21 cars destroyed in multi-storey parking lot in West Delhi - Sakshi
Sakshi News home page

ఘోర అగ్ని ప్రమాదం... 21 కార్లు దగ్ధం

Published Mon, Dec 26 2022 4:49 PM | Last Updated on Mon, Dec 26 2022 5:28 PM

21 Cars Destroyed In Delhi  Multi Storey Building Parking Lot - Sakshi

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బహుళ అంతస్తుల భవనంలోని పార్కింగ్‌ ప్రదేశంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 21 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన ఢిల్లీలోని సుభాష్‌ నగర్‌లో సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు చోటు చేసుకుంది. ఈ ఘటనకు గల కారణాలేంటో తెలియరాలేదని అధికారులు చెబుతున్నారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించగా..ఒక అపరిచిత వ్యక్తి పార్కింగ్‌ ప్రదేశంలో సంచరించినట్లు కనిపించిందని అదికారులు తెలిపారు.

ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఆరు అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ని చేపట్టినట్లు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది ఉదయం సుమారు 6.10 నిమిషాలకు మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా ఈ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతోంది.

(చదవండి: ఇంట్లో ఆయుధాలు లేదా పదునైనా కత్తులైనా ఉంచుకోండి: బీజేపీ ఎంపీ షాకింగ్‌ వ్యాఖ్యలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement