శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం లాబాం గ్రామంలో శనివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరు పూరిళ్లు దగ్ధమైనాయి. ఓ పూరింటి నుంచి ఆకస్మాత్తుగా మంటలు ఎగసిపడటంలో స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో సహా ఘటన స్థలానికి చేరుకున్నారు.
అయితే అప్పటికే స్థానికులు మంటలార్పారు. అయితే పూరిళ్లలోని వారు కూలి పనులకు వెళ్లడంతో ఈ ప్రమాదంలో ఎంత నష్టం వాటిల్లిందో తెలియరాలేదని పోలీసులు తెలిపారు.