న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ చేసిన వ్యయం రూ. 1,737.68 కోట్లు. ఎన్నికల కమిషన్‌కు ఆ పార్టీ ఈ మేరకు నివేదిక సమర్పించింది. ఇందులో సాధారణ పార్టీ ప్రచారం కోసం పెట్టిన ఖర్చు రూ. 884.45 కాగా, అభ్యర్థులకు సంబంధించిన వ్యయం రూ.853.23 కోట్లు. సుమారుగా రూ.611.50 కోట్లను కేవలం మీడియాలో ప్రకటనల కోసమే వెచ్చించింది. ఇందులో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు, బల్క్ ఎస్‌ఎంఎస్‌లు, కేబుల్, వెబ్‌సైట్లు, టీవీ చానెళ్లలో ప్రచారం వంటివి ఉన్నాయి.
మరో రూ.55.75 కోట్లను పోస్టర్లు, బ్యానర్లు, జెండాలు ప్రచార సామాగ్రికి ప్రత్యేకించింది. బహి రంగ సభలు, ర్యాలీల ఏర్పాట్ల కోసం మరో రూ.19.84 కోట్లు ఖర్చు చేసింది. స్టార్ క్యాంపెయినర్ల ప్రయాణ ఖర్చుల కోసం రూ. 168. 92 కోట్లను, ఇతర పార్టీ నేతల ప్రయా ణాలకు రూ.2.53 కోట్లు ఖర్చయింది. సార్వ త్రిక ఎన్ని కలతోపాటే మూడు రాష్ట్రాలు.. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు వరుసగా రూ.5,552.57 కోట్లు, రూ.5,552.41 కోట్లు, రూ.5,555.65 కోట్లు వెచ్చించినట్లు బీజేపీ తన నివేదికలో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment