Sultanpur
-
రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులకు రూ. 10 లక్షల ఆఫర్..
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో పక్షనేత రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులకు రూ. 10 లక్షలు డిమాండ్ పలుకుతోందట. అయితే వాటిని ఆమ్మేందుకు యజమాని మాత్రం ససేమిరా అంటున్నాడు. అసలు రాహుల్ గాంధీ ఏంటి? చెప్పులు కుట్టడం ఏంటి? అవి అమ్మడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అక్కడికే వస్తున్నాం..ఇటీవల ఓ కేసు విషయంలో రాహుల్ ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ కోర్టు హాజరయ్యారు. ఈ క్రమంలో అక్కడి నుంచి వస్తూ దారిలో ఉన్న ఓ చెప్పుల దుకాణం వద్ద ఆగాడు. అక్కడ చెప్పులు కుట్టే రామ్ చేత్ వ్యక్తిని కలిసి అతని పని గురించి తెలుసుకున్నాడు. అనంతరం అక్కడే ఓ చెప్పుల జత కుట్టాడు. అతనికి సాయం చేస్తానని హామీ ఇచ్చారు. తనను కలిసి మరుసటి రోజే చెప్పులు కుట్టుకునే వ్యక్తికి ఓ షూ స్టిచింగ్ మెషిన్‌ను అందించాడు.ఇప్పుడు ఈ స్లిప్పర్స్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. రాహుల్ గాంధీ రామ్ చేత్నును కలిసి వెళ్లిన తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో పలు శాఖల అధికారులు వచ్చి, ఆయన సమస్యలు తెలుసుకుంటున్నారు. అయితే రాహుల్ కుట్టిన చెప్పులకు ఎన్ని లక్షలు ఇచ్చినా.. అమ్మేది లేదని చెప్పులు కుట్టే వ్యక్తి తేల్చి చెప్పారు. ఆయన కుట్టిన చెప్పులను ఓ గ్లాస్ ఫ్రేమ్‌లో భద్రపరచనున్నట్లు వెల్లడించాడు. రాహుల్ గాంధీ తన వద్దకు రావడం, తన జీవితాన్నే మార్చేసిందని పేర్కొన్నాడు.‘రాహుల్ కుట్టిన చెప్పులను మేము కొంటామంటూ ప్రతి రోజూ నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మంగళవారం ఒక వ్యక్తి ఫోన్ చేసి రూ.5 లక్షలు ఇస్తాం.. చెప్పులు ఇవ్వాలని అడిగాడు. నేను కుదరదని చెప్పాను. అప్పుడు అతను రూ.10 లక్షలు ఇస్తానన్నాడు. నేను ఇవ్వను అని చెప్పాను. ఈ చెప్పులు నాకు లక్కీ.. వీటికి గాజు ఫ్రేమ్ కట్టించి. నా షాప్ లో పెట్టుకుంటాను’ అని చెప్పాడు. రాహుల్ గాంధీ తన దుకాణంలో కూర్చొని చెప్పు కుట్టడం ద్వారా ఆయన తన పార్ట్నర్ అయ్యారని రామ్ అన్నారు. -
Rahul Gandhi: బీజేపీ చౌకబారు ప్రచారం కోసమే!
సుల్తాన్పూర్(యూపీ): కేవలం చౌకబారు ప్రచారం కోసమే బీజేపీ నేతలు తనపై పరువు నష్టం వేశారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. శుక్రవారం ఆయన సుల్తాన్‌పూర్‌లోని ఎంపీ–ఎమ్మెల్యే కేసులను విచారించే ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు. తాను ఎవరిపైనా పరువు నష్టం కలిగించేంతటి ఆరోపణలు చేయలేదని జడ్జి శుభమ్ వర్మ ఎదుట తెలిపారు. దీంతో, జడ్జి కేసు తదుపరి విచారణను ఆగస్ట్ 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అదే రోజు రాహుల్ వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని చెప్పారు. రాహుల్ కోర్టుకు రానవసరం లేదని పేర్కొన్నారు. అనంతరం కోర్టు వెలుపల రాహుల్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు చౌకబారు ప్రచారం కోసమే తనపై కేసు వేశారన్నారు. రాహుల్ కొత్త చిరునామా..!న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సునహరీ బాగ్ రోడ్‌లోని ఐదో నంబర్ బంగ్లాకు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేబినెట్ హోదా కలిగిన ప్రతిపక్ష నేతకు నిబంధనల ప్రకారం టైప్–8 బంగ్లాను కేటాయించాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీకి సునహరీ బాగ్‌లోని ఐదో నంబర్ బంగ్లాను కేటాయించినట్లు హౌస్ కమిటీ వర్గాలు శుక్రవారం తెలిపాయి. -
అమిత్‌షాపై వ్యాఖ్యలు.. యూపీ సుల్తాన్పూర్ కోర్టుకు రాహుల్
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేడు ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ కోర్టుకు హాజరయ్యారు. కేంద్రమంత్రి అమిత్‌షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపిస్తూ బీజేపీ నేత విజయ్ మిశ్రా దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించిన విచారణ నేపథ్యంలో ఆయన నేడు కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ తరపు న్యాయవాది కాశీ ప్రసాద్ శుక్లా మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని, రాజకీయ దురుద్దేశంతో, తన ప్రతిష్టను దెబ్బతిసేందుకు ఈ కేసు నమోదు చేశారని తెలిపారు. కోర్టు అడిగిన ప్రశ్నలకు రాహుల్ తన స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు పేర్కొన్నారు. వాదనల అనంతరం కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 12కు వాయిదా వేసింది. ఆగస్టు 12న రాహుల్ మరోసారికి కోర్టుకు హాజరై సాక్ష్యాలను సమర్పించనున్నారు.#WATCH | Sultanpur, Uttar Pradesh: Advocate Kashi Prasad Shukla, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi's lawyer says, "...Rahul Gandhi recorded his statement in the court and said that all the allegations are false and the complaint has been filed due to political… pic.twitter.com/ne8YUWvI3O— ANI (@ANI) July 26, 2024 కాగా 2018 కర్ణాటక ఎన్నికల సమయంలో బెంగళూరులో జరిగిన ర్యాలీలో రాహుల్ పాల్గొని కేంద్రమంత్రి అమిత్‌షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. అప్పటి సుల్తాన్పూర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న విజయ్ మిశ్రా అదే ఏడాది ఆగస్టు 4 జిల్లా కోర్టులో రాహుల్ పై పరువు నష్టం కేసు నమోదు చేశారు. ఓ హత్య కేసులో అమిత్ షా నిందితుడు అని రాహుల్ వ్యాఖ్యానించినట్లు విజయ్ మిశ్రా ఆరోపించారు.రాహుల్ ఆ ర్యాలీలో..‘బీజేపీ అధ్యక్షుడు ఓ హత్యకేసులో నిందితుడనే విషయాన్ని దేశంలోని ప్రజలు మర్చిపోతున్నారు. అదే నిజం. నిజాయితీ, మర్యాద, గురించి మాట్లాడే పార్టీకి.. హత్య ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నారు. అమిత్ షాపై హత్యా ఆరోపణలు వచ్చాయి, కాదా? సుప్రీంకోర్టు జడ్జి లోయా కేసును ప్రస్తావించింది. కాబట్టి అమిత్ షాకు పెద్దగా క్రెడిబిలిటీ లేదు. ఆయన హత్య నిందితుడని మర్చిపోవద్దు. ”అని రాహుల్ వ్యాఖ్యానించారు. -
Lok Sabha Election 2024: చోటీ బహూకు ఇంటిపోరు
సుల్తాన్పూర్. గాంధీ కుటుంబపు కంచుకోట రాయ్‌బరేలీకి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోక్‌సభ స్థానం. అత్తగారైన ఇందిరను ఎదిరించి చిన్న వయస్సులోనే ఒంటరిగా రాజకీయాల్లోకి వచి్చన మేనకా గాంధీ ఇక్కడి సిట్టింగ్ ఎంపీ. ఎంపీగా ఏకంగా తొమ్మిదో విజయమే లక్ష్యంగా బీజేపీ తరఫునే మళ్లీ బరిలోకి దిగారు. అయితే సొంత పారీ్టయే ఆమెకు అంతగా సహకరించడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో మేనక కేవలం 14,500 ఓట్లతో గట్టెక్కారు. ఈసారి ఆమె గెలుపు ఈజీ కాదని విశ్లేషకులూ అంటున్న పరిస్థితి! ఇన్ని సవాళ్ల నడుమ సుల్తాన్ పూర్ పరీక్షలో 67 ఏళ్ల ఈ ‘చోటీ బహు’ ఎలా నెగ్గుకొస్తారనేది ఉత్కంఠ రేపుతోంది... భర్త సంజయ్‌గాంధీ మరణం తర్వాత ఇందిరతో విభేదాలు మేనకను ఒంటరిని చేశాయి. అప్పటికి చంటిపిల్లాడైన వరుణ్ గాం«దీని తీసుకొని కుటుంబం నుంచి బయటికొచ్చారు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఒంటరి పోరాటమే చేస్తూ వచ్చారు. తొలిసారి 1984లో అమేథీలో బావ రాజీవ్‌గాం«దీని ఢీకొని 2.7 లక్షల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. 1989లో జనతాదళ్ తరఫున ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ నుంచి గెలిచి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. 1991లో మళ్లీ బీజేపీ చేతిలో ఓటమి చవిచూసినా ఆ తర్వాత మాత్రం వరుసగా ఏడుసార్లు విజయం సాధించారు. పిలిభిత్ను కంచుకోటగా మార్చుకున్నారు. అక్కడి నుంచి మూడుసార్లు ఇండిపెండెంట్‌గా కూడా విజయకేతం ఎగరేయడం విశేషం. మధ్యలో ఒకసారి ఆవ్లా లోక్‌సభ స్థానం నుంచీ నెగ్గారు. వీపీ సింగ్ ప్రభుత్వంలో, తర్వాత వాజ్‌పేయి సర్కారులో, మోదీ తొలి విడత ప్రభుత్వంలోనూ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఫిలిబిత్‌లో ఆరుసార్లు గెలిచాక 2019లో ఆ స్థానాన్ని కుమారుడు వరుణ్‌కు వదిలి తొలిసారి సుల్తాన్‌పూర్‌కు మారారు. వరుణ్‌కు బీజేపీ ఈసారి మొండిచేయి చూపడంతో మేనక కూడా నిరుత్సాహానికి గురయ్యారు. ఓబీసీలు, ముస్లింలే కీలకం... సుల్తాన్‌పూర్‌లో నిషాద్‌లతో పాటు కురీ్మలు, యాదవులు, ముస్లింలు, దళితులు ఎక్కువగా ఉన్నారు. బ్రాహ్మణులు, ఠాకూర్లు ఓ మోస్తరుగా ఉంటారు. కాంగ్రెస్ మద్దతుతో ఎస్పీ తరఫున బరిలోకి దిగిన రామ్ భువల్ నిషాద్కు ఆ సామాజిక వర్గంలో గట్టి పట్టుంది. బీఎస్పీ కుర్మీ సామాజికవర్గానికి చెందిన ఉద్రజ్ వర్మను రంగంలోకి దించడంతో ఓట్లు భారీగా చీలే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ బీఎస్పీ రెండుసార్లు గెలవగా ఎస్పీ బోణీయే చేయలేదు! స్థానిక సమస్యలే ప్రధానాంశాలుగా ప్రచారం సాగింది. ప్రచారానికి మోదీ, షా దూరం సుల్తాన్‌పూర్‌లో శనివారం ఆరో విడతలో పోలింగ్ జరగనుంది. కానీ యూపీ అంతా కలియదిరుగుతున్న ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ అగ్ర నేతలెవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విశేషం! ప్రచారం చివర్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఓ ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో ఈ ఎన్నికలు ఆమెకు మళ్లీ ఒంటరి పోరాటంగానే కనిపిస్తున్నాయి. అయితే కుటుంబీకులైన రాహుల్, ప్రియాంక మొదలుకుని విపక్ష నాయకులెవరూ కూడా మేనకకు వ్యతిరేకంగా పెద్దగా ప్రచారం చేయకపోవడం విశేషం! అయోధ్య రామ మందిర నిర్మాణం, వరుణ్‌కు టికెట్ నిరాకరణ వంటివేవీ సుల్తాన్‌పూర్‌లో ఎన్నికల అంశాలు కావు. నియోజకవర్గ ప్రజల సమస్యలే ప్రధానాంశాలు. వాటిని తీర్చేందుకు ఐదేళ్లుగా చేసిన కృషే నన్ను మళ్లీ గెలిపిస్తుంది. గత ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచి చూపిస్తా. – మేనకా గాంధీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
Maneka gandhi: కరిగిన కల నుంచి లేచిన అల
మేనకా గాంధీ. సైనిక కుటుంబంలో పుట్టిన ఆమె జీవితమంతా పోరాటాలమయమే. ప్రధాని ఇందిర ఇంటి కోడలయ్యారు. కానీ కళ్లముందు కని్పంచిన బంగారు భవిష్యత్తు చూస్తుండగానే కరిగిపోయింది. భర్త హఠాన్మరణంతో అంతా తలకిందులైంది. అయితే.. అత్తపై తిరగబడాల్సి వచి్చనా, రెండేళ్ల పసిబాబుతో అత్తింటికి శాశ్వతంగా దూరమైనా డీలా పడలేదు. ఒంటరిగానే రాజకీయాల్లో రాణించారు. బీజేపీలో చేరిన గాంధీ కుటుంబీకురాలిగా సంచలనం సృష్టించారు... భర్త మరణంతో... సంజయ్‌తో మేనక వైవాహిక బంధానికి ఆరేళ్లకే నూరేళ్లు నిండాయి. 1980లో భర్త విమాన ప్రమాదంలో మరణించే నాటికి మేనకకు కేవలం 23 ఏళ్లు. కొడుకు వరుణ్ 100 రోజుల పసికందు! భర్త ప్రాతినిధ్యం వహించిన అమేథీ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో పోటీ చేయాలనుకున్నారు. అందుకామె వయసు చాలలేదు. రాజ్యాంగ సవరణ చేసి ఎన్నికల్లో పోటీకి కనీస వయసును తగ్గించాల్సిందిగా ప్రధాని అయిన తన అత్తగారు ఇందిరను కోరారు. ఆమె ఒప్పుకోలేదు. బావ రాజీవ్ అమేథీ నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. మరుసటేడు 1982లో సంజయ్ అనుచరులు లక్నోలో ఏర్పాటు చేసిన భేటీలో మేనక పాల్గొని ప్రసంగించారు. దీన్ని తనపై తిరుగుబాటుగా ఇందిర భావించారు. లండన్ పర్యటన నుంచి తిరిగొస్తూనే కోడలిపై కన్నెర్రజేశారు. ఇంటినుంచి వెళ్లిపొమ్మన్నారు. మనవడు వరుణ్‌ను తనతోనే ఉంచుకునేందుకు విఫలయత్నం చేశారు. 1982 మార్చిలో రెండేళ్ల కొడుకును వెంటబెట్టుకుని అత్తింటిని శాశ్వతంగా వదిలి వెళ్లారు మేనక.సొంత పార్టీ .. బీజేపీ తీర్థం... 1983లో అక్బర్ అహ్మద్‌తో కలిసి రా్రïÙ్టయ సంజయ్ మంచ్‌ను స్థాపించారు మేనక. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి నాలుగింటిని గెలుచుకున్నారు! 1984 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీలో రాజీవ్‌పై పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత పార్టీని జనతాదళ్‌లో విలీనం చేశారు. ఆ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 1989లో జనతాదళ్ టికెట్‌పై పిలిభిత్ నుంచి లోక్‌సభకు ఎన్నికవడమే గాక కేంద్ర మంత్రి కూడా అయ్యారు. 1996లో అక్కణ్నుంచే స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేశారు. 1998లో రెండోసారి గెలిచారు. 1999లో బీజేపీలో చేరారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. 2014లో మోదీ ప్రభుత్వంలో మహిళా, శిశు సంక్షేమ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సుల్తాన్పూర్ నుంచి గెలుపొందారు. ఈసారీ అక్కణ్నుంచే బరిలో ఉన్నారు. పిలిభిత్‌కు మేనక ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించారు. తర్వాత అక్కణ్నుంచి వరుణ్ రెండుసార్లు గెలిచారు. ప్రేమ, పెళ్లి, ఎడబాటు.. మేనక 1956 ఆగస్టు 26న జని్మంచారు. తల్లిదండ్రులు లెఫ్టినెంట్ కల్నల్ తర్లోచన్ సింగ్ ఆనంద్, అమర్దీప్. లారెన్స్ స్కూల్, లేడీ శ్రీ రామ్ కాలేజీలో చదివారు. జవహర్లాల్ నెహ్రూ వర్సిటీలో జర్మన్ అభ్యసించారు. కాలేజీ రోజుల్లో అందాల పోటీల్లో గెలుపొందారు. బాంబే డైయింగ్ మోడల్‌గా కూడా చేశారు. 1973లో సంజయ్ గాంధీని ఓ పార్టీ లో కలిశారు. రెండేళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ప్రధాని కొడుకుతో సంబంధం అనగానే మేనక కుటుంబం సంకోచించినా ఇందిర మాత్రం ఈ బంధాన్ని సాదరంగా స్వాగతించారు. అలా 1974లో సంజయ్‌తో పెళ్లయింది. 1980లో వరుణ్ పుట్టాడు. తొలుత ఫిరోజ్ అని తాత పేరు పెట్టగా దానికి వరుణ్ అని ఇందిర చేర్చారు. జంతు ప్రేమికురాలిగా.. మేనక చేయి తిరిగిన రచయిత్రి, కాలమిస్ట్. జంతు హక్కుల కార్యకర్త. 1992లో పీపుల్ ఫర్ యానిమల్స్ (పీఎఫ్ఏ)ని స్థాపించారు. ఇది దేశంలో అతిపెద్ద జంతు సంక్షేమ సంస్థల్లో ఒకటి. కేంద్రంలో జంతు సంక్షేమ శాఖను సృష్టించి, దానికి మంత్రిగా కూడా పనిచేశారు. బహిరంగ ప్రదర్శనలకు జంతువుల వాడకాన్ని నిషేధిస్తూ చట్టం తెచ్చారు. కాస్మటిక్స్, ఆహార ఉత్పత్తులపై శాకాహారం, మాంసాహారం అని లేబుల్ చేయడాన్ని తప్పనిసరి చేశారు. జంతువులు, పర్యావరణం పట్ల ఆమె నిబద్ధతకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. పలు ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పరువు నష్టం కేసులో రాహుల్‌గాంధీకి ఊరట
ఉత్తరప్రదేశ్ న్యాయస్థానంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. 2018 పరువు నష్టం కేసులో రాహుల్‌కు సుల్తాన్పూర్ ప్రత్యేక కోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక ఎన్నికల సమయంలో 2018 మే 8న బెంగళూరులో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ.. హోం మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకుడు విజయ్ మిశ్రా అనే వ్యక్తి అదే ఏడాది ఆగస్టు 4న పరువు నష్టం కేసు వేశాడు. ఓ పక్క బీజేపీ నిజాయితీ, స్వచ్ఛమైన రాజకీయాలకు కట్టుబడి ఉందని ప్రకటిస్తూనే మరో పక్క ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలు చేసిన సమయంలో అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవిలో కొనసాగుతున్నారు. #WATCH | Uttar Pradesh: Congress leader Rahul Gandhi leaves from Sultanpur Court. The court granted him bail in a 2018 defamation case. pic.twitter.com/IZbyNsfyP5 — ANI (@ANI) February 20, 2024 రాహుల్ వ్యాఖ్యలను తప్పుబడుతూ మిశ్రా కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై సుల్తాన్ పూర్ కోర్టు మంగళవారం విచారణ జరిపింది. కేసు విచారణకు నేడు రాహుల్ కూడా హాజరయ్యారు. ఈ మేరకు ఇరుపక్ష వాదనలు విన్న న్యాయస్థానం.. రాహుల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చదవండి: క్యా సీన్ హై.. వధువుకి పాదాభివందనం చేసిన వరుడు #WATCH | Sultanpur, UP: On Congress Leader Rahul Gandhi being granted bail by District Court, Advocate Santosh Pandey says, "He (Rahul Gandhi) surrendered in the court today. He surrendered and the court took him into custody for 30-45 minutes. After that, his bail application… pic.twitter.com/tgxdOKlbnb — ANI (@ANI) February 20, 2024 ఈ సందర్భంగా రాహుల్ న్యాయవాది సంతోష్ పాండే విలేకరులతో మాట్లాడుతూ.. పరువు నష్టం కేసులో రాహుల్ నేడు కోర్టుకు హాజరైనట్లు తెలిపారు. కోర్టు నాయన్ను 30-45 నిమిషాల పాటు విచారించిందన్నారు. తర్వాత రాహుల్ బెయిల్ దరఖాస్తు సమర్పించబడంతో కోర్టు ఆమోదించిందని తెలిపారు. తదుపవరి విచారణ తేదీని ఇంకా ప్రకటించలేదని, ఈ కేసులో రాహుల్ నిర్దోషి అని, పరువు నష్టం కలిగించే విధంగా ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదని పేర్కొన్నారు. కాగా రాహుల్ చేపట్టిన భారత్‌జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోనే కొనసాగుతుండటం గమనార్హం. నేటి ఉదయం కోర్టుకు హాజరు కావడంతో యాత్ర తాత్కాలికంగా ఆపేశారు. మధ్యాహ్నం మధ్యాహ్నం 2 గంటలకు అమేథీలోని ఫుర్సత్గంజ్ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. -
Nitish Rajput: వీడియో పెట్టు కోట్లు కొట్టు
వీడియోలు చేస్తే ఎంత వస్తుంది? యూట్యూబ్‌లో పెడితే ఎంత వస్తుంది? ఎంత టాలెంట్ ఉంటే అంత వస్తుంది. నితిష్ రాజ్‌పుట్‌కు నెలకు 25 లక్షలు సంవత్సరానికి ఎంత లేదన్నా 3 కోట్లు వస్తాయి. ‘నాలెడ్జ్ ఈజ్ పవర్’ అన్నారు. సామాజిక అంశాల పై విస్తృత సమాచారం అందిస్తూ అతడు చేసే వీడియోల వల్లే ఈ ఆదాయం. నితిష్ సక్సెస్ స్టోరీ. 2022లో మన దేశంలో పాన్‌మసాలా వ్యాపార లావాదేవీల మొత్తం ఎంతో తెలుసా? 43,410 కోట్లు. ఊహకు అందని భారీ వ్యాపారం. అందుకే పాన్‌మసాలా సంస్థలు తమ బ్రాండ్ పేరు జనం నాలికల మీద తద్వారా వారి పొగాకు ఉత్పత్తులు జనాల నోళ్ల లోపలకు వెళ్లాలంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలతో ఎలా యాడ్స్ చేయిస్తాయో నితిష్ రాజ్పుట్ తన 30 నిమిషాల వీడియోలో వివరిస్తాడు. ఎలాగైతే ఆల్కహాల్ కంపెనీలు తమ బ్రాండ్ ప్రచారం కోసం మంచి నీళ్లు, మ్యూజిక్ సీడీలను తమ బ్రాండ్‌తో యాడ్స్ చేస్తాయో... పాన్ మసాలా కంపెనీలు కూడా అదే దారిలో సినిమా స్టార్స్‌ను పెట్టి లాఘవంగా ‘ఇలాచీ’, ‘గులాబ్’ అంటూ దొంగ యాడ్స్ చేస్తాయని వివరిస్తాడు. అమ్మేది మాత్రం పొగాకు ఉత్పత్తులనే అని తెలుపుతాడు. అంతేకాదు పొగాకు ఉత్పత్తుల్లో నేరుగా ప్రభుత్వం ఎలా భాగస్వామ్యం అయి ఉందో కూడా చెప్తాడు. ఇంత సవివరంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా దాదాపుగా రాయదు. అందుకే నితిష్ రాజ్పుట్ వీడియోలకు అంత డిమాండ్. అన్ని వైపుల సమాచారం నితిష్ రాజ్పుట్ 2020లో తన పేరు మీద ‘నితిష్ రాజ్‌పూట్ యూట్యూబ్ చానెల్’ను మొదలుపెట్టాడు. అందులో తనే మాట్లాడుతుంటాడు. ఏం మాట్లాడతాడు? ఒరిస్సాలో ట్రైన్ యాక్సిడెంట్‌కు కారణాలేమిటి? మణిపూర్‌లో ఏం జరుగుతోంది? ఖలిస్తాన్ ఉద్యమంలో వాస్తవం ఎంత? తాలిబన్లంటే ఎవరు? క్రెడిట్ కార్డ్స్‌లో మోసం ఎలా జరుగుతుంది... ఇలాంటి అంశాలతో వీడియోలు చేస్తాడు. అయితే ఇవి పైపైన చేసే వీడియోలు కాదు. దాదాపు పరిశోధనాత్మక జర్నలిజం స్థాయిలో ఉంటాయి. తీసుకున్న అంశంలో ఏదో ఒక పక్షం వహించకుండా అన్ని పక్షాల వైపు నుంచి సమాచారాన్ని రాసి పోస్ట్ చేస్తాడు. అంతే కాదు చరిత్రలో జరిగిపోయిన కొన్ని ఘటనలను కూడా వివరిస్తాడు. ఉదాహరణకు ఇజ్రాయిల్– పాలస్తీనాల మధ్య గొడవ. ఇలా ఒకటనేముంది మ్యూచువల్ ఫండ్స్ దగ్గరి నుంచి స్టాక్ మార్కెట్ పాఠాల వరకూ అన్నీ చెబుతాడు. అందుకే రెండేళ్ల కాలంలోనే అనూహ్యమైన విజయం సాధించాడు. ఉత్తరప్రదేశ్ కుర్రాడు నితిష్ రాజ్పుట్ ఉత్తర ప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ అనే చిన్న ఊళ్లో పుట్టాడు. ఇప్పుడు అతనికి 33 ఏళ్లు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బి.టెక్. చేసి ఐ.టి. కంపెనీల్లో పని చేశాడు. కాని తనకంటూ ఒక సొంత అస్తిత్వం, ఆర్థిక అంతస్తు ఉండాలని ఆశించి 2020లో వీడియో చానల్ ప్రారంభించాడు. సగటు మనిషికి నిత్యం కనిపించే విషయాలే లోతుగా తెలియచేయడం అతడు ఎంచుకున్న ఫార్ములా. ఉదాహరణకు బిట్‌కాయిన్ కథా కమామిషు ఏమిటి అనే వీడియో చూస్తే దాని గురించి మనకు దాదాపుగా ఓ సమగ్ర అవగాహన వస్తుంది. ఎయిర్‌పోర్ట్‌లు ఎలా ఆదాయం గడిస్తాయి అనేది అతని మరో వీడియో. బాలీవుడ్లో భారీ సినిమాలు ఫ్లాప్ అయినా డబ్బులెందుకు వస్తున్నాయి అనేది మరో వీడియో. స్పష్టంగా, డేటా విజువల్స్‌తో మంచి ఎడిటింగ్‌తో అతను ధారగా చెప్పుకుపోతాడు. 50 లక్షల ఫాలోయెర్లు నితిష్ రాజ్పుట్ యూట్యూబ్ చానల్‌కు 35 లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. ఫేస్బుక్, ఇన్‌స్టా ఇవన్నీ కలిపి మొత్తం 50 లక్షల మంది అతణ్ణి ఫాలో అవుతున్నారు. నితిష్ రాజ్పుట్ యూట్యూబ్‌లో ఇప్పటి వరకూ చేసిన వీడియోలకు 25 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోల్లో యాడ్స్ ప్లే అవుతాయి కనుక యూట్యూబ్ నుంచి అలాగే ప్రాడెక్ట్స్ ప్రమోషన్ వల్ల నెలకు అతడు 25 లక్షలు సంపాదిస్తున్నాడు. సంవత్సరానికి 3 కోట్ల ఆదాయం గడిస్తున్నాడు. రెండేళ్లల్లో సాధించిన విజయం అంటే ఆశ్చర్యమే. -
230 స్పీడ్‌లో బీఎండబ్ల్యూ.. మేమంతా చావబోతున్నాం.. కాసేపటికే..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ సుల్తాన్పూర్ జిల్లా పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న బీఎండబ్ల్యూ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు మొత్తం పూర్తిగా ధ్వంసమై తుక్కును తలపించింది. ఇంజిన్, ఇతర భాగాలు చెల్లాచెదురయ్యాయి. ఈ ఘోర ప్రమాదంలో మృతి చెందిన ఓ యువకుడి తల, చేయి 20-30 దూరంలో ఎగిరిపడ్డాయి. ఘటన సమయంలో బీఎండబ్ల్యూ గంటకు 230కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. కారులో వెళ్తూ వీరంతా ఫేస్బుక్ లైవ్‌లో స్పీడ్‌మీటర్‌పై పోకస్ చేసి వీడియో తీశారు. ఆ సమయంలో ఓ యువకుడు 'మేమంతా కాసేపట్లో చావబోతున్నాం' అని అన్నాడు. కాసేపటికే కారు ప్రమాదానికి గురై నలుగురూ చనిపోయారు. అయితే మృతుల్లో ముగ్గురిని ఆనంద్ ప్రకాశ్(37), అఖిలేశ్ సింగ్(35), దీపక్ కుమార్(37)గా గుర్తించారు పోలీసులు. కానీ మరో యువకుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. చదవండి: విషాదం.. ప్రాణాలు కాపాడే అంబులెన్సే మృత్యుపాశమైంది..! -
వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా రామాలయం సిద్ధం
సుల్తాన్పూర్(యూపీ): అయోధ్యలో ఆలయ నిర్మాణం వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా పూర్తవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. నిర్మాణం పూర్తయితే 2023 డిసెంబర్ నుంచి రామ్ లల్లాను భవ్య రామాలయంలోనే భక్తులు దర్శించుకోవచ్చని అన్నారు. నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఆయన సుల్తాన్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. గుడి నిర్మాణంలో ఎక్కడా ఇనుమును వినియోగించడం లేదన్నారు. అందరూ అబ్బురపడే రీతిలో ఆలయ నిర్మాణ కౌశలం ఉంటుందని రాయ్ పేర్కొన్నారు. అయోధ్యలో ఆలయ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చదవండి: (భారత ఆందోళనను లెక్కచేయని శ్రీలంక.. చైనా నిఘా నౌకకు అనుమతి) -
మోల్డ్‌టెక్ మరో రెండు ప్లాంట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజెక్షన్ మోల్డెడ్ ప్లాస్టిక్ కంటైనర్ల తయారీ దిగ్గజం మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ మరో రెండు ప్లాంట్లను స్థాపిస్తోంది. హైదరాబాద్ సమీపంలోని సుల్తాన్పూర్ వద్ద ఇంజెక్షన్ బ్లో మౌల్డింగ్ (ఐబీఎం) ప్యాకేజింగ్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని రూ.50 కోట్లతో నెలకొల్పనుంది. అలాగే రూ.20 కోట్లతో ఉత్తరప్రదేశ్‌లోనూ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్టు మోల్డ్‌టెక్ గ్రూప్ సీఎండీ జె.లక్ష్మణ్ రావు తెలిపారు. ఫార్మా, కాస్మెటిక్స్, ఎఫ్ఎంసీజీ రంగాలకు అవసరమైన ఉత్పత్తుల కోసం ఐబీఎం ప్యాకేజింగ్ విభాగంలోని ప్రవేశించిన సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ టెక్నాలజీని పరీక్షించేందుకు రూ.10 కోట్లతో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాం. ఐబీఎం ప్యాకేజింగ్ ఉత్పత్తుల మార్కెట్ దేశంలో 9 శాతం వృద్ధితో రూ.5,000 కోట్లు ఉంది. 2025 నాటికి ఈ రంగంలో 5–6 శాతం మార్కెట్ వాటాను చేజిక్కించుకుంటాం’ అని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏకైక సంస్థ.. రోబోలను వినియోగించి ప్లాస్టిక్ కంటైనర్లను అలంకరణకు ఇన్ మోల్డ్ లేబులింగ్ (ఐఎంఎల్) విధానాన్ని దేశంలో పరిచయం చేసిన తొలి సంస్థగా మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ రికార్డు సాధించింది. ప్రపంచంలో ఐఎంఎల్ డెకోరేషన్ కోసం రోబోలను సొంతంగా రూపకల్పన చేసి తయారు చేస్తున్న ఏకైక ప్యాకేజింగ్ సంస్థ కూడా ఇదే. ‘గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.480 కోట్ల టర్నోవర్ సాధించింది. 2021–22లో 25 శాతం వృద్ధితో రూ.600 కోట్లు ఆశిస్తోంది. మూడు నాలుగేళ్లలో రూ.1,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకున్నాం. విస్తరణకుగాను 2024 నాటికి రూ.200 కోట్లు పెట్టుబడి చేయనున్నాం’ అని లక్షణ్ రావు తెలిపారు. భారత్‌లో సంస్థకు 9 తయారీ కేంద్రాలు ఉన్నాయి. మోల్డ్‌టెక్ గ్రూప్ సీఎండీ జె.లక్ష్మణ్ రావు -
వివాహేతర సంబంధం: బీరు బాటిల్‌తో తలపై కొట్టి..
పటాన్చెరు టౌన్: వివాహేతర సంబంధంతో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో పోలీసులు ముగ్గురు నిందితులను పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు శుకవ్రాం డీఎస్పీ భీంరెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్పూర్ మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన మంగళి రమేశ్ (41) హెయిర్ కటింగ్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా రమేశ్‌కు షాపు ఎదుట ధర్మకాంటలో పనిచేసే మహేందర్‌కు పరిచయం ఏర్పడి ఇద్దరు స్నేహితులైయ్యారు. ఈ క్రమంలో మహేందర్ భార్య శోభతో రమేశ్‌కు వివాహేతర సంబంధం ఏర్పడటంతో మహేందర్ రమేశ్‌ను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. పథకంలో భాగంగా ఫిబ్రవరి 25వ తేదీన మహేందర్ తన గ్రామానికి చెందిన స్నేహితులు సుభాష్, నునవత్ ప్రకాశ్‌లతో కలసి మద్యం సేవించడానికి వెళ్దామని చెప్పి రమేశ్‌ను కారులో జహీరాబాద్ మండలంలోని హోతి(బి) గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. పథకం ప్రకారమే హత్య.. ముందుగా వేసుకున్న పథకం మేరకు బీరు బాటి ల్తో రమేశ్ తలపై కొట్టి, పగిలిన బాటిల్‌తో తలపై పొడిచి హత్య చేశారు. కాగా రమేశ్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు మరుసటి రోజు అమీన్పూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశా రు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తుండగా, మార్చి 4న జహీరాబాద్ పోలీసులు కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించి, మృతుడు అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో అదృశ్యమైన రమేశ్గా ధ్రువీకరించారు. ఫోన్ నంబర్ల ఆధారంగా గుర్తింపు పటాన్చెరు క్రైం సీఐ శ్రీనివాసులు, సీఐ వేణు గోపాల్ రెడ్డి, అమీన్పూర్ ఎస్ఐ మురళీ దర్యాప్తు లో భాగంగా ఫోన్ నంబర్ల ఆధారంగా అమీన్పూర్ మండలం సుల్తాన్‌పూర్‌లో గురువారం ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా కేతవత్ మహేందర్, సుభాష్, ప్రకాశ్ కలసి హత్య చేసినట్లు ఒప్పు కున్నారు. హత్య చేసి తిరిగి వచ్చే సమయంలో కొత్త బట్టలు సంగారెడ్డిలో కొనుగోలు చేసుకొని వైకుంటపురం ఆలయంలో స్నానాలు చేసి రక్తం మరకలతో ఉన్న బట్టలను ఆలయం వెనుక భాగంలో పడేసి నట్టు దర్యాప్తులో తెలిపారు. ఈ మేరకు వారి వద్ద నుంచి మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన క్రైం సీఐ శ్రీనివాసులు, సీఐ వేణు గోపాల్ రెడ్డి, అమీన్పూర్ ఎస్ఐ మురళిని డీఎస్పీ అభినందించారు. -
ప్రత్యర్థితో మేనకాగాంధీ వాగ్వాదం
లక్నో: కేంద్ర మంత్రి, సుల్తాన్పూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మేనకాగాంధీ, తన ప్రత్యర్థి సోనూ సింగ్‌ల మద్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం పిలీభీత్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మేనకాగాంధీ ఈ ఎన్నికల్లో సుల్తాన్పూర్ నుంచి బరిలో నిలిచిన సంగతి తెలసిందే. అయితే ఆ స్థానం నుంచి ఎస్పీ, బీఎస్పీ కూటమి తరఫున సోనూ సింగ్ బరిలో ఉన్నారు. కాగా, ఆరో విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆదివారం ఉదయం పోలింగ్ ప్రారంభం అయింది. నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూతులను పరిశీలిస్తున్న మేనకాగాంధీ.. ఎస్పీ, బీఎస్పీ నాయకులు ఓటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ‘మీ రౌడీయిజం ఇక్కడ పని చేయదని’ సోనూ సింగ్‌ను ఉద్దేశించి మేనకాగాంధీ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను ఖండించిన సోనూ సింగ్ తాను ఏ తప్పు చేశానో చెప్పాలంటూ మేనకాగాంధీని ప్రశ్నించారు. ఈ సమయంలో సోనూ సింగ్ అనుచరులు ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇరువురు నేతలు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది. ‘నేను నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌ల పరిశీలనలో భాగంగా ఇక్కడికి వచ్చాను. పోలింగ్ సక్రమంగా జరుగుతుందో లేదో తెలసుకోవడం ఎలాంటి నేరం కాదు. సోనూ సింగ్‌తో ఉన్నవారిలో ఒక వ్యక్తి జైలు నుంచి పారిపోయి పరారీలో ఉన్నాడు. అలాంటి వ్యక్తులు ఓటు వేసే ముందు ఓటర్లను భయపెడుతున్నారు. ఇది సరియైన పద్ధతి కాదు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో ఓటు వేసే హక్కు ఉంద’ని మేనకా గాంధీ తెలిపారు. #WATCH: Minor argument between Union Minister and BJP's candidate from Sultanpur Maneka Gandhi and Mahagathbandhan candidate Sonu Singh after Gandhi alleged that Singh's supporters were threatening voters. #LokSabhaElections #Phase6 pic.twitter.com/l2Pn1yCRVO — ANI UP (@ANINewsUP) 12 May 2019 -
పేరు మారనున్న మరో నగరం..!
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో మరో నగరం పేరు మారనుంది. ఇప్పటికే అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా, ఫైజాబాద్‌ను అయోధ్యగా మార్చిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.. తాజాగా చారిత్రక నగరం సుల్తాన్‌పూర్‌ను కూడా ఆ జాబితాలో చేర్చనుంది. ఈ మేరకు గవర్నర్ రామ్‌నాయక్ సీఎం యోగీకి లేఖ రాశారు. చారిత్రకంగా ప్రాధాన్యం కలిగిన సుల్తాన్పూర్ పేరును.. కుష్‌భావన్‌పూర్‌గా మార్చాలని ఆయన సీఎంకు సూచించారు. పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ మేధావులు, ప్రతినిధులు తనతో భేటీ అయ్యారని తెలిపారు. వారు సమర్పించిన మెమోరాండం, సుల్తాన్పూర్ చరిత్రను తెలిపే ఓ పుస్తకాన్ని కూడా యోగికి అందించారు. కుష్‌భావన్‌పూర్‌ను చారిత్రక నగరంగా గుర్తించి అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారని తెలిపారు. సుల్తాన్పూర్ పేరు మార్చాలని బీజేపీ ఎమ్మెల్యే ఆ రాష్ట్రం అసెంబ్లీలో ప్రతిపాదన కూడా చేశారు. ఇక మొగల్ చక్రవర్తుల కాలం నుంచి ఉన్న పలు పురాతన నగరాల పేర్లు మార్చుతున్న బీజేపీ తమ హిందుత్వ అజెండాను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. (చదవండి : అలహాబాద్.. ఇకపై ప్రయాగ్‌రాజ్!) -
వెయిటర్‌తో గొడవ యజమానిపై కాల్పులు
-
వెయిటర్‌తో గొడవ.. ఓనర్‌పై కాల్పులు
లక్నో : ఉత్తరప్రదేశ్, సుల్తాన్‌పూర్‌లోని ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న కాల్పుల ఘటన థ్రిల్లర్ సినిమాను తలిపించింది. ఫుడ్ పార్సిల్ నేపథ్యంలో వెయిటర్‌తో చోటుచేసుకున్న గొడవ యజమాని హత్యాయత్నానికి దారి తీసింది. రోజులానే అవంతికా రెస్టారెంట్ ఆదివారం జనాలతో సందడిగా ఉంది. హోటల్ క్యాష్ కౌంటర్ వైపు సాదా సీదాగా నడుచుకుంటు వచ్చిన ఓ వ్యక్తి తుపాకీతో యజమాని అలోక్ ఆర్యాపై కాల్పులు జరిపాడు. డ్రామాను తలపించిన ఈ ఘటనతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. ఈ తతంగం అంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో తెల్లని షర్ట్, బ్లూ ప్యాంట్ వేసుకున్న ఓ వ్యక్తి కౌంటర్ వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ కౌంటర్ ముందు టేబుల్ మీద ఓ ఫ్యామిలీ డిన్నర్ చేస్తోంది. అయితే ఆ వ్యక్తి చడి చప్పుడు లేకుండా మూడు రౌండ్ల కాల్పులు జరిపి మెళ్లిగా జారకున్నాడు. వెంటనే తేరుకున్న హోటల్ సిబ్బంది అలోక్ ఆర్యాను సమీప ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అతనో ప్రయివేట్ కాంట్రాక్టర్ అని, పార్సిల్ విషయంలో వెయిటర్‌తో అతను గొడవపెట్టుకోగా .. యజమాని ఆర్యా జోక్యం చేసుకుని అతన్ని శాంతింపచేసే ప్రయత్నం చేశాడని తెలిపారు. అయితే నిందితుడు మళ్లి తన ఇద్దరి స్నేహితులతో రెస్టారెంట్‌కు వెళ్లి కాల్పులకు తెగబడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. -
నిర్లక్ష్యం: కన్నుతెరవకుండానే కన్నుమూశాడు
లక్నో: వైద్యుడి నిర్లక్ష్యం ఆ పసికందు పాలిట శాపమైంది. ఆ తల్లికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఉత్తర ప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ దారుణం చోటు చేసుకుంది. 26 సంవత్సరాల రేష్మీకి పురిటినొప్పులు రావటంతో సుల్తాన్‌పూర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. మగబిడ్డను ప్రసవించటంతో ఆ కుటుంబంలో సంతోషం నెలకొంది. అయితే కాన్ఫు చేసిన వైద్యుడు బొడ్డు తాడును కత్తిరించే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఆ పసిగుడ్డు పీకను కొసేశాడు. కళ్లు తెరకుండానే ఆ పసికందు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అటుపై మృత శిశువు జన్మించిందని కుటుంబ సభ్యులను నమ్మించే యత్నం చేశాడు. అయితే గొంతుపై కత్తి గాటు గమనించిన బంధువులు వైద్యుడిని నిలదీయటంతో అసలు విషయం చెప్పి క్షమాపణలు కోరాడు. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు అతనిపై దాడి చేసి పోలీసులకు అప్పగించారు. వైద్యుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
కూతురి వైద్యమంటే.. ట్రిపుల్ తలాక్!
లక్నో : ఓవైపు ట్రిపుల్ తలాక్‌ను క్రిమినల్ నేరంగా పరిగణించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న వేళ.. దేశవ్యాప్తంగా షరా మాములుగా ట్రిపుల్ తలాక్‌ల పర్వం కొనసాగుతూనే ఉంది. అయితే బిల్లు వార్తల్లో నిలుస్తున్న తరుణంలో అలాంటి కేసులు ఇంకా ఎక్కువ నమోదు అవుతుండటమే ఇక్కడ గమనించదగ్గ అంశం. ఉత్తర ప్రదేశ్‌లో శనివారం ఒక్క రోజే రెండు ట్రిపుల్ తలాక్ వ్యవహారాలు వెలుగుచూశాయి. గోండా ప్రాంతంలో ఓ మహిళకు తన భర్త మూడుసార్లు తలాక్ చెప్పి వెళ్లగొట్టాడని మీడియా ముందు వాపోయింది. వికలాంగురాలైన కూతురి చికిత్స కోసం డబ్బులు అడిగితే.. తన భర్త ఈ చర్యకు పాల్పడ్డాడని ఆమె వాపోయింది. తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె మత పెద్దలను, పోలీసులను కోరుతోంది. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఇక మరో ఘటనలో దుబాయ్‌లో ఉంటున్న ఓ వ్యక్తి భార్యకు ఫోన్లో సందేశం ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేశాడు. సుల్తాన్‌పూర్‌కు చెందిన రుబినా బానోకు, హఫీజ్ ఖాన్‌కు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త యూఏఈలో ఉద్యోగం చేస్తుండగా.. ఆమె అత్తవారింట్లో ఉంటోంది. అయితే గత కొంత కాలంగా అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తున్నారు. ఈ క్రమంలోనే రుబినా ఫోన్‌కు హఫీజ్ ట్రిపుల్ తలాక్ సందేశం పంపటంతో ఆమె షాక్ తింది. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు భర్త తనకు విడాకులు ఇచ్చి ఉంటాడని ఆమె భావిస్తోంది. గత రెండు నెలల్లో యూపీలో ట్రిపుల్ తలాక్ కేసులు 30 దాకా నమోదు కావటం గమనార్హం. రుబినా బానో ఫోటో ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) బిల్లు ప్రకారం 'ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్'ను క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. అది ఏ రూపకంలో(ఫోన్ సందేశం, సోషల్ మీడియా ద్వారా అయినా) ఉన్నా సరే నేరమే. దీని కింద ఒక ముస్లిం పురుషుడికి అత్యధికంగా మూడేళ్ల జైలుశిక్ష విధించవచ్చు. అంతే కాకుండా భర్త ఆ కాలంలో బాధితురాలికి భరణాన్ని కూడా చెల్లించాలి. లోక్‌సభలో బిల్లుకు క్లియరెన్స్ లభించగా.. రాజ్యసభలో ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. -
చెట్టు కిందే ఒక్కటైన జంట
-
చెట్టు కిందే ఒక్కటైన జంట
ఎలిగేడు(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌లో నివాస స్థలం విషయంలో నెలకొన్న వివాదంతో పోలీసు ఆంక్షల మధ్య చెట్టు కింద వివాహం జరిగింది. ‘సాక్షి’లో బుధవారం ‘చెట్టు కింద పెళ్లి’శీర్షికన ప్రచురితమైన కథనానికి తహసీ ల్దార్ నాగరాజమ్మ, సర్పంచ్ పెద్ది అనిత సమ్మయ్యలు స్పందించారు. బుధవారం ఉదయం సుల్తానాపూర్‌లోని వధువు ఇంటికి వచ్చి, ఆమె సుష్మిత తండ్రి వడ్లకొండ రామలక్ష్మయ్యతో మాట్లాడారు. రామలక్ష్మయ్యకు చెందిన వివాదాస్పద స్థలంలోనే టెంటు, కళ్యాణ మండపం వేయించారు. దీంతో సుష్మిత వివాహం శ్రావణ్‌తో సంప్రదాయబద్ధంగా జరిగింది. అంతా కొత్త దంపతులను ఆశీర్వదించారు. -
చైల్డ్‌లైన్‌కు ఫోన్‌కాల్.. ఆగిన బాల్య వివాహం
బంట్వారం: బాల్య వివాహ విషయమై చైల్డ్‌లైన్‌కు కాల్ చేయడంతో అధికారులు స్పందించి వివాహాన్ని నిలిపివేశారు. ఈ సంఘటన మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో సోమవారం చోటుచేసుకుంది. అధికారుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పి. కృష్ణయ్య, మల్లమ్మ దంపతుల కూతురు(13) బంట్వారం కేజీబీవీ పాఠశాలలో 8 వతరగతి చదువుతోంది. ఇదిలా ఉండగా బాలికకు ఆమె తల్లిదండ్రులు నవాబుపేట మండలం చించల్‌పేటకు చెందిన మేనబావ పరమేష్‌తో ఈనెల 12న పెళ్లి జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయమై గుర్తుతెలియని వ్యక్తులు చైల్డ్‌లైన్ నంబర్ 1098కు ఫోన్ చేసి విషయం తెలిపారు. అప్రమత్తమైన చైల్డ్‌లైన్ ఆర్గనైజర్ శ్రీనివాస్ సోమవారం ఐసీడీఎస్ సూపర్వైజర్ జగదాంభ, తహసీల్దార్ శ్రీనివాస్, ఇన్చార్జి ఎస్ఐ రాజు తదితరులు సుల్తాన్‌పూర్‌కు వెళ్లి బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు.బాలికకు మైనారిటీ తీరాకే పెళ్లి చేయాలని సూచించారు. దీంతో వారు అంగీకరించారు. అక్కడినుంచి అధికారుల బృందం బాలికతో సహా ఆమె తల్లిదండ్రులను కే జీబీవీ హాస్టల్‌కు తీసుకెళ్లారు. బాలిక మేజర్ అయ్యే వరకు పెళ్లి చేయబోనని ఆమె తండ్రి కృష్ణయ్య హామీపత్రం రాసిచ్చాడు. అనంతరం బాలికను హాస్టల్లో చేర్పించారు. బాలికను వివాహం చేసుకునేందుకు సిద్ధపడిన ఆమె బావ పరమేష్‌తో ఎస్ఐ రాజు మాట్లాడి హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించి బాలికను మైనారిటీ తీరకముందే పెళ్లి చేసుకుంటే కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. పీఎసీఎస్ చెర్మైన్ లక్ష్మారెడ్డి చైల్డ్‌లైన్ ఆర్గనైజర్ శ్రీనివాస్‌ను అభినందించారు. బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని బాలికకు సూచించారు. చిన్న వయసులో పెళ్లి చేస్తే జరిగే అనర్థాల గురించి అధికారులు బాలిక తల్లిదండ్రులకు వివరించారు. -
కాలుతూ కాలుతూ బిఎస్ పీ నేతను వాటేసుకున్నయువకుడు
దూరదర్శన్ ఎంపీ అభ్యర్థుల ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూండగా హఠాత్తుగా ఒక వ్యక్తి తనకు తాను నిప్పంటించుకుని, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిని గట్టిగా వాటేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ లో జరిగింది. దూరదర్శన్ జనమత్ 2014 కార్యక్రమాన్ని నిర్వహిస్తూండగా ఉన్నట్టుండి కిరోసిన్ తో నిండా తడిసిన ఒక వ్యక్తి దూసుకువచ్చాడు. అందరూ చూస్తూండగానే తనకు తాను నిప్పంటించుకున్నాడు. ఆ తరువాత పరుగులు తీస్తూ వచ్చి బిఎస్ పీ అభ్యర్థి కమరుజ్జమా ఫౌజీని వాటేసుకున్నాడు. ఇద్దరినీ విడదీసి ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ యువకుడికి 95 శాతం, కమరుజ్జమాకి 75 శాతం కాలిన గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితీ విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. వీరిద్దరిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు వ్యక్తులకు కూడా కాలిన గాయలు అయ్యాయి. ఆ యువకుడెవరు, ఎందుకిలా చేశాడన్నది ఇంకా తెలియరాలేదు. మొత్తం మీద ఈ సంఘటన సంచలనం సృష్టించింది. -
నన్ను కొట్టినవాడా ... నీకు నమస్కారం
పట్టుదలకు అరవింద్ కేజరీవాల్ మారుపేరు. నెత్తిన పెట్టుకున్న ఢిల్లీ ఓటరు చెంప వాచేలా కొడుతున్నా అరవింద్ కేజరీవాల్ పట్టుదల మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. మంగళవారం ఆయన్ని ఢిల్లీలోని సుల్తాన్ పురిలో ప్రచారం చేస్తూండగా ఒక ఆటోరిక్షా డ్రైవర్ చాచిపెట్టి చెంపమీద కొట్టాడు. కేజరీవాల్ తీరుకు వ్యతిరేకంగా లాలీ అనే ఈ ఆటోరిక్షా డ్రైవర్ ఈ చర్యకు తెగబడ్డాడు. ఆటో రిక్షా డ్రైవర్లకు కేజరీవాల్ అన్యాయం చేశారని ఆయన ఆరోపించాడు. ఈ దెబ్బకి కేజరీవాల్ కన్ను వాచిపోయింది. ఆయన్ని వెంటనే ఆస్పత్రికి తరలించవలసి వస్తుంది. ఇంత జరిగినా అరవింద్ కేజరీవాల్ పట్టుదల మాత్రం తగ్గలేదు. ఆయన 'నన్ను కొట్టిన వారిని నేను క్షమిస్తున్నాను. నన్ను కొట్టిన వారికి నమస్కారం. మీకు కావలసినంతగా నన్ను కొట్టుకొండి. నా కార్యకర్తలకు మాత్రం నేను చెప్పేది ఒక్కటే. నన్ను కొట్టిన వారిని తిరిగి కొట్టకండి.' అన్నారు కేజరీవాల్. అంతే కాదు... బుధవారం లాలీని కలుసుకునేందుకు ఆయన ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అరవింద్ కేజరీవాల్ కి పూలే కాదు. ముళ్లు కూడా దక్కుతున్నాయి. ఇప్పటికే గత కొన్ని వారాల్లో ఆయనపై పలు సార్లు దాడులు జరిగాయి. ఆయనపై గుడ్లు, ఇంకు, మోబిల్ ఆయిల్ వంటివి కూడ పోయడం జరిగింది. అయితే ఇవేవీ కేజరీవాల్ పట్టుదలను పెంచాయే తప్ప తగ్గించలేకపోయాయి.