destroyed
-
ఒంగోలు కూరగాయల మార్కెట్లో బీభత్సం
ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని దామోదరం సంజీవయ్య ప్రధాన కూరగాయల మార్కెట్లో మంగళవారం పోలీసులు, నగర పాలక సంస్థ అధికారులు బీభత్సం సృష్టించారు. 2019 కరోనా సమయంలో ఉన్న బకాయిలు, వాటిపై వడ్డీ చెల్లించలేదంటూ దుకాణదారులపై విరుచుకుపడ్డారు. తెల్లవారు జామున నాలుగు గంటలకు దుకాణాలు తెరిచి కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకుందామని అన్నీ సిద్ధం చేసుకునే సరికి ఒక్కసారిగా అధికారులు, పోలీసులు మార్కెట్‌ను చుట్టుముట్టారు. తాత్కాలికంగా వేసుకున్న షెడ్డులను కూలదోసేందుకు ముప్పేట దాడి మొదలెట్టారు. ఇదేం దౌర్జన్యం అని అడిగేలోగానే దుకాణాలు నేలమట్టమయ్యాయి. ముందస్తు సమాచారంగానీ, నోటీసులు గానీ ఇవ్వకుండానే దాదాపు 200 మందికి పైగా మార్కెట్‌ను చుట్టుముట్టి భయానక వాతావరణాన్ని సృష్టించారు. కూరగాయలను బురదపాల్జేశారు. మార్కెట్లో దాదాపు 200కు పైగా హోల్‌సేల్, రిటైల్ దుకాణాలున్నాయి. ఇవి కాక మరో వంద వరకు చిరు వ్యాపారులు నేలపై పట్టలు పరుచుకుని కూరగాయలు అమ్ముకుంటుంటారు. ప్రతి దుకాణంలో రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు కూరగాయలను నష్ట పోయామంటూ బాధితులు లబోదిబోమంటున్నారు. దుకాణాలను ధ్వంసం చేసిన అధికారులు.. టీడీపీ సానుభూతిపరుల షాపుల జోలికి వెళ్లకపోవడంతో ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బాధితుల నిరసన కూరగాయల మార్కెట్లోని దుకాణాలపై ఉన్న పట్టలు, తడికలకు మంట పెట్టి అందులో కూరగాయలను దహనం చేసి బాధిత వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. అధికారుల చర్యలకు నిరసనగా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ప్రధాన గేటు ముందు కూర్చొని అధికారుల చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనా సమయంలో చెల్లించాల్సిన అద్దెబకాయిలకు రెండింతలు వడ్డీ వేసి మరీ కట్టాలని వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రధానమంత్రి పదవి ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారు
న్యూఢిల్లీ: దేశంలో 140 కోట్ల మంది ప్రజలకు నరేంద్ర మోదీ పదేపదే డొల్ల హామీలు ఇస్తూ ప్రధానమంత్రి పదవి గౌరవాన్ని, ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గురించి ఆందోళనను పక్కనపెట్టి, ప్రధాని పదవి గౌరవాన్ని పెంచడంపై ఇకనైనా దృష్టి పెట్టాలని మోదీకి హితవు పలికారు. ఈ మేరకు ప్రియాంక శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సత్యమే దేవుడు, సత్యమేవ జయతే అని జాతిపిత మహాత్మాగాంధీ తరచుగా బోధిస్తూ ఉండేవారని పేర్కొన్నారు. వేలాది సంవత్సరాల మన సంస్కృతికి సత్యమే ఆధారమని ఉద్ఘాటించారు. ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి అబద్ధాలు చెప్పడం, డొల్ల హామీలు ఇవ్వడం సరైందని కాదని స్పష్టంచేశారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాయన్ని వెల్లడించారు. గ్యారంటీలతో ప్రజల సొమ్మును ప్రజలకు అందజేస్తున్నాయని తెలిపారు. నరేంద్ర మోదీ ఎన్నో హామిలిచ్చారని, వాటిలో ఎన్ని నెరవేర్చారో చెప్పాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. మోదీ హామీలన్నీ బూటకమేనని తేలిపోయిందన్నారు. ‘అచ్చే దిన్’ ఎక్కడున్నాయో చెప్పాలని నిలదీశారు. -
ఇది ప్రకృతి వైపరీత్యం
సాక్షి, హైదరాబాద్ : వాతావరణంలో అనూహ్యంగా చోటుచేసుకున్న మార్పుల చేర్పులతోపాటు అరుదైన ప్రకృతి వైపరీత్యం కారణంగా ములుగు అడవుల్లో చెట్లకు భారీగా నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వానికి అటవీశాఖ నివేదిక సమర్పించింది. దీనిని ‘ఎకోలాజికల్ డిజాస్టర్’గానే పరిగణించాల్సి ఉంటుందని ఇందులో సూచించినట్టు సమాచారం. మొత్తంగా 204 హెక్టార్లలో (500 నుంచి 600 ఎకరాల్లో) దాదాపు 70 వేల దాకా వివిధ జాతుల చెట్లకు నష్టం వాటిల్లినట్టు పేర్కొంది. అటవీ పునరుద్ధరణతోపాటు, భూసార పరిరక్షణ చర్యలు, గ్యాప్ ఏర్పడిన చోట్ల వాటిని నింపేలా పెద్దమొత్తంలో మొక్కల పెంపకం, వంటివి చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో ఇంకా అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతోపాటు, కొండ ప్రాంతాలు వంటివి ఉండడంతో జరిగిన నష్టం, కూలిన చెట్ల వివరాల సేకరణ అంత వేగంగా సాగడం లేదని అటవీ అధికారులు చెబుతున్నారు.వివిధ రూపాల్లో వాటిల్లిన నష్టంపై వారంరోజుల్లో క్షేత్రస్థాయి నుంచి ఒక స్పష్టమైన అంచనాకు వచ్చాక పర్యావరణం, అడవులతో సంబంధమున్న నిపుణులతో అధ్యయనం జరిపించాలని అటవీశాఖ నిర్ణయించింది. దేశంలోనే అత్యంత అరుదైన రీతిలో ములుగు అటవీప్రాంతంలో చెట్లకు నష్టం జరిగినందున, పూర్తి సమాచారం అందిన తర్వాతే అటవీ ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి సవివరమైన నివేదిక అందజేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ములు గులో సుడిగాలుల బీభత్సం సమయంలోనే ఆదిలా బాద్ జిల్లా ఉట్నూరులో, ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలోనూ స్వల్పస్థాయిలో చెట్లకు నష్టం జరిగినట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు వస్తేనే...హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) నుంచి ఉపగ్రహ ఛాయాచిత్రాలను సేకరించడం ద్వారా ములుగు అటవీ విధ్వంసం కారణాలు వెల్లడి కాగలవని అటవీశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి అవసరమైన డేటాను ఉపగ్రహం నుంచి సేకరిస్తున్నామని, రెండురోజుల్లో దీనిపై వివరాలు అందజేస్తామని ఎన్ఆర్ఎస్సీ అధికారులు చెప్పారు. ఈ సమాచారాన్ని తమ ఎర్త్ అండ్ క్లైమేట్ సైన్స్ ఏరియా డివిజన్ క్రోడీకరించి అందజేస్తామని అటవీ అధికారులకు చెప్పారు. అయితే భారత వాతావరణ శాఖ (ఐఎండీ)పై అటవీ అధికారులు పెట్టుకున్న ఆశలు మాత్రం నెరవేరలేదు.ములుగు పరిసర ప్రాంతాల్లో తమ అబ్జర్వేటరీ లేనందువల్ల, ఈ బీభత్సం చోటుచేసుకున్న రోజునాటి వివరాలు ఇవ్వలేకపోతున్నామని అధికారులకు ఐఎండీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఐఎండీనే చేతులెత్తేస్తే ఇంకా తమకు ఎవరు వాతావరణ సాంకేతిక విషయాలు అందించగలరని అటవీ అధికారులు విస్తుపో తున్నారు. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టంపై ఎన్యుమరేషన్ పూర్తయి, ఎన్ఆర్ఎస్సీ నుంచి సాంకేతిక సమాచారం అందాక 2,3 రోజుల్లో ములుగు జిల్లా అటవీ అధికారులు నివేదిక సమర్పించే అవకాశాలున్నాయి. -
రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడి
ఉక్రెయిన్- రష్యాల మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తాజాగా ఉక్రేనియన్ దళాలు పశ్చిమ రష్యాలోని సెమ్ నదిపై ఉన్న మూడు వంతెనలను ధ్వంసం చేశాయి. దీనికి సంబంధించిన వివరాలను రష్యన్ అధికారులు మీడియాకు వెల్లడించారు.పశ్చిమ రష్యాపై ఉక్రెయిన్ దాడి మూడో వారంలోకి ప్రవేశించింది. రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో జరిగిన కీవ్ దాడి.. యుద్ధ పరిణామాలను ఊహకందని విధంగా మార్చివేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యాపై ఇదే అతిపెద్ద దాడి అని చెబుతున్నారు. ఈ తాజా దాడి నేపధ్యంలో ఉక్రెయిన్ విజయోత్సవాలు చేసుకుంటుండగా, అదే సమయంలో తూర్పు ఉక్రెయిన్‌లోని పోక్రోవ్స్క్‌ను కూడా స్వాధీనం చేసుకునే దిశగా రష్యా ముందుకు కదులుతోంది.కుర్స్క్ పరిధిలోని సెయిమ్ నదిపైగల మూడు వంతెనలపై ఉక్రేనియన్ దాడి చేసింది. ఉక్రెయిన్ వైమానిక దళ కమాండర్ సెమ్ నదిపైగల వంతెనలపై జరిపిన దాడులకు సంబంధించిన రెండు వీడియోలను పోస్ట్ చేశారు. కుర్స్క్ ప్రాంతంలో దాడి మొదలుపెట్టినప్పటి నుండి ఉక్రేనియన్ దళాలు 1,250 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని, 92 రష్యా స్థావరాలను స్వాధీనం చేసుకున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు.తమ దేశంపై భవిష్యత్తులో జరిగే సరిహద్దు దాడులను నిరోధించేందుకు ‘బఫర్ జోన్’ను ఏర్పాటుచేసే లక్ష్యంతో ఉన్నామని జెలెన్స్కీ పేర్కొన్నారు. అలాగే ఉక్రెయిన్ దగ్గర భారీ సంఖ్యలో రష్యన్ యుద్ధ ఖైదీలు ఉన్నారని తెలిపారు. రష్యా తన దగ్గరున్న ఉక్రెయిన్ పౌరులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలావుండగా ఉక్రేనియన్ సైన్యం జరిపిన దాడిలో తమ దేశానికి చెందిన 17 మంది మృతిచెందారని, 140 మంది గాయపడ్డారని రష్యన్ మెడికల్ సర్వీస్‌కు చెందిన ఒక అధికారి తెలిపారు. -
టీడీపీ నేతలే నా బైక్ తగలబెట్టారు: YSRCP నేత పిచ్చయ్య
-
అమిత్ షా చేతుల మీదుగా డ్రగ్స్ ధ్వంసం
ఢిల్లీ: దేశంలో ఇవాళ ఓ భారీ పరిణామం చోటు చేసుకుంది. భారీ మొత్తంలో డ్రగ్స్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) ధ్వంసం చేసింది. కేంద్ర హోం మంత్రి వర్చువల్‌గా బటన్ నొక్కి ఈ కార్యక్రమం ప్రారంభించి.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆ ధ్వంసాన్ని వీక్షించారు. ఢిల్లీలో ఇవాళ కేంద్రం హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో డ్రగ్స్ ట్రాఫికింగ్ అండ్ నేషనల్ సెక్యూరిటీ ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ భేటీ నుంచే ఆయన లక్షా 44 వేల కేజీల డ్రగ్స్‌ను నాశనం చేయడాన్ని ప్రారంభించి.. వీక్షించారు. ఈ డ్రగ్స్ మొత్తం విలువ సుమారు రూ. 2,416 కోట్లు ఉంటుందని తేలింది. ఎన్సీబీ.. యాంటీ నార్కోటిక్స టాస్క్ ఫోర్స్ సమన్వయంతో ఈ ఆపరేషన్‌ను చేపట్టింది. అందులో ఎన్సీబీ హైదరాబాద్ యూనిట్ నుంచి 6,590 కేజీలు, ఇండోర్ యూనిట్ 822 కేజీలు, జమ్ము యూనిట్ 356 కేజీలు సీజ్ చేసినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే.. అసోం నుంచి 1,468 కేజీలు, ఛండీగఢ్ నుంచి 229 కేజీలు, గోవా నుంచి 25 కేజీలు, గుజరాత్ నుంచి 4,277 కేజీలు, జమ్ము కశ్మీర్ నుంచి 4,069 కేజీలు, మధ్యప్రదేశ్ నుంచి 1,03,884 కేజీలు, మహారాష్ట్ర నుంచి 159 కేజీలు, త్రిపుర నుంచి 1,803 కేజీలు, ఉత్తర ప్రదేశ్ నుంచి 4,049 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని నాశనం చేఏసినట్లు వెల్లడించింది. #WATCH | #Delhi | Union Home Minister #AmitShah chairs Regional Conference on ‘Drugs Trafficking and National Security’ in New Delhi; over 1,44,000 kilograms of drugs being destroyed in various parts of the country by #NCB, in coordination with ANTFs of all states. (ANI) pic.twitter.com/hE8kblYX6E — Argus News (@ArgusNews_in) July 17, 2023 డ్రగ్స్ రహిత దేశంగా భారత్‌ను మలిచే క్రమంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం ఈ ఆపరేషన్ చేపట్టింది. జూన్ 1,2022 నుంచి జులై 15వ తేదీల మధ్య ఎన్సీపీ అన్ని యూనిట్లు, అన్ని రాష్ట్రాల యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్‌ల సమన్వయంతో రూ.9,580 కోట్ల విలువ చేసే 8,76,554 కేజీల డ్రగ్స్‌ను నాశనం చేశారు. ఇది నిర్దేశించుకున్న టార్గెట్ కంటే 11 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. -
నేడు అమిత్ షా సమక్షంలో.. 1.44 లక్షల కిలోల డ్రగ్స్ ధ్వంసం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విధ్వంసానికి కేంద్రం రంగం సిద్ధం చేసింది. సోమవారం ఢిల్లీలో హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో నిర్వహించనున్న ‘డ్రగ్స్ స్మగ్లింగ్, జాతీయ భద్రత’ సదస్సులో ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ ఎన్సీబీ పరిధిలో పట్టుకున్న 6,590 కిలోలు సహా 1,44,000 కిలోల మాదకద్రవ్యాలను (రూ.2,416 కోట్లు) ధ్వంసం చేయనున్నారు. దీంతో కలిపి జూన్ 1, 2022 నుంచి జులై 15, 2023 వరకూ రాష్ట్రాల్లోని ఎన్సీబీ, యాంటీ నార్కొటిక్స్ టాస్క్ ఫోర్స్‌ల ప్రాంతీయ యూనిట్లు సమష్టిగా సుమారు రూ.9,580 కోట్ల విలువైన 8.76 లక్షల కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేశాయి. సోమవారం నాటితో ఏడాదిలో ధ్వంసమయ్యే డ్రగ్స్ మొత్తం 10 లక్షల కిలోలు దాటనుంది. డ్రగ్స్ రహిత భారతదేశాన్ని సృష్టించడానికి ప్రభుత్వం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జీరో టోలరెన్స్ విధానం అవలంభిస్తోందని హోంశాఖ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. -
థియేటర్ ధ్వంసం.. పవన్ అభిమానులపై కేసు
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): తొలిప్రేమ సినిమా ప్రదర్శించిన థియేటర్‌ను ధ్వంసం చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులపై విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా శుక్రవారం నగరంలోని గాంధీనగర్‌లో ఉన్న కపర్థి థియేటర్లో ప్రదర్శించారు. సెకండ్ షో రాత్రి 10.30 గంటలకు మొదలవగా, 10.45కి కొంతమంది అభిమానులు స్క్రీన్ వద్దకు చేరి డ్యాన్సులు చేశారు. స్క్రీన్‌ను చింపేందుకు ప్రయతి్నంచగా, థియేటర్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో పవన్ అభిమానులు రెచి్చపోయి సిబ్బందిపై దాడి చేశారు. స్క్రీన్‌ను చించివేశారు. కుర్చీలు, తలుపులు విరగ్గొట్టారు. అద్దాలను పగులగొట్టారు. సినిమాకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు థియేటర్లో విధ్వంసం సృష్టించి రూ.4 లక్షలు ఆస్తి నష్టం కలిగించారని థియేటర్ మేనేజర్ బి.మోహనరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు శనివారం కేసు నమోదు చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఇది కూడా చదవండి: చనిపోయినట్లు భావించి అంత్యక్రియలకు ఏర్పాట్లు -
టైటాన్ విషాదం.. అయిదుగురూ ప్రాణాలు కోల్పోయినట్లే!
-
టైటాన్ ఆశలు జల సమాధి
దుబాయ్/బోస్టన్: ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉదంతం.. విషాదాంతం అయ్యింది. అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ ఓడ శకలాలను తిలకించడానికి టైటాన్ మినీజలాంతర్గామిలో వెళ్లిన అయిదుగురూ ప్రాణాలు కోల్పోయినట్లే!. టైటాన్ శకలాలను టైటానిక్ సమీపంలోనే గుర్తించినట్లు అమెరికా తీర రక్షక దళం అధికారికంగా ప్రకటించింది. ఓవైపు ఉత్కంఠగా అన్వేషణ కొనసాగుతున్న తరుణంలో.. ప్రాణవాయువు(ఆక్సిజన్) ముగిసిపోయే అంచనా గడువు దగ్గరపడుతున్న సమయంలోనే ఈ ప్రకటన వెలువడంది. తాము నీటి అడుగుకు పంపించిన రిమోటెడ్ ఆపరేటెడ్ వెహికిల్.. శకలాలను గుర్తించిందని వెల్లడించింది. అవి టైటాన్వేనని భావిస్తున్నట్లు తెలిపింది. ‘తమ సంస్థ చీఫ్ పైలట్.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాక్టన్ రష్, ప్రయాణికులైన షహ్జాదా దావూడ్, ఆయన కొడుకు సులేమాన్ దావూద్, హామిష్ హార్డింగ్, పౌల్–హెన్రీ నర్గియెలెట్ మృతి చెందారు’అని ఓషన్ గేట్ తెలిపింది. అయితే, వారు ఎలా ప్రాణాలు కోల్పోయారనే విషయం మాత్రం వెల్లడించలేదు. ఆదివారం ఉదయం బయలుదేరిన సమయంలో టైటాన్లో దాదాపు 96 గంటలపాటు మాత్రమే శ్వాసించేందుకు అవసరమైన ఆక్సిజన్ ఉంది. ఆ సమయం కూడా ముగిసిపోయింది. గురువారం ఉదయానికల్లా జలాంతర్గామిలో ఆక్సిజన్ ఇక పూర్తిగా నిండుకున్నట్లే. అయితే, టైటాన్ గల్లంతైన రోజే వారు మరణించారా? అంటే..ఆ పరిస్థితిని కూడా కొట్టిపారేయలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టైటాన్ ఆదివారం ఉదయం కెనడాలోని న్యూఫౌండ్లాండ్ నుంచి 700 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో గల్లంతైన సంగతి తెలిసిందే. టైటాన్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించడం ఒక పెద్ద సవాలుగా మారింది. అమెరికా కోస్ట్‌గార్డ్ సిబ్బంది సముద్రంలో టైటాన్ కోసం తీవ్ర అన్వేషణ కొనసాగించింది. సెర్చ్ ఆపరేషన్ కోసం మరిన్ని నౌకలు, విమానాలను, ఇతర పరికరాలను రంగంలోకి దించారు. ఫ్రెంచ్ పరిశోధక సంస్థ కెమెరాలు, లైట్లతో కూడిన డీప్–డైవింగ్ రోబోట్‌ను సముద్రంలోకి పంపించింది. A debris field was discovered within the search area by an ROV near the Titanic. Experts within the unified command are evaluating the information. 1/2 — USCGNortheast (@USCGNortheast) June 22, 2023 Coast Guard holds press briefing about discovery of debris belonging to the 21-ft submersible, Titan. #Titanic https://t.co/aPSeEaBuG8 — USCGNortheast (@USCGNortheast) June 22, 2023 -
ఉక్రెయిన్‌లో భారీ డ్యామ్ కూల్చివేత ?
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నిరవధికంగా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ దాడుల్లో దక్షిణ ఉక్రెయిన్‌లోని కాఖోవ్కా హైడ్రో ఎలెక్ట్రిక్ డ్యామ్ తునాతునకలైంది. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఈ డ్యామ్ తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భారీ నష్టం... దక్షిణ ఉక్రెయిన్ లోని డెనిప్రో నదిపై నిర్మించబడిన ఈ కాఖోవ్కా డ్యామ్ ప్రధానంగా క్రైమే పెనిన్సులా, న్యూక్లియర్ ప్లాంట్ కు నీటిని సరఫరా చేస్తుంటుంది. ఈ ఒక్క డ్యామ్ కూలిన కారణంగా కిందన ఉన్న అనేక పట్టణాల్లో వరద ప్రమాదం పొంచి ఉంది. ఆయా లోతట్టు నివసిస్తున్న వారిని వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాల్సిందిగా ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. డ్యామ్ కూల్చివేతపై రష్యా బలగాలు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు కానీ ఉక్రెయిన్ మాత్రం రష్యాపైనే ఆరోపణలు చేస్తోంది. BREAKING: Video shows the Kakhovka hydro-electric dam in southern Ukraine has been destroyed pic.twitter.com/DePGbQUHRD — BNO News (@BNONews) June 6, 2023 -
కర్ణాటక ఎన్నికలో రచ్చ రచ్చ...
-
మార్గదర్శిలో భారీగా నల్లధనం చలామణీ జరిపినట్టు సీఐడీ అంచనా
-
ఘోర అగ్ని ప్రమాదం... 21 కార్లు దగ్ధం
ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బహుళ అంతస్తుల భవనంలోని పార్కింగ్ ప్రదేశంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 21 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన ఢిల్లీలోని సుభాష్ నగర్లో సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు చోటు చేసుకుంది. ఈ ఘటనకు గల కారణాలేంటో తెలియరాలేదని అధికారులు చెబుతున్నారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించగా..ఒక అపరిచిత వ్యక్తి పార్కింగ్ ప్రదేశంలో సంచరించినట్లు కనిపించిందని అదికారులు తెలిపారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఆరు అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ని చేపట్టినట్లు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది ఉదయం సుమారు 6.10 నిమిషాలకు మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా ఈ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతోంది. मेरे वॉर्ड #SubhashNagar में सुबह 3 बजे के आस-पास किसी असामाजिक तत्व ने MCD की मल्टी लेवल कार पार्किंग में आग लगा दी जिसमें लगभग 30-35 गाड़ियाँ जलकर ख़ाक हो गई हैं। मैं सुबह से ही मौक़े पर मौजूद हूं और दोषी को पकड़वाने के लिए हर संभव प्रयास कर रहा हूं pic.twitter.com/itbGV2wQ7U — Aditya Goswami (@AdityaGoswami_) December 26, 2022 (చదవండి: ఇంట్లో ఆయుధాలు లేదా పదునైనా కత్తులైనా ఉంచుకోండి: బీజేపీ ఎంపీ షాకింగ్ వ్యాఖ్యలు) -
ఏపీలో భారీగా గంజాయి దహనం
-
గంజాయిపై ఏపీ పోలీసుల ఉక్కుపాదం
-
ఒక్క ప్రమాదం.. ఆరు కార్లు ధ్వంసం
రామవరప్పాడు: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరు జాతీయ రహదారిపై శనివారం జరిగిన ప్రమాదంలో ఆరు కార్లు ధ్వంసమయ్యాయి. గన్నవరం నుంచి విజయవాడ వైపుగా వస్తున్న ఓ కారు నిడమానూరు జాతీయ రహదారి వంతెన సమీపంలో వచ్చే సరికి డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో దాని వెనుకగా వస్తున్న 5 కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన కార్లను ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా పక్కకు తీయించారు. (చదవండి: భయంకరమైన యాక్సిడెంట్: మహిళ పైకి దూసుకుపోయిన బీఎండబ్ల్యూ కారు) -
Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై ఆగని బాంబుల వర్షం
బుచా/కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒడెసా సమీపంలో ఆదివారం క్షిపణుల వర్షం కురిపించాయి. ఉక్రెయిన్ సైన్యం ఉపయోగిస్తున్న చమురు శుద్ధి కర్మాగారాన్ని, మూడు చమురు డిపోలను ధ్వంసం చేశామని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. కోస్తియాన్టినివ్కా, ఖ్రేసిచేలో ఆయుధ డిపోలను సైతం ధ్వంసం చేశామని తెలియజేసింది. మారియుపోల్ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఖర్కీవ్‌పై 20 వైమానిక దాడులు జరిగాయి. బలాక్లియా పట్టణంలో ఆసుపత్రిపై రష్యా క్షిపణి దాడికి పాల్పడింది. మరోవైపు ఇరు దేశాల మధ్య చర్చలు సోమవారం మళ్లీ మొదలవనున్నాయి. బుచాలో దారుణ దృశ్యాలు కొన్ని వారాలుగా రష్యా సైన్యం నియంత్రణలో ఉన్న రాజధాని కీవ్ ఉత్తర ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నామని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. కీవ్‌కు 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుచా పట్టణం ఇప్పటికే ఉక్రెయిన్ అధీనంలోకి వచ్చింది. అక్కడ శవాలు వీధుల్లో చెల్లాచెదురుగా దర్శనమిచ్చాయని మీడియా ప్రతినిధలు చెప్పారు. వాటికి సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తూర్పు ప్రాంతంలో రష్యా భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది. ఉత్తర ఉక్రెయిన్ నుంచి సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించింది. ఉక్రెయిన్‌లో మందుపాతర్ల బెడద రష్యా జవాన్లు తమ భూభాగంలో ఎక్కడిక్కడ మందుపాతరలు ఏర్పాటు చేశారని అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. రోడ్లపై, వీధుల్లో, ఇళ్లలో, అఖరికి శవాల లోపలా మందుపాతరలు పె ట్టారన్నారు. మరిన్ని ఆధునిక ఆయుధాలు, యుద్ధ విమానాలివ్వాలని పశ్చిమ దేశాలను కోరారు. రంజాన్‌పై యుద్ధ ప్రభావం యుద్ధంతో చమురు, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగినందున ఈసారి రంజాన్ జరుపుకోవడం కష్టమేనని లెబనాన్, ఇరాక్, సిరియా, సూడాన్, యెమెన్ తదితర దేశాల్లో జనం వాపోతున్నారు. వాటికి గోధుమలు, బార్లీ గింజలు, నూనె గింజలు రష్యా, ఉక్రెయిన్ నుంచే వెళ్తాయి. లిథువేనియాకు చెందిన ప్రముఖ సినీ దర్శకుడు రావిసియస్ మారియుపోల్‌లో కాల్పుల్లో మృతి చెందారు. రష్యా సైన్యంలో తిరుగుబాటు! సుదీర్ఘ యుద్ధంతో ఉక్రెయిన్‌లో రష్యా సైనికులు నీరసించిపోతున్నట్లు చెప్తున్నారు. ముందుకెళ్లడానికి వారు ససేమిరా అంటున్నారు. సొంత వాహనాలు, ఆయుధాలనూ ధ్వంసం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఉత్తర్వులను లెక్కచేయడం లేదు. సైనికుల్లో తిరుగుబాటు మొదలైందని, పుతిన్ మొండిపట్టుపై వారు రగిలిపోతున్నారని ఉక్రెయిన్ అంటోంది. ‘‘సహచరుల మరణాలు రష్యా సైనికులను కలచివేస్తున్నాయి. స్థైర్యం సన్నగిల్లి ఆస్త్ర సన్యాసం చేస్తున్నారు’’ అరని నాటో కూటమి అంటోంది. యుద్ధానికి రష్యా సైన్యం విముఖత వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. 1905 జూన్‌లో రూసో–జపనీస్ యుద్ధంలోనూ వారు ఇలాగే సహాయ నిరాకరణ చేశారు. ఉన్నతాధికారులపై తిరగబడ్డారు. వారి ఆదేశాలను ధక్కిరించారు. -
మ్రియాను మించి.. ఆకాశాన ఏతెంచి...
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో విమానం ధ్వంసమైంది. సోమవారం ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడుల్లో ఆంటోనోవ్ ఏఎన్–225 మ్రియా విమానం ధ్వంసమైంది. అయితే అంతకన్నా పెద్ద విమానం స్ట్రాటో లాంచ్ ఇటీవల అమెరికాలో నింగిలోకి ఎగిరింది. ఆ విమానం ఎలా ఉంటుంది.. అది ఎక్కడ, ఎంత ఎత్తుకు ఎగిరింది. దాన్ని ఎవరు రూపొందించారు. అనే ఆసక్తికర విషయాలేంటో చూద్దాం! –సాక్షి, సెంట్రల్ డెస్క్ స్ట్రాటోలాంచ్ అనే బాహుబలి విమానాన్ని ఇటీవల అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో విజయవంతంగా పరీక్షించారు. మోజవ్ ఎయిర్ స్పేస్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఈ విమానం గంటా 43 నిమిషాలపాటు గగనతలంలో చక్కర్లుకొట్టింది. గరిష్టమైన 15వేల అడుగుల ఎత్తుకు వెళ్లి విన్యాసాలు చేసింది. దీన్ని ఇప్పటిదాకా మూడుసార్లు పరీక్షించగా, తాజాగా నాలుగోసారి కాలిఫోర్నియాలో పరీక్షించారు. దీని రెక్కల పొడవు 383 అడుగులు (117 మీటర్లు). సాధారణంగా ఫుట్‌బాల్ స్టేడియం 345 అడుగుల వెడల్పుతో ఉంటే ఇది అంతకన్నా పెద్దగా ఉంటుంది. 50 అడుగుల ఎత్తుతో ఉండే ఈ విమానంలో బోయింగ్ 747లో ఉన్నటువంటి ఇంజిన్ ఉంటుంది. ఇది 2,26,796 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది. రెండు విమానాలను కలిపితే ఎలా ఉంటుందో చూడ్డానికి ఇది అలానే ఉంటుంది. ఆపరేషనల్ స్థాయికి సమీపించినట్లే... స్ట్రాటోలాంచ్ను నాలుగోసారి ప్రయోగించినప్పుడు మొదటిసారి విమానంలోని అన్ని ల్యాండింగ్ గేర్లను ఉపసంహరించుకోవాలని భావించారు. అయితే ఒక గంట తర్వాత విమానంలో వైబ్రేషన్ సమస్యతోపాటు వార్నింగ్లైట్ రావడంతో అనుకున్న సమయానికంటే ముందుగానే వెనుదిరిగింది. దీంతో మోజవ్ ఎయిర్‌పోర్ట్‌లో విజయవంతంగా ల్యాండ్ అయింది. విమానంలో ఇద్దరు పైలట్లతోపాటు ఒక ఫ్లైట్ ఇంజనీర్ ఉన్నారు. విమానం ఫుల్ ల్యాండింగ్ గేర్ ఉపసంహరణ స్థాయి వరకు వచ్చిందంటే ఇది ఆపరేషనల్ స్థాయికి సమీపించినట్టేనని, మొత్తమ్మీద ఇది విజయవంతమైందని స్ట్రాటోలాంచ్ అధ్యక్షుడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ జకరీ క్రెవోర్ చెప్పారు. 2017 మేలో దీన్ని తొలిసారి పరీక్షించారు. వచ్చే ఏడాది మధ్యనాటికల్లా... మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు పాల్ అలెన్‌కు చెందిన సంస్థ దీన్ని రూపొందించింది. 2023 మధ్యనాటికల్లా దీన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ హైపర్సోనిక్ విమానం అనేక సంప్రదాయ రక్షణ వ్యవ స్థలను సమర్థంగా ఎదుర్కోవడంతోపాటు వేగం గా ఆయుధాలను చేరవేయగలదు. 2011లో చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయాన్ని తొలుత రూ.2,250 కోట్లుగా భావించగా, 2019 నాటికి 3 వేల కోట్లకు చేరిందని అంచనా. ఈ విమానం అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైన ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లగలదు. తన రెక్కల ద్వారా ఒకేసారి 3 శాటిలైట్ రాకెట్లను తీసుకెళ్లే లక్ష్యంతో దీన్ని చేపట్టారు. -
టీడీపీ కార్యకర్తల బరితెగింపు !
కంచికచర్ల(కృష్ణా జిల్లా): వైఎస్సార్ సీపీ నాయకుల ఫ్లెక్సీను చింపేసిన సంఘటన సోమవారం గొట్టుముక్కల గ్రామంలో వెలుగులోకి వచ్చింది. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మాజీ సర్పంచ్ గుదే రంగారావు, ఎంపీటీసీ సభ్యురాలు గుదే సరస్వతి వైఎస్సార్ సీపీ నేతల ఫొటోలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇది జీర్ణించుకోలేని ఆకతాయిలు రాత్రి వేళ ఫ్లెక్సీని చింపివేశారు. చదవండి: AP: బండారుపై తిరగబడ్డ జనం.. వెళ్లవయ్యా.. వెళ్లు! 2014లో గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ వార్డు సభ్యుడు ఆలోకం కృష్ణారావును చిన్నపాటి వివాదానికి టీడీపీ కార్యకర్తలు హత్య చేశారు. గతంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు గుదే అక్కారావుపై టీడీపీ నాయకులు హత్య ప్రయత్నం చేశారు. ఫ్లెక్సీని టీడీపీ నాయకులే ధ్వంసం చేసి ఉంటారని వైఎస్సార్ సీపీ నాయకులు భావిస్తున్నారు. -
పాక్‌లో రాజా రంజిత్ సింగ్ విగ్రహం ధ్వంసం
లాహోర్: సిక్కు వర్గానికి చెందిన మహారాజా రంజిత్ సింగ్ కంచు విగ్రహాన్ని తెహ్రీక్ ఈ లబ్బైక్ పాకిస్తాన్ (టీఎల్పీ) కార్యకర్త ధ్వంసం చేశాడు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సుకు చెందిన లాహోర్ ఫోర్ట్ వద్ద ఈ విగ్రహం ఉంది. పలు నినాదాలు చేస్తూ, విగ్రహాన్ని ఓ వైపు నుంచి కూల్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనంతరం మరో వ్యక్తి వెళ్లి విగ్రహపు చేతిని ధ్వంసం చేయడం వీడియోలో కనిపించింది. 2019లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ఎత్తు 9 అడుగులు ఉంటుంది. సిక్కు సంప్రదాయ రూపంతో కత్తి పట్టుకొని గుర్రం మీద మహారాజ రంజిత్ సింగ్ కూర్చొని ఉంటారు. దీనిపై పాక్ ప్రభుత్వం స్పందించింది. సమాచార మంత్రి ఫవాద్ చౌధరి మాట్లాడుతూ.. ఇలాంటి నిరక్షరాస్యుల వల్ల అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు పోతోందని వ్యాఖ్యానించారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ సలహాదారు షబ్నాజ్ గిల్ మాట్లాడుతూ, నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నిందితున్ని ఇప్పటికే పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై భారత్ స్పందించింది. మైనారిటీల్లో భయం పోగొట్టడంలో పాక్ ప్రభుత్వం విఫలమైందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పాక్‌లో తరచుగా జరుగుతున్నాయని అన్నారు. విగ్రహాలు ధ్వంసం చేయడం ఇది మూడో ఘటన అని పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల్లో ఈ తీరు వల్ల భయాందోళనలు వ్యక్తమవుతున్నాయన్నారు. -
బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ
ఖైరతాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్‌ను నెక్లెస్ రోడ్డులో ఖైరతాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి విజయారెడ్డి, స్థానికులు సోమవారం రాత్రి అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ విషయంపై సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ బీజేపీ నాయకులతో కలసి బండి సంజయ్ రాత్రి 8:50 గంటలకు నెక్లెస్ రోడ్డులో ఉన్నారనే సమాచారం రావడంతో రాంగోపాల్‌పేట్ ఇన్స్పెక్టర్ను అక్కడికి పంపించినట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి నాయకులు పబ్లిక్ ప్లేస్‌లో తిరగడం మంచిది కాదని పోలీసులు నచ్చజెప్పారు. దీంతో బండి సంజయ్, ఆయన అనుచరులు కారులో వెళ్తుండగా కొందరు యువకులు, టీఆర్ఎస్ ఖైరతాబాద్ అభ్యర్థి విజయారెడ్డి బండి సంజయ్ కారును అడ్డుకున్నారని డీసీపీ చెప్పారు. వాహనాన్ని ముందుకు పంపించడంతో వెనుక ఉన్న వాహనాన్ని అడ్డుకొని అద్దాన్ని పగలగొట్టారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదన్నారు. ఇరు పార్టీల వారిని వెంటనే అక్కడి నుంచి పంపించామని డీసీపీ విశ్వప్రసాద్ వివరించారు. అయితే ఎన్నికల కోడ్ ఉన్నా కూడా బండి సంజయ్ మక్తాలో అనుచరులతో డబ్బులు పంపిణీ చేసేందుకు ప్రయత్నించడంతో అడ్డుకున్నట్లు విజయారెడ్డి తెలిపారు. మహిళ అని కూడా చూడకుండా తనను తోశారని, కానీ ఆయనపైనే దాడి జరిగినట్లు ఆరోపిస్తున్నారని విమర్శించారు. సంజయ్ కారును తనిఖీ చేయాలన్నా చేయకపోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని విజయారెడ్డి తెలిపారు. కాగా, చంపాపేట డివిజన్లో టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నట్లు తెలుసుకున్న బీజేపీ నేతలు అక్కడకు వెళ్లి వారిని నిలదీయడం ఉద్రిక్తతకు దారితీసింది. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హుటాహుటిన కాలనీకి చేరుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీ మహేష్ భగత్ నేతలకు నచ్చజెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ దాడులు: కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ‘లా అండ్ ఆర్డర్‌ను కాపాడాల్సిన పోలీసులే టీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. టీఆర్ఎస్ డబ్బులు, మద్యంతో ఓటర్లను ప్రభావితం చేస్తుంటే అడ్డుకొని పట్టిస్తున్న బీజేపీ కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ ఓడిపోతామనే భయంతో ఎంతకైనా దిగజారడం మంచి పద్ధతి కాదు ’అని కిషన్‌రెడ్డి అన్నారు. కాగా, ‘టీఆర్ఎస్ ఏవిధంగానైనా గెలవాలననే దురుద్దేశంతో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తోంది. అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తోంది’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు తనపై దాడి చేశారని, ఇంకా అనేక చోట్ల బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని సంజయ్ ఆరోపించారు. కాగా, టీఆర్ఎస్ దాడుల కు నిరసనగా నేడు(మంగళవారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు డాక్టర్ కె.లక్ష్మణ్, ఆ డీకే అరుణ దీక్ష చేపట్టున్నట్లు ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. -
పీఓకేలో ఉగ్ర స్థావరాలు ధ్వంసం!
న్యూఢిల్లీ: కశ్మీర్లో అలజడి సృష్టించడమే లక్ష్యంగా ఉగ్రవాదులను ఎగదోస్తున్న పాకిస్తాన్‌కు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పింది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని అనుమానిత ఉగ్రవాద స్థావరాలపై గురువారం విరుచుకుపడింది. భారత సైన్యం దాడిలో ముష్కరుల స్థావరాలు ధ్వంసమైనట్లు సమాచారం. వారికి భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు పీఓకేలో తిష్ట వేశారు. పాకిస్తాన్ సైనికుల అండతో భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి కుట్రలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. చలికాలం ప్రారంభం కావడానికంటే ముందే ఉగ్రవాదులను భారత్‌లోకి పంపాలని పాక్ విశ్వప్రయత్నాలు సాగిస్తోంది. భారత సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో పాక్ ఆటలు సాగడం లేదని అధికారులు వెల్లడించారు. పాక్ సైన్యం ఇటీవల తరచుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ఎల్ఓసీ వద్ద భారత సైన్యంపై, పౌరులపై కాల్పులకు తెగబడుతోంది. భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతున్న పాక్ సైన్యానికి హెచ్చరికలు పంపడంతోపాటు ఉగ్రవాదుల పీచమణచడమే లక్ష్యంగా భారత సైన్యం పీఓకేలో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. అయితే, నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద గురువారం ఎలాంటి కాల్పులు జరగలేదని సైనిక వర్గాలు స్పష్టం చేశాయి. -
మావోయిస్టుల పలాయనం
బరంపురం: కొందమాల్ జిల్లాలో రెండు రోజులుగా మావోయిస్టులు, సీఆర్పీఎఫ్, ఎస్ఓజీ జవాన్ల మధ్య రెండు వేర్వేరు అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎదురు కాల్పుల సంఘటనలలో రెండు మావోయిస్టుల శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసి భారీగా సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు కొందమాల్ ఎస్పీ వినీత్ అగర్వాల్ తెలియజేశారు. శనివారం సాయంత్రం జిల్లా హెడ్‌క్వార్టర్ పుల్బణిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వినీత్ అగర్వాల్ మాట్లాడుతూ జిల్లాలోని బల్లిగుడ పోలీస్‌స్టేషన్ పరిధి కలహండి జిల్లా సరిహద్దు పంగిబాజు అటవీ ప్రాంతంలో గురువారం మావోయిస్టులు, ఎస్ఓజీ, సీఆర్పీఎఫ్ జవాన్ల మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు జరగడంతో తాళలేక మావోయిస్టులు తప్పించుకున్నారు. పంగిబాజు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు విడిచి వెళ్లిన శిబిరాన్ని పోలీసులు ధ్వంసం చేసి భారీగా మావోయిస్టు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే శుక్రవారం తుమ్ముడిబొంద పోలీస్ స్టేషన్ పరిధిలో గల బురానహి దక్షిణ రిజర్వ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పులతో తట్టుకోలేక మావోయిస్టులు తప్పించుకున్నట్లు చెప్పారు. బురానహి దక్షిణ రిజర్వ్ శిబిరాన్ని వీడి మావోయిస్టులు పారిపోవడంతో పోలీసులు శిబిరాన్ని ధ్వంసం చేశారు. అయితే వేర్వేరు కాల్పుల సంఘటనలలో మావోయిస్టులు ఎవరూ మృతి చెందలేదని తెలియజేశారు. తప్పించుకున్న మావోయిస్టుల శిబిరంలో సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకుడు మురళి ఉన్నట్లు ఎస్పీ తెలియజేశారు. మావోయిస్టులు వీడి పారిపోయిన శిబిరాల్లో భారీ విస్ఫోటక సామగ్రితో పాటు మూడు విదేశీ తుపాకులు, రెండు ప్లాస్టిక్ పెట్టెలు, ఔషధాలు, ప్లాస్టిక్ కవర్లు, విప్లవ సాహిత్యం, మావోయిస్టు దుస్తులు, వాటర్ బాటిల్స్, విద్యుత్ తీగలు, సిరంజిలు, నిత్యావసర సామగ్రి ఉన్నట్లు ఎస్పీ వివరించారు. కొనసాగుతున్న కూంబింగ్ కొందమాల్–కలహండి జిల్లాల సరిహద్దులకు మోహరించిన అదనపు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. స్థాని క పోలీసుల సహకారంతో మావోయిస్టుల అచూకీ కోసం దట్టమైన అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. -
గుట్టల్లో గుట్టుగా గంజాయి సాగు
నిజాంసాగర్ (జుక్కల్): జుక్కల్ మండలం కౌలాస్ ఖిల్లా అటవీ ప్రాంతంలోని పాండవుల గుట్టల్లో గుట్టుగా సాగు చేస్తున్న గంజాయి గుట్టును అధికారులు రట్టు చేశారు. రూ.5 లక్షల విలువైన గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. జిల్లా ఎన్ఫోర్స్మెంట్, బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో అధికారులు శనివారం మెరుపుదాడి చేశారు. పోచారం తండాకు చెందిన బార్దల్ నారాయణ కౌలాస్ అటవీ ప్రాంతంలో సాగు చేసిన 1.5 ఎకరాల్లో పత్తి పంటలో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నాడు. సమాచారమందుకున్న ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేసి, 1,050 గంజాయి మొక్కలను తొలగించి వాటిని కాల్చేశారు. నిందితుడు నారాయణపై కేసు నమోదు చేశామని, గంజాయి మొక్కల విలువ రూ.5 లక్షల వరకు ఉంటుందని ఎక్సైజ్ సీఐ సుధాకర్ తెలిపారు. -
పాక్‌కు బుద్ధి చెప్పిన భారత్
జమ్మూ: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత సరిహద్దు ప్రాంతాలైన రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో మోర్టారు దాడులు, కాల్పులకు తెగబడ్డ పాకిస్తాన్‌కు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పింది. పాక్‌కు చెందిన 7 సైనిక పోస్టులను భారత్ ధ్వంసం చేసింది. పలువురు పాక్ సైనికులు గాయపడ్డారు. ఈ మేరకు ఉన్నతాధికారులు మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఈ ఘటన అనంతరం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో సరిహద్దు ప్రాంతాల్లోని స్కూళ్లను మూసివేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి సోమవారం పాక్ మోర్టారు దాడులు చేయడంతో ఓ బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, ఐదేళ్ల బాలికతోపాటు ముగ్గురు మరణించారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. పూంచ్, నౌషెరా సెక్టార్ పరిధిలోని రాజౌరీలో పాక్ సోమవారం మొదలుపెట్టిన మోర్టారు దాడులు, కాల్పులు మంగళవారం కొనసాగాయి. ఇందుకు ప్రతిగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఎల్ఓసీ వెంబడి రాక్‌చిక్రి, రావలకోటె ప్రాంతాల్లో ఉన్న 7 పాక్ సైనిక పోస్టులను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ ఘటనలో ముగ్గురు పాక్ సైనికులు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు పాకిస్తాన్ ప్రభుత్వ విభాగం తెలిపింది. -
రూ. కోటి విలువైన మద్యం నిల్వల ధ్వంసం
సాక్షి, అహ్మదాబాద్ : మద్యనిషేధం అమల్లో ఉన్న గుజరాత్లో రూ కోటి విలువైన మద్యం నిల్వలను నగరంలోని రామోల్‌లో బుధవారం గుజరాత్ పోలీసులు ధ్వంసం చేశారు. గుజరాత్ రాష్ట్రంలో మద్యం తయారీ, వినియోగం, రవాణాలపై నిషేధం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర నుంచి 1960లో గుజరాత్ విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినప్పటి నుంచి సంపూర్ణ మద్యనిషేధం అమల్లో ఉంది. అప్పటినుంచి రాష్ట్రంలో మద్యం తయారీ, క్రయవిక్రయాలు, మద్యం రవాణాపై పూర్తినిషేధం అమల్లో ఉన్నా మద్యం మాఫియా పరిశ్రమగా ఎదిగింది. అక్రమ మద్యాన్ని ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో అరికట్టలేకపోయాయి. తాజాగా రూ కోటి విలువైన మద్యం నిల్వలను పోలీసులు ధ్వంసం చేయడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. -
రాముని విగ్రహం ధ్వంసం.. నిర్మల్ బంద్
సాక్షి, నిర్మల్: శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రలో రాముని విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాముని విగ్రహాన్ని పగలగొట్టడాన్ని నిరసిస్తూ హిందూవాహిని నాయకులు, కార్యకర్తలు నిర్మల్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ ఘటనతో నిర్మల్, ఖానాపూర్, భైంసాలో బంద్ కొనసాగుతోంది. బంద్ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, పెట్రోల్ బంక్‌లు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం
గోరంట్ల: పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంను గురువారం రాత్రి గుర్తు తెలియని ఓ దుండగుడు ధ్వంసం చేసి చోరీకి యత్నంచాడు. ఇది విఫలం కావడంతో పక్కనే ఉన్న కృష్ణారెడ్డి కిరాణా షాపు తాళం పగులగొట్టి రూ. 14 వేల నగదు దొచుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. శుక్రవారం ఉదయం ఎస్ఐ సుధాకర్‌యాదవ్ తన సిబ్బంది వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్బీఐ బ్యాంకులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజ్‌ను నిశితంగా పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు విచారణ చేస్తామని ఎస్ఐ తెలిపారు. -
హింస నచన ధ్వంస రచన
రాజకీయ నాయకులు, సిద్ధాంతకర్తలు, సంఘసంస్కర్తల విగ్రహాల విధ్వంసం ఈనాటిది కాదు. మతపరమైన విగ్రహాలు, పూజా స్థలాలను ధ్వంసం చేయడం వేల ఏళ్ల క్రితమే క్రితమే జరిగిందని చరిత్ర చెబుతోంది. కొత్త పాలకులు అధికారంలోకి వచ్చినప్పుడు ఓడిపోయిన నేతల చిత్రాలు, విగ్రహాలు, వారి అధికారం, సిద్ధాంతాల చిహ్నాలను పగలగొట్టడం ఫ్రెంచి విప్లవంలో విస్తృతంగా జరిగింది. ప్రస్తుత పాలకులు, వారు ఆరాధించే నాయకుల విగ్రహాలను కూలదోయడం విప్లవకారుల నుంచి అనేక రాజకీయ గ్రూపుల వరకూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా సాగుతోంది. అధికారంలో ఉన్నవారు, రాజ్యాధికారం కోసం తిరుగుబాటు చేసేవారు విగ్రహాల విధ్వంసానికి పాల్పడడాన్ని రాజకీయ అసహనంగా ప్రజాస్వామికవాదులు భావిస్తారు. దేశంలో 1960ల ఆఖరులో ఆరంభమైన నక్సలైట్ ఉద్యమకాలంలో పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా కోలకత్తా నగరంలో రాజారామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ లాంటి 19వ శతాబ్దానికి చెందిన సంఘసంస్కర్తలు, గాంధీ, నెహ్రూ, నేతాజీ సుభాస్‌చంద్రబోస్ వంటి స్వాతంత్య్రసమరయోధుల విగ్రహాలను ధ్వంసం చేయడం సంచలనం సృష్టించింది. మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాల్లో దళితులతో పేచీ పడిన ఇతర వర్గాలు బడుగువర్గాలు ఆరాధించే బీఆర్అంబేడ్కర్ విగ్రహాలను పగలగొట్టడం లేదా నల్లరంగు పూయడం ఎంతో కాలంగా జరుగుతోంది. ఎక్కడైనా గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలపై దాడులు జరిపి వాటిని పగలగొట్టినప్పుడు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగడం రివాజుగా మారింది. కూలిన లెనిన్, స్టాలిన్ విగ్రహాలు 1991 జూన్ డిసెంబర్ మధ్య జరిగిన పరిణామాలతో సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నమై కమ్యూనిస్టుల పాలన ముగిసినప్పుడు రాజధాని మాస్కో, ఇతర ప్రధాన నగరాల్లోని కమ్యూనిస్ట్యో ధులు వ్లాదిమిర్లెనిన్, జోసెఫ్స్టాలిన్భారీ విగ్రహాలను కూల్చివేయడం ఇతర దేశాల ప్రజలకు దిగ్భాంతి కలిగించింది. కమ్యూనిస్టుల పాలన అంతమైన పోలండ్, బల్గేరియా వంటి తూర్పు ఐరోపా దేశాల్లోనూ కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్తలు, విప్లవకారుల విగ్రహాలను బుల్డోజర్లతో తొలగించారు. 2001 మార్చిలో అఫ్ఘానిస్తాన్‌లోని బామియాన్లోయ ప్రాంతంలోని భారీ బుద్ధ విగ్రహాలను పాలకపక్షమైన తాలిబాన్లు తమ నేత ముల్లా మహ్మద్ఒమర్ ఆదేశాలపై కూల్చివేయడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. దక్షిణాఫ్రికాలోని జొహనీస్ బర్గ్‌లో గాంధీ విగ్రహాన్ని 2015 ఏప్రిల్12న కొందరు దుండగులు ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ఈ దాడిలో ముఖ భాగం స్వల్పంగా దెబ్బతింది. దక్షిణాఫ్రికా శ్వేత జాతి పాలనపై పోరాడిన గాంధీకి నల్లజాతివారంటే చిన్నచూపని ఆరోపిస్తూ ఈ పనిచేశారు. మరో ఆఫ్రికా దేశం ఘనా రాజధాని ఆక్రాలోని యూనివర్సిటీ ఆఫ్ఘనా ఆవరణలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించిన గాంధీ విగ్రహాన్ని తొలగించాలని 2016లో దాదాపు వేయి మంది పౌరులు సంతకాలు చేసిన వినతిపత్రాన్ని ప్రభుత్వానికి పంపారు. దాంతో ఈ విగ్రహాన్ని మరో ప్రదేశానికి మార్చడానికి ప్రభుత్వం అంగీకరించింది. అమెరికాలోనూ విగ్రహాలపై ఆగ్రహం! అమెరికాను కనుగొన్న స్పెయిన్‌కు చెందిన అన్వేషకుడు క్రిస్టఫర్ కొలంబస్ స్మారక దినం సందర్భంగా 2017 అక్టోబర్9న ఇలినాయ్, రోడ్ఐలండ్రాష్ట్రాలు, కనెక్టికట్‌లోని మూడు నగరాల్లో వాటిని కొందరు ప్రదర్శకులు కొలంబస్ విగ్రహాలను స్వల్పంగా ధ్యంసం చేశారు. 19వ శతాబ్దంలో నల్లవారిని బానిసలుగా చూసే వ్యవస్థను కాపాడడానికి దక్షిణాది రాష్ట్రాలైన వర్జీనియా, నార్త్, సౌత్కరోలినా రాష్ట్రాల తరఫున పోరాడిని కాన్ఫడరేట్దళాలను నడిపించిన కమాండర్లు, సైనికుల విగ్రహాలు కొన్నింటిని కిందటేడాది తొలగించారు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా దినోత్సవం సందర్భంగా సిడ్నీలోని అన్వేషకుడు కెప్టెన్జేమ్స్కుక్విగ్రహంపై నల్ల రంగు పెయింట్పోసి కొందరు స్థానిక జాతుల ప్రదర్శకులు నిరసన తెలిపారు. ఏలూరు కాలవలోకి నీలం విగ్రహం! 1960ల చివర్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలంటూ సాగిన ఆందోళన సందర్భంగా విజయవాడలోని అప్పటి కేంద్ర ఉక్కు శాఖామంత్రి నీలం సంజీవరెడ్డి విగ్రహాన్ని ఉద్యమకారులు తొలగించి ఎదురుగా ఉన్న ఏలూరు కాలువలో వేశారు. 2001 మార్చిలో ప్రత్యేక తెలంగాణ కోసం ట్యాంక్ బండ్‌పై సాగిన మిలియన్మార్చ్సందర్భంగా కొందరు అక్కడి కొన్ని విగ్రహాలను ధ్వంసం చేశారు. అదే కాలంలో తెలంగాణ ఉద్యమం సందర్భంలోనే సిద్దిపేట పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కొందరు పగలగొట్టారు. టీఆర్ఎస్ నేత కె.చంద్రశేఖర్‌రావు వెంటనే జోక్యం చేసుకుని తెలుగువారికి ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోసం కొట్లాడిన అమరజీవి విగ్రహాల జోలికి పోవద్దనీ, ఆయనపై తమకు ఎంతో గౌరవం ఉందని ప్రకటించాక ఇలాంటి దాడులు జరగలేదు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ఆగని అన‘కొండ’ కాట్లు
ఈ నెల మొదటివారంలో కొవ్వూరు రోడ్డు తారకరామానగర్ ప్రాంతంలోని సర్వే నెంబర్ 20/2ఎలో ఆ స్థల యజమానులు నిర్మాణాలు చేపడుతుంటే ఎమ్మెల్యే కొండబాబు అనుచరులు దాడి చేశారు. కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టుకుంటున్న 60 మందిపై సుమారు పది మంది ఎమ్మెల్యే మనుషులు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా అక్కడ నిర్మాణాల్ని దౌర్జన్యంగా కూల్చేశారు. ఆ 60 మంది చేత స్థలాలు కొనుగోలు చేయించిన ఎమ్మెల్యే అనుచరుడే ఆ తర్వాత వారిపై దాడి చేసి, ధ్వంస రచనకు పాల్పడ్డాడు. దాడుల్లో గాయపడ్డ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. తిరిగి బాధితుల్నే వేధించిన పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా కాకినాడ మహలక్ష్మీ నగర్లో ప్రభుత్వ నిధులతో వేసిన రోడ్డును ఎమ్మెల్యే కొండబాబు కుటుంబీకులు, అనుచరులు జేసీబీ సాయంతో తవ్వేసి ధ్వంసం చేశారు. ఈ విషయం తెలిసినా అధికారులు పట్టించుకోలేదు. రోడ్డేసిన స్థలం ప్రైవేటుదని, తమదే ఆ స్థలమని ఎమ్మెల్యే కుటుంబీకుల కను సన్నల్లో దౌర్జన్యానికి దిగారు. గూండా గిరీ ప్రదర్శించారు. రోడ్డును ధ్వంసం చేయడమే కాకుండా అడ్డొచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేశారు. స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకతతోపాటు ఫిర్యాదులు రావడంతో అధికారులు తప్పని పరిస్థితుల్లో స్పందించారు. సాక్షి ప్రతినిధి,తూర్పుగోదావరి, కాకినాడ: కాకినాడలో టీడీపీ ఆగడాల్లకు అంతులేకుండా పోతోంది. వరుస ఘటనలు పట్టణం నడిబొడ్డున యథేచ్ఛగా జరుగుతున్నా జిల్లా అధికారులు ప్రేక్షకపాత్రకే పరిమితమవుతున్నారు. తాజా ఘటనలతోపాటు ఇదే నెల మొదటి వారంలో జరిగినవే కాకుండా గత ఏడాదిలో కాకినాడ మెయిన్ రోడ్డులోని జగన్నాథపురం వంతెన సమీపంలో విలువైన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై ఎమ్మెల్యే అనుచరులు రాత్రికి రాత్రి కబ్జా చేసేందుకు యత్నించిన వైనం అప్పట్లో వివాదస్పదమయింది. ఆ స్థలంలో ఉన్న షాపును బలవంతంగా ఖాళీ చేయించేందుకు యత్నించడంతోపాటు ఎమ్మెల్యే అనుచరులు పొక్లైనర్‌ను తీసుకెళ్లి కూల్చేందుకు ప్రయత్నించారు. ఇవన్నీ అధికార అండ చూసుకుని చేసినవే. జిల్లా కేంద్రమైన కాకినాడలో ఇటువంటి దారుణాలు అనేకం జరుగుతున్నా అడ్డుకట్ట వేసేందుకు అధికారులు సాహసించడం లేదు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఏమాత్రం భయం లేకుండా తెగబడుతున్నారు. దాడులకు దిగి, ధ్వంస రచనకు పాల్పడిన భూముల్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు చేసిన ఎత్తుగడే. గతంలో జరిగిన ప్రయివేటు షాపు కూల్చివేత , మొన్న తారకరామ నగర్లో చేసిన దౌర్జన్యకాండ పక్కన పెడితే తాజాగా మహలక్ష్మీ నగర్లో ప్రభుత్వ రోడ్డును ధ్వంసం చేసిన ఘటన మరింత దారుణమైంది. అసలు అక్కడ తమ భూములగా చెప్పుకుంటున్నవాటిపైనే అనుమానాలున్నాయి. అసలా భూములపైనే అనుమానాలు సముద్ర నీరు వేసిన మేటల్ని ఆక్రమంచి, తమవిగా రికార్డుల్లో ఎక్కించే యత్నాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. అక్కడున్న పోలీసు ౖరైఫిల్ రేంజ్ స్థలం కూడా ఆక్రమణకు గురైందన్న వాదనలున్నాయి. సముద్రం ఒడ్డున స్తంభాలు వేసి తమ భూములగా చెప్పుకుంటున్న వైనంపైనే సందేహాలున్నాయి. ఇవేవీ అధికారులకు పట్టడం లేదు. ఆ భూముల సంగతేమిటన్నది తేల్చడం లేదు. వాస్తవ పరిస్థితులు గుర్తించకుండా వదిలేయడంతోనే సముద్రం ఒడ్డున ఉన్న భూములన్నీ కబ్జాకు గురవుతున్నాయి. ఇవన్నీ ఎమ్మెల్యే అనుచరుల చేతుల్లో ఉండటంతో వారి ఆగడాలకు అడ్డు అదుపూలేకుండా పోతోంది. రూ.6 లక్షల ప్రభుత్వ నిధులతో పట్టపగలు, జేసీబీని తీసుకెళ్లి ధ్వంసం చేశారంటే ఏ స్థాయిలో బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. ఇది చాలదన్నట్టు రోడ్డును ధ్వంసం చేసినచోట స్థానికుల శిబిరం ఏర్పాటు చేసి, నిరసన తెలియజేస్తుంటే వారిపై కొందర్ని ఉసిగొల్పి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. అక్కడున్న టెంట్లు తొలగించాలని హెచ్చరిస్తున్నారు. దీంతో స్థానికులు మరింత భయాందోళనకు గురవుతున్నారు. సోమవారం బాధితులంతా కలెక్టర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. వీరే కాకుండా అక్కడ వివాదాస్పదంగా ఉన్న భూములపై కొందరు చేస్తున్న అజమాయిషీపై కూడా ఫిర్యాదులు చేశారు. విషయం అంతవరకు వెళ్లినా స్థానిక అధికారులకు ఏమాత్రం పట్టనట్టే ఉన్నారు సరికదా ఆ రోడ్డు తాము వేయలేదని ఎమ్మెల్యే మనుషులకు వత్తాసు పలికే పరిస్థితి నెలకుంది. మీడియాలో పతాక శీర్షికల్లో దౌర్జన్యకాండా వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు ఎట్టకేలకు స్పందించారు. ఎమ్మెల్యే కుటుంబీకులపై ఎట్టకేలకు కేసు నమోదు : స్థానికులు ఆందోళనలకు దిగడం, వైఎస్సార్సీపీ, సీపీఎం, సహా పలువురు ప్రజలు, ప్రజా సంఘాలు ఎమ్మెల్యే తీరుపై తీవ్రస్థాయిలో మండిపడిన నేపథ్యంలో కలెక్టర్ జోక్యం చేసుకున్నారు. జిల్లా పం చాయతీ అధికారి ద్వారా ఆదేశాలిప్పించి తూరంగి పంచాయతీ ప్రత్యేకాధికారి పి.మణేశ్వరావు చేత ఇంద్రపాలెం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. పబ్లిక్ ప్రాపర్టీస్ ధ్వంసం దృష్ట్యా పలు సెక్షన్ల కింద ఎమ్మెల్యే సోదరుడు వనమాడి సత్యనారాయణ, ఆయన కుమారుడు ఉమాశంకర్‌తోపాటు మరో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. -
మరీ ఇంత దౌర్జన్యమా?
తూర్పుగోదావరి, కాకినాడ: ప్రభుత్వం నిర్మించిన రహదారిని ప్రైవేటు సైన్యంతో దౌర్జన్యంగా ధ్వంసం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నా అధికార యంత్రాంగం స్పందించకపోవడం దారుణమని వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సోదరుడు, ఆయన కుమారుడితోపాటు కొంతమంది వ్యక్తులు బహిరంగంగా పంచాయతీ నిధులతో నిర్మించిన రహదారిని ధ్వంసం చేసిన తీరు చూస్తుంటే ఇక్కడ ప్రభుత్వ పాలన నడుస్తుందో, ప్రైవేటు పాలన నడుస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. సోమవారం సాయంత్రం కాకినాడ మహాలక్ష్మినగర ప్రాంతాన్ని కన్నబాబు, పార్టీ నేతలు సందర్శించారు. రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలోని భూమిని, ధ్వంసం చేసిన రహదారిని పరిశీలించారు. అనంతరం కన్నబాబు విలేకర్లతో మాట్లాడుతూ కనుచూపు మేరలోని సముద్రం వరకు ఉన్న భూమి అంతా తనదేనంటూ టీడీపీ ఎమ్మెల్యే బహిరంగంగా కబ్జాకు ప్రయత్నిస్తున్నా సంబంధిత రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆక్రమణలో భాగంగా అడ్డువచ్చిన పేదల ఇళ్లను, రోడ్లను తొలగించేందుకు సైతం టీడీపీ నేతలు బరితెగిస్తున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వభూమికి తప్పుడు రికార్డులు సృష్టించి కైంకర్యం చేసేందుకు కొండబాబు, ఆయన బంధువులు చేస్తున్న యత్నాలను తక్షణమే రెవెన్యూ యాంత్రాంగం అడ్డుకోవాలని కన్నబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ధనంతో నిర్మించిన రహదారిని ధ్వంసం చేసినా సరైన స్పందన లేకపోవడం అత్యంత దారుణమన్నారు. ఎమ్మెల్యే సోదరుడు వనమాడి సత్యనారాయణ, ఆయన కుమారుడు వనమాడి ఉమాశంకర్‌లపై మొక్కుబడిగా కేసునమోదు చేసి బెయిల్‌బుల్ సెక్షన్లు వేశారని, ఇలాగైతే ఇక ప్రభుత్వ ఆస్తులకు రక్షణ ఎక్కడ ఉంటుందని కన్నబాబు ప్రశ్నించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో ఇందిరమ్మ పథకంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని, అది ప్రైవేటు భూమి అయితే అప్పుడే ఎందుకు అభ్యంతరం చెప్పలేదని కన్నబాబు నిలదీశారు. ఈ విషయంలో ఎలాంటి అన్యాయం జరిగినా, అధికారులు ఏకపక్షంగా వ్యవహరించినా ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ తరఫున గట్టిగా పోరాడతామని కన్నబాబు పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం తారకరామానగర్ ప్రాంతంలో మూడు ఎకరాల భూమి విషయంలో ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యంగా వ్యవహరించి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారన్నారు. కన్నబాబు వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ బలగం ప్రసన్నకుమార్, పార్టీ నాయకులు కర్ణాసుల సీతారామాంజనేయులు, సరబాబు, శివబుజ్జి, గోపిశెట్టిబాబి, ముమ్మిడి శ్రీను, పైడియ్య తదితరులు ఉన్నారు. -
సరిహద్దుల్లో భారత్ ప్రతీకారం!
జమ్మూ: అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తాన్ కుయుక్తులకు భారత్ దీటైన సమాధానం ఇస్తోంది. సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న బీఎస్ఎఫ్ హెడ్‌కానిస్టేబుల్‌పై పాక్ సైనికులు కాల్పులు జరిపి హతమార్చటంతో రాత్రికి రాత్రే భారత బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. బుధవారం రాత్రి సాంబా సెక్టార్ సమీపంలో దాయాదిపై విరుచుకుపడిన భారత బలగాలు మూడు పాక్ ఔట్‌పోస్టులను ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో 8–10 పాకిస్తాన్ రేంజర్లు హతమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించగా.. పాక్‌కు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిందని బీఎస్ఎఫ్ ఐజీ రామ్ అవతార్ వెల్లడించారు. అటు, జమ్మూ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుగుండా చొరబాటుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని బీఎస్ఎఫ్ భగ్నం చేసింది. ఓ ఉగ్రవాదిని కాల్చి చంపగా మిగిలిన వారు పారిపోయారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. మరోవైపు, పాక్‌తో 200 కిలోమీటర్ల మేర ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ ‘ఆపరేషన్ అలర్ట్’ ప్రారంభించింది. వేడెక్కిన సరిహద్దు బుధవారం రాత్రి ఆర్పీ హజారా అనే కానిస్టేబుల్ సాంబా సెక్టార్ సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తుండగా.. పాకిస్తాన్ వైపునుంచి అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభమయ్యాయి. భారత బలగాలు అప్రమత్తమై ప్రతిస్పందించేలోపే హజారా బుల్లెట్ గాయాలతో నేలకొరిగారు. వెంటనే బీఎస్ఎఫ్ ప్రతీకారానికి దిగింది. సాంబా సెక్టార్లో పాక్ మోర్టార్లున్న ప్రాంతాన్ని గుర్తించి భారత బలగాలు ఎదురుదాడి చేశాయి. ఈ స్థాయిలో ప్రతిఘటనను ఊహించని పాక్‌కు ఈ మెరుపుదాడితో తీవ్ర నష్టం వాటిల్లింది. సోలార్ ప్యానళ్లు, ఆయుధాలు నష్టపోయాయని.. ప్రాణనష్టం భారీగానే ఉండొచ్చని భారత ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. చొరబాట్లపై ‘ఆపరేషన్ అలర్ట్’ శీతాకాలంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మంచు తీవ్రస్థాయిలో కురుస్తుంది. ఈ పరిస్థితుల్లో గస్తీకాసేందుకు ప్రతికూల వాతావరణం ఉంటుంది. దీన్ని ఉపయోగించుకుని పాక్ వైపునుంచి చొరబాట్లకు అవకాశం ఉంటుంది. అందుకే వీటిని నిరోధించేందుకు బీఎస్ఎఫ్ అంతర్జాతీయ సరిహద్దు వెంట ‘ఆపరేషన్ అలర్ట్’ను ప్రారంభించింది. మరోవైపు, పీవోకే సరిహద్దుల్లోని ఆర్ఎస్ పుర సెక్టార్లో ముగ్గురు ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నించగా బలగాలు తిప్పికొట్టాయి. ఈ ఘటనలో ఓ అనుమానిత ఉగ్రవాది చనిపోగా మిగిలిన వారు పారిపోయారని అధికారులు వెల్లడించారు. -
దారి దోపిడీ చేయబోయి..
మదనపల్లె క్రైం : రెండు నెలల క్రితం కలకలం సృష్టిం చిన ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం చేసి రూ.22 లక్షల నగదు చోరీని కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఇందుకు కారణమైన ముఠాలోని ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు. వారి నుంచి లారీ, బొలేరో, ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ ఎం.చిదానందరెడ్డి స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్ల డించారు. హర్యానా రాష్ట్రం మేవార్డు జిల్లాకు చెందిన హసన్‌ఖాన్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన చెల్లెలి పెళ్లికి రూ.30 లక్షలకు పైగా అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు మా ర్గం చూపాలని స్నేహితుడు లతీఫ్‌ను అడిగాడు. లతీఫ్ అతన్ని హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఏటీఎం చోరీలకు పాల్పడే అమస్, సమూన్, కల్లు వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశాడు. లారీ డ్రైవర్లుగా పనిచేస్తూ.. ఈ ముఠా సభ్యులు లారీ డ్రైవర్లుగా పనిచేస్తూ దారి దోపిడీలు, చోరీలు చేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరించేవారు. ఇటీవల హర్యానాకు చెందిన ఓ లారీ యజమాని ఆదేశాల మేరకు ఏడుగురు కలిసి బెంగళూరుకు లారీలో మందులు తీసుకువచ్చారు. అక్కడి నుంచి బ్రోకర్ సమాచారంతో బొప్పాయి పండ్లను బెంగళూరుకు తీసుకెళ్లేందుకు కలికిరి వచ్చారు. అక్కడ ఒక రోజు ఉండి తమ వద్ద ఉన్న సెల్ఫోన్లలోని గూగుల్ మ్యాప్‌ల ద్వారా ఏటీఎంలు ఎక్కడెక్కడ ఉన్నాయి, సెక్యూరిటీలేని ఏటీఎంల వివరాలను తెలుసుకున్నారు. పక్కా పథకంతో చోరీ మదనపల్లె బెంగళూరు రోడ్డు నక్కలదిన్నె తండాలో ఉన్న ఏటీఎంలో చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. చోరీ కోసం ఆయుధాలు సమకూర్చుకుని కలికిరి నుంచి మదనపల్లెకు బస్సులో వస్తూ చింతపర్తి వద్ద ముగ్గురు వ్యక్తులు దిగారు. అక్కడ ఓ ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి అదే వాహనంలో మదనపల్లెకు చేరుకున్నారు. బస్సులో ముందుగా వచ్చిన ముగ్గురు, ద్విచక్ర వాహనంలో వచ్చిన ముగ్గురు కలిసి ఎస్టేట్‌లో బొలేరో వాహనం చోరీ చేశారు. వాహనాల్లో తిరుగుతూ మదనపల్లె పట్టణంలో రెక్కీ నిర్వహించారు. పథకం ప్రకారం సెప్టంబర్ 2 బక్రీద్ పండుగ రోజు వేకువజామున గ్యాస్ కట్టర్లను వినియోగించి నక్కలదిన్నె తండా వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి రూ.22.24 లక్షల నగదును చోరీ చేశారు. అనంతరం ములకలచెరువు రోడుల్డోని చీకటిమాను పల్లె వద్ద వాహనాలను వదిలిపెట్టి పరారయ్యారు. దారి దోపిడీ చేయబోయి.. ఘటనపై ఒకటో పట్టణ సీఐ నిరంజన్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే దుండగులు రొంపిచెర్ల వద్ద దారి దోపిడీకి ప్రయత్నించారు. వారిలో ముగ్గురిని పీలేరు సీఐ మహేశ్వర్ అదుపులోకి తీసుకున్నారు. నలుగురు పరారయ్యారు. విచారణలో వారు హర్యానా రాష్ట్రం మేవార్డుకు చెందిన ముస్తాక్‌ఖాన్, హసన్‌ఖాన్, యాకుబ్‌గా తేలింది. పలు నేరాలు, చోరీలకు పాల్పడినట్టు అంగీకరించారు. యాకుబ్ గాయపడడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తప్పించుకున్న నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ చిదానందరెడ్డి తెలిపారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన సీఐలు మహేశ్వర్, నిరంజన్‌కుమార్‌రెడ్డి, రుషికేశవ్, ఎస్ఐలు రహీమ్వుల్లా, దస్తగిరి, ఈశ్వర్‌కు డీఎస్పీ రివార్డులు ప్రకటించారు. -
చలో గరగపర్రు భగ్నం
పాలకోడేరు: దళిత సంఘాల చలో గరగపర్రు కార్యక్రమాన్ని పోలీసులు శనివారం భగ్నం చేశారు. గరగపర్రు గ్రామానికి వెళ్లే అన్ని రోడ్లను పోలీసులు తమ వలయంలోకి తీసుకుని నిర్బంధించారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్‌ను గ్రామంలోకి రాకుండా మండలంలోని వేండ్ర రైల్వే గేటు వద్ద అరెస్ట్ చేసి భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాంతో గరగపర్రు గ్రామంలోని దళితులంతా ర్యాలీగా గ్రామ సెంటర్లోకి చేరుకుని నిరసన తెలిపేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. కోపోద్రిక్తులైన ముగ్గురు దళిత యువకులు వంతెనపై నుంచి యనమదుర్రు డ్రెయిన్‌లోకి దూకేశారు. దీంతో ఒక దశలో గ్రామ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒక దశలో ఏమవుతుందో ఏంటో అని అందరూ కంగారు పడ్డారు. డీఎస్పీ పూర్ణచంద్రరావు వస్తున్నారు.. మీతో మాట్లాడతారు వెనక్కి పదండి అని పోలీసులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ప్రాంతానికి తీసుకువచ్చారు. మంత్రులు ఇచ్చిన 10 హామీలు నెరవేర్చాలని వారు కోరగా అందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని నర్సాపురం డీఎస్పీ పూర్ణచంద్రరావు హామీ ఇచ్చారు. రిలే నిరాహార దీక్షలో ఉన్న దళిత నేతలతో చర్చించి కొంత మంది ప్రతినిధులు నరసాపురం కార్యాలయానికి వస్తే చర్చించి సమస్య పరిష్కారానికి దారి చూపుతామని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా ఆందోళనను దళితులు విరమించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ నాయకులు కారుమంచి క్రాంతి, ఎరిచర్ల రాజేష్ తదితర దళిత నాయకులు మాట్లాడుతూ డీఎస్పీతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని, ఒకవేళ కాకపోతే చలో విజయవాడ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. దళితుల చలో గరగపర్రుకు పిలువు ఇవ్వడంతో గరగపర్రు వెళ్లే ప్రతి వ్యక్తిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి వారి గుర్తింపు కార్డులు చూసి నిర్ధారించి గ్రామంలోకి పంపించారు. -
అంబేద్కర్ విగ్రహంపై దాడి.. నిందితుల అరెస్ట్
► సోషల్ మీడియా ద్వారా బయటకొచ్చిన ఉదంతం పహాడీషరీఫ్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని అవమానకర రీతిలో ధ్వంసం చేస్తూ తీసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దీంతో దళిత సంఘాల నాయకులు గురువారం బాలాపూర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. బాలాపూర్ గ్రామంలోని అంబేద్కర్ యువజన సంఘం కమ్యూనిటీ హాల్‌కు గత నెల 18న బడంగ్‌పేటకు చెందిన బ్యాండ్ బృందం అనుగొందుల రాజు(19), నాదర్గుల్కు చెందిన గోడ నవీన్(19), బైండ్ల శివ(22)లతో పాటు మరి కొంత మంది వచ్చారు. వీరు హాల్లోని అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ అవమాన పరిచారు. ఈ తతంగాన్ని అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాలాపూర్‌కు చెందిన కొప్పుల సురేష్ దీన్ని గమనించి బాలాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న బీఎస్పీ రాష్ట్ర నాయకుడు ఇబ్రాం శేఖర్, దళిత సంఘాల నాయకులు బాలాపూర్ ఠాణా వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఆ సమయంలో ఇన్స్పెక్టర్ లేకపోవడంతో వెంటనే మీర్‌పేట ఇన్స్పెక్టర్ రంగస్వామి, పహాడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను శాంతిపర్చేందుకు యత్నించారు. వారు మాట వినకపోవడంతో పోలీసులు వెంటనే అనుగొందుల రాజు, గోడ నవీన్‌లను అరెస్ట్ చేయడంతో ఆందోళన విరమించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. -
వైఎస్ విగ్రహ ధ్వంసం పిరికిపందల చర్య
మంత్రి అండదండలతోనే విధ్వంసాలు రెచ్చగొడితే చూస్తూ ఊరుకోం విగ్రహం ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి నిరశన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ చెన్నేకొత్తపల్లి : అధికారంలో ఉన్నవారు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి కానీ అల్లరిమూకలను ప్రేరేపించడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ టీడీపీ నాయకులకు హితవు పలికారు. రాష్ట్రంలో ఆటవికపాలన సాగుతోందని, చంద్రబాబునాయుడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మండల కేంద్రమైన చెన్నేకొత్తపల్లిలో ఏర్పాటు చేసిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ దుశ్చర్యను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం వైఎస్సార్ విగ్రహం వద్ద శాంతియుత నిరశన కార్యక్రమం చేపట్టారు. శంకరనారాయణతోపాటు రాప్తాడు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మైలారపు రమణారెడ్డి, పలువురు నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకరనారాయణ మాట్లాడుతూ జిల్లాలోని తాడిపత్రి, ధర్మవరం, రాప్తాడు, శింగనమలతోపాటు మరిన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ వారి ఆగడాలు శృతి మించాయన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఇప్పటివరకు నాలుగుచోట్ల వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. మంత్రి అండదండలతోనే ఇవన్నీ జరుగుతున్నాయని, ఇది నీతిమాలిన పిరికిపందల చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము శాంతిని కోరుకుంటున్నామని, తమ సహనాన్ని చేతగానితనంగా భావించి రెచ్చగొడితే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన ఘాటుగా హెచ్చరించారు. వైఎస్ విగ్రహం «ధ్వంసం చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం న్యామద్దెల సర్కిల్ నుంచి పోలీస్‌స్టేషన్ వరకు ప్రభుత్వానికి, మంత్రి సునీతకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి రామగిరి సీఐ యుగంధర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దోషులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ మెట్టుగోవిందరెడ్డి, స్థానిక సర్పంచ్ క్రిష్ణారెడ్డి, న్యామద్దెల ఎంపీటీసీ లక్ష్మీనారాయణ, దామాజిపల్లి సొసైటీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, సొసైటీ డైరెక్టర్ ప్యాదిండి నరసింహారెడ్డి, నాయకులు గాలిశ్రీనివాసరెడ్డి, పుల్లారెడ్డి, రామక్రిష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, లింగమయ్య, హరినాథ్‌రెడ్డి, క్రిష్ణమూర్తి, రామాంజి, నగేష్, రాప్తాడు మండల కన్వీనర్ రామాంజినేయులు, వరప్రసాద్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి, సాకే నారాయణ, నందకుమార్‌రెడ్డి, లింగారెడ్డి, చిన్ననరసింహులు, ప్రతాప్, జయరామిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, తాతిరెడ్డి, చంద్రశేర్‌రెడ్డి, సిద్దప్ప తదితరులు పాల్గొన్నారు. ఎదుర్కొనే ధైర్యంలేకే... వైఎస్ జగన్మోహన్రెడ్డికి పెరుగుతున్న జనాదరణ చూసి ఓర్వలేకే మంత్రి అనుచరుల అండదండలతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారని రాప్తాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మైలారపు రమణారెడ్డి అన్నారు. ఆయన నిరశన కార్యక్రమానికి మద్దతు పలికి ర్యాలీలో పాల్గొన్నారు. అధికార పార్టీ వారు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. ప్రశాంతంగా ఉన్న చెన్నేకొత్తపల్లిలోనూ చిచ్చు పెట్టేందుకే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారన్నారు. మంత్రి అల్లరిమూకలను పెంచి పోషిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. రాప్తాడు మండల కన్వీనర్ బోయ రామాంజినేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అరాచకాలు అధికమయ్యాయన్నారు. రాప్తాడు ఎమ్మెల్యేగా ఉన్న పరిటాల సునీతకు పౌరసరఫరాల శాఖను తప్పించి స్త్రీ శిశు సంక్షేమశాఖను అప్పగించినా బుద్ధి రాలేదన్నారు. -
అనధికార ఆక్వా చెరువులు ధ్వంసం
హైకోర్టు ఉత్తర్వులను అమల్లోకి తెచ్చిన అధికారులు రెవెన్యూ, ఫిషరీష్, పోలీసు అధికారుల జాయింట్ యాక్షన్ అమలాపురం రూరల్ : హైకోర్టు ఉత్తర్వులను అధికారులు తక్షణమే అమల్లోకి తెచ్చి అనధికార ఆక్వా చెరువులను శనివారం ధ్వంసం చేశారు. అమలాపురం రూరల్ మండలం తాండవపల్లిలో దాదాపు 50 ఎకరాల్లో అనధికారికంగా ఆక్వా సాగు చేస్తున్న వైనంపై స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్పందించి చెరువుల సాగును నిలిపివేయాలని గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై స్థానిక రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు విచారణ చేసి నివేదిక పంపించారు. అయినా సాగు ఆగకపోవటంతో బాధితులు కోర్టు ధిక్కార నేరం కింద మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు స్వయంగా కలెక్టర్‌ను కోర్టుకు హాజరు కావాలని ఆదేశించడంతో అధికారులు ఇప్పుడు చెరువుల ధ్వంసానికి తక్షణ చర్యలు చేపట్టారు. జేసీబీలతో చెరువులు ధ్వంసం చేయించారు. రెవెన్యూ, పోలీసు, మత్స్యశాఖ అధికారులు సంయుక్తంగా ఆ యాక్ష¯ŒS చేపట్టారు. తహసీల్దార్ నక్కా చిట్టిబాబు, మత్స్యశాఖ డీడీ ఎస్.అంజలి, ఏడీఏ ఎస్.సంజీవరావు, ఎఫ్‌డీవో సీహెచ్.గోపాల కృష్ణ, ఆర్ఐ కేశవదాసు రాంబాబు, ఎస్సై ఎం.గజేంద్రకుమార్‌ల స్వీయ పర్యవేక్షణలో చెరువులకు జేసీబీలతో గండ్లు కొట్టి ధ్వంసం చేశారు. రైతులు జంపన శ్రీలక్ష్మి, జంపన సత్యనారాయణరాజు, పులవర్తి సుబ్బారావు, నడింపల్లి పార్వతమ్మ, రాజులపూడి సత్యనారాయణ, నడింపల్లి సుబ్బరాజులకు చెందిన 50 ఎకరాల్లోని అక్రమ ఆక్వా సాగును ధ్వంసం చేస్తున్నారు. -
టోల్‌ప్లాజాలో దారుణం.. వీడియో
-
అక్రమ కట్టడాల కూల్చివేత!
ప్రొద్దుటూరు టౌన్ : మున్సిపాలిటీ స్థలం ఆక్రమణకు గురైందా.. ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలు నిర్మించారా.. ప్లాన్ తీసుకోకుండా నిర్మాణం చేస్తున్నారా?.. అయితే ఇక కూల్చి వేస్తారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ బృందం ఇప్పటికే కడప కేంద్రంలో అక్రమ కట్టడాలపై చర్యలు చేపట్టింది. మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి ఈ టీంను, జిల్లా సర్వేయర్‌ను ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి కూడా పంపాలని కలెక్టర్‌కు విన్నవించారు. నేడో, రేపో ప్రొద్దుటూరుకు రాక... ప్రొద్దుటూరు మున్సిపాలిటీ స్థలాలు చాలా చోట్ల కబ్జాకు గురయ్యాయి. కొందరు స్వార్థపూరిత అధికారుల వల్ల ఏకంగా ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు జరిగాయి. మున్సిపల్ కార్యాలయం వెనుక వైపు ఉన్న మున్సిపల్ స్థలంలో కొందరు ప్రైవేటు కల్యాణ మండపం నిర్మించారు. అలాగే బాలాజీ నగర్లో 16 సెంట్ల మరుగుదొడ్డి స్థలాన్ని ఆక్రమించారు. ఇందులో కూడా గృహాలు వెలిశాయి. మరింత స్థలం ఖాళీగా ఉంది. టూటౌన్ పోలీస్‌స్టేషన్ పక్కన ఉన్న రెండో మున్సిపల్ కాలనీలో పార్కు స్థలం కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధమైంది. వసంతపేట, కోనేటి కాలువ వీధి, శ్రీనివాసనగర్ తదితర ప్రాంతాల్లో కూడా స్థలాలను ఆక్రమించుకున్నారు. రూ. కోట్లు విలువ చేసే స్థలాలు అప్పనంగా కొందరు అమ్మేస్తున్నా వాటిని కాపాడటానికి అధికారులు చర్యలు చేపట్టలేదు. మున్సిపల్ లేఅవుట్, మ్యాప్‌ల ఆధారంగా ఎన్ని చోట్ల స్థలాలు కబ్జాకు గురయ్యాయి అనే విషయాన్ని మొదట ఈ టీం గుర్తిస్తుంది. అలాంటి వాటిపై ఎవ్వరికీ ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఏకంగా వాటిని కూలదోసేందుకు కావాల్సిన చట్టపరమైన అన్నింటికి సంబంధించిన సమాచారం ఈ టీం సభ్యుల్లోని అధికారుల వద్ద ఉంటుంది. మేల్కోకపోతే చర్యలు తప్పవు: అక్రమ నిర్మాణాలు, ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్న వారు ఇప్పటికైనా మేల్కోకపోతే ఆర్థికంగా బాగా దెబ్బతినే పరిస్థితి ఉంది. ప్లాన్ ప్రకారం నిర్మాణం చేయకుండా, గృహానికి ప్లాన్ తీసుకొని దుకాణాలు నిర్మిస్తున్న వారు కొందరైతే, ఏకంగా ప్లాన్ తీసుకోకుండా నిర్మాణాలు చేస్తున్న వారు మరికొందరు ఉన్నారు. వీరంతా నిర్మాణాలను ప్లాన్ మేరకు నిర్మించుకోవాల్సిన బాధ్యత ఉంది. అధికారులపై కూడా ఆరోపణలు: మున్సిపాలిటీ స్థలాలు ఎక్కడున్నాయి, ప్రభుత్వ స్థలం ఎంత ఉంది అనే సమాచారం మొత్తం మున్సిపాలిటీ, మండల సర్వేయర్ల వద్ద ఉంటుంది. అందుకు కావాల్సిన ప్లాన్లు, లేఅవుట్లు కూడా వారి వద్ద లభిస్తాయి. ఇందులో కొందరు స్వార్థం కోసం మున్సిపల్, ప్రభుత్వ స్థలాలను కొందరు బడాబాబులకు తెలిపి అందులో నిర్మాణాలు చేసేందుకు సహకరించారనే దానిపై కూడా కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. స్పెషల్ టీంతో మున్సిపల్ ఆక్రమణ స్థలాలపై చర్యలు స్పెషల్ టీం ప్రొద్దుటూరుకు కూడా కావాలని కలెక్టర్‌ను కోరా. త్వరలో ఈ టీం ప్రొద్దుటూరుకు వస్తుంది. అక్రమ కట్టడాలు, మున్సిపల్ స్థలాల్లో నిర్మించిన కట్టడాలపై చర్యలు తీసుకుంటుంది. – ఉండేల గురివిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ -
నాగదేవతల విగ్రహాలు ధ్వంసం
వీహెచ్‌పీ, బీజేపీ నాయకుల ఆందోళన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు జగిత్యాల అర్బన్ : జగిత్యాల పట్టణం మంచినీళ్ల బావి సమీపంలోని మడలేశ్వరస్వామి ఆలయం ఆవరణలోని రావిచెట్టు కింద ఉన్న నాగదేవతల విగ్రహాలను గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న రజక సంఘం నాయకులు వీహెచ్‌పీ, బీజేపీ నాయకులతో కలిసి నిజమాబాద్ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఓ పథకం ప్రకారమే దుండగులు విగ్రహాలు ధ్వంసం చేశారని ఆరోపించారు. స్థానిక ఎస్సై శివకృష్ణ అక్కడకు చేరుకుని వారికి నచ్చజెప్పేందుకు యత్నించారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేవరకు ఇక్కడి నుంచి కదలమని భీష్మించారు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సీఐ కరుణాకర్‌రావుకు ఫిర్యాదు చేశారు.మంచినీళ్ల బావి సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
రవిశంకర్ గురూజీకి ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వరల్డ్ కల్చర్ ఫెస్టివల్ వల్ల యమునా నదీ పరీవాహక ప్రాంతం పూర్తిగా ధ్వంసమైందని నిపుణుల కమిటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు నివేదించింది. వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించిన యమునా నదీ పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించిన కమిటీ అక్కడి పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ స్వతంత్ర కుమార్ ఆధ్వర్యంలోని కమిటీ 47 పేజీల నివేదికను సమర్పించింది. పర్యావరణాన్ని విధ్వంసం చేశారనే ఆరో్పణలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ కమిటీని వేసింది. నదీ తీరాన జీవవైవిద్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని కమిటీ తన నివేదికలో పేర్కొంది. -
పోడు భూముల్లో పచ్చని పంటలు ధ్వంసం
125 ఎకరాల్లో స్వాధీనం చేసుకున్న ఫారెస్టు అధికారులు నలుగురు రైతుల అరెస్టు.. స్పృహ కోల్పోయిన ఇద్దరు మహిళా రైతులు టేకులపల్లి : మండలంలోని కొప్పురాయి పంచాయతీ ఒడ్డుగూడెం సమీపంలో పోడు భూముల్లో 125 ఎకరాల పచ్చని పంటలను ధ్వంసం చేశారు. పోలీసుల సహకారంతో ఫారెస్టు అధికారులు పంతం నెగ్గించుకున్నారు. జూలై 23 నుంచి పలు దఫాలుగాఅధికారులు దాడులకు పాల్పడ్డారు.అయితే బాధిత రైతులు ప్రతిఘటిస్తున్న నేపథ్యంలో శుక్రవారం భారీ బందోబస్తుతో ఒడ్డుగూడెం గ్రామం నుంచి,రాజారాం తండా గ్రామం నుంచి రైతులు పంట చేల వైపు రాకుండా మధ్యలోనే రహదారులపై అడ్డుకున్నారు.దీంతో రైతులను వెనక్కి పంపించి వేస్తున్న క్రమంలో తీవ్రంగా ప్రతిఘటించిన చింత భద్రమ్మ, పూనెం భద్రమ్మ, పూనెం కోటమ్మ, జర్పుల విజయలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. చింత లక్ష్షి్మనారాయణ, భూక్య లింగ్యా, భిక్షంలను సైతం అదుపులోకి తీసుకుని వదిలేశారు.ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో రైతుల కళ్లముందే పంటలను ధ్వంసం చేశారు. దీంతో ఇద్దరు మహిళా రైతులు భూక్య జిజానీ, భూక్య అచ్చాలీలు రోదించి స్పృహతప్పి పడిపోయారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ మంజుల, బోడు ఎస్ఐ బొడ్డు అశోక్, నరేష్, ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ, రామవరం, వైల్డ్‌లైఫ్ ఫారెస్టు అధికారులు, సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. నిబంధనల ప్రకారమే...ఎఫ్ఆర్ఓ హరితహారంలో మొక్కలు నాటేందుకు 125 ( 50 హెక్టార్లు) ఎకరాలను నిబంధనల ప్రకారమే భూమిని స్వాధీనం చేసుకున్నామని ఎఫ్ఆర్ఓ మంజుల తెలిపారు.ఈ భూముల్లో సాగు చేయవద్దని గతంలోనే అనేక పర్యాయాలు చెప్పామని అయినా వినకుండా రైతులు సాగు చేశారని తెలిపారు. వీఎస్ఎస్ ద్వారా లబ్ధి పొందాలని రైతులకు చెప్పిన వారు ఒప్పుకోలేదని పేర్కొన్నారు. -
40 ఎకరాల్లో పంట ధ్వంసం
టేకులపల్లి ఏజెన్సీలో ఉద్రిక్తం పరస్పరం తోపులాట.. ఇద్దరికి గాయాలు టేకులపల్లి :ఏపుగా పెరిగిన పంటను అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. కళ్లముందే పంట నేల పాలవుతుంటే గుండెలవిసిపోయిన గిరిజనులు రోదిస్తూ.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరస్పరం తోపులాటకు దిగడంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఒక గిరిజన మహిళ, ఫారెస్టు బీట్ ఆఫీసర్ స్పహ కోల్పోయారు. జూలై 23న పంట చేలను దున్నించేందుకు వచ్చిన అటవీ అధికారులను గిరిజనులు ప్రతిఘటించడంతో.. ఈసారి పోలీసు బలగాలతో తరలివచ్చి పంటను ధ్వంసం చేశారు. ఈ సంఘటన కొప్పురాయి పంచాయతీ పరిధిలోని ఒడ్డుగూడెం ఏజెన్సీలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చాతకొండ రిజర్వ్ ఫారెస్టు, కొప్పురాయి బీట్ ఒడ్డుగూడెంలోని కంపార్ట్మెంట్ నం.30లో మొత్తం 200 హెక్టార్ల భూమి ఉంది. ఇందులోని 125(50 హెక్టార్లు) ఎకరాల్లో అటవీ శాఖ అధికారులు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు పూనుకున్నారు. అయితే ఈ భూముల్లో కొప్పురాయి, ఒడ్డుగూడెం, రాజారాంతండా, బర్లగూడెంకు చెందిన గిరిజనులు కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ భూముల్లోనే హరితహారం మొక్కలు నాటాలనే ఉద్దేశంతో కొత్తగూడెం ఎఫ్ఆర్ఓ మంజుల ఆధ్వర్యంలో 40 మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, 10 మంది బోడు పోలీసుల సహాయంతో ఒడ్డుగూడెంలోని పంట భూముల్లోకి దున్నేందుకు ఉపయోగించే 10 ట్రాక్టర్లను తీసుకుని వెళ్లారు. పూనెం వీరస్వామి, చింత వసంతరావు, ఈసం శ్రీను, పెంటయ్య, పూనెం లక్ష్మయ్య తదితర రైతుల పంట చేలలోకి దూసుకెళ్లి ఏపుగా పెరిగిన మొక్కజొన్న, నువ్వు, పత్తి పంటలను ధ్వంసం చేసి.. దున్నడం మొదలు పెట్టారు. దీంతో గిరిజనులు ఆగ్రహంతో దున్నుతున్న ట్రాక్టర్లను, అటవీ అధికారుల చర్యలను అడ్డుకునేందుకు పరుగులు తీశారు. అటవీ శాఖ, పోలీసు అధికారులు, సిబ్బంది భారీ తాడు సాయంతో వారిని అడ్డుకున్నారు. బాధిత రైతులకు పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రైతులకు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. మహిళా రైతులను అదుపులోకి తీసుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది శత విధాల ప్రయత్నించారు. ఒకరిపై ఒకరు తోపులాటలు.. మట్టితో దాడులు చేసుకోవడం.. ఇరువర్గాలు దుర్భాషలాడుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతుల బట్టలు చినిగిపోయే విధంగా ఫారెస్టు అధికారులు బలప్రయోగం చేసి అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. దీంతో బాధిత రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. భారీ సంఖ్యలో ఉన్న అటవీ, పోలీసు అధికారులు, సిబ్బంది రైతులను బలవంతంగా దూరంగా పంపించి పంటలను నాశనం చేశారు. సుమారు 40 ఎకరాల్లో పంటలను ధ్వంసం చేశారు. మిగిలిన పంటను మంగళవారం ధ్వంసం చేయనున్నారు. కాగా, అటవీ శాఖ అధికారులు, రైతులకు మధ్య జరిగిన ఘర్షణలో చింత లక్ష్మి తలకు తీవ్ర గాయమై స్పహ కోల్పోయింది. ఇదే ఘటనలో ఫారెస్టు బీట్ ఆఫీసర్ గౌరమ్మకు కూడా గాయాలై అస్వస్థతకు గురైంది. వెంటనే ఇద్దరిని అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. రైతులకు మద్దతుగా వచ్చిన సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు ఎట్టి నర్సింహారావు, గంగారపు భాస్కర్‌ను పోలీసులు మందలించారు. -
పంటను ధ్వంసం చేసిన అధికారులు
పోడుదారులు, పోలీసుల మధ్య తోపులాట సొమ్మసిల్లి పడిపోయిన ఐదుగురు గిరిజనులు కొత్తగూడెం రూరల్ : పోడు పోరు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అడవిని చదును చేసుకొని గిరిజనులు సాగు చేసుకుంటున్న పత్తి, సజ్జ మొక్కలను అటవీ శాఖ అధికారులు యంత్రాలతో దున్నించి.. ధ్వంసం చేశారు. దీంతో పోడుదారులు, అటవీ శాఖ అధికారుల మధ్య తోపులాట జరగగా.. ఐదుగురు గిరిజనులు స్పృహతప్పి పడిపోయారు. ఈ సంఘటన రేగళ్ల పంచాయతీ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. అటవీ భూమిలో గిరిజనులు సాగు చేసుకుంటున్న పత్తి, సజ్జ పంటలకు అటవీ శాఖ అధికారులు యంత్రాలతో దున్నించారు. దీంతో పలువురు పోడుదారులు అటవీ శాఖ అధికారులను అడ్డుకున్నారు. ఇరువురి మధ్య తోపులాట జరగడంతో గుగులోతు మంగీ, బానోతు విజయ, జర్పుల డాలీ, భూక్యా బోడ, తేజావత్ జమున స్పృహతప్పి పడిపోయారు. మంగీని 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. వైద్య సేవలు అందించారు. అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ మంజుల, తీట్రౌన్ సీఐ బూర రాజ్‌గోపాల్, సీఐ శ్రీనివాసరావు, పాల్వంచ టౌన్ ఎస్సై పి.సత్యనారాయణరెడ్డి, రూరల్ ఎస్సై బత్తుల సత్యనారాయణ ఎటువంటి గొడవలు జరగకుండా అక్కడే ఉండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీఐ రాజ్‌గోపాల్ మాట్లాడుతూ అటవీ భూముల్లో గిరిజనులు సాగు చేయడం సరికాదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎంతటి వారైనా కేసులు పెడతామని హెచ్చరించారు. -
గిరిజన సమావేశం రసాభాస
గుంటూరు వెస్ట్ : జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారులు గిరిజన సంఘాల నాయకులతో గురువారం ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. సమావేశానికి గిరిజన సంఘాల నాయకులు అందరికీ సమాచారం ఇవ్వలేదని, అదేవిధంగా గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారంటూ నాయకులు మండిపడ్డారు. సమావేశాన్ని బహిష్కరించి ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళితే... ఆగస్టు 9న నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఏర్పాట్లపై చర్చించేందుకు గుంటూరు నగరంలోని ఎస్సీ కార్పొరేషన్ సమావేశపు హాలులో జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి(డీటీడబ్ల్యూవో) వి.నారాయణుడు గురువారం వివిధ గిరిజన సంఘాల నాయకులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి వివిధ గిరిజన సంఘాల నాయకులు కె.వెంకటేశ్వరరావు, కృష్ణానాయక్, కుంభా నాగేశ్వరరావు, యేసుబాబు, మొగిలి శివకుమార్, దేవరకొండ వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణుడు మాట్లాడుతూ ప్రతిఏటా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లుగానే ఈ ఏడాది కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని చెప్పారు. ఏర్పాట్లపై సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. దీంతో గిరిజన నాయకులంతా ఒక్కసారిగా లేచి నిలబడి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో గిరిజన కమ్యూనిటీ భవనాన్ని నిర్మిస్తామని ఇచ్చిన గతం లో హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్‌లో తీర్మానం చేసి స్థలం కేటాయించినా అధికారులు సక్రమంగా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. నెలరోజుల్లో గిరిజన భవన ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని గత ఏడాది ఆదివాసీ వేడుకల్లో కలెక్టర్ హామీఇచ్చినా, ఇంతవరకు ఆ మేరకు చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. సమావేశాన్ని బహిష్కరించి, హాలు వెలుపల ధర్నాకు దిగారు. కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రావెలకు వ్యతిరేకంగా నినాదాలు రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి రావెల కిశోర్‌బాబుకు వ్యతిరేకంగా గిరిజన సంఘాల నాయకులు నినాదాలు చేశారు. గిరిజనుల సమస్యల పరిష్కారంలో వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. గిరిజనులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చకుంటే ఆగస్టు 9వ తేదీన జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని బహిష్కరిస్తామంటూ హెచ్చరించారు. సుమారు రెండుగంటలపాటు ధర్నా కొనసాగింది. సమస్యలను కలెక్టర్ దృష్టికి, మంత్రి దృష్టికి తీసుకెళ్తామని అధికారులు హామీ ఇవ్వడంతో నాయకులు ఆందోళన విరమించారు. -
నిఘా నీడలో ‘జనగామ’
పట్టణంలో కొనసాగుతున్న 144 సెక్షన్ ఐదు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై కేసులు జనగామ : జనగామలో జిల్లా కోసం జరుగుతున్న ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం కొనసాగుతుంది. నాలుగు రోజులుగా పట్టణం పోలీస్ నిఘా నీడలోనే ఉంది. ఇటీవల జరిగిన రాస్తారోకోలో గుర్తు తెలియని వ్యక్తులు బస్సు దగ్ధం, వాహనాల అద్దాలను ధ్వంసం చేయడం తో ఉద్యమ స్వరూపం ఒక్కసారిగా పోలీసుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో జిల్లాలోని పారా మిలటరీ బలగాలతో పాటు జనగామ, నర్సంపేట, మహబూబాబాద్, వరంగల్ డివి జన్ పరిధిలోని పోలీసులను పెద్ద సంఖ్యలో రంగంలోకి దింపారు. అలాగే పట్టణంలో 144 సెక్షన్‌ను అమలులోకి తీసుకువచ్చారు. ఉద్యమకారులను అరెస్టు చేసి జైలుకు పంపించిన పో లీసులు, అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుండడంతో రహదారిపైకి రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. విడతల వారిగా ఉద్యమకారులను అరెస్టు చేస్తూ రిమాం డ్కు పంపిస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. జిల్లా ఉద్యమంలో తాము సైతం అంటూ ఆందోళనకు బా సటగా నిలిచిన ప్రైవేట్ పాఠశాలలకు చెందిన యాజమాన్యాలపై కేసులు నమోదుచేశారు. అ డుగడుగునా పోలీసుల వాహనం తో 144 సెక్ష న్ అమలులో ఉందంటూ మైక్ ద్వారా పోలీ సులు ప్రచారం చేస్తున్నారు. పోలీ సులు ఉక్కుపాదంతో ఉద్యమాన్ని అణచివేయాలని చూ స్తుంటే, ఉద్యమకారులు మాత్రం జిల్లా సాధిం చే వరకు తలపెట్టిన పోరు వదిలి పెట్టమని తే ల్చి చెబుతున్నారు. అక్రమ కేసులపై పో రాటం చేస్తామని వడుప్సా ప్రతినిధులు అం టుండ గా.. వైద్య సేవలను నిలిపివే స్తామని మెడికల్ జాక్ ప్రకటించడంతో ఉద్యమ స్వరూపం మరింత వేడెక్కే అవకాశం ఉంది. -
అంబేద్కర్ విగ్రహం పాక్షికంగా ధ్వంసం
రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్ గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి పాక్షికంగా ధ్వంసం చేశారు. చేయితోపాటు నడుం కింది భాగం ధ్వంసం అయింది. మంగళవారం ఉదయం గమనించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు స్థానికులు విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. విగ్రహానికి నష్టం కలిగించిన వారిని పట్టుకుని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఇన్చార్జి ఎస్ఐ ఖలీల్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేశారు. ఇందుకు కారకులైన వారిని రెండు రోజులలో దుండగులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. -
ఆ బాంబర్లు.. ఎయిర్‌పోర్టులో క్లీనర్లు!!
బ్రసెల్స్ బాంబర్ సోదరులు విమానాశ్రయంలో క్లీనర్లుగా పనిచేశారా? ఇబ్రహిం, ఖలీద్ ఎల్ బాక్రాయిలకు టెర్మినల్ నిర్మాణంపై పూర్తి అవగాహన ఉందా? వీరిద్దరూ అమెరికా టెర్రర్ వాచ్ లిస్టులో ఉన్నారా? ఇలా ఉత్పన్నమౌతున్న ఎన్నో అనుమానాలు ఒక్కొక్కటే నిజమౌతున్నాయి. విమానాశ్రయాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా ఆ జిహాదీ సోదరులు టెర్మినల్‌లో క్లీనర్లుగా పనికి చేరినట్లు స్వయంగా వారి మేనమామ తెలపడం ఆ అనుమానాలను నిజం నిజం చేస్తోంది. ఇబ్రహీం, ఖలీద్ ఎల్ బక్రాయి బ్రసెల్స్ ఉగ్రదాడులకు ముందే వ్యూహం పన్నినట్లు తాజాగా తెలుస్తోంది. విమానాశ్రయాన్ని నాశనం చేయాలన్న లక్ష్యంతోనే వారిద్దరూ అక్కడ క్లీనర్స్ గా చేరి, సెక్యూరిటీ చెక్ ల నుంచి కూడా ఎలా తప్పించుకోవాలో క్షుణ్ణంగా పరిశీలించారని తెలుస్తోంది. ఆ సోదరులిద్దరూ కనీసం పాఠశాల చదువు కూడా పూర్తి చేయలేదని, ఎయిర్ పోర్ట్, రెస్టారెంట్లో వాళ్ళిద్దరూ క్లీనర్స్ గా చేరారని, వేసవికాలంలో ఎయిర్ పోర్టు శుభ్రం చేసే పనిలో ఉన్నారని వారి మేనమామ తెలిపారు. ఈ సోదరులిద్దరూ అమెరికా టెర్రర్ వాచ్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోందని విమానాశ్రయాన్ని పరిశీలించిన బెల్జియన్ ప్రాసిక్యూటర్ ఒకరు తెలిపారు. ఇబ్రహీం గతంలో రెండుసార్లు బహిష్కరణకు గురైనట్లు వెల్లడించినా, అతడు ఐసిస్ మోజులో ఉన్నాడని తెలిపినా తమ హెచ్చరికలను బెల్జియం విస్మరించిందని టర్కిష్ అధికారులు కూడా అంటున్నారు. గత జూలైలో ఓ టర్కిష్ పోలీసును ఇబ్రహీం కాల్చి చంపేశాడని వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బెల్జియం హోం, న్యాయశాఖ మంత్రులు రాజీనామా చేశారు. అయితే ప్రధానమంత్రి వారిని వారించారు. విపత్కర పరిస్థితుల్లో రాజీనామా సరైన నిర్ణయం కాదంటూ వారిని అంగీకరించలేదు. 29 ఏళ్ళ ఇబ్రహీం, బాంబ్ మేకర్ నజీమ్ లాచ్రౌ ఇద్దరూ జావెంటెమ్ ఎయిర్ పోర్టులో సూట్ కేస్ బాంబు పేల్చి బీభత్సం సృష్టించారు. బాంబు పేలే సమయానికి వారు చేతులకు గ్లౌజెస్ పెట్టుకుని తమ ట్రాలీలను తీసుకెళ్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ను బట్టి తెలుస్తోందని, వారి పక్కనే టోపీ పెట్టుకుని ఓ తెల్లజాతి వ్యక్తి సీసీటీవీలో కనిపించాడని, అతడికి చెందిన బాంబు పేలకపోవడంతో అక్కడినుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. అమెరికా అధికారులు కూడా అతడు అమెరికా వాచ్ లిస్టులో ఉన్నట్లు వెల్లడించారు. విమానాశ్రయంలో ఉగ్రదాడి జరిగిన కొద్ది సేపటికే మీల్ బీక్ స్టేషన్లో బాంబు దాడికి పాల్పడిన ఖలీద్ అక్కడినుంచి కూడా తప్పించుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ జిహాదీ సోదరులిద్దరూ పాఠశాల స్థాయి వరకూ బాగానే చదివినా.. ఆ తర్వాత వారిద్దరికీ నేర చరిత్ర తీవ్రంగానే ఉంది. ఇద్దరూ పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించారు. అదే నేపథ్యంలో వారు ఎయిర్ పోర్ట్ ను లక్ష్యంగా చేసుకుని ముందుస్తు అంచనాతోనే అక్కడ క్లీనర్స్ గా పనికి చేరి ఉండొచ్చని వారి మేనమామ చెబుతున్నారు. జైలుశిక్ష అనుభవించిన అనంతరం వారిలో తీవ్ర మార్పు కనిపించిందని, హుందాగా కనిపించడం, వస్త్రధారణలో వచ్చిన మార్పులతో పాటు ఇబ్రహీం ఎప్పుడూ ఎవరికో ఒకరికి సహాయం చేస్తుండేవాడని ఇదంతా చూస్తే వారు తిరిగి ఇలాంటి చర్యకు పాల్పడతారని ఊహించలేదని వారి మేనమామ విచారణలో వెల్లడించాడు. కాగా ఎయిర్ పోర్ట్ అధికారులు మాత్రం ఆ సోదరులిద్దరూ విమానాశ్రయంలో క్లీనర్స్ గా పనిచేశారా లేదా అన్నది ఇంకా నిర్థారించలేదు. మరోవైపు బాంబ్ మేకర్ నజీమ్ లాచ్రౌ సోదరుడు మౌరాద్ లాచ్రౌ మాత్రం తమ అన్న మూడేళ్ళ క్రితం సిరియా పారిపోయినప్పటినుంచీ అతడితో తమ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని, సూసైడ్ బాంబర్స్ తీరు ఎంతో సిగ్గుగా, బాధగా అనిపించిందని తెలిపారు. -
భారీగా బెల్లం ఊట ధ్వంసం
సుండుపల్లి: వైఎస్సార్ జిల్లాలో ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో బుధవారం భారీగా దాడులు నిర్వహించారు. కొలిమిట్ట, మాతమ్మ హరిజనవాడ అటవీప్రాంతంలోలో అక్రమంగా నిల్వ ఉంచిన 2200 లీటర్ల బెల్లం ఊటను అధికారులు ధ్వంసంచేశారు. అదేవిధంగా 60లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పరపల్లిలో నాగేనాయక్ అనే వ్యక్తి ఇంట్లో నాటుసారా ఉన్నట్లు సమాచారం రావడంతో అతని నుంచి 20లీటర్ల నాటుసారాను స్వాధీనపరుచుకున్నారు. సుమారు 20 డ్రమ్ముల్లో ఊటను పారబోశారు. ఈ దాడుల్లో కడప ఎక్సైజ్ అధికారిణి విజయకుమారి, డీటీఎఫ్టీఐ వెంకటరమణ, రాయచోటి ఎక్సైజ్‌శాఖ సీఐ కిషోర్‌తో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. -
ఏటీఎంను ధ్వసం చేసిన దుండగులు
కడప: వైఎస్సార్ జిల్లా జిల్లా కేంద్రం కడప నగరంలోని ప్రకాశ్‌నగర్‌లో ఆదివారం రాత్రి దొంగలు ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించిన దొంగలు మొదట దానిని తెరిచేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అది ఎంతకూ తెరుచుకోకపోవడంతో ఏకంగా ఏటీఎం మిషన్‌ను ఊడబెరికే ప్రయత్నం చేశారు. అదికూడా సాధ్యపడకపోవడంతో పలాయనం చిత్తగించారు. స్థానికులు సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీం రప్పించి వివరాలు సేకరిస్తున్నారు. -
అగ్నిప్రమాదంలో ఆరు పూరిళ్లు దగ్ధం
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం లాబాం గ్రామంలో శనివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరు పూరిళ్లు దగ్ధమైనాయి. ఓ పూరింటి నుంచి ఆకస్మాత్తుగా మంటలు ఎగసిపడటంలో స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో సహా ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే స్థానికులు మంటలార్పారు. అయితే పూరిళ్లలోని వారు కూలి పనులకు వెళ్లడంతో ఈ ప్రమాదంలో ఎంత నష్టం వాటిల్లిందో తెలియరాలేదని పోలీసులు తెలిపారు. -
ధ్వంసమైన ఎవరెస్ట్ బేస్ క్యాంప్, 13మంది మృతి
-
అనధికార లేఅవుట్ల ధ్వంసానికి శ్రీకారం
తోట్లవల్లూరు : జిల్లాలో అనధికార లేఅవుట్ల ధ్వంసానికి అధికారులు శ్రీకారం చుట్టారు. తోట్లవల్లూరు మండలంలో 12 లే అవుట్లను, పెనమలూరు మండలం యనమలకుదురులో మరో లే అవుట్‌ను శనివారం ధ్వంసం చేశారు. జిల్లా పంచాయతీ అధికారి నాగరాజవర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. సీఆర్డీఏ అధికారులు ఈ పనులను పర్యవేక్షించారు. తోట్లవల్లూరు మండలంలోని యాకమూరులో అనధికార లేఅవుట్లను డీపీవో ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనధికార లేఅవుట్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తెలియజేశారు. మండల పరిధిలో మొత్తం 36 అనధికార లేఅవుట్లు ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 768 అనధికార వెంచర్లను గుర్తించినట్లు చెప్పారు. సామాజిక అవసరాల కోసం పది శాతం స్థలం వదలకుండా, కనీసం గ్రామపంచాయతీకి దర ఖాస్తు కూడా చేయకుండా గ్రామాలలో లేఅవుట్లు వేస్తున్నారని చెప్పారు. ఇలాంటి అక్రమ లేఅవుట్లను తొలగిస్తున్నట్లు చెప్పారు. అన్ని అనుమతులు ఉన్న లేఅవుట్లలోనే ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కేవలం రోడ్లను చూసి అనుమతి లేని వాటిని కొనుగోలు చేసి మోసపోవద్దని కోరారు. యాకమూరు, తోట్లవల్లూరు గ్రామాల్లోని వెంచర్లను ధ్వంసం చేసిన అధికారులు.. విడతల వారీగా మిగిలిన గ్రామాలలో కూడా అనధికార వెంచర్లను ధ్వంసం చేస్తామని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీవో వరప్రసాద్, ఈవోపీఆర్డీ అరుణ, పంచాయతీ కార్యదర్శులు కుమారస్వామి, హనుమాన్‌గౌడ్, సూర్య తదితరులు పాల్గొన్నారు. -
వర్షాలు, పంట నష్టంపై వైఎస్ జగన్ ఆరా
-
ఏపీలో భారీ వర్షాలు, పంట నష్టంపై వైఎస్ జగన్ ఆరా
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, పంట నష్టంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఆయన సోమవారం అన్ని జిల్లాల పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు వైఎస్ఆర్ సీపీ నవంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపనున్న విషయం తెలిసిందే. దీనిపై కూడా వైఎస్ జగన్ పార్టీ నేతలతో చర్చించనున్నారు. -
'కత్తి' వివాదం... థియేటర్ల విధ్వంసం
చెన్నై: విజయ్ - సమంత హీరోహీరోయిన్లుగా నటించి తమిళ యాక్షన్ థ్రిల్లర్ 'కత్తి' చిత్రంపై నెలకొన్న వివాదం రోజురోజూకు రాజుకోంటుంది. కత్తి చిత్రాన్ని బుధవారం ఎట్టి పరిస్థితుల్లోనైనా విడుదల చేసి తీరుతామని నిర్మాతలు స్పష్టం చేశారు. దాంతో తమిళ సంఘాలు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గత అర్థరాత్రి చెన్నై మహానగరంలోని పలు సినిమా థియేటర్లపై తమిళ సంఘాల వాళ్లు రాళ్లు రువ్వారు. ఆ దాడిలో రెండు థియేటర్లు ధ్వంసమైనాయి. దీంతో తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా థియెటర్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సినిమా థియేటర్ల వద్ద భారీగా పోలీసులను మెహరించారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో కత్తి చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. అయితే ఈ నిర్మాణ సంస్థతో శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సకు సంబంధాలున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికే మహింద రాజపక్సపై తమిళనాడు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ చిత్రం బ్యానర్ నుంచి లైకా పేరు తొలగించాలని వారు కత్తి నిర్మాతలను డిమాండ్ చేస్తున్నారు. అందుకు వారు ససేమిరా అంటున్నారు. దీంతో ఆగ్రహించిన తమిళ సంఘాలు గత రాత్రి విధ్వంసానికి దిగాయి. -
అరెరె.. గిట్లాయె..!
ఇటీవల కమలాపూర్ మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తే.. అదేరోజు రాత్రి సొంత పార్టీ ప్రజాప్రతినిధులే ఆ శిలాఫలకాలను ధ్వంసం చేశారు. శిలాఫలకంలో తమ పేర్లు లేవని.. ఆ కార్యక్రమంలో మంత్రి తమను చిన్నచూపు చూశాడనే ఆరోపణలతో విధ్వంసానికి ఒడిగట్టారు. కమలాపూర్ సర్పంచ్ శనిగరం సమ్మయ్య, వైస్ ఎంపీపీ బైరి దశరథంతో పాటు మరో టీఆర్ఎస్ నాయకుడు, కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యుడిని పోలీసులు ఈ ఘటనలో అదుపులోనికి తీసుకున్నారు. మంత్రి సెగ్మెంట్లో ఆయన కనుసన్నల్లోనే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పోలీసులు అరెస్టు చేసేంత వరకు వెళ్లటం అందరి నోటా చర్చనీయాంశమైంది. మరోవైపు హుజూరాబాద్ ప్రాంత చిరకాల వాంఛ అయిన రెవెన్యూ డివిజన్ హోదా కోసం ఈటెల మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే తనవంతుగా పావులు కదిపారు. ఎన్నికల ముందు హుస్నాబాద్‌కు మంజూరైన రెవెన్యూ డివిజన్‌ను రద్దు చేయించి కొత్త జీవో తెచ్చారు. ఆగస్టు 14న హుజూరాబాద్‌లో ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభించారు. నెలరోజుల తర్వాత ఈ ఆర్డీవో కార్యాలయాన్ని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. పాత జీవోను అమలు చేయాలని సూచించింది. హుస్నాబాద్‌లో ఆర్డీవో కార్యాలయం కావాలని సొంత పార్టీ ఎమ్మెల్యే సతీష్‌బాబు, ఆయన తండ్రి, పార్టీ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు పట్టుబడుతున్నారు. హుజూరాబాద్‌కు ఈ హోదా కల్పించాలని ఈటెల కోరుతున్నారు. ఈ వివాదంలో కోర్టు తీర్పు ఈటెలకు షాక్ ఇచ్చింది. మరోవైపు హుజూరాబాద్ నగర పంచాయతీ చైర్మన్ నియామకం మంత్రిని చు ట్టుముట్టింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్‌గా గెలిచిన విజయ్‌కుమార్‌ను చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టి చివరి నిమిషంలో టీఆర్ఎస్లో చేర్పించటం సొంత పార్టీ కౌన్సిలర్లను అయోమయానికి గురిచేసింది. అక్కడ తొమ్మిది మంది టీఆర్ఎస్ కౌన్సిలర్లుగా గెలిచారు. బీసీ జనరల్‌కు కేటాయిం చిన చైర్మన్ సీటుకు నలుగురు కౌన్సిలర్లు పోటీపడ్డారు. ఆ నలుగురిలో సయోధ్య కుదర్చటంలో మంత్రి విఫలమయ్యారు. దీంతో టీఆర్ఎస్లో చేరే ఒప్పందంతో కాంగ్రెస్ కౌన్సిలర్ ఈ సీటును దక్కించుకున్నారు. సొంత పార్టీ కౌన్సిలర్లను కాద ని, వేరే కౌన్సిలర్‌కు మద్దతిచ్చారనే అపవాదు మంత్రిని వెంటాడుతూనే ఉంది. పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతుల రుణమాఫీపై ఈటెల చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం లేపాయి. స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ అవి అవగాహన లేని మాటలు.. అంటూ వివాదాన్ని తేలిగ్గా కొట్టిపారేయటంతో మంత్రి ఇరుకునపడ్డారు. రాష్ట్ర కేబినేట్లో మన జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ జిల్లాకు సంబంధించిన వ్యవహారాల్లో ఈటెల రాజేందర్ క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. మంత్రి కేటీఆర్ సీఎం కుమారుడు కావటంతో రాష్ట్రస్థాయి వ్యవహారాల్లోనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. దీంతో జిల్లాలోని చర్చనీయాంశాలు.. తక్షణ సమస్యలన్నీ మంత్రి ఈటెల వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. అదే సమయంలో సొంత సెగ్మెంట్లోనే అసంతృప్తి సెగలు ఆయనకు కంట్లో నలుసులా మారుతున్నాయా.. అనే చర్చలు మొదలయ్యాయి. -
రసాయన ఆయుధాల నాశనానికి ఏడాది పడుతుంది: బషర్ అల్-అసద్
సిరియా అధ్యక్షుడు అసద్ వెల్లడి డమాస్కస్: సిరియాలో రసాయన ఆయుధాలను నాశనం చేయడానికి కనీసం ఏడాది సమయం పడుతుందని ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ స్పష్టంచేశారు. సిరియా ఉగ్రవాద బాధిత దేశంగా మారిందని, విదేశాల మద్దతుతోనే అల్‌కాయిదా చొరబాటు శక్తులు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయని చెప్పారు. 80కిపైగా దేశాలకు చెందిన అల్‌కాయిదా గెరిల్లాలు ఇందులో పాలుపంచుకుంటున్నాయని ఆరోపించారు. అంతేతప్ప ఇక్కడ జరుగుతున్నది అంతర్యుద్ధం కానేకాదని చెప్పారు. అమెరికా వార్తా చానల్ ‘ఫాక్స్ న్యూస్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈవిషయాలు వెల్లడించారు. రసాయన ఆయుధాలను నాశనం చేయడమనేది ఆషామాషీ వ్యవహారం కాదని, సాంకేతికంగా ఇదో పెద్ద సంక్లిష్ట ప్రక్రియ అని అసద్ పేర్కొన్నారు. దీనికి కనీసం 100 కోట్ల డాలర్లు వెచ్చించాల్సి ఉంటుందన్నారు. -
టోల్ బూత్‌పై దాడి
నాసిక్: టోల్ చెల్లించమని అడిగారనే కోపంతో శివసేన ఎమ్మెల్యే అనిల్ కదమ్, ఆయన అనుచరులు టోల్నాకాను ధ్వంసం చేశారు. ఈ ఘటన నాసిక్ జిల్లా ముంబై-ఆగ్రా జాతీయరహదారిలోని పింపల్గావ్-బస్వంత్ టోల్‌బూత్ వద్ద గురువారం చోటుచేసుకుంది. టోల్ చెల్లించమని అడిగినందుకు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న మహిళా సిబ్బందిని అనిల్ దూషిస్తున్న దృశాల్యను ఓ ప్రైవేటు టీవీ చానల్ ప్రసారం చేసింది. ఎమ్మెల్యేలకు టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఉందని, అయితే విధుల్లో ఉన్న సిబ్బంది అడిగారని, దీంతో అనిల్ తనను తాను నియంత్రించుకోలేకపోయారని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో అనిల్ ఓ ప్రైవేటు వాహనంలో ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదైందా లేదా అనే విషయాన్ని పోలీసులు నిర్ధారించలేదు. ఎమ్మెల్యే అనిల్ కదమ్... నిఫడ్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
రాజీవ్‌గాంధీ విగ్రహన్ని ధ్వసం చేసేయత్నం