Cabinet approval
-
రూ.10,000 కోట్ల ఒప్పందానికి కేబినెట్ కమిటీ ఆమోదం
భారత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) రూ.10,000 కోట్ల విలువైన రాకెట్లు, మందుగుండు సామగ్రి కోసం అతిపెద్ద దేశీయ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా పినాకా రాకెట్లు, ఏరియా డిస్ట్రక్షన్ మందుగుండు సామగ్రి కొనుగోలు చేయనున్నారు. వీటిని మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్), ఎకనామిక్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ (ఈఈఎల్) ఉత్పత్తి చేస్తాయి.డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన పినాకా రాకెట్లు భారత సైన్యానికి లాంగ్ రేంజ్ ఆర్టిలరీ వ్యవస్థను అందిస్తాయి. ఇవి 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. ఇవి సైన్యం వ్యూహాత్మక కార్యకలాపాలకు కీలకమైన వనరుగా మారాయి. ఈ ఒప్పందంలోని మరో కీలక అంశం ఏరియా డేనియల్ మ్యునిషన్స్(ఏడీఎం). ఎక్కువ విస్తీర్ణంలో వందలాది బాంబులను ఏర్పాటు చేయడం ద్వారా నిర్దిష్ట ప్రాంతాల్లో శత్రు దళాలు ప్రవేశించకుండా కట్టడి చేయవచ్చు. అందుకోసం మందుగుండు సామగ్రి అవసరం అవుతుంది. ఈ ఒప్పందాన్ని డీఆర్డీఓ, ఎంఐఎల్, ఈఈఎల్కు వాటి వాటా ఆధారంగా విభజిస్తారు. మందుగుండు సామగ్రికి సంబంధించి ఈఈఎల్ కాంట్రాక్ట్ విలువలో 60% అందుకుంటుంది. మిగిలిన 40% ఎంఐఎల్కు అందుతుంది. ఈ సహకారం రక్షణ తయారీ రంగంలో స్వావలంబనను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇదీ చదవండి: ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడుల జోరుఈ ఒప్పందానికి సీసీఎస్ ఆమోదం లభించడంతో రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, స్వదేశీ తయారీని ప్రోత్సహించేందుకు పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తుంది. సైన్యం ఇప్పటికే 10 పినాకా రెజిమెంట్లను కలిగి ఉంది. భవిష్యత్తులో మరిన్ని రాకెట్లు తోడవుతుండడం సైన్యం వ్యూహాత్మక పరిధిని మరింత పెంచుతుంది. ఈ నిర్ణయం రక్షణ తయారీ రంగంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్ల టర్నోవర్ సాధించాలనే దేశ లక్ష్యానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. -
AP: భారీగా అప్పుల సేకరణకు కేబినెట్ ఆమోదం
సాక్షి,విజయవాడ:ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. భారీగా అప్పుల సేకరణకు ఏపీ కేబినెట్ గురువారం(డిసెంబర్ 19) ఆమోదం తెలిపింది.పెద్ద ఎత్తున రూ.17 వేల కోట్ల రుణాలు సేకరించాలని కేబినెట్ నిర్ణయించింది.మార్క్‌ఫెడ్ ద్వారా రూ. 1000 కోట్ల అప్పులు సమీకరించేందుకు ఆమోద ముద్ర వేశారు.కెఎఫ్‌డబ్ల్యూ ఆర్థిక సంస్థ ద్వారా రూ. 5 వేల కోట్లు,హడ్కో ద్వారా రూ. 11 వేల కోట్ల రుణాలను సేకరించేందుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కాగా, వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నపుడు ఏపీ ప్రభుత్వ అప్పులు పెరిగిపోతున్నాయని, ఏపీ శ్రీలంకలా మారిపోతోందని ప్రస్తుత కూటమి ప్రభుత్వ పెద్దలు, అప్పటి ప్రతిపక్షనేతలు గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. వారే ఇప్పుడు ఎడాపెడా అప్పులు తీసుకుంటుండడంపై విస్మయం వ్యక్తమవుతోంది. -
ప్రభుత్వ ఉద్యోగులకు 3.64% డీఏ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు దీపావళి కానుక ఇచ్చింది. మంత్రివర్గం ఆమోదం మేరకు 3.64% కరువు భత్యం (డీఏ) మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ డీఏను డిసెంబర్ 1న చెల్లించే నవంబర్ నెల వేతనంతో కలిపి ఇవ్వనున్నట్టు ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది. దీంతో ప్రస్తుతం 22.75%గా ఉన్న డీఏ 26.39 శాతానికి పెరగనుంది. 2022, జూలై 1 నుంచి ఈ డీఏ వర్తిస్తుందని, ఇందుకు సంబంధించిన బకాయిలను (జూలై 1, 2022 నుంచి అక్టోబర్31, 2024 వరకు) ఉద్యోగుల భవిష్యనిధి (పీఎఫ్) ఖాతాలో జమ చేయనున్నట్టు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, మార్చి 31, 2025లోపు పదవీ విరమణ పొందే ఉద్యోగులకు 17 వాయిదాల్లో ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్టు తెలిపారు. 2004, సెప్టెంబర్ 1 తర్వాత నియమితులై కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు ఇచ్చే డీఏలో 10 శాతం వారి ‘ప్రాన్’ (పరి్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్) అకౌంట్లలో జమ చేస్తామని, మిగిలిన మొత్తాన్ని జనవరి, 2025 వేతనం నుంచి మొదలుపెట్టి 17 వాయిదాల్లో చెల్లిస్తామన్నారు. పీఎఫ్ ఖాతాలు లేని కాంటిజెంట్ ఉద్యోగులకు కూడా 2025, జనవరి నెల వేతనంతో మొదలుపెట్టి 17 వాయిదాల్లో చెల్లిస్తామని తెలిపారు. ఒకవేళ ఉద్యోగులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఈ డీఏను ఒకేసారి చెల్లించనున్నట్టు పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జీహెచ్ఎంసీ ఉద్యోగుల డీఏలను ఆయా సంస్థలే భరించాల్సి ఉంటుందని వివరించారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా అన్ని శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. -
అంతరిక్షంలో మన జైత్రయాత్ర
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనల్లో మరో ముందడుగు పడింది. అంతరిక్ష రంగంలో భారత్ జైత్రయాత్రకు మార్గం సుగమమైంది. ఈ దిశగా పలు కీలక కార్యక్రమాలకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. చందమామపైకి భారత వ్యోమగాములను పంపించి, అక్కడ నమూనాలు సేకరించి, క్షేమంగా వెనక్కి తీసుకురావడానికి ఉద్దేశించిన చంద్రయాన్–4 మిషన్‌కు ఆమోద ముద్రవేసింది. వ్యోమగాములను పంపించడానికి అవసరమైన సాంకేతికత పరిజ్ఞానాన్ని, వ్యూహాలను ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.2,104.06 కోట్లు ఖర్చు చేయబోతోంది. చంద్రయాన్–4 స్పేస్‌క్రాఫ్ట్ అభివృద్ధి, లాంచింగ్ బాధ్యతను ఇస్రోకు అప్పగించబోతున్నారు. ఈ నూతన మిషన్‌కు పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీనే ఉపయోగించనున్నారు. చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రయాన్–4ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అంతరిక్షంలో సొంతంగా ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’ నిర్మించుకోవడంతోపాటు 2040 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగానే చంద్రయాన్–4కు శ్రీకారం చుడుతోంది. ఈ మిషన్‌లో భారతీయ పరిశ్రమలను, విద్యా సంస్థలను భాగస్వాములను చేస్తారు. ఎన్జీఎల్వీ సూర్య పాక్షిక పునరి్వనియోగ తదుపరి తరం లాంచ్ వెహికల్(ఎన్జీఎల్వీ) ‘సూర్య’ అభివృద్ధికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇస్రో లాంచ్ వెహికల్ మార్క్–3 కంటే మూడు రెట్లు అధికంగా పేలోడ్‌ను ఇది మోసుకెళ్లగలదు. మార్క్–3తో పోలిస్తే ఖర్చు మాత్రం కేవలం 50 శాతమే పెరుగుతుంది. ఎన్జీఎల్వీ ‘సూర్య’ అభివృద్ధికి ప్రభుత్వం రూ.8,240 కోట్లు కేటాయించింది. గగన్‌యాన్ కార్యక్రమాన్ని మరింత విస్తరింపజేస్తూ భారతీయ అంతరిక్ష స్టేషన్లో మొదటి మాడ్యూల్(బీఏఎస్–1) అభివృద్ధికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. గగన్‌యాన్‌లో భాగంగా 2028 డిసెంబర్ నాటికి ఎనిమిది మిషన్లు పూర్తిజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గగన్‌యాన్‌కు రూ.20,193 కోట్లు కేటాయించింది. కార్యక్రమ విస్తరణ కోసం అదనంగా రూ.11,170 కోట్లు కేటాయించింది. → బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్íÙప్ డెవలప్మెంట్(బయో–రైడ్) పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. బయో టెక్నాలజీ రంగంలో పరిశోధనలు, అభివృద్ధికి ఈ పథకం తోడ్పాటు అందించనుంది. ఈ పథకం అమలుకు రూ.9,197 కోట్లు కేటాయించారు. → యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ రంగాల్లో నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్(ఎన్సీఓఈ) ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ అంగీకారం తెలిపింది. ఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ద్వారా ఇండియాను కంటెంట్ హబ్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. → 2024–25 రబీ సీజన్లో ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులపై రూ.24,474.53 కోట్ల రాయితీ ఇచ్చేందుకు కేబినెట్ సుముఖత వ్యక్తంచేసింది. ఈ రాయితీ వల్ల సాగు వ్యయం తగ్గుతుందని, రైతులకు భరోసా లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రైతన్నలకు కొరత లేకుండా నిరంతరాయంగా ఎరువులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. → ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్(పీఎం–ఆశా)కు కేబినెట్ నుంచి ఆమోదం లభించింది. రైతులకు తగిన మద్దతు ధర అందించడంతోపాటు మార్కెట్లో నిత్యావసరాల ధరలను నియంత్రించడానికి 2025–26లో రూ.35,000 కోట్లతో ఈ పథకం అమలు చేస్తారు. పీఎం–ఆశాతో రైతులతోపాటు వినియోగదారులకు సైతం లబ్ధి చేకూరుతుందని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. → దేశవ్యాప్తంగా గిరిజన వర్గాల సామాజిక–ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడమే లక్ష్యంగా ‘ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్’కు మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ పథకానికి రూ.79,156 కోట్లు కేటాయించారు.‘వీనస్ ఆర్బిటార్ మిషన్’ శుక్ర గ్రహంపై మరిన్ని పరిశోధనలకు గాను ‘వీనస్ ఆర్బిటార్ మిషన్’ అభివృద్ధికి కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. డిపార్టుమెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు చేస్తారు. శుక్ర గ్రహం కక్ష్యలోకి సైంటిఫిక్ స్పేస్‌క్రాఫ్ట్ పంపించాలని నిర్ణయించారు. ‘వీనస్ ఆర్బిటార్ మిషన్’కు కేంద్ర కేబినెట్ రూ.1,236 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.824 కోట్లతో స్పేస్‌క్రాఫ్ట్‌ను అభివృద్ధి చేస్తారు. -
‘జమిలి’తో ప్రభుత్వాలు రద్దేనా?: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: జమిలి ఎన్నికలపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల కోసం దేశంలోని అన్ని ప్రభుత్వాలను రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. జమిలి ఎన్నికలపై పార్టీ నేతలమంతా కూర్చొని చర్చించి నిర్ణయం చెబుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలను మోసం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. బుధవారం(సెప్టెంబర్18) కేటీఆర్ తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ పార్టీ బీసీ నేతలతో సమావేశమై మాట్లాడారు.‘కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరిట చేసిన మోసంపై పార్టీ బీసీ నేతల సమావేశంలో చర్చించాం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేసే దాకా కాంగ్రెస్‌ను నిలదీస్తాం. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి.సమగ్ర కులగణన వెంటనే ప్రారంభించాలి.నవంబర్ 10 లోపు పూర్తి చేయని పక్షంలో బీసీల తరఫున ఎలా ముందుకు పోతామో కార్యాచరణ ప్రకటిస్తాం.అవరసరం అయితే ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతాం.బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ అని చెప్పి ఎనిమిది వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో పెట్టారు.బీసీ సబ్ ప్లాన్ పెట్టాలి.25 నుంచి 35 వేల కోట్లు అందులో పెట్టాలి.ఎమ్మెల్సీ మధుసూదనా చారి నేతృత్వంలో తమిళనాడు వెళ్లి బీసీ స్కీమ్‌లపై అధ్యయనం చేయాలని నిర్ణయించాం. కేవలం ఇద్దరు బీసీ మంత్రులు మాత్రమే కేబినెట్లో ఉన్నారు. ఎంబీసీలకు మంత్రి పదవి ఇవ్వాలి. బీఆర్ఎస్ బీసీల కోసం కదులుతుంది’అని కేటీఆర్ తెలిపారు. ఇదీ చదవండి.. జమిలికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ -
ఖజానాకు కన్నం!
ఇలాంటి దోపిడీకి మళ్లీ రాచమార్గంపట్టిసీమ టెండర్లలో రూ. 257.45 కోట్ల లూటీ..2017–18లోనే కడిగేస్తూ కాగ్ నివేదికవైకుంఠపురం బ్యారేజ్ పనుల వ్యయాన్ని రూ.400 కోట్లు పెంచేసి 13.19 శాతం అధిక ధరలకు నవయుగకు ధారాదత్తంపోలవరం హెడ్‌వర్క్స్‌లో జల విద్యుత్ కేంద్రం పనులను నవయుగకు 4.8 శాతం అధిక ధరలకు రూ.3,216.11 కోట్లకు అప్పగించిన బాబు మళ్లీ ఇప్పుడూ అదే రీతిలో కాంట్రాక్టర్లతో కలిసి ఖజానా దోచేసేందుకు సిద్ధంనీతి ఆయోగ్ ప్రశంసించిన రివర్స్ టెండరింగ్టెండర్ ప్రక్రియలో పూర్తి పారదర్శకతకాంట్రాక్టర్లు రింగ్‌గా ఏర్పడి అధిక మొత్తం కోట్ చేయకుండా ఉంటారు.ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడతారు.రూ.100 కోట్లు దాటిన ప్రతి టెండర్‌ను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపుతారు.ప్రజల నుంచి ఆన్లైన్లో సలహాలు, సూచనలు స్వీకరిస్తారు.తక్కువ మొత్తం కోట్ చేసిన కాంట్రాక్టర్‌ను ఎల్–1గా నిర్ణయిస్తారు. రివర్స్ టెండరింగ్ రద్దుకు కేబినెట్ ఆమోదంకంచే చేను మేస్తే?.. ప్రభుత్వ పెద్దలే అక్రమాలకు గేట్లెత్తితే? రివర్స్ టెండరింగ్ విధానం రద్దుతో ఇప్పుడు అదే పునరావృతమవుతోంది!! ఖజానాకు టెండర్ పెట్టేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్‌తో టెండర్ల వ్యవస్థలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక మార్పులకు మంగళం పాడింది. రివర్స్ టెండరింగ్ విధానం రద్దుకు రాష్ట్ర మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది. 2014–19 మధ్య ఉన్న పాత టెండర్ విధానం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పనుల అంచనా వ్యయాన్ని లెక్కకట్టక ముందే కమీషన్ ఎక్కువ ఇచ్చేందుకు ముందుకొచ్చిన కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై తర్వాత అంచనా వ్యయాన్ని భారీగా పెంచడం.. ఆ కాంట్రాక్టర్‌కే పనులు దక్కే నిబంధనలతో టెండర్ నోటిఫికేషన్ జారీ .. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరలకు పనులు అప్పగింత.. ఆ తర్వాత ఖజానా నుంచి మొబిలైజేషన్ అడ్వాన్సుల సంతర్పణ.. వాటినే కమీషన్లుగా వసూలు చేసుకునేందుకు రంగం సిద్ధమైంది. – సాక్షి, అమరావతిఖజానాపై రూ.20 వేల కోట్ల భారం..రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఖజానా లూటీకి టెండర్ విధానాలను ఓ అస్త్రంగా మల్చుకున్నారు. పనుల ప్రతిపాదన దశలోనే అధికారులపై ఒత్తిడి తెచ్చి అంచనా వ్యయాన్ని పెంచడం.. అధికంగా కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్‌కు పనులు దక్కేలా నోటిఫికేషన్ జారీ చేయడం.. సగటున 4.85 శాతం అధిక ధరలకు పనులను కట్టబెట్టి ఖజానాకు కన్నం వేసి కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం.. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు మొబిలైజేషన్ అడ్వాన్సుగా చెల్లించిన మొత్తాన్నే కమీషన్‌గా జేబులో వేసుకోవడం ఆనవాయితీగా మార్చుకున్నారు.⇒ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో 2015 మార్చిలో రూ.1,170.25 కోట్లతో పట్టిసీమ ఎత్తిపోతలకు చంద్రబాబు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు. 21.999 శాతం అధిక ధరలకు అంటే రూ.1,427.70 కోట్లకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థ ఎల్–1గా నిలిచింది. ఆ సంస్థకు పనులు అప్పగించేశారు. దేశ చరిత్రలో కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరలకు అత్యధికంగా అప్పగించిన టెండర్ ఇదే కావడం గమనార్హం. నిబంధనల ప్రకారం ఐదు శాతం కంటే అధిక ధరలకు కోట్ చేస్తే ఆ టెండర్‌ను రద్దు చేయాలి. అయితే చంద్రబాబు మాత్రం ఐదు శాతం అధిక ధరలు, ఏడాదిలో ఎత్తిపోతల పూర్తి చేస్తే 16.999 శాతం బోనస్‌గా ఇస్తామంటూ టెండర్ ఆమోదించేశారు. 2016 మార్చి నాటికి ఆ పథకం పూర్తయినా అప్పుడు గోదావరిలో ప్రవాహం లేనందున ఎలాంటి ప్రయోజనం ఉండదు. వీటినేవి పరిగణనలోకి తీసుకోకుండా అక్రమంగా 21.999 శాతం అధిక ధరలకు కాంట్రాక్టర్‌కు అప్పగించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై రూ.257.45 కోట్ల భారం పడింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు పది శాతం నిధులను మొబిలైజేషన్ అడ్వాన్సులుగా అప్పగించి కమీషన్లు రాబట్టుకున్నారు. పట్టిసీమ టెండర్లో నాటి చంద్రబాబు సర్కార్ ఖజానాను కాంట్రాక్టర్‌కు దోచిపెట్టిందని కాగ్ 2017–18లో ఇచ్చిన నివేదికే ఇందుకు నిదర్శనం.⇒ ప్రకాశం బ్యారేజీకి 21 కి.మీ. ఎగువన కృష్ణా నదిపై వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మాణానికి 2018లో తొలుత రూ.801.88 కోట్లతో చంద్రబాబు సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. తర్వాత దాన్ని రద్దు చేసి అంచనా వ్యయాన్ని అమాంతం రూ.1,376 కోట్లకు పెంచేసి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే అంచనాల్లోనే రూ.574.12 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఈ పనులను రామోజీరావు కుమారుడి వియ్యంకుడికి చెందిన నవయుగకు దక్కేలా టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 13.19% అధిక ధరకు రూ.1,554.88 కోట్లకు నిబంధనలకు విరుద్ధంగా నవయుగకు అప్పగించారు. అంచనాలు పెంచడం, అధిక ధరలకు పనులు అప్పగించడం ద్వారా నవయుగకు ఖజానా నుంచి ఉత్తినే రూ.753 కోట్లు దోచిపెట్టడానికి రంగం సిద్ధం చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిపుణుల కమిటీ సిపార్సు మేరకు వైకుంఠపురం బ్యారేజీ పనుల టెండర్‌ను రద్దు చేయడంతో నవయుగ దోపిడీకి బ్రేక్ పడింది.⇒ 2014–19 మధ్య వివిధ శాఖల్లో మొత్తం రూ.3.51 లక్షల కోట్ల విలువైన పనులకు చంద్రబాబు సర్కార్ టెండర్లు నిర్వహించింది. ఎన్నికల సంవత్సరం 2018–19లోనే రూ.1.27 లక్షల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచింది. అధిక ధరలకు పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడం ద్వారా ఖజానాపై రూ.20 వేల కోట్ల మేర భారం వేసి ఆ మేరకు కమీషన్ల రూపంలో చంద్రబాబు తన జేబులో వేసుకున్నారు.⇒ 2024 ఎన్నికల్లో జనసేన, బీజేపీతో జట్టు కట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మళ్లీ 2014–19 తరహాలోనే కాంట్రాక్టర్లతో కలిసి ఖజానాను దోచేసేందుకు సిద్ధమైనట్లు తాజాగా రివర్స్ టెండరింగ్ విధానం రద్దు నిర్ణయంతో స్పష్టమవుతోంది.రివర్స్ టెండరింగ్ ఇదీ..బోర్డు ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ (బీవోసీఈ) నివేదిక ఆధారంగా రివర్స్ టెండరింగ్‌పై 2019 ఆగస్టు 16న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబరు 67 జారీ చేసింది. ఈ విధానంలో జ్యూడీషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదించిన కాంట్రాక్టు విలువను ఖరారు చేస్తూ టెండర్ షెడ్యూలు ముసాయిదాతోనే నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీనివల్ల ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడతారు. టెండర్లో ఆర్థిక బిడ్ తెరిచాక తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌ను ఎల్–1గా ఖరారు చేస్తారు. ఎల్–1గా నిలిచిన కాంట్రాక్టర్ కోట్ చేసిన మొత్తానే కాంట్రాక్టు విలువగా నిర్ణయించి ఆన్లైన్లో రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తారు. అత్యంత తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌కు సాంకేతిక కమిటీ సిఫార్సు మేరకు పనులు అప్పగిస్తారు. గత ప్రభుత్వం 59 నెలల పాటు ఇదే పద్ధతిలో టెండర్లు నిర్వహించడం ద్వారా ఖజానాకు రూ.7,500 కోట్లకుపైగా ఆదా చేసింది.రివర్స్ టెండరింగ్‌తో పగిలిన అక్రమాల పుట్ట..2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టెండర్ల వ్యవస్థను సంస్కరించారు. జ్యుడీషియల్ ప్రివ్యూ వ్యవస్థను ప్రవేశపెట్టారు. రూ.వంద కోట్లు అంతకంటే అధిక వ్యయం ఉన్న పనుల టెండర్ ముసాయిదా షెడ్యూల్‌ను జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి పరిశీలనకు పంపాలని ఆదేశించారు. దీనిపై జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి ఆన్లైన్లో అన్ని వర్గాల ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేలా విధాన నిర్ణయం తీసుకున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకుని టెండర్ ముసాయిదా షెడ్యూలులో మార్పుచేర్పులను జడ్జి సూచిస్తారు. ఎలాంటి మార్పులు అవసరం లేదని భావిస్తే ముసాయిదా షెడ్యూల్‌ను యథాతధంగా ఆమోదిస్తారు. జ్యూడీషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదించిన టెండర్ ముసాయిదా షెడ్యూలుతోనే టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు చేపట్టారు. ఇక రూ.కోటి అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులకు రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్లు నిర్వహించేలా విధానాన్ని రూపొందించారు. దీనిద్వారా టెండర్ల వ్యవస్థను అత్యంత పారదర్శకంగా మార్చారు. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చే నిబంధనను తొలగించారు.⇒ రాష్ట్రంలో 2014–19 మధ్య సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అక్రమాలపై నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా రివర్స్ టెండరింగ్‌కు వైఎస్ జగన్ ఆదేశించారు. తొలుత పోలవరం ఎడమ కాలువ అనుసంధానం (ప్యాకేజీ–65) పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఈ పనులను 2018లో రూ.278 కోట్ల అంచనా వ్యయంతో టీడీపీ సర్కార్ నిర్వహించిన టెండర్లలో 4.8 శాతం అధిక ధరలకు అంటే రూ.292.09 కోట్లకు మ్యాక్స్ ఇన్ఫ్రాకు కట్టబెట్టారు. దీనివల్ల ఖజానాపై రూ.14.09 కోట్ల భారం పడింది. చంద్రబాబు సర్కార్ కాంట్రాక్టర్‌కు అప్పగించిన పనుల విలువ మొత్తం రూ.292.09 కోట్లనే కాంట్రాక్టు విలువగా పరిగణించి వైఎస్ జగన్ రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఆరు సంస్థలు పోటాపోటీగా బిడ్లు దాఖలు చేశాయి. టీడీపీ హయాంలో రూ.292.09 కోట్లకు పనులను దక్కించుకున్న మ్యాక్స్ ఇన్ఫ్రా సంస్థే రివర్స్ టెండరింగ్‌లో రూ.231.47 కోట్లకే పనులు చేయడానికి ముందుకొచ్చింది. దాంతో ఖజానాకు రూ.60.62 కోట్లు ఆదా అయ్యాయి. తద్వారా చంద్రబాబు సర్కార్ అక్రమాలు బట్టబయలయ్యాయి.⇒ పోలవరం హెడ్ వర్క్స్ (జలాశయం)లో రూ.2,917 కోట్ల విలువైన పనులను నవయుగకు చంద్రబాబు నామినేషన్‌పై కట్టబెట్టారు. ఇందులో 2019 మే 30 నాటికి రూ.1,771.44 కోట్ల విలువైన పనులు మిగిలాయి. హెడ్ వర్క్స్‌కు అనుసంధానంగా 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం పనులను కూడా నవయుగకే 4.8 శాతం అధిక ధరలకు రూ.3,216.11 కోట్లకు చంద్రబాబు అప్పగించారు. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు వైఎస్ జగన్ ఈ రెండు పనులను రద్దు చేశారు. నవయుగకు అప్పగించిన విలువనే కాంట్రాక్టు విలువగా పరిగణించి రెండింటినీ కలిపి ఒకే ప్యాకేజీ కింద రూ.4,987.55 కోట్లతో రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఈ పనులను 12.6 శాతం తక్కువ ధరలకు అంటే రూ.4,358.11 కోట్లకే చేసేందుకు మేఘా సంస్థ ముందుకొచ్చింది. దాంతో ప్రభుత్వ ఖజానాకు రూ.629.44 కోట్లు ఆదా అయ్యాయి. చంద్రబాబు సర్కార్ గతంతో జలవిద్యుత్కేంద్రం పనులను 4.8 శాతం అధిక ధరలకు అప్పగించడం వల్ల ఖజానాపై రూ.154 కోట్ల భారం పడింది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే రివర్స్ టెండరింగ్ వల్ల రూ.783.44 కోట్లు ఆదా అవడంతో చంద్రబాబు అక్రమాలు మరోసారి నిరూపితమయ్యాయి.⇒ ఒక్క సాగునీటి ప్రాజెక్టుల పనుల్లోనే రివర్స్ టెండరింగ్ ద్వారా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.2,500 కోట్లకుపైగా ఆదా చేసింది. రహదారులు, భవనాలు, పురపాలక, పట్టణాభివృద్ధి తదితర శాఖల్లో మొత్తం రూ.3,60,448.45 కోట్ల విలువైన 4,36,164 పనులకు టెండర్లు నిర్వహించగా రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.7,500 కోట్లకుపైగా ఖజానాకు ఆదా అయ్యాయి. దేశ చరిత్రలో ఇదో రికార్డు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత పారదర్శకమైన టెండర్ల విధానం అమల్లో ఉందని, ఇది దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తోందని నాడు నీతి అయోగ్ ప్రశంసించడం గమనార్హం. -
AP: డీఎస్సీ, పెన్షన్లకు కేబినెట్ ఆమోదం
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు మూడున్నర గంటల పాటు జరిగిన భేటీలో పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీలో భాగంగా ఐదు సంతకాలకు ఆమోదం తెలిపారు. డీఎస్సీ, పెన్షన్లు, అన్నా క్యాంటీన్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, స్కిల్ సెన్సస్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. హెల్త్ యూనివర్సిటీ పేరు పునరుద్ధరణకు కూడా ఆమోదం తెలిపారు. -
Modi 3.0: 3 కోట్ల ఇళ్ల నిర్మాణం
న్యూఢిల్లీ: ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన కింద (పీఎంఏవై) దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ సాయమందించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కొత్తగా కొలువుదీరిన ఎన్డీఏ మంత్రివర్గం సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన తొలిసారి సమావేశమైంది. మోదీ అధికారిక నివాసం ‘7, లోక్ కల్యాణ్ మార్గ్’లో జరిగిన ఈ భేటీలో బీజేపీతో సహా అన్ని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రులు పాల్గొన్నారు. అర్హులైన కుటుంబాల గృహ నిర్మాణ అవసరాలను తీర్చాలని భేటీలో నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అర్హులైన పేద కుటుంబాలకు కనీస సదుపాయాలతో కూడిన ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సాయం చేసే నిమిత్తం 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి పీఎంఏవై పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. దీని కింద గత పదేళ్లలో 4.21 కోట్ల మంది అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. -
మోదీ కేబినెట్ తొలి నిర్ణయం: పేద ప్రజలకు శుభవార్త
నరేంద్ర మోదీ మూడోసారి భారత ప్రధానిగా జూన్ 9న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు (జూన్ 10) మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో కొత్త మంత్రుల శాఖలను కూడా ప్రకటించారు. ఈ తరుణంలోనే పట్టణ, గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సొంతింటి కలను నిజం చేయడానికి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.నరేంద్ర మోదీ.. ఇతర కేంద్ర మంత్రుల మంత్రివర్గ సమావేశంలో పీఎం ఆవాస్ యోజన కింద ఏకంగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆర్ధిక సాయం అందించడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దేశంలో సొంతింటి కలను నిజం చేసుకునే వారికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఓ గొప్ప వరం అనే చెప్పాలి.పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయాలనే సదుద్దేశ్యంతో.. 2015-16 బడ్జెట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ప్రకటించారు. అర్హత కలిగిన పేద ప్రజలు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుంది. గడిచిన 10 సంవత్సరాల్లో పీఎం ఆవాస్ యోజన కింద 4.21 కోట్ల ఇల్లు పూర్తయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.ఇళ్ల నిర్మాణాలు మాత్రమే కాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరుగుదొడ్లు, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్, విద్యుత్తు కనెక్షన్, కుళాయి (నల్లా) కనెక్షన్ వంటివి కూడా ఉన్నాయి. ఇవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలు చేయడం జరిగింది. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
కేంద్ర ప్రభుత్వం డీఏ (Dearness Allowance)ను 4 శాతం పెంచే నిర్ణయానికి ఈ రోజు (గురువారం) ఆమోదం తెలిపినట్లు. ఈ పెంపు తరువాత డియర్నెస్ అలవెన్స్ & డియర్నెస్ రిలీఫ్ (డిఆర్) 50 శాతానికి చేరుతుంది. ఈ పెంపు వల్ల కేంద్రం రూ.12,868.72 కోట్ల రూపాయల అదనపు భారాన్ని భరించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు 49.18 లక్షల మంది ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. వచ్చే నెల నుంచే జీతాలు, పెన్షన్ వంటివి భారీగా పెరుగుతాయి. డియర్నెస్ అలవెన్స్ పెంపుతో పాటు, రవాణా అలవెన్స్, క్యాంటీన్ అలవెన్స్, డిప్యుటేషన్ అలవెన్స్‌లలో కూడా 25 శాతం పెరుగుదల ఉంటుందని సమాచారం. #WATCH | Union Cabinet approves hike in Dearness Allowance to govt employees and Dearness Relief to pensioners by 4% from January 1, 2024, announces Union Minister Piyush Goyal. pic.twitter.com/IsWUnwBGHW — ANI (@ANI) March 7, 2024 -
PM Surya Ghar Muft Bijli Yojna: రూఫ్‌టాప్ సోలార్ రాయితీ 78 వేలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రూఫ్‌టాప్ సౌర విద్యుత్ పథకం ‘పీఎం–సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని అధ్యక్షతన మంత్రివర్గం గురువారం సమావేశమైంది. రూ.75,021 కోట్లతో అమలు చేసే ఈ పథకం కింద దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఇళ్లపై సౌర ఫలకాల ఏర్పాటుకు లబి్ధదారులకు రూ.78,000 వరకు రాయితీ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలియజేశారు. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లాకో మోడల్ సోలార్ గ్రామం రూప్‌టాప్ సౌర విద్యుత్ పథకాన్ని ప్రధాని మోదీ ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన ప్రారంభించారు. పథకం అమలులో భాగంగా 2 కిలోవాట్ల సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం ఆర్థిక సాయం అందిస్తుంది. 2 కిలోవాట్ల నుంచి 3 కిలోవాట్ల సోలార్ పవర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి అదనంగా మరికొంత ఆర్థిక సాయం అందజేస్తుంది. 3 కిలోవాట్ల వరకే పరిమితి విధించారు. ఒక కిలో వాట్ వ్యవస్థకు రూ.30 వేలు, 2 కిలోవాట్ల వ్యవస్థకు రూ.60 వేలు, 3 కిలోవాట్ల వ్యవస్థకు రూ.78 వేల చొప్పున కేంద్రం నుంచి రాయితీ లభిస్తుంది. లబ్ధిదారులు రాయితీ సొమ్ము కోసం నేషనల్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసే కంపెనీని పోర్టల్ ద్వారా ఎంపిక చేసుకోవచ్చు. కేంద్రం ఇచ్చే రాయితీ మినహా మిగిలిన పెట్టుబడి కోసం ఎలాంటి పూచీకత్తు లేకుండానే తక్కువ వడ్డీకే రుణం తీసుకొనే అవకాశం కలి్పంచారు. సౌర విద్యుత్‌పై గ్రామీణ ప్రజలకు అవగాహన కలి్పంచడానికి ప్రతి జిల్లాలో ఒక మోడల్ సోలార్ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూఫ్‌టాప్ సోలార్ పథకాన్ని ప్రమోట్ చేసే పట్టణ స్థానిక సంస్థలకు, పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్రం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 3 కిలోవాట్ల సౌర విద్యుత్ వ్యవస్థ నెలకు 300 యూనిట్లకుపైగా కరెంటును ఉత్పత్తి చేస్తుంది. 300 యూనిట్లు ఉచితంగా ఉపయోగించుకొని, మిగిలిన కరెంటును డిస్కమ్‌లకు విక్రయించి ఆదాయం పొందవచ్చు. పీఎం–సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన కింద సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి, రాయితీ పొందడానికి https:// pmsuryaghar.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకం ద్వారా కొత్తగా 17 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. -
అయోధ్య ఎయిర్‌పోర్టుకు మహర్షి వాల్మికి పేరు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మికి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు–అయోధ్యధామ్’ అని పేరుపెట్టాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించాలని కూడా నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది. రైల్వేలో ‘సున్నా కర్బన ఉద్గారాల’ లక్ష్యాన్ని సాధించడానికి అమెరికాతో ఒప్పందానికి అనుమతించింది. మారిషస్ భాగస్వామ్యంతో ఉమ్మడిగా బుల్లి ఉపగ్రహం అభివృద్ధికి అవగాహనా ఒప్పందానికి కూడా అంగీకరించింది. ‘పృథ్వీ విజ్ఞాన్’కు ఆమోదం ఎర్త్ సైన్సెస్ రంగంలో ఐదు వేర్వేరు పథకాల కింద పరిశోధనలకు, కేటాయించిన నిధుల వినియోగానికి ఉద్దేశించిన ‘పృథ్వీ విజ్ఞాన్’కు కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని అమలుకు రూ.4,797 కోట్లు కేటాయించింది. ఇది ఐదేళ్లపాటు అమల్లో ఉంటుంది. వాతావరణం, సముద్రం, క్రయోస్పియర్, పోలార్ సైన్స్, సీస్మాలజీ, జియోసైన్సెస్ వంటి అంశాలపై పరిశోధనలు చేయనున్నారు. పృథ్వీ విజ్ఞాన్ కింద రీసెర్చ్ ప్రాజెక్టులను విదేశీ సంస్థలకు అప్పగించడానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. గయానా నుంచి ముడి చమురు కొనుగోలుతో పాటు హైడ్రో కార్బన్ రంగంలో పరస్పర సహకారానికి ఒప్పందం కుదుర్చుకునేందుకూ అంగీకరించింది. గయానాలో ముడి చమురు అన్వేషణ, ఉత్పత్తిలో భారతీయ కంపెనీలకు సైతం భాగస్వామ్యం కలి్పస్తారు. ప్రపంచ దేశాలతో అయోధ్య అనుసంధానం: మోదీ అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలపడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. దీన్ని వాల్మికి మహర్షికి దేశ ప్రజల తరపున ఘనమైన నివాళిగా అభివరి్ణంచారు. అయోధ్యను ప్రపంచ దేశాలతో అనుసంధానించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. -
Israel-Hamas war: కాల్పులకు విరామం
జెరూసలేం/ఐరాస: తాత్కాలికంగానైనా ప్రార్థనలు ఫలించాయి. ప్రపంచ దేశాల విన్నపాలు ఫలితమిచ్చాయి. తీవ్ర ప్రతీకారేచ్ఛతో గాజాపై ఆరు వారాలుగా వైమానిక, భూతల దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఓ మెట్టు దిగొచి్చంది. అంతర్జాతీయ సమాజం విజ్ఞప్తి మేరకు తాత్కాలికంగా కాల్పుల విరమణకు ఎట్టకేలకు అంగీకరించింది. ఈ మేరకు ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. ‘‘ఇజ్రాయెల్ నాలుగు రోజుల పాటు కాల్పులను పూర్తిగా నిలిపేస్తుంది. బదులుగా హమాస్ తన చెరలో ఉన్న 240 మంది పై చిలుకు బందీల్లో 50 మందిని విడిచిపెడుతుంది’’ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయం పేర్కొంది. బందీలందరినీ విడిపించేందుకు కట్టుబడి ఉన్నట్టు తెలిపింది. ఒప్పందంలో భాగంగా తమ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనియన్లను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించినట్టు సమాచారం. హమాస్ చెర నుంచి బయట పడేవారిలో అత్యధికులు మహిళలు, పిల్లలే ఉంటారని చెబుతున్నారు. ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా మహిళలు, పిల్లలను విడిచి పెట్టనుందని ఖతర్ వెల్లడించింది. ఈజిప్టు, అమెరికాతో పాటు ఖతర్ కూడా ఇరు వర్గాల చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించడం తెలిసిందే. నిత్యావసరాలతో సహా సర్వం నిండుకుని మానవీయ సంక్షోభంతో అల్లాడిపోతున్న గాజాకు ఈ నాలుగు రోజుల్లో అదనపు సాయాన్ని అనుమతించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించినట్టు ఖతర్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒప్పందం మలి దశలో భాగంగా మున్ముందు ఇరువైపుల నుంచి మరింత మంది బందీలు విడుదలవుతారని చెప్పుకొచి్చంది. కాల్పుల విరమణ గురువారం ఉదయం పదింటి నుంచి అమల్లోకి రానుంది. యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కుండబద్దలు కొట్టారు! నాలుగు రోజుల విరామం ముగియగానే గాజాపై దాడులు పునఃప్రారంభం అవుతాయని ఆయన స్పష్టం చేశారు. ‘‘మేం ముట్టడిలో ఉన్నాం. హమాస్‌ను నిర్మూలించి మా లక్ష్యాలన్నింటినీ సాధించేదాకా యుద్ధాన్ని కొనసాగించి తీరతాం’’ అని ప్రకటించారు. దీర్ఘకాలిక యుద్ధానికి సైన్యం మరింతగా సన్నద్ధమయ్యేందుకు విరామం ఉపయోగపడుతుంది తప్ప సైనికుల స్థైర్యాన్ని తగ్గించబోదని ఆయన అన్నారు. అయితే హమాస్ చెరలోని బందీల్లో ప్రతి 10 మంది విడుదలకు ప్రతిగా కాల్పుల విరామాన్ని ఒక రోజు చొప్పున పెంచేందుకు ఇజ్రాయెల్ సమ్మతించింది. కాల్పుల విరమణను ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలు దేశాధినేతలు స్వాగతించారు. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న హమాస్ ఇస్లామిక్ మిలిటెంట్లు మెరుపు దాడికి దిగడం తెలిసిందే. 1,200 మందికి పైగా ఇజ్రాయెలీలను హతమార్చడంతో పాటు 240 మందికి పైగా బందీలుగా గాజాకు తరలించారు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగి గాజాపై ఆరు వారాలుగా క్షిపణులు, బాంబుల వర్షం కురిపిస్తోంది. ఏం జరగనుంది... ► ఇజ్రాయెల్, హమాస్ రెండూ నాలుగు రోజుల పాటు కాల్పులను పూర్తిగా నిలిపేస్తాయి. ►ముందు తమ వద్ద ఉన్న బందీల్లోంచి 50 మంది మహిళలు, చిన్నారులను రోజుకు 12 మంది చొప్పున హమాస్ విడుదల చేస్తుంది. ►అనంతరం ఇజ్రాయెల్ కూడా తన జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనియన్లను విడుదల చేస్తుందని ఖతర్ ప్రకటించింది. ►బహుశా గురువారమే బందీల విడుదల ప్రక్రియ మొదలవ్వొచ్చని వైట్‌హౌస్ అభిప్రాయపడింది. ►ఈ నాలుగు రోజుల్లో గాజాకు అదనపు మానవీయ సాయాన్ని ఇజ్రాయెల్ అనుమతిస్తుంది. ఇప్పట్లో మళ్లీ కాల్పులుండనట్టే...! విరామానికి స్వస్తి చెప్పి ఇజ్రాయెల్ ఇప్పట్లో గాజాపై మళ్లీ దాడులకు దిగడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘‘50 మంది బందీలు విడుదలైతే మిగతా వారినీ విడిపించాలంటూ కుటుంబీకుల నుంచి ఇజ్రాయెల్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. అందులోనూ హమాస్ తన చెరలో ఉన్న సైనికులను చిట్టచివరన గానీ వదిలిపెట్టదు. అప్పటిదాకా దాడులు మొదలు పెట్టేందుకు వారి కుటుంబాలు ఒప్పుకోకపోవచ్చు’’ అని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో హమాస్ దీన్ని తమ విజయంగా చెప్పుకుంటే అది నెతన్యాహూ సర్కారుకు ఇబ్బందికరంగా పరిణమించవచ్చు. మరోవైపు, గాజాపై ఇజ్రాయెల్ దాడులు బుధవారం కూడా తీవ్ర స్థాయిలో కొనసాగాయి. ఉత్తర గాజాలో జబాలియా శరణార్థి శిబిరం బాంబు దాడులతో దద్దరిల్లింది. హమాస్ కూడా రోజంతా ఇజ్రాయెల్‌పైకి రాకెట్ దాడులు కొనసాగించింది. -
సీఎం జగన్ నిర్ణయంపై జర్నలిస్టుల హర్షం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు సీఎం జగన్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రి మండలి సమావేశం ఆమోదం తెలిపిన విషయం విదితమే. సీఎం జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీకి ఆమోదం తెలపడం చరిత్రాత్మకమైన నిర్ణయమని పలు జర్నలిస్టు సంఘాలు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా, అంతర్ రాష్ట్ర వ్యవహారాల సలహాదారు దేవులపల్లి అమర్ ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ఉమ్మడి ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసిన దివంగత సీఎం వైఎస్సార్ తనయుడుగా.. నేడు రాష్ట్రంలోని వేలాది మందికి మేలు చేసే నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని తెలిపారు. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ (ఇండియా) మాజీ జాతీయ కార్యదర్శి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు మరో ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. మీడియాలోని ఒక వర్గం నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా మీడియా సంస్థల్లో పనిచేసే నిరుపేద పాత్రికేయుల చిరకాల స్వప్నాన్ని సీఎం నెరవేర్చబోతున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్ విశాల దృక్పథంతో అందజేయనున్న ఇళ్ల స్థలాలను జర్నలిస్టులు సది్వనియోగం చేసుకోవాలని సి.రాఘవాచారి ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు విడుదల చేసిన ప్రకటనలో కోరారు. అమరావతి అక్రిడేటెడ్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ బి.వి.రాఘవరెడ్డి, వైస్ చైర్మన్ ఎం.విశ్వనాథ రెడ్డి, సెక్రటరీ పి. నాగశ్రీనివాసరావు విడుదల చేసి న ప్రకటనలో జర్నలిస్టుల ఆశలను నెరవేరుస్తూ నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంకు మంత్రుల ధన్యవాదాలు.. రాష్ట్రంలోని అక్రిడేటెడ్ జర్నలిస్టులకు మూడు సెంట్ల చొప్పున ఇళ్లస్థలాలను కేటాయించాలనే సీఎం జగన్ నిర్ణయం హర్షణీయమని పలువురు మంత్రులు ప్రశంసించారు. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కొట్టు సత్యనారాయణ, కే నారాయణస్వామి, బూడి ముత్యాలనాయుడు, అంజాద్ బాషా, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కేవీ ఉషశ్రీచరణ్, ఆదిమూలపు సురే‹Ù, డాక్టర్ సీదిరి అప్పలరాజు, మేరుగ నాగార్జున, జోగి రమేష్ జర్నలిస్టుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం.. జర్నలిస్టులకు మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నట్లు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడంపై ఏలూరు జిల్లా నూజివీడులోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ వద్ద నూజివీడు ప్రెస్‌క్లబ్ అండ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కేడీసీసీబీ చైర్పర్సన్ తాతినేని పద్మావతి, ఏపీ స్టేట్ కో–ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ దేశిరెడ్డి రాఘవరెడ్డి పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. చదవండి: సంపూర్ణ సాధికారత -
ఎరువులపై రూ.22,303 కోట్ల సబ్సిడీ
న్యూఢిల్లీ: రబీ సీజన్లో పాస్ఫరస్, పొటాషియం (పీ అండ్ కే) సంబంధిత ఎరువులపై రూ.22,303 కోట్ల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 50 కేజీల డీఏపీ బస్తా ధరను రూ.1,350గానే కొనసాగించాలని నిర్ణయించింది. 2023–24 రబీ సీజన్(2023 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 2024 మార్చి 31 దాకా)లో పోషకాల ఆధారిత సబ్సిడీకి ఎరువులు, రసాయనాల శాఖ చేసిన ప్రతిపాదనలకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తర్వాత మీడియాకు వెల్లడించారు. రైతులకు అందుబాటు ధరల్లో చాలినన్ని ఎరువులను అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. ‘ నత్రజని, ఫాస్ఫరస్, పొటాíÙయంలు పాత ధరకే లభిస్తాయి. అంటే బస్తా నత్రజని పాత రూ.1,470 ధరకే, ఎస్ఎస్పీ(సింగిల్ సూపర్ ఫాస్ఫేట్) బస్తా దాదాపు రూ.500కు దొరుకుతాయి. ఫొటాష్(ఎంఓపీ) బస్తా ధర రూ.1,655కు తగ్గనుంది’ అని మంత్రి వివరించారు. గత ఖరీఫ్ సీజన్‌కు రూ.38,000 కోట్ల ఎరువుల సబ్సిడీని కేంద్రం అందజేయడం తెలిసిందే. మొత్తం వార్షిక ఎరువుల సబ్సిడీ రూ.2.55 లక్షల కోట్లకు పెరిగిందని ఠాకూర్ చెప్పారు. -
మేరా యువ భారత్ వేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: యువతలో నైపుణ్యాల అభివృద్ధి కోసం మేరా యువ భారత్ (మై భారత్) అనే స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ ఏర్పాటుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో యువతలో నైపుణ్యాల అభివృద్ధి, నాయకత్వ లక్షణాల పెంపు కోసం ఒక వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులకు వెల్లడించారు. అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఈ సంస్థను జాతికి అంకితం చేయనున్నారు. యువతలో నైపుణ్యాలను, ఆకాంక్షాలను వెలికి తీయడమే లక్ష్యంగా ఆ సంస్థ పనిచేస్తుందన్నారు. మరోవైపు కేబినెట్ సమావేశంలో కొన్ని ఖనిజాలకు సంబంధించిన రాయల్టీ రేట్లను నిర్ణయించారు. లిథియం, నియోబియం ఖనిజాలకు 3%, అరుదుగా లభించే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (ఆర్ఈఈ)లకు ఒక్క శాతం రాయల్టీ నిర్ణయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. -
పీఎం–ఈబస్ సేవాతో ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 10,000 ఎలక్ట్రిక్ బస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పీఎం–ఈబస్ సేవా’ పథకం.. క్షేత్ర స్థాయిలో ఈవీల విస్తరణకు దోహదపడుతుందని పరిశ్రమ వర్గాల్లో ఆశాభావం వ్యక్తమైంది. పట్టణాల్లో ఎలక్ట్రిక్ బస్ సేవలకు వీలుగా ఈ పథకానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. 169 పట్టణాలకు 10,000 బస్‌లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో కేటాయించనున్నారు. ప్రభుత్వ నిర్ణయం ఎలక్ట్రిక్ ఆటోమోటివ్ కంపెనీలకు ప్రయోజనం కలిగించనుంది. ఈ పథకంపై జేబీఎం ఆటో వైస్ చైర్మన్, ఎండీ నిశాంత్ ఆర్య స్పందిస్తూ.. ప్రముఖ పట్టణాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పర్వత ప్రాంతాలకు, ఈశాన్య రాష్ట్రాలకు కేటాయింపులు చేయడంతో ఎలక్ట్రిక్ బస్‌లను క్షేత్రస్థాయికి తీసుకెళ్లిన్టటు అవుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఈవీ ఎకోసిస్టమ్ మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. పీఎంఐ ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ సీఈవో ఆంచాల్ జైన్ సైతం దీన్ని నిర్ణయాత్మక, పరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చేసే పథకంగా పేర్కొన్నారు. స్థానికంగా ఈబస్ల తయారీని ప్రోత్సహిస్తుందన్నారు. -
మన డేటా ఎంత భద్రం? కేంద్రం ముసాయిదా బిల్లులో ఏముంది ?
మనమున్న సైబర్ ప్రపంచంలో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పౌరుల వ్యక్తిగత గోప్యత ప్రశ్నార్థకంగా మారింది. ఒక యాప్ డౌన్ లోడ్ చేసుకున్నా చాలు మన వ్యక్తిగత సమాచారం బజార్లో పడినట్టే. మెటా, ట్విట్టర్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు ఈ– కామర్స్ సైట్లు పౌరుల వ్యక్తిగత డేటాతో ఆటాడుకుంటున్నాయి. వీటి దూకుడుకు కళ్లెం వేయడానికే ఇప్పుడీ ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ‘‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ బిల్లు–2022’’ను (డీపీడీపీ) వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. ఈ డిజిటల్ ప్రపంచంలో పౌరుల వ్యక్తిగత సమాచారం గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. గత ఆరేళ్లుగా మేధోమథనం సాగించిన కేంద్రం ప్రభుత్వం ఎట్టకేలకు ముసాయిదా బిల్లును రూపొందించింది. గతేడాది నవంబర్‌లో ప్రజలు, సామాజిక సంస్థల అభిప్రాయం కోసం వెలువరించిన ముసాయిదా బిల్లులో అంశాలే ఇంచుమించుగా ఇందులో ఉన్నాయి. అయితే విదేశీ సంస్థలు సమాచార సేకరణలో కొన్ని ఆంక్షల్ని విధించారు. బిల్లులో ఏముందంటే ? డీపీడీపీ బిల్లును ఇంకా పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉండడంతో దీని వివరాలను కేంద్రం అత్యంత గోప్యంగా ఉంచింది. అయితే కొన్ని జాతీయ మీడియా కథనాల ప్రకారం నిపుణులు ఆందోళన వ్యక్తం చేసిన కొన్ని వివాదాస్పద అంశాలు అలాగే ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థలకు విస్తృతమైన మినహాయింపులు ఇవ్వడం, డేటా ప్రొటక్షన్ బోర్డు పాత్రను గణనీయంగా తగ్గించడం వంటివి ఉన్నట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఇక ప్రభుత్వాధికారులు, ఇతర నాయకులకు సంబంధించిన డేటా కూడా ఈ చట్టం కింద గోప్యంగా ఉంచడం వల్ల సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందనే ఆందోళనలున్నాయి. ఇంకా బిల్లులో ఉన్న అంశాలివే.. ► ఆన్లైన్ లేదంటే ఆఫ్‌లైన్ ద్వారా సమాచారం సేకరించి డిజిటలైజ్ చేసే పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని పూర్తిగా వారి సమ్మతితో సేకరించాలి. దానిని భద్రంగా ఉంచాల్సిన బాధ్యత ఆ సంస్థలదే. తమ పని పూర్తి కాగానే ఆ సమాచారాన్ని తొలగించాలి. ► మన దేశంలో డిజిటల్ పర్సనల్ డేటాను సేకరించి ప్రాసెస్ చేయవచ్చు. అదే విదేశాల్లో వస్తు, సేవల వినియోగంలో మాత్రం డేటాను సేకరించే అవకాశం ఉంటుంది. ► వివిధ సామాజిక మాధ్యమాలు, ఈ కామర్స్ సంస్థలు, మొబైల్ యాప్స్ జవాబుదారీ తనం పెరిగేలా సేకరించిన సమాచారాన్ని ఎలా భద్రపరుస్తున్నారు, ఏ రకంగా సేకరిస్తున్నారు ? పౌరుల సమాచారాన్ని ఏ రకంగా ఉపయోగిస్తున్నారు ? వంటి ప్రశ్నలకు ఆయా సంస్థలు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది ► ఏదైనా సమాచారం చుట్టూ వివాదం చెలరేగితే కేంద్రం ఏర్పాటు చేయనున్న డేటా ప్రొటక్షన్ బోర్డు ఆఫ్ ఇండియా వాటిని పరిష్కరి స్తుంది. ఈ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ను కేంద్రమే నియమిస్తుంది. ► పౌరుల వ్యక్తిగత సమాచారం ఉల్లంఘన జరిగితే సదరు కంపెనీలకు అత్యధికంగా రూ.250 కోట్ల జరిమానా విధించవచ్చు. ► ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు వేర్వేరు విధివిధానాలున్నాయి. జాతి భద్రతకు సంబంధించిన అంశాల్లో సమాచార సేకరణపై మినహాయింపులున్నాయి. ► పౌరులు తమ డేటాను వాడుకున్నారని భావిస్తే నష్టపరిహారం కోసం కోర్టుకి ఎక్కొచ్చు. చిన్నారుల వ్యక్తిగత డేటాను సేకరించాల్సి వచ్చిన ప్పుడు వారి లీగల్ గార్డియన్ అనుమతి తప్పనిసరిగా ఉంటుంది. ► ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతో వాణిజ్య లావాదేవీల్లో అత్యంత కీలకం కానుంది. గతంలో ఏం జరిగింది? వ్యక్తిగత డేటా పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ కఠినమైన నిబంధనల్నీ విధిస్తూ ఉంటే మన ప్రభుత్వం 2018 నుంచి ఈ చట్టంపై కసరత్తు చేస్తోంది. వ్యక్తిగత డేటా పరిరక్షణ కోసం ఉద్దేశించిన శ్రీకృష్ణ కమిటీ 2018లో ఒక ముసాయిదా బిల్లు కేంద్రానికి సమర్పించింది. కానీ కేంద్రానికి, దిగ్గజ సామాజిక మాధ్యమ సంస్థలకి మధ్య ఒక అంగీకారం రాలేదు. చివరికి 2019లో ఒక ముసాయిదా బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లులో సమగ్రత లోపించిందని స్వయంగా జస్టిస్ శ్రీకృష్ణ పేర్కొనడం కలకలం రేపింది. డేటా పరిరక్షణ బిల్లు నిబంధనల్ని అతిక్రమించే వారి జాబితా నుంచి ప్రభుత్వం తనని తాను మినహాయించుకోవడంతో దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆ బిల్లులో 81 సవరణలు చేయాలంటూ పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించడంతో గత ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును ఉపసంహరించుకుంది. విదేశాల్లో వ్యక్తిగత గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ప్రపంచంలోని 71% దేశాల్లో వ్యక్తిగత సమాచారం భద్రతపై కఠినమైన చట్టాలే ఉన్నాయి. వాణిజ్యం, అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సదస్సులో తీసుకున్న నిర్ణయానికనుగుణంగా 194 దేశాల్లోని 137 దేశాలు డేటా పరిరక్షణ కోసం చట్టాలు రూపొందించాయి. ► ఆఫ్రికా దేశాల్లో 54గాను 33 దేశాల్లో (61%) డేటా చట్టాలు అమల్లో ఉన్నాయి. ► ఆసియా దేశాల్లో ఇది ఇంకా తక్కువగా 57% మాత్రమే ఉంది. ► 60 దేశాలకు గాను 34 దేశాలు చట్టాలను రూపొందించాయి. ఇక వెనుకబడిన దేశాలు 46కి గాను 22 దేశాల్లో మాత్రమే చట్టాలున్నాయి. అంతర్జాతీయంగా ఈయూ మోడల్, యూఎస్ మోడల్ చట్టాలే అత్యధికంగా ప్రాచుర్యం పొందాయి. ఈయూ మోడల్లో వ్యక్తిగత సమాచార సేకరణ నిబంధనలు అత్యంత కఠినంగా ఉంటాయి. పౌరుల డేటా బయటకు వచ్చిందంటే ఆయా సంస్థలకు భారీగా జరిమానాలు విధిస్తాయి. అత్యధిక దేశాలు ఈ మోడల్‌నే అనుసరిస్తున్నాయి. ఇక అమెరికా మోడల్లో డేటా భద్రతని వ్యక్తుల స్వేచ్ఛ పరిరక్షణగా చూస్తారు. ప్రభుత్వాలు కూడా వ్యక్తుల పర్సనల్ స్పేస్‌లోకి వెళ్లవు. వ్యక్తుల డేటా అవసరమైన ప్రతీ సారి వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. -సాక్షి, నేషనల్ డెస్క్ -
బీఎస్ఎన్ఎల్కు రూ.89,047 కోట్ల ప్యాకేజీ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ ప్రైవేటు కంపెనీలకు దీటుగా దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సేవల ప్రారంభించేందుకు కీలక అడుగు పడింది. స్పెక్ట్రమ్ కేటాయింపులతో కూడిన రూ.89,047 కోట్ల విలువ చేసే మరో పునరుద్ధరణ ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈక్విటీ రూపంలో బీఎస్ఎన్ఎల్కు 4జీ, 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపు ఈ ప్యాకేజీలో భాగంగా ఉంది. రూ.46,338 కోట్లు విలువ చేసే 700 మెగాహెర్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్, 3300 మెగాహెర్జ్ బ్యాండ్‌లో 70 మెగాహెర్జ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ (రూ.26,184 కోట్లు), 26 గిగాహెర్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రమ్ (రూ.6,565 కోట్లు), 2500 మెగాహెర్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ (రూ.9,428 కోట్లు) కేటాయించనుంది. దీంతో బీఎస్ఎన్ఎల్ అధీకృత మూలధనం రూ.1,50,000 కోట్ల నుంచి రూ.2,10,000 కోట్లకు పెరగనుంది. ఈ స్పెక్ట్రమ్ కేటాయింపులతో బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సేవలను గ్రామీణ ప్రాంతాల్లోనూ అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం 2019లో మొదటిసారి బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కు రూ.69,000 కోట్ల విలువ చేసే ప్యాకేజీ ప్రకటించింది. 2022లో మరో రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీని ఇచ్చింది. కేంద్రం సాయంతో బీఎస్ఎన్ఎల్ రుణ భారం రూ.22,289 కోట్లకు దిగొచ్చింది. -
157 నర్సింగ్ కాలేజీలు
న్యూఢిల్లీ: ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలలకు అనుబంధంగా రూ.1,570 కోట్ల వ్యయంతో నూతనంగా 157 నర్సింగ్ కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సంబంధిత కేబినెట్ భేటీ నిర్ణయాలను ఆ తర్వాత మీడియాకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఢిల్లీలో చెప్పారు. ‘కొత్త కాలేజీల రాకతో ఏటా దాదాపు 15,700 కొత్త నర్సింగ్ గ్రాడ్యుయేట్ సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రతీ కాలేజీలు 100 బీఎస్సీ(నర్సింగ్) సీట్లు ఉంటాయి. మొత్తం 157కుగాను యూపీలో 27, రాజస్థాన్‌లో 23, మధ్యప్రదేశ్‌లో 14, తమిళనాడు, పశ్చిమబెంగాల్లో చెరో 11 , కర్ణాటకలో నాలుగు కాలేజీలు నెలకొల్పుతాం’ అని మాండవీయ చెప్పారు. బ్రిటన్‌లో 26 వేల మంది, అమెరికాలో 16వేల మంది, ఆస్ట్రేలియాలో 12వేల మంది, గల్ఫ్ దేశాల్లో 20వేల మంది భారతీయ నర్సులు సేవలందిస్తున్నారు. -
కేంద్ర మంత్రివర్గం ఆమోదం.. రూ.27,360 కోట్లతో ‘పీఎం–శ్రీ’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం–శ్రీ) పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పీఎం–శ్రీ యోజన, పీఎం గతిశక్తికి సంబంధించిన రైల్వే ల్యాండ్ పాలసీ సవరణకు ఆమోదం తెలిపారు. పలు ఇతర కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేరళలో రూ.1,957 కోట్లతో కొచ్చీ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిజాస్టర్ మేనేజ్మెంట్లో పరస్పరం సహకరించుకోవడానికి వీలుగా భారత్–మాల్దీవుల మధ్య ఇటీవల కుదిరిన అవగాహనా ఒప్పందానికి(ఎంఓయూ) ఆమోదం తెలియజేసింది. విద్యార్థులకు లబ్ధి చేకూరేలా ఒక దేశంలోని కోర్సులు, విద్యార్హతలను మరో దేశం గుర్తించేలా యూకే–భారత్ మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందాన్ని కేబినెట్ ఆమోదించింది. పీఎం–శ్రీ కింద ఐదేళ్లలో రూ.27,360 కోట్లతో దేశవ్యాప్తంగా 14,597 పాఠశాలలను పీఎం–శ్రీ స్కూళ్లుగా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. 35 ఏళ్లకు రైల్వే భూముల లీజు రైల్వే కొత్త ల్యాండ్ పాలసీ ప్రతిపాదనలో కార్గో, పబ్లిక్ యుటిలిటీ, రైల్వేల ప్రత్యేక వినియోగాల్లో సవరణలు చేశారు. రైల్వే భూమిని దీర్ఘకాలిక లీజుకు ఇచ్చే విధానం రాబోయే 90 రోజుల్లో అమలవుతుందని కేంద్ర సమాచార మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ‘‘ఐదేళ్లలో 300 కార్గో టెర్మినళ్లను అభివృద్ధి చేస్తాం. తద్వారా 1.25 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. కార్గో టెర్మినళ్లతో సరుకు రవాణాలో రైల్వే వాటా కూడా పెరుగుతుంది’’ అని తెలిపారు. దన్నారు. ఆధునిక విద్యకు పెద్దపీట పీఎం–శ్రీ స్కూళ్లలో ఆధునిక విద్యావిధానం అమలు చేస్తారు. స్మార్ట్ తరగతి గదులు, క్రీడలు, సదుపాయాలపై పథకం దృష్టి సారిస్తుంది. వీటిని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. దీనికింద రాష్ట్రాలు, స్కూళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంతో 18.7 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని అంచనా. -
Andhra Pradesh: రూ. 1.25 లక్షల కోట్లతో పది పరిశ్రమలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా రూ.1.25 లక్షల కోట్లతో పది పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 5వ తేదీన సీఎం అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పరిశ్రమల శాఖ పరిధిలో నాలుగు, విద్యుత్ శాఖ పరిధిలో ఐదు, పర్యాటక శాఖ పరిధిలో ఒకటి చొప్పున మొత్తంగా పది పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరిశ్రమల ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా 40 వేల మందికి, పరోక్షంగా 60 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఇంకా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాకు వివరించారు. జడ్జిలకు వ్యక్తిగత కార్యదర్శి ► రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులకు, రిజిస్టార్లకు 71 కోర్టు మాస్టర్లు, పర్శనల్ సెక్రటరీ పోస్టుల నియామకానికి ఆమోదం. నెల్లూరు, కర్నూలు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో శాశ్వత లోక్ అదాలత్‌ల ఏర్పాటుకు ఆమోదం. ఆయా లోక్ అదాలత్‌ల పరిధిలో 40 పోస్టుల భర్తీ. ► ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించిన 175 మంది ఖైదీలతో పాటు మరో 20 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలన్న నిర్ణయానికి ఆమోదం. ► నంద్యాల, నెల్లూరు, శ్రీసత్యసాయి, బాపట్ల, విశాఖపట్నం జిల్లాలలో వివిధ ప్రభుత్వ శాఖలకు, కార్పొరేషన్లు, ఇతర సంస్థలకు అవసరమైన ప్రభుత్వ భూములను కేటాయించాలన్న నిర్ణయానికి ఆమోదం. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రతిపాదనల మేరకు పారిశ్రామిక పార్కులు, వివిధ సంస్థలకు భూమి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ► శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలో వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు అవసరమైన 30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం లభించింది. ► శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో బంజారా సేవా సంఘానికి ఎస్టీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు అవసరమైన 44 సెంట్ల భూమి కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ► వైఎస్సార్ జిల్లా అమీన్ పీర్ దర్గాకు వివిధ సర్వే నెంబర్లలో 16.86 ఎకరాల స్థలాన్ని ఈద్గా, అనాథ సదనం కోసం కేటాయిస్తూ నిర్ణయం. ఎకరా రూ.లక్ష చొప్పున కేటాయించాలని నిర్ణయం. ► వైఎస్సార్ జిల్లా కడప మండలం చిన్న చౌక్‌లో 134 ఎకరాలను డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్ట్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కోసం కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. ► వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ కోసం భూములిచ్చిన 379 మంది ఆసైనీ పట్టాదారులకు అసైన్మెంట్ కమిటీ నిర్ణయం మేరకు పరిహారం చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ► ప్రకాశం జిల్లా రుద్రసముద్రంలో సోలార్ పపర్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన 1454.06 ఎకరాల భూమిని ఏపీజీఈసీఎల్‌కు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. కొత్తగా చింతూరు రెవెన్యూ డివిజన్ ► అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతూరు ప్రధాన కేంద్రంగా నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోదం. ► విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరంలో రహదారులు, భవనాల శాఖకు 23.73 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ నిర్ణయం. ► రాష్ట్ర వ్యాప్తంగా 679 రెవెన్యూ మండలాల్లో ఏఆర్ఐ (అడిషనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్) లేదా సీనియర్ అసిస్టెంట్ పోస్టులను డిప్యూటీ తహసీల్దార్ పోస్టు కేడర్‌కు అప్‌గ్రేడ్ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న భూముల రీ–సర్వే, గ్రామ కంఠం భూముల రికార్డింగ్ ప్రక్రియ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి. సర్వే ప్రక్రియ పూర్తయ్యేంత వరకు లేదా గరిష్టంగా రెండేళ్లు వర్తించేట్టుగా లేదా రెండింటిలో ఏది ముందు పూర్తయితే ఆ మేరకు ఈ నిర్ణయం అమలు. ► వైఎస్సార్ జిల్లా చిన్నచౌక్‌లో 17 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన 95 ఎకరాల భూమిని మున్సిపల్ శాఖకు కేటాయిస్తూ నిర్ణయం. ► శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పెద్దకోట్ల, తాటితోట గ్రామాల్లో 304.15 ఎకరాల భూమిని 500 మెగావాట్ల పంప్డ్, హైడ్రో స్టోరేజ్ పవర్ ప్లాంటు ఏర్పాటు కోసం ఎన్‌ఆర్‌ఈడీసీఏపీకి కేటాయింపు. ► ఆంధ్రప్రదేశ్ టెనెన్సీ యాక్ట్ – 1956కు సంబంధించిన ప్రతిపాదన బిల్లుకు ఆమోదం. ► వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో వీరబల్లి మండలం, ఒంగిమల్లలో 1800 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్, హైడ్రో పవర్ ప్లాంటు ఏర్పాటుకు ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ లిమిటెడ్‌కు అనుమతులు మంజూరు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం. ► అరబిందో రియాల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ 1600 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్, హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదం. ► ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతిస్తూ ఆమోదం. ► గ్రీన్కోకు సోలార్, విండ్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. ► కర్నూలు జిల్లా నంద్యాలలో ఆర్సిలర్ మిట్టల్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న 700 మెగావాట్ల సోలార్ పవర్, 300 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులకు అవసరమైన భూమి కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ► రెన్యూవబుల్ ఎక్స్పోర్ట్ పాలసీ 2020 సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం. రాష్ట్రంలో పెరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తి ► ప్రస్తుత ఖరీఫ్ సందర్భంగా రాష్ట్రంలో 438 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావడంపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఇప్పటి వరకు ఈ ఖరీఫ్‌లో 82 శాతం నాట్లు పూర్తయ్యాయని, మిగిలిన చోట్ల వ్యవసాయ పనులు ఊపందుకున్నట్టు మంత్రివర్గం దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. రాష్ట్రంలో 2014–15 నుంచి 2018–19 వరకు సగటున 153 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరగ్గా.. 2019 నుంచి వరుసగా మూడేళ్లు సగటున ఏడాదికి 13 లక్షల టన్నులకు ఉత్పత్తులు పెరిగి 166.73 లక్షలకు చేరడంపై మంత్రివర్గం హర్షం వ్యక్తం చేసింది. ► ప్రస్తుత ఖరీఫ్‌లో సబ్సిడీ ద్వారా 5.05 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు సరఫరా చేశామని, ఖరీప్ అవసరాలకు 19 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉండగా, 18 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. ► రాష్ట్రంలో ఎక్కడా ఎరువులకు కొరత లేదని, ఆర్బీకేల ఏర్పాటు ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్టు చర్చ జరిగింది. ఆర్బీకే విధానాలను ప్రపంచ బ్యాంకు ప్రశంసించడంపై మంత్రివర్గం ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుత ఏడాదిలో వైఎస్సార్ యంత్ర సేవా పథకానికి రూ.2,235 కోట్లు ఖర్చు చేస్తోంది. ► మరోవైపు కోవిడ్ పరిస్థితుల్లోనూ మన రాష్ట్రం దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల కన్నా అత్యధికంగా 11.43 శాతం వృద్ధి రేటు సాధించడంపై సీఎం జగన్మోహన్రెడ్డికి మంత్రివర్గం అభినందనలు తెలియజేసింది. -
షిండే అనారోగ్యంతో హస్తినకు ఫడ్నవీస్.. ఏం జరుగుతోంది?
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపుతున్నాయి. శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే.. బీజేపీతో చేరి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయినప్పటికీ.. వెనకుండి నడిపించేది మాత్రం బీజేపీనే అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఏక్నాథ్ షిండే అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. దీంతో మంత్రివర్గ విస్తరణ బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకున్నారు. ఈ నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో కేబినెట్ విస్తరణపై తొందరపడుతోంది మహా ప్రభుత్వం. ఇందులో భాగంగానే షిండేకు బదులుగా ఫడ్నవీస్ ఢిల్లీ వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ అధిష్ఠానంతో చర్చించి తుది జాబితాను ఖరారు చేయనున్నారని పేర్కొన్నాయి. సీఎంగా ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ జూన్ 30న ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి కేబినెట్ విస్తరణ పెండింగ్‌లోనే ఉంది. బీజేపీ కేంద్ర నాయకత్వం ఓకే చెబితే శుక్రవారమే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సమాచారం. అనారోగ్యానికి గురైన షిండే ఈ టూర్ నుంచి తప్పుకున్నారు. ముఖ్యమంత్రి తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని, వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు షిండే వర్గాలు తెలిపాయి. అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు పేర్కొన్నాయి. ముసాయిదా జాబితాతో గత జూలైలో షిండే, ఫడ్నవీస్ ఢిల్లీలో పర్యటించారు. కానీ, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 43 స్థానాలకు ఎక్కువ మంది పోటీ పడుతున్న నేపథ్యంలో సంక్లిష్టంగా మారింది. ఇదీ చదవండి: Varsha Raut: సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్‌కు ఈడీ సమన్లు -
దశాబ్దాల సమస్యకు ఏపీ కేబినెట్ పరిష్కారం..
నరసాపురం తీర గ్రామాల్లో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న భూముల సమస్యకు పరిష్కారం దొరికింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టడంతో.. బ్రిటీష్ హయంలో లీజుకు తీసుకుని తరతరాలుగా అనుభవిస్తున్న సాగుభూములకు వారికే అప్పగించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నరసాపురం: నరసాపురం మండలం దర్భరేవు కంపెనీ భూములను ప్రస్తుతం అనుభవిస్తున్నవారికే రూ.100 నామమాత్రపు కనీస ధరకు అప్పగించాలని, రిజిస్ట్రేషన్ చార్జీలు ప్రభుత్వమే భరించాలని కేబినెట్ నిర్ణయించింది. 1754 ఎకరాల భూమిని సాగుచేసుకుంటున్న 1485 మంది రైతులకు పంపిణీ చేయనున్నారు. త్వరలో నరసాపురంలో ముఖ్యమంత్రి పర్యటనలో ఈ పంపిణీ జరుగుతుంది. 1921లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం దర్భరేవు చుట్టు పక్కల గ్రామాల్లో ఉన్న 1814 ఎకరాల భూమిని సాగు చేసుకునేందుకు పేదలకు ఇవ్వాలని నిర్ణయించింది. ది అగ్రికల్చర్ సొసైటీ కంపెనీతో ఓ సొసైటీని ఏర్పాటు చేసి దానికి 1,814 ఎకరాల భూమిని 100 ఏళ్ల లీజుకు అప్పగిస్తూ జీవో విడుదల చేసింది. మళ్లీ ఓ ఐదేళ్ల తరువాత అదే బ్రిటీష్ ప్రభుత్వం సర్వే చేపట్టి కాలువలు, డ్రెయిన్ల తవ్వడం కోసం 1,814 ఎకరాల్లో 60 ఎకరాలు అవసరమని తీసుకుంది. మిగిలిన 1,754 ఎకరాలు వ్యవసాయానికి పనికి రాకుండా అడవిలా ఉండేవి. స్వాతంత్య్రం వచ్చాక మన ప్రభుత్వాలు ఈ భూముల జోలికి వెళ్లలేదు. రైతులు కష్టపడి వాటిని సాగుభూములుగా మార్చుకున్నారు. కోట్లు దండుకున్న టీడీపీ ప్రభుత్వం గత టీపీపీ ప్రభుత్వం ఈ భూములపై కన్నేసింది. 2019లో అమలు సాధ్యంకాని జీవో హడావుడిగా తీసుకొచ్చింది. ఎకరాకు రూ.1000 నామమాత్రం ధర తీసుకుని సాగుదారులకు కంపెనీ భూముల పట్టాలిస్తున్నామని మభ్యపెట్టారు. తీరా ఎకరాకు రూ.1000 కాకుండా స్థానిక టీడీపీ నాయకులు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేశారు. అయితే పట్టాలు ఇవ్వలేదు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రైతులు ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు తాము మోసపోయిన వైనాన్ని మొరపెట్టుకున్నారు. ముఖ్యమంత్రికి, అప్పటి వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో నరసాపురం సబ్‌కలెక్టర్‌తో విచారణ చేయించారు. అవకతవకలు జరిగినట్టు అప్పటి సబ్ కలెక్టర్ నివేదిక ఇవ్వడంతో సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ అంశంపై సీఐడీ విచారణ సాగుతుంది. చదవండి: (Palle Vs JC: పల్లె అక్రమాలపై జేసీ లొల్లి..) న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు రైతుల నుంచి వసూలు చేసిన సొమ్ము తిరిగి ఇచ్చేలా ప్రభుత్వ ముదునూరి కృషి చేస్తున్నారు. ఇప్పుడు సాగుదారులగా ఉన్న కొందరి రైతుల చేతుల్లో 10, 12 ఎకరాలు కూడా ఉన్నాయి. నిబంధనల మేరకు రెండున్నర ఎకరాలకు మించి ప్రభుత్వ భూములు పంచడానికి వీలులేదు. భూముల్లో అసలు సాగుదారుల ఎవరు అనే అంశంపై సర్వే చేయించి, భవిష్యత్‌లో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్ణయించారు. నిజమైన సాగుదారులకే భూముల పంపిణీ దర్బరేవు కంపెనీ భూముల సమస్య చెప్పగానే ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు నిజమైన సాగుదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ భూములు పంచుతాం. గత ప్రభుత్వంలో ఈ భూముల విషయంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు సాగుతుంది. – ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్ విప్ -
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, అదనంగా వందల కోట్లు కేటాయించిన కేంద్రం!
న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)కు రూ. 820 కోట్ల అదనపు నిధుల కేటాయింపు ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. దేశంలోని అన్ని పోస్టాఫీసులకు తన సేవలను విస్తరించేందుకు ఐపీపీబీ ఈ నిధులను వినియోగించుకుంటుంది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులకు ఈ విషయాన్ని తెలిపారు. 1.56 లక్షల పోస్టాఫీసులలో ఐపీపీబీ ప్రస్తుతం 1.3 లక్షల పోస్టాఫీసుల నుండి పనిచేస్తోందని తెలిపారు. రెగ్యులేటరీ అవసరాలు, సాంకేతిక అప్గ్రేడేషన్ల కోసం ఐపీపీబీకి రూ.500 కోట్ల కేటాయింపులకు క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని కూడా ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు లక్ష్యం: ఐపీపీబీ తన బ్యాంకింగ్ సేవలను 1,56,434 పోస్టాఫీసులకు విస్తరించబోతున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదలు, తల్లులు, సోదరీమణులు బ్యాంకింగ్ సౌకర్యాన్ని పొందేందుకు వీలుగా రూ. 820 కోట్ల పెట్టుబడి పెట్టాలని కేంద్ర క్యాబినెట్ తాజా నిర్ణయం తీసుకుందని ఠాకూర్ పేర్కొన్నారు. అధికారిక ప్రకటన ప్రకారం, రెగ్యులేటరీ అవసరాలను తీర్చడానికి ఈక్విటీ పెట్టుబడిగా ఐపీపీబీ ఏర్పాటుకు సంబంధించి ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ. 1,435 కోట్ల నుండి రూ. 2,255 కోట్లకు సవరించడానికి కూడా క్యాబినెట్ ఆమోదముద్ర పడింది. సామాన్యులకు అత్యంత అందుబాటులో, సరసమైన, విశ్వసనీయమైన, పారదర్శకమైన బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రాజెక్ట్ లక్ష్యమని ఆ వర్గాలు వెల్లడించాయి. అందరికీ బ్యాంకింగ్ సదుపాయం లభ్యత, ఆర్థిక సేవల విస్తరణ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడం, నగదు రహిత వ్యవస్థ దిశగా అడుగులు, తదనుగుణమైన ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు ధ్యేయమని కూడా పేర్కొన్నాయి. ప్రస్తుతం ఐపీపీబీ ఇలా.. ఒక అధికారిక ప్రకటన ప్రకారం, ఐపీపీబీ 1.36 లక్షల పోస్టాఫీసులను బ్యాంకింగ్ సేవలను అందించడానికి వీలు కల్పించింది. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందించడానికి దాదాపు 1.89 లక్షల మంది పోస్ట్‌మెన్, గ్రామీణ డాక్ సేవక్‌లకు స్మార్ట్‌ఫోన్, బయోమెట్రిక్ పరికరాలను సమకూర్చింది. ఐపీపీబీ 2018 సెప్టెంబర్‌లో 650 శాఖలు/నియంత్రణ కార్యాలయాలతో ప్రారంభమైంది. ప్రారంభించినప్పటి నుండి, ఇది మొత్తం 82 కోట్ల ఆర్థిక లావాదేవీలతో 5.25 కోట్లకు పైగా ఖాతాలను తెరిచింది. లావాదేవీల విలువ రూ.1,61,811 కోట్లు. రూ. 21,343 కోట్ల విలువైన 765 లక్షల ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ లావాదేవీలను కలిగి ఉంది. 5 కోట్ల ఖాతాలలో 77 శాతం ఖాతాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. 48 శాతం మహిళా ఖాతాదారులు సుమారు రూ. 1,000 కోట్ల డిపాజిట్‌తో ఉన్నారు. దాదాపు 40 లక్షల మంది మహిళా ఖాతాదారులు తమ ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ప్రయోజనం పొందారు. దీని విలువ దాదాపు రూ.2,500 కోట్లు. పాఠశాల విద్యార్థుల కోసం 7.8 లక్షలకు పైగా ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
ఎరువులపై రూ.60,939 కోట్ల సబ్సిడీ
న్యూఢిల్లీ: డీఏపీ సహా ఫాస్పాటిక్ అండ్ పొటాలిక్ ఎరువులకు రూ.60,939 కోట్ల సబ్సిడీకి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలలకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. రైతులకు నాణ్యమైన ఎరువులు సరసమైన ధరలకు అందించాలన్న ఉద్దేశంతో ఫాస్ఫాటిక్ అండ్ పొటాసిక్ (పీ అండ్ కే) ఎరువులకు సబ్సిడీ ఇవ్వాలన్న ప్రతిపాదనలను బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం అంటే ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ సబ్బిడీని కేటాయిస్తున్నట్టుగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇక ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి పథకాన్ని 2024 డిసెంబర్ వరకు విస్తరిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 4జీ సేవలు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 4జీ మొబైల్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పుడున్న 2జీ మొబైల్ సేవలను 4జీకి అప్‌గ్రేడ్ చేసేందుకు ఉద్దేశించిన యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్(యూఎస్ఓఎఫ్) ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. యూఎస్ఓఎఫ్ ప్రాజెక్టు కింద 2,343 వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 2జీ నుండి 4జీ మొబైల్ సేవలను రూ.2,426 కోట్ల అంచనా వ్యయంతో (పన్నులు, సుంకాలు మినహాయించి) అప్‌గ్రేడ్ చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఈ– గవర్నెన్స్, బ్యాంకింగ్, టెలి–మెడిసిన్ డెలివరీ, మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా టెలి ఎడ్యుకేషన్ మొదలైన సేవలు సులువుగా అందుతాయి. -
Cryptocurrency Bill: క్రిప్టో బిల్లు ఇక లేనట్లేనా?
క్రిప్టోకరెన్సీ బిల్లు.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు నుంచే మొదలైన హడావిడి. ప్రైవేట్ క్రిప్టో అడ్డుకట్టవేయడం, ఆర్బీఐ సొంత డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చే ప్రయత్నాలకూ ఈ సమావేశాల్లోనే లైన్ క్లియర్ అవుతుందని అంతా భావించారు. అయితే బిల్లు డ్రాఫ్ట్ సర్వం సిద్ధమైందన్న ఆర్థిక మంత్రి ప్రకటన.. కేవలం ప్రకటనకే పరిమితం కావడం, మరో మూడు రోజుల్లో సమావేశాలు ముగుస్తుండడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. బిజినెస్ న్యూస్ ఏజెన్సీ బ్లూమరాంగ్.. క్రిప్టోకరెన్సీ బిల్లు ఈ సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు రాకపోవచ్చనే ఓ కథనం ప్రచురించింది. మరో మూడు రోజుల్లో (డిసెంబర్ 23తో) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో చట్టానికి సంబంధించిన విధివిధానాల గురించి కేంద్రం తుది నిర్ణయానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిర్మలమ్మ చెప్పినా కూడా.. ప్రతిపాదిత క్రిప్టోకరెన్సీల చట్టంపై అనవసర ఊహాగానాలు మీడియాలో ప్రచారమైన నేపథ్యంలో ఆమధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. సంబంధిత వర్గాలందరితో చర్చించాకే పక్కా బిల్లు రూపొందించామని, కేబినెట్ ఆమోదించాకే దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నామని ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ, అధికారిక డిజిటల్ కరెన్సీ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు దాదాపు ఖరారు చేసేసుకున్నారు. కానీ, బిల్లు ఇప్పటికీ కేబినేట్ అనుమతి పొందలేదు. వేగిరపాటు వద్దనే.. సిడ్నీ డైలాగ్ వర్చువల్ కీనోట్ ప్రసంగం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ... ‘ క్రిప్టోకరెన్సీలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే భారీ ప్రమాదం పొంచి ఉందన్నారు. అంతేకాకుండా యువతను కూడా నాశనం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీతో ఏలాంటి అవాంతరాలు జరగకుండా చూసుకోవడానికి అన్ని ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయాలని కోరారు. ఆ వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన క్రిప్టో వ్యవహారంపై సమావేశాన్ని కూడా నిర్వహించారు. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు భావించారు. నిజానికి క్రిప్టో బిల్లు ప్రస్తావనను శీతాకాల సమావేశాల షెడ్యూల్లో చేర్చిన కేంద్రం.. పార్లమెంట్ వెబ్సైట్లో సైతం ఆ విషయాన్ని పేర్కొంది. కానీ, ఇప్పుడు క్రిప్టో బిల్లు విషయంలో తొందరపాటు నిర్ణయం వద్దనే కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని మార్పులు చేర్పులతో ఆర్డినెన్స్గానీ, ప్రత్యేక ఆర్డర్‌గానీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్లమెంట్ సమావేశాలు ముగిశాక.. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలపై నిషేధం, నియంత్రణపై స్పష్టమైన చేర్పులతో కూడిన చట్టం చేయవచ్చనే(పార్లమెంట్ సమావేశాలు లేకున్నా చట్టం చేసే వెసులుబాటు ఉండడం) అంచనా. అంశాలు.. క్రిప్టోకరెన్సీ బిల్లు (నియంత్రణ)పై ఎలాంటి స్పష్టత లేకపోయినప్పటికీ.. అందులో అంశాల గురించి మాత్రం విస్తృత చర్చ జరిగింది. ఆర్బీఐ క్రిప్టో కరెన్సీని పూర్తిగా నిషేధించాలని కోరుతోంది. కానీ, కేంద్రం మాత్రం అందుకు సుముఖంగా లేదు. క్రిప్టోకరెన్సీ హోల్డర్స్ ఆస్తులను ప్రకటించడానికి, రాబోయే కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉండటానికి వారికి గడువు ఇవ్వాలనే ప్రతిపాదనలను సూత్రప్రాయంగా అంగీకరించిందని, క్రిప్టో చట్టాన్ని ఉల్లంఘిస్తే ఇరవై నుంచి యాభై కోట్ల జరిమానా, ఏడాదిన్నర శిక్ష.. ఇలాంటి అంశాలు చేర్చిందని గతంలో బ్లూమరాంగే ఓ కథనం ప్రచురించింది. అంతేకాదు క్రిప్టో కరెన్సీ నియంత్రణను ఆర్బీఐకి, క్రిప్టో ఆస్తుల పర్యవేక్షణ(నియంత్రణ)ను సెబీకి అప్పగించే ఉద్దేశంలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. చైనాలిసిస్ నివేదిక ప్రకారం...2021లో భారత్‌లో క్రిప్టో ఇన్వెస్టర్లు ఏకంగా 641 శాతం మేర పెరిగారని వెల్లడించింది. అంతేకాకుండా 2021 గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ ప్రకారం 154 దేశాలలో క్రిప్టోకరెన్సీ యజమానుల సంఖ్య పరంగా రెండో స్థానంలో... 'క్రిప్టో-అవగాహన'లో ఏడో దేశంగా భారత్ నిలిచింది. దాదాపు కోటిన్నరమంది ఇన్వెస్టర్లు.. 45 వేల కోట్ల రూపాయల విలువైన క్రిప్టో ఆస్తుల్ని కలిగి ఉన్నారు. -
వధువు @ 21.. వివాహ చట్టబద్ధ వయసు పెంపుదల
భారతదేశంలో మహిళలకు చట్టబద్ధమైన పెళ్లి వయసు 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ ఈ మేరకు ఆమోదం తెలిపింది. త్వరలో ఈ నిర్ణయం చట్టం రూపం దాల్చుతుంది. బాల్య వివాహాలను నిరోధించడానికి, చిన్న వయసులో గర్భాలను నిరోధించడానికి, యువతుల శారీరక మానసిక ఆరోగ్యాల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. ఈ సందర్భంగా కొందరు భిన్న రంగాల మహిళా ఆలోచనాపరుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? డిసెంబర్ 15, బుధవారం కేంద్ర కేబినెట్ స్త్రీలకు సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని ఆమోదించింది. వివాహానికి అవసరమైన వయసు 21 సంవత్సరాలుగా ప్రతిపాదించింది. గతంలో ఈ వయసు అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21గా ఉండేది. ఇప్పుడు స్త్రీ, పురుషులకు ఒకే వయసు నిర్ణయించినట్టు అయ్యింది. దీని వల్ల జెండర్ తటస్థత పాటించినట్టు భావిస్తోంది. హిందూ వివాహ చట్టం, 1955 ప్రకారం ఆడపిల్ల వయసు వివాహానికి 18 ఏళ్లు ఉండాలి. ఇస్లాంలో అమ్మాయి ఈడేరిన తర్వాత వివాహానికి యోగ్యురాలిగా భావిస్తారు. స్పెషల్ మేరేజ్ యాక్ట్, 1954 ప్రకారం అబ్బాయి వయసు 21, అమ్మాయి వయసు 18గా ఉంది. తాజా ప్రతిపాదన చట్టం దాలిస్తే 21 ఏళ్లు ఉమ్మడి వయసు అవుతుంది. బాల్య వివాహాలను నిరోధించేందుకు, యువతుల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉండటం కోసం, బాలింత–శిశు మరణాల నివారణకు, పోషకాహార సమతుల్యత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం చెబుతోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2015–16లో బాల్య వివాహాలు 27 శాతం ఉంటే 2019–20లలో వీటి శాతం 23కు చేరింది. ఈ శాతాన్ని ఇంకా తగ్గించడంలో వివాహ చట్టబద్ధ వయసు పెంపుదల ఉపయోగపడుతోందని భావిస్తోంది. 2020 కమిటీ స్త్రీల శారీరక పోషక విలువల స్థాయికి, పెళ్లి వయసుకూ మధ్య సమన్వయం, సంబంధం గురించి అంచనాకు రావడానికి కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ జయా జైట్లీ అధ్యక్షతన 2020లో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ 16 యూనివర్సిటీల విద్యార్థినీ విద్యార్థుల అభిప్రాయాలను తీసుకుంది. అలాగే 15 ఎన్జిఓల సహాయంతో గ్రామీణ ప్రాంతాలలోని అన్ని వర్గాల యువతీ యువకుల అభిప్రాయాలను సేకరించింది. వీటన్నింటి ఆధారంగా కమిటీ యువతుల వివాహ వయసును 21కి పెంచమని రికమండ్ చేసింది. అంతేకాదు అమ్మాయిల చదువు అవకాశాలను పెంచమని, వారి రాకపోకల సౌకర్యాలను పెంచమని, అలాగే ఉపాధికి అవసరమైన ట్రైనింగులను పెంచాలని సూచించింది. ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన నిపుణుల, ఆలోచనాపరుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. ఆడపిల్లలకు డబ్బు ముఖ్యం అని చెప్పాలి ఒకప్పుడు డబ్బుకు పెద్ద విలువ ఇవ్వొద్దని తల్లిదండ్రులు చెప్పేవారు. ఇప్పుడు డబ్బుకు విలువ ఇవ్వండని చెప్పాలి. ముఖ్యంగా ఆడపిల్లకు ఆర్థికంగా తన మీద తాను ఆధారపడే వీలు కల్పించాలి. ఇందుకు బాగా చదివించాలి. వివాహ వయసు 21 సంవత్సరాలకు పెంచడం మంచిది. దాని వల్ల చదువుకుంటారు. ఉద్యోగాలు చేయాలనుకుంటారు. డబ్బు గురించి ఆలోచిస్తారు. కొన్ని వర్గాలలో తల్లిదండ్రులు పనికి వెళ్లాల్సి రావడం వల్ల ఇంట్లో ఆడపిల్లను ఉంచడం ఎందుకు అని పెళ్లి చేస్తున్నారు. పది ఫెయిల్ అయిన ఆడపిల్లకు పెళ్లి తప్పనిసరి అవుతోంది. పెళ్లి చేసి పంపాక అక్కడ అమ్మాయి ఇమడలేకపోతే పుట్టింటి సపోర్ట్ ఉండటం లేదు. అమ్మాయికి తన కాళ్ల మీద తాను నిలబడే ఆర్థిక శక్తి, స్కిల్స్ ఉండటం లేదు. దీని వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా కాకుండా వీళ్లను ఉపాధి పొందే ట్రయినింగుల్లోకి మళ్లించాలి. ఆ మేరకు తల్లిదండ్రులకు చైతన్యం కలిగించాలి. చట్టం తేవడం ఒక విషయం అయితే దానిని గట్టిగా అమలయ్యేలా చూడటం ఒక విషయం. ఆ విషయంపై శ్రద్ధ పెట్టాలి. – పి.సత్యవతి, రచయిత పంచాయతీలు జాగ్రత్త తీసుకోవాలి అమ్మాయి పెళ్లి వయసు 21 పెంచుతూ తీసుకున్న నిర్ణయం మంచిది. దీనిని తల్లిదండ్రులకు, యువతులకు అర్థమయ్యేలా ప్రచారం చేయాలి. ఎలా చేస్తే చట్టబద్ధమో ఎలా చేస్తే చట్టవిరుద్ధమో విడమర్చి చెప్పాలి. ముఖ్యంగా పల్లెటూళ్లలో పంచాయతీలు అక్కడ జరుగుతున్న పెళ్లిళ్లను గమనించి ఈ నిర్ణయం అమలయ్యేలా చూడాలి. అప్పుడు దాదాపుగా ఈ నిర్ణయం వల్ల ఉపయోగం కలుగుతుంది. గ్రామాల్లో పెళ్లి చేసుకోమనే తల్లిదండ్రులను ఆడపిల్లలు ఎదిరించడం కష్టసాధ్యమైన పని. అలాంటి వారికి ఈ చట్టం ఉపయోగపడుతుంది. వారు సర్పంచ్ చేతో మరెవరి చేతో ఈ విషయాన్ని చెప్పించి చదువు, ఉపాధిలో రాణించవచ్చు. పెళ్లి వయసు 21 చేయడం అంటే అమ్మాయిలు పరిణితితో నిర్ణయం తీసుకునే వీలు కల్పించడం. జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు ఈ వయసు నియమం వల్ల తగ్గితే అదీ మంచిదే. – ఓల్గా, రచయిత టీనేజ్‌లో పెళ్లి అయితే హైరిస్క్ పదకొండు నుంచి పదమూడేళ్ల వయసు అమ్మాయిల్లో రుతుక్రమం ప్రారంభం అవుతుంది. టీనేజ్ దశలో వాళ్ల శరీరం గురించి వారికి సరైన అవగాహన ఉండదు. పెద్దవాళ్లు చెప్పరు. పద్దెనిమిది ఏళ్లు నిండగానే పెళ్ళి చేస్తే అవగాహన లేమి కారణంగా త్వరగా గర్భం దాల్చుతుంటారు. టీనేజ్‌లో రక్త హీనత సమస్య ఎక్కువ. ఈ వయసు గర్భవతుల్లో హైబీపీ రిస్క్ కూడా ఎక్కువగా చూస్తుంటాం. దీని వల్ల వీరికి ఫిట్స్ రావడం, నెలలు నిండకుండా పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ. అందుకని అమ్మాయిలకు తమ శరీరం గురించి, సెక్స్ఎడ్యుకేషన్ అవగాహన కల్పించాలి. అప్పుడే లైంగికపరంగా వచ్చే జబ్బుల గురించి కూడా అవగాహన ఉంటుంది. శారీరక, మానసిక ఆరోగ్యాలు బాగున్నవారు పుట్టబోయే పిల్లల ఆరోగ్యం గురించి కూడా సరైన జాగ్రత్తలు తీసుకుంటారు. 21 ఏళ్లకు పెళ్లి అయితే పిల్లలు కోసం ప్లానింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. తల్లి సరైన జాగ్రత్తలు తీసుకునే అవగాహన ఉంటే, రాబోవు తరాలు ఆరోగ్యంగా ఉంటాయి. – డాక్టర్ శిరీషారెడ్డి, గైనకాలజిస్ట్ లక్ష్యానికి రూపం రావాలంటే 21 ఏళ్లు నిండాలి మా ఊరు మొయినాబాద్ మండలంలోని యత్బార్పల్లి. మా ఊళ్లో పద్దెనిమిదేళ్లు నిండకుండానే అమ్మాయిలకు పెళ్లి చేస్తుంటారు. ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉంటుంది. దానికి ఒక రూపం రావాలంటే డిగ్రీ వరకు చదువుకోవాలి. మా ఇంట్లో కూడా నీకు పద్దెనిమిదేళ్లు నిండగానే పెళ్లి చేసేస్తాం అన్నారు. కేంద్రప్రభుత్వం అమ్మాయిలకు పెళ్లివయసు 21 ఏళ్లు చట్టం తీసుకువస్తుందని వినగానే చాలా సంతోషం వేసింది. గ్రామాల్లో ఉన్నవాళ్లకు ఈ విషయం తెలియాలి. మా కాళ్ల మీద మేం నిలబడాలి. నేనిప్పుడు ఇంటర్మీడియెట్ చదువుతున్నాను. డిగ్రీ చేసి, జాబ్ తెచ్చుకోవాలి. మా అమ్మనాన్నలను మంచిగా చూసుకోవాలి. నాకో తమ్ముడు ఉన్నాడు. కానీ, అమ్మనాన్నల బాధ్యత నాది కూడా. జాబ్ చేయాలి అలాగే వ్యవసాయం కూడా చేయాలి. మా నాన్న రైతు. నేనూ పొలం పనులు చేస్తుంటాను. రైతుల కష్టాలు చూస్తూ పెరిగాను కాబట్టి, రైతుల అభివృద్ధికి కృషి చేయాలన్నది నా లక్ష్యం. – బి.భవానీ, విద్యార్థిని చట్టం సరే... చైతన్యం ఇంకా మంచిది ఉత్తరాది రాష్ట్రాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి దక్షిణాదితో పోలిస్తే. తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లలు చదువుకుంటున్నారు. కింది వర్గాలలో కూడా బి.టెక్, ఎంటెక్‌లు చేస్తున్నారు. 18 ఏళ్లు అంటే చదువు విషయంలో అటూ ఇటూ కాని వయసు. 21కి పెళ్లి వయసు పెంచడం వల్ల చదువు కొనసాగించి ఉద్యోగాల్లోకి వెళ్లే వీలుంటుంది. ఆ మేరకు ఈ నిర్ణయం మంచిది. అయితే ఈ విషయాన్ని చట్టం తెచ్చి చెప్పడం కన్నా చైతన్యం చేయడం ద్వారా చెప్తే బాగుంటుంది. ఒక రకంగా ఇప్పుడు పెళ్లిళ్లు అయ్యే సరికి అమ్మాయికి కొన్ని వర్గాల్లో 24 వస్తోంది. 20 ఏళ్లకు పెళ్లి చేయాలన్నా అబ్బాయిలు సెటిల్ కాకపోవడం వల్ల పెళ్లికొడుకు దొరకని పరిస్థితి ఉంది. 20 ఏళ్ల తర్వాత పెళ్లిళ్లకే ఇప్పటి విద్య, ఉపాధి, సామాజిక పరిస్థితులు దారి తీస్తున్నాయి. మిగిలిన వర్గాల్లో ఎర్లీ మేరేజస్ తగ్గించాలంటే చైతన్యస్థాయిని పెంచడం ఇంకా మంచి మార్గం అని నా అభిప్రాయం. – ముదిగంటి సుజాతా రెడ్డి, రచయిత డిగ్రీ చదువు పూర్తవ్వాలి నా మనవరాలికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ వచ్చాక పెళ్లి అయ్యింది, ఇప్పుడు పిల్లలు. ఉద్యోగం చేసుకుంటూ, కుటుంబాన్ని చక్కదిద్దుకుంటోంది. ఏ సమస్య అయినా పరిష్కరించుకోగలదు. నా రోజుల్లో స్కూల్ చదువు పూర్తికాగానే పెళ్లి చేసేశారు. దీంతో కాలేజీ చదువులు చదువుకోలేకపోయాను. పెళ్లయ్యాక బాధ్యతల్లోనే జీవితమంతా గడిచిపోయింది. మా అమ్మాయికీ పెద్దవాళ్ల జోక్యంతో చిన్న వయసులోనే పెళ్లి చేశాను. తన సమర్థత వల్ల పెళ్లి తర్వాత కూడా చదువుకుంది, బ్యూటీషియన్‌గా ఎదిగింది. అందరికీ ఆ అవకాశం ఉండదు. సాధారణంగా అమ్మాయిల బాధ్యత త్వరగా తీర్చుకోవాలనే ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ, అమ్మాయి అత్తింటికి వెళ్లాక అక్కడ పరిస్థితులకు ఇమడలేకపోయినా, జీవితాన్ని చక్కదిద్దుకునే సామర్థ్యం లేకపోయినా కుటుంబానికి, తనకూ అన్యాయమే జరుగుతుంది. ఆడ–మగ ఇద్దరికీ ఉన్నది ఒకటే జీవితం. ఆనందంగా బతకాలంటే అవగాహన కూడా రావాలి. అందుకని, డిగ్రీ చదువు పూర్తయ్యాక అమ్మాయికి పెళ్లి అయితే అన్ని విధాల బాగుంటుంది. – తుమ్మ సత్యవతి, గృహిణి కలలు నెరవేరాకే పెళ్లి ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఆడపిల్లలకు జీవితంలో సాధించాల్సిన కలలు ఎన్నో ఉంటాయి. కానీ, పెళ్లి కారణంగా పెద్దవాళ్లు ఆ కలలను చంపేస్తున్నారు. బయట అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక వేధింపులు తల్లిదండ్రుల భయాలకు కారణం అవుతున్నాయి. దీని వల్లే అమ్మాయిలకు పద్దెనిమిది నిండకుండానే పెళ్లి చేసి భారం దించుకున్నాం అనుకుంటున్నారు. చిన్నవయసులో పిల్లలు పుట్టినా ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉండరు. అలాగే, ఆమె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మాది రంగారెడ్డి జిల్లాలోని తోల్కట్ట అనే ఊరు. పేదింటి అమ్మాయిని. నాన్న ఊరూరు తిరుగుతూ పాతబట్టలు తీసుకొని, కొత్త ప్లాస్టిక్ టబ్బులు అమ్ముతుంటారు. వాటిని సేకరించుకుని వస్తే మేం అవన్నీ ఇంటి వద్ద సపరేట్ చేసి, మరొకరికి ఇచ్చి డబ్బులు తీసుకుంటాం. మా అమ్మనాన్నలకు నేను అన్నయ్య, తమ్ముడు సంతానం. నాకూ పెళ్లి చేస్తామన్నారు. కానీ, నేను బతిమాలుకున్నందుకు నన్ను కాలేజీకి పంపిస్తున్నారు. ఇంకో ఏడాదిలో పెళ్లి చేస్తామన్నారు. నాకు పోలీస్ అవ్వాలన్నది కల. ఇప్పుడు ఈ చట్టం వస్తే నా కల నెరవేరుతుంది. – నిఖిత, విద్యార్థిని -
కేంద్రం కీలక నిర్ణయం.. ఇక అమ్మాయిల కనీస వివాహ వయసు 21 ఏళ్లు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం ఉన్న యువతుల కనీస వివాహ వయసు 18 ఏళ్లు.. ఇక నుంచి 21 ఏళ్లు కానుంది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో యువతుల కనీస వివాహ వయసు ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సస్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా యువతుల వివాహ వయసు పెంచుతామని తన ప్రసంగంలో పేర్కొన్న విషయం తెలిసిందే. తమ ప్రభుత్వం కుమార్తెలు, సోదరీమణుల ఆరోగ్యం గురించి నిరంతరం శ్రద్ధ వహిస్తుందని తెలిపారు. అదే విధంగా పోషకాహార లోపం నుంచి వారిని రక్షించాలని, అందులో భాగంగానే వారికి సరైన వయసులో వివాహం చేయటం అవసరని పేర్కొన్న సంగతి తెలిసిందే. చదవండి: సమ్మె మా కోసం కాదంటూ..’ 10 లక్షల మంది నిరసన ప్రస్తుతం అబ్బాయిల వివాహ కనీస వయసు 21 ఏళ్లు, అమ్మాయిల వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. అయితే బాల్య వివాహాల నిషేధ చట్టం, ప్రత్యేక వివాహాల చట్టం, హిందూ వివాహాల చట్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. జయ జైట్లీ నేతృత్వంలోని నీతి ఆయోగ్ టాస్క్‌ఫోర్స్ అమ్మాయిల కనీస వివాహ వయసు ప్రతిపాదనకు మద్దతు ఇచ్చింది. స్త్రీలకు మొదటి గర్భధారణ సమయంలో కనీసం 21 ఏళ్లు ఉండాలని టాస్క్‌ఫోర్స్ చెప్పడంతో ఈ ప్రతిపాదనపై డిసెంబర్ నెలలోనే సిఫారస్సులు సమర్పించారు. -
హిప్.. చిప్.. భారత్!
న్యూఢిల్లీ: భారత్‌ను ప్రపంచానికి తయారీ కేంద్రంగా మలిచే లక్ష్యంతో కేంద్ర సర్కారు మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సెమీ కండక్టర్ల తయారీ (చిప్‌లు), డిస్ప్లే తయారీ ఎకోసిస్టమ్‌కు రూ.76,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా స్వీయ సమృద్ధి సాధించడమే కాకుండా, చైనా మార్కెట్‌పై ఆధారపడడం తగ్గుతుందని కేంద్ర సర్కారు భావిస్తోంది. సెమీ కండక్టర్లు, డిస్ప్లే తయారీ, డిజైన్ కంపెనీలకు అంతర్జాతీయంగా ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను ఈ పథకం కింద అందించడం వల్ల.. ఎలక్ట్రానిక్స్ తయారీలో కొత్త శకానికి దారితీస్తుందని కేంద్రం పేర్కొంది. కేబినెట్ సమావేశం వివరాలను ఐటీ, టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నిత్య జీవితంలో ఎలక్ట్రానిక్స్ ముఖ్య పాత్ర పోషిస్తుంటే.. ఎలక్ట్రానిక్స్ తయారీలో సెమీ కండక్టర్లకు కీలక పాత్ర ఉందన్నారు. లక్ష్యాలు..: మూలధన, సాంకేతిక సహకారాన్ని ఈ పథకం కింద కంపెనీలు పొందొచ్చు. అర్హులైన దరఖాస్తులకు ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం నిధుల సహకారాన్ని ప్రభుత్వం అందించనుంది. సిలికాన్ సెమీకండక్టర్ ఫ్యాబ్‌లు, డిస్ప్లే ఫ్యాబ్‌లు, కాంపౌండ్ సెమీకండక్టర్లు, సిలికాన్ ఫోటోనిక్స్, సెన్సార్ ఫ్యాబ్‌లు, సెమీకండక్టర్ ప్యాకేజింగ్, సెమీ కండక్టర్ డిజైన్లకు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను కూడా ప్రభుత్వం ఇవ్వనుంది. ప్రాజెక్టులకు అవసరమైన మౌలిక సదుపాయాల (భూమి, నీరు, విద్యుత్తు, రవాణా, పరిశోధన సదుపాయాలు) ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి కేంద్రం పనిచేయనుంది. కనీసం రెండు గ్రీన్‌ఫీల్డ్ సెమీ కండక్టర్ ఫ్యాబ్‌లు, రెండు డిస్ప్లే ఫ్యాబ్‌లను ఏర్పాటు చేయాలన్నది కేంద్రం లక్ష్యంగా ఉంది. ఈ ప్రతిపాదిత పథకం కింద కనీసం 15 కాంపౌండ్ సెమీకండక్టర్లు, సెమీకండక్టర్ల ప్యాకేజింగ్ యూనిట్లు ఏర్పాటవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. డిజైన్ అనుసంధాన ప్రోత్సాహక పథకం (డీఎల్ఐ) కింద ప్రాజెక్టు ఏర్పాటు వ్యయంలో 50 శాతాన్ని ప్రోత్సాహకంగా ప్రభుత్వం సమకూర్చనుంది. అలాగే, ఐదేళ్లపాటు విక్రయాలపై 6–4 శాతం మేర ప్రోత్సాహకాలను ఇవ్వనుంది. ‘‘దేశీయంగా 100 వరకు సెమీకండక్టర్ డిజైన్ ఫర్ ఇంటెగ్రేటెడ్ సర్క్యూట్స్, చిప్సెట్లు, సిస్టమ్ ఆన్ చిప్స్, సెమీకండక్టర్ డిజైన్ కంపెనీలకు మద్దతు లభించనుంది. వచ్చే ఐదేళ్లలో రూ.1,500 కోట్ల టర్నోవర్ సాధించిన కంపెనీలకు ప్రోత్సాహకాలు లభిస్తాయి’’ అని ప్రభుత్వం నుంచి విడుదలైన ప్రకటన తెలిపింది. ఈ పరిశ్రమ దీర్ఘకాల వృద్ధికి వీలుగా అంతర్జాతీయ నిపుణులతో సెమీకండక్టర్ మిషన్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. 1.35 లక్షల మందికి ఉపాధి వచ్చే నాలుగేళ్లలో ఈ పథకం కింద దేశంలోకి 1.7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.35 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినివైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతానికి దేశంలో 75 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎలక్ట్రానిక్స్ తయారీ ఆరేళ్లలో 300 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు. టాటా గ్రూపు ఇప్పటికే సెమీకండక్టర్ల తయారీలోకి ప్రవేశించనున్నట్టు ప్రకటించగా.. వేదాంత గ్రూపు సైతం ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తితో ఉంది. రెండు అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ చిప్ తయారీ కంపెనీలు, రెండు డిస్ప్లే తయారీ కంపెనీలు ఒక్కోటీ రూ.30,000–50,000 కోట్ల స్థాయి పెట్టుబడులతో వచ్చే నాలుగేళ్లలో ముందుకు రావచ్చని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ అంచనా వేస్తోంది. ఆవిష్కరణలు, తయారీకి ఊతం: ప్రధాని మోదీ సెమీకండక్టర్లకు సం బంధించి కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఈ రంగంలో పరిశోధన, ఆవిష్కరణలకు, తయారీకి ఊతమిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తుందంటూ ప్రధాని ట్వీట్ చేశారు. డిజిటల్ చెల్లింపులకు మరింత మద్దతు న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు ఇప్పటికే గరిష్టాలకు చేరుకోగా.. వీటిని మరింత ప్రోత్సహించాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది. యూపీఐ, రూపే డెబిట్ కార్టులతో చేసే చెల్లింపులను ప్రోత్సహించేందుకు రూ.1,300 కోట్ల పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. వ్యక్తులు వర్తకులకు చేసే డిజిటల్ చెల్లింపులకు అయ్యే వ్యయాలను ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రూపే డెబిట్ కార్డు, భీమ్ యూపీఐతో రూ.2,000 వరకు చెల్లింపులపై అయ్యే వ్యయాలను ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. వచ్చే ఏడాది కాలంలో ప్రభత్వం రూ.1,300 కోట్లను ఖర్చు చేయడం వల్ల మరింత మంది డిజిటల్ చెల్లింపులకు ముందుకు వస్తారని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది నవంబర్‌లో 7.56 లక్షల కోట్ల విలువైన 423 కోట్ల డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు నమోదైనట్టు వెల్లడించారు. -
సాగు చట్టాల ఉపసంహరణ బిల్లు రేపే
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినట్లుగా మూడు నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణకు రంగం సిద్ధమయ్యింది. ఈ చట్టాల ఉపసంహరణకు ఉద్దేశించిన కొత్త బిల్లును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తొలిరోజే దిగువ సభలో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాలో ఈ కొత్త బిల్లును అధికారులు చేర్చారు. సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలియజేసింది. ‘‘మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేవలం కొందరు రైతులు మాత్రమే నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమగ్రాభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని వెళ్లాల్సి ఉంది’’ అని బిల్లులో ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 29న లోక్‌సభకు కచ్చితంగా హాజరు కావాలని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. వివాదాస్పద సాగు చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకున్నంత మాత్రాన సరిపోదని, తమ డిమాండ్లను నెరవేర్చేదాకా పోరాటం కొనసాగిస్తామని రైతు సంఘాలు తేల్చిచెబుతున్నాయి. ట్రాక్టర్ల ర్యాలీ రద్దు ఈ నెల 29వ తేదీన పార్లమెంట్ వరకూ తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీని రద్దు చేసినట్లు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేత దర్శన్ పాల్ శనివారం ప్రకటించారు. తమ డిమాండ్లపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశామని, ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 4న రైతు సంఘాలతో సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. ముంబైలో ఆదివారం సంయుక్త షెట్కారీ కామ్‌గార్ మోర్చా(ఎస్ఎస్కేఎం) ఆధ్వర్యంలో కిసాన్–మజ్దూర్ మహాపంచాయత్ నిర్వహించనున్నారు. 100కు పైగా రైతు, కార్మిక సంఘాలు పాల్గొననున్నాయి. రైతుల త్యాగాలను కించపరుస్తారా?: కాంగ్రెస్ వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లులో కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించిన ‘అభ్యంతరాలు, కారణాలు’ అనే పదాల పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనీష్ తివారీ విమర్శలు గుప్పించారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిగా కొనసాగుతున్న పోరాటంలో మరణించిన 750 మంది రైతుల త్యాగాలను ప్రభుత్వం కించపరుస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. రైతులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు. 750 మంది రైతులు మరణిస్తే, కేవలం కొందరే ఈ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వం చెప్పడం ఏమిటని నిలదీశారు. పంట వ్యర్థాల దహనం నేరం కాదు కేసుల ఉపసంహరణపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలి: కేంద్రం రైతాంగం డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. పంట వ్యర్థాలను దహనం చేయడాన్ని నేరంగా పరిగణించరాదంటూ రైతులు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం అంగీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఆందోళన విరమించాలని కోరారు. పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ), పంటల వైవిధ్యంపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతుల డిమాండ్లపై ప్రధాని మోదీ హామీ మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న రైతులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించే అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉందని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లిండంపైనా రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాతా రైతులు ఆందోళన కొనసాగించడంలో అర్థం లేదన్నారు. రైతన్నలు పెద్ద మనసు చేసుకొని, పోరాటం ఆపేసి, ఇళ్లకు తిరిగి వెళ్లాలని తోమర్ విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ చట్టాల వల్ల దక్కే ప్రయోజనాల గురించి కొందరు రైతులను ఒప్పించలేకపోయామని, ఈ విషయంలో తమకు అసంతృప్తి ఉన్న మాట నిజమేనని అంగీకరించారు. -
పల్లెపల్లెకూ మొబైల్
సాక్షి, న్యూఢిల్లీ: తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్ సేవలు లేని గ్రామాలకు 4జీ సేవలు అందించడానికి కేంద్రం సన్నద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లో 1,218 గ్రామాలు సహా దేశవ్యాప్తంగా 44 ఆకాంక్ష (యాస్పిరేషనల్) జిల్లాల్లోని 7,287 గ్రామాలకు 4జీ సేవలు అందించడంలో భాగంగా యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఓఎఫ్) పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలు బుధవారం సమావేశమయ్యాయి. అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. యూఎస్ఓఎఫ్ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశాల్లోని 44 ఆకాంక్ష జిల్లాల్లో 7,287 గ్రామాల్లో సుమారు రూ.6,466 కోట్ల అంచనా వ్యయంతో 4జీ ఆధారిత మొబైల్ సేవలు అందించనున్నట్లు తెలిపారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాల అనంతరం ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ... ఏపీలోని ఆకాంక్ష జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, కడపల్లోని మారుమూల గ్రామాలకు మొబైల్ సేవలు విస్తరించనున్నట్లు తెలిపారు. విశాఖ జిల్లాలో 1,054, విజయనగరంలో 154, కడప జిల్లాలో 10 గ్రామాల్లో మొబైల్ సేవల విస్తరణకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని తెలిపారు.మొత్తంగా 18 నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. సాధ్యసాధ్యాలు పరిగణనలోకి తీసుకొని పరిగణలోకి తీసుకొని సాధ్యమైనంత ఎక్కువగా సోలర్ పవర్ బ్యాటరీలు ద్వారా టెలికాం టవర్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. 2022 వరకు పీఎంజీఎస్‌వై పథకం ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) పథకం ఫేజ్ 1, 2 లను సెప్టెంబరు 2022 వరకూ కొనసాగించనున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. రూ.33,822 కోట్లతో గిరిజన, మారుమూల ప్రాంతాల్లో 32,152 కి.మీ.ల మేర రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. మైదాన ప్రాంతాల్లో 500 పైగా, ఈశాన్య, పర్వత ప్రాంతాల్లో 250పైగా జనాభా ఉన్న గ్రామాలకు రహదారుల అనుసంధానం నిమిత్తం కేంద్రం పీఎంజీఎస్‌వైను ప్రారంభించింది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు రహదారుల అనుసంధానం (ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఏ) ద్వారా 9 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో 4,490 కిలోమీటర్ల మేర రహదారిలో 105 వంతెనలు ఇప్పటికే పూర్తిచేశామన్నారు. 5,714 కిలోమీటర్ల రహదారి, 358 వంతెనలు పూర్తి కావాల్సి ఉండగా మరో 1,887 కిలోమీటర్ల రహదారి, 40 వంతెనల నిర్మాణాలకు అనుమతులు వచ్చినట్లు తెలిపారు. ఈ పథకాన్ని మార్చి 2023 వరకు కొనసాగించడం ద్వారా ఈశాన్య రాష్ట్రాలు, పర్వత ప్రాంతాల రాష్ట్రాల్లోని మిగిలిన పనులు పూర్తి కానున్నాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. -
విశాఖలో వినూత్న ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం
విశాఖ విరాజిల్లేలా సరికొత్త ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సంస్కృతి పరిరక్షణకు చిరునామాగా, పర్యాటక రంగానికి ప్రధాన కేంద్రంగా.. సాంకేతిక రంగంలో అంతర్జాతీయ ఖ్యాతినార్జించేలా భారీ ప్రాజెక్టులు రానున్నాయి. వీటి రాకతో 30 వేల మందికి పైగా ప్రత్యక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదముద్ర వేశారు. ముఖ్యంగా విశాఖ అభివృద్ధిపైనే ప్రభుత్వం దృష్టిసారించినట్లుగా భారీ ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా మాత్రమే కాకుండా.. పర్యాటక రాజధానిగానూ, ఐటీ హబ్‌గానూ తీర్చిదిద్దాలన్న సీఎం వైఎస్ జగన్ సంకల్పానికి అనుగుణంగా భారీ ప్రాజెక్టులు విశాఖకు రానున్నాయి. సంస్కృతి, వేద పాఠశాలలకు.. ఆధ్యాత్మిక కేంద్రానికి చిరునామాగా మారిన విశాఖ జిల్లాని సనాతన సంస్కృతి, సంప్రదాయాలకు కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా భీమిలి మండలం కొత్తవలసలో 15 ఎకరాలను విశాఖ శారదా పీఠానికి కేటాయిస్తూ కేబినెట్ ఆమోదించింది. మార్కెట్ విలువ ప్రకారం ఎకరం రూ.1.5 కోట్లు చొప్పున భూమిని కేటాయించింది. ఈ ప్రాంతంలో సంస్కృత పాఠశాలతో పాటు వేద విద్య పాఠశాలను శారదా పీఠం నిర్మించనుంది. అదేవిధంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిలయంగా కొత్తవలసని మార్చాలని శారదా పీఠం ప్రణాళికలు సిద్ధం చేసింది. అదానీ సంస్థ కోసం నిర్మితమవుతున్న రహదారి అదానీ.. సాంకేతిక మణిహారం రూ.14,634 కోట్లతో పాతికవేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా విశాఖలో అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్‌కు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మధురవాడలో 130 ఎకరాలు కేటాయింపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అదానీ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్, ఇంటిగ్రేటెడ్ ఐటీ అండ్ బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ, రిక్రియేషన్ సెంటర్లని ఏర్పాటు చేయనుంది. విశాఖ ఐటీ చరిత్ర తిరగరాసే విధంగా ఏకంగా పాతికవేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకొచ్చిన అదానీ సంస్థల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాల్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సర్వే నెంబర్ 409లో ఎకరానికి రూ.కోటి చొప్పున 130 ఎకరాలను కేటాయించింది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో 82 ఎకరాల్లో 200 మెగావాట్ల సామర్థ్యంలో డేటా సెంటర్ పార్కు, 28 ఎకరాల్లో ఐటీ బిజినెస్ పార్కు, 11 ఎకరాల్లో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్శిటీ, 9 ఎకరాల్లో రిక్రియేషన్ పార్కు ఏర్పాటు చేయనుంది. మొత్తం 24,900 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఈ మూడు ప్రాజెక్టులు వస్తే అన్ని విభాగాల్లోనూ విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందనుంది. చదవండి: (Andhra Pradesh: అగ్రవర్ణ పేదలకు దన్ను) రిసార్టులతో విదేశీ పర్యాటకాయ నమః టూరిజం డెస్టినీగా పిలిచే విశాఖపట్నం అంటే ప్రపంచ పర్యాటకులకూ ఎంతో ఇష్టం. భారత్‌కు వచ్చే ప్రతి 10 మంది విదేశీయుల్లో ఏడుగురు కచ్చితంగా విశాఖలో పర్యటిస్తారు. అంతర్జాతీయ పర్యాటకులతో నిత్యం కిటకిటలాడే విశ్వనగరిలో తమ శాఖల్ని విస్తరింపజేసేందుకు ప్రముఖ సంస్థలు పోటీ పడుతున్నాయి. అంతర్జాతీయ పర్యాటకులతో పాటు దేశీయ సందర్శకుల కోసం సరికొత్త మౌలిక వసతులతో ముందుకొస్తున్నాయి. ప్రముఖ ఒబెరాయ్ సంస్థ భీమిలి మండలం అన్నవరంలో 7 స్టార్ సదుపాయాలతో లగ్జరీ రిసార్టులు నిర్మించేందుకు సిద్ధమవుతోంది. రూ.350 కోట్లతో ఏర్పాటు చేయనున్న రిసార్ట్ ద్వారా 5,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి. అదేవిధంగా.. పీఎంపాలెం శిల్పారామంలో ప్రముఖ హయత్ గ్రూప్స్ స్టార్ హోటల్ నిర్మించేందుకు ముందుకొచ్చింది. వరుణ్ బీచ్ వద్ద టూరిజం ప్రాజెక్టుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు వస్తే.. మరో 3 వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ప్రాజెక్టులకు టూరిజం పాలసీలో భాగంగా రాయితీలిచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది. -
ఎగుమతులకు కేంద్రం బూస్ట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఎగుమతుల రుణ హామీ బీమా సేవల సంస్థ– ఈసీజీసీ లిస్టింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వచ్చే ఐదేళ్లలో (2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025–2026 ఆర్థిక సంవత్సరం వరకూ)మూలధనంగా కంపెనీకి రూ.4,400 కోట్లు సమకూర్చడానికి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తద్వారా సంస్థ మరింత మంది ఎగుమతిదారులకు రుణ హామీ బీమా సేవలను అందజేయగలుగుతుందని వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయెల్ తెలిపారు. ఎగుమతుల రంగం పురోగతికి కేంద్రం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటుందని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 400 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుందని, ఇందులో సెప్టెంబర్ ముగింపునకు 190 బిలియన్ డాలర్లకు చేరువవుతున్నామని తెలిపారు. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎగుమతుల పురోగతికి ఈసీజీసీ తమ సామర్థ్యాన్ని మరింత పటిష్ట చేసుకోడానికి దోహదపడుతుందని వివరించారు. తక్షణం ఈసీజీసీకి రూ.500 కోట్లు మూలధనంగా సమకూర్చుతున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరం మరో రూ.500 కోట్లను సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఈసీజీసీ లిస్టింగ్ ప్రక్రియను కేంద్రం త్వరలో ప్రారంభిస్తుందని, వచ్చే ఏడాది ఆఫర్ మార్కెట్లోకి వస్తుందని వెల్లడించారు. ఎన్‌ఈఐఏ స్కీమ్ కొనసాగింపు నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్ (ఎన్‌ఈఐఏ) స్కీమ్ కొనసాగింపునకు, అలాగే వచ్చే ఐదేళ్లలో రూ.1,650 కోట్ల మేర గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందించడానికి కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసినట్లు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు.ఈ చర్య ద్వారా సంఘటిత రంగంలో దాదాపు 12,000సహా మొత్తం 2.6 లక్షల నూతన ఉద్యోగ కల్పన జరుగుతుందని మంత్రి వివరించారు. 2022 మార్చి వరకు ఈసీఎల్జీఎస్ స్కీమ్ చిన్న సంస్థలకు మరింత చేయూత కోసమే కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్లతో ఆర్థికంగా దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్ఎంఈ) ఆదుకునేందుకు అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఈసీఎల్జీఎస్) మరింత కాలం పాటు పొడిగించాలని కేంద్రం నిర్ణయంచింది. 2020లో తీసుకొచి్చన ఈ పథకం గడువు వాస్తవానికి 2021 సెపె్టంబర్ 30తో ముగిసిపోవాలి. కానీ, 2020 మార్చి 31 వరకు అంటే మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది. పరిశ్రమల మండళ్లు, ఇతర భాగస్వాముల నుంచి డిమాండ్లు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. ‘‘కరోనా రెండో విడత వల్ల ప్రభావితమైన పలు వ్యాపారాలకు మద్దతుగా నిలిచేందుకు 2020 మార్చి 31 వరకు ఈసీఎల్జీఎస్ పథకం గడువును పొడిగించాలని నిర్ణయించడమైనది. లేదా రూ.4.5 లక్షల కోట్ల రుణాల మంజూరు లక్ష్యం పూర్తయ్యే వరకు (ఏది ముందు అయితే అది) ఈ పథకం అమల్లో ఉంటుంది’’ అని ఆర్థిక శాఖ తన ప్రకటనలో వివరించింది. ఈ పథకం కింద రుణాల విడుదలకు చివరి తేదీగా 2020 జూన్ 30 అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈసీఎల్జీఎస్ 1.0, 2.0 కింద ఇప్పటికే రుణాలు తీసుకున్న సంస్థలకు.. అదనంగా మరో 10% (మిగిలిన రుణంలో) లభిస్తుందని పేర్కొంది. ఈసీఎల్జీఎస్ 1.0, 2.0 కింద ఇప్పటి వరకు సాయం పొందని సంస్థలు.. 30 శాతాన్ని (తమ రుణ బకాయిల మొత్తంలో) తాజా రుణం కింద తీసుకోవచ్చని సూచించింది. ఈసీఎల్జీఎస్ 3.0 కింద ప్రకటించిన రంగా ల్లోని కంపెనీలకు ఇది 40%గా అమలు కానుంది. -
బ్యాడ్ బ్యాంక్‌కు సావరిన్ గ్యారంటీ
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ మొండిబకాయిల భారం తగ్గించేందుకు ఏర్పాటుకానున్న ప్రతిపాదిత నేషనల్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) లేదా బ్యాడ్ బ్యాంక్ జారీ చేసే రిసిట్స్‌కు ప్రభుత్వ (సావరిన్) గ్యారంటీ లభించింది. ఇందుకు సంబంధించి రూ.30,600 కోట్లు కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విలేకరులకు గురువారం ఈ విషయాన్ని తెలిపారు. ప్రతిపాదిత బ్యాడ్ బ్యాంక్... ఎన్ఏఆర్సీఎల్ జారీ చేసే సెక్యూరిటీ రిసిట్స్‌కు ప్రభుత్వం గ్యారెంటీగా ఉండే ప్రతిపాదనకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని క్యాబినెట్ సమావేశం బుధవారమే ఆమోదముద్ర వేసింది. అయితే ఇందుకు సంబంధించి రూ.30,600 కోట్ల నిధుల కేటాయింపు జరుపుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థికమంత్రి తాజాగా తెలిపారు. గత ఆరు సంవత్సరాల్లో బ్యాంకులు రూ.5.01 లక్షల కోట్ల రుణ రికవరీ చేశాయని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా తెలిపారు. 2018 మార్చి నుంచీ చూస్తే ఈ విలువ రూ.3.1 లక్షల కోట్లుగా ఉందని పేర్కొన్నారు. నవంబర్‌కల్లా లైసెన్సులు బ్యాంకింగ్ మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్య పరిష్కారం దిశలో ఇండియన్ బ్యాంక్స్ అసోషియేషన్ (ఐబీఏ) బ్యాడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. లైసెన్స్ మంజూరీకి గత నెల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు ఐబీఏ దరఖాస్తు చేసింది. వచ్చే రెండు నెలల్లో దీనికి ఆర్బీఐ ఆమోదముద్రవేసే అవకాశాలు కూడా ఉన్నాయని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. నిర్వహణా తీరు ఇది... ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం, ఒక బ్యాంక్ నుంచి మొండిబకాయి (ఎన్పీఏ) కొనే సందర్భంలో, అంగీకరించిన విలువలో 15 శాతం వరకూ ఎన్ఏఆర్సీఎల్ నగదు రూపంలో చెల్లిస్తుంది. మిగిలిన 85 శాతం కేంద్ర హామీతో కూడిన సెక్యూరిటీ రిసిట్స్ ఉంటాయి. ఏదైనా ఎన్పీఏ కొనుగోలుకు సంబంధించి ప్రవేశ విలువలో నష్టం జరిగితే ప్రభుత్వ హామీ భరోసాగా ఉంటుంది. రిసిట్స్‌కు గ్యారంటీ ఐదేళ్లు... ఆర్థిక సేవల కార్యదర్శి దేబాíÙష్ పాండా తెలిపిన సమాచారం ప్రకారం, రిసిట్స్‌కు సావరిన్ గ్యారంటీ ఐదేళ్ల కాలానికి వర్తిస్తుంది. రిసిట్స్ విలువకు ఎన్ఏఆర్సీఎల్ ఫీజుకూడా చెల్లించాలి. తొలి దశలో దీనికి 0.25 శాతం ఫీజు ఉంటుంది. మొండిబకాయిల పరిష్కారం విషయంలో ఆలస్యం అయితే ఈ ఫీజు 0.5 శాతం వరకూ పెరుగుతంది. ఈ బ్యాకప్ వ్యవస్థ మొత్తం మొండిబకాయిల భారం సత్వర పరిష్కారానికి, బ్యాంకింగ్‌కు త్వరిత గతిన నిధుల లభ్యతకు, తద్వారా తదుపరి బ్యాంకింగ్ రుణ పంపిణీ పురోగతికి దోహదపడే అంశమని ఆయన వివరించారు. 2021–22 బడ్జెట్ చూస్తే... 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఆర్థికమంత్రి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. ‘‘మొండిబకాయిల నిర్వహణకు అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ ఏర్పాటు జరుగుతుంది. ఒత్తిడిలో ఉన్న రుణ బకాయిని ఈ కంపెనీ తన ఆ«దీనంలోనికి తీసుకుని నిర్వహిస్తుంది లేదా ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లేదా ఇతర అర్హత కలిగిన ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ ప్రాతిపదికన విక్రయిస్తుంది. తద్వారా రుణ బకాయికి తగిన విలువను పొందుతుంది’’ అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. వాటాలు ఇలా.. ఎన్ఏఆర్సీఎల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 51 శాతంగా ఉండనుంది. మిగిలిన వాటాను ప్రైవేటు రంగ బ్యాంకులు కలిగిఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్‌బీఎఫ్‌సీలుసహా ఎన్ఏఆర్సీఎల్లో 16 మంది షేర్హోల్డర్లు ఉంటారు. ఎన్ఏఆర్సీఎల్లో 12 శాతం వాటాతో లీడ్ స్పాన్సర్‌గా ఉండామన్న ఆకాంక్షను ప్రభుత్వ రంగ కెనరాబ్యాంక్ వ్యక్తం చేసింది. తొలి దశలో బ్యాడ్ బ్యాంక్‌కు బదలాయించడానికి 22 మొండి బకాయిలను గుర్తించినట్లు సమాచారం. వీటి విలువ దాదాపు రూ.89,000 కోట్లు. రానున్న కొద్ది కాలంలో దాదాపు రూ.2 లక్షల కోట్ల మొండిబకాయిలను ఎన్ఏఆర్సీఎల్ నిర్వహిస్తుందని (కొనుగోలు చేస్తుందని) అంచనా. ‘4ఆర్’ విధానం ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు మరింత మెరుగుపడ్డానికి ‘4ఆర్’ వ్యూహాన్ని కేంద్రం అనుసరిస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. సమస్య గుర్తింపు (రికగ్నేõÙన్), పరిష్కారం (రిజల్యూషన్), అవసరమైన మూలధన కల్పన (రీక్యాపిటలైజేషన్), సంస్కరణలు (రిఫార్మ్) ‘4ఆర్’లో ఉన్నట్లు వివరించారు. కాగా, బ్యాడ్ బ్యాంక్ ఏదైనా ఎన్పీఏ కొనుగోలుకు సంబంధించి ప్రవేశ విలువలో నష్టం జరిగే సందర్భాలు తక్కువగానే ఉండవచ్చని, ఆ నష్టం ఏ స్థాయిలో ఉంటుందని ఇప్పుడు ఊహించడం సరికాదని ఈ సందర్భంగా సూచించారు. అందువల్ల రిసిట్స్‌కు ప్రభుత్వ గ్యారెంటీ వల్ల ప్రస్తుతానికి ఆర్థిక భారం కేంద్రంపై ఉండబోదని స్పష్టం చేశారు. -
బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటులో కీలక అడుగు
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ మొండి బకాయిల (ఎన్పీఏ) పరిష్కారంలో భాగంగా ప్రతిపాదిత బ్యాడ్ బ్యాంక్ లేదా నేషనల్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) ఏర్పాటు దిశలో కీలక అడుగు పడింది. ఎన్ఏఆర్సీఎల్ జారీ చేసే సెక్యూరిటీ రిసిప్ట్స్‌కు ప్రభుత్వం గ్యారంటీగా ఉండే ప్రతిపాదనకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని క్యాబినెట్ సమావేశం బుధవారం ఆమోదముద్ర వేసింది. తాజా నిర్ణయంతో ఎన్ఏఆర్సీఎల్ జారీ చేసే సెక్యూరిటీ రిసిట్స్‌కు సావరిన్ (ప్రభుత్వ) గ్యారంటీ లభించనుంది. ప్రభుత్వ గ్యారెంటీ తొలి దశలో దాదాపు రూ.31,000 కోట్లు ఉంటుందని బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) అంచనావేస్తోంది. మొండిబకాయికి సంబంధించి ఆమోదిత విలువలో 15 శాతం ఎన్ఏఆర్సీఎల్ నగదులో చెల్లిస్తుంది. మిగిలిన 85 శాతం ప్రభుత్వ హామీతో కూడిన సెక్యూరిటీ రిసిప్్ట్స’ ఉంటాయని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదైనా ఎన్పీఏ కొనుగోలుకు సంబంధించి ప్రవేశ విలువలో నష్టం జరిగితే ప్రభుత్వ హామీ భరోసాగా ఉంటుంది. లైసెన్స్‌కు ఇప్పటికే దరఖాస్తు.. రూ.6,000 కోట్ల బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుకు సంబంధించి లైసెన్స్‌కు ఐబీఏ గతవారం ఆర్బీఐని సంప్రదించింది. వచ్చే రెండు నెలల్లో ఈ లైసెన్స్ జారీ అవకాశం ఉంది. ఎన్ఏఆర్సీఎల్ ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 51 శాతంగా ఉండనుంది. మిగిలిన వాటాను ప్రైవేటు రంగ బ్యాంకులు కలిగిఉంటాయి. ఎన్ఏఆర్సీఎల్లో 12 శాతం వాటాతో లీడ్ స్పాన్సర్‌గా ఉందామన్న ఆకాంక్షను ప్రభుత్వ రంగ కెనరాబ్యాంక్ వ్యక్తం చేసింది. తొలి దశలో బ్యాడ్ బ్యాంక్‌కు బదలాయించడానికి 22 మొండి బకాయిలను గుర్తించినట్లు సమాచారం. వీటి విలువ దాదాపు రూ.89,000 కోట్లు. -
వాహనాలు, డ్రోన్ పరిశ్రమకు పీఎల్ఐ స్కీమ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆటోమొబైల్ పరిశ్రమ, డ్రోన్ పరిశ్రమలకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాన్ని(పీఎల్‌ఐఎస్) వర్తింపజేసే ప్రతిపాదనలకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా రానున్న ఐదేళ్లలో రూ. 26,058 కోట్ల మేర నిధులను కేటాయించనున్నారు. అధిక విలువతో కూడిన అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ వాహనాలు, ఉత్పత్తులకు ఈ పీఎల్ఐ స్కీమ్ ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన సామర్థ్యం, గ్రీన్ ఆటోమోటివ్ వాహనాల తయారీకి ఈ చర్య ఊతమిస్తుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ విలేకరుల సమావేశంలో వివరించారు. 2021–22 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన మేరకు మొత్తం 13 రంగాలకు పీఎల్ఐ స్కీమ్ వర్తింపజేయాల్సి ఉంది. అందులో భాగంగానే తాజాగా కేంద్రం ఆటోమోటివ్, డ్రోన్ రంగాలకు ఈ స్కీమ్‌ను వర్తింపజేసింది. అత్యాధునిక ఆటోమోటివ్ టెక్నాలజీ ఉత్పత్తుల తయారీలో ఎదురవుతున్న పెట్టుబడి సమస్యలను ఈ పథకం పరిష్కరిస్తుంది. సంబంధిత దేశీయ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసేలా కొత్త పెట్టుబడులను పెట్టేందుకు ఈ ప్రోత్సాహక స్వరూపం దోహదపడుతుంది. ఐదేళ్ల కాలంలో ఆటోమొబైల్, ఆటో కంపోనెంట్స్ పరిశ్రమలో సుమారు రూ. 42,500 కోట్ల పెట్టుబడులకు ఈ చర్య దోహదపడుతుందని కేంద్రం అంచనా వేసింది. సుమారుగా రూ. 2.3 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు పెరగడం వల్ల 7.5 లక్షల మందికి అదనంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేసింది. అలాగే అంతర్జాతీయ ఆటోమోటివ్ వాణిజ్యంలో ఇండియా వాటా పెరుగుతుంది. రెండు విధాలుగా అమలు.. ఈ పీఎల్ఐ స్కీమ్ ప్రస్తుతం ఉనికిలో ఉన్న తయారీ సంస్థలకు, కొత్త పెట్టుబడిదారులకు కూడా వర్తిస్తుంది. ఇందులో రెండు కాంపొనెంట్లు ఉన్నాయి. చాంపియన్ ఓఈఎం ఇన్సెంటివ్ స్కీమ్ అమ్మకాల విలువతో అనుసంధానమైన స్కీమ్. ఇది బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్స్‌కు వర్తిస్తుంది. ఇక కాంపొనెంట్ చాంపియన్ ఇన్సెంటివ్ స్కీమ్ అమ్మకాల విలువతో అనుసంధానమై ఉన్న మరో పథకం. ఇది అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ కాంపొనెంట్స్, సీకేడీ, సెమీ సీకేడీ కిట్స్, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్ల విడిభాగాలకు వర్తిస్తుంది. రూ. 18 వేల కోట్లతో అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్‌కు ఇప్పటికే పీఎల్ఐ స్కీమ్ వర్తింపజేసింది. అలాగే రూ. 10 వేల కోట్లతో ఫేమ్ స్కీమ్ అమలు చేస్తోంది. డ్రోన్స్‌కు రెక్కలు పీఎల్ఐ పథకంలో భాగంగా డ్రోన్స్, డ్రోన్స్‌కు అవసరమయ్యే విడిభాగాల పరిశ్రమకు దన్నునిచ్చేందుకు సైతం ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు మూడేళ్ల కాలానికిగాను రూ. 120 కోట్లు కేటాయించినట్లు పౌర విమానయాన శాఖ పేర్కొంది. డ్రోన్లు, డ్రోన్ల విడిభాగాల తయారీలో వేల్యూ ఎడిషన్‌కు గరిష్టంగా 20 శాతంవరకూ ప్రోత్సాహకాలు లభించగలవని తెలియజేసింది. 2021 డ్రోన్ నిబంధనల ప్రకారం డ్రోన్ల నిర్వాహకులు నింపవలసిన దరఖాస్తులను 25 నుంచి 5కు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. తద్వారా విప్లవాత్మక ఆధునిక తర టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సాహించనుంది. మూడేళ్ల కాలంలో డ్రోన్ల పరిశ్రమలో రూ. 5,000 కోట్ల పెట్టుబడులకు దారి ఏర్పడుతుందని ప్రభుత్వం పేర్కొంది. రూ. 1,500 కోట్ల అర్హతగల అమ్మకాలు పెరగవచ్చని, ఇదే విధంగా 10,000 మందికి అదనంగా ఉపాధి లభించగలదని భావిస్తోంది. పథకంకింద డ్రోన్ల విడిభాగాలలో ఎయిర్‌ఫ్రేమ్, ప్రొపుల్షన్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, బ్యాటరీలు, ఫ్లైట్ కంట్రోల్ మాడ్యూల్, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, కెమెరాలు, సెన్సార్లు తదితరాలను చేర్చింది. కాగా.. డ్రోన్ల సంబంధిత ఐటీ ప్రొడక్టుల అభివృద్ధి సంస్థలకు సైతం పీఎల్ఐ పథకాన్ని వర్తింప చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. 2021–22 కేంద్ర బడ్జెట్లో పీఎల్ఐ పథకానికి అనుమతించిన 13 రంగాలలో భాగంగానే డ్రోన్ల పరిశ్రమను చేర్చినట్లు ప్రభుత్వం తెలియజేసింది. -
ఆటో ‘మొబైల్’కు బూస్ట్!
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోలకు ఊపిర్లూదే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంది. టెలికం రంగంలో భారీ సంస్కరణలకు తెర తీస్తూ టెల్కోలకు ఉపశమన ప్యాకేజీ ప్రకటించింది. ఆపరేటర్లు చెల్లించాల్సిన బకాయిలపై నాలుగేళ్ల దాకా మారటోరియం విధించడం, ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) నిర్వచనాన్ని సవరించడం, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు తొలగించడం, టెలికం రంగంలో ఆటోమేటిక్ విధానం ద్వారా 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించడం తదితర చర్యలు ఇందులో ఉన్నాయి. కేంద్ర కేబినెట్ బుధవారం ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర వేసింది. వ్యవస్థాగతంగా తొమ్మిది సంస్కరణలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. టెల్కోల ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడేందుకు ఈ ప్యాకేజీ తోడ్పడగలదని పరిశ్రమ వర్గాలు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఉపాధి, పోటీకి ఊతం: టెలికం మంత్రి వైష్ణవ్ ‘‘టెలికం పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించేందుకు, కస్టమర్లకు ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచేందుకు, కొత్త సంస్థలు వచ్చేలా దారి ఏర్పర్చేందుకు తొమ్మిది వ్యవస్థాగతమైన సంస్కరణలను కేబినెట్ ఆమోదించింది’’ అని కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. 5జీ స్పెక్ట్రం వేలం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉందన్నారు. ప్యాకేజీలో..: సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) నిర్వచన పరిధి నుంచి టెలికంయేతర ఆదాయాలను మినహాయించారు. ఇది .. ఇక నుంచి అమలవుతుంది. నిబంధనల ప్రకారం ఏజీఆర్‌లో నిర్దిష్ట శాతాన్ని టెలికం కంపెనీలు.. కేంద్రానికి చట్టబద్ధమైన సుంకాల రూపంలో కట్టాల్సి ఉంటుంది. టెలికంయేతర ఆదాయాలను కూడా ఏజీఆర్‌లో కలపడం వల్ల వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోలు కట్టాల్సిన బాకీలు వేల కోట్ల రూపాయల మేర పేరుకుపోయాయి. దీంతో అవి దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నాయి. తాజాగా టెలికంయేతర ఆదాయాలను ఏజీఆర్ నుంచి మినహాయించడంతో టెల్కోలకు ఊరట లభిస్తుంది. మరోవైపు, ప్రభుత్వానికి టెల్కోలు గత బాకీలను చెల్లించేందుకు నాలుగేళ్ల దాకా మారటోరియం (వార్షిక చెల్లింపులను వాయిదా వేసుకునే వీలు) ఇవ్వడానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. అయితే, ఈ వ్యవధిలో స్వల్పంగా వడ్డీ కట్టాల్సి ఉంటుంది. టెలికంలో ఆటోమేటిక్ మార్గంలో 100%ఎఫ్‌డీఐలకు అనుమతినిచ్చారు. ఇప్పటిదాకా ఇది 49%గానే ఉంది. దానికన్నా మించితే ప్రభుత్వ అనుమతి ద్వారా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటోంది. ► స్పెక్ట్రం యూజర్ చార్జీలను (ఎస్‌యూసీ) క్రమబదీ్ధకరించారు. ఎస్‌యూసీ బాకీలపై నెలవారీ చక్ర వడ్డీ విధానం స్థానంలో వార్షిక చక్రవడ్డీ విధానాన్ని ప్రకటించారు. అలాగే వడ్డీ రేటును కూడా తగ్గించారు. ఇకపై టెల్కోలు పదేళ్ల తర్వాత స్పెక్ట్రంను సరెండర్ చేయొచ్చు, అలాగే ఇతర సంస్థలతో పంచుకోవచ్చు. సెల్ఫ్ అప్రూవల్ ప్రాతిపదికన టవర్ల ఏర్పాటు ప్రక్రియను సరళతరం చేశారు. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థలు కేంద్రానికి రూ. 92,000 కోట్లు లైసెన్సు ఫీజు, రూ. 41,000 కోట్లు స్పెక్ట్రం యూసేజీ చార్జీలు బాకీ పడ్డాయి. ► ఇతర సుంకాలను, లైసెన్సు ఫీజుకు సంబంధించి చూపాల్సిన బ్యాంక్ గ్యారంటీలను తగ్గించారు. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల (ఎస్‌యూసీ) చెల్లింపులో జాప్యానికి గాను విధించే పెనాలీ్టలను తొలగించారు. వడ్డీ రేట్లను క్రమబదీ్ధకరించారు. భవిష్యత్తులో నిర్వహించే వేలానికి బ్యాంక్ గ్యారంటీ అవసరం ఉండదు. ► స్పెక్ట్రం కాలపరిమితిని 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు పొడిగించారు. 10 సంవత్సరాల తర్వాత స్పెక్ట్రంను సరెండర్ చేయవచ్చు. భవిష్యత్తులో నిర్వహించే వేలంలో కొనుగోలు చేసే స్పెక్ట్రంపై ఎస్‌యూసీ ఉండదు. ► ప్రక్రియపరమైన సంస్కరణలు చూస్తే..స్పెక్ట్రం వేలం నిర్వహణకు నిర్దిష్ట క్యాలెండర్ రూపకల్పన, వైర్లెస్ పరికరాల కోసం క్లిష్టతరమైన లైసెన్సు ప్రక్రియ తొలగింపు, యాప్ ఆధారిత సెల్ఫ్–కేవైసీ, పేపర్ రూపంలో ఉండే కస్టమర్ అక్విజిషన్ ఫారమ్‌ల (సీఏఎఫ్) స్థానంలో డేటాను డిజిటల్‌గా భద్రపర్చడం వంటివి ఉన్నాయి. అలాగే ఈ–కేవైసీ రేటును రూ.1కి సవరించారు. ఉభయతారకంగా సంస్కరణలు.. ఈ సంస్కరణలు.. టెలికం రంగానికి, వినియోగదారులకు ఉభయతారకంగా ఉంటాయి. పరిశ్రమ అభివృద్ధికి, ఉద్యోగావకాశాలకు తోడ్పడతాయి. వాహనాలు, డ్రోన్ పరిశ్రమకు ప్రకటించిన పీఎల్ఐ స్కీముతో తయారీకి ఊతం లభిస్తుంది. – నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి డిజిటల్ లక్ష్య సాకారానికి దోహదం.. ఎకానమీకి తోడ్పాటు అందించడంతో పాటు డిజిటల్ ఇండియా లక్ష్యాల సాకారానికి తోడ్పడేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణలు, చర్యలను స్వాగతిస్తున్నాను. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు – ముకేశ్ అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్ చేసేందుకు తోడ్పాటు.. పరిశ్రమ నిర్భయంగా పెట్టుబడులు పెట్టేందుకు, డిజిటల్ ఇండియా ఆకాంక్షల సాధనకు కేంద్రం ప్రకటించిన సంస్కరణలు తోడ్పడతాయి. టెల్కోలు నిలదొక్కుకునేందుకు ఇవి దోహదపడగలవు. ప్రధాని పిలుపు మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ఎయిర్టెల్ సిద్ధం. – సునీల్ మిట్టల్, చైర్మన్, భారతి ఎయిర్టెల్ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.. పరిశ్రమ ఆరోగ్యకరంగా ఎదిగేలా చూసేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందనడానికి ఈ సంస్కరణలు నిదర్శనం. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించడాన్ని ఈ చర్యలు ప్రతిబింబిస్తున్నాయి. – కుమార మంగళం బిర్లా, చైర్మన్, ఆదిత్య బిర్లా గ్రూప్ ఎగుమతులకు జోష్... సవరించిన పీఎల్ఐ పథకం ఎగుమతులకు భారీ అవకాశాలను కలి్పంచనుంది. దేశీ ఆటో పరిశ్రమ ప్రపంచవ్యాప్త సప్లై చైన్‌తో మమేకమయ్యేందుకు దోహదపడుతుంది. మన కంపెనీల అవకాశాలకు తోడ్పడుతుంది. –విపిన్ సొం«దీ, ఎండీ, సీఈఓ, అశోక్ లేలాండ్ పరిశ్రమకు దన్ను.. తాజాగా సవరించిన పీఎల్ఐ పథకం ఆటో పరిశ్రమకు అవసరమైన జోష్‌నివ్వనుంది. ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలకు దారి చూపనుంది. –వేణు శ్రీనివాసన్, చైర్మన్, టీవీఎస్ మోటార్ ఇవి అత్యధిక నిధులు.. ప్రభుత్వం ప్రకటించిన పీఎల్ఐ పథకాలలోకెల్లా తాజాగా కేటాయించిన నిధులు అత్యధికం. ఎలక్ట్రిక్, హైడ్రోజన్ వాహనాలు, విడిభాగాలకు ప్రోత్సాహకాల ద్వారా దేశీ ఆటో పరిశ్రమకు మద్దతివ్వడం.. ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. –కెనిచి అయుకవా, ప్రెసిడెంట్, సియామ్ -
టెక్స్‌టైల్స్‌కు ‘పీఎల్ఐ’ బూస్ట్!
సాక్షి, న్యూఢిల్లీ: వస్త్ర పరిశ్రమ (టెక్స్టైల్స్)ను ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కిందకు తీసుకువస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రంగానికి రానున్న ఐదేళ్లలో రూ.10,683 కోట్లు కేటాయించింది. పరిశ్రమ పురోభివృద్ధి, ఎగుమతులు లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాణిజ్య, పరిశ్రమలు, టెక్స్టైల్స్ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ విలేకరులకు తెలిపారు. ఎంఎంఎఫ్ (మేన్–మేడ్ ఫైబర్) దుస్తులు, ఎంఎంఎఫ్ వస్త్రాలు, టెక్నికల్ టెక్స్‌టైల్స్‌కు సంబంధించిన 10 విభాగాలు/ఉత్పత్తులకు తాజా నిర్ణయం వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. 13 రంగాలకు వర్తించే విధంగా పీఎల్ఐ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం 2021–22 ఏడాది బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి మొత్తంగా రూ.1.97 లక్షల కోట్ల కేటాయింపులు జరిపింది. ఉపాధి, వాణిజ్య అవకాశాల మెరుగుదల ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు, పత్తి, సహజ ఫైబర్ ఆధారిత వస్త్ర పరిశ్రమలో కొత్తగా ఉపాధి, వాణిజ్య అవకాశాలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం దోహదపడనుంది. కొన్ని నిర్దిష్ట జిల్లాలతోపాటు, టైర్–3, టైర్– 4 పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ రంగంలో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు కేంద్రం తెలిపింది. వస్త్ర పరిశ్రమకు పీఎల్ఐ స్కీమ్ వర్తింపు వల్ల తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, యూపీ, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, ఒడిశా తదితర రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుంనది వివరించింది. ఐదేళ్లలో ఈ స్కీమ్ వల్ల రూ. 19,000 కోట్లకు పైగా కొత్త పెట్టుబడులు వస్తాయని అంచనా వేసింది. రూ. 3 లక్షల కోట్లకు పైగా టర్నోవర్ సాధ్యమవుతుందని పేర్కొంది. ప్రత్యేకించి ఈ పథకం మహిళలకు సాధికారతనిస్తుందని, ఆర్థిక వ్యవస్థలో వారి భాగస్వామ్యాన్ని పెంచుతుందని వివరించింది. ఎంఎంఎఫ్ ఫ్యాబ్రిక్స్‌కు మెరుపు కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం భారత వస్త్ర పరిశ్రమలో కీలక పరిణామం. ఎంఎంఎఫ్ ఫ్యాబ్రిక్ భారత తయారీ సామర్థ్యం పటిష్టతకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. ఎంఎంఎఫ్ ఫ్యాబ్రిక్, దారం సరఫరాలను భారత్ కలిగి ఉంది. అయితే అయితే నాణ్యమైన ఎంఎంఎఫ్ వస్త్ర ఉత్పత్తి తగినంతగా లేదు. ఈ సమస్యను అధిగమించడానికి తాజా కేబినెట్ నిర్ణయం సహాయపడుతుంది. భారత్ మొత్తం వస్త్ర ఉత్పత్తిలో ఎంఎంఎఫ్ ఆధారిత దుస్తుల వాటా 20 శాతం మాత్రమే. ఈ నిర్ణయం వల్ల ఎంఎంఎఫ్ ఆధారిత దుస్తులు ఇకపై ప్రతి ఏడాదీ పెరుగుతాయి. వచ్చే మూడేళ్లలో వస్త్ర ఎగుమతులూ రెట్టింపయ్యే అవకాశాలు ఉన్నాయి. – ఏ శక్తివేల్, ఏఈపీసీ చైర్మన్ -
యాంకరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారీ ఎఫ్‌డీఐ ప్రతిపాదనకు ఓకే!
న్యూఢిల్లీ: యాంకరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ రూ.15,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనకు ప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదముద్ర వేసింది. మౌలిక రంగంలో పెట్టుబడులకు ఉద్దేశించి యాంకరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ (కెనడా పెన్షన్ ఫండ్‌కు అనుబంధ విభాగం) ఈ భారీ ఎఫ్‌డీఐ ప్రతిపాదనను చేసింది. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ వాటా యాంకరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్‌కు బదలాయింపు కూడా పెట్టుబడుల్లో భాగంగా ఉంది. ఇటీవల కేంద్రం ప్రకటించిన నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) విధానానికి, ఉపాధి కల్పనకు తాజా ఎఫ్‌డీఐ ప్రతిపాదన భారీ మద్దతునిస్తుందని ఈ మేరకు వెలువడిన ఒక అధికారిక ప్రకటన తెలిపింది. -
ఆయిల్ పామ్ గెలలకు ధర హామీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ శాఖ నూతనంగా ప్రతిపాదించిన జాతీయ వంట నూనెలు–ఆయిల్ పామ్ మిషన్ (నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్– ఆయిల్ పామ్) పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ కేంద్ర ప్రాయోజిత పథకం ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తుంది. దేశం వంట నూనెల దిగుమతులపై ఆధారపడి ఉన్నందున ఆయా పంటల విస్తీర్ణం పెంచడం, ఉత్పాదకత పెంచడం లక్ష్యంగా ఈ పథకం పనిచేస్తుంది. రూ. 11,040 కోట్ల మేర ఖర్చయ్యే ఈ పథకంలో కేంద్రం రూ. 8,844 కోట్లు, రాష్ట్రాలు రూ. 2,196 కోట్ల మేర వెచ్చించాల్సి ఉంటుంది. 2025–26 సంవత్సరం నాటికి అదనంగా 6.5 లక్షల హెక్టార్ల మేర పామాయిల్ సాగయ్యేలా లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా మొత్తం పామాయిల్ సాగు 10 లక్షల హెక్టార్లకు చేరుతుంది. పామాయిల్ పంటకు ధర హామీ సాధారణంగా పామాయిల్ గెలల దరలు అంతర్జాతీయ క్రూడ్ పామ్ ఆయిల్ ధరల అనిశ్చితి వల్ల ప్రభావితమవుతాయి. అందువల్ల తొలిసారిగా కేంద్రం పామాయిల్ రైతులకు తాజా గెలలకు గాను ధర హామీ అందించనున్నట్టు ప్రకటించింది. దీనిని వయబులిటీ ప్రైస్ (వీపీ)గా పేర్కొంది. దీని ద్వారా ధరల అనిశ్చితి నుంచి రైతులకు భరోసా అందుతుందని తెలిపింది. రాష్ట్రాలు ఈ పథకం వర్తింపునకు కేంద్రంతో ఎంవోయూ కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఇన్‌పుట్స్‌కు సాయం పెంపు.. ప్లాంటింగ్ మెటిరియల్ తదితర అవసరాల కోసం హెక్టారుకు కేంద్రం ప్రస్తుతం ఇస్తున్న రూ. 12 వేల సాయాన్ని రూ. 29 వేలకు పెంచింది. పామాయిల్ తోటల్లో పాత చెట్ల స్థానంలో కొత్త చెట్లను నాటేందుకు వీలుగా మొక్కకు రూ. 250 చొప్పున ఆర్థికసాయాన్ని కూడా కేంద్రం ఈ పథకం ద్వారా ప్రకటించింది. ప్లాంటింగ్ మెటిరియల్ కొరతను తీర్చేందుకు వీలుగా సంబంధిత నర్సరీలకు 15 హెక్టార్లకు రూ. 80 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. ఈశాన్య ప్రాంతాల వ్యవసాయ మార్కెటింగ్ సంస్థ పునరుద్ధరణకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. దీనికి రూ. 77 కోట్ల మేర పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించింది. -
రాష్ట్రాలకు ‘ఓబీసీ జాబితా’ అధికారాలు
న్యూఢిల్లీ: ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ) జాబితాలో మార్పులు/చేర్పులకు సంబంధించిన హక్కులను మళ్లీ రాష్ట్రాలకు కట్టబెట్టేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది. అందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పిందని విశ్వసనీయ వర్గాలు బుధవారం వెల్లడించాయి. త్వరలో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాల(ఎస్ఈబీసీ)లను గుర్తించి వారిని ఓబీసీ జాబితాలో చేర్చే హక్కులు ప్రస్తుతం రాష్ట్రాలకు లేవని గతంలో సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు చెప్పడం తెల్సిందే. అంతకుపూర్వం రాష్ట్రాలకు ఈ హక్కులు ఉండేవి. అయితే, 102వ రాజ్యాంగ సవరణ తర్వాత రాష్ట్రాలకు ఈ హక్కులు లేవని కోర్టు తేల్చింది. జాతీయ బీసీ కమిషన్ విధివిధానాలను ఖరారుచేస్తూ 2018నాటి రాజ్యాంగ సవరణ చట్టంలో 338బీ ఆర్టికల్‌ను చేర్చారు. ఇదే చట్టంలోని ఆర్టికల్ 342ఏ ప్రకారం ఎస్ఈబీసీలను నోటిఫై చేసే అధికారం రాష్ట్రపతికే ఉంది. ఎస్ఈబీసీ జాబితాలో మార్పులు చేసే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందంటూ మే ఐదున సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. కొత్తగా మరాఠాలకు కోటా ఇస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లదంటూ, 1992నాటి ‘మండల్’ తీర్పును విస్తృత ధర్మాసనానికి సమీక్షకోసం పంపలేమంటూ జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల ధర్మాసనం మే ఐదున సంచలన తీర్పు వెలువరించడం తెల్సిందే. ఈ తీర్పు తర్వాత రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. సమైక్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ తమ నుంచి కేంద్రం అధికారాలను లాగేసుకుందని రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. అందుకే మళ్లీ రాష్ట్రాలకు ఓబీసీ జాబితాలో మార్పులు చేసే అధికారాలు అప్పజెప్పే బిల్లుకు కేబినెట్ ఓకే చెప్పిందని సమాచారం. మరో ఐదేళ్లు సమగ్ర శిక్షా పథకం పాఠశాల విద్యకు సంబంధించిన సమగ్ర శిక్షా పథకాన్ని మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. అంగన్వాడీలకు శిక్షిణనిచ్చే మాస్టర్ ట్రెయినర్లకు శిక్షణనివ్వడం, విద్యార్థినుల హాస్టళ్లలో శానిటరీ ప్యాడ్ మెషీన్ల ఏర్పాటు, సీనియర్ సెకండరీ స్కూళ్లలో కొత్త సబ్జెక్టులను నేర్పించడం, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 12వ తరగతి వరకూ విద్యాబోధన, తదితరాలను సమగ్ర శిక్షా పథకంలో భాగంగా అమలుచేయనున్నారు. మరో రెండేళ్లు ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు 389 పోక్సో కోర్టులుసహా దేశవ్యాప్తంగా 1,023 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులను మరో రెండేళ్లపాటు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెస్తామని మంత్రి అనురాగ్ ఠాకూర్ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. కోర్టుల నిర్వహణకు కేంద్రం తన వాటాగా రూ.971.70 కోట్లు ఖర్చుచేయనుంది. ‘నిర్భయ’ నిధి నుంచి కేంద్రం తన వాటా నిధులను అందజేయనుంది. -
ప్రైవేటీకరణ దిశగా కేంద్రం జోరు
న్యూఢిల్లీ: ప్రైవేటీకరణ బాటలో కేంద్రం తన స్పీడ్ పెంచింది. ఈ దిశలో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ రంగంలోని ఆయిల్, గ్యాస్ కంపెనీల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) కేంద్రం గురువారం అనుమతినిచ్చింది. దీనితో ఆయా సంస్థల నుంచి ప్రభుత్వం తన మెజారిటీ వాటాల విక్రయానికి (వ్యూహాత్మక విక్రయాలు) మార్గం సుగమం అయ్యింది. ఇక ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల ప్రైవేటీకరణకు ఉద్దేశించిన జీఐబీఎన్‌ఏ (జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్– నేషనలైజేషన్ యాక్ట్) సవరణలకు కేంద్రం క్యాబినెట్ బుధవారమే ఆమోదముద్ర వేసినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఆయిల్, గ్యాస్ రంగంలో తక్షణం పెట్టుబడుల ఉపసంహరణ వరుసలో భారత్ రెండవ అతిపెద్ద ఆయిల్ రిఫైనర్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) నిలుస్తోంది. ప్రభుత్వం బీపీసీఎల్‌ను ప్రైవేటీకరిస్తున్న సంగతి తెలిసిందే. కంపెనీలో తన పూర్తి 52.98 శాతం వాటాలను విక్రయిస్తోంది. ‘‘ఆయిల్, సహజ వాయువు రంగాలకు సంబంధించి ఎఫ్‌డీఐ విధానానికి కొత్త క్లాజ్‌ను జోడించడం జరిగింది. దీని ప్రకారం, వ్యూహాత్మక విక్రయాలకు సూత్రప్రాయ ఆమోదం పొందిన సంస్థల్లోకి 100 శాతం విదేశీ పెట్టుబడులను ఆటోమేటిక్ రూట్లో (కఠిన ఆమోదాలు అవసరం లేని) అనుమతించడం జరుగుతుంది’’ అని డీపీఐఐటీ (పారిశ్రామిక అభివృద్ధి, అంతర్గత వాణిజ్య శాఖ) ఒక నోట్లో పేర్కొంది. విదేశీ కంపెనీల ఆసక్తి.. బీపీసీఎల్‌లో ప్రభుత్వ పూర్తి వాటా కొనుగోలుకు ఆసక్తిని వ్యక్తం చేసిన 3 కంపెనీల్లో రెండు విదేశీ కంపెనీలే. ప్రభుత్వం నుంచి 52.98% వాటాను కొనుగోలు చేసే సంస్థ, టేకోవర్ నిబంధనల ప్రకారం ఇతర వాటాదారుల నుంచి మరో 26% వాటా కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ ఇవ్వవచ్చు. బీపీసీఎల్ కొనుగోలు రేసులో వేదాంతాతో పాటు, అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు అపోలో గ్లోబల్, ఐ స్వేర్డ్ క్యాపిటల్స్ అనుబంధ విభాగం థింక్ గ్యాస్‌లు పోటీపడుతున్నాయి. ఇప్పటివరకూ 49 శాతమే! 2008 మార్చిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రమోట్ చేస్తున్న చమురు రిఫైనర్‌లో ఎఫ్‌డీఐ పరిమితి 26% నుంచి 49%కి పెరిగింది. బీపీసీఎల్ అమ్మకం పూర్తయితే, ఐఓసీ మాత్రమే ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉండే ఏౖకైక చమురు రిఫైనింగ్ కంపెనీగా ఉంటుంది. ప్రభుత్వ బీమా కంపెనీలు కూడా! ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల ప్రైవేటీకరణకు ఉద్దేశించిన జీఐబీఎన్‌ఏ (జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్– నేషనలైజేషన్ యాక్ట్) సవరణలకు కేంద్రం క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లును ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రైవేటీకరణ చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన 2021–22 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ బాధ్యతను నీతి ఆయోగ్‌కు అప్పగించడమూ జరిగింది. ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమకూర్చుకోవాలన్నది బడ్జెట్ లక్ష్యం. ఫైనాన్షియల్ రంగంలో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎల్ఐసీ మెగా ఐపీఓకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికితోడు ఐడీబీఐ బ్యాంక్‌లో తన మిగిలిన వాటా విక్రయాలకూ సిద్ధమవుతోంది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లో వాటాల విక్రయానికి నీతి ఆయోగ్ సూచనలు చేసినట్లు సమాచారం. చిన్న విమానాశ్రయాలు షురూ..! దేశంలో చిన్న విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రోత్సాహం, మారుమూల, దూర ప్రాంతాలకు విమాన సర్వీసుల విస్తరణకు తొలి అడుగు పడింది. ఇందుకు సంబంధించిన ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (సవరణ) బిల్లు, 2021కు లోక్‌సభ గురువారం ఆమోదముద్ర వేసింది. పెగాసస్, రైతుల సమస్యలపై సభ్యులు ఆందోళనలు చేస్తున్న పరిస్థితుల్లో ఎటువంటి చర్చా లేకుండా పౌర విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది. దేశంలో 128 విమానాశ్రయాలు త్వరలో ఏర్పాటవుతాయని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. -
సంస్కరణలకు ‘సవరణ’ దన్ను!
న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణల బాటలో కీలక చట్ట సవరణ బిల్లుకు బుధవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ (ఎల్ఎల్పీ) యాక్ట్ చట్ట సవరణలకు ఓకే చెప్పింది. ఇక బ్యాంకింగ్ డిపాజిటర్ల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) యాక్ట్, 1961 సవరణకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ంది. రెండు అంశాలనూ వేర్వేరుగా పరిశీలిస్తే... ఎల్ఎల్పీ యాక్ట్.. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ (ఎల్ఎల్పీ) చట్టంలో అనేక నిబంధనలకు కాలం చెల్లింది. ఆయా నిబంధనల కింద ఏదైనా తప్పు జరిగితే నేరపూరితంగా పరిగణించడం జరుగుతోంది. ఇలాంటి ఇబ్బందిని తొలగించడమే (డీక్రిమినలైజ్) ఎల్ఎల్పీ యాక్ట్ చట్ట సవరణ ప్రధాన ఉద్దేశ్యం. దేశంలో ఎటువంటి ఇబ్బందీ లేకుండా వ్యాపార నిర్వహణకు (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ఎల్ఎల్పీ యాక్ట్‌లో పలు నిబంధనలను సవరించాలని పారిశ్రామిక వర్గాల నుంచి గత కొన్నేళ్లుగా డిమాండ్ ఉంది. ఈ చట్టం కింద నిబంధనలు పాటించడంలో విఫలమైన దాదాపు 2.30 లక్షల కంపెనీలు ప్రస్తుతం క్రిమినల్ చర్యలను ఎదుర్కొంటున్నాయి. కేంద్ర క్యాబినెట్ తాజా నిర్ణయం ఆయా కంపెనీలకు పెద్ద ఊరట. క్యాబినెట్ సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, తాజా ఆమోదాల వల్ల చట్టంలోని పీనల్ ప్రొవిజన్స్ (శిక్షకు సంబంధించిన నిబంధనలు) 22కు తగ్గిపోతాయని తెలిపారు. కాంపౌండబుల్ (నేరుగా కక్షి దారులు పరిష్కరించుకోదగినవి) నేరాలకు సంబంధించిన నిబంధనలు ఏడుకు, నాన్–కాంపౌండబుల్ నిబంధనలు మూడుకు తగ్గుతాయని పేర్కొన్నారు. ఇక ఇన్–హౌస్ అడ్జూడికేషన్ యంత్రాగం (ఐఏఎం) కింద పరిష్కరించుకోగలిగిన వివాదాల నిబంధనలు కేవలం 12గా ఉంటాయని పేర్కొన్నారు. ఎల్ఎల్పీ యాక్ట్ 81 సెక్షన్లు, 4 షెడ్యూళ్లను కలిగిఉంది. డీఐసీజీసీ చట్టం... ఒక బ్యాంకు మూతపడే సందర్భాల్లో ఆ బ్యాంకులో ఉన్న తన మొత్తం డిపాజిట్లో కేవలం లక్ష రూపాయలను మాత్రమే డిపాజిట్ దారుడు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) యాక్ట్ కింద తిరిగి పొందగలుగుతున్నాడు. అయితే ఈ కవరేజ్‌ని ఐదు రెట్లు అంటే రూ.5 లక్షలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీఐసీజీసీ యాక్ట్, 1961ను సవరిస్తున్నట్లు 2021–22 వార్షిక బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► చట్ట సవరణ ప్రకారం, మారటోరియం కింద ఉన్న డిపాజిట్ సొమ్ములో 5 లక్షల వరకూ డిపాజిటర్ 90 రోజుల్లో పొందగలుగుతాడు. ► పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ), యస్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి, డిపాజిటర్లు తీవ్ర ఇబ్బందుల్లో పడిన నేపథ్యంలో కేంద్రం డీఐసీజీసీ చట్ట సవరణ బిల్లు, 2021కు ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు ఆమోదం వేలాది మంది డిపాజిటర్లకు ప్రయోజనం చేకూర్చనుంది. ► ఈ బిల్లును వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి తెలిపారు. ► నిజానికి ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, 5 లక్షల వరకూ డిపాజిట్ ఇన్సూరెన్స్ ఉంది. అయితే బ్యాంక్ లైసెన్స్ రద్దయి, లిక్విడేషన్ ప్రక్రియ ప్రారంభమైతేనే ఈ డిపాజిట్ ఇన్సూరెన్స్ అమల్లోకి వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఒత్తిడిలో ఉన్న బ్యాంక్ నుంచి తమ డబ్బు రాబట్టుకోడానికి దాదాపు 8 నుంచి 10 సంవత్సరాల కాలం పడుతోంది. ► బ్యాంక్ డిపాజిటర్లకు బీమా కవరేజ్ అందించడానికి ఆర్బీఐ అనుబంధ విభాగంగా డీఐసీజీసీ పనిచేస్తోంది. భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ బ్యాంక్ బ్రాంచీలుసహా కమర్షియల్ బ్యాంకుల సేవింగ్స్, ఫిక్స్డ్, కరెంట్, రికరింగ్ డిపాజిట్ హోల్డర్లందరికీ డీఐసీజీసీ కింద బీమా సదుపాయం లభిస్తుంది. ► తాజా సవరణ ప్రకారం అసలు, వడ్డీసహా గరిష్టంగా బ్యాంకుల్లో ప్రతి అకౌంట్ హోల్డర్ డిపాజిట్‌పై రూ.5 లక్షల వరకూ బీమా కవరేజ్ ఉంటుంది. అంటే వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు ఐదు లక్షలకుపైబడి ఉన్నా... మొత్తంగా ఐదు లక్షల వరకే బీమా లభిస్తుంది. ► తాజా క్యాబినెట్ నిర్ణయంతో దేశంలోని దాదాపు 98.3% డిపాజిట్ అకౌంట్లకు పూర్తి ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది. విలువలో చూస్తే 50.9% డిపాజిట్ల విలువకు కవరేజ్ లభిస్తుంది. ఆర్థిక మంత్రి తెలిపిన సమాచారం ప్రకారం, అంతర్జాతీయంగా చూస్తే, ఆయా అంశాల్లో భారత్ మెరుగైన పరిస్థితిలో ఉంది. అంతర్జాతీయంగా 80 శాతం డిపాజిట్ అకౌంట్లకే కవరేజ్ లభిస్తుంటే, విలువలో ఈ కవరేజ్ 20 నుంచి 30%గా ఉంది. ► ప్రస్తుతం రూ.100 డిపాజిట్‌కు ప్రతి బ్యాంక్ 10 పైసలు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తుండగా, దీనిని 12 పైసలకు పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. ► 2020 ఫిబ్రవరి 4వ తేదీ నుంచీ రూ. 5 లక్షల వరకూ డిపాజిట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అమలు జరుగుతుందని మంత్రి వివరించారు. -
కేంద్ర ఉద్యోగులకు 28% డీఏ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం(డీఏ), పెన్షనర్లకు కరువు ఉపశమనం(డీఆర్) 28 శాతానికి పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన మంత్రివర్గం ప్రస్తుతం మూలవేతనంపై 17 శాతంగా ఉన్న డీఏను మరో 11 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ వెల్లడించారు. దీనివల్ల కేంద్రంపై అదనంగా రూ.34,401 కోట్ల ఆర్థిక భారం పడనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 48.34 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65.26 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారని చెప్పారు. కాగా, 2020 జనవరి 1, 2020 జులై 1, 2021 జనవరి 1 తేదీల్లో చెల్లించాల్సిన మూడు అదనపు డీఏ, డీఆర్ వాయిదాలను.. కోవిడ్–91 మహమ్మారి కారణంగా తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. 2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 మధ్య గల కాలానికి డీఏ, డీఆర్ 17 శాతంగానే ఉంటుందని కేంద్రం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ‘ఆయుష్ మిషన్’ ఐదేళ్లపాటు పొడిగింపు నేషనల్ ఆయుష్ మిషన్(నామ్)ను కేంద్ర ప్రాయోజిత పథకంగా 2021 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకూ కొనసాగింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు రూ.4,607.30 కోట్ల వ్యయం కానుంది. ఇందులో కేంద్రం వాటా రూ.3,000 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.1,607 కోట్లుగా ఉంటుంది. నేషనల్ ఆయుష్ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం 2014 సెప్టెంబరు 15న ప్రారంభించింది. అర్హులందరికీ వైద్య సేవలు అందేలా చూడడం, ఔషధాలు, మానవ వనరుల లభ్యత పెరిగేలా చూడడం, ఆయుష్ విద్యా సంస్థల సంఖ్యను పెంచడం వంటివి ఆయుష్ మిషన్ లక్ష్యాలు. కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు ∙న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.9,000 కోట్లతో కేంద్ర ప్రాయోజిత పథకం కొనసాగింపు ప్రతిపాదనలకు ఆమోదం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సహా ఐదేళ్లపాటు ఇది అమలవుతుంది. ఓబీసీ ఉప కులాల వర్గీకరణ కమిషన్ కాలపరిమితి మరో ఆరు నెలల పాటు.. అంటే జనవరి 31 వరకు పొడిగింపు. నార్త్ ఈస్ట్రన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫోక్ మెడిసిన్ సంస్థ పేరు ఇకపై నార్త్ ఈస్ట్రన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఫోక్ మెడిసిన్ రీసెర్చ్‌గా మార్పు. ప్రత్యేక పశు సంవర్థక ప్యాకేజీ అమలుకు ఆమోదం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లపాటు అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మార్పులు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రత్యేక పశు సంవర్థక ప్యాకేజీ అమలు చేయాలని తీర్మానించింది. పశు సంవర్థక రంగం వృద్ధితోపాటు ఈ రంగంలో ఉన్న 10 కోట్ల మంది రైతులకు మెరుగైన ప్రతిఫలం దక్కేలా ఈ చర్య దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ ప్యాకేజీ కింద కేంద్రం రూ.9,800 కోట్ల మేర ఆర్థిక సాయం అందించనుంది. మొత్తంగా రూ.54,618 కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తోంది. వివిధ విభాగాలను రాష్ట్రీయ గోకుల్ మిషన్, జాతీయ పాడి అభివృద్ధి కార్యక్రమం(ఎన్పీడీడీ), జాతీయ పశు సంపద మిషన్‌గా విభజించారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ దేశీయ జాతుల అభివృద్ధి, పరిరక్షణకు సహాయపడుతుంది. ఎన్పీడీడీ పథకం సుమారు 8,990 బల్క్ మిల్క్ కూలర్స్ ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తోంది. -
16 రాష్ట్రాల్లో పీపీపీ మోడల్లో భారత్‌నెట్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోవిడ్–19 ప్రభావిత రంగాలకు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలోని పలు పలు ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశ వివరాలను కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్, ఆర్.కె.సింగ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన పొడిగింపు ఉద్యోగ కల్పనకు వీలుగా కొత్త నియామకాలకు యజమాని, ఉద్యోగుల చందాను కేంద్రం భరిస్తూ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)కు చెల్లించడానికి వీలుగా ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజనను మార్చి 2022 వరకు పొడిగింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్‌నెట్ కోసం రూ .19,041 కోట్ల సాధ్యత గ్యాప్ నిధులు భారత్ నెట్ ద్వారా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానం(పీపీపీ)లో రూ. 19,041 కోట్ల మేర వయబులిటీ గ్యాప్ ఫండ్‌తో 16 రాష్ట్రాల్లోని గ్రామాల్లో బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. 16 రాష్ట్రాల్లోని 3,60,000 గ్రామాలను కవర్ చేయడానికి మొత్తం రూ . 29,430 కోట్లు ఖర్చవుతుంది. దేశంలోని 6 లక్షల గ్రామాలను 1,000 రోజుల్లో బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానం చేస్తామని 2020 ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తరువాత ప్రైవేట్ భాగస్వాములను చేర్చుకునే నిర్ణయం తీసుకున్నట్లు రవిశంకర్‌ప్రసాద్ తెలిపారు. ఈ రోజు వరకు 2.5 లక్షల గ్రామ పంచాయతీలలో 1.56 లక్షల పంచాయతీలు బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానితమయ్యాయని ఆయన చెప్పారు. విద్యుత్తు డిస్కమ్‌ల బలోపేతానికి రూ. 3.03 లక్షల కోట్ల వ్యయం విద్యుత్తు సరఫరా వ్యవస్థ బలోపేతానికి సంస్కరణల ఆధారంగా, ఫలితాల ప్రాతిపదికన డిస్కమ్‌లకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు రూ. 3.03 లక్షల కోట్ల విలువైన పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ సంబంధిత వివరాలు వెల్లడిస్తూ విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, దీనికి అనుగుణంగా రూ. 3.03 లక్షల కోట్ల విలువైన కొత్త పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఇందులో రూ. 97,631 కోట్ల మేర కేంద్రం ఖర్చు చేస్తుందని తెలిపారు. సంస్కరణ ఆధారిత, ఫలితాల ప్రాతిపదికన పునరుద్ధరించిన విద్యుత్ పంపిణీ పథకాన్ని ఈ సంవత్సరం బడ్జెట్లో ప్రకటించారు. మౌలిక సదుపాయాల కల్పన, వ్యవస్థ ఆధునీకరణ, సామర్థ్యం పెంపు, ప్రక్రియ మెరుగుదల కోసం డిస్కమ్‌లకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒక్కో రాష్ట్ర పరిస్థితిని బట్టి వేర్వేరుగా రూపొందించిన కార్యచరణకు అనుగుణంగా ఆర్థిక సహాయం అందుతుంది. 25 కోట్ల ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు అమర్చడం, వ్యవసాయానికి పగటి పూట కూడా విద్యుత్తు అందేలా రూ. 20 వేల కోట్లతో సౌర విద్యుత్తు పంపిణీకి వీలుగా 10 వేల ఫీడర్లను ఏర్పాటు చేయడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. లోన్ గ్యారంటీ స్కీమ్‌కు ఆమోదం కోవిడ్ –19 మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే ప్యాకేజీలో భాగంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు రూ .1.5 లక్షల కోట్ల అదనపు రుణాలు ఇచ్చేలా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఆరోగ్య సంరక్షణ రంగానికి రూ. 50 వేల కోట్ల మేర, పర్యాటక సంస్థలకు, గైడ్లకు, ఇతర కోవిడ్ ప్రభావిత రంగాలకు రూ. 60 వేల కోట్ల మేర రుణాలు ఇచ్చేందుకు ఆర్థిక మంత్రి ప్రకటించిన లోన్ గ్యారంటీ స్కీమ్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. -
గరీబ్ కల్యాణ్ అన్నయోజన... ఐదు నెలలపాటు పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఆహార భద్రతాచట్టం పరిధిలోని 81.35 కోట్ల మంది పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున అదనంగా ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ చేసేలా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన(పీఎంజీకేఏవై)ను మరో ఐదు నెలల పాటు వర్తింపజేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈనెల ఏడో తేదీన ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ 18 ఏళ్ల పైబడిన వారందరికీ కేంద్రమే ఉచిత టీకాలిస్తుందని, నవంబరు వరకు ఉచిత రేషన్‌ను అందజేస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఉచిత రేషన్‌కు ఆమోదం తెలిపింది.ఈ పథకాన్ని కోవిడ్–19 లాక్డౌన్ నేపథ్యంలో తొలుత 2020 మార్చిలో ప్రధాని ప్రకటించారు. ఇప్పటివరకు మూడో విడతలుగా ఈ పథకం అమలైంది. నాలుగో విడతలో భాగంగా జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలోని 81.35 కోట్ల మందికి మరో 5 నెలల పాటు అంటే 2021 జులై మొదలుకొని 2021 నవంబరు వరకు ప్రతి ఒక్క వ్యక్తికి 5 కిలోల వంతున ఉచితంగా అదనపు ఆహారధాన్యాలను పంపిణీ చేస్తారు. ఇందుకు రూ. 64,031 కోట్ల మేర ఆహార సబ్సిడీపై వెచ్చించాల్సి వస్తుందని అంచనా. రైల్‌సైడ్ వేర్‌హౌజ్ కంపెనీ విలీనం సెంట్రల్ రైల్ సైడ్ వేర్‌హౌస్ కంపెనీ లిమిటెడ్ (సీఆర్‌డబ్ల్యూసీ)ను దాని మాతృసంస్థ అయిన సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ)లో విలీనం చేయడానికి ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. -
వరికి మద్దతు ధర రూ. 72.. అత్యధికంగా నువ్వులపై 452 పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: వరికి మద్దతు ధరను రూ.72 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2021–22 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి వివిధ పంటల కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) పెంపు ప్రతిపాదనలకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఈ కమిటీ సమావేశమైంది. వరి ధాన్యం కామన్ గ్రేడ్ ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.1,868 ఉండగా రూ.72 పెంచుతూ... రూ. 1,940గా నిర్ధారించింది. ఈ ధాన్యం ఉత్పత్తి వ్యయం క్వింటాలుకు రూ. 1,293గా అంచనా వేసింది. వరి ధాన్యం గ్రేడ్ ఏ రకం ప్రస్తుతం క్వింటాల్‌కు రూ. 1,888 ఉండగా రూ.72 పెంచుతూ రూ.1,960గా ఖరారు చేసింది. రైతులకు సహేతుకంగా, న్యాయమైన రీతిలో గిట్టుబాటు ధర లభించేలా 2018–19 కేంద్ర బడ్జెట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లు ఉండేలా కనీస మద్దతు ధరను నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ లెక్కన అత్యధికంగా సజ్జలకు పెట్టుబడిపై 85 శాతం, మినుములకు 65 శాతం, కందులకు 62 శాతం ప్రతిఫలం దక్కుతుందని పేర్కొంది. ఈ సీజన్లో పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తి పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పప్పు గింజల్లో అత్యధిక ఉత్పాదకత ఉన్న రకాల విత్తనాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది. ఈసారి ఖరీఫ్ సీజన్లో అదనంగా 6.37 లక్షల హెక్టార్లలో నూనె గింజల సాగుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపింది. కనీస మద్దతు ధర పెంపుతో రైతుల ఆదాయం పెరగడంతోపాటు వారి జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మెరుగవనున్న రైల్వేల కమ్యూనికేషన్, సిగ్నలింగ్ రైల్వేల కమ్యూనికేషన్, సిగ్నలింగ్ వ్యవస్థలను మరింత ఆధునీకరించేందుకు 700 మెగా హెడ్జెస్ బ్యాండ్‌లో 5 మెగా హెడ్జెస్ స్పెక్ట్రమ్‌ను కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. స్పెక్ట్రమ్ పెరగడంతో రైల్వే ప్రయాణికుల భద్రత మరింత పెరగడంతోపాటు రైల్వేల రవాణా నెట్వర్క్ నవీకరణ సుసాధ్యం కానుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు.లాంగ్–టర్మ్–ఎవల్యూషన్(ఎల్టీఈ) ఆధారిత మొబైల్ ట్రెయిన్ కమ్యూనికేషన్‌ను ఆయా రూట్లలో రైల్వే ఉపయోగించుకోనుంది. దీనికి సంబంధించిన రూ.25 వేల కోట్ల ప్రాజెక్టును వచ్చే ఐదేళ్లలో పూర్తిచేయనున్నారు. పంట ఎమ్మెస్పీ (రూ.) పెంపు(రూ.) వరి(కామన్) 1,940 72 వరి (ఏ) 1,960 72 జొన్న(హైబ్రిడ్) 2,738 118 జొన్న(మల్దండి) 2,758 118 సజ్జలు 2,250 100 రాగి 3,377 100 మొక్కజొన్న 1,870 20 కందులు 6,300 300 పెసర 7,275 79 మినుములు 6,300 300 వేరుశనగ 5,550 275 పొద్దుతిరుగుడు 6,015 130 నువ్వులు 7,307 452 ఒడిసలు(నైగర్‌సీడ్) 6,930 235 పత్తి (మీడియం స్టేపుల్) 5,726 211 పత్తి(లాంగ్ స్టేపుల్) 6,025 200 -
Model Tenancy Act: వారు 2 నెలల అద్దె ముందే చెల్లించాలి!
న్యూఢిల్లీ: యజమాని, కిరాయిదారుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా రూపొందిన చట్టం... ‘మోడల్ టెనన్సీ యాక్ట్’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పలు కీలక సంస్కరణలతో కూడిన ఈ నమూనా చట్టానికి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి భేటీలో గ్రీన్ సిగ్నల్ లభించింది. వివాదాల సత్వర పరిష్కారం కోసం జిల్లాల్లో ప్రత్యేక రెంట్ అథారిటీలు, రెంట్ కోర్టులు, రెంట్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని ఈ చట్టంలో స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు యథాతథంగా అమలు చేసుకోవచ్చు. లేదా ఇప్పటికే తమ వద్ద అమల్లో ఉన్న సంబంధిత చట్టాలకు అవసరమైన మార్పులు చేసి, అమలు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఆస్తులను అద్దెకు ఇవ్వడానికి సంబంధించిన న్యాయ ప్రక్రియలో ఈ కొత్త చట్టం ద్వారా సమూల మార్పులు వస్తాయని కేంద్ర గృహ నిర్మాణ మంత్రి హరిదీప్‌సింగ్ పూరి తెలిపారు. ఈ చట్టం రెంటల్ హౌజింగ్‌ను ఒక వ్యాపార మోడల్‌గా నిర్వహించే అవకాశం కల్పిస్తుందని, తద్వారా దేశంలో రెంటల్ హౌజింగ్ మార్కెట్ అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని ఆదాయ వర్గాల వారికి అందుబాటులో, సమస్యలు లేని విధంగా అద్దె వసతి లభించేలా చట్టం రూపొందిందని వెల్లడించింది. 2011 జనగణన ప్రకారం దేశవ్యాప్తంగా, నగరాలు, పట్టణాల్లో దాదాపు కోటి గృçహాలు ఖాళీగా ఉన్నాయని హరిదీప్ సింగ్ పూరి వెల్లడించారు. కిరాయిదారులు ఖాళీ చేయరేమోనని, లేదా ఆక్రమించుకుంటారేమోనని, లేదా ఖాళీ చేయడానికి ఇబ్బంది పెడ్తారేమోనని భయంతో యజమానులు తమ ఆస్తులను అద్దెకు ఇవ్వడం లేదని గృహ నిర్మాణశాఖకు చెందిన ఒక అధికారి వివరించారు. ఈ తాజా చట్టంలో కిరాయిదారు, యజమానుల పాత్రను, హక్కులు, బాధ్యతలను స్పష్టంగా నిర్వచించినందున ఇకపై వారిలో ఈ భయాందోళనలు తొలగిపోతాయని భావిస్తున్నామన్నారు. ఈ చట్టం ప్రకారం.. ► నివాస సముదాయాల్లో కిరాయిదారు యజమానికి సెక్యూరిటీ డిపాజిట్‌గా గరిష్టంగా రెండు నెలల అద్దె ముందే చెల్లించాలి. అదే, వాణిజ్య సముదాయాలైతే ఆరునెలల అద్దెను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ► అన్ని కొత్త అద్దె ఒప్పందాలు ఇకపై కచ్చితంగా లిఖితపూర్వకంగా ఉండాలి. అలాగే, వాటిని సంబంధిత జిల్లా ‘రెంట్ అథారిటీ’కి సమర్పించాలి. ► ఇప్పటికే అమల్లో ఉన్న రెంటల్ అగ్రిమెంట్‌పై కొత్త చట్టం ప్రభావం ఉండదు. ► అద్దె, కాలవ్యవధులను పరస్పర అంగీకారంతో కిరాయిదారు, యజమాని నిర్ణయించుకోవాలి. లిఖిత పూర్వక ఒప్పందంలో ఆ విషయాన్ని పొందుపర్చాలి. ► యజమాని, లేదా ప్రాపర్టీ మేనేజర్ కిరాయిదారుల నివాసాలకు నిత్యావసర సదుపాయాలను నిలిపివేయకూడదు. ► అద్దె ఒప్పందం అమలులో ఉన్న సమయంలో కిరాయిదారును ఖాళీ చేయించకూడదు. ఒకవేళ ఒప్పందంలో సంబంధిత నిబంధన ఉంటే ఖాళీ చేయించవచ్చు. ► కిరాయిదారు నష్టపరిచినవి మినహా మిగతా నిర్మాణ మరమ్మతులు, రంగులు వేయించడం, పాడైన ప్లంబింగ్ పైప్‌ల మార్పు, విద్యుత్ వైరింగ్ తదితరాలను యజమానే చేయించాలి. ► డ్రైనేజ్ క్లీనింగ్, విద్యుత్ స్విచ్‌లు, సాకెట్ల మరమ్మతులు, కిచెన్‌లో అవసరమైన రిపేర్లు, మరమ్మతులు, ధ్వంసమైన కిటికీలు, ద్వారాల గ్లాస్ ప్యానెళ్ల మార్పు, గార్డెన్ నిర్వహణ.. మొదలైనవాటిని కిరాయిదారు చేయాల్సి ఉంటుంది. ► కిరాయిదారు ఆక్రమణలో ఉన్న చోట యజ మాని ఏదైనా అదనపు నిర్మాణం చేయాలనుకున్నప్పుడు, దాన్ని కిరాయిదారు వ్యతిరేకిస్తే.. యజమాని జిల్లా రెంట్ కోర్టును ఆశ్రయించాలి. ► యజమాని ముందస్తు అనుమతి లేకుండా, కిరాయిదారు తాను అద్దెకు ఉన్న ప్రాంగణంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదు. ► ప్రతీ జిల్లాలో రెంట్ ట్రిబ్యునల్‌గా జిల్లా జడ్జిని కానీ, జిల్లా అదనపు జడ్జీని కానీ హైకోర్టు సూ చనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించాలి. ► రెంట్ కోర్ట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ను కాని, తత్సమాన హోదా ఉన్న అధికారిని కానీ నియమించాలి. ► రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో డిప్యూటీ కలెక్టర్ హోదాకు తగ్గని అధికారిని ‘రెంట్ అథారిటీ’గా జిల్లా కలెక్టర్ నియమించాలి. ► యజమానికి, కిరాయిదారుకు మధ్య వివాదం తలెత్తినప్పుడు.. మొదట రెంట్ అథారిటీని ఆశ్రయించాలి. అక్కడి పరిష్కారంతో సంతృప్తి చెందనట్లయితే, తరువాత రెంట్ కోర్టును, ఆ తరువాత రెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలి. ► కిరాయిదారులను ఖాళీ చేయించే విషయంలో ఇబ్బంది పడే యజమానుల కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించారు. అద్దె ఒప్పందంలో పేర్కొన్న మేరకు ముందస్తు నోటీసు ఇవ్వడం సహా అన్ని నిబంధనలను పాటిస్తూ ఖాళీ చేయాలని యజమాని కోరినప్పటికీ కిరాయిదారు ఖాళీ చేయనట్లయితే.. అలాగే, ఒప్పందం కాలపరిమితి ముగిసినప్పటికీ కిరాయిదారు ఖాళీ చేయనట్లయితే.. యజమాని నెలవారీ అద్దెను మొదట రెండు నెలల పాటు రెండింతలు, ఆ తరువాత ఖాళీ చేసేంతవరకు నాలుగు రెట్లు చేయవచ్చు. ► కిరాయిదారుకు చెల్లించాల్సిన రీఫండ్‌ను యజమాని సమయానికి ఇవ్వనట్లయితే.. సాధారణ వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. -
పట్టణాభివృద్ధిలో భారత్‌కు జపాన్ చేయూత
న్యూఢిల్లీ: పట్టణాభివృద్ధిలో జపాన్ సహకారం పొందేందుకు భారత్ ముందడుగు వేసింది. ఈ మేరకు రెండు దేశాల మధ్య సహకార ఒప్పందం (ఎంఓసీ) కుదుర్చుకునేందుకు బుధవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు వెలువడిన ఒక అధికార ప్రకటన ప్రకారం భారత్ తరఫున గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ, అలాగే జపాన్ తరఫున భూ, మౌలిక, రవాణా, పర్యాటక మంత్రిత్వశాఖల ప్రతినిధులు ఎంఓసీపై సంతకాలు చేయనున్నారు. నిజానికి పట్టణాభివృద్ధికి సంబంధించి రెండు దేశాలూ 2007లో ఒక అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. దీని స్థానంలో తాజాగా ఎంఓసీ రానుంది. ఉపాధి కల్పనకూ అవకాశాలు అర్బన్ ప్లానింగ్, స్మార్ట్ సిటీల అభివృద్ధి, చౌక ధరల గృహ నిర్మాణం, పట్టణ వరద నివారణా నిర్వహణ, పారిశుధ్యం, వేస్ట్ వాటర్ నిర్వహణ, పట్టణ రవాణా, విపత్తు నిర్వహణ వంటి కీలక అంశాలపై రెండు దేశాలూ మున్ముందు సహకరించుకోనున్నాయి. ఇందుకు సంబంధించి చేపట్టే ప్రాజెక్టుల వల్ల యువతకు కూడా ఉపాధి అవకాశాలు భారీగా లభిస్తాయి. సహకారం విషయంలో వ్యూహం, కార్యక్రమాల అమలు వంటి కార్యకలాపాలకు సంయుక్త కార్యాచరణ బృందం (జేడబ్ల్యూజీ) కూడా ఏర్పాటవుతుంది. ఏడాదికి ఒకసారి జేడబ్ల్యూజీ సమావేశమవుతుంది. ఈ సమావేశం ఒక ఏడాది భారత్‌లో జరిగితే మరో సంవత్సరం జపాన్‌లో జరుగుతుంది. ఒకసారి సంతకాలు పూర్తయిన తర్వాత ఐదేళ్లు ఎంఓసీ అమల్లో ఉంటుంది. కాగా, పట్టణాభివృద్ధికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో మాల్దీవులతో జరిగిన ఎంఓయూపై కూడా క్యాబినెట్ సమీక్షించింది. -
హంద్రీ–నీవా సామర్థ్యం పెంపునకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ద్వారా కృష్ణా వరద జలాలను గరిష్టంగా ఒడిసి పట్టి.. రాయలసీమను సుభిక్షం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హంద్రీ–నీవా ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు అభివృద్ధి చేసే పనులను చేపట్టడానికి మంగళవారం మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.6,182 కోట్ల వ్యయంతో పనులను చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. శ్రీశైలం జలాశయం నుంచి 40 టీఎంసీల కృష్ణా వరద నీటిని తరలించి.. రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. కృష్ణా నదికి వరద వచ్చే 120 రోజుల్లో.. రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 40 టీఎంసీలు తరలించేలా పనులు చేపట్టారు. పరీవాహక ప్రాంతంలో అనావృష్టి పరిస్థితుల వల్ల శ్రీశైలానికి కృష్ణా నది ద్వారా వరద వచ్చే రోజులు బాగా తగ్గాయి. అతివృష్టి ఏర్పడినప్పుడు ఒకేసారి గరిష్టంగా వరద వస్తోంది. కానీ.. ఆ స్థాయిలో వరదను ఒడిసి పట్టే పరిస్థితులు లేకపోవడంతో ఆ జలాలు సముద్రంలో వృథాగా కలుస్తున్నాయి. వరద నీటిని గరిçష్ట స్థాయిలో ఒడిసి పట్టడం ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళిక రచించారు. అందులో భాగంగా హంద్రీ–నీవా తొలి దశ ప్రధాన కాలువ, ఎత్తిపోతల సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచాలని నిర్ణయించారు. 221.106 కి.మీ. పొడవున కాలువ విస్తరణ శ్రీశైలం జలాశయంలో మల్యాల పంప్ హౌస్ ద్వారా హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి 8 దశల్లో నీటిని ఎత్తిపోస్తారు. 216.3 కి.మీ. పొడవున్న ప్రధాన కాలువ ద్వారా జీడిపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తారు. మల్యాల పంప్‌హౌస్‌కు నీటిని తెచ్చేందుకు జలాశయంలో 4.806 కి.మీ. పొడవున అప్రోచ్ చానల్ తవ్వారు. ప్రవాహ సామర్థ్యాన్ని పెంచాలంటే అప్రోచ్ చానల్‌తోపాటు ప్రధాన కాలువను విస్తరించాలి. అంటే.. మొత్తం 221.106 కి.మీ. పొడవున ప్రధాన కాలువను విస్తరించే పనులను ప్రభుత్వం చేపట్టనుంది. ప్రధాన కాలువకు అనుబంధంగా ఉన్న ఎత్తిపోతలను ఆ మేరకు విస్తరించనుంది. 78 నుంచి 80 రోజుల్లోనే 40 టీఎంసీలు..: ప్రస్తుత డిజైన్ మేరకు హంద్రీ–నీవా నుంచి 40 టీఎంసీలను తరలించడానికి 120 రోజులు సమయం పడుతోంది. కృష్ణా నదికి అన్ని రోజుల్లోను వరద ప్రవాహం ఉండటం లేదు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 830 అడుగుల మేర నీటి మట్టం ఉంటేనే మల్యాల ఎత్తిపోతల ద్వారా తరలించే అవకాశం ఉంది. కానీ.. తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి రోజుకు 4 టీఎంసీల చొప్పున దిగువకు తరలించడం వల్ల శ్రీశైలంలో నీటిమట్టం ఆ స్థాయిలో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో కృష్ణా వరద జలాలను గరిష్టంగా ఒడిసి పట్టేందుకు హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు అభివృద్ధి చేసే పనులను చేపట్టింది. దీనివల్ల 78 నుంచి 80 రోజుల్లోనే 40 టీఎంసీలను తరలించడానికి అవకాశం ఉంటుంది. -
ల్యాప్‌టాప్, టాబ్లెట్, పీసీల వంతు
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఆల్ ఇన్ వన్ పర్సనల్ కంప్యూటర్లు (పీసీ), సర్వర్ల తయారీతోపాటు, ఫార్మా రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) అమలు చేసే ప్రతిపాదనలకు ప్రధాని అధ్యక్షతన గల కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలియజేసింది. అంతర్జాతీయంగా పేరొందిన ఎలక్ట్రానిక్స్ కంపెనీలు భారత్‌లో తయారీ దిశగా ఆకర్షించేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. టెలికం ఎక్విప్మెంట్ల తయారీకి పీఎల్ఐ పథకాన్ని వర్తింపజేస్తూ, 12,195 కోట్ల మేర రాయితీలు కల్పించేందుకు కేంద్రం గతవారం నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ఐటీ హార్డ్‌వేర్ (ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఆల్ ఇన్ వన్ పీసీలు, సర్వర్ల తయారీతో కూడిన) రంగానికి పీఎల్ఐ పథకం కింద రూ.7,350 కోట్ల రాయితీలు ఇచ్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసినట్టు సమావేశం అనంతరం కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్ మీడియాకు తెలిపారు. నాలుగు సంవత్సరాలపాటు భారత్‌లో ఈ ఉత్పత్తుల తయారీకి ఈ మేరకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. ఈ పథకం భారత్‌ను తయారీ కేంద్రంగా మలచడంతోపాటు, ఎగుమతుల వృద్ధికి, ఉపాధి అవకాశాల విస్తృతికి తోడ్పడుతుందని మంత్రి పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ల తయారీకి పీఎల్ఐ పథకాన్ని గతేడాది కేంద్రం ప్రకటించడంతో శామ్సంగ్, యాపిల్ తదితర దిగ్గజ అంతర్జాతీయ, దేశీయ సంస్థలు రాయితీల కోసం దరఖాస్తులు చేసుకోవడం తెలిసిందే. ఇవే ప్రోత్సాహకాలు.. 2019–20 బేస్ సంవత్సరంగా పరిగణిస్తూ ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల విక్రయాల(పెరిగిన మేర)పై 4–1 శాతం వరకు ప్రోత్సాహకాలను ఈ పథకం కింద కంపెనీలకు ప్రభుత్వం ఇవ్వనుంది. పెట్టుబడులు పెట్టడంతోపాటు, ఉపాధి కల్పన, నిర్దేశిత విక్రయ లక్ష్యాలను చేరుకున్న కంపెనీలకే ప్రోత్సాహకాలు లభించనున్నాయి. ఐదు అంతర్జాతీయ సంస్థలు, 10 దేశీ చాంపియన్ కంపెనీలు ప్రయోజనం పొందనున్నాయని మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరించారు. ఈ ఉత్పత్తుల కోసం దిగుమతులపై ఆధారపడి ఉన్నామని పేర్కొంటూ, వీటి విషయంలో స్వావలంబన అవసరమన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీలో అదనంగా రూ.2,700 కోట్ల పెట్టుబడులకు తాజా నిర్ణయం వీలు కల్పిస్తుందని చెప్పారు. ప్రస్తుతం ల్యాప్‌టాప్, టాబ్లెట్ల డిమాండ్ ను పెద్ద మొత్తంలో దిగుమతుల రూపంలోనే తీర్చుకుంటున్నాము. రూ.29,470 కోట్ల మేర ల్యాప్‌టాప్‌లు, రూ.2,870 కోట్ల ట్యాబ్లెట్ల దిగుమతులు నమోదవుతున్నాయి. ‘‘గడిచిన 5 నెలల కాలం లో పీఎల్ఐ పథకం కింద రూ.35,000 కోట్ల ఉత్ప త్తుల తయారీ దేశీయంగా నమోదైంది. రూ.1,300 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కొత్తగా 22,000 మందికి ఉపాధి లభించింది’’ అని కేంద్రం తెలిపింది. ఫార్మాలోకి రూ.15,000 కోట్ల పెట్టుబడులు ఫార్మాస్యూటికల్స్‌కు సైతం పీఎల్ఐ కింద రూ.15,000 కోట్ల రాయితీల కల్పనకు కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి కొత్తగా ఉపాధి లభిస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. దేశీయ తయారీ సంస్థలకు ఈ పథకం మేలు చేస్తుందని, పెద్ద ఎత్తున ఉపాధి కల్పనతోపాటు ప్రజలకు మందులు అందుబాటు ధరలకు లభించేందుకు వీలు కల్పిస్తుందని కేంద్రం పేర్కొంది. పీఎల్ఐ పథకం వల్ల ఆరేళ్ల కాలంలో (2022–28 మధ్య) రూ.2.94 లక్షల కోట్ల మేర ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు, రూ.1.96 లక్షల కోట్ల ఫార్మా ఎగుమతులు నమోదవుతాయనేది ప్రభుత్వం అంచనా. ప్రోత్సాహకాలు..: అంతర్జాతీయ తయారీ ఆదాయాల (జీఎమ్ఆర్) ఆధారంగా ఫార్మా కంపెనీలను కేంద్రం మూడు కేటగిరీలుగా విభజించింది. గ్రూప్ ఎ కింద రూ.5,000 కోట్లు అంతకుమించి జీఎమ్ఆర్ కలిగిన కంపెనీలకు.. రూ.11,000 కోట్ల ప్రోత్సాహకాలను ఇవ్వనుంది. రూ.500–5,000 కోట్ల మధ్య జీఎమ్ఆర్ కలిగిన కంపెనీలకు గ్రూప్ బి రూ.2,250 కోట్లు, రూ.500 కోట్లలోపు జీఎమ్ఆర్ కలిగిన ఫార్మా కంపెనీలకు గ్రూప్ సి కింద రూ.1,750 కోట్ల మేర ప్రోత్సాహకాలను కేంద్రం నాలుగేళ్ల కాలంలో ఇవ్వనుంది. -
లాంబ్రెటా కంపెనీ ఇక కనుమరుగు..
న్యూఢిల్లీ: లాంబ్రెటా.. విజయ్ సూపర్ .. కొన్ని దశాబ్దాల క్రితం స్కూటర్లకు పర్యాయపదంగా నిల్చాయీ బ్రాండ్లు. అప్పట్లో ఓ ఊపు ఊపిన లాంబ్రెటా స్కూటర్లంటే ఇప్పటికీ ఒక వింటేజ్ బ్రాండ్‌గా ప్రత్యేక గుర్తింపు ఉంది. కాలక్రమేణా లాంబ్రెటా, విజయ్ సూపర్ ఇతర వాహనాల పోటీ దెబ్బకు కనుమరుగయ్యాయి. ఇప్పుడిక వీటిని తయారు చేసిన కంపెనీ స్కూటర్స్ ఇండియా (ఎస్ఐఎల్) వంతు వచ్చింది. నష్టాల భారంతో కుదేలవుతున్న ఎస్ఐఎల్ను విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలేమీ ఫలించకపోవడంతో దీన్ని మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. మూసివేతకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక కేంద్ర భారీ పరిశ్రమల శాఖ తదుపరి ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాదన ప్రకారం స్కూటర్స్ ఇండియా బ్రాండ్ పేరును విడిగా విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్యాబినెట్ ముందు ఉంచిన ప్రణాళిక ప్రకారం కంపెనీ మూసివేతకు రూ. 65.12 కోట్లు అవసరమయ్యే నిధులను రుణం కింద కేంద్రం సమకూర్చాలి. తగు స్థాయిలో నిధులు సమకూరిన తర్వాత అదనంగా ఉన్న రెగ్యులర్ సిబ్బందికి స్వచ్ఛంద పదవీ విరమణ స్కీమును (వీఆర్ఎస్/వీఎస్ఎస్) ఆఫర్ చేయనున్నారు. లక్నో కేంద్రంగా కార్యకలాపాలు సాగించే స్కూటర్స్ ఇండియాలో సుమారు 100 మంది ఉద్యోగులు ఉన్నారు. మరోవైపు, కంపెనీకి చెందిన 147.49 ఎకరాల స్థలాన్ని పరస్పర ఆమోదయోగ్య రేటు ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామికాభివృద్ధి ప్రాధికార సంస్థకు అప్పజెబుతారు. ఇక, స్టాక్ ఎ క్సే్చంజీల నుంచి షేర్లను కూడా డీలిస్ట్ చేయాల్సి ఉంటుంది. 1972 నుంచి.. స్కూటర్స్ ఇండియా (ఎస్ఐఎల్) 1972లో ఏర్పాటైంది. వివిధ రకాల ఇంధనాలతో పనిచేసే త్రిచక్ర వాహనాల డిజైనింగ్, అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్ కోసం దీన్ని నెలకొల్పారు. 1975లో దేశీ మార్కెట్ కోసం విజయ్ సూపర్ బ్రాండ్‌తోనూ, విదేశీ మార్కెట్ల కోసం లాంబ్రెటా పేరుతోనూ ఎస్ఐఎల్ స్కూటర్లను తయారు చేయడం మొదలు పెట్టింది. అటు పైన విక్రమ్/లాంబ్రో పేరిట త్రిచక్ర వాహనాలను కూడా ఉత్పత్తి చేసింది. 1997లో ద్విచక్ర వాహనాల ఉత్పత్తిని నిలిపివేసిన ఎస్ఐఎల్ .. విక్రమ్ బ్రాండు కింద వివిధ త్రిచక్ర వాహనాల తయారీ, మార్కెటింగ్‌పై మాత్రమే దృష్టి పెట్టింది. కంపెనీ నష్టాల్లో కూరుకుపోతుండటంతో కేంద్రం గతంలో దీన్ని విక్రయించే ప్రయత్నాలు చేసింది. యాజమాన్య హక్కుల బదలాయింపుతో పాటు తనకున్న పూర్తి వాటాలను విక్రయించేందుకు 2018 లో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహ్వానించింది. కానీ, విక్రయ యత్నాలు కుదరకపోవడంతో చివరికి మూసివేత నిర్ణ యం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
అమ్మకానికి ‘ఆకాశ్ క్షిపణి’
న్యూఢిల్లీ: దేశీయంగా తయారు చేసిన ఆకాశ్‌మిస్సైల్ వ్యవçస్థను విదేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఈ మిస్సైల్స్‌ను కొనేందుకు తయారుగా ఉన్న దేశాల ప్రతిపాదనలు పరిశీలించి వేగంగా అమ్మకాల అనుమతులిచ్చేందుకు వీలుగా ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఆకాశ్‌లో 96 శాతం దేశీయంగా తయారైన పరికరాలే ఉన్నాయి. 25 కిలోమీటర్ల రేంజ్లో టార్గెట్‌ను విజయవంతంగా ధ్వంసం చేయగలదు. ఆత్మ నిర్భర్ భారత్ కింద ఇండియా సొంతంగా మిస్సైళ్లు తయారుచేసి ఎగుమతి చేసే స్థాయికి చేరిందని, తాజాగా ఆకాశ్ మిస్సైల్స్‌ను విదేశాలకు విక్రయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఈ నిర్ణయంతో ఆయుధాల విక్రయాల్లో భారత్ విదేశాలతో పోటీ పడే అవకాశం కలుగుతుందన్నారు. రక్షణ అమ్మకాలు 500 కోట్ల డాలర్లకు చేర్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. 2024నాటికి 101 రకాల ఆయుధాలను, మిలటరీ ప్లాట్‌ఫామ్స్‌ను దిగుమతి చేసుకోవడం నిలిపివేసి స్వదేశీవి తయారు చేసుకోవాలని భారత్ భావిస్తోంది. భారత్ మిషన్స్ సాంస్కృతిక, వాణిజ్య సంబంధాల పెంపుదల లక్ష్యంగా వివిధ దేశాల్లో ఇండియన్ మిషన్స్‌ను ఆరంభించాలని కేంద్రం నిర్ణయించింది. ఈస్తోనియా, పరాగ్వే, డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ మిషన్లను ఆరంభిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. ఈ మిషన్లతో రాజకీయ, సాంస్కృతిక బం ధాలు బలపడడం, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు ఊపందుకోవడం జరుగుతుందన్నారు. సబ్‌సాత్ సబ్కా వికాస్ ఆధారంగా ఈ మిషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. -
మధ్యప్రదేశ్‌లోనూ మత స్వేచ్ఛ బిల్లు
మధ్యప్రదేశ్: వివాహం ద్వారా గానీ లేదా ఇతర తప్పుడు పద్ధతుల్లో మత మార్పిడికి పాల్పడడాన్ని అడ్డుకునేందుకు ఉద్దేశించిన మత స్వేచ్ఛ(ఫ్రీడం ఆఫ్ రిలిజియన్) బిల్లు 2020ని మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదించిందని ఆ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. ఇది అమల్లోకి వచ్చి చట్టరూపం దాలిస్తే, చట్ట ఉల్లంఘనకు అత్యధికంగా పదేళ్ళ జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చు. ఈ బిల్లు ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ప్రొహిబిషన్ ఆఫ్ అన్‌లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలిజియన్ ఆర్డినెన్స్, 2020ని పోలి ఉంది. మధ్య ప్రదేశ్‌లో ఇది అమలులోకి వస్తే దేశంలోనే కఠినతరమైన చట్టం అవుతుందని మిశ్రా తెలిపారు. ఈ చట్టం ఉల్లంఘించిన వారు మూడేళ్ళ నుంచి ఐదేళ్ళ జైలు శిక్ష, రూ. 50,000 జరిమానాకి అర్హులు. మతమార్పిడికి పాల్పడిన వ్యక్తి ఎస్సీ, ఎస్టీ, ౖమైనర్ అయితే, 2 నుంచి 10 ఏళ్ళ జైలు, రూ.50వేల జరిమానా విధించొచ్చు. -
స్పెక్ట్రమ్ వేలానికి సై!
న్యూఢిల్లీ: దేశీ టెలికం రంగంలో భారీ స్థాయి స్పెక్ట్రమ్ వేలానికి రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది మార్చిలో మరో రౌండ్ స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ బిడ్డింగ్ ద్వారా 2,251.25 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను విక్రయించనున్నారు. ఈ మొత్తం స్పెక్ట్రమ్ కనీస వేలం ధర (బేస్ ప్రైస్) రూ.3.92 లక్షల కోట్లుగా అంచనా. ఈ నెలలోనే దరఖాస్తుల ఆహ్వానానికి ప్రకటన జారీ చేస్తామని, బిడ్డింగ్ మార్చిలో నిర్వహిస్తామని కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కేబినెట్ సమావేశం అనంతరం వెల్లడించారు. కాగా, 5జీ సేవల కోసం నిర్దేశించిన 3,300–3,600 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్ ్రïఫీక్వెన్సీలను మాత్రం ఈ తాజా వేలంలో విక్రయించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ‘‘700, 800, 900, 2100, 2300, 2500 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్ ఫ్రీక్వెన్సీల్లో 2,251.25 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ వేలంలో అందుబాటులో ఉంటుంది. మొత్తం 20 ఏళ్ల వ్యవధికి గాను ఈ బిడ్డింగ్‌లో స్పెక్ట్రమ్‌ను దక్కించుకోవచ్చు. బేస్/రిజర్వ్ ధర ప్రకారం ఇప్పుడు వేలం వేయనున్న స్పెక్ట్రమ్ విలువ రూ.3,92,332.70 కోట్లు’’ అని ప్రభుత్వ అధికారిక ప్రకటన పేర్కొంది. ప్రస్తుతానికి 5జీ వేలం లేనట్టే...! 5జీ సేవలకు ఉద్దేశించిన స్పెక్ట్రమ్‌తో పాటు మొత్తం రూ.5.22 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్ వేలం ప్రణాళికలకు టెలికం శాఖ (డాట్)కు చెందిన అత్యున్నత సంస్థ అయిన డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ఈ ఏడాది మే నెలలోనే లైన్ క్లియర్ చేసింది. అయితే, 5జీ సేవల కోసం నిర్దేశించిన స్పెక్ట్రమ్‌లో 300 మెగాహెట్జ్‌ను నేవీ ఉపయోగించుకుంటోంది, అలాగే భారత అంతరిక్ష విభాగం కూడా ఈ 5జీ స్పెక్ట్రమ్‌లో పెద్దమొత్తాన్ని తమకు కావాలని కోరింది. మరోపక్క, టెలికం పరిశ్రమ కూడా 5జీ స్పెకŠట్రమ్ బేస్ ధరను ప్రభుత్వం తగ్గించాలంటూ డిమాండ్ చేస్తూ వస్తోంది. 5జీ సేవల కోసం అవసరమైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయడానికి ఒక్కో టెలికం ఆపరేటర్ దాదాపుగా రూ.50,000 కోట్లు వెచ్చించాల్సి వస్తుందనేది కంపెనీల వాదన. అయితే, 5జీ స్పెక్ట్రమ్ వేలం పరిస్థితిపై అడిగిన ప్రశ్నలకు మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానమివ్వలేదు. రానున్న వేలంలో కూడా చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం 2016లో నిర్ధేశించిన నిబంధనలనే కొనసాగిస్తుందని మంత్రి తెలిపారు. చైనా టెలికం పరికరాలకు చెక్ చైనా నుంచి దేశంలోకి దిగుమతయ్యే టెలికం పరికరాలకు మరింతగా అడ్డుకట్ట వేసేవిధంగా కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయం తీసుకుంది. టెలికం మౌలిక వసతుల భద్రతను కట్టుదిట్టం చేసే చర్యల్లో భాగంగా, ‘‘నమ్మకమైన విక్రేత (సోర్స్)’’ నుంచి మాత్రమే దేశీ టెలికం సేవల సంస్థలు తమకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. భారత జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని టెలికం రంగానికి సంబంధించిన జాతీయ భద్రత నిబంధనలను రూపొందించినట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఈ నిబంధనల ప్రకారం... దేశీ టెలికం నెట్‌వర్క్‌లో ఉపయోగించదగిన నమ్మకమైన విక్రేతలు అలాగే పరికరాల జాబితాను డాట్ ప్రకటిస్తుంది. ‘‘డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు నేతృత్వంలోని కమిటీ ఈ నమ్మకమైన సోర్స్ అలాగే ఉత్పత్తుల జాబితాను రూపొందిస్తుంది. ఆయా సంస్థలు, పరికరాలను మాత్రమే ఇకపై దేశీ టెల్కోలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ‘టెలికం రంగంలో జాతీయ భద్రత కమిటీ’గా వ్యవహరించే ఈ బృందంలో సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన సభ్యులతో పాటు టెలికం పరిశ్రమ, స్వతంత్ర నిపుణుల నుంచి ఇద్దరు సభ్యులుగా ఉంటారు’ అని రవిశంకర్ ప్రసాద్ వివరించారు. నెట్‌వర్క్‌లలో ఇప్పటికే వినియోగిస్తున్న పరికరాలకు తాజా నిబంధన వర్తించదని, వాటిని మార్చాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఖజానాకు దండిగా నిధులు... వేలంలో స్పెక్ట్రమ్‌ను దక్కించుకునే టెలికం ఆపరేటర్లు తమ బిడ్ ధరతో పాటు ఏటా ప్రభుత్వానికి తమ సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్)లో 3 శాతం వాటాను స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. వైర్‌లైన్ సేవల ఆదాయాన్ని మినహాయించి ఏజీఆర్‌ను లెక్కగడతారు. ‘‘స్పెక్ట్రమ్‌లో విజయవంతమైన బిడ్డర్లు తమ బిడ్ మొత్తాన్ని ఒకే విడతలో ముందుగానే చెల్లించవచ్చు లేదా కొంత మొత్తాన్ని (700, 800, 900 మెగాహెట్జ్ బ్యాండ్లలో దక్కించుకున్న స్పెక్ట్రమ్‌కు బిడ్ ధరలో 25%; 1800, 2100, 2300, 2500 మెగాహెట్జ్ బ్యాండ్లలో అయితే 50%) ముందుగా చెల్లించి, మిగతా మొత్తాన్ని గరిష్టంగా 16 సమాన వార్షిక వాయిదాల్లో (రెండేళ్ల మారటోరియం తర్వాత నుంచి) చెల్లించేందుకు వీలుంటుంది’’ అని ప్రభుత్వ అధికార ప్రకటన వివరించింది. చక్కెర పరిశ్రమకు 3,500 కోట్లు్.. చెరకు రైతులకు బకాయిలను చెల్లించేందుకు వీలుగా చక్కెర పరిశ్రమకు ప్రభుత్వం రాయితీలను ప్రకటించింది. ప్రస్తుత 2020–21 మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర మిల్లులకు 60 లక్షల టన్నుల పంచదార ఎగుమతులపై రూ.3,500 కోట్ల సబ్సిడీకి కేంద్రంæ ఆమోదం తెలిపింది. ఈ మొత్తం నేరుగా రైతులకు చెల్లించడం జరుగుతుందని కేబినెట్ సమావేశం అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. గడిచిన రెండు మూడేళ్లుగా చక్కెర పరిశ్రమ, అలాగే చెరుకు రైతులు కూడా అధిక దేశీ ఉత్పత్తి కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ ఏడాది కూడా వార్షిక డిమాండ్ 260 లక్షల టన్నులు కాగా, 310 లక్షల టన్నుల ఉత్పత్తిని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. -
కేంద్ర ఉద్యోగులకు బోనస్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దసరా సందర్భంగా బోనస్ ప్రకటించింది. సుమారు 30.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 3,737 కోట్ల బోనస్‌ను అందజేయాలన్న ప్రతిపాదనకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019–2020 సంవత్సరానికి గానూ ఉద్యోగులకు ఉత్పాదకత ఆధారిత బోనస్ (ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్– పీఎల్బీ), ఉత్పాదకతకు సంబంధం లేని బోనస్ (నాన్ పీఎల్బీ లేదా అడ్హాక్) ఇవ్వాలని నిర్ణయించినట్లు∙సమాచార, ప్రసార శాఖ మంత్రి జవదేకర్ వెల్లడించారు. ఈ బోనస్ వల్ల దసరా, దీపావళి ఉత్సవాల సందర్భంగా ఉద్యోగుల కొనుగోళ్లు పెరిగి, తద్వారా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నామన్నారు. ‘ప్రతీ సంవత్సరం దసరా సమయంలో ఉద్యోగులకు గత సంవత్సర ఉత్పాదకత ఆధారంగా బోనస్ ప్రకటించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం కూడా పీఎల్బీ, అడ్హాక్ బోనస్‌ను తక్షణమే అందించనున్నాం’ అని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. రైల్వే, పోస్ట్స్, డిఫెన్స్, ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ, తదితర విభాగాలకు చెందిన సుమారు 16.97 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు రూ. 2,791 కోట్లతో 2019–20 సంవత్సరానికి గానూ పీఎల్బీ అందించనున్నారు. సుమారు 13.70 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ నాన్‌గెజిటెడ్ ఉద్యోగులకు రూ. 946 కోట్లతో అడ్హాక్ బోనస్‌ను ఇవ్వనున్నారు. జమ్మూకశ్మీర్‌లో నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్) ద్వారా 12 లక్షల టన్నుల యాపిల్‌ను సేకరించే పథకాన్ని 2020–21 సీజన్లో కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు నాఫెడ్ వద్ద ప్రభుత్వ హామీగా ఉన్న రూ. 2500 కోట్లను వినియోగించేందుకు అనుమతించింది. కశ్మీర్లో పంచాయతీరాజ్ చట్టం– 1989 అమలు ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. మూడంచెల పంచాయతీరాజ్ విధానం కశ్మీర్‌లోనూ అమలు కానుంది. -
అ‘ధనం’ ఇచ్చినా అందుకోలేదు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల పూర్తికి.. పెరిగిన ధరలకు అనుగుణంగా కాంట్రాక్టర్లకు అదనపు ధరలు చెల్లించేందుకు వీలుగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించినా ఇంతవరకు అవి పూర్తి కాలేదు. 16 భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలోని 86 ప్యాకేజీల పనులకు అదనపు చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం సుముఖం చూపినా ఇప్పటివరకు జరగని భూసేకరణ, సహాయ పునరావాసం (ఆర్అండ్ఆర్), బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా 61 ప్యాకేజీల పనులు ఐదేళ్లుగా పూర్తి కాలేదు. మరో 15 వేల ఎకరాలకు పైగా భూసేకరణ చేస్తే కానీ ఈ పనులు పూర్తయి మరో 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందదు. ఈ దృష్ట్యా ఈ పనుల గడువును మరో 6 నెలల నుంచి రెండేళ్లు పెంచాల ని ఇరిగేషన్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఐదేళ్లుగా ఎక్కడికక్కడే.. జలయజ్ఞంలో భాగంగా సాగునీటి ప్రాజెక్టులు వివిధ కారణాల రీత్యా జాప్యం జరగడంతో పాత ధరల ప్రకారం పనులు కొనసాగించలేమని కాంట్రాక్టు ఏజెన్సీలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో పెరిగిన సిమెంట్, కాంక్రీట్, స్టీలు ధరలకు అనుగుణంగా కొత్త ధరలు చెల్లించేందుకు ప్రభుత్వం 2015లో జీవో–146 వెలువరించింది. అనంతరం 2017లో కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ప్రాజెక్టుల్లో ఐబీఎం అంచనాలకు అదనంగా కొత్త కాంక్రీటు నిర్మాణాలు, అదనపు నిర్మాణాలు, లైనింగ్ పనులు చేరితే ఆ పనులకు అనుగుణంగా అంచనా వ్యయాన్ని పెంచుకునేందుకు ఆమోదం తెలిపారు. ఈ జీవోల మేరకు 2013 ఏప్రిల్ తర్వాత నిర్మాణం కొనసాగుతున్న ప్రాజెక్టుల్లోని ప్యాకేజీల పనులకు జీవో–146 అమలు చేస్తున్నారు. మొత్తంగా 111 ప్యాకేజీల పనులను దీని కింద చేర్చారు. తర్వాత ఇందులో కొన్నింటిని తొలగించి 86 ప్యాకేజీలకు జీవో వర్తింపచేశారు. రూ.19 వేల కోట్ల విలువైన ఈ ప్యాకేజీల పరిధిలో పనులు పూర్తి చేయాలంటే 45 వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించాల్సి ఉంది. అయితే, ఇప్పటికీ చాలా ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణ పూర్తి కాలేదు. ముఖ్యంగా బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, దేవాదుల, ఎస్సారెస్పీ స్టేజీ–2 వంటి పథకాల్లో ఇంకా భూ సేకరణ పూర్తి కాలేదు. ఇంకా 15 వేల ఎకరాలకు పైగా భూ సేకరణ జరగాల్సి ఉంది. కొన్ని చోట్ల ఆర్అండ్ఆర్ పనులు పూర్తికాక కోర్టు కేసుల నేపథ్యంలో పనులు ముందుకు కదలడం లేదు. కొన్ని ప్యాకేజీల పరిధిలో చాలాకాలంగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఏజెన్సీలు పనులు చేయడం లేదు. మరికొన్ని ప్యాకేజీల్లో ఏజెన్సీలు దివాలా తీయడంతోనూ పనులు ఆగిపోయాయి. దీంతో మరో రూ.3,500 కోట్ల పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులు పూర్తయితేనే మరో 10 లక్షల ఎకరాల మేర ఆయకట్టు వృద్ధిలోకి వస్తుంది. ఇప్పటికే ఈ ప్యాకేజీల గడువును 2007–08 నుంచి 5 నుంచి 10 సార్లకు పైగా పొడిగించగా, ఇప్పుడు మళ్లీ వీటి గడువును 6 నెలల నుంచి రెండేళ్ల వరకు పొడిగించాలని ఇరిగేషన్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయని పక్షంలో ఆ ఏజెన్సీలు కొన్నేళ్లపాటు ఎలాంటి పనులు చేపట్టకుండా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. -
‘మిషన్ కర్మయోగి’కి కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులను మరింత సమర్థ్ధవంతంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ‘మిషన్ కర్మయోగి’పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేబినెట్ ఈ ‘మిషన్ కర్మయోగి లేదా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్(ఎన్పీసీఎస్సీబీ)’కార్యక్రమానికి పచ్చ జెండా ఊపింది. ప్రభుత్వ ఉద్యోగులను సృజనాత్మకంగా, సానుకూల దృక్పథం కలిగినవారుగా, వృత్తి నిపుణులుగా, సాంకేతికంగా మరింత మెరుగైన వారిగా మార్చే అతిపెద్ద పాలనా సంస్కరణగా ‘మిషన్ కర్మయోగి’ని కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దింది. సరైన దృక్పథం, లోతైన జ్ఞానం, ఆధునిక నైపుణ్యాలు కలగలసిన, భారతదేశ భవిష్యత్ అవసరాలను తీర్చగల సమర్థ్ధులైన ఉద్యోగులుగా వారిని సిద్ధం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ‘మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి ఇది అతిపెద్ద ప్రభుత్వ కార్యక్రమం’అని కేబినెట్ భేటీ అనంతరం సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగిని దేశసేవకు ఉపయోగపడే అసలైన కర్మయోగిగా మార్చేలా ఈ కార్యక్రమం ఉంటుందని సిబ్బంది శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ‘2020 నుంచి 2025 వరకు దశలవారీగా రూ. 510.86 కోట్ల వ్యయంతో సుమారు 46 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వామ్యులను చేస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది’ అని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక కెపాసిటీ బిల్డింగ్ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే, పథకానికి దిశానిర్దేశం చేసేందుకు ప్రధానమంత్రి నేతృత్వంలో కొందరు ఎంపిక చేసిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రఖ్యాత హెచ్ఆర్ నిపుణులు సభ్యులుగా ఒక కేంద్ర కమిటీని ఏర్పాటు చేస్తారు. భవిష్యత్ భారత అవసరాలను తీర్చగల సమర్ధులైన ఉద్యోగులను రూపొందించడం మిషన్ కర్మయోగి లక్ష్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జమ్మూ, కశ్మీర్లో హిందీ, కశ్మీరీ, డోగ్రీలను అధికార భాషల్లో చేర్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఇంగ్లీష్, ఉర్దూ అధికార భాషలుగా ఉన్నాయి. దీనికి సంబంధించిన ‘జమ్మూకశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజెస్ బిల్–2020’ని రానున్న సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెడ్తామని జావదేకర్ వెల్లడించారు. -
అదానీ చేతికి మరో మూడు విమానాశ్రయాలు
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ మూడు విమానాశ్రయాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో(పీపీపీ) లీజుకు ఇచ్చేందుకు బుధవారం ఆమోదం తెలియజేసింది. ఈ మూడు.. జైపూర్, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాలు కాగా, వీటి నిర్వహణ హక్కులను అదానీ ఎంటర్ప్రైజెస్ బిడ్ రూపంలో గతేడాది గెలుచుకుంది. ఈ మూడింటితోపాటు లక్నో, అహ్మదాబాద్, మంగళూరు విమానాశ్రయాలను కూడా 2019 ఫిబ్రవరిలో అదానీ దక్కించుకుంది. ఈ ఆరింటిలో అహ్మదాబాద్, మంగళూరు, లక్నో విమానాశ్రయాలను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు లీజుకు ఇచ్చేందుకు అనుకూలంగా 2019 జూలైలోనే కేంద్రం ఆమోదం తెలిపింది. మిగిలిన మూడు విమానాశ్రయాలనూ పీపీపీ విధానంలో లీజునకు తాజాగా ఆమోదముద్ర వేసింది. ఈ వివరాలను కేబినెట్ భేటీ తర్వాత కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు తెలియజేశారు. అదానీ ఎంటర్ప్రైజెస్ సొంతం చేసుకున్న ఆరు విమానాశ్రయాలు ప్రస్తుతం ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహణలో ఉన్నాయి. కేంద్ర కేబినెట్ తొలుత ఆమోదం తెలిపిన లక్నో, మంగళూరు, అహ్మదాబాద్ విమానాశ్రయాల నిర్వహణ, కార్యకలాపాలు, అభివృద్ధి కి సంబంధించి రాయితీ ఒప్పందాన్ని ఈ ఏడాది ఫి బ్రవరి 14న ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో అదానీ కుదుర్చుకుంది. వాస్తవానికి వీటిని ఆగస్ట్ 12 నాటికే అదానీ స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. కరోనా కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో నవంబర్ 12 వరకు గడువును ఏఏఐ పొడిగించింది. తాజాగా లీజునకు ఆమోదం తెలియజేసిన వాటిల్లో గువాహటి, తిరువనంతపురం విమానాశ్రయాల ప్రైవేటీకరణపై కోర్టుల్లో విచారణ కొనసాగుతోంది. కాగా, కోర్టు నుంచి ఎటువంటి స్టే ఆదేశాలు లేనందున, వీటి లీజు విషయంలో ముందుకు వెళ్లొచ్చని కేంద్రం భావించింది. ‘‘ఈ విమానాశ్రయాలను పీపీపీ కిందకు బదిలీ చేయ డం అంటే సమర్థవంతమైన, నాణ్యమైన సేవలను ప్రయాణికులకు అందించేందుకు వీలు కల్పించడం. ఏఏఐ ఆదా యం పెరగడమే కాకుండా, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో మరిన్ని విమానాశ్రయాల అభివద్ధిపై ఏఏఐ దృష్టిసారించేందుకు అవకాశం లభిస్తుంది’’ అంటూ పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారు. ‘‘జైపూర్, గువాహటి, తిరువనంతపురం విమానాశ్రయాలను శాశ్వతం గా ప్రైవేటు ఆపరేటర్‌కు ఇవ్వడం లేదు. 50 ఏళ్ల నిర్వహణ తర్వాత ఆయా విమానాశ్రయాలను ఏఏఐకి తిరిగి ఇచ్చేయాలి. ఈ లీజు వల్ల ఏఏఐకి ప్రారంభంలోనే రూ.1,070 కోట్లు లభిస్తాయి. ప్రయాణికులకు మంచి సేవలు లభిస్తాయి‘‘అని ప్రకాశ్ జవదేకర్ మీడియాకు తెలిపారు. -
పాఠశాల, ఉన్నత విద్యలో భారీ సంస్కరణలు
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: నూతన విద్యావిధానం–2020 (ఎన్ఈపీ–2020)కి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ఈ విధానాన్ని రూపొందించారు. 34 సంవత్సరాల క్రితం నాటి జాతీయ విద్యా విధానం 1986 స్థానంలో ఇది రూపుదిద్దుకుంది. అందుబాటులో అందరికీ నాణ్యమైన విద్య ప్రధాన లక్ష్యంగా, 2030 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. పాఠశాల, కళాశాల విద్యను 21వ శతాబ్దపు అవసరాలకు అనువైనదిగా తీర్చిదిద్దడంపై ఈ విధానం ప్రధానంగా దృష్టి పెట్టింది. సామాజికంగా, ఆర్ధికంగా అణగారిన వర్గాల వారిపై ఈ విధానంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. జీడీపీలో విద్యారంగ కేటాయింపులు కనీసం ఆరు శాతానికి చేర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల విద్యకు ప్రమాణాలు: ళి విద్యా సంబంధ, విధాన నిర్ణయాలకు సంబంధించి స్పష్టమైన ప్రత్యేక వ్యవస్థ ఉండాలని ఈ విధానం స్పష్టం చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పాఠశాల ప్రమాణాల రాష్ట్ర అథారిటీ(ఎస్ఎస్ఎస్ఏ)ని ఏర్పాటు చేసుకుంటాయి. 2035 నాటికి 50 శాతానికి జీఈఆర్: ళి ఉన్నత విద్యలో దేశంలో స్థూల ఎన్రోల్మెంట్ నిష్పత్తి (జీఈఆర్)ని 26.3 శాతం( 2018) నుంచి 2035 నాటికి 50 శాతానికి చేర్చాలని జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యంగా నిర్ణయించుకుంది. కొత్తగా 3.5 కోట్ల సీట్లను జత చేయనున్నారు. ఎంఫిల్ కోర్సులను తొలగించాలని నిర్ణయించారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ► ఉన్నత విద్యా వ్యవస్థ పాలన అవసరాల కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయనున్నారు. వైద్య విద్య, న్యాయ విద్యకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుంది. దీనికి నాలుగు స్వతంత్ర విభాగాలు ఉంటాయి. అవి నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్, జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (జిఇసి), హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్, నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్. ► ఉపాధ్యాయ విద్యకు సంబంధించి, సమగ్రమైన నూతన జాతీయ కరికులమ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్‌ను 2021 నాటికి రూపొందించనున్నారు. 2030 నాటికి బోధనకు నాలుగు సంవత్సరాల బీఈడీ డిగ్రీ కనీస అర్హత అవుతుంది. నాసిరకం ఉపాధ్యాయ విద్యా సంస్థలపై కఠిన చర్యలుంటాయి. ► ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్దులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటారు. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్‌ను విస్తరింపచేసి స్కాలర్షిప్ పొందిన విద్యార్ధుల ప్రగతిని గమనిస్తారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఎక్కువ ఫ్రీషిప్, స్కాలర్షిప్లను తమ విద్యార్థులకు అందించేలా చూస్తారు. ముఖ్యాంశాలు.. ► ప్రి స్కూలు నుంచి సెకండరీ స్థాయి వరకు అన్ని స్థాయిలలోనూ పాఠశాల విద్యను సార్వత్రికంగా అందుబాటులో ఉంచాలి. వినూత్న విద్యా కేంద్రాలు, మౌలికసదుపాయాల మద్దతుతో మధ్యలోనే బడి మానేసిన దాదాపు 2 కోట్లమందిని మళ్లీ బడిబాట పట్టించాలి. ► పూర్వ ప్రాథమిక విద్యపై దృష్టిపెడుతూ 10+2 విద్య స్థానంలో 5+3+3+4 సంవత్సరాల విద్యను తీసుకురానున్నారు. 3–8, 8–11, 11–14, 14–18 సంవత్సరాల విద్యార్ధులు దీనిపరిధిలోకి వస్తారు. ► పిల్లల మానసిక వికాసానికి అనువైన దశగా అంతర్జాతీయంగా గుర్తించిన నేపథ్యంలో ఇకపై 3–6 సంవత్సరాల వయసుగల వారు పాఠశాల విద్యా ప్రణాళిక కిందికి వస్తారు. ఈ విధానంలో మూడు సంవత్సరాలు అంగన్ వాడీ లేదా ప్రీ స్కూల్‌తో మొత్తం 12 సంవత్సరాల పాఠశాల విద్య ఉంటుంది. ► పాఠశాల స్థాయిలో విద్యార్థుల సమగ్ర వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని వారిని 21 వ శతాబ్దపు నైపుణ్యాలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఆలోచన స్థాయిని పెంచేందుకు, కీలక అంశాలను నేర్చుకునేందుకు పాఠ్యాంశాలను తగ్గిస్తారు. ప్రయోగాత్మక అభ్యాసానికి వీలు కల్పించి దానిపై దృష్టిపెడతారు. సబ్జెక్టుల ఎంపికలో విద్యార్ధులకు స్వేచ్చ ఉంటుంది. ఆర్ట్స్, సైన్సు మధ్య కఠిన విభజన ఏదీ ఉండదు. వృత్తి విద్యను 6 వ గ్రేడ్ నుంచే ఇంటర్న్‌షిప్‌తో పాటు ప్రారంభిస్తారు. ► కొత్త సమగ్రమైన నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (ఎన్సీఎఫ్ఎస్ఈ– 2020–21)ను ఎన్సీఈఆర్టీ అభివృద్ధి చేయనుంది. ళీ మాతృభాష, స్థానిక భాష, ప్రాంతీయ భాషను బోధన మాధ్యమంగా కనీసం 5వ తరగతి వరకు ఉంచాలని, 8వ తరగతి, ఆపై వరకూ దీనిని కొనసాగించవచ్చని సూచించారు. సంస్కృతాన్ని పాఠశాలలోని అన్ని స్థాయిల్లో విద్యార్థులు ఐచ్ఛికంగా మూడు భాషల విధానంలో భాగంగా ఎంచుకోవచ్చని స్పష్టం చేసింది. ► ఇతర ప్రాచీన భాషలు, సాహిత్యం కూడా విద్యార్థులు ఎంపిక చేసుకోవడానికి వీలుంటుంది. 6–8 గ్రేడ్ ల మధ్య ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమం కింద విదేశీ భాషలను సెకండరీ విద్యాస్థాయిలో నేర్చుకోవచ్చు. ళీ వెనుకబడిన ప్రాంతాలు, వర్గాల కోసం స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్లను, జెండర్ ఇంక్లూజన్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తారు. దివ్యాంగులైన పిల్లలు రెగ్యులర్ పాఠశాల ప్రక్రియలో ఫౌండేషన్ స్థాయి నుంచి ఉన్నత విద్యవరకు పూర్తి స్థాయిలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తారు. హెచ్చార్డీ కాదు.. విద్యా శాఖ మానవ వనరుల అభివృద్ధి(హెచ్చార్డీ) మంత్రిత్వ శాఖ పేరును మళ్లీ విద్యా శాఖగా మారనుంది. సంబంధిత ప్రతిపాదనకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నూతన విద్యా విధానం సిఫారసుల్లో మంత్రిత్వ శాఖ పేరు మార్పు కూడా ఒకటి. 1985లో రాజీవ్ గాంధీ హయాంలో విద్యా శాఖ పేరును హెచ్చార్డీ శాఖగా మార్చరు. -
జాతీయ విద్యా విధానానికి ఆమోదం
-
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ (హెచ్ఆర్డీ) శాఖ పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చే ప్రతిపాదనను బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇస్రో మాజీ చీఫ్ కే కస్తూరిరంగన్ సారథ్యంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ తొలుత మంత్రిత్వ శాఖ పేరు మార్చాలని సిఫార్సు చేసింది. నూతన విద్యా విధానం డ్రాఫ్ట్‌లో ఇది కీలక సిఫార్సు కావడంతో పేరు మార్పునకు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. విద్య, బోధన, సాధన ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించే దిశగా హెచ్ఆర్డీ శాఖను విద్యా మంత్రిత్వ శాఖగా మార్చాలని ఈ కమిటీ సూచించింది. జాతీయ విద్యా విధానానికీ కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చదవండి : సినిమాలు, జిమ్స్ తెరవొచ్చు! -
హైటెక్ వ్యవ‘సాయం’!
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలకు, టెక్నాలజీని ప్రవేశపెట్టేవారికి, స్టార్టప్‌లకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ముందుకు వచ్చే వారికి ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర సర్కారు రూ.లక్ష కోట్లతో అగ్రి ఇన్ఫ్రా ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. మౌలిక సదుపాయాలు, రవాణా వసతుల కోసం ఏర్పాటయ్యే రైతు గ్రూపులకు కూడా ఈ నిధి కింద రుణ సాయం అందుతుంది. కరోనా వైరస్ తర్వాత కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీకి తాజాగా ప్రకటించిన రూ.లక్ష కోట్ల నిధి అదనం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ థోమర్ మీడియాకు తెలిపారు. చరిత్రాత్మకమైన ఈ నిర్ణయం వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. అగ్రి ఇన్ఫ్రా ఫండ్ పదేళ్ల పాటు 2029 వరకు అమల్లో ఉంటుంది. సాగు అనంతరం పంట ఉత్పత్తుల విక్రయం వరకు వసతుల నిర్వహణ (శీతల గోదాములు, గోదాములు, గ్రేడింగ్, ప్యాకేజింగ్ యూనిట్లు, ఈ మార్కెటింగ్, ఈ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు తదితర), సామాజిక సాగు తదితరాలకు దీర్ఘకాల రుణ సాయం పొందొచ్చు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా ఈ రుణాలను మంజూరు చేస్తారు. రూ.లక్ష కోట్ల నిధి ఏర్పాటులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020–21) కేంద్రం రూ.10,000 కోట్లను సమకూరుస్తుంది. తదుపరి మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.30,000 కోట్ల చొప్పున ఏర్పాటు చేస్తుంది. గరిష్టంగా రూ.2 కోట్ల రుణానికి 3 శాతం వడ్డీ రాయితీని ఇవ్వనున్నట్టు మంత్రి తోమర్ చెప్పారు. ఈపీఎఫ్ చెల్లింపుల పథకం ఆగస్టు వరకు చిన్న సంస్థల తరఫున ఈపీఎఫ్ చెల్లింపుల పథకాన్ని ఆగస్టు వరకు కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది. 100 వరకు ఉద్యోగులు కలిగిన సంస్థల్లో 90 శాతం మంది రూ.15,000లోపు వేతనం కలిగి ఉంటే.. ఉద్యోగుల చందాతోపాటు, వారి తరఫున ఆయా సంస్థల చందా (చెరో 12 శాతం)ను కేంద్రమే చెల్లించనుంది. లాక్డౌన్ కారణంగా చిన్న, మధ్య స్థాయి సంస్థలు చాలా వరకు మూతపడడంతో.. వాటికి వెసులుబాటునిస్తూ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ పథకం కింద ఈ భారాన్ని తాను భరించనున్నట్టు కేంద్రం లోగడ ప్రకటించింది. తొలుత మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన చందాలను చెల్లించాలని నిర్ణయించింది. జూన్, జూలై, ఆగస్టు నెలలకూ ఈపీఎఫ్ చందాలను తానే చెల్లించాలని కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులు మరింత వేతనాన్ని ఇంటికి తీసుకెళ్లొచ్చని, సంస్థలపైనా భారం తగ్గుతుందని కేంద్ర మంత్రి జవదేకర్ పేర్కొన్నారు. మూడు బీమా సంస్థలకు రూ.12,450 కోట్లు ప్రభుత్వరంగంలోని మూడు సాధారణ బీమా సంస్థ లు.. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు రూ.12,450 కోట్ల మూలధనసాయాన్ని అందించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో 2019–20లో అందించిన రూ.2,500 కోట్లు కలసి ఉంటుందని మంత్రి జవదేకర్ తెలిపారు. ఈ మూడు కంపెనీలను విలీనం చేసి, స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలన్నది కేంద్రం ప్రణాళికగా ఉంది. -
మద్దతు ధరలను పెంచిన కేంద్రం
-
వరికి మద్దతు రూ.53 పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: ఆహార, వాణిజ్య పంటల కనీస మద్ధతు ధర(ఎమ్మెస్పీ)లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వరి మద్ధతు ధరను స్వల్పంగా రూ. 53 పెంచింది. ఈ పెంపుతో వరి క్వింటాల్ ధర సాధారణ రకం రూ. 1,868కి, ఏ గ్రేడ్ రకం రూ. 1888కి చేరింది. నూనె గింజలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలకు గణనీయంగా పెంచింది. ప్రస్తుత 2020–21 పంట సంవత్సరానికి(2020 జూలై– 2021 జూన్) ఈ ఎమ్మెస్పీ వర్తిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ కనీస మద్దతు ధర పెంపు ప్రతిపాదనలను ఆమోదించారు. అత్యధికంగా గడ్డి నువ్వులు(నైజర్ సీడ్స్)కు క్వింటాలుకు రూ. 755 పెంచారు. నువ్వులకు రూ. 370, మినుములకు రూ. 300, పత్తికి రూ. 275 మేర పెంచారు. మద్దతు ధర పెంపులో ఉత్పత్తి వ్యయంపై మెరుగైన ప్రతిఫలంతోపాటు, వైవిధ్య పంటల ప్రోత్సాహం అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. పంట ఉత్పత్తి వ్యయంపై అదనంగా కనీసం 50 శాతం ప్రతిఫలం లభించేలా కనీస మద్దతు ధర ఉండాలని 2018–19 బడ్జెట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా మద్దతు ధరలను ప్రకటించారు. ఉత్పత్తి వ్యయానికి అదనంగా సజ్జల(బాజ్రా)కు 83%, మినుములకు 64%, కందులకు 58%, మొక్కజొన్నకు 53%, ఇతర పంటలకు కనీసం 50% మేర ప్రతిఫలం వస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఖరీఫ్ సీజన్లో వరి ప్రధాన పంట. ఇప్పటికే 35 లక్షల హెక్టార్లలో నాట్లు వేశారు. ‘కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ సిఫారసుల మేరకు 2020–21 సంవత్సరానికి గానూ 14 ఖరీఫ్ పంటలకు మద్ధతు ధరలను పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వివిధ పంటలపై, దిగుబడి ఖర్చుపై 50% నుంచి 83% వరకు రైతుకు లాభం వచ్చేలా ధరల పెంపు ఉంది’ అని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ తెలిపారు. వరి దిగుబడి వ్యయాన్ని సాధారణ రకానికి రూ. 1245, ఏ గ్రేడ్ రకానికి రూ. 1246గా నిర్ధారించి, దానిపై 50% ప్రతిఫలం లభించేలా కనీస మద్దతు ధర నిర్ణయించామన్నారు. వంట నూనెల దిగుమతిని తగ్గించేందుకు, దేశీయంగా నూనె గింజల దిగుబడిని పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు వాటి ఎమ్మెస్పీని గణనీయంగా పెంచారు. రూ. 3 లక్షల వరకు స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్నవారు తిరిగి చెల్లించే తేదీని ఆగస్ట్ 31 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. -
ఎన్‌బీఎఫ్‌సీలకు కేంద్రం ఊరట
న్యూఢిల్లీ: బ్యాంకింగ్యేతర ఫైనాన్స్ (ఎన్బీఎఫ్సీ), గృహ రుణ సంస్థలు (హెచ్ఎఫ్సీ), సూక్ష్మ రుణ సంస్థలకు ఊరటనిచ్చేలా కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మరిన్ని సంస్థలు పాక్షిక రుణ హామీ పథకం (పీసీజీఎస్) పరిధిలోకి వచ్చేలా నిబంధనలు సడలించడంతో పాటు కాల వ్యవధిని జూన్ 30 దాకా పొడిగించింది. దీని కాలపరిమితి వాస్తవానికి మార్చి 31తో తీరిపోయింది. సవరించిన పీసీజీఎస్ ప్రకారం ఏఏ కన్నా తక్కువ రేటింగ్ ఉన్న ఎన్బీఎఫ్సీ, ఎంఎఫ్ఐ, హెచ్ఎఫ్సీ బాండ్లను కొనుగోలు చేసే ప్రభుత్వ రంగ బ్యాంకులకు నష్టం వాటిల్లితే.. అందులో సుమారు 20 శాతం దాకా భర్తీ అయ్యేలా ప్రభుత్వం పూచీకత్తునిస్తుంది. మరోవైపు, కరోనా వైరస్ సంక్షోభాన్ని అధిగమించే దిశగా రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీలకు ప్రకటించిన రూ. 30,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. 2018 సెప్టెంబర్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీల డిఫాల్ట్‌తో మొదలుపెట్టి ఆ తర్వాత చోటుచేసుకున్న అనేక పరిణామాలతో ఎన్బీఎఫ్సీలు నిధులు దొరక్క సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు, సూక్ష్మ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలకు తోడ్పాటు అందించేందుకు రూ. 10,000 కోట్లతో కొత్త పథకానికి కూడా క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనితో 2,00,000 యూనిట్లకు రుణ ఆధారిత సబ్సిడీని అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. 2024–25 దాకా అయిదేళ్లు ఈ స్కీము అమలవుతుంది. ఆదాయంలో ప్రభుత్వానికి వాటాలిచ్చే ప్రాతిపదికన వాణిజ్య కార్యకలాపాల కోసం బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆదాయంలో ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తారన్న అంశం ఆధారంగా కంపెనీలు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. నాలుగు శాతం వాటా కనీస స్థాయిగా ఉంటుంది. -
‘యస్’ ప్రణాళికకు కేంద్రం ఓకే..
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు ఉద్దేశించిన పునరుద్ధరణ ప్రణాళికకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రణాళికను నోటిఫై చేసిన 3 రోజుల్లోగా బ్యాంకుపై మారటోరియంపరమైన ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు, 7 రోజుల్లోగా కొత్త బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తెలిపారు. ‘ఆర్బీఐ ప్రతిపాదించిన యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డిపాజిటర్ల ప్రయోజనాలు పరిరక్షించేందుకు, యస్ బ్యాంక్‌ను స్థిరపర్చేందుకు, బ్యాంకింగ్ వ్యవస్థలో పరిస్థితులు స్థిరంగా ఉండేలా చూసేందుకు ఈ స్కీమ్ తోడ్పడుతుంది‘ అని మంత్రి తెలిపారు. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)..49 శాతం వాటాలు కొనుగోలు చేస్తోందని, యస్ బ్యాంకు కొత్త బోర్డులో ఎస్బీఐ డైరెక్టర్లు ఇద్దరు ఉంటారని ఆమె చెప్పారు. కొత్త బోర్డు ఏర్పాటైన 7 రోజుల్లోగా అడ్మినిస్ట్రేటర్ తప్పుకుంటారన్నారు. ఎస్బీఐ వాటాలకు సంబంధించి 26%కి మాత్రమే మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుం దని, మిగతా ఇన్వెస్టర్లకు 75% వాటాలకు ఇది వర్తిస్తుందని మంత్రి చెప్పారు. ఇక, పెరుగుతున్న మూలధన అవసరాలకు అనుగుణంగా యస్ బ్యాంక్ అధీకృత మూలధనాన్ని రూ. 6,200 కోట్లకు పెంచినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆర్బీఐ ముసాయిదా పునరుద్ధరణ ప్రణాళిక ప్రకారం.. అధీకృత మూలధనం రూ. 5,000 కోట్లు. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ పెట్టుబడులు.. యస్ బ్యాంకులో రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు ఐసీఐసీఐ బ్యాంకు తెలియజేసింది. ఇది 5 శాతం పైగా వాటాలకు సమానమవుతుంది. అయితే, పునరుద్ధరణ స్కీమ్ ప్రకారం తుది వాటాల సంగతి వెల్లడవుతుందని పేర్కొంది. అటు రుణాల సంస్థ హెచ్డీఎఫ్సీ కూడా రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. యాక్సిస్ బ్యాంక్ సైతం రూ. 600 కోట్లతో 60 కోట్ల దాకా షేర్లు కొనుగోలు చేయనుంది. కోటక్ మహీంద్రా బ్యాంకు కూడా రూ. 500 కోట్లతో 50 కోట్ల షేర్లు తీసుకోనున్నట్లు క్సే ్చంజీలకు తెలిపింది. రాణా కపూర్‌పై మరో సీబీఐ కేసు.. యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్, ఆయన భార్య బిందుపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. అవంత రియల్టీ గ్రూప్ సంస్థలకు యస్ బ్యాంక్ ద్వారా రుణాలిప్పించి, రాణా కపూర్ ప్రతిఫలంగా ఢిల్లీలోని ఓ భవంతిని అత్యంత చౌకగా తీసుకున్నారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. వివరాల్లోకి వెడితే.. అవంత సంస్థలకు రూ. 1,900 కోట్ల రుణాలిచ్చినందుకు ప్రతిగా బ్లిస్ అబోడ్ అనే సంస్థ ద్వారా ఢిల్లీలోని బంగళాను రూ. 378 కోట్లకు కపూర్ కొనుగోలు చేశారు. ఈ బ్లిస్ అబోడ్ అనే సంస్థ ఇద్దరు డైరెక్టర్లలో బిందు కూడా ఒకరు. బంగళాను కొన్న వెంటనే రాణా కపూర్ .. దాన్ని ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌లో తనఖా పెట్టి రూ. 685 కోట్లు తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి బ్లిస్ అబోడ్, అవంత రియల్టీ, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, తమ కార్యాలయాల్లో సోదాల వార్తలను ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ తోసిపుచ్చింది. అస్థిరతల కట్టడికి చర్యలు: సెబీ న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ఇన్వెస్టర్లలో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు సెబీ, కేంద్రం చొరవ తీసుకున్నాయి. స్టాక్ మార్కెట్లలో అస్థిరతలను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సెబీ ప్రకటించింది. తీవ్ర అమ్మకాలతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభంలోనే 10 శాతం కుప్పకూలడంతో ట్రేడింగ్‌ను 45 నిమిషాల పాటు నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో సెబీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఆర్థిక మందగమనం, చమురు ధరల పతనంపై ఆందోళనలతో గత కొన్ని రోజులుగా భారత స్టాక్ మార్కెట్.. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లకు అనుగుణంగా చలిస్తోంది. అవసరమైతే తగిన చర్యలు తీసుకునేందుకు సెబీ, స్టాక్ ఎక్సేంజ్‌లు సన్నద్ధంగా ఉన్నాయి’’ అని సెబీ తన ప్రకటనలో పేర్కొంది. పరిశ్రమలకు ఉపశమనం కల్పిస్తాం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లను ప్రభుత్వం, ఆర్బీఐ నిశితంగా పరిశీలిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన పరిశ్రమలకు ఉపశమనం కల్పించే చర్యల కోసం ప్రభుత్వంలోని భిన్న శాఖలు కలసికట్టుగా పనిచేస్తున్నాయని ఆమె చెప్పారు. ‘‘కరోనా వైరస్ కారణంగా ఎదురైన సవాళ్ల నుంచి బయటకు వచ్చేందుకు అన్ని రంగాలతో నేను సమావేశం నిర్వహించిన విషయం మీకు తెలుసు. ఆయా పరిశ్రమలు సవాళ్ల నుంచి బయటకు వచ్చేందుకు తాము ఎంత మేరకు మెరుగ్గా సాయం అందించొచ్చన్న దానిపై ప్రతి శాఖా ఎంతో సమయం వెచ్చిస్తోంది’’ అని మంత్రి వివరించారు. -
‘యస్’ పునర్నిర్మాణ పథకం, త్వరలోనే ఆంక్షలు ఎత్తివేత
సాక్షి, న్యూఢిల్లీ : సంక్షోభంలో పడిన ప్రైవేటు బ్యాంకు యస్ బ్యాంకు పునర్నిర్మాణ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్బీఐ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని శుక్రవారం కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తక్షణ మూలధన అవసరాల నిమిత్తం రూ. 1100 కోట్ల నుంచి రూ. 6200 కోట్లకు పెంచినట్టు ఆమె ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని నిర్ధారించే లక్ష్యంతో బ్యాంక్ పునర్నిర్మాణ పథకాన్ని ఆమోదించామనీ, ప్రధానంగా డిపాజిటర్ల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎస్బీఐ 49 శాతం ఈక్విటీ షేర్ల కొనుగోలు ద్వారా రూ. 7,250 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ఎస్బీఐ షేర్లకు 26 శాతం చొప్పున మూడేళ్ల లాక్ ఇన్ వ్యవధి ఉంటుంది. ప్రైవేట్ పెట్టుబడిదారుల 75 శాతం పెట్టుబడులకు మూడేళ్ల లాక్-ఇన్ వ్యవధి ఉంటుందని చెప్పారు. ఇతర పెట్టుబడిదారులను కూడా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో ఆర్బీఐ ఇతర పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోందన్నారు. నోటిఫికేషన్ వచ్చిన మూడు రోజుల (వర్కింగ్) తరువాత మారటోరియం ఎత్తివేస్తామని ఆర్థికమంత్రి వెల్లడించారు. నోటిఫికేషన్ వెలువడిన 7 రోజుల్లో కొత్త బోర్డు ఏర్పాటవుతుంది. అలాగే బోర్డులో కనీసం ఇద్దర డైరెక్టర్లు ఎస్బీఐకి చెందినవారు వుంటారు. మరోవైపు యస్ బ్యాంక్ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) సుమారు 1.35 బిలియన్ షేర్లను రూ .10 చొప్పున కొనుగోలు చేయనుంది. అలాగే ఈక్విటీ ద్వారా రూ .1000 కోట్ల పెట్టబడులను ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు ఆమోదించింది. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: బ్యాంక్‌ల విలీనంపై కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసే చర్యల్లో భాగంగా పది ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో ప్రకటించిన విషయం తెలిసిందే. ఎప్రిల్ 1,2020 నుంచి నాలుగు మెగా బ్యాంక్‌లు తమ కార్యకలాపాలు నిర్వర్తిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్యాంకులను బలోపేతం చేయడంతో పాటు, నష్టాల నుంచి బయటపడేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బ్యాంక్‌ల విలీనానికి సంబంధించి చట్టపరమైన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని, అంతర్జాతీయ బ్యాంక్‌లతో పోటీని తట్టుకునేందుకు ఈ నిర్ణయం ఎంతో దోహదం చేస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కేవలం విలీన నిర్ణయంతోనే బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్ట పరచడం సాధ్యం కాదని, ప్రభుత్వం తీసుకున్న విలీన నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు బ్యాంక్ యూనియన్లు ప్రకటించాయి -
పన్నుల పరిష్కార పథకం పరిధి పెంపు...
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన ’వివాద్ సే విశ్వాస్’ పథకం పరిధిని విస్తరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రుణ రికవరీ ట్రిబ్యునల్స్‌లో (డీఆర్టీ) ఉన్న పెండింగ్ కేసులను కూడా ఇందులోకి చేర్చే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. 2019 నవంబర్ దాకా గణాంకాల ప్రకారం.. వివాదాల్లో చిక్కుబడిన ప్రత్యక్ష పన్ను బకాయీలు సుమారు రూ. 9.32 లక్షల కోట్లుగా ఉన్నాయి. సంబంధిత వర్గాల సిఫార్సులకు అనుగుణంగా వివాద్ సే విశ్వాస్ బిల్లుకు కొత్త సవరణలను ప్రస్తుత పార్లమెంటు సెషన్లో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. ఈ బిల్లు ప్రకారం పథకాన్ని ఎంచుకున్న వారు.. మార్చి 31లోగా వివాదాస్పద పన్ను మొత్తం కడితే వడ్డీ నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. మరోవైపు, 12 ప్రధాన పోర్టులకు స్వయంప్రతిపత్తినిచ్చే దిశగా 1963 నాటి చట్టం స్థానంలో కొత్త మేజర్ పోర్ట్ అథారిటీ బిల్లు 2020కి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధాన పోర్టుల సామర్థ్యాన్ని, పోటీతత్వా న్ని పెంచేందుకు ఇది తోడ్పడనుంది. ప్రస్తుత పార్ల మెంటు సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. -
రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మరో ముందడుగు పడింది. మందిర నిర్మాణ పర్యవేక్షణకు ఒక స్వతంత్ర సంస్థ(ట్రస్ట్) ఏర్పాటైంది. అత్యద్భుతంగా మందిర నిర్మాణం జరిపేందుకు ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ పేరుతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రకటించారు. మందిర నిర్మాణానికి ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని ‘అయోధ్య’ తీర్పులో సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. 3 నెలల్లోగా ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించగా, ఆ గడువు ఫిబ్రవరి 9తో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం.. బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రధాని ఈ ప్రకటన చేశారు. ‘ఒక ముఖ్యమైన, చరిత్రాత్మక అంశంపై మీతో ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నా. ఇది లక్షలాది ప్రజలలాగే నా హృదయానికి కూడా చాలా దగ్గరైన విషయం. దీనిపై ప్రకటన చేసే అవకాశం లభించడం నా అదృష్టం’ అంటూ ట్రస్ట్ ఏర్పాటుపై ప్రధాని ప్రకటన చేశారు. అయోధ్యలో రామ మందిర అభివృద్ధి కోసం ఒక విస్తృత పథకాన్ని సిద్ధం చేశామన్నారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలం సహా మొత్తం 67.703 ఎకరాలను ఈ ట్రస్ట్‌కు బదిలీ చేస్తామన్నారు. శ్రీరాముడి జన్మస్థలంలో అద్భుతమైన రామాలయ నిర్మాణానికి భారతీయులంతా సహకరించాలని మోదీ కోరారు. ప్రధాని ప్రకటన సందర్భంగా అధికార పక్ష సభ్యులు జై శ్రీరాం నినాదాలతో సభను హోరెత్తించారు. అయోధ్య తీర్పు అనంతరం దేశ ప్రజలంతా ప్రజాస్వామ్య విధివిధానాలపై గొప్ప విశ్వాసాన్ని చూపారని, అందుకు 130 కోట్ల భారతీయులకు సెల్యూట్ చేస్తున్నానని మోదీ తెలిపారు. భారత్‌లో అన్ని మతాల వారు ఒక ఉమ్మడి కుటుంబంలా కలిసి ఉంటారన్నారు. మన సంస్కృతిలోనే ఆ వసుధైక కుటుంబ భావన ఉందన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ మార్గంలో తన ప్రభుత్వం పయనిస్తోందన్నారు. ఒక దళితుడు సహా 15 మంది ట్రస్టీలు రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైన ట్రస్ట్‌లో 15 మంది సభ్యులుంటారని, వారిలో ఒకరు దళిత వర్గానికి చెందినవారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ ట్రస్ట్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ‘లక్షలాది భక్తుల కోరిక త్వరలో నెరవేరుతుందని ఆశిస్తున్నా. రాముడు జన్మించిన పుణ్యక్షేత్రంలో భక్తులు పూజలు చేసుకునే అవకాశం త్వరలోనే లభించనుంది’ అన్నారు. అయితే, ట్రస్టీల పేర్లను ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. కాగా, రామ మందిర నిర్మాణం గతంలో ‘రామజన్మభూమి న్యాస్’ ప్రతిపాదించిన నమూనాలో ఉంటుందని ఆశిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు విష్ణు సదాశివ్ పేర్కొన్నారు. సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు ఐదెకరాలు మసీదు నిర్మాణం కోసం అయోధ్య జిల్లాలో సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు ఐదెకరాల స్థలాన్ని కేటాయిస్తూ యూపీ సర్కార్ నిర్ణయించింది. సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు మసీదు నిర్మాణం కోసం ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని అయోధ్య తీర్పులో సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. అయోధ్య నుంచి 18 కి.మీల దూరంలో లక్నో హైవేపై ఈ స్థలాన్ని కేటాయించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. కాగా, రామాలయ నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడానికి తన అనుమతి అవసరం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. -
‘బొగ్గు’లో సంస్కరణల బాజా
న్యూఢిల్లీ: దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచడంతో పాటు మరింతగా పెట్టుబడులు ఆకర్షించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంది. గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1957, బొగ్గు గనులు (స్పెషల్ ప్రొవిజన్స్) చట్టం 2015లో సవరణలను సవరిస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్‌కు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం.. బొగ్గుయేతర సంస్థలు కూడా బొగ్గు గనుల బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చు. అలాగే, అంతిమంగా బొగ్గు వినియోగంపైనా ఆంక్షలు ఉండవు. కేంద్ర క్యాబినెట్ భేటీ అనంతరం బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విషయాలు వెల్లడించారు. నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా కనీస అర్హత గల ఏ కంపెనీ అయినా బొగ్గు గనుల వేలంలో పాల్గొనవచ్చు. ఈ కొత్త నిబంధనల కింద జనవరిలోనే తొలి విడత వేలం నిర్వహించనున్నట్లు బొగ్గు శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ జైన్ చెప్పారు. మొదటి విడతలో 40 బొగ్గు బ్లాకుల దాకా వేలం వేయనున్నట్లు వివరించారు. మరోవైపు, మార్చి 31తో మైనింగ్ లీజు ముగిసిపోయే ముడి ఇనుము, ఇతర ఖనిజాల గనుల వేలాన్ని గడువులోగా నిర్వహించే ప్రతిపాదనకు కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. కోల్ ఇండియాకూ మద్దతు ఉంటుంది.. అవకతవకల ఆరోపణల కారణంగా.. 2014లో సుప్రీం కోర్టు 204 బొగ్గు బ్లాకుల కేటాయింపును రద్దు చేసింది. అయితే, అంతిమంగా వినియోగించే అంశానికి సంబంధించి పరిమితుల కారణంగా వాటిలో కేవలం 29 బ్లాకులను మాత్రమే వేలం వేయడం జరిగింది. తాజాగా ఆంక్షలను ఎత్తివేయడంతో మిగతా బ్లాకుల వేలానికీ మార్గం సుగమం అవుతుందని జోషి చెప్పారు. ఈ రంగంలో పోటీని పెంచేందుకు, బొగ్గు దిగుమతులను తగ్గించుకునేందుకు, ప్రభుత్వ రంగ కోల్ ఇండియా గుత్తాధిపత్యాన్ని తగ్గించేందుకు కూడా ఈ చర్యలు ఉపయోగపడనున్నట్లు జైన్ చెప్పారు. అలాగని కోల్ ఇండియా ప్రాధాన్యాన్ని తగ్గించే యోచనేదీ లేదని, దాన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. 2023 నాటికి 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు దానికి తగినన్ని బ్లాక్‌లు కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు. మరోవైపు, 334 నాన్–క్యాప్టివ్ ఖనిజ గనుల లీజు ఈ ఏడాది మార్చి 31తో ముగిసిపోనుంది. ఇవి మూతబడితే దాదాపు 60 మిలియన్ టన్నుల ముడి ఇనుము కొరత ఏర్పడవచ్చని జోషి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఉత్పత్తికి కోత పడకుండా గడువులోగా ఖనిజాల గనుల వేలాన్ని కూడా నిర్వహించాలని.. బిడ్డింగ్‌లో గెలుపొందిన సంస్థకు ఇతరత్రా అటవీ, పర్యావరణ అనుమతులు కూడా బదలాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. దీని వల్ల రెండేళ్ల సమయం ఆదా అవుతుందని, ఎలాంటి అవరోధాలు లేకుండా ఉత్పత్తి యథాప్రకారంగా కొనసాగుతుందని చెప్పారు. అత్యంత భారీ సంస్కరణలు: ప్రధాన్ వాణిజ్య అవసరాల కోసం బొగ్గు ఉత్పత్తి చేసేందుకు 2018లో ప్రైవేట్ కంపెనీలకూ అనుమతినిచ్చినప్పటికీ.. బొగ్గుపరిశ్రమయేతర సంస్థలను వేలంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించలేదు. తాజా మార్పుచేర్పులు బొగ్గు పరిశ్రమలో అత్యంత భారీ సంస్కరణలని చమురు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభివర్ణించారు. కేంద్ర నిర్ణయాన్ని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్ స్వాగతించారు. ‘ఏటా 15 బిలియన్ డాలర్లకు పైగా ఉంటున్న బొగ్గు దిగుమతులను తగ్గించుకోవడానికి గణనీయంగా ఉపయోగపడుతుంది. చమురు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గుల తరుణంలో.. ఇంధన రంగంలో భారత్ స్వయం సమృద్ధికి తోడ్పడుతుంది‘ అని జిందాల్ చెప్పారు. అంతిమ వినియోగంపై ఆంక్షల ఎత్తివేత నిర్ణయం.. దేశీయంగా బొగ్గు నిల్వల వెలికితీతకు, మరిన్ని విదేశీ సంస్థలు ఇన్వెస్ట్ చేసేందుకు తోడ్పడగలదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ చెప్పారు. బొగ్గు మైనింగ్ ఆర్డినెన్స్‌ను ఉక్కు పరిశ్రమ స్వాగతించింది. బొగ్గు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇది తోడ్పడగలదని ఇండియన్ స్టీల్ అసోసియేషన్ పేర్కొంది. ఈ సంస్కరణల ఊతంతో దేశీ ఉక్కు పరిశ్రమ .. అంతర్జాతీయ స్థాయిలో మరింతగా పోటీపడగలదని తెలిపింది. నీలాచల్ ఇస్పాత్ విక్రయానికీ గ్రీన్‌సిగ్నల్.. ఉక్కు సంస్థ నీలాచల్ ఇస్పాత్ నిగమ్ (ఎన్ఐఎన్ఎల్)లో ఆరు ప్రభుత్వ రంగ సంస్థల వాటాల వ్యూహాత్మక విక్రయానికి కూడా కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ విషయాన్ని తెలిపారు. ఎన్ఐఎన్ఎల్లో ఎంఎంటీసీ, ఎన్ఎండీసీ, బీహెచ్ఈఎల్, ఎంఈసీవోఎన్, ఐపీఐసీవోఎల్, ఒడిషా మైనింగ్ కార్పొరేషన్లకు వాటాలు ఉన్నాయి. మరోవైపు, నీలాచల్ ఇస్పాత్‌లో వాటాల విక్రయ ప్రతిపాదనను ఉక్కు రంగ కార్మికుల సమాఖ్య ఎస్‌డబ్ల్యూఎఫ్‌ఐ ఖండించింది. భూషణ్ స్టీల్, ఆధునిక్ స్టీల్ వంటి ప్రైవేట్ రంగ సంస్థలు మూతబడుతుంటే ప్రభుత్వ రంగంలోని సంస్థలు మెరుగ్గానే పనిచేస్తున్నాయని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ పి.కె. దాస్ చెప్పారు. వాటాల విక్రయ ప్రతిపాదనలను ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే కార్మికులు సమ్మెకు దిగేందుకు సిద్ధమని తెలిపారు. -
సీడీఎస్‌గా బిపిన్ రావత్
న్యూఢిల్లీ: దేశ మొట్టమొదటి రక్షణ బలగాల అధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, సీడీఎస్)గా జనరల్ బిపిన్ రావత్‌ను కేంద్రప్రభుత్వం నియమించింది. ఈ నియామకం డిసెంబర్ 31(నేటి)నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని నియామకాల కేబినెట్ కమిటీ సీడీఎస్‌గా రావత్ నియామకానికి సోమవారం ఆమోదం తెలిపిందని ఓ అధికారి చెప్పారు. కార్గిల్ యుద్ధం సమయంలో త్రివిధ దళాల్లో కనిపించిన సమన్వయలోపం నేపథ్యంలో సీడీఎస్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అప్పటినుంచి దాదాపు 20 ఏళ్లుగా ఫైళ్లలోనే మగ్గుతున్న సీడీఎస్‌ను ఇటీవల కేంద్రం కార్యరూపంలోకి తెచ్చింది. సైన్యం, నావికా, వైమానిక దళాలను సమన్వయపరుస్తూ సైనిక సంబంధిత విషయాల్లో రక్షణమంత్రికి సలహాదారుగా వ్యవహరించడం సీడీఎస్ ప్రధాన బాధ్యత. దళాధిపతితో సమాన హోదా, వేతనం, ఇతర సౌకర్యాలు సీడీఎస్‌కు ఉంటాయి. రక్షణ శాఖలో కొత్తగా ఏర్పాటయ్యే డిపార్ట్మెంట్ ఆఫ్ మిలటరీ ఎఫైర్స్(డీఎంఏ) కార్యదర్శిగా సీడీఎస్ వ్యవహరిస్తారు. ఆర్మీ, నేవల్, ఎయిర్, డిఫెన్స్ స్టాఫ్ ప్రధాన కార్యాలయాలు డీఎంఏలోనే ఉంటాయి. చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి సీడీఎస్ శాశ్వత చైర్మన్‌గా ఉంటారు. త్రివిధ దళాలకు చెందిన వివిధ విభాగాల పరిపాలన బాధ్యతలు చూస్తుంటారు. రక్షణ మంత్రి నేతృత్వంలోని రక్షణ శాఖ కొనుగోళ్ల మండలిలో, ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో నడిచే డిఫెన్స్ ప్లానింగ్ కమిటీలో సీడీఎస్ సభ్యునిగా ఉంటారు. అణు కమాండింగ్ అథారిటీకి మిలటరీ అడ్వైజర్‌గా ఉంటారు. అయితే, బలగాలకు ఆదేశాలిచ్చే అధికారం సీడీఎస్‌కు ఉండదు. 1978లో గూర్ఖా రైఫిల్స్‌లో చేరిన రావత్ 2016 డిసెంబర్ 31వ తేదీన ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టి, మూడేళ్ల పూర్తి కాలం కొనసాగారు. జనరల్ బిపిన్ రావత్ ఆర్మీ చీఫ్‌గా మంగళవారం రిటైర్ కావాల్సి ఉంది. ఆర్మీ చీఫ్ కాకమునుపు జనరల్ రావత్ ఈశాన్య రాష్ట్రాలతోపాటు పాక్, చైనా సరిహద్దుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. -
‘ఎన్పీఆర్’కు కేబినెట్ ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై ఒకవైపు తీవ్రస్థాయిలో ఆందోళనలు చెలరేగుతున్న తరుణంలోనే.. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ మంగళవారం జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్– ఎన్పీఆర్)ను తాజాగా సవరించేందుకు(అప్డేట్) రూ. 3,941.35 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 2020 ఏప్రిల్– సెప్టెంబర్ మధ్య జరిగే ‘జనగణన – 2021’ తొలి దశతో పాటు ఎన్పీఆర్ను అప్డేట్ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. దేశంలోని ‘సాధారణ నివాసుల’ వివరాలను ఈ ఎన్పీఆర్లో నమోదు చేస్తారు. ఆరు నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు ఒక చోట నివాసం ఉన్న వ్యక్తి లేదా కనీసం రానున్న ఆరునెలలు ఒక ప్రాంతంలో నివాసం ఉండాలని నిర్ణయించుకున్న వ్యక్తిని ‘సాధారణ నివాసి’గా పరిగణిస్తారు. మొదట 2010లో జాతీయ జనాభా పట్టికను రూపొందించగా, 2015లో ఇంటింటి సర్వే ద్వారా దీన్ని అప్డేట్ చేశారు. 2021 జనాభా గణనకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో.. జనాభా పట్టికను సవరించేందుకు తాజాగా నిర్ణయం జరిగింది. అస్సాం మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఎన్నార్సీతో సంబంధం లేదు ఎన్పీఆర్ను 2010లోనే రూపొందించారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. యూపీఏ హయాంలో పౌరసత్వ చట్టం–1955 లోని నిబంధనల కింద 2010లోనే ఎన్పీఆర్ ప్రక్రియ ప్రారంభమైందని, 2015లో ఒకసారి అప్డేట్ అయిందని వివరించారు. అప్పుడు ఆధార్‌తో అనుసంధానం చేశారన్నారు. తాజాగా, ఆ జాబితాను అప్డేట్ చేస్తున్నామని వివరించారు. ఎన్పీఆర్ ఆధారంగానే ఎన్నార్సీ(జాతీయ పౌర పట్టిక) ప్రక్రియ చేపడ్తారన్న ఆందోళనలను ఆయన తోసిపుచ్చారు. ఎన్పీఆర్కు ఎన్సార్సీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీ నిర్ణయాలను మరో మంత్రి పియూష్ గోయల్‌తో కలిసి ఆయన వెల్లడించారు. ‘ఎన్పీఆర్ ప్రక్రియలో ఎలాంటి ధ్రువీకరణలు సమర్పించాల్సిన అవసరం లేదు. అలాగే బయోమెట్రిక్ ముద్రలు కూడా అవసరం లేదు. ఇదొక స్వీయ ధ్రువీకరణ వంటిదే. కేంద్ర సంక్షేమ పథకాలను అవసరమైన వారందరికీ చేర్చే లక్ష్యంతో ఈ ఎన్పీఆర్ ప్రక్రియ ఉంటుంది. గతంలో మాదిరిగా పెద్ద దరఖాస్తు నింపాల్సిన పనేమీ లేదు. మొబైల్ యాప్ ద్వారా సులువుగా నింపే వెసులుబాటు ఉంటుంది’ అని వెల్లడించారు. అయితే, జనగణన కమిషనర్ అధికారిక వెబ్సైట్లో మాత్రం ఎన్పీఆర్ కోసం బయోమెట్రిక్ వివరాలను కూడా సేకరిస్తామని ఉండటం గమనార్హం. గతంలో తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాలు ఎన్పీఆర్ డేటాను సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించేందుకు ఉపయోగించుకున్నాయని జవదేకర్ గుర్తు చేశారు. ఎన్పీఆర్ డేటాను ఆయుష్మాన్భారత్, ప్రధానమంత్రి ఆవాస్‌యోజన, ఉజ్వల, సౌభాగ్య తదితర కేంద్ర పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఉపయోగిస్తామన్నారు. పశ్చిమబెంగాల్, కేరళసహా కొన్ని బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలు ఎన్పీఆర్ కార్యక్రమంలో పాలు పంచుకోబోమని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేయగా.. ‘ఈ ప్రక్రియకు సంబంధించి అన్ని రాష్ట్రాలు నోటిఫికేషన్లను విడుదల చేశాయి. దీనికి సంబంధించి అధికారులకు శిక్షణనివ్వడం కూడా ప్రారంభించాయి’ అని జవదేకర్ సమాధానమిచ్చారు. ఎన్నార్సీకి ఎన్పీఆర్తో లింక్: కాంగ్రెస్ ఎన్నార్సీకి ఎన్పీఆర్తో లింక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ చర్య రాజ్యాంగంలోని లౌకికభావనకు భంగకరమని కాంగ్రెస్ పేర్కొంది. ఎన్పీఆర్కు, ఎన్నార్సీకి ఏమాత్రం సంబంధం లేదంటూ హోం మంత్రి అమిత్‌షా చేస్తున్న ప్రకటన..ఎన్నార్సీపై పార్లమెంట్లో చర్చించలేదంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్య కంటే పెద్ద అబద్ధమని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ విమర్శించారు. ఎన్నార్సీకి మొదటి మెట్టు ఎన్పీఆర్ అంటూ హోం శాఖ తన వార్షిక నివేదికలో తెలిపిందన్నారు. 2021లో జనగణనతోపాటుగా ఎన్పీఆర్ చేపట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘జనగణన’కు ఆమోదం దేశ జనాభాను లెక్కించేందుకు ఉద్దేశించిన జనగణన– 2021 కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు రూ. 8,754.23 కోట్ల అంచనా వ్యయాన్ని ఆమోదించింది. ఇది దేశంలో జరిగే 16వ జనగణన. స్వాతంత్య్రం వచ్చాక జరుగుతున్న 8వ జనగణన. ఈ జనగణన దేశమంతటా చేస్తారు. జనగణన రెండు విడతలుగా జరుగనుంది. తొలి దశలో 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు కుటుంబాల గణన, 2021 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు మొత్తం జనాభా గణన ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా డేటా సేకరిస్తుండడంతో జనగణన వివరాలను ప్రకటించే అవకాశముంది. -
కేంద్రం మరో సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : ఒకవైపు దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్ఆర్సీ ప్రకంపనల తీవ్రత కొనసాగుతుండగానే కేంద్రం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్- ఎన్పీఆర్) రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) నవీకరించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ఇందుకు రూ. 8700 కోట్లను కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఈ ప్రతిపాదనను ఆమోదించిందిందని పీటీఐ నివేదించింది. మొదట ఎన్పీఆర్ను రూపొందించి ఆ తర్వాత ఎన్ఆర్సీ అమలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ భావిస్తోంది. ఒకసారి ఎన్పీఆర్ తయారైన తరువాత దాని ఆధారంగా జాతీయ పౌర పట్టిక (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్-ఎన్ఆర్సీ)ని రూపొందించనుంది.దేశంలోని నిజమైన పౌరుల వివరాలు సేకరించడమే ఎన్పీఆర్ లక్ష్యం. ప్రజలందరి వేలి ముద్రలు సేకరించడం, అందరికీ పౌరసత్వ గుర్తింపు కార్డులు ఇస్తారు. అసోం మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 2020 ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య ఎన్పీఆర్ ప్రక్రియ జరగనుంది. దేశంలోని ప్రతి "సాధారణ నివాసి" సమగ్ర గుర్తింపు డేటాబేస్‌ను రూపొందించడం ఎన్పీఆర్ లక్ష్యం అని సెన్సస్ కమిషన్ తెలిపింది. -
పౌరసత్వ బిల్లుకు కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ ముసాయిదా బిల్లుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లో మతపరమైన వేధింపులు, వివక్షను ఎదుర్కొంటూ భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. భారత్ లౌకికత్వానికి ఈ మతతత్వ బిల్లు వ్యతిరేకమని అవి వాదిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వలసలు అధికంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఈ ప్రతిపాదనపై ఆగ్రహంతో ఉన్నారు. మూడు ఇస్లామిక్ దేశాల నుంచి శరణార్ధులుగా వచ్చిన వారిలో హిందువులే అత్యధికంగా ఉంటారు. ముస్లిమేతరులకు పౌరసత్వమిచ్చి వారికి ఎన్నార్సీ నుంచి రక్షణ కల్పించాలని బీజేపీ భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అక్రమ వలసదారులను గుర్తించి, దేశం నుంచి పంపించేందుకు వీలుగా జాతీయ పౌరపట్టిక (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్‌షిప్–ఎన్నార్సీ)ను సిద్ధం చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. దేశ ప్రయోజనాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పౌరసత్వ బిల్లు రూపకల్పన సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ బిల్లును నేడు కానీ, రేపు కానీ సభలో ప్రవేశపెట్టి, వచ్చే వారం సభ ఆమోదం పొందేలా చూడాలని కేంద్రం ఆలోచిస్తోంది. తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్, టీఎంసీ ఈ బిల్లున వ్యతిరేకిస్తున్నాయి. మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడం భారత లౌకిక భావనకు వ్యతిరేకమని కాంగ్రెస్ నేత శశి థరూర్ విమర్శించారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని కాంగ్రెస్ నేత, అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ తెలిపారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 12 మంది ఎంపీలు మోదీకి లేఖ రాశారు. లోక్‌సభలో బీజేపీకి ఉన్న మెజారిటీ దృష్ట్యా అక్కడ ఈ బిల్లు ఆమోదం పొందడం సమస్య కాబోదుగానీ, రాజ్యసభలో విపక్షం ఈ బిల్లును అడ్డుకునే అవకాశముంది. గత ప్రభుత్వం ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టింది. అప్పుడు లోక్‌సభలో గట్టెక్కింది. కానీ, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో నిరసనలు చోటు చేసుకోవడంతో రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టలేదు. ఆ తరువాత ఆ ప్రభుత్వ పదవీకాలం ముగిసింది. కేబినెట్ నిర్ణయాల్లో మరికొన్ని.. ► వ్యక్తిగత డేటా ప్రొటెక్షన్ బిల్లుకు ఆమోదం. డేటా సేకరణ, నిల్వ, వినియోగం, సంబంధిత వ్యక్తుల ఆనుమతి, ఉల్లంఘనలకు జరిమానా, శిక్ష.. తదితరాలకు సంబంధించిన సమగ్ర విధి, విధానాలతో బిల్లును రూపొందించారు. ► కేంద్ర సంస్కృత యూనివర్సిటీల ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం. మూడు డీమ్డ్ సంస్కృత యూనివర్సిటీలను సెంట్రల్ యూనివర్సిటీలుగా మార్చేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ► ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 3.7 ఎకరాల స్థలాన్ని ఐటీడీసీ(ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్), ఐటీపీఓ(ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్)లకు రూ. 611 కోట్లకు 99 ఏళ్ల పాటు లీజుకు అప్పగించే ప్రతిపాదనకు ఆమోదం. ఈ స్థలంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్, ఫైవ్‌స్టార్ హోటల్‌ను నిర్మిస్తారు. 2021లోగా ఈ నిర్మాణం పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ► జమ్మూకశ్మీర్‌లో ఆర్థికంగా వెనకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఉపసంహరించేందుకు ఆమోదం. ఇటీవలి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆ అంశం ఉండటంతో ఈ బిల్లును వెనక్కు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. లోక్‌సభ, అసెంబ్లీల్లో రిజర్వేషన్ల పొడిగింపునకు ఆమోదం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ సభ్యుల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు(ఎస్సీ, ఎస్టీ) రిజర్వేషన్లను పొడిగించే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు జనవరి 25, 2020తో ముగియనుండగా, వాటిని జనవరి 25, 2030 వరకు పొడిగించేందుకు నిర్ణయించారు. అయితే, ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లను పొడిగించే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ప్రస్తుతానికి వారికి రిజర్వేషన్లను పొడిగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలుస్తోంది. ఈ విషయమై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను మీడియా ప్రశ్నించగా, బిల్లును సభలో ప్రవేశపెట్టినప్పుడు అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ప్రస్తుతం పార్లమెంట్లో ఎస్సీ సభ్యులు 84 మంది, ఎస్టీ సభ్యులు 47 మంది ఉన్నారని జవదేకర్ వెల్లడించారు. రాష్ట్రాల శాసనసభల్లో 614 ఎస్సీ, 554 ఎస్టీ సభ్యులున్నారన్నారు. ఏమిటీ బిల్లు? పౌరసత్వ చట్టం, 1955కి తాజాగా కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ కొత్త బిల్లు ప్రకారం పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లలో నివసిస్తూ మత పరమైన హింస, వేధింపుల్ని ఎదుర్కొంటున్న ఆరు వర్గాలకు భారత పౌరసత్వాన్ని కల్పించడానికి వీలుగా చట్టానికి సవరణలు చేస్తున్నారు. హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, పార్సీలు, జైనులు, బుద్ధులకు ఈ కొత్త సవరణ చట్టం ప్రకారం మన దేశ పౌరసత్వం లభిస్తుంది. వీరంతా భారత్‌లో ఉంటూ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, ఆ పత్రాల గడువు తేదీ ముగిసిపోయినా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఆరు వర్గాల్లో ముస్లింలు లేకపోవడం మైనారిటీల్లో అసంతృప్తి రాజేస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో.. బంగ్లాదేశ్ నుంచి భారీ సంఖ్యలో హిందువులు కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా దేశంలోని ఈశాన్యరాష్ట్రాల్లో ప్రవేశించారు. ఇప్పుడు వారందరికీ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా పౌరసత్వం వస్తుంది. ఇప్పటికే అసోం పౌర రిజిస్టర్ ద్వారా ఎందరో దేశ పౌరసత్వాన్ని కోల్పోయారు. దశాబ్దాల తరబడి ఈ రాష్ట్రాల్లో ఉంటున్న మైనారిటీల భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళన నెలకొంది. పార్లమెంటులో బిల్లు గట్టెక్కుతుందా? లోక్‌సభలో ఈ బిల్లుని మొదట 2016లో ప్రవేశపెట్టారు. అధికార బీజేపీకి అసోంలో మిత్రపక్షమైన అసోం గణ పరిషత్(ఏజీపీ) అప్పట్లో దీనిని వ్యతిరేకించింది. కొన్ని సవరణలతో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో ఎన్డీయే ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నందున దీనిపై వ్యతిరేకత వచ్చినా ఆమోద ముద్ర పడుతుంది. ఇక రాజ్యసభలో మాత్రం జేడీ(యూ), అకాలీదళ్ వంటి పార్టీల మద్దతు లేకుండా బిల్లు గట్టెక్కలేదు. రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసుకునేందుకు హోంమంత్రి అమిత్ పలు పార్టీలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. బిల్లుకు అనుకూలం బీజేపీ, అకాలీదళ్, ఏఐఏడీఎంకే బిల్లుకి ప్రతికూలం కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, ఆర్జేడీ, వామపక్ష పార్టీలు, మరికొన్ని ప్రాంతీయ పార్టీలు -
పౌరసత్వ బిల్లుకు మంత్రిమండలి ఓకే..
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద పౌరసత్వ (సవరణ) బిల్లు, 2016కు కేంద్ర మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది. మంత్రిమండలి ఆమోద ముద్ర లభించడంతో ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే హోంమంత్రి ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. పౌరసత్వ బిల్లుపై హోంమంత్రి అమిత్ షా గత రెండు రోజులుగా ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులతో విస్తృతంగా సంప్రదింపులు చేపట్టారు. బిల్లుపై పలువురు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేసే కసరత్తు సాగించారు. కాగా ఈ బిల్లును పొరుగు దేశాల నుంచి వలస వచ్చే ముస్లిమేతర శరణార్ధులకు పౌరసత్వం కల్పించే దిశగా రూపొందించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.ఇక ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో పౌరసత్వ బిల్లు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పౌరసత్వ బిల్లుతో పాటు వచ్చే ఏడాది జనవరి 25తో ముగియనున్న చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను మరో పదేళ్లకు పొడిగించే నిర్ణయానికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. -
ఈజిప్టు నుంచి 6వేల టన్నుల ఉల్లి
న్యూఢిల్లీ: దేశీయంగా ఉన్న కొరత, పెరుగుతున్న ధరను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈజిప్టు నుంచి 6వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోనుంది. దీనిని కిలో రూ.52–60 స్థాయిలో రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. సుమారు 1.2 లక్షల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోవాలని గత వారం కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ‘ఈజిప్టు నుంచి మొదటి విడతగా 6,090 టన్నుల ఉల్లి కొనుగోలు చేయాలని నిర్ణయించాం. కావాలనుకున్న రాష్ట్రాలు డిసెంబర్ మొదటి వారం నుంచి ఈ స్టాకును తీసుకెళ్లవచ్చునన్నారు. -
ప్రైవేట్...‘సై’రన్
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో మందగమనం నేపథ్యంలో ఆదాయాన్ని పెంచుకునే దిశగా కేంద్రం భారీ స్థాయిలో ప్రైవేటీకరణకు తెరతీసింది. పలు ప్రభుత్వ రంగ దిగ్గజాల్లో (పీఎస్‌యూ) డిజిన్వెస్ట్‌మెంట్ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చమురు దిగ్గజం బీపీసీఎల్, షిప్పింగ్ సంస్థ ఎస్సీఐ, కార్గో సేవల సంస్థ కాన్‌కర్‌లో వాటాల విక్రయానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో పాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను 51 శాతం లోపునకు తగ్గించుకునే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. దీని ప్రకారం, దేశీయంగా రెండో అతి పెద్ద రిఫైనర్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)లో కేంద్రం తనకున్న మొత్తం 53.29% వాటాలను విక్రయించడంతో పాటు యాజమాన్య అధికారాలను కూడా బదలాయించనుంది. ఇందులో నుమాలిగఢ్ రిఫైనరీని మినహాయించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రైవేటీకరణపై ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళన తలెత్తకుండా చూసేందుకు దీన్ని ప్రభుత్వ రంగ చమురు సంస్థ పరిధిలోకి చేర్చనున్నట్లు ఆమె వివరించారు. మరోవైపు, కార్పొరేట్ ట్యాక్స్‌ను 22 శాతానికి తగ్గిస్తూ ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ స్థానంలో ప్రత్యేక బిల్లును క్యాబినెట్ ఆమోదించింది. దీన్ని ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు, ఇతర ఊరట చర్యల కారణంగా ప్రభుత్వానికి ఏటా రూ. 1.45 లక్షల కోట్ల మేర ఆదాయం తగ్గనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 1.05 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. క్యాబినెట్ నిర్ణయాల్లో ముఖ్యాంశాలు.. ► షిప్పింగ్ కార్పొరేషన్(ఎస్సీఐ)లో మొత్తం 63.75% వాటాలను.. అలాగే కంటెయినర్ కార్పొరేషన్(కాన్కర్)లో 30.9% వాటాలు ప్రభుత్వం విక్రయించనుంది. ప్రస్తుతం కాన్‌కర్‌లో కేంద్రానికి 54.80 శాతం వాటాలు ఉన్నాయి. ► టీహెచ్‌డీసీ ఇండియా, నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (నీప్కో)లో మొత్తం వాటాలను ఎన్టీపీసీకి కేంద్రం విక్రయించనుంది. ► నియంత్రణ అధికారాలు తనకే ఉండే విధంగా.. ఇండియన్ ఆయిల్(ఐవోసీ)లో వాటాలను 51% లోపునకు తగ్గించుకోనుంది. ఇందులో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకున్న వాటాల కారణంగా నియంత్రణాధికారాలు కేంద్రానికే ఉంటాయి. ఐవోసీలో కేంద్రానికి ప్రస్తుతం 51.5% వాటా ఉండగా... 26.4% వాటాలను దాదాపు రూ. 33,000 కోట్లకు విక్రయించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ► కాంట్రాక్టర్లు, ప్రభుత్వ సంస్థలకు మధ్య నెలకొనే చెల్లింపుల వివాదాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భాల్లో ప్రభుత్వ సంస్థలు ఆర్బిట్రేషన్ ఉత్తర్వులను సవాల్ చేసినా.. చెల్లించాల్సి న మొత్తంలో 75%(బ్యాంకు పూచీకత్తుకు ప్రతి గా) కాంట్రాక్టరుకు చెల్లించేందుకు ఓకే చెప్పింది. టెల్కోలకు ఊరట.. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న టెలికం కంపెనీలకు ఊరటనిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. టెల్కోలు కట్టాల్సిన స్పెక్ట్రం చెల్లింపులకు సంబంధించి రెండేళ్ల పాటు మారటోరియం విధించింది. 2020–21, 2021–22 సంవత్సరాల్లో జరపాల్సిన చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. దీంతో భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో సంస్థలకు సుమారు రూ. 42,000 కోట్ల మేర ఊరట లభించనుంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) వివాదంలో ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో టెల్కోలు..దాదాపు 1.4 లక్షల కోట్ల మేర లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు కట్టాల్సి రానున్న సంగతి తెలిసిందే.