సుల్తాన్‌పూర్(యూపీ): అయోధ్యలో ఆలయ నిర్మాణం వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా పూర్తవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. నిర్మాణం పూర్తయితే 2023 డిసెంబర్ నుంచి రామ్ లల్లాను భవ్య రామాలయంలోనే భక్తులు దర్శించుకోవచ్చని అన్నారు.
నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఆయన సుల్తాన్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. గుడి నిర్మాణంలో ఎక్కడా ఇనుమును వినియోగించడం లేదన్నారు. అందరూ అబ్బురపడే రీతిలో ఆలయ నిర్మాణ కౌశలం ఉంటుందని రాయ్ పేర్కొన్నారు. అయోధ్యలో ఆలయ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
చదవండి: (భారత ఆందోళనను లెక్కచేయని శ్రీలంక.. చైనా నిఘా నౌకకు అనుమతి)
Comments
Please login to add a commentAdd a comment