నిఘా నీడలో ‘జనగామ’ | Section 144 in the town of ongoing | Sakshi
Sakshi News home page

నిఘా నీడలో ‘జనగామ’

Published Wed, Jul 6 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM

నిఘా నీడలో ‘జనగామ’

నిఘా నీడలో ‘జనగామ’

పట్టణంలో కొనసాగుతున్న 144 సెక్షన్
ఐదు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై కేసులు

 
 
జనగామ : జనగామలో జిల్లా కోసం జరుగుతున్న ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం కొనసాగుతుంది. నాలుగు రోజులుగా పట్టణం పోలీస్ నిఘా నీడలోనే ఉంది. ఇటీవల జరిగిన రాస్తారోకోలో గుర్తు తెలియని వ్యక్తులు బస్సు దగ్ధం, వాహనాల అద్దాలను ధ్వంసం చేయడం తో ఉద్యమ స్వరూపం ఒక్కసారిగా పోలీసుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో జిల్లాలోని పారా మిలటరీ బలగాలతో పాటు జనగామ, నర్సంపేట, మహబూబాబాద్, వరంగల్ డివి జన్ పరిధిలోని పోలీసులను పెద్ద సంఖ్యలో రంగంలోకి దింపారు. అలాగే పట్టణంలో 144 సెక్షన్‌ను అమలులోకి తీసుకువచ్చారు. ఉద్యమకారులను అరెస్టు చేసి జైలుకు పంపించిన పో లీసులు, అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుండడంతో రహదారిపైకి రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. విడతల వారిగా ఉద్యమకారులను అరెస్టు చేస్తూ రిమాం డ్‌కు పంపిస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది.


జిల్లా ఉద్యమంలో తాము సైతం అంటూ ఆందోళనకు బా సటగా నిలిచిన ప్రైవేట్ పాఠశాలలకు చెందిన యాజమాన్యాలపై కేసులు నమోదుచేశారు. అ డుగడుగునా పోలీసుల వాహనం తో 144 సెక్ష న్ అమలులో ఉందంటూ మైక్ ద్వారా పోలీ సులు ప్రచారం చేస్తున్నారు. పోలీ సులు ఉక్కుపాదంతో ఉద్యమాన్ని అణచివేయాలని చూ స్తుంటే, ఉద్యమకారులు మాత్రం జిల్లా సాధిం చే వరకు తలపెట్టిన పోరు వదిలి పెట్టమని తే ల్చి చెబుతున్నారు. అక్రమ కేసులపై పో రాటం చేస్తామని వడుప్సా ప్రతినిధులు అం టుండ గా.. వైద్య సేవలను నిలిపివే స్తామని మెడికల్ జాక్ ప్రకటించడంతో ఉద్యమ స్వరూపం మరింత వేడెక్కే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement