
జస్టిస్ జాస్తి చలమేశ్వర్
ముంబై: అయోధ్యలో రామమందిర నిర్మాణం వివాదం సుప్రీంకోర్టులో ఉండగానే ప్రభుత్వం చట్టం తెచ్చి ఆలయాన్ని నిర్మించేందుకు అవకాశం ఉందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ నిర్వహించిన సమావేశంలో జస్టిస్ చలమేశ్వర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ‘చట్టం ద్వారా ఆలయాన్ని నిర్మించొచ్చా? లేదా? అనేది ఒక అంశం. అసలు ఈ ప్రభుత్వం చట్టం తెచ్చి గుడిని కడుతుందా? లేదా? అనేది మరో అంశం. అయితే కొత్త చట్టం తీసుకురావడం ద్వారా సుప్రీంకోర్టులోని కేసుతో సంబంధం లేకుండా ఆలయాన్ని నిర్మించడం మాత్రం సాధ్యమే. సుప్రీంకోర్టు తీర్పుల నుంచి తప్పించుకోడానికి చట్ట ప్రక్రియను ప్రభుత్వాలు ఉపయోగించుకున్న సందర్భాలు గతంలో ఉన్నాయి’ అని చలమేశ్వర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment