లక్నో : వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ సీనియర్ నేత మేనకా గాంధీ ఈసీ ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తనయుడు, సుల్తాన్‌పూర్ సిట్టింగ్ ఎంపీ వరుణ్‌గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. మేనకా తరపున సుల్తాన్‌పూర్‌లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకులపై విమర్శలు చేసేక్రమంలో నోరుజారారు. ప్రతిపక్ష నాయకులతో తన షూ లేసులు విప్పించుకుంటానని వ్యాఖ్యానించారు. తమది నెహ్రూ-గాంధీ ఫ్యామిలీ అని పరోక్షంగా చెప్పుకున్న వరుణ్ సుల్తాన్‌పూర్ బీఎస్పీ అభ్యర్థి చంద్ర భద్ర సింగ్‌ని టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘మనం దేవుడికి తప్ప ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీకోసం నేనున్నా. నేను సంజయ్ గాంధీ తనయున్ని. మన పట్ల అగౌరంగా మాట్లాడేవారిని పట్టించుకోవద్దు. అలాంటి వారితో నా షూ లేసు విప్పించుకుంటా. నా ముందు మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. ప్రజలు మోనూ, సోనూలను చూసి భయపడొద్దు’ అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన చంద్ర భద్ర సింగ్‌ని స్థానికులు సోనూ సింగ్ అని పిలుస్తారు. ఆయన సోదరుడు మోనూ సింగ్‌కి స్థానికంగా పేరుంది. వరుణ్ గాంధీ ప్రసంగించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఓ రాజకీయ నేత అయివుండీ నోటికొచ్చినట్లు మాట్లాడటం కరెక్టు కాదని నెటిజన్లు మండిపడుతన్నారు. ఫ్రస్ట్రేషన్‌లో ఉండటం వల్లే ఇలా మాట్లాడుతున్నారని ఫైర్ అవుతున్నారు. వరుణ్ ఫిలిబిత్ నుంచి పోటీ చేస్తున్నారు.
#WATCH BJP LS candidate from Pilibhit, Varun Gandhi in Sultanpur says, "Mai ek hi cheez aapko kehna chahta hoon, kisi se darne ki koi zarurat nahi hai....Mai khada hoon yaha pe, mai Sanjay Gandhi ka ladka hoon, mai in logon se apne jute khulvata hoon" (2.4.19) pic.twitter.com/LnA8kVDivu
— ANI UP (@ANINewsUP) May 4, 2019
Comments
Please login to add a commentAdd a comment