ప్రజా ప్రయోజిత వ్యాజ్యం (పిల్)పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చౌకబారు ప్రచారం కోసం పిల్ పేరుతో కోర్టులను ఆశ్రయించవద్దని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం పేర్కొంది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీకి హర్యానా ప్రభుత్వం భుమి కేటాయించడంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఎమ్.ఎల్.శర్మ అనే న్యాయవాది దాఖలు చేసిన పిల్ను తోసిపుచ్చుతూ సుప్రీం కోర్టు పైవిధంగా స్పందించింది.
జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ రంజన్ గొగోయ్లతో కూడిన ధర్మాసనం పిల్ను ఉపసంహరించుకునేందుకు శర్మకు అనుమతించింది. 'మీరు ఏ ఆధారాలతో ఓ వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నారు? అతని పేరు ప్రతిష్టలను దెబ్బతీసేందుకు పిల్ను ఉపయోగించడాన్ని అనుమతించం. రాజకీయ నేతలతో బంధుత్వం ఉన్నంత మాత్రాన వారిపై నిరాధార ఆరోపణలు చేసి కోర్టులను ఆశ్రయించవద్దు. చౌకబారు ప్రచారం కోసం పిల్ దాఖలు చేయొద్దు' అని జస్టిస్ దత్తు అన్నారు.
చౌకబారు ప్రచారం కోసం పిల్ వేయొద్దు: సుప్రీం కోర్టు
Published Mon, Oct 28 2013 1:47 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement