
అయోధ్య: అయోధ్యలోని రామమందిరం నిర్మాణానికి ముహూర్తం ఖరారయ్యింది. రామమందిరానికి జూన్10వ తేదీన పునాదులు వేస్తున్నట్టు గుడి ట్రస్ట్ అధికార ప్రతినిధి ప్రకటించారు. గత నవంబర్‌లో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు నేపథ్యంలో అయోధ్యలోని రామజన్మభూమిలో కోర్టు కేటాయించిన స్థలంలోని కుబేర్ మందిరంలో శివుడి ప్రార్థనలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించారు. లంకపై దాడికి వెళ్ళేముందు రాముడు అనుసరించిన శివుడి ప్రార్థనల ‘రుద్రాభిషేకం’’తోనే రామమందిర నిర్మాణం కూడా ప్రారంభిస్తున్నట్టు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధిపతి మహంత్ నృత్య గోపాల్ దాస్ వెల్లడించారు. జూన్ 10న, బుధవారం ఉదయం 8 గంటలకు ట్రస్ట్ అధికార ప్రతినిధి మహంత్ కమల్ నయన్ దాస్, ఇతర పౌరోహితుల ప్రత్యేక ప్రార్థనల అనంతరం రామాలయానికి పునాదులు వేయడం ప్రారంభం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment