పేదలకు ఇళ్లు
గ్రేటర్ వరంగల్, జనగామ, మహబూబాబాద్మునిసిపాలిటీలు ఎంపిక
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణ పథకం వర్తింపు
వరంగల్ అర్బన్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి జిల్లాలోని మహానగరం, జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు ఎంపికయ్యాయి. 2014 అక్టోబర్‌లో నగర పాలక సంస్థతోపాటు, మునిసిపాలిటీల్లో సొంత ఇళ్లు లేని నిరుపేదలు, వారికి అవసరమైన ఇళ్ల సంఖ్య, ూముల లభ్యత వంటి అంశాలతో జిల్లా అధికార యంత్రాంగం కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపించింది. జూన్ మూడో వారంలో ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అందరికి గృహ సదుపాయం సమావేశం జరిగింది. వరంగల్ మహా నగరంలో 8,20 లక్షల మంది ఉండగా, ఇందులో 3.30 లక్షల మంది పేదలు మురికివాడల్లో నివశిస్తున్నారు. వీరంతా నివాసయోగ్యం కానీ ప్రదేశాల్లో గుడిసెల్లో మగ్గుతున్నారు. అంతేకాక జనగామ, మహబూబాబాద్ పట్టణాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వేలాది కుటుం బాలు పక్కా ఇళ్లు లేక పురిగుడిసెల్లో జీవనం సాగిస్తున్నారు. వీరందరికీ ఈ పథకం తీపి కబురు.
గత యూపీఏ ప్రభుత్వ హయూంలో రాజీవ్ అవాస్ యోజన పథకానికి వరంగల్ మహా నగరం ఎంపికైంది. కానీ ఈ పథకం ముందుకు సాగలేదు. ఈ లోగా యూపీఏ ప్రభుత్వం అధికారాన్ని కొ ల్పోయి ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ పథకంలోభారీ మా ర్పులు చేస్తూ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంగా రూపకల్పన చేశా రు. ఈ పథకం ద్వారా 2022 నాటికి అందరికీ ఇళ్లు నిర్మించాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. అల్పాదాయ వర్గాలు, ఆ ర్థికంగా బల హీన వర్గాలకు పథకం వ ర్తించనుంది.ఈ పథకంపై తర్వలో స్ప ష్టమైన మార్గదర్శకాలు వెల్లడికానున్నాయి.
తీపి కబురు
Published Mon, Aug 31 2015 3:23 AM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM
Advertisement
Advertisement