న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం గురువారం సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. కుంభకోణాలతో అప్రతిష్ట మూట గట్టుకున్న భారత వైద్య మండలి (ఎంసీఐ – మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) పాలనా వ్యవహారాలు చూసేందుకు కమిటీని నియమిస్తూ గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్‌ను కేంద్రం మరోసారి ఇచ్చింది.
గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్ చట్టం రూపం దాల్చాల్సి ఉండగా, అది పార్లమెంటులో పెండింగ్‌లో ఉంది. జాతీయ మెడికల్ కమిషన్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే ఎంసీఐ స్థానంలో కొత్త సంస్థ ఏర్పాటవుతుంది. తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ సెప్టెంబర్‌లో ఇచ్చిన ఆర్డినెన్స్ గడువు మరో పది రోజుల్లో తీరిపోనుండటంతో, ఆ ఆర్డినెన్స్‌ను కేంద్రం మరోసారి ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment