Prime Minister Awas Yojana
-
Modi 3.0: 3 కోట్ల ఇళ్ల నిర్మాణం
న్యూఢిల్లీ: ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన కింద (పీఎంఏవై) దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ సాయమందించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కొత్తగా కొలువుదీరిన ఎన్డీఏ మంత్రివర్గం సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన తొలిసారి సమావేశమైంది. మోదీ అధికారిక నివాసం ‘7, లోక్ కల్యాణ్ మార్గ్’లో జరిగిన ఈ భేటీలో బీజేపీతో సహా అన్ని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రులు పాల్గొన్నారు. అర్హులైన కుటుంబాల గృహ నిర్మాణ అవసరాలను తీర్చాలని భేటీలో నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అర్హులైన పేద కుటుంబాలకు కనీస సదుపాయాలతో కూడిన ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సాయం చేసే నిమిత్తం 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి పీఎంఏవై పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. దీని కింద గత పదేళ్లలో 4.21 కోట్ల మంది అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. -
ఆగని అత్యాచార పర్వం
ముజఫర్‌నగర్: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇప్పిస్తామంటూ ఇద్దరు యువకులు ఓ యువతిని నమ్మించి, పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని భోపా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 22 ఏళ్ల యువతిపై యోగేశ్ కుమార్, బబ్లు అనే ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. అత్యాచారాన్ని ఫోన్లో రికార్డు చేశారు. అనంతరం ఫోన్ నుంచి వీడియో తొలగిస్తానని చెప్పి యోగేశ్ కుమార్ ఆ యువతిపై మరోమారు అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియో తొలగించకపోగా, మరిన్ని బెదిరింపులకు పాల్పడటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసే ప్రక్రియ సాగుతోందని పోలీసులు వెల్లడించారు. మహారాష్ట్రలో.. 20 ఏళ్ల యువతిపై కదులుతున్న రైల్లో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి లక్నో–ముంబై పుష్ఫక్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇగత్పురి, కసర స్టేషన్ల మధ్య ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. రాత్రి సమయంలో రైలు ఘాట్ మార్గంలో ప్రయాణిస్తుండగా అత్యాచారం జరిగిందన్నారు. కర్ణాటకలో... దక్షిణ కన్నడ జిల్లా బంటా్వళ తాలూకాలో మైనర్ బాలికకు మత్తు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచి్చంది. శుక్రవారం ఉదయం 7:30 గంటల సమయంలో మైనర్ బాలిక (16) స్కూల్‌కు నడిచి వెళ్తుండగా తెల్లని కారులో వచి్చన దుండగులు బాలికను అపహరించారు. దూరంగా ఓ ఇంట్లోకి తీసుకెళ్లి మత్తు పానీయం తాగించి మూకుమ్మడిగా లైంగికదాడి చేసి అక్కడికి దగ్గరలో వదిలేసి వెళ్లారు. కొంతసేపటికి మత్తు నుంచి తేరుకున్న నేరుగా స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఈ ఘోరం గురించి ఫిర్యాదు చేసింది. ఐదుమంది అత్యాచారం చేశారని, వారి పేర్లను కూడా వెల్లడించింది. జార్ఖండ్‌లో.. జార్ఖండ్‌లో 14 ఏళ్ల బాలికపై 58 ఏళ్ల వృద్ధుడు గత రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సిండేగా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక తండ్రి కేరళలో పని చేస్తుండగా, తల్లి ఉదయాన్నే పనులకు వెళుతుంది. ఇంటి పక్కనే నివసిస్తున్న వృద్ధుడు బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం బాలిక తన తల్లికి తెలియజేయగా ఆమె పోలీసులకు చెప్పారు. కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్లో... పశ్చిమబెంగాల్ పూర్బ బర్దమాన్ జిల్లాలో ఓ గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం జరిగిం ది. బస్‌స్టాండ్ వద్ద వేచి చూస్తున్న సమయంలో ఆరుగురు వ్యక్తులు కలసి ఆమెను అపహరించి అత్యాచారం చేశారు. బాధితురాలి పిర్యాదు మేరకు ప్రస్తుతం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. -
పట్టణ గృహ నిర్మాణానికి రూ. 6,953 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, మచిలీపట్నం: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పట్టణం) కింద 2015–16 నుంచి 2019–20 వరకు ఆంధ్రప్రదేశ్‌కు రెండు విడతల్లో రూ. 6,953 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్సింగ్పూరి బుధవారం రాజ్యసభలో తెలిపారు. వైఎస్సార్సీసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ లబ్ధిదారులకు వడ్డీ సబ్సిడీ కింద మరో రూ. 436.54 కోట్ల మేర ఆంధ్రప్రదేశ్‌కు పంపిణీ చేసినట్లు చెప్పారు. లక్షా 24 వేల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కేంద్రం చేసే 40 శాతం ఆర్థిక సాయంలో మొదటి వాయిదాను ఇంకా విడుదల చేయాల్సి ఉందని అన్నారు. ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారుల జాబితా, వారి ఆధార్ కార్డు వివరాలు, వినియోగ పత్రాలు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అనంతరం ఈ నిధులు విడుదల చేస్తామని మంత్రి చెప్పారు. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీల్లో 27.5 శాతం ఖాళీలు దేశవ్యాప్తంగా ఉన్న ఏడు సెంట్రల్ ఫోరెన్సిక్ లేబొరేటరీల్లో 27.5 శాతం ఖాళీలు ఉన్నాయని, హైదరాబాద్‌లోని కేంద్రంలో 32 శాతం మేర ఖాళీలు ఉన్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రాజ్యసభలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. డిఫెన్స్ క్యాంటీన్ స్టోర్ మూసివేత ఉండదు డిఫెన్స్ క్యాంటీన్ స్టోర్ మూసివేత ఉండదని, కేవలం హేతుబద్ధీకరణ ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఏలూరు నియోజకవర్గ పరిధిలో డిఫెన్స్ క్యాంటీన్ స్టోర్ మూసివేత అంశంపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. రైల్వే డివిజన్ల వారీగా బడ్జెట్ కేటాయింపుల్లో వాల్తేరుకే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ పరిధిలో సేవలందిస్తున్న వాల్తేరు, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు రైల్వే డివిజన్లలో గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో వాల్తేరు రైల్వే డివిజన్‌కే అధిక నిధులు కేటాయించినట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్షనేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ బీశెట్టి వెంకట సత్యవతి, కోటగిరి శ్రీధర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు గాను బడ్జెట్ సవరణ అంచనాలు, వాస్తవ వ్యయ పద్దులను తన సమాధానంలో పొందుపరిచారు. 2017–18లో సవరించిన అంచనాల ప్రకారం వాల్తేరు డివిజన్‌కు రెవెన్యూ పద్దు కింద రూ. 2,463 కోట్లు, కేపిటల్ పద్దు కింద రూ. 407 కోట్లు కేటాయించారు. 2018–19లో ఈ డివిజన్‌కు సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ పద్దు కింద రూ. 2,761 కోట్లు, కేపిటల్ పద్దు కింద రూ. 420 కోట్లు కేటాయించారు. 2017–18లో సవరించిన అంచనాల ప్రకారం విజయవాడ డివిజన్‌కు రెవెన్యూ పద్దు కింద రూ. 1,997 కోట్లు, కేపిటల్ పద్దు కింద రూ. 207 కోట్లు కేటాయించారు. 2018–19లో ఈ డివిజన్‌కు సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ పద్దు కింద రూ. 2,041 కోట్లు, కేపిటల్ పద్దు కింద రూ. 149 కోట్లు కేటాయించారు. 2017–18లో సవరించిన అంచనాల ప్రకారం గుంతకల్లు డివిజన్‌కు రెవెన్యూ పద్దు కింద రూ. 1428 కోట్లు, కేపిటల్ పద్దు కింద రూ. 217 కోట్లు కేటాయించారు. 2018–19లో ఈ డివిజన్‌కు సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ పద్దు కింద రూ. 1644 కోట్లు, కేపిటల్ పద్దు కింద రూ. 328 కోట్లు కేటాయించారు. 2017–18లో సవరించిన అంచనాల ప్రకారం గుంటూరు డివిజన్‌కు రెవెన్యూ పద్దు కింద రూ. 374 కోట్లు, కేపిటల్ పద్దు కింద రూ. 102 కోట్లు కేటాయించారు. 2018–19లో ఈ డివిజన్‌కు సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ పద్దు కింద రూ. 402 కోట్లు, కేపిటల్ పద్దు కింద రూ. 98 కోట్లు కేటాయించారు. రెండు మార్గాల్లో ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ రేణిగుంట–ఎర్రగుంట్ల సెక్షన్ మధ్య, విజయనగరం–పలాస సెక్షన్ మధ్య ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ పనులు మంజూరయ్యాయని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఆధునిక వ్యవస్థ వల్ల భద్రత, ట్రాఫిక్, లైన్ సామర్థ్యం, రైళ్ల వేగం, సమయపాలన వంటి విషయాల్లో మెరుగైన ఫలితాలు ఉంటాయని వివరించారు. వీసీఐసీ ఫేజ్ –1 లో విశాఖ, చిత్తూరు నోడ్ల అభివృద్ధికి ఆమోదం వైజాగ్–చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ)లో విశాఖ, చిత్తూరు నోడ్లను ఫేజ్–1లో అభివృద్ధి చేసేందుకు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (ఎన్ఐసీడీఐటీ) 2019 ఆగస్టు 30న ఆమోదం తెలిపిందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఈ కారిడార్‌కు సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (సీడీపీ)ను సిద్ధం చేసిందని, వీటిలో విశాఖ, మచిలీపట్నం, దొనకొండ, చిత్తూరు నోడ్లు ఉన్నాయని, ఫేజ్–1లో వైజాగ్, చిత్తూరు నోడ్లను అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు ఎన్ఐసీడీఐటీ దీనికి ఆమోదం తెలిపిందని వివరించారు. ఫేజ్ – 1 కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) రూ. 45 వేల కోట్లు (631 మిలియన్ డాలర్లు) రుణం ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందని వివరించారు. -
ఇల్లు కొంటారా..? ఇవి గుర్తుంచుకోండి!!
ప్రభుత్వ ప్రోత్సాహం తోడుండటం వల్ల కూడా కావచ్చు... ప్రస్తుతం మార్కెట్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు గృహ రుణాలపై ఆకర్షణీయమైన ఆఫర్లిస్తున్నాయి. తగ్గుతున్న వడ్డీ రేట్లు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, రెరా చట్టం ప్రయోజనాలు, అమ్ముడు కాకుండా పెద్ద సంఖ్యలో పేరుకుపోయిన గృహాలు... ఇవన్నీ చూస్తే ఇంటి కొనుగోలుకు అనువైన పరిస్థితులు కల్పిస్తున్నాయి. మీరు కొనడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది వేరే విషయం. ఒకవేళ కొనాలనే ఉద్దేశం ఉండి, ఊగిసలాడుతుంటే కనక సొంతింటి కలను సాకారం చేసుకునే ముందు చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం... అనువైన ఇల్లు ఏది..? ఎలాంటి ఇంటిని కొనాలనుకుంటున్నారో నిర్ణయించుకోవడం రెండో అంశం. ఇది కష్టమైన వ్యవహారమే. మంచి లొకాలిటీలో మీరు మెచ్చిన ఇంటిని వెతికిపుచ్చుకుంటే సరిపోదు. ఆ ఇంటి ఖరీదు మీ బడ్జెట్‌కి అనువైనదిగాను, ఇటు సౌకర్యంతో పాటు అటు మానసిక సంతృప్తినిచ్చేదిగా కూడా ఉండాలి. అలాంటి ప్రాపర్టీని ఎంచుకున్నాక... తర్వాతి దశలో చూడాల్సినవి మరికొన్ని ఉన్నాయి. చేతి నుంచీ కొంత పడుతుంది.. ఇంటి కొనుగోలు అంటే బోలెడన్ని లావాదేవీలుంటాయి. డౌన్ పేమెంటు, రిజిస్ట్రేషన్.. స్టాంపు డ్యూటీ, ఫర్నిషింగ్, బ్రోకరేజి, లోన్ చార్జీలు, ఈఎంఐలు.. వగైరా వంటి అనేకానేకం ఉంటాయని గుర్తుంచుకోవాలి. గృహ రుణం సంగతి పక్కనపెడితే.. డౌన్ పేమెంటు, ఇతర ఖర్చులన్నీ మీ జేబు నుంచే కట్టాలి. ఎందుకంటే గృహ రుణం అనేది ప్రాపర్టీ విలువలో సుమారు 70–90 శాతానికే వస్తుంది. ఇక మిగతా ఖర్చులన్నీ మీరు చూసుకోవాల్సినవే. ఇందుకు సరిపడేంత నగదు కూడా చేతిలో పట్టుకుని ఉన్న పక్షంలో .. తదుపరి అంశంపై దృష్టి పెట్టవచ్చు. ఏ అవసరానికి కొంటున్నాం.. ముందుగా ఇంటి కొనుగోలు అవసరం గురించి ప్రశ్నించుకోవాలి. చాలా మందికి రెండే కారణాలుంటాయి. ఒకటి సొంతంగా నివసించేందుకు కాగా రెండోది.. పన్నుపరమైన మినహాయింపు, క్యాపిటల్ గెయిన్స్ ప్రయోజనాలు పొందడం కోసం ఇన్వెస్ట్మెంట్ కోణంలో కొనడం. అవసరం ఏదైనా రెండింటిలో సానుకూల, ప్రతికూలాంశాలను బేరీజు వేసుకోవాలి. కుటుంబానికి సొంతింటి భరోసా, పెరిగే అద్దెల నుంచి రక్షణ, పెరిగే ఆస్తి విలువ, పన్నుపరమైన ప్రయోజనాలు మొదలైనవి సానుకూలాంశాలు ఉంటాయి. ఇక దీనికి వ్యతిరేక అంశాల విషయానికొస్తే.. చేతిలో నగదు లభ్యత, మార్కెట్.. చట్టపరమైన రిస్కులు, తీసుకున్న రుణం తిరిగి చెల్లింపులో ఎదురయ్యే సమస్యలు లాంటివి ఉంటాయి. పేపర్‌వర్క్ పక్కాగా.. సాధారణంగా ఇంటి కొనుగోలు అనేది చాలా మంది జీవితాల్లో చాలా పెద్ద ఆర్థిక లావాదేవీగానే చెప్పవచ్చు. అందుకే అన్నీ సక్రమంగా ఉండాలి. మీరు కొందామనుకుంటున్న ఇంటికి సంబంధించి మున్సిపల్ క్లియరెన్సులు, ఇతరత్రా అవసరమైన పర్మిట్లు ఉన్నాయా లేదా చూసుకోవాలి. పేపర్‌వర్క్ పక్కాగా ఉండాలి. స్థల వివాదాల్లాంటివేమీ ఉండకూడదు. ఇంటి పత్రాలను మదింపు చేయడంలో న్యాయనిపుణుడి సలహాలనూ తీసుకోవడం మంచిది. ప్రాపర్టీ చట్టబద్ధంగా పక్కాగా ఉందని పూర్తిగా నమ్మకం కలిగాకే కొనుగోలు విషయంలో ముందడుగు వేయాలి. ఎంత గృహ రుణం రావొచ్చు.. ఏ రుణానికైనా కొన్ని అర్హతా ప్రమాణాలుంటాయి. అవి కుదిరితేనే బ్యాంకులు రుణాలిస్తాయి. గృహ రుణమూ ఇందుకు మినహాయింపేమీ కాదు. ఆ అర్హతా ప్రమాణాలేమిటంటే.. మీ వయస్సు (సాధారణంగా 18–65 ఏళ్ల మధ్య), ఆదాయం, క్రెడిట్ స్కోరు, ప్రస్తుతం కడుతున్న రుణ మొత్తాలు మొదలైనవి. రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే గానీ క్రెడిట్ స్కోరు తెలుసుకునే వీలు లేదు కదా అనుకోవద్దు. ప్రస్తుతం ఆన్లైన్లోనే ఉచితంగా కూడా క్రెడిట్ రిపోర్టు పొందే వెసులుబాటుంది. సదరు నివేదికను బట్టి రుణ అర్హత మెరుగుపర్చుకునేందుకు వీలయితే ప్రస్తుత రుణాలను తీర్చుకునే అంశాన్ని కూడా పరిశీలించవచ్చు. ఒకవేళ మీ ఎలిజిబిలిటీ తక్కువగా ఉన్న పక్షంలో అర్హత ఉన్న కుటుంబ సభ్యులతో కలిసి జాయింట్‌గా కూడా రుణం తీసుకోవచ్చు. దీర్ఘకాలమని గుర్తుంచుకోవాలి.. ప్రాపర్టీ కొనాలన్నా, అమ్మాలన్నా చాలా పెద్ద వ్యవహారమే. సొంతంగా ఉండటానికైనా లేదా ఇన్వెస్ట్మెంట్ కోసమైనా... చాన్నాళ్ల పాటు దాన్నే అట్టే పెట్టుకుని ఉండాలి. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇతరత్రా ఆర్థిక అసెట్స్‌ను ఏ రోజైనా విక్రయించుకునే వీలుంది. అదే ప్రాపర్టీ విషయానికొస్తే.. అలాంటి వెసులుబాటు ఉండదు. అనుకున్న రేటుకు విక్రయించుకుని, వైదొలగాలంటే కాలం పట్టేస్తుంది. ఇక, గృహ రుణం తీసుకున్నారంటే.. కాలపరిమితి ఎంతైనా సరే చట్టప్రకారంగాను, ఆర్థికంగానూ, నైతికంగాను కట్టి తీరాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. -
గృహ నిర్మాణం కోసం పేదలకు మలబార్ ఆర్థిక సాయం
హైదరాబాద్: పేద, బలహీన వర్గాల వారందరికీ సొంతిళ్లను నిర్మించి ఇవ్వాలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంకల్పానికి చేయూనివ్వడానికి ప్రముఖ రియల్టీ, ఆభరణాల వ్యాపార సంస్థ మలబార్ గ్రూప్ ఆర్థిక సహాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వపు ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’, కేరళ ముఖ్యమంత్రి ప్రకటించిన ‘లైఫ్ మిషన్’ వంటి కార్యక్రమాలకు మద్దతు ప్రకటిస్తున్నామని గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహ్మద్ తెలిపారు. గృహ నిర్మాణ ప్రాజక్టులకు అవసరమైన పాక్షిక ఆర్థిక సాయం మలబార్ హౌసింగ్ చారిటబుల్ ట్రస్ట్, మలబార్ డెవలపర్స్ నుంచి అందుతుందని పేర్కొన్నారు. 4 సెంట్ల స్థలం కలిగి, 600 చదరపు అడుగుల నిర్మాణ వైశాల్యంలో ఇల్లు నిర్మించుకోదలచిన వారు భూమి దస్తావేజుల నకలు, ఇంటి ప్లాన్ కాపీ, ఫోటో గుర్తింపు కార్డులను జతచేస్తూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులను సమీపంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ స్టోర్ లేదా మలబార్ డెవలపర్స్ కార్యాలయం లేదా మలబార్ హౌసింగ్ చారిటబుల్ ట్రస్ట్ ఆఫీస్‌లలో ఈ మార్చి 10 లోగా అందజేయాలని పేర్కొన్నారు. -
ఇల్లు కొంటే లాభమే!
చెల్లించే వడ్డీలో కేంద్రం భారీ రాయితీలు ఏటా రూ.18 లక్షల ఆదాయం ఉన్నవారికీ వర్తింపు గరిష్టంగా రూ.2.4 లక్షల వరకు ప్రయోజనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పొందే అవకాశం మూడు శ్లాబ్‌ల కింద భిన్న రకాలుగా సబ్సిడీ న్యూఢిల్లీ: మొదటిసారి రుణం తీసుకుని ఇల్లు కొనుక్కునే వారికి, కట్టించుకునే వారికి శుభవార్త. వార్షికాదాయం రూ.18 లక్షల వరకూ ఉన్నా సరే.. వారు ఇంటికోసం తీసుకునే రుణంలో కొత్త మొత్తానికి కేంద్ర ప్రభుత్వం వడ్డీ సబ్సిడీ ఇవ్వనుంది. 20 ఏళ్లకు గృహ రుణం తీసుకుంటే వారు చెల్లించే వడ్డీలో దాదాపు రూ.2.4 లక్షల మొత్తాన్ని కేంద్రం సబ్సిడీగా చెల్లిస్తుంది. ఈ మేరకు నెలసరి వాయిదాలు సుమారు రూ.2,200 మేర తగ్గడం ఇందులోని ప్రయోజనం. 2022 నాటికి అందరికీ సొంతిల్లు లక్ష్యాన్ని సాధించేం దుకు కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తాజాగా రెండు సబ్సిడీ పథకాలను తీసుకువచ్చింది. 20 ఏళ్ల కాల వ్యవధికి ఇంటి రుణం తీసుకునే వారు కూడా ఈ సబ్సిడీలను పొందేందుకు అర్హులు. ఇప్పటికే సొంతింటికి సంబంధించి ఓ సబ్సిడీ పథకం అమల్లో ఉంది. కానీ వార్షికాదాయం రూ.6 లక్షలలోపు ఉన్నవారు, అది కూడా 15 ఏళ్ల కాల వ్యవధికి మించని రుణం తీసుకున్న వారికి మాత్రమే అది అందుతోంది. కేంద్రం తాజాగా దీన్ని మరింత సరళీకరించింది. ఒక్కొక్కరికీ ఒక్కోలా... వార్షికాదాయాన్ని బట్టి ఇంటి రుణంపై కేంద్రం భరించే సబ్సిడీ కొద్దిగా మారుతుంది. రూ.6 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న వారు రుణంపై ఇల్లు కొంటే.. వారికి వడ్డీపై 6.5 శాతం రాయితీ లభిస్తుంది. అయితే ఎంత రుణం తీసుకున్నా కేవలం రూ.6 లక్షల రుణం వరకే వడ్డీ సబ్సిడీ పరిమితం అవుతుంది. మిగతా రుణంపై వడ్డీ మామూలుగానే ఉంటుంది. ఉదాహరణకు 9 శాతం వడ్డీతో రూ.20 లక్షల రుణం తీసుకున్నారనుకుందాం. అప్పుడు రూ.6 లక్షలపై 6.5 శాతం రాయితీపోను కేవలం 2.5 శాతం వడ్డీ చెల్లిస్తే చాలు. మిగతా రూ.14 లక్షలకు వడ్డీ 9 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు వడ్డీపై 4 శాతం రాయితీని అందుకోవచ్చు. ఈ రాయితీ రుణం మొత్తంలో రూ.9 లక్షలకే పరిమితం. ఏడాదికి రూ.18 లక్షల వరకు ఆదాయమున్న వారు.. వారి రుణంలో రూ.12 లక్షల మొత్తానికి 3 శాతం వడ్డీ రాయితీ పొందవచ్చు. ఈ మూడూ శ్లాబ్‌లలో ఉన్న వారు 20 ఏళ్ల కాల వ్యవధికి ఇంటి రుణంపై నికర వడ్డీ సబ్సిడీ రూపేణా రూ.2.4 లక్షల (9 శాతం వడ్డీ ఆధారంగా) వరకు ప్రయోజనం పొందవచ్చు. అంటే నెలసరి వాయిదా రూ.2,200 వరకు తగ్గుతుంది. ఇంటి రుణంపై చెల్లించే వడ్డీకి, అసలుకు ఇప్పటికే ఆదాయపన్ను పరంగా పలు మినహాయింపులున్న విషయం తెలిసిందే. తాజా సబ్సిడీలు వాటికి అదనం కావడం మరింత ఆకర్షణీయం. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ), హడ్కోలకు ఈ సబ్సిడీ పథకాలను అమలు చేసే బాధ్యతను కేంద్రం కట్టబెట్టింది. -
పీఎంఏవై రుణాల కాలపరిమితి పెంపు
కేబినెట్ భేటీలో నిర్ణయం న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకం కింద సబ్సిడీ రుణాలు తీసుకున్నవారి రుణాల చెల్లింపు కాలపరిమితిని 15ఏళ్ల నుంచి 20ఏళ్లకు పెంచుతూ బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముందస్తు బడ్జెట్ కేటాయింపుల్లో రూ.1000 కోట్లతో మధ్యస్థాయి ఆదాయ వర్గాల కోసం మరో పథకం ప్రారంభించాలని ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం లో నిర్ణయించారు. దేశవ్యాప్తంగా పీఎంఏవై పథకం కింద మంజూరుచేస్తున్న రుణాల మొత్తాన్ని రూ.15,000 కోట్ల నుంచి రూ.23,000 కోట్లకు పెంచారు. -
ప్రత్యామ్నాయ నిర్మాణ సాంకేతికత తక్షణావసరం
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన లక్ష్యాలను చేరుకోవడానికి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలుకు సంప్రదాయ నిర్మాణ పరిజ్ఞానానికి బదులుగా ప్రత్యామ్నాయ ప్రీఫ్యాబ్రికేటెడ్ నిర్మాణ సాంకేతిక పరిజ్ఞాన వినియోగం తక్షణావసరమని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఈ పరిజ్ఞానాన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ రంగం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం ఢిల్లీలో హౌసింగ్ టెక్నాలజీ పార్క్‌ను ప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ ప్రత్యామ్నాయ నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానం వల్ల సురక్షిత, త్వరితగతిన నిర్మాణం చేపట్టవచ్చన్నారు. ప్రత్యామ్నాయ నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాలకు ప్రజాదరణ కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. పెద్ద గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లలో ఈ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారని, చిన్న తరహా ప్రాజెక్ట్‌లలో, వ్యక్తిగత గృహ నిర్మాణంలో కూడా వినియోగించాలని వెంకయ్య సూచించారు. కాగా, ప్రీఫ్యాబ్రికేటెడ్ ప్రత్యామ్నాయ సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై తెలుగు రాష్ట్రాలు అసక్తి కనబరుస్తున్నాయని గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నందిత చటర్జీ తెలిపారు. -
రియల్ ఎస్టేట్ బిల్లును గట్టెక్కిస్తాం
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల్లోనే రియల్ ఎస్టేట్ బిల్లుకు ఆమోదం లభిస్తుందన్న ఆశాభావాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య వ్యక్తం చేశారు. ఈ బిల్లును పార్లమెంటరీ స్ధాయీ సంఘం, సెలెక్ట్ కమిటీలు పరిశీలించి నివేదిక లు అందజేశాయని విలేకరులతో చెప్పారు. జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా కేంద్ర సాయాన్ని అందుకోవడంలో రాష్ట్రాల జాప్యంపై ఆవేదనచెందారు. ప్రణాళిక, వాటి అమలు సామర్థ్యాలను రాష్ట్రాలు పెంపొందించుకోవాలన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, అటల్ మిషన్, స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్ కింద కేంద్రం హామీ ఇచ్చిన విధంగా నిధులను అందిస్తామని, రాష్ట్రాలు కేంద్రం అందించిన నిధులను త్వరగా ఖర్చుచేసి, మరిన్ని నిధుల కోసం కోరాలని సూచించారు. -
గుడివాడలో ‘అందరికీ పక్కా ఇళ్లు’
రూ.182కోట్లతో ప్రాజెక్టు పనులు3312 మందికి అవకాశం డీపీఆర్‌తో ఢిల్లీకి బయలుదేరి అధికారులు గుడివాడ : గుడివాడ పట్టణంలోని అందరికీ పక్కాఇళ్లు పథకం మరో అడుగు ముందుకేసింది. మల్లాయిపాలెం సమీపంలో ఉన్న 77 ఎకరాల్లో జీ ప్లస్-2 గృహ సముదాయం నిర్మాణానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)తో గృహ నిర్మాణశాఖ అధికారులు ఢిల్లీకి బయలుదేరి మంజూరుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు 3312 మంది లబ్ధిదారుల వివరాల సేకరణకు బుధవారం నుంచి సర్వే చేపట్టనున్నాను. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హౌసింగ్ ఫర్ ఆల్... కేంద్ర ప్రభుత్వం మున్సిపాల్టీల్లో నివసించే వారందరికీ పక్కాఇళ్ల నిర్మాణం కోసం ‘అందరికీ ఇళ్లు-ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ పథకం చేపట్టింది. పథకం కింద గుడివాడ పట్టణానికి రూ.182కోట్లు అంచనా వ్యయంతో 3312 మంది లబ్ధిదారులకు జీప్లస్-2 నిర్మాణంతో భవంతులు నిర్మించి ఇవ్వనున్నారు. గుడివాడ పట్టణం శివారులో ఉన్న 77.46 ఎకరాలు ప్రభుత్వ భూమిలో ఈ భవంతులు నిర్మించనున్నారు. 138 బ్లాకులుతో ఒక్కొబ్లాకులో 24 ఇళ్లు ఉంటాయని చెబుతున్నారు. ఒక్కొ ఇంటికి సుమారు రూ.4.80 లక్షలు వ్యయం అవుతుండగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాటాలతోపాటు లబ్ధిదారుని వాటా, బ్యాంకు రుణం ఉంటుందని అధికారులు చెప్పారు. జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల కన్నా ముందుగానే డీపీఆర్‌ను సిద్ధం చేసిన అధికారులు బుధవారం ఢిల్లీ బయలుదేరుతున్నారు. నేటి నుంచి సర్వే గుడివాడ పట్టణంలో 3312 మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. గతంలో ఇంది రమ్మ పథకం ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఈ జాబితాలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారులు ఎంపిక చేసి దాదాపు మూడేళ్లు గడుస్తున్నందున ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారు. వారి వివరాలు సేకరించేందుకుగాను మున్సిపల్ అధికారులు బుధవారం నుంచి సర్వే నిర్వహించనున్నారు. లబ్ధిదారుల ఆధార్కార్డునెం బ రు, బ్యాంకు ఖాతా నెంబరు, రేషన్‌కార్డు, సామాజిక వివరాలు, ఆదాయ ధ్రువీకరణ వంటివి సేకరిస్తారు. ఎవరైనా చనిపోతే వారి వారసులకు ఇచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అధికారులతో చైర్మన్ సమీక్ష మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు మంగళవారం అధికారులతో సమీక్షించారు. లబ్ధిదారుల జాబితాను మున్సిపల్ కార్యాలయం నోటీసు బోర్డులోను, ఆయా వార్డుల్లో కౌన్సిలర్లుకు అందిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ దీనిపై సర్వే బృందానికి సమగ్ర సమాచారం అందించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, టీపీవో శేషగిరిరావు, ఎంఈ చౌదరి, కౌన్సిలర్లు చోరగుడి రవికాంత్, బాజీబాషా, పొట్లూరి కృష్ణారావు పాల్గొన్నారు. -
తీపి కబురు
పేదలకు ఇళ్లు గ్రేటర్ వరంగల్, జనగామ, మహబూబాబాద్మునిసిపాలిటీలు ఎంపిక ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణ పథకం వర్తింపు వరంగల్ అర్బన్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి జిల్లాలోని మహానగరం, జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు ఎంపికయ్యాయి. 2014 అక్టోబర్‌లో నగర పాలక సంస్థతోపాటు, మునిసిపాలిటీల్లో సొంత ఇళ్లు లేని నిరుపేదలు, వారికి అవసరమైన ఇళ్ల సంఖ్య, ూముల లభ్యత వంటి అంశాలతో జిల్లా అధికార యంత్రాంగం కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపించింది. జూన్ మూడో వారంలో ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అందరికి గృహ సదుపాయం సమావేశం జరిగింది. వరంగల్ మహా నగరంలో 8,20 లక్షల మంది ఉండగా, ఇందులో 3.30 లక్షల మంది పేదలు మురికివాడల్లో నివశిస్తున్నారు. వీరంతా నివాసయోగ్యం కానీ ప్రదేశాల్లో గుడిసెల్లో మగ్గుతున్నారు. అంతేకాక జనగామ, మహబూబాబాద్ పట్టణాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వేలాది కుటుం బాలు పక్కా ఇళ్లు లేక పురిగుడిసెల్లో జీవనం సాగిస్తున్నారు. వీరందరికీ ఈ పథకం తీపి కబురు. గత యూపీఏ ప్రభుత్వ హయూంలో రాజీవ్ అవాస్ యోజన పథకానికి వరంగల్ మహా నగరం ఎంపికైంది. కానీ ఈ పథకం ముందుకు సాగలేదు. ఈ లోగా యూపీఏ ప్రభుత్వం అధికారాన్ని కొ ల్పోయి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ పథకంలోభారీ మా ర్పులు చేస్తూ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంగా రూపకల్పన చేశా రు. ఈ పథకం ద్వారా 2022 నాటికి అందరికీ ఇళ్లు నిర్మించాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. అల్పాదాయ వర్గాలు, ఆ ర్థికంగా బల హీన వర్గాలకు పథకం వ ర్తించనుంది.ఈ పథకంపై తర్వలో స్ప ష్టమైన మార్గదర్శకాలు వెల్లడికానున్నాయి.