Rama mandira construction
-
President Droupadi Murmu: వారసత్వ ప్రతీక రామమందిరం
న్యూఢిల్లీ: భారత్ తన పురాతన నాగరికత వారసత్వాన్ని పునరుజ్జీవింపజేసుకున్న అద్భుత ఘడియగా ‘రామ మందిర నిర్మాణ ఘట్టం’ నిలిచిపోతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వ్యాఖ్యానించారు. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతినుద్దేశిస్తూ రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. ‘‘ అయోధ్యలో రామమందిర దివ్యధామం ప్రజల విశ్వాసాలను మాత్రమే కాదు న్యాయవ్యవస్థ పట్ల ప్రజలకున్న అచంచల విశ్వాసానికీ నిలువెత్తు నిదర్శనం’’ అని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పనితీరునూ ఆమె ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య రగులుతున్న ఘర్షణలు, మానవీయ సంక్షోభాలు, యుద్ధాలపై ఆందోళన వ్యక్తంచేశారు. ఘర్షణలకు మూలాలను వెతక్కుండా భయాలు, విద్వేషంతో ఆయా దేశాల ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు కొన్ని ఆమె మాటల్లోనే.. జీ20 ఆతిథ్యం ఎన్నో నేరి్పంది ‘‘న్యాయ ప్రక్రియ, సుప్రీంకోర్టు సముచిత తీర్పుల తర్వాతే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బాటలు పడ్డాయి. ఈ ఆలయం నిర్మాణం ద్వారా భారత్ తన నాగరికత వారసత్వ పరంపరను కొనసాగిస్తున్నట్లు మరోమారు ప్రపంచానికి చాటింది. ప్రజల విశ్వాసం మాత్రమే కాదు వారు న్యాయవ్యవస్థ మీద వారికున్న నమ్మకానికి నిదర్శనం ఈ ఆలయం. ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించి భారత్ తన పౌరుల భాగస్వామ్యంలో ఎంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలనైనా నిర్వహించగలదని రుజువు చేసింది. వ్యూహాత్మక, దౌత్య అంశాలపై ఏకాభిప్రాయాన్ని సాధించి చూపింది. ప్రజలు తమ సొంత భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోగలరో ప్రపంచ దేశాలకు నేరి్పంది. గ్లోబల్ సౌత్‌కు భారత్ గొంతుకగా నిలిచింది. ఆర్థిక వ్యవస్థ పరిపుష్టితో ధృఢ విశ్వాసంతో భారత్ అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులేస్తోంది’’ అని అన్నారు. అభివృద్ధి భారత్ బాధ్యత పౌరులదే ‘‘ స్వతంత్రభారతావని 75 వసంతాలు పూర్తిచేసుకుని శత స్వాతంత్రోత్సవాల దిశగా అడుగులేస్తోంది. రాబోయే పాతికేళ్ల అమృత్‌కాలంలో సర్వతోముఖాభివృద్ధి సాధించి అభివృద్ధి చెందిన భారత్‌గా దేశాన్ని నిలపాల్సిన బాధ్యత పౌరులదే. ఇప్పుడు మహాత్ముని మాటలు గుర్తొస్తున్నాయి. దేశంలో ప్రజలు ప్రాథమిక హక్కులు గురించి మాత్రమే మాట్లాడితే సరిపోదు. ప్రాథమిక విధులు సైతం ఖచి్చతంగా నిర్వర్తిస్తూ బాధ్యతగా మెలిగినప్పుడే భారత్ అభివృద్ది చెందుతుందని గాం«దీజీ ఉపదేశించారు’’ అని ముర్ము గుర్తుచేశారు. -
అయోధ్య రాముని సన్నిధిలో 500 కేజీల డ్రమ్
లక్నో: అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అయోధ్య రాముని సన్నిధిలో 500 కిలోల డ్రమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. గుజరాత్ నుంచి 500 కిలోల డ్రమ్‌ను రథంపై అయోధ్యకు తీసుకొచ్చారు. గుజరాత్ కర్ణావతిలోని దర్యాపూర్‌లో దబ్గర్ కమ్యూనిటీ ప్రజలు డ్రమ్‌ను తయారు చేశారని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. రామాలయం ప్రాంగణంలో ఈ డ్రమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. సూర్యరశ్మి, వర్షానికి గురికాకుండా తట్టుకునేలా ఈ డ్రమ్ తయారు చేశారు. బంగారు, వెండి పొరలతో డ్రమ్ పూత పూయబడింది. ఇనుము, రాగి పలకలను ఉపయోగించి డ్రమ్‌ను తయారు చేశారు. దీని శబ్దం కిలోమీటరు దూరం వరకు వినపడుతుంది. ఆలయ ట్రస్టుకు గుజరాత్ విశ్వహిందూ పరిషత్ నాయకుడు లేఖ పంపిన తర్వాత ఈ డ్రమ్‌ను ఏర్పాటు చేశారు. రామమందిరాన్ని జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా వేలాది మంది వీక్షకులను ఆహ్వానించారు. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించిన కార్మికుల కుటుంబాలు కూడా ఆహ్వానితుల జాబితాలో ఉన్నాయి. బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలతో సహా 7,000 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇదీ చదవండి: రామ మందిర ప్రతిష్టాపన.. ఆ మూడు రాష్ట్రాల్లో 'డ్రై డే' -
అయోధ్య రామాలయంలో... గర్భగుడికి శంకుస్థాపన
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం నిర్మాణంలో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. ఆలయ గర్భగుడి నిర్మాణానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం శంకుస్థాపన చేశారు. మందిర నిర్మాణాన్ని దేశ ఐక్యతకు నిదర్శనంగా, దురాక్రమణదారులపై విజయంగా అభివర్ణించారు. చరిత్రాత్మక తీర్పుతో రామజన్మభూమి–బాబ్రీమసీదు వివాదానికి తెరదించి మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతివ్వడంతో 2020 ఆగస్టులో ఆలయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. తాజాగా ప్రధానాలయ నిర్మాణానికి యోగి చేతుల మీదుగా శైల పూజ జరిగింది. యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, రామ మందిర ట్రస్టు అధికారుల సమక్షంలో సీఎం పునాది రాళ్లు వేశారు. ‘‘అయోధ్య రామాలయం మన జాతీయాలయం. ప్రజల ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ప్రతి భారతీయునికీ గర్వకారణం’’ అన్నారు. 500 ఏళ్లుగా భారతీయులు అనుభవిస్తున్న వేదన ఆలయ నిర్మాణంతో దూరమవుతుందన్నారు. -
దళిత కుటుంబానికి భూమిపూజ తొలి ప్రసాదం
అయోధ్య: అయోధ్యలో రామ మందిర భూమి పూజకు సంబంధించిన ప్రసాదాన్ని తొలిగా ఒక దళిత కుటుంబం అందుకుంది. లడ్డూలు, రామచరిత మానస్ పుస్తకం, తులసిమాల ఉన్న ప్రసాదాన్ని యూపీ సీఎం ఆదేశాల మేరకు అయోధ్యలోని మేస్త్రీ వృత్తిలో ఉన్న మహావీర్ కుటుంబానికి అధికారులు పంపించారు. మహావీర్ అయోధ్యలోని సుతాటి ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. 2019 ఎన్నికల సందర్భంగా మహావీర్ ఇంట్లో ఆదిత్యనాథ్ భోజనం చేశారు. ‘అలి– బజరంగ బలి’ వ్యాఖ్యల కారణంగా అంతకుముందే సీఎం యోగిని మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ‘నన్ను గుర్తుంచుకుని ప్రసాదం పంపినందుకు ఆయనకు కృతజ్ఞతలు’ అని మహావీర్ పేర్కొన్నారు. -
అమెరికా, బ్రిటన్‌లో జైశ్రీరామ్
వాషింగ్టన్/లండన్: అయోధ్యలో రామాలయ మందిర నిర్మాణానికి చేసిన భూమి పూజను పురస్కరించుకొని అమెరికా, బ్రిటన్‌లలోని భారతీయ హిందువులు సంబరాలు చేసుకున్నారు. అమెరికాలోని క్యాపిటల్ హిల్ ప్రాంతంలో రాముడి చిత్రాలు కలిగిన డిజిటల్ స్క్రీన్ ట్రక్కు తిరుగుతూ జైశ్రీరామ్ అనే నినాదాలను వినిపించింది. వాషింగ్టన్ లోనూ విశ్వహిందూ పరిషద్ సభ్యులు రాముడి చిత్రాలు, నినాదాలతో కూడిన ఓ ట్రక్కును నడిపారు. భారతీయ హిందువులు తమ ఇళ్లలో దీపాలను వెలిగించి తమ ఆనందాన్ని తెలిపారు. కాలిఫోర్నియాకు చెందిన హిందూ నాయకుడు అజయ్ జైన్ మాట్లాడుతూ రామున్ని ఆరాధించే హిందువులు, జైనులకు ఇది ఓ మరపురాని రోజు అని చెప్పారు. ప్రముఖ టైమ్ స్క్వేర్ వద్ద రాముడి చిత్రాలను, రామాలయ నమూనా త్రీడీ చిత్రాలను ప్రదర్శించారు. మరోవైపు యూకేలో భారతీయ హిందువులు ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనల ద్వారా అయోధ్య భూమి పూజ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. కోవిడ్ నిబంధనల కారణంగా వర్చువల్‌గా పూజలు జరిపి తమ సంతోషాన్ని వ్యక్తంచేశారు. యూకేలో ఉన్న 150 దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపినట్లు వెల్లడించారు. భూమి పూజ జరిగిన కార్యక్రమం హిందువుల మనసుల్లో చిరకాలం నిలిచిపోతుందని యూకే హిందూ కౌన్సిల్ చెప్పింది. -
జగమంతా రామమయం
అయోధ్య: శతాబ్దాల నిరీక్షణ ఫలించింది. కోట్లాది రామభక్తుల స్వప్నం సాకారమైంది. దేశవ్యాప్తంగా రామ నామం ప్రతిధ్వనించింది. విశ్వవ్యాప్తంగా హిందూ లోగిళ్లలో ఉత్సవ వాతావరణం నెలకొంది. బాల రాముడి కోసం ఆయన జన్మస్థలిలోనే నవ్య, భవ్య, రమ్య మందిరం ఘనంగా సిద్ధమవుతోంది. అయోధ్యలో శ్రీరామచంద్రుడు జన్మించాడని భక్తులు విశ్వసించే ప్రదేశంలో భవ్యమైన రామ మందిర నిర్మాణానికి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. సుముహూర్త సమయమైన మధ్యాహ్నం 12.44 గంటలకు శంకుస్థాపన జరిపారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్, శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ సంత్ నృత్య గోపాల్ దాస్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయోధ్యలో ఉత్సవ వాతావరణం నెలకొంది. పట్టణమంతా పూల దండలతో ముస్తాబయింది. అలాగే, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. పలు చోట్ల ప్రజలు షాపుల్లోని టీవీల ముందు నిల్చుని కార్యక్రమాన్ని చూశారు. దేశంలోని పలు రామాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. భూమి పూజ అనంతరం ప్రధాని మోదీ ఆహూతులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘సియా(సీతా)వర్ రామచంద్రజీ కీ జై’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. భారత దేశ ఆత్మగా నిలిచిన సకలగుణాభిరాముడి ఔన్నత్యాన్ని ఘనంగా శ్లాఘించారు. రామ నామం ఇప్పుడు దేశం నలుమూలలా ప్రతిధ్వనిస్తోందన్నారు. రాముడు సర్వ జనుల కొంగు బంగారమని కొనియాడారు. అద్భుత ఆలయంగా శతాబ్దాలు నిలిచే నిర్మాణానికి భూమిపూజ నిర్వహించే అవకాశం లభించడం తన అదృష్టమన్నారు. దశాబ్దాలుగా చిన్న తాత్కాలిక గుడారంలో ఉన్న రామ్‌లల్లా ఇకపై అద్భుతమైన ఆలయంలో కొలువుతీరుతారని హర్షం వ్యక్తం చేశారు. రామ్‌లల్లా ఆలయం భారతదేశ ఘన సంస్కృతికి ప్రతీకగా, మానవాళికి స్ఫూర్తిప్రదాయినిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారతీయులందరి హృదయాల్లో రాముడు నిలిచి ఉంటాడన్నారు. సామాజిక సామరస్యం రామరాజ్యంలో ముఖ్యమైన విధానమని తెలిపారు. రాళ్లపై శ్రీ రామ అని రాసి ‘రామసేతు’ నిర్మించిన తీరుగానే.. దేశంలోని మూల మూలల నుంచి రామ మందిర నిర్మాణం కోసం ఇటుకలు వచ్చాయని మోదీ వ్యాఖ్యానించారు. ప్రసంగం ముగించే ముందు సీతారాములను కీర్తిస్తూ ‘జై శ్రీరామ్’ అని నినదించారు. హనుమాన్‌గఢీలో హారతి భూమి పూజ కోసం బుధవారం ఉదయం ప్రధాని మోదీ అయోధ్య చేరుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి, ముందుగా హనుమాన్‌గఢీలోని ఆంజనేయుడి దేవాలయాన్ని సందర్శించారు. అక్కడ స్వయంగా పవన సుతుడికి హారతి ఇచ్చారు. ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆ తరువాత అక్కడినుంచి వారు నేరుగా రామ్‌లల్లాను దర్శించుకునేందుకు రామజన్మభూమికి వెళ్లారు. రామ్‌లల్లాకు సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆ ప్రాంగణంలో పారిజాత మొక్కను నాటారు. అనంతరం, కొద్దిమంది ఆహ్వానితుల సమక్షంలో భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. భూమిపూజ వేదికకు సాష్టాంగ ప్రణామాలు అర్పించారు. అనంతరం విశిష్ట అతిథుల సమక్షంలో కాసేపు ప్రసంగించారు. కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో 175 మందికి మాత్రమే ఆహ్వానం పంపించారు. వారిలో పలువురు వృద్ధాప్యం సహా పలు ఇతర కారణాలతో ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. హిందూ, ముస్లిం వర్గాల మధ్య దశాబ్దాలుగా సాగిన వివాదం అనంతరం.. రామజన్మభూమి ప్రాంతం రామ్‌లల్లాకే చెందుతుందని స్పష్టం చేస్తూ గత సంవత్సరం సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు ప్రకటించిన నేపథ్యంలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. 1992లో ఆ ప్రదేశంలో ఉన్న బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేయడం, తదనంతరం దేశవ్యాప్తంగా మతకల్లోలాలు చెలరేగడం తెలిసిందే. రామ చరితం విశ్వవ్యాప్తం ప్రసంగం ప్రారంభ, ముగింపు సమయాల్లో సీతారాములను కీర్తిస్తూ ‘సియావర్ రామచంద్ర కీ జై’, ‘సీతారామ్’ అని ప్రధాని నరేంద్ర మోదీ నినదించారు. ‘ఈ నినాదాలు ఇక్కడే కాదు.. ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తున్నాయి’ అని అన్నారు. ‘అంతా జానకీ మాతను, శ్రీరామ చంద్రుడిని జ్ఞప్తికి తెచ్చుకోండి. ఆ తరువాత నేను ప్రసంగం ప్రారంభిస్తాను’ అన్నారు. అనంతరం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు, రామ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రసంగాన్ని ముగిస్తూ.. ‘ప్రజలంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆ రామచంద్రుడిని, సీతమ్మ తల్లిని ప్రార్థిస్తున్నా. వారిద్దరి ఆశీస్సులు మీ పై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’ అన్నారు. తొలి ప్రధాని మోదీనే.. అయోధ్యలో రామ జన్మభూమిని, హనుమాన్‌గఢీ ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీయేనని యూపీ ప్రభుత్వం తెలిపింది. భూమి పూజను పురస్కరించుకుని ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్‌ను మోదీ ఆవిష్కరించారు. దేశంలో నెలకొని ఉన్న సామాజిక సామరస్యానికి, దేశ ప్రజల అభినివేశానికి ఈ కార్యక్రమం సాక్ష్యంగా నిలుస్తుంది. రామరాజ్య విలువలతో నడిచే ఆధునిక భారతదేశ ప్రతీకగా చట్టబద్ధంగా నిర్మితమవుతున్న ఈ ఆలయం నిలుస్తుంది. –రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భారతీయుల 500 ఏళ్ల కలను నేడు ప్రధాని మోదీ సాకారం చేశారు. ప్రధాని మోదీ ముందుచూపు, జ్ఞానము రామ మందిరానికి మార్గం సుగమం చేశాయి. ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా, రాజ్యాంగ మార్గాల ద్వారా సమస్యలు ఎలా పరిష్కరించవచ్చో మోదీ చూపించారు. –యోగి ఆదిత్యనాథ్, ఉత్తర ప్రదేశ్ సీఎం మానవ విలువలకు అత్యున్నత రూపం రాముడు. ఆయన శాంతమూర్తి. ఆయనలో క్రూరత్వం, ద్వేషం, అన్యాయం లేవు. –రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత రామ మందిర నిర్మాణానికి పునాది పడిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో ఆనందాన్ని నింపింది. దేశం స్వతంత్రంగా నిలబడగల ఆత్మవిశ్వాసం దీని ద్వారా వస్తుంది. రామాలయం కోసం రథయాత్ర చేసిన అడ్వాణీ జీ కార్యక్రమంలో హాజరు కాలేకపోయినా, టీవీ ద్వారా చూస్తూ ఉంటారు. – మోహన్ భాగవత్, ఆరెస్సెస్ చీఫ్ కోట్లాది మంది హిందు వుల కల నేడు నిజమైంది. అయోధ్యలో రామాలయ నిర్మా ణం ప్రజా క్షేమం కోసం చేస్తున్న కార్యక్రమం. ఇది దేశాన్ని, ప్రపంచాన్ని నిర్మించడం లాంటిది. ఆలయాన్ని త్వరగా నిర్మి స్తే మన కళ్లతో చూడవచ్చు. ఓ వైపు మోదీ, మరో వైపు యోగి. ఇప్పు డు కాకపోతే ఎప్పుడు నిర్మిస్తారు. –మహంత్ న్రిత్య గోపాల్ దాస్, రామాలయ ట్రస్ట్ చీఫ్ స్వాతంత్య్ర పోరాటం తీరుగానే.. బంగారు రంగు కుర్తా, ధోవతిపై కాషాయ కండువా ధరించి కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. రామ మందిర నిర్మాణం దేశ ఐక్యతకు ప్రతీక అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఆలయంతో ఈ ప్రాంతం ఆర్థి కంగా పుంజుకుంటుందన్నారు. ప్రేమ, సౌభ్రాతృత్వం పునాదులుగా ఆలయ నిర్మాణం జరుగుతుందన్నారు. ‘దశాబ్దాలుగా చిన్న గుడారంలో ఉన్న రామ్‌లల్లా కోసం అద్భుత ఆలయం రూపుదిద్దుకోనుంది. తన అస్తిత్వాన్ని రూపుమాపేందుకు శతాబ్దాలుగా సాగిన అన్ని ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకుని రామ జన్మభూమి స్వేచ్ఛను పొందింది. రాముడి విగ్రహాలను ధ్వంసం చేశారు. కానీ ఆయన మన హృదయాల్లో నిలిచి ఉన్నాడు. మన సంస్కృతికి మూలం ఆయనే’ అన్నారు. ఇప్పుడు భారత్ అయోధ్యలో ఒక అద్భుత అధ్యాయాన్ని లిఖిస్తోందన్నారు. భారత దేశ విశిష్టత భిన్నత్వంలో ఏకత్వమని, ఆ భావనను నిలిపే ఉమ్మడి బంధం రాముడేనని వ్యాఖ్యానించారు. ఆంగ్లేయుల నుంచి స్వాతంత్య్రం పొందేందుకు జరిపిన పోరాటంతో.. ఆయోధ్యలోని రామజన్మభూమి ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించేందుకు శతాబ్దాలు సాగిన పోరాటాన్ని ప్రధాని పోల్చారు. స్వాతంత్య్ర పోరాటంలో దళితులు, గిరిజనులు సహా దేశంలోని అన్ని వర్గాల ప్రజలు మహాత్మాగాంధీకి మద్దతిచ్చిన విధంగానే.. నేడు ప్రజలంతా దేశంలోని మూలమూలల నుంచి ఇటకలు, మట్టి, పవిత్ర జలంతో రామాలయ నిర్మాణానికి సహకరిస్తున్నారన్నారు. వేలాది మంది సహకారం, కృషి కారణంగానే రామాలయ నిర్మాణానికి పునాది పడిందన్నారు. తమ జీవిత కాలంలో ఈ అద్భుతాన్ని చూస్తామని ఊహించని వారంతా.. ఇప్పుడు తాదాత్మ్యంతో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారని అన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా నిర్మించనున్న ఆలయం భారతదేశ సంస్కృతి, విశ్వాసాలకు, జాతీయ భావనకు ప్రతీకగా నిలుస్తుందని మోదీ తెలిపారు. రాముడు చూపిన మార్గంలో వెళ్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ మార్గం తప్పినప్పుడు విధ్వంసం చోటు చేసుకుంటుందని వివరించారు. అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ఇండోనేషియా సహా.. ప్రపంచంలోని పలు దేశాల్లో పలు రూపాల్లో రామ చరితం ప్రజల్లో నిలిచి ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జైపూర్‌లోని రామచంద్రజీ ఆలయంలో ప్రమిదలు వెలిగిస్తున్న భక్తురాలు మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో రామ్టెంపుల్ కరమ్‌చంద్ చౌక్ వద్ద బాణసంచా కాలుస్తూ స్థానికుల సంబరాలు అయోధ్యలో హనుమాన్ ఆలయంలో హారతి ఇస్తున్న ప్రధాని మోదీ -
సీఎం యోగి అయోధ్య పర్యటన రద్దు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నేటి అయోధ్య పర్యటన రద్దైంది. రామ మందిర ‘భూమి పూజ’ ఏర్పాట్లను ఆదివారం సీఎం యోగి పరిశీలించాల్సి ఉంది. కానీ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కమలా రాణి కరోనా బారినపడి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఆమె మరణంతో సీఎం యోగి అయోద్య పర్యటనను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 5న జరిగే అయోద్య రామ మందిర ‘భూమి పూజ’ వేడుక సన్నాహాక కార్యక్రమాల సమీక్షలో భాగంగా సీఎం యోగి ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు రామ జన్మభూమిని సందర్శించాల్సి ఉంది. (భూమిపూజకు అడ్వాణీ, జోషిలకు ఫోన్లో ఆహ్వానం) అదే విధంగా హనుమన్‌గారి ఆలయం, రామ్ కి పాడి కూడా సందర్శించాల్సి ఉంది. సీఎం యోగి పర్యటనలో మార్పు చోటు చేసుకోవటంతో హనుమాన్‌గారి ఆలయం వద్ద నిషన్‌పూజను రద్దు చేశామని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు. ఆదివారం జరగాల్సిన నిషన్‌పూజను మంగళవారం నిర్వహిస్తామని పేర్కొన్నారు. శ్రీరాముని సంబంధించిన ఎదైనా కార్యక్రమం ప్రారంభించే ముందు హనుమంతుని నిషన్పూజ తప్పకుండా జరపాలనే ఆచారం కొనసాగుతోందని తెలిపారు. ఆగస్టు5న ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. ఇక జులై18న కమలా రాణి అనారోగ్యం పాలైయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి లక్నోలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి తుదిశ్వాస విడిచారు. మంత్రి మృతి పట్ల ముఖ్యమంత్రి యోగి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
భూమిపూజకు అడ్వాణీ, జోషిలకు ఫోన్లో ఆహ్వానం
న్యూఢిల్లీ: అయోధ్యలో ఆగస్టు 5న నిర్వహించే రామ మందిరం భూమి పూజకు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషిని తప్పనిసరిగా ఆహ్వానిస్తామని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వర్గాలు శనివారం వెల్లడించాయి. ఇతర నాయకుల తరహాలోనే వారిద్దరికీ ఫోన్ ద్వారా ఆహ్వానం పలుకుతామని పేర్కొన్నాయి. అడ్వాణీ, జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తితోపాటు ఆరోగ్య కారణాల రీత్యా వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆహ్వానాల వ్యవహారాన్ని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్‌కు శనివారం ఆహ్వానాలు అందాయి. భూమి పూజకు తాము కచ్చితంగా హాజరవుతామని వారు పేర్కొన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అడ్వాణీ, జోషీ, ఉమా భారతి ప్రధాన నిందితులన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా అయోధ్యలో భూమిపూజ మహోత్సవానికి హాజరు కానున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీఐపీ అతిథుల జాబితాను 50 మందికి కుదించినట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలియజేసింది. భవ్య రామ మందిరం భూమిపూజకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. భూమిపూజ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మరో నలుగురు నాయకులు వేదికను పంచుకోనున్నారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, రామ జన్మభూమి న్యాస్ చీఫ్ నృత్యగోపాల్ దాస్తోపాటు మరో ఇద్దరు వేదికపై ఉంటారు. -
అద్వానీ, జోషిలకు అందని ఆహ్వానం
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆగస్టు 5న ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరగనుంది. అందుకోసం ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ మందిని ఆహ్వానించకూడదని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్ణయించింది. కేవలం 150 మంది అతిథులు సహా 200 మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించింది. రామ మందిరం అనగానే మొదటగా మనకు గుర్తొచ్చే పేర్లలో మొదటి వరుసలో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, కళ్యాణ్‌సింగ్ ఉంటారు. వీరి ఆధ్వర్యంలో అయోధ్యలో రామమందిరం కట్టాలన్న డిమాండ్‌తో 1990లో అద్వానీ చేపట్టిన రథయాత్ర బీజేపీని మరింత ఎత్తున నిలబెట్టాయి. అయితే రామమందిర భూమి పూజ కార్యక్రమానికి బీజేపీ అగ్ర నాయకులు ఎల్కే అద్వానీ, ఎమ్ఎమ్ జోషిలకు ఆహ్వానం అందకపోగా.. మాజీ కేంద్రమంత్రి ఉమాభారతి, మాజీ గవర్నర్ కళ్యాణ్ సింగ్‌లకు మాత్రమే ఆహ్వానం అందింది. ఈ వివాదంలో ఈ ఇద్దరు నేతలు సీబీఐ విచారణను సైతం ఎదుర్కొన్నారు. బాబ్రీ మసీదు వివాదంలో వీరంతా కోర్టు ముందు కూడా హాజరయ్యారు. అటువంటి అగ్రశ్రేణి నాయకులకు ఆగస్టు 5న జరిగే రామ మందిరం శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం అందలేదు. ఇప్పటివరకు రూపొందించిన షెడ్యూల్‌లోకానీ, వేదికపై కూర్చొనే ఆహ్వానితుల జాబితాలో కానీ వారి పేర్లు ఎక్కడా కనిపించలేదు. -
అలర్ట్ : అయోధ్యకు పొంచి ఉన్న మరో ముప్పు
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని రామ జన్మభూమిలో రామ మందిర నిర్మాణం కోసం జరిగే భూమి పూజ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు జరుగుతుండగా అయోధ్యకు వరద ముప్పు పొంచి ఉన్నట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ శుక్రవారం హెచ్చరించింది. గంగానది ప్రధాన ఉపనది అయిన ఘగ్రా నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తుందని దీంతో అయోధ్యలో వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఒక పక్క రామ మందిర నిర్మాణం కోసం జరిగే భూమి పూజ కార్యక్రమానికి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోండగా వరద ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సిన పూజారికి, పదహారు మంది భద్రతా సిబ్బందికి కోవిడ్ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. (అయోధ్య పూజారికి కరోనా) ఆగస్టు 5న జరిగే భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, 50 మంది అతిథులు కూడా పాల్పంచుకోనున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 200 మంది ప్రముఖులతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. భూమిపూజ ఘట్టాన్ని అమెరికాలోని ప్రవాస భారతీయులు సైతం వీక్షించనున్నారు. న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ దగ్గర శ్రీరాముడి చిత్రాలూ, అయోధ్య రామమందిరం త్రీడీ చిత్రాలను ప్రపంచంలోనే అతిపెద్ద 17వేల చదరపుటడుగుల భారీ నాస్డాక్ స్క్రీన్‌పై దీన్ని ప్రదర్శించనున్నట్టు అమెరికన్ ఇండియా పబ్లిక్ అఫెయిర్స్ కమిటీ అధ్యక్షుడు జగదీష్ షెహానీ వెల్లడించారు. (అయోధ్యలో హైఅలర్ట్) -
అయోధ్య: 4 లక్షల లడ్డూలు సిద్ధం
లక్నో (ఉత్తర ప్రదేశ్): రామ మందిర నిర్మాణం కోసం జరిగే భూమి పూజ కార్యక్రమానికి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ వేడుకలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ప్రధానితోపాటు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, 50 మంది అతిథులు కూడా హాజరుకానున్నారు. అయోధ్య నిర్మాణాన్ని పర్యవేక్షించే ఆలయ పాలక మండలి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భూమి పూజ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాలకు లడ్డూలను పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు నాలుగు లక్షల ప్యాకెట్ల లడ్డూలను ఆర్డర్ ఇచ్చినట్లు ట్రస్ట్ అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 5న జరిగే కార్యక్రమానికి మొత్తం 1,11,000 వేల లడ్డూలు సిద్ధమవుతునన్నాయని అధికారులు పేర్కొన్నారు. వీటిని రామ్ దాస్ చావ్ని అనే వ్యక్తి వద్ద తయారు చేస్తున్నట్లు తెలిపారు. (అయోధ్యలో హైఅలర్ట్) ఆగస్టు 3వ తేదీన గణేశుడి పూజతో కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు. ఆగస్టు 5వ తేదీన గర్భగుడిలో జరిగే పూజ కోసం 11 మంది పండితులు వేదమంత్రాలు చదవనున్నారు. ప్రధాని మోదీ చేత భూమిపూజ చేపట్టనున్నారు. పూజా కార్యక్రమానికి 600 మంది సాధువులను ఆహ్వానించాలని ట్రస్ట్ నిర్ణయించింది. అలాగే కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేవలం 200 మందిని మాత్రమే వేడుకకు ఆహ్వానించాలని కూడా నిర్ణయించారు. పూజ నిర్వహించనున్న రామ మందిరం పూజారి ప్రదీప్ దాస్ తాజాగా కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. పూజారికి కరోనా సోకడంతో ఏం చేయాలనే దానిపై ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. (అయోధ్య పూజారికి కరోనా) -
అయోధ్యలో హైఅలర్ట్
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరగనున్న భవ్య రామ మందిరం భూమి పూజపై ఉగ్రవాద శక్తులు కన్నేశాయని, ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అయోధ్య నగరంలో హైఅలర్ట్ ప్రకటించింది. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది. భూమి పూజ సందర్భంగా అయోధ్యలో భారీగా దాడులు చేయాలని, తీవ్ర భయోత్పాతం సృష్టించాలని లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఉగ్రవాదులతో కూడిన ఓ బృందం పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు వేచి చూస్తున్నట్లు అనుమానిస్తున్నాయి. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చేరవేశాయి. అయోధ్యలో ఆగస్టు 5న నిర్వహించే భూమి పూజకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అయోధ్యలో రామాలయం భూమి పూజకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఆయన సాకేత్ మహావిద్యాలయ ప్రాంగణంలో హెలికాప్టర్లో దిగుతారు. ఇక్కడి నుంచి రామ జన్మభూమి వరకు ప్రధానమంత్రి ప్రయాణించే మార్గాన్ని భద్రతా బలగాలు ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్నాయి. స్థానికులు రాకపోకలు సాగించేందుకు పాసులు జారీ చేశారు. పాసులు ఉన్నవారినే అనుమతిస్తున్నారు. ప్రతి ఇంటినీ తనిఖీ చేస్తున్నారు. -
అయోధ్యలో ‘కాలనాళిక’
పట్నా: అయోధ్యలో భవ్య రామ మందిరం భూమి పూజకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మందిరం నిర్మాణంలో మరో విశేషం చోటుచేసుకోబోతోంది. రామ జన్మభూమికి సంబంధించిన సమస్త చరిత్రను అక్కడే భూగర్భంలో నిక్షిప్తం చేస్తామని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండడానికే ఇదంతా అని తెలిపారు. ఆలయ నిర్మాణ స్థలంలో 2,000 అడుగుల లోతున ఒక కాల నాళిక(టైమ్ క్యాప్సూల్)ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇందులోనే ఆలయ చరిత్ర, కీలక పరిణామాల సమాచారం భద్రపరుస్తామన్నారు. రామ జన్మభూమి కేసు సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలం కొనసాగిందని, ప్రస్తుత, రాబోయే తరాలకు ఇదొక పాఠమని వెల్లడించారు. భవిష్యత్తులో ఈ రామాలయం గురించి ఎవరైనా అధ్యయనం చేయడానికి ఈ కాల నాళిక ఉపయోగపడుతుందన్నారు. వాస్తవాలు వక్రీకరణకు గురయ్యే అవకాశం ఉండదని, తద్వారా ఎలాంటి వివాదాలు తలెత్తవని చెప్పారు. కాల నాళికను తామ్ర పత్రంలో(కాపర్ ప్లేట్) ఉంచి భూగర్భంలో భద్రపరుస్తామని కామేశ్వర్ చౌపాల్ వివరించారు. శ్రీరాముడు నడయాడిన పుణ్య క్షేత్రాలు, పవిత్ర నదుల నుంచి మట్టి, నీరు తెప్పిస్తున్నామన్నారు. భూమి పూజలో వీటిని ఉపయోగస్తామని తెలిపారు. -
ఆగస్టులో రామాలయం పనులు
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శనివారం అయోధ్యలో సమావేశమై ముహూర్తం ఖరారు చేయనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా శుక్రవారం అయోధ్య చేరుకున్నారు. ఆగస్టులో ఆలయ పనుల ప్రారంభంపై ప్రధాని ఆమోదించిన తేదీని ఈ సమావేశంలో ఆయన ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా అయిన మిశ్రా వెంట నిపుణులైన ఇంజనీరింగ్ అధికారుల బృందం కూడా వచ్చిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అధికారులు ఆలయ నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తారని సమాచారం. వచ్చే నెలలో రామాలయ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీతోపాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ హాజరయ్యే అవకాశాలున్నాయి. ఈ కార్యక్రమానికి రావాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రెసిడెంట్ మహంత్ నృత్య గోపాల్ దాస్ తెలిపారు. ‘ఆలయ భూమి పూజ ఆన్లైన్ ద్వారా గానీ లేదా ఇతర వర్చువల్ విధానాల్లో గానీ ప్రారంభించాలని సాధువులు కోరుకోవడం లేదు. ప్రధాని స్వయంగా ఈ కార్యక్రమానికి రావాలని వారు భావిస్తున్నారు. నా ఆహ్వానాన్ని ప్రధాని ఆమోదిస్తారనే నమ్మకం ఉంది’అని గోపాల్ దాస్ అన్నారు. ఆగస్టులో ప్రధాని మోదీ అయోధ్య సందర్శనపై పీఎంవో నుంచి ఎటువంటి సమాచారం లేదు. -
రేపే రామమందిరానికి పునాది
అయోధ్య: అయోధ్యలోని రామమందిరం నిర్మాణానికి ముహూర్తం ఖరారయ్యింది. రామమందిరానికి జూన్10వ తేదీన పునాదులు వేస్తున్నట్టు గుడి ట్రస్ట్ అధికార ప్రతినిధి ప్రకటించారు. గత నవంబర్‌లో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు నేపథ్యంలో అయోధ్యలోని రామజన్మభూమిలో కోర్టు కేటాయించిన స్థలంలోని కుబేర్ మందిరంలో శివుడి ప్రార్థనలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించారు. లంకపై దాడికి వెళ్ళేముందు రాముడు అనుసరించిన శివుడి ప్రార్థనల ‘రుద్రాభిషేకం’’తోనే రామమందిర నిర్మాణం కూడా ప్రారంభిస్తున్నట్టు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధిపతి మహంత్ నృత్య గోపాల్ దాస్ వెల్లడించారు. జూన్ 10న, బుధవారం ఉదయం 8 గంటలకు ట్రస్ట్ అధికార ప్రతినిధి మహంత్ కమల్ నయన్ దాస్, ఇతర పౌరోహితుల ప్రత్యేక ప్రార్థనల అనంతరం రామాలయానికి పునాదులు వేయడం ప్రారంభం అవుతుంది. -
ఏప్రిల్‌లో మందిర నిర్మాణం!
పుణే/న్యూఢిల్లీ/అయోధ్య: అయోధ్యలో రామ మందిర నిర్మాణం శ్రీరామ నవమి(ఏప్రిల్ 2) రోజు కానీ, అక్షయ తృతీయ(ఏప్రిల్ 26)రోజు కానీ ప్రారంభమవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యుడు స్వామి గోవింద దేవగిరి మహారాజ్ చెప్పారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం 15 మంది సభ్యులతో కేంద్రం శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర పేరుతో ఒక ట్రస్ట్‌ను బుధవారం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రామమందిర నిర్మాణాన్ని కచ్చితంగా ఏ రోజున ప్రారంభిస్తామనేది త్వరలో జరగనున్న ట్రస్ట్ తొలి భేటీలో నిర్ణయిస్తామని దేవగిరి తెలిపారు. రెండేళ్లలో మందిరాన్ని పూర్తి చేస్తామన్నారు. తొలి విరాళం రూపాయి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం తొలి విరాళంగా కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయిని లాంఛనంగా ట్రస్ట్‌కు అందజేసింది. కేంద్రం తరఫున హోంశాఖలో అండర్ సెక్రటరీగా పనిచేస్తున్న డీ ముర్ము బుధవారం ఈ మొత్తాన్ని నగదు రూపంలో ట్రస్ట్‌కు అందించారు. నగదు రూపంలో కానీ, స్థిరచరాస్తుల రూపంలో కానీ ట్రస్ట్‌కు విరాళాలు అందజేయవచ్చని అధికారులు తెలిపారు. ట్రస్ట్ కార్యాలయాన్ని తాత్కాలికంగా గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలోని సీనియర్ న్యాయవాది, ట్రస్ట్ సభ్యుడు పరాశరన్ ఇంట్లో ఏర్పాటు చేశామని, త్వరలో శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మసీదుకు ఇచ్చిన స్థలం చాలా దూరంగా ఉంది మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన స్థలం అయోధ్యకు 25 కి.మీ.ల దూరంలో రోడ్డు కూడా సరిగాలేని ఓ గ్రామంలో ఉందని ‘అయోధ్య’ వివాదంలోని ముస్లిం పిటిషన్‌దారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో స్థలాన్ని కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టంగా ఉంది. ఇప్పుడు కేటాయించిన ప్రదేశంచాలా దూరంలో ఉంది’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. వివాదాస్పద స్థలం ఉన్న 67 ఎకరాల్లోనే మందిరం, మసీదు ఉండాలని 1994లో ఇస్మాయిల్ ఫరుఖి కేసులో సుప్రీం తీర్పునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. -
రామ మందిరం నిర్మిస్తాం
న్యూఢిల్లీ: స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తిచేసుకునే 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్’ కలను సాకారం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆ పార్టీ సోమవారం 75 వాగ్దానాలతో లోక్‌సభ ఎన్నికలకు మేనిఫెస్టోను ప్రకటించింది. 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే 2022 నాటికి ఈ లక్ష్యాలన్ని సాధించాలని ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలిపింది. త్వరితగతిన రామమందిర నిర్మాణం, ఉగ్రవాదంపై ఉక్కుపాదం, వచ్చే మూడేళ్లలో రైతుల ఆదాయాన్ని మూడింతలు చేయడం తదితరాలను మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించింది. కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దుచేస్తామని హామీ ఇచ్చింది. మేనిఫెస్టో ముఖ్యాంశాలు సాంస్కృతిక వ్యవహారాలపై.. అయోధ్యలో త్వరితగతిన రామ మందిర నిర్మాణానికి రాజ్యాంగ నిబంధలకు లోబడి అన్ని చర్యలు తీసుకుంటాం. సంప్రదాయాలు, మత విశ్వాసాలకు రాజ్యాంగపర రక్షణ కల్పించేందుకు కృషిచేస్తాం. శబరిమల వివాదంలో మతాచారాలకు సంబంధించిన విషయాల్ని సుప్రీంకోర్టు ముందు సమగ్రంగా అందుబాటులో ఉంచుతాం. ఉమ్మడి పౌర స్మృతి ముసాయిదా రూపకల్పనకు కట్టుబడి ఉన్నాం. అన్ని లిఖిత, అలిఖిత భాషలు, యాసలపై అధ్యయనానికి జాతీయస్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేస్తాం. జమ్మూ కశ్మీర్‌పై.. ఆర్టికల్ 370 రద్దుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తున్నాం. బయటి వారెవరూ కశ్మీర్లో ఆస్తులు కొనుగోలు చేయకుండా నిరోధిస్తున్న ఆర్టికల్ 35ఏను కూడా తొలగిస్తాం. ఈ ఆర్టికల్ స్థానికేతరులు, మహిళలపై వివక్షాపూరితంగా ఉంది. ఆర్థిక వ్యవస్థపై.. 2030 నాటికి భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తాం. 2025 నాటికి మన ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు, 2032 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుస్తాం. రక్షణ, భద్రతపై.. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేలా సాయుధ బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాం. రక్షణ కొనుగోళ్ల ప్రక్రియను వేగిరం చేస్తాం. దశల వారీగా ఎన్ఆర్సీ(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్)ని వేర్వేరు ప్రాంతాల్లో అమలు చేస్తాం. రాష్ట్రాల సంస్కృతులు, ఆచారాలను గౌరవిస్తూ పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదిస్తాం. వ్యవసాయంపై.. 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్య సాధనకు కట్టుబడి ఉన్నాం. ప్రస్తుతం 2 హెక్టార్లలోపు భూమి ఉన్న రైతులకే అందుతున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయాన్ని రైతులందరికీ విస్తారిస్తాం. చిన్న, సన్నకారు రైతులకు పింఛన్ పథకాన్ని తెస్తాం. సకాలంలో చెల్లిస్తే రూ.లక్ష వరకు తీసుకునే రుణాలపై వడ్డీ కట్టనక్కర్లేదు. గ్రామీణాభివృద్ధిపై.. వచ్చే ఐదేళ్లలో గ్రామీణాభివృద్ధికి రూ. 25 లక్షల కోట్లు వెచ్చిస్తాం. సొంతిళ్లు లేని వారికి 2022 నాటికి పక్కా ఇళ్లు ఉండేలా చూస్తాం. 2024 నాటికి ప్రతి ఇంటికీ పైపుల ద్వారా తాగునీరు సరఫరా చేస్తాం. స్టార్టప్‌లపై.. ఎలాంటి హామీ లేకుండానే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రూ.50 లక్షల వరకు రుణ సదుపాయం పొందేలా కొత్త పథకం తెస్తాం. పురుషులు తీసుకునే రుణ మొత్తంలో 50 శాతానికి, మహిళలు పొందే రుణాల్లో 25 శాతానికి ప్రభుత్వమే హామీదారుగా ఉంటుంది. నియంత్రణ సంబంధిత నిబంధనలను సరళీకరించి స్టార్టప్‌ల స్థాపనను సులభతరం చేస్తాం. మౌలిక రంగంపై.. గ్యాస్ గ్రిడ్లు, వాటర్ గ్రిడ్లు, ఐ–వేస్, ప్రాంతీయ విమానాశ్రయాల నిర్మాణం, జాతీయ రహదారుల వెంట కనీస సదుపాయాల కల్పనతో తదుపరి తరం మౌలిక వసతులు నిర్మిస్తాం. ఇతర హామీలు ► దేశవ్యాప్తంగా కొత్తగా 75 మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలల స్థాపన ► ప్రతి గ్రామంలో ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ ► 2022 నాటికి అన్ని రైల్వే ట్రాక్‌ల విద్యుదీకరణ పూర్తి ► స్టెంట్లు, కృత్రిమ మోకాలి చిప్పలు లాంటి అత్యవసర వైద్య ఉపకరణాలతో ప్రత్యేక జాబితా. వాటి ధరల నిర్ధారణకు ప్రత్యేక విధానం జాతీయవాదమే స్ఫూర్తి జాతీయవాద స్ఫూర్తి, సుపరిపాలన అనే మంత్రంతో దేశాన్ని 2047(స్వాతంత్య్ర శతాబ్ది వేడుకల ఏడాది) నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా మారుస్తామని మోదీ అన్నారు. పౌరులందరికీ ఆత్మ గౌరవం, భద్రత, అభివృద్ధి అందించే శక్తిమంతమైన దేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని మేనిఫెస్టో ముందుమాటలో పేర్కొన్నారు. ఐదేళ్ల ఎన్డీయే పాలనలో చారిత్రక నిర్ణయాలు ఎన్నో తీసుకున్నామని, అన్ని వర్గాలకు న్యాయం చేశామని అమిత్ షా అన్నారు. జాతీయవాదానికి, ఉగ్రవాదంపై శూన్య సహనశీల వైఖరికి బీజేపీ కట్టుబడి ఉందని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్‌నాథ్ తెలిపారు. వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా మేనిఫెస్టో రూపొందించామని జైట్లీ అన్నారు. 370 రద్దుపై కన్నెర్ర జెండా ఎవరెగరేస్తారో చూస్తా: ఫరూక్ ‘370 అధికరణం రద్దు చేస్తామని వాళ్లు మాట్లాడుతున్నారు. అలా మీరు చేస్తే, కశ్మీర్లో మీ పాలనకు చట్టబద్ధత లేనట్లే. వారు ఆ పని ఎలా చేస్తారో చేయని వ్వండి. ఇక్కడ జాతీయ జెండా ఎగురవేస్తారో చూస్తా. హృదయాలను కలపండి, ముక్కలు కానివ్వకండి’ అని నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూక్ అబ్దుల్లా అన్నారు. నిప్పుతో ఆడుకోవద్దు: మెహబూబా ఆర్టికల్ 370 రాష్ట్రాన్ని దేశంతో కలిపే వారధి వంటింది. దానిని తెంపితే రాష్ట్రంపై భారత్‌కు చట్టబద్ధ హక్కు ఉండదు. కశ్మీర్ ఒక బాంబులా ఉంది. దానికి నిప్పు అంటిస్తే అంతటా అంటుకుంటుంది. కశ్మీర్‌తోపాటు భారత్ కూడా మిగలదు’ అని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోపై స్పందనలు అది వంచనా పత్రం: కాంగ్రెస్ 2014లో ఇచ్చిన హామీలనే తాజాగా తన మేనిఫెస్టోలో బీజేపీ చేర్చిందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. నిండా అబద్ధాలు, వంచనతో కూడిన మేనిఫెస్టో బదులు క్షమాపణ పత్రం విడుదల చేస్తే బాగుండేదని చురకలు అంటించింది. తమ మేనిఫెస్టోలో న్యాయం ఉంటే, బీజేపీ మేనిఫెస్టోలో అబద్దాలున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అన్నారు. మేనిఫెస్టోపై బెంగాల్ సీఎం మమతా స్పందిస్తూ ‘మోదీ ప్రధానిగా ఎన్నికైతే అసలైన పౌరులు శరణార్థులుగా మారుతారు’ అని హెచ్చరించారు. అది బీజేపీ గిమ్మిక్కు: ఎన్సీపీ బీజేపీ మేనిఫెస్టో ఒక జిమ్మిక్కు అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) పేర్కొంది. 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలయిందీ వెల్లడించాలని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నారు. ‘కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణం రద్దు, మందిర నిర్మాణం వంటి వాటిపై ఏళ్లుగా చెబుతున్న బీజేపీ ఇప్పటికీ నెరవేర్చలేదు’ అని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీకి అర్హత లేదు: మాయావతి ఎన్నికల హామీలను విస్మరించిన బీజేపీ, ప్రధాని మోదీకి తాజాగా మరో మేనిఫెస్టో విడుదల చేసే నైతిక అర్హత లేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. ఇందుకు బదులుగా ఆ పార్టీ గత హామీలు ఏమేరకు అమలయ్యాయో తెలిపే నివేదిక ఇస్తే బాగుండేదన్నారు. స్వాగతించిన శివసేన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను ఎన్డీఏ భాగస్వామి పార్టీ శివసేన స్వాగతించింది. మందిరం నిర్మించేందుకు, ఉమ్మడి పౌర స్మృతి అమలు చేసేందుకు గట్టిగా ప్రయత్నం చేస్తామని తెలిపింది. -
‘రామ మందిర నిర్మాణానికి చట్టం తేవొచ్చు’
ముంబై: అయోధ్యలో రామమందిర నిర్మాణం వివాదం సుప్రీంకోర్టులో ఉండగానే ప్రభుత్వం చట్టం తెచ్చి ఆలయాన్ని నిర్మించేందుకు అవకాశం ఉందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ నిర్వహించిన సమావేశంలో జస్టిస్ చలమేశ్వర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ‘చట్టం ద్వారా ఆలయాన్ని నిర్మించొచ్చా? లేదా? అనేది ఒక అంశం. అసలు ఈ ప్రభుత్వం చట్టం తెచ్చి గుడిని కడుతుందా? లేదా? అనేది మరో అంశం. అయితే కొత్త చట్టం తీసుకురావడం ద్వారా సుప్రీంకోర్టులోని కేసుతో సంబంధం లేకుండా ఆలయాన్ని నిర్మించడం మాత్రం సాధ్యమే. సుప్రీంకోర్టు తీర్పుల నుంచి తప్పించుకోడానికి చట్ట ప్రక్రియను ప్రభుత్వాలు ఉపయోగించుకున్న సందర్భాలు గతంలో ఉన్నాయి’ అని చలమేశ్వర్ అన్నారు. -
‘రామ మందిరం’ మధ్యవర్తిగా రవిశంకర్!
న్యూఢిల్లీ: వివాదాస్పద రామ మందిర నిర్మాణంపై చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించాలని నిర్మోహి అఖాదా, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ పండిట్ రవిశంకర్‌ను సంప్రదించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ధ్రువీకరిస్తూ, తాను కూడా ఇదే విషయమై అక్టోబర్ 20–15 మధ్య రవిశంకర్‌తో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ఈ కేసులో తదుపరి విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్లో చేపట్టనుంది. చర్చలకు మధ్యవర్తిగా రవిశంకర్‌నే ఎంచుకోవడం ఎందుకని ప్రశ్నించగా...ఆయన జీవన విధానం, అన్ని మతాల పట్ల ఆయన అనుసరిస్తున్న ప్రేమపూరిత వైఖరే కారణమని స్వామి బదులిచ్చారు. -
'మేం రెండేళ్లలో అవినీతిని దూరం చేశాం'
ఢిల్లీ: అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే బీజేపీ ప్రభుత్వం అవినీతిని దూరం చేసిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. యూపీఏ పదేళ్ల పాలనంతా అవినీతిమయమని విమర్శించారు. మంగళవారం అమిత్‌షా న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. యూపీ ప్రభుత్వ అసమర్థత వల్లే మథురలో అల్లర్లు జరిగాయని మండిపడ్డారు. కాగా, అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని అమిత్‌షా స్పష్టం చేశారు.