కేబినెట్ తొలి భేటీలో నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన కింద (పీఎంఏవై) దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ సాయమందించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కొత్తగా కొలువుదీరిన ఎన్డీఏ మంత్రివర్గం సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన తొలిసారి సమావేశమైంది. మోదీ అధికారిక నివాసం ‘7, లోక్ కల్యాణ్ మార్గ్’లో జరిగిన ఈ భేటీలో బీజేపీతో సహా అన్ని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రులు పాల్గొన్నారు.
అర్హులైన కుటుంబాల గృహ నిర్మాణ అవసరాలను తీర్చాలని భేటీలో నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అర్హులైన పేద కుటుంబాలకు కనీస సదుపాయాలతో కూడిన ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సాయం చేసే నిమిత్తం 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి పీఎంఏవై పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. దీని కింద గత పదేళ్లలో 4.21 కోట్ల మంది అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment