Maneka Gandhi
-
Lok Sabha Election 2024: చోటీ బహూకు ఇంటిపోరు
సుల్తాన్పూర్. గాంధీ కుటుంబపు కంచుకోట రాయ్‌బరేలీకి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోక్‌సభ స్థానం. అత్తగారైన ఇందిరను ఎదిరించి చిన్న వయస్సులోనే ఒంటరిగా రాజకీయాల్లోకి వచి్చన మేనకా గాంధీ ఇక్కడి సిట్టింగ్ ఎంపీ. ఎంపీగా ఏకంగా తొమ్మిదో విజయమే లక్ష్యంగా బీజేపీ తరఫునే మళ్లీ బరిలోకి దిగారు. అయితే సొంత పారీ్టయే ఆమెకు అంతగా సహకరించడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో మేనక కేవలం 14,500 ఓట్లతో గట్టెక్కారు. ఈసారి ఆమె గెలుపు ఈజీ కాదని విశ్లేషకులూ అంటున్న పరిస్థితి! ఇన్ని సవాళ్ల నడుమ సుల్తాన్ పూర్ పరీక్షలో 67 ఏళ్ల ఈ ‘చోటీ బహు’ ఎలా నెగ్గుకొస్తారనేది ఉత్కంఠ రేపుతోంది... భర్త సంజయ్‌గాంధీ మరణం తర్వాత ఇందిరతో విభేదాలు మేనకను ఒంటరిని చేశాయి. అప్పటికి చంటిపిల్లాడైన వరుణ్ గాం«దీని తీసుకొని కుటుంబం నుంచి బయటికొచ్చారు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఒంటరి పోరాటమే చేస్తూ వచ్చారు. తొలిసారి 1984లో అమేథీలో బావ రాజీవ్‌గాం«దీని ఢీకొని 2.7 లక్షల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. 1989లో జనతాదళ్ తరఫున ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ నుంచి గెలిచి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. 1991లో మళ్లీ బీజేపీ చేతిలో ఓటమి చవిచూసినా ఆ తర్వాత మాత్రం వరుసగా ఏడుసార్లు విజయం సాధించారు. పిలిభిత్ను కంచుకోటగా మార్చుకున్నారు. అక్కడి నుంచి మూడుసార్లు ఇండిపెండెంట్‌గా కూడా విజయకేతం ఎగరేయడం విశేషం. మధ్యలో ఒకసారి ఆవ్లా లోక్‌సభ స్థానం నుంచీ నెగ్గారు. వీపీ సింగ్ ప్రభుత్వంలో, తర్వాత వాజ్‌పేయి సర్కారులో, మోదీ తొలి విడత ప్రభుత్వంలోనూ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఫిలిబిత్‌లో ఆరుసార్లు గెలిచాక 2019లో ఆ స్థానాన్ని కుమారుడు వరుణ్‌కు వదిలి తొలిసారి సుల్తాన్‌పూర్‌కు మారారు. వరుణ్‌కు బీజేపీ ఈసారి మొండిచేయి చూపడంతో మేనక కూడా నిరుత్సాహానికి గురయ్యారు. ఓబీసీలు, ముస్లింలే కీలకం... సుల్తాన్‌పూర్‌లో నిషాద్‌లతో పాటు కురీ్మలు, యాదవులు, ముస్లింలు, దళితులు ఎక్కువగా ఉన్నారు. బ్రాహ్మణులు, ఠాకూర్లు ఓ మోస్తరుగా ఉంటారు. కాంగ్రెస్ మద్దతుతో ఎస్పీ తరఫున బరిలోకి దిగిన రామ్ భువల్ నిషాద్కు ఆ సామాజిక వర్గంలో గట్టి పట్టుంది. బీఎస్పీ కుర్మీ సామాజికవర్గానికి చెందిన ఉద్రజ్ వర్మను రంగంలోకి దించడంతో ఓట్లు భారీగా చీలే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ బీఎస్పీ రెండుసార్లు గెలవగా ఎస్పీ బోణీయే చేయలేదు! స్థానిక సమస్యలే ప్రధానాంశాలుగా ప్రచారం సాగింది. ప్రచారానికి మోదీ, షా దూరం సుల్తాన్‌పూర్‌లో శనివారం ఆరో విడతలో పోలింగ్ జరగనుంది. కానీ యూపీ అంతా కలియదిరుగుతున్న ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ అగ్ర నేతలెవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విశేషం! ప్రచారం చివర్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఓ ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో ఈ ఎన్నికలు ఆమెకు మళ్లీ ఒంటరి పోరాటంగానే కనిపిస్తున్నాయి. అయితే కుటుంబీకులైన రాహుల్, ప్రియాంక మొదలుకుని విపక్ష నాయకులెవరూ కూడా మేనకకు వ్యతిరేకంగా పెద్దగా ప్రచారం చేయకపోవడం విశేషం! అయోధ్య రామ మందిర నిర్మాణం, వరుణ్‌కు టికెట్ నిరాకరణ వంటివేవీ సుల్తాన్‌పూర్‌లో ఎన్నికల అంశాలు కావు. నియోజకవర్గ ప్రజల సమస్యలే ప్రధానాంశాలు. వాటిని తీర్చేందుకు ఐదేళ్లుగా చేసిన కృషే నన్ను మళ్లీ గెలిపిస్తుంది. గత ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచి చూపిస్తా. – మేనకా గాంధీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
Maneka gandhi: కరిగిన కల నుంచి లేచిన అల
మేనకా గాంధీ. సైనిక కుటుంబంలో పుట్టిన ఆమె జీవితమంతా పోరాటాలమయమే. ప్రధాని ఇందిర ఇంటి కోడలయ్యారు. కానీ కళ్లముందు కని్పంచిన బంగారు భవిష్యత్తు చూస్తుండగానే కరిగిపోయింది. భర్త హఠాన్మరణంతో అంతా తలకిందులైంది. అయితే.. అత్తపై తిరగబడాల్సి వచి్చనా, రెండేళ్ల పసిబాబుతో అత్తింటికి శాశ్వతంగా దూరమైనా డీలా పడలేదు. ఒంటరిగానే రాజకీయాల్లో రాణించారు. బీజేపీలో చేరిన గాంధీ కుటుంబీకురాలిగా సంచలనం సృష్టించారు... భర్త మరణంతో... సంజయ్‌తో మేనక వైవాహిక బంధానికి ఆరేళ్లకే నూరేళ్లు నిండాయి. 1980లో భర్త విమాన ప్రమాదంలో మరణించే నాటికి మేనకకు కేవలం 23 ఏళ్లు. కొడుకు వరుణ్ 100 రోజుల పసికందు! భర్త ప్రాతినిధ్యం వహించిన అమేథీ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో పోటీ చేయాలనుకున్నారు. అందుకామె వయసు చాలలేదు. రాజ్యాంగ సవరణ చేసి ఎన్నికల్లో పోటీకి కనీస వయసును తగ్గించాల్సిందిగా ప్రధాని అయిన తన అత్తగారు ఇందిరను కోరారు. ఆమె ఒప్పుకోలేదు. బావ రాజీవ్ అమేథీ నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. మరుసటేడు 1982లో సంజయ్ అనుచరులు లక్నోలో ఏర్పాటు చేసిన భేటీలో మేనక పాల్గొని ప్రసంగించారు. దీన్ని తనపై తిరుగుబాటుగా ఇందిర భావించారు. లండన్ పర్యటన నుంచి తిరిగొస్తూనే కోడలిపై కన్నెర్రజేశారు. ఇంటినుంచి వెళ్లిపొమ్మన్నారు. మనవడు వరుణ్‌ను తనతోనే ఉంచుకునేందుకు విఫలయత్నం చేశారు. 1982 మార్చిలో రెండేళ్ల కొడుకును వెంటబెట్టుకుని అత్తింటిని శాశ్వతంగా వదిలి వెళ్లారు మేనక.సొంత పార్టీ .. బీజేపీ తీర్థం... 1983లో అక్బర్ అహ్మద్‌తో కలిసి రా్రïÙ్టయ సంజయ్ మంచ్‌ను స్థాపించారు మేనక. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి నాలుగింటిని గెలుచుకున్నారు! 1984 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీలో రాజీవ్‌పై పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత పార్టీని జనతాదళ్‌లో విలీనం చేశారు. ఆ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 1989లో జనతాదళ్ టికెట్‌పై పిలిభిత్ నుంచి లోక్‌సభకు ఎన్నికవడమే గాక కేంద్ర మంత్రి కూడా అయ్యారు. 1996లో అక్కణ్నుంచే స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేశారు. 1998లో రెండోసారి గెలిచారు. 1999లో బీజేపీలో చేరారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. 2014లో మోదీ ప్రభుత్వంలో మహిళా, శిశు సంక్షేమ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సుల్తాన్పూర్ నుంచి గెలుపొందారు. ఈసారీ అక్కణ్నుంచే బరిలో ఉన్నారు. పిలిభిత్‌కు మేనక ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించారు. తర్వాత అక్కణ్నుంచి వరుణ్ రెండుసార్లు గెలిచారు. ప్రేమ, పెళ్లి, ఎడబాటు.. మేనక 1956 ఆగస్టు 26న జని్మంచారు. తల్లిదండ్రులు లెఫ్టినెంట్ కల్నల్ తర్లోచన్ సింగ్ ఆనంద్, అమర్దీప్. లారెన్స్ స్కూల్, లేడీ శ్రీ రామ్ కాలేజీలో చదివారు. జవహర్లాల్ నెహ్రూ వర్సిటీలో జర్మన్ అభ్యసించారు. కాలేజీ రోజుల్లో అందాల పోటీల్లో గెలుపొందారు. బాంబే డైయింగ్ మోడల్‌గా కూడా చేశారు. 1973లో సంజయ్ గాంధీని ఓ పార్టీ లో కలిశారు. రెండేళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ప్రధాని కొడుకుతో సంబంధం అనగానే మేనక కుటుంబం సంకోచించినా ఇందిర మాత్రం ఈ బంధాన్ని సాదరంగా స్వాగతించారు. అలా 1974లో సంజయ్‌తో పెళ్లయింది. 1980లో వరుణ్ పుట్టాడు. తొలుత ఫిరోజ్ అని తాత పేరు పెట్టగా దానికి వరుణ్ అని ఇందిర చేర్చారు. జంతు ప్రేమికురాలిగా.. మేనక చేయి తిరిగిన రచయిత్రి, కాలమిస్ట్. జంతు హక్కుల కార్యకర్త. 1992లో పీపుల్ ఫర్ యానిమల్స్ (పీఎఫ్ఏ)ని స్థాపించారు. ఇది దేశంలో అతిపెద్ద జంతు సంక్షేమ సంస్థల్లో ఒకటి. కేంద్రంలో జంతు సంక్షేమ శాఖను సృష్టించి, దానికి మంత్రిగా కూడా పనిచేశారు. బహిరంగ ప్రదర్శనలకు జంతువుల వాడకాన్ని నిషేధిస్తూ చట్టం తెచ్చారు. కాస్మటిక్స్, ఆహార ఉత్పత్తులపై శాకాహారం, మాంసాహారం అని లేబుల్ చేయడాన్ని తప్పనిసరి చేశారు. జంతువులు, పర్యావరణం పట్ల ఆమె నిబద్ధతకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. పలు ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సస్పెన్స్‌లో తల్లీకొడుకుల సీట్లు.. విడిగా వరుణ్ గాంధీ పోటీ?
లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్ చాలా కీలకమైన రాష్ట్రం. ఇక్కడ మొత్తం 80 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ క్రమంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు ఈ రాష్ట్రానికి చెందిన 51 స్థానాలకు బీజేపీ మొదటి విడతలో అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ ప్రకటించిన మొదటి విడత అభ్యర్థుల జాబితాలో పిలిభిత్, సుల్తాన్పూర్, కైసర్‌గంజ్, రాయ్‌బరేలి, మైన్‌పురి, మరికొన్ని ముఖ్యమైన స్థానాలు లేవు. వీటిలో పిలిభిట్ లోక్‌సభ స్థానం నుంచి ప్రస్తుతం వరుణ్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆయన తల్లి, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ సుల్తాన్పూర్ లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇక్కడి రాష్ట్ర బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం.. రైతులకు సంబంధించిన సమస్యలపై పార్టీ నాయకత్వంతోపాటు స్థానిక బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేక గళం వినిపించిన వరుణ్ గాంధీకి ఈసారి టిక్కెట్ ఉండకపోవచ్చు అంటున్నారు. ఒకప్పుడు తన తండ్రి సంజయ్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన అమేథీ నుంచి ప్రతిపక్ష భారత కూటమి మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా వరుణ్ గాంధీ పోటీ చేయవచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి. -
ఎల్విష్ రేవ్ పార్టీ కలకలం: మేనకా గాంధీ ఫైర్, అసలీ ట్రాప్ ఎవరిది?
రేవ్‌పార్టీ, కోబ్రా విషం లాంటి సంచలన ఆరోపణలు ఎదుర్కొటున్న యూ ట్యూబర్ బిగ్ బాస్ OTT సీజన్ 2 విజేత ఎల్విష్ యాదవ్ వ్యవహారంలో ట్విస్ట్‌లు ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుతో తనకేమీ సంబంధంలేదనీ ఎల్విష్ వాదిస్తుండగా, అతడే కీలక సూత్రధారి కచ్చితంగా అరెస్ట్ చేయాలని బీజేపీ ఎంపీ మేనకా గాంధీ డిమాండ్ చేశారు. మరోవైపు ఈకేసులో అతని జోక్యంపై ఇంకా ఎలాంటి విషయాలు వెలుగు రాలేదని పోలీసులు తాజాగా తేల్చారు. దీంతో అసలీ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చింది. మేనకా గాంధీ ఎందుకు స్పందించారు లాంటి వివరాలు ఒకసారి చూద్దాం... యూట్యూబర్, బిగ్‌బాస్ ఓటీటీ సీజన్-2 (హిందీ) విజేత ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) పాములు, పాముల విషంతో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎల్విష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సంచలనం రేపింది. అయితే ఈ కేసులో తనను అరెస్టు చేసినట్లు ఆరోపణలు, ఇతర వాదనలు అవాస్తవమని పేర్కొన్నాడు. తనపై అసత్యం ప్రచారం జరుగుతోందంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నానంటూ మీడియాలో వస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం ఎంతమాత్రం నిజంలేదని, అసలు ఈ కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. దీనిపై విచారణ జరిపించాలంటూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు ఈ వ్యవహారంలో తనప్రమేయం ఉందని తేలితే తదనంతర పరిణామాలకు, తాను బాధ్యత వహిస్తానన్నాడు. శిక్ష అనుభవించడానికి సిద్ధమేనని పేర్కొన్నాడు. అంతేకాదు ఈ విషయంలో ఆధారాలు లేకుండా తన పేరును ప్రస్తావించ వద్దని యూపీ పోలీసులను కోరాడు. అతడే కింగ్ పిన్, అరెస్ట్ చేయండి మరోవైపు ఈ ఘటనపై బీజేపీ ఎంపి మేనకా గాంధీ స్పందించారు. ఎల్విష్ యాదవ్‌ను వెంటనే అరెస్టు చేయాలని మేనకా గాంధీ డిమాండ్ చేశారు. అంతేకాదు అతను నిర్దోషి కాకపోతే, ఎందుకు పరారీలో ఉన్నాడని ఆమె ప్రశ్నించారు. వన్యప్రాణుల చట్టం కింది. ఇది గ్రేడ్ 1 నేరం, ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు. అలాగే చాలా వీడియోలలో అంతరించిపోతున్న జాతుల పాములను ఉపయోగిస్తాడు. నోయిడా, గురుగ్రామ్‌లలో పాము విషాన్ని విక్రయిస్తున్నాడనే సమాచారం తమ వద్ద ఉందని స్పష్టం చేశారు. కింగ్ కోబ్రాస్ విషాన్ని బయటకు తీస్తే చనిపోతాయనిప తెలిపారు. ఆహారం జీర్ణం కావడానికి ఈ విషం తోడ్పడుతుందని, విషం లేకుండా ఏమీ తినలేక చనిపోతాయన్నారు. దేశంలో నాగుపాములు, కొండ చిలువలు చాలా తక్కువ.. వాటిని సొంతం చేసుకోవడం నేరమని వాటిని కాపాడాలని ఆమె మీడియాకు వెల్లడించారు. దీని వెనుక పెద్ద రాకెట్ ఉండి ఉండవచ్చని, ఈ స్మగ్లింగ్‌కు సంబంధించినమొత్తం వ్యవహారంలో కింగ్‌పిన్ అతడేనని మేనకా గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. మొన్న ఇస్కాన్.. ఇపుడు నేను, ఇలా అయితే లోక్ సభ సీటు వచ్చేస్తుందా? మేనకా గాంధీ వ్యాఖ్యలు తనకు షాకింగ్ అనిపించాయని దీనిపై తనకు క్షమాపణలు చెప్పాలంటూ ఎల్వీష్ ట్వీట్ చేశాడు. మొన్న ఇస్కాన్ మీద ఆరోపణలు, ఇపుడు తనను టార్గెట్ చేశారు... ఇలా లోక్‌సభ టిక్కెట్ వస్తుందా అంటూ ఎల్విష్ యాదవ్ మేనకా గాంధీపై విరుచుకుపడ్డాడు. ఇదిలా ఉండగా ఎల్విష్ పాముతో ఆడుకుంటున్నట్లు మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Judge saab proof ye rha pic.twitter.com/2db31v0bVb — Dr Nimo Yadav (@niiravmodi) November 3, 2023 పీపుల్ ఫర్ యానిమల్స్ ట్రాప్ మేనకా గాంధీ ఫౌండర్‌గా ఉన్న స్వచ్ఛంద సంస్థ పీపుల్ ఫర్ యానిమల్స్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, ఈ ఎన్జీవోనే ఎల్విష్ యాదవ్‌ను సంప్రదించి, రేవ్ పార్టీ నిర్వహించి, కోబ్రా విషం కావాలంటూ కోరింది. దీనికి సరేనన్న ఎల్విష్ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశాడు. కోబ్రా విషాన్ని తీసుకని రాహుల్ అనే అతను సెక్టార్ 51 బాంకెట్ హాల్‌కు వచ్చాడు. దీంతో నోయిడా పోలీసులు డిఎఫ్ఓతో పాటు అతగాడిని అరెస్టు చేశారు. రేవ్ పార్టీ కేసులో ఎల్విష్ , మరో ఐదుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదైనాయి. అలాగే దు కోబ్రాలతో సహా తొమ్మిది పాములను కూడా రక్షించారు. రాహుల్ నుంచి 20 ఎంఎల్ విషాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని విచారణ నిమిత్తం ఎఫ్ఎస్ఎల్కు పంపించిన సంగతి తెలిసిందే. Uttar Pradesh Police registers FIR against YouTuber and Bigg Boss winner Elvish Yadav, for making available snake venom at rave parties BJP MP and founder of People for Animals (PFA), Maneka Gandhi says, "He should be arrested immediately. This is a grade-I crime - that means… pic.twitter.com/26qX6gciG3 — ANI (@ANI) November 3, 2023 -
'గాడిద పాల సబ్బు వాడితే మహిళలు ఎప్పటికీ అందంగా ఉంటారు'
లక్నో: బీజేపీ ఎంపీ, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ స్టేట్మెంట్కు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉత్తర్‌ప్రదేశ్ సుల్తాన్‌పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాడిద పాలతో తయారు చేసిన సబ్బులు వాడితే మహిళలు చాలా అందంగా అవుతారని మేనకా గాంధీ అన్నారు. ఈజిప్టుకు చెందిన ప్రఖ్యాత రాణి క్లియోపాత్ర కూడా గాడిద పాలలోనే స్నానం చేసేదని పేర్కొన్నారు. దీంతో ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. 'గాడిద పాలతో తయారు చేసిన సబ్బు ధర ఢిల్లీలో రూ.500 ఉంది. మనం కూడా గాడిద పాలు, మేక పాలతో సబ్బులు తయారు చేయడం ఎందుకు ప్రారంభించకూడదు?. లద్దాక్‌కు చెంది ఓ కమ్యూనిటీ గాడిదల సంఖ్య క్రమంగా తగ్గుతోందని వెల్లడించింది. అందుకే గాడిద పాలను వారు సబ్బుల తయారీకి వాడుతున్నారు. గాడిద పాలతో చేసిన సబ్బును వాడితే మహిళలు ఎప్పటికీ అందంగా ఉంటారు.' అని మేనకా గాంధీ అన్నారు. गधे के दूध का साबुन औरत के शरीर को खूबसूरत रखता है"◆ BJP सांसद @Manekagandhibjp का बयान #BJP | BJP | #ManekaGandhi | Maneka Gandhi pic.twitter.com/AlvguCEgE5— Shahzad Khan (@Shahzadkhanjou) April 2, 2023 చదవండి: రాహుల్ గాంధీకి నిరాశ.. కోర్టులో దక్కని ఊరట.. ఏప్రిల్ 13 వరకు బెయిల్ -
క్లియోపాత్ర వాటితోనే స్నానం చేసింది!: మేనక గాంధీ వ్యాఖ్యలు వైరల్
బీజేపీ పార్లమెంటు సభ్యురాలు కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ గాడిద పాల గురించి చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ మేరకు ఆమె ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో జరిగిన బహిరంగ సమావేశంలో గాడిద పాల సబ్బులు మహిళలను ఎల్లప్పుడూ అందంగా ఉంచుతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆమె ఆ వీడియోలో..గాడిద పాలతో చేసిన సబ్బులు మహిళల సౌందర్యాన్ని పెంచుతాయని, ఈజిప్టు రాణి క్లియోపాత్రా కూడా గాడిద పాలతోనే స్నానం చేసిందని అన్నారు. పైగా ఢిల్లీలో గాడిద పాలతో చేసిన సబ్బు ఒక్కొక్కటి రూ. 500 ధర పలుకుతుందని చెప్పారు. లడఖ్ కమ్యూనిటీ కూడా గాడిద పాలతోనే సబ్బులు తయారు చేస్తున్నట్లు చెప్పారు. అందువల్లే గాడిదల సంఖ్య తగ్గిపోతున్నట్లు చెప్పుకొచ్చారు. అదీగాక చాకలివాళ్లు కూడా గాడిదలను వినయోగించడం లేదని అన్నారు. లడఖ్‌లోని కమ్యూనిటీ సంఘం కూడా గాడిదల సంఖ్య తగ్గిపోతున్నట్ల గుర్తించిందని తెలిపారు. తన ప్రసంగంలో పెరుగుతున్న ఖర్చుల గురించి కూడా ప్రస్తావించారు..చెట్లు అంతరించిపోతున్నాయని, అందువల్లే కలప ఖరీదు పెరిగిపోయిందన్నారు. దీంతో దహన సంస్కారాల ఖర్చులు కూడా పెరిగిపోయాయని చెప్పుకొచ్చారు. అందువల్ల పేద ప్రజలు మరణంలో సైతం తమ కుంటుంబికులను నిర్థాక్షిణ్యంగా వదిలేస్తున్నారని చెప్పారు. దహన సంస్కరాలకు కలపను/ఆవు పేడను వినియోగిస్తే అయ్యే ఖర్చుల వ్యత్యాసాన్ని సైతం విపులంగా వివరించారు మేనకా గాంధీ. అయితే తన ఉద్దేశ్యం ప్రజలు జంతవుల నుంచి డబ్బు సంపాదించమని కాదని, ఐనా ఈనాటికి మేకలు, ఆవులు పెంచుతున్న వారెవరూ ధనవంతులు కాలేదని చెప్పారు. అయినా మన వద్ద తగిన సంఖ్యలో వైద్యులు కూడా అందుబాటులో లేరని అన్నారు. సుమారు 25 లక్షల మంది ఉండే సుల్తాన్‌పూర్‌లో కనీసం ముగ్గురు డాక్టర్లు కూడా లేరని, కొన్నిసార్లు అంతమంది కూడా ఉండరని చెప్పుకొచ్చారు. గెదె, మేక జబ్బు పడితే లక్షలు ఖర్చు పెడతారు, పైగా ఆడవాళ్లను కూడా పశుపోషణలో చేయమని అడుగుతాం. అయితే వారు ఎంతవరకు చేయగలరు. అందుకే తాను మేక లేదా ఆవు పెంపకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాను. దీంతో మీరు సంపాదించాలంటే దశాబ్దం పడుతుంది. పైగా ఆ జంతవు ఒక్క రాత్రిలో చనిపోతుంది. దీంతో అప్పటి వరకు చేసిందంతా వృధా అయిపోతుందంటూ మేనకా గాంధీ చాలా విచిత్రంగా ప్రసంగించారు. गधे के दूध का साबुन औरत के शरीर को खूबसूरत रखता है"इनकी सुंदरता की राज आजा के सामने आई जो गधे के दूध से बनी और गोबर से बनी साबुन का प्रोडक्ट यूज करती हैं ◆ BJP सांसद @Manekagandhibjp का बयान #BJP | BJP | #ManekaGandhi | Maneka Gandhi pic.twitter.com/rXW1aY1t6o — AZAD ALAM (@Azad24906244) April 2, 2023 (చదవండి: కాంగ్రెస్ ఫైల్స్ అంటూ వీడియో రిలీజ్ చేసిన బీజేపీ) -
వీధికుక్కల ఆదరణపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. వాస్తవమెంతంటే..
ఢిల్లీ: వీధి కుక్కలను ఆదరించేవాళ్లకు సుప్రీం కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చిందంటూ ఓ కథనం జాతీయ మీడియా వెబ్సైట్లలో చక్కర్లు కొడుతోంది. ప్రతీరోజూ వాటికి తిండిపెట్టడమే కాదు.. వ్యాక్సినేషన్ వేయించాల్సిన బాధ్యత కూడా ఉంటుందని గుర్తు చేసిందంటూ, ఒకవేళ అవి గనుక ఎవరినైనా కరిస్తే, ఆ పరిణామాలకూ వాటిని ఆదరించేవాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేసిందన్నది ఆ కథనాల సారాంశం. మూగజీవాల పరిరక్షణతో పాటు ప్రజల భద్రత కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం తెలిపిందని, వీధికుక్కలను ఆదరించి.. తిండి పెట్టేవాళ్లూ వాటి బాధ్యతలను కూడా తీసుకోవాల్సి ఉంటుందని, ఒకవేళ అవి ఎవరి మీదైనా దాడి చేస్తే గనుక.. ఆ ఘటనలకు వాళ్లే బాధ్యలవుతారు అంటూ బెంచ్ పేర్కొందని కథనం కొన్ని జాతీయ మీడియా ఛానెల్స్ ద్వారా ప్రముఖంగా వైరల్ అయ్యింది. అయితే.. ఈ కథనంలో వాస్తవం లేదన్న విషయం ఇప్పుడు తేలింది. ఎంపీ, జంతు పరిరక్షణ సమితి సభ్యురాలు మేనకా గాంధీ ఓ వీడియో విడుదల చేశారు. న్యాయస్థానంగానీ, ఏ న్యాయమూర్తి అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కేవలం దురుద్దేశంతోనే కొందరు అలా ప్రచారం చేస్తున్నారని ఆమె ఆ వీడియోలో స్పష్టత ఇచ్చారు. కాబట్టి, వీధికుక్కల ఆదరణపై సుప్రీం కోర్టు ప్రతికూల వ్యాఖ్యలు చేసిందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేలింది. FAKE NEWS : "Those who feed stray dogs will be held liable if dogs attack : supreme court order" Maneka Gandhi, Member of Loksabha, animal rights activist, and environmentalist has given clarification on the same. We request everyone to continue to feed stray animals 🙏. pic.twitter.com/2AWptngja6 — BELAGAVI INFRA.co.in (@Belagavi_infra) September 10, 2022 ఇదిలా ఉంటే.. 2019 నుంచి దేశంలో 1.5 కోట్ల మంది కుక్కకాటుకు గురైనట్లు గణాంకాలు చెప్తున్నాయి. అత్యధికంగా ఉత్తర ప్రదేశ్‌లో కేసులు, ఆపై తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో కేసులు నమోదు అయ్యాయి. వీటిలో పెంపుడు కుక్కలంటే.. వీధికుక్కల దాడులే ఎక్కువగా ఉన్నాయి. కేరళ, ముంబైలలో పెనుముప్పుగా మారిన వీధికుక్కల దాడులను అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వ సంబంధిత పౌర విభాగాలు.. వాటిని చంపించడంపై దృష్టిసారించాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల హైకోర్టుల్లో పలు పిటిషన్లు నమోదుకాగా.. వాటిని కోర్టులు తోసిపుచ్చాయి. దీంతో మూగజీవాల సంరక్షణ సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా.. ఒక బ్యాచ్ పిటిషన్లను విచారిస్తోంది అత్యున్నత న్యాయస్థానం. తాజా విచారణ సందర్భంగా.. సెప్టెంబర్ 28కి తదుపరి విచారణ వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. దేశంలో మణిపూర్, లక్షద్వీప్, దాద్రానగర్ హవేలిలో వీధి కుక్కల సంఖ్య సున్నాగా ఉందని అక్కడి అధికార యంత్రాంగాలు ప్రకటించుకున్నాయి. ఇదీ చదవండి: జొమాటో డెలివరీ బాయ్‌పై కుక్క దాడి.. వీడియో వైరల్ -
వరుణ్ గాంధీకి బీజేపీ ఝలక్.. ఎందుకంటే..?
న్యూఢిల్లీ: వరుణ్ గాంధీకి భారతీయ జనతా పార్టీ(బీజేపీ) షాక్ ఇచ్చింది. తాజాగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో వరుణ్ గాంధీకి మొండిచేయి చూపింది. 80 సభ్యులతో కూడిన జాతీయ కార్యవర్గాన్ని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం ప్రకటించారు. వరుణ్ గాంధీ సహా ఆయన తల్లి మేనకా గాంధీకి కూడా కార్యవర్గంలో చోటు దక్కలేదు. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీ.. సొంత పార్టీకి కంట్లో నలుసులా మారారు. మేనకా గాంధీ.. మధ్యప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ ఎంపీగా ఉన్నారు. అందుకే చోటు దక్కలేదా? ఇటీవల కాలంలో మోదీ సర్కారు విధానాలను విమర్శిస్తూ వరుణ్ గట్టిగానే గళం విన్పిస్తున్నారు. ముఖ్యంగా రైతు చట్టాలు, ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరి ఘటన నేపథ్యంలో ఆయన స్వరాన్ని మరింత పెంచారు. లఖీమ్‌పూర్ ఖేరీలో శాంతియుతంగా నిరసన చేపట్టిన రైతులపై ఉద్దేశపూర్వకంగానే కారు ఎక్కించారని ఆరోపించారు. పోలీసులు తక్షణమే స్పందించి దోషులను అరెస్ట్ చేయాలన్నారు. హింసాకాండకు బాధ్యులైన వారిని చట్టప్రకారం శిక్షించాలని తాజాగా డిమాండ్ చేశారు. అన్నదాతల రక్తం కళ్లజూసిన వారిని బోనెక్కించాలని ట్విటర్ వేదికగా నినదించారు. ఈ నేపథ్యంలో విడుదల చేసిన బీజేపీ జాతీయ కార్యవర్గంలో వరుణ్, మేనకా గాంధీలకు చోటు దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జంబో కార్యవర్గం బీజేపీ తాజాగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు చోటు దక్కించుకున్నారు. 80 మంది సాధారణ సభ్యులతో పాటు 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 179 మంది శాశ్వత ఆహ్వానితులు(ఎక్స్‌ఆఫిషియో) సహా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, లెజిస్లేటివ్ పార్టీ నేతలు, మాజీ డిప్యూటీ సీఎం, జాతీయ అధికార ప్రతినిధి, నేషనల్ ఫ్రంట్ ప్రెసిడెంట్, స్టేట్ ఇన్చార్జి, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. (చదవండి: లఖీమ్‌పూర్ హింస.. సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా) అమిత్ షా, రాజనాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్, మాజీ మంత్రులు హర్షవర్థన్, ప్రకాశ్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్, ఎంపీలు, సీనియర్ నేతలకు బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది. బీజేపీ జాతీయ కార్యవర్గం వివిధ అంశాలపై చర్చిస్తుంది. పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన మార్గదర్శకాలను నిర్దేశిస్తుంది. కోవిడ్ -19 సంక్షోభం కారణంగా జాతీయ కార్యవర్గ సమావేశం చాలా కాలంగా జరగలేదు. -
ఆ వ్యక్తిని అరెస్ట్ చేయండి: మేనకా గాంధీ
న్యూఢిల్లీ : పంజాబ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి పెంపుడు శునకాన్ని కారుతో తొక్కించి చంపిన ఘటనపై బీజేపీ సీనియర్ నాయకురాలు మేనకా గాంధీ స్పందించారు. సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ట్విటర్ వేదికగా ఆమె స్పందిస్తూ.. ‘‘శునకాన్ని కారుతో తొక్కించి చంపిన వ్యక్తి పేరు గురిందర్ సింగ్. పంజాబ్‌లోని కాపుర్తలా, దండూపుర్‌కు చెందిన వాడు. అతడు డాగ్స్ బ్రీడింగ్ చేయటంతో పాటు వాటిని పోట్లాటల కోసం అమ్ముతుంటాడు. కుక్కలతో అవసరం తీరిపోతే అతడు ఇలా హింసించి చంపుతుంటాడు. ఆ కుక్క అత్యంత బాధను అనుభవించి 30 నిమిషాల తర్వాత చనిపోయింది’’ అని తెలిపారు. This is Gurinder Singh s/o Harbans Singh, village Dandupur, Kapurthala in Punjab. He is a breeder and seller of dogs for dog fights. This is what he does to dogs when they are no longer useful. This dog died after 30 minutes of being in excruciating pain. pic.twitter.com/lIvBpzXOhp — Maneka Sanjay Gandhi (@Manekagandhibjp) August 18, 2020 ‘‘ఆ రోజు రాత్రి అతడి దగ్గర ఉన్న కుక్కలను ఇంటి వెనకాల ఉన్న ఓ చెరువులో పడేశాడు. ఓ కుక్క చనిపోయింది. మిగిలిన కుక్కలను స్థానికులు కాపాడారు. ఈ వ్యక్తిని అరెస్ట్ చేయాలని ముఖ్యమంత్రి, పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని మరో ట్వీట్లో పేర్కొన్నారు. -
ప్రత్యర్థితో మేనకాగాంధీ వాగ్వాదం
లక్నో: కేంద్ర మంత్రి, సుల్తాన్పూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మేనకాగాంధీ, తన ప్రత్యర్థి సోనూ సింగ్‌ల మద్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం పిలీభీత్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మేనకాగాంధీ ఈ ఎన్నికల్లో సుల్తాన్పూర్ నుంచి బరిలో నిలిచిన సంగతి తెలసిందే. అయితే ఆ స్థానం నుంచి ఎస్పీ, బీఎస్పీ కూటమి తరఫున సోనూ సింగ్ బరిలో ఉన్నారు. కాగా, ఆరో విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆదివారం ఉదయం పోలింగ్ ప్రారంభం అయింది. నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూతులను పరిశీలిస్తున్న మేనకాగాంధీ.. ఎస్పీ, బీఎస్పీ నాయకులు ఓటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ‘మీ రౌడీయిజం ఇక్కడ పని చేయదని’ సోనూ సింగ్‌ను ఉద్దేశించి మేనకాగాంధీ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను ఖండించిన సోనూ సింగ్ తాను ఏ తప్పు చేశానో చెప్పాలంటూ మేనకాగాంధీని ప్రశ్నించారు. ఈ సమయంలో సోనూ సింగ్ అనుచరులు ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇరువురు నేతలు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది. ‘నేను నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌ల పరిశీలనలో భాగంగా ఇక్కడికి వచ్చాను. పోలింగ్ సక్రమంగా జరుగుతుందో లేదో తెలసుకోవడం ఎలాంటి నేరం కాదు. సోనూ సింగ్‌తో ఉన్నవారిలో ఒక వ్యక్తి జైలు నుంచి పారిపోయి పరారీలో ఉన్నాడు. అలాంటి వ్యక్తులు ఓటు వేసే ముందు ఓటర్లను భయపెడుతున్నారు. ఇది సరియైన పద్ధతి కాదు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో ఓటు వేసే హక్కు ఉంద’ని మేనకా గాంధీ తెలిపారు. #WATCH: Minor argument between Union Minister and BJP's candidate from Sultanpur Maneka Gandhi and Mahagathbandhan candidate Sonu Singh after Gandhi alleged that Singh's supporters were threatening voters. #LokSabhaElections #Phase6 pic.twitter.com/l2Pn1yCRVO — ANI UP (@ANINewsUP) 12 May 2019 -
వాళ్లతో నా షూ లేసులు విప్పించుకుంటా..!
-
వాళ్లతో నా షూ లేసులు విప్పించుకుంటా..!
లక్నో : వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ సీనియర్ నేత మేనకా గాంధీ ఈసీ ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తనయుడు, సుల్తాన్పూర్ సిట్టింగ్ ఎంపీ వరుణ్‌గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. మేనకా తరపున సుల్తాన్‌పూర్‌లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకులపై విమర్శలు చేసేక్రమంలో నోరుజారారు. ప్రతిపక్ష నాయకులతో తన షూ లేసులు విప్పించుకుంటానని వ్యాఖ్యానించారు. తమది నెహ్రూ-గాంధీ ఫ్యామిలీ అని పరోక్షంగా చెప్పుకున్న వరుణ్ సుల్తాన్పూర్ బీఎస్పీ అభ్యర్థి చంద్ర భద్ర సింగ్‌ని టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మనం దేవుడికి తప్ప ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీకోసం నేనున్నా. నేను సంజయ్ గాంధీ తనయున్ని. మన పట్ల అగౌరంగా మాట్లాడేవారిని పట్టించుకోవద్దు. అలాంటి వారితో నా షూ లేసు విప్పించుకుంటా. నా ముందు మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. ప్రజలు మోనూ, సోనూలను చూసి భయపడొద్దు’ అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన చంద్ర భద్ర సింగ్‌ని స్థానికులు సోనూ సింగ్ అని పిలుస్తారు. ఆయన సోదరుడు మోనూ సింగ్‌కి స్థానికంగా పేరుంది. వరుణ్ గాంధీ ప్రసంగించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఓ రాజకీయ నేత అయివుండీ నోటికొచ్చినట్లు మాట్లాడటం కరెక్టు కాదని నెటిజన్లు మండిపడుతన్నారు. ఫ్రస్ట్రేషన్లో ఉండటం వల్లే ఇలా మాట్లాడుతున్నారని ఫైర్ అవుతున్నారు. వరుణ్ ఫిలిబిత్ నుంచి పోటీ చేస్తున్నారు. #WATCH BJP LS candidate from Pilibhit, Varun Gandhi in Sultanpur says, "Mai ek hi cheez aapko kehna chahta hoon, kisi se darne ki koi zarurat nahi hai....Mai khada hoon yaha pe, mai Sanjay Gandhi ka ladka hoon, mai in logon se apne jute khulvata hoon" (2.4.19) pic.twitter.com/LnA8kVDivu — ANI UP (@ANINewsUP) May 4, 2019 -
కేంద్రమంత్రికి ఈసీ మొట్టికాయలు..!
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను బెదిరిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి మేనకా గాంధీకి ఎన్నికల కమిషన్ మొట్టికాయలు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ నుంచి పోటీ చేస్తున్న మేనక ఈ నెల 16న సర్కోటా గ్రామంలో మాట్లాడుతూ.. బీజేపీకి మద్దతుగా ఉండే గ్రామాలను ఏబీసీడీ కేటగిరిలుగా విభజించి.. గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని బెదిరింపులకు దిగారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించిన ఈసీ ఆమెను రెండు రోజులు (48 గంటల పాటు) ఎన్నికల ప్రచారం నుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈసీ మేనకాకు మరోసారి నోటీసులు ఇచ్చింది. ఓటర్లను బెదిరిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి రిపీట్ కావొద్దని హెచ్చరించింది. అంతకుముందు కూడా ఆమె నోరు జారారు. (చదవండి : మళ్లీ నోరు జారిన మేనకా!) తురబ్ ఖానీ గ్రామంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ... ‘నా గెలుపు తథ్యం. కానీ ముస్లింల మద్దతు లేకుండా గెలవడం నాకు సంతోషాన్నివ్వదు. ప్రతిఫలం ఆశించకుండా పనిచేయడానికి తామేమీ మహాత్మా గాంధీ వారసులం కాదు కదా’ అంటూ మేనక వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కూడా ఆమె షోకాజ్ నోటీసులు అదుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మూడు రోజుల చొప్పున, బీఎస్పీ అధినేత్రి మాయావతి రెండు రోజుల పాటు ప్రచారానికి దూరంగా ఉండాలని ఈసీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారన్న కారణంగా ఈసీ వీరిపై చర్యలు తీసుకుంది. (చదవండి : ఓటు గుట్టు తెలిస్తే ఏమవుతుంది? -
ఓటర్లను హెచ్చరించిన మేనకా గాంధీ
-
ఓటు గుట్టు తెలిస్తే ఏమవుతుంది?
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న మేనకా గాంధీ సోమవారం పిలిభిత్ జిల్లా వాసులతో మాట్లాడుతూ తనకు వచ్చిన ఓట్ల ప్రాతిపదికన ఆయా ప్రాంతాలను ఏబీసీడీలుగా విభజించి అభివద్ధి కార్యక్రమాలను అమలు చేస్తానని హెచ్చరించిన విషయం తెల్సిందే. అంటే, ఎక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాలను ‘ఏ’ కేటగిరీగా తక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాలను ‘డీ’ కేటగిరీలుగా విభజిస్తానని చెప్పడం. అంతకుముందు వారం ఆమె ముస్లిం ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ తనకు ఓట్లేస్తేనే ముస్లిం బాగోగులు గురించి చూస్తనని హెచ్చరించడమే కాకుండా, ఏ యాభై, వందో ఓట్లేసి పనుల కోసం తన దగ్గరికొస్తే అప్పుడు వారి పని చెబుతానని కూడా హెచ్చరించారు. ఆమె హెచ్చరికల వెనకనున్న ఉచితానుచితాలను, తప్పొప్పులను ప్రస్తుతానికి పక్కన పెడితే ఏ ప్రాంతంలో ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి ఓట్లు వేశారనే విషయం బయటకు తెలియడం వల్ల ఎంత ముప్పుందో, ఓటు గుట్టును గుట్టుగా ఉంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఎంత అవసరమో చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1951లోని ప్రజా ప్రాతినిథ్య చట్టం ఓటును గోప్యంగా ఉంచేందుకు గ్యారంటీగా ‘రహస్య బ్యాలెట్’ విధానాన్ని తీసుకొచ్చింది. రహస్య బ్యాలెట్ నిర్వహించినప్పటికీ గ్రామాల్లో లేదా చిన్న, చిన్న బూతుల్లో ఏ అభ్యర్థికి ఓటు వేశారన్న విషయం తెలిసిపోతుండడంతో, ఓ ప్రాంతం, ఓ బ్లాక్ నుంచి తీసుకొచ్చిన పోలింగ్ డబ్బాలన్నింటిని ఓ చోట చేర్చి వాటిలోని ఓట్లను మిశ్రమం చేసి లెక్కించాలని ప్రజాప్రాతినిధ్య చట్టానికి 1961లో ఓ సవరణ తీసుకొచ్చారు. అంటే ఏ ప్రాంతంలో ఏ అభ్యర్థికి ఎక్కువ లేదా తక్కువ ఓట్లు వచ్చాయో తెలుసుకునే అవకాశం లేకుండా ఉండాలన్న ఉద్దేశమే సవరణ లక్ష్యం. ఈ విధానం 2009 వరకు కొనసాగింది. ఈవీఎంల ప్రవేశంతో సీన్ మారింది! 2009 ఎన్నికల నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)ను ప్రవేశపెట్టడం ద్వారా ఓటు గోప్యత తగ్గుతూ వచ్చింది. సాధారణంగా వెయ్యి నుంచి 1500 ఓటర్లకు ఒక ఈవీఎంను ఏర్పాటు చేస్తారు. అయితే ఒక్కో ఈవీఎంలో 200 నుంచి 600 వరకు ఓట్లు నమోదు అవుతున్నాయి. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ప్రతి పోలింగ్ అధికారి ‘ఫామ్20’ నింపాలి. పోలింగ్ కేంద్రంలో ఎన్ని ఈవీఎంలు ఉపయోగించారో, ఒక్కో ఈవీఎంలో ఎన్ని ఓట్లు పడ్డాయో ఆ ఫామ్‌లో తెలియజేయాలి. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏ ప్రాంతం, ఏ పోలింగ్ బూత్, ఏ ఈవీఎంలో అభ్యర్థులకు ఎలా వచ్చాయో తెలిసిపోతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద, పార్టీల వద్ద పోలింగ్ కేంద్రం ప్రాతిపదికన చిరునామాలతో సహా ఓటర్ల జాబితా లభిస్తుంది. ఆ జాబితా ఆధారంగా ఏ కులస్థులు, ఏ మతస్థులు, పురుషులు లేదా మహిళలు ఎవరికి ఓటు వేశారో సులభంగానే తెలుసుకోవచ్చు. ఓటర్ల జాబితాలో కుల, మతాల ప్రస్థావన ఉండకపోయినా రాజకీయ పార్టీలు సమకూర్చుకున్న డేటాలో ఆ వివరాలు ఉంటున్నాయి. చిన్న పోలింగ్ కేంద్రాలలో ఎవరు, ఎవరికి ఓటు వేశారో ఇంకా సులువుగా తెలుసుకోవచ్చు. ఎప్పుడూ బీజేపీకే ఆ ఓటు గుజరాత్‌లోని గిరి అడవుల్లో బనేజ్ తండాలో ఒకే ఒక ఓటరు ఉన్నారు. భరత్‌దాస్ దర్శన్‌దాస్ అనే 55 ఏళ్ల ఆ ఓటరు గత కొన్ని పర్యాయాలుగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేస్తున్నారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లోని మాలేగామ్ పర్వతాల్లో సొకేలా తయాంగ్ అనే 39 ఏళ్ల ఏకైక ఓటరు కోసం ప్రత్యేక పోలీంగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 11వ తేదీన ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపున ఆమె ఎవరికి ఓటు వేశారో సులభంగా తెలిసి పోతుంది. (చదవండి: ఒక్క ఓటు కోసం ఆరుగురు సిబ్బంది) అమిత్ షా ఆదేశాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీదున్న వ్యతిరేకతను ఎదుర్కోవడానికి వీలుగా కేంద్ర సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న దేశంలోని 22 కోట్ల మందిని ప్రత్యక్షంగా కలుసుకొని ఓట్లను కోరాల్సిందిగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల పార్టీ కార్యకర్తలను ఆదేశించారు. నేటి డిజిటల్ యుగంలో లబ్ధిదారుల్లో ఓటర్లను గుర్తించడం కష్టం కాదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ‘సేవామిత్ర’ యాప్ ద్వారా ఓటర్లలో ప్రభుత్వ లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రయత్నించిన విషయం తెల్సిందే. తీవ్రమైన పర్యవసనాలు ఏ ఓటరు ఎవరికి ఓటు వేశారో తెలిసిపోతే తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయి. మేనకా గాంధీ హెచ్చరించినట్లు ఓటు వేయని వారిపై కక్ష సాధించవచ్చు. వారికి ఎలాంటి ప్రభుత్వ సాయం అందకుండా చేయవచ్చు. ఇంకేమైనా చేయవచ్చు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం జేడీయూ కార్యకర్తలు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తమ పార్టీ అభ్యర్థికి ఎందుకు ఓటు వేయలేదంటూ ఓ ప్రాంతం ఓటర్లను చితక బాదారు. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా పునరావతం కావచ్చు! పరిష్కారం ఏమిటీ ? ఈవీఎంలను ప్రవేశపెట్టడానికి ముందు నుంచే, అంటే 2008 నుంచి ఈవీఎంలను విడివిడిగా కాకుండా కలిపి లెక్కించేందుకు వాటికి ‘టోటలైజర్’ను అనుసంధించాలనే డిమాండ్ వస్తోంది. బూత్ స్థాయిలో 14 ఈవీఎంలకు ఒక టోటలైజర్‌ను అనుసంధానించవచ్చని కూడా నిపుణులు తేల్చారు. టోటలైజర్ ఓట్ల లెక్కింపును ‘క్లస్టర్ కౌంటింగ్’ అని కూడా వ్యవహరిస్తారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ విధానాన్ని అమలుకు ప్రతిపాదించగా 2017లో బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. దీని వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని ఉన్నత స్థాయి కమిటీ ద్వారా తేలిందని సుప్రీం కోర్టు ముందు వాదించింది. అలా తేల్చిన కమిటీ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీల కమిటీ. ఇదే విషయమై 2018లో క్లస్టర్ కౌంటింగ్ కోసం ఓ ఎన్జీవో సంస్థ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా, విచారించకుండానే కోర్టు దాన్ని కొట్టివేసింది. యాభై శాతం ఓటింగ్ యంత్రాలకు ఓటర్ వెరీఫైయింగ్ (వీవీపీఏటీ) స్లిప్‌లు ఉండాలని డిమాండ్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తామంటూ ఆదివారం నాడు ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి. వాటికన్నా కూడా ఈ ‘క్లస్టర్ కౌంటింగ్’ అత్యవసరం. ఈ ఎన్నికలకు క్లస్టర్ కౌంటింగ్ సాధ్యం కాదు కనుక, ‘ఫొమ్ 20’ నింపకుండానైనా చూడాలి. -
ఆజంఖాన్‌కు గట్టి షాక్ ఇచ్చిన ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్‌పై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. బీజేపీ అభ్యర్థి, సినీనటి జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఆయనపై వేటు వేసింది. 72గంటలు (మూడు రోజులు) ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా ఆయనపై ఈసీ నిషేధం విధించింది. అదేవిధంగా ముస్లింల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి మేనకా గాంధీపైన ఈసీ చర్యలు తీసుకొంది. 48 గంటలు ప్రచారం నిర్వహించకుండా ఆమెపై నిషేధం విధించింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు, మతమనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలు చేస్తున్న నేతలపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి వరుసగా మూడు రోజులు (72 గంటల పాటు), రెండు రోజులు (48 గంటల పాటు) ఎన్నికల ప్రచారం నుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక, ఆదివారం ఓ ఎన్నికల ప్రచారసభలో ఆజంఖాన్ మాట్లాడుతూ.. ‘జయప్రదను నేనే రాంపూర్‌కు తీసుకొచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా, పల్లెత్తు మాట అనకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే(మీడియా) సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను.’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈవ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మహిళల మనోభావాలు కించపరిచేలా ఉన్నాయని ఆజంఖాన్‌పై కేసు కూడా నమోదైంది. మహిళా కమిషన్ సైతం ఆజం ఖాన్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి అతనికి నోటీసులు జారీ చేసినట్టు పేర్కొంది -
మళ్లీ నోరు జారిన మేనకా!
లక్నో : తనకు ఓటు వేస్తేనే సాయం చేస్తానని ముస్లిం ఓటర్లను బెదిరించి వివాదంలో చిక్కుకున్న కేంద్రమంత్రి మేనకా గాంధీ.. మరోసారి నోరు జారారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ నుంచి పోటీ చేస్తున్న ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి మద్దతుగా ఉండే గ్రామాలను ఏబీసీడీ కేటగిరిలుగా విభజించి.. గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేపడ్తామని ప్రకటించారు. బీజేపీ 80 శాతం ఓటర్లు మద్దతుగా ఉండే గ్రామాలను ఏ కేటగిరిగా.. 60 శాతంలోపు ఉండే గ్రామాలను బీ.. 50 శాతంకు తక్కువగా ఉండే ఊర్లను సీ.. 30 శాతం కన్నా తక్కువగా ఉన్న గ్రామాలను డీ కేటగిరిలుగా విభజించారు. గెలిచిన తర్వాత చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ఈ కేటగిరిల మాదిరిగానే ప్రాధాన్యత కల్పిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే పిలిబిత్ నియోజకవర్గంలో ఈ కేటగిరి సిస్టమ్‌ను అమలు చేశామన్నారు. పిలిభిత్ నుంచి ఆరసార్లు గెలుపొందిన మేనకా.. ఈ సారి సుల్తాన్పూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. సుల్తాన్పూర్ సిట్టింగ్ ఎంపీ అయిన ఆమె కుమారుడు వరుణ్ గాంధీ పిలిబిత్ నుంచి పోటీ చేస్తున్నారు. మస్లిం ఓటర్లను బెదిరించిన వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చకావడంతో ఈసీ వివిరణ కోరుతూ ఆమెకు నోటీసులు జారిచేసింది. ముస్లింల ఓట్లు లేకుండా లభించే గెలుపు తనకు సంతోషానివ్వదంటూనే...తనకు ఓటు వేయాలో లేదో నిర్ణయించుకోవాలని, తనకు ఓటు చేయని ముస్లింలకు తానెలా సాయం చేస్తానంటూ మేనకా బ్లాక్ మెయిలింగ్‌కు దిగారు. ఓటు వేయని ముస్లిం ఓటర్ల వివరాలు తనకు తెలిసి పోతాయనీ ఈ నేపథ్యంలో వారికందాల్సిన సహాయం ఆధారపడి వుంటుందంటూ సభాముఖంగానే హెచ్చరించారు. మీరు ఓటు వేసినా... వేయకపోయినా గెలుస్తాను. కానీ ఇది ఇచ్చు పుచ్చుకోవాల్సిన వ్యవహారమని వివాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
నాకు ఓటేయకపోతే శపిస్తా : బీజేపీ ఎంపీ
ఉన్నావ్ : 2019లో 'మోదీ సునామీ' నేపథ్యంలో 2024లో ఎన్నికలే జరగవని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సాక్షిమహరాజ్.. తాజాగా ఓటర్లను బెదరించారు. తనకు ఓటేయ్యకపోతే శపిస్తానని హెచ్చరించారు. ఉన్నావ్ సిట్టింగ్ ఎంపీ అయిన సాక్షిమహరాజ్.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను బెదిరించారు. తాను ఒక సన్యాసినని, సన్యాసి అడిగింది ఇవ్వకపోతే.. చెడు కలుగుతుందని పురాణాల్లో ఉందన్నారు. సుఖాలకు దూరమై చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవిస్తారన్నారు. తానేం ఆస్తులు అడుగటం లేదని, 125 కోట్ల మంది భవిష్యత్తు నిర్ణయించే ఓటును మాత్రమే అడుగుతున్నాన్నారు. కేంద్రమంత్రి మనేకాగాంధీ సైతం ఇలానే ఓటర్లను బెదిరించి అభాసుపాలైనవ విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ నుంచి పోటీ చేస్తున్న ఆమె.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లిం ఓటర్లను బెదరించారు. ముస్లింల ఓట్లు లేకుండా లభించే గెలుపు తనకు సంతోషాన్నివ్వదని, తనకు ఓటు వేయని ముస్లింలకు తానెలా సాయం చేస్తానంటూ బ్లాక్ మెయిలింగ్‌కు దిగారు. ఓటు వేయని ముస్లిం ఓటర్ల వివరాలు తనకు తెలిసి పోతాయనీ.. వారికందే సహాయం ఓటేసేదానిపైనే ఆధారపడి ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేయడంతో ఈసీ ఆమెను వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. -
మేనకా గాంధీకి షోకాజ్ నోటీసులు!
లక్నో : ముస్లింలు తనకు ఓటేయాలని, గెలిచిన తర్వాత తనతో వారికి పడుతుందంటూ బ్లాక్‌మెయిలింగ్ ధోరణిలో మాట్లాడిన కేంద్రమంత్రి, బీజేపీ నేత మేనకా గాంధీకి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుల్తాన్‌పూర్‌లోని తురబ్ ఖానీ గ్రామంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ... ‘నా గెలుపు తథ్యం. కానీ ముస్లింల మద్దతు లేకుండా గెలవడం నాకు సంతోషాన్నివ్వదు. ప్రతిఫలం ఆశించకుండా పనిచేయడానికి తామేమీ మహాత్మా గాంధీ వారసులం కాదు కదా’ అంటూ మేనక వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. అదేవిధంగా సుల్తాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ కూడా ఆమెకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. కాగా గతంలో ఫిలిబిత్ నుంచి పోటీ చేసిన మేనకా గాంధీ ఈసారి తన కుమారుడు వరుణ్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న సుల్తాన్పూర్ నుంచి బరిలో దిగుతున్నారు. అదే విధంగా వరుణ్ గాంధీ పిలిభిత్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రచార కార్యక్రమంలో మేనక మాట్లాడుతూ.. పిలిభిత్ నుంచి గతంలో తాను ఆరుసార్లు గెలుపొందానని, అక్కడి ప్రజలకు తానేంటో తెలుసనని పేర్కొన్నారు. ముస్లింలను ఉద్దేశించి.. ‘మీరు ఓటు వేసినా... వేయకపోయినా గెలుస్తాను. కానీ ఇది ఇచ్చిపుచ్చుకోవాల్సిన వ్యవహారమని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. Maneka Gandhi threatening voters that she will watch booth wise votes to decide whom to be helped once she wins. Sakshi Maharaj says as a ‘Sanyasi’ he’ll curse people if they won’t vote for him! BJP is a Party with a Difference 😁 pic.twitter.com/sG1X65WJ5s — Ravi Nair (@t_d_h_nair) April 12, 2019 -
నేనే గెలుస్తా..కేంద్రమంత్రి బెదిరింపు - వీడియో వైరల్
సాక్షి, లక్నో: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ నేతలు తమ అసలు స్వరూపాన్ని బయట పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా బీజేపీ నేత సాక్షి మహారాజ్ తాను 'సన్యాసి' గనుక తనకు ఓటు వేయని వారిని శపిస్తానని బెదింరించారు. తాజాగా కేంద్రమంత్రి మేనకా గాంధీ ఇలాంటి బెదిరింపులకు దిగారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ నుంచి పోటీ చేస్తున్న మేనక ఎన్నికల ప్రచారంలో ముస్లింలనుద్దేశించిన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముస్లింల ఓట్లు లేకుండా లభించే గెలుపు తనకు సంతోషానివ్వదంటూనే...తనకు ఓటు వేయాలో లేదో నిర్ణయించుకోవాలన్నారు. అలాగే తనకు ఓటు చేయని ముస్లింలకు తానెలా సాయం చేస్తానంటూ బ్లాక్ మెయిలింగ్‌కు దిగారు. ఓటు వేయని ముస్లిం ఓటర్ల వివరాలు తనకు తెలిసి పోతాయనీ ఈ నేపథ్యంలో వారికందాల్సిన సహాయం ఆధారపడి వుంటుందంటూ సభాముఖంగానే హెచ్చరించారు. మీరు ఓటు వేసినా... వేయకపోయినా గెలుస్తాను. కానీ ఇది ఇచ్చు పుచ్చుకోవాల్సిన వ్యవహారమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతోంది. పిలిభిత్ నుంచి గతంలో తాను ఆరుసార్లు గెలుపొందానని, అక్కడి ప్రజలకు తానేంటో తెలుసనని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజల మద్దతుతో ఈ సారి ఎన్నికల్లో కూడా తాను ఎలాగూ గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేసిన మేనకా ..ముస్లింలు కూడా తనకు ఓటు వేయాలని డిమాండ్ చేశారు. ముస్లింలు ఓటు వేయకపోతే తన మనసుకు కష్టంగా ఉంటుందనీ, అలాంటి వారికి తానెందుకు పనిచేయాలనే ఆలోచన మనసులో వస్తుంది జాగ్రత్త అంటూ హెచ్చరించారు. అంతేకాదు ప్రతీసారి సాయం చేస్తూ పోవడానికి మనమేమైనా మహాత్మాగాంధీ వారసులమా అంటూ కేంద్రమంత్రి ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రజలే నిర్ణయం తీసుకోవాలన్నారు. కాగా, ఈ ఎన్నికల్లో మేనకా గాంధీ సుల్తాన్పూర్ నుంచి పోటీ చేస్తుండగా, ఫిలిబిత్ నుంచి ఆమె కుమారుడు వరుణ్ గాంధీ పోటీ చేస్తున్నారు. Maneka Gandhi threatening voters that she will watch booth wise votes to decide whom to be helped once she wins. Sakshi Maharaj says as a ‘Sanyasi’ he’ll curse people if they won’t vote for him! BJP is a Party with a Difference 😁 pic.twitter.com/sG1X65WJ5s — Ravi Nair (@t_d_h_nair) April 12, 2019 -
‘అద్భుతం జరిగితే తప్ప ఆయన ప్రధాని కాలేడు’
సాక్షి, న్యూఢిల్లీ : ఏదైనా అద్భుతం జరిగితే తప్ప రాహుల్ గాంధీ ప్రధాని కాలేరని కేంద్ర మంత్రి మేనకా గాంధీ వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఎన్ని ప్రయత్నాలు చేసినా భారతదేశానికి ప్రధాని కాలేరని ఆమె స్పష్టం చేశారు. అంతేకాక రాహుల్ గాంధీ రెండు చోట్ల పోటీ చేయడంపై స్పందిస్తూ.. ఏ వ్యక్తి అయినా ఎన్నికల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయవచ్చని పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ ప్రచారం గురించి మాట్లాడుతూ.. ఆమె ప్రచారం వల్ల మా పార్టీపై ఎటువంటి ప్రభావం ఉండదని తెలిపారు. మేనకా గాంధీ, ఆమె కుమారుడు వరుణ్ గాంధీలు గతంలో వరుసగా ఫిలిబిత్, సుల్తాన్‌పూర్‌ల నుంచి పోటీ చేయగా.. ఈ సారి వారి స్ధానాలను పరస్పరం మార్పు చేశారు.ఈ విషయంపై ఆమె స్పందిస్తూ.. ‘నా భర్త సంజయ్ గాంధీ రెండు సార్లు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో నా కుమారుడు వరుణ్ గాంధీ కూడా విజయం సాధించారు. ఇక ఈ సారి నా వంతు. నేను కూడా తప్పక విజయం సాధిస్తాన’ని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇక బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి సుల్తాన్పూర్ టికెట్‌ను అమ్ముకున్నారనే అంశంపై స్పందిస్తూ.. ‘ఆమె టికెట్లు అమ్ముకుంటారనే విషయం అందరికి తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో సుల్తాన్పూర్ టికెట్‌ను ఆమె రూ. 15 కోట్లకు అమ్ముకుంది. అయితే గతంలో ఇలాంటి అంశాల గురించి మాట్లాడాలంటే భయపడేదాన్ని. కానీ ఇప్పుడు నాతో పాటు ప్రజలకు కూడా ధైర్యం వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇలాంటి వారి గురించి బహిరంగంగానే మాట్లాడుతున్నారని’ పేర్కొన్నారు. రాయ్‌బరేలీ, అమేథీలో ప్రచారం చేయమని పార్టీ తనను కోరలేదని తెలిపారు. ఒకవేళ అలా అడిగితే.. తప్పకుండా ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. -
రాంపూర్ బరిలో జయప్రద
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీలో చేరిన సినీ నటి జయప్రదను ఊహించినట్టే యూపీలోని రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ బరిలో నిలిపింది. యూపీ, పశ్చిమ బెంగాల్లో పోటీ చేసే 29 మంది అభ్యర్థులతో కూడిన తాజా జాబితాను బీజేపీ మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో కాన్పూర్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీని తప్పించి కేంద్ర మంత్రి సత్యదేవ్ పచౌరీకి చోటు కల్పించారు. ఇక కేంద్ర మంత్రి మేనకా గాంధీ, ఆమె కుమారుడు వరుణ్ గాంధీలు గతంలో వరుసగా ఫిలిబిత్, సుల్తాన్‌పూర్‌ల నుంచి పోటీ చేయగా వారి స్ధానాలను పరస్పరం మార్పు చేశారు. యూపీ మంత్రి రీటా బహుగుణ జోషికి అలహాబాద్ స్ధానం నుంచి పోటీకి నిలిపారు. 2014లో ఇక్కడి నుంచి గెలుపొందిన శ్యామ చరణ్ గుప్తా సమాజ్‌వాదీ పార్టీలో చేరడంతో జోషీ వైపు బీజేపీ అగ్రనాయకత్వం మొగ్గుచూపింది. -
ఎన్నారై భర్తల ఆగడాలకు కేంద్రం చెక్
-
45 మంది ఎన్నారై భర్తల పాస్‌పోర్టులు రద్దు
న్యూఢిల్లీ: భార్యలను వదిలేస్తున్న ఎన్నారై భర్తలపై కొరడా ఝుళిపించినట్లు కేంద్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ తెలిపారు. ఇప్పటివరకూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డ 45 మంది ఎన్నారైల పాస్‌పోర్టులను రద్దుచేసినట్లు వెల్లడించారు. కేంద్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రాకేశ్ శ్రీవాత్సవ నేతృత్వంలో సమీకృత నోడల్ ఏజెన్సీ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. మహిళలకు న్యాయం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును తాము తీసుకొచ్చినప్పటికీ రాజ్యసభలో ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1967 నాటి పాస్‌పోర్ట్ చట్టం, 1973 నాటి క్రిమినల్ ప్రొసిజర్‌లో సవరణలు తీసుకొచ్చి ఈ బిల్లు రూపొందిచినట్టు తెలిపారు. విదేశాంగ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ బిల్లును తయారు చేశాయని వెల్లడించారు. -
చిన్మయి ఫిర్యాదు.. స్పందించిన మేనకా గాంధీ
బాలీవుడ్లో తను శ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమాన్ని సౌత్‌లో ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ముందుండి నడిపించారు. చిన్మయి కూడా స్వయంగా లైంగిక వేధింపుల బాధితురాలే. మీటూ ఉద్యమంలో భాగంగా 18 ఏళ్ల వయసులో వైరముత్తు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని షాకింగ్ విషయాలను బయటపెట్టి సంచలనం సృష్టించారు చిన్మయి. ఆ తరువాత మరి కొందరు వైరముత్తుపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఇండస్ట్రీ వైరముత్తుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ చిన్మయిని మాత్రం కోలీవుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ నుంచి తప్పించారు. అప్పటి నుంచి వైరముత్తుకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు చిన్మయి. తాజాగా ఈ విషయం గురించి ట్విటర్ వేదికగా కేంద్ర మంత్రి మేనకా గాంధీకి ఫిర్యాదు చేశారు చిన్మయి. ‘మేడమ్.. వైరముత్తు నన్ను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేసి నాలుగు నెలలు అవుతోంది. ఈ విషయంలో నాకు న్యాయం జరగకపోగా.. నన్ను తమిళనాడు ఫిలిం ఇండస్ట్రీ నుంచి తప్పించారు. ప్రస్తుతం నేను కేసు పెట్టలేని పరిస్థితిలో ఉన్నాను. మీరే నాకేదన్నా దారి చూపండి’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ, మేనకా గాంధీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు చిన్మయి. ఈ ట్వీట్‌పై మేనకా గాంధీ స్పందించారు. ‘మీ కేసును ఎన్సీడబ్ల్యూ (జాతీయ మహిళా కమిషన్) దృష్టికి తీసుకెళ్లాను. మీ వివరాలను నాకు పంపించండి’ అని రిట్వీట్ చేశారు మేనకా గాంధీ. (తమిళంలో చిన్మయి గొంతు వినిపించదు) I have taken up your case with @NCWIndia. Kindly DM your contact details. @Chinmayi @sharmarekha https://t.co/louSvb4Ge6 — Maneka Gandhi (@Manekagandhibjp) February 27, 2019