cheap publicity
-
Rahul Gandhi: బీజేపీ చౌకబారు ప్రచారం కోసమే!
సుల్తాన్పూర్(యూపీ): కేవలం చౌకబారు ప్రచారం కోసమే బీజేపీ నేతలు తనపై పరువు నష్టం వేశారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. శుక్రవారం ఆయన సుల్తాన్‌పూర్‌లోని ఎంపీ–ఎమ్మెల్యే కేసులను విచారించే ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు. తాను ఎవరిపైనా పరువు నష్టం కలిగించేంతటి ఆరోపణలు చేయలేదని జడ్జి శుభమ్ వర్మ ఎదుట తెలిపారు. దీంతో, జడ్జి కేసు తదుపరి విచారణను ఆగస్ట్ 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అదే రోజు రాహుల్ వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని చెప్పారు. రాహుల్ కోర్టుకు రానవసరం లేదని పేర్కొన్నారు. అనంతరం కోర్టు వెలుపల రాహుల్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు చౌకబారు ప్రచారం కోసమే తనపై కేసు వేశారన్నారు. రాహుల్ కొత్త చిరునామా..!న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సునహరీ బాగ్ రోడ్‌లోని ఐదో నంబర్ బంగ్లాకు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేబినెట్ హోదా కలిగిన ప్రతిపక్ష నేతకు నిబంధనల ప్రకారం టైప్–8 బంగ్లాను కేటాయించాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీకి సునహరీ బాగ్‌లోని ఐదో నంబర్ బంగ్లాను కేటాయించినట్లు హౌస్ కమిటీ వర్గాలు శుక్రవారం తెలిపాయి. -
ఈ ఉద్యమాలతో ఏం సాధిస్తారు?
‘‘నేను స్త్రీవాదినే. కాకపోతే ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న ‘మీటూ’ ఉద్యమమంతా రబ్బిష్ (చెత్త) ’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటి షావుకారు జానకి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇలా పేర్కొన్నారామె. ఓ తమిళ చానెల్ ఇంటర్వ్యూలో ‘మీటూ’ గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘కొన్ని రోజులుగా టీవీల్లో, పేపర్స్‌లో ‘మీటూ’ గురించే వార్తలు వస్తున్నాయి. ఎప్పుడో ఇలాంటి ఓ పనికి అంగీకరించి ప్రస్తుతం ప్రమోషన్ కోసం దానిని వాడుకుంటున్నారు. ఇలాంటి పనుల వల్ల మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పరువు పోవడం తప్ప ఏం లేదు. ఇలాంటి ఉద్యమాలతో ఏం సాధిస్తారు? చీప్ పబ్లిసిటీ కోసం ఎప్పుడో జరిగినవాటి గురించి, లేదా జరగని వాటి గురించిన ఆరోపణలు చేస్తున్నారు వీళ్లంతా’’ అని పేర్కొన్నారు షావుకారు జానకి. -
చౌకబారు ప్రచారం కోసం పిల్ వేయొద్దు: సుప్రీం కోర్టు
ప్రజా ప్రయోజిత వ్యాజ్యం (పిల్)పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చౌకబారు ప్రచారం కోసం పిల్ పేరుతో కోర్టులను ఆశ్రయించవద్దని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం పేర్కొంది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీకి హర్యానా ప్రభుత్వం భుమి కేటాయించడంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఎమ్.ఎల్.శర్మ అనే న్యాయవాది దాఖలు చేసిన పిల్‌ను తోసిపుచ్చుతూ సుప్రీం కోర్టు పైవిధంగా స్పందించింది. జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ రంజన్ గొగోయ్‌లతో కూడిన ధర్మాసనం పిల్‌ను ఉపసంహరించుకునేందుకు శర్మకు అనుమతించింది. 'మీరు ఏ ఆధారాలతో ఓ వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నారు? అతని పేరు ప్రతిష్టలను దెబ్బతీసేందుకు పిల్‌ను ఉపయోగించడాన్ని అనుమతించం. రాజకీయ నేతలతో బంధుత్వం ఉన్నంత మాత్రాన వారిపై నిరాధార ఆరోపణలు చేసి కోర్టులను ఆశ్రయించవద్దు. చౌకబారు ప్రచారం కోసం పిల్ దాఖలు చేయొద్దు' అని జస్టిస్ దత్తు అన్నారు.