమణులు ధరించి ఉన్న నగలను తీసి పక్కకు పెట్టమని చెప్పారని, వాటినే ఫోటోలు తీసి సీజ్ చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2017లో కూడా తమ పార్టీ రూ.8,000కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడిందని చెప్పి దర్యాప్తు సంస్థలు దాడులు చేశాయని, వాటి సంగతేంటని ప్రశ్నించారు. ముందు వాటికి సంబంధించిన వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీలా తమది ఫేక్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ కాదని తేజస్వీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమిత్ షా క్రోనాలజీ వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇచ్చారు. తమది నిజమైన సోషలిస్టు కుటుంబం అని పేర్కొన్నారు. బిహార్‌లో బీజేపీని అధికారానికి దూరం చేసినందుకే తమపై దాడులు జరుగుతున్నాయని ప్రజలందరికీ తెలుసునని తేజస్వీ అన్నారు. కమలం పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈడీ సోదాల్లో ఏం సీజ్ చేశారో అధికారికంగా ప్రకటన విడదల చేయాలని, లేదంటే తానే నిజాన్ని వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థలు దాడులు చేయాలని బహుశా అమిత్‌షానే డైరెక్షన్ ఇచ్చి ఉంటారని తేజస్వీ ఆరోపించారు. ప్రతిసారి ఇలానే చేస్తే వర్కవుట్ కాదని.. వాళ్లు స్క్రిప్ట్ రైటర్లు, డైలాగ్ రైటర్లను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఎద్దేవా చేశారు. చదవండి: ప్రియాంక గాంధీ పెయింటింగ్‌కు రూ.2 కోట్లా? -
50 లీటర్ల పెట్రోల్ ట్యాంకుకు 57 లీటర్ల బిల్లు! బంకు సీల్..!
జబల్పూర్: మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఓ పెట్రోల్ పంపు సిబ్బంది ఏకంగా హైకోర్టు న్యాయమూర్తికే టోకరా ఇచ్చారు! ఆయన కారు ట్యాంక్ సామర్థ్యమే 50 లీటర్లయితే ఏకంగా 57 లీటర్ల పెట్రోల్ కొట్టినట్టు బిల్లు చేతికిచ్చారు. న్యాయమూర్తి ఫిర్యాదు మేరకు అధికారులు పెట్రోల్ బంకును సీల్ చేశారు. ఆ ప్రాంతంలోని ఇతర బంకుల నిర్వహణ తీరుపై విచారణకు ఆదేశించారు. ఈ నెల 9వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. చదవండి: ఆల్‌టైం రికార్డు సృష్టించిన చికెన్ ధర.. కేజీ రూ.720..! -
షాకింగ్.. సబ్బు పెట్టెల్లో హెరాయిన్.. రూ.12 కోట్ల డ్రగ్స్ సీజ్..
ఐజ్వాల్: మిజోరాంలో డ్రగ్స్ భారీగా పట్టుబడ్డాయి. పోలీసులు, అస్సాం రైఫిల్స్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఐజ్వాల్‌లో రెండు చోట్ల మత్తుపదార్థాలను సీజ్ చేశారు. వీటి విలువ రూ.12 కోట్లు ఉంటుందని అంచనా. రెండు వేర్వేరు ఘటనల్లో మొత్తం నలుగురు డ్రగ్ పెడ్లర్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక చోట 98,000 డ్రగ్స్ మాత్రలను సీజ్ చేశారు. వీటి విలువ రూ.9.8 కోట్లు ఉంటుందని తెలిపారు. మరో ఘటనలో శనివారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. 40 సబ్బుపెట్టెల్లో హెరాయిన్‌ను గుర్తించారు అధికారులు. దీని విలువ రూ.2.5కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. చదవండి: ఎంపీ సుప్రియా సూలే చీరకు అంటుకున్న నిప్పు.. వీడియో వైరల్.. -
పాకిస్తాన్లో రెచ్చిపోయిన తాలిబన్లు.. పోలీస్ స్టేషన్‌ను సీజ్ చేసి..
ఇస్లామాబాద్: తాలిబన్ మిలిటెంట్లు పాకిస్తాన్లో రెచ్చిపోయారు. ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని ఓ పోలీస్ స్టేషన్‌ను నిర్భంధించారు. అంతేకాదు ఉగ్రవాద వ్యతిరేక శాఖ భద్రతా సిబ్బందిని స్టేషన్లో బంధించారు. ఆదివారం ఈ ఘటన జరిగింది. అయితే స్టేషన్లో ఉన్న తమవాళ్లను విడిపించుకునేందుకే తాలిబన్లు ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌ను పూర్తిగా తమ నియంత్రణలో ఉందని, 9 మంది సిబ్బందిని బంధించినట్లు తాలిబన్లు ఓ వీడియో విడుదల చేశారు. వాళ్లను విడిచిపెట్టాలంటే తమను క్షేమంగా దేశం దాటించి అఫ్గానిస్తాన్ చేరుకునేందుకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తాలిబన్లు స్టేషన్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్న అనంతరం పాకిస్తాన్ సైన్యం రంగంలోకి దిగింది. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. తాలిబన్లు బయటి నుంచి దాడి చేశారా? లేక స్టేషన్ లోపలికి వెళ్లి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారా? అనే విషయంలో స్పష్టత లేదు. వారి చెర నుంచి అధికారులను విడిపించేందుకు పాక్ సైన్యం ప్రయత్నిస్తోంది. చదవండి: ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి.. ఫ్యాన్స్ ఆగ్రహం.. ఫ్రాన్స్‌లో ఘర్షణలు.. -
సూర్యాపేట: ప్రైవేట్ ఆసుపత్రి సీజ్.. ఎందుకో తెలుసా..?
సాక్షి, సూర్యాపేట: జిల్లాలో సిజేరియన్ ఆపరేషన్లపై సాక్షి వరుస కథనాలతో వైద్యారోగ్యశాఖ యంత్రాంగంలో కదిలిక వచ్చింది. ముహూర్తపు సిజేరియన్లు చేస్తున్నారంటూ సాక్షి స్ట్రింగ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ స్ట్రింగ్ ఆపరేషన్‌లో స్థానిక దీప్తి ఆసుపత్రి అడ్డంగా దొరికిపోయింది. సాక్షి కథనాలతో డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో ఆసుపత్రిలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో వైద్యురాలి సంభాషణ సీక్రెట్ కెమెరాలో రికార్డు అయ్యింది. దీంతో, ఆసుపత్రిని సీజ్ చేసినట్టు డీఎంహెచ్‌వో తెలిపారు. ఈ సందర్బంగా.. సిజేరియన్లను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇది కూడా చదవండి: నకిలీ సర్టిఫికెట్స్‌తో 230 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు -
చైనా బొమ్మలతో డేంజర్!
Dangerous Chemicals In China Toys: మేడ్ ఇన్ చైనా బొమ్మలకు అమెరికా చెక్ పోస్ట్ వేసింది. చైనా నుంచి నౌకల్లో చేరిన బొమ్మలను దేశంలోకి రాకుండా అడ్డుకుంది. తాజాగా పోర్ట్‌లోనే సుమారు ఏడు బాక్స్‌ల బొమ్మలను అధికారులు సీజ్ చేయడం విశేషం. ఇందుకు కారణం.. బొమ్మల్లో ప్రమాదకరమైన కెమికల్స్‌ను గుర్తించడం!. చైనా నుంచి వచ్చిన బొమ్మల్లో ప్రమాదకరమైన రసాయనాల ఆనవాళ్లను అమెరికా అధికారులు గుర్తించారు. ఈ మేరకు షిప్లో వచ్చిన మేడ్ ఇన్ చైనా బొమ్మల్ని అమెరికా కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. భారత్‌లో బాగా ఫేమస్ అయిన లగోరి(స్వీట్, పల్లీ.. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు) తరహా చైనా మేడ్ బొమ్మలూ ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. జులై 16న చేపట్టిన కన్జూమర్ ప్రొడక్ట్స్ సేఫ్టీ కమిషన్(CPSC), సీబీపీ అధికారులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీలలో ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్న బొమ్మల్ని గుర్తించారు. కొన్ని బొమ్మలకు సీసం, కాడ్మియం, బేరియం పూత పూస్తున్నారని, దానివల్ల పిల్లల ప్రాణాలకు ముప్పుపొంచి ఉందని పేర్కొంటున్నారు వైద్యులు. అంతేకాదు ఆగష్టు 24న చైనా నుంచి షిప్ ద్వారా వచ్చిన కొన్ని బొమ్మల్లోనూ ఈ కెమికల్స్ ఆనవాళ్లను నిర్ధారించారు. ఈ తరుణంలో అక్టోబర్ 4న అమెరికాకు చేరుకున్న చైనా బొమ్మల్ని సీజ్ చేయడం విశేషం. మరోవైపు హాలీడే షాపింగ్ సీజన్ నేపథ్యంలో యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్(సీపీబీ) అప్రమత్తమైంది. అంతేకాదు ఆన్లైన్ షాపింగ్ చేసేప్పుడు పిల్లల బొమ్మల విషయాల్లో జాగ్రత్తగా ఎంచుకోవాలని ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఈ ఎఫెక్ట్‌తో చైనా బొమ్మల వర్తకంపై భారీ ప్రతికూల ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. చదవండి: చైనాలో భారీ కార్పొరేట్ పతనం తప్పదా? -
ఆ కేసుతో విజయవాడకు సంబంధంలేదు: సీపీ
సాక్షి, విజయవాడ: గుజరాత్లో పట్టుబడ్డ డ్రగ్స్‌కు విజయవాడకు ఎలాంటి సంబంధం లేదని విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, విజయవాడకు డగ్స్ తరలిస్తుండగా పట్టుకున్నారన్నది వాస్తవం కాదని సీపీ స్పష్టం చేశారు. గుజరాత్ ముంద్ర పోర్టులో హెరాయిన్‌ను అధికారులు పట్టుకున్నారు. (చదవండి: ఐటీ నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా ఉద్యోగాలు!) చెన్నై నివాసముంటున్న దుర్గాపూర్ణ వైశాలి పేరుతో విజయవాడ అడ్రస్ పేరుతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్నారన్నారు. కొన్నేళ్లుగా వైశాలి, ఆమె భర్త, సుధాకర్ చెన్నైలో ఉంటున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ డీఆర్ఐ విచారణ జరుపుతోందని సీపీ వివరించారు. ఈ కేసుపై అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నైలలో కూడా సోదాలు నిర్వహించాయన్నారు. విజయవాడలో ఇంటి అడ్రస్‌తో లైసెన్స్ తీసుకోవడం తప్పితే డ్రగ్స్ ఆనవాళ్లు లేవని సీపీ తెలిపారు. చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌కు 11 రూల్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజనులు -
ఎయిర్‌పోర్టులో రూ. కోటి విలువైన ఐఫోన్లు పట్టివేత
శంషాబాద్: కస్టమ్స్ సుంకం చెల్లించకుండా వాణిజ్య అవసరాల కోసం తీసుకొచ్చిన 80 ఐఫోన్లను శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బుధవారం రాత్రి షార్జా నుంచి జి9458 విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికులు లగేజీ బెల్టు వద్ద ఓ బ్యాగును వదిలేశారు. కస్టమ్స్ అధికారులు అనుమానించి బ్యాగును తెరిచి చూడగా అందులో సుమారు రూ. 1,00,65,000 విలువ చేసే 80 ఐఫోన్లను గుర్తించారు. బ్యాగును తీసుకొచ్చిన ఇద్దరు ప్రయాణికులతో పాటు దాన్ని తరలించేందుకు వచ్చిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లింగ్‌లో భాగంగా ఐఫోన్లను తీసుకొచ్చినట్లు నిందితులు విచారణలో తెలిపారు. -
హోటల్లో ఈవీఎంలు, వీవీప్యాట్ స్వాధీనం
పట్నా : బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ హోటల్లో సోమవారం ఉదయం ఆరు ఈవీఎంలు, వీవీప్యాట్‌ను అధికారులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ముజఫర్‌పూర్ ఎస్డీఓ కుందన్ కుమార్ ఈవీఎంలను సీజ్ చేసి తన స్వాధీనంలోకి తీసుకున్నారు. సెక్టార్ మేజిస్ర్టేట్ అవధేష్ కుమార్ తన డ్రైవర్ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్లడంతో ఈవీఎంలను హోటల్‌కు తీసుకువెళ్లినట్టు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈవీఎంలను హోటల్ నుంచి స్వాధీనం చేసుకున్న సమాచారం తెలియగానే అక్కడ గుమికూడిన స్ధానికులు మేజిస్ర్టేట్ తీరును తప్పుపడుతూ నిరసన తెలిపారు. పోలింగ్ విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించారని మేజిస్ర్టేట్ అవధేష్ కుమార్‌కు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈవీఎంలు హోటల్‌కు ఎలా చేరుకున్నాయో వెల్లడించాలని ఆయనను కోరారు. తన డ్రైవర్ ఓటు వేసేందుకు వెళ్లడంతో మేజిస్ర్టేట్ ఈవీఎంలు, వీవీప్యాట్‌ను హోటల్‌కు తీసుకువెళ్లారని జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ ఘోష్ నిర్ధారించారు. నిబంధనలను ఉల్లంఘించిన అవధేష్ కుమార్‌పై శాఖాపరమైన విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
విజయవాడలో కలకలం రేపిన ఇరీడియం బాక్స్
-
కలెక్టర్ వాహనం జప్తునకు కోర్టు ఆదేశం
ఒకటి కాదు...రెండు కాదు... ఏకంగా పాతికేళ్లుగా పరిహారం కోసం బాధితులు పోరాడుతు న్నారు. ప్రభుత్వం సేకరించిన తమ భూమికి తగిన పరిహారం ఇవ్వాలంటూ ఏళ్లుగా వేడుకుం టున్నారు. పరిహారం కోసం తొలుత కార్యాలయాల చుట్టూ తిరిగిన చాలా మంది కాలం చేశారు. కానీ ఇప్పటికీ ఆ కుటుంబాలకు పరిహారం అందనే లేదు. రెవెన్యూ విభాగంలో అంతులేని నిర్లక్ష్యంపై కోర్టు పలుమార్లు మెట్టికాయలు వేసింది. అయినా స్పందన రావడం లేదు. చివరికి కలెక్టర్ వాహనం జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈనెల 28లోగా వాహనాన్ని అటాచ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. సాక్షి, పెద్దపల్లి: రామగుండం మండలం జనగామ శివారులో 1994లో వాటర్‌ట్యాంక్ నిర్మించారు. సర్వేనంబర్ 599లో ఎకరా పది గుంటల భూమిని వాటర్‌ట్యాంక్ నిర్మాణానికి ప్రభుత్వం సేకరించింది. ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం నిర్ణయించింది. అయితే ఆ పరిహారం తమకు ఆమోదయోగ్యం కాదంటూ గౌసియా బేగం తదితర కుటుంబాలు కోర్టుకు వెళ్లాయి. ఇందుకు స్పందించిన కోర్టు ఎకరాకు రూ.3.50లక్షల చొప్పున చెల్లించాలంటూ 2012 జూలై 31న తీర్పునిచ్చింది. అన్ని లెక్కలు కలిపి మొత్తం రూ.31లక్షల 24వేల 968 పరిహారం కింద చెల్లించాలని పెద్దపల్లి కోర్టు తేల్చింది. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు ఎ లాంటి చెల్లింపులు జరపలేదు. సంవత్సరాలు గడుస్తున్నా సమస్య కొలిక్కిరాలేదు. తమకు రావాల్సిన పరిహారం కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే.. ఇప్పుడు, అప్పుడు అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. కలెక్టర్ వాహనం జప్తు చేయాలని ఆదేశం పరిహారం కోసం పోరాటం చేస్తున్న బాధిత కుటుంబాలకు కోర్టు బాసటగా నిలిచింది. మొ త్తం రూ.31,24,968 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. పరిహారంపై రెవెన్యూ అధికారులు అదే రీతిన నిర్లక్ష్యం చేస్తుండడంతో జిల్లా కలెక్టర్ వాహనం జప్తు చేయాలంటూ పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. వరుస సెలవులు రావడంతో ఈనెల 28లోగా కలెక్టర్ వాహ నం జప్తు చేసే అవకాశం ఉంది. అయితే ఆ లోగా నే డబ్బులు చెల్లించి, వ్యవహారం కలెక్టర్ వాహ నం జప్తు కాకుండా చూసేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలోనూ రామగుండం తహసీల్దార్ కార్యాలయం లోని సామగ్రిని జప్తు చేయాలని కోర్టు 2016లో ఆదేశించింది. దీంతో కార్యాలయంలోని కంప్యూటర్, బీరువాలు, టేబుళ్లను బాధితులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని వేలం వేయాల్సి ఉండగా, రూ.84,500 చెల్లించి ప్రభుత్వమే తిరిగి కొనుగోలు చేసింది. సామగ్రి విలువ ప్రకారం చెల్లించి న, పరిహారం మాత్రం పూర్తిగా దక్కలేదు. మళ్లీ రెండేళ్ల తర్వాత ఏకంగా కలెక్టర్ వాహనాన్ని పరిహారం కింద జప్తు చేయాలని కో ర్టు ఆదేశించడం సంచలనంగా మారింది. కాగా పాతికేళ్లుగా పరిహారం ఇవ్వకుండా తమను మా నసికంగా వేధిస్తున్నారని, ఇప్పటికైన పూర్తి పరిహారం ఇవ్వాలని బాధితులు వేడుకొంటున్నారు. జప్తు కానివ్వం కలెక్టర్ వాహనం జప్తు కావట్లేదు. మేమున్నంత వరకు జప్తు కానివ్వం. ప్రజా ఆరోగ్యశాఖ డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఆ శాఖ డబ్బులు చెల్లించకపోవడంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. ఇప్పుడు మున్సిపల్ (ప్రజా ఆరోగ్యశాఖ) నుంచి రూ.10 లక్షల చెక్‌ను కోర్టుకు పంపిస్తున్నాం. ఏ వాహనం కూడా జప్తు కాదు.–పుప్పాల హన్మంతరావు, తహసీల్దార్, రామగుండం