రైల్వేస్టేషన్ రోడ్డులో మూతపడిన టపాసుల దుకాణాలు
ష్.. గప్‌చుప్
Published Tue, Oct 18 2016 12:03 PM | Last Updated on Thu, Sep 13 2018 5:25 PM
టపాసుల జీరో దందాకు బ్రేక్
దుకాణాలకు తాళాలు వేసిన వ్యాపారులు
రహస్య ప్రాంతాలకు బాణసంచా తరలింపు
‘సాక్షి’ కథనంతో అప్రమత్తం
బేరసారాల కోసం ప్రయత్నాలు
సాక్షి, జనగామ : జనగామ జిల్లా కేంద్రంగా సాగుతున్న టపాసుల జీరో దందాకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. నిన్న మొన్నటి దాకా దర్జాగా విక్రయాలు జరిపి ఇతర ప్రాంతాలకు బాణసంచాను రవాణా చేసిన వ్యాపారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. జనావాసాల మధ్య నిర్వహిస్తున్న దుకాణాలకు తాళాలు వేసి దూర ప్రాంతాలకు వెళ్లారు. నిబంధనలు ఉల్లంఘించి జిల్లా కేంద్రంగా సాగిస్తున్న టపాసుల విక్రయాలపై సోమవారం ‘సాక్షి’లో ‘దర్జాగా దందా’ శీర్షికతో జిల్లా మొదటి పేజీలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తారనే భయంతో టపాసుల విక్రయాలను వ్యాపారులు అర్థంతరంగా నిలిపివేశారు. అలాగే జనగామ, బచ్చన్నపేట, కళ్లెం రోడ్లతోపాటు కుర్మవాడలో ఏర్పాటు చేసిన గోదాంలో నిల్వ ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే టపాసులను గుట్టుచప్పుడు హైదరాబాద్ శివారు, హుస్నాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాలకు తరలించారు.
బేరసారాలకు యత్నాలు..
దీపావళి పండుగ సమయంలోనే టపాసులు అధికంగా విక్రయిస్తారు. అయితే ఇప్పుడే అ మ్మకాలను నిలిపివేస్తే దందా దివాలా తీస్తుం దనే భయంతో కొందరు వ్యాపారులు బేరసారాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు ప్రధాన భూమిక పోషిస్తున్న వ్యాపారులతోపాటు వారికి అనుబంధంగా పెద్ద, చిన్న 300 మంది వరకు ఉన్నారు. అయితే అధికారులకు నయానో.. భయానో చెల్లించి యధావిధిగా వి క్రయాలు చేసుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైన ట పాసుల విక్రయాలకు బ్రేక్ పడడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఉపిరి పీల్చుకున్నారు.
Advertisement