Ordinances
-
ఆ 3 ఆర్డినెన్స్‌లు వ్యవసాయానికి దండగే
న్యూఢిల్లీ : పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లో రైతన్నలు నిరసన బాట పట్టారు. 14 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో గిట్టుబాటు ధరలకి సంబంధించిన మూడు ఆర్డినెన్స్‌లకు చట్టరూపం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉండడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆర్డినెన్స్‌లతో వ్యవసాయ రంగాన్ని మోదీ సర్కార్ కార్పోరేటీకరణ చేస్తోందని మండిపడుతున్నారు. అవి చట్టరూపం దాలిస్తే తాము అప్పుల ఊబిలో కూరుకుపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమావేశాల మొదటి రోజైన సోమవారం దేశవ్యాప్తంగా ఆర్డినెన్స్‌లపై నిరసన గళాన్ని వినిపించాలని అఖిల భారత రైతు సమన్వయ కమిటీ జాతీయ కన్వీనర్ వీఎం సింగ్ పిలుపునిచ్చారు. ఏమిటీ ఆర్డినెన్స్‌లు? కేంద్ర ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో నిత్యావసర సరుకుల(సవరణ) ఆర్డినెన్స్, రైతుల(సాధికారత, పరిరక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద ఆర్డినెన్స్, రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య(ప్రోత్సాహక, సులభతర) ఆర్డినెన్స్‌లను తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్‌లతో రైతులు పండించే పంటలకు ఎక్కువ ధర వస్తుందని, రైతులు తమ పంటల్ని దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా అమ్ముకునే వీలు ఉంటుందని కేంద్రం చెబుతోంది. కాంట్రాక్ట్ వ్యవసాయం చట్టబద్ధమవుతుందని, రైతులే పారిశ్రామికవేత్తలుగా మారవచ్చునని అంటోంది. అయితే రైతులు వీటిని వ్యతిరేకిస్తున్నారు. కనీస మద్దతు ధర నిర్ణయించకుండా వ్యవసాయ రంగంలో సంస్కరణలు సాధ్యం కాదని వీఎం సింగ్ చెప్పారు. కాంట్రాక్ట్ వ్యవసాయానికి చట్టబద్ధత అన్నది మన దేశంలో చెరుకు రైతుల విషయంలో ఒక విఫల ప్రయోగంగా మిగిలిపోయిందని గుర్తు చేశారు. అసంఘటిత రంగంలో ఉండే రైతాంగానికి ఈ ఆర్డినెన్స్‌లు మేలు చేయవన్నారు. వ్యవసాయానికి మృత్యుఘంటికలు : కాంగ్రెస్ ఆర్డినెన్స్‌లపై పోరుబాట పట్టిన రైతన్నలకు కాంగ్రెస్ అండగా నిలిచింది. ఆ ఆర్డినెన్స్‌లు రైతు వ్యతిరేకమని ఆరోపించింది. కార్పోరేట్ రంగాన్ని మోదీ సర్కార్ పెంచి పోషిస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ çసూర్జేవాలా ధ్వజమెత్తారు. -
పార్లమెంటులో హార్డ్‌కాపీలు ఉండవు
న్యూఢిల్లీ: వచ్చేనెలలో జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆర్డినెన్స్‌లకు సంబంధించి హార్డ్‌కాపీలను (కాగితాల రూపంలో) పంపిణీ చేయడం ఉండదని లోక్‌సభ సచివాలయం తెలిపింది. ప్రభుత్వం గడిచిన ఆరునెలల్లో తెచ్చిన పలు ఆర్డినెన్స్‌లు ఆమోదం కోసం పార్లమెంటు ముందుకు రానున్నాయి. ఎంపీలకు భౌతికంగా కాగితాలు అందజేస్తే... కరోనా వ్యాప్తి చెందే అవకాశాలుంటాయి కాబట్టి సాఫ్ట్‌కాపీలను అందజేస్తామని లోక్‌సభ సచివాలయం సోమవారం ఒక ప్రకటనలో వివరించింది. -
రాష్ట్రాల మీదికి ఎక్కుపెట్టిన త్రిశూలం
ఈనెల 3న కేంద్ర ప్రభుత్వం ఒకేరోజు మూడు ఆర్డినెన్సుల్ని ఆమోదించింది. రైతులకు మేలు చేసే, వ్యవసాయ రంగ రూపు మార్చే చారిత్రక ఆర్డినెన్సులుగా వీటిని పేర్కొన్నారు. మూడింట్లో ఒకటైన నిత్యావసర సరుకుల చట్టం సవరణ ఆర్డినెన్స్ అన్ని వ్యవసాయ సంబంధ ఉత్పత్తులను నిత్యావసర సరుకుల జాబితా నుంచి తొలగిస్తుంది. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో ఏ వ్యవసాయ ఉత్పత్తినైనా అత్యవసరమైనదిగా పేర్కొనే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం కలిగివుంటుంది. అయితే, వ్యవసాయరంగంలో పెట్టుబడిదారులను నిరుత్సాహపరచకుండా, ఎగుమతిదారుల నిల్వల పరిమితిని దీన్నుంచి మినహాయించినట్టు తెలిపింది. ఉత్పత్తి, నిల్వల, రవాణా, పంపిణీలపై స్వేచ్ఛ ఇవ్వడం వల్ల వ్యవసాయ రంగంలోకి ప్రైవేటు రంగాన్నీ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులనూ పెద్దస్థాయిలో ఆకర్షించవచ్చనీ; భావిస్తోంది ప్రభుత్వం. ఈ ఎస్మా ఆర్డినెన్స్ వల్ల ధరలు స్థిరీకరించబడి, వ్యాపారులు, వినియోగదారులకు మేలు కలుగుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఇది ప్రాథమికంగా వ్యాపారులకు మేలు చేసేదే. ఇక రెండవదైన, వ్యవసాయ రంగ ఉత్పత్తుల అమ్మకం, వాణిజ్యం ఆర్డినెన్స్ రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ చట్టాలు సూచించిన భౌతిక ఆవరణల బయట రాష్ట్ర అంతర్గత, అంతర్రాష్ట్ర వాణిజ్యంలో ఉన్న ఆటంకాలను తొలగించడానికి ఉద్దేశించినది. దేశంలో విస్తారంగా క్రమబద్ధీకరించిన వ్యవసాయ మార్కెట్లను తెరిచే దిశగా ఇదొక చారిత్రక అడుగుగా ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఇది ప్రాథమికంగా ‘మార్కెట్ ఆవరణల’ బయట వాణిజ్య అవకాశాలను సృష్టించడానికి ఉద్దేశించినది. ఇక మూడోది, ‘ద ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్ ఆర్డినెన్స్, 2020’. ఇది రైతులతో ఒప్పందాలు చేసుకునే ఏ థర్డ్ పార్టీకైనా ఒక జాతీయ ఫ్రేమ్‌వర్క్ సమకూర్చడం కోసం ఉద్దేశించింది. అంటే, కాంట్రాక్టు వ్యవసాయానికి చట్టబద్ధతను కల్పించడం. ఈ మూడు ఆర్డినెన్సులూ రైతులకు లబ్ధి చేకూర్చేవిగా ప్రభుత్వం చిత్రిస్తున్నప్పటికీ, ఇందులో ఏ ఒక్కటి కూడా రైతులకు మేలు చేయదు. ఇవి వ్యాపారులకు, ప్రత్యేకించి పెద్ద కంపెనీలకు లబ్ధి కలిగిస్తాయి. ఉమ్మడిగా ఈ మూడు అత్యవసరాదేశాలు రాష్ట్ర చట్టాల్నీ, మార్కెట్ కమిటీల్నీ కాదని రాష్ట్రాల అధికారాల్ని బలవంతంగా లాక్కునే లక్ష్యంతో తెచ్చినవి. ప్రణాళిక, నిధుల కేటాయింపు, అమలు తదితరాల్లో కేంద్ర ప్రభుత్వం భాగమైనప్పటికీ వ్యవసాయం ముఖ్యంగా రాష్ట్రాల పరిధిలోని అంశం. దీర్ఘకాలంగా వ్యవసాయ ఉత్పాదక కంపెనీలు, ముఖ్యంగా విత్తనాలు, రసాయన ఎరువుల కంపెనీలు వ్యవసాయ సంబంధ నిర్ణయాల్లో కేంద్రీకరణ ఉండటం తమకు లాభిస్తుందనే యోచనతో ఉన్నాయి. గత కొన్ని యేళ్లుగా మోడల్ చట్టాల ద్వారా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ వాణిజ్యంలో సంస్కరణల కోసం పట్టుబడుతోంది. ఈ శాసనాలతో పాటు ఇంకా ఇతరత్రా అన్ని కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీలను, ప్రాంత గుత్తాధిపత్యాలను నీరుగార్చడానికి ఉద్దేశించినవి. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత విధానం ‘మార్చి’, ఈ ‘నమూనా’ విధానంలోకి మారడానికి మొగ్గుచూపవు. ఎందుకంటే వాటికి ఆదాయం సమకూర్చే ఆధారంలో కోతపడుతుంది. ఈ త్రిశక్తి ఆర్డినెన్సులు– వ్యవసాయ ఉత్పత్తులు, వాటి మార్కెట్ల మీద రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణనూ సంపూర్ణంగా తొలగించాలని ఆశిస్తున్నాయి. అత్యవసర ఉత్పత్తి అనే ట్యాగ్ తొలగించినప్పటకీ, రాష్ట్రాల మార్కెటింగ్ కమిటీ చట్టాల వల్ల వ్యాపారులు ఇప్పటికీ ఆటంకాలు ఎదుర్కోవచ్చు. అందుకోసమని రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఉండబోదని వ్యాపారులు, వ్యవసాయ కంపెనీలకు కేంద్రం విశ్వాసం కలిగించవచ్చు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయం నష్టపోతాయి. వ్యవసాయ ఉత్పత్తుల మీద వాటి ఆధిపత్యం తగ్గిపోతుంది. ఒక్కమాటలో, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడానికి ఏ మాత్రమూ వీలు లేకుండా చేయడంలో ఈ మూడు అత్యవసర ఆదేశాలు విజయం సాధిస్తాయి. కానీ, వినియోగదారులు(ఈ దేశానికి సంబంధించిన అందరు పౌరులు) ధరలు పెరగడాన్ని చూడాల్సిరావొచ్చు. ‘స్వేచ్ఛా వాతావరణం’లో వ్యవసాయ దిగుమతులు పెరగవచ్చు. ఈ దిగుమతులతో ఉత్పన్నమయ్యే పోటీలో, రైతులు నష్టపోవచ్చు.రాష్ట్రాల్లో వివిధ పార్టీలు అధికారంలో ఉన్న సందర్భంలో ఇది ఇక అధికార క్రీడ అవనుంది. బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. కానీ ఒకటి, ఈ అధికార పోరులో రైతులకు స్థానం లేదు. రైతులు ఎప్పుడూ పరిగణనలో లేరు, ఉండరు. కేంద్రం ఇప్పటికైతే ఈ త్రిశూల్ ద్వారా వ్యాపారులు, పెట్టుబడిదారులు, కంపెనీలు, అమ్మకందారులు అందరికీ సహకరించాలని నిర్ణయించుకుంది. ఇండియాను పారిశ్రామిక వ్యవసాయంలోకి నడిపించాలనుకునే ఈ శక్తిమంతమైన లాబీకి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తలొగ్గుతాయా? బహుశా అవునా కాదా అన్నదానికంటే ఎప్పుడు, ఎలా అనేదే విషయం కావొచ్చు. నరసింహారెడ్డి దొంతి – వ్యాసకర్త ఆర్థిక రంగ విశ్లేషకులు ఫోన్ : 0091–40–24077804 -
2025లోపు రామమందిరం: భయ్యాజీ
ప్రయాగ్‌రాజ్: అయోధ్యలో రామమందిర నిర్మాణం 2025లోపు పూర్తి అవుతుందని భావిస్తున్నట్లు రాష్ట్రీ య స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) జనరల్ సెక్రటరీ భయ్యాజీ జోషి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే మందిర నిర్మాణం ప్రారంభించాలన్నారు. ట్రిపుల్ తలాక్ అంశంపై ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లుగానే మందిర నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రామమందిర నిర్మాణంపై ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తుందని ప్రధాని మోదీ ఓ టీవీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాక భయ్యాజీ పైవిధంగా స్పందించారు. -
ఎంసీఐ, ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌లు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం గురువారం సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. కుంభకోణాలతో అప్రతిష్ట మూట గట్టుకున్న భారత వైద్య మండలి (ఎంసీఐ – మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) పాలనా వ్యవహారాలు చూసేందుకు కమిటీని నియమిస్తూ గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్‌ను కేంద్రం మరోసారి ఇచ్చింది. గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్ చట్టం రూపం దాల్చాల్సి ఉండగా, అది పార్లమెంటులో పెండింగ్‌లో ఉంది. జాతీయ మెడికల్ కమిషన్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే ఎంసీఐ స్థానంలో కొత్త సంస్థ ఏర్పాటవుతుంది. తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ సెప్టెంబర్‌లో ఇచ్చిన ఆర్డినెన్స్ గడువు మరో పది రోజుల్లో తీరిపోనుండటంతో, ఆ ఆర్డినెన్స్‌ను కేంద్రం మరోసారి ఇచ్చింది. -
‘అయోధ్య’పై త్వరలో శుభవార్త
న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించి త్వరలోనే భక్తులు ఓ శుభవార్త వింటారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం చెప్పారు. రామ మందిర నిర్మాణం కోసం రామ భక్తులు మరెన్నో రోజులు ఎదురు చూడాల్సిన అవసరం లేదన్నారు. ఉన్నత విద్య ప్రమాణాలపై హరిద్వార్‌లో జరిగిన జ్ఞానకుంభ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈసారి దీపావళి వేడుకలను రాముడి జన్మ స్థలంలో జరుపుకునేందుకు దక్షిణ కొరియా నుంచి ఓ ఉన్నత స్థాయి బృందం వస్తోందని చెప్పారు. జ్ఞానకుంభ్ కార్యక్రమంలోనే యోగా గురు బాబా రాందేవ్ మాట్లాడుతూ ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. మరోవైపు రామ మందిర నిర్మాణానికి వివిధ వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఆలయ నిర్మాణాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదని బీజేపీ నేతలైన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యలు వ్యాఖ్యానించారు. మరోవైపు రామాలయ నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు దాదాపు 3 వేల మంది సాధువులు, సన్యాసులు ఢిల్లీలోని తాల్కటోరా మైదానంలో శని, ఆదివారాల్లో సమావేశమయ్యారు. రామ మందిర నిర్మాణానికి ప్రభుత్వం కొత్త చట్టం లేదా ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని దేశంలో హిందూ సంస్థలకు నేతృత్వం వహిస్తున్న అఖిల భారతీయ సంత్ సమితి డిమాండ్ చేసింది. మరో కేంద్ర మంత్రి ఉమాభారతి ఢిల్లీలో మాట్లాడుతూ ‘హిందువులు ప్రపంచంలోనే అత్యంత సహనపరులు. అయితే అయోధ్యలో రామాలయ పరిసరాల్లో మసీదును కూడా కట్టాలనే మాటలు హిందువులను అసహనానికి గురిచేస్తాయి’ అని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తనతో కలిసి ఆలయానికి పునాది రాయి వేయాలని ఆమె ఆహ్వానించారు. -
‘రామ మందిర నిర్మాణానికి చట్టం తేవొచ్చు’
ముంబై: అయోధ్యలో రామమందిర నిర్మాణం వివాదం సుప్రీంకోర్టులో ఉండగానే ప్రభుత్వం చట్టం తెచ్చి ఆలయాన్ని నిర్మించేందుకు అవకాశం ఉందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ నిర్వహించిన సమావేశంలో జస్టిస్ చలమేశ్వర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ‘చట్టం ద్వారా ఆలయాన్ని నిర్మించొచ్చా? లేదా? అనేది ఒక అంశం. అసలు ఈ ప్రభుత్వం చట్టం తెచ్చి గుడిని కడుతుందా? లేదా? అనేది మరో అంశం. అయితే కొత్త చట్టం తీసుకురావడం ద్వారా సుప్రీంకోర్టులోని కేసుతో సంబంధం లేకుండా ఆలయాన్ని నిర్మించడం మాత్రం సాధ్యమే. సుప్రీంకోర్టు తీర్పుల నుంచి తప్పించుకోడానికి చట్ట ప్రక్రియను ప్రభుత్వాలు ఉపయోగించుకున్న సందర్భాలు గతంలో ఉన్నాయి’ అని చలమేశ్వర్ అన్నారు. -
‘ఎస్సీ, ఎస్టీ చట్టం’పై ఆర్డినెన్స్?
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టంలో మార్పులు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. ఆ తీర్పును రద్దు చేసేలా ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పునకు ముందున్న యథాస్థితికి ఆ చట్టాన్ని పునరుద్ధరించాలని కేంద్రం భావిస్తోంది. ఆర్డినెన్స్ జారీ ద్వారా సుప్రీంకోర్టు చేసిన మార్పుల్ని రద్దు చేసే అంశంపై ఇప్పటికే సమాలోచనలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై సాగుతున్న చర్చలపై ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ.. ‘ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా ఉద్రిక్తతల్ని తగ్గించవచ్చనే ఆలోచనలో కేంద్రం ఉంది. అలాగే సుప్రీంకోర్టు తీర్పును నిరోధించేలా జూలైలో జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై వేధింపుల నిరోధక చట్టం, 1989ను సవరించేలా బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది’ అని వెల్లడించాయి. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద తక్షణ అరెస్టుల నుంచి రక్షణ కల్పిస్తూ గత నెల 20న సుప్రీం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్డినెన్స్‌తో తక్షణ ఫలితం ‘ఒకసారి ఆర్డినెన్స్ జారీ చేస్తే.. ఆ తర్వాత దానిని బిల్లు రూపంలో మార్చి పార్లమెంటు ఆమోదం పొందవచ్చు. రెండింటి ఫలితాలు ఒకటే అయినా ఆర్డినెన్స్‌తో తక్షణం ఎస్సీ, ఎస్టీ చట్టం పూర్వపు స్థితిలో అమల్లోకి వస్తుంది. ఆర్డినెన్స్‌తో వెంటనే ఫలితాన్ని పొందవచ్చు. దేశంలో కొనసాగుతున్న నిరసనల్ని నియంత్రించవచ్చు’ అని ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ చట్టంలో మార్పులు చేస్తూ మార్చి 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దళిత, గిరిజన సంఘాలతో పాటు అనేక రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తీర్పును నిరసిస్తూ ఏప్రిల్ 2న దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్ బంద్ హింసాత్మకంగా మారడంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగారనివ్వబోమని శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ‘మనం పటిష్టంగా రూపొందించిన చట్టం ప్రభావితమయ్యేందుకు (సుప్రీంకోర్టు తీర్పు ద్వారా) అనుమతించమని మీకు హామీ ఇవ్వాలనుకుంటున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఇచ్చిన తీర్పు దేశానికి తీవ్ర నష్టం వాటిల్లేలా చేస్తుందని, సమీక్షించాలని ఇప్పటికే సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరిన విషయం విదితమే. ఇంకా నిర్ణయం తీసుకోలేదు: ప్రభుత్వం కాగా ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఆర్డినెన్స్ జారీకి ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై సుప్రీం తీర్పు ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రివ్యూ పిటిషన్‌తో తక్షణ ఫలితం రాకపోవచ్చని, అలాగే సుప్రీంకోర్టు నిర్ణయం సానుకూలంగా ఉండకపోవచ్చని.. అందువల్ల భవిష్యత్తు కార్యాచరణపై ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముందని భావిస్తున్నారు. వ్యతిరేకంగా వస్తే ఆర్డినెన్స్: పాశ్వాన్ దళితుల హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం బలహీనపరిచే చర్యల్ని ప్రభుత్వం అంగీకరించబోదని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌పై తీర్పు వ్యతిరేకంగా వచ్చిన పక్షంలో.. ఆర్డినెన్స్‌తో పాటు పలు ప్రత్యామ్నాయాల్ని కేంద్రం పరిశీలిస్తుందని చెప్పారు. ‘తీర్పు మాకు వ్యతిరేకంగా వస్తే.. ఆ తర్వాతి రోజే కేబినెట్ భేటీలో ఆర్డినెన్స్‌పై నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన న్యాయమూర్తుల అంశంపై మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టులో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఒక్క న్యాయమూర్తి కూడా లేరు. హైకోర్టుల్లో నామమాత్రంగా న్యాయమూర్తులు ఉన్నారు’ అని పేర్కొన్నారు. -
‘నయీమ్ ఎన్కౌంటర్ వెనుక చీకటికోణం’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటి వరకు జరగనంత అతిపెద్ద భూకుంభకోణానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన బినామీ జూపల్లి రామేశ్వరరావులు పాల్పడుతున్నారని కొడంగల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ.. అసైన్డ్ భూములపై ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకే హడావిడిగా అసెంబ్లీ సమావేశాన్ని ముగించారని తెలిపారు. లబ్దిదారులకు మేలు చేస్తున్నామన్న ముసుగులో ఆర్డినెన్స్ తేవాలని చూస్తున్నారని చెప్పారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయల భూదందాకు తెరలేపిందన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే తన ఆరోపణలపై స్పందించాలని సవాల్ విసిరారు. ఈ కుంభకోణంలో కేసీఆర్, ఆయన బినామీ జూపల్లి రామేశ్వరరావు ఉన్నారని.. శంషాబాద్, మహేశ్వరం పరిసరాల్లో నాలుగు వేల ఎకరాల భూమి జూపల్లి చేతిలో ఉందని వెల్లడించారు. హెచ్ఎండీఏ ప్రాంతంలో అసైన్ ల్యాండ్ రెగ్యులరైజ్ వ్యతిరేకించినందుకే బీఆర్ మీనాను బదిలీ చేశారని విమర్శించారు. రామేశ్వరరావుకు మేలు చేసేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భూములను కట్టబెట్టారని ఆరోపించారు. శంషాబాద్, మహేశ్వరం మండలంలో రామేశ్వరరావుకు భూములెన్ని ఉన్నాయో, వాటిలో అసైన్డ్ భూమి ఎన్ని ఎకరాలు ఉన్నాయో చెప్పాలని సూటిగా అడిగారు. కేసీఆర్ తన చుట్టం జూపల్లి కోసం.. చట్టం తేవాలని చూస్తున్నారని రేవంత్ అన్నారు. సీఎం, ఆయన బంధువులపై తాను ఆరోపణలు చేస్తున్నానని.. ధైర్యముంటే తనపై కేసులు పెట్టుకోవచ్చునని సవాల్ విసిరారు. నయీమ్ ఎన్కౌంటర్ వెనక, ఈ భూమికి సంబంధించిన చీకటి కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మొత్తం భూ దందాపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తనను రెచ్చగొట్టేందుకు తిట్ల కోసం కాకుండా.. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ నేతలను సూటిగా అడిగారు. నిషేధించిన చట్టాన్ని మార్చాలని కేసీఆర్ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. -
మోదీ సర్కారు తొలి బడ్జెట్‌పై భారీ అంచనాలు
-
24 ఏళ్ళుగా పెండింగ్‌లో రైల్వే ప్రాజెక్ట్‌లు
-
రైల్వే బడ్జెట్ మరి కాసేపట్లో పట్టాలెక్కనుంది
-
కొత్త రైల్వే జోన్ లేనట్టేనా?
-
బడ్జెట్ పై ఉత్కంఠ
-
ఆర్డినెన్స్ బైపాస్ కాదు: జైట్లీ
ఆర్డినెన్స్ అనేవి పార్లమెంటుకు బైపాస్లాంటివి కాదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. వీటి విషయంలో తాము ఏ తప్పు చేయడం లేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మంగళవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో భూసేకరణ అంశంతోపాటు పలు ఆర్డినెన్స్‌పై చర్చకు వచ్చాయి. బీజేపీ బైపాస్ ద్వారా ఆర్డినెన్స్ రూపంలో గట్టెక్కాలని చూస్తోందని విపక్షాలు తీవ్రంగా విమర్శించడంతో జైట్లీ జోక్యం చేసుకున్నారు. "గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా పలు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆమోదింపజేసుకున్నాయి. చట్టాలు చేశాయి. తమది బైపాస్ రూట్ అని ఆరోపణలు చేయడం తప్పు'' అని రాజ్యసభలో బదులిచ్చారు. ఆర్డినెన్స్‌పై ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ పార్టీకీ లేదని చెప్పారు. -
క్వొశ్చన్ అవర్ రద్దుకు కాంగ్రెస్ నోటీసు
న్యూఢిల్లీ : రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయం రద్దుకు కాంగ్రెస్ పార్టీ మంగళవారం నోటీసు ఇచ్చింది. కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ రూల్ 267 నిబంధన ప్రకారం ఈ నోటీసు ఇచ్చారు. భూ సేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా రాజ్యసభలో కాంగ్రెస్ ....ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. రైతులకు అన్యాయం చేసే ఆర్డినెన్స్‌ను తక్షణమే వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ సభలో డిమాండ్ చేయనుంది. కాగా రెండోరోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. మరోవైపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఈరోజు ఉదయం ఇక్కడ సమావేశమైంది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు పలు కీలక బిల్లుల ఆమోదం తదితర అంశాలపై చర్చించింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు హాజరయ్యారు. -
ప్రణబ్ ప్రసంగపాఠంలో కొన్ని ముఖ్యాంశాలు
-
ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
-
ప్రతీ పౌరుడికీ అభివృద్ధి ఫలాలు
-
మహిళా భద్రతకోసం హిమ్మత్ యాప్
న్యూఢిల్లీ : ప్రతి భారతీయ పౌరుడికి అభివృద్ధి ఫలాలు అందిస్తామని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. పేదరిక నిర్మూలనకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్...ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రణబ్ ప్రసంగపాఠంలో కొన్ని ముఖ్యాంశాలు *ప్రతీ పౌరుడికీ అభివృద్ధి ఫలాలు అందుతాయి. *జనధన్ యోజనతో11 వేల కోట్లు జమయ్యాయి. *ఉపాధికల్పన, ఉత్పత్తి పెంపు మా ప్రభుత్వ లక్ష్యం. *పారిశుద్ధ్యం నుండి స్మార్ట్ సిటీల వరకు ప్రాధాన్యం *సబ్ కా సాథ్ , సబ్ కా వికాస్ మా లక్ష్యం *2022 నాటికి అందరికీ గృహ వసతి *ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ఖాతాలు *సమీకృత అభివృద్దికి కృషి..ద్రవ్యోల్బణ నియంత్రణకు ప్రాధాన్యత *దేశవ్యాప్తంగా దేశంలోని ప్రతీ పాఠశాలలో మరుగుదొడ్ల సౌకర్యం.. *టీమిండియా స్పూర్తితో ముందు సాగుదాం. *ఆడపిల్లల,విద్య...రక్షణకోసం బేటీ బచావో.. బేటీ పఢావో పథకం ద్వారాకృషి . *టెక్నాలజీని వాడుకొని బ్లాక్ మనీ నిరోధానికి కృషి. చేస్తాం. *భూసేకరణలో పారదర్శకతను పాటిస్తాం. రైతులకు పెద్ద పీట వేస్తామంటూ అన్నదాత సుఖీభవ కు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. *మాగ్జిమమ్ గవర్నన్స్, మినిమిం గవర్నమెంట్.. *సకాలంలో ఉపకార వేతనాలు అందేలా చూస్తాం. *గిరిజన అభివృద్ధి వనబందు కళ్యాణ్ యోజన్ పథకం *మంచివైద్యంకోసం మిషన్ ఇంద్రధనుష్ *ఈశాన్యరాష్ట్రాల విద్యాభివృద్ధికి పాటుపడతాం. *ప్రధానమంత్రి నీటి పారుదల పథకం మొదలుపెడతాం *పాలనా పరమైన నిర్ణయాల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తాం. *మహిళా సాధికారతకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది *న్యాయ సంస్కరణలకు పెద్ద పీట వేస్తాం. *పన్నుల విధానాన్ని సరళీకరణ చేస్తాం. *మారుమూల ప్రాంతాల్లోను మౌలిక వసతులు కల్పిస్తాం. *కరెంటు లోటుపైనా ప్రత్యేక దృష్టి పెడతాం. *పోర్టుల ద్వారా రవాణాను పెంచుతాం. *ప్రపంచ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు చర్యలు చేపడతాం. -
ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. తన ప్రసంగంలో ఆయన 'శ్యామ ప్రసాద్ ముఖర్జీ' వ్యాఖ్యలను కోట్ చేశారు. అంతకు ముందు రాష్ట్రపతిని పార్లమెంట్‌కు... ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి తదితరులు స్వయంగా తోడ్కని వచ్చారు. -
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. మొదటి విడత ఫిబ్రవరి 23 నుంచి మార్చి 20 వరకు... రెండో విడత ఏప్రిల్ 20 నుంచి మే 8 వరకు జరుగుతాయి. తొలి విడతలో 26 రోజులు, రెండో విడతలో 19 రోజుల పాటు కొనసాగనున్న ఈ సమావేశాల్లో చర్చించేందుకు ప్రభుత్వం 44 అంశాలను తన ఎజెండాలో పొందుపరిచింది. అలాగే ఫిబ్రవరి 26న రైల్వే బడ్జెట్, 27న ఆర్థిక సర్వే, 28న సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. సోమవారం తొలిరోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నరేంద్ర మోదీ సర్కారు ఇటీవల తీసుకువచ్చిన ఆరు ఆర్డినెన్స్‌లకు ఈ సమావేశాల్లోనే చట్టరూపం కల్పించాలని ప్రభుత్వం తలపిస్తోంది. వాటి స్థానంలో బిల్లులు తీసుకురానుంది. ఉభయ సభల్లో కొత్తగా ఏడు బిల్లులను ప్రవేశపెట్టనుంది. లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్న 3, రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న 7 బిల్లులకు ఆమోదముద్ర వేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అధేవిధంగా ఏపీ శాసన మండలి సభ్యుల సంఖ్యను 50 నుంచి 58కి పెంచేందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014కు సవరణ తీసుకురానుంది. లోక్‌సభలో ఎన్డీఏకు పూర్తిస్థాయి మద్దతు ఉన్నా.. రాజ్యసభలో విపక్షాలదే పైచేయిగా ఉండడంతో బిల్లుల ఆమోదంలో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది. -
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
-
రేపటి నుంచే సభా సమరం!
సాక్షి, న్యూఢిల్లీ: సభా సమరానికి తెరలేవనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్డినెన్స్‌లపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. విపక్షాలను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కూడా సమాయత్తమైంది. మొత్తమ్మీద తాజాగా వెలుగుచూసిన కార్పొరేట్ గూఢచర్యంతోపాటు భూసేకరణ ఆర్డినెన్స్‌లతో ఉభయసభలు దద్దరిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 23 నుంచి మార్చి 20 వరకు, ఏప్రిల్ 20 నుంచి మే 8 వరకు రెండు విడతలుగా సమావేశాలు జరగనున్నాయి. తొలి విడతలో 26 రోజులు, రెండో విడతలో 19 రోజుల పాటు కొనసాగనున్న ఈ సమావేశాల్లో చర్చించేందుకు ప్రభుత్వం 44 అంశాలను తన ఎజెండాలో పొందుపరిచింది. సోమవారం తొలిరోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మోదీ సర్కారు ఈనెల 26న రైల్వే బడ్జెట్, 27న ఆర్థిక సర్వే, 28న సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇటీవల తీసుకువచ్చిన ఆరు ఆర్డినెన్స్‌లకు ఈ సమావేశాల్లోనే చట్టరూపం కల్పించాలని ప్రభుత్వం తలపోస్తోంది. వాటి స్థానంలో బిల్లులు తీసుకురానుంది. ఉభయ సభల్లో కొత్తగా ఏడు బిల్లులను ప్రవేశపెట్టనుంది. లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్న 3, రాజ్యసభలో పెండిం గ్లో ఉన్న 7 బిల్లులకు ఆమోదముద్ర వేయిం చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఏపీ శాసన మండలి సభ్యుల సంఖ్యను 50 నుంచి 58కి పెంచేందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014కు సవరణ తీసుకురానుంది. లోక్‌సభలో ఎన్డీఏకు పూర్తిస్థాయి మద్దతు ఉన్నా.. రాజ్యసభలో విపక్షాలదే పైచేయిగా ఉండడంతో బిల్లుల ఆమోదంలో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది. నేడు అఖిలపక్షంతో వెంకయ్య సమావేశం సభలో చర్చించాల్సిన బిల్లులపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆదివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌లపై పూర్తిస్థాయి చర్చకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్న ప్రభుత్వం.. అందుకు సహకరించాల్సిందిగా విపక్షాలను కోరనుంది. స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా మధ్యాహ్నం వివిధ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాల్సిందిగా ఆమె కోరనున్నారు. వ్యూహంపై కాంగ్రెస్ కసరత్తు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ శనివారం పార్టీ సీనియర్ నేతలతో చర్చించారు. ఆంటోని, గులాం నబీఆజాద్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున్‌ఖర్గే, లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్ జ్యోతిరాదిత్యసింథియా తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లలో 456 ఆర్డినెన్స్‌లు
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు లేని సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం ఆర్డినెన్స్‌లు జారీ చేస్తుంది. ఇవి చట్టాలుగా మారాలంటే ఆర్డినెన్స్ లు జారీ చేసిన తర్వాత పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఎనిమిది నెలల కాలంలోనే నరేంద్రమోదీ ప్రభుత్వం 9 ఆర్డినెన్స్‌లు జారీ చేసి మరిన్నింటిని జారీ చేసే ప్రయత్నంలో ఉంది. ముఖ్యమైన బిల్లులని చర్చించకుండానే ఆర్డినెన్స్లని తీసుకురావడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చట్టాలు చేయడానికి సమయం ఉన్న సందర్భాల్లో కూడా ఆర్డినెన్స్లని జారీ చేయడం సరైంది కాదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం వ్యాఖ్యానించారు. దీంతో ఈ ఆర్డినెన్స్‌ల జారీలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. భారత ప్రభుత్వం 1952-2014 మధ్య మొత్తం 637 ఆర్డినెన్స్‌లు జారీ చేసింది. అంటే అప్పటి నుంచి సరాసరిగా దాదాపు నెలకి ఒక ఆర్డినెన్స్ జారీ అయింది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఈ ఆర్డినెన్స్‌ల జారీ మీద మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. కానీ మొత్తం జారీ చేసిన ఆర్డినెన్స్‌లలో 456 కేవలం 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆరుగురు ప్రధానులు జారీ చేసినవే. వీటిలో జవహర్లాల్ నెహ్రూ 70, ఇందిరాగాంధీ 77, రాజీవ్ గాంధీ 35, పీవీ నరసింహరావు 77 ఆర్డినెన్స్ లని జారీచేశారు. మన్మోహన్ సింగ్ ప్రధాని గా యూపీఏ 1 లో 36 ఆర్డినెన్స్లని జారీచేయగా యూపీఏ 2 హయాంలో కొంత మెరుగుపడి కేవలం 25మాత్రమే జారీ చేశారు.అంటే పదేళ్ల వ్యవధిలో సంవత్సరానికి ఆరు సార్లు మాత్రమే ఆర్డినెన్స్‌ల సహాయాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకుంది. -
లోక్‌సభలోకి సెబీ చట్ట సవరణ బిల్లు
న్యూఢిల్లీ: సెబీకి మరిన్ని అధికారాలను కల్పించే సెక్యూరిటీ చట్టాల(సవరణ) బిల్లు-2014ను కేంద్ర ప్రభుత్వం సోమవారం ఎట్టకేలకు లోక్‌సభలో ప్రవేశపెట్టింది. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో దీనికి సంబంధించి ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చినప్పటికీ.. పార్లమెంటులో ఆమోదముద్ర పడలేదు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును లోక్‌సభకు సమర్పించారు. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా సభకు హాజరుకాకపోవడంతో ఆయన బదులు తాను బిల్లును ప్రవేశపెట్టినట్లు సీతారామన్ పేర్కొన్నారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే.. మోసపూరిత పెట్టుబడి పథకాల(పోంజీ స్కీమ్‌లు)కు పూర్తిస్థాయిలో అడ్డుకట్టవేయడంతోపాటు దర్యాప్తులో భాగంగా ఏ ఇతర సంస్థల నుంచైనా సమాచారాన్ని కోరడానికి.. విచారణను వేగంగా పూర్తిచేసేందుకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు అధికారం కూడా సెబీకి లభిస్తాయి. అంతేకాకుండా కాల్ డేటా రికార్డులను సైతం తీసుకునే పవర్ దక్కుతుంది. స్టాక్ మార్కెట్‌తో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థలనే కాకుండా.. ఎవరినైనా సమాచారం కోసం పిలిపించే అవకాశం సెబీకి లభిస్తుంది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు, స్టాక్ మార్కెట్లో మార్పులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా సెబీ అధికారాలు పెంచడమే ఈ బిల్లు ప్రధానోద్దేశమని నిర్మల చెప్పారు. కాగా, సెక్యూరిటీస్ కాంట్రాక్టుల(నియంత్రణ) బిల్లు-1956, డిపాజిటరీస్ చట్టం-1996లో సవరణలకు సంబంధించిన బిల్లులను కూడా ఆమె సభలో ప్రవేశపెట్టారు. స్వల్ప మార్పులు..: ప్రభుత్వం ప్రవేశపెట్టిన సవరణ బిల్లులో ఆర్డినెన్స్ చేర్చిన కొన్ని అధికారాలకు సంబంధించి మార్పులు చేశారు. దీనిప్రకారం సెబీ ఏదైనా కేసులకు సంబంధించి సోదాలు, స్వాధీనాలు(సీజ్) చేపట్టాలంటే ముందుగా ప్రత్యేక కోర్టుల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. కేసుల స్వభావాన్నిబట్టి కనీస స్థాయిలో రూ.లక్ష-రూ.10 లక్షల వరకూ జరిమానాలు విధించే కొత్త నిబంధనలను కూడా బిల్లులో చేర్చారు. -
అవతరణోత్సవాలకు మోడీకి ఆహ్వానం
- వివాదం నేపథ్యంలో టీఆర్ఎస్ నిర్ణయం - కేసీఆర్ స్వయంగా ఆహ్వానిస్తారు: వినోద్ - జూన్ మధ్యలో ఉండవచ్చన్న టీఆర్ఎస్ ఎంపీ - భద్రతా కారణాలతోనే కేసీఆర్ ప్రమాణానికి పిలవలేదని వ్యాఖ్య న్యూఢిల్లీ: తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానిస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. జూన్ 2న తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మోడీని పిలవకపోవడంపై తలెత్తిన వివాదం నేపథ్యంలో శనివారం పార్టీ ఈ మేరకు ప్రకటన చేసింది. కేసీఆర్ ప్రమాణం అనంతరం రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లి ప్రధానిని స్వయంగా వేడుకలకు ఆహ్వానిస్తామని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎంపీ బి.వినోద్‌కుమార్ తెలిపారు. అవతరణ దినోత్సవాలను జూన్ మధ్యలో జరుపుతామని శనివారం ఆయన పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించారు. ‘‘కొత్త ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి, డీజీపీల గైర్హాజరీలో ప్రధాని వంటి వీఐపీలకు రక్షణ కల్పించడం చాలా కష్టమనే మోడీని ఆహ్వానించలేదు. దానికి బదులుగా అవతరణోత్సవాలకు ఆహ్వానించాలని నిర్ణయించాం’’ అని వివరణ ఇచ్చారు. జూన్ మధ్యకల్లా వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి కాబట్టి అవతరణ వేడుకలను అప్పుడు నిర్వహిస్తే విద్యార్థులు కూడా వాటిలో పాల్గొనే వీలుంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా మోడీని చంద్రబాబు వ్యక్తిగతంగా ఆహ్వానించిన నేపథ్యంలో టీఆర్ఎస్ పిలవకపోవడాన్ని పలువురు తప్పుబట్టారు. పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ మోడీ సర్కారు తన తొలి మంత్రివర్గ భేటీలోనే ఆర్డినెన్స్‌ను ఆమోదించడంపై ఇటీవలే కేసీఆర్ మండిపడటం తెలిసిందే. -
కిరణకు హైకమాండ్ తలంటిందా?!