
సికింద్రాబాద్‌లో 142 కిలోల గంజాయి స్వాధీనం
చిలకలగూడ: సికింద్రాబాద్ చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీతాఫల్‌మండి చౌరస్తా వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు 142 కిలోల గంజాయిని ఇన్నోవా కారులో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.7 లక్షల 40 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
విశాఖ, తూర్పుగోదావరి, నల్గొండ జిల్లాలకు చెందిన ఆరుగురిని అరెస్టు చేశారు. గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు,. చిలకలగూడ సీఐ కావేటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు.