![Officers Destroyed Marijuana Crop in Nizamabad District - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/27/ganjay%20copy.jpg.webp?itok=aRR8JvlB)
అధికారులు స్వాధీనం చేసుకున్న గంజాయి
నిజాంసాగర్ (జుక్కల్): జుక్కల్ మండలం కౌలాస్ ఖిల్లా అటవీ ప్రాంతంలోని పాండవుల గుట్టల్లో గుట్టుగా సాగు చేస్తున్న గంజాయి గుట్టును అధికారులు రట్టు చేశారు. రూ.5 లక్షల విలువైన గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్, బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో అధికారులు శనివారం మెరుపుదాడి చేశారు. పోచారం తండాకు చెందిన బార్దల్ నారాయణ కౌలాస్ అటవీ ప్రాంతంలో సాగు చేసిన 1.5 ఎకరాల్లో పత్తి పంటలో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నాడు. సమాచారమందుకున్న ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి చేసి, 1,050 గంజాయి మొక్కలను తొలగించి వాటిని కాల్చేశారు. నిందితుడు నారాయణపై కేసు నమోదు చేశామని, గంజాయి మొక్కల విలువ రూ.5 లక్షల వరకు ఉంటుందని ఎక్సైజ్ సీఐ సుధాకర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment