
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకంగా భావిస్తున్న ‘ఆయుష్మాన్ భారత్’ను ప్రారంభించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఈ పథకం ద్వారా ఏటా 10 కోట్ల పేద కుటుంబాలకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలని సంకల్పించిన సంగతి తెలిసిందే. అలాగే, పట్టు పరిశ్రమ అభివృద్ధికి రూ.2,161 కోట్లు కేటాయించడానికి సమ్మతించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం కేంద్ర నిధులతో అమలవుతున్న రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన(ఆర్‌ఎస్‌బీవై), సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీం(ఎస్‌సీహెచ్‌ఐఎస్) పథకాలను ఆయుష్మాన్ భారత్‌లో విలీనం చేయనున్నారు.
ఇతర నిర్ణయాలు..
దేశంలో సెరీకల్చర్‌ను ప్రోత్సహించడానికి పట్టు పరిశ్రమ అభివృద్ధికి వచ్చే రెండేళ్లలో రూ.2,161.68 కోట్లు వెచ్చించాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే ఈ రంగంలో ఉత్పాదక ఉద్యోగుల సంఖ్య 85 లక్షల నుంచి కోటికి పెరిగే అవకాశాలున్నాయి.
► ఓబీసీల ఉపవర్గీకరణపై ఏర్పాటైన జస్టిస్ జి.రోహిణి కమిటీ పదవీ కాలం జూన్ 20 వరకు పొడిగింపు.
► వాణిజ్య సరోగసీని నిషేధించి, షరతులకు లోబడి పిల్లలు లేని దంపతులకు నైతిక సరోగసీకి వీలుకల్పించేలా చట్టంలో సవరణ చేయడానికి ఆమోదం.
Comments
Please login to add a commentAdd a comment