rama janmabhoomi
-
secunderabad: అయోధ్యకు బయలుదేరిన మొదటి ట్రైన్
సాక్షి, హైదరాబాద్: అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం అనంతరం దేశవ్యాప్తంగా ప్రజలు బాలరాముడి దర్శించుకోవటానికి భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యకి ప్రయాణికులతో మొదటి ట్రైన్ బయలుదేరింది. 1400 మంది ప్రయాణికులతో ఈ ట్రైన్ మొదలైంది. Flagged off special train to #Ayodhya from Secunderabad Railway station along with MLA Shri @kvr4kamareddy ji, MLA Shri @Dhanpal_Suranna ji, Shri @ShyamSunder_BJP ji and Senior leaders. #JaiShreeRam pic.twitter.com/32M624iMlv — Kontham Deepika BJP (@KonthamDeepika) February 5, 2024 అయోద్య రైలు కోసం రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయోధ్య దర్శనం అనంతరం తిరిగి 9వ తేదీన మళ్ళీ సికింద్రబాద్‌కు ప్రత్యేక రైలు రానున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. -
బాలరామున్ని దర్శించుకున్న హనుమాన్..! ఆలయంలో ఆసక్తికర ఘటన
లక్నో: అయోధ్య రామాలయ గుడిలో విచిత్రమైన ఘటన జరిగింది. బాలరాముడు కొలువై ఉన్న గర్భగుడిలోకి ఓ వానరం ప్రవేశించింది. మంగళవారం సాయంత్రం సమయంలో గుడి దక్షిణ ద్వారం గుండా ఓ కోతి ప్రవేశించింది. కొత్త ఆలయాన్ని నిర్మించడానికి ముందు గుడారంలో ఉంచిన బాలరాముని పాత విగ్రహాన్ని చేరుకుంది. ఈ విషయాన్ని అయోధ్య రామాలయ ట్రస్టు ట్విట్టర్ వేదికగా పంచుకుంది. విగ్రహం భద్రత గురించి భద్రతా సిబ్బంది ఆందోళన చెంది, కోతి వైపు పరుగెత్తారు. అయితే, కోతి ప్రశాంతంగా వెనక్కి తిరిగి ఉత్తర ద్వారం వైపు వెళ్లింది. అది మూసివేసి ఉండటంతో భక్తుల రద్దీని దాటి ఎలాంటి హాని చేయకుండా తూర్పు ద్వారం గుండా వెళ్లిపోయింది. బాలరామున్ని దర్శించేందుకు హనుమంతుడు స్వయంగా వచ్చాడని కోతి సందర్శనను దైవానుగ్రహంగా భక్తులు భావించారని ట్రస్ట్ తెలిపింది. आज श्री रामजन्मभूमि मंदिर में हुई एक सुंदर घटना का वर्णन: आज सायंकाल लगभग 5:50 बजे एक बंदर दक्षिणी द्वार से गूढ़ मंडप से होते हुए गर्भगृह में प्रवेश करके उत्सव मूर्ति के पास तक पहुंचा। बाहर तैनात सुरक्षाकर्मियों ने देखा, वे बन्दर की ओर यह सोच कर भागे कि कहीं यह बन्दर उत्सव… — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 23, 2024 కోతిని హనుమంతుని రూపంగా భక్తులు భావిస్తారు. అయితే.. అక్టోబర్ 30, 1990న బాబ్రీ మసీదుపై కరసేవకులు జెండాలను ఎగురవేశారు. ఈ క్రమంలో కరసేవకులను భద్రతా బలగాలు చెదరగొట్టాయి. ఈ క్రమంలో మసీదు గోపురంపై కరసేవకులు అమర్చిన జెండాను తొలగించకుండా ఓ కోతి కాపాడింది. ఇదీ చదవండి: కేంద్ర మంత్రులు అయోధ్యకు వెళ్లకండి: మోదీ -
కేంద్ర మంత్రులు అయోధ్యకు వెళ్లకండి: మోదీ
లక్నో: ఫిబ్రవరిలో అయోధ్యను సందర్శించడం మానుకోవాలని కేబినెట్ మంత్రులను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన తర్వాత భక్తులు భారీ సంఖ్యలో రామమందిరానికి తరలి రావడంతో మోదీ ఈ మేరకు మంత్రులకు విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో కేంద్ర మంత్రులు మార్చి నెలలో అయోధ్యను సందర్శించనున్నట్లు తెలుస్తోంది. వీఐపీల సందర్శనలో ప్రోటోకాల్‌ల వల్ల భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అయోధ్యకు వెళ్లే ప్రణాళికను మంత్రులు వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ కోరినట్లు తెలుస్తోంది. అయోధ్య రామమందిర నిర్మాణంపై ప్రజల అభిప్రాయాన్ని కూడా ప్రధాని మోదీ మంత్రులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. సోమవారం అయోధ్య ఆలయంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ నాయకత్వం వహించారు. ఈ వేడుకను దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. అగ్రశ్రేణి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు, సెలబ్రిటీలతో సహా అనేక వేల మందిని కార్యక్రమానికి ఆహ్వానించారు. సంప్రోక్షణ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆహ్వానితులు దేవుడి దర్శనం చేసుకున్నారు. సాధారణ ప్రజల కోసం మంగళవారం ఉదయం ఆలయ తలుపులు తెరవబడ్డాయి. మొదటి రోజు దాదాపు ఐదు లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు బారులు తీరారు. భక్తులు భారీగా తరలిరావడంతో మంగళవారం దర్శనానికి కొద్దిసేపు విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఇదీ చదవండి: Ayodhya Ram Mandir: తొలి రోజు రాములోరి నిద్ర 15 నిముషాలే! -
Ram Mandir: ‘ భూమ్మీద అత్యంత అదృష్టవంతుడను నేనే’
అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. సర్వాంగ సుందరంగా, నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగింది. గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నేతృత్వంలో మహా గంభీరంగా ప్రాణప్రతిష్ట క్రతువు నిర్వహించారు. రామ్ లల్లా విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ట కర్తగా వ్యవహరించారు. ప్రాణప్రతిష్ట చేసిన బాల రాముడి విగ్రహం జీవకళ ఉట్టిపడుతోంది. ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ సుందరంగా చెక్కిన విషయం తెలిసిందే. సోమవారం అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న అరుణ్ యోగిరాజ్ మీడియాతో మాట్లాడారు. ‘నేను ఈ భూమి మీద ఉన్న అదృష్టమైన వ్యక్తిగా భావిస్తున్నాను. భగవాన్ శ్రీ రామ్ లల్లా, మా పూర్వికులు, కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు ఎల్లప్పడూ నాతో ఉంటాయి. ఇప్పటికీ నాకు ఊహాలోకంలో ఉన్నట్లు అనిపిస్తోంది’ అని యోగిరాజ్ పేర్కొన్నారు. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించే రాముని విగ్రహాన్ని ఎంపిక చేయడానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సమావేశంలో ఓటింగ్ నిర్వహించి విషయం తెలిసిందే. ప్రత్యేక శిల్పులు రూపొందించిన మూడు నమూనాల్లో ఒక విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఇందులో యోగి రాజు చెక్కిన బాలరాముని శ్యామవర్ణ విగ్రహం ఎక్కువ ఓట్లు పొందిన అత్యుత్తమ విగ్రహంగా నిలిచింది. రామ్ లల్లా విగ్రహ విశేషాలు.. ► అయోధ్య రామాలయంలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ► నల్లరాతిపై చెక్కిన బాల రాముడి ప్రతిమ. నీలమేఘ శ్యాముడంటూ రామాయణంలోని వర్ణనకు అనుగుణంగా ఈ రాతిని ఎంచుకున్నారు. ► రామ్‌లల్లాను చెక్కిన శిల బరువు దాదాపు 200 కిలోలు. ► ఐదేళ్ల బాలుడి రూపంలో రామ్‌లల్లా విగ్రహాన్ని రూపొందించారు. ► ఓ చేతిలో బాణం పట్టుకుని, మరో చేతితో ఆశీర్వాదం ఇస్తున్న రూపంలో విగ్రహాన్ని మలిచారు. ► స్వచ్ఛమైన బంగారంతో విల్లంబులు తయారుచేసి బాల రాముడి చేతిలో అలంకరించారు. ► శ్రీరామ నవమి రోజున గర్భగుడిలో సూర్య కిరణాలు పడేలా ఏర్పాట్లు ► శ్రీరాముడికి సూర్య తిలకంలో కిరణాలు పడేలా ఏర్పాట్లు చదవండి: Ayodhya Ram Mandir: భావోద్వేగానికి లోనైన దిగ్గజ నేతలు -
Ayodhya Ram Mandir: 32 ఏళ్ల తర్వాత అయోధ్యకు ఉమాభారతి
అయోధ్యలో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతం అయింది. సర్వాంగ సుందరంగా, నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగింది. గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నేతృత్వంలో మహా గంభీరంగా ప్రాణప్రతిష్ట క్రతువు నిర్వహించారు. రామ్ లల్లా విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ట కర్తగా వ్యవహరించారు. అయితే బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ముందు రామ మందిర ప్రాంగణంలో చోటుచేసుకున్న ఓ ఘటన అక్కడ ఉన్నవారందరినీ భావోద్వేగానికి గురిచేసింది. రామ మందిర నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ దిగ్గజ నేతలు ఉమాభారతి, సాధ్వి రితంబర మందిర ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే భావోద్వేగానికి లోనయ్యారు. వారిరువురు తాము కన్న కల నిజమైందని భావోద్వేగంతో కౌగిలించుకున్నారు. ఈ క్రమంలో సాధ్వి రితంబర కళ్లు చెమర్చాయి. రామ మందిర నిర్మాణమే లక్ష్యంగా పోరాడిన ఈ నేతల కలసాకారమైంది. వారు భావోద్వేగానికి లోనైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. मैं अयोध्या में राम मंदिर के सामने हूं, रामलला की प्रतीक्षा हो रही है।@BJP4India @BJP4MP @ShriAyodhya_ @RamNagariAyodhy pic.twitter.com/2NDjQZhQxH — Uma Bharti (@umasribharti) January 22, 2024 సుమారు 32 ఏళ్ల తర్వాత నేడు రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం అమె అయోధ్యలో అడుగుపెట్టారు. ‘నేను అయోధ్యలోని రామ మందిరం ముందు ఉన్నాను. రామ్ లల్లా దర్శనం కోసం వేచి ఉన్నా’ అని ఉమాభారతి మందిరం ముందు దిగిన ఫొటోను ‘ఎక్స్’ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 1990లో అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ చేపట్టిన ఉద్యమంలో ఉమాభారతి, సాధ్వి రితంబర కీలకమైన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక.. బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని రాజకీయ, సినీ ప్రముఖలు హాజరై తిలకించారు. చదవండి: Ayodhya Ram Mandir: అయోధ్య కొలువుదీరిన బాలరాముడు.. దర్శన వేళలు ఇవే -
వేయి టన్నుల పూలతో అయోధ్య రామాలయం అలంకరణ
-
అయోధ్యలో నూతనోదయం: యోగి ఆదిత్యానాథ్
జాసు బిరహ సోచహు దిన రాతీ! రటహు నిరంతర గున్ గన్ పాంతి!! రఘుకుల తిలక సుజన్ సుఖదాత! ఆయౌ కుసల్ దేవ ముని త్రాతా!! శతాబ్దాల నిరీక్షణకు, తరాల పోరాటానికి, మన పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞకు ముగింపు పలికే రోజు ఎట్టకేలకు వచ్చింది. సనాతన సంస్కృతికి ఆత్మ అయిన ‘రఘునందన్ రాఘవ్ రామ్‌లల్లా’ తన జన్మస్థలమైన అవధ్‌పురిలోని గొప్ప దైవిక ఆలయంలో ప్రతిష్ఠితమవుతున్నారు. 500 సంవత్సరాల విరామం తర్వాత జరుగు తున్న ఈ చరిత్రాత్మకమైన, పవిత్రమైన సందర్భం... భారతదేశాన్ని మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని ‘మోక్షదాయని’ అయోధ్యపై చూపు నిలిపేలా చేసింది. నేడు ప్రతి రహదారీ శ్రీరామ జన్మభూమికి దారి తీస్తుంది. ప్రతి కన్ను ఆనందబాష్పాలతో తడిసిపోతుంది. అందరూ ‘రామ్–రామ్’ అని జపిస్తారు. తరతరాలుగా విశ్వాసులు, లోకాన్ని విడిచిపెట్టిన రామభక్తులు ఈ రోజు కోసం ఎంతగానో ఎదురు చూశారు. 2024 జనవరి 22 ప్రాముఖ్యత బాలరూప రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు మించినది. ఇది ప్రజల విశ్వాస పునఃస్థాపనను సూచిస్తుంది. అయోధ్య ఇప్పుడు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. సత్య న్యాయాల ఉమ్మడి విజయం చేదు జ్ఞాపకాలను చెరిపివేస్తుంది. కొత్త కథలను సృష్టిస్తుంది. సమాజంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది. ‘శ్రీరామ జన్మభూమి ముక్తి మహాయజ్ఞం’ అనేది కేవలం సనాతన విశ్వాసానికి పరీక్ష కాదు; ఇది విజయవంతంగా దేశ సామూహిక చైతన్యాన్ని మేల్కొల్పింది. భారత దేశాన్ని ఐక్యతా సూత్రంతో కలిపింది. రాముడి జన్మస్థలంలో ఆలయ నిర్మాణం కోసం జరిగిన పోరాటంలో ప్రదర్శించిన ప్రత్యేక ఐక్యత అసమానమైనది. సాధువులు, సన్యాసులు, మేధావులు, రాజకీయ నాయకులు మరియు అన్ని వర్గాల ప్రజలు విభేదాలకు అతీతంగా ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ఏకమయ్యారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ వంటి సామాజిక సాంస్కృతిక సంస్థలు రోడ్‌మ్యాప్‌ను రూపొందించి ప్రజలను ఏకం చేశాయి. ఆ తీర్మానం ఎట్టకేలకు నెర వేరింది. భారతదేశంలో కొత్త ఉషస్సు వెల్లివిరుస్తోంది. ఒకప్పుడు ‘అవని అమరావతి’ అనీ, ‘భూలోక వైకుంఠం’ అనీ పిలి చిన అయోధ్య శతాబ్దాల పాటు శాప గ్రస్తంగా ఉండిపోయింది. ‘రామ రాజ్యం’ ఒక ఆదర్శ భావనగా ఉన్న దేశంలోనే రాముడు తన ఉనికిని నిరూపించుకోవాల్సిన అగత్యం వచ్చింది. అతని జన్మస్థలానికి ఆధారాలు కావాల్సి వచ్చింది. కానీ శ్రీరాముని జీవితం మర్యాదగా ప్రవర్తించడం, స్వీయ నిగ్రహాన్ని పాటించడం నేర్పుతుంది. రాముని భక్తులు ఓర్పు, పట్టుదలను ప్రదర్శించారు. నేడు అయోధ్య తాను కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందడంతో యావత్ జాతి సంతోషిస్తోంది. ఈ సంకల్పాన్ని నెరవేర్చడానికి మార్గనిర్దేశం చేసినందుకు గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీకి హృదయపూర్వక అభినందనలు! 2024 జనవరి 22 వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషకరమైన సందర్భం. నేను ఈ ప్రయాణం గురించి తలపోస్తున్నప్పుడు, రామ జన్మభూమిని విముక్తం చేయాలన్న అచంచలమైన సంకల్ప క్షణాలు నా మనస్సును ముంచెత్తుతున్నాయి. ఈ సంకల్పమే నన్ను గౌరవనీయులైన గురుదేవ్ మహంత్ వైద్యనాథ్ జీ మహారాజ్ సద్గుణ సాంగత్యంలోకి నడిపించింది. విగ్రహ ప్రతిష్ఠాపన శుభ సందర్భంలో మా తాత బ్రహ్మలీన్ మహంత్ శ్రీ దిగ్విజయ్నాథ్ జీ మహారాజ్, గౌరవనీయులైన గురుదేవ్ బ్రహ్మలీన్ మహంత్ శ్రీ వైద్యనాథ్ జీ మహారాజ్‌తో పాటు ఇతర గౌరవనీయులైన సాధువులు భౌతికంగా లేరని నాకు తెలుసు. కానీ వారి ఆత్మలు కచ్చితంగా అపారమైన సంతృప్తిని అనుభవిస్తాయి. గౌరవనీయులైన నా గురువులు జీవితాంతం అంకితభావంతో చేసిన తీర్మానం నెరవేరడానికి సాక్షిగా నిలవడం నా అదృష్టం. శ్రీ రామ జన్మభూమి ఆలయంలో శ్రీరామ్‌లల్లా ప్రతిష్ఠాపన గురించి ప్రకటించినప్పటి నుండి, ప్రతి సనాతన విశ్వాసిలో నిరీక్షణ స్పష్టంగా కనిపించింది. ఇటీవలి శతాబ్దాలలోనే అసమానమైన సామూహిక ఆనంద వాతావరణం దేశమంతటా వ్యాపించింది. శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య, సిక్కు, బౌద్ధ, జైన, దశనామీ శంకర్, రామానంద, రామానుజ, నింబార్క, మధ్వ, విష్ణునామి, రామసనేహి, ఘీసాపంథ్, గరీబ్దాసి, అకాలీ, నిరంకారీ, గౌడీయ, కబీర్పంథ్ వంటి విభిన్న ఆధ్యాత్మిక సంప్రదాయాలకు చెందిన వారు... అనేక సంఖ్యలో ఉన్న శాఖలు, ఆరాధన పద్ధతుల వారు... 150కి పైగా సంప్రదాయాలకు చెందిన సాధువులు... అటవీ – గిరి నివాసులు, గిరిజన సమూహాలు, వివిధ రంగాలకు చెందిన ప్రము ఖులు... రాజకీయాలు, సైన్స్, పరిశ్రమలు, క్రీడలు, కళలు, సంస్కృతి, సాహిత్య రంగాలవారు అందరూ ఒకే గొడుగు కిందకు చేరడం నిజంగా అపూర్వమైనది, అరుదైనది. ఈ మహత్తరమైన సందర్భం ఎంతో గర్వకారణం. ఉత్తరప్రదేశ్‌లోని 25 కోట్ల మంది ప్రజల తరఫున పవిత్ర అయోధ్యధామంలో ఉన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను. ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం తరువాత, అయోధ్యధామం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు, పర్యా టకులకు, పరిశోధకులకు, జిజ్ఞాసువులకు సాదర స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. ప్రధాన మంత్రి దూరదృష్టితో కూడిన ప్రణాళికలకు అనుగుణంగా అయో«ధ్యాపురి కచ్చితమైన సన్నాహాలు చేస్తోంది. నగరం ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం, విస్తరించిన రైల్వే స్టేషన్, అన్ని దిశల నుండి కలుస్తున్న 4–6 లేన్ రోడ్లతో బాగా అనుసంధానించబడిన నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. అదనంగా హెలిపోర్ట్ సేవ, సందర్శకుల విభిన్న అవసరాలను తీర్చడానికి అనుకూలమైన హోటళ్లు, అతిథి గృహాల శ్రేణి ఏర్పాటైనాయి. కొత్త అయోధ్యలో, పురాతన సంస్కృతి, నాగరికత పరిరక్షణ జరుగుతూనే అత్యాధునిక నగర సౌక ర్యాలు అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి తగినట్టుగా నిర్మాణం జరుగుతోంది. ఈ చొరవలో భాగంగా అయోధ్యలోని పంచకోసి, 14 కోసి, 84 కోసి పరిక్రమ పరిధిలోని మతపరమైన, పౌరాణిక. చారిత్రక ప్రదేశాలకు వేగవంతమైన పునరుజ్జీవనం కలిగించడం జరిగింది. ఈ సమష్టి ప్రయత్నాలు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు దోహదపడటమే కాకుండా పర్యాటకాన్ని పెంచడానికీ, ఈ ప్రాంతంలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడానికీ ఉపయోగపడతాయి. శ్రీరామ జన్మభూమి ఆలయ స్థాపన ఒక లోతైన ఆధ్యాత్మిక వేడుకగా నిలుస్తుంది. ఇది భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి సూచిక. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ఇది జాతీయ దేవాలయం. శ్రీరామ్లలా పవిత్రోత్సవం యావత్ జాతి జనుల హృదయాన్ని గర్వంతో ఉప్పొంగించే ఒక ముఖ్యమైన సందర్భం. రాముడి దయతో, అయోధ్య సంప్రదాయ పరిక్రమ పవిత్రత ఇప్పుడు సురక్షితంగా ఉంటుంది. ఎటువంటి ఆటంకాలూ దాని పవిత్ర మార్గాన్ని నాశనం చేయలేవు. అయోధ్య వీధులలో ఇక బుల్లెట్లు ప్రతి ధ్వనించవు, సరయూ నది రక్తపు మరకను భరించదు, కర్ఫ్యూ విధ్వంసం జరగదు. బదులుగా ఆనందో త్సవ వేడుకలు జరుపుకొంటూ, రామనామ సంకీర్తనలతో ప్రతిధ్వనిస్తుంది. అవధ్పురిలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ భారతదేశంలో రామరాజ్య స్థాపన తాలూకు ప్రకటనను తెలియజేస్తుంది. ఇది ఆదర్శానికి స్వరూపం. ఇక్కడ ‘సబ్ నర్ కరహీ పరస్పర ప్రీతి చలహీ స్వధర్మం నిరత శుతి నీతి’ అవుతుంది. శ్రీ రామ జన్మభూమి ఆలయంలో ప్రతిష్ఠించనున్న బాలరూప రాముని విగ్రహం మార్గదర్శక కాంతిగా పనిచేస్తుంది. ప్రతి సనాతన విశ్వాసి తన మతపరమైన సూత్రాలను అనుసరించడానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ శుభ సందర్భంగా 140 కోట్ల మంది తోటి పౌరులకు అభినందనలు! మన పూర్వీకులు నెలకొల్పుతామని గంభీరంగా ప్రమాణం చేసిన ఆలయాన్ని నిర్మించాలనే నిబద్ధత నెరవేరడం చూసి మనం ఎనలేని సంతృప్తిని పొందుదాం. భగవంతుడు శ్రీరాముని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలి. శ్రీ రామః శరణం మమ జయ–జయ శ్రీసీతారామ్! యోగి ఆదిత్యనాథ్ వ్యాసకర్త ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి -
అంతరిక్షం నుంచి అయోధ్య చిత్రాలు..!
లక్నో: రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జనవరి 22(సోమవారం)న జరగనుంది. ఈ సందర్భంగా అంతరిక్షం నుంచి తీసిన రామ మందిర దృశ్యాలను ఇస్రో పంచుకుంది. ఇస్రో ఆధ్వర్యంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)ఈ దృశ్యాలను తీసింది. డిసెంబర్ 16, 2023న నిర్మాణంలో ఉన్న ఆలయం ఫొటోలు తీసింది. ఉపగ్రహ చిత్రాలలో నూతనంగా అభివృద్ధి చేసిన దశరథ్ మహల్, సరయు నది కూడా రామమందిరం సమీపంలో చూడవచ్చు. కొత్తగా పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను NRSC షేర్ చేసిన చిత్రాలలో కూడా చూడవచ్చు. ఆలయ మొదటి దశ పూర్తి కావొస్తోంది. జనవరి 22న బాలరాముని విగ్రహాన్ని ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. దేశంలో ప్రముఖులతో కలిపి మొత్తం 7000 మందికి ఆహ్వానాలు అందాయి. సాంప్రదాయ నగారా శైలిలో నిర్మించిన ఆలయ సముదాయం 380 అడుగుల పొడవు (తూర్పు-పడమర దిశ), 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయంలోని ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉన్నాయి. ఇదీ చదవండి: అయోధ్య రామయ్య దర్శనం, ప్రసాదం ఉచితమే..! -
Ayodhya Event: సెలవుపై వెనక్కి తగ్గిన ఢిల్లీ ఎయిమ్స్
ఢిల్లీ: అయోధ్య రామ మందిర వేడుకకు ఆఫ్ డే సెలవు ప్రకటనపై ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వెనక్కి తగ్గింది. మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని రేపు మధ్యాహ్నం 2.30 గంటల వరకు నాన్ క్రిటికల్ సర్వీస్‌లను మూసివేయాలన్న నిర్ణయాన్ని ఈరోజు వెనక్కి తీసుకుంది. నాన్-క్రిటికల్ సర్వీస్‌లలోని సిబ్బందికి రేపు సగం రోజు విరామం ప్రకటించడంపై నిరసన వ్యక్తమైన విషయం తెలిసిందే. ఎయిమ్స్-ఢిల్లీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజేష్ కుమార్ రేపు ఆఫ్ డే సలవు అని పేర్కొంటూ మెమోరాండం జారీ చేశారు. రేపు ప్రభుత్వ సిబ్బందికి హాఫ్ డేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. "22.01.2024న 14.30 గంటల వరకు ఎయిమ్స్ హాఫ్ డే సెలవు ఉంటుందని ఉద్యోగులందరి సమాచారం" అని మెమోరాండం పేర్కొంది. అయినప్పటికీ, "అన్ని క్రిటికల్ క్లినికల్ సేవలు" నడుస్తాయని పేర్కొన్నారు. ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (OPD) సేవలు అందుబాటులో ఉంటాయో లేదో అధికారిక నోట్లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కానీ ఇలాంటి రోజుల్లో అవుట్డోర్ పేషెంట్లు వైద్యులను సంప్రదించలేమని భయపడ్డారు. దీంతో ఢిల్లీ ఎయిమ్స్ నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. రోగులు నెలల తరబడి వేచి ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓపీడీ సేవలు నిలిపివేస్తే రోగులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని మండిపడ్డారు. దీంతో ఢిల్లీ ఎయిమ్స్ యాజమాన్యం తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఇదీ చదవండి: అయోధ్య రామయ్య దర్శనం, ప్రసాదం ఉచితమే..! -
అయోధ్య రామయ్య దర్శనం ఉచితమే..!
లక్నో: రామ మందిరం దేశంలోనే ప్రముఖ దేవాలయాల జాబితాలో చేరబోతోంది. ఇలాంటి చోట దర్శనం, ప్రసాదాలకు రుసుము ఉండటం సహజం. కానీ, భక్తులు సమర్పించిన రూ.వేల కోట్ల విరాళాలతో రూపుదిద్దుకుంటున్న ఈ భవ్య మందిరంలో భక్తులపై దర్శన వేళ అదనంగా రుసుము భారం మోపొద్దని ట్రస్టు నిర్ణయించింది. ఎంతమంది భక్తులు వచ్చినా ఎలాంటి రుసుమూ లేకుండా దర్శనానికి అవకాశం కల్పించబోతున్నారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరికీ ఒకే తరహాలో దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి దర్శన అనంతరం ఎంతో భక్తిశ్రద్ధలతో స్వీకరించే ప్రసాదం కూడా ఉచితంగా అందించాలని నిర్ణయించారు. అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి కాకముందే భక్తుల తాకిడి పెరిగింది. ఇక్కడ ఆలయ నిర్మాణం ప్రారంభం కాకమునుపు రోజుకు సగటున 1500 నుంచి 2000 మంది వరకు వచ్చేవారు. ఆలయ పనులు మొదలయ్యాక ఆ సంఖ్య ఒక్కసారిగా పది వేలకు పెరిగింది. ఇప్పుడు నిత్యం 40 వేల నుంచి 50 వేల మంది భక్తులు అయోధ్యకు వస్తున్నారు. జనవరి 22 ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఆ సంఖ్య లక్షకు చేరువవుతుందని అంచనా వేస్తున్నారు. వీరందరికీ ఉచితంగానే దర్శనం కల్పించాలని భావిస్తున్నారు. ఆలయ నిర్మాణానికి అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రపభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవటం లేదని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఇప్పటికే ప్రకటించింది. పూర్తిగా భక్తులు సమర్పించిన విరాళాలతోనే పనులు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటి వరకు ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా రామభక్తుల నుంచి రూ.3500 కోట్లకు పైగానే విరాళాలు అందినట్టు సమాచారం. వాటి ద్వారా వస్తున్న వడ్డీ మొత్తంతోనే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు. భక్తులు ఇప్పటికీ విరాళాలు సమర్పిస్తూనే ఉన్నారు. అయోధ్య ఆలయ సమీపంలో ఉన్న కౌంటర్లు, తాత్కాలిక మందిరం వద్ద ఉన్న కౌంటర్లతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా భక్తులు విరాళాలు సమర్పిస్తూనే ఉన్నారు. ప్రతినెలా రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు అవి సమకూరుతున్నట్టు సమాచారం. ఇదీ చదవండి: అయోధ్య రామాలయం: భారీగా పెరిగిన స్టాక్‌లు ఇవే..! -
అయోధ్య రామాలయం: భారీగా పెరిగిన స్టాక్‌లు ఇవే..!
లక్నో: అయోధ్య రామ మందిర నిర్మాణం చిన్న స్టాక్‌లకు వరంగా మారింది. ఆలయ నిర్మాణంతో సంబంధం ఉన్న కంపెనీల షేర్లు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. అయోధ్య సమీపంలో లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేసిన ప్రవేగ్ లిమిటెడ్, సీసీటీవీ నిఘా నెట్వర్క్ కోసం కాంట్రాక్ట్ పొందిన అలైడ్ డిజిటల్ సర్వీసెస్ లిమిటెడ్ రెండు స్టాక్స్ గత నెలలో 55% కంటే ఎక్కువ పెరిగాయి. కామత్ హోటల్స్ ఇండియా లిమిటెడ్ కూడా దాదాపు 35% లాభపడింది. అయోధ్య ప్రారంభోత్సవానికి ముందే అక్కడ భక్తుల రద్దీ భారీగా పెరిగిందని ప్రవేగ్ లిమిటెడ్ తెలిపింది. స్థలం కోసం ఇప్పటికే అక్కడ ట్రావెల్ ఏజెంట్లు పోటీ పడుతున్నారని పేర్కొంది. అయోధ్యలో సీసీటీవీ ఒప్పందంతోనే అలైడ్ డిజిటల్ వెలుగులోకి వచ్చిందని బ్రోకరేజ్ బొనాంజా పోర్ట్‌ఫోలియో లిమిటెడ్ విశ్లేషకుడు వైభవ్ విద్వానీ తెలిపారు. అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. ఈ పుణ్యక్షేత్రంతో పర్యాటకం అభివృద్ధి కావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కొత్త విమానాశ్రయం, రైలు స్టేషన్ గత నెలలో ప్రారంభమైంది. హోటళ్ళు, రిటైలర్లు, బ్యాంకింగ్ సెక్టార్ కూడా విస్తరించడానికి పలు సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఆలయం చుట్టూ మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడంతో వేల సంఖ్యలో భక్తులు రానున్నారు. మౌలిక సదుపాయాల కల్పన ఎంతో ప్రాముఖ్యతగా మారనుంది. అయెధ్యలో స్థిరమైన వృద్ధి జరుగుతుందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈక్విటీలో పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ డైరెక్టర్ సుకుమార్ రాజా తెలిపారు. రాబోయే రోజుల్లో ఉత్తరప్రదేశ్ ప్రధాన ప్రయాణ, వ్యాపార కార్యకలాపాల కేంద్రంగా అయోధ్య ఉద్భవించగలదని ఆయన భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: Ayodhya Ram mandir: అయోధ్య భక్తజన సంద్రం -
రాముని విగ్రహం ఫొటోలు లీకు..! ప్రధాన పూజారి ఆగ్రహం
లక్నో: ప్రాణప్రతిష్టకు ముందే బాలరాముని విగ్రహం ఫొటోలు లీకవడంపై అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. దీనిపై దర్యాప్తుకు డిమాండ్ చేశారు. ‘‘ప్రాణప్రతిష్ట జరగకుండా మూలవిరాట్టు ఫొటోలు విడుదల చేయడం సరికాదు. ముఖ్యంగా నేత్రాలను బహిర్గతపరచడం పూర్తిగా నిషిద్ధం. కళ్లు కనిపిస్తున్నది అసలు విగ్రహం కాదు." అని తెలిపారు. ఒకవేళ అది అసలు విగ్రహమే అయితే ఫొటోను లీక్ చేసిందెవరో కనిపెట్టి శిక్షించాలని ఆచార్య సత్యేంద్ర దాస్ కోరారు. ప్రాణప్రతిష్ట జరగనున్న బాలరామునికి సంబంధించి శుక్రవారం రెండు ఫొటోలు వెలుగు చూడటం తెలిసిందే. ఒకదాంట్లో కళ్లకు పసుపు వస్త్రం కట్టి ఉండగా మరొక దాంట్లో కళ్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాణప్రతిష్టకు సంబంధించి ఎలాంటి తప్పుడు కంటెంట్‌నూ వ్యాప్తి చేయొద్దని ప్రింట్, టీవీ మీడియాతో పాటు సోషల్ మీడియా వేదికలకు కేంద్రం సూచించింది. #WATCH | Ayodhya: On the idol of Lord Ram, Shri Ram Janmabhoomi Teerth Kshetra Chief Priest Acharya Satyendra Das says, "...The eyes of Lord Ram's idol cannot be revealed before Pran Pratishtha is completed. The idol where the eyes of Lord Ram can be seen is not the real idol. If… pic.twitter.com/I0FjRfCQRp — ANI (@ANI) January 20, 2024 రేపు (జనవరి 22)న అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. ఇందుకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దేశంలో ప్రముఖ నేతలు హాజరుకావడానికి ఆహ్వానాలు అందాయి. దాదాపు 7,000 మంది హాజరుకానున్నారు. ఈ వేడుకకు విదేశీ ప్రముఖులు కూడా హాజరవుతారు. ఇదీ చదవండి: Ayodhya Ram mandir: అయోధ్య భక్తజన సంద్రం -
సెలవు ఇవ్వండి.. సీజేఐకి లేఖ
లక్నో: అయోధ్యలోని రామమందిర ప్రతిష్ఠాపన వేడుకను వీక్షించేందుకు జనవరి 22న కోర్టులకు సెలవు ఇవ్వాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ చారిత్రక సందర్భాన్ని గుర్తించడానికి తగిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నట్లు బార్ కౌన్సిల్ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా లేఖలో పేర్కొన్నారు. ఈ అభ్యర్థనను అత్యంత సానుభూతితో పరిగణించాలని సీజేఐని కోరారు. "అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేడుకలు, దేశవ్యాప్తంగా జరిగే ఇతర సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనడానికి కోర్టు సిబ్బందికి సెలవు రోజు అవసరం అవుతోంది." అని బార్ కౌన్సిల్ ఛైర్మన్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా అన్నారు. తక్షణ విచారణ అవసరమయ్యే అంశాన్ని ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా సర్దుబాటు చేయవచ్చు లేదా తదుపరి రోజుకు రీషెడ్యూల్ చేయవచ్చని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సాధువులు, ప్రముఖులతో సహా 7,000 మందికి పైగా ప్రజలు ఈ వేడుకలకు హాజరవనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వివిధ దేశాల నుండి దాదాపు 100 మంది ప్రతినిధులు పాల్గొంటారు. ఇదీ చదవండి: Ayodhya Ram Mandir: అయోధ్యలో కలశ పూజ -
అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠకు శరద్ పవార్ దూరం
ముంబయి: అయోధ్య రామ మందిరంలో జనవరి 22న జరిగే ప్రతిష్ఠాపన కార్యక్రమానికి తాను హాజరు కావడం లేదని ప్రముఖ రాజకీయ నాయకుడు శరద్ పవార్ తెలిపారు. ఆహ్వానం పంపించినందుకు రామమందిరం ట్రస్టుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణప్రతిష్ఠకు పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు వస్తున్నందున దర్శనం పొందడం సులభం కాదని అన్నారు. జనవరి 22 తర్వాత దర్శనం పొందడం సులభం అవుతుందని ఆయన చెప్పారు. త్వరలో అయోధ్యను దర్శిస్తానని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి, భక్తికి రాముడు ప్రతీక అని శరద్ పవార్ అన్నారు. "అయోధ్యలో జరిగే కార్యక్రమం కోసం రామభక్తులలో విపరీతమైన ఉత్సాహం ఉంది. వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. ఈ చారిత్రాత్మక సందర్భం నాకు ఆనందాన్నిస్తోంది. జనవరి 22 ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత దర్శనం పొందడం సులభం అవుతుంది" అని శరద్ పవార్ ఓ ప్రకటనలో తెలిపారు. అయోధ్య రామున్ని త్వరలో ప్రార్థిస్తానని శరద్ పవార్ పేర్కొన్నారు. అప్పటికి రామమందిర నిర్మాణం కూడా పూర్తవుతుందని చెప్పారు. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. జనవరి 16 నుంచే ప్రాణప్రతిష్ఠకు జరగాల్సిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్రజాప్రతినిధులతో సహా సెలబ్రిటీలకు కూడా ఆహ్వానాలు అందాయి. జనవరి 23 నుంచి రామాలయాన్ని సాధారణ భక్తుల దర్శనం కోసం తెరవనున్నారు. ఇదీ చదవండి: Lata Mangeshkar: లతా మంగేష్కర్ ఆఖరి రామ శ్లోకాన్ని షేర్ చేసిన ప్రధాని మోదీ! -
Sculptor Arun Yogiraj: రామ్‌లల్లా విగ్రహం ఖరారు
మైసూర్: అయోధ్య రామమందిరంలో ప్రతిష్టించబోయే రామ్‌లల్లా విగ్రహాన్ని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఖరారు చేసింది. కర్ణాటక రాష్ట్రం మైసూర్‌కు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన ప్రతిమకు ఆ మహద్భాగ్యం దక్కనుంది. ఈ నెల 22న గర్భాలయంలో విగ్రహం ప్రాణపత్రిష్ట జరుపుకోనుంది. అయోధ్య ఆలయంలో ప్రతిష్టించడానికి మూడు విగ్రహాలను చెక్కించారు. వీటిలో అరుణ్ యోగిరాజ్ చెక్కిన శిల్పాన్ని ఎంపిక చేశారు. ఈ విగ్రహం ఐదేళ్ల బాలరాముడి రూపంలో ఉందని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ తెలిపారు. నిల్చున్న రూపంలోనే విగ్రహాన్ని తయారు చేయించామని చెప్పారు. రామ్‌లల్లా విగ్రహాన్ని ఈ నెల 18వ తేదీన గర్భాలయంలోని ఆసనంపైకి చేరుస్తామని వెల్లడించారు. బాలరాముడి విగ్రహాన్ని తయారు చేయడానికి ఎంతగానో శ్రమించారని, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని అరుణ్ యోగిరాజ్ కుటుంబ సభ్యులు మంగళవారం చెప్పారు. రామ్‌లల్లా విగ్రహాన్ని చెక్కుతుండగా గాయం వల్ల ఆయనకు కంటి నొప్పి వచి్చందని అన్నారు. యోగిరాజ్ రూపొందించిన శిల్పాన్ని తీర్థ క్షేత్ర ట్రస్టు ఎంపిక చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ మహాకార్యం కోసం దేవుడు తన భర్తను ఎన్నుకొని ఉండొచ్చని యోగిరాజ్ భార్య విజేత అన్నారు. ఇది తమకు మర్చిపోలేని రోజు అని యోగిరాజ్ సోదరుడు సూర్యప్రకాశ్ పేర్కొన్నారు. వార్త తెలిసిన తర్వాత తమకు చెప్పలేనంత ఆనందంగా ఉందని ఆయన తల్లి సరస్వతి అన్నారు. అరుణ్ యోగిరాజ్ గొప్ప శిల్పిగా ప్రఖ్యాతిగాంచారు. కేదార్‌నాథ్‌లో ప్రతిష్టించిన ఆది శంకరాచార్య, ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద నెలకొల్పిన సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను ఆయనే రూపొందించారు. -
Ram Mandir Pran Pratishtha: టైమ్స్ స్క్వేర్‌లో ‘ప్రాణప్రతిష్ఠ’ ప్రత్యక్ష ప్రసారం
జనవరి 22న అయోధ్యలో జరిగే బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మన దేశంలోని పలు ప్రాంతాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ప్రత్యక్ష ప్రసారం కానుంది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్‌లో కూడా ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం అయోధ్య పవిత్రోత్సవం వివిధ దేశాలలోని భారత రాయబార కార్యాలయాలలో కూడా ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఆరోజు రామభక్తులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ వేడుకకు సంబంధించిన సన్నాహాలను ప్రధాని మోదీ నిశితంగా పరిశీలిస్తున్నారని సమాచారం. బాలరాముని ప్రాణప్రతిష్ఠ ఉత్సవానికి 84 సెకన్ల శుభ సమయం నిర్ణయించారు. 2024, జనవరి 22న ఉదయం 12:29 నుండి 12:30 మధ్య కాలంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. కాగా నూతన రామాలయం మూడు అంతస్తులలో నిర్మితమయ్యింది. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఆలయంలో మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి. అయోధ్యలో ప్రతిష్ఠించబోయే రామ్‌లల్లా విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దారు. ఈ విగ్రహం ఐదేళ్ల బాలుని రూపంలో ఉంటుంది. కాగా ఆలయంలో ఇంతవరకూ ఉన్న బాలరాముని విగ్రహాన్ని నూతన విగ్రహంతో పాటు గర్భగుడిలో ప్రతిష్ఠించనున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్య ‘ప్రాణప్రతిష్ఠ’కు ముఖ్య అతిథులెవరు? -
రామమందిర ప్రారంభోత్సవం.. ఇక్బాల్ అన్సారికి ఆహ్వానం
అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 22న వైభవంగా జరిగిగే బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ వేడుకకు 7000 మంది హాజరుకానున్నారు. తాజాగా రామ జమ్మభూమి-బాబ్రీ మసీద్ స్థలం విషయంలో నాడు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఇక్బాల్ అన్సారికి కూడా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారిక ఆహ్వానం అందించింది. రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరింది. బాబ్రీ మసీదుగా మద్దతుగా నాడు సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన ఇక్బాల్ అన్సారికి 2020 ఆగస్టు 5న రామ మందిర భూమిపూజ కార్యక్రమానికి కూడా ఆహ్వానం పంపించిన విషయం గమనార్హం. అయితే ఇటీవల అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. ఆ సమయంలో కూడా రోడ్డు షోలో పాల్గొన్న ప్రధానమంత్రికి ఇక్బాల్ అన్సారి పూలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంలో ఇక్బాల్ స్పందిస్తూ.. అతను(మోదీ) మా ప్రాంతానికి వచ్చారు. ఆయన మాకు అతిథి, మా ప్రధానమంత్రి కూడా’ అంటూ అందుకే స్వాగతం పలికానని వివరణ ఇచ్చారు. కాగా.. ఇక్బాల్ అన్సారి తండ్రి కూడా రామజన్మభూమి వివాదంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన 95 ఏళ్ల వయస్సులో 2016లో మృతి చెందారు. అనంతరం రామజన్మభూమి వివాదం కేసులో ఇక్బాల్ అన్సారీ కూడా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసి కీలకంగా వ్యవహిరించారు. కాగా.. రామజన్మభూమి వివాదంలో సర్వోన్నత న్యాయస్థానం 2019 నవంబర్ 9న కీలక తీర్పును వెలువరించింది. వివాదంలో ఉన్న స్థలాన్ని రామమందిర నిర్మాణానికి కేటాయిస్తూ.. దానికి దగ్గరలో మరోచోటు ముస్లింలకు 5ఎకరాలకు స్థలాన్ని కేటించిన విషయం తెలిసిందే. చదవండి: జైల్లోని తమిళనాడు మంత్రికి సుప్రీంకోర్టులో ఊరట -
శ్రీరాముని దర్శనం కోసం భక్తులు బారులు
నూతన సంవత్సరం సందర్భంగా అయోధ్యలో రోజంతా భక్తుల సందడి కనిపించింది. వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని, శ్రీరాముని దర్శించుకున్నారు. జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులను కూడా ఆహ్వానించారు. ప్రస్తుతం అయోధ్యను సుందరంగా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి. కొత్త సంవత్సరం తొలి రోజున రామాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజాది కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. నూతన సంవత్సరం సంద్భంగా శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్‌లో నాలుగు వేదాలలోని అన్ని శాఖల పారాయణం, యాగం నిరంతరం కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వేద పండితులు, యాగ్యాచార్యులను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానిస్తోంది. -
అయోధ్యలో అక్షత పూజ
అయోధ్య: అయోధ్యలో శ్రీరామ మందిరంలో ప్రతిష్టాపన పూజలు ఆదివారం సంప్రదాయం ప్రకారం అక్షత పూజతో మొదలయ్యాయి. ఆలయంలోని రామదర్బార్, శ్రీరాముని ఆస్థానంలో పసుపు, దేశవాళీ నెయ్యి కలిపిన 100 క్వింటాళ్ల బియ్యంతో అక్షత పూజ నిర్వహిస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. దేశంలోని 45 ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చిన విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ)కు చెందిన 90 మంది ముఖ్యులకు 5 కిలోల మేర అక్షతలను పంపిణీ చేస్తారు. వీరు వీటిని జిల్లాలు, బ్లాకులు, తహసీల్లు, గ్రామాల ప్రతినిధులకు అందజేస్తారని ట్రస్ట్ కార్యదర్శి చంపత్‌రాయ్ చెప్పారు. మిగతా అక్షతలను ఆలయంలోని శ్రీరాముని విగ్రహం ఎదురుగా కలశంలో ఉంచుతారు. వీరు ఈ అక్షతలను వీరు వచ్చే జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్టాపన జరిగేలోగా దేశవ్యాప్తంగా ప్రజలకు పంపిణీ చేయనున్నారని ట్రస్ట్ తెలిపింది. -
భావోద్వేగాలతో నిండిన రోజు ఇది: ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఇవాళ(బుధవారం) రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు తనను కలిసి ఆహ్వానం అందించారని సంతోషం వ్యక్తం చేశారాయన. ఈ మేరకు ఎక్స్‌లో భావోద్వేగంగా ఆయన ట్వీట్ చేశారు. సియా రామ్! ఈ రోజు భావోద్వేగాలతో నిండిన రోజు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు నన్ను కలవడానికి నా నివాసానికి వచ్చారు. శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా అయోధ్యకు రావాల్సిందిగా ఆయన నన్ను ఆహ్వానించారు. నా జీవితకాలంలో ఈ చారిత్రాత్మక సందర్భాన్ని చూడటం నా అదృష్టం అని ఎక్స్‌లో పోస్ట్ చేశారాయన. जय सियाराम! आज का दिन बहुत भावनाओं से भरा हुआ है। अभी श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के पदाधिकारी मुझसे मेरे निवास स्थान पर मिलने आए थे। उन्होंने मुझे श्रीराम मंदिर में प्राण-प्रतिष्ठा के अवसर पर अयोध्या आने के लिए निमंत्रित किया है। मैं खुद को बहुत धन्य महसूस कर रहा… pic.twitter.com/rc801AraIn — Narendra Modi (@narendramodi) October 25, 2023 జనవరి 22వ తేదీన ఉత్తర ప్రదేశ్ అయోధ్య నగర రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపనతో ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న 136 సనాతన సంప్రదాయాలకు సంబంధించి పాతిక వేల మంది హిందూ సంఘాల నేతలకు, మరో పాతిక వేల మంది సన్యాసులకు, ఇంకో పదివేల మంది ప్రత్యేక అతిథులకు ఆహ్వానం అందించే యోచనలో ఉంది ట్రస్ట్. 2016లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. ఆ తర్వాతే కేంద్రం శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేయించి మందిర నిర్మాణం ప్రారంభించింది. -
Gyanvapi Masjid Case: కదిలిన తేనెతుట్టె!
చిన్నగా మొదలైన కొన్ని అంశాలే కాలగతిలో పెను పరిణామాలకు దారితీస్తాయి. ఇది చరిత్రలోని చిత్రమైన లక్షణం. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వ్యవహారానికి సంబంధించి అక్కడి జిల్లా న్యాయస్థానం సోమవారం ఇచ్చిన 26 పేజీల ఆదేశం సరిగ్గా అలాంటిదే. మసీదు ప్రాంగణంలోని హిందూ దేవతామూర్తులను పూజించేందుకు అనుమతించాలంటూ అయిదుగురు హిందూ మహిళలు వేసిన పిటిషన్ విచారణార్హమైనదే అని కోర్టు నిర్ణయించడం కీలక పరిణామం. 17వ శతాబ్దికి చెందిన ఈ మసీదులో పూజలకు అనుమతించడానికి ఇప్పుడున్న మూడు చట్టాల ప్రకారం కుదరదంటూ మసీదును నిర్వహిస్తున్న అంజుమన్ ఇంతెజామియా మస్జిద్ కమిటీ వాదించింది. ప్రార్థనా స్థలాల (ప్రత్యేక ఏర్పాట్ల) చట్టం – 1991, వక్ఫ్ చట్టం – 1995, యూపీ శ్రీకాశీ విశ్వనాథ్ ఆలయ చట్టం –1983... ఈ మూడింటినీ కమిటీ ప్రస్తావించింది. కానీ, జడ్జి విశ్వేశ ఆ వాదనను తోసిపుచ్చారు. ఈ 22న విచారణకు నిర్ణయించారు. జిల్లా కోర్ట్ ఆదేశంపై మస్జిద్ కమిటీ హైకోర్ట్ గుమ్మం తొక్కనుంది. వెరసి, సుదీర్ఘంగా సాగిన అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదు – రామజన్మభూమి వ్యవహారంలా ఇక ఇప్పుడు కాశీలో జ్ఞానవాపి కథ మొదలు కానుంది. కొద్దినెలల విరామం తర్వాత జ్ఞానవాపి మసీదు వివాదంలో మొదలైన ఈ కొత్త అంకం అనేక పర్యవసానాలకు దారితీయడం ఖాయం. కొద్ది నెలల క్రితం మసీదు ప్రాంగణాన్ని సర్వే చేసి, వీడియో తీసినప్పుడు బయటపడ్డ శివలింగం తరహా నిర్మాణం గురించి కోర్టులో చర్చకు రానుంది. అయోధ్య, కాశీ, మథురల్లోని మసీదులు నిజానికి హిందువుల భూభూగాలేననే వాదన దీర్ఘకాలంగా ఉంది. చాలా ఏళ్ళుగా బీజేపీ, సంఘ్ పరివార్లు దాన్ని తమ రాజకీయ అజెండాగా మార్చుకున్నాయి. దీనిపై ఇటు వీధుల్లోనూ, అటు కోర్టుల్లోనూ పోరు సాగిస్తూనే ఉన్నాయి. రామజన్మభూమి ఉద్యమం తీవ్రంగా సాగుతున్న వేళ ఆ స్థాయి వివాదాలు ఇతర ప్రార్థనా స్థలాలపై తలెత్తకూడదనే ఉద్దేశంతో 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని అప్పటి కేంద్రప్రభుత్వం చేసింది. 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న స్థితినే కొనసాగించాలనీ, ఏ వివాదాస్పద ప్రార్థనా స్థల స్వరూప స్వభావాలనూ మార్చ రాదనీ సదరు చట్టం నిర్దేశిస్తోంది. తీరా 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతతో ప్రార్థనాస్థల రాజకీయాలు పతాకస్థాయికి చేరాయి. మళ్ళీ ఇప్పుడు జ్ఞానవాపిపై కోర్టు ఆదేశంతో ఒకప్పటి బాబ్రీ మసీదు వివాదంలా సమాజంలోని రెండు వర్గాల మధ్య సామరస్యం దెబ్బతిని, సుస్థిరత దెబ్బతినే ప్రమాదం ఉంది. 1991 నాటి చట్టం సైతం నిష్ప్రయోజనం కావచ్చని ముస్లిమ్ వర్గం ఆందోళన. అయితే, 1947కూ, 1993కూ మధ్య జ్ఞానవాపి ప్రాంగణంలో హిందువుల ప్రార్థనలను అనుమతించారు. 1993 తర్వాతా ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏటా ఒకసారి అక్కడ దేవతామూర్తుల ప్రార్థనకు వీలు కల్పిస్తున్నారు. హిందూ మహిళల పిటిషన్‌ను అనుమతించిన జిల్లా కోర్ట్ ఆ సంగతులే గుర్తు చేసింది. ప్రార్థనాస్థల ధార్మిక స్వరూప స్వభావాలను మార్చే ప్రయత్నమేదీ ఇందులో లేదనీ, అక్కడ పూజలు చేసుకొనే హక్కు మాత్రమే అడుగుతున్నారనీ వ్యాఖ్యానించింది. కానీ, కథ అంతటితో ఆగుతుందా అన్నది ప్రశ్న. నిజానికి, జ్ఞానవాపి ప్రాంగణంపై హక్కులకు సంబంధించి హైకోర్ట్‌లో ఇప్పటికే అనేక కేసులు విచారణలో ఉన్నాయి. ప్రాంగణంలో భారత సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ)తో సర్వేకు అనుమతిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశం పైనా హైకోర్ట్ విచారిస్తోంది. ఇలా జ్ఞానవాపిపై ఒక వర్గం ఒకే రకమైన పలు కేసులు దాఖలు చేయడం ఒక వ్యూహం ప్రకారం జరుగుతోందని రెండో వర్గం అనుమానం. పూజల కోసం భక్తులు వేసిన పిటిషన్‌ను ముందుగా జిల్లా కోర్టు వినాలని ఆ మధ్య సుప్రీం కోర్టే చెప్పింది. వారణాసి కోర్ట్ తాజా నిర్ణయంతో వివాదం పైకోర్టులకు పాకుతుంది. నిజానికి, దశాబ్దాల తరబడి సాగిన రామజన్మభూమి వివాదంపై 2019లో అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు నిచ్చింది. బాబ్రీ మసీదు ఒకప్పుడున్న స్థలంలో రామాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిస్తూనే, 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని భారత రాజ్యాంగ లౌకికవాద లక్షణాలను కాపాడేందుకు తీర్చి దిద్దిన చట్టపరమైన పరికరంగా అభివర్ణించింది. తీరా తాజా నిర్ణయంతో వారణాసి కోర్ట్ ఆ మాట లను ప్రశ్నార్థకం చేసి, వివాదాల తేనెతుట్టెను కదిలించింది. పైకి కోర్టు కేసులుగా కనిపిస్తున్నా, వీటిలో రాజకీయాలూ పుష్కలం. బాబ్రీ మసీదు వివాదంతో ఇప్పటికే దేశంలో ఒక వర్గాన్ని బయటి వ్యక్తులుగా చూసే ధోరణి ప్రబలింది. జాతీయవాదం, హైందవ ఆత్మగౌరవం లాంటి పదబంధా లకు ప్రాచుర్యం పెరిగింది. మరోపక్క మథుర, ఆగ్రాల్లోనూ ఇలాంటి కేసులే కోర్టుల్లో ఉన్నాయి. అసలు ‘ప్రార్థనాస్థలాల చట్టం–1991’ రాజ్యాంగబద్ధత పైనా సుప్రీమ్‌లో కేసు పెండింగ్‌లో ఉంది. ఆ అంశంపై సుప్రీమ్ తీర్పు కోసం నిరీక్షించకుండా, జిల్లా కోర్ట్ అత్యుత్సాహం చూపింది. ఈ పరిస్థితుల్లో ఈ వివాదాలన్నిటికీ కీలకం కానున్న 1991 నాటి చట్టానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఎంత త్వరగా తన తీర్పునిస్తే అంత మంచిది. కింది కోర్టులకు అది మార్గదర్శకమవుతుంది. సమస్యలు మరింత జటిలం కాకుండా అడ్డుకుంటుంది. ఎందుకంటే, ధార్మిక విశ్వాసాలు నిప్పు లాంటివి. వాటితో చెలగాటమాడితే చేతులు కాలక తప్పదు. ఏమరుపాటుగా ఉంటే సమాజాన్నీ, విభిన్న వర్గాల సామరస్యాన్నీ ఆ అగ్ని దహించకా తప్పదు. న్యాయస్థానాల మొదలు ప్రభుత్వాల దాకా అందరూ అప్రమత్తంగా ఉండాల్సింది అందుకే! -
వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా రామాలయం సిద్ధం
సుల్తాన్పూర్(యూపీ): అయోధ్యలో ఆలయ నిర్మాణం వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా పూర్తవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. నిర్మాణం పూర్తయితే 2023 డిసెంబర్ నుంచి రామ్ లల్లాను భవ్య రామాలయంలోనే భక్తులు దర్శించుకోవచ్చని అన్నారు. నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఆయన సుల్తాన్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. గుడి నిర్మాణంలో ఎక్కడా ఇనుమును వినియోగించడం లేదన్నారు. అందరూ అబ్బురపడే రీతిలో ఆలయ నిర్మాణ కౌశలం ఉంటుందని రాయ్ పేర్కొన్నారు. అయోధ్యలో ఆలయ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చదవండి: (భారత ఆందోళనను లెక్కచేయని శ్రీలంక.. చైనా నిఘా నౌకకు అనుమతి) -
'ఆ రోజే అయోధ్య రామాలయం ప్రారంభం'
న్యూఢిల్లీ: అయోధ్యలో భవ్య రామమందిరం 2024 జనవరి రెండోవారం నాటికి సిద్ధమవుతుందని రామ జన్మభూమి మందిర్ తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ చెప్పా రు. ఆయన శనివారం ఢిల్లీలో ఆయోధ్య పర్వ్ కార్యక్రమంలో మాట్లాడారు. 2024లో మకర సంక్రాంతి రోజున రామాలయాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి మందిర నిర్మాణ పనులను వేగవంతం చేస్తామన్నారు. రాళ్లను చెక్కే పని ఇప్పటికే మొదలయ్యిందన్నారు. చదవండి: (కిచిడీలో ఉప్పెక్కువైందని.. భార్య గొంతు నులిమాడు) -
దీపోత్సవానికి అయోధ్య ముస్తాబు!
లక్నో: అయోధ్యలో దీపోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవంబర్ 11 నుంచి 13 మధ్య జరిగే ఈ దీపాల పండుగలో ఈసారి 5.51 లక్షల దీపాలను వెలిగించనున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. రామజన్మభూమి- అయోధ్య వివాదం కేసులో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు తర్వాత జరుపుకొంటున్న తొలి దీపావళి కావడంతో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే విధంగా రామ మందిర నిర్మాణానికి భూమి పూజ(ఆగష్టు 5) తర్వాత జరగనున్న అయోధ్యలో మొదటి వేడుక కానుండడంతో ప్రత్యేకత సంతరించుకుంది. (చదవండి: ఉద్యోగులకు దీపావళి కానుక : ఒక నెల బోనస్) ఈ నేపథ్యంలో ఈసారి మరింత ప్రత్యేకంగా దీపోత్సవాన్ని నిర్వహించేందుకు యోగి సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సీఎం ఆదేశాలతో శ్రీరామ జన్మభూమితో పాటు కనక భవన్, రామ్ పైడి, హనుమాన్ ఘర్ ఆలయాలను అంగరంగ వైభవంగా అలంకరించేందుకు నిర్వహకులు సిద్ధమవుతున్నారు. ఇక ఈ శుభ సందర్భంలో, మొట్ట మొదటి సారిగా ఆవుపేడతో చేసిన దీపాలను ఈ వేడుకలో వాడుతున్నారు. యూపీ ప్రభుత్వం ఈ ఉత్సవాలకు 20 జానపద నృత్య బృందాలను ఆహ్వానించింది. ఇక సీఎం యోగికి అయోధ్యతో మంచి అనుబంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. -
అయోధ్యలో మందిర నిర్మాణం ప్రారంభం
అయోధ్య: అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. వచ్చే మూడు–మూడున్నరేళ్లలో మందిరం పూర్తవుతుందని నిర్మాణ పనుల్ని పర్యవేక్షించే ట్రస్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర వెల్లడించింది. భారత్‌కు చెందిన అత్యంత పురాతన నిర్మాణ శైలితో పటిష్టంగా మందిర నిర్మాణాన్ని చేస్తున్నట్టుగా తెలిపింది. దీనికి సంబంధించి ట్రస్ట్ వరుస ట్వీట్లు చేసింది. ‘‘ఎల్ అండ్ టీ సంస్థతో పాటుగా సీబీఆర్ఐ రూర్కీ, ఐఐటీ మద్రాస్ ఇంజనీర్లు మందిర నిర్మాణ స్థలంలో మట్టిని పరీక్షిస్తున్నారని, 36–40 నెలల్లో నిర్మాణం పూర్తయిపోతుందని ట్రస్ట్ తన ట్వీట్లో పేర్కొంది. భూకంపాలు, తుపాన్ బీభత్సాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునేలా ఆలయ నిర్మాణం సాగుతుంది. అందుకే ఈ నిర్మాణంలో ఇనుము వాడడం లేదు. వేల ఏళ్లయినా చెక్కు చెదరకుండా ఉండడానికి రాతితో నిర్మించే మందిరంలో ప్రతీ రాయికి మధ్య రాగి పలకల్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 18 అంగుళాల పొడవు, 30 మి.మీ. వెడల్పు, 3 మి.మీ. లోతు కలిగిన 10 వేల రాగి పలకలు అవసరమవుతాయి. ఈ రాగి పలకల్ని విరాళంగా అందివ్వాలని మందిరం ట్రస్ట్ రామ భక్తులకు పిలుపునిచ్చింది. దాతలు వాటిపై తమ కుటుంబ సభ్యుల పేర్లు, వంశం పేరు రాయవచ్చునని పేర్కొంది.