ఈ ఉద్యమాలతో ఏం సాధిస్తారు? | Veteran actor Sowcar Janaki calls the Me Too movement a 'shameless publicity stunt' | Sakshi
Sakshi News home page

ఈ ఉద్యమాలతో ఏం సాధిస్తారు?

Published Tue, Jan 1 2019 3:57 AM | Last Updated on Tue, Jan 1 2019 5:29 AM

Veteran actor Sowcar Janaki calls the Me Too movement a 'shameless publicity stunt' - Sakshi

షావుకారు జానకి

‘‘నేను స్త్రీవాదినే. కాకపోతే ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న ‘మీటూ’ ఉద్యమమంతా రబ్బిష్‌ (చెత్త) ’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్‌ నటి షావుకారు జానకి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇలా పేర్కొన్నారామె. ఓ తమిళ చానెల్‌ ఇంటర్వ్యూలో ‘మీటూ’ గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘కొన్ని రోజులుగా టీవీల్లో, పేపర్స్‌లో ‘మీటూ’ గురించే వార్తలు వస్తున్నాయి.

ఎప్పుడో ఇలాంటి ఓ పనికి అంగీకరించి ప్రస్తుతం ప్రమోషన్‌ కోసం దానిని వాడుకుంటున్నారు. ఇలాంటి పనుల వల్ల మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పరువు పోవడం తప్ప ఏం లేదు. ఇలాంటి ఉద్యమాలతో ఏం సాధిస్తారు? చీప్‌ పబ్లిసిటీ కోసం ఎప్పుడో జరిగినవాటి గురించి, లేదా జరగని వాటి గురించిన ఆరోపణలు చేస్తున్నారు వీళ్లంతా’’ అని పేర్కొన్నారు షావుకారు జానకి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement