marijuana
-
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ : దేవుడా..ప్యాక్ చూసి షాక్!
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసినపుడు ఒకటికి బదులు ఒకటి రావడం, లేదంటే ఆహారంలో పురుగులు, సిగరెట్ పీకలు రావడం లాంటి ఘటనలు గతంలో చాలా చూశాం. తాజాగా అమెరికాలోని ఒక మహిళకు మరో వింత అనుభవం ఎదురైంది. తను ఆర్డర్ చేసిన ప్యాకేజీ ఓపెన్ చేసి, చూసి షాకయ్యింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. స్టోరీ ఏంటంటే..!న్యూజెర్సీలో డ్రైవర్‌గా పని చేసే ఒక మహిళ ఉబెర్ ఈట్స్నుంచి బురిటో(షావర్మా) లాంటిది ఆర్డర్ చేసింది. ఉబెర్ ఈట్స్ డెలివరీ అందుకొని ఓపెన్ చేసి, తిందామని ఏంతో ఆతృతగా ఫాయిల్ రేపర్ విప్పి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అందులో బురిటోకు బదులుగా గంజాయి ప్యాక్ చేసి ఉంది. ఘటన వాషింగ్టన్ టౌన్షిప్, క్యామ్‌డెన్ కౌంటీలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ విషయంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే తన డెలివరీ ప్యాకేజీలో బురిటోకు బుదులుగా ఏదో తేడా వాసన వచ్చినట్టుగా అనిపించిందని బాధితురాలు తెలిపిందని వాషింగ్టన్ టౌన్షిప్ పోలీస్ చీఫ్ పాట్రిక్ గుర్సిక్ ఒక ప్రకటనలో తెలిపారు. అది ఒక ఔన్స్ గంజాయి అని తేలిందని ఆయన వెల్లడించారు. డ్రగ్స్, ఆల్కహాల్ లేదా మందులను రవాణాపై నిషేధం ఉన్న నేపథ్యంలో ఉబెర్ ఈట్స్‌లో ప్యాకేజీ డెలివరీ ఫీచర్‌ను ఎవరైనా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించి ఉంటారని అనుమానిస్తున్నారు.ఉబెర్ ఈట్స్ స్పందనదీనిపై ఉబెర్ ఈట్స్ కూడా స్పందించింది. ఈ ఘటన తీవ్రంగా కలపర్చేదేనని ఉబెర్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. స్థానిక అధికారులను వెంటనే అప్రమత్తం చేసినందుకు ఆమెను అభినందించారు. ఇలాంటి అనుమానాస్పద డెలివరీలపై వెంటనే రిపోర్ట్ చేయాలని ఇతర డ్రైవర్లను కూడా కోరారు.ఇదీ చదవండి : వయసు 28, తులసి పంట రారాజు ఫిలిప్పో సక్సెస్ స్టోరీ, ఆదాయం ఎంతో తెలుసా? -
కుప్పంలో గంజాయి ‘మత్తు’.. తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ
సాక్షి, చిత్తూరు జిల్లా: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి మత్తులో తెలుగు తమ్ముళ్లు ఘర్షణ పడటంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఇరువర్గాలు ఒకరిపై మరొకరు కత్తులు, రాడ్డులతో దాడులు చేసుకున్నారు. దాడిలో కుప్పం మాజీ జడ్పీటీసీ రాజ్ కుమార్ తమ్ముడు వినయ్ తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘర్షణలో న్యాయవాది కుమారుడు, రాజకీయ నేతల కుమారులు ఉన్నట్లు తెలిసింది. టీడీపీ కార్యకర్త వినయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్నివివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘర్షణలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఇదీ చదవండి: గనుల శాఖలో బదిలీల ‘వేలం’ -
మత్తు వదిలిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: మత్తుపదార్థాలు రవాణా చేసే ముఠాలను కట్టడి చేయడంతోపాటు మత్తుపదార్థాలకు అలవాటుపడిన వారిని అందులోంచి బయటపడేసే వ్యూహంతో ముందుకు వెళితేనే మత్తు మహమ్మారిని తరిమికొట్టడం సాధ్యమవుతుందని నిపుణులు చెపుతున్నారు. మద్యం, కల్తీకల్లు, గంజాయి, ఇతర మత్తుపదార్థాలకు బానిసలైన వారిని ఆ వ్యసనం నుంచి బయటపడేసేందుకు ఏర్పాటు చేసిన డీ–అడిక్షన్ సెంటర్లకు రోగుల సంఖ్య ఇటీవల పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గతానికి భిన్నంగా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల గురించి అవగాహన పెరుగుతుండటంతో డీ–అడిక్షన్ సెంటర్లలో చేరే రోగుల సంఖ్యా పెరుగుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా డీ–అడిక్షన్ సెంటర్ల పనితీరును టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ఇటీవలే పరిశీలించి ఓ నివేదికను తయారు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16 డీ–అడిక్షన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తుండగా.. ఐదు సెంటర్లు పూర్తిగా మూతపడినట్టు అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా డీ–అడిక్షన్‌కు ప్రాధాన్యం పెరగడంతోనషాముక్త భారత్ అభియాన్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో డీ–అడిక్షన్ సెంటర్లను కొత్తగా ఏర్పాటు చేశారు. వీటిల్లో కనీసం 10 చొప్పున బెడ్లు అందుబాటులోకి తెచ్చారు. మద్యం బానిసలే ఎక్కువ.. డీ–అడిక్షన్ సెంటర్లలో చేరుతున్న రోగులలో ఎక్కువ మంది మద్యానికి బానిసలైన వారే ఉంటున్నారు. తర్వాత పెద్ద సంఖ్యలో గంజాయి బానిసలు ఉంటున్నారు. 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు 12 వరకు డీ–అడిక్షన్ సెంటర్లలో చేరిన రోగుల సంఖ్య ఆధారంగా చూస్తే.. హనుమకొండలోని డీ–అడిక్షన్ కేంద్రంలో 1,067 మంది మద్యానికి బానిసలైన వారుండగా, గంజాయి రోగులు 344 మంది ఉన్నారు. ఆదిలాబాద్ సెంటర్లో 781 మంది మద్యానికి బానిసలైన వారు చేరగా.. 53 మంది గంజాయి బాధితులు ఉన్నారు.ఎల్బీనగర్లోని సెంటర్లో 933 మంది మద్యానికి బానిసలైన రోగులు, 39 మంది గంజాయికి బానిసలైన రోగులున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాలలో 850 మంది మద్యం బానిసలు, 30 మంది గంజాయికి బానిసలైన రోగులు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులోని సెంటర్లో 722 మంది మద్యానికి బానిసలైన వారు.. 24 మంది గంజాయికి అలవాటుపడిన వారున్నారు. ఖమ్మం జిల్లా మధిర‡ సెంటర్లో 427 మంది రోగులు మద్యానికి బానిసలైన వారుండగా, 23 మంది గంజాయి నుంచి డీ–అడిక్షన్ కోసం చేరారు. డీ–అడిక్షన్ సెంటర్లు అంటే..? మద్యం, గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలకు బానిసలైన వారికి ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు అవసరమైన వైద్య సహాయం, కౌన్సెలింగ్ అందించి వారిని తిరిగి ఆరోగ్యవంతులుగా మార్చే కేంద్రాలను డీ–అడిక్షన్ సెంటర్లుగా వ్యవహరిస్తారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆధ్వర్యంలో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ (ఎన్ఏపీడీడీఆర్) పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రులలో డీ–అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. -
సీటివ్వండి..లేకపోతే చచ్చిపోతా!
పెందుర్తి: గంజాయి మత్తులో ఓ టీనేజర్ పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద సోమవారం వీరంగం సృష్టించాడు. గతేడాది ఇదే కళాశాలలో చదువుకున్నానని..కానీ బహిష్కరించారని..ఇప్పుడు తనకు సీటివ్వకపోతే చచ్చిపోతానని బెదిరించాడు. కర్రతో రోడ్డుపై వచ్చేపోయే వాహనాలకు ఇబ్బంది కలిగించాడు. రోడ్డుపై పడుకొని తీవ్రస్థాయిలో అలజడి రేపాడు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి అతడ్ని రిహబిలిటేషన్ కేంద్రానికి తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వివరాలివి..పెందుర్తి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి (17) గతేడాది పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాడు. అయితే అతడి అలవాట్లు, క్రమశిక్షణారాహిత్యం కారణంగా అప్పట్లో కళాశాల నుంచి టీసీ ఇచ్చి పంపేశారు. అయితే సదరు విద్యార్థి గంజాయి మత్తులో సోమవారం కళాశాల ప్రాంగణానికి వచ్చి కర్రలతో విద్యార్థులను హడలగొట్టాడు. తనకు మళ్లీ సీటు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని వాహనాల మధ్యకు వెళ్లి అలజడి రేపాడు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్ఐ అసిరితాత వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సదరు టీనేజర్‌ను అదుపులోని తీసుకుని స్టేషన్‌కు తరలించారు. సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం ప్రభుత్వ రిహబిలిటేషన్ కేంద్రానికి తరించారు. -
ఖాకీ వనంలో గంజాయి మొక్కలు!
ఖాకీ వనంలో గంజాయి మొక్కలుగా పోలీసులు అవినీతి సొమ్ముకు అలవాటుపడి ఒక్కొక్కరుగా ఏసీబీ అధికారులు విసిరిన ‘వల’లో చిక్కుతున్నారు. కేవలం మూడున్నర మాసాల వ్యవధిలో నలుగురు ఖాకీలు అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడి పోలీస్‌శాఖకు మచ్చతెచ్చారు. మెదక్‌జోన్: జిల్లాలోని కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల సమీపంలో ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్లో గత మార్చి 19న అవుసులపల్లి వార్డుకు చెందిన ఓవ్యక్తి ఇసుకను గ్రామశివారులోని వాగు నుంచి అక్రమంగా తరలిస్తుండగా రూరల్ పోలీసులు ట్రాక్టర్‌ను సీజ్‌చేశారు. దీంతో ఆ యజమాని మైనింగ్ అధికారులకు జరిమానా చెల్లించి ట్రాక్టర్‌ను విడుదల చేయాల్సిందిగా కోరాడు. అందుకు రూ.25వేలు లంచం ఇస్తేనే ట్రాక్టర్‌ను వదిలిపెడతామని ఓ కానిస్టేబుల్ ట్రాక్టర్ యజమానిని డిమాండ్ చేశాడు. దీంతో విసుగు చెందిన ఆ యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో లంచం తీసుకుంటుండగా పోలీస్ రైటర్ బాసిత్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హేండెడ్‌గా పట్టుకున్నారు. అప్పటికే స్టేషన్ బయట ఉన్న ఎస్ఐ అమర్ ఫోన్ స్విచ్చ్ఆఫ్ చేసుకుని పారిపోయారు. పది రోజులపాటు ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా పరారైయ్యారు. 15రోజుల అనంతరం ఎస్ఐ డ్యూటీలో చేరిన విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు మళ్లీ విచారణ జరిపారు. లంచం తీసుకున్న కేసులో ఎస్ఐతోపాటు మరో కానిస్టేబుల్ సురేందర్ హస్తం ఉందని నిర్ధారించి ఆ ఇద్దరు కానిస్టేబుల్స్‌తోపాటు ఎస్ఐ అమర్‌ను సస్పెండ్‌చేసి రిమాండ్‌కు తరలించారు.ఏసీబీ ట్రాప్‌లో నలుగురుతాజాగా హవేళిఘణాపూర్ ఎస్ఐ ఆనంద్‌గౌడ్‌తో సహా కేవలం మూడున్నర నెలల వ్యవధిలోనే ఇద్దరు ఎస్ఐలు, ఇద్దరు కానిస్టేబుల్స్ కలిసి మొత్తం నలుగురు ఏసీబీకి పట్టుబడడంతో పోలీసుల అవినీతి బాగోతంపై జిల్లాలో చర్చసాగుతోంది.ఏసీబీ వలలో హవేళి ఎస్ఐహవేళిఘణాపూర్: ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ఓ టిప్పర్‌ను వదిలిపెట్టేందుకు మధ్యవర్తి ద్వారా రూ.20వేలు లంచం తీసుకుంటుండగా స్థానిక ఎస్ఐ ఆనంద్ గౌడ్‌ను ఏసీబీ అధికారులు ట్రాప్‌చేసి సోమవారం పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌కు చెందిన పూల గంగాధర్ టిప్పర్ ఈ నెల 29న ఇసుకను తరలిస్తూ పట్టుబడింది. ఈ టిప్పర్‌ను విడిచిపెట్టడానికి ఎస్ఐ ఆనంద్ గౌడ్ రూ.50వేలు డిమాండ్ చేయగా రూ.20వేలకు ఒప్పందం కుదిరింది. ఈ కేసులో గంగాధర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం మధ్యవర్తి మస్తాన్ అనే వ్యక్తి హవేళిఘణాపూర్ పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి డబ్బులు తీసుకొనివెళ్లి ఎస్ఐకు ఇవ్వగా పట్టుకొని విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏసీబీ సిబ్బంది రమేశ్, వేణు పాల్గొన్నారు. -
మత్తు డేగ ఎగురుతోంది... జాగ్రత్త
వీధి చివర బంకుల్లో మత్తు చాక్లెట్లు కాలేజీ క్యాంపస్‌లో గంజాయి పొగ పబ్‌లో మాదకద్రవ్యాలు బుద్ధిగా చదువుకోవాల్సిన టీనేజ్ పిల్లల్ని మత్తులోకి లాగడానికి పొంచి ఉన్న డేగలు. జాగ్రత్త... తల్లిదండ్రులూ.. జాగ్రత్త. పిల్లలు తెలిసీ తెలియక చిక్కుకుంటారు. గమనించాలి. చర్చించాలి. కాపాడుకోవాలి.స్కూల్ వయసు పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా హర్యాణ రాష్ట్రంలో పోలీసులు ఆయా స్కూళ్లకెళ్లి వారిని చైతన్యపరిచే కార్యక్రమాలు చేస్తున్నారు. ‘క్యాచ్ దెమ్ యంగ్’ అనేది ఈ కార్యక్రమం పేరు. అంటే చిన్న వయసులోనే పిల్లల దృష్టిని ఆకర్షించి వారిని డ్రగ్స్ దుష్ప్రభావాల గురించి చెప్పాలి. ఇందుకు వారు అంబాలలోని ఒక ప్రయివేటు స్కూల్లో ప్రయోగాత్మకంగా ఒక ప్రయత్నం చేశారు. దాని పేరు ‘చక్రవ్యూహ్’. వరుసగా ఉన్న ఐదు గదుల్లో రకరకాల పజిల్స్ ఇచ్చి ఒక గదిలో నుంచి మరో గదిలోకి కేవలం తెలివితేటల ఆధారంగా తలుపు తెరుచుకుని ప్రవేశిస్తూ అంతిమంగా బయట పడాలి. ‘ఇది ఒక అద్భుత ప్రయోగం’ అని విద్యార్థులు అంటున్నారు.చక్రవ్యూహ్ ప్రయోగంచక్రవ్యూహ్ అనేది ఒక పజిల్ గేమ్. ఆటోమేటిక్ తాళాలు ఉన్న గదుల్లోకి నలుగురు విద్యార్థుల బృందాన్ని పంపిస్తారు. ఆ బృందం అక్కడ తమ జీవితంలో ఎదురయ్యే రకరకాల సమస్యలను పజిల్స్ రూపంలో ఎదుర్కొంటుంది. అంటే పరీక్షలో ఫెయిల్ కావడం, మంచి ర్యాంక్ రాకపోవడం, నిరుద్యోగం, ఒంటరితనం, తల్లిదండ్రుల కొట్లాట... ఇలాంటి సమయంలో ఆ సమస్యలను ఎలా దాటాలో అక్కడే క్లూస్ ఉంటాయి. ఆ క్లూస్ ద్వారా ముందుకు సాగితే తర్వాతి గదిలోకి తలుపు తెరుచుకుంటుంది. ఇదంతా íసీసీ టీవీల ద్వారా అధ్యాపకులు గమనిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రతి సవాలు ఎదుర్కొనే సమయంలో ఆ సమస్య నుంచి పారిపోయి డ్రగ్స్‌ను ఎంచుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. కాని ఈ మొత్తం చక్రవ్యూహ్లో కలిగే అవగాహన ఏమిటంటే నిజ జీవిత సమస్యల్ని తల్లిదండ్రుల, స్నేహితుల సాయంతో దాటితే వచ్చే కిక్కు డ్రగ్స్ తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకోవడంలో లేదని తెలియడం. ఇలాంటి చక్రవ్యూహ్ ప్రయోగాన్ని హర్యాణలోని స్కూళ్లల్లో విస్తృతంగా నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. జీవితపు చక్రవ్యూహంలో చిక్కుకుంటే బయటపడే దారి ఉంటుందిగాని డ్రగ్స్‌లో చిక్కుకుంటే దారి ఉండదు అని తెలియడం వల్ల విద్యార్థులు చిన్న వయసులోనే గట్టి సందేశం అందుకుంటారు.కుతూహలం, సాంగత్యంటీనేజీ పిల్లలు అయితే కుతూహలం కొద్దీ లేదా దుష్ట సాంగత్యంలోని ఒత్తిడి వల్ల డ్రగ్స్‌ను ట్రై చేస్తున్నారని డీ అడిక్షన్ థెరపిస్టులు అంటున్నారు. పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని తల్లిదండ్రులు గమనించే లోపు వారి ప్రవర్తన పూర్తిగా మారిపోయి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. సరదా షికార్లు, స్లీప్ ఓవర్ల సమయంలో సరదా కొద్ది సీనియర్లో స్నేహితులో డ్రగ్స్ ఇస్తున్నారు. మొదటి ఒక రకం డ్రగ్స్ తీసుకున్నాక మెదడు ఇంకా ‘హై’ కావాలని కోరుకుంటుంది. దాంతో పిల్లలు ఇంకా ఎన్ని రకాల డ్రగ్స్ ఉన్నాయో చూద్దామని వెతుకులాట సాగిస్తారు. ఇక అంతటితో వారి చదువు, ఆరోగ్యం, ఏకాగ్రత, వ్యక్తిత్వం మొత్తం ధ్వంసమైపోతాయని డ్రగ్స్‌కు బానిసలైన టీనేజ్ విద్యార్థులను పరిశీలిస్తున్న డీ అడిక్షన్ థెరపిస్టులు తెలియచేస్తున్నారు.బయట పడేయాలిడ్రగ్స్కు అలవాటు అయ్యారని తెలియగానే తల్లిదండ్రులు పిల్లల్ని మందలించడానికి చూస్తారు. వెంటనే ఆ పిల్లలు ‘మీరిలా తిడితే ఇల్లు విడిచి వెళ్లిపోతాం’ అని బ్లాక్మెయిల్ చేస్తారు. వీరిని చాలా ఓర్పుతో థెరపీల ద్వారా తిరిగి మామూలు మనుషుల్ని చేయాల్సి వస్తుంది. పోలీసుల గమనింపు ప్రకారం 18 నుంచి 25 ఏళ్ల లోపు వారిని డ్రగ్ పెడలర్స్ లక్ష్యం చేసుకున్నా నేడు 14 ఏళ్ల పిల్లలతో మొదలు ప్రతి టీనేజ్ అమ్మాయి అబ్బాయి డ్రగ్స్ డేగ రెక్కల కింద ఉన్నట్టే లెక్క.నెగెటివ్ కుటుంబ వాతావరణంటీనేజ్ పిల్లలు డ్రగ్స్ వైపు మొగ్గు చూపడంలో ప్రధానంగా నెగెటివ్ కుటుంబ వాతావరణం ఒక ముఖ్యకారణమని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు ఘర్షణతో ఉన్నా పిల్లలతో మంచి అనుబంధం ఏర్పరుచుకోకపోయినా ఆత్మీయంగా వారితో సమయం గడపకపోయినా ‘మనం పట్టని తల్లిదండ్రుల’ కంటే ‘మనకు కిక్ ఇచ్చే డ్రగ్స్ మేలు’ అనే భావనలో భ్రష్ట సాంగత్యాలలోకి పిల్లలు వెళతారు. ఆ సంగతి తెలియనివ్వరు. చదువుతో పాటు క్రీడలు, ప్రకృతి ప్రేమ, బంధుమిత్రులు, క్రమశిక్షణ గల ఆర్థిక పరిస్థితి, భావోద్వేగాలకు అయినవారు ఉన్నారన్న భరోసా, విలువలు లేదా ఏదో ఒక ఆధ్యాత్మిక ఆలంబన... ఇవి టీనేజ్ పిల్లల రోజువారీ జీవనంలో ఉంటే వారు డ్రగ్స్ బారిన ఏ మాత్రం పడరు. తల్లిదండ్రులూ బహుపరాక్.ఎలా గుర్తించాలి?మీ టీనేజ్ పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని ఎలా గుర్తించాలి?1. చాలా మూడీగా తయారవుతారు 2. సరిగా భోజనం చేయరు 3. సడన్‌గా కొత్త కొత్త స్నేహితులు ప్రత్యక్షమవుతుంటారు. తరచూ ఏవో పార్టీలున్నాయని వెళుతుంటారు. 4. గతంలో కంటే ఎక్కువ డబ్బు అడుగుతారు 5. పొడి పెదిమలు 6. ఎర్రబడ్డ కళ్లు 7. వాదనలకు దిగి ఆధిపత్యం ప్రదర్శించడం 8. కుటుంబంతో కలివిడిగా లేకపోవడం 9. అర్థం పర్థం లేని నిద్రా సమయాలు. -
అమెరికాలో గంజాయి బ్యాచ్‌లకు ఊరట!
‘‘గంజాయిని కలిగి ఉన్నా.. లేదంటే సేవించినంత పని చేసినా ఇక నుంచి జైలుకేం వెళ్లరు’’ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో స్వయంగా చేసిన పోస్ట్ ఇది. ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకుని ఈ ఫెడరల్ పాలసీని ప్రతిపాదించినట్లు బైడెన్ ప్రభుత్వం చెబుతోంది.వాషింగ్టన్: అమెరికాలో మాదకద్రవ్యాల చట్టంలో మార్పులు జరిగాయి. గంజాయిని నెమ్మదిగా ఆ దేశంలో చట్టబద్ధం చేసే ప్రయత్నాల్లో మొదటి అడుగు పడినట్లయ్యింది. ఈ క్రమంలోనే గంజాయిని షెడ్యూల్-3 డ్రగ్ నుంచి షెడ్యూల్-1 డ్రగ్ కేటగిరీకి మార్చారు. అంటే ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల జాబితా నుంచి తక్కువ ప్రమాదకరమైన మాదకద్రవ్యాల జాబితాలోకి మార్చబోతున్నారన్నమాట.అమెరికాలో మాదకద్రవ్యాల నిషేధిత చట్టం రూపకల్పన 1937లో జరిగింది. రేసిజం నేపథ్యంలోనే ఈ చట్టాన్ని రూపొందించడం గమనార్హం. ఆ తర్వాత మైనర్లు డ్రగ్స్ బారిన పడుతున్నారనే 1970లో కొత్త చట్టం తెచ్చారు. అదే కంట్రోల్డ్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్. దీని ప్రకారం గంజాయిని ఇంతకాలం షెడ్యూల్-1 డ్రగ్ కింద ఉంచారు. ఈ షెడ్యూల్-1 డ్రగ్స్‌లో హెరాయిన్, ఎల్ఎస్డీ, ఎక్సాట్సీ వంటివి కూడా ఉన్నాయి. ఇవి చాలా ప్రమాదకరమైన డ్రగ్స్ అని, వీటిని సేవించినా.. కనీసం కలిగి ఉన్నట్లు రుజువైన ఇంతకాలం కఠిన శిక్షలు అమలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ లిస్ట్‌లో ఉన్న గంజాయిని.. షెడ్యూల్3 డ్రగ్స్‌లోకి మార్చేందుకు ప్రతిపాదన చేశారు. షెడ్యూల్-3 డ్రగ్స్‌లో కెటామైన్, పెయిన్కిలర్స్లో వాడే కోడైన్(codeine) ఉన్నాయి. గంజాయిని ఇందులోంచి మినహాయించడంతో.. ఇక నుంచి గంజాయి బ్యాచ్‌లకు కాస్త ఊరట కలగనుంది. అలాగని అమెరికాలో గంజాయిని కలిగి ఉండడం చట్టబద్ధం అని మాత్రం కాదు. కాకుంటే.. ఇంతకు ముందు స్థాయిలో మాత్రం అరెస్టులు ఉండకపోవచ్చు.వాస్తవానికి గంజాయిని ప్రమాదకరమైన డ్రగ్స్ జాబితాను తొలగించే ప్రయత్నాలు బైడెన్ హయాంలో 2022లోనే మొదలయ్యాయి. అయితే.. గంజాయిని రీక్లాసిఫై చేసే ప్రతిపాదనను మాత్రం బైడెన్ ప్రభుత్వం ఈ ఏప్రిల్ చివరి వారంలోనే రూపొందించింది. జస్టిస్ డిపార్ట్మెంట్ మాత్రం ఆ ప్రాసెస్‌ను అధికారికంగా గురువారం నుంచే ప్రారంభించింది. అంటే.. ఆ ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడేదాకా ఇంకొంచెం సమయం పడుతుంది. అప్పటిదాకా ఇది ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల జాబితాలోనే కొనసాగనుంది.ప్రపంచంలో చాలా దేశాల్లో గంజాయి వాడకం తప్పేం కాదు. అలాగే గంజాయిని చట్ట బద్ధం చేయాలనే డిమాండ్ అమెరికాలో ఎప్పటి నుంచో ఉంది. ప్యూ రీసెర్చ్‌సెంటర్ సర్వే ప్రకారం.. 88 శాతం అమెరికన్లు గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేయాలని కోరుతున్నారు. కేవలం 11 శాతం మంది మాత్రమే వద్దని కోరారు.బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయం.. ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలను తీవ్ర ప్రభావితం చేస్తుందని, ముఖ్యంగా యువ ఓటర్లను ఆకర్షించే దిశగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఉడ్తా షెహర్! హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న డ్రగ్స్..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా మారుతోంది. యువత భవిష్యత్తును నిర్వీర్యం చేసే మాదకద్రవ్యాల క్రయవిక్రయాలు నగరంలో జోరుగా సాగుతున్నాయి. గంజాయి ఆకులతో తయారు చేసే హష్ ఆయిల్ మొదలుకుని, కొకైన్, హెరాయిన్, బ్రౌన్‌షుగర్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ బ్లాట్స్ లాంటి ఖరీదైన సింథటిక్ డ్రగ్స్ విచ్చలవిడిగా లభిస్తున్నాయి. పాఠశాల విద్యార్థుల నుంచి కాలేజీ కుర్రాళ్ల వరకు.. ప్రైవేట్ ఉద్యోగుల నుంచి సాఫ్ట్వేర్ నిపుణుల వరకు.. వైద్యులు, వ్యాపారవేత్తలతో పాటు సినీ ప్రముఖులు సైతం వీటి బారిన పడ్డట్టు తెలుస్తోంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎంత నిర్బంధం విధిస్తున్నా.. వాళ్ల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ డ్రగ్ పెడ్లర్స్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో జరిగిన పార్టీలో దాని యజమాని కుమారుడు సహా పలువురు ప్రముఖులపై కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇంటర్నెట్లో డార్క్ వెబ్ ద్వారా కావాల్సిన డ్రగ్‌ను ఎంచుకోవడం.. సోషల్ మీడియా యాప్ ద్వారా సరఫరాదారుడిని సంప్రదించడం.. బిట్ కాయిన్స్ రూపంలో నగదు చెల్లించడం.. డెడ్ డ్రాప్ లేదా కొరియర్ ద్వారా సరుకు తెప్పించుకోవడం..ఇలా పూర్తి వ్యవస్థీకృతంగా మాదకద్రవ్యాల దందా సాగిపోతోంది. వారాంతంలో హోటళ్లు, పబ్‌లు, రిసార్టుల్లో యథేచ్ఛగా డ్రగ్ పార్టీలు జరిగిపోతున్నాయి. దుమ్ము రేపుతున్న రేవ్ పార్టీలు ఒక్క రాడిసన్ హోటలే కాదు.. రాత్రి అయిందంటే చాలు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, గచ్చిబౌలి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లోని హోటళ్లు, రిసార్టులు, పబ్‌లు రేవ్ పార్టీలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఇందుకోసం కొందరు నిర్వాహకులు ప్రత్యేకంగా యాప్‌లు నిర్వహిస్తున్నారు. పార్టీలకు హాజరు కావాలని భావించే వారంతా వాటిని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి. పార్టీ జరిగే ప్రాంతంలోకి ప్రవేశించే సమయంలో దానికి సంబంధించిన ఓటీపీని కూడా అక్కడి వారికి చెప్పాల్సి ఉంటుంది. పచ్చబొట్లలో డ్రగ్ గుట్టు కొందరు సొంతంగా యాప్స్, వాట్సాప్, టెలిగ్రాం గ్రూపులు నిర్వహిస్తూ మూడో కంటికి తెలియకుండా కస్టమర్లకు రేవ్ పార్టీలపై సమాచారం అందిస్తున్నాన్నారు. పార్టీకి హాజరయ్యే కస్టమర్ చేతులపై తాత్కాలిక పచ్చబొట్లు ముద్రిస్తున్నారు. ఈ టాటూ ఆధారంగానే ఏ డ్రగ్ సరఫరా చేయాలన్నది సప్లై చేసే వారికి తెలుస్తుంది. కుడి చేయి మణికట్టు మీద టాటూ వేస్తే అతడికి గంజాయి, హష్ ఆయిల్ సరఫరా చేయాలని అర్థం. ఎడమ చేతిపై టాటూ ఉంటే కొకైన్, ఎండీఎంఏ, ఎక్స్టసీ వంటి మాదకద్రవ్యాలు సరఫరా అవుతాయి. కొన్ని పబ్‌ల నిర్వాహకులు ‘స్పెషల్’, ‘ఆఫర్’, ‘స్కీమ్’, ‘లిమిటెడ్’పేరుతో ప్రత్యేక కోడ్ భాషను పార్టీల సందర్భంగా వాడుతున్నట్లు సమాచారం. రేవ్ తీరే వేరు అర్ధరాత్రి ప్రారంభమయ్యే రేవ్ పార్టీలు తెల్లవారే వరకు జరుగుతుంటాయి. వీటి నిర్వహణకు మద్యం, మాదకద్రవ్యాలు, మ్యూజిక్ సిస్టమ్‌తో పాటు ల్యాప్‌టాప్ లేదా స్క్రీన్ తప్పనిసరి. అడ్డూ అదుపు లేకుండా సాగే ఈ పార్టీల్లో హోరెత్తే మ్యూజిక్‌లో మత్తెక్కించే మద్యం, మగత పుట్టించే డ్రగ్స్‌తో రెచ్చిపోయి నాట్యం చేసే యువత.. ల్యాప్‌టాప్ లేదా స్క్రీన్ పై ‘పైట్రాన్స్’ఇమేజెస్‌గా పిలిచే ఓ రకమైన ఫొటోల్ని చూస్తుంటారు. అక్కడ సైకెడెలిక్గా పిలిచే ప్రత్యేక మ్యూజిక్ కూడా నడుస్తుంటుంది. ఇవి వారిని మరింత రెచ్చగొట్టడంతో పాటు ఉత్తేజాన్ని ఇస్తుంటాయి. ఈ రేవ్ పార్టీ తీరుతెన్నులు, అక్కడకు వచ్చే వారి వస్త్రధారణ ఫలితంగా టీనేజ్లోనే పెళ్లి కాకుండా ‘లివ్ ఇన్ రిలేషన్షిప్’లు పెరిగిపోతుండటం ఆందోళనకర అంశమని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక వ్యవస్థీకృతంగా కాకుండా కొద్దిమంది స్నేహితులు కలిసి చేసుకునే రేవ్ పార్టీలకు హోటళ్లు అడ్డాలుగా మారుతున్నాయి. దీనికోసం కనెక్టింగ్ రూమ్స్ వినియోగిస్తున్నారు. కొత్త ట్రెండ్.. డ్రగ్ టూర్స్ రాజధానిలో ఇటీవల కాలంలో డ్రగ్ టూర్స్ పెరిగినట్లు పోలీసులు చెప్తున్నారు. టాస్‌్కఫోర్స్, ఎస్ఓటీ, హెచ్–న్యూ, టీఎస్–నాబ్ వంటి ప్రత్యేక వింగ్స్ రాజధానిలో జరుగుతున్న డ్రగ్స్ దందాపై నిఘా పెంచాయి. ఇది ఇక్కడ పెడ్లర్స్ కదలికలకు, మాదకద్రవ్యాల అందుబాటుకు కొంత సమస్యగా మారింది. మరోవైపు వీటి ఖరీదు కూడా అమాంతం పెరిగిపోయింది. దీంతో డ్రగ్స్ వినియోగదారులు ప్రత్యేక టూర్స్ ఏర్పాటు చేసుకుంటున్నట్లు సమాచారం. వీకెండ్స్‌లో సిటీకి చెందిన అనేక మంది హైక్లాస్ యూత్ గోవాతో పాటు హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిల్లల పైనా గంజాయి పంజా నగరంలో లభిస్తున్న మాదకద్రవ్యాల్లో గంజాయిది ప్రథమ స్థానం. ఒకప్పుడు కేవలం గంజాయి మొక్క ఆకుల్ని మాత్రమే ప్యాక్ చేసి సరఫరా చేసే వాళ్లు. అయితే భారీ స్థాయిలో దీన్ని సేకరించి, ప్యాక్ చేసి, వాహనాల్లో తరలించి విక్రయించడంలో రిస్క్ ఎక్కువ. దీంతో ఇటీవల కాలంలో గంజాయికి బదులుగా హష్ ఆయిల్ అక్రమ రవాణా పెరిగింది. గంజాయి ఆకుల్ని ప్రాసెస్ చేయడం ద్వారా దీన్ని తయారు చేస్తున్నారు. కొన్నిసార్లు క్రీమ్ మాదిరిగా ఉండే చరస్‌ను సరఫరా చేస్తున్నారు. లీటర్ ఖరీదు అత్యంత లాభదాయకంగా రూ.లక్షల్లో ఉండటంతో పాటు రవాణా, విక్రయం, వినియోగం తేలిక కావడంతో స్మగ్లర్లు వీటి వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ హష్ ఆయిల్‌తో తయారవుతున్న చాక్లెట్లు కూడా విచ్చలవిడిగా లభిస్తున్నాయి. పాఠశాల విద్యార్థులకు సైతం ఇవి అందుబాటులోకి వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సింథటిక్ డ్రగ్స్ కేరాఫ్ విదేశాలు సింథటిక్ డ్రగ్స్ సౌతాఫ్రికా, నైజీరియా లాంటి దేశాల నుంచి వస్తున్నాయి. సముద్ర, విమాన మార్గాల్లో వచ్చి తొలుత ముంబై, గోవాలకు చేరుకుంటున్నాయి. అక్కడ ఉంటున్న డి్రస్టిబ్యూటర్లు వీటిని దేశ వ్యాప్తంగా ఉంటున్న పెడ్లర్స్‌కు సరఫరా చేస్తున్నారు. వీరి నుంచి ఈ డ్రగ్స్ వినియోగదారులకు చేరుతున్నాయి. ఈ దందా కోసం పెడ్లర్స్ వివిధ రకాలైన సోషల్ మీడియా యాప్స్ వాడుతున్నారు. తమ ఐడీలను డార్క్‌వెబ్‌లోని డ్రగ్స్ ఫోరమ్స్‌లో తమ వద్ద లభించే డ్రగ్స్ వివరాలు, వాటి రేట్లను ఉంచుతున్నారు. రేటు ఖరారైన తర్వాత బైనాన్స్ లేదా వజీరెక్స్ వంటి వాటి ద్వారా క్రిప్టో కరెన్సీగా మారిన నగదును స్వీకరిస్తూ కొరియర్ ద్వారా లేదా డెడ్ డ్రాప్ విధానంలో సరుకు పంపిస్తున్నారు. కొరియర్లో అయితే తమ అసలు చిరునామా రాయకుండా వస్తువులు, వ్రస్తాల మాదిరిగా ప్యాక్ చేసి లేదా కాగితాల మధ్యలో ఉంచి పంపిస్తున్నారు. ఎక్కువ సందర్భాల్లో ఎంపిక చేసిన ఓ ప్రాంతంలో డ్రగ్ పార్సిల్ ఉంచి ఆ వివరాలను మెసెంజర్ ద్వారా అందిస్తున్నారు. దీన్నే డెడ్ డ్రాప్ విధానం అంటారు. -
కిరాణా కొట్టులో గంజాయి!
‘‘ఒడిశాకు చెందిన అనంత కుమార్ బారిక్ బాలానగర్‌లో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు తనిఖీ చేయగా 3 ప్యాకెట్లలో 120 చాక్లెట్లు బయటపడ్డాయి. ఒడిశా నుంచి వీటిని తీసుకొచ్చి విద్యార్థులకు, కూలీలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.’’ ‘‘ఇటీవల చర్లపల్లిలోని పాన్ డబ్బాలో ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టి 18 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాదీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి వీటిని తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.’’ సాక్షి, హైదరాబాద్: ... ఇలా పాఠశాల విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయదారులు దందా కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త దారులు, కొత్త రుచులతో మత్తులో దించుతున్నారు. తొలుత ఉచితంగా అందించి వ్యసనంగా మారిన తర్వాత ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పిప్పి నుంచి చాక్లెట్లుగా.. గంజాయి నుంచి హాష్ ఆయిల్ తీసిన తర్వాత పిప్పి మిగులుతుంది. ఈ పిప్పిని వృథాగా పారేయకుండా దానికి కొన్ని రసాయనాలు, ద్రవ రూప చాక్లెట్ల మిశ్రమాన్ని కలిపి వీటిని తయారు చేస్తున్నారు. చిన్న చిన్న దుకాణాల్లో విక్రయించే ఐస్‌క్రీమ్‌లపై హాష్ ఆయిల్ చల్లి ఇవ్వడం, చాకెట్లలో మధ్యలో ఉంచి తక్కువ ధరకు విక్రయించడం చేస్తున్నారు. కొన్నిసార్లు కస్టమర్లను పెంచుకోవడానికి ఉచితంగా కూడా అందిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి సరఫరా.. ఈ గంజాయి చాక్లెట్లను గల్లీలోని చిన్న చిన్న దుకాణాలు, పాన్‌షాపులు, కిరాణా కొట్లలో విక్రయిస్తుంటారు. బీహార్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి నిర్మాణ రంగంలో వలస కూలీలు వీటిని అక్రమ మార్గంలో వీటిని నగరానికి తీసుకొస్తున్నారు. ఈ చాక్లెట్లు బంగారం, పసుపు రంగులో ఉంటాయి. 5 గ్రాములు బరువు ఉండే ఒక్క చాక్లెట్‌ను రూ.15–20 విక్రయిస్తున్నారు. ఇందులో 14 శాతం గంజాయితో పాటు ఇతర పదార్థాలుంటాయి. చారి్మనార్ గోల్డ్ పేర్లతో.. చారి్మనార్ గోల్డ్, చారి్మనార్ గోల్డ్ మునక్కా, వంటి స్థానిక పేర్లతో ఈ గంజాయి చాక్లెట్లను బ్రాండింగ్ చేస్తున్నారు. ఆయుర్వేదిక్ ఔషధం అంటూ ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. చూసేవాళ్లకు అవి గంజాయి చాక్లెట్లు అని ఏమాత్రం అనుమానం కలగకుండా విక్రయదారులు ఈ ఎత్తుగడ వేస్తున్నారని పోలీసులు తెలిపారు. -
ప్రియురాలి నిర్వాకం.. ప్రియుడిపై కోపంతో సినిమా తరహా పక్కా స్కెచ్
సాక్షి, హైదరాబాద్: తనను దూరం పెడుతున్నాడనే కోపంతో మాజీ ప్రియుడిపై పగ తీర్చుకునేందుకు సినిమాను తలదన్నే రీతిలో స్కెచ్ వేసింది ప్రియురాలు. మాజీ ప్రియుడిని గంజాయి కేసులో ఇరికించింది. స్నేహితుల సాయంతో మాజీ ప్రియుడి కారులో గంజాయి పెట్టించిన యువతి.. పోలీసులకు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేయించింది. జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ చేయగా యువతి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ యువతితో పాటు ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు. ఇదీ చదవండి: ‘నాన్నా.. వేధింపులు భరించలేకపోతున్నా.. చావుతోనే నాకు విముక్తి’ -
గంజాయి సేవించనందుకు విద్యార్థిపై దాడి
నిజామాబాద్: గంజాయి సేవించాలని ఒత్తిడి చేయగా.. అంగీకరించకపోవడంతో ఓ విద్యార్థిపై మరో ఐదుగురు విద్యార్థులు దాడి చేసిన ఘటన మాక్లూర్ మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థి తల్లి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఐదుగురు ప్రతిరోజూ మధ్యాహ్న భోజన విరామంలో స్కూల్‌కు కొద్దిదూరం వెళ్లి గంజాయి సేవిస్తున్నారు. గత శనివారం వారి తరగతిలోని మరో విద్యార్థిని సైతం గంజాయి సేవించాలని ఒత్తిడి తెచ్చారు. కానీ, సదరు విద్యార్థి అంగీకరించకపోవడంతో అతనిపై దాడి చేశారు. ఆ విద్యార్థి తనపై తోటి విద్యార్థులు దాడి చేసినట్లు తల్లికి చెప్పాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులతో బాధిత విద్యార్థి తల్లి మాట్లాడగా గొడవ సద్దుమణిగింది. సోమవారం తిరిగి బాధిత విద్యార్థి పాఠశాలకు వెళ్లగా తల్లిదండ్రులకు చెబు తావా అంటూ ఐదుగురు విద్యార్థులు పాఠశాల సమీపంలోకి తీసుకెళ్లి చితకబాదారు. దీంతో సదరు విద్యార్థికి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తల్లి బుధవారం మాక్లూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయమై ఎస్సై సుధీర్‌రావును సంప్రదించగా విచారణ చేపట్టి చర్య లు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే కేసు నమోదు చేస్తామన్నారు. -
HYD: భారీగా గంజాయి స్వాధీనం.. బీటెక్ విద్యార్థులే టార్గెట్..
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా నార్సింగ్ చౌరస్తాలో గంజాయి కలకలం రేగింది. 12 కిలోల గంజాయిని నార్సింగ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా గంజాయి దందా సాగుతోంది. చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయి అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. నలుగురిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. చదవండి: Madhapur: డ్రగ్స్‌తో పాటు వ్యభిచారం కూడా! -
22 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయి: కోర్టుకు తెలిపిన చెన్నై పోలీసులు
22 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయి: కోర్టుకు తెలిపిన చెన్నై పోలీసులు -
22 కేజీల గంజాయి తిన్న ఎలుకలు.. తప్పించుకున్న స్మగ్లర్లు
చెన్నై: గంజాయి స్మగ్లింగ్ కేసులో అరెస్టైన ఇద్దరి నుండి స్వాధీనం చేసుకున్న మొత్తం 22 కిలోల గంజాయిని ఎలుకలు తినేయడంతో సాక్ష్యాధారాలు లేని కారణంగా వారిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2022లో రాజగోపాల్, నాగేశ్వర రావు అనే ఇద్దరు వ్యక్తులు మారీనా బీచ్ సమీపంలో గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. మరీనా పోలీసులు వీరి నుండి 22కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అందులోనుంచి 50 గ్రాములను మాత్రం పరీక్షల నిమిత్తం నార్కోటిక్ విభాగానికి పంపించారు. మిగిలిన మొత్తాన్ని వారి స్వాధీనంలోని ఉంచి నిందితులిద్దరినీ రిమాండుకు తరలించారు. ఈ కేసులో మరీనా పోలీసులు ఇప్పటికే ఛార్జిషీటు కూడా దాఖలు చేయగా అప్పటి నుంచి చెన్నై హైకోర్టులోని మాదకద్రవ్య నియంత్రణ విభగంలో న్యాయవిచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా మంగళవారం కోర్టు పోలీసులను సాక్ష్యం సేకరించిన గంజాయిని కోర్టుకు చూపించమని కోరగా ఆ మొత్తాన్ని ఎలుకలు ఖాళీ చేసేశాయని చెప్పారు. దీంతో విచారణ సమయంలో సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించని కారణంగా నేరారోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు రాజగోపాల్, నాగేశ్వర రావులను చెన్నై కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఇది కూడా చదవండి: ఏసీ వార్డు కోసం రచ్చ.. కయ్యానికి దిగిన వియ్యంకులు -
‘తాడేపల్లిలో జరిగింది గంజాయి హత్య కాదు’
సాక్షి, గుంటూరు: తాడేపల్లి మైనర్ ఎస్తేర్ రాణి హత్య కేసులో నిందితుడు దయానంద రాజును అరెస్ట్ చేసిన పోలీసులు.. మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా.. ఇది గంజాయి హత్య కాదని స్పష్టం చేశారు గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ వకుల్ జిందాల్. ఆపై ఏపీ హోం మంత్రి సైతం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ప్రతిపక్ష ఆరోపణలను తోసిపుచ్చారు. అంతేకాదు.. జగనన్నది భరోసా ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు దయానంద రాజు.. తన ఇంటికి ఎదురుగా ఉన్న ఎస్తేర్ రాణి తో అసభ్యంగా ప్రవర్తించాడు. రాణి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వాళ్లు అతన్ని ప్రశ్నించారు. ఆ కోపంతోనే ఎస్తేర్ రాణి పై రాజు కత్తితో దాడి చేశాడని తెలిపారామె. కొన్ని మీడియాల్లో గంజాయి మత్తులో హత్య చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అది పూర్తిగా అవాస్తవం. అప్పటికే కోపంతో ఉన్న రాజు.. మద్యం సేవించి ఆ మత్తుతోనే హత్యకు పాల్పడ్డాడు. గతంలోనూ రాజు ఒక కేసులో అరెస్టై జైలుకు వెళ్లాడు. నిందితుడిపై రౌడీ షీట్ తెరుస్తామని తెలిపిన ఎస్పీ.. ఘటన జరగగానే పోలీసులు వెంటనే స్పందించారని స్పష్టం చేశారు. మహిళల భద్రత,రక్షణకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వమిది సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని మహిళల భద్రత, రక్షణకు జగనన్న ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. నిందితులు ఎంతటివారైనా సరే తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. మంగళవారం ఏపీ సెక్రటేరియట్లో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ.. ఈ నెల 12 వ తేదీ అర్థరాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఒక మైనర్ బాలికపై నేరచరిత్ర ఉన్న ఓ వ్యక్తి దాడిచేసి హత్యకు పాల్పడ్డాడు. ఇది దురదృష్టకరమైన ఘటన. మద్యం మత్తులో ఉన్న నిందితుడు.. ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. గంజాయి మత్తు ఇందుకు ఏమాత్రం కారణం కాదు. కేవలం.. వ్యక్తిగత గొడవలే ఈ హత్యకు కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రభుత్వం వెంటనే స్పందించడం వల్ల నిందితుని ఒక గంటలోపే పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ ఘటనపై పలువురు నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. మహిళల భద్రత కోసం జగనన్న సర్కార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలను చేపట్టినప్పటి నుండి రాష్ట్రంలో మహిళల భద్రతకు, రక్షణకు, సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పలు వినూత్న కార్యక్రమాలను, పథకాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే దిశా చట్టాన్ని రూపొందించి కేంద్రం ఆమోదానికి పంపడం జరిగింది. ఆపదలో ఉన్న మహిళలను వెంటనే రక్షించేందుకు దిశా యాప్ తీసుకొచ్చాం. ఇప్పటి వరకూ కోటి 30 లక్షల మంది ఈ యాప్ ను తమ స్మార్టు ఫోన్లలోకి డౌన్ లోడ్ చేసుకున్నారు. తొమ్మిది వందలకు పైగా ఈ యాప్ ద్వారా రక్షణ పొందారు. తప్పు ఎవరు చేసినా..ఎలాంటి వారు చేసినా.. ఎటు వంటి పక్షపాతం చూపకుండా 24 గంటల్లోపే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోలీస్ శాఖ పనితీరుకు ఇదే నిదర్శనం. గంజాయిపై ఉక్కుపాదం రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమ రవాణా పై జగనన్న ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని, రెండు లక్షల కేజీల గంజాయిని పట్టుకోవడమే కాకుండా ఏజన్సీలో గంజాయి సాగును పూర్తిగా నియంత్రించడం జరిగిందని హోం మంత్రి వనిత వెల్లడించారు. గంజాయి సాగుపై ఆధారపడిన గిరిజన రైతులను ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసుకునే విధంగా మళ్లించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో నాటు సారా తయారీని కూడా పూర్తిగా నియంత్రించడం జరిగిందని, అధిక మొత్తంలో బెల్లం వ్యాపార చేసే వారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, మహిళల భద్రత..రక్షణ..సాధికారత అంశాలకు జగనన్న ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆమె స్పష్టం చేశారు. వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నప్పటికీ ప్రధాన ప్రతి పక్షం ఏదో రకంగా ఆరోపణలు చేయడమే పరిపాటి అయిందన్నారు. గత ప్రభుత్వంలో.. మహిళలకు భద్రత ఉండేది కాదని.. దోషులకు శిక్షలు పడకుండా నేతలు కొమ్ముకాసేవారని, కానీ.. ఇప్పుడున్న ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు లేవని, తప్పుచేసిన వారు ఎంతటివాళ్లైనా 24 గంటల్లోనే చర్యలు తీసుకుంటూ బాధిత కుటుంబాలకు న్యాయం అందిస్తున్నామని ఆమె తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి స్నేహపూర్వక పోలీస్ విధానాన్ని, జీరో ఎఫ్.ఐ.ఆర్. విధానాన్ని అమల్లోకి తేవడమే కాకుండా.. ఇవాళ టూరిస్టు పోలీస్ స్టేషన్లను కూడా సీఎం జగన్ ప్రారంభించారని ఆమె గుర్తు చేశారు. -
రూ. 244 కోట్ల విలువైన గంజాయి ధ్వంసం
సాక్షి, అనకాపల్లి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: విశాఖ రేంజ్ పరిధిలోని ఐదు(శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, మన్యం, అనకాపల్లి) జిల్లాల్లో స్వాధీనం చేసుకున్న లక్షా 93 వేల కిలోల గంజాయి, 131 కిలోల హాష్ ఆయిల్‌ను పోలీసులు ధ్వంసం చేశారు. అనకాపల్లి జిల్లా కోడూరు గ్రామ శివారులో శనివారం గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ డీఐజీ హరికృష్ణ , అనకాపల్లి ఎస్పీ గౌతమి సాలి, అల్లూరి ఎస్పీ సతీష్‌కుమార్‌లు నిప్పుపెట్టి ధ్వంసం చేశారు. దీని విలువ రూ.240 కోట్లకు పైగా ఉంటుందని పోలీసుల అంచనా. ఈ కేసుల్లో 3,500 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.300 కోట్ల విలువైన గంజాయిని, ఇప్పుడు రూ.240 కోట్ల విలువైన గంజాయిని ధ్వంసం చేశారు. విశాఖ రేంజ్ పరిధిలో ఇప్పటి వరకు ఏడు సార్లు ఇలా గంజాయి ధ్వంసం జరిగింది. ఆంధ్ర ఒడిశా బోర్డర్(ఏఓబీ) కేంద్రంగా గంజాయి వివిధ రాష్ట్రాల ప్రధాన నగరాలకు తరలివెళుతోంది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ఏజెన్సీకి సందర్శన పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి.. అక్కడ నుంచి డ్రై గంజాయి, లిక్విడ్ గంజాయి ప్యాకెట్లను వివిధ మార్గాల ద్వారా తరలిస్తున్నారు. దీనిని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ‘ఆపరేషన్ పరివర్తన్’ పేరుతో గతంలో 7,552 ఎకరాల్లో, ఈ ఏడాది 650 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశారు. పేరేచర్ల ప్రాంతంలో ధ్వంసం: సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువైన గంజాయిని గుంటూరు రేంజ్ పోలీసులు శనివారం దహనం చేశారు. గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టే దిశగా ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇటీవల రేంజ్ పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో స్వాధీనం చేసుకుని కోర్టుకు సమర్పించిన 10,340 కిలోల గంజాయిని పేరేచర్లలోని కైలాసగిరి వద్ద ఉన్న పోలీస్ ఫైర్ రేంజ్ వద్ద దహనం చేశారు. కార్యక్రమంలో గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమవర్మ, గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, బాపట్ల ఎస్పీ వకుల్‌జిందాల్, ప్రకాశం ఎస్పీ మలికాగార్గ్, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చాక్లెట్ బార్లలో గంజాయి!
సాక్షి, హైదరాబాద్: అతని పేరు రిషి సంజయ్ మెహతా (22)... తల్లిదండ్రులు ఓ ఫార్మా కంపెనీ యజమానులు... చదివేది అమెరికాలోని ఫీనిక్స్ యూనివర్సిటీ నుంచి ఆన్లైన్ ఎంబీఏ. అయితేనేం... మాదకద్రవ్యాలకు బానిసగా మారాడు. పోలీసుల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు హష్ ఆయిల్ (ఓ రకమైన గంజాయి గుజ్జు)తో చాక్లెట్లు తయారు చేసి విక్రయిస్తూ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులకు చిక్కాడు. ఈ విషయాన్ని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... రిషి సంజయ్ మెహతాకు కాలేజీ రోజుల నుంచే హష్ ఆయిల్ సహా ఇతర డ్రగ్స్ వినియోగం అలవాటైంది. ఆపై డ్రగ్ పెడ్లర్‌గా మారాడు. ప్రస్తుతం హష్ చాక్లెట్స్ తయారీ మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు నడుస్తుండటంతో ఇంటి వద్దే ఉంటూ తల్లిదండ్రులు ఫార్మా కంపెనీకి వెళ్లగానే బెడ్రూమ్లోనే వాటిని తయారు చేస్తున్నాడు. దీనికి అవసరమైన ఉపకరణాలు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. విశాఖలోని చింతపల్లికి చెందిన రామారావు గంజాయి నుంచి ఈ హష్ ఆయిల్ తయారు చేస్తున్నాడు. ఇది సూరారానికి చెందిన బోనాల వినోద్, కె.శ్రీకాంత్ యాదవ్‌ల చేతులు మారి సి.రోహిత్‌కు చేరుతోంది. అతన్నుంచి 5 గ్రాముల బాటిల్‌ను రూ. 3 వేలకు రిషీ కొంటున్నాడు. తొలినాళ్లలో దీన్ని ఈ–సిగరెట్లు, బ్రౌనీస్‌లో (తినుబండారం) ఉంచి విక్రయించినా లాభసాటిగా లేకపోవడంతో ఇంటర్నెట్లో చూసి హష్ ఆయిల్ చాక్లెట్ల తయారీ మొదలెట్టాడు. తయారీ ఇలా... మార్కెట్ నుంచి ముడి చాక్లెట్‌ను 4 కేజీల చొప్పున రిషి కొనుగోలు చేసి అందులో 40 గ్రాముల హష్ ఆయిల్ కలుపుతున్నాడు. ఆపై ఆ ద్రవాన్ని పోతపోసి చాక్లెట్లుగా మారుస్తున్నాడు. ఆ సమయంలోనే ఓరియో, కిట్‌క్యాట్, క్యాట్‌బర్రీ వంటి ఫ్లేవర్లు కలుపుతున్నాడు. ఈ మిశ్రమాన్ని డీఫ్రిజ్‌లో పెట్టి చాక్లెట్ బార్స్‌గా మారుస్తున్నాడు. వాటిని సిల్వర్ ఫాయిల్‌తో కూడిన వేఫర్లలో చుట్టి ఒక్కోటి రూ. 5 వేల నుంచి రూ.10 వేలకు అమ్ముతున్నాడు. అతనికి నగరంలోనే 100 మంది కస్టమర్లు ఉన్నారు. రిషీ దందాపై సమాచారం అందుకున్న హెచ్–న్యూ ఇన్స్పెక్టర్ పి.రాజేశ్, ఎస్సై జీఎస్ డానియేల్‌లతో కూడిన బృందం అతనిపాటు వినోద్, శ్రీకాంత్, రోహిత్‌లను పట్టుకుంది. పరారీలో ఉన్న రామారావు కోసం గాలిస్తోంది. అతన్నుంచి 48 హష్ చాక్లెట్ బార్స్, 40 గ్రాముల హష్ ఆయిల్ స్వాధీనం చేసుకుంది. రిషీ నుంచి చాక్లెట్ బార్లు కొనుగోలు చేసిన వాళ్లు అందులోని 15 పీసులను విడగొట్టి ఒక్కో పీస్‌ను గరిష్టంగా రూ. 2 వేల చొప్పున రూ. 30 వేలకు అమ్ముతుండటం గమనార్హం. ఒక్కో చాక్లెట్ బార్ తినడం ద్వారా వినియోగదారులు 6 గంటల వరకు మత్తులో జోగుతున్నారు. -
ఆంధ్ర యూనివర్సిటీ లా విద్యార్థుల మధ్య గంజాయి చిచ్చు
-
వీడియో వైరల్: ఏయూ లా విద్యార్థుల మధ్య గంజాయి చిచ్చు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్శిటీ లా విద్యార్థుల మధ్య గంజాయి చిచ్చు రేగింది. ఒక వర్గం విద్యార్థులపై మరో వర్గం విద్యార్థులు దాడి చేశారు. ఒక వర్గం విద్యార్థులు గంజాయి తయారు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఇరువర్గాల విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: ఎన్నెన్నో అందాలు.. వాటి వెనుక అంతులేని విషాదాలు -
చంద్రబాబు పొంతనలేని వ్యాఖ్యలు.. అవాక్కయిన టీడీపీ కార్యకర్తలు
అనంతపురం శ్రీకంఠం సర్కిల్/సోమందేపల్లి: గంజాయి అమ్మేవారిపై దాడులా అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో గంజాయిని నిర్మూలించడానికి సర్కారు ఓ వైపు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ దానిని నిర్వీర్యం చేస్తున్న సమయంలో టీడీపీ అధినేత ఈ తరహా వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. చదవండి: డిజిటల్ హెల్త్‌లో ఏపీ టాప్ ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ కార్యకర్తల సమావేశంతోపాటు రాప్తాడు రోడ్‌షో, శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో జరిగిన బహిరంగ సభలో శుక్రవారం ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో గంజాయికి ఎక్కువమంది బానిసలవుతున్నారని.. గుంటూరులో యువకులు గంజాయి మత్తులోనే విద్యార్థినిపై అత్యాచారానికి తెగబడ్డారని.. దాని నుంచి మీ పిల్లలను కాపాడుకోవాలంటూ చంద్రబాబు పొంతనలేని వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ కార్యకర్తలు తలలు పట్టుకున్నారు. తమ అధినేత ఇలా మాట్లాడడంతో వారంతా అవాక్కయ్యారు. 40 శాతం సీట్లు యువతకే ఇక పార్టీని ఈసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నానని.. ప్రధానంగా 40 శాతం సీట్లు యువతకు కేటాయిస్తానని.. కొత్తగా వచ్చేవారికి అవకాశమిస్తానన్నారు. తన వయసు 72 ఏళ్లయినా మీకోసం 27 ఏళ్ల కుర్రాడిలా పనిచేస్తానని చెప్పారు. ఇదిలా ఉండగా, జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా సోమందేపల్లిలో టీడీపీ అభిమానులు కేక్‌కట్ చేసి.. ఆయన చిత్రపటాలతో హంగామా చేశారు. ‘జై జూనియర్ ఎన్టీఆర్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడున్న కొంతమంది టీడీపీ నాయకులు వారిపై అసహనం వ్యక్తంచేశారు. -
గడువు.. రెండు నెలలు
సాక్షి, అనకాపల్లి: చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా.. ప్రశాంత వాతావరణంలో జిల్లా ప్రజలు నివసించేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలపై పోలీస్ అధికారులు దృష్టి సారించాలని ఎస్పీ గౌతమి సాలి ఆదేశించారు. రెండు నెలల్లో జిల్లాలో ఎక్కడా గంజాయి, నాటుసారా అనేది లేకుండా మూలాల్ని నాశనం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఈ క్రతువులో బాగా పనిచేసే సిబ్బందికి రివార్డులతో పాటు పని చెయ్యని వారిపై చర్యలూ ఉంటాయని ఎస్పీ స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ), జిల్లా పోలీసులతో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఈబీ సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా గంజాయి, నాటుసారాలపై ఎన్ఫోర్స్మెంట్ చేయాలని ఆదేశించారు. గతంలో నమోదైన కేసుల ఆధారంగా గ్రామాల్లో ముమ్మర దాడులు నిర్వహించి జిల్లా నుంచి సమూలంగా నిర్మూలించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు వివిధ నేరాలకు సంబంధించి నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్న ఎస్పీ.. అందులో గంజాయి, నాటుసారా కేసులలో ఉన్న పాత నేరస్తులపై బైండోవర్ చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. వారు మళ్లీ.. ఈ తరహా కేసుల్లో దొరికితే స్థానిక తహసీల్దార్ కోర్టులో నగదు పూచీతో జరిమానా కట్టించాలని, లేదంటే జైలు శిక్ష అనుభవిం చాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వివరాల్ని ప్రతి గ్రామంలోని ప్రజలకు తెలియజేసే ఏర్పాట్లు చేయాలన్నారు. నల్లబెల్లం ఎక్కడిది.? నాటుసారా తయారీలో ప్రధాన ముడిపదార్థమైన నల్లబెల్లం రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. గడిచిన రెండు వారాల్లో దాదాపు 50 వేల లీటర్లకు పైగా బెల్లం పులుపుని ధ్వంసం చేసినా.. ఇంకా పలు చోట్ల పట్టుబడుతుండటంపై ఎస్పీ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అసలు ఈ నల్లబెల్లం ఎక్కడి నుంచి వస్తోంది.? నాటుసారా తయారు చేస్తున్నవారు ఎలా కొనుగోలు చేస్తున్నారు.? అనే కోణంలో దర్యాప్తు నిర్వహించి.. సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. అనకాపల్లిలో ఉన్న బెల్లం వ్యాపారులతో ఎస్ఈబీ, స్థానిక పోలీసులు సమావేశాలు ఏర్పాటు చేసి.. నల్లబెల్లం విక్రయాలపై నిఘా పటిష్టం చెయ్యాలని ఎస్పీ సూచించారు. అధికారులకు రివార్డులు జిల్లా నుంచి గంజాయి, నాటుసారా సమూల నిర్మూలనకు చేస్తున్న యుద్ధంలో ప్రతి ఒక్క పోలీస్ అధికారి కీలక భాగస్వామిగా మారాలని ఎస్పీ గౌతమి పిలుపునిచ్చారు. ఎన్ఫోర్స్మెంట్లో ప్రతిభ కనబరిచిన అధికారులకు రివార్డులు ఉంటాయని ప్రకటించారు. అదే సమయంలో అంచనాలకు తగ్గట్లుగా పనిచెయ్యని సిబ్బందిపై చర్యలు కూడా తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్) కె.శ్రావణి, నర్సీపట్నం సబ్ డివిజన్ అదనపు ఎస్పీ మణికంఠ చందోలు, ఎస్ఈబీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రవికుమార్‌తోపాటు జిల్లా సీఐలు, ఎస్ఐలు, ఎస్ఈబీ ఎస్‌హెచ్‌వోలు పాల్గొన్నారు. గంజాయి రవాణాపై గట్టి నిఘా గొలుగొండ: ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు వస్తున్న గంజాయిపై దృష్టి సారించాలని, గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ గౌతమి సాలి ఆదేశాలు జారీ చేశారు. ఆమె గురువారం రాత్రి ఏజెన్సీకి ముఖద్వారం అయిన కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు. తరువాత భీమవరం చెక్‌పోస్టును తనిఖీ చేశారు. చింతపల్లి, జీకేవీధి నుంచి గంజాయి రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కృష్ణదేవిపేట పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి, రికార్డులు పరిశీలించారు. ఆమె వెంట నర్సీపట్నం ఏఎస్పీ మణీకంఠ చందోల్, సీఐ స్వామినాయుడు, ఎస్ఐ సూర్యనారాయణ తదితరులు ఉన్నారు. -
గంజాయి మత్తులో ‘సాఫ్ట్వేర్లు’
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు సాఫ్ట్వేర్ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులు గంజాయి మత్తుకు అలవాటుపడ్డారు. కొన్ని సందర్భాల్లో రేవ్ పార్టీలు నిర్వహించుకుంటూ సింథటిక్ డ్రగ్ ఎండీఎంఏ వినియోగిస్తున్నారు. వీరితో పాటు ఓ వైద్యుడికీ మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును సిటీ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్– న్యూ) అధికారులు రట్టు చేశారు. మొత్తం 16 మందిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నామని నగర కొత్వాల్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. హెచ్–న్యూ డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కోవిడ్ విజృంభణ తర్వాతే సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో డ్రగ్స్ అలవాటు పెరిగిందని ఆనంద్ తెలిపారు. యాప్రాల్‌కు చెందిన స్టాక్‌మార్కెట్ ట్రేడర్ జవాలా పాండే తరచు గోవా వెళ్లేవాడు. ►డ్రగ్స్‌కు అలవాటుపడిన ఇతగాడు ఆపై విక్రయించడం మొదలెట్టాడు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సోనేరావ్, లఖన్ గంజాయి పండిస్తున్నారు. దీన్ని అదే జిల్లా వాసులు ఉల్లాస్ సాబ్లే, గోటి హరిసింగ్, అమర్ సింగ్, సకారాం సాబ్లే ఎర్తిగ కారులో నగరానికి తరలిస్తున్నారు. వీరి నుంచి గంజాయి పాండేకు అందుతోంది. పాండే గంజాయితో పాటు అరకుకు చెందిన యశ్వంత్ నుంచి హష్ ఆయిల్, పాండుచ్చేరీలో ఉంటున్న నైజీరియన్ నికొలస్ నుంచి ఎండీఎంఏ డ్రగ్ ఖరీదు చేస్తున్నాడు. వీటిని ఇతగాడు ఆదిత్య రాజన్ (ప్రైవేట్ సంస్థ మేనేజర్), జయబాలాజీ (విద్యార్థి), నిఖిల్ షెనోయ్ (డీజే ప్లేయర్)లకు అమ్ముతున్నాడు. ►నగరంలోని అనేక మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఈ మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నారు. ఏజెన్సీలో కేజీ రూ.10 వేలు ఉంటున్న గంజాయి సిటీలో వినియోగించే వారి దగ్గరకు వచ్చేసరికి రూ.60 వేలకు చేరుతోంది. 10 గ్రాములు 500 ఖరీదు చేస్తున్న ఎండీఎంఏను పెడ్లర్స్ రూ.2 వేలకు అమ్ముతున్నారు. మాదకద్రవ్యాలను పెడ్లర్లు రాత్రి వేళల్లో కార్ఖానా వద్ద ఉన్న హాకీ గ్రౌండ్స్‌లో వినియోగదారులకు అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఏసీపీ కె.నర్సింగ్‌రావు పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్లు పి.రాజేష్, పి.రమేష్‌రెడ్డిలు తమ బృందాలతో రంగంలోకి దిగారు. ►డ్రగ్స్ విక్రేతలు పాండే, నికోలస్, నిఖిల్, సోనేరావ్, అమర్, ఉల్లాస్, సకారాం, హరీష్, ఆదిత్య, జయ బాలాజీలను పట్టుకున్నారు. వీరి నుంచి డ్రగ్స్ ఖరీదు చేసి వినియోగిస్తున్న బంజారాహిల్స్ వాసి మహ్మద్ మడ్నే (వైద్యుడు), మాదాపూర్ వాసి సాయి అనిరుధ్ (ఐటీ కంపెనీ ఫౌండర్), మియాపూర్ వాసి కుషా మిశ్రా (ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో క్వాలిటీ అనలిస్ట్), శేరిలింగంపల్లికి చెందిన సిద్థార్థ్ విజయ్ కుమరన్ (ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో బిజినెస్ కన్సల్టెంట్), నిజాంపేల వాసి రోహిత్ కుమార్ (ఐటీ కంపెనీలో హెచ్ఆర్ విభాగం), గంగారం వాసి బాలాజీ భగవాన్ సింగ్‌లను (ఐటీ కంపెనీ కౌంటెంట్) అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.5.4 లక్షల విలువైన డ్రగ్స్, వాహనాలు స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. -
ఇదో గమ్మత్తు కథ.. సీజ్ చేసిన గంజాయి ఎటు పోతుందో తెలుసా!
సాక్షి, హైదరాబాద్: పెడ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి ‘తరలింపు’లో పోలీసుల నిర్లక్ష్యం ఓ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుకు కలిసి వచ్చింది. ‘మిగిలిపోయిన’ గంజాయిని సొంతం చేసుకున్న అతగాడు స్థానికంగా విక్రయించాడు. ఇలా ఖరీదు చేసి వినియోగిస్తున్న వారిని పోలీసులు పట్టుకోవడంలో కథ మొత్తం బయటకు వచ్చింది. ఈ ‘గమ్మత్తు’ వ్యవహారంలో సెక్యూరిటీ గార్డుపై రెండు కేసులు నమోదు కాగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హయత్‌నగర్ పోలీసులపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. చదవండి: HYD: ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యాన్ని అడ్డుకున్న ఆటోడ్రైవర్ ఠాణాకు మరమ్మతులు జరుగుతుండడంతో.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొన్నాళ్లుగా పోలీసులు గంజాయిపై జంగ్ చేస్తున్నారు. ఫలితంగా వరుసగా విక్రేతలు, వినియోగదారులు పట్టుబడుతున్నారు. ఇటీవల హయత్‌నగర్ పోలీసులు ఇలాంటి ఓ ముఠాను పట్టుకున్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న 9 కేజీల గంజాయిని కోర్టు ఆదేశాలతోనే ధ్వంసం చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు కచ్చితంగా దర్యాప్తు అధికారులు ఆ సరుకును తమ అధీనంలో ఉంచుకోవాలి. సాధారణంగా పోలీసులు ఇలా స్వాధీనం చేసుకున్న గంజాయిని ఠాణాలోనే ఉంచుతారు. ఆ సమయంలో పోలీసుస్టేషన్‌కు మరమ్మతులు జరుగుతుండటంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ గోదాంలో భద్రపరిచారు. చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బోణీ.. కవిత సహా ముగ్గురు ఏకగ్రీవం..! తరలింపులో నిర్లక్ష్యం.. ఠాణాకు మరమ్మతులు పూర్తయిన తర్వాత పోలీసులు ఈ గంజాయిని తీసుకురావచ్చారు. ప్యాకెట్లలో ఉన్న గంజాయిని తీసుకువచ్చిన బృందం వాటి కింద పరిచిన కార్పెట్ కింద పడిపోయిన దాన్ని పట్టించుకోలేదు. ఈ నిర్లక్ష్యమే సదరు గోదాం సెక్యూరిటీ గార్డుకు కలిసి వచ్చింది. గోదాం శుభ్రం చేసే నెపంతో అక్కడ పడిన గంజాయిని అతడు సొంతం చేసుకున్నాడు. దాన్ని తన వద్దే భద్రపరిచి, స్థానికంగా కొందరికి విక్రయించాడు. విడతల వారీగా జరిగిన ఈ విక్రయంపై హయత్‌నగర్ పోలీసులకే సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఖరీదు చేసిన వారిని, వారి ద్వారా సదరు సెక్యూరిటీ గార్డును పట్టుకున్నారు. నిర్లక్ష్యం బయటకు... కొన్నేళ్లుగా నగరంతో పాటు శివారు జిల్లాలకు గంజాయి విశాఖ ఏజెన్సీ నుంచి సరఫరా అవుతోంది. ఈ సెక్యూరిటీ గార్డుకు గంజాయి అలానే చేరిందని పోలీసులు భావించారు. విచారణ నేపథ్యంలోనే తమ నిర్లక్ష్యం బయటపడింది. తాము భద్రపరిచిన గంజాయిలో కొంత భాగం చోరీ చేయడంపై దొంగతనం కేసు, ఆ సరుకును విక్రయించడంపై మాదకద్రవ్యాల చట్టం కింద మరో కేసు నమోదు చేశారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డును హయత్‌నగర్ పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా రిమాండ్‌కు తరలించారు. ఈ ‘గమ్మత్తు’ కథ మొత్తం తెలుసుకున్న ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. సీజ్ చేసిన గంజాయి నిల్వ, తరలింపులో నిర్లక్ష్యంగా ఉన్న హయత్‌నగర్ ఇన్స్పెక్టర్ ఎం.సురేందర్‌తో పాటు మరో ఇద్దరు పోలీసులకు చార్జి మెమోలు జారీ చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న అంతర్గత విచారణ ముగిసిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టనున్నారని సమాచారం. -
గంజాయి రాజకీయంలో కుటిలనీతి
ఇటీవల రాష్ట్రంలో గంజాయి రాజకీయం నడుస్తోంది. గంజాయిని రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించి మచ్చతెచ్చేందుకు ప్రధాన ప్రతిపక్షం కుటిలనీతిని అవలంబిస్తోంది. దీనిని ఢిల్లీ స్థాయిలోకి తీసుకువెళ్లి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేయడం రాష్ట్ర ప్రజలను అవమాన పరిచేదిగా ఉంది. దేశ, విదేశాలకు ఆంధ్రప్రదేశ్ గంజాయి ఎగుమతి కేంద్రంగా ఉన్నదనే అపోహ సృష్టించే ప్రయత్నం అత్యంత ప్రమాదకరం. రాజకీయంగా వైరి వర్గాలు ఆరోపణలు చేసుకోవడం సహజమే. ప్రతిపక్షాలు అధికార పక్షంపై విమర్శలు చేయడం కూడా సహజమే. కానీ గంజాయి విషయం ఒక సున్నితమైన అంశం. దీనిని ఒక రాజకీయ అస్త్రంగా మార్చుకోవాలనే ప్రయత్నం వలన దేశానికీ, ప్రపంచానికీ ఒక తప్పుడు సంకేతం ఇవ్వడమే కాక ఇక్కడి ప్రజల మనోభావాల పైన ప్రభావం చూపిస్తుంది. ఆంధ్ర ప్రజలను దోషులుగా నిలబెట్టే ప్రయత్నంగా భావించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గతంలో మన రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన ఒక నాయకుడు ‘కేంద్రం ఒక మిథ్య’ అంటూ విమర్శించేవారు. కేంద్రం ఒక మిథ్య అంటే రాష్ట్రం ఒక మి«థ్య కాదా? ఈ తరహా విమర్శలు మంచిది కాదంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకమైన పార్టీలతో సహా రాజకీయ విజ్ఞులు దానిపై ఘాటుగా స్పందిం చడంతో ఆయన ఆ మాటను మాట్లాడకుండా హుందాతనాన్ని కాపాడుకున్నారు. సరిగ్గా ఇప్పుడు గంజాయి విషయంలో ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు ఇదే కోవకు చెందుతాయి. గంజాయిని రాష్ట్ర ప్రభుత్వమే ఎగుమతులు చేస్తున్నట్లుగా ఉన్న వారి విమర్శలు ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రమాదకరం గంజాయి వంటి మత్తు పదార్థాలను ఎవరూ ప్రోత్సహించరు. ఇది అంతర్రాష్ట్ర సమస్య. ఒక రాష్ట్రం కట్టుదిట్టంగా అమలు చేసినా మరో రాష్ట్రంలోనో ఇంకో రాష్ట్రంలోనో ఎగుమతులు జరగవచ్చు. వాటిని సమూలంగా నిర్మూలించేందుకు కొంత సమయం పట్టవచ్చు. ముఖ్యంగా అటవీ ప్రాంతాలలో జరిగే ఈ తరహా విషయాలను నిర్మూలించేందుకు తప్పకుండా సమయం పడుతుంది. స్మగ్లర్లు ఆ ప్రాంతాలలో నివసించే నిరుపేదలను ఇందుకు పావులుగా వాడుకొనే పరిస్థితులలో దీనిని నిర్మూలించే ప్రక్రియలో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. గంజాయి విషయం కూడా కొత్తగా ఏర్పడిన సమస్య కాదు. గత ప్రభుత్వ హయాంలో ఒక మంత్రి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు, వీడియో టేపులు ఇటీవల ప్రచారంలోకి వచ్చాయి. గంజాయి ఎగుమతులలో రాష్ట్రం నంబర్ వన్‌గా ఉన్నదంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రివర్గ సమావేశంలో వ్యాఖ్యానించారు అంటూ ఆ మంత్రి వ్యాఖ్యలు చేయడం ఆ వీడియో సారాంశం. అంటే గంజాయిని అప్పటి ప్రభుత్వమే ప్రోత్సహిం చినట్లా? ఈ వ్యాఖ్యల ద్వారా గత ప్రభుత్వ హయాంలో ఈ సమస్య ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. ఇది రాత్రికి రాత్రి పరిష్కారం అయ్యే సమస్య కాదు. కావాలని బురద చల్లే ప్రయత్నం వల్ల రాష్ట్రానికీ, ప్రభుత్వానికీ, ప్రజలకు చెడ్డపేరు తెస్తే చరిత్ర క్షమించదు. ప్రజలు అంతకన్నా క్షమించరు. బాధ్యతగల ప్రతిపక్షం, ఆ పక్ష నాయకుడు వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. గంజాయి విషయంలో గత ప్రభుత్వంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ సమయంలో ఒక పక్క గంజాయితో పాటు, మరోపక్క ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో అప్పటి మంత్రులు, సాక్షాత్తు ముఖ్యమంత్రి తనయుడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాలను ఎదుర్కొనేందుకు గంజాయి దొంగలంటూ అమాయకులైన నిరుపేదలను ఎన్కౌంటర్ చేసింది ప్రభుత్వం. ఈ విషయంలో అప్పటి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఒక లోక్‌సభ సభ్యుడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తూ ‘స్మగ్లర్లను వదిలేసి అమాయకులైన నిరుపేదలను పొట్టన పెట్టుకున్నది మన ప్రభుత్వం, ఇది చాలా దారుణం’ అంటూ ప్రశ్నించగా ఆయన సమాధానం దాటవేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ పరిణామాలతో అప్పటి స్మగ్లర్లతో ప్రభుత్వంలో ఉన్న నేతల సంబంధాలు బయటపడ్డాయి. దీనిని మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నాన్ని విజ్ఞులు ఎవరు సమర్థించరు. ఈ తరహా విష సంస్కృతి రాజకీయాలలో తప్పుడు సంకేతాలను ఇస్తుంది. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని గౌరవించాలనే కనీస విలువలు మంటగలపడం దురదృష్టకరం. నేలపూడి స్టాలిన్ బాబు వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు మొబైల్: 83746 69988 -
విస్తృత తనిఖీలు.. 150 కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గంజాయి వేట దూకుడుగా సాగుతోంది. గంజాయిని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు పోలీస్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు కొరడా ఝుళిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్లు, ఎక్సైజ్ ఠాణా పరిధిలో ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నాయి. భారీస్థాయిలో కేసులు నమోదు చేస్తున్నాయి. గంజాయి సాగు చేస్తున్న వారితోపాటు సరఫరా చేస్తున్న వారినీ అరెస్ట్‌చేసి కటకటాల్లోకి నెడుతున్నాయి. ఈ నెల 20న సీఎం కేసీఆర్ సమీక్ష తర్వాత నుంచి ఇప్పటివరకు నాలుగు క్వింటాళ్లకుపైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు చెప్పాయి. ప్రత్యేక బృందాల సోదాలు ప్రతీ జిల్లా సరిహద్దుల్లో పోలీస్, ఎక్సైజ్ శాఖలు తనిఖీలు ముమ్మరం చేశాయి. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోనూ నిఘా పెంచి గంజాయి స్మగ్లర్లకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతున్నాయి. హైదరాబాద్‌లోని అన్ని జోన్ల డీసీపీల పరిధిలో ప్రతీ రోజు 4 నుంచి 6 గంజాయి కేసులు నమోదవుతున్నాయి. ఒక్కో కేసులో 2 కేజీలకుపైగా గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నాయి. ఈ వారం రోజుల్లో ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే గంజాయి, డ్రగ్స్‌కు సంబంధించి 38 కేసులు నమోదు చేసినట్టు సీపీ అంజనీకుమార్ తెలిపారు. క్వింటాల్‌కుపైగా గంజాయిని హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్వాధీనం చేసుకున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. అదేవిధంగా సైబరాబాద్, రాచకొండ కమిషరేట్లలోనూ వేట కొనసాగుతోంది. సైబరాబాద్‌లో క్రైమ్స్ విభా గం డీసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటుచేసి సోదాలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు 10 కేసులు నమోదు చేసి 11 కేజీల గంజా యి స్వాధీనం చేసుకుని, 17 మందిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. అదేవిధంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో తనిఖీలు చేసి 38 కేసులు నమోదు చేశా రు. గంజాయి సిగరెట్లు విక్రయిస్తున్న పాన్షాపులపైనా దృష్టి పెట్టి 13 మందిపై కేసులు పెట్టారు. జిల్లాల్లోనూ ముమ్మరంగా... గంజాయి కట్టడికి వరంగల్, కరీంనగర్, ఖమ్మం కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి మహారాష్ట్ర, తెలంగాణకు సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 32 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా కరీంనగర్‌లోని హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులకు 11.6 కేజీల గంజాయి పట్టుబడటం సంచలనం రేపింది. పోలీసులంతా ఎన్నికల బందోబస్తు, నేతల ప్రచారం, భద్రత వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో గంజాయి స్మగ్లర్లు ఇదే అదనుగా భావించినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో సీపీ సత్యనారాయణ అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో విస్తృతమైన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో చెన్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, పెద్దపల్లి, మంథనిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే, వరుసగా గంజాయి కేసుల్లో పట్టుబడుతున్న నిందితులపై పోలీసులు పీడీ యాక్ట్ అమలుచేస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 31 మందిపై, సైబరాబాద్‌లో ఆరుగురు, రాచకొండలో 8 మంది, నల్లగొండలో ఐదుగురు, ఖమ్మం, భద్రాచలం పోలీస్యూనిట్లలో 9 మందిపై పీడీ యాక్ట్ నమోదుచేశారు. గంజాయి సాగుపై నజర్ కొత్తగూడెం, రామగుండం కమిషనరేట్, ఆసిఫాబాద్, రాచకొండ, సంగారెడ్డి, సైబరాబాద్, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, నల్లగొండ, వికారాబాద్ జిల్లాల్లో గంజాయి సాగుపై ఇటు పోలీస్, అటు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాయి. అంతర్‌పంట పేరుతో గంజాయి సాగు చేస్తున్న వారిని గుర్తించి, పంటలను ధ్వంసం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని జాఫర్పల్లిలో, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్ పరిధిలోని కడ్తాల్లోనూ గంజాయి పంటను ఎక్సైజ్ అధికారులు «ధ్వంసం చేశారు. -
ఏం ఐడియారా సామీ.. పోలీసులకే దిమ్మ తిరిగిపోయింది
బెంగళూరు: ఎంబీఏ చదివాడు.. భక్తి పారవశ్యంలో మునిగిపోయాడు.. నెమ్మదిగా మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు. లాక్డౌన్ కాలంలో అవి సులువుగా లభించకపోవడంతో.. తనే వాటిని తయారు చేయాలనుకున్నాడు. ఇంటినే పెరడుగా మార్చి.. హైటెక్ పద్దతిలో ఇంట్లోనే గంజాయి పండించడం ప్రారంభించాడు. తనలానే ఇబ్బందిపడుతున్న మత్తుబాబులకు దాన్ని సరఫరా చేస్తూ.. భారీగా ఆర్జించాడు. ఏడాది కాలం నుంచి గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం కాస్త పోలీసులకు తెలిసిపోయింది. ప్రస్తుతం ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ హైటెక్ గంజాయి సాగు బెంగళూరులో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. కర్ణాటకకు చెందిన జావేద్ అనే వ్యక్తి బెంగళూరు కళ్యాణ్ నగర్లో ఎంబీఏ పూర్తి చేశాడు. కమ్మనహళ్లి ప్రాంతంలో నివసించేవాడు. ఈ క్రమంలో అతడు ఆధ్యాత్మికంవైపు మళ్లి.. గంజాయికి అలవాటు పడ్డాడు. గత మూడు సంవత్సరాల నుంచి మత్తు పదార్థాలకు బానిసగా మారాడు. తను తీసుకోవడమే కాక స్నేహితులను కూడా డ్రగ్స్‌కు అలవాటుపడేలా చేశాడు. (చదవండి: లోడ్ దించుతున్నారనుకున్నాం; దీని కింద ఇంత కథ ఉందా!) లాక్డౌన్ ఎఫెక్ట్.. ఇలా సాగిపోతున్న సమయంలో గతేడాది బెంగళూరులో భారీ ఎత్తున మత్తుపదార్థాలు వెలుగు చూడటంతో భయపడిన జావేద్.. కమ్మనహళ్లి ప్రాంతం నుంచి బిదాదికి మకాం మార్చాడు. ఆ ప్రాంతంలోని ఓ విల్లాలో మకాం పెట్టాడు. దాని రెంటే ఏకంగా 35 వేల రూపాయలు. ఇలా ఉండగా లాక్డౌన్ విధించడంతో డ్రగ్స్ లభించడం కష్టంగా మారింది. వాటికి బానిసైన జావేద్.. మత్తుపదార్థాలు లభించకపోవడంతో పిచ్చివాడిగా మారాడు. ఇంట్లోనే గంజాయి పెంపకం... ఆ పరిస్థితి నుంచి బయటపడటం కోసం తన ఇంట్లోనే గంజాయి పెంచాలని భావించాడు. ఇందుకు గాను ఎల్ఈడీ లైట్లను అమర్చి హైడ్రోఫోనిక్ మోడల్ని సెటప్ చేశాడు. అనంతరం డార్క్ వెబ్ నుంచి గింజలను ఆర్డర్ చేశాడు. యూరోప్ నుంచి వాటిని పొందాడు. ప్రారంభంలో తన ఇంట్లో ఉన్న ఫిష్ ట్యాంక్‌లో ఓ విత్తనాన్ని నాటాడు. అది విజయవంతంగా పెరగడంతో.. మరిన్ని గింజలను నాటాడు. (చదవండి: వెబ్ సిరీస్ స్ఫూర్తి.. ఈ జంటది మామూలు తెలివి కాదు!) గ్రాము ధర రూ.3-4 వేలు ఇలా ఇప్పటి వరకు 130 మొక్కలను పెంచాడు. వాటి పెంపకం కోసం చాలా అధునాతనమైన పద్దతిని సెట్ చేశాడు. వాటిని మత్తుపదార్థంగా ఉపయోగించేలా తయారు చేశాడు. తన స్నేహితుల ద్వారా ఈ హైడ్రో గంజాయిని వినియోగదారులకు సరఫరా చేయడం ప్రారంభించాడు. ఒక్క గ్రాము గంజాయిని 3-4 వేల రూపాయలకు విక్రయించడం ప్రారంభించాడు. ఎలా దొరికాడంటే.. రెండు రోజుల క్రితం క్రైం బ్రాంచ్ పోలీసులు డీజే హళ్లి ప్రాంతంలో మత్తుపదార్థాలను సరఫరా చేస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా జావేద్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితులు చెప్పిన అడ్రెస్ ప్రకారం పోలీసులు జావేద్ విల్లాలో సోదాలు నిర్వహించారు. అక్కడ ఉన్న హైటెక్ ఏర్పాట్లును చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నలుగురు డ్రగ్ పెడ్లర్స్‌ని.. ఇద్దరు ఇరానియన్లను అరెస్ట్ చేశారు. చదవండి: 8వ తరగతి ప్రేమ.. బాలిక తిరస్కరించిందని ఆమె ఇంట్లోనే..? -
తస్మాత్ జాగ్రత్త..ఈ స్మార్ట్ ఫోన్లు వారిని కనిపెట్టేస్తాయ్
స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారా? అయితే వాటితో తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే ఫోన్లలో ఉన్న సెన్సార్లు గంజాయిని సేవించిన వారిని గుర్తిస్తాయని సైంటిస్ట్‌లు నిర్ధారించారు. మనం వినియోగించే స్మార్ట్ ఫోన్లలో ఉన్న సెన్సార్లు అనేక రకాలైన పనులు చేస్తాయి.వాటిలో మోషన్ సెన్సార్స్, ఎన్విరాన్ మెంటల్ సెన్సార్, పొజీషన్ సెన్సార్, ఆంబీనెట్ లైట్ సెన్సార్లు ఉంటాయి. కానీ అవి ఎందుకు ఉన్నాయి?ఎలా పనిచేస్తాయనే విషయం గురించి పట్టించుకోం.కానీ ఇదే సెన్సార్లపై 'అమెరికన్ రట్జర్స్ యూనివర్సిటీ' సైంటిస్ట్‌లు 'జనరల్ డ్రగ్ అండ్ ఆల్కహాల్ డిపెండెన్సీ' పేరుతో రిసెర్చ్ చేశారు. రిసెర్చ్‌లో భాగంగా..వారానికి రెండు సార్లు గంజాయి సేవించిన యువకుల నుంచి సంబంధిత డేటాను సేకరించారు.ఆ డేటా సాయంతో ఫోన్ సెన్సార్ల ద్వారా గంజాయి సేవించిన సదరు యువకుల్ని పరీక్షించారు.ఆ టెస్ట్‌ల్లో యువకులు గంజాయి ఎప్పుడు తీసుకున్నారు? ఎంత తీసుకున్నారు. తీసుకున్న తరువాత వారి శరీరం తీరు ఎలా ఉందని గుర్తించారు.అంతేకాదు స్మార్ట్ ఫోన్ సెన్సార్ల సాయంతో యువకులు ఎంత మొత్తంలో గంజాయి తీసుకున్నారో 90శాతం పాజిటీవ్ రిజల్ట్ వచ్చిందని సైంటిస్ట్ టామీ చుంగ్ తెలిపారు. చదవండి : ఛార్జర్ ఒక్కటే.. కొత్త ఫోన్లకు ఛార్జర్లు ఇవ్వరు!! -
8వ తరగతి ప్రేమ.. బాలిక తిరస్కరించిందని ఆమె ఇంట్లోనే..?
పట్నంబజారు (గుంటూరు జిల్లా): చెడు వ్యసనాలకు బానిసగా మారిన బాలుడు ఓ బాలికను ప్రేమించాడు. ఆ యువతి తిరస్కరించడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అరండల్‌పేట పోలీసుల వివరాల ప్రకారం... బొంగరాలబీడు 1వ లైనుకు చెందిన నల్లమోతు ఆంథోనిబాబు (15) వసంతరాయపురంలోని మెయిన్‌రోడ్డులో ఉన్న ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఆంథోనికి గంజాయి సేవించే అలవాటు ఉంది. ఈ క్రమంలో వరసకు మరదలయ్యే నిరుపేదల కాలనీలో నివసించే ఆమె స్నేహితురాలితో పరిచయం ఏర్పడింది. ప్రేమించమని అడగడంతో ఆ బాలిక తిరస్కరించింది. దీంతో ఆంథోనిబాబు మస్తాపానికి గురై మంగళవారం నిరుపేదల కాలనీలోని మరదలు నివాసంలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి రాజారత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హష్ ఆయిల్.. 1 ఎంఎల్ @ రూ.600
సాక్షి, హైదరాబాద్: గంజాయి సంబంధిత ఉత్పత్తి అయిన హష్ ఆయిల్‌ను విక్రయిస్తున్న ఇద్దరు యువకులకు మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. వీరి నుంచి 100 మిల్లీ లీటర్ల (ఎంఎల్) హష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు ఆదివారం వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గుడిమల్కాపూర్‌లోని ప్రియ కాలనీకి చెందిన వడ్డల లక్ష్మీ వెంకట నర్సింహాచారి డీజే సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. ఇటీవల కాలంలో తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వీటిని అధిగమించడం కోసం తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాలను అన్వేషించాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి గుంటూరుకు చెందిన ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే హష్ ఆయిల్‌కు గంజాయి కంటే ఎక్కువ డిమాండ్ ఉందంటూ ఇతగాడు చెప్పాడు. తాను సరఫరా చేస్తానని, సిటీలో విక్రయించి సొమ్ము చేసుకుందామని ఆఫర్ ఇచ్చాడు. దీనికి చారి అంగీకరించడంతో ఇటీవల 100 ఎంఎల్ ఆయిల్ తెచ్చి ఇచ్చాడు. దీన్ని ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ సాయంతో 5 ఎంఎల్ చొప్పున చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సుల్లో ప్యాక్ చేస్తున్న చారి హీట్ గన్‌తో సీలు వేస్తున్నాడు. వీటిని తన స్నేహితుడైన ప్రైవేట్ ఉద్యోగి ముల్కాల భాను ప్రకాష్ సాయంతో విక్రయిస్తున్నాడు. ఒక్కో బాక్సును రూ.3 వేలకు (ఒక్కో మిల్లీ లీటర్ రూ.600 చొప్పున) అమ్ముతూ వచ్చిన లాభాలను ముగ్గురూ పంచుకుంటున్నారు. వీరి వ్యవహారంపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ మహ్మద్ అబ్దుల్ జావేద్‌కు సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీనివాసులు, మహ్మద్ షానవాజ్ షఫీ, టి.శ్రీధర్ రంగంలోకి దిగి వల పన్నారు. ఆదివారం చారి, భానులను పట్టుకుని హష్ ఆయిల్, వేయింగ్ మిషన్ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును ఆసిఫ్‌నగర్ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న ప్రవీణ్ కోసం గాలిస్తున్నామని, అతడు చిక్కితే ఈ ఆయిల్ మూలాలపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు. -
స్నేహితుడు కాదు రాక్షసుడు.. గంజాయి కోసం రూ. 50 ఇవ్వలేదని..
పాట్నా : గంజాయి కొనడానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో స్నేహితుడ్ని హత్య చేశాడో వ్యక్తి. ఈ సంఘటన బిహార్‌లోని పాట్నా జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాట్నా జిల్లా పాలి గ్రామానికి చెందిన ప్రదీప్ కుమార్, ప్రిన్స్ కుమార్ స్నేహితులు. ప్రిన్స్ కుమార్ గంజాయికి బానిస. ప్రతి రోజు గంజాయి తీసుకునేవాడు. ఈ నేపథ్యంలో శనివారం తనకు గంజాయి కొనడానికి 50 రూపాయలు ఇవ్వాలని ప్రదీప్‌ను అడిగాడు. అయితే, ప్రదీప్ డబ్బులు ఇవ్వనని చెప్పాడు. దీంతో ఇద్దరికీ మాటా,మాటా పెరిగి గొడవ జరిగింది. ప్రిన్స్ తన దగ్గర ఉన్న కత్తితో ప్రదీప్ రొమ్ముపై నాలుగైదు సార్లు పొడిచి, అక్కడినుంచి పారిపోయాడు. తీవ్రగాయాలపాలైన ప్రదీప్‌ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికి లాభం లేకపోయింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
సికింద్రాబాద్‌లో డ్రగ్స్ కలకలం
హైదరాబాద్: సికింద్రాబాద్‌లో డ్రగ్స్ కలకలం సృష్టించింది. బిశ్వజిత్ అనే అమెజాన్ ఉద్యోగి డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుపడ్డాడు. నిందితుడి నుంచి కేజీ గంజాయి, 20 గ్రాముల హాషిప్ ఆయిల్, 5 గ్రాముల చరాస్ పోలీసులు సీజ్ చేసినట్లు సమాచారం. ఈ ముఠా గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఫ్రెండ్‌తో బయటకు వెళ్లాడు.. బెంగళూరులో అరెస్ట్ అయ్యాడు..
జయపురం: కొరాపుట్ జిల్లాలో యువత గంజాయి బాట పడుతున్నారు. తక్కువ వ్యయంతో రూ.లక్షలు గడించవచ్చని పలువురు యువకులు గంజాయి మాఫియా వలలో పడుతూ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా కొందరు, తల్లిదండ్రుల అనుమతితోనే మరికొందరు గంజాయి రవాణాలో మమేకం అవుతున్నారు. తాజాగా శనివారం వెలుగు చూసిన సంఘటన ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. దసమంతపూర్ గ్రామంలో అంబిక దళపతి కుమారుడు దివాకర దళపతి జూన్ 28న తన స్నేహితునితో టంగినిగుడ గ్రామం వెళ్లొస్తానని చెప్పాడు. దివాకర్ ఇంటికి తిరిగి రాకపోవటంతో అతడి స్నేహితులు, బంధువులు అన్ని ప్రాంతాలలో గాలించారు. అయినా కుమారుడి జాడ తెలియక తల్లి.. బొయిపరిగుడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శనివారం దివాకర్ దళపతితో పాటు మరో ఇద్దరు యువకులను బెంగళూరు పరిదిలోని మాదబలి పోలీసులు గంజాయి కేసులో అరెస్టు చేసినట్లు బొయిపరిగుడ పోలీసులకు సమాచారం అందింది. వారి నుంచి 150 కేజీల గంజాయిని, రవాణాకు వినియోగించిన కారును స్వాదీనం చేసుకున్నట్లు మాదబలి పోలీసులు బొయిపరిగుడ పోలీసులకు తెలియజేశారు. జూన్ 28న కారులో గంజాయిని బెంగళూరుకు రవాణా చేస్తుండగా, తమకు చిక్కారని మధుబలి పోలీసులు బియపరిగుడ పోలీసులకు తెలిపారు. -
ఇంజనీరింగ్ చదివారు.. గంజాయి అమ్ముతూ బుక్కయ్యారు!
బనశంకరి: ఇద్దరూ ఇంజనీరింగ్ పట్టభద్రులు. కష్టపడితే మంచి భవిష్యత్తు. కానీ తప్పుదోవ తొక్కి కష్టాల్లో పడ్డారు. ప్రియుని ఒత్తిడితో గంజాయి అమ్ముతూ ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన రేణుక (25) యువతి బెంగళూరు సదాశివనగర పోలీసులకు పట్టుబడింది. ఆమె ప్రియుడు సిద్ధార్థ్ పరారీలో ఉన్నాడు. చెన్నైలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివిన రేణుక, కడప జిల్లావాసి సిద్ధార్థ్ ఇద్దరూ ఒకే బ్యాచ్. కాలేజీలో ప్రేమలో పడ్డారు. చదువు ముగిశాక రేణుక చెన్నైలో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరింది. సిద్ధార్థ్ మాత్రం విలాసవంత జీవితంపై మోజుతో డ్రగ్స్ ముఠాలతో కలిశాడు. నేను కొత్త వ్యాపారాన్ని ప్రారంభించానని, ఇందులో చాలా డబ్బు వస్తుందని రేణుకకు చెప్పాడు. సరేనని ఆమె ఉద్యోగం వదిలిపెట్టి ప్రియునితో కలిసి డ్రగ్స్ దందాలోకి దిగింది. లాక్డౌన్లో గంజాయి విక్రయాలు గతేడాది కరోనా లాక్డౌన్ సమయంలో రేణుకను గంజాయి విక్రయానికి బెంగళూరుకు పంపించాడు. ఆమె మారతహళ్లి సమీపంలోని పీజీ హాస్టల్లో ఉండేది. బిహార్‌కు చెందిన సుధాంశు అనే వ్యక్తితో కలిసి గంజాయి విక్రయాలు ప్రారంభించింది. ప్రియుడు సిద్ధార్థ్ పెద్దమొత్తంలో గంజాయిని తీసుకువస్తే రేణుక చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మేది. మంగళవారం రాత్రి సదాశివనగర ప్రాంతంలో గంజాయి అమ్ముతున్నట్లు తెలిసి సీఐ ఎంఎస్ అనిల్‌కుమార్, ఎస్ఐ లక్ష్మీలు దాడి చేసి రేణుక, సుధాంశును అరెస్ట్ చేశారు. ఇద్దరినీ పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. ప్రియుని మాటలను నమ్మి తప్పు చేశానని రేణుక విలపించింది. సిద్ధార్థ్ కోసం గాలిస్తున్నారు. చదవండి: బాబోయ్ కుళ్లిన శవం వాసన.. సెల్ఫీలకు క్యూ కట్టిన జనం -
వెబ్ సిరీస్ స్ఫూర్తి.. ఈ జంటది మామూలు తెలివి కాదు!
ముంబై : కేకుల్లో ఇడిబుల్(తినడానికి వీలుగా ఉండే) గంజాయి పెట్టి అమ్మకాలు సాగిస్తున్న ఓ యువ జంటను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. శనివారం ముంబై, మలద్‌లోని ఓ బేకరీపై రైడ్ చేసిన అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరికి గంజాయి సప్లయ్ చేస్తున్న మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఈ జంట లాక్డౌన్ సమయంలో బేకరీ వ్యాపారం ప్రారంభించింది. ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా కేకుల అమ్మకాలు సాగిస్తోంది. ఈ జంట వెబ్ సిరీస్ స్ఫూర్తితో గంజాయి కేకులు తయారు చేయటం మొదలుపెట్టింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆర్డర్లు తీసుకుని గంజాయి కేకులు అమ్మేవారు. ఆన్లైన్ పేమెంట్ ద్వారా డబ్బులు వసూలు చేసేది. అధికారులు ఈ జంట వద్దనుంచి 830 గ్రాముల ఇడిబుల్ గంజాయిని, 160 గ్రాముల మామూలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఇడిబుల్ గంజాయి సప్లయ్ చేస్తున్నవారి కోసం అధికారులు అన్వేషణ మొదలుపెట్టారు. నిందితుల ఇంటినుంచి కస్టమర్ల పేర్లు ఉన్న ఓ డైరీని సైతం స్వాధీనపర్చుకున్నారు. గంజాయి కేకులు కొద్దిగా ఆకుపచ్చరంగులో ఉండి.. కొద్దిగా గంజాయి వాసన కూడా వస్తుందని.. మామూలు కేకులకు, గంజాయి కేకులకు తేడా కనుక్కోవటం అంత వీజీ కాదని అధికారులు చెబుతున్నారు. చదవండి : హైదరాబాద్‌లో: కార్లను అద్దెకు తీసుకుని ఆపై అమ్మకం.. -
చదివింది ఎమ్మెస్సీ.. అమ్మేది గంజాయి
తిరుపతి క్రైం: ఉన్నత చదువులు చదివిన ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తూ తిరుపతి పోలీసులకు పట్టుబడ్డారు. తిరుచానూరు రోడ్ కెనడీనగర్లోని ఓ ఇంట్లో శనివారం 1,350 గ్రాముల గంజాయిని ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సీఐ శివ ప్రసాద్‌రెడ్డి సీజ్ చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు.. స్థానికుడు శివయ్య ఎమ్మెస్సీ చదువుకున్నాడు. అదేవిధంగా కర్నూలుకు చెందిన జయప్రకాష్ ఫిజియోథెరపీ మెడికల్ కాలేజ్‌లో చదివాడు. వీరిద్దరూ పాత పరిచయం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించేందుకు గాను.. గంజాయిని విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బైరాగిపట్టెడలోని మోనిషా అనే వ్యక్తి వద్ద రూ.16 వేలకు కొనుగోలు చేసి గంజాయిని ప్యాకెట్ల రూపంలో రూ.200 నుంచి రూ.300 వరకు విక్రయించేవారు. శనివారం ఉదయం కెనడీ నగర్‌లోని వారి నివాసంలో దాడులు నిర్వహించగా శివయ్య, జయప్రకాష్ ప్యాకెట్లు కడుతుండగా అరెస్ట్ చేశారు. మాదక ద్రవ్యాలపై దండయాత్ర అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్పల నాయుడు ఆదేశాల మేరకు శనివారం తిరుపతిలో మాదక ద్రవ్యాలపై పోలీసుల దండయాత్ర ప్రారంభించారు. గుట్కా, గంజాయి వంటి మత్తుపదార్థాల విక్రయాలపై ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గుట్కా, గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. చదవండి: 9 బృందాలు.. 36 గంటలు అడ్డుగా ఉందని చంపేశాడు -
ఎఫైర్; భర్తను జైలుకి పంపాలని స్కెచ్.. ట్విస్ట్ ఏంటంటే!
చండీఘఢ్: భర్తను కటకటాల్లోకి నెట్టాలని భావించి ఓ భార్య చేసిన కుట్ర బెడిసికొట్టింది. తనన మోసం చేస్తున్నాడని భావించి అతడిని ఇరికించేందుకు చేసిన ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో ఆమెకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ షాకింగ్ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివారల్లోకి వెళితే.. ఫరీదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి అతను రోజూ ఇంటికి ఆలస్యంగా వచ్చేవాడు. ఇక ఒక్కోరోజు అసలు ఇంటికే వెళ్లేవాడే కాదు. దీంతో తన భర్త ఎందుకు ఇంటికి రావడం లేదని ఆలోచించిన భార్య అతనిపై క్రమంగా అనుమానం పెంచుకుంది. ఈ నేపథ్యంలో భర్త మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని అపోహ పడింది. మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని అనుమానించి రగిలిపోయింది. ఈ విషయం పలుమార్లు భర్తతో చర్చించగా వీరి మధ్య తరుచూ గొడవలు అయ్యేవి. దీంతో విసిగి పోయిన మహిళ.. ఎలాగైనా అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. ఢిల్లీ వెళ్లి మరీ ఓ వ్యక్తి వద్ద గంజాయి మొక్కను కొనుక్కొచ్చింది. సుమారు 700 గ్రాముల గంజాయి మొక్కను తన భర్త ఆటోలో పెట్టింది. తరువాత తనకేం సంబంధం లేనట్లు గుర్తు తెలియని మహిళ మాదిరిగా పోలీసులకు ఫోన్ చేసి గంజాయి విషయం చెప్పి భర్తను బుక్ చేయాలని చూసింది. భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరపడంతో అసలు కిలాడీ భార్యేనని తెలిసి ఆమెకు షాకిచ్చారు. ఆమెను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. చదవండి: వరకట్నం కేసుల నుంచి తప్పించుకుంటున్నారు: హైకోర్టు ఆవేదన యువతితో దిగిన ఫొటోతో స్టేటస్.. భార్య చూడటంతో! -
ఆ ఏనుగులకు గంజాయి.. ఎందుకంటే?..
వార్సా : పోలాండ్, వార్సా జూలోని ఏనుగుల ఒత్తిడిని తగ్గించటానికి ఓ వినూత్న పద్ధతిని ఎంచుకోబోతున్నారు జూ అధికారులు. వాటికి వైద్యపరమైన గంజాయిని ఇవ్వనున్నారు. జూలోని మూడు ఆఫ్రికన్ ఏనుగులకు ద్రవ రూపంలోని అధిక సాంద్రత కలిగిన రిలాక్సింగ్ కెన్నిబినాయిడ్‌ను తొండాల ద్వారా అందించనున్నారు. ఆఫ్రికన్ ఏనుగులపై ఇలాంటి పరిశోధనలు చేయటం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు. దీనిపై ఓ పశు వైద్యాధికారి మాట్లాడుతూ.. వైద్య పరమైన గంజాయి ఏనుగుల ఆరోగ్యంపై ఎటువంటి చెడు ప్రభావం చూపదని స్పష్టం చేశారు. ఇది ఏనుగుల ఒత్తిడిని తగ్గించటానికి ఓ సహజ సిద్ధమైన పద్దతిని వెతుక్కునే ప్రయత్నమని చెప్పారు. ( 80 ఏళ్లుగా జుట్టు కత్తిరించలేదు..!) కాగా, గత మార్చి నెలలో జూలోని ఆడ ఏనుగు ఎర్నా చనిపోవటంతో గుంపులోని ఫ్రెడ్జియా అనే మరో ఆడ ఏనుగు అప్పటినుంచి ఒత్తిడికి లోనవుతోంది. అంతేకాకుండా తోటి ఆడ ఏనుగులతో కూడా సఖ్యంగా ఉండటం లేదు. గుంపులోని పెద్ద చనిపోయినపుడు మిగిలిన ఏనుగులు ఆ బాధనుంచి బయటపడటానికి కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా పట్టవచ్చని పరిశోధనల్లో తేలింది. మామూలుగా వైద్యపరమైన గంజాయిని కుక్కలు, గుర్రాలకు చికిత్స చేయటానికి ఉపయోగిస్తుంటారు. -
ఆ రెండూ దొరక్కపోవడంతో...
నగర వ్యాప్తంగా మాదకద్రవ్యాల క్రయవిక్రయాలు, వినియోగంపై నిఘా ముమ్మరమైంది. ఓ వైపు పోలీసులు, మరో వైపు ఎక్సైజ్ అధికారులు ఎడాపెడా దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మత్తుకు బానిసైన యువకులు ‘సేఫ్ డ్రగ్స్’ వినియోగానికి మొగ్గుచూపుతున్నారు. వీరితో పాటు ఫుట్‌పాత్‌లపై బతికే అనాథలు సైతం వీటిని వినియోగిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: మత్తు కోసం ‘సేఫ్ డ్రగ్స్’ వినియోగం అధికం అవుతున్న నేపథ్యంలో నగర పోలీసు విభాగం ఈ దందాపై కన్నేసింది. అందులో భాగంగా సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం హిమాయత్‌నగర్‌కు చెందిన జయంత్ అగర్వాల్‌ను అరెస్టు చేశారు. ఇతడి నుంచి 154 బాటిళ్ల దగ్గుమందు స్వాధీనం చేసుకున్నారు. ఆ రెండూ దొరక్కపోవడంతో... మాదకద్రవ్యాలు.. ఇతరత్రా ఖరీదైన డ్రగ్స్ కొనలేని ‘మత్తు బానిసలు’ ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ‘ఆల్టర్నేటివ్ డ్రగ్స్’లో నిద్రమాత్రలు, వైట్నర్, దగ్గు మందు ప్రధానమైనవిగా మారాయి. అయితే వైద్యులు రాసిన ప్రిస్క్రెప్షన్ లేకుండా స్లీపింగ్ పిల్స్‌ను ఖరీదు చేయడం కష్టసాధ్యం. వైట్నర్ను ఖరీదు చేయడం తేలికే అయినా వినియోగించేప్పుడు ఇతరుల దృష్టిలో పడే అవకాశాలు ఉంటాయి. దీంతో అత్యధికంగా ప్లాట్‌ఫామ్స్‌పై నివసించే అనాథలే దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. మత్తుకు బానిసవుతున్న యువత, వైట్నర్ లభించని అనాథలు దగ్గు మందు ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీరికి ఈ మందులు మెడికల్ దుకాణాల నుంచే లభిస్తున్నాయి. దగ్గు కరోనా లక్షణాల్లో ఒకటైనా... నగరంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఎలాంటి లక్షణాలు లేని అసిమ్టమ్యాటిక్ కేసులతోపాటు ఈ వైరస్ సోకిన వారు క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించడం, లక్షణాలున్నా కోవిడ్ అని గుర్తించలేక కొన్ని మందులు వాడుతూ బయట సంచరించడం కూడా కారణాలనే వైద్యులు చెబుతున్నారు. కరోనా లక్షణాల్లో దగ్గు కూడా ఒకటి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం గతంలోనే కీలక ఆదేశాలు జారీ చేసింది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి వాటికి మెడికల్ షాపుల యజమానులు నేరుగా మాత్రలు అమ్మవద్దని, అమ్మినా ఖరీదు చేసిన వారి వివరాలు వైద్య ఆరోగ్య శాఖకు తెలపాలని స్పష్టం చేసింది. అయినా కొందరు మెడికల్ షాపుల యజమానులు మత్తుకు బానిసైన వారికి దగ్గు మందు విక్రయించేస్తున్నారు. దారుస్సలాంలో అగర్వాల్స్ ఫార్మసీ నిర్వహిస్తున్న హిమాయత్‌నగర్‌కు చెందిన జయంత్ అగర్వాల్ ఈ మందుల్ని అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటూ శుక్రవారం సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్‌కు చిక్కాడు. శృతిమించితే తీవ్ర పరిణామాలే... అత్యధిక శాతం దగ్గు మందుల్ని డెక్స్‌ట్రోమెథార్ఫిన్, కోడైన్‌లతో తయారు చేస్తారు. కోడైన్‌తో కూడిన ఈ రసాయనం నియంత్రిత జాబితాలో ఉన్న మాదకద్రవ్యం. మత్తును కలిగించే దీన్ని కేవలం ఔషధాల తయారీకి మాత్రమే వినియోగిస్తుంటారు. ప్రధానంగా డెక్స్‌ట్రోమెథార్ఫిన్ కారణంగానే అనేక మంది దగ్గు మందులకు బానిసలు అవుతున్నారు. ఇది శృతిమించితే కిడ్నీ, కాలేయానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు విపరీతంగా పెరిగిపోతాయి. కొన్నిసార్లు మెదడుకు సంబంధించిన తీవ్రరుగ్మతలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు తమ వారి వ్యవహారశైలిపై కన్నేసి ఉంచాలని, అవసరం లేకుండా దగ్గు మందుల వాడకాన్ని నిరోధించాలని పోలీసులు కోరుతున్నారు. ఎలాంటి చీటీ లేకుండా వీటిని విక్రయిస్తున్న ఔషధ దుకాణాలపై నిఘా ముమ్మరం చేశామని, వాటి యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
గంజాయి మత్తులో యువకుల హల్చల్
కొత్తగూడెంఅర్బన్: పండ్ల వ్యాపారం చేసే యువకులు గంజాయి, మద్యం మత్తులో కొత్తగూడెం పట్టణంలో గురువారం బీభత్సం సృష్టించారు. అడ్డొచ్చిన వారిపై కర్రలు, కత్తులతో బెదిరింపులకు దిగారు. ఆపడానికి వచ్చిన ట్రాఫిక్ పోలీసులపై సైతం దాడి చేశారు. స్థానికులు, త్రీటౌన్ సీఐ, ట్రాఫిక్ పోలీసుల కథనం ప్రకారం... కూరగాయలు, పండ్ల కొనుగోలుకు చుంచుపల్లి మండలానికి చెందిన ఓ మహిళ గురువారం రైతుబజార్‌కు రాగా, పండ్ల వ్యాపారులు అసభ్యంగా మాట్లాడారు. ఆమె భర్తకు విషయం తెలియజేయడంతో, అతను వచ్చి వ్యాపారులను నిలదీశాడు. ఈ క్రమంలో వ్యాపారులు, అతనికి మధ్య గొడవ జరిగింది. మద్యం, గంజాయి మత్తులో పండ్ల వ్యాపారితోపాటు మరో ముగ్గురు యువకులు కలిసి మహిళ భర్తపై కర్రలు, కత్తులతో దాడికి యత్నించారు. దీంతో అతను పరుగులు తీస్తూ సూపర్‌బజార్ మీదుగా ట్రాఫిక్ పోలీసు స్టేషన్లోకి వెళ్లాడు. ఆ యువకులు కూడా స్టేషన్లోకి రాగా, ట్రాఫిక్ పోలీసులపై అడ్డుకున్నారు. దీంతో వారిపై కూడా దాడి చేశారు. ట్రాఫిక్ పోలీస్ చేతిని కొరికి గాయపరిచారు. సమాచారం అందుకున్న త్రీటౌన్ సీఐ ఆదినారాయణ ట్రాఫిక్ ఠాణాకు చేరుకుని, నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
గుప్పుమంటున్న గంజాయి!
నిజామాబాద్, మోర్తాడ్(బాల్కొండ): గంజాయి దందా జోరుగా సాగుతోంది. గంజాయి గ‘మ్మత్తు’కు అలవాటు పడిన యువత చిత్తవుతోంది. ఎక్కడో హైదరాబాద్ లాంటి పట్టణాల్లో కనిపించే హుక్కా సంస్కృతి పల్లెలకూ పాకింది. కొంత మంది యువకులు, విద్యార్థులు బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. హాసాకొత్తూర్, మోర్తాడ్, కమ్మర్పల్లి, ఏర్గట్ల, తాళ్లరాంపూర్, వడ్యాట్, రామన్నపేట్, శెట్పల్లి, తిమ్మాపూర్, ఉప్లూర్ తదితర గ్రామాలలో కొన్ని నెలల నుంచి గంజాయి విక్రయాలు ఊపందుకున్నాయి. అయినా అటు ఎక్సైజ్ అధికారులు కానీ, ఇటు పోలీసులు గానీ పెద్దగా పట్టించుకున్న దాఖలాల్లేవు. యువతను టార్గెట్‌గా చేసుకుని కొందరు అక్రమార్కులు గంజాయి దందాను కొనసాగిస్తున్నారు. సిగరేట్లలో తంబాకును తొలగించి గంజాయి మిశ్రమాన్ని కలిపి విక్రయిస్తున్నారు. పోచంపాడ్, కోరుట్ల తదితర ప్రాంతాల నుంచి గంజాయి మిశ్రమం గల సిగరేట్లు దిగుమతి అవుతున్నాయని తెలుస్తుంది. ఒక్కో సిగరేట్‌ను రూ.150 నుంచి రూ.200లకు విక్రయిస్తున్నారు. ఇవే కాకుండా విడిగా గంజాయిని విక్రయిస్తున్నట్లు తెలిసింది. గంజాయికి అలవాటు పడుతున్న వారిలో యువకులతో పాటు పాఠశాలల్లో చదివే విద్యార్థులు సైతంఉంటున్నారు. ఒకరిని చూసి ఒకరు అలవాటు చేసుకుంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఠాలు కడుతున్న యువకులు, విద్యార్థులు.. గంజాయి మత్తులో ఇతరులతో ఘర్షణలకు దిగుతున్నారు. ఇలాంటి ఘర్షణలు ఇటీవల రెండు, మూడు చోట్ల జరిగాయి. గంజాయికి బానిసలైన యువకులు దొరికితే పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేస్తున్నారు. అయితే, గంజాయి ఎక్కడి నుంచి వస్తుందనేది మాత్రం వారు గుర్తించలేక పోతున్నారు. గంజాయి స్మగ్లర్లకు రాజకీయ నేతల అండదండలు ఉండటం వల్లనే దందా యథేచ్ఛగా సాగుతోందని సమాచారం. సమాచారమివ్వాలి.. గంజాయిని విక్రయించే స్మగ్లర్ల కోసం ఆరా తీస్తున్నాం. స్మగ్లర్ల గురించి ఎవరైనా సమాచారం ఇస్తే వారి వివరాలను రహస్యంగా ఉంచుతాం. పోలీసులకు సహకరించి గంజాయి విక్రయాల వివరాలను అందించాలి.– సంపత్‌కుమార్, ఎస్ఐ, మోర్తాడ్ -
గంజాయి కేసు; మహిళకు నోటీసులు
ఒడిశా, జయపురం: దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో నమోదైన గంజాయి కేసులో ఒడిశాకు చెందిన ఆదివాసీ నిరుపేద మహిళను నిందితురాలిగా చేసి కోర్టుకు హాజరుకావాలని ఉత్తరప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ నోటీసులు పంపింది. అవిభక్త కొరాపుట్‌లోని నవరంగపూర్ జిల్లా పపడహండి సమితిలో చిన్న కుగ్రామం సన్యాసిగుడలో పశువులు మేపుకుంటూ జీవనం సాగిస్తున్న గౌరిమణి భొత్ర అనే మహిళకు నాలుగు రోజుల క్రితం ఈ నోటీసులు అందాయి. గంజాయి కేసులో నిందితురాలు లక్నోలోని కార్యాలయంలో హాజరుకావాలని నోటీసు సారాంశం. ఇంతవరకూ ఆమె తన జిల్లా కేంద్రాన్నే చూసి ఎరుగదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ ఉందో తెలియని నిరక్షరాస్య, నిరుపేద మహళా పశువుల కాపరికి ఆ నోటీసు ఎందుకు వచ్చిందో? ఎవరు పంపారో తెలియక, అందులో ఏముందో అర్థం కాక ముచ్చెమటలు పట్టి అందరి వద్దకు తిరిగి చదివి వినిపించమని వేడుకుంది. ఆ గ్రామంలోనే కాదు పరిసర గ్రామాలలో ఆ నోటీసు చదవగల వారు ఎవరూ లేక పోవడంతో మంత్రిగుడలో ఒక ఉపాధ్యాయుడితో చదివించుకుంది. ధైర్యం చెప్పిన ఎస్పీ కుశలకర్ నోటీసులో విషయం తెలిశాక తాను గంజాయి కేసులో ఎప్పుడు? ఎక్కడ? పట్టుబడ్డానంటూ తల పట్టుకుంది. మూడు నాలుగు రోజులు మానసిక వ్యధ పొందిన ఆమె చివరికి ఉపాధ్యాయుని సలహా మేరకు గురువారం నవరంగపూర్ వచ్చి ఎస్పీ కుశలకర్‌ను కలిసి నోటీసు చూపింది. నోటీసు చదివిన ఎస్పీ ఏమీ కాదని భరోసా ఇవ్వడంతో ఊరట చెంది ఇంటికి మళ్లింది. -
ఉల్లి లోడు పేరుతో భారీ గంజాయి స్మగ్లింగ్
బరంపురం : ఉల్లిపాయల లోడు పేరుతో అక్రమంగా 1100 కేజీల గంజాయి రవాణా చేస్తున్న ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఘటనలో ట్రక్కుని సీజ్ చేసి, డ్రైవర్‌తో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు పోలీసులు. ఐఐసీ అధికారి అందించిన సమాచారం ప్రకారం... బరంపురం జిల్లా కె.నువగాం పోలీసు స్టేషన్ పరిధిలో తుంబా అటవీమార్గం గుండా ఉల్లిపాయల లోడ్ పేరు చెప్పి, అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు సమాచారం అందింది. గంజాం ఎస్పీ ఆదేశాల మేరకు కె.నువాగం పోలీసులు అటవీ మార్గంలో నిఘా పెట్టారు. ( ప్రాణం తీసిన వివాహేతర సంబంధం ) అటువైపుగా వస్తున్న ట్రక్కుపై దాడి చేసి, తనిఖీ చేయగా.. భారీగా గంజాయి నిల్వలు కనిపించాయి. ఇందులో 1100 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ట్రక్కు సహా సీజ్ చేసి, డ్రైవర్, మరో ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారి వద్ద నుంచి ఒక తుపాకీ, 5 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
గంజాయి, సారా స్వాధీనం
నగరి : మండలంలోని ఓజీకుప్పం గ్రామాన్ని ఆదివారం ఉదయం పోలీసులు చుట్టుముట్టి తనిఖీ నిర్వహించారు. కార్డన్ అండ్ సెర్చ్ (సమస్యాత్మక పల్లెల్ని చుట్టుముట్టి తనికీ చేయడం)లో భాగంగా ఆదివారం జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆధ్వర్యంలో సీఐలు, చిత్తూరు అడిషనల్ ఎస్పీ కృష్ణార్జునరావు, చిత్తూరు ఎస్బీ డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, చిత్తూరు ఏఆర్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, నగరి, నగరి రూరల్, పుత్తూరు సీఐలు మద్దయ్య ఆచారి, రాజశేఖర్, వెంకట్రామిరెడ్డి, ఎస్ఐలతో పాటు 100 మంది పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టి తనిఖీ చేశారు. సీఐ మద్దయ్య ఆచారి తెలిపిన వివరాల మేరకు.. పోలీసులు ప్రతి ఇంటికీ వెళ్లి అనుమానిత వ్యక్తులు ఉన్నారా అని ఆరాతీశారు. ఇళ్ల వద్ద ఉన్న వాహనాల రికార్డులను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఊహించని పలు అంశాలు వెలుగుచూశాయి. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న పళని(48), మునస్వామి(28), మురళి (32), సంపూర్ణమ్మ(70) పట్టుపడగా, వారి వద్ద నుంచి 12.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్రమంగా సారా, మద్యం బాటిళ్లు విక్రయిస్తున్న దొరై(60), మునిలక్ష్మి (56)ని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి 114 సారాపాకెట్లు, 11 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. రికార్డులు సక్రమంగా లేని 11 ద్విచక్రవాహనాలను గుర్తించి స్టేషన్‌కు తరలించారు. గంజాయి నిల్వ ఉంచుకున్న వారిపై ఎన్ఈబీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేయగా, అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్న వారిపై ఏపీ ఎక్సైజ్ యాక్టు కింద కేసు నమోదు చేశారు. -
కొడైక్కెనాల్ కొండపై.. మందేసి చిందేసి
సాక్షి ప్రతినిధి, చెన్నై: వారంతా పాతికేళ్లలోపు యువతీ యువకులు. ఉద్యోగాలే చేస్తున్నారో.. ఉన్నత విద్యలే అభ్యసిస్తున్నారో తెలియదు. ఆడామగా తేడా లేకుండా మద్యం మత్తులో ఊగిపోయారు. పరిసరాలను మరిచిపోయి చిందులు వేశారు. మాదకద్రవ్యాల మైకంలో మరో లోకంలో విహరించారు. పోలీసులు రంగప్రవేశం చేసి 270 మంది యువతీ, యువకులను అరెస్ట్ చేశారు. దిండుగల్లు జిల్లా కొడైక్కెనాల్లో ఇళవరసి అనే కొండ ఎంతో ప్రసిద్ధి చెందింది. పోలీసుల అదుపులో యువతీ, యువకులు దేశం నలుమూలల నుంచేగాక విదేశీ పర్యాటకులు సైతం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇదిలాఉండగా కొడైక్కెనాల్ కోండపై భాగంలో యువతీయవకులు అడపాదడపా మాదకద్రవ్యాలు, మద్యం పార్టీలు చేసుకుంటారు. కొన్ని నెలల క్రితం న్యాయస్థానం అనుమతితో పోలీసుల పర్యవేక్షణలో పూంపారై కొండపై కొందరు మద్యం పార్టీ చేసుకున్నారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి కొడైక్కెనాల్ పైభాగం కొండకు సమీపంలోని గుండుపట్టి గ్రామంలోని ఒక ప్రయివేటు తోటలో పెద్ద సంఖ్యలో యువత కోలాహలం సాగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పళని తైపూస మహోత్సవంలో భద్రతా విధుల కోసం దిండుగల్లు జిల్లాకు వెళ్లి ఉండిన శివగంగై జిల్లా మానామధురై డీఎస్పీ కార్తికేయన్ నేతృత్వంలో పోలీసుల బృందం గుండుపట్టి గ్రామానికి చేరుకుంది. ప్రయివేటు తోటలో యువతీయువకులు మద్యం, మాదకద్రవ్యాల మత్తులో ఊగిపోవడాన్ని చూసి నివ్వెరపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మొత్తం 270 మందిలో ఆరుగురు యువతులు కూడా ఉన్నారు. బ్రెజిల్ దేశానికి చెందిన ఒక యువకుడిని కూడా పోలీసులు గుర్తించారు. తోటలో పార్టీ చేసుకుంటున్నవారంతా 25 ఏళ్లలోపు యువతీయువకులే కావడం గమనార్హం. వాట్సాప్ ద్వారా సమీకరణ మత్తుకు బానిసైన వారిని ఒక చోట చేర్చేందుకు కొందరు వ్యక్తులు వాట్సాప్ గ్రూప్ తయారు చేశారు. దాని ద్వారా యువతను సమీకరించి మెగా మాదకద్రవ్యాల పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.ఆమేరకు ఆహ్వానించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పార్టీ చేసుకుంటున్న 270 మందిని పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లు, గంజాయి తదితర మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. మత్తులో జోగుతూ ఏం జరుగుతోందో కూడా తెలియని స్థితిలో ఉండడంతో యువత నుంచి మరింత సమాచారం రాబట్టడం కష్టంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ పార్టీని ఎవరు ఏర్పాటు చేశారు, ఈ ప్రాంతాన్నే ఎందుకు ఎంచుకున్నారు, యువతను సమీకరించేందుకు వినియోగించిన వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు ఎవరు..? అనే కోణంలో శుక్రవారం విచారణ ప్రారంభించారు. పార్టీ జరిపేందుకు అనుమతిచ్చిన తోట యజమానిని కూడా విచారిస్తున్నారు. 270 మంది యువతను సమీకరించి ఒక మారుమూల గ్రామానికి తీసుకొచ్చి ఇలాంటి మాదకద్రవ్యాల పార్టీ జరిగిన సంఘటన పరిసరాల్లోని ప్రజలనేగాక పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. -
కోర్టులో గంజాయి సిగరెట్ కాల్చాడు..
-
ఇటుదటు... అటుదిటు!
సాక్షి, సిటీబ్యూరో: నగరం కేంద్రంగా వ్యవస్థీకృత మాదకద్రవ్యాల దందాకు పాల్పడుతున్న ముఠా గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన ఫ్రాన్సిస్ జేవియర్ కుటుంబం పాతికేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి కార్ఖానా ప్రాంతంలో స్థిరపడింది. ఇంటర్మీడియట్‌తో చదువు మానేసిన ఫ్రాన్సిస్ ఆపై దురలవాట్లకు బానిసగా మారాడు. మాదకద్రవ్యాలు వినియోగించడం మొదలు పెట్టిన అతడికి ఆరు నెలల క్రితం ప్రస్తుతం గోవాలో ఉంటున్న సికింద్రాబాద్ వాసి ఆర్ఎం గౌడ్‌తో పరిచయం ఏర్పడింది. తరచు సిటీకి వచ్చి వెళ్తున్న ఆర్ఎం గౌడ్ తనతో పాటు కొన్ని డ్రగ్స్ తీసుకువచ్చి ఫ్రాన్సిస్‌కు విక్రయించేవాడు. వీటిని ఇతడు విరివిగా వినియోగిస్తుండటంతో ఈ విషయం అందరికీ తెలిసింది. దీంతో ఇతడి స్నేహితులు, పరిచయస్తులు తమకూ డ్రగ్స్ కావాలని కోరేవారు. ఇలా డిమాండ్ పెరగడంతో అప్పటి వరకు డ్రగ్ వినియోగదారుడిగానే ఉన్న ఫ్రాన్సిస్ ఆపై పెడ్లర్‌గా మారి విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. అయితే గోవాకు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు ఇతడి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు లేకపోవడంతో కొత్త దందాకు శ్రీకారం చుట్టాడు. మారేడ్‌పల్లికి చెందిన విద్యార్థి గౌతమ్‌తో కలిసి ముఠా కట్టాడు. అదిలాబాద్ జిల్లాకు వెళ్లి అక్కడ ఉంటున్న సత్తార్ అనే వ్యక్తి నుంచి కేజీ రూ.4 వేల నుంచి రూ.5 వేలకు గంజాయి ఖరీదు చేసే వాడు. దీనిని బస్సుల్లో గోవాకు తరలించి కేజీ రూ.25 వేల నుంచి రూ.30 వేలకు రిటైల్‌గా చిన్న చిన్న ప్యాకెట్లలో ఉంచి అమ్ముతుండేవాడు. అలా వచ్చిన డబ్బుతో గోవాలో ఉండే అక్బర్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసేవాడు. అక్కడ తక్కువ ధరకు కొని నగరంలో రిటైల్‌గా ఎక్కువ రేటుకు అమ్ముతున్నాడు. హెరాయిన్ గ్రాము రూ.4 వేల నుంచి రూ.5 వేలకు కొని రూ.7 వేల నుంచి రూ.9 వేలకు, ఎల్ఎస్డీ బోల్డ్ ఒక్కోటి రూ.వెయ్యి నుంచి రూ.1500 కొని రూ.3 వేలకు, ఎక్స్టసీ ట్యాబ్లెట్స్ ఒక్కోటి రూ.1800 నుంచి రూ.2 వేలకు కొని రూ.3,500 విక్రయించేవాడు. కొన్నాళ్ళుగా గుట్టుగా సాగిస్తున్న వీరి వ్యవహారాలపై దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, మహ్మద్ థక్రుద్దీన్ తమ బృందాలతో దాడి చేసి శుక్రవారం ఫ్రాన్సిస్, గౌతమ్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి ఐదు గ్రాముల హెరాయిన్, 28 బోల్డ్‌ల ఎల్ఎస్డీ, 32 ఎక్స్టసీ ట్యాబ్లెట్స్, మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న గౌడ్, అక్బర్, సత్తార్ కోసం గాలిస్తున్నారు. ‘న్యూ’ పార్టీలపై నిఘా: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వీరు ఈ డ్రగ్ తీసుకువచ్చారు. ఈ వేడుకల నేపథ్యంలో సిటీలో డ్రగ్స్ క్రయవిక్రయాలు, వినియోగంపై నిఘా ఉంచాం. ఇప్పటికే ఈవెంట్లు నిర్వహించే పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, హోటల్స్ యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేశాం. న్యూ ఇయర్ పార్టీల్లో డ్రగ్స్ వినియోగం, మైనర్లు మద్యం తాగడం వంటివి లేకుండా చూడాలని స్పష్టం చేశాం.– అంజనీకుమార్, కొత్వాల్ -
కరకట్ట మీద డొంకలు కదులుతున్నాయి!
సాక్షి, తాడేపల్లి (మంగళగిరి): తాడేపల్లి పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ కరకట్ట మీద నివాసం ఉండే ఓ తల్లి తన కొడుకు ప్రవర్తనపై తాడేపల్లి పోలీసులకు అయిదు రోజుల క్రితం ఫిర్యాదు చేయడంతో, తాడేపల్లి పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. ఆ యువకుడిపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి, భారీగా గంజాయి పట్టుకున్నారు. బాధ్యులపై గురువారం కేసు నమోదుచేసి కోర్టుకు హాజరుపరిచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎన్టీఆర్ కరకట్ట మీద నివాసం ఉండే జున్ను పద్మ చిన్న కొడుకైన జున్ను తేజ అయిదు రోజుల క్రితం తల్లిపై చెయ్యి చేసుకుని, ఆమె వద్దనున్న డబ్బులు లాక్కొని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. వెంటనే ఆమె తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు తేజపై ప్రత్యేక నిఘా పెట్టారు. తల్లి ద్వారా మరికొంత డబ్బులు ఇప్పించగా, తేజ గంజాయి కొనుగోలు చేసేందుకు తాడేపల్లి పట్టణ పరిధిలోని అమరారెడ్డినగర్‌లో సన్నిధి నాగ అంజయ్య ఇంటికి వెళ్లాడు. అక్కడ నాగ అంజయ్య భార్య సంధ్యారాణి తేజకు గంజాయి ఇస్తుండగా పోలీసులు రెడ్హాండెడ్గా పట్టుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి వెంటనే ఇంట్లో తనిఖీలు చేయగా 3 కేజీల గంజాయి దొరికింది. అనంతరం తేజను మళ్లీ విచారించగా, విజయవాడ ప్రకాష్‌నగర్‌లో గంజాయి అమ్మే స్థలం తెలుసని చెప్పడంతో, ముందు పోలీసులు తేజాను పంపించి గంజాయి కొనుగోలు చేశారు. అక్కడ జొన్నలగడ్డ పద్మ ఇంట్లో తనిఖీ చేయగా, 3కేజీల 200 గ్రాముల గంజాయి దొరికింది. తిరిగి మళ్లీ తేజా విజయవాడలోని పైపులరోడ్డు తుపాకుల రామయ్య పార్కు వద్ద జొన్నలగడ్డ సారమ్మ ఇంటికి వెళ్లి గంజాయి కొనుగోలు చేస్తుండగా, అక్కడ దాడి చేసి 4కేజీల 700 గ్రాముల గంజాయితో పాటు, సారమ్మ ఇంట్లో గంజాయి అమ్మగా వచ్చిన రూ.1,42,800 స్వాదీనం చేసుకున్నట్లు తాడేపల్లి పోలీసులు తెలియజేశారు. తేజ ఇచ్చిన సమాచారం మేరకు గంజాయి విక్రయించే నలుగురిని, గంజాయి కొనుగోలు చేస్తున్న తేజాను, 10 కేజీల 900 గ్రాముల గంజాయిని, రూ.1,42,800 నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి, కోర్టుకు హాజరుపరిచినట్టు సీఐ అంకమరావు చెప్పారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజయవాడలో కూడా తనిఖీలు చేసినట్లు తెలిపారు. కేసులో కీలకపాత్ర పోషించిన సిబ్బందిని ఆయన అభినందించారు. -
రూ.50 ఇవ్వలేదని అంతమొందించారు
కర్ణాటక ,యశవంతపుర : గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు యువకులు రూ.50 కోసం స్నేహితుడినే అంతమొందించారు. ఈ ఘటన డీజేహళ్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. హతుడిని మహమ్మద్ వాసీం(16)గా గుర్తించారు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో నిందితులు వాసీం వద్దకు బైక్‌పై వచ్చారు. రూ.50 ఇవ్వాలని అడిగారు. తన వద్ద డబ్బు లేదని పేర్కొనడంతో గంజాయి మత్తులో ఉన్న నిందితులు వాగ్వాదానికి దిగి కత్తులతో పొడిచి ఉడాయించారు. తీవ్రంగా గాయపడిన వాసీం అక్కడికక్కడే మృతి చెందాడు. బెంగళూరు తూర్ప విభాగం డీసీపీ డాక్టర్ శరణప్ప ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హంతకుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు విలేకరులకు తెలిపారు. -
గంజాయికి బానిసలై.. స్మగ్లర్లుగా మారి..
నెల్లూరు (క్రైమ్): గంజాయికి బానిసైన ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు స్మగ్లర్లుగా అవతారమెత్తిన ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. సోమవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్రా మెమోరియల్ కాన్ఫరెన్స్ హాల్లో కావలి డీఎస్పీ డి.ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళానికి చెందిన ఎస్.పవన్‌కల్యాణ్, విశాఖపట్టణానికి చెందిన లోకనాథ్ అఖిల్, విజయనగరం జిల్లాకు చెందిన బి.రవితేజ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలానికి చెందిన అమర్నాథ్ (కారు డ్రైవర్) వేలూరులోని విట్ కళాశాలలో ఇంజనీరింగ్ చదివారన్నారు. వీరంతా అక్కడ చదువుతున్న సమయంలోనే గంజాయికి బానిసలయ్యారని తెలిపారు. మత్తుకు బానిసైన వీరు గంజాయి తామే సరఫరా చేస్తే, తమ అవసరాలు తీరడంతో పాటు అధికంగా డబ్బులొస్తాయని భావించి స్మగ్లర్లుగా అవతారమెత్తారని చెప్పారు. విశాఖ ఏజెన్సీలోని తమ స్నేహితుడి ద్వారా గంజాయిని కొనుగోలు చేసి రైలు, రోడ్డు మార్గాన వేలూరుకు తరలించేవారని తెలిపారు. విశాఖ ఏజెన్సీలో కేజీ రూ.3 వేలకు కొనుగోలు చేసి వేలూరులో రూ.25 వేలకు విక్రయిస్తున్నారని, రెండేళ్లుగా ఈ అక్రమ రవాణా నిరాటంకంగా సాగుతోందని వివరించారు. సరుకు తీసుకెళుతూ.. నిందితులు పవన్‌కల్యాణ్, లోక్‌నాథ్ అఖిల్, రవితేజ, అమర్నాథ్ అద్దెకు కారు తీసుకుని విశాఖ ఏజెన్సీలోని అరకులో గంజాయిని కొనుగోలు చేశారు. కారులో వేలూరుకు బయలు దేరారు. కావలి వద్ద కారును ఆపి తమ స్నేహితుడైన గంజాయి విక్రేత (మహారాష్ట్ర, పూణేకు చెందిన) ప్రత్యూష్ సిన్హాతో మాట్లాడుతుండగా.. అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేయడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో సోమవారం వారందరిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించగా ఈ వ్యవహారంలో మరికొంతమంది హస్తం ఉందని చెప్పడంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
గుట్టల్లో గుట్టుగా గంజాయి సాగు
నిజాంసాగర్ (జుక్కల్): జుక్కల్ మండలం కౌలాస్ ఖిల్లా అటవీ ప్రాంతంలోని పాండవుల గుట్టల్లో గుట్టుగా సాగు చేస్తున్న గంజాయి గుట్టును అధికారులు రట్టు చేశారు. రూ.5 లక్షల విలువైన గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. జిల్లా ఎన్ఫోర్స్మెంట్, బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో అధికారులు శనివారం మెరుపుదాడి చేశారు. పోచారం తండాకు చెందిన బార్దల్ నారాయణ కౌలాస్ అటవీ ప్రాంతంలో సాగు చేసిన 1.5 ఎకరాల్లో పత్తి పంటలో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నాడు. సమాచారమందుకున్న ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేసి, 1,050 గంజాయి మొక్కలను తొలగించి వాటిని కాల్చేశారు. నిందితుడు నారాయణపై కేసు నమోదు చేశామని, గంజాయి మొక్కల విలువ రూ.5 లక్షల వరకు ఉంటుందని ఎక్సైజ్ సీఐ సుధాకర్ తెలిపారు. -
80 కిలోల గంజాయి పట్టివేత
సాక్షి, హైదరాబాద్: విశాఖ నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో విక్రయిస్తున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.15.2 లక్షల విలువచేసే 80 కిలోల గంజాయి, కారు, రూ.4,200ల నగదు, నాలుగు సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. ఈ వివరాలను నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ మీడియాకు తెలిపారు. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం గుడెపు కుంట తండాకు చెందిన గుగులోతు సైదా నాయక్ అలియాస్ సైదా వృత్తి రీత్యా డ్రైవర్. అదే జిల్లా నూతంకల్ మండలం తీక్యా తండాకు చెందిన లవుడ్య అనిల్ కూడా డ్రైవర్. వీరిరువురు స్నేహితులు. ఈ ఇద్దరి ఆదాయం అంతంత మాత్రమే కావడంతో రవాణా రంగంలో ఉన్న సమయంలో విశాఖకు చెందిన గంజాయి విక్రయదారులతో ఏర్పడిన సత్సంబంధాలను ఉపయోగించి ఎక్కువగా డబ్బులు సంపాదించాలని ప్రణాళిక వేశారు. ఇందుకు వీరి స్నేహితులు సూర్యాపేట జిల్లాకే చెందిన లకావత్ వినోద్, లకావత్ హుస్సేన్‌ల సహకారం తీసుకున్నారు. ఇలా వీరు విశాఖ జిల్లా దారకొండ మండలం కొత్తూరు ఏజెన్సీ ప్రాంతం నుంచి అతి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్, నిజామాబాద్‌లోని కొందరికి అతి ఎక్కువ ధరకు విక్రయిస్తూ డబ్బులు సంపాదించడం మొదలెట్టారు. ఐదువేల లాభానికి విక్రయిస్తూ... విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి కిలో రూ.2 వేలకు కొనుగోలు చేసి తమ కొనుగోలుదారులకు దాన్ని రూ.7 వేలకు విక్రయిస్తున్నారు. ఇలా కొత్తూరుకు చెందిన శివ నుంచి 80 కిలోల గంజాయిని కొనుగోలు చేసి కారు డిక్కీలో, సైడ్ డోర్లో, సీట్ల కింద పెట్టి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్వోటీ, మీర్‌పేట పోలీసులు సంయుక్తంగా గాయత్రి నగర్లో తనిఖీలు చేపట్టి గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. ఆ వెంటనే నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిని కోర్టు ఎదుట హాజరుపరిచి జ్యుడీíÙయల్ రిమాండ్‌కు తరలించారు. -
జైల్లో ఇవేమిటి?
కర్ణాటక, బనశంకరి: బెంగళూరు శివార్లలోని పరప్పన అగ్రహార జైలంటే ఎంతో భద్రత కలిగిన కారాగారం. కానీ జైల్లో కత్తులు, సిగరెట్లు, గంజాయి తదితరాలు సులభంగా చేరిపోతున్న వైనం మరోసారి బయటపడింది. జైల్లో బుధవారం సీసీబీ పోలీసులు చేసిన దాడుల్లో వీటితో పాటు మొబైల్ సిమ్‌కార్డులు దొరికాయి. పలువురు ఖైదీల వద్ద, సెల్లలోను, బాత్రూంలు, రహస్య ప్రాంతాల్లో ఇవి లభించాయి. పరప్పన అగ్రహార జైలు నుంచి కొందరు ఖైదీలు నగరంలో నేర కార్యకలాపాలను తమ అనుచరుల ద్వారా నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో సీసీబీ జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్‌పాటిల్ నేతృత్వంలో జైలులో సోదాలు చేశారు. పలువురు ఖైదీలు దాచుకున్న 37 చాకులు,డ్రాగర్లు, గంజాయి, గంజాయి తాగే పైపు లు, మొబైల్సిమ్కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఎలా వెళ్తున్నాయి బెంగళూరు నగరంలో రౌడీ కార్యకలాపాల అణచివేతకు అప్పుడప్పుడు జైలులో తనిఖీలు చేస్తామని సందీప్‌పాటిల్ తెలిపారు. జైలులో ఉన్న బెంగళూరు రౌడీలను విచారిస్తున్నట్లు తెలిపారు. జైలులో స్వాదీనం చేసుకున్న వస్తువులు, సిమ్‌కార్డులు గురించి జైలులో ఉన్న ఉన్నతాధికారులతో సమాచారం సేకరిస్తున్నామని సందీప్‌పాటిల్ తెలిపారు. పరప్పన జైలులో ఎంతమంది సిబ్బందితో కాపలా పెట్టినా ఖైదీలు, రిమాండు ఖైదీలు సెల్ఫోన్ల ద్వారా నగరంలో నేర కలాపాలను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జైలు సిబ్బంది కుమ్మక్కు కావడంతో సులభంగా మొబైళ్లు, గంజాయి, కత్తులను కూడా లోపలికి వెళ్లిపోతున్నట్లు ఆరోపణలున్నాయి. కొందరు పేరుమోసిన ఖైదీలు జైలులో ఉంటూ మొబైల్ ద్వారా అండర్‌వరల్డ్ డాన్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. జైల్లో ఉండి నేరాలు చేయిస్తే సాక్ష్యాధారాలు దొరకవని నేరగాళ్ల ధీమా. -
సెల్‌ఫోన్ దొంగల అరెస్టు
బంజారాహిల్స్: గంజాయికి అలవాటు పడి సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను జూబ్లీహిల్స్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించార. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బంజారాహిల్స్ ఏసీపీ కే.ఎస్.రావు, ఇన్స్పెక్టర్ కె.బాలకృష్ణారెడ్డి, వివరాలు వెల్లడించారు. శ్రీకాకులం జిల్లా, జగన్నాథపుర గ్రామానికి చెందిన పెద్దింటి యాదగిరి సెంట్రింగ్ వర్కర్‌గా పనిచేస్తూ మూసాపేట యాదవ బస్తీలో తన స్నేహితుడు మహ్మద్ జజ్బార్ అహ్మద్‌తో కలిసి అద్దెకు ఉంటున్నాడు. ఇద్దరు కొంతకాలంగా గంజాయికి అలవాటు పడ్డారు. గంజాయి కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో సెల్ఫోన్ల చోరీకి పాల్పడుతున్నారు. గత నెల 26న బోరబండకు చెందిన సతీష్ అనే డ్రైవర్, జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్ 36లో నడిచి వెళుతుండగా బైక్‌పై వచ్చిన వీరు సెల్‌ఫోన్ లాక్కుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన క్రైమ్ పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. -
గంజాయి కావాలా నాయనా..!
సాక్షి.సిటీబ్యూరో: నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోను గుప్పుగుప్పు మంటు గంజాయిని పీల్చుతున్న యువత రోజు రోజుకూ పెరుగుతోంది.స్నేహితుల ప్రోద్బలంతో మొదట సిగరేట్‌తో ప్రారంభించి మద్యం దాని తరువాత గంజాయికి అలవాటు అవుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. ఎక్సైజ్, పోలీసులకు పట్టుబడిన గంజాయి కేసులలో 85 శాతంకు పైగా కళాశాల స్థాయి యువతనే ఉండటం గమనార్హం. గంజాయి సేవిస్తు పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ఇప్పించడం, తల్లిదండ్రులకు తెలియజేస్తున్నప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనబడటం లేదు. ఇటీవల పోలీసులు కొంత మందిపై పీడీ యాక్ట్‌లను సైతం నమోదు చేస్తున్నారు. అయినప్పటికీ గంజాయి సేవించేటువంటి యువత పెరుగుతున్నారు. ఒకప్పుడు నగరంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అమ్మేవారు కానీ నేడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుండటం వల్ల యువత సలువుగా దీనికి అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. 2017 సంవత్సరంలో 63 కేసులు నమోదు చేయగా, 2018లో 195 కేసులు నమోదు చేసి 416 మందిని అరెస్టు చేశారు. అదే విధంగా 2019 లో 130 కేసులు నమోదు చేసి 639 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారంగా మలుచుకుంటున్న వైనం గంజాయి సేవించే సమయంలోనే వాసన వస్తుంది కానీ తరువాత వాసన ఉండదు. దీని వల్ల గంజాయి తీసుకున్నట్లు గుర్తించడం కష్టం. దీనికి తోడు చాలా మంది యువత దీన్ని ఒక అనుభూతిగా భావించి అలవాటు అవుతున్నారు. గంజాయి మత్తుకు అలవాటు పడ్డటు వంటి కొంత మంది కళాశాలల విద్యార్ధులు, యువత దీన్ని ఒక వ్యాపారంగా కూడ మలుచుకుంటున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. గతంలో పట్టుబడిన చాలా కేసుల్లోను ఇది రుజువయిందని అంటున్నారు. దీనికి పెద్దగా పెట్టుబడి కూడ ఏమి లేకపోవడం, సులువుగా డబ్బులు వస్తుండటంతో దీనికి అలవాటు పడుతున్నారు. రూ. 500 నుంచి 1000 వరకు చేతిలో ఉంటే చాలు సరఫరా చేసే వారి నుంచి కొనుగోలు చేసి తమతో పాటు చదువుకునే తోటి విద్యార్ధులకు, ఫ్రెండ్స్ సర్కిల్లో పరిచయం ఉన్న వారికి అమ్ముతున్నారు. గల్లీ గల్లీలోను లభ్యం ఒకప్పుడు నగరంలోని ధూల్‌పేటతో పాటు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన గంజాయి అమ్మకాలు నేడు నగరం అంతటా విస్తరించాయి. గల్లీ గల్లీలోని పాన్ షాప్‌లు, కిరాణ దుకాణాలు, టీ స్టాల్లు గంజాయి అమ్మకాలకు అడ్డాలుగా మారిపోయాయి. పెద్దగా పెట్టుబడి లేకుండా సంపాదన కూడ అధికంగా ఉండటంతో గంజాయి అమ్మకాలకు అలవాటు పడుతున్నారు. టెక్నాలజీ వినియోగం గంజాయికి అలవాటు పడ్డటువంటి యువత అధిక శాతం మంది టెక్నాలజీని వినియోగించుకుంటున్నారు. వారికి కావాల్సిన గంజాయిని సెల్‌ఫోన్ , వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పట్టుబడే అవకాశం ఉండదని భావించి ఆర్డర్ చేసి గంజాయిని తెప్పించుకుంటున్నారు. కొంత మంది గంజాయి సేవించేటువంటి వారు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకుని దాంట్లో రిఫరెన్స్ ద్వారానే కొత్త వారిని చేర్చుతున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా కొత్త వారికి నేరుగా కాకుండా అప్పటికే పరిచయం ఉన్నటువంటి వారి ద్వారా మాత్రమే అమ్ముతున్నారు. ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ, డైరక్టరేట్ రెవెన్యూ ఇంటలిజెన్స్ శాఖల మధ్య సమన్వయ లోపం కొట్టోచ్చిన్నట్లు కనబడుతుంది. దీంతో గంజాయి రవాణ, అమ్మకాలు యధేచ్చగా కొనసాగుతున్నాయి. -
300 కేజీల గంజాయి పట్టివేత
మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ టోల్గేట్ వద్ద మంగళగిరి రూరల్ పోలీసులు మంగళవారం భారీగా గంజాయిని పట్టుకున్నారు. విశాఖపట్నం నుంచి చెన్నైకి కారులో గంజాయి తరలిస్తున్నారని సమాచారం అందడంతో మంగళగిరి రూరల్ సీఐ శేషగిరిరావు, తన సిబ్బందితో అప్రమత్తమయ్యారు. మంగళవారం తెల్లవారుజామున 2.45 గంటలకు స్టేషన్ నుంచి కాజ టోల్గేట్ వద్దకు వెళ్లే సమయంలో జాతీయ రహదారిపై పోలీసు వాహనం ఎదురు ఏపీ 16 ఏపీ 9599 నంబరు కారు వేగంగా వెళ్లడాన్ని గమనించారు. దీంతో పోలీసులు సినీఫక్కీలో ఆ వాహనాన్ని వెంబడించారు. వాహనం కాజ టోల్గేట్ 3వ కానా వద్ద ఆగి ఉండడంతో పోలీసు వాహనంలోని సిబ్బంది దిగి వాహనం వద్దకు వెళ్లేలోపే, స్కార్పియో వాహనంలోని ఇద్దరు వ్యక్తులు పోలీసు వాహనాన్ని గమనించి పారిపోగా పోలీసులు వారిని వెంబడించారు. ఆ సమయంలో బాగా చీకటిగా ఉండటంతో వారు తప్పించుకొని వెళ్లిపోయారు. పోలీసులు టోల్‌ప్లాజా కానా వద్ద ఆగి ఉన్న వాహనం వద్దకు చేరుకొని ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఆ వాహనాన్ని పక్కన పెట్టించారు. అనంతరం వాహనాన్ని తనిఖీ చేయగా, కారులో వెనుకవైపు భాగంలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. బ్రౌన్ కలర్ కవర్లలో గంజాయి ప్యాక్ చేసి ఉన్న 160 ప్యాకెట్లు కారులో లభ్యమైనట్లు పోలీసులు తెలియచేశారు. ఒక్కో ప్యాకెట్టు 2 కేజీల బరువుంటుందని, 300 కేజీలకు పైగానే ఈ గంజాయి ఉంటుందని ప్రాథమిక అంచనా వేశారు. కారులో ఏపీ 07 సీఎఫ్ 0445, ఏపీ 16 బీసీ 9388, టీఎన్ 67 ఎల్ 3435 నంబర్లతో ఉన్న మరో మరో మూడు నంబర్ ప్లేట్లను గుర్తించారు. ఎక్కడా పోలీసులకు అనుమానం రాకుండా నంబర్ ప్లేట్లు మార్చుకుంటూ వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కారు వెనుక వైపు అద్దంపై లాయర్లకు సంబంధించిన స్టిక్కరు అంటించి ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులు ఆ వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
గంజాయి మత్తు వదిలేనా..
సాక్షి సిటీబ్యూరో: దేశానికి రేపటి భవిష్యత్తును నిర్దేశించే యువత గంజాయి మత్తులో చిత్తవుతోంది. గంజాయి, డ్రగ్స్ మత్తులో ఉన్నప్పుడు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడటంతో పాటు విచక్షణ కోల్పోయి ఏమి చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. నగరంలో గంజాయి అమ్మకాలు, రవాణాకు ధూల్‌పేట్ కేంద్రంగా మారింది. ఆయా ప్రాంతాల్లో పలువురు స్మగ్లర్లు యథేచ్ఛగా ఈ దందా నిర్వహిస్తున్నారు. తక్కువ ధరలో సులువుగా గంజాయి లభిస్తుండటంతో యువత అధిక శాతం మంది దీనిపై ఆసక్తి చూపుతున్నారు. వీరికి అడ్డుకట్ట వేసేందుకు ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ శాఖ అధికారులు నిఘా తీవ్రతరం చేశారు. ఇందులో భాగంగా గంజాయి స్మగ్లర్లను గుర్తించి కేసులు పెట్టి జైలుకు పంపారు. అంతేగాక కొనుగోలు చేసేందుకు వస్తున్న యువకులను కూడా అదుపులోకి తీసుకుని వారిలో మొదటి సారి పట్టుబడినవారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి పంపుతున్నారు. రెండో సారి పట్టుబడితే సెక్షన్ 27,28 నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ 1985 కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. దీంతో పరిస్థితుల్లో కొంత మేర మార్పు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. గంజాయి అడ్డాలపై నజర్.... ధూల్‌పేటలో గంజాయి విక్రయ కేంద్రాలు, అనుమానిత వ్యక్తులపైన ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే గంజాయి అమ్మడం, రవాణా చేస్తున్న వారిని పట్టుకుని పలువురిపై కేసులు నమోదు చేయగా, మరికొందరిని జైలుకు పంపారు. అయినా అక్రమ సంపాదనకు అలవాటు పడిన వీరు యువలను లక్ష్యంగా చేసుకుని ఈ దందాను నడుపుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అధికారులు నిరంతర నిఘా ఏర్పాటు చేయడంతో ప్రతి రోజు 30 నుంచి 40 మంది గంజాయి కొనుగోలు చేస్తు లేదా సేవిస్తూ పట్టుబడుతున్నట్లు సమాచారం. 5 వేల మందికి కౌన్సెలింగ్... గడిచిన 16 నెలల్లో 5 వేల మంది ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ అధికారులకు పట్టుబడ్డారు. వారిలో 85 శాతం మంది 16 నుంచి 25 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. 25 నుంచి 40 ఏళ్ల లోపు వారు కేవలం 15 శాతం లోపు ఉంటున్నట్లు అధి కారుల గణాంకాలు పేర్కొంటున్నాయి. వీరిలో నూ ఎక్కువ శాతం మంది ఇంజినీరింగ్ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఉన్నారు. ఇలా పట్టుబడిన వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తు న్నారు. రెండవ సారి పట్టుబడితే కేసులు నమోదు చేయడంతో పాటు జైలుకు పంపిస్తున్నారు. ఇలా వరుసగా పలుమార్లు పట్టుబడిన 30 మందిపైన కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు. ఎస్ఎంఎస్ల ద్వారా అవగాహన... ఎక్కువ శాతం మంది యువతకు కళాశాలల్లో పరిచయం అయ్యే స్నేహితుల ద్వారానే ఒకరి నుంచి మరొరు గంజాయికి అలవాటు పడుతున్నట్లు సమాచారం. వాట్సాప్, సెల్‌ఫోన్ ద్వారా గంజాయి విక్రేతలను సంప్రదించి కొనుగోలు కోసం ధూల్‌పేటకు వస్తూ ఎక్సైజ్ అధికారులకు చిక్కుతున్నారు. ఒక్క సారి పట్టుబడిన వారి నుంచి ఆధార్ కార్డు , సెల్‌ఫోన్ నెంబర్‌ను తీసుకున్న అధికారులు వారి ఫోన్లకు ‘గంజాయి సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదని, యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచిస్తూనే ధూల్‌పేటకు గంజాయి కొనుగోలు కోసం రావద్దని ఇక్కడ నిత్యం నిఘా పెంచామని, పట్టుబడితే చట్ట ప్రకారం కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని’ మేసేజ్‌లు పెడుతున్నారు. దీంతోపలువురు గంజాయి కొనుగోలు కోసం రావడం మానుకున్నారని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. ఓ కంట కనిపెట్టాలి తల్లిదండ్రులు తమ పనుల్లో బిజీగా ఉన్నా పిల్లలపై దృష్టి సారించాలి. పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు పడినట్లు అనుమానం వస్తే వెంటనే వారిని కౌన్సిలింగ్, రిహాబిలిటేషన్ సెంటర్లకు తీసుకెళ్లాలి. కళాశాలల్లోనూ యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్లను నిర్వహించాలి. అధ్యాపకులు విద్యార్థుల ప్రవర్తనను గమనించి వారిలో మార్పు కోసం కృషి చేయాలి.–నవీన్ నాయక్, ధూల్‌పేట ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఎస్హెచ్ఓ -
రాజధానిలో.. డ్రగ్ కల్చర్!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరం డ్రగ్‌కల్చర్ విషయంలో ఇతర మెట్రోపాలిటన్ సిటీల సరసన చేరుతోందా..? ఔననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓపక్క పోలీసులు వీటికి అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నా... ఈ దందా మాత్రం ఆగడం లేదు. ఎక్సైజ్ అధికారులు సోమవారం ఏకంగా 254 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. నగరంలో డిమాండ్ నేపథ్యంలో డ్రగ్ మాఫియా వ్యవస్థీకృతంగా దందా సాగిస్తున్నట్లు సమాచారం. నైజీరియన్లను పెడ్లర్స్‌గా మార్చుకుని వీరు వ్యవహారాలు కొనసాగిస్తున్నారు. మాదకద్రవ్యాల వినియోగంలో గంజాయి, చెరస్, కొకైన్ మొదటి మూడు స్థానాల్లో నిలుస్తున్నాయి. నార్కొటిక్స్ వినియోగమే ఎక్కువ... చెలామణిలో ఉన్న మాదకద్రవ్యాల్లో ప్రధానంగా రెండు రకాలున్నాయి. చెట్ల నుంచి లభించే పదార్థాలతో తయారయ్యే నార్కోటిక్ సబ్స్టాన్సస్, ప్రయోగశాలల్లో తయారు చేసే సైకోట్రోపిక్ సబ్స్టాన్సస్. గాంజ (గంజాయి), ఓపియం (నల్లమందు), కొకైన్‌లతో పాటు గంజాయితో తయారు చేసే చెరస్, హషీష్ ఆయిల్, బంగ్, నల్లమందు ద్వారా ఉత్పత్తి చేసే బ్రౌన్ షుగర్, హెరాయిన్... ఇవన్నీ నార్కొటిక్స్ కిందకి వస్తాయి. కెటామిన్, ఎపిడ్రిన్, పెథిడిన్ తదితరాలు సైకోట్రోపిక్స్ కోవకు చెందుతాయి. రాజధానిలో నార్కోటిక్స్ వినియోగమే ఎక్కువగా ఉండగా వీటిలోనూ గాంజ, చెరస్, కొకైన్లను విచ్చలవిడిగా వాడుతున్నారు. లోకల్, ఇంపోర్టెడ్... నార్కోటిక్స్‌లో గాంజకు సంబంధించిన ఉత్ప త్తులు ప్రధానంగా హిమాచల్‌ప్రదేశ్ నుంచి సరఫరా అవుతున్నాయి. వరంగల్, మెదక్, జహీరాబాద్‌లతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల నుంచి గంజాయి సరఫరా జరుగుతుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో పండే గంజాయితో పాటు అక్కడ తయారయ్యే చెరస్, హషీష్ ఆయిల్‌కు మంచి డిమాండ్ ఉంది. వీటి వినియోగం ఎక్కువగా ఉన్నప్పటికీ... ఓపియం సహా దాని సంబంధిత ఉత్పత్తులైన బ్రౌన్‌షుగర్, హెరాయిన్ల చెలామణి తక్కువగా ఉంటోంది. కోకా చెట్టు నుంచి తీసే కొకైన్ కేవలం దక్షిణ అమెరికాలోనే ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది. షిప్మెంట్ ద్వారా రవాణా... కొకైన్‌ను గతంలో విమానాల ద్వారా స్మగ్లింగ్ చేసే వారు. అయితే ఇటీవలి కాలంలో విమానాశ్రయాల్లో నిఘా పెరగడంతో షిప్‌మెంట్స్ ద్వారా రప్పిస్తున్నారు. దక్షిణ అమెరికా నుంచి హాంకాంగ్‌కు అక్కడి నుంచి భారత్‌కు వచ్చి చేరుతోంది. దీనిని పలు రకాలుగా రవాణా చేస్తున్నప్పటికీ... ఇటీవల కాలంలో ‘పుస్తక రవాణా’ పెరిగిందని పోలీసులు చెబుతున్నారు. తెల్లని పొడిలా ఉండే కొకైన్‌ను బౌండ్ పుస్తకాల పేజీలకు పూత మాదిరి పూస్తున్నారు. అలా ఒక్కో పుస్తకంలోనూ దాదాపు 200 గ్రాముల వరకు పూత పూయవచ్చు. ఆ పుస్తకాలను పార్శిల్ చేసి లేదా మహిళా ట్రాన్స్పోర్టర్ల ద్వారా షిప్పుల్లో భారత్‌కు చేరుస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత టిష్యూ పేపర్లపై ఆ పొడిని దులిపి ప్యాక్ చేసి విక్రయిస్తారు. నైజీరియన్ మాఫియా... ముంబై, గోవా, ఢిల్లీ, ఛండీఘడ్ ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరాకు సంబంధించి ప్రధాన డీలర్లు ఉంటున్నారు. దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వీరి డ్రగ్ నెట్‌వర్క్‌లో నైజీరియన్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిని వివిధ వీసాలపై భారత్ రప్పిస్తున్నారు. అలా వచ్చిన వారి పాస్‌పోర్టులను డిపాజిట్ చేయించుకుని వివిధ నగరాల్లో ప్లేస్‌మెంట్స్ ఇస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రిటైల్ వ్యాపారం వీరికి అప్పగిస్తూ బస్సులు, రైళ్ల ద్వారా డ్రగ్‌ను అక్కడికి చేరుస్తున్నారు. విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తాన్ని హోల్‌సేల్ పెడలర్స్‌కు పంప డం, వారిచ్చే కమీషన్ తీసుకోవడం వీరి పని. ఈ నైజీరియన్లు పట్టుబడినప్పటికీ తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ గుర్తింపును హోల్‌సేలర్లు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. వీకెండ్స్‌లో భారీ డిమాండ్... ఈ మాదకద్రవ్యాలకు వీకెండ్స్‌లో భారీ డిమాండ్ ఉంటోంది. శని, ఆదివారాల్లో రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు పెడలర్స్ వ్యాపారం చేస్తుంటారు. ఫోన్‌కాల్స్‌పై వచ్చే ఆర్డర్స్ ఆధారంగా కేవలం పరిచయస్తులకు మాత్రమే వీటిని విక్రయిస్తారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లతో పాటు పంజగుట్ట ప్రాంతాల్లోని వీఐపీలు, సినీ ప్రముఖులతో పాటు వారి పిల్లలువీటిని ఎక్కువగా వినియోగిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. నగరంలోని పబ్లతోపాటు శివార్లలోని ఫామ్‌హౌస్‌లు, రిసార్టుల్లో జరిగే రేవ్ పార్టీల్లో వీటి వినియోగం సర్వసాధారణమైంది. రీటైల్ డ్రగ్స్ మార్కెట్... గంజాయి: రూ.4 వేల నుంచి రూ.5 వేలు (కేజీ) చెరస్: రూ.60 వేల నుంచి రూ. లక్ష (కేజీ) హషీష్ ఆయిల్: రూ.80 వేల నుంచి రూ.1.2 లక్షలు (కేజీ) బంగ్: రూ.50 నుంచి రూ.70 (ఒక్కో టాబ్లెట్) కొకైన్: రూ.5 వేల నుంచి రూ.10 వేలు (గ్రాము) బ్రౌన్‌షుగర్: రూ.12 వేల నుంచి రూ.15 వేలు (గ్రాము) హెరాయిన్: రూ.11 వేల నుంచి రూ.18 వేలు (గ్రాము) మారుపేర్లు, ప్రభావాలు... హెరాయిన్: బ్లాక్ ట్రా, చివా, నెగ్రా, హార్స్ మారుపేర్లు. కరగబెట్టి ఇంజెక్షన్ చేసుకోవడం (ఇంజెక్టింగ్), ముక్కుతో పీల్చడం (నోజింగ్), సిగరెట్లో నింపుకుని కాల్చడం (స్మోకింగ్) ద్వారా సేవిస్తారు. హెరాయిన్‌ను ఎక్కువగా వినియోగిస్తే శ్వాసకోస వ్యాధులు, చర్మ వ్యాధులతో పాటు కోమాలోకి వెళ్లి మరణం సైతం సంభవిస్తుంది. కొకైన్: స్టఫ్, కోకి, ఫ్లాకీ, స్నో, కోకా, సోడా మారుపేర్లు. ముక్కుతో పీల్చడం, సిగరెట్లో నింపుకుని కాల్చడం, వైన్‌లో కలుపుకుని తాగడం (స్పైకింగ్) ద్వారా సేవిస్తారు. దీని వినియోగం పెరగడం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తిని కోల్పోవడంతో పాటు అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. గండె సంబంధ వ్యాధులు త్వరగా వస్తాయి. గాంజ, చెరస్: ఓ మాల్గా ప్రాచుర్యంలో ఉంది. ఈ ఆకులను సిగరెట్లో నింపుకుని కాలుస్తారు. ఈ చెట్టు నుంచి కారే బంక నుంచి చెరస్ ఉత్పత్తి అవుతుంది. దీని నేరుగా తీసుకోవడం లేదా సిగరెట్ ద్వారా సేవిస్తారు. ఇవి ఊపిరితిత్తులు, మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. -
దమ్ మారో దమ్!
నగరంలో ‘గంజాయి మత్తు’ ఎక్కువైంది. తక్కువ ధరలకు లభిస్తున్న ఈ మత్తు పదార్థం యువతను చిత్తు చేస్తోంది. స్కూలు విద్యార్థులు సైతం దీనికి బానిసలవుతున్నారు. నగరంలో వాడుకలో ఉన్న, చిక్కుతున్న మాదకద్రవ్యాల్లో గంజాయి మొదటి స్థానంలో ఉండడం ఇందుకు నిదర్శనం. రాజధాని నగరంలో మాదకద్రవ్యాలు రాజ్యమేలుతున్నాయి. వీటిలో వివిధరకాలైన డ్రగ్స్‌కు యువతతో పాటు స్కూలు విద్యార్థులు బానిసలుగామారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తక్కువ ధరకు లభించడం, తేలిగ్గావినియోగించేందుకు వీలుగా ఉండడంతో అత్యధికులు గంజాయికిబానిసలవుతున్నారు. నగరంలో వాడుకలో ఉన్న, చిక్కుతున్న మాదకద్రవ్యాల్లో గంజాయి మొదటి స్థానంలో ఉండడం ఇందుకు నిదర్శనం. కేంద్రం అధీనంలో పనిచేసే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూఇంటెలిజెన్స్(డీఆర్ఐ) సైతం గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టిపెడుతున్నాయంటే నగరంలో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గంజాయి వాడుతున్న వారిలో అత్యధికులు విద్యార్థులు అందులోనూ మైనర్లు కావడం ఆందోళన కలిగిస్తోంది. సాక్షి, సిటీబ్యూరో :సిటీలో చేతులు మారే మాదకద్రవ్యాల్లో ప్రధానంగా రెండు రకాలున్నాయి. వృక్షాల నుంచి లభించే పదార్థాలతో తయారయ్యే నార్కోటిక్ సబ్స్టాన్సస్. ప్రయోగశాలల్లో తయారు చేసే సైకోట్రోపిక్ సబ్స్టాన్సస్. మొక్క నుంచి ఉత్పత్తయ్యే గంజాయి నార్కోటిక్స్ కేటగిరీలోకి వస్తుంది. దీన్ని ఉత్పత్తి, రవాణా, విక్రయం సైతం అత్యంత తేలికగా మారిపోయింది. అత్యధికులు గంజాయిని నేరుగా తీసుకుంటుండగా.. కొంత మంది మాత్రం దీని అనుబంధ ఉత్పత్తులైన చెరస్, హషీష్ ఆయిల్, బంగ్ తదితరాలను వాడుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల సైకోట్రోపిక్ సరఫరా, వినియోగంపై నిఘా ముమ్మరం కావడంతో గంజాయి వినియోగం పెరిగినట్లు పోలీసులు గుర్తించారు. సిగరెట్‌తో ప్రారంభమై బానిసలుగా.. గంజాయికి బానిసలుగా మారుతున్న వారిలో విద్యార్థులు సైతం ఎక్కువగా ఉంటున్నారు. వీరు ఈ మత్తుకు దశల వారీగా అలవాటుపడి బాసిసలుగా మారుతున్నారని పోలీసులు వివరిస్తున్నారు. హైస్కూల్, జూనియర్ కాలేజీ స్థాయికి వచ్చిన తర్వాత ప్రాథమికంగా సిగరెట్ అలవాటు చేసుకుని.. సొంతంగా ప్రేరణ పొందడం, స్నేహితులు ప్రేరేపించడం ద్వారా వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. కొన్నాళ్లకు సిగరెట్ నుంచి హుక్కా పార్లర్ వైపు వీరి అడుగులు పడుతున్నాయి. అక్కడే గంజాయి అలవాటు చేసుకుంటున్నారు. ఇది ప్యాషన్‌గా ప్రారంభమై కాలానుగుణంగా బానిసలైపోతున్నారు. అనేక మార్గాల్లో సిటీకి రవాణా సిటీలోకి అనేక పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఉన్న పాన్ డబ్బాలు, ఇతర దుకాణాలే గంజాయి విక్రయ కేంద్రాలుగా ఉంటున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అత్యంత రహస్యంగా, కేవలం పరిచయం ఉన్న, పాత వినియోగదారులకు మాత్రమే దీన్ని అమ్ముతున్నట్టు పోలీసుల మాట. ఒకప్పుడు వరంగల్, మెదక్, జహీరాబాద్ ప్రాంతాల నుంచి గంజాయి సిటీకి వచ్చేది. ఇటీవల ఇక్కడ సాగు కనుమరుగవడంతో విశాఖజిల్లా ఏజెన్సీ ప్రాంతంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల నుంచి గంజాయి సరఫరా అవుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ప్రత్యేక వాహనాలు, ఆర్టీసీ/ప్రైవేట్ బస్సులతో పాటు రైళ్లల్లోనూ భారీ మొత్తంగా గంజాయి సిటీకి అక్రమ రవాణా అవుతోంది. పర్యవేక్షణ లేక పెరిగిన వినియోగం యువత ప్రధానంగా విద్యార్థులు గంజాయితో పాటు ఇతర మాదకద్రవ్యాలను బానిసలుగా మారడానికి ప్రధాన కారణం పర్యవేక్షణ కొరవడటమే అని పోలీసులు వివరిస్తున్నారు. ఇటు ఇళ్లు, అటు పాఠశాలల్లోనూ వీరి కదలికల్ని కనిపెట్టే విధానాలు కొరవడ్డాయి. అడిగినంత పాకెట్ మనీ ఇస్తూ, ప్రైవసీ పేరుతో ప్రత్యేకంగా గదులు కేటాయిస్తున్న కుటుంబాలతో పాటు తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులైన సందర్భాల్లోనూ పిల్లలపై పర్యవేక్షణ లేక పెడదారి పడుతున్నారు. తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్స్, చిన్నపాటి గదుల్లో ఉంటున్న వారూ దీనికి అలవాటు పడుతున్నారు. తల్లిదండ్రుల తర్వాత పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టాల్సిన ఉపాధ్యాయులు, స్కూలు యాజమాన్యాలు సైతం కేవలం విద్యాబోధన వరకే పరిమితం అవుతున్నాయి. ఇదో మైనర్ కథ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న ఓ మైనర్ డ్రగ్ పెడ్లర్‌గా మారాడు. గంజాయితో మొదలెట్టి మాదకద్రవ్యమైన ఎక్స్టసీని తాను వినియోగించడంతో పాటు మరికొందరికి విక్రయించడం ప్రారంభించాడు. చివరకు గతనెలలో ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కాడు. తార్నాక నాగార్జుననగర్‌కు చెందిన ఓ మైనర్ పదో తరగతిలో ఉండగానే హుక్కాకు అలవాటుపడ్డాడు. శివంరోడ్‌లోని ఓ హుక్కా పార్లర్‌కు రెగ్యులర్ కస్టమర్‌గా మారాడు. కొన్నాళ్లకు హుక్కాతో పాటు గంజాయికీ బానిసయ్యాడు. ధూల్‌పేట ప్రాంతానికి చెందిన కిషోర్ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనేవాడు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో తన ఇంటిపై ఉన్న గదిలోనే స్నేహితులతో కలిసి హుక్కా, గంజాయి పీల్చేవాడు. ఇతడికి మెహదీపట్నం ప్రాంతానికి చెందిన హన్నన్ అనే వ్యక్తితో పరిచయమైంది. ఇతడి నుంచి ఎక్స్టసీ, ఎల్ఎస్డీ వంటి మాదకద్రవ్యాలు కొనడం ప్రారంభించిన మైనర్.. తొలినాళ్లలో తానే వినియోగించేవాడు. కొన్నాళ్లకు విక్రేతగా మారి పోలీసులకు చిక్కాడు. కస్సోల్లో ఖరీదైన గంజాయి స్థానికంగా లభిస్తున్న గంజాయి ధర తక్కువగా ఉంటోంది. కొకైన్, హెరాయిన్, బ్రౌన్‌షుగర్, ఎల్ఎస్డీ, ఎండీఎంఏ తదితర మాదకద్రవ్యాలు ఖరీదు చేయాలంటే గ్రాముకు లేదా డోస్‌కు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు చెల్లించాలి. దీంతో దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి యువత, విద్యార్థులు గంజాయి వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. కేవలం రూ.500 వెచ్చిస్తే 100 గ్రాములు దొరికే అవకాశం ఉండటం, బహిరంగానైనా దీన్ని సిగరెట్లలో పెట్టుకుని కాల్చే అవకాశం ఉండటంతో ఇటువైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. విద్యార్థి దశలో ప్రారంభమైన ఈ అలవాటు ఎన్నేళ్లయినా కొనసాగుతోంది. ఉన్నత వర్గాలకు చెందిన వారిలోనూ గంజాయి బానిసలు ఉన్నప్పటికీ.. వారు వినియోగించేది మాత్రం హిమాచల్‌ప్రదేశ్‌లోని కస్సోల్ ప్రాంతంలో నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇది 100 గ్రాములు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుందని, సిటీలో దీని వినియోగం అత్యంత తక్కువని పోలీసులు చెబుతున్నారు. నగరంలో గంజాయికి ‘ఓ మాల్’ అనే కోడ్ ఉంది. ఈ పేరుతోనే పాన్ డబ్బాలు, దుకాణాల ద్వారా విక్రయం జరుగుతోందని సమాచారం. ఓసీబీ స్లిప్‌లకు మహా డిమాండ్ సాధారణ సిగరెట్లలో నింపుకుని గంజాయి కాల్చే వారితో పాటు ఓసీబీ స్లిప్స్‌లో పెట్టి కాల్చే వారి సంఖ్యా పెరుగుతోంది. గంజాయిని చేతిలో వేసుకుని నలిపిన తర్వాత దాన్ని ఓసీబీ స్లిప్‌లో చుట్టి సిగరెట్ తరహాలో కాలుస్తారు. మామూలు కాగితం మంట అంటుకుంటే వేగంగా కాలిపోతుంది. ఈ ఓసీబీ స్లిప్ ప్రత్యేకమైన కాగితం కావడంతో గంజాయి నింపినప్పుడు సిగరెట్ తరహాలో ఆరిపోకుండా వెలుగుతాయి. పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఉన్న దుకాణాల్లో ‘ఓ మాల్’తో పాటు ఓసీబీ స్లిప్స్ కూడా విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ‘మచ్చ’తునకలివిగో.. ♦ సాఫ్ట్వేర్, ఫ్యాషన్ డిజైనింగ్ రంగాల్లో పనిచేస్తున్న ఐదుగురు యువతీ యువకులు తమ ఫ్లాట్స్‌లో గంజాయి కాల్చుతూ కేపీహెచ్‌బీ పోలీసులకు చిక్కారు. ♦ బెంగళూరులోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న తార్నాక వాసిని 200 గ్రాముల గంజాయితో ఎల్బీనగర్ పోలీసులు పట్టుకున్నారు. ♦ దోమలగూడ ఏవీ కాలేజీలో ఎల్ఎల్బీ చదువుతున్న విద్యార్థి గంజాయి కాలుస్తూ ఆదిభట్ల పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతడి స్వస్థలం కరీంనగర్ జిల్లా చెందౌలి. ♦ మమతానగర్ కాలనీలోని ఎన్విరాన్ టవర్స్‌లోని ఓ గదిలో నివసిస్తున్న ఐదుగురు విద్యార్థులు గంజాయికి అలవాటుపడి, అది సేవిస్తూ ఎల్బీనగర్ పోలీసులకు చిక్కారు. ♦ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ సమీపంలో ఉన్న ఓ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు గంజాయితో అరెస్టు అయ్యారు. గంజాయిని నేరుగా అమ్మితే చిక్కే ప్రమాదం ఉందనే ఉద్దేశంలో పెడ్లర్స్ వివిధ రూపాల్లో సంగ్రహించి విక్రయాలు చేస్తున్నారు. ఇటీవల విశాఖపట్నం సమీపంలోని అరకు నుంచి గంజాయి అనుబంధ ఉత్పత్తి అయిన ‘హష్ ఆయిల్’ను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. అలాగే గంజాయిని చాక్లెట్ల రూపంలో మార్చి పాన్‌షాపుల ద్వారా అమ్ముతున్న ఉదంతాలూ వెలుగులోకి వచ్చాయి. ఫతేనగర్‌లోని రెండు దుకాణాలపై దాడి చేసిన ఎక్సైజ్ పోలీసులు 1480 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని పెడ్లర్లు నగరంతో పాటు శివార్లలోని విద్యార్థులు, యువత, ఐటీ ఉద్యోగులే టార్గెట్‌గా అమ్ముతున్నట్లు గుర్తించారు. రిహాబిలిటేషన్ సెంటర్ అవసరం చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు గంజాయి, మాదకద్రవ్యాలకు బాసిలయ్యారని తెలిసినా పిల్లలకు ట్రీట్మెంట్ చేయించేందుకు ముందుకు కావడంలేదు. బయటకు తెలిస్తే తమ పరువు పోతుందనే ఉద్దేశంతో పాటు రిహాబిలిటేషన్ సెంటర్లకు వెళ్లే స్థోమత లేకపోవడమూ దీనికి కారణంగా మారుతోంది. మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి పోలీసు విభాగం ‘భరోస’ సెంటర్ ఏర్పాటు చేసింది. అన్ని రకాలైన సహాయ సహకారాలనూ ఒకే గొడుకు కిందికి తేవడంతో పాటు గోప్యతను పాటిస్తోంది. సిటీలో పెరిగిన డ్రగ్ కల్చర్ నేపథ్యంలో మాదకద్రవ్యాలకు బాసిసలైన వారిని మార్చడంతో పాటు ఈ సంస్కృతిని కూకటివేళ్లతో పెకిలించేందుకు ‘భరోస’ తరహాలోనే డ్రగ్స్ బానిసల కోసమూ ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసి ఉచిత సేవలు అందించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. మత్తుకు బానిసలైన వారు మాదకద్రవ్యాల వినియోగదారులుగా మారిన కొందరు ఆ డబ్బుల కోసం వాటినే అమ్ముతున్నారు. ఇలాంటి అనేక ముఠాలను పోలీసులు పట్టుకుంటున్నారు. తాజాగా ఈ నెల 2వ తేదీన చిక్కిన గ్యాంగ్ ఇందుకు ఉదాహరణ. ఫిల్మ్‌నగర్‌లో ఉండే ఎలక్ట్రీషియన్ కె.భాస్కర్ ఓ షేరింగ్ రూమ్‌లో స్నేహితుడైన ఎం.విశాల్‌తో కలిసి ఉంటున్నాడు. మత్తుకు బాసిసలుగా మారిన వీరు గంజాయికి అలవాటుపడ్డారు. ఈ వ్యసనంతో పాటు ఇతర ఖర్చులూ పెరిగిపోవడంతో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. వీటి నుంచి బయటపడేందుకు వారే డ్రగ్ పెడ్లర్స్‌గా మారారు. వీరితో పాటు మరో ఇద్దరిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు నాలుగు రకాల మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మత్తు.. యువత చిత్తు
ఫ్రెండ్ పుట్టిన రోజనో.. శుభకార్యమనో.. లేక బాధకర సందర్భమో గానీ.. ‘నిషా’ అందిస్తున్న మత్తు అనే స్నేహహస్తం.. యవతను ‘ఉన్మత్తు’ ఆగాధంలోకి లాగేస్తోంది. చివరకు బతుకునే ఉప్పెనలా ముంచేస్తోంది. ఈ ఉచ్చులో పడిన వారి బతుకు అర్ధంతరంగా ముగిసిపోతోంది. ఈ విషయంలో మద్యం ప్రధాన పాత్ర పోషిçస్తుంటే.. గంజాయి, డ్రగ్స్ విపత్తు తక్కువేం కాకుండా ఉంది. మంచిర్యాలక్రైం :మత్తుకాటుతో యువత చిత్తవుతోంది. సరదాగా ప్రారంభమైన ఈ వ్యసనం.. చివరకు అలవాటుగా మారి ఆరోగ్యాన్ని బలి తీసుకుంటోంది. ఏటా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న వారిలో 70శాతం మంది 35 ఏళ్ల లోపువారే కావడం ఆందోళన కలిగించే ఆంశం. ఈ బాధితుల్లో 80శాతం మంది మద్యం, దుమపానం వంటి వ్యసనాల కారణంగానే అనారోగ్యం బారినా పడుతున్నారని వైద్యవర్గాలు వెల్లడిస్తున్నాయి. పుట్టిన రోజు.. అమ్మాయికి ప్రపోజ్ చేసినరోజు.. పెళ్లిరోజు.. ఇలా ఏ చిన్న సందర్భం దొరికినా.. మందుతాగేవారు కొందరుంటే.. స్నేహితులు బలవంతం చేశారని మరికొందరు వ్యసనం బారినపడుతున్నారు. ఒక్క గ్లాస్‌తో మొదలవుతున్న ఈ వ్యసనం.. జీవితాన్ని ఆసుపత్రిపాలుచేసే వరకూ కొనసాగుతోంది. సరదాగా ప్రారంభమవుతున్న ఈ అలవాట్లు చివరికి ఎందరి జీవితాలకో శాపంగా మారుతున్నాయి. చాలామంది సరదాగా గ్లాస్ పట్టి చివర కు దేవదాసులై పోతున్నారు. ఒక వ్యక్తి రోజుకు 360ఎంఎల్ మద్యం తీసుకుంటే కొన్నాళ్ల తర్వాత మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా ప్రతిరోజూ మద్యం సేవిస్తున్నవారిలో 35 ఏళ్ల యువకులు 60శాతం ఉండడం విచారకరం. బాధితుల్లో దాదాపు 90 శాతం మద్యంతోపాటు ధూమపానం, గంజాయి, డ్రగ్స్, ఎక్కువగా ఉంటున్నారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. చిన్న వయసులోనే ఉద్యోగం, ఉపాధి పొందినవారు ఎక్కువ శాతం మత్తుకు బానిస అవుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. సినిమాలు, ఇంటర్నెట్ ప్రభావం విస్తృతమయ్యాక ‘పార్టీల’ సంస్కృతి పెరిగింది. ఇటీవల లేట్‌నైట్ పార్టీ కల్చర్ యువతను ఆకుట్టుకుంటోంది. దీంతో ప్రతి ఆనందానికి మ ద్యం గ్లాసులు గలగలలాడుతున్నాయి. నలు గురు స్నేహితులు కలిస్తే చాలు.. మందు పార్టీ ఇప్పుడు ఫ్యాషన్‌గా తయారవుతోంది. గతంలో పోల్చితే మత్తు బారిన పడుతున్న యువత సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రోజుమం దు తాగేవారు.. సిగరెట్ కాల్చేవారు ఒకేసారి మానేసినా మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. చేతులు, కాళ్లు వణకడం, పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం, ఒంటరితనంగా ఫీలవ్వడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వారిని గుర్తించి తక్షణమే మానసిక వైద్యనిపుణులకు చూపించాలని సూచిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలోనే పగ్గాలు ముఖ్యం మత్తుకు బానిసై తీవ్ర మానసిక సమస్యలకు దారితీయకముందే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నా రు. అతిగా మద్యం, పొగ, గంజాయి, డ్రగ్స్ వంటి మ త్తు పదార్థాలు తీసుకోవడం వల్ల శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలూ తలెత్తుతాయి. ఇలాంటి వా టిని ఫ్రాథమిక స్థాయిలో గుర్తించాల్సిన అవసరం ఉం ది. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రా త్రివేళల్లో పార్టీలంటూ తరచూ పిల్లలు స్నేహితుల్లో కలి సి బయటకు వెళ్తుంటే ఆలాంటి వారిపై ఓ కన్నేసి ఉం చాల్సిందే. ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తలు ఉద్యోగులైతే పిల్లల్ని అశ్రద్ధ చేయడం కనిపిస్తోంది. దీంతో వారి లో తాము ఒంటరి అనే భావన కలిగి చివరికి చెడు వ్యసనాలకు అలవాటుపడుతారు. ఇంట్లో పెద్దలకు సమ యం లేకపోయినప్పటికీ పిల్లలతో గడిపేందుకు ప్రణా ళిక వేసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం వారంలో ఒకరోజైనా పూర్తిగా వారితో గడపాలని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చిన్నప్పటినుంచే విలువలు నేర్పిస్తూ పిల్లలకు తల్లిదండ్రులే ఆదర్శంగా నిలువాలని సూచిస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు మందు, గుట్కా, సిగరెట్ వంటి మత్తు పదార్థాలు తీసుకుంటుంటారు. ఇది కూడా వారిపై ప్రభావం చూపుతోంది. యువత జోగుతోందిలా.. మంచిర్యాల జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న డ్రంకెన్‌డ్రైవ్ కేసుల్లో ప ట్టుబడుతున్న వారిలో 35ఏళ్లలోపు ఉన్నవారే అధికంగా ఉంటున్నారని పోలీస్‌వర్గాలు చెబుతున్నాయి. జిల్లా వాణిజ్య, వ్యాపారరంగంలో దినదినం అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ ప్రధానంగా సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి. జిల్లాలో 7.30లక్షల జనాభా ఉండగా సుమారు 2 లక్షలకుపైగా ప్రభుత్వ, సింగరేణి, ప్రైవేటు ఉద్యోగులు ఉన్నారు. సింగరేణి ప్రాంతానికి చెందిన యువత మద్యం, డ్రగ్స్‌కు బానిసవుతున్నట్లు తెలుస్తోంది. మంచిర్యాల, శ్రీరాంపూర్, సీసీ, బెల్లంపల్లి, మందమర్రి పోలీసులు ఇటీవల మద్యంమత్తులో ఉన్న యువకులను అ దుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించినట్లు సమాచారం. జిల్లా కేంద్రం లోని రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలు, కళాశాల రోడ్, ఏసీసీక్వారీ రోడ్ ప్రాంతాలను యువత డ్రగ్స్, గంజాయి, మద్యం సేవించేందుకు అడ్డాలుగా చేసుకుంటున్నట్లు సమాచారం. విస్తృతమవుతున్న డ్రగ్స్ వినియోగం మత్తు పదార్థాల వ్యాపారులు విద్యార్థులను, యువతను టార్గెట్ చేస్తూ మత్తులోకి దింపుతూ వ్యాపా రం సాగిస్తున్నారు. మద్యం, గంజాయి, డ్రగ్స్.. ఇలా మత్తు పదార్థాలకు యువతరం బా నిసగా మారుతోంది. దినదినం అభివృద్ధి చెం దుతున్న పట్టణాల్లో విద్య, వైద్యం, విజ్ఞానరంగాల్లో గుర్తింపు పొందుతున్న విద్యా సంస్థల్లో డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం. విద్యార్థులు, యువత డ్రగ్స్ , గంజా యి, వాడకుండా కట్టడి చేయకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైదరా బాద్, మహా రాష్ట్ర, మహబూబాబాద్, విజయవాడ ప్రాంతాల నుంచి కొందరు డ్రగ్స్ ముఠా యువత ను టార్గెట్ చేస్తూ మంచిర్యాల, కాగజ్‌నగర్, నిర్మల్ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. కదలికలపై దృష్టి పెట్టాలి పిల్లల కదలికలను తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఉంది. ఒకసా రి వ్యసనం బారిన పడితే. వాటి నుంచి తప్పించుకునేందుకు శ్రమించాల్సి వస్తుంది. ఒత్తిడి కారణంగానో..? ఒంటరితనం భావనతో కొందరు. చెడుస్నేహాలతో మరికొందరు. ఈ ఊబిలోకి దిగుతున్నారు. ఒక్కసారి మద్యం తాగితే. మనసు దానిపట్ల ఆకర్షణ పెరిగిపోయి.. మానసిక సంఘర్షణకు లోనవుతుంటా రు. మెదడును ఉత్తేజపరిచే మద్యం.. క్రమంగా దానికి బానిసను చేస్తుంది. ఆ తర్వాత మెదడు చురుకుదనం కోల్పోతుంది. మానసిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. తల్లిదండ్రులు పిల్లలపట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. – విశ్వేశ్వర్రావు,మానసిక వైద్యనిపుణులు, మంచిర్యాల తల్లిదండ్రులదే కీలక బాధ్యత నయాకల్చర్కు అవాటు పడుతున్న యువత సగం మందికిపైగా పెడదోవ పడుతున్నవారే ఉన్నారు. మద్యానికి బానిసలుగా మారడంతోపాటు గుట్కా, సిగరెట్ వంటివి వినియోగిస్తున్నారు. పిల్లలను సన్మార్గంలో పెట్టాల్సిన తల్లిదండ్రులు సంపాదన ధ్యేయంగా పనిచేస్తుండడంతో వారు ఈ తరహ వ్యసనాల బారిన పడుతున్నారు. టీనేజీలో ఉన్న పిల్లలతో గడిపేందుకు సమయం కేటా యించి.. వారి దృష్టి ఇతర వ్యాపకాలవైపు మరల్చకుండా కంటికి రెప్పలా కాపాడాల్సి బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది.– ఎడ్ల మహేష్, సీఐ, మంచిర్యాల -
రాజేంద్రనగర్‌లో గంజాయి మూఠా గుట్టురట్టు
-
జైలులోకి గంజాయి విసిరిన యువకులు
పశ్చిమగోదావరి , ఏలూరు టౌన్ : ఏలూరు కోటదిబ్బలోని జిల్లా జైలులోకి యథేచ్ఛగా గంజాయి వెళుతోంది. జైలులోని ఖైదీలు భోజన విరామ సమయంలో బ్యారెక్ల నుంచి బయటకు వచ్చే సమయంలో జైలు వెనుక భాగంలోని అంగన్వాడీ స్కూల్ నుంచి కొందరు గంజాయి, గుట్కా, బీడీలను విసరటం ఆనవాయితీగా మారింది. ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రం భోజన విరామ సమయంలో ఏలూరుకు చెందిన కొందరు యువకులు జైలులోకి గంజాయి, గుట్కా, బీడీలు, సిగరెట్లు విసిరారు. వెంటనే అప్రమత్తమైన జైలు సెంట్రీలు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని జైలు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఏలూరు వన్‌టౌన్ పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. నగరంలోని ఒక ప్రాంతంలో ఇటీవల కొందరు యువకులు కత్తులతో దాడులు చేసుకునేందుకు తిరిగటంతో వారిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ నిందితుల వద్దకు ఈ రోజు కొందరు యువకులు ములాకత్‌కు వచ్చారనీ, భోజన విరామ సమయంలో ఇలా గంజాయి విసిరి ఉంటారని జైలు అధికారులు చెబుతున్నారు. జైలు అధికారులు, సెంట్రీలు అప్రమత్తంగా ఉండటంతోనే ఇటువంటి వాటికి చెక్ పెడుతున్నామని అంటున్నారు. ఇద్దరు యువకులను అప్పగించాం : బి.చంద్రశేఖర్, జైలు సూపరింటిండెంట్ : ఏలూరులోని జిల్లా జైలులోకి కొందరు యువకులు గంజాయి, గుట్కాలు, బీడీలు బుధవారం విసిరారు. ఈ విషయాన్ని పసిగట్టిన సెంట్రీలు వెంటనే అప్రమత్తమై ఇద్దరిని పట్టుకున్నారు. వారిద్దరినీ ఏలూరు వన్‌టౌన్ పోలీసులకు అప్పగించాం. ఇదే విధంగా గతంలోనూ కొందరు యువకులు గంజాయి విసురుతూ పట్టుబడగా పోలీసులకు అప్పగించామని, జైలు వద్ద విధులు నిర్వర్తించే సెంట్రీలు అప్రమత్తంగా ఉండడంతో ఇటువంటి వారిని వెంటనే నిలువరించగలుగుతున్నామన్నారు. ఇదిలా ఉండగా, పోలీసులు మాత్రం తమ వద్ద ఎవరూ లేరని, కేసులేమీ నమోదు చేయలేదని చెప్పడం గమనార్హం. టీడీపీ నేతల సెటిల్మెంట్ ? : జిల్లా జైలులోకి గంజాయి విసురుతూ పట్టుబడిన యువకులు ఇద్దరిని ఏలూరు వన్‌టౌన్ స్టేషన్లో ఉంచటంతో వెంటనే టీడీపీ నేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వారిద్దరిపై కేసులు లేకుండా బయటకు తీసుకువెళ్ళేందుకు మంతనాలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కేసు పెట్టేందుకు పోలీసు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా టీడీపీ నేతల ఒత్తిడితో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నట్లు తెలిసింది. ప్రతీ చిన్న విషయానికి టీడీపీ నేతల జోక్యం పెరిగిపోయిందనీ, ఇలాగైతే ఉద్యోగాలు ఎలా చేయాలో తెలియటం లేదంటూ వాపోతున్నారు. -
హైదరాబాద్‌లో లిక్విడ్ గంజాయి దందా
-
నగరంలో కొత్తరకం గంజాయి దందా
సాక్షి, హైదరాబాద్ : నగరంలో కొత్త రకం గంజాయి దందా వెలుగుచూసింది. గంజాయిని లిక్విడ్ రూపంలోకి మార్చి విక్రయిస్తున్న ఓ ముఠాను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ లిక్విడ్ గంజాయి సరఫరా వ్యాపారం నడుస్తోంది. బిర్యానీ ఫుడ్ కలర్స్ బాటిల్స్‌లో, తేనె బాటిల్స్‌లో గంజాయి లిక్విడ్‌ను నింపి అమ్ముతున్నారు. వైజాగ్ నుంచి లిక్విడ్ గంజాయిని హైదరాబాదుకు తీసుకు వచ్చి, చిన్న చిన్న బాటిళ్లలో నింపి సరఫరా చేస్తున్నారు. బెంగళూరులోని విద్యార్ధులకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగులకు గంజాయిని విక్రయిస్తున్నారు. లిక్విడ్ గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. -
ఆ కళాశాలలో గంజాయి నిల్వలు?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నగరంలో పేరు గాంచిన ఆ కళాశాలలో ఇన్నాళ్లూ బయటకు పొక్కని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సంపన్నుల పిల్లలు చదివే ఈ కళాశాలలో పాశ్చాత్య పోకడలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ర్యాగింగ్, మద్యపానం సేవించడం, డ్రగ్స్, గంజాయితో ఇక్కడ విద్యార్థులు పట్టుబడినా ఆ విద్యా సంస్థ పేరు మాత్రం బయటకు రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ జరిగిన అరాచకాలను సైతం మాఫీ చేసేశారు. ఇప్పుడు ఆ కార్పొరేట్ కళాశాలలో అసాంఘిక కార్యకలాపాలు పెచ్చుమీరడంతో పోలీసులు కూడా దృష్టిసారించారు. ఆదివారం సాయంత్రం పోలీసులు, ఎక్సైజ్ విభాగం అధికారులు రుషికొండ సమీపంలోని కళాశాలకు చెందిన హాస్టల్లో తనిఖీలు చేపట్టి విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకొన్నట్లు తెలుస్తోంది. ఆ కళాశాల యాజమాన్యం అధికార పార్టీ ద్దలకు అత్యంత సన్నిహితులు కావడంతో పోలీసులు, ఎక్సైజ్ విభాగం అధికారులు దీనిపై పెదవి విప్పడం లేదు. ఈ విషయంపై మాట్లాడేందుకు సైతం నిరాకరిస్తున్నారు. అయితే గంజాయి పట్టబడటం వాస్తవమేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల రుషికొండ ప్రాంతంలో రేవ్ పార్టీలు నగరంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జరిగిన తనిఖీల్లో విద్యార్థుల నుంచి గంజాయి పెద్ద మొత్తంలో లభించడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. -
వీడ్‌లు.. డోప్‌లు..!
మీకు తెలుసా? ‘వీడ్’ అంటే గంజాయి సిగరెట్.. డోప్ అంటే చాక్లెట్ అని..! మీకే కాదు.. నగరంలో చాలామందికి తెలియదు. కానీ మాదకద్రవ్యాలకు బానిసలై మత్తులో మునిగితేలే వారు మాత్రం ఎవరికీ అనుమానం రాకుండా ఈ కోడ్ భాషలతోనే కథ నడిపిస్తారు. వీటి కోసం కాఫీడే సెంటర్లు, బార్లు, పార్కులు వంటి వాటిని అడ్డాలుగా చేసుకుంటున్నారు. సిగరెట్లు, చాక్లెట్ల రూపంలో అందుబాటులో ఉంచుతున్నారు. మత్తుకు అలవాటు పడిన వారు బానిసలుగా మారి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తెగబడుతున్నారు. ఇందులో అత్యధికులు విద్యావంతులే కాక బడాబాబుల పిల్లలు ఉంటున్నారు. ఇంకా ఒకడుగు ముందుకేసీ విశాఖలో రేవ్ పార్టీలకు కూడా వీరే కారణమవుతున్నారు. ఇటీవల రుషికొండ బీచ్‌లో నిర్వహించిన రేవ్ పార్టీలో మాదక ద్రవ్యాలు, మద్యం సేవించి అదుపు తప్పిన యువత తీరు చూసి ప్రశాంత విశాఖ నివ్వెరపోయింది. సాక్షి, విశాఖపట్నం: స్మార్ట్ సిటీ విశాఖ మాదకద్రవ్యాల మాఫియాకు అడ్డాగా మారుతోంది. ఊహించని రీతిలో నగర శివార్లలోనే కాదు.. నడిబొడ్డున కూడా మత్తులో ముంచెత్తడానికి ఎన్నో అడ్డాలు అందుబాటులోకి వచ్చాయి. వీడ్‌లు (గంజాయి సిగరెట్లు, డోప్‌లు (మిల్క్ బార్లు మాదిరి) డ్రగ్స్ చాక్లెట్లను గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. విశాఖలోని కొన్ని ఇంజినీరింగ్ కాలేజీలు, విద్యా సంస్థల్లో మాదకద్రవ్యాలకు అలవాటు పడిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, ఏటా వీరి సంఖ్య పెరుగుతోందని ఇప్పటికే అధికారులు నిర్ధారించారు. కొంతమంది ధనికులు, స్థితిమంతుల పిల్లలు వీటికి అలవాటు పడ్డాక మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వారి ద్వారా తమ వద్దకే (కాలేజీలు, పార్కులు, హోటళ్ల వద్దకు) రప్పించుకుంటున్నారు. తొలుత మత్తునిచ్చే గంజాయి సేవనం మరిగాక కొన్నాళ్లకు నిషేధిత మాదకద్రవ్యాల వైపు మళ్లుతున్నారు. చాలా కాస్టిలీ గురూ.. ఎవరికీ అనుమానం రాకుండా సిగరెట్లు, చాక్లెట్ల రూపంలో వీటిని తయారు చేస్తున్నారు. మామూలు సిగరెట్లలో పొగాకును తొలగించి పొడిలా చేసిన గంజాయిని కూరుతారు. వీటినే కాఫీడేలు, బార్లు, పార్కులు, హోటళ్లు వద్ద ఎక్కువగా విక్రయిస్తుంటారు. మరోవైపు హైదరాబాద్, పాడేరు, అరకులోయ కేంద్రంగా గంజాయి చాక్లెట్లు తయారవుతున్నాయి. గంజాయి నూనె, పొడి మిశ్రమంతో సిసలైన చాక్లెట్ల మాదిరిగా వీటిని తయారు చేస్తుంటారు. వీటిని కూడా కాఫీడేలు, బార్ అండ్ రెస్టారెంట్లు, ఖరీదైన హోటళ్ల వద్ద రహస్యంగా విక్రయిస్తున్నారు. ఒక్కో సిగరెట్ ధర రూ.100 నుంచి 250 వరకు, చాక్లెట్ సైజును బట్టి రూ.500 నుంచి 1000 వరకు ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మాదకద్రవ్యాలకు మారుపేర్లుకోడ్లు, డీకోడ్లతో విక్రయాలు.. గంటల తరబడి మత్తు.. గంజాయి సిగరెట్ తాగితే దాదాపు గంటకు పైగా మత్తుగా ఉంటుంది. గంజాయి చాక్లెట్ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందంటారు. ఒక చాక్లెట్‌ను తింటే ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు మత్తులో ముంచెత్తుతుంది. అందుకే వీటికి అలవాటైన స్థితిమంతుల పిల్లలు ఎంత ఖరీదైనా వెనకడగు వేయరు. ఒకసారి మాదకద్రవ్యాలకు బానిసలయ్యాక వాటి నుంచి బయట పడలేకపోతున్నారు. మానసిక ఒత్తిడి అధికమై అఘాయిత్యాలకు పాల్పడు తున్నారు. చేతిలో డబ్బుల్లేకపోతే చోరీల బాట పడుతున్నారు. చోరీలు, గొలుసు దొంగతనాల్లో పట్టుబడుతున్న వారిలో పలువురు యువకులతో పాటు ఇంజినీరింగ్ చదివిన, చదువుతున్న వారే ఉండడం విస్తుగొలుపుతోంది. ఆన్లైన్.. వెబ్సైట్.. ఇటీవల రుషికొండలో నిర్వహించిన రేవ్ పార్టీలో మాదకద్రవ్యాలను సేవించినట్టు తేలింది. అంతేకాదు వారి వద్ద ఎండీఎం, ఎల్ఎస్డీ వంటి నిషేధిత మాదకద్రవ్యాలు లభించాయి. వీటిని ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసినట్టు నిందితులు వెల్లడించారు. ఏకంగా దీనికోసం ఒక వెబ్‌సైట్‌నే నడుపుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ స్థావరాలు? నగరంలో కొన్ని బార్ అండ్ రెస్టారెంట్లు, కాఫీడే సెంటర్లు, సిరిపురం జంక్షన్, హెచ్Œ ఎస్బీసీ–వుడా పార్క్ మధ్య ప్రాంతం, ఏయూ ఇంటర్నేషనల్ హాస్టల్ పరిసరాలు, పాతపోస్టాఫీసు, రైల్వేస్టేషన్, ఎంవీపీ కాలనీ, సాగరతీరంలోని గోకుల్‌పార్క్, లాసన్స్‌బే బీచ్, తెన్నేటి పార్క్, రుషికొండ (సమీపంలోని సరుగుడు తోటలు) తదితర ప్రాంతాలు మాదక ద్రవ్యాలకు కేరాఫ్ అడ్రస్‌లుగా ఉన్నాయి. అవగాహన కల్పిస్తాం.. డ్రగ్స్ వినియోగంతో వాటిల్లే దుష్ప్రభావాలపై యువత, విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. వీటి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. డ్రగ్స్ సరఫరాదార్లపై షీట్లు ఓపెన్ చేస్తాం. –మహేంద్ర మత్తే, ఏసీపీ, టాస్క్‌ఫోర్స్. నిఘా పెడుతున్నాం.. మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగంపై నిఘా పెడుతున్నాం. ఇంజినీరింగ్ కాలేజీలు, ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిసరాలు, వన్‌టౌన్, పోర్టు ఏరియా, ఎయిర్‌పోర్టు, రుషికొండ తదితర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. పాడేరు, అరకు ప్రాంతాల్లో గంజాయి చాక్లెట్ తయారవుతున్నట్టు సమాచారం ఉంది. డ్రగ్ ఇన్స్పెక్టర్లతో కలిసి మందుల షాపుల్లో మత్తు ఇంజక్షన్ల విక్రయాలపై తనిఖీలు నిర్వహిస్తాం. కాలేజీల్లో విద్యార్థులకు, తల్లిదండ్రులకు డ్రగ్స్‌పై అవగాహనా సదస్సులు నిర్వహిస్తాం.–శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్‌శాఖ. -
అబులెన్స్‌లో అక్రమంగా గంజాయి రవాణా
-
దిగంబరత్వం.. బూడిద..పరమేశ్వరుని అంశ
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవంగా కుంభమేళాకు పేరుంది. యునెస్కో గుర్తింపు కూడా పొందింది. మత్స్య పురాణంలో సాగర మథనం కథ ప్రకారం అమృత కలశం సొంతం చేసుకోడానికి రాక్షసులు, దేవతల మధ్య 12 ఏళ్లు యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా అమృత కలశం నుంచి చిందిన బిందువులు భారతదేశంలోని నాలుగు ప్రాంతాల్లో పడ్డాయట. అవి ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్), హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని. ఈ నదీ తీరాల్లో ప్రతి 12 ఏళ్లకు కుంభమేళా నిర్వహిస్తారు. ఆరేళ్లకోసారి అర్ధ కుంభమేళా, 144 ఏళ్లకోసారి మహా కుంభమేళా జరుగుతుంది. ఈ ఏడాది ప్రయాగ్‌రాజ్(అలహాబాద్)లోని త్రివేణి సంగమం వద్ద అర్ధ కుంభమేళా జరిగిన సంగతి తెలిసిందే. జనవరి 15 నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవం మార్చి 4 (మహా శివరాత్రి) తో ముగుస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 12 కోట్ల మంది ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే కుంభమేళ అనగానే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు నాగసాధువులు. ఒళ్లంతా బుడిద పూసుకుని, దిగంబరంగా లేదా అర్థ నగ్నంగా తిరుగుతూ.. మరేదో లోకం నుంచి వచ్చిన వారిలా కనిపించే నాగసాధువులను కుంభమేళా ఉత్సవాన్ని పరిపూర్ణం చేయడానికి వచ్చిన ఆత్మలుగా భావిస్తారు. దేశాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడే సైన్యంగా జగద్గురు ఆదిశంకరాచార్యులు ఈ నాగ సాధువులను తయారు చేశారనే ప్రతీతి. అఖరాలలో నివసించే వీరు కుంభమేళా కోసం తరలి వస్తారు. ఈ కుంభమేళా ఉత్సవాల్లో బందీప్ సింగ్ అనే వ్యక్తి నాగసాధులకు సంబంధించిన అరుదైన ఫోటోలతో పాటు ఆసక్తికర సమాచారాన్ని కూడా అందించారు. దిగంబరత్వం.. బూడిద నాగ సాధువులు శ్మశాన బూడిదను మాత్రమే ఒంటికి పట్టించుకుంటారు. ఇలా బూడిదను రాసుకోవడం అంటే అన్ని బంధాల నుంచి విముక్తి అయ్యానని తెలపడం. ఐహిక వాంఛల నుంచి విముక్తి అయ్యాము... వైరాగ్య పంథాలో పయనిస్తున్నామని ప్రకటించడం. సాధరణ మానవునికి ఉన్న వాంఛలను తాము జయించామని తెలపడం కోసం ఇలా దిగంబరంగా తిరుగుతారు. వ్యవసాయదారుడైన సురేశ్వర్ గిరి(60) కుటుంబంతో పాటు వృత్తిని వదిలి సన్యాస దీక్ష తీసుకుని నాగ సాధువుగా మారారు. తలకు, ఒంటికి పట్టిన బూడిదను వదిలించు కోవడం కోసం తన జటాలను విదిలిస్తుండగా తీసిన ఫోటో శ్మశాన నివాసి అయిన పరమేశ్వరుని అంశను చూపిస్తున్నట్లుగా గోచరిస్తుంది. రుద్రాక్ష ధారణ పరమేశ్వరుని మూడో కన్నుగా రుద్రాక్షను పరిగణిస్తారు. చాలామంది నాగ సాధువులు కేజీల కొద్ది రుద్రాక్షలను ధరిస్తారు. నాగబాబా శక్తి గిరి (54) రుద్రాక్షలనే వస్త్రాలుగా ధరించాడు. సుమారు 70 కిలోల బరువున్న 1,25,000 రుద్రాక్షలను ఒంటిపై ధరించాడు. మరో నాగబాబా రాజ్ పూరి 21 కిలోల బరువున్న శివలింగాన్ని తల మీద ధరించాడు. చబి సంప్రదాయం ఐహిక వాంఛల్ని ముఖ్యంగా లైంగిక కోరికల్ని వదిలేసి పూర్తి బ్రహ్మచర్యంతో, దేహంలోని ప్రతి అవయవాన్ని బలోపేతం చేసుకునేందుకు కఠిన శిక్షణలు పొందుతారు నాగ సాధువులు. లైంగిక వాంఛల్ని వదిలేసుకున్నామనే దానికి నిదర్శనంగా ఈ చబి సంప్రదాయాన్ని పాటిస్తారు. దీనిలో భాగంగా మర్మాంగాలతో సాహసోపేతమైన పనులను చేస్తారు. ఈ ఫోటోలో నాగబాబా కమల్ పూరి ప్రదర్శిస్తున్నది చబి ఆచారాన్నే. మర్మాంగాన్ని రాడ్‌కు చుట్టి దాని మీద మరో వ్యక్తిని నిల్చోబెట్టాడు. కొందరు రాడ్ బదులు కత్తిని కూడా ఉపయోగిస్తారు. ఊర్ధ్వబాహు హఠ యోగ దీన్ని సాధన చేసేవారు.. ఏళ్ల పాటు ఒక చేతిని గాల్లోకి లేపే ఉంచాలి. కిందకు దించకూడదు. శరీరం మీద మెదడు పూర్తి పట్టు సాధించడం కోసం ఇలాంటి కఠిన సాధనలు చేస్తారు. ఉజ్జయినికి చెందిన నాగబాబా రాధే పూరి గత పన్నేండేళ్లుగా దీన్ని సాధన చేస్తున్నాడు. మరిజునా.. ఏకాగ్రతతో, తదేక దీక్షగా సాధనను కొనసాగించడం కోసం మరిజునాను పీలుస్తామని వెల్లడించాడు నాగబాబా రాజు పూరి. ఎరుపెక్కిన కళ్లతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న సేనికునిలా.... చిల్లం నుంచి పొగ పీల్చడంతో అతని కళ్లు ఎర్రబడ్డాయి. సంప్రదాయాన్ని కాపాడే యోధులుగానే ప్రజలు తమను గుర్తించాలనుకుంటారు వీరు. -
గంజాయి మత్తు.. యువత చిత్తు!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో గంజాయి కేసులు...గంజాయి వినియోగించే వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఈ వ్యసనం యువత బంగారు భవిష్యత్‌ను ఛిద్రం చేస్తోంది. మాదకద్రవ్యాల వాడకం, విక్రయం కేసుల్లో్ల యువతే అత్యధికంగా ఉంటున్న తీరు సర్వత్రా కలవరపరుస్తోంది. గతేడాదిగా మహానగరం పరిధిలో గంజాయి విక్రయం, సరఫరాకు సంబంధించి ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు జరిపిన తనిఖీల్లో 300 కేజీలకు పైగా గంజాయి దొరకడం గమనార్హం. ఈ ఉదంతాలకు సంబంధించి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు సుమారు 200 కేసులు నమోదుచేశారు. ఆయా సంఘటనల్లో 412 మందిని అరెస్టు చేశారు. వీరిలో 20–30 మధ్య వయస్కులు సుమారు 200కు పైమాటేనని ఆబ్కారీశాఖ అధికారులు స్పష్టంచేస్తున్నారు. నగరంలోని పలు వృత్తివిద్యా కళాశాలలు, హాస్టళ్లలో అలవాటయ్యే గంజాయి వారి ప్రాణాలకు చేటుతెస్తుందని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. సరదా అలవాటు ముంచేస్తోంది... నగరంలో ఉన్నత చదువులు, వృత్తివిద్యాకోర్సులు, ఉద్యోగాలు చేస్తున్న రెండు తెలుగురాష్ట్రాలకు చెందిన యువతీయువకులతోపాటు, పొరుగురాష్ట్రాలకు చెందినవారు, విదేశీయులు తొలుత సిగరెట్.. ఆతరవాత స్నేహితుల ప్రోద్భలంతో కొన్నిసార్లు గంజాయిని సరదాగా అలవాటు చేసుకుంటున్నారు. ఇదే వారి భవిష్యత్‌ను నాశనం చేస్తోంది. తొలుత పదిగ్రాముల గంజాయిని రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు కొనుగోలుచేస్తున్నారు. ఇక అది దొరకడం కష్టతరం అయినపుడు తామే సరఫరాదారుల అవతారమెత్తి డ్రగ్స్మాఫియా చేతిలో సమిధలుగా మారుతున్నారు. అటవీప్రాంతాల నుంచి నగరానికి పది కేజీల గంజాయిని తరలిస్తే రూ.పదివేల వరకు గిట్టుబాటవుతుండడంతో జల్సాలకు అలవాటుపడిన యువత ఈ సరఫరాలో కీలక సూత్రధారులుగా మారుతున్నారు. తమ వ్యక్తిగత బైక్‌లు, కార్లు, రైళ్లు బస్సుల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని రవాణా చేస్తున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసుల తనిఖీలు జరిపిన ప్రతీసారీ ఇలాంటి వారే పట్టుబడుతున్నారు. అంతకుముందు నేరచరిత్ర లేని యువత సైతం ఈ దాడుల్లో దొరుకుతున్నారని ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు చెబుతున్నారు. తొలిసారి పట్టుబడినపుడు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తున్నామని..తిరిగి అదేపనిగా ఇదే దందాలో కొనసాగుతున్నవారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదుచేస్తున్నట్లు తెలిపారు. అయితే డ్రగ్స్మాఫియా వెనక ఉన్న బడాఅక్రమార్కులు చిక్కడంలేదని పోలీసులు వాపోతున్నారు. గంజాయి సరఫరా కేసుల్లో పట్టుబడిన యువత కూడా బడా అక్రమార్కుల పేర్లు, ఆచూకీ తెలపడం లేదని చెబుతున్నారు. ఏటేటా పెరుగుతోన్న కేసులు.. గంజాయి అమ్మకం, సరఫరాకు సంబంధించి నగరంలో ఏటేటా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో 2017లో కేవలం 63 కేసులు నమోదుకాగా...2018లో ఏకంగా 200 కేసులు నమోదవడం గమనార్హం. కళాశాలలు, వర్సిటీ క్యాంపస్‌లు, హాస్టళ్లపై సరైన నిఘా లేకపోవడంతో విద్యార్థులు గంజాయి ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఇక విద్యార్థుల ప్రవర్తన, వ్యవహార శైలిపై ఇటు కళాశాలల అధ్యాపకులు, వసతిగృహాల నిర్వాహకులతోపాటు తల్లిదండ్రులు సైతం నిఘా పెట్టాలని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఆదిలోనే ఈ వ్యసనానికి అడ్డుకట్ట వేయాలన్నారు. తస్మాత్ జాగ్రత్త... గంజాయిలో ప్రమాదకరమైన ’టెట్రహైడ్రోకెన్నాబినాల్’ అనే రసాయణం ఉంటుంది. ఇది మొదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉన్నది లేన్నట్లు..లేనిది ఉ న్నట్లు భ్రమలు కల్పిస్తుంది. మానసిక ఆందోళనతో పాటు తీవ్రమైన ఉద్రేకతను రేకెత్తిస్తుంది. సరదాగా మొదలైన ఈ అలవాటు క్రమంగా బలహీనతకు గురి చేస్తుంది. ప్రస్తుతం నగరంలో 14 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలు ఎక్కువగా ఈ గంజాయికి అలవాటు పడుతున్నారు. తొలుత సిగరెట్‌కు అలవాటు పడి, ఆ తర్వాత గంజాయి వాడుతున్నారు. చికాకు, కోపం, టెన్షనం, భయం, ఒంటరితనానికి అలవాటు పడటం వంటి లక్షణాలు కన్పిస్తాయి. జ్ఞాపకశక్తి తగ్గి, చదువులో వెనుకబడిపోతారు. తాగి డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాల భారినపడే అవకాశం ఉంది. విచక్షణను కోల్పొయి దొంగతనాలు, దోపిడీలకే కాదు చివరకు హత్యలకు వెనుకాడరు. హోమియోపతి డి అడిక్షన్లో మంచి మందులు ఉన్నాయి. మూడు నుంచి ఆరు మాసాల కోర్సు వాడాల్సి ఉంటుంది. గంజాయి నుంచి విముక్తి పొందాలని భావించే వారు...మరిన్ని వివరాల కోసం 9885536313 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు. – డాక్టర్ వై.జయరామిరెడ్డి -
స్నేహితుడిని కేసులో ఇరికించాలనుకుని..
చిక్కడపల్లి: స్నేహితుడిని గంజాయి కేసులో ఇరికించాలని భావించిన ఓ యువకుడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.అశోక్‌నగర్ గీతారెసిడెన్సీలో ఉంటున్న కవాడిగూడ కార్పొరేటర్ లాస్య నందిత వద్ద నాగరాజు అనే వ్యక్తి కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అంతకు ముందు ఆమె వద్ద డ్రైవర్‌గా పని చేసిన దామెదర్ ఎలాగైనా నాగరాజును విధుల నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో తన మిత్రుడు శ్రీనివాస్‌రావుకు మద్యం తాగించి ఆదివారం నాగరాజుకు చెందిన ఇన్నోవా కారులో గంజాయి పెట్టాలని సూచించాడు. అనంతరం దామోదర్ చిక్కడపల్లి పోలీసులకు ఫోన్ చేసి దీనిపై సమాచారం అందించాడు. ఎస్ఐ బాల్‌రాజ్ సంఘటనా స్థలానికి వెళ్లి కారులో ఉన్న 70 గ్రాముల ఆరు గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా శ్రీనివాసరావు కారులో గంజాయి పెడుతున్నట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దామోదర్ సూచనమేరకే కారులో గంజాయి ప్యాకెట్లు ఉంచినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గంజాయి ఫ్రం సూర్యాపేట
సాక్షి, సిటీబ్యూరో: సూర్యాపేట జిల్లా నుంచి గంజాయిని అక్రమ రవాణా చేసి నగరంలో విక్రయిస్తున్న ముఠా గుట్టును వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి 31 కేజీలు స్వాధీనం చేసుకున్నామని, పరారీలో ఉన్న సూత్రధారి కోసం గాలిస్తున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు గురువారం తెలిపారు. మంగళ్‌హాట్‌కు చెందిన రాజు సింగ్ గతంలో బేగంబజార్‌లోని ఓ మెడికల్‌షాప్‌లో పని చేశాడు. ఆపై గణేష్ విగ్రహాల తయారీదారుడిగా మారాడు. ఈ ఆదాయంతో సంతృప్తి చెందని రాజు గంజాయి దందా మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో గతంలో రెండుసార్లు అరెస్టై జైలుకు వెళ్లాడు. ఏడాది క్రితం బెయిల్‌పై బయటిని వచ్చిన ఇతను మళ్లీ గణేష్ విగ్రహాల తయారీ మొదలు పెట్టాడు. ఈ ఆదాయంతో విలాస జీవితం గడపటం సాధ్యం కాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం, జల్మల్‌కుట తాండకు చెందిన లావూరి సంతోష్‌తో పరిచయం ఏర్పడింది. వివిధ మార్గాల్లో కేజీ రూ.2500 చొప్పున గంజాయి సేకరిస్తున్న అతను దానిని రూ.5 వేలకు విక్రయించేవాడు. ఈ విషయం తెలుసుకున్న రాజు తన ప్రాంతానికే చెందిన కిషన్‌సింగ్, పూల్ సింగ్‌లతో జట్టు కట్టాడు. ముగ్గురు కలిసి విక్రయించాలనే ఉద్దేశంతో 31 కేజీలు తీసుకురావాలని సంతోష్‌కు ఆర్డర్ ఇచ్చారు. అతడు గంజాయి తీసుకువచ్చి డెలివరీ చేసి వెళ్లాడు. దీనిని పంచుకునేందుకు మిగిలిన ఇద్దరినీ ఆసిఫ్‌నగర్‌కు రావాల్సిందిగా రాజు సూచించాడు. దీంతో వారు ఇద్దరూ గురువారం నిర్దేశిత ప్రదేశానికి చేరుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి ముగ్గురినీ పట్టుకుని గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సంతోష్ కోసం గాలిస్తున్నారు. గంజాయి రవాణా చేస్తున్న8 మంది అరెస్టు.. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఎనిమిదిమంది నిందితులను అరెస్ట్ చేసి 8.44 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు గురువారం తెలిపారు. జూబ్లీహిల్స్, అప్పర్ ధూళ్‌పేట్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఏఈఎస్ అంజిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సాహసించలేకపోయారు..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మన్యంలో సాగవుతున్న గంజాయి పంటను ధ్వంసం చేయడానికి ఏర్పాటైన స్పెషల్ టాస్క్ఫోర్సు బృందాలు ఈ ఏడాది ఆయా ప్రాంతాల్లోకి అడుగు పెట్టలేక పోయాయి. అక్టోబర్ నుంచి నాలుగు నెలల పాటు ఈ బృందాలు దాడులు నిర్వహించాల్సి ఉన్నా పట్టుమని పాతిక రోజులు కూడా చేయలేకపోయాయి. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను గత సెప్టెంబర్‌లో మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో మన్యంలో గంజాయి సాగవుతున్న మారుమూల ప్రాంతాల్లోకి టాస్క్ఫోర్సు బృందాలు వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో ఈఏడాది కేవలం 245 ఎకరాల్లో మాత్రమే గంజాయి పంటను ధ్వంసం చేయగలిగారు. విశాఖ ఏజెన్సీలోని ఎనిమిది మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో గంజాయి పంట విరివిగా సాగవుతున్నట్టు అధికారికంగా గుర్తించారు. దీనిని మూడేళ్లలో పూర్తిగా నిర్మూలించాలన్నది లక్ష్యం. దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతయ్యే గంజాయిలో అత్యధిక శాతం విశాఖ నుంచే జరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్, పోలీసు, అటవీ, రెవిన్యూ శాఖల అధికారులు, సిబ్బందితో గత ఏడాది స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఏటా జులై, ఆగస్టుల్లో గంజాయి సాగు మొదలై నవంబర్/డిసెంబర్ నాటికి కోతకు వస్తుంది. దీనిని కొన్నాళ్లు ఆరబెట్టి ఎగుమతికి వీలుగా ప్యాకింగులు చేస్తారు. దీంతో ఈ టాస్క్‌ఫోర్స్ బృందాలు అక్టోబర్ నుంచి గంజాయి సాగవుతున్న ప్రాంతాలకు వెళ్లి ఆ పంటను ధ్వంసం చేయాల్సి ఉంది. ఇలా గత ఏడాది ఇదే టాస్క్‌ఫోర్స్ బృందాలు 3,125 ఎకరాల్లో గంజాయిని ధ్వంసం చేశారు. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి తారుమారైంది. సెప్టెంబర్‌లో అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ హత్య తర్వాత పోలీసులు మన్యంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆలస్యంగా నవంబర్ 15 నుంచి టాస్క్‌ఫోర్స్ టీమ్‌లు దాడులు మొదలు పెట్టాయి. ఈసారి దాడుల్లో రాష్ట్రంలోని ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది మొత్తం150 మంది పాల్గొన్నారు. వీరితో పాటు ఇతర శాఖ సిబ్బంది కూడా ఉన్నారు. వీరు జి.మాడుగుల, పాడేరు, హుకుంపేట, పెదబయలు, మండలాల్లో మాత్రమే పోలీసుల నుంచి క్లియరెన్స్ లభించాక వీరు దాడులు చేశారు. మిగతా మండలాల్లోకి వెళ్లే సాహసం చేయలేకపోయారు. కొన్నిచోట్ల గంజాయి సాగుదార్లు ఈ టాస్క్‌ఫోర్స్ బృందాలపై రాళ్లదాడికి కూడా తెగబడ్డారు. మధ్యమధ్యలో విరామం ఇస్తూ జనవరి మొదటి వారం వరకు అతికష్టమ్మీద కొనసాగించారు. ఇలా ఈ దఫా 245 ఎకరాల్లో మాత్రమే గంజాయి పంటను ధ్వంసం చేయగలిగారు. మరోవైపు మన్యంలో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది లోపలకు వెళ్లలేని పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది గంజాయి సాగును విస్తృతం చేసినట్టు తెలుస్తోంది. ఇలా ప్రతికూల పరిస్థితుల్లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలు రెండో ఏడాది గంజాయి సాగును నామమాత్రంగానే ధ్వంసం చేయగలిగాయి. -
హైదరాబాద్ పోలీసులు 102కిలోల గంజాయి పట్టివేత
-
కారులో తరలిస్తున్న 100 కేజీల గంజాయి స్వాధీనం
గుంటూరు, చిల్లకల్లు (జగ్గయ్యపేట) : కారులో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన మండలంలోని గౌరవరం గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీ 37 ఏవై 3333 కారులో అక్రమంగా గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు చిల్లకల్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో సీఐ జయకుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ చిరంజీవి సిబ్బందితో జీఎంఆర్ టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో గంజాయి తరలిస్తున్న కారు టోల్ ప్లాజా సమీపంలోకి వచ్చింది. అక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులను గమనించి వారి కారును సమీపంలోని గౌరవరం గ్రామానికి మళ్లించారు. అది గమనించిన పోలీసులు ఆ కారును వెంబడించారు. గ్రామం సమీపంలోని యూకల్లిప్టస్ (జామాయిల్) తోట వద్ద కారును వదిలి అందులోని వారు పరారయ్యారు. దాంతో పోలీసులు ఆ కారును పరిశీలించగా అందులో 100 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
120 కేజీల గంజాయి పట్టివేత
మల్కాపురం(విశాఖ పశ్చిమ): పారిశ్రామిక ప్రాతంలో గం జాయి తరలిస్తున్న వారిని మల్కాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు కార్లు ద్వారా తీసుకువచ్చిన గంజాయిని ఓ ఇంటి వద్ద డంప్ చేస్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. పంచదార్ల రమణ అనే వ్యక్తి 47వ వార్డు ఎక్స్సర్వీస్మెన్కాలనీలో ఓ ఇంట్లో మూడు నెలల క్రి తం అద్దెకు దిగాడు. ఇతను జీకేవీధికి చెందిన ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకుని ఇక్కడే జీవిస్తున్నాడు. రమణ అత్తమామలకు చింతపల్లిలో వ్యవసాయ భూమి ఉంది. ఆ సమీపాన పండిస్తున్న గంజాయిని రమణ తక్కువ ధరకు కొనుగోలు చేసి, గతంలో పరిచయం ఉన్న తమిళనాడు, మధురై ప్రాంతాలకు చెందిని ఐదుగురు (నగరంలో ఈ ఐదుగురు నివాసముంటున్నారు) సాయంతో కేజీ రూ.12వేలు చొప్పున విక్రయిస్తుం టాడని, ఈ మేరకు గురువారం అర్ధరాత్రి రెండు కార్లలో చింతపల్లి నుంచి తీసుకువచ్చిన 120 కిలోల గంజాయిని డంప్ చేశారు... అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. రంగంలోకి దిగిన ఎస్బీ పోలీసులు, మల్కాపురం పోలీ సుల సాయంతో అర్ధరాత్రి రమణ ఇంటిపై దాడి చెయ్యగా గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలించిన రమణతో పాటు ఐదుగురు తమిళనాడు ప్రాంత వాసులను అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనిపై పోలీసులు స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వలేదు. -
‘సాఫ్ట్వేర్ల’ గంజాయి వ్యాపారం
సాక్షి,సిటీబ్యూరో: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. బోరబండ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో బసవాపురం సాయిచరణ్(24), పసుల శ్రీకాంత్(23)లను అరెస్టుచేసి వారి వద్ద నంచి 1.2 కిలోల డ్రై గంజా, రెండు మొబైల్ఫోన్లు,ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. గంజాయికి అలవాటుపడిన వీరిద్దరు అరకు నుంచి కాకుండా గంజాయి తీసుకొచ్చి 25, 50 గ్రాముల ప్యాకెట్లలో గంజాయిని నింపి ఎస్.ఆర్.నగర్,అమీర్‌పేట్,బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో పలువురికి విక్రయించినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసును అమీర్‌పేట్ పోలీసులకు అప్పజెప్పారు. నగర ఎక్సైజ్ విభాగం డిప్యూటీ కమీషనర్ సి.వివేకానందరెడ్డి ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఏఈఎస్ ఎన్.అంజిరెడ్డిల పర్యవేక్షణలో ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు. -
గృహంలో గంజాయి వనం
ప్రకాశం, బల్లికురవ: ఇంటి అవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు సమాచారం మేరకు మంగళవారం అద్దంకి ఎస్ఐ, సీఐ తిరపతయ్య మండలంలోని గుంటుపల్లి గ్రామంలో తనిఖీ నిర్వహించారు. సీఐ అందించిన వివరాల ప్రకారం గుంటుపల్లి గ్రామంలో అద్దేటి ఏడుకొండలు ఇంటి ఆవరణలో కూరగాయలు ఆకుకూరల మొక్కల్లో గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. తనిఖీల్లో భాగంగా 3 గంజాయి మొక్కలను గుర్తించి ఏడుకొండలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి బుధవారం అద్దంకి కోర్టుకు హజరుపరుస్తామని చెప్పారు. గంజాయి మొక్కలు పెంచటం, అమ్మటం చట్టరీత్యా నేరమని ఎంతటివారపైన అయినా కేసు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. -
నిత్యానంద కోసం పోలీసుల గాలింపు
యశవంతపుర : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గంజాయి తీసుకోవాలని ప్రేరేపించే విధంగా వ్యాఖ్యల చేసిన నిత్యానందకు ఇటీవల సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన స్పందించపోవడంతో గాలింపు చేపట్టారు. అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఆయన బిడిది వీడి తమిళనాడులో తలదాచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గంజాయిపై ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అది పెద్ద దుమారంగా మారింది. ఒక ప్రత్యేక బృందం నిత్యానంద కోసం గాలింపు చేపట్టారు. -
గంజాయి.. గుప్పు!
మత్తు మనిషిని చిత్తు చేస్తుంది. ఒక్కసారి అలవాటుపడిన తర్వాత వదలనంటుంది. వేదనపెడుతుంది.బెజవాడ నగరం గంజాయి అక్రమ రవాణా కేంద్రంగామారుతున్న పరిణామాలు కలవరపెడుతున్నాయి. చాపకిందనీరులా ఎంతమంది ఈ వ్యసనానికి బానిసలవుతున్నారనే విషయం ఆందోళన కలిగిస్తోంది.గంజాయి ముఠాలు గుట్టుచప్పుడు కాకుండా విజయవాడపైఉచ్చువేసి మత్తులోకి దించుతున్నట్లు తెలుస్తోంది.పోలీసుల ఉదాసీనత.. పాలకులకు పట్టని వైనం వెరసిబెజవాడ గంజాయికి అడ్డాగా మారుతోంది. మత్తువదలకుంటే తీవ్రపరిణామాలను చవిచూడాల్సివస్తుంది. సాక్షి, అమరావతిబ్యూరో : సెప్పెంబరు 25న విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అక్రమంగా రవాణా చేస్తున్న 17.33 కిలోల గంజాయిని విజయవాడలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని రామవరప్పాడు వద్ద సెప్టెంబరు 30వ తేదీ విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్తున్న ఓ కారులో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. 132 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాజధాని ప్రాంతమైన విజయవాడ కేంద్రంగా గంజాయి రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. రైళ్లు, బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాల ద్వారా నగరానికి తెచ్చే గంజాయి విక్రయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశంలో ఎక్కడికైనా చేరుకునేందుకు విజయవాడ నుంచి ఎప్పుడైనా రైలు సదుపాయం అందుబాటులో ఉండడం.. నగర శివారు ప్రాంతాల్లో అత్యధికంగా పేద, మధ్య తరగతి ప్రజలు నివసిస్తుండడం వల్ల గంజాయి అక్రమ రవాణాతో పాటు వినియోగం కూడా పెరుగుతోంది. అక్రమ రవాణా, విక్రయదారుల పట్ల పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతోఈ విష సంస్కృతి పెరిగిపోవడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. నగరానికి చేరుస్తున్నారు ఇలా.. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, విశాఖపట్నం జిల్లా మన్యం ప్రాంతాలతో పాటు తెలంగాణలోని ఇల్లందు ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో గంజాయి నగరానికి వచ్చిచేరుతోంది. ఆయా ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు సరుకును నగరానికి తీసుకొచ్చి దళారులకు అప్పగించి వెళ్లిపోతుంటారు. అత్యంత రహస్యంగా బలిష్టమైన ప్యాకింగ్ చేసి వాసన కూడా బయటకు రాకుండా మిర్చీ మధ్యలోనూ కొరియర్ బాక్సుల్లో దీన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మొత్తంలో తేవాలంటే మాత్రం కార్లు, లారీలు, బస్సులు వంటి వాహనాలను వినియోగిస్తున్నారు. గంజాయిని సూట్ కేసుల్లో, స్టీలు సంచుల్లో, మెడికల్ కిట్లలో రవాణా చేస్తున్నారు. వాసన రాకుండా పౌడర్ చల్లడం వల్ల ఎవరికీ అనుమానం ఉండదు. నగర ప్రవేశ మార్గాల్లో ఎటువంటి తనిఖీ కేంద్రాలు లేకపోవడం.. ఉన్నా అక్కడి వారు పట్టించుకోకపోవడంతో అక్రమ రవాణా సాగిపోతోంది. ఇక్కడి నుంచి కృష్ణా జిల్లాతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు గంజాయి రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. ఆడుతూపాడుతూ అక్రమ రవాణా.. విజయవాడ గంజాయి రవాణాకు అడ్డాగా మారింది. ఇక్కడి నుంచి రూ.లక్షల్లో విలువ చేసే వందల కిలోల గంజాయి రైళ్ల ద్వారా తరలిపోతోంది. ఒడిశాలోని బరంపురంతో పాటు విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పుగోదావారి, ఖమ్మం జిల్లాలోని మన్యం ప్రాంతాల నుంచి నిత్యం రైళ్లతో పాటు బస్సులు, కార్లలో రవాణా జరుగుతోంది. అయితే పోలీసులు పట్టుకున్న ప్రతిసారి చిన్న చేపలు మాత్రమే దొరకడం, పెద్ద చేపలు తప్పించుకోవడం పోలీసులకు సవాలుగా మారుతోంది. పట్టుబడ్డ వారంతా సామాన్యులే కావడం గమనార్హం. శ్రీకాకుళం నుంచి బాపట్ల, గుంటూరు వరకు విస్తరించిన రైల్వే పోలీసు డివిజన్లో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. పట్టుబడిన వారికి వెంటనే బెయిల్.. గంజాయి కేసుల్లో పట్టుబడ్డ వెంటనే లాయర్లను ఏర్పాటు చేసి బెయిల్ ఇప్పించే పనిని కూడా ముఠా సభ్యులే చూసుకుంటారు. సామాన్యులనే ఎంచుకుని రైళ్లలో ప్రయాణికులు మాదిరిగా బ్యాగులతో తరలించి ఎవరికీ అనుమానం రాకుండా ఈ వ్యాపారాన్ని సెల్ఫోన్లపైనే నడుపుతున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని రోజుల తరబడి పోలీసులు జాగ్రత్తగా ఉంచి న్యాయస్థానాల్లో హాజరుపరచాలి. ఎక్కువ సమయం వృథా అయ్యే కేసుగా గంజాయి కేసులు ఉంటాయని పోలీసులే చెబుతున్నారు. అందుకే ఈ కేసులపై అంతగా దృష్టి పెట్టలేమిని చెప్పేవారు లేకపోలేదు. గంజాయి అక్రమ రవాణా ముఠా సభ్యులు ఎక్కువగా మహిళలను ఎంచుకుంటున్నారు. పోలీసులు రైళ్లలో పరుషులను ఎక్కువగా తనిఖీ చేస్తుండడంతో మహిళల ద్వారా చేరవేస్తున్నారు. -
మత్తులో యువత చిత్తు
బసినికొండకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మృతిచెందాడు. ప్రభుత్వం కారుణ్య నియామకం కింద తండ్రి ఉద్యోగం కొడుకుకు ఇచ్చింది. ఆ యువకుడు తనకు వచ్చే జీతంలో సగం ఇంట్లో మిగతా డబ్బంతా స్నేహితులతో కలిసి మద్యం, గంజా యి తాగుతూ జల్సాలకు ఖర్చు చేస్తున్నాడు. మత్తుకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నాడు. దీంతో అతని కుటుంబం అర్ధాకలితో అలమటిస్తూ కాలం వెళ్లదీస్తోంది. శేషమహాల్ దగ్గర ఉంటున్న ఓ యువకుడు స్థానికంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తాడు. నెలకు రూ.65 వేలం జీతం వస్తుంది. ఇతనికి అమ్మానాన్నలతో పాటు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. స్నేహితులతో కలిసి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. సిగరెట్ కాల్చడంతోపాటు మద్యం సేవిస్తూ జీతాన్ని ఖర్చు చేస్తున్నాడు. ఆరోగ్యాన్ని గుల్ల చేసుకోవడంతోపాటు కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో ఎప్పుడు ఏ చెడు వార్త వినాల్సి వస్తుందోనని ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చిత్తూరు, మదనపల్లె టౌన్ : మదనపల్లె పట్టణంతో పాటు నియోజకవర్గంలో నిబంధనలు పాటించకకుండా విచ్ఛలవిడిగా మద్యం, సిగరెట్లు, గంజాయి, గుట్కా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో యువకులు మద్యం మత్తులో జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. మదనపల్లె నియోజకవర్గంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 299 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా వాటిలో మదనపల్లెలోనే 209 కేసులు ఉండడం ఇందుకు నిదర్శనం. కొంతమంది గంజాయిని అక్రమంగా విక్రయిస్తున్నారు. కాలేజీల్లో చదువుతున్న యువకులు మూత్రశాలలు, బాత్ రూముల్లో రహస్యంగా గంజాయి పీల్చుతున్నారు. మద్యం, గంజాయి, డ్రగ్ మత్తుకు బానిసలుగా మారుతున్న వారిలో అధిక శాతం మంది ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు, ఉద్యోగుల పిల్లలే ఉంటున్నారు. చెడు వ్యసనాలతో జీవితాలను నాశనం చేసుకోకుండా అవగాహన కల్పించాల్సిన అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇరుక్కుంటున్నారు మదనపల్లె పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువ అయ్యాయి. యువకులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడుతున్నారు. ఒక్కొక్కరికి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు అపరాధం విధిస్తున్నారు.– చలపతి, మాజీ వైస్ సర్పంచి, బసినికొండ వ్యసనాలతో జీవితం అంధకారం వ్యసనాలతోనే యువత జీవితం అంధకారమౌతోంది. చెడు సావాసం మానుకుని భవిష్యత్తును బంగారు మయం చేసుకోవాలి. మాకు తాగేవాడు దొరికినా, అమ్మేవాడు దొరికినా కేసుపెట్టి జైలుకు పంపుతాం. పోలీసులు దేన్నీ చూస్తూ ఊరుకోరు. – చిదానందరెడ్డి, డీఎస్పీ, మదనపల్లె యువత పెడతోవకు పాలకులేæ కారణం.. యువత పెడతోవ పట్టడానికి పాలకులే కారణం. వీధికో మద్యం షాపు పెట్టి విచ్ఛలవిడిగా విక్రయాలు సాగిస్తున్నారు. పోలీస్, ఎక్సైజ్ అధికారుల నిబంధనలను షాపులు, బార్ల యజమానులు బేఖాతర్ చేస్తునానరు. యువత మద్యం తాగడానికి క్యూకడున్నారు. – డాక్టర్ ఖాన్, మదనపల్లె -
ఆ మత్తుతో... ఎన్నో ప్రయోజనాలు
గంజాయి దమ్ము బిగించి కొడితే మత్తులో తేలిపోతామని చాలామంది అనుకుంటారుగానీ.. ఆ మత్తు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకూ చెక్ పెడుతుందని చెబుతున్నారు యూనివర్శిటీ ఆఫ్ న్యూ మెక్సికో శాస్త్రవేత్తలు. దుష్ప్రభావాలు కూడా చాలా తక్కువగా ఉంటాయని వీరు తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనం స్పష్టం చేసింది. మొబైల్ అప్లికేషన్ ఆధారంగా వీరు ఈ అధ్యయనం నిర్వహించారు. విపరీతమైన నొప్పి, నిద్రలేమి, మూర్ఛ, మానసిక కుంగుబాటు వంటి దాదాపు 27 ఆరోగ్య సమస్యలకు సంబంధించి దాదాపు లక్ష మంది నుంచి సమాచారం సేకరించి విశ్లేషించారు. గంజాయితో తమ లక్షణాలు దాదాపు సగానికి తగ్గిపోయాయని అధ్యయనంలో పాల్గొన్న వారు ‘రిలీఫ్’ ఆప్ ద్వారా తెలపడం విశేషం. గంజాయి మొగ్గలను నేరుగా వాడటం ద్వారా చాలామంది నిద్రలేమి సమస్యలను అధిగమించారని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జాకబ్ మిగ్యుల్ విజిల్ తెలిపారు. అల్లోపతి వైద్యవిధానంలో ఇచ్చే మందులతో అనేక దుష్ప్రభావాలు ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయాల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గంజాయి ప్రభావశీలతపై విస్తత స్థాయిలో సమాచారం సేకరించే లక్ష్యంతో తాము ఈ అధ్యయనం జరిపినట్లు విజిల్ అంటున్నారు.