పరువు నష్టం కేసుపై రాహుల్ వ్యాఖ్యలు, కోర్టుకు హాజరు
సుల్తాన్‌పూర్(యూపీ): కేవలం చౌకబారు ప్రచారం కోసమే బీజేపీ నేతలు తనపై పరువు నష్టం వేశారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. శుక్రవారం ఆయన సుల్తాన్‌పూర్‌లోని ఎంపీ–ఎమ్మెల్యే కేసులను విచారించే ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు. తాను ఎవరిపైనా పరువు నష్టం కలిగించేంతటి ఆరోపణలు చేయలేదని జడ్జి శుభమ్ వర్మ ఎదుట తెలిపారు.
దీంతో, జడ్జి కేసు తదుపరి విచారణను ఆగస్ట్ 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అదే రోజు రాహుల్ వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని చెప్పారు. రాహుల్ కోర్టుకు రానవసరం లేదని పేర్కొన్నారు. అనంతరం కోర్టు వెలుపల రాహుల్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు చౌకబారు ప్రచారం కోసమే తనపై కేసు వేశారన్నారు.
రాహుల్ కొత్త చిరునామా..!
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సునహరీ బాగ్ రోడ్‌లోని ఐదో నంబర్ బంగ్లాకు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేబినెట్ హోదా కలిగిన ప్రతిపక్ష నేతకు నిబంధనల ప్రకారం టైప్–8 బంగ్లాను కేటాయించాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీకి సునహరీ బాగ్‌లోని ఐదో నంబర్ బంగ్లాను కేటాయించినట్లు హౌస్ కమిటీ వర్గాలు శుక్రవారం తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment