మేనకా గాంధీ. సైనిక కుటుంబంలో పుట్టిన ఆమె జీవితమంతా పోరాటాలమయమే. ప్రధాని ఇందిర ఇంటి కోడలయ్యారు. కానీ కళ్లముందు కని్పంచిన బంగారు
భవిష్యత్తు చూస్తుండగానే కరిగిపోయింది. భర్త హఠాన్మరణంతో అంతా తలకిందులైంది. అయితే.. అత్తపై తిరగబడాల్సి వచి్చనా, రెండేళ్ల పసిబాబుతో అత్తింటికి శాశ్వతంగా దూరమైనా డీలా పడలేదు. ఒంటరిగానే రాజకీయాల్లో రాణించారు. బీజేపీలో చేరిన గాంధీ కుటుంబీకురాలిగా సంచలనం సృష్టించారు...
భర్త మరణంతో...
సంజయ్‌తో మేనక వైవాహిక బంధానికి ఆరేళ్లకే నూరేళ్లు నిండాయి. 1980లో భర్త విమాన ప్రమాదంలో మరణించే నాటికి మేనకకు కేవలం 23 ఏళ్లు. కొడుకు వరుణ్ 100 రోజుల పసికందు! భర్త ప్రాతినిధ్యం వహించిన అమేథీ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో పోటీ చేయాలనుకున్నారు. అందుకామె వయసు చాలలేదు. రాజ్యాంగ సవరణ చేసి ఎన్నికల్లో పోటీకి కనీస వయసును తగ్గించాల్సిందిగా ప్రధాని అయిన తన అత్తగారు ఇందిరను కోరారు.
ఆమె ఒప్పుకోలేదు. బావ రాజీవ్ అమేథీ నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. మరుసటేడు 1982లో సంజయ్ అనుచరులు లక్నోలో ఏర్పాటు చేసిన భేటీలో మేనక పాల్గొని ప్రసంగించారు. దీన్ని తనపై తిరుగుబాటుగా ఇందిర భావించారు. లండన్ పర్యటన నుంచి తిరిగొస్తూనే కోడలిపై కన్నెర్రజేశారు. ఇంటినుంచి వెళ్లిపొమ్మన్నారు. మనవడు వరుణ్‌ను తనతోనే ఉంచుకునేందుకు విఫలయత్నం చేశారు. 1982 మార్చిలో రెండేళ్ల కొడుకును వెంటబెట్టుకుని అత్తింటిని శాశ్వతంగా వదిలి వెళ్లారు మేనక.
సొంత పార్టీ .. బీజేపీ తీర్థం...
1983లో అక్బర్ అహ్మద్‌తో కలిసి రా్రïÙ్టయ సంజయ్ మంచ్‌ను స్థాపించారు మేనక. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి నాలుగింటిని గెలుచుకున్నారు! 1984 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీలో రాజీవ్‌పై పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత పార్టీని జనతాదళ్‌లో విలీనం చేశారు. ఆ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు.
1989లో జనతాదళ్ టికెట్‌పై పిలిభిత్ నుంచి లోక్‌సభకు ఎన్నికవడమే గాక కేంద్ర మంత్రి కూడా అయ్యారు. 1996లో అక్కణ్నుంచే స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేశారు. 1998లో రెండోసారి గెలిచారు. 1999లో బీజేపీలో చేరారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. 2014లో మోదీ ప్రభుత్వంలో మహిళా, శిశు సంక్షేమ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సుల్తాన్‌పూర్ నుంచి గెలుపొందారు. ఈసారీ అక్కణ్నుంచే బరిలో ఉన్నారు. పిలిభిత్‌కు మేనక ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించారు. తర్వాత అక్కణ్నుంచి వరుణ్ రెండుసార్లు గెలిచారు.
ప్రేమ, పెళ్లి, ఎడబాటు..
మేనక 1956 ఆగస్టు 26న జని్మంచారు. తల్లిదండ్రులు లెఫ్టినెంట్ కల్నల్ తర్లోచన్ సింగ్ ఆనంద్, అమర్‌దీప్. లారెన్స్ స్కూల్, లేడీ శ్రీ రామ్ కాలేజీలో చదివారు. జవహర్‌లాల్ నెహ్రూ వర్సిటీలో జర్మన్ అభ్యసించారు. కాలేజీ రోజుల్లో అందాల పోటీల్లో గెలుపొందారు. బాంబే డైయింగ్ మోడల్‌గా కూడా చేశారు. 1973లో సంజయ్ గాంధీని ఓ పార్టీ లో కలిశారు. రెండేళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ప్రధాని కొడుకుతో సంబంధం అనగానే మేనక కుటుంబం సంకోచించినా ఇందిర మాత్రం ఈ బంధాన్ని సాదరంగా స్వాగతించారు. అలా 1974లో సంజయ్‌తో పెళ్లయింది. 1980లో వరుణ్ పుట్టాడు. తొలుత ఫిరోజ్ అని తాత పేరు పెట్టగా దానికి వరుణ్ అని ఇందిర చేర్చారు.
జంతు ప్రేమికురాలిగా..
మేనక చేయి తిరిగిన రచయిత్రి, కాలమిస్ట్. జంతు హక్కుల కార్యకర్త. 1992లో పీపుల్ ఫర్ యానిమల్స్ (పీఎఫ్‌ఏ)ని స్థాపించారు. ఇది దేశంలో అతిపెద్ద జంతు సంక్షేమ సంస్థల్లో ఒకటి. కేంద్రంలో జంతు సంక్షేమ శాఖను సృష్టించి, దానికి మంత్రిగా కూడా పనిచేశారు. బహిరంగ ప్రదర్శనలకు జంతువుల వాడకాన్ని నిషేధిస్తూ చట్టం తెచ్చారు. కాస్మటిక్స్, ఆహార ఉత్పత్తులపై శాకాహారం, మాంసాహారం అని లేబుల్ చేయడాన్ని తప్పనిసరి చేశారు. జంతువులు, పర్యావరణం పట్ల ఆమె నిబద్ధతకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. పలు ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment