Janagama
-
ఇన్ఫోసిస్, విప్రోలాంటి సంస్థల్లో ఉద్యోగం కాదనుకుని కానిస్టేబుల్‌గా..!
ఇన్ఫోసిస్, విప్రోలాంటి పెద్ద సంస్థల నుంచి మంచి ప్యాకేజీతో ఉద్యోగం వెదుక్కుంటూ వస్తే... ఏ అమ్మాయికైనా సంతోషమే. అయితే సౌమ్య మాత్రం ఆ సంతోషాన్ని కాదనుకుంది. కారణం... పోలిస్ ఉద్యోగంపై ఆమెకు ఉన్న ఇష్టం. ప్రస్తుతం పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. సౌమ్య ఉద్యోగ ఎంపిక చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. అయితే ఆమె మాత్రం... ‘ఇది తొలి అడుగు. ఐపీఎస్ నా లక్ష్యం’ అంటుంది....జనగామ జిల్లా తిరుమలగిరికి చెందిన ఉప్పునూతల సౌమ్య ఒకవైపు చదువులో రాణిస్తూనే దుక్కి దున్నడం, పురుగు మందు పిచికారీ చేయడం, కలుపు తీయడంలాంటి వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేది. కానిస్టేబుల్ శిక్షణ సమయంలో బెస్ట్ ఆల్‌రౌండర్, ఇండోర్ ట్రోఫీలను గెలుచుకున్న సౌమ్య 2024 బ్యాచ్ స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసింగ్ అవుట్ పరేడ్‌లో 1,211 మంది మహిళా ట్రైనీలకు పరేడ్ కమాండర్‌గా వ్యవహరించింది.అమ్మ బడిలో...‘మా అమ్మకు చదువుకోవాలని ఉండేది. కానీ కుటుంబ సమస్యలతో సాధ్యపడలేదు. అందుకే మా చదువులపై ఎప్పటికీ రాజీపడలేదు. మాకు రోజూ లెక్కలు చెప్పేది. గూడూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో నేషనల్ క్యాడెట్ కార్పస్‌ను ప్రవేశపెట్టినప్పుడు పోలీస్ యూనిఫాం పట్ల ఇష్టం ఏర్పడింది. నేను పదవ తరగతి చదివే సమయానికి నా స్నేహితుల్లో చాలామందికి పెళ్లి జరిగింది. అయితే పెళ్లి విషయంలో తల్లిదండ్రులు నన్ను ఎప్పుడూ బలవంతం చేయలేదు. నేను ఎంత చదివితే వారికి అంత సంతోషం. మా గ్రామం నుంచి ఎవరూ పాఠశాల స్థాయి దాటి ముందుకు సాగలేదు’ అంటుంది బీటెక్ చేసిన సౌమ్య. తెలంగాణలో కానిస్టేబుల్‌గా పనిచేయడానికి ముందు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా ఎంపికైంది సౌమ్య. ఢిల్లీలో కొంత కాలం పాటు పనిచేసింది. ఎలాంటి కోచింగ్‌లపై ఆధారపడకుండా స్వతంత్రంగా పారామిలిటరీ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించడం తన మీద తనకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచింది.ఢిల్లీ నుంచి తిరిగి ఇంటికి...‘తల్లిదండ్రులకు చాలా దూరంగా ఉంటున్నాను. వారు ఎలా ఉన్నారో ఏమిటో!’ అనే దిగులుతో తిరిగి సొంత ఊరికి వచ్చింది సౌమ్య.మళ్లీ..ఎంతోమందికి ఆశ్చర్యం!‘బంగారంలాంటి ఉద్యోగాన్ని వదిలి ఇలా వచ్చావేమిటి’ అని అడిగిన వాళ్లకు సౌమ్య ఏం జవాబు చెప్పిందో తెలియదుగానీ... అదే సమయంలో మరో అవకాశం ఆమెను వెదుక్కుంటూ వచ్చింది. తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇంట్లోనే ఉంటూ రాత్రింబవళ్లు కష్టపడి చదువుకుని కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైంది. ‘ఐపీఎస్ కచ్చితంగా సాధిస్తాను. ఇది గొప్ప కోసం చెబుతున్న మాట కాదు. ఆత్మవిశ్వాసంతో చెబుతున్న మాట’ అంటుంది సౌమ్య స్వరంతో ఉప్పునూతల సౌమ్య.నా బిడ్డ సాధించింది... ఇంకా ఎంతో సాధిస్తుంది!పోలిస్ అకాడమీలో మహిళా ట్రైనీలకు పరేడ్ కమాండర్‌గా వ్యవహరించిన సౌమ్యను చూసి పొంగిపోయాను. నాలాగా నా పిల్లలు చదువుకు దూరం కావద్దు అనుకున్నాను. చదువులోనే కాదు వ్యవసాయ పనుల్లోనూ కూడా సౌమ్య కష్టపడి పనిచేస్తుంది. నా బిడ్డ సాధించింది. ఇంకా ఎంతో సాధిస్తుంది.– అరుణ, సౌమ్య తల్లి – కొత్తపల్లి కిరణ్ కుమార్, సాక్షి, జనగామఫొటోలు: గోవర్ధనం వేణుగోపాల్ -
బ్యాంక్ లింక్ పంపి.. రూ.11లక్షలు దోచేశారు
జనగామ: ఇంటి నిర్మాణానికి మూడేళ్లుగా బ్యాంకులో పొదుపు చేసుకుంటున్న సొమ్మును సైబర్ మాయగాళ్లు ఏపీకే లింక్ పంపి దాన్ని డౌన్లోడ్ చేయగానే క్షణాల్లో నగదును మాయం చేశారు. ఫోన్ ఔట్ గోయింగ్ పని చేయడం లేదని.. అనుమానం వచ్చి బ్యాంకు వెళ్లి ఆరా తీయగా ఖాతాలో సొమ్ము లేదని చెప్పడంతో ఖంగుతిన్నాడు సదరు ఖాతాదారుడు. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ పట్టణం హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన పోలోజు రామేశ్వర్ ఆర్టీసీ కండక్టర్‌గా పని చేస్తున్నాడు. సొంతింటి కళను సాకారం చేసుకునేందుకు మూడేళ్ల క్రితం పునాది వేశాడు. అప్పటి నుంచి ఇంటి నిర్మాణానికి సంపాదనలో కొంత సొమ్మును పొదుపు చేస్తూ స్థానిక యూనియన్ బ్యాంకులో రూ.11లక్షల వరకు జమ చేశాడు. ఇంటి నిర్మాణ పనులకు అవసరమైనప్పుడు బ్యాంకు నుంచి కొంత నగదును డ్రా చేసుకుంటున్నాడు. కాగా ఈ నెల 8వ తేదీన వ్యక్తిగత పని నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లిన రామేశ్వర్.. తిరుగు ప్రయాణంలో తన ఫోన్‌కు యూనియన్ బ్యాంకుకు సంబంధించిన ఏపీకే యాప్ లింక్‌తో ఫేక్ మెసేజ్ వచ్చింది. బ్యాంకు ఖాతా సేఫ్టీ కోసం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సైబర్ మోసగాడు పంపించిన యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. సైబర్ నేరస్తుడు సదరు వ్యక్తికి ఎటువంటి అనుమానం కలుగకుండా తన ఫోన్ ఔట్ గోయింగ్ కాల్ వెళ్లకుండా చేశాడు. అదే రోజు రాత్రి రామేశ్వర్ యూనియన్ బ్యాంకు ఖాతా నుంచి రూ.7 లక్షలు, శుక్రవారం రూ.4.21 లక్షలు, మొత్తంగా 16 లావాదేవీల ద్వారా రూ.11.21 లక్షల నగదును డ్రా చేసుకుని, రూ.142 మాత్రమే మి గిల్చారు. ఫోన్ కలవడం లేదని అనుమానం వచ్చిన బాధితుడు రి పేరు సెంటర్‌కు వెళ్లి సరి చేయగా, డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్ రా వడంతో అక్కడ నుంచి హుటాహుటిన బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు అ ధికారులు ఖాతా నంబర్‌ను పరిశీలించిన తర్వాత పెద్ద మొత్తంలో డ బ్బులు డ్రా అయినట్లు తెలిపారు. ఇందులో రూ.9.21 లక్షల నగదు అ నుమానం కలుగకుండా డ్రా చేయగా, రూ.2లక్షలు మాత్రం చెన్నైలో ని సిద్దపుడూర్ సెంట్రల్ బ్యాంకు నుంచి రాహుల్ అనే వ్యక్తికి నెఫ్ట్ చేసిన ట్లు గుర్తించినట్లు బాధితుడు రామేశ్వర్ తెలిపారు. బాధితుడు పో లీ సులను ఆశ్రయించగా 1930కు ఫోన్ చేసి సైబర్ క్రైంలో ఫిర్యాదు చే యించారు. వెంటనే కేసును విచారించిన పోలీసులు, రూ.1.37 లక్షల ను హోల్డ్ చేసినట్లు మెసేజ్ వచ్చినట్లు రామేశ్వర్ తెలిపారు. పోలీసులు విచారణ చేసి న్యాయం చేయాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు. -
రైతులను మోసం చేస్తే సహించేది లేదు
సాక్షి, హైదరాబాద్/ జనగామ: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఎవరు మోసం చేసేందుకు ప్రయత్నించినా చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లలో విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. జనగామ మార్కెట్ యార్డులో రైతుల ఆందోళన అంశంపై సీఎం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. వ్యవసాయ మార్కెట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు. జనగామ వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించాం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అద నపు కలెక్టర్ రోహిత్ సింగ్‌కు నా అభినందనలు. అధికారులందరూ ధాన్యం కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను’’ అని పేర్కొన్నారు. ముగ్గురు ట్రేడర్లపై కేసులు జనగామ వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు సిండికేట్ అయి ధాన్యానికి తక్కువ ధర చెల్లిస్తు న్నారంటూ రైతులు బుధవారం ఆందోళన చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్.. మార్కెట్ కార్యదర్శి భాస్క ర్ను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరణ తీసుకున్నాక కార్యదర్శిపై చర్యలు చేపడతామన్నారు. మరోవైపు జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ నరేంద్ర ఫిర్యాదు మేరకు ముగ్గురు ట్రేడర్లపై కేసు నమోదు చేసినట్టు సీఐ రఘు పతిరెడ్డి తెలిపారు. ప్రైవేటు మార్కెట్లో ధాన్యానికి రూ.1,800కన్నా ఎక్కువ ధర ఇవ్వాలని అధికారులు ఆదేశించినా.. వ్యాపారులు కేవలం రూ.30 పెంచి కొనుగోలు చేస్తున్నట్టు రైతులు ఆరోపించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గురువారం వ్యవసాయ మార్కెట్లో పర్యటించారు. ధాన్యం ధర తగ్గించి కొనుగోలు చేస్తే ఊరు కునేది లేదన్నారు. -
ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ కీలక ట్వీట్
సాక్షి, హైదరాబాద్: వ్యాపారులు, మార్కెట్ అధికారులు కుమ్మక్కై ధాన్యానికి తక్కువ ధర చెల్లిస్తున్నారంటూ రైతులు జనగామ వ్యవసాయ మార్కెట్లో ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రేడర్లపై కేసులు, మార్కెట్ కార్యదర్శి సస్పెన్షన్‌కు అదనపు కలెక్టర్ ఆదేశాలిచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఎక్స్(ట్విటర్) వేదికగా ట్వీట్ చేశారు. ‘‘ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు… వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు. జనగామ వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి.. రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించడం.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ గారికి నా అభినందనలు’’ అంటూ సీఎం ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
రేపు పంటల పరిశీలనకు కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/హైదరాబాద్: ఎండుతున్న పంటలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఆదివారం మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో సాగునీరు లేక, భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల స్థితిగతులు తెలుసుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటిస్తారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండిపోతున్న వరిపంటలపై ఇటీవల కేసీఆర్‌కు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనకు వస్తున్నారు. -
‘పల్లా’కు మతిభ్రమించింది.. : సుంకెట అన్వేష్‌రెడ్డి
నిజామాబాద్: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకెట అన్వేష్‌రెడ్డి విమర్శించారు. నగరంలోని కాంగ్రెస్ భవన్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి రైతు సమన్వయ సమితి ఉన్న అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రకతి వైపరీత్యాలు వచ్చినా స్పందించలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలపై సర్వే చేయిస్తున్నట్లు చెప్పారు. సర్వే కాకుండానే రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు రాజేశ్వర్‌రెడ్డి ఎలా చెబుతారని ప్రశ్నించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బీన్‌హందాన్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి, సిరికొండ గంగారెడ్డి, అల్లూరి మహేందర్ రెడ్డి, శశిధర్‌రెడ్డి, సుంకెట బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. ఇవి చదవండి: పసుపుబోర్డు ఎక్కడుందో చెప్పాలి.. : ఎంపీ బాజిరెడ్డి -
జనగామలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
-
తెలంగాణ: చేతులు కలిపితే సరిపోతుందా?
సాక్షిప్రతినిధి, వరంగల్: రాజకీయ ఉద్ధ్దండులకు కేరాఫ్ అయిన వరంగల్‌లో రోజుకో తీరు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈసారి మూడు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో రాజకీయాలు కీలకంగా మారాయి. దరఖాస్తులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తుండగా.. ముందుగానే టికెట్ ఖరారు చేసుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులు కొందరు వ్యూహరచన, ప్రచారాల్లో పడ్డారు. ఇదే సమయంలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో చెలరేగిన అసంతృప్తి మాత్రం సద్దుమణగడం లేదు. ఉమ్మడిజిల్లాలో 12 స్థానాల్లో పది చోట్ల ప్రశాంతంగా ఉన్నా.. ఈ రెండు స్థానాలు మాత్రం అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. అందరి దృష్టి ఇప్పుడు ఆ నియోజకవర్గాలపైనే ఉంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు మంతనాలు జరిపినా.. ఆరెండు నియోజకవర్గాల్లో అసంతృప్తి.. అంతర్గత కుమ్ములాటలు సద్దుమణగడం లేదు. ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి ఎవరికీ వారుగానే వ్యవహరిస్తున్నారు. నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు వారం రోజుల కిందట బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్‌కు పిలిపించారు. స్టేషన్ ఘన్‌పూర్‌కు సంబంధించి ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో వేర్వేరుగా, కలిపి మంత్రి కేటీఆర్ చాలాసేపు చర్చలు జరిపారు. ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ ప్రయోజనాలు, అవకాశాలపై కూలంకుషంగా మాట్లాడిన అనంతరం మంత్రి కేటీఆర్ సమక్షంలో రాజయ్య, శ్రీహరి కరచాలనం చేసుకున్నారు. అప్యాయంగా పలకరించుకున్న ఫొటోలు, వీడియోలు మీడియాలో రావడంతో అంతా సద్దుమణిగినట్లేననుకున్నారు. ఆ మరుసటి రోజు నుంచి చేయి కలిపితే పోటీ చేయకుండా ఉంటానన్నట్లా అంటూ రాజయ్య, శ్రీహరి ఎవరికి వారుగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని బుజ్జగించేందుకు నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కేటీఆర్ వద్దకు తీసుకెళ్లారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా ప్రగతిభవన్లోనే ఉన్నప్పటికీ కేటీఆర్.. ఎమ్మెల్యే యాదగిరిరెడ్డితోనే మాట్లాడారు. తర్వాత సీఎం కేసీఆర్‌ను కూడా కలిసినట్లు యాదగిరిరెడ్డి చెప్పారు. ఇది జరిగిన మరుసటి రోజు నుంచే ఎమ్మెల్యే జనగామలో తిరుగుతుండగా.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సైతం నియోజకవర్గంలోని తన అనుచరులతో వ్యూహ రచనలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందటి కంటే ఎక్కువగా ఒకరిపై ఒకరు పరోక్ష వ్యాఖ్యలు, విమర్శలు చేసుకుంటుండడంతో పార్టీ క్యాడర్ ఇబ్బంది పడుతోంది. కేటీఆర్ పర్యటనతోనైనా సద్దుమణిగేనా.. ప్రయత్నాలెన్ని చేసినా.. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ రాజకీయాలు ఇంకా రక్తి కట్టడం లేదు. ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మధ్య అగాధం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. అంతా అయిపోయిందనుకున్న స్టేషన్ ఘన్‌పూర్‌లో సైతం పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంది. మరో ఐదారు రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తాయన్న ప్రచారం జోరందుకుంది. ఆమేరకు కూడా ఆరెండు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి రెండు నెలలు కావొస్తున్నా.. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ కుదురుకోవడం లేదు. పైగా.. ఆ ప్రభావం ఇతర నియోజకవర్గాలపైనే చూపే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో నేతల మధ్య విభేధాలతో ‘ఎవరి వెంట వెళ్లాలో.. ఎవరితో వెళ్లకూడదో అర్థం కావడం లేదని.. అధిష్టానం తొందరగా సెట్ చేస్తేనే కలిసి తిరగగలం’ అని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈనెల 6న మంత్రి కేటీఆర్ వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఆయన ఉమ్మడి వరంగల్ రాజకీయాలపై సమీక్ష జరిపే అవకాశం ఉందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఈనేపథ్యంలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో నేతల వివాదాలకు సైతం సీరియస్‌గానే తెర వేయనున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. -
జనగామకు ‘పల్లా’ వద్దే వద్దు
జనగామ: బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే టికెట్ విషయం మరింత వేడెక్కింది. తమ నియోజకవర్గంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి జోక్యం ఏమిటంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వర్గాలు రోడ్డెక్కాయి. నియోజకవర్గంలోని 8 మండలాలతోపాటు జనగామ అర్బన్‌కు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు శనివారం ‘పల్లా గో బ్యాక్’, ‘ముత్తిరెడ్డికి మూడోసారి టికెట్ ఇవ్వండి.. లేదంటే పోచంపల్లికి ఇచ్చినా పర్వాలేదు’అంటూ పట్టణంలో ర్యాలీ నిర్వహించాయి. అనంతరం ఆర్టీసీ చౌరస్తాలో హైదరాబాద్–వరంగల్ హైవేపై నిరసనకు దిగాయి. పల్లా రాజేశ్వర్‌రెడ్డి అనుచరులు జనగామ బీఆర్ఎస్ టికెట్ కోసం స్థానిక ప్రజాప్రతినిధులను సంతలో పశువుల్లా కొంటున్నారని ఆరోపించారు. పల్లాకు జనగామతో పనేమిటని, ఆయనకు టికెట్ ఇస్తే తమ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు. ఆందోళనకారులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి దిష్టిబోమ్మను దహనం చేసేందుకు ప్రయతి్నంచినా తర్వాత విరమించుకున్నారు. మొత్తంగా ముత్తిరెడ్డి, పోచంపల్లి వర్గీయుల ఆందోళనతో జనగామలో నాలుగు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. కార్యక్రమంలో నాయకులు కర్రె శ్రీనివాస్, మసివుర్ రెహమాన్, విష్ణువర్ధన్‌రెడ్డి, రేఖ, శ్రీనివాస్, మల్లాగారి రాజు, స్వప్నరాజు, శ్రీశైలం, మామిడాల రాజు, రామక్రిష్ణ, ఉడుగుల కిష్టయ్య, ప్రభాకర్, తిప్పారపు విజయ్, నాగరాజు, మిద్దెపాక లెనిన్, జూకంటి కిష్టయ్య, రమేష్, వంగ ప్రణీత్‌రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్, బూరెడ్డి ప్రమోద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పల్లాకు జనగామలో ఏం పని: ముత్తిరెడ్డి సింహం లాంటి సీఎం కేసీఆర్ పక్కన ఉండి కూడా పల్లా రాజేశ్వర్‌రెడ్డి చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విమర్శించారు. శనివారం జనగామలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జనగామ టికెట్ కోసం పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పోటీపడుతున్నారంటూ ప్రచారం జరిగినప్పుడు ఆయన నా ఆఫీసుకు వచ్చి ప్రెస్‌మీట్ పెట్టి మరీ అది అబద్ధమని చెప్పారు. ఆయన చూపిన సంస్కారానికి నా నమస్కారం. కానీ పల్లా ఎంత ఎత్తులో ఉన్నారో అంతటి స్థాయిలో కుట్రలకు తెరలేపారు. నా వెనుక ఉన్న నాయకులకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. జనగామను మరో హుజూరాబాద్ చెయ్యాలని చూస్తున్నారు. పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నారు. నా కుటుంబంలో కలహాలు రేపించినది ఎవరో అందరికీ తెలుసు..’’అని ముత్తిరెడ్డి పేర్కొన్నారు. ఉద్యమంలో 2002 నుంచి కేసీఆర్ వెంట సైనికుడిలా పనిచేస్తున్నానని, తనకు తొలి జాబితాలోనే టికెట్ ప్రకటించాలని సీఎంకు దండం పెట్టి విన్నవిస్తున్నానంటూ కన్నీటిపర్యంతమయ్యారు. -
ఈసారి పాలకుర్తిలో వాడివేడి పోటీ.. అధికార పార్టీపై హాస్తం వ్యూహాలు..!
పాలకుర్తి నియోజకవర్గం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓటమి ఎరుగని నేతగా పేరుతెచ్చుకున్న ఎర్రబెల్లికి ఈసారి చుక్కలు చూపించేందుకు కాంగ్రెస్ బారీ కసరత్తే చేస్తుంది. ఆయనను ఈసారి ఓడించేందుకు కాంగ్రెస్ ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుటుంబసభ్యులను బరిలోకి దింపనున్నారు. ఝాన్సీరెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశిస్సులతోపాటు మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి సహకారం ఉంటుంది. మంత్రి ఎర్రబెల్లికి సైతం జనం నుంచి వ్యతిరేక ఉండడంతో నియోజకవర్గానికే పరిమితం అవుతున్నాడు. రాజకీయపరమైన అంశాలు పాలకుర్తి టిఆర్ఎస్ పార్టీ నుండి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటికి మూడుసార్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దయాకర్ రావు కలిసి వచ్చే అంశం నియోజకవర్గ ప్రజలతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండడం. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫ్రీగా నిరుద్యోగులకు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం. మహిళలకు కుట్టు మిషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ఫ్రీగా కుట్టు మిషన్ ఇవ్వడం. మహిళలకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫ్రీ మిల్స్ ఏర్పాటు చేయడం. జూనియర్ డిగ్రీ కాలేజీలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫ్రీగా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం కలిసి వచ్చే అంశాలు. కాంగ్రెస్ పార్టీ నుండి అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి , నియోజకవర్గ లోకల్‌గా కలిసి వచ్చే అంశం. ఆమె గతంలో నిరుపేదలకు చేసిన సేవలు కూడా ప్రభావితం చేస్తాయి అని చెప్పవచ్చు. రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న నాయకులు ఆమెతో కలిసి వచ్చే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే నెమరు కొమ్ముల సుధాకర్ రావు ఎమ్మెల్సీ ఇస్తానని ఇవ్వకపోవడంతో తనతో ఉన్న కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు. పాలకుర్తిలో బిజెపి ప్రభావం పెద్దగా చెప్పుకోదగినంత ఏమీ లేదు. గతంలో రెండు సార్లు పెద్దగాని సోమయ్య పోటీ చేశాడు కానీ ఇప్పటివరకు మళ్లీ ఏ వ్యక్తికైనా బిజెపి నుండి అభ్యర్థిగా నిర్ణయించలేదు.. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : పాలకుర్తి నియోజకవర్గం లోకల్ నాన్ లోకల్ అంశం, ఈ ఎలక్షన్లో రెడ్డి సామాజిక వర్గం ప్రభావితం చూపే అవకాశం ఉంది. నాలుగో సారి ఎన్నికల బరిలో మంత్రి దయాకర్ రావు ప్రజల నుంచి సహజంగా వచ్చే వ్యతిరేకత. మూడోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వచ్చే వ్యతిరేకత ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు బీఆర్ఎస్ ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి బీజేపీ పార్టీ పెద్దగాని సోమయ్య వృత్తిపరంగా ఓటర్లు: రైతులు. వ్యాపారులు. మతం/కులాల వారిగా ఓటర్లు: హిందుఓటర్లు అందులో రెడ్డి సామాజికవర్గం ఓట్లు ప్రభావం చూపుతాయి. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: పాలకుర్తి నియోజకవర్గం మూడు జిల్లాలకు విస్తరించి ఉంది. వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉంది. అడవులు లేవు పర్యాటక కేంద్రంగా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ టెంపుల్, వల్మిడి సీతారామచంద్ర స్వామి టెంపుల్, బొమ్మెర పోతన స్మారక మందిరం. -
జనగామలో టెన్షన్ టెన్షన్.. పల్లా గో బ్యాక్.. ముత్తిరెడ్డి వర్గీయుల నిరసన
సాక్షి, జనగామ: బీఆర్ఎస్లో జనగామ టిక్కెట్ వివాదం తారస్థాయికి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యేకే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అనుచరులు రచ్చ రచ్చ చేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి టిక్కెట్ ఖరారు చేశారనే ప్రచారంతో ముత్తిరెడ్డి అనుచరులు గో బ్యాక్ పల్లా అంటూ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. చౌరస్తాలో బైఠాయించి ముత్తిరెడ్డికి టిక్కెట్ ఇస్తే గెలిపించి గిఫ్ట్ ఇస్తామని లేకుంటే పార్టీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని హెచ్చరించారు. అటు స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే రాజయ్య అనుచరులు కడియంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగి దిష్టిబొమ్మలు దహనం చేశారు. చదవండి: బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారు -
'పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతు తెలుపుదాం..' జనగామ జడ్పీ ఛైర్మన్ ఆడియో లీక్..
జనగామ: తెలంగాణలో ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయదలచిన నాయకులు అంతర్గతంగా కార్యాచరణను ప్రారంభించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో బరిలో నిలబడటానికి నాయకులు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనగామ నియోజక వర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కాదని పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మద్దతు తెలుపుదామని జడ్పీ ఛైర్మన్ సంపత్ రెడ్డి మాట్లాడిన ఆడియో బయటకొచ్చింది. పార్టీ జిల్లా అధ్యక్షులు జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి.. రెండు రోజుల క్రితం నర్మెట్ట జడ్పీటీసీ మలోత్ శ్రీనివాస్ తో ఫోన్లో మాట్లాడారు. దాని సారాంశం ఏంటంటే.. జనగామ నియోజక వర్గం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎన్నికల బరిలో నిలబడితే మద్దతు తెలుపుదామని సంపత్ రెడ్డి.. జడ్పీటీసీ మాలోత్ శ్రీనివాస్‌తో మాట్లాడారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని స్థానికుడంటూ పేర్కొంటూ.. సపోర్టు చేద్దామని అనుకున్నారు. నియోజక వర్గంలో ఉన్న 8 మండలాల నుంచి జడ్పీటీసీ, ఎంపీపీలతో కలిసి ఓ రిప్రజెంటేషన్‌ని సీఎం కేసీఆర్‌కి పంపించాలని మాట్లాడుకున్నారు. చేర్యాల, మద్దురు, దులిమిట, కొమురవేల్లి నాలుగు మండలాల నుంచి అభ్యర్థులు రాకపోవచ్చని సంపత్ రెడ్డి ఫోన్లో శ్రీనివాస్‌కు చెప్పారు. 'ఒకవేళ జనగామ నియోజక వర్గం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డికి కాకుండా పోచంపల్లి శ్రీనివాస్‌కు సీటు ఇచ్చినా అభ్యంతరం లేదు. సీటు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి వస్తే అభ్యంతరం లేదు. శ్రీనన్న కనుక నాన్ లోకల్ అంటే మనం రాజేశ్వర్ రెడ్డి సార్ కు ఇవ్వమని అడుగుదాం. నువు వెంటనే పల్లా రాజేశ్వర్ రెడ్డి సార్ కు ఫోను చెయ్యి, మళ్ళీ నాకు వెంటనే కాల్ చేసి చెప్పు. సారు తోటి మంచిగా మాట్లాడు, మీకు అంతా అనుకూలంగా ఉంటది అందరూ ఒకే అంటారు అని చెప్పు. నేను నర్మెట ZPTC ఫోన్ చేస్తాడు అని చెప్పిన. మన తమ్ముడే, రాజేశ్వర్ రెడ్డి సార్ అంటే పడి చస్తాడు అని చెప్పిన, నువ్వు కూడా అదేవిధంగా మాట్లాడు' అని సంపత్ రెడ్డి నర్మెట్ట జడ్పీటీసీ మలోత్ శ్రీనివాస్‌తో మాట్లాడారు. ఇదీ చదవండి: మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు షాక్.. మధ్యంతర పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు -
ఇంటిపోరుతో సతమతమవుతున్న జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి
-
భూ సమస్య పరిష్కారం కోసం దంపతుల ఆత్మహత్యయత్నం
-
పెంబర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
జనగామ: పొగమంచు.. అతివేగంతో జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. జనగామ మండలం పెంబర్తి శివారు పెట్రోల్ బంకు ఏరియాలో హైవేపై మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటలకు జరిగిన ప్రమాదంలో వేర్వేరు కుటుంబాలకు చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇనుప సామాను స్క్రాప్ వ్యాపారం చేసే సూర్యాపేట జిల్లా తిర్మలగిరికి చెందిన వాటం రాజశేఖర్(33), భువనగిరిలో ఉంటున్న డీసీఎం క్లీనర్ ఎండీ అబ్దుల్‌రహీంఖాన్(38) స్క్రాప్ లోడ్ తీసుకుని డీసీఎంలో సిద్ధిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌కు సోమవారం రాత్రి బయలుదేరారు. జనగామ మండలం పెంబర్తి శివారు పెట్రోలు బంకు ఏరియాకు చేరుకునే సమయంలో డీసీఎం టైరు పంక్చర్ అయింది. టైరు మార్చుకునే క్రమంలో డీసీఎంను రోడ్డు పక్కన నిలిపి... పార్కింగ్ లైట్లు వెలిగించి సెక్యూరిటీగా టైరును అడ్డంగా ఉంచారు. తిరుపతి నుంచి వరంగల్‌కి రైలులో వచ్చిన బేగంపేట బ్రాంచ్ హెచ్డీబీ బ్యాంకు మేనేజర్ మిర్యాల దేవేందర్‌రెడ్డి కారులో తాను నివాసం ఉంటున్న హైదరాబాద్ కేబీహెచ్‌కే కాలనీకి తన భార్య శ్రావణి, కూతురు శ్రీనిత (7)తో బయలుదేరారు. తెల్లవారుజామున 5.30గంటల సమయంలో పొగమంచు కారణంగా రోడ్డుపై ఆగి ఉన్న డీసీఎంను గమనించని దేవేందర్‌రెడ్డి.. సెక్యూరిటీగా ఉంచిన టైరును వేగంగా ఢీకొట్టాడు. దీంతో గాల్లో పల్టీలు కొట్టిన కారు... టైరు పంక్చర్ చేస్తున్న క్లీనర్ ఎండీ అబ్దుల్ రహీం ఖాన్, రాజశేఖర్‌పై పడి... మరో 200 మీటర్ల దూరం దూసుకుపోయింది. నుజ్జునుజ్జయిన ఆ ఇద్దరూ అక్కడకక్కడే మృతి చెందగా... కారులో కూర్చున్న శ్రీనిత.. ముందు అద్దం పగలడంతో రోడ్డుపై ఎగిరి పడింది. తలకు బలమైన గాయాలు కావడంతో...ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. సీటు బెల్ట్ ధరించడంతో తప్పిన ప్రాణాపాయం దేవేందర్‌రెడ్డి, శ్రావణి సీటు బెల్ట్ ధరించడంతో స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ప్రమాద సమయంలో డీసీఎం డ్రైవర్ మహబూబ్ కాస్త దూరంగా ఉండడంతో.. త్రుటిలో ప్రాణాపాయంనుంచి తప్పించుకున్నాడు. దేవేందర్‌రెడ్డిపై కేసు నమోదు... మృతుడు రాజశేఖర్ భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు కారు యజమాని(డ్రైవర్) దేవేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. ప్రమాద సమయంలో డీసీఎం రోడ్డు పక్కగా ఉందని, అటుగావచ్చే వాహనాలు గమనించేలా పార్కింగ్ లైట్లు కూడా వేశారని చెప్పారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో షాకింగ్ ఘటన..
సాక్షి, జనగామ జిల్లా: సీఎం కేసీఆర్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. సీఎం కాన్వాయ్ నుంచి మహిళా పోలీస్ అధికారి జారిపడ్డారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. శనివారం.. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. జనగామ జిల్లా పెంబర్తి కళాతోరణం వద్ద కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు, సెక్యూరిటీ సిబ్బంది బయలు దేరారు. కాన్వాయ్ నుంచి ఓ మహిళా ఆఫీసర్ జారీ జాతీయ రహదారిపై పడిపోయారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వాహనాలు నిలిపి వేశారు. చదవండి: 16 ఏళ్ల ప్రస్థానాన్ని సెప్టెంబర్ గుర్తు చేసింది: కేటీఆర్ -
సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో అపశృతి.. కాన్వాయ్ నుంచి జారిపడ్డ మహిళా అధికారి
-
జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలి: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: మొఘలాయిల ఆగడాలపై పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న పేరును జనగామ జిల్లాకు పెట్టాలని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి సందర్భంగా నందనం కృపాకర్ రాసిన ‘మరో ఛత్రపతి – మన తెలుగు దళపతి’పుస్తకాన్ని గురువారం ఆయన బీజేపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొఘలాయిల ఆగడాలు, అకృత్యాలపై పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. సర్దార్ పాపన్న స్ఫూర్తితో టీఆర్ఎస్ ప్రభుత్వంపై తిరగబడాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నిజాం, మొఘలాయిల తరహా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో అవినీతి పాలన నడుస్తోందని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణలో మరో పోరాటానికి నాంది పలకాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: విజయశాంతి బహిరంగంగా అసంతృప్తి.. తెర వెనుక ఎవరైనా ఉన్నారా?) -
ఎగిరిన రాళ్లు.. విరిగిన కర్రలు.. బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత
సాక్షి ప్రతినిధి, వరంగల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ‘ప్రజాసంగ్రామ పాదయాత్ర’లో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాదయాత్ర జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోకి ప్రవేశించడంతో స్థానిక బీజేపీ శ్రేణులు బాణసంచాలు కాలుస్తూ ఘనస్వాగతం పలికాయి. అక్కడ స్వరాజ్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో బండి సంజయ్ మాట్లాడారు. నాటి నిజాం సర్కారు, నేటి కేసీఆర్ పాలన తీరును ఎండగట్టారు. రెండువర్గాల వారు పరస్పరం తలపడ్డారు. కంకర రాళ్లు ఎగిరి పడగా, జెండా కర్రలు విరిగేలా కొట్టుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడుల్లో టీఆర్ఎస్, బీజేపీలకు చెందిన వారితో పాటు సభకు వచ్చిన ఓ సాధారణ మహిళ సత్తెమ్మ.. మొత్తం తొమ్మిది మందికి గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి లాఠీలకు పనిచెప్పారు. ఈ సంఘటన దేవరుప్పుల చౌరస్తా వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. డీజీపీకి సంజయ్ ఫోన్ ఈ సంఘటనపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలోనే ఫోన్ ద్వారా డీజీపీ మహేందర్‌రెడ్డితో మాట్లాడుతూ, వరంగల్ సీపీ.. మంత్రి దయాకర్‌రావుకు గుత్తేదారుగా తయారు కావడం వల్లే తమ యాత్రకు ఆటంకాలు ఏర్పడుతున్నా యని ఫిర్యాదు చేశారు. పోటాపోటీ ధర్నాలు అనంతరం బండి సంజయ్ యాత్ర దేవరుప్పుల నుంచి ధర్మాపురానికి బయలుదేరింది. యాత్ర వెళ్లాక తమ పార్టీ కార్యకర్తలను తీవ్రంగా గాయపర్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ శ్రేణులు పలువురు బీజేపీ నాయకుల కార్ల అద్దాలు పగులగొట్టారు. ఈ క్రమంలో బీజేపీ మహిళ మోర్చా మేడ్చల్ జిల్లా నాయకురాలు హైమారెడ్డి, సుధారాణి, సులోచనలు వాహనంలో వస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు అద్దాలు పగులగొట్టారు. దీనికి నిరసనగా సూర్యాపేట రహదారిపై నాలుగు గంటలపాటు ధర్నాకు దిగారు. 500 మంది గూండాలతో యాత్ర: ఎర్రబెల్లి బండి సంజయ్ 500 మంది గూండాలతో యాత్ర చేస్తూ, ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, రాళ్లు, కర్రలతో దాడి చేయిస్తున్నారని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. దేవరుప్పులలో గాయపడిన టీఆర్ఎస్ కార్యకర్తలు జనగామ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మంత్రి.. నాయకులతో కలిసి పరామర్శించారు. చదవండి: సంక్షేమ తెలంగాణం.. ఎన్నో పథకాల్లో దేశానికే ఆదర్శం -
జనగామ: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత
-
జనగామలో తీవ్ర ఉద్రిక్తత.. కర్రలతో కొట్టుకున్న టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు
సాక్షి, జనగామ: ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ ఆందోళనలు పలుచోట్ల ఉద్రిక్తతకు దారితీసింది. జనగామలో టీఆర్ఎస్ నిరసన ర్యాలీని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరువర్గాలు పోటాపోటీగా నిరసన ఆందోళనకు దిగి ఘర్షణపడ్డారు. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. తోపులాట, ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. అటు హనుమకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. చదవండి: కోడిపుంజుకు టికెట్.. స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ -
పెట్రోల్ రేట్ల పెంపుతో ఇంజన్ పీకేసి.. ఇలా సెట్ చేశాడు
Janagaon Electric Bike: పెరుగుతున్న పెట్రోలు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత రెండు నెలలుగా దాదాపు రోజు విడిచి రోజు పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెరిగిన ధరలతో కొందరు తమ వాహనాలను మూలన పడేయగా మరికొందరు ప్రత్యామ్నాయాలను చూసుకున్నారు. కానీ జనగామకు చెందిన విద్యాసాగర్ విభిన్నమైన మార్గం ఎంచుకున్నాడు. జనగామకు చెందిన కూరపాటి విద్యాసాగర్ ఓ ఎలక్ట్రానిక్ దుకాణం నిర్వహిస్తున్నారు. రోజురోజుకి పెరుగుతున్న పెట్రోలు ధరలు భారంగా మారాయి. జనగామలో కూడా పెట్రోలు ధర లీటరు వంద దాటింది. పెట్రోలు ధరలు పెరగడమే తప్ప తగ్గకపోవడంతో తన భైకుకు ఉన్న పెట్రోల్ ఇంజన్‌ను తీసేయాలని నిర్ణయించుకున్నాడు. రూ.10 వేల ఖర్చుతో 30ఏహెచ్ కెపాసిటీ కలిగిన నాలుగు బ్యాటరీలు కొనుగోలు చేశారు. ఆ తర్వాత రూ.7500 ఖర్చు చేసి ఆన్లైన్లో మోటారు కొన్నాడు. స్థానిక మెకానిక్ అనిల్ సహకారంతో పెట్రోల్ ఇంజన్ స్థానంలో బైక్‌కి బ్యాటరీలు, మోటార్ అమర్చాడు. ఈ లోకల్ మేడ్ ఎలక్ట్రిక్ వెహికల్ 5 గంటలపాటు ఛార్జింగ్ పెడితే 50 కిలోమీటర్ల ప్రయాణిస్తోంది. బ్యాటరీలతో నడుస్తున్న విద్యాసాగర్ బైక్ ఇప్పుడు జనగామలో ట్రెండింగ్‌గా మారింది. బ్యాటరీలను ఛార్జింగ్ చేసుకోవడానికి ఒకటి నుంచి ఒకటిన్నర యూనిట్ కరెంటు ఖర్చవుతోంది, కేవలం రూ.10తో 50 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నా. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా ఈ ఆలోచన చేశాను - విద్యాసాగర్ -
రేపు సీఎం కేసీఆర్ జనగామ పర్యటన
సాక్షి, జనగాం: ముఖ్యమంత్రి కేసీఆర్ జనగాం పర్యటన ఖరారైంది. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో శనివారం కేసీఆర్ పర్యటించనున్నారు. హెలీక్యాప్టర్ ద్వారా రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు కేసీఆర్ కొడకండ్ల చేరుకుంటారు. నిర్మాణం పూర్తయిన రైతు వేదికను ప్రారంభిస్తారు. ఆ తర్వాత పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించనున్నారు. అంతేకాకుండా స్థానిక వ్యవసాయ మార్కెట్ ఆవరణలో సుమారు 5 వేల మంది రైతులతో ఏర్పాటుచేసే సభలో కేసీఆర్ మాట్లాడతారు. ఈ సందర్భంగా రైతు వేదికల ముఖ్య ఉద్దేశాలను ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి హాజరయ్యే రైతు బంధు జిల్లా, మండల, గ్రామ కమిటీల సభ్యులతో పాటు రైతులకు, తద్వారా రాష్ట్రంలోని రైతాంగానికి సీఎం వివరించనున్నారు. ఈ పర్యటనలో సీఎం వెంట రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొడకండ్లకు సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం పరిశీలించారు. స్వయంగా సీఎం కేసీఆర్ మంత్రి ఎర్రబెల్లికి ఫోన్ చేసి కొడకండ్లకు వస్తున్న సమాచారాన్ని తెలియజేశారు. అప్పటికే వరంగల్ పర్యటనలో ఉన్న మంత్రి దయాకర్‌రావు వెంటనే కొడకండ్లకు చేరుకున్నారు. రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ నిఖిల, డీసీపీ శ్రీనివాసరెడ్డి, జెడ్పీ చైర్మన్ సంపత్‌రెడ్డితో కలిసి సీఎం పర్యటన కోసం చేయాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేశారు. సీఎం ప్రారంభించనున్న రైతు వేదిక నిర్మాణం, పల్లె ప్రకృతి వనం, డబుల్ బెడ్రూం ఇళ్లు, వ్యవసాయ మార్కెట్లోని సభాస్థలి, హెలీప్యాడ్ నిర్మాణాలను పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సూచించారు. ఇదిలా ఉండగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించాలని ముఖ్యమంత్రిని కోరడంతో, అధికారులతో నివేదిక తెప్పించుకుని జనగామ జిల్లా కొడకండ్లకు రావాల ని నిర్ణయించుకోవడం అదష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు పేర్కొన్నారు. సీఎం ఫోన్ ద్వారా కొడకండ్లతో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించారని దయాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ జ్యోతి ర వీందర్ నాయక్, జెడ్పీటీసీ సత్తమ్మ, ట్రైకార్ మాజీ చైర్మన్ గాంధీనాయక్, సర్పంచ్ మధుసూదన్, ఎంపీటీసీలు విజయలక్ష్మి, యాకయ్య పాల్గొన్నారు. -
తాటిచెట్టును పట్టుకొని ముగ్గురు..
జనగామ: జనగామ మండలం వడ్లకొండ వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. నర్మెట నుంచి జనగామ వైపు వస్తున్న కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో మంగళవారం రాత్రి సుమారు 10.20 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలను నిలిపివేసి పోలీసులు కాపలాగా ఉన్నారు. ఆ రహదారిపై వస్తున్న కారును ముందు రావొద్దని పోలీసులు వారించినా డ్రైవర్ వినిపించుకోకుండా దూసుకొచ్చాడు. కల్వర్టుపైకి రాగానే వరద ఉధృతికి కారు చీటకోడూరు రిజర్వాయర్ వైపు కొట్టుకుపోయింది. ఈ సమయంలో కారులో ఉన్న ఓ వ్యక్తి తాటిచెట్టును గట్టిగా పట్టుకోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. వెంటనే మిగతా ఇద్దరు కూడా చెట్టును పట్టుకున్నారు. భారీక్రేన్ తెప్పించి ఈ ముగ్గురి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. -
సర్పంచ్‌ను చితకబాదిన గ్రామస్తులు
-
సర్పంచ్‌ను చితకబాదిన గ్రామస్తులు
జనగామ : గ్రామ తొలి పౌరుడిగా అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన గ్రామ సర్పంచ్ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పతుండటంతో గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామ సర్పంచ్ వేముల వెంకటేశ్‌ను గ్రామస్థులు చితకబాదారు. కారులో వెళ్తున్న వెంకటేశ్‌ను అడ్డుగించి దాడికి పాల్పడ్డారు. సర్పంచ్ కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పలువురు మహిళలు కూడా ఉన్నారు. గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే సర్పంచ్‌పై దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. దాడికి సంబంధిన ఘటనను స్థానికులు వీడియోలో చిత్రీకరించడంతో అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
గులాబీ జెండా.. ఓరుగల్లు నిండా !
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఉద్యమాల ఖిల్లా.. పోరాటాల జిల్లాలో మరోసారి గులాబీ జెండా రెపరెపలాడింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. తొమ్మిది మున్సిపాలిటీలకు గాను ఎనిమిది చోట్ల భారీ ఆధిక్యతను సాధించింది. ఇక మరిపెడ మున్సిపాలిటీలోనైతే 15 వార్డులకు మొత్తం టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుచుకున్నారు. పరకాల, నర్సంపేట, తొర్రూరు, డోర్నకల్, మరిపెడ, వర్ధన్నపేట, భూపాలపల్లిలో ప్రతిపక్ష పార్టీలు, ప్రత్యర్థులు దారిదా పుల్లో లేకుండా పోయారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులకు 19 చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా, కాంగ్రెస్ 10, సీపీఐ, సీపీఎం రెండేసి వార్డులను, స్వతంత్రులు మూడు వార్డులను గెలుచుకున్నారు. గులాబీ బ్రహ్మరథం ఓరుగల్లు ఇలాకాలో మరోసారి గులాబీ ప్రభంజనం వీచింది. ఓటెత్తిన జనం మున్సిపల్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టారు. మొత్తం 9 మున్సిపాలిటీలోŠల్ ఆ పార్టీ అభ్యర్థులకు ఓటర్లు పట్టం కట్టారు. జనగామ మున్సిపాలిటీ మినహా కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయంది. మొత్తం 200 వార్డులకు 134 వార్డులు టీఆర్ఎస్ గెలుచుకుంటే.. 33 వార్డులకే కాంగ్రెస్ పరిమితమైంది. ఇక బీజేపీ 10 గెలుచుకోగా, ఏఐఎఫ్బీ 4, సీపీఐ 4, సీపీఎం 2 వార్డులు గెలవగా.. 13 వార్డుల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. రోజురోజుకు జిల్లాలో పతనమవుతూ వస్తున్న తెలుగుదేశం పార్టీ 19 వార్డుల నుంచి అభ్యర్థులను దింపగా, ఒక్కరు కూడా గెలుపొందలేదు. జనగామలో కాంగ్రెస్ నుంచి అభ్యర్థులను దింపిన డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి గట్టి పోటీ ఇవ్వగా, మహబూబాబాద్లోను 10 వార్డులను కాంగ్రెస్ గెలుచుకుంది. నర్సంపేటలో ఆరు వార్డులు గెలుచుకున్న కాంగ్రెస్, మిగతా మున్సిపాలిటీల్లో ప్రభావం చూపలేకపోయంది. కాంగ్రెస్ దిగ్గజాలకు ఓటర్లు ఈ ఎన్నికల్లోనూ షాక్ ఇచ్చారు. 135 వరకు వార్డుల్లో పోటీ చేసిన బీజేపీ 10 వార్డుల్లో గెలిచింది. లెక్క తప్పిన జనగామ జనగామ మున్సిపాలిటీ విషయానికొస్తే టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ల కేటాయింపు నుంచి వివాదాలే చోటు చేసుకున్నాయి. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా టీఆర్ఎస్ అభ్యర్థులపై రెబల్స్ ఇక్కడి నుంచే పోటీ చేశారు. దీంతో ఇక్కడ 30 వార్డులకు టీఆర్ఎస్ 13 మాత్రమే గెలుచుకోగా, 10 కాంగ్రెస్, 4 బీజేపీలు గెలుచుకున్నాయి. మరో మూడు వార్డుల్లో టీఆర్ఎస్ టికెట్ రాని వారు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్లకు గాలం వేయగా, టీఆర్ఎస్ సైతం ఇతర పార్టీల కౌన్సిలర్లను లాగడంతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లపై ఆశలు పెట్టుకుంది. వరుస విజయాలు : అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుస విజయాలను సాధించిన టీఆర్ఎస్... మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే హవా కొనసాగించడం ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని రెట్టింపు చేసింది. కాగా, ఈనెల 27వ తేదీ సోమవారం న జరిగే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాలో అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగుర వేయనుంది. క్యాంపులకు కౌన్సిలర్లు తొమ్మిది మున్సిపాలిటీల్లో శనివారం ఉదయం నుంచే కౌంటింగ్ మొదలైంది. ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు. ఆయా మున్సిపాలిటీల్లో ఆధిక్యత పెరిగి విజయావకాశాలు ఉన్న కౌన్సిలర్లను ఒక చోటకు చేర్చేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇన్‌చారి్జలను నియమించారు. ఫలితాల వెల్లడయ్యాక ఒక్కో మున్సిపాలిటీకి చెందిన క్యాంపు ఇన్చార్జీలు వారిని నిర్దేశించిన ప్రాంతాలకు తరలించారు. మొత్తం 9 మున్సిపాలిటీల్లో 200 వార్డులకు 18 ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని సైతం కౌంటింగ్ కేంద్రాలకు రప్పించిన పార్టీల నేతలు.. ఫలితాలు వెల్లడి తర్వాత పార్టీల వారీగా క్యాంపులకు తరలించారు. మొత్తం మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేయడం లక్ష్యంగా టీఆర్ఎస్ క్యాంపులు నిర్వహిస్తుండగా.. మిగతా పార్టీల కౌన్సిలర్లు చెదిరిపోకుండా ఆయా పార్టీల నేతలు కూడా క్యాంపులకు కౌన్సిలర్లను తరలించారు. ఈనెల 27వ తేదీ సోమవారం చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు ఉండడం.. మధ్యలో ఒక రోజే సమయం ఉన్న నేపథ్యంలో అందుబాటులో ఉండేలా క్యాంపులు ఏర్పాటు చేశారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 9 మున్సిపాలిటీల టీఆర్ఎస్ కౌన్సిలర్లకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్చార్జీల పర్యవేక్షణలో హైదరాబాద్, వరంగల్ల్లో రిసార్టులు, ఫంక్షన్ హాల్లు, హోటళ్లలో బస ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇక నర్సంపేటకు చెందిన కౌన్సిలర్లు హన్మకొండ అశోక్ హోటల్లోనే ఉన్నట్లు సమాచారం. -
ఎన్నికలు వచ్చే..ఉపాధి తెచ్చే
సాక్షి, వరంగల్: మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి లభిస్తోంది. అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారానికి పదును పెట్టారు. ఓటర్లను తమవైపు తిప్పుకోవడంలో ప్రత్యర్థులతో పోటాపోటీగా సందడి చేయాల్సిందే. పూల దుకాణాలు మొదలు వాహనాల వరకు మంచి గిరాకీ ఏర్పడింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నూతన పోకడలకు అభ్యర్థులు శ్రీకారం చుడుతున్నారు. విభిన్న తరహాలో ప్రచార సామగ్రి సమకూర్చుకుంటున్నారు. కార్యకర్తలు, నాయకుల బాగోగులు చూసుకుంటున్నారు. ఎన్నికల క్రమంలో ఉపాధి తీరుతెన్నులపై ప్రత్యేక కథనం.. డప్పు కళాకారులకు ఆదరణ.. డప్పు చప్పుళ్లతో అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. పది మంది కళాకారుల బృందం రోజుకు రూ.3 వేలు నుంచి రూ.5 వేల వరకు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల్లో వీరికి గిరాకీ అధికంగా ఉంది. టెంట్‌హౌస్‌లు, కుర్చీలకు గిరాకీ.. అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు సభలో మాట్లాడేందుకు స్థానికులకు కుర్చీలు వేయాల్సి ఉంటుంది. దీంతో టెంట్‌హౌస్‌లకు గిరాకీ పెరిగింది. టెంట్లు, కుర్చీలను బట్టి ధర ఉంటుంది. నిత్యం చిన్న సభకు రూ.4 వేల నుంచి రూ.6 వేలు, పెద్ద బహిరంగ సభ అయితే రూ. 15 వేల నుంచి రూ.20 వేలకు పైగా తీసుకుంటున్నారు. వంట మనుషులకు.. నాయకులు, కార్యకర్తలకు విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో చికెన్, మటన్ బిర్యానీ అందిస్తున్నారు. దీనికై ప్రత్యేకంగా వంట మనుషులను ఏర్పాటు చేసుకుంటున్నారు. వార్డుల్లోని ముఖ్య నాయకుల ఇళ్లల్లో కార్యకర్తలు, ప్రచారానికి వచ్చినవారి సదుపాయం కోసం భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 600 మందికి పైగా వంట మనుషులకు ఉపాధి లభిస్తోంది. రోజుకు ఒక వంట మనిషికి రూ.5 వేల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఫొటో, వీడియోగ్రాఫర్లకు.. అభ్యర్థుల ఎన్నికల ప్రచారం చిత్రీకరించడానికి ఎన్నికల అధికారులు వీడియో, ఫొటోగ్రాపర్లను ఏర్పాటు చేశారు. సమావేశాలు ప్రచారాలకు సంబంధించిన చిత్రాలు తీయడానికి అభ్యర్థులు సొంత ఖర్చులతో నియమించుకుంటున్నారు. వాహనాలకు డిమాండ్... ఎన్నికల సందర్భంగా వాహనదారులకు గిరాకీ లభిస్తుంది. అభ్యర్థులతో పాటు నాయకులు, కార్యకర్తలను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడానికి ఐదారు వాహనాలు అవసరం. సొంత వాహనం అభ్యర్థికి అవసరమైతే, మిగతా వారికి అద్దె వాహనాలు సమకూర్చుతున్నారు. ప్రచార రథంతో పాటు బహిరంగ సభలకు జనాన్ని తరలించడానికి వాహనాలు అవసరమవుతుండటంతో ప్రైవేటు వాహన యజమానులకు గిరాకీ లభిస్తుంది. ఇదే అదనుగా వాటి అద్దె ధరలను సైతం పెంచడం విశేషం. దీనికి తోడుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వాహనాల అద్దెలు పెంచడానికి కారణమవుతుంది. కళకళలాడుతున్న జిరాక్స్ సెంటర్లు.. ఎన్నికల వేళ జిరాక్స్ సెంటర్లకు గిరాకీ ఏర్పడింది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఎత్తుగడలు వేస్తుంటారు. ఓటరు జాబితా సేకరించి తదనుగుణంగా ప్రణాళిక రచిస్తారు. అధికారుల నుంచి ఓటరు జాబితాను సేకరించి పదుల సంఖ్యలో జిరాక్స్ తీస్తుంటారు. నామినేషన్ల ఉప సంహరణ ఘట్టం ముగియడంతో ఈ ప్రక్రియ మరింత ఊపందుకుంది. వంట మనుషులకు.. నాయకులు, కార్యకర్తలకు విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో చికెన్, మటన్ బిర్యానీ అందిస్తున్నారు. దీనికై ప్రత్యేకంగా వంట మనుషులను ఏర్పాటు చేసుకుంటున్నారు. వార్డుల్లోని ముఖ్య నాయకుల ఇళ్లల్లో కార్యకర్తలు, ప్రచారానికి వచ్చినవారి సదుపాయం కోసం భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 600 మందికి పైగా వంట మనుషులకు ఉపాధి లభిస్తోంది. రోజుకు ఒక వంట మనిషికి రూ.5 వేల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. హోటళ్లకు పెరిగిన తాకిడి.. ప్రచారానికి వెళ్లే నాయకులు, కార్యకర్తలకు ఉదయం అల్పాహారం తప్పనిసరి. మధ్యాహ్న భోజనంతో మున్సిపాలిటీల్లోని హోటళ్లకు తాకిడి పెరిగింది. ఆర్డర్‌పై కోరిన చోటుకి భోజనాలు వండి తీసుకెళ్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. దర్జీలకు.. రాజకీయ నాయకులకు ముఖ్యమైనది ఎన్నికల పండుగే. నూతన దుస్తులకు ప్రాధాన్యం ఇస్తుండటంతో ఇటీవల దర్జీలకు గిరాకీ పెరిగింది. పూలకు పెరిగిన డిమాండ్.. అభ్యర్థులు, ప్రచారానికి వచ్చే నాయకులకు పూలదండలు వేయడానికి కార్యకర్తలు పోటీపడుతుంటారు. ప్రచారంలో అభ్యర్థులపై పూల వర్షం కురిపిస్తున్నారు. పూల వ్యాపారుకు గిరాకీ పెరిగింది. బంతిపూలు, గులాబీ దండల ధర పెరిగిపోయింది. ఒక్కో దండ సుమారు రూ.300 పలుకుతోంది. ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు బిజీ బిజీ.. అభ్యర్థుల బొమ్మలతో పాటు పార్టీ గుర్తు, అధినాయకుల బొమ్మలున్న వాల్ పోస్టర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కరపత్రాలు, ఇతర సామగ్రితో ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు బిజీబిజీగా మారారు. వాహనాలు, ఇళ్లకు అంటించే స్టిక్కర్లు, కీచైన్లు, చేతిపట్టీలు వంటివి తయారు చేసే వారికి సైతం ఉపాధి దొరుకుతోంది. -
తార్నాకలో ఆర్టీసీ బస్సు బీభత్సం
సాక్షి, హైదరాబాద్ : జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం ఉదయం తార్నాకలో బీభత్సం సృష్టించింది. డ్రైవర్.. బస్సును అదుపు చేయలేక.. ముందున్న వాహనాలను ఢీ కొట్టాడు. దీంతో.. మూడు కార్లు, ఓ బైక్ ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటన జరిగిన వెంటనే తాత్కాలిక డ్రైవర్ పారిపోయారు. జేబీఎస్ నుంచి జనగామ వెళుతుండగా హబ్సీగూడ సిగ్నల్స్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. గోతిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ క్రాస్‌రోడ్డు వద్ద భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా రోడ్డుపక్కనున్న గోతిలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో 13మంది ప్రయాణికులు గాయపడ్డారు. మరోవైపు సత్తుపల్లి డిపోకు చెందిన బస్సు కూడా ప్రమాదానికి గురైంది. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. కాగా తాత్కాలిక డ్రైవర్లకు సరైన అనుభవం లేకపోవడంతో ఇప్పటికే పలుచోట్ల ప్రమాదాలు జరిగాయి. 24వ రోజుకు చేరిన సమ్మె కాగా తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 24వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం మొండి వైఖరి వీడేవరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. సీఎం కేసీఆర్ కార్మికుల సమస్యల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఇది మంచి పద్దతి కాదని వారు హితవు పలికారు. ఈనెల 30న సరూర్‌నగర్ నగర్లో సకలజనుల సమరభేరి సభను నిర్వహిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి తెలిపారు. -
నా హీరో.. నా దైవం కేసీఆర్
నేను అసలు సినిమాలు చూడను.. నాకు అభిమాన హీరోలు లేరు.. నాకు తెలిసినంత వరకు తెలంగాణ ఉద్యమ సారధి, ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు హీరో.. అంతే కాదు నాకు దైవంతో సమానం. ఏదో ఓ కాంట్రాక్టర్ దగ్గర సూపర్వైజర్గా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో ఆ ఉద్యోగాన్ని వదులుకొని ఉద్యమంలోకి వచ్చా. వ్యాపారం చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపా. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న.. నిర్బంధాన్ని తట్టుకొని ఉద్యమంలో పాల్గొన్న. నా మీద 28 కేసులు నమోదయ్యాయి. ఎన్నో కష్టాలను అనుభవించా. ఈ సమయంలో నా కుమారుడు ఉంటే బాగుండు. అధినేత కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు సాగుతానని జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి అన్నారు. ‘సాక్షి’ పర్సనల్ టైమ్‌లో తన ఉద్యమ సమయం నాటి జ్ఞాపకాలతోపాటు తన ఇష్టాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. సాక్షి, జనగామ: మాది జనగామ జిల్లాలోని చిల్పూర్ మండలం రాజవరం గ్రామం. మా అమ్మానాన్నలు సుకన్య, జయపాల్‌రెడ్డి. ముగ్గురు సంతానంలో నేనే పెద్దవాడిని. నా ప్రాథమిక విద్య ను రాజవరంలో పూర్తి చేసి 8, 9 తరగతులను హన్మకొండలో చదివాను. 10వ తరగతి, ఇంటర్ స్టేషన్‌ఘన్‌పూర్‌లో చదివాను. బీకాం హైదరాబాద్‌లో చదివి, హన్మకొండలో ఐటీఐ చేశాను. కాంట్రా క్టర్‌గా మారి కొంతమందికి ఉపాధి కల్పించాలనే భావనతో ప్రత్యేకంగా ఐటీఐ కోర్సు తీసుకున్నా. 1992లో సుజాతతో వివాహం అయింది. కుమార్తె సంజనారెడ్డి బీటెక్ చదువుతోంది. రూ.4వేలకు సూపర్వైజర్ ఉద్యోగం చేశా.. మాది పక్కా వ్యవసాయ కుటుంబం. గ్రామీణ నేపథ్యంలోనే పెరిగాను. కాంట్రాక్టర్‌గా మారి పది మందికి ఉపాధి కల్పించాలనే కోరిక నాలో బలంగా ఉండేది. డిగ్రీ తర్వాత ఐటీఐ కోర్సు చేశా. ఆ తరువాత హైదరాబాద్‌లో ఓ కాంట్రాక్టర్ దగ్గర నెలకు రూ.నాలుగు వేల జీతానికి పనిచేశాను. అలా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించాను. కేసీఆర్ పిలుపుతో ఉద్యమకారుడిగా మారా.. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న సమయంలోనే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుకొచ్చారు. ఉద్యమంలో చేరాలని కేసీఆర్ పిలుపునివ్వడంతో కరీంనగర్లో జరిగిన జైత్రయాత్ర సభకు వెళ్లాను. అప్పటి నుంచి కేసీఆర్ వెంటే ఉన్నా. 2002–06 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా యువజన విభాగం ప్రచార ప్రధాన కార్యదర్శిగా, 2006–13 వరకు స్టేషన్‌ఘన్‌పూర్ మండల అధ్యక్షుడిగా, 2013–15 వరకు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ఇన్చార్జితో పాటు పలు పదవుల్లో పనిచేశాను. నిర్బంధంతోనే పట్టుదల పెరిగింది.. తెలంగాణ ఉద్యమ సమయంలో నాపైన తీవ్రమైన నిర్బంధం ఉండేది. నా ప్రతి కదలికపై పోలీసుల నిఘా ఉండేది. ఉద్యమ సమయంలో ఓ సారి అప్పటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య పాలకుర్తి పర్యటనకు వస్తున్నారు. పర్యటనకు ముందే నన్ను అరెస్టు చేయాలని పోలీసులు భావించి అర్ధరాత్రి మా ఇంటికి వచ్చారు. సంపత్‌రెడ్డిని పిలవమని నా భార్యను కోరారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఇంటి వెనుకవైపు ఉన్న గోడ నుంచి దూకాను. రాత్రి కావడంతో రాళ్లపై పడడంతో నాకు గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకొని అదేరోజు తిరిగొచ్చి పొన్నాల పర్యటనను అడ్డుకున్నా. ఓ సారి ఘన్‌పూర్‌లో రాస్తారోకో చేస్తుంటే ఓ పోలీసు అధికారి వాహనాన్ని అడ్డుకున్నాం. ఆ సమయంలో నన్ను భయపెట్టడానికి తీవ్రంగా ప్రయత్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనలు ఉన్నాయంటే ముందుగానే స్టేషన్‌కు తీసుకుపోయే వారు. నా కోసం ఒక పోలీసు టీం ఎప్పటికీ తిరుగుతూ ఉండేది. నిర్బంధం కారణంగా వ్యవసాయ బావులు దగ్గర పడేకునేది. నాపైన 28 కేసులు పెట్టారు. ఈ సమయంలో నా కుమారుడు ఉంటే బాగుండు.. నా కుమారుడు ఈ సమయంలో ఉంటే బాగుండు అనిపిస్తోంది. నా కుమారుడు సాయి 2012లో ఇంటర్ చదువుకునే రోజుల్లో బైక్‌పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడు. నా కుమారుడి మరణం నన్ను తీవ్రంగా కలిచి వేసింది. ఆ ప్రభావం మా కుటుంబంపై పడింది. నా భార్య గౌరవాన్ని పెంచింది.. నా భార్య సుజాత నా గౌరవాన్ని పెంచింది. ఆమె పీజీ వరకు చదువుకుంది. ఉద్యమం సమయంలో నేను ఎక్కువగా బయటనే ఉండేవాడిని. ఏ రోజు కూడా ఆమె నన్ను వద్దనలేదు. తెలంగాణ వచ్చే వరకు ఉద్యమలోనే ఉండాలని చెప్పేది. ఆమె మాటలు నాకు స్ఫూర్తిగా నిలిచాయి. మేము ముగ్గురం అన్నదమ్ములం ఇప్పటికీ కలిసే ఉంటాం. మాది ఉమ్మడి కుటుంబమే. రాజవరంలో క్రికెట్ ప్రారంభించాను.. మా ఊరు రాజవరంలో మొదటగా క్రికెట్‌ను ప్రారంభించిందే నేను. నాకు క్రికెట్ అంటే మహా ఇష్టం. స్వయంగా నేను ఆడుతా. గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్లు పెట్టేది. ఇప్పటికీ క్రికెట్ కిట్లు అందజేస్తాను. క్రీడాకారులను ప్రోత్సహిస్తాను. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా.. నాకు చాలా ఆనందంగా ఉంది. ఉద్యమకారుడిని కావడం వల్లనే పదవి దక్కింది. సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహకారంతో జిల్లాను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా. ఉద్యమకారుడిగా తెలంగాణ కోసం కొట్లాడినట్లుగానే అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాను. వెనుకబడిన జిల్లాను సమగ్రాభివృద్ధి చేయడానికి శక్తివంచన లేకుండా పని చేస్తా. నిత్యం జిల్లా ప్రజానీకానికి అందుబాటులో ఉంటా. కేసీఆర్ నాపైన పెట్టిన బాధ్యతలు నేరవేరుస్తా.. ఆయన నమ్మకాన్ని వమ్ముచేయను. వ్యాపారం చేసి ఉద్యమాన్ని నడిపా.. నాడు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడిని. మాకు ఆర్థికంగా లేకపోయేది. దీంతో స్వయంగా నేనే ఇటుక బట్టీల వ్యాపారం ప్రారంభించాను. దాంతో వచ్చిన డబ్బులను ఉద్యమానికి ఉపయోగించేది. ప్రస్తుతం 50 మంది బట్టీల్లో పని చేస్తున్నారు. వారందరికి ఉపాధి కల్పిస్తున్నా. తెలంగాణ ప్రకటన మర్చిపోలేను.. డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ ప్రకటన రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజుగా ఉంటుంది. కేసీఆర్ తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయించారు. తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మళ్లీ జూన్ రెండో తేదీన చిరకాల కోరిక నేరవేరింది. ఈ రెండు సందర్భాల్లో ఎంతో ఆనందంగా గడిపాం. -
పవిత్ర ఓటును తాకట్టు పెట్టకు..!
సాక్షి, జనగామ అర్బన్: ఓటర్లు ప్రలోభాలకు లొంగొద్దని రాజకీయ నాయకులు చేసే ఆచరణసాధ్యం కాని హామీలకు పవిత్ర ఓటును తాకట్టు పెట్టొద్దని, ప్రజాసేవ చేసే నాయకుడికే ఓటు వేయాలని ప్రజల్లో ఆలోచన రేకెత్తించే విధంగా జనగామ ప్రభుత్వ పాఠశాల (రైల్వేస్టేషన్ రోడ్డు) డ్రాయింగ్ మాస్టర్ సయ్యద్ హాష్మతుల్లా గీసిన ఈ చిత్రం పలువురిని ఆలోచింపజేస్తుంది. ఓటు హక్కును వినియోగించుకోవడం పౌరుడి భాధ్యతే కాకుండా దానిని సరిగ్గా ఉపయోగించడం కూడా చాలా ముఖ్యం. -
యువ ఓటర్లపైనే గురి
సాక్షి, జనగామ:శాసనసభ ఎన్నికల్లో జనగామ జిల్లాలో యువ ఓటర్ల తీర్పు కీలకంగా మారనుంది. అభ్యర్థుల గెలుపు ఓటములపై యువ ఓటర్లు ప్రభావితం చూపనున్నారని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. యువ ఓటర్ల ను తమవైపు తిప్పుకోవడం కోసం ప్రధాన పార్టీలు ఇప్పటికే ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. యువతకు దగ్గరయ్యేందుకు.వివిధ మార్గాలను అన్వేషిస్తున్నాయి. యువతను కలుసుకుని ఓట్లరూపంలో వారి మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. జిల్లాలోని జనగామ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో యువ ఓటర్లు వేల సంఖ్యలో ఉండడంతో వారి ఓట్లను రాబట్టుకునేందుకు పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. విద్యార్థి సంఘాల రూపంలో ప్రధాన పార్టీలు.. ఎన్నికల బరిలో తలపడుతున్న ప్రధాన పార్టీలు యువ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం ఆయా పార్టీలకు ఉన్న విద్యార్థి విభాగాలను సమాయత్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాలతో పాటు యువజన విభాగాలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. కొత్త ఓటర్లు, యువ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం కోసం విద్యార్థి విభాగాలు, యువజన విభాగాల నాయకులు ప్రత్యేక బృందాలుగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. కొత్త, యువ ఓటర్ల సెల్‌నంబర్లు సేకరిస్తున్నారు. యువసేనల జోరు.. యువ ఓటర్లను దగ్గర చేసుకోవడం కోసం ఇప్పటికే మూడు నియోజకవర్గాల్లో యువసేన సంఘాలు జోరందుకున్నాయి. ఎన్నికల బరిలో దిగనున్న అభ్యర్థులకు మద్దతుగా యువకులు యువసేన సంఘాలను ప్రారంభించారు. పాలకుర్తిలో దయన్న యువసేన, జనగామలో ముత్తిరెడ్డి యువసేన, స్టేషన్‌ఘన్‌పూర్‌లో రాజన్న యువసేన, కేసీఆర్ యువసేన, కేటీఆర్ యువసేన, హరీషన్న యువసేన, పొన్నాల యువసేన, జంగా యువసేన, వంశన్న యువసేన, ముక్కెర యువసేన, రమణన్న యువసేన వంటి సంఘాలు ఆయా పార్టీలకు, అభ్యర్థులకు మద్దతుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ భృతితో యువతకు గాలం... విద్యార్థి సంఘాలు, యువజన విభజన విభాగాలు, యువసేన సంఘాలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుండగా మరోవైపు ప్రధాన పార్టీలు నిరుద్యోగ భృతి పథకంతో ఓట్లకు గాలం వేసేందుకు యత్నిస్తున్నాయి. అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇస్తున్నాయి. ఉద్యోగాల నోటిఫికేషన్లు, ఉపాధి అవకాశాలపై దృష్టిపెడతామని యువ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఏదేమైనా మూడు నియోజకవర్గాల్లో యువ ఓటర్ల తీర్పు కీలకం కాబోనున్నది. -
ఖర్చు పెరిగితే వేటు
సాక్షి, జనగామ: ప్రస్తుతం ఎన్నికల ప్రచారం, సరళి చేస్తే అభ్యర్థులు ఖర్చు విపరీతంగా పెడుతున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించకపోతే మాత్రం వారిపై వేటు తప్పదు. భవిష్యత్‌లో పోటీచేసేందుకు కూడా అనర్హులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి రూ. 28 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలని ఎన్నికల కమిషన్ నిబంధన ఉంది.ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల కమిషన్ అభ్యర్థుల వ్యయానికి కచ్చితమైన నిబంధలు రూపొందించింది. పోటీచేసే అభ్యర్థి రూ.28 లక్షలకు మించి ఖర్చుచేయొద్దని స్పష్టంగా పేర్కొంది. నామినేషన్ వేసినప్పటి నుంచి కౌంటింగ్ ముగిసే వరకు ఖర్చులను పరిమితం చేసింది. రూ.28 లక్షలకు మించి ఖర్చుచేసినా, ఖర్చుల లెక్కలను చూపకపోయినా వేటుతప్పదని కఠినంగా హెచ్చరిస్తున్నారు. లెక్కలు చూపకుండా గెలిస్తే అభ్యర్థి అభ్యర్థిత్వాన్ని రద్దుచేయడంతోపాటు భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటిస్తారు. ఖర్చుల నిబంధనలు ఇవి... అభ్యర్థి నామినేషన్ వేసినప్పటి నుంచి గెలుపు పొందిన తరువాత విజయోత్సవ ర్యాలీ లేదా కృతజ్ఞత ర్యాలీ వరకు రూ.28 లక్షలు ఖర్చు పెట్టొచ్చు. ఎన్నికల ఖర్చుల కోసం పోటీ చేసే అభ్యర్థి ప్రత్యేకంగా ఒక బ్యాంకు అకౌంట్ తెరవాల్సి ఉంటుంది. అభ్యర్థితోపాటు తన ఏజెంట్ పేరుతో బ్యాంకు అకౌంట్ తెరవాలి. చీఈ అకౌంట్లో మొత్తం రూ.28లక్షలు జమ చేయాలి. ఈ మొత్తంలో తాను సొంతంగా ఇచ్చినది, పార్టీ పంపించిన, ఇతర దాతలు ఇచ్చిన డబ్బులు ఉంటాయి. రూ. 20 వేల లోపు అయితే నగదు రూపంలో, రూ.20 వేలు దాటితే చెక్ రూపంలో డిజిటల్ ఫార్మెట్లో జమచేయాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు 40 మందికి వరకు స్టార్ క్యాంపెయినర్లను, గుర్తింపులేని రాజకీయ పార్టీలు 20 మంది వరకు స్టార్ క్యాంపెయినర్లను నమోదుచేసుకునే అవకాశం ఉంటుంది. ఆ స్టార్ క్యాపెయినర్లు వాడుతున్న హెలీక్యాప్టర్ లేదా ప్రత్యేక ప్రచార రథాల్లో ప్రయాణిస్తే ఆ ఖర్చులో సగం అభ్యర్థి వ్యయంలో కలుపుతారు. స్టార్ క్యాంపెయినర్లు నిర్వహించే బహిరంగ సభలో ఒక అభ్యర్థితోపాటు ఇతర నియోజకవర్గాల్లోని అభ్యర్థులు ఆ వేదికపై కన్పిస్తే బహిరంగ సభ ఖర్చు అభ్యర్థులకు సమానంగా పంచబడుతుంది. ఎన్నికల సమయంలో అభ్యర్థికి ఒక పుస్తకం ఇస్తారు. ఆ పుస్తకంలో మూడు రకాల పేజీలుంటాయి. మొదటిపేజీలో నగదుకు సంబంధించిన వివరాలు, రెండోపేజీలో బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలు, మూడో పేజీలో అభ్యర్థి పెట్టిన ఖర్చుల వివరాలు ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు అభ్యర్థి తరుపు ఏజెంట్ నింపాల్సి ఉంటుంది. ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తరువాత అభ్యర్థులు లేదా ఏజెంట్లు అకౌంట్స్ అధికారులతో సమావేశమైన, నమోదైన ఖర్చులను సరిచూసుకోవాలి. అభ్యర్థి నామినేషన్ వేసినప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు కనీసం మూడు సార్లు అభ్యర్థి ఖర్చులను బిల్లులతో సహా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉన్న అకౌంట్ విభాగంలో సమర్పించి సరి చూసుకోవాలి. ఆ సమయంలో అకౌంట్ సిబ్బంది ఖర్చులను తమ దగ్గర ఉన్న బుక్‌లో నమోదు చేస్తారు. అభ్యర్థికి తెలియకుండా షాడో టీం సభ్యులు అభ్యర్థి ఖర్చుపై నిఘాపెడుతారు. ఆ విషయాన్ని అభ్యర్థి తరుపు ఏజెంట్‌కు తెలియజేస్తారు. ఖర్చు విషయాన్ని సరి చూసుకొని భవిష్యత్ ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో అభ్యర్థి తరుపున ప్రచారం చేయడానికి వాహనాలు, బహిరంగ సభల అనుమతులు రద్దుచేస్తారు. అభ్యంతరాలు ఉన్నట్లయితే కౌంటింగ్ పూర్తయిన 26వ రోజున ఎన్నికల అధికారులు అభ్యర్థికి లేదా ఏజెంట్లకు తెలియజేస్తారు. అభ్యర్థులు గానీ వారి ఏజెంట్లు గానీ కౌంటింగ్ జరిగిన 30వ రోజులోపు అకౌంట్‌ను సరి చూసుకోని సమర్పించాలి. అభ్యర్థుల ఖర్చు రూ.28 లక్షలు దాటినా, అభ్యర్థులు ఎన్నికల ఖర్చును సమర్పించకపోయినా వారి సభ్యత్వం రద్దవుతుంది. భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లో పోటీకి అనర్హులు. -
కాంగ్రెస్ మాయమాటలకు మోసపోవద్దు
జనగామ: కాంగ్రెస్ మాయమాటలను నమ్మి మోసపోవద్దని తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ నియోజకవర్గం సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం వంగపల్లి, రేబర్తి గ్రామాల్లో ఆయన సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి మాట్లాడుతూ 40 ఏళ్ల రాజకీయ జీవితమంటూ ప్రచారం చేసుకుం టున్న పొన్నాల లక్ష్మయ్య.. ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదన్నారు. వరుస కరువుతో వ్యవసాయాన్ని వదులుకున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా ఇవ్వలేక పోయిందన్నారు. నాడు నీళ్లమంత్రిగా ఉన్న పొన్నాల ఒక్క చెరువు కూడా నింపలేక పోయాడన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తాను గోదావరి జలాలతో ఊళ్లకు పునీతం చేసి రూ.20కోట్ల పంట దిగుబడుల నుంచి రూ.350 కోట్లకు తీసుకువచ్చానని అన్నారు. రైతుల పక్షాన నిలబడి.. అన్ని వర్గాల ప్రజలకు సర్కారు ఫలాలను అందించి.. 24 గంటల పాటు అందుబాటులో ఉన్నానని, ఈ సారి ఆశీర్వదిస్తే.. జనగామను మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ముత్తిరెడ్డికి ఆయా గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. -
చీటూరులో మరో యువకుడి ఆత్మహత్యాయత్నం
లింగాలఘణపురం జనగామ : మండలంలోని చీటూరులో మరో యువకుడు బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు అప్రమత్తమై మందు డబ్బాను లాక్కొని ప్రాణాపాయం నుంచి తప్పించారు. ఇప్పటికే చీటూరులో నాలుగేళ్లలో పది మంది యువకులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా యుక్త వయసులోనే మద్యానికి బానిసలవడం, చిన్న విషయాలకే క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఒకరిని చూసి మరొకరు ఆత్మహత్యలకు పాల్పడడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. యువతలో మనో ధైర్యం కల్పించే విధంగా కౌన్సెలింగ్ నిర్వహిం చాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పటికే పది మంది యువకులు ఆత్మహత్య చేసుకోవడం, ఒకరిద్దరు యువకులు కూడా తాము చనిపోతామం టూ తల్లిదండ్రులకు చెబుతుండడం గమనార్హం. చావుతో ఏదీ పరిష్కారం కాదు యువకులు ఆత్మహత్యలకు పాల్పడితే సమస్యలు పరిష్కా రం కావు. సమస్యలు ఉంటే ఇంట్లో పెద్దలకు చెప్పాలి. యుక్తవయసులో చనిపోవడంతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు.అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లల పెంపకంపై దష్టి సారించాలి. –పసుల సోమనర్సయ్య, మాజీ ఎంపీపీ, చీటూరు యువతకు కౌన్సెలింగ్ ఇవ్వాలి గ్రామంలోని యువతకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. ఇప్పటికే నాలుగేళ్లలో పది మందికి పైగా యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కౌన్సెలింగ్‌తో యువకుల్లో మనోధైర్యం కల్పించాలి. ఎంతో భవిష్యత్ ఉన్న యుక్త వయసు వారే చనిపోవడం గ్రామంలో ఆందోళన కలిగిస్తోంది. – ఉప్పల మధు, ఎంపీటీసీ సభ్యుడు, చీటూరు -
డీఎంహెచ్ఓ అన్నప్రసన్నకుమారి బదిలీ
జనగామ : జనగామ జిల్లా వైద్యాధికారి అన్నప్రసన్నకుమారిని పదోన్నతిపై బదిలీ చేస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. 2017 మేలో జిల్లా వైద్యాధికారిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ ఆస్పత్రులను చక్కదిద్దడమే కాకండా.. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్న ప్రైవేట్ క్లినిక్, నర్సింగ్ హోం, స్కానింగ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. జిల్లా కేంద్రంలోని పలు స్కానింగ్ కేంద్రాలు, క్లినిక్, ఆస్పత్రుల రిజిస్ట్రేషన్లను రద్దు చేయడమే కాకుండా, కేసులు కూడా నమోదు చేశారు. గుట్టుచప్పడు కాకుండా చేస్తున్న అబార్షన్లపై కన్నెర్రజేశారు. ప్రజలను అమాయకులను చేసి, అడ్డదారిలో వైద్యం చేసే ఎంతటి వారినైనా వదిలి పెట్టలేదు. రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లెక్క చేయకుండా ఆస్పత్రులను సీజ్ చేశారు. సుమారు 14 నెలల జనగామలో పని చేసిన అన్న ప్రసన్నకుమారి రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ అడిషినల్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పదోన్నతిపై వెళ్తున్నారు. జిల్లాలో పని చేసినంత కాలం వైద్య సేవల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశారు. నేడు విధుల్లో చేరాలని కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జనగామ జిల్లా వైద్యాధికారిగా మహేందర్ జనగామ జిల్లా వైద్యాధికారిగా ఎ.మహేందర్‌ను నియమిస్తూ వైద్యారోగ్య కమిషనర్ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం స్టేట్ ఎంసీహెచ్ ప్రోగ్రాం ఆఫీసర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్‌గా పని చేసిన మహేందర్ పదోన్నతిపై హైదరాబాద్‌కు వెళ్లారు. ప్రస్తుత డీఎంహెచ్ఓ పదోన్నతిపై బదిలీపై వెళ్లడంతో ఆమె స్థానంలో మహేందర్‌ను నియమించారు. -
ఉదయ్ హత్యపై అనేక అనుమానాలు.?
జనగామ : జనగామ మండలం చీటకోడూరులో అల్లుడిని మామ హత్య చేసిన ఘటన అనేక అనుమానాలు తావిస్తుంది. ఫోన్ సమాచారంతో అల్లుడిని ప్లాన్ ప్రకారమే పిలిపించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామానికి చెందిన గంధమల్ల ఎల్లయ్య కూతురు మౌనికను కొలనుపాకకు చెందిన ఉదయ్ ప్రేమించి వివాహం చేసుకోగా... రెండు రోజుల క్రితం అతను మామ చేతిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. చీటకోడూరులో ఎల్లయ్య నివాసం ప్రధాన రహదారిపై ఉండడమే కాకుండా చుట్టుపక్కల నివాసాలు ఉన్నాయి. ఉదయ్‌ను హ్యత్య చేసే ముందు ఇరువురి మధ్య పెనుగులాట.. గొడ్డలితో నరికే సమయంలో అరుపులు.. కేకలు వినిపించాలి. గ్రామంలో ఎవరిని అడిగినా.. గొడవ జరిగినట్లు అలజడి లేదంటున్నారు. ఉదయ్ ఇంటికి రాగానే.. బయటకు తీసుకువెళ్లి చంపేసి.. ఇక్కడ పడేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఎవరూ కూడా సరైన వివరణ ఇవ్వడం లేదు. ఉదయ్ మృతదేహం ఉన్న ప్రదేశంలో కారం పొడి ప్యాకెట్ కూడా ఉన్నట్లు మంగళవారం పలువురు గ్రామస్తులు గుర్తుపట్టినట్లు తెలుస్తుంది. పెనుగులాట సమయంలో ఉదయ్ మామా, బావమర్ధిని ఎదురించడంతో కళ్లలో కారం చల్లి హత్య చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అర్ధరాత్రి హత్య జరిగినప్పటికీ ఉ దయ్ కుటుంబసభ్యులకు మాత్రం తెల్లవారుజా ము 9గంటల తర్వాతనే సమాచారం అందించారు. ఆలస్యం వెనక అనుమానాలను వ్యక్తమవుతున్నాయి. అల్లుడిని మామనే హత్య చేసినట్లు పోలీ సులు నిర్ధారించగా బావమర్ధి కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరేనా.. ఇంకెవరైనా హత్యలో పాలుపంచుకున్నారనే అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. 8 మందిపై కేసు నమోదు.. అల్లుడు గంధమల్ల ఉదయ్‌ను గొడ్డలితో హత్య చేసిన ఘటనలో మామ ఎల్లయ్య, బావమర్ధి పవన్‌తో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క శ్రీనివాస్ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు, నింధితులను త్వరలోనే రిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. -
బ్లూ కిరోసిన్ దందా
జనగామ : జిల్లా కేంద్రంగా బ్లూ కిరోసిన్ దందా యథేచ్ఛగా సాగుతోంది. డీజిల్ ధరలు పెరుగుతుండడంతో వాహనదారులు రేషన్ ద్వారా పంపిణీ చేసే బ్లూ కిరోసిన్ వైపు దృష్టి సారిస్తున్నారు. కొంతమంది బ్రోకర్లు రాత్రికి రాత్రే బ్లూ కిరోసిన్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. లబ్ధిదారులతోపాటు పలువురు ఏజెంట్ల నుంచి బ్లూ కిరోసిన్‌ను సేకరిస్తూ రహస్య ప్రదేశాల్లో డంపింగ్ చేస్తున్నారు. జనగామ పట్టణంలో నడిరోడ్డుపై ‘బ్లాక్’ దందా సాగిస్తున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జనగామతోపా టు మండలాల్లో ఈ వ్యాపారం మూడు పూలు..ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. జనగామ జిల్లాలోని 13 మండలాల్లో 355 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ప్రతి నెల 1.62 లక్షల కుటుంబాలకు 1.62 లక్షల లీటర్ల కిరోసిన్‌ను పంపిణీ చేస్తున్నారు. రేషన్ దుకాణాల ద్వారా నిరుపేద కుటుంబాలకు సరఫరా చేస్తున్న కిరోసిన్ పెద్ద మొత్తంలో పక్కదారి పడుతోంది. జనగామ జిల్లా కేంద్రంలో కొంతమంది బ్రోకర్ల కనుసన్నల్లో ఈ దందా జరుగుతోంది. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి వెంబడే ఓ వ్యాపారి పట్టపగలే కిరోసిన్‌ను బ్లాక్‌లో అమ్ముతున్నాడు. పట్టణంలోని రెండు మూడు ప్రదేశాల్లో కూడా గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. రహస్య ప్రదేశాల్లోని గోదాంలో బ్లూ కిరోసిన్ క్యాన్లను నిల్వ చేస్తున్నారు. తనిఖీలు చేస్తున్నాం అర్ధరాత్రి సమయంలో బ్లూ కిరోసిన్ అమ్మకాలపై తనిఖీలు చేస్తున్నాం. కొడకండ్ల పరిధిలో కేసులు కూడా నమోదు చేసినం. లబ్ధిదారులు ఎక్కడా కూడా కిరోసిన్ అమ్ముకోవద్దు. ఎవరైనా సబ్సిడీ కిరోసిన్ అమ్మినా, ప్రైవేట్ వ్యాపారాలకు వినియోగించినా కేసులు తప్పవు. - రుక్మిణి, డీఎస్ఓ -
ఆ దిబ్బలో ఏముంది..?
సాక్షి, హైదరాబాద్: వేల ఏళ్ల మానవ మనుగడ.. తొలి చారి త్రక యుగం, బృహత్శిలా యుగం, కొత్త రాతి యుగం.. ఇలా వివిధ కాలాల్లో మనిషి వర్ధిల్లా డు. ఇప్పుడు మిగిలింది ‘బూడిద’. వేల ఏళ్ల మా నవ ఆవాసం కొనసాగిందనేందుకు నిదర్శనంగా బూడిద కుప్ప తరహాలో దిబ్బ ఏర్ప డింది. మరి వేల ఏళ్ల కాల ప్రవాహంలో అక్కడ మనిషి జాడ ఎందుకు కనుమరుగైంది..? ఇప్పు డు ఇక్కడి మర్మం కనుక్కునేందుకు బృహత్తర అన్వేషణకు తెర లేవబోతోంది. మానవ మనుగడలో కీలక భూమిక పోషించిన అంశాలు.. అక్కడ వినియోగించిన ధాన్యం.. మనిషితో పెనవేసుకున్న వృక్ష సంపద.. నాటి పర్యావరణం.. ఉపద్రవాలేమైనా సంభవించాయా.. అక్కడ మనిషి మనుగడ లేకుండా అదృశ్యమవటానికి కారణమైన అంశాలేంటి..? ఇంగ్లండ్ లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) నేతృత్వంలో ఈ అన్వేషణ కొనసాగ నుంది. ఈ బృహత్తర కార్యక్రమానికి జనగా మకు దగ్గర లోని కొన్నె–రామచంద్రాపురం ప్రాంతా ల్లోని గజగిరిగుట్ట కేంద్రం కాబోతోంది. ముందు జాగ్రత్తకు.. సాధారణంగా పురావస్తు అన్వేషణలు చరిత్రను కళ్ల ముందుంచుతాయి. గతించిన కాలానికి చెందిన వైభవాన్ని ప్రస్ఫుటిస్తాయి. తాజాగా జరగబోయే అన్వేషణ మాత్రం చరిత్రతో పాటు భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సమాయత్తం చేసేందుకు దోహదపడనుండటం విశేషం. ప్రకృతి ఉపద్రవాలను ముందే ఊహించి వాటి నుంచి బయటపడేందుకు పద్ధతులను అన్వేషించటం, అసలు ఉపద్రవాలు ఎందుకొచ్చాయో తెలుసుకోవటం చాలా అవసరం. పర్యావరణానికి పెను ముప్పుగా మారుతున్న మానవ తప్పిదాలు భవిష్యత్తును ఆందోళనకరంగా మారుస్తున్నాయి. ఈ క్రమంలో గత అనుభవాలను స్పష్టంగా తెలుసుకుంటే భవిష్యత్తులో ఉపద్రవాల నుంచి బయటపడేందుకు మార్గం సుగమమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ఆర్కియాలజీ విభాగం ప్రొఫెసర్ డోరియన్ ఫుల్లర్ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని సంప్రదించారు. ఈ పరిశోధనల్లో ఫుల్లర్, హెచ్‌సీయూ ప్రొఫెసర్ కె.పుల్లారావు ముందుకొచ్చారు. అత్యాధునిక పద్ధతిలో.. గతంలో కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా పరిశోధన జరిగినా అది పూర్తిగా సంప్రదాయ పద్ధతిలో సాగింది. తొలిసారి ఆధునిక పద్ధతిలో అధ్యయనానికి సిద్ధమవుతున్నారు. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపి మానవ మనుగడ సాగిన కాలాన్ని కచ్చితంగా నిర్ధారిస్తారు. ప్రస్తుతం బూడిద మట్టి పేరుకుపోయిన ప్రాంతంలో కొన్ని మీటర్ల లోతు తవ్వి నాటి మనుషులు ఆహారంగా వినియోగించిన ధాన్యపు గింజలు, ఇతర పదార్థాల అవశేషాలను గుర్తిస్తారు. మట్టి పొరల్లో నిక్షిప్తమైన పుప్పొడి అవశేషాలనూ సేకరిస్తారు. దీనివల్ల నాటి ఆహార పదార్థాలు, సేకరణ తీరు, పుప్పొడి ఆధారంగా నాటి వృక్ష జాతి, పర్యావరణం తీరును కచ్చితంగా అంచనా వేస్తారు. ఇందుకు ‘యాక్సలేటర్ మాస్ స్పెక్ట్రోమిట్రీ (ఏఎంఎస్)’అనే ఆధునిక విధానాన్ని అనుసరించనున్నారు. దీని ద్వారా సేకరించిన అతి సూక్ష్మ నమూనాలను అత్యాధునిక పరిశోధన శాలలున్న ఆక్స్ఫర్డ్, ఆరిజోనా యూనివర్సిటీ ల్యాబ్‌ల్లో పరిశోధిస్తారు. జనగామ ప్రాంతమే ఎందుకు? జనగామ సమీపంలోని కొన్నె–రామచంద్రాపురం ప్రాంతాల్లో వేల ఏళ్లనాటి మానవ నివాస జాడలున్నాయి. ఇక్కడి గజగిరిగుట్ట వద్ద పెద్ద ఆవాసం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ప్రొఫెసర్ పుల్లారావు ఆధ్వర్యంలో అధ్యయనం జరిగింది. అక్క డ తొలి చారిత్రక యుగం, బృహత్ శిలా యుగం, కొత్తరాతియుగం కాలాల్లో మాన వులు నివాసాలు ఏర్పాటు చేసుకున్న ఆధారాలు వెలుగు చూశాయి. ఆయా కాలాల్లో వినియోగించిన పనిముట్లు, ఆయుధాలు, పాత్రలు కనిపించాయి. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో మానవ సమాధులకు చిహ్నాలైన రాక్షస గుళ్లు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని డోరియర్ ఫుల్లర్ దృష్టికి తేవటంతో ఆయన ఇక్కడికొచ్చి పరిశీలించారు. పరిశోధనలకు అనుమతి కావాలంటూ గతంలో హెచ్‌సీయూ కేంద్రాన్ని కోరింది. తాజాగా కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ అనుమతి మంజూరు చేసింది. ఈ పరిశోధన చాలా కీలకం: ప్రొఫెసర్ పుల్లారావు ‘ఈ పరిశోధనల వల్ల ప్రకృతితో మానవుడి అనుబంధం, పర్యావరణ పరంగా వచ్చిన మార్పులు, మనిషి చెల్లాచెదురయ్యేందుకు కారణాలను కనుక్కొనే అవకాశముంది. ఇలాంటి పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా చాలాచోట్ల వచ్చాయి. అయితే కారణాలు కనుక్కుంటే భవిష్యత్తు ఉపద్రవాలను ఎదుర్కోవచ్చు. ఇదే దిశగా మా పరిశోధన ఉండనుంది. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంది’. -
జనగామ వద్ద వాహనాలు ఢీ... ఇద్దరి మృతి
సాక్షి, జనగామ: జనగామలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గొర్రెల లోడ్‌తో వెళ్తున్న టాటాఏస్ వాహనం ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో టాటాఏస్ వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన వెంటనే డీసీఎం డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. వాహనంలో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు రెండు గంటలు కష్టపడ్డారు. మృతులు వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదంలో 10 గొర్రెలు కూడా మృతి చెందాయి. మృతుల్లో ఒకరిని నాగారానికి చెందిన గొల్ల అంజయ్యగా గుర్తించారు. పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది. -
‘బతుకమ్మకుంట’ ఆక్రమణలపై చర్యలేవీ?
సాక్షి, హైదరాబాద్: జనగామలోని బతుకమ్మకుంట చెరువులో అక్రమ నిర్మాణాల అంశంపై సోమవారం శాసనమండలిలో వాడివేడి చర్చ జరిగింది. ఆక్రమణలపై కలెక్టర్ నివేదిక ఇచ్చి నా చర్యలు ఎందుకు తీసుకోలేదని విపక్ష కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే చెరువును ఆక్రమించారని ఆరోపించారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, కలెక్టర్ మధ్య జరిగిన సంభాష ణ టేపులు కూడా తమ వద్ద ఉన్నాయన్నారు. ఒక ఐఏఎస్ అధికారిపై దౌర్జన్యం కూడా చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రెండెకరాలకు మించిన చెరువులను పూడ్చరాదని, కానీ బతుకమ్మకుంట చెరువులో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన జరిగిం దని పొంగులేటి విమర్శించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) మహమూద్ అలీ సమాధానమిస్తూ.. బతుకమ్మకుంట చెరువు శిఖం భూమిలో ఒక ఆక్రమణ, పూర్తిస్థాయి చెరువులోని పట్టా భూమిలో 6 నిర్మాణాలు ఉ న్నట్లు గుర్తించామన్నారు. ఆక్రమించిన చెరువు విస్తీర్ణం 3,855 చదరపు గజాలని, పట్టా భూమిలో నిర్మాణాల విస్తీర్ణం 976 గజాలని వివరించారు. ఆక్రమణదారుల నుంచి చెరువును రక్షించాలని జిల్లా సాగునీటి అధికారిని కలెక్టర్ ఆదేశించారన్నారు. సమాధానంపై సం తృప్తి చెందని షబ్బీర్, పొంగులేటి న్యాయ వి చారణకు డిమాండ్ చేశారు. దీంతో మంత్రి శ్రీ నివాస్ యాదవ్ జోక్యం చేసుకుంటూ ఈ అం శంపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చే స్తోంద ని మండిపడ్డారు. అక్కడ గుడి నిర్మాణం జరిగినట్లు కనిపిస్తోంది తప్ప ఎమ్మెల్యే ఆక్రమించిన ట్లు ఏమీ లేదన్నారు. ప్రభుత్వ సమాధానానికి నిరసనగా కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. -
రెండు కొత్త మార్కెట్ కమిటీలు
హైదరాబాద్: జనగామ జిల్లా పాలకుర్తి, సిద్దిపేట జిల్లా తూప్రాన్‌లో కొత్త మార్కెట్ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కొడకండ్ల మార్కెట్ కమిటీలో భాగంగా ఉన్న పాలకుర్తి మండలంలోని గ్రామాలను వేరు చేస్తూ పాలకుర్తి మార్కెట్ కమిటీని, వంటిమామిడి మార్కెట్ కమిటీలో భాగంగా ఉన్న తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లోని గ్రామాలను వేరు చేస్తూ తూప్రాన్ మార్కెట్ కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే నిర్మల్ జిల్లా నిర్మల్ మార్కెట్ కమిటీ పరిధిలోని లక్ష్మణచందలో సబ్ మార్కెట్ యార్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. -
కత్తి పట్టడం వస్తే చాలు.. కోసుడే..!
► ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇష్టారీతిగా ఆపరేషన్లు ► అనుమతి లేకుండానే ల్యాబ్‌ల నిర్వహణ ► అధ్వానంగా వైద్య సేవలు ► గాల్లో కలిసి పోతున్న రోగుల ప్రాణాలు జనగామ: జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణ అధ్వానంగా మారింది. అడ్డదారి అనుమతులతో అధికారులను బోల్తాకొట్టిస్తూ ప్రైవేట్ దందా సాగిస్తున్నారు. క్వాలీఫైడ్ డాక్టర్ల పేరుతో పెద్దపెద్ద బోర్డులను ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులు ఆస్పత్రిని అంగడి సరుకుగా మారుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్రోకర్లను ఏర్పాటు చేసుకుని చిన్న పాటి జబ్బులకే వారిని భయబ్రాంతులకు గురిచేస్తూ కమీషన్లు ఇచ్చే ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. స్కానింగ్ కేంద్రాలకు బ్రోకర్ల లింకు... లింగనిర్ధారణ పరీక్షల్లో శిశవు ఎవరనే విషయాన్ని చెప్పవద్దని చట్టం ఉన్నా.. అది బ్రోకర్లకు చుట్టంగానే మారుతోంది. కమీషన్ల దందా సాగిస్తూ.. అమ్మ కడుపులో పెరుగుతున్న శిశువు ఆడ, మగ అని ముందే తెలుసుకుంటున్నారు. అలా పసిబిడ్డల ప్రాణాలను కళ్లు తెరవక ముందే పొట్టన బెట్టుకుంటున్నారు. ఈ తతంగంలో సూత్ర.. పాత్ర దారిలో పట్టణానికి చెందిన ఓ ఆర్ఎంపీతో పాటు మరి కొంతమంది ఉన్నట్లు తెలుస్తుంది. సదరు ఆర్ఎంపీ ఆయా స్కానింగ్ నిర్వాహకులతో చేతులు కలిపి లింగనిర్ధారణ పరీక్షల్లో కమీషన్ల దందా సాగిస్తున్నారు. పైసలకు కక్కుర్తి పడిన ఈయన అబార్షన్లను కూడా చేస్తూ మహాపాపాన్ని మూటగట్టు కుంటున్నాడు. రోతపుట్టిస్తున్న ప్రైవేట్ దవాఖానాలు జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు రోత పుట్టిస్తున్నాయి. ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, వార్డుల నిర్వహణ అత్యంత అధ్వానగా ఉంది. ప్రసూతి వచ్చి డెలివరీ అయిన తర్వాత వారిని గాలికి వదిలేస్తున్నారు. రాత్రి సమయంలో గైనకాలజిస్టు, స్టాఫ్ నర్సు ఉండాల్సిన దవాఖానాలో కింది స్థాయి సిబ్బందితో పని కానిచ్చేస్తున్నారు. ఎవరు పడితే వారు సెలెన్, ఇంజక్షన్, మందు గోలీలను ఇస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఆస్పత్రి రిస్ట్రేషన్ సమయంలో క్వాలిఫైడ్ డాక్టర్ల సర్టిఫికెట్లను చూపిస్తూ అనుమతులు పొందుతున్నారు. రెండు మూడు నెలల పాటు అంతా సాఫీగా సాగిస్తున్న నిర్వాహకులు.. ఆ తర్వాత ప్రైవేట్‌గా ప్రాక్టీసు పొందిన వారిచే ప్రై‘వేటు’ వైద్యం చేయిస్తున్నారు. ‘అనస్తీషియా’ హల్చల్... జిల్లా కేంద్రంలో 20 నర్సింగ్ హోంలు, 30 క్లినిక్‌ల వరకు ఉంటాయి. అయితే బచ్చన్నపేట, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, దేవరుప్పులతో పాటు పలు మండలాల్లోని ప్రైవేట్ క్లినిక్‌ల్లో అనస్తీషియా డాక్టర్లదే హవా కొనసాగుతోంది. కాన్పు సమయంలో మత్తు సూది ఇచ్చే డాక్టర్ ఏకంగా ఆపరేషన్లు చేస్తుండడం గమనార్హం. ఇక కొన్ని ఆస్పత్రుల్లో అనస్తీషియా డాక్టర్‌కు బదులుగా సదరు దవాఖానలో పని చేస్తున్న వైద్యులే మత్తు మందు ఇస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రైవేట్ ఆస్పత్రుల్లో గతంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలే ఇందుకు నిదర్శనం. ‘నాని’ సీజ్, ‘వినాయక్’ లైసెన్స్ రద్దు... అబార్షన్ కేసులో నాని చిన్న పిల్లల ఆస్పత్రిని సీజ్ చేయగా.. వినాయక దవాఖానా లైసె న్స్ను రద్దు చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కనీస మౌలిక వసతులు కూడా కరువయ్యాయి. అనుమతులు లేకుండా ల్యాబ్‌లను నిర్వహిస్తూ పేదల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. అవసరమున్నా.. లేకున్నా రక్త పరీక్షలు మాత్రం ప్రైవేట్ డాక్టర్ మందుల చీటీలో తప్పనిసరిగా మారుతున్నాయి. నార్మల్ డెలివరీ అయ్యే పరిస్థితుల్లో నొప్పులు రావడం లేదని కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేస్తూ డబ్బుల కోసం కడుపును కోస్తున్నారు. అబార్షన్ వెనక అసలు కథ.. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన ఓ మహిళకు అబార్షన్ చేసిన ఘటన అనేక మలుపులు తిరుగుతోంది. ప్రైవేట్ ఆస్పత్రిలో మహిళకు అబార్షన్ చేస్తుం డగా ఓ అజ్ఞాత వ్యక్తి కలెక్టర్ శ్రీదేవసేనకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెం టనే స్పదించిన కలెక్టర్ సదరు ఆస్పత్రిని తనిఖీ చేయాలని డీఎంహెచ్ఓను ఆదేశించడంతో వారు హుటాహుటిన వెళ్లారు. ముందుగానే సమాచారం అందుకున్న హిందువుల ఆరాధ్య దైవమైన దేవుడు పేరుతో ఉన్న ఓ ఆస్పత్రి నిర్వాహకులు వెంటనే సదరు మహిళను పక్కనే ఉన్న చిన్న పిల్లల నాని ఆస్పత్రికి తరలించారు. ఎప్పటిలాగే వైద్యారోగ్య శాఖ అధికారులు ఆ ఆస్పత్రికి వెళ్లి తనిఖీ చేసి.. ఏ మీలేదని తేల్చి చెప్పారు. ముందుగా కలెక్టర్‌కు ఫోన్ చేసిన ఆ వ్యక్తి మహిళను నాని ఆస్పత్రికి తీసుకువెళ్లి అబార్షన్ చేస్తున్నట్లు చెప్పడంతో దొంగతనం వెలుగు చూసింది. గత రాత్రి డీఎంహెచ్ఓ అన్న ప్రసన్నకుమారి వినాయక ఆస్పత్రినికి తనిఖీ చేయగా.. అంతా నకిలీలే బయట పడ్డారు. దీంతో ఆగ్రహించిన అమె ఆస్పత్రి లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. కఠిన చర్యలు తప్పవు జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులపై నిఘా వేసినం. అనుమతులను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. వినాయక ఆస్పత్రి నిర్వహణ అధ్వానంగా మారింది. కింది స్థాయి వర్కర్లు ప్రసూతి చేసుకున్న వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. ల్యాబ్‌ను కూడా అనుమతులు లేకుండా నడిపిస్తున్నారు. ఇటీవల జరిగిన అబార్షన్ విషయంతో కూపీ లాగుతున్నాం. ఇందులో ఎవరి పాత్ర ఉందనే దానిపై పూర్తి ఆధారాలు సేకరించాం. ఎవరనీ వదిలిపెట్టం. – అన్న ప్రసన్నకుమారి, డీఎంహెచ్ఓ ‘క్వాలిఫై డాక్టర్ ఉన్నాడు.. ఆస్పత్రి నిర్వహణకు అన్ని సౌకర్యాలు కల్పించాం.. పేషెంట్లకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తాం..’ అని అనుమతులు తీసుకుంటున్న కొన్ని ప్రైవేట్ దవాఖానాలు అమాయకుల ప్రాణాలు గాలిలో కలిపేస్తున్నాయి. కత్తి పట్టడం వస్తే చాలు.. కడుపును కోసేస్తున్నారు. లింగనిర్ధారణ పరీక్షల పేరిట కమీషన్ల దందా సాగిస్తూ.. ఆడపిల్లను కడుపులోనే ఖతం చేస్తున్నారు. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరా చేసుకుంటున్న వ్యక్తులు.. డాక్టర్ల పేరుతో డ్యూటీ చేస్తూ.. రెండు చేతులా సంపాదిస్తున్నారు. రోగుల ప్రాణాలు పోతే మాకేంటిలే అన్న విధంగా జిల్లా కేంద్రంలో కొన్ని ప్రైవేట్ దవాఖానాల నిర్వాహకులు వ్యహరిస్తున్నారు. కొన ఊపిరితో ఆస్పత్రికి వచ్చే రోగులకు ప్రాణ భిక్షపెట్టే ఆస్పత్రులే.. ప్రాణాలు తీస్తుంటే.. వైద్యారోగ్య శాఖ మాత్రం గుడ్డితనంగా వ్యవహరిస్తోంది. -
శీలానికి వెల కట్టిన గ్రామ పెద్దలు
-
శీలానికి వెల కట్టిన గ్రామ పెద్దలు
బచ్చన్నపేట(జనగామ జిల్లా): బచ్చన్నపేట మండలం పోచన్నపేటలో దారుణం చోటుచేసుకుంది. యువతిని నిర్బంధించి వారం రోజుల పాటు ఓ యువకుడు అత్యాచారం జరిపాడు. ఈ విషయం గ్రామస్తులు గమనించి బాధితురాలికి విముక్తి కల్పించి తల్లిదండ్రులకు అప్పగించారు. జరిగిన అన్యాయంపై పోలీసులకు బాధితులు పిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. గ్రామ పెద్దలు ఆమె శీలానికి రూ.40 వేలు ఖరీదు కట్టి విషయం సద్దుమనిగేలా చూశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించారు. న్యాయం కోసం ఉన్నత అధికారి సీపీ సుధీర్ బాబుకి వాట్సప్‌లో బాధితులు పిర్యాదు చేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేసు నమోదు చేయాలని ఆదేశించారు. -
గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
రూ. 2 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం జనగామ: జిల్లా కేంద్రంలో నిషేధిత గుట్కాల విక్రయం జోరుగా సాగుతోందనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రూ. 2 లక్షల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం దాడులు చేపట్టిన పోలీసులు ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
వింత శిశువు జననం
జనగామ: జిల్లా కేంద్రంలో వింత శిశువు జన్మించింది. స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఓ తల్లి మూడు కాళ్ల పాపకు జన్మనిచ్చింది. జిల్లాలోని రఘునాధపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన ఎల్లబోయిన జంపన్న, శ్రీలతలకు రెండవ సంతానంగా మూడుకాళ్ల కూతురు జన్మించింది. ఆరు నెలల క్రితం స్కానింగులో ఈ విషయం భయపడింది. గత వారం రోజులుగా ఏరియా ఆస్పత్రి లో శ్రీలతకు వైద్య పరీక్షలను నిర్వహిస్తుండగా.. సోమవారం రాత్రి శ్రీలతకు నొప్పలు రావడంతో కుటుంబ సభ్యులు అస్పత్రకి తీసుకువచ్చారు. కడుపులో బేబి ఉమ్మనీరు మింగడంతో డాక్టర్ స్వప్న బృందం అర్థరాత్రి ఆపరేషన్ నిర్వహించారు. శ్రీలతకు జన్మించిన పాప మూడు కాళ్లతో ఉండడంతో వైద్యులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. పాప ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నప్పటికి.. మూడు కాలుపై క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ లోని నీలోఫర్ అస్పత్రికి రెఫర్ చేశారు. మూడుకాళ్లతో జన్మించిన పాపను చూసేందుకు చుట్టపక్కల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. -
‘నేను.. నాపాలన.. నాఇష్టంగా’ మారింది
జనగామ జిల్లా: టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం..నేడు నేను.. నాపాలన.. నాఇష్టంగా మారిందని విమర్శించారు. జనగామలో విలేకరులతో మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ కాస్త బాధల తెలంగాణగా మారిందన్నారు. రైతులు, ఉద్యోగులు, పోలీసులు స్తెతం ఆత్మహత్యలకు పాలుపడుతుడండం టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. రుణమాఫీ పథకం వడ్డీ మాఫీ పథకంగా, మిషన్ భగీరథ కాస్త మిషన్ కల్వకుంట్లగా మారిందన్నారు. మిషన్ భగీరథ పథకంప్తె బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని అంశాలపై ప్రాధాన్యం ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. -
చరిత్రలో పోరుగడ్డ
జనగామ : పోరుగడ్డగా పేరొందిన జనగామ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కొత్త జిల్లాగా ఏర్పాటైన అనతికాలంలోనే చరిత్ర సృష్టించింది. వీరనారిలు రాణి రుద్రమదేవి, చాకలి ఐలమ్మ స్ఫూర్తితో బాలికలు ఆత్మరక్షణపై మహా ప్రదర్శన చేపట్టారు. మండుటెండలో 36 నిమిషాల పాటు కరాటే విన్యాసా లు చేపట్టి అబ్బురపరిచారు. తాము నేర్చుకున్న నైపుణ్యాలను క్రమ పద్ధతిలో ప్రదర్శించి అందరిని ఆకట్టుకున్నారు. సెల్ఫ్‌డిఫెన్స్‌పై మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొంది న విద్యార్థినులు భారీ ప్రదర్శన నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డులో చోటు సంపాదించారు. ఈ మహాత్తర వేడుకను మంగళవారం జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. 13,683 మంది విద్యార్థినులు.. 36 నిమిషాల ప్రదర్శన.. బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు కలెక్టర్ శ్రీదేవసేన సెల్ఫ్ డిఫెన్స్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో బాలికలు, మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపేవిధంగా కార్యక్రమాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ మేరకు కలెక్టర్ బాలికలకు ఆత్మరక్షణపై శిక్షణ అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా డిసెంబర్ 4వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా రుద్రమదేవి సెల్ఫ్ అకాడమీ మార్షల్ ఆర్ట్స్ ఇన్స్ట్రక్టర్లు లక్ష్మి, రవి శిక్షణ ఇచ్చారు. విద్యాలయాల్లో ఇచ్చిన శిక్షణను ధర్మకంచ ఇండోర్ స్టేడియంలో ఇండిగ్రేటెడ్ చైల్డ్ ప్రొడక్షన్ స్కీం (ఐసీపీఎస్) ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సంఘటిత సబల’ పేరుతో ప్రదర్శించారు. జిల్లా నలుమూలల నుంచి 157 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు చెందిన 13,683 మంది విద్యార్ధినులుతరలివచ్చారు. ఎలక్ట్రానిక్ మిషన్ల ద్వారా బాలికల సంఖ్యను లెక్కించారు. ఉదయం 11:39 నిమిషాలకు ప్రారంభమైన ప్రదర్శన మధ్యాహ్నం 12:15 ముగిసింది. గిన్నిస్ బుక్ రికార్డు భారత ప్రతినిధిగా జైసింహ, టైమర్‌గా చందూ శ్రీనివాస్ పర్యవేక్షణలో మహా ప్రదర్శన కొనసాగింది. 36 నిమిషాల పాటు సాగిన ప్రదర్శనను డ్రోన్ కెమెరాల సాయంతో రికార్డు చేశారు. కాగా, జనగామ ప్రపంచ రికార్డును సృష్టించడంతో మంత్రి అజ్మీరా చందూలాల్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గాలిలోకి బెలూన్లు ఎగురవేశారు. ‘గ్రేట్ జనగామ’ నినాదాలు.. వేలాదిగా తరలివచ్చిన విద్యార్థినులను ఉత్తేజపరిచేందుకు కరాటే ఇన్స్ట్రక్టర్టు లక్ష్మి, రవి ద గ్రేట్ జనగామ అంటూ నినాదాలు చేశారు. 13 నుంచి 18 ఏళ్ల లోపు ఉన్న 13,683 మంది విద్యార్థినులు, 450 మంది అంగన్వాడీ కార్య కర్తలు, 10 మంది సీనియర్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్లు, ఉపాధ్యాయినులు, పీఈటీలు పాల్గొన్నారు. ఇన్స్ట్రక్టర్లు లక్ష్మి, రవి 25 అంశాల్లో సెల్ప్ డిఫెన్స్‌పై విద్యార్థినులతో విన్యాసాలు చేయించారు. హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు.. సంఘటిత సబల ప్రదర్శన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టూరిజం శాఖమంత్రి అజ్మీరా చందూలాల్, జెడ్పీ చైర్పర్సన్ పద్మ, శాసన మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ పూల రవీందర్‌తో పాటు వరంగల్ సీపీ సుధీర్‌బాబు, జేసీ గోపాలకృష్ణాప్రసాద్రావు, డీసీపీ వెంకన్న, మునిసిపల్ చైర్ పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ పద్మ, వైస్ చైర్మన్ వెంకట్, డీపీఓ రవికుమార్, డీఈఓ యాదయ్య, డీఏఓ వీరునాయక్ పాల్గొన్నారు. ఇండియన్ వరల్డ్ రికార్డు పత్రాల అందజేత ప్రపంచ స్థాయిలో ఎక్కడ జరగని విధంగా సంఘటిత సబల ప్రదర్శన గిన్సిస్ బుక్‌లో చోటు సంపాదించింది. 36 నిమిషాల పాటు సాగిన ప్రదర్శన అనంతరం ఇండియన్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్లను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్ చేతుల మీదుగా కలెక్టర్ శ్రీదేవసేనకు అందజేశారు. రుద్రమదేవి, ఐలమ్మకు నిజమైన వారసులు : డిప్యూటీ సీఎం కడియం నూతనంగా ఏర్పడిన జనగామ జిల్లా విద్యార్థినులు గిన్నిస్ బుక్ రికార్డు సాధించి రాణిరుద్రమదేవి, చాకలి ఐలమ్మకు నిజమైన వారసులుగా నిలిచారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. 13,683 మంది 36 నిమిషాల పాటు ప్రదర్శన ఇవ్వడం అభినందనీయమన్నారు. బాలికల విద్యకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. త్వరలో జిల్లా కలెక్టరేట్ ఇంటిగ్రేటెట్ సముదాయాన్ని నిర్మించబోతున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో జనగామలో ఎస్సీ, ఎస్టీ బాలికల కోసం డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలను ప్రారంభిస్తామన్నారు. రాబోయే ఏడాదిలో ఎస్సీ బాలికల కోసం 104, ఎస్టీలకు 51, మైనార్టీలకు 71, వెనకబడిన విద్యార్థినుల కోసం 119 గురుకుల విద్యాలయాలను నెలకొల్పబోతున్నామన్నారు. కాగా, మహా ప్రదర్శన నిర్వహించేందు కు కృషి చేసిన కలెక్టర్ శ్రీదేవసేనను, పాల్గొన్న విద్యార్థులను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందించారు. -
జనగామ, మహబూబాబాద్‌లకు ఔటర్ రింగ్ రోడ్లు
డీపీఆర్‌లు రూపొందించాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి కడియం ఆదేశం హైదరాబాద్: వరంగల్, మహబూబాబాద్, జనగామలకు ఔటర్ రింగ్ రోడ్లు నిర్మించేందుకు డీపీఆర్‌లు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రోడ్లు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మూడు జిల్లా కేంద్రాల మీదుగా రెండు వంతున కొనసాగుతున్న జాతీయ రహదారులను బైపాస్‌లుగా చేసి ఔటర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్లో చేరిస్తే రాష్ట్ర ఖజానాపై భారం తగ్గుతుందన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశ మందిరంలో ఆయన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, చందూలాల్, ఎమ్మెల్యేలు వినయభాస్కర్, ఆరూరి రమేశ్, శంకర్‌నాయక్ వరంగల్ మేయర్ నరేందర్, కుడా చైర్మన్ యాదవరెడ్డి తదితరులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వరంగల్ ఔటర్రింగురోడ్డు పనులు మొదలైనా, నత్తనడకన సాగుతుం డటం సబబు కాదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఔటర్ రింగ్‌రోడ్డు బైపాస్ పనులను వెంటనే వేగిరపరచాలని ఆదేశించారు. వరంగల్ మీదుగా ఎన్‌హెచ్ 163, జగిత్యాల–ఖమ్మం ఎన్‌హెచ్, మహబూబాబాద్, మరిపెడ మీదుగా వెళ్లే భూపాలపల్లి–నర్సంపేట ఎన్‌హెచ్, మహబూబాబాద్ మీదుగా భద్రాచలం–వలిగొండ వెళ్లే జాతీయ రహదారి, జనగామ మీదుగా ఎన్‌హెచ్ 163, సూర్యాపేట ఎన్హెచ్లను మూడు ఔటర్ రింగ్‌రోడ్డులతో అనుసంధానించేలా అలైన్ మెంట్లలో చేర్చాలని సూచించారు. కాగా ఫాతిమానగర్, ఖాజీపేటల మధ్య సమాంతర ఆర్ఓబీ నిర్మాణం కోసం అధికారులు డీపీఆర్ పూర్తి చేశారు. దీనికి రూ.70 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. వచ్చే ఏడాది సమ్మక్కసారలమ్మ జాతర ఉన్నందున భూపాలపల్లి వెళ్లే రోడ్డును 4 వరుసలుగా అభివృద్ధి చేయాలన్నారు. -
ష్.. గప్‌చుప్
టపాసుల జీరో దందాకు బ్రేక్ దుకాణాలకు తాళాలు వేసిన వ్యాపారులు రహస్య ప్రాంతాలకు బాణసంచా తరలింపు ‘సాక్షి’ కథనంతో అప్రమత్తం బేరసారాల కోసం ప్రయత్నాలు సాక్షి, జనగామ : జనగామ జిల్లా కేంద్రంగా సాగుతున్న టపాసుల జీరో దందాకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. నిన్న మొన్నటి దాకా దర్జాగా విక్రయాలు జరిపి ఇతర ప్రాంతాలకు బాణసంచాను రవాణా చేసిన వ్యాపారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. జనావాసాల మధ్య నిర్వహిస్తున్న దుకాణాలకు తాళాలు వేసి దూర ప్రాంతాలకు వెళ్లారు. నిబంధనలు ఉల్లంఘించి జిల్లా కేంద్రంగా సాగిస్తున్న టపాసుల విక్రయాలపై సోమవారం ‘సాక్షి’లో ‘దర్జాగా దందా’ శీర్షికతో జిల్లా మొదటి పేజీలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తారనే భయంతో టపాసుల విక్రయాలను వ్యాపారులు అర్థంతరంగా నిలిపివేశారు. అలాగే జనగామ, బచ్చన్నపేట, కళ్లెం రోడ్లతోపాటు కుర్మవాడలో ఏర్పాటు చేసిన గోదాంలో నిల్వ ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే టపాసులను గుట్టుచప్పుడు హైదరాబాద్ శివారు, హుస్నాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాలకు తరలించారు. బేరసారాలకు యత్నాలు.. దీపావళి పండుగ సమయంలోనే టపాసులు అధికంగా విక్రయిస్తారు. అయితే ఇప్పుడే అ మ్మకాలను నిలిపివేస్తే దందా దివాలా తీస్తుం దనే భయంతో కొందరు వ్యాపారులు బేరసారాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు ప్రధాన భూమిక పోషిస్తున్న వ్యాపారులతోపాటు వారికి అనుబంధంగా పెద్ద, చిన్న 300 మంది వరకు ఉన్నారు. అయితే అధికారులకు నయానో.. భయానో చెల్లించి యధావిధిగా వి క్రయాలు చేసుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైన ట పాసుల విక్రయాలకు బ్రేక్ పడడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఉపిరి పీల్చుకున్నారు. -
జనగామ జిల్లా కోసం ఉద్యమం ఉధృతి
వరంగల్ : జనగామ జిల్లా కోసం ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. అందులోభాగంగా మంగళవారం జనగామలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు టీ జేఏసీ చైర్మన్ కోదండరాంతోపాటు పొన్నాల లక్ష్మయ్య, చుక్కా రామయ్య, చాడ వెంకట్‌రెడ్డి హాజరుకానున్నారు. ఇప్పటికే జనగామ ప్రత్యేక జిల్లా చేయాలని ఇంతకుముందు తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. కోర్టు అనుమతితో నేడు జరగనున్న ఈ బహిరంగ సభకు ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. అలాగే కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లను ప్రత్యేక జిల్లా చేయాలని డిమాండ్ చేస్తు జిల్లా జేఏసీ మంగళవారం 48 గంటల పాటు బంద్‌కు పిలుపు ఇచ్చిన విషయం విదితమే. -
సాయుధ పోరుకు పురుడు పోసింది జనగామనే
జనగామ : నిజాం సర్కారుకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటానికి పురుడు పోసిన జనగామను జిల్లా చేయాల్సిందేనని నాటి పోరాట యోధురాలు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం అన్నారు. జిల్లా సాధన కోసం జేఏసీ తలపెట్టిన రిలే దీక్షలను ఆదివారం ఆమె ప్రారంభించారు. అంతకు ముందు జేఏసీ చైర్మెన్ ఆరుట్ల దశమంతరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి, సీపీఎం డివిజన్ కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ఆమెకు ఘనస్వాగతం పలికారు. అనంతరం మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ.. జిల్లా ఏర్పాటు అయితే భవిష్యత్ తరాలకు బతుకుదెరువు కలుగుతుందన్నారు. జిల్లా కోసం డివిజన్లోని అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు ఏడాది కాలంగా ఉద్యమం చేస్తుంటే, పాలకులు పట్టించు కోకపోవడం బాధాకరమని అన్నారు. ప్రజా ఉద్యమాన్ని చులకనగా చూస్తే అగ్నికణమవుతుందని హెచ్చరించారు. ప్రజల ఆకాంక్షలను గ్రహించాలని కేసీఆర్‌కు సూచించారు. దళితులకు మూడెరకాల భూపంపిణీ అటకెక్కిందని విమర్శించారు. అనంతరం విస్నూరు దొరను జనగామ రైల్వేస్టేన్లో హత్య చేసిన ధర్మాపురం గ్రామానికి చెందిన 106 ఏళ్ల దర్గానాయక్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోకల లింగయ్య, పజ్జూరి గోపయ్య, బూడిద గోపి, ఉడుత రవి, గొళ్లపల్లి బాపురెడ్డి, మిట్యానాయక్, క్రిష్ణ, బొట్ల చిన శ్రీనివాస్, ఇర్రి అహల్య, మంగళ్లపల్లి రాజు, రెడ్డి రత్నాకర్‌రెడ్డి, మిద్దెపాక సుధాకర్, ధర్మపురి శ్రీనివాస్ ఉన్నారు. -
లక్ష మందితో జనగామ జనగర్జన
జనగామ : జనగామ జిల్లా సాధనే లక్ష్యంగా ప్రజ లను మరితం చైతన్యవంతం చేస్తూ, ప్రభుత్వా న్ని మేలుకొలిపే విధంగా జనగామలో జనగర్జన సభ నిర్వహిస్తామని జేఏసీ చైర్మను ఆరుట్ల దశమంతరెడ్డి తెలిపారు. పట్టణంలోని జూబ్లీగార్డెనులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నేటి జిల్లా ఉద్యమం వరకు ప్రాణాలర్పించిన ఉద్యమకారులను స్మరిస్తూ మైదానానికి అమరుల ప్రాంగణంగా నామకరణం చేశామన్నారు. 20వ తేదీ ఉదయం 11 గంటలకు జరిగే సభకు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. లక్ష మంది జనంతో నిర్వహించే సభను విజయవంతం చేసేందుకు ఆరు రోజులపాటు నిర్వహించే కార్యాచరణ రూపొం దించామన్నారు. మానవహారాలు, బైక్ ర్యాలీలు, ఇంటిట ప్రచారం, డప్పుచాటింపు కార్యక్రమాలకు పిలుపునిస్తున్నామని అన్నారు. మండల, గ్రామ స్థాయి జేఏసీ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాలను భాగస్వాములను చేసుకోవాలని సూచించారు. 14న జనగామలో పది వేల మందితో మానవహారం, 16న పట్టణం నుంచి రెండు రూట్లలో 400 బైక్‌లతో గ్రామ గ్రామాన పర్యటిస్తామన్నారు. ప్రజలనుంచి అభ్యంతరాలు స్వీకరించిన ఆయా గ్రామాల జేఏసీలు బైక్‌ర్యాలీగా వచ్చిన ప్రతినిధులకు వాటిని అప్పగించాలని సూచించారు. అదేరోజు అన్ని గ్రామాల్లో ఇంటిటికీ బొట్టు పెట్టి జనగర్జన సభకు రావాల్సిందిగా ఆహ్వానిస్తామన్నా రు. 19న డప్పు చాటింపుతో ప్రచారం చేస్తామన్నారు. నెహ్రూ పార్కు మీదుగా భారీ ర్యాలీ జనగర్జన సభ ప్రారంభానికి ముందు కళాకారుల నృత్యాలు, వేషధారణలతో భారీ ర్యాలీ, ప్రదర్శనగా అమరవీరుల ప్రాంగణం వద్దకు చేరుకుంటామన్నారు. జనగామకు మద్దతుగా వచ్చిన అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు అ న్ని వర్గాల వారికి ఆహ్వానం పంపిస్తామన్నారు. సీతారాంపురం, కడవెండి, బైరానుపల్లి మీదుగా వచ్చే అమరుల జ్యోతి ర్యాలీ 10 గంటల వరకు చేరుకుంటుదని వివరించారు. జనగర్జనతో ప్రభుత్వంలో కదిలిక వచ్చేలా చేసే బాధ్యత ప్రజలపై ఉందని, డివిజనులోని అన్ని ప్రాంతాల నుంచి పిల్లా, పాపలతో కలిసి తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఆ¯ŒSలైన్లో సిద్దిపేట జిల్లాపై వచ్చే ఫిర్యాదులను తొలగిస్తున్నారని అనుమానంగా ఉందని, ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. యాదాద్రి వద్దు, జనగామ జిల్లా కావాలని ఇప్పటి వరకు ఆ¯ŒSలై¯ŒSలో పదివేల అభ్యం తరాలు రాగా, లిఖిత పూర్వకంగా మరో 50వేల ఫిర్యాదులు వెళ్లినట్లు వివరించారు. జేఏసీ నాయకులు ఆకుల వేణుగోపాల్‌రావు, మేడ శ్రీను, మంగళ్లపల్లి రాజు, ఆలేటి సిద్దిరాములు, ధర్మపురి శ్రీనివాస్, పిట్టల సురేష్, తిప్పారపు విజయ్, బొట్ల శేఖర్, జి.కృష్ణ తది తరులు ఉన్నారు. -
బైక్ దొంగ అరెస్ట్
జనగామ: పార్క్ చేసి ఉన్న ద్విచక్రవాహనాలను టార్గెట్‌గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి నాలుగు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా నివాసముంటున్న యాట రమేష్ జల్సాలకు అలవాటు పడి చోరీల బాట పట్టాడు. ఈ క్రమంలో పార్క్ చేసి ఉన్న నాలుగు ద్విచక్రవాహనాలను అపహరించాడు. బైక్ చోరీలపై ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని శనివారం అరెస్ట్ చేశారు. -
జనగామ నేతల ఆమరణ దీక్ష భగ్నం
తెల్లవారుజామున వరంగల్ ఎంజీఎంకు నేతల తరలింపు ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న 12మంది జనగామ : జనగామ జిల్లా కోసం జేఏసీ నాయకులు తలపెట్టిన ఆమరణ దీక్షను గురువారం తెల్లవారుజామున పోలీసులు భ గ్నం చేశారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డితో పాటు డాక్ట ర్ లక్షీ్మనారాయణనాయక్, ఆకుల దుర్గాప్రసాద్, జక్కుల వేణుమాధవ్, పూల సుధాకర్, మంతెన మణి, అనంతుల శ్రీనివాస్, ఉడ్గుల రమేష్, పిట్టల సత్యం, నాగారపు వెంకట్, సీతారాము లు, పానుగంటి ప్రవీణ్ మంగళవారం ఆమరణ దీక్షలో కూర్చున్నారు. మొదటి రోజు దీక్షలు ప్రశాంతగా ప్రారంభం కావడంతో పోలీసులు కూడా సహకరిస్తారని అంతా భావించారు. అయితే బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు డీఎస్పీ పద్మనాభరెడ్డి పర్యవేక్షణలో జనగామ, రూరల్, చేర్యాల సీఐలు ముసికె శ్రీనివాస్, తిరుపతి, చంద్రశేఖర్, బలగాలు శిబిరం వద్దకు చేరుకుని నిద్రలో ఉన్న జేఏసీ నాయకులను వాహనంలో ఎక్కించే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న వారు అడ్డుకున్నా పోలీసులు వారిని వాహనంలో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కాగా, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హైదరాబాద్ వెళ్తున్న సమయం లో ఎవరైనా అడ్డుకుంటారేమోననే భావనతో సీఐ శ్రీనివాస్ ఆ ధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇంకా పలు ప్రాంతాల్లో నిఘా వేయడంతో పాటు విద్యార్థి సంఘాల నేతలు తీగల సిద్ధూ, పిట్టల సురేష్, మజీద్, నాగరాజు తదితరులను అరెస్ట్ చేశారు. కాగా, హైదరాబాద్ జాతీయ రహదారి కళ్లెం క్రాస్ రోడ్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి టైర్లకు నిప్పు పెట్టారు. ఎంజీఎంలో కొనసాగుతున్న దీక్ష ఎంజీఎం : జనగామను జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్షకు దిగిన జేఏసీ నేతలను పోలీసులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు తమను బలవంతంగా తీసుకురావడంతో జేఏసీ నేతలు ఎంజీఎం క్యాజువాలిటీ వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం వైద్యులు వారిని ఆబ్జర్వేషన్ వార్డుకు తరలించి పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపా రు. కాగా, జనగామను జిల్లాగా ఏర్పాటుచేయాలన్న డిమాండ్ తో తలపెట్టిన ఆమరణ దీక్షను కొనసాగిస్తన్నామని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డితో పాటు డాక్టర్ లక్షీ్మనారాయణ నాయక్ తెలిపారు. దీక్షలో పాల్గొన్న తమను పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదన్నారు. కాగా, తాము ఆస్పత్రిలో గ్లూకోజ్ నిరాకరించామని, దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
జనగామలో ఉద్యమకారులు అరెస్ట్
కరీంనగర్ : జనగామ జిల్లా కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగిన 12 మంది ఉద్యమకారులను పోలీసులు బుధవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అనంతరం వారిని జనగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జనగామ ప్రత్యేక జిల్లా కోసం ఆందోళన చేస్తున్న పలువురు రాజకీయ, విద్యార్థి, యువజన సంఘాల నాయకుల ఇళ్లపై కూడా పోలీసులు దాడి చేశారు. ఆ తర్వాత వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని... పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
పిన్ నంబర్ అడిగాడు.. డబ్బు డ్రా చేశాడు
జనగామ : ‘హలో.. మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ ఏటీఎం రెన్యువల్ చేసుకోవాలి.. పిన్ నంబర్ చెప్పండి’ అంటూ ఓ సైబర్ నేరగాడు జనగామ పట్టణానికి చెందిన చిరు వ్యాపారి ఎండీ.జహంగీర్‌కు మంగళవారం ఫోన్ చేశాడు. సెల్ నంబర్ 8404860148 నుంచి కాల్ వచ్చింది. జహంగీర్ తన ఏటీఎం కార్డు పిన్ నంబర్ చెప్పిన నిమిషాల వ్యవధిలోనే సైబర్ నేరగాడు రూ.49,500 డ్రా చేశాడు. అనంతరం ఎస్బీఐకి వెళ్లి అకౌంట్ వివరాలు పరిశీలించగా, డబ్బులు డ్రా అయ్యాయని గ్రహించారు. ఖాతాలో ఉన్న మిగితా రూ.29వేలను వెంటనే జహంగీర్ డ్రా చేసుకున్నాడు. దీనిపై తమకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై సంతోషం రవీందర్ తెలిపారు. -
సీఎం, హరీశ్, కడియం చిత్రపటాల ఫ్లెక్సీ దహనం
జనగామ : జనగామ జిల్లాకు అన్యాయం చేసి న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, డిప్యూ టీ సీఎం కడియం శ్రీహరి చిత్రlపటాలు ఉన్న ఫ్లెక్సీని సోమవారం దహనం చేశారు. జేఏసీ నాయులు తీగల సిద్దూగౌడ్, నాగారపు వెంకట్, పిట్టల సత్యం, బండి రాకేష్ కుమార్, ఆలేటì సిద్దిరాములు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జిల్లా ఏర్పాటుకు అన్ని అర్హతలున్న జనగామకు అన్యాయం చేసి చరిత్రను కనుమరుగు చేస్తున్నారని మండిపడ్డారు. -
జనగామకు చీకటి రోజు
మా గొంతు కోయకండి ఆరు మండలాలతో రెవెన్యూ డివిజనా? ఈ ప్రాంత ప్రజలకు సీఎం సమాధానం చెప్పాలి జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి నేటినుంచి ఆమరణ దీక్ష.. అన్ని పార్టీల మద్దతు జనగామ : నూతన జిల్లాల ముసాయిదా ప్రకటనతో జనగామలో చీకట్లు కమ్ముకున్నాయని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి అన్నారు. పట్టణంలోని జూబ్లీ గార్డెన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, పోకల లింగయ్య, నాగారపు వెంకట్‌తో కలిసి మాట్లాడారు. జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకటించి, సంబురాలు చేసుకోమంటున్న సీఎం కేసీఆర్, జనగామ ప్రజలు ఏం చేయాలో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో ముఖ్యభూమిక పోషించినందుకే ఈ శిక్ష వేశారా అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని, శాస్త్రీయ పద్ధతిలో జిల్లాలను చేస్తామని ప్రకటించిన సీఎం, ఏకపక్షంగా డ్రాఫ్ట్‌ను ప్రకటించడం సిగ్గుచేటన్నారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్లోనూ రెవెన్యూ డివిజన్ పరిధిలో కలిపిన మండలాల జాబితాలో జనగామ పేరు గల్లంతు చేశారని విమర్శించారు. జనగామ కో సం పది మండలాల ప్రజలు ఉద్యమాలు చే స్తుంటే, వద్దంటున్న హన్మకొండ, నిర్మల్ జిల్లాలను చేయడమేంటని ప్రశ్నించారు. సిద్దిపేట, అర్భన్ రెండు మండలాలు చూపించిన ప్రభుత్వం, జనగామ మున్సిపాలిటీ, రూరల్‌ను ఒకే మండలంగా గుర్తించడంలో ఆంతర్యమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ స్థాయికి దిగజార్చారు.. పది మండలాలతో రెవెన్యూ డివిజన్‌గా కొనసాగుతున్న జనగామకు ఆరు మండలాలను మాత్రమే కేటాయించి, గ్రామపంచాయతీ స్థాయికి దిగజార్చారని దశమంతరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నేటి నుంచి ఆమరణ దీక్ష.. నూతన జిల్లాల ముసాయిదాలో జనగామకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నేటి నుంచి ఆమరణ దీక్ష చేపడతానని దశమంతరెడ్డి ప్రకటించారు. అన్ని పార్టీలు పూర్తి మద్దతు ప్రకటించాయని తెలిపారు. జనగామ జిల్లా ప్రకటించేవరకూ దశల వారీగా ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు తీగల సిద్దూగౌడ్, ఆలేటి సిద్దిరాములు, సత్యం, కాసుల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
జనగామ జిల్లా కోసం కొనసాగుతున్న ఆందోళన
జనగామ(వరంగల్ జిల్లా): జనగామను జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ స్థానికులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. జనగామ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భారీ ఎత్తున పోలీసులను మోహరించింది. ఆందోళనలకు దిగిన వారిని ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు. నిరసనకు దిగిన సుమారు 300 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రే పలువురు జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంబర్తి, రఘనాథపల్లి మండలాల్లో 1000 మంది విద్యార్థులు జనగామ జిల్లా కోసం ఆందోళనకు దిగారు. -
జనగామ బంద్ సంపూర్ణం
144 సెక్షన్ అమలుతో నిశ్శబ్ద విప్లవం జేఏసీ నాయకులపై పోలీసుల నిఘా జనగామ : జనగామ జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో జేఏసీ పిలుపునిచ్చిన 48 గంటల బంద్ మొదటి రోజు విజయవంతమైంది. జేఏసీ చైర్మెన్ ఆరుట్ల దశమంతరెడ్డి నాయకత్వంలో శనివారం మొదటి రోజు బంద్‌లో అన్నివర్గాల ప్రజలు పాల్గొని జిల్లా కావాలనే బలమైన సంకేతాన్ని మరోసారి చూపించారు. పట్టణంతో పాటు డివిజన్లోని పలు మండల కేంద్రాల్లో బంద్ విజయవంతంగా సాగుతోంది. పెట్రోలు బంక్‌లు, సినిమాహాళ్లు, జ్వువెల్లర్స్, కిరాణ, వస్త్ర దుకాణాలు మూసివేయడంతో జనగామ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా ని మారిపోయాయి. 144 సెక్షన్ అమలులో ఉండడంతో నిశ్శబ్ధ విప్లవం సృషించారు. రహదారులపై గ్రూపులుగా తిరగరాదంటూ పోలీసులు ప్రచారం చేస్తూ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో మంత్రుల సబ్‌కమిటీ సమావేశంలో ప్రజాప్రతిని ధులు, అధికారులతో చర్చ సాగనున్న నేపథ్యంలో బంద్ ప్రభావం ఏ మేరకు లాభం చేకూరుతుందో చూడాలి. గతం లో ఎన్నడూ లేని విధంగా బంద్‌కు మంచి స్పదన రావడంతో జేఏసీ నాయకులు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఢిల్లీ దాకా.. డోలు మోత
వికసించిన ఒగ్గుడోలు విన్యాసం స్వాతంత్య్ర వేడుకల్లో ప్రదర్శనకు మొదటిసారి ఎంపిక తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దం చుక్క సత్తయ్య ఆధ్వర్యంలో జనగామ డివిజన్లో కళాకారులకు ప్రత్యేక శిక్షణ విచిత్ర వేషధారణ.. చేతిలో డోలు.. లయబద్ధంగా కొనసాగే విన్యాసాలు.. ఒళ్లు గగుర్పొడిచే తల్వార్ల ప్రదర్శన.. ఇవన్నీ ఒగ్గుడోలుకు సంబంధించిన దృశ్యాలు. పదిమంది కళాకారులు ఒకరిపై ఒకరు నిలబడి డోలు వాయి ద్యం చేస్తుంటే రెండు కళ్లు చాలవు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే ఓరుగల్లు.. ఒగ్గుడోలు ప్రదర్శన ఢిల్లీ, హైదరాబాద్‌లో జరిగే పంద్రాగస్టు వేడుకలకు మెుదటిసారిగా ఎంపికైంది. ఈ నేపథ్యంలో ఒగ్గుడోలు విశిష్టత, కళాకారుల విన్యాసాలపై ప్రత్యేక కథనం. –జనగామ త్రిపురాసురులైన రాక్షసులను.. శివుడు సంహరించే సమయంలో తన శక్తియుక్తులు సరిపోకపోవడంతో అమ్మ వారైన చండీకామాతను వేడుకుంటాడు. అయితే రాక్షస సంహారంలో శివుడు తన శక్తియుక్తులు కోల్పోతున్న సమయంలో అమ్మవారు ప్రత్యక్షమవుతారు. ఈ క్రమంలో రాక్షసులను సంహరించే సమయంలో శివుడి రక్తం నేలపై పడకుండా చండీకామాత మింగేస్తుంది. యుద్ధంలో శివుడు విజయం సాధించిన తర్వాత ఇద్దరు కలిసి ఢమరుక నాదాల మధ్య శివతాండవం చేస్తారు. పరమేశ్వరుడి అర్ధ భాగమైన చండీకామాత వద్ద ఉన్న ఢమరుకం శివుడి చేతిలోకి రావడంతో పూజలు చేస్తున్న ఒగ్గు పూజారులకు మల్లికార్జునుడి రూపంలో వచ్చి దానిని అప్పగిస్తాడు. శివుడి చేతిలో ఉన్న ఢమరుకాన్ని అందుకున్న నాటి నుంచి ఒగ్గు పూజారులు.. డోలు కళాకారులుగా కీర్తించబడుతూ మల్లన్న సేవలో తరిస్తున్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక ఒగ్గు కథ, ఒగ్గు డోలు విన్యాసాలు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయి. కళలకు, కళాకారులకు పుట్టినిల్లుగా పేరొందిన వరంగల్ జిల్లాలోని జనగామ డివిజన్ ప్రాంతానికి చెందిన కళాకారులు డోలు విన్యాసంలో తమదైన ప్రతిభను చాటుతున్నారు. లయబద్ధంగా చేసే వాయిద్యాలు, కాలి అందెల సవ్వడి, ఒళ్లు గగుర్పొడిచే విన్యా సాలతో వారు ప్రజలను మంత్ర ముగ్ధులను చేస్తున్నారు. కాగా, విచిత్ర వేషధారణ, పోతరాజుల పొలికేకలు, పిర మిడ్ విన్యాసాలు కళాకారుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. పండుగలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారాలు ఇలా ఏదైన ఒగ్గుడోలు విన్యాసాలు ప్రజల మదిలో నిలిచిపోతున్నాయి. చుక్క సత్తయ్యకు మణిహారం ఒగ్గు కథ పితామహుడు చుక్క సత్తయ్యకు మణిహారంగా ఒగ్గు డోలు విన్యాసాలు నిలిచాయి. డివిజన్లోని లింగాలఘణపురం మండలం మాణిక్యాపురానికి చెందిన చెందిన చుక్క సత్తయ్య దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు పొరుగు దేశాల్లో కూడా ఒగ్గుకథ ప్రదర్శనలు ఇచ్చి ఎంతో మంది మన్ననలు పొందారు. ఒగ్గు కథ మాదిరిగానే ఒగ్గు డోలు విన్యాసాలు కూడా అదే స్థాయిలో జనగామ డివిజన్లో అభివృద్ధి చేసేందుకు చుక్క సత్తయ్య తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ మేరకు శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఆసక్తి కలిగిన కళాకారులకు డోలు విన్యాసాలు నేర్పిస్తున్నారు. ఇందులో భాగంగా 27 రాష్ట్రాల్లో ఆరు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి ఒగ్గు డోలు విన్యాసాల ప్రాధాన్యతను వెలుగులోకి తీసుకొస్తున్నారు. చుక్క సత్తయ్య శిష్యుల్లో ఒకరైన మాణిక్యాపురానికి చెం దిన చౌదరిపల్లి రవికుమార్ డోలు విన్యాసంలో తన బృందంతో జిల్లాతోపాటు ఇతర రాష్ట్రాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఇటీవల హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో అద్భుత ప్రతిభను కనబరిచారు. 220 మంది కళాకారుల ఎంపిక జనగామ డివిజన్‌కు చెందిన ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త విన్యాసాలతో సౌత్ ఇండియా ట్రెడిషియన్ను ఆకట్టుకునే విధంగా వీరశైవ సంప్రదాన్ని పాటిస్తూ ఉంటుంది. చూడగానే అబ్బో అనిపించే విధంగా మేకప్‌లు.. రంగు రంగుల కాస్ట్యూమ్స్‌పై వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. రౌద్రం, ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉండే తల్వార్ల ప్రదర్శన, ఒకరిపై ఒకరు వరుసగా పది మంది నిలబడి డోలు కొడుతూ వీక్షకులకు కనువిందు చేస్తుంటారు. అయితే పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని భారత ప్రభుత్వం ‘భాగర్ పర్వ్’ పేరిట వారం రోజుల పాటు ఢిల్లీ పరేడ్‌గ్రౌండ్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కళా ప్రదర్శనలు నిర్వహించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం జనగామ నుంచి ఒగ్గు కళాకారులను ఎంపిక చేసి పంపించగా వారు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఈ మేరకు వారు తొలిసారిగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శనలు సిద్ధమయ్యారు. కాగా, రెం డు ప్రాంతాల్లో జరిగే వేడుకలకు జనగామ డివిజన్లోని లింగాలఘణపురం (మాణిక్యాపురం), బచ్చన్నపేట, మద్దూరు, జనగామ మండలాలకు చెందిన 220 మంది కళాకారులు ఎంపికయ్యారు. ఇందులో 20 మంది నేడు (ఆదివారం) ఢిల్లీకి బయలు దేరనున్నారు. చాలా సంతోషంగా ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఒగ్గుడోలు విన్యాసాలను స్వాతంత్య్ర వేడుకల్లో ప్రదర్శించేందుకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను బతికిస్తున్న ఒగ్గు కళాకారులకు గుర్తింపు రావడం ఆనం దంగా ఉంది. కళలు కళ కోసం కాదు.. ప్రజల కోసం అని ప్రభుత్వాలు మరోసారి గుర్తించాయి. – చుక్క సత్తయ్య, ఒగ్గుకథ పితామహుడు కళాకారుల ప్రదర్శన చూసి మురిసిపోవాలె జనగామ డివిజన్‌కు చెందిన ఒగ్గు కళాకారులు చుక్క సత్తయ్య చేతిలో మెరికల్లా తయారయ్యారు. కైలాసంలో ఉన్న పరమేశ్వరుడే పులకించే విధంగా డోలు విన్యాసం మోగిస్తారు. ఒక్కో స్టెప్పు.. స్టెప్పు స్టెప్పునకు మారుతున్న శబ్దం.. ఇలా గంటల పాటు డోలు మోగించే కళాకారులు వేలల్లో ఉన్నారు. ఢిలోలో జరిగే ప్రంద్రాగస్టు వేడుకలకు మొట్టమొదటి సారిగా ఒగ్గుకళకు అరుదైన గౌరవం దక్కింది. దీనికి కారణం సీఎం కేసీఆర్ ప్రభుత్వం. – చౌదరపల్లి రవికుమార్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఒగ్గు కళాకారుల కోఆర్డినేటర్ -
జనగామలో మరోసారి ఉద్రిక్తత
జనగామ: జనగామను జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ రోజు రోజుకు ఎక్కువవుతోంది. తాజాగా జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆందోళనకు దిగిన జేఏసీ నాయకులు అంబేడ్కర్ విగ్రహం కళ్లకు గంతలు కట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న స్పీకర్ మధుసూదనా చారి కాన్వాయ్‌ని అడ్డుకోవడానికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. నేటి నుంచి 48 గంటల జనగామ నిరవధిక బంద్ నేపథ్యంలో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ప్రధాని సభలో జనగామ జిల్లా నినాదం
జనగామ : తెలంగాణ రాష్ట్రానికి ప్రప్రమథంగా వచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ మహా సమ్మేళన సభలో జేఏసీ నాయకులు జనగామ జిల్లా నినాదాలతో హోరెత్తించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రధాని సభలో పలువురు జేఏసీ నాయకులు అన్ని అర్హతలు ఉన్న జనగామను జిల్లా చేయాలని ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. జనగామ జిల్లా విషయమై బీజేపీ నేతలు రాష్ట్రనాయకులతో కలిసి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు జిల్లా సాధాన కమిటీ కన్వీనర్ మంగళంపల్లి రాజు తెలిపారు. -
జిల్లాపై కడియం స్పష్టత ఇవ్వాలి
లేనిపక్షంలో ఆయన పర్యటనలో నిరసన తప్పదు 9న చలో హైదరాబాద్ జనగామ జేఏసీ చైర్మన్ దశమంతరెడ్డి జనగామ : జనగామ జిల్లాపై స్పష్టత ఇచ్చిన తర్వాతనే డిప్యూటీ సీఎం కడి యం శ్రీహరి హరితహారం కార్యక్రమానికి హాజరుకావాలని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి అన్నారు. పట్టణంలో సోమవారం జరిగిన జేఏసీ స మావేశంలో 15 రోజుల కార్యచరణ ప్రకటించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దశమంతరెడ్డి మాట్లాడారు. ఈనెల 4న జనగామలో జరిగే హరితహారంలో పాల్గొనేం దుకు రానున్న కడియం శ్రీహరి జిల్లాపై స్పష ్టత ఇవ్వకుండా వస్తే నిరసనలు తప్పవని హె చ్చరించారు. తెలంగాణ సాయుధ పోరా టం నుంచి స్వరాష్ట్రంకోసం సాగిన ఉద్యమంలో సైతం లేని విధంగా నెల రోజులుగా 144 సెక్ష న్ అమలు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. పట్టణంలో అప్రకటిత క ర్ఫూ్య వాతావరణం నెలకొందని, దీనికి పూర్తి బాధ్యత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వహించాలన్నా రు. 144 సెక్షన్ తో శాంతి యుత ఉద్యమాలపై ఉక్కుపా దం మోపుతున్నారని మండిపడ్డారు. 144 సెక్షన్‌పై ఆర్డీవోను కలిసిన అనంతరం హైకోర్టులో రిట్ వేస్తామని తెలిపారు. -
జనగామ జిల్లా మా జన్మ హక్కు
జిల్లా ఏర్పాటు కోరుతూ కరపత్రాల పంపిణీ బచ్చన్నపేట : జనగామ జిల్లా మా జన్మ హక్కు అని ఉస్మానియా యునివర్సిటీ విద్యార్థి బాల్ లక్ష్మి, జెడ్పీటీసి వేముల స్వప్నసాగర్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి, జనగామ జిల్లా సాధన మా జన్మహక్కు అనే కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడు తూ అన్ని వసతులు ఉన్న జనగామను జిల్లా కేంద్రంగా ప్రకటించకుండా ఉండడంలో అధికారుల నిర్లక్ష్యం ఉందన్నారు. అన్ని రంగాల్లో జనగామ నియోజకవర్గం వెనకబడి ఉన్నదనీ, జిల్లా చేస్తే అభివృద్ధిపథంలో పయనిస్తుందన్నారు. చేర్యాల ప్రాంతంలో నీటి డ్యాములు ఉన్నందున దీనిని సిద్దిపేట జిల్లాలో కలుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేసే ముందు ఆ ప్రాంత ప్రజల అభిప్రాయాలను సేకరించాల్సి ఉంటుందనీ, అయినా ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే అందరినీ కలుపుకుని పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వీరి వెంట నాయకులు రాపెల్లి వెంకటేష్, పందిపెల్లి సిద్దిరాంరెడ్డి, మల్లం లక్ష్మినారాయణ, అట్ల సందీప్, పెండెం నాగేష్, గౌస్, మంత్రి అయిలు మల్లయ్య, మహేందర్, నారాయణరెడ్డి, బొమ్మెన అంజనేయులు, ప్రకాష్, నేరెళ్ల రాజయ్య, నల్లగోని బాలకిషన్, రాగీరు సత్యనారాయణ ఉన్నారు. -
ర్యాగింగ్‌కు ఇంటర్ విద్యార్థి బలి
-
ర్యాగింగ్‌కు ఇంటర్ విద్యార్థి బలి
జనగామ (వరంగల్) : ర్యాగింగ్ భూతానికి ఓ విద్యార్థి బలయ్యాడు. వరంగల్ జిల్లా జనగామలోని వాగ్దేవి జూనియర్ కాలేజీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రవీణ్(16)ను రెండో సంవత్సరం చదువుతున్న ఉమేష్ తీరు మార్చుకోమని హెచ్చరించాడు. దీంతో మనస్తాపానికి గురైన ప్రవీణ్ ఈ నెల 3న తేదీన ఉమేష్‌తో గొడవపడి.. పరస్పరం దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్ర గాయాలైన ప్రవీణ్ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. కుమారుడిపై కళాశాలలో దాడి జరిగిన విషయాన్ని దాచిన యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
జనగామ బంద్ సంపూర్ణం
స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రజానీకం నిర్మాణుష్యంగా మారిన రహదారులపై పోలీసుల నిఘా నిలిచిన వైద్య సేవలు మెడికల్ జాక్, ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల నిరసన జనగామ : జనగామ జిల్లా ఆకాంక్షను కోరుతూ శుక్రవారం జేఏసీ తలపెట్టిన స్వచ్ఛంద బంద్ విజయవంతంగా ముగిసింది. వ్యాపార వర్గాల తో పాటు ప్రతి ఒక్కరు బంద్‌లో పాల్గొని తమ నిరసనను తెలిపారు. ‘అన్ని వనరులున్న జనగామను ముక్కలు చేయకుండా జిల్లా చేయాలి’ అంటూ ప్రతి దుకాణం ఎదుట వ్యాపారులు స్వ చ్ఛందంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. అక్రమంగా అరెస్టు చేసిన ఉద్యమ కారులను వి డుదల చేసి, 144 సెక్షన్ ఎత్తివేయాలని కోరు తూ బంద్‌కు పిలుపునిచ్చారు. డీఎస్పీ పద్మనాభ రెడ్డి ఆధ్వర్యంలో సీఐలు చెన్నూరి శ్రీనివాస్, తిరుపతి పర్యవేక్షణలో సబ్ డివిజన్‌తో పాటు వరంగల్, మహబూబాబాద్. నర్సంపేట డివిజ న్లోని పోలీసులు, పారా మిలటరీ బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్-హైరాబాద్ జాతీయ రహదారిపై నలుదిక్కు లా పోలీసులు టెంట్లు వేసుకుని నిఘా ఏర్పాటు చేశారు. వారం రోజులుగా 144 సెక్షన్ అమలు లో ఉండడంతో ధర్నాలు, రాస్తారోకోలు లేకపోవడంతో ప్రధాన చౌరస్తా మూగబోయింది. మెడికల్ జాక్ ఆధ్వర్యంలో మూడు మెడికల్ షా పులు మినహా పూర్తి స్థాయిలో వైద్య సేవలను నిలిపి వేశారు. ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు నిరసన తెలిపారు. శాంతియుతంగా నిరసనలు జనగామ జిల్లా చేయాలని సకల జనులు శాంతి యుతంగా తమ ఆకాంక్షను తెలియజేస్తున్నారు. పట్టణంలో 144 సెక్షన్ కొనసాగుతున్నప్పటికీ ప్రజలు మాత్రం ప్రభుత్వానికి నిరసన సెగలు కల్పిస్తున్నారు. రహదారులపై ఇద్దరు కంటే ఎక్కువగా కనిపిస్తే అరెస్ట్ చేస్తామంటూ పోలీ సులు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు నిశ్శబ్ధ విప్లవాన్ని సృష్టిస్తున్నారు. గతంలో ఎన్న డూ లేని విధంగా స్వచ్ఛందంగా బంద్ పాటిం చేందుకు ప్రజలు ముందుకు రావడంతో జనగామ 24 గంటల పాటు నిర్మాణుష్యంగా మారి పోయింది. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభు త్వ కార్యాలయాల ఎదుట ఎస్ఐ స్థాయి అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన హరితహా రం కార్యక్రమంలో విద్యార్థుల ర్యాలీలు, వారి భాగస్వామ్యం లేకుండా పోయింది. ప్రజల ఆకాంక్షను గుర్తించాలి : మాజీ ఎమ్మెల్యే జిల్లా ఆకాంక్షను తెలుపుతూ దేశ చరిత్రలో మునుపెన్నడూ జరగని విధంగా జనగామ ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారని మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. శాంతియుత వాతావరణంలో 144 సెక్షన్‌ను కొనసాగించడం ప్రజల హక్కులను హరించడమేనని, వెంటనే దానిని ఎత్తివేయాలని కోరారు. -
జనగామ నుంచే టీఆర్ఎస్ పతనం
భయభ్రాంతులతో ఉద్యమాలను అడ్డుకోలేరు తెలంగాణ పోరాటంలో తప్పుడు కేసులు లేవు సబ్‌జైలులో జేఏసీ నాయకులను పరామర్శించిన పొన్నాల జనగామ : ప్రజాస్వామ్యయుతంగా జనగామ జిల్లా కోసం చేస్తున్న ఉద్యమాలను అణచివేసే ధోరణిని ప్రభుత్వం మానుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సూచించా రు. జిల్లా ఉద్యమంలో అరెస్ట్ అయి జనగామ సబ్‌జైలులో ఉన్న జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి, డాక్టర్ లక్ష్మీనారాయణ నా యక్, ఆకుల వేణుగోపాల్‌రావును బుధవారం ఆయన పరామర్శించారు. అనంతరం పొన్నాల విలేకరుల తో మాట్లాడుతూ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన సీఎం కేసీఆర్, జనగామలో అందుకు వ్యతిరేకంగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పతనం వరంగల్ జిల్లా జనగామ నుంచి మొదలైం దని హెచ్చరించారు. కేసులు, పోలీసుల లాఠీలకు భయపడి వెన కంజ వేసే ప్రసక్తేలేదన్నారు. భయభ్రాంతులకు గురి చేస్తే ఉద్యమాలు మరింతం ఎగిసిపడతాయన్నారు. తెలంగాణ ఉద్యమం లో మంత్రులపై దాడులు చేస్తేనే ఆకాంక్షతో చేశారని ఊరుకున్నా మే తప్ప, ఒక్క కేసు, రిమాండ్ చేయలేదన్నారు. జనగామ జిల్లా కోసం శాంతియుతంగా ఉద్యమాలు చేస్తుంటే, రెచ్చగొట్టే విధం గా అక్ర మ కేసులను బనాయించి, 144 సెక్షన్ పేరుతో అలజడి సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఎన్నికల సమయంలో కొత్త జిల్లాల జాబి తాలో 11వ పేరు జనగామ అని ప్రకటించిన సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలని హితవు పలికారు. నాయకులు పీవీ శ్రీనివాస్, వెన్నెం వెంకటనర్సింహారెడ్డి, రంగరాజు ప్రవీణ్‌కుమార్, ఖాదర్ షరీఫ్, రంగు రవి, వనజారెడ్డి, జమాల్షరీప్, మేకల రాంప్రసాద్, బుచ్చిరెడ్డి, గౌస్, వేమెళ్ల పద్మ, వెన్నెం శ్రీలత, నజీర్, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. -
నిఘా నీడలో ‘జనగామ’
పట్టణంలో కొనసాగుతున్న 144 సెక్షన్ ఐదు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై కేసులు జనగామ : జనగామలో జిల్లా కోసం జరుగుతున్న ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం కొనసాగుతుంది. నాలుగు రోజులుగా పట్టణం పోలీస్ నిఘా నీడలోనే ఉంది. ఇటీవల జరిగిన రాస్తారోకోలో గుర్తు తెలియని వ్యక్తులు బస్సు దగ్ధం, వాహనాల అద్దాలను ధ్వంసం చేయడం తో ఉద్యమ స్వరూపం ఒక్కసారిగా పోలీసుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో జిల్లాలోని పారా మిలటరీ బలగాలతో పాటు జనగామ, నర్సంపేట, మహబూబాబాద్, వరంగల్ డివి జన్ పరిధిలోని పోలీసులను పెద్ద సంఖ్యలో రంగంలోకి దింపారు. అలాగే పట్టణంలో 144 సెక్షన్‌ను అమలులోకి తీసుకువచ్చారు. ఉద్యమకారులను అరెస్టు చేసి జైలుకు పంపించిన పో లీసులు, అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుండడంతో రహదారిపైకి రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. విడతల వారిగా ఉద్యమకారులను అరెస్టు చేస్తూ రిమాం డ్కు పంపిస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. జిల్లా ఉద్యమంలో తాము సైతం అంటూ ఆందోళనకు బా సటగా నిలిచిన ప్రైవేట్ పాఠశాలలకు చెందిన యాజమాన్యాలపై కేసులు నమోదుచేశారు. అ డుగడుగునా పోలీసుల వాహనం తో 144 సెక్ష న్ అమలులో ఉందంటూ మైక్ ద్వారా పోలీ సులు ప్రచారం చేస్తున్నారు. పోలీ సులు ఉక్కుపాదంతో ఉద్యమాన్ని అణచివేయాలని చూ స్తుంటే, ఉద్యమకారులు మాత్రం జిల్లా సాధిం చే వరకు తలపెట్టిన పోరు వదిలి పెట్టమని తే ల్చి చెబుతున్నారు. అక్రమ కేసులపై పో రాటం చేస్తామని వడుప్సా ప్రతినిధులు అం టుండ గా.. వైద్య సేవలను నిలిపివే స్తామని మెడికల్ జాక్ ప్రకటించడంతో ఉద్యమ స్వరూపం మరింత వేడెక్కే అవకాశం ఉంది. -
జైల్ భరో ఉద్రిక్తం
పోలీసుల కన్నుగప్పి చౌరస్తాలో ప్రత్యక్షమైన జేఏసీ నాయకులు ఒక్కసారిగా ఉరుకులు, పరుగులు పెట్టిన పోలీసులు 32 మందిపై కేసు నమోదు, అరెస్ట్ మద్దూరు పీఎస్‌కు తరలింపు జనగామ : జిల్లా కోసం జేఏసీ తలపెట్టిన జైల్ భరో కార్యక్రమంతో జనగామలో ఉత్కంఠ నెలకొంది. జేఏసీ చైర్మన్ కోసం పోలీసుల వెతుకులాట.. జైల్ భరోను భగ్నం చేసేందుకు పకడ్బందీ వ్యూహాల నడుమ సోమవారం జనగామలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం వరకు ని ర్మాణుష్యంగా ఉన్న ఆర్టీసీ చౌరస్తాలో ఒక్క సారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. జాతీయ రహదారిపై నలుదిక్కులా కాపలా ఉన్న పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. పోలీసులు రహదారికి రెండు వైపులా గట్టి బందోబస్తు చేపట్టారు. ఉదయం స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి కాన్వాయ్ ఆర్టీసీ చౌరస్తా మీదుగా వెళ్లిపోవడం తో వారు ఊపిరి పీల్చుకున్నారు. హైవేపై దృష్టి సారిస్తున్న పోలీసుల కన్నుగప్పి జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి, ప్రతినిధి డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, జేఏసీ నాయకుడు ఆకుల వేణు గోపాల్‌రావులు ఉదయం 11.00 గంటలకు ఒక్కొక్కరుగా ఆర్టీసీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రత్యక్షమయ్యారు. అంతలోనే తేరుకున్న పోలీసులు వారిని పట్టుకుని ప్రత్యేక వాహనంలో ఎక్కించేందుకు ప్రయత్నించడంతో రోడ్డుపై బైఠాయించారు. పోలీసులతో పెనుగులాడిన దశమంతరెడ్డిని బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించి, పీఎస్‌కు తరలించారు. మరో నాయకుడు ఆకుల వేణుగోపాల్‌రావు తప్పించుకుని స్టేషన్‌కు వెళ్లే క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతలోనే డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ అక్కడకు చేరుకుని అంబేద్కర్ విగ్రహం ఎదు ట బైఠాయించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించుకుంటున్న జక్కుల వేణుమాధవ్‌తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకోవడంతో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జేఏసీ చైర్మన్‌తో పాటు మరో 31 మందిని పటిష్ట బందో బస్తు మధ్య మద్దూరు పీ ఎస్‌కు తరలించారు. కాగా, రైల్వేస్టేషన్, కోర్టు, ఏరియా ఆస్పత్రిలో బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టారు. -
రాజీనామాలు చేసి ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తాం - టీఆర్ఎస్
లింగాలఘణపురం: జనగామ జిల్లా సాధన కోసం ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారంతా రాజీనామాలు చేసి ఉద్యమ కా ర్యచరణ ప్రకటిస్తామని టీఆర్ఎస్ నాయకులు ప్రకటించారు. ఆదివారం మండల కేంద్రంలో ని గౌడ సంఘం భవనంలో జే ఏసీ నాయకుడు బోయిని రా జు, సర్పంచుల ఫోరం మండల ప్రధాన కార్యదర్శి శ్రీనువాసు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మధు విలేకరులతో మాట్లాడారు. జనగామ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే సాగుతున్న ఉద్యమంలో తాము కూడా భాగస్వాములమవుతామన్నారు. సమావేశంలో సర్పంచులు విజయ్‌భాస్కర్, మ దార్, మల్లారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు రేగు అంజయ్య,తదితరులు పాల్గొన్నారు. పటేల్‌గూడెంలో రాస్తారోకో జనగామ జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం జనగామ - సూర్యాపేట రోడ్డులో పటేల్‌గూడెం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. కార్యక్రమం లో బీజేపీ మండలాధ్యక్షుడు రమేష్‌రెడ్డి, జేఏసీ నాయకుడు రాజు పాల్గొన్నారు. -
జనగామలో కొనసాగుతున్న బంద్
జనగామ: వరంగల్ జిల్లాలోని జనగామను ప్రత్యేక జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా జేఏసీ పిలుపు మేరకు రెండో రోజు శనివారం కూడా బంద్ కొనసాగుతోంది. జిల్లా జేఏసీ ఆందోళనలో భాగంగా శుక్రవారం పట్ఠణంలో జరిగిన కార్యక్రమాల్లో ఆందోళనకారులు ఆర్టీసి బస్సును దహనం చేసిన సంగతి తెలిసిందే. దీంతో పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సీఐ చెన్నూరి శ్రీనివాస్ తెలిపారు. బంద్ నేపథ్యంలో పట్టణంలోని వాణిజ్య, వ్యాపార సంస్థలతో పాటు విద్యాసంస్థలు కూడా మూతబడ్డాయి. యశ్వంత్‌పూర్ శివారులోని వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై పరిసర గ్రామాల ప్రజలు రాస్తారోకో చేశారు. దీంతో 5 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళకారులతో చర్చించి ఆందోళనను విరమింపజేశారు. డీఎస్పీ పద్మనాభరెడ్డి పర్యవేక్షణలో సబ్‌డివిజన్‌లోని పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. శుక్రవారం జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు వరంగల్, మహబూబాబాద్, నర్సంపేట నుంచి అదనంగా పోలీసు బలగాలను జనగామకు రప్పించారు. దీంతో ఈ రోజు కూడా ఉత్కంఠ నెలకొంది. -
జనగామ జిల్లా పోరు ఉద్రిక్తం
- ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇంటి ముట్టడికి యత్నం - లాఠీచార్జి... ఆర్టీసీ బస్సును తగలబెట్టిన ఉద్యమకారులు జనగామ: వరంగల్ జిల్లాలోని జనగామను జిల్లా చేయాలన్న ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోంది. జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం తలపెట్టిన జనగామ బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల ముందుస్తు అరెస్టులతో మరింత వేడి రగిలి, రణరంగంగా మారింది. జనగామ జిల్లా ఏర్పాటు చేయూలని డిమాండ్ చేస్తూ అన్ని వర్గాల ప్రజలు వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపైకి వచ్చారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, వ్యాపార, వాణిజ్య, కార్మిక వర్గాలతో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు రహదారిని దిగ్బంధించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రాస్తారోకో మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. ఒక్కసారిగా ఉద్రిక్తం... శాంతియుతంగా జరుగుతున్న ఆందోళన ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఉద్యమకారులు కొంత మంది హైదరాబాద్ రహదారిలో ఉన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. పోలీసు వలయాన్ని ఛేదించుకుంటూ ఎమ్మెల్యే ఇంటివైపు వెళుతుండడంతో పోలీసులు పలుమార్లు లాఠీచార్జి చేశారు. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. జేఏసీ ప్రతినిధి ఆకుల సతీశ్‌ను బలవంతంగా జీపులో ఎక్కించుకున్న పోలీసులు... మరికొందరు యువకులను లాక్కెళ్లారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద ఆందోళన కొనసాగుతుండగానే గుర్తుతెలియని వ్యక్తులు హైదరాబాద్ రోడ్డుపైనున్న జనగామ డిపో ఆర్టీసీ బస్సుకు నిప్పంటించారు. మంటలా ర్పేందుకు వచ్చిన ఫైరింజన్‌ను మున్సిపల్ చైర్మన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, టీఆర్ఎస్, జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో బస్సు పూర్తిగా తగలబడిపోయింది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆందోళన కొనసాగింది. ట్రాఫిక్ పెద్దఎత్తున నిలిచిపోరుుంది. కాగా, ఉద్యమకారులపై పోలీసుల లాఠీచార్జికి నిరసనగా శనివారం జనగామ నియోజకవర్గ బంద్ నిర్వహించనున్నట్టు జేఏసీ చైర్మన్ దశమంతరెడ్డి తెలిపారు. -
రణరంగంగా మారిన జనగామ
జనగామ జిల్లా పోరు ఉద్రిక్తం జనగామలో జిల్లా పోరు రణరంగంగా మారింది. జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం తలపెట్టిన బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. జనగామ జిల్లా ఏర్పాటు చేయూలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు, వ్యాపార, వాణిజ్య, కార్మిక వర్గాలతో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు రహదారిని దిగ్బంధించారు. రాస్తారోకో కొనసాగుతుండగానే నిరసనకారులు ఆర్టీసీ బస్సుకు నిప్పంటించడంతో తీవ్ర అలజడి రేగింది. పోలీసులు లాఠీచార్జి చేసి అందరిని చెదరగొట్టారు. మంటలు ఆర్పేందుకు వస్తున్న అగ్నిమాపక వాహనాన్ని కూడా ఆందోళనకారులు అడ్డుకోవడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. నిరసనలతో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. - జనగామ * జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధం * బస్సుకు నిప్పంటించిన నిరసనకారులు * 20 వాహనాలు ధ్వంసం.. పోలీసుల లాఠీచార్జి జనగామ : జనగామను జిల్లాగా ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌తో చేపట్టిన ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోంది. ఇందులో భాగం గా జేఏసీ ఆధ్వర్యాన శుక్రవారం బంద్‌కు పిలుపునివ్వగా.. ఉద్యమకారుల ఆందోళనతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జేఏసీ తో పాటు వివిధ సంఘాల నాయకులు, స్థానికులు పెద్దసంఖ్యలో రోడ్డుపైకి చేరుకుని ఆందోళనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై నాలుగున్నర గంటల పాటు రాస్తారోకో చేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తొలుత ప్రకటించిన నూతన జిల్లాల జాబితాలో లేకున్నా నిర్మల్ జిల్లాకు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఉద్యమ కారుల ఆవేశం కట్టలు తెంచుకుంది. బంద్‌ను భగ్నం చేయడానికి పోలీసులు ముందస్తు అరెస్టులు చేసినా పెద్దసంఖ్యలో రహదారిపైకి చేరుకున్నారు. అలాగే, పోలీసుల కన్నుగప్పి ఉద్యమ చౌక్‌కు చేరుకున్న జేఏసీ చైర్మన్ దశమంతరెడ్డి ఆధ్వర్యాన రాస్తారోకోకు బైఠాయించారు. ఇంతలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు చేరుకుని అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ మేరకు ఉద్యమ కారులు హైదరాబాద్ రహదారిలో ఉన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇంటి వైపు పరుగులు తీయగా.. తేరుకున్న పోలీసులు వారిని నిలువరించేందుకు యత్నించారు. డీఎస్పీ పద్మనాభరెడ్డి, సీఐ చెన్నూరి శ్రీనివాస్, తిరుపతి ఆధ్వర్యంలో ఎస్సైలు సంతోషం రవీందర్, శ్రీనివాస్‌తో పాటు సబ్ డివిజన్లోని పోలీసు బలగాలు అడ్డుకునేందుకు రాగా ఉద్యమకారులు వినకపోవడంతో లాఠీచార్జీ చెదరగొట్టే ప్రయత్నం చేశారు. మంటలు.. రాళ్లు ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వెళ్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జికి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ మేరకు జాతీయ రహదారిపై నిలిచి ఉన్న ఇరవైకి పైగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. అలాగే, జనగామ డిపోకు చెందిన బస్సు(ఏపీ 29జెడ్ 3141)కు నిప్పుపెట్టారు. హైదరాబాద్ బాలాజీ నగర్‌కు వెళ్లి వస్తున్న ఈ బస్సును రాస్తారోకో కారణంగా సాయినగర్ కాలనీ వద్ద నిలపగా.. గుర్తు తెలియని వ్యక్తులు బస్సులో పెట్రోలు డబ్బా విసిరేసి అంటించినట్లు డ్రైవర్ సీ.లక్ష్మారెడ్డి, కండక్టర్ సతీష్ తెలిపారు. అలాగే, జనగామ సీఐ శ్రీనివాస్ వాహనం అద్దాలతో పాటు నల్లగొండ జిల్లా నూతనకల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్ రజాక్ వాహన అద్దాలను ధ్వంసం చేశారు. ఇంకా పలు ప్రైవేట్, ప్రభుత్వ వాహనాల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసు బలగాలు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇంటిని ముట్టడిస్తారని జేఏసీ ప్రకటించడంతో ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా పోలీసులు మొహరించారు. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించేందుకు ఉద్యమకారులు రెండుసార్లు ప్రయత్నించారు. ఆర్టీసీ చౌరస్తా నుంచి కిలోమీటరున్నర దూరంలో ఉన్న ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టేందుకు ఉద్యమకారులు పరుగులు తీస్తుండగా పోలీసులు మరోసారి లాఠీలకు పని చెప్పారు. దీంతో యువకులు పక్కనే ఉన్న మల్లన్న ఆలయం వైపు వెళ్తుండగా పోలీసులు ద్విచక్రవాహనాలపై వెంబడించడంతో వారు పట్టాల వైపు వెళ్లారు. ఇక ఎమ్మెల్యే ఇంటి వెనక నుంచి ముట్టడించేందుకు ఉద్యమ కారులు ప్రయత్నించగా, సమాచారం అందుకున్న పోలీసులు అటువైపు నిఘా వేయడంతో ఎవరూ ముందుకు వెళ్లలేకపోయారు. కాగా, జనగామను జిల్లా చేయాలనే డిమాండ్‌తో ఆందోళన చేస్తున్న వారిపై పోలీసుల లాఠీచార్జికి నిరసనగా శనివారం బంద్‌కు పిలుపునిస్తున్నట్లు జేఏసీ చైర్మన్ దశమంతరెడ్డి తెలిపారు. జనగామ, బచ్చన్నపేట, లింగాలఘనపురం, దేవరుప్పుల మండలాలతో పాటు మిగతా అన్ని మండలాల్లో బంద్ పాటించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. -
జనగామలో ఉద్రిక్తత
హైదరాబాద్: వరంగల్ జిల్లా జనగామలో ఉద్రిక్తత నెలకొంది. జనగామను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని గత కొద్ది రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం కొంతమంది ఆందోళనకారులు స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అదుపు తప్పిన ఆందోళ కారులు పోలీసుల వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ ఘటలో పలువురికి గాయాలయ్యాయి. హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై నిరసనకారులు భైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిపోయాయి. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
అదే హోరు... అదే జోరు
బతుకమ్మ..కబడ్డీ ఆటలు.. రాస్తారోకో జోరు వానలో జనగామ జిల్లా కోసం నిరసనలు జనగామ : జనగామ జిల్లా చేయాలనే ఆకాంక్ష ఎదుట జోరువాన సైతం అడ్డుకోలేకపోయింది. మహిళలు.. కుల సంఘాలతో హన్మకొండ-వరంగల్ జాతీయ రహదారి అట్టుడికిపోయింది. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి ఆధ్వర్యం లో బుధవారం జరిగిన నిరసన, ఆందోళన కా ర్యక్రమాలకు మహిళా సంఘాలతో పాటు రెడ్డి కులస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ము న్సిపల చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ఎంపీ పీ యాదగిరిగౌడ్, టీఆర్ఎస్ నాయకులు బాల్నె సిద్దులు, బండ యాదగిరిరెడ్డి, కన్నారపు ఉపేం దర్, వంగ శ్రీకాంత్‌రెడ్డి, తిప్పారపు ఆనంద్, ఉ డుగుల నర్సిహులు, లెనిన్, రావెల రవిలు జేఏ సీ ఉద్యమంలో కలిసి జిల్లా ఏర్పాటుకు ముం దుకువచ్చారు. ఆర్ఈండ్బీ అతిథి గృహం నుం చి నెహ్రూ పార్కు మీదుగా భారీ ర్యాలీతో ఆర్టీ సీ చౌరస్తాకు చేరుకున్నారు. మహిళలు బతుక మ్మ ఆటలు ఆడగా.. యువకులు కబడ్డీ ఆడి త మ జిల్లా ఆకాంక్షను తెలిపారు. సీఐలు చెన్నూరి శ్రీనివాస్, తిరుపతి, కరణాసాగర్రెడ్డితో పాటు సబ్‌డివిజన్‌లోని పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. జాతీయ రహదారిపై రెండు గంటల పాటు రాస్తారోకో చేయడంతో వాహనాలు ఎ క్కడికక్కడే నిలిచిపోయాయి. యువకులు తొడకొట్టి జిల్లా సాధిస్తామని శపథం చేశారు. పోలీస్ ఫోర్స్‌తో హైదరాబాద్ వైపు వెళుతున్న బస్సు ను అడ్డుకోవడంతో సీఐ వచ్చి పంపించారు. జ నగామ జిల్లా కాకుండా, యాదాద్రిలో కలిపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. -
జనగామను జిల్లాగా ప్రకటించాలి
దేవరుప్పుల : జనగామను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మంగళవారం మండల కేంద్రంలోని జనగామ-సూర్యాపేట రహదారిపై అఖిలపక్ష నాయకులు రాస్తారోకో చేశారు. తొలుత మండల కేంద్రంలోని వ్యాపార, వాణిజ్య దుకాణాలు మూయించి గంటపాటు రాస్తారోకో చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వలస వచ్చిన నేతలకు పదవులు కల్పించేందుకు ప్రజల మనోభావాలను పక్కకు పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రాస్తారోకోలో మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు ఉప్పల సురేష్‌బాబు, సీపీఐ మండల కార్యదర్శి బిల్లా తిరుపతిరెడ్డి, ఆటో యూనియన్ అధ్యక్షుడు నర్ర సోమసుందర్, పీఎసీఎస్ ైవె స్ చైర్మన్ గుంషావళి, పెద్ది కృష్ణమూర్తి, రవి, ముసిగుంపుల అంజయ్య, బస్వ సోమన్న, వంగ దశరథ,రతన్, మల్లాజీ, ప్రభాకర్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.