Varun Gandhi
-
‘సుల్తాన్పూర్ ప్రజల ‘అమ్మ‘కు మద్దతు ఇవ్వడానికి వచ్చా’
లక్నో: దేశంలో కేవలం సుల్తాన్పూర్ నియోజకవర్గం ప్రజలు మాత్రమే తమ ఎంపీని ‘అమ్మ’ అని ఆప్యాయంగా పిలుస్తారని బీజేపీ నేత వరుణ గాంధీ అన్నారు. వరుణ గాంధీ తన తల్లి మేనకా గాంధీ కోసం గురువారం సుల్తాన్పూర్ పార్లమెంట్ స్థానంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మేనకా గాంధీ సుల్తాన్పూర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా వరుణ్ గాంధీ మాట్లాడారు.‘‘దేశంలోనే ఒకే ఒక పార్లమెంట్ స్థానంలో అక్కడి ప్రజలంతా తమ ఎంపీని ఆప్యాయంగా ‘అమ్మ’ అని పిలుస్తారు. నేను ఇక్కడికి వచ్చింది మా అమ్మ మేనకా గాంధీకి ప్రజలు మద్దలు ఇవ్వాలని కోరడానికి రాలేదు. సుల్తాన్పూర్ ప్రజల ‘అమ్మ’కు మద్దతు ఇవ్వాలని కోరటం కోసం వచ్చా’’ అని వరుణ్ గాంధీ అన్నారు.#WATCH | Uttar Pradesh | BJP leader Varun Gandhi campaigns for his mother and party candidate from Sultanpur constituency Maneka Gandhi "There is only one constituency in the country where its people do not call its MP as 'Sansad' but as 'Maa'...I am here not just to gather… pic.twitter.com/8n7u9k8Ztp— ANI (@ANI) May 23, 2024మేనకా గాంధీ సుల్తాన్పూర్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేయటం ఇది రెండోసారి. 2019 ఎన్నికల్లో ఆమె ఇక్కడ 14000 వేల ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఈసారి భారీ మెజార్టీ సాధించటంపై బీజేపీ దృష్టి పెట్టింది. అందుకే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం సుల్తాన్‌పూర్‌లో మేనకా గాంధీ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఇక.. ఫిలిబీత్ సిట్టింగ్ ఎంపీ అయిన వరుణ్ గాంధీకి ఈసారి బీజేపీ టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే వరుణ్ గాంధీ బీజేపీ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగా విమర్శించటం వల్లనే బీజేపీ ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వలేదని రాజకీయంగా పార్టీలో చర్చ జరుగుతోంది. -
‘వరుణ్ విషయంలో బీజేపీని సవాల్ చేయలేను’
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకుపోతుంది. 400 స్థానాలే లక్ష్యంగా ప్రచారంలో వేగం పెంచింది. ఇక.. ఈసారి కొంతమంది సిట్టింగ్‌లకు బీజేపీ టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. అందులో ప్రముఖంగా వరుణ్‌గాంధీకి ఫిలిభీత్ స్థానంలో బీజేపీ అధిష్టానం టికెట్ ఇవ్వకపోవటంపై చర్చ జరిగింది. అయితే తాజాగా శనివారం వరణ్ గాంధీకి టికెట్ కేటాయించకపోవటంపై ఆయన తల్లి మేనకా గాంధీ స్పందించారు. ఆమె ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.‘‘వరుణ్ గాంధీ విషయంలో బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తాను సవాల్ చేయలేను. నేను పార్టీకి నిర్ణయానికి గౌరవిస్తాను. అలాగే వరుణ్ గాంధీపై నాకు అపారమైన నమ్మకం, విశ్వాస ఉంది. నా కుమారుడు వరుణ్ గాంధీ చాలా సమర్థవంతుడు, తన స్థాయికి తగినట్లు కృషి చేస్తాడు. కొంతమంది ఎంపీ కావాలనుకుంటారు. కానీ, కొంతమంది ఎంపీ పదవికి ఎంపిక కాకుండానే ప్రజల కోసం రాజకీయనాయకులు అవుతారు. జీవితం మన కోసం ఏం నిక్షిప్తం చేసి ఉందో తెలియదు’’ అని మేనకా గాంధీ అన్నారు. ఇక.. మేనకా గాంధీ ఉత్తర ప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ పార్లమెంట్ నుంచి బరిలో ఉన్నారు. ప్రజలకు సేవ చేయటం కోసం మరోసారి బీజేపీ టికెట్ కేటాయించటంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఎన్ని ఓట్లను సాధిస్తార్న ప్రశ్నకు స్పందిస్తూ.. వీలైనన్ని ఎక్కువ ఓట్లు సంపాదించటం కోసం ప్రతిరోజూ ప్రయత్నం చేస్తూ ఉంటానని తెలిపారు.వరుణ్ గాంధీ రెండుసార్లు ఫిలిభీత్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. బీజేపీ, ప్రభుత్వ విధానాలకు వరుణ్ గాంధీ బహిరంగంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనకు బీజేపీ ఫిలిభీత్ టికెట్ నిరారించినట్లు ప్రచారం జరిగింది. -
సుల్తాన్పూర్ లోక్‌సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
లక్నో : ఉత్తర్ ప్రదేశ్ సుల్తాన్ పుర్ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి క్రితికా జోత్నకు నామినేషన్ ప్రతాలు అందించారు. నామినేషన్ దాఖలు సమయంలో ఎన్డీఏ కూటమి పార్టీలు నిషాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిషాద్, అప్నాదల్ నేత, కేబినెట్ మంత్రి అశిష్ పటేల్‌లు ఆమె వెంట ఉన్నారు.నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మేనకా గాంధీ మాట్లాడుతూ.. గత ఐదేళ్ల చేసిన అభివృద్ది కంటే వచ్చే ఐదేళ్లలో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. లోక్‌సభ నియోజకవర్గాన్ని అభివృద్దిలో మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఇక్కడి ప్రజలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మరిన్ని ఇళ్లను అందించాలని కోరుకుంటున్నామని అన్నారు.ప్రతిపక్షాల ఆరోపణలపైబీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ ప్రతిపక్షాల ఆరోపణలపై మేనకా గాంధీ ఖండించారు. కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలీలో బీజేపీ నుంచి తన కుమారుడు వరుణ్ గాంధీ పోటీ చేస్తారన్న ఊహాగానాలపై వ్యాఖ్యానించేందుకు ఆమె నిరాకరించారు.వరుణ్ గాంధీకి నో టికెట్వరుణ్ గాంధీ ఇటీవల గతంలో ఎన్నడూ లేనివిధంగా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ క్రమంలో పిలిభిత్ లోక్‌సభ టికెట్‌ను బీజేపీ నిరాకరించింది. జితిన్ ప్రసాదకు అప్పగించింది.2009 లోక్‌సభ ఎన్నికల్లో వరుణ్ గాంధీ తొలిసారిగా పిలిభిత్ నుంచి ఎంపీ అయ్యారు. 2014లో బీజేపీ ఆయనను సుల్తాన్పూర్ నుంచి బరిలోకి దిపింది. అక్కడ ఆయన గెలుపొందారు. మళ్లీ 2019లో మళ్లీ పిలిభిత్ స్థానం నుంచి పోటీ చేసి మళ్లీ ఎంపీగా విజయం సాధించారు. -
రాయ్‌బరేలీ పోరులో వరుణ్ గాంధీ.. ప్రియాంకపై పోటీకి నో
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నట్లు ప్రచారం సాగుతోది. అయితే ఆమెకు పోటీగా అదే కుటుంబానికి చెందిన వరుణ్ గాంధీని రంగంలోకి దించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. కానీ పార్టీ ప్రతిపాదనను వరుణ్ గాంధీ తిరస్కరించినట్లు సమాచారం. రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానంలో తన సోదరి ప్రియాంక గాంధీపై పోటీ చేసేందుకు ఆయన నిరాకరించినట్లు సమాచారం. కాగా రాయ్‌బరేలీ, అమేథీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు తన అభ్యర్థులను ప్రకటించలేదు. అటు బీజేపీ కూడా రాయ్‌బరేలీలో తన అభ్యర్థిని ఖరారు చేయలేదు. కాగా కాంగ్రెస్ నుంచి యాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉంది. రాయ్‌బరేలీ నుంచి గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన మాజీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి నుంచి ప్రియాంక బరిలో దిగనున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో తన సిట్టింగ్ స్థానమైన పిలిబిత్ నుంచి బీజేపీ టికెట్ నిరాకరణకు గురైన వరుణ్ గాంధీ.. రాయ్‌బరేలి నుంచి పోటీకి దించితే కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఎదురవుతుందని బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోంది. ఈ విషయంపై వరుణ్‌ను సంప్రదించగా.. ఆయన నిరాసక్తి కనబర్చినట్లు తెలుస్తోంది. ‘గాంధీ వర్సెస్ గాంధీ’ పోటీ ఉండటం తనకు నచ్చకపోవడంతో రాయ్‌బరేలీ పోరు నుంచి తప్పుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
రాయ్‌బరేలీకి ఇద్దరు గాంధీలు? 40 ఏళ్ల కిందటి చరిత్ర పునరావృతం?
ఉత్తరప్రదేశ్‌లోని హై ప్రొఫైల్ సీట్లలో ఒకటైన రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయాన్ని అటు కాంగ్రెస్ గానీ, ఇటు బీజేపీగానీ ఇంకా వెల్లడించలేదు. అయితే ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రియాంకకు పోటీగా నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వరుణ్‌గాంధీని ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ నిర్ణయించింది. రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వరుణ్‌గాంధీకి బీజేపీ తాజాగా ఆఫర్ ఇచ్చిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వరుణ్ తన సోదరి ప్రియాంకా గాంధీపై ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం అడిగారని సమాచారం.రాయ్‌బరేలీ అభ్యర్థుల ప్యానెల్లో వరుణ్ గాంధీ పేరును కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం చేర్చినట్లు సమాచారం. రాయ్‌బరేలీ సీటు కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరొందింది. ఈసారి సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వరుణ్‌గాంధీని రంగంలోకి దించితే కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఎదురవుతుందని బీజేపీ అంతర్గత సర్వేలో వెల్లడైంది. ఈ నేపధ్యంలోనే వరుణ్ గాంధీని ఇక్కడి నుంచి పోటీచేయించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసింది. ఒకవేళ వరుణ్ గాంధీ రాయ్ బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తే, గాంధీ కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు పోటీ చేయడం 40 ఏళ్ల తర్వాత జరుగుతున్నట్లవుతుంది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీ అమేథీ నుంచి రాజీవ్ గాంధీపై పోటీ చేశారు. అప్పట్లో ఆమె ఓటమిని ఎదుర్కొన్నారు. ఆ తరువాత మేనకా గాంధీ, సోనియా గాంధీ కుటుంబాలు పరస్పరం ఎన్నికల్లో పోటీకి దిగలేదు. ప్రస్తుతం యూపీలోని సుల్తాన్పూర్ స్థానం నుంచి మేనకా గాంధీ మరోసారి ఎన్నికల బరిలోకి దిగారు. -
వరుణ్‌గాంధీ పోటీ.. మేనకాగాంధీ ఏమన్నారంటే?
బీజేపీ మహిళా నేత, సుల్తాన్పూర్ లోక్‌సభ అభ్యర్థి మేనకా గాంధీ తన కుమారుడు వరుణ్ గాంధీ పోటీ విషయమై ఆసక్తికర వ్యాఖ్య చేశారు. వరుణ్ గాంధీకి బీజేపీ పిలిభిత్ సీటును కేటాయించకపోవడంతో ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాజాగా విలేకరులు మేనకా గాంధీని మీ కుమారుడు వరుణ్ గాంధీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా? అని అడిగినప్పుడు ఆమె ఆసక్తికర సమాధానమిచ్చారు. ‘ఇది పార్టీ తీసుకున్న నిర్ణయం. వరుణ్ ఉత్తమ ఎంపీగా పేరు తెచ్చుకున్నారు. వరుణ్ దేశానికి మంచి చేస్తారని అంటూనే, వరుణ్ గాంధీ ఎన్నికల్లో విడిగా పోటీ చేయరని, మేం అలాంటి వాళ్లం కాదని పేర్కొన్నారు. దీనికి ముందు బీజేపీ ఎంపి వరుణ్ గాంధీ తన పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు భవోద్వేగంతో కూడిన లేఖను రాశారు. ఎంపీగా తన పదవీకాలం ముగిసినా, పిలిభిత్‌తో తన అనుబంధం తన చివరి శ్వాస వరకు ఉంటుందని అన్నారు. సామాన్యుల గొంతు పెంచేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని వరుణ్ ఆ లేఖలో రాశారు. #WATCH सुल्तानपुर: वरुण गांधी का टिकट कटने पर भाजपा नेता मेनका गांधी ने कहा, "ये पार्टी का फैसला है। वरुण बहुत अच्छे सांसद थे। आगे भी जिन्दगी में जो भी बनेंगे, देश के लिए अच्छा ही करेंगे।" वरुण गांधी द्वारा अलग से चुनाव लड़ने के सवाल पर उन्होंने कहा, "नहीं...हम इस तरह के लोग… pic.twitter.com/xAZTJOyrLA — ANI_HindiNews (@AHindinews) April 8, 2024 -
ఏం చేస్తారో వరుణ్ గాంధీనే అడగండి: మేనకా గాంధీ
లక్నో: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. పదిరోజుల ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీ యూపీలోని సుల్తాన్పూర్ పర్యటిస్తున్నారు. తన కుమారుడికి బీజేపీ ఫిలీభీత్ స్థానాన్ని నిరాకరించిన విషయం తెలిసిందే. బీజేపీ వరణ్‌గాంధీకి టికెట్ నిరారించిన తర్వాత తొలిసారి మేనకా గాంధీ స్పందించారు. ప్రస్తుతం వరణ్‌గాంధీ చేస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు మేనకా గాంధీ సమాదానం ఇచ్చారు.‘వరుణ్‌కు గాంధీ ఏం చేయాలనుకుంటున్నారో.. ఆయన్నే అడగండి. లోక్‌సభ ఎన్నికల అనంతరం దాని గురించి ఆలోచిస్తాం. ఇంకా చాలా సమయం ఉంది’అని ఆమె తెలిపారు. ‘నేను బీజేపీలో ఉన్నందుకు సంతోషపడుతున్నా. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా నాకు టికెట్ ఇచ్చారు.అయితే టికెట్ కేటాయించటంలో కొంత జాప్యం జరిగింది. దీంతో నేను ఎక్కడ పోటీ పడతానోనని కొంత అయోమయం మొదలైంది. మళ్లీ అందులో ఈసారి ఫిలీభీత్? లేదా సుల్తాన్పూర్?. అయితే బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవటం సంతోషం. మళ్లీ నేను సుల్తాన్‌పూర్‌లో పోటీ చేయటం ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ సెగ్మెంట్లో ఒకసారి గెలిచిన ఎంపీ మళ్లీ గెలవడని చర్రిత చెబుతోంది ’అని మేనకా గాంధీ అన్నారు.టికెట్ ప్రకటించిన తర్వాత మేనకా గాంధీ సుల్తాన్‌పూర్‌లో పర్యటించటం ఇదే మొదిటిసారి. పది రోజుల ఎన్నికల ప్రచారంలో భాగంగా సుల్తాన్పూర్ సెగ్మెంట్లో సుమారు 101 గ్రామాలను పర్యటించనున్నారు. ఇక.. అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వరణ్ గాంధీ సొంత పార్టీపైనే విమర్శలు చేయటంలో ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల వరుణ్ గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిని లేఖ రాశారు. తన కడ శ్వాసవరకు ఫిలీభీత్ ప్రజలతో సంబంధాలను కొనసాగాస్తానని చెప్పారు. -
ఏం చేస్తారో వరుణ్ గాంధీనే అడగండి: మేనకా గాంధీ
లక్నో: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. పదిరోజుల ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీ యూపీలోని సుల్తాన్పూర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తన కుమారుడికి బీజేపీ ఫిలీభీత్ స్థానాన్ని నిరాకరించిన విషయం తెలిసిందే. బీజేపీ వరణ్‌గాంధీకి టికెట్ నిరాకరించిన తర్వాత తొలిసారి మేనకా గాంధీ స్పందించారు. ప్రస్తుతం వరణ్‌గాంధీ చేస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు మేనకా గాంధీ సమాదానం ఇచ్చారు. ‘వరుణ్‌కు గాంధీ ఏం చేయాలనుకుంటున్నారో.. ఆయన్నే అడగండి. లోక్‌సభ ఎన్నికల అనంతరం దాని గురించి ఆలోచిస్తాం. ఇంకా చాలా సమయం ఉంది’ అని ఆమె తెలిపారు. ‘నేను బీజేపీలో ఉన్నందుకు సంతోషపడుతున్నా. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా నాకు టికెట్ ఇచ్చారు.అయితే టికెట్ కేటాయించటంలో కొంత జాప్యం జరిగింది. దీంతో నేను ఎక్కడ పోటీ పడతానోనని కొంత అయోమయం మొదలైంది. మళ్లీ అందులో ఈసారి ఫిలీభీత్? లేదా సుల్తాన్పూర్?. అయితే బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవటం సంతోషం. మళ్లీ నేను సుల్తాన్‌పూర్‌లో పోటీ చేయటం ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ సెగ్మెంట్లో ఒకసారి గెలిచిన ఎంపీ మళ్లీ గెలవడని చర్రిత చెబుతోంది ’ అని మేనకా గాంధీ అన్నారు. టికెట్ ప్రకటించిన తర్వాత మేనకా గాంధీ సుల్తాన్‌పూర్‌లో పర్యటించటం ఇదే మొదిటిసారి. పది రోజుల ఎన్నికల ప్రచారంలో భాగంగా సుల్తాన్పూర్ సెగ్మెంట్లో సుమారు 101 గ్రామాలను పర్యటించనున్నారు. ఇక.. అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వరణ్ గాంధీ సొంత పార్టీపైనే విమర్శలు చేయటంలో ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల వరుణ్ గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిని లేఖ రాశారు. తన కడ శ్వాసవరకు ఫిలీభీత్ ప్రజలతో సంబంధాలను కొనసాగిస్తానని చెప్పారు. -
Varun Gandhi: ‘కడశ్వాస వరకు మీతోనే ఉంటా’
లక్నో: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు సొంతపార్టీపైనే విమర్శలు చేస్తూ వార్తలు నిలిచారు బీజేపీ ఫిలీభీత్ ఎంపీ వరుణ్ గాంధీ. దీంతో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఫిలీభీత్ సెగ్మెంట్ నుంచి ఆయనకు టికెట్ నిరాకరించింది బీజేపీ. అక్కడ ఈసారి జితిన్ ప్రసాదను బరిలోకి దింపింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ.. వరుణ్ గాంధీని తమ పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. బీజేపీ తనకు టికెట్ నిరాకరించిన తర్వాత తొలిసారి ఎంపీ వరుణ్ గాంధీ స్పందించారు. ఫిలీభీత్ నియోజకవర్గం, అక్కడి ప్రజలతో తనకు ఉన్న జ్ఞాపకాలు, ఆ ప్రాంతంలో చిన్ననాటి సంఘటనలు గుర్తు చేసుకున్నారు. ‘ఈ లేఖలో నాకు భావోద్వేగం కలిగించే లెక్కలేనన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. నేను మూడేళ్లు ఉన్న సమయంలో అంటే 1983లో నా తల్లి చేతులు పట్టుకొని మొదటిసారి ఫిలీభీత్ ప్రాంతంలో అడుగుపెట్టాను. చిన్న పిల్లవాడిగా ఉన్న నాకు.. ఇదే ప్రాంతమే నేను పనిచేసే కార్యస్థలం, ఇక్కడి ప్రజలే నా కుటుంబమవుతుందని ఎలా తెలుస్తుంది. ఇన్నేళ్లు ఫిలీభీత్ ప్రజలకు సేవ చేసే అవకాశం కలగటం నా అదృష్టంగా భావిస్తున్నా. పార్లమెంట్ సభ్యుడి పాత్ర మాత్రమే కాకుండా వ్యక్తిగత ఎదుగుదులకు ఇక్కడి ప్రజల నుంచి ఆదర్శాలు, దయ వంటి విలువైన పాఠాలు నేర్చుకున్నా. ..ఫిలీభీత్ ప్రజలకు ఒక ఎంపీగా నా పదవి కాలం ముగియవచ్చు. కానీ, ఇక్కడి ప్రజలతో ఉన్న బంధం మాత్రం నా చివరిశ్వాస ఆగేవరకు కొనసాగుతుంది. నేను ఎంపీగా లేకున్నా. ఫిలీభీత్ ప్రజలకు సేవ చేయడానికి ఒక కొడుకులా నా జీవితాంతం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నేను రాజకీయాల్లోకి వచ్చిందే సామాన్యుడి స్వరం వినిపించడానికి.. అందుకే మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలి. ఫిలీభీత్‌కు, నాకు రాజకీయాలకు అతీతంగా ప్రేమ, నమ్మకంతో కూడిన విడదీయరాని అనుబంధం ఉంది. నేను ఎల్లప్పుడూ ఫిలీభీత్ ప్రజలతోనే ఉంటా’ అని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సుదీర్ఘంగా లేఖలో పేర్కొన్నారు. ఇక..1996 నుంచి మేనకా గాంధీ, వరుణ్ గాంధీలకు ఫిలీభీత్ పార్లమెంట్ నియోజకవర్గం కంచుకోట. వరుణ్ గాంధీ ఈ నియోజకవర్గం నుంచి 2009, 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు. -
వరుణ్‌కు కాంగ్రెస్ ‘ఆఫర్’? బీజేపీకి గట్టిపోరు?
గాంధీ కుటుంబంలో దశాబ్దాల నాటి రాజకీయ శత్రుత్వం ముగియనుందా? రాహుల్, వరుణ్ కలిసి నడుస్తారా? వరుణ్‌గాంధీకి కాంగ్రెస్ పార్టీ ఓపెన్ ఆఫర్ ఇచ్చినప్పటి నుంచి ఈ ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు అందరి దృష్టి వరుణ్ గాంధీపైనే నిలిచింది. యూపీలోని పిలిభిత్ సిట్టింగ్ ఎంపీ వరుణ్‌గాంధీకి బీజేపీ టిక్కెట్ కేటాయించకపోవడంతో ఈ చర్చ మరింత వేడందుకుంది. పిలిభిత్ సీటు గాంధీ కుటుంబీకుల సంప్రదాయ సీటు. వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీ ఈ స్థానం నుండి ఆరు సార్లు, వరుణ్ గాంధీ ఈ స్థానం నుండి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఈసారి బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో వరుణ్ గాంధీకి పిలిభిత్ టికెట్ ఇవ్వలేదు. జతిన్ ప్రసాద్‌ను ఇక్కడి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కాంగ్రెస్ వరుణ్‌కు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు వరుణ్ గాంధీ తదుపరి స్టెప్ ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ వరుణ్‌గాంధీ కాంగ్రెస్ ఆఫర్‌ను అంగీకరిస్తే గాంధీ కుటుంబం మధ్య కొనసాగుతున్న రాజకీయ శత్రుత్వానికి తెరపడుతుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. అప్పుడు అన్నదమ్ములైన రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ మరోసారి రాజకీయంగా ఏకమవుతారని అంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి వరుణ్ గాంధీని కాంగ్రెస్‌లో చేరాలని కోరారు. వరుణ్ గాంధీ చాలా కాలంగా సొంత పార్టీని పలు అంశాలలో విమర్శిస్తూ వస్తున్నారు. వరుణ్ వ్యాఖ్యానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, అగ్నివీర్ యోజన, కేంద్ర ఉచిత రేషన్ స్కీమ్ మొదలైనవాటిపై వరుణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపధ్యంలోనే బీజేపీ వరుణ్‌కు టిక్కెట్ కేటాయించలేని తెలుస్తోంది. అయితే అతని తల్లి మేనకాగాంధీకి మాత్రం బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో వరుణ్ కాంగ్రెస్ ఆఫర్‌ను అందుకుంటారా? సోదరుడు రాహుల్‌తో కలిసి ముందుకు అడుగులు వేస్తారా? అనేది త్వరలో తేలిపోనుంది. -
అందుకే వరుణ్ గాంధీని బీజేపీ పక్కన పెట్టింది: అధిర్ రంజన్
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిభిత్ సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీకి బీజేపీ మొండిచెయ్యి చూపడంతో ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? లేదా ఇతర పార్టీలో చేరి బీజేపీ రెబల్‌గా రంగంలోకి దిగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చింది. ఆయన్ను తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వరుణ్ కుటుంబ మూలాలు ‘గాంధీ’తో ముడిపడి ఉండటం వల్లే ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించిందని విమర్శించారు. వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరాలని అధిర్ రంజన్ చౌదరి కోరారు. ఒకవేళ ఆయన పార్టీలో చేరితే సంతోషిస్తామన్నారు. వరుణ్ ఉన్నతమైన నాయకుడని, బాగా చదువుకున్న నేతగా అభివర్ణించారు. పారదర్శకత కలిగిన వ్యక్తిగా తెలిపారు. వరుణ్‌కు గాంధీ కుటుంబంతో సంబంధాలు ఉన్నాయని, అందుకే ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వలేదని చెప్పారు. వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరాలని తాము కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా పిలిభిత్ లోక్‌సభ స్థానం గత నాలుగు ఎన్నికల్లో బీజేపీ ఖాతాలోనే ఉంది. అయితే ప్రస్తుతం ఫిలిభిత్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీని కాదని జితిన్ ప్రసాద్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. కొంతకాలంగా వరుణ్ బీజేపీ పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ తన గళం విప్పారు. సొంత పార్టీపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించినట్లు సమాచారం. చదవండి: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలను బరిలోకి దింపిన బీజేపీ -
వరుణ్‌కు మొండిచెయ్యి.. జితిన్‌కు పట్టం!
రంగుల పండుగ హోలీకి ముందుగానే అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ ఎన్నికల వేడిని మరింత పెంచింది. యూపీలోని పిలిభిత్ స్థానం ఎవరికి కేటాయిస్తారన్న చర్చలకు ఫుల్స్టాప్ పెట్టింది. ఇక్కడి నుంచి జితిన్ ప్రసాద్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. పిలిభిత్ స్థానం వరుణ్ గాంధీకి కేటాయిస్తారా లేదా అనే దానిపై ఇన్నాళ్లూ పలు ఊహాగానాలు కొనసాగాయి. వాటికి ఇప్పుడు తెరపడింది. వరుణ్‌కు ఈసారి బీజేపీ టికెట్ ఇవ్వలేదు. పిలిభిత్ లోక్‌సభ స్థానం గత నాలుగు ఎన్నికల్లో బీజేపీ ఖాతాలోనే ఉంది. ప్రస్తుతం ఈ స్థానంలో వరుణ్ గాంధీ ఎంపీగా ఉన్నారు. అయితే వరుణ్ గాంధీ చాలా కాలంగా పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ తన గళం విప్పారు. అయితే ఇటీవల ఆయన పార్టీ విషయంలో కాస్త మెత్తబడ్డారు. దీంతో వరుణ్‌కు టికెట్ ఇస్తారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. బీజేపీ తొలి జాబితా విడుదలైన తర్వాత పిలిభిత్ నుంచి పోటీ చేసేది వీరేనంటూ పలువురు పోటీదారుల పేర్లు చర్చకు వచ్చాయి. వారిలో ఒకరే జితిన్ ప్రసాద్. ఆదివారం రాత్రి వెలువడిన బీజేపీ జాబితాలో జితిన్ ప్రసాద్ పేరు కనిపించింది. దీంతో జిల్లాలో ఎన్నికల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. జితిన్ ప్రసాద్ ప్రస్తుతం పబ్లిక్ వర్క్స్ మంత్రిగా ఉన్నారు. ఆయన పిలిభిత్, లఖింపూర్, సీతాపూర్ తదితర జిల్లాల్లో పలు అభివృద్ధి పనులు చేశారు. జితిన్ ప్రసాద్ 2004 లోక్‌సభ ఎన్నికల్లో షాజహాన్‌పూర్ నుంచి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ధౌరహర స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ సమయంలో జితిన్ కేంద్ర రోడ్డు రవాణా , రహదారుల మంత్రిత్వ శాఖ, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రిగా ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం జితిన్ బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. -
బీజేపీ: వరుణ్ గాంధీకి టికెట్ దక్కేనా?
లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో సమావేశమైంది. బీహార్, రాజస్థాన్‌తో పాటు యూపీలోని మిగిలిన 24 స్థానాలతో సహా ఇతర రాష్ట్రాల అభ్యర్థుల విషయమై చర్చించారు. అలాగే వరుణ్ గాంధీకి పిలిభిత్ స్థానం కేటాయించాలా వద్దా? అనేదానిపై కూడా చర్చ జరిగిందని తెలుస్తోంది. అన్ని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయని, అయితే వీటిని దశలవారీగా విడుదల చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం యూపీలో మొదటి దశలో మిగిలిన మూడు స్థానాలైన పిలిభిత్, మొరాదాబాద్, సహరన్పూర్ స్థానాల అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేయవచ్చని తెలుస్తోంది. యూపీలో మొదటి దశలో మొత్తం ఎనిమిది లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. వీటిలో సహారన్పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్ మరియు పిలిభిత్ ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు ఐదు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. పిలిభిత్, సహరన్పూర్, మొరాదాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పిలిభిత్ స్థానానికి అభ్యర్థిని నిర్ణయించడంపై సీఈసీ సమావేశంలో పెద్ద ఎత్తున చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వరుణ్ గాంధీ ప్రస్తుతం ఇక్కడ ఎంపీగా ఉన్నారు. అయితే ఈ సారి ఆయనకు టిక్కెట్ కేటాయించకుండా, కొత్తవారిని రంగంలోకి దింపుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన గతంలో సొంత పార్టీపై చేసిన విమర్శలే ఇందుకు కారణమని చెబుతున్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఎన్నికల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ధరంపాల్ తదితరులు పాల్గొన్నారు. యూపీకి సంబంధించిన మిగిలిన 24 సీట్ల జాబితాను ఒకేసారి విడుదల చేయకుండా దశలవారీగా విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. -
వరుణ్‌కు నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలెందుకు?
బీజేపీ నేత, పిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ నుంచి పోటీ చేయనున్నారా? దీనికి ప్రస్తుతానికి ఎవరి వద్దా సమాధానం లేదు. అయితే ఆయన తాజాగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. రాజధాని ఢిల్లీ నుంచి వచ్చిన వరుణ్ గాంధీ ప్రతినిధులు యూపీలోని పిలిభిత్‌లో నాలుగు సెట్ల నామినేషన్ ఫారాలను కొనుగోలు చేసి, తిరిగి ఢిల్లీకి వెళ్లినట్లు మీడియాకు సమాచారం అందింది. మరోవైపు వరుణ్ గాంధీ పిలిభిత్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తాంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన అధికార ప్రతినిధి వీటిని ఖండించారు. వరుణ్ గాంధీ ఆదేశాల మేరకు నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను కొనుగోలు చేశామని, అందులో రెండు హిందీ, రెండు సెట్లు ఇంగ్లీషు భాషలో ఉన్నాయని ఆయన ప్రతినిధి ఎంఆర్ మాలిక్ తెలిపారు. ఈసారి వరుణ్ గాంధీసీటు మారుతున్నదన్న ఊహాగానాలకు తెరదించుతూ ఈ స్థానం నుంచి వరుణ్ గాంధీనే బీజేపీ అభ్యర్థి అని మాలిక్ స్పష్టం చేశారు. వరుణ్ గాంధీ గత కొన్నేళ్లుగా తన సొంత పార్టీ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే ఈ మధ్యనే ఆయన బీజేపీ నేతలతో మంతనాలు జరిపారు. అలాగే ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. కాగా పిలిభిత్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీ ఇంకా ప్రకటించనేలేదు. ఏప్రిల్ 19న పిలిభిత్‌లో తొలి దశలో ఓటింగ్ జరగనుంది. బుధవారం నుంచే ఇక్కడ నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. ఏదీఏమైనప్పటికీ వరుణ్ గాంధీ నాలుగు నామినేషన్ పత్రాలు కొనుగోలు చేయడం పలు సందేహాలకు తావిస్తోంది. -
Lok Sabha Elections: స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి వరుణ్ గాంధీ!
లక్నో: దేశంలో ఎన్నికల హడావిడీ ఉంది. లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో జాతీయ పార్టీలతోపాటు ప్రాంతీయ పార్టీలన్నీ అభ్యర్ధుల ఎంపిక, ప్రచారాలపై దృష్టి సారించాయి. దీంతో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమకు టికెట్ దక్కుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్న వారికి సీటు రాకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్రంగా లేదా వేరే పార్టీ తీర్ధం పుచ్చుకొనైనా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేత వరుణ్ గాంధీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లోని పిలిభిత్ నుంచి బీజేపీ లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. అయితే గత కొంత కాలంగా వరుణ్ కాషాయ పార్టీ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా లేన్నట్లు ప్రచారం నడుస్తోంది. పిలిభిత్ స్థానం నుంచి బీజేపీ తనకు టిక్కెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని సంబందిత వర్గాలు తెలిపాయి. ఇక పిలిభిత్ స్థానానికి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను ఆయన ప్రతినిధులు ఢిల్లీ నుంచి యూపీకి ఇప్పటికే తీసుకొచ్చారని పేర్కొన్నాయి. 2009, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వరుణ్‌గాంధీ పిలిభిత్ నుంచి పోటీ చేసి రెండోసార్లు గెలుపొందారు. అయితే పిలిభిత్ స్థానానికి బీజేపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ఇప్పటికే పలువురు అభ్యర్థులను ప్రకటించింది. అంబేద్కర్ నగర్ నుంచి బీఎస్సీ మాజీ ఎంపీ రితేష్ పాండేని పోటీకి దించగా.. హేమ మాలిని, రవి కిషన్, అజయ్ మిశ్రా తేని, మహేష్ శర్మ, ఎస్పీఎస్ బాఘెల్, సాక్షి మహరాజ్‌లను తమ స్థానాల నుంచి మరోసారి అవకాశం ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసి నుంచి, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లక్నో నుంచి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అమేథీ నుంచి పోటీ చేయనున్నారు. కాగా, ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలపై పలు సందర్భాల్లో తన అసమ్మతి గళాన్ని వినిపిస్తూ వస్తున్నారు.. కీలక అంశాల్లో పార్టీ నిర్ణయాలపైనే బహిరంగ విమర్శలు చేస్తున్నారు. కొంతకాలంగా తన లోక్‌సభ నియోజకవర్గమైన పిలిభిత్‌లో క్రియాశీలకంగా ఉంటున్న ఆయన.. పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మాట్లాడుతున్నారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారంటూ ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. -
వరుణ్‌కు టిక్కెట్ ప్లాన్ చేసిన అఖిలేష్?
లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించడంతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇదేసమయంలో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ దుమారం చెలరేగుతోంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీకి టిక్కెట్ ఇవ్వకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తన స్నేహితుడు వరుణ్ గాంధీకి టిక్కెట్ ఇచ్చేందుకు ప్లాన్ చేశారని తెలుస్తోంది. యూపీలోని పిలిభిత్ స్థానానికి ఎస్పీ-కాంగ్రెస్ కూటమి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఇక్కడి నుంచి సమాజ్‌వాదీ పార్టీ వరుణ్‌గాంధీని బరిలోకి దింపవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పిలిభిత్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. వరుణ్ గాంధీకి ఇక్కడి టిక్కెట్ ఇస్తారనే ఊహాగానాలకు ఈ సమావేశం మరింత బలాన్నిచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో తొలి దశ ఎన్నికలకు మార్చి 20న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, నామినేషన్ల దాఖలుకు మార్చి 27 చివరి తేదీ. నామినేషన్ పత్రాల పరిశీలన తేదీ మార్చి 28. నామినేషన్ల ఉపసంహరణ తేదీ ఏప్రిల్ 30. ఎన్నికల తేదీ ఏప్రిల్ 19. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
సస్పెన్స్‌లో తల్లీకొడుకుల సీట్లు.. విడిగా వరుణ్ గాంధీ పోటీ?
లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్ చాలా కీలకమైన రాష్ట్రం. ఇక్కడ మొత్తం 80 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ క్రమంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు ఈ రాష్ట్రానికి చెందిన 51 స్థానాలకు బీజేపీ మొదటి విడతలో అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ ప్రకటించిన మొదటి విడత అభ్యర్థుల జాబితాలో పిలిభిత్, సుల్తాన్పూర్, కైసర్‌గంజ్, రాయ్‌బరేలి, మైన్‌పురి, మరికొన్ని ముఖ్యమైన స్థానాలు లేవు. వీటిలో పిలిభిట్ లోక్‌సభ స్థానం నుంచి ప్రస్తుతం వరుణ్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆయన తల్లి, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ సుల్తాన్పూర్ లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇక్కడి రాష్ట్ర బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం.. రైతులకు సంబంధించిన సమస్యలపై పార్టీ నాయకత్వంతోపాటు స్థానిక బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేక గళం వినిపించిన వరుణ్ గాంధీకి ఈసారి టిక్కెట్ ఉండకపోవచ్చు అంటున్నారు. ఒకప్పుడు తన తండ్రి సంజయ్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన అమేథీ నుంచి ప్రతిపక్ష భారత కూటమి మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా వరుణ్ గాంధీ పోటీ చేయవచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి. -
రాహుల్ కాదు వరుణ్.. అమేథీ ఓటర్ల యూటర్న్?
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమేథీ(యూపీ) లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపడంతో, గాంధీ కుటుంబానికి పట్టంకట్టే స్థానికులు ఇప్పుడు వరుణ్ గాంధీవైపు చూస్తున్నారు. రాహుల్ 2019లో అమేథీ నుండి బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయినప్పటి నుంచి తన ‘కుటుంబ నియోజకవర్గాన్ని’ తిరిగి దక్కించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. రాహుల్ ప్రస్తుతం కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. అలాగే రాహుల్ తిరిగి వయనాడ్ నుండి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే.. రాయ్‌బరేలీని ఎంపిక చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల సోనియా గాంధీ అమేథీ నియోజకవర్గ ప్రజలకు రాసిన లేఖలో భవిష్యత్తులో ఇక్కడి ప్రజలు తన కుటుంబానికి మద్దతు ఇస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా దివంగత సంజయ్ గాంధీతోపాటు తన రాజకీయ అరంగేట్రం చేసిన ప్రముఖ కాంగ్రెస్ నేత రామ్ కరణ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. 1980లో సంజయ్ గాంధీ అమేథీ సీటును గెలుచుకోవడంతో గాంధీ కుటుంబానికి అమేథీతో అనుబంధం ఏర్పడిందని అన్నారు. రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయడానికి అంగీకరించకపోతే వరుణ్ గాంధీ అమేథీ నుండి పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ఇదేగానీ జరిగితే, తామంతా వరుణ్‌కు మద్దతుగా నిలుస్తామని తెలిపారు. అయితే పార్టీ విధానాలను తీవ్రంగా విమర్శించే వరుణ్ గాంధీకి బీజేపీ టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో వరుణ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ అతనికి మద్దతు ఇచ్చే అవకాశాలున్నయనే వార్తలు వినిపిస్తున్నాయి. -
Kedarnath: ఎదురుపడ్డ సోదరులు.. రాహుల్, వరుణ్‌గాంధీ అప్యాయ పలకరింపు
న్యూఢిల్లీ: వాళ్లిద్దరూ సోదరులే... కాకపోతే దశాబ్దాలుగా ఎడముఖం పెడముఖమే. ఇద్దరూ రాజకీయనేతలే. పార్లమెంటు సభ్యులే. కానీ పార్టీలు మాత్రం వేర్వేరు. అలాంటి ఇద్దరు అన్నదమ్ములు అకస్మాత్తుగా.. అనుకోకుండానే ఒకరికొకరు తారసపడితే? ఇలాంటి అపురూపమైన ఘట్టమే మంగళవారం ఉత్తారఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఆవిషృతమైంది. ఆ అన్నదమ్ములు ఎవరో కాదు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ.. ఇందిరగాంధీ రెండో కోడలైన మేనకా గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ! కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మూడు రోజులుగా రాహుల్ గాంధీ కేదార్‌నాథ్‌లోనే ఉంటున్నారు. అయితే మంగళవారం వరుణ్ గాంధీ తన కుటుంబంతో కలిసి కేదార్‌నాథ్‌లో శివుడిని దర్శించుకునేందుకు వచ్చారు. ఈ సమయంలోనే ఇద్దరు సోదరులు ఒకరికొకరు ఎదురయ్యారు. కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్న తరువాత ఆలయం బయట ఇద్దరు నేతలు కలుసుకొని కొద్దసేపు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అయితే ఈ సమావేశం చాలా తక్కువ సమయం జరిగిందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. వీరిద్దరి సంభాషణలో రాజకీయాల గురించి చర్చ జరగలేదని తెలిపాయి. వరుణ్ కుమార్తెను చూసి రాహుల్ సంతోషం వ్యక్తం చేసినట్లు సమాచారం. पवित्र देवभूमि की यात्रा हमेशा की तरह अद्भुत एवं अविस्मरणीय रही। ऋषियों के तपोबल से उन्मुक्त हिमालय की गोद में आकर ही मन मस्तिष्क एक नयी ऊर्जा से भर गया। साथ ही परिवार समेत बाबा केदार और भगवान बद्री विशाल के दर्शन करने का सौभाग्य भी मिला। प्रभु सभी का कल्याण करें। 🙏 pic.twitter.com/aSKzj4xUI1 — Varun Gandhi (@varungandhi80) November 8, 2023 కాగా రాహుల్ వరుణ్ ఇద్దరూ సోదరులే అయినప్పటికీ బహిరంగంగా కలిసి కనిపించడం చాలా అరుదు. అయితే ఉన్నట్టుండి ఈ ప్రత్యర్థి పార్టీ ఎంపీలు ఎదురుపడటం, సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్‌తో భేటీ కావడంతో వరుణ్ త్వరలోనే పార్టీ మారే అవకాశాలు ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. దీనికి తోడు వరుణ్ గాంధీ ఆ మధ్య కాలంలో బీజేపీ పార్టీలో యాక్టివ్‌గా కనిపించడం లేదు. పార్టీ ముఖ్య సమావేశాల్లో ఆయన కనిపించడం లేదు. అంతేగాక కొత్త వ్యవసాయ చట్టాలు, లఖింపూర్ ఖేరీ ఘటన సహా పలు కీల అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని బహరింగానే ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఆయన బీజేపీకి గుడ్‌బై చెప్పి, కాంగ్రెస్‌లో చేరనున్నారనే సందేహాలకు బలాన్ని చేకూర్చుతున్నాయి. ఇక సంజయ్ గాంధీ, మేనకాగాంధీల కుమారుడు అయిన వరుణ్ గాంధీ ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిలిభిత్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. అయితే గతేడాది వరుణ్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే వార్తలు వస్తున్నాయని..ఆయన్నుపార్టీలోకి ఆహ్వానిస్తారా అని రాహుల్‌కు ఓ మీడియా సమావేశంలో ప్రశ్న ఎదురైంది. దీనికి వయనాడ్ ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లోకి ఎవరినైనా ఆహ్వానిస్తామని తెలిపారు. అయితే వరుణ్ బీజేపీ/ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మాత్రం ఎన్నడూ సమర్థించనని స్పష్టం చేశారు. -
నేను అలా చేయలేను.. వరుణ్ గాంధీపై రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కాంగ్రెస్ తలపెట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం పంజాబ్‌లో భారత్ జోడో యాత్ర కొనసాగుతుండగా.. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీపై రాహుల్ గాంధీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇద్దరి ఐడియాలజీలు వేరని స్పష్టం చేశారు. తాను ఆర్ఎస్ఎస్ ఆఫీసుకు వెళ్లేలోపే తల నరికేసుకుంటానని సంచలన కామెంట్స్ చేశారు. వివరాల ప్రకారం.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పంజాబ్‌లో కొనసాగుతోంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ.. మంగళవారం పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ వరుణ్ గాంధీ భావజాలంతో తాను ఏకీభవించలేనన్నారు. వరుణ్ గాంధీ ప్రస్తుతం బీజేపీ తరుఫున లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. అందుకే అతని భావాజాలంతో నేను ఏకీభవించలేను. రాష్ట్రీయ స్వయం సేవక్ ఆఫీసుకు వెళ్లడానికి ముందే తన తల నరుక్కోవాల్సి ఉంటుందని రాహుల్ స్పష్టం చేశారు. ఇదే క్రమంలో రాహుల్ గాంధీ.. ‘మా కుటుంబానికి ఒక ఐడియాలజీ ఉంది. కానీ వరుణ్ గాంధీ మరో భావజాలాన్ని స్వీకరించారు. నేను వరుణ్‌ను ఆత్మీయంగా కౌగిలించుకోగలను.. ప్రేమతో మాట్లాడగలను. కానీ.. అతను పుచ్చుకున్న ఐడియాలజీని తాను స్వీకరించలేన’ని తెలిపారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో వరుణ్ గాంధీ పాల్గొంటారనే వార్తలు ఇటీవల చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కామెంట్స్ ఆసకిక్తరంగా మారాయి. ఇక, వరుణ్ గాంధీ.. ఆయన తల్లి మేనకా గాంధీ కూడా బీజేపీలో ఎంపీలుగా ఉన్న సంగతి తెలిసిందే. #WATCH | Varun Gandhi is in BJP if he walks here then it might be a problem for him. My ideology doesn't match his ideology.I cannot go to RSS office,I'll have to be beheaded before that. My family has an ideology. Varun adopted another & I can't accept that ideology:Rahul Gandhi pic.twitter.com/hEgjpoqlhK — ANI (@ANI) January 17, 2023 మరోవైపు.. గతకొద్దిరోజులుగా వరుణ్ గాంధీ బీజేపీ అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, నిరుద్యోగంపై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. దీంతో, వరుణ్ గాంధీ వచ్చే ఎన్నికల సమయానికి బీజేపీని వీడే అవకాశం ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
Video Viral: జెండా కొంటేనే రేషన్.. తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ: దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జాతీయజెండాను రేషన్‌కార్డు పేద లబ్ధిదారులతో బలవంతంగా కొనుగోలుచేయిస్తున్న వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి. ‘రూ.20 పెట్టి జెండా కొనాల్సిందే. ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. ఆహారధాన్యాలు కావాలంటే జెండా కొనండి. లేదంటే వెళ్లండి’ అంటూ హరియాణాలోని కర్నాల్‌లో ఒక రేషన్ షాప్ డీలర్ కరాఖండీగా చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘జాతీయతను బీజేపీ అమ్మకానికి పెట్టింది. పేదల ఆత్మాభిమాన్ని గాయపరిచింది’ అని బీజేపీ సర్కార్‌ను విమర్శిస్తూ రాహుల్ ఫేస్బుక్లో పోస్ట్‌పెట్టారు. Forced To Buy Flag To Get Ration, Allege Haryana Villagers https://t.co/QMuJIrA4I9 pic.twitter.com/M50XBXhQnX — NDTV (@ndtv) August 10, 2022 వరుణ్ గాంధీ ఆగ్రహం ‘75వ స్వాతంత్య్రదినోత్సవాల వేళ ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు. చౌక సరకుల కోసం రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడే పేద ప్రజల కష్టార్జితాన్ని ఇలా చిల్లరగా వసూలుచేయడం దారుణం. త్రివర్ణ పతాకానికి వెల కట్టడం శోచనీయం’ అని వరుణ్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో జాతీయ పండుగ పేదలకు భారంగా మారిందన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలంతా తమ తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడం తెల్సిందే. దీని అవకాశంగా తీసుకుని రేషన్ షాపుల వద్ద జెండాల వ్యాపారం చేయిస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. చదవండి: (ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలొస్తే.. బిహార్‌లో వారిదే హవా) -
జెండా పేరుచెప్పి ఇలా చేస్తారా.. కేంద్రంపై బీజేపీ ఎంపీ ఫైర్
ఢిల్లీ/ఛండీగఢ్: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను దేశం మొత్తం ఘనంగా నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు రాష్ట్రాలు కూడా స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను తమ పరిధిలో ఘనంగా నిర్వహిస్తున్నాయి. అయితే.. ఈ వేడుకలు పేదలకు భారంగా పరిణమించాయంటున్నారు బీజేపీ నేత వరుణ్ గాంధీ. బీజేపీ నేత వరుణ్ గాంధీ మరోసారి కేంద్ర వ్యతిరేక స్వరం వినిపించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పేదలకు భారంగా మారడం దురదృష్టకరం అంటూ ఓ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారాయన. రేషన్ కోసం వెళ్తున్నవాళ్లు.. జాతీయ జెండా కొంటేనే రేషన్ ఇస్తామంటూ డీలర్లు బలవంతం చేయడం సిగ్గుచేటంటూ వరుణ్ గాంధీ ఆరోపించారు. ప్రతి భారతీయుడి గుండెల్లో బతుకుతున్న 'తిరంగ'.. నిరుపేదల ఆహారాన్ని లాగేసుకోవడం సిగ్గుచేటన్నారు. आजादी की 75वीं वर्षगाँठ का उत्सव गरीबों पर ही बोझ बन जाए तो दुर्भाग्यपूर्ण होगा। राशनकार्ड धारकों को या तिरंगा खरीदने पर मजबूर किया जा रहा है या उसके बदले उनके हिस्से का राशन काटा जा रहा है। हर भारतीय के हृदय में बसने वाले तिरंगे की कीमत गरीब का निवाला छीन कर वसूलना शर्मनाक है। pic.twitter.com/pYKZCfGaCV — Varun Gandhi (@varungandhi80) August 10, 2022 హర్యానా కర్నల్‌లో జాతీయ జెండా కోసం 20రూ. డిమాండ్ చేయడం, అలా కొంటేనే రేషన్ ఇస్తామని డీలర్లు బలవంతం చేయడం.. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో.. ఆ రేషన్ డిపో ఓనర్ లైసెన్స్ రద్దు చేశారు. రేషన్ డిపోలో జాతీయ జెండాలు అమ్మకానికి ఉంచిన మాట వాస్తవమేనని, అయితే.. కొనుగోలు చేయాలని రేషన్ లబ్ధిదారులపై ఎలాంటి ఒత్తిడి లేదని అధికారులు అంటున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా ఉద్యమానికి పిలుపు ఇచ్చింది. అంతేకాదు సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్స్‌గా మువ్వన్నెల జెండాలను ఉంచాలన్న ప్రధాని పిలుపునకు మంచి స్పందనే లభిస్తోంది. మరోవైపు యూపీ పిలిభిత్ నియోజకవర్గం బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.. ఈ మధ్యకాలంలో కేంద్రంపై వరుసగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. సీనియర్ సిటిజన్లకు రైల్వే కన్షెషన్ రద్దు చేయండం, ప్యాకేజీ ఫుడ్ ఐటెమ్స్ మీద జీఎస్టీ, అగ్నిపథ్ నియామక ప్రకటన.. ఇలా దాదాపు చాలావరకు కేంద్ర నిర్ణయాలపై ఆయన నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇదీ చదవండి: ఆగస్టు 21 నుంచి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు -
పట్టించుకోకుండా ఉండటానికి.. అన్నది ప్రతిపక్షం కాద్సార్!
పట్టించుకోకుండా ఉండటానికి.. అన్నది ప్రతిపక్షం కాద్సార్! -
కాషాయ పార్టీలో కలకలం.. ప్రధాని మోదీ, సీఎం యోగికి ఊహించని షాక్!
అధికార బీజేపీలో వ్యతిరేక గళం వినిపిస్తోంది. రెండు క్రితం యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు షాకిస్తూ కేబినెట్ మంత్రి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో కాషాయ పార్టీ ఎంపీ ఏకంగా.. బీజేపీ సర్కార్‌పైనే విమర్శలు ఎక్కుపెట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే, యూపీలో ఈనెల 16న ప్రధాని నరేంద్ర మోదీ 296 కిలో మీటర్ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన విషయం తెలిసిందే. చిత్రకూట్ లోని భరత్ కూప్ నుంచి ఇటావాలోని కుంద్రెల్‌ను కలిపే ఈ నాలుగు లైన్ల ఈ ఎక్స్‌ప్రెస్‌వేను యోగి సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు రూ.15వేల కోట్లతో నిర్మించారు. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో జలౌన్ జిల్లా సమీపంలో కొన్నిచోట్ల పెద్ద రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పిలిభిత్ నియోజకవర్గం ఎంపీ వరుణ్ గాంధీ.. బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వారం రోజుల్లోనే రోడ్డు ఇలా అయితే ఎలా అంటూ ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా.. ఈ ప్రాజెక్ట్ హెడ్, నిర్మాణంలో భాగస్వాములైన కంపెనీలు, ఇంజనీర్లకు వెంటనే సమన్లు జారీ చేయాలని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, సొంత పార్టీ ఎంపీనే ఇలా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ప్రతిపక్ష నేతలు మాటల దాడి ప్రారంభించారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. బీజేపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. రోడ్డు నిర్మాణ విషయంలో ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. 15 हजार करोड़ की लागत से बना एक्सप्रेसवे अगर बरसात के 5 दिन भी ना झेल सके तो उसकी गुणवत्ता पर गंभीर प्रश्न खड़े होते हैं। इस प्रोजेक्ट के मुखिया, सम्बंधित इंजीनियर और जिम्मेदार कंपनियों को तत्काल तलब कर उनपर कड़ी कार्यवाही सुनिश्चित करनी होगी।#BundelkhandExpressway pic.twitter.com/krD6G07XPo — Varun Gandhi (@varungandhi80) July 21, 2022 ఇదిలా ఉండగా, వరుణ్ గాంధీ కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై సమయం వచ్చిన ప్రతీసారి విమర్శలు చేస్తూనే ఉన్నారు. అంతకుముందు ఉద్యోగ నోటిఫికేషన్ల భర్తీ విషయంలోనూ మోదీపై వరుణ్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో నిరుద్యోగం తీవ్ర స్థాయిలో ఉందంటూ.. ప్రస్తుతం ఇదే దేశంలో బర్నింగ్ ప్రాబ్లమ్ అంటూ వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా 60 లక్షలకుపైగా మంజూరైన పోస్టులు ఖాళీగా ఉండటం ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు. बेरोज़गारी आज देश का सबसे ज्वलंत मुद्दा है और पूरे देश के नेताओं को इस मुद्दे पर सरकार का ध्यान आकृष्ट कराना चाहिए। बेरोज़गार नौजवानों को न्याय मिलना चाहिए,तभी देश शक्तिशाली बनेगा। मैं आभारी हूँ की रोजगार के ऊपर उठाए गए मेरे सवालों का @asadowaisi जी ने अपने भाषण में ज़िक्र किया। pic.twitter.com/MAqfTOtHKZ — Varun Gandhi (@varungandhi80) June 13, 2022 ఇదిలా ఉండగా.. కేంద్ర గణాంకాలను నమ్మవచ్చా? పలు శాఖల్లోని ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ పోస్టులకు కేటాయించిన బడ్జెట్ ఎక్కడకు వెళ్లింది? అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. దేశంలో ఉన్న నిరుద్యోగులందరీ ఈ విషయం తెలుసుకునే హక్కు ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. వరుణ్ గాంధీ పార్టీ మరబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కూడా చదవండి: మహారాష్ట్రలో ట్విస్టులు.. షిండే సర్కార్‌కు బిగ్ షాక్! -
'ముందు అమలు చేసి, తర్వాత ఆలోచించండి': బీజేపీ నేత
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు దేశవ్యాప్తంగా హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీకి చెందిన వరుణ్ గాంధీ కేంద్రం వైఖరిపై విరుచుకుపడ్డారు. ఈ పథకాన్ని పరిగణలోనికి తీసుకునే ముందే వివిధ కోణాలను పరిగణలోనికి తీసుకులేదంటూ ఆరోపణలు చేశారు ఎటువంటి ముందుచూపు లేకుండా కొత్త పథకాన్ని తీసుకు వచ్చేసి...వ్వతిరేకత మొదలయ్యాక మళ్లీ పునరాలోచించడం వంటివి కొన్ని సున్నితమైన అంశాల్లో పనికి రాదంటూ ప్రభుత్వం పై మండిపడ్డారు. సాయుధ బలగాలు, భద్రతకు సంబంధించి యువత విషయానికి వస్తే...సాయుధ దళాల్లోని యువకులకు సైనికులుగా స్వల్పకాలిక ఉపాధి కల్పించడమే ఈ పథకంలో తీసుకొచ్చిన సరికొత్త మార్పు అని చెప్పారు. ఐతే ఈ పథకం ద్వారా ముఖ్యంగా 75 శాతం మందినే రిక్రూట్ చేసుకుంటారని చెప్పారు.. పైగా నాలుగేళ్లు మాత్రమే పనిచేస్తారని, ఆ తర్వత సాధారణ సైనికుల మాదిరి ఎటువంటి ప్రయోజనాలను పొందలేరని తెలిపారు. దీంతో యువత ఆందోళనలు చేపట్టిందన్నారు. ఐతే యువత చేస్తున్న ఆందోళనలను అణిచివేసే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు కారణంగానే నిరసనలు హింసాత్మకంగా మారాయన్నారు. 'अग्निपथ योजना' को लाने के बाद महज कुछ घंटे के भीतर इसमें किए गए संशोधन यह दर्शाते हैं कि संभवतः योजना बनाते समय सभी बिंदुओं को ध्यान में नहीं रखा गया। जब देश की सेना, सुरक्षा और युवाओं के भविष्य का सवाल हो तो ‘पहले प्रहार फिर विचार’ करना एक संवेदनशील सरकार के लिए उचित नहीं। — Varun Gandhi (@varungandhi80) June 18, 2022 (చదవండి: అగ్నిపథ్ ఆందోళనలు.. కేంద్రం దిద్దుబాటు చర్య, రక్షణ శాఖ కూడా 10 శాతం రిజర్వేషన్) -
మోదీకి ఊహించని షాక్.. ఒవైసీకి మద్దతు తెలిపిన బీజేపీ ఎంపీ
కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌కు భారీ షాక్ తగిలింది. కాషాయ పార్టీకి చెందిన ఎంపీ.. సొంత పార్టీ బీజేపీపైనే సంచలన విమర్శలు చేశారు. దీంతో దేశంలోనే ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వివరాల ప్రకారం.. యూపీలోని పిలిభిత్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.. కేంద్రానికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. దేశంలోని నిరుద్యోగ సమస్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని నిరుద్యోగం గత మూడు దశాబ్దాల కంటే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తున్నదని కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. భారత్‌లో నిరుద్యోగం తీవ్ర స్థాయిలో ఉందంటూ.. ప్రస్తుతం ఇదే దేశంలో బర్నింగ్ ప్రాబ్లమ్ అంటూ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగితేనే దేశం శక్తివంతం అవుతుందని కుండబద్దలుకొట్టారు. ఒక వైపు ఉద్యోగాలు లేక దేశంలోని కోట్ల మంది యువత నిరుత్సాహంలో మునిగి ఉన్నారని అన్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా 60 లక్షలకుపైగా మంజూరైన పోస్టులు ఖాళీగా ఉండటం ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా.. కేంద్ర గణాంకాలను నమ్మవచ్చా? పలు శాఖల్లోని ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ పోస్టులకు కేటాయించిన బడ్జెట్ ఎక్కడకు వెళ్లింది? అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. దేశంలో ఉన్న నిరుద్యోగులందరీ ఈ విషయం తెలుసుకునే హక్కు ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కొద్దిరోజుల కిత్రం పలు కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాల ఖాళీలను వెల్లడించారు. ఈ సందర్బంలో తాను చదవి వినిపించిన డేటా తనది కాదని.. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీదని తెలిపారు. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న పోస్టుల గురించి తన డేటాను చదవి వినిపించిన అసదుద్దీన్ ఒవైసీకి వరణ్ గాంధీ కృతజ్ఞతలు చెప్పారు. बेरोज़गारी आज देश का सबसे ज्वलंत मुद्दा है और पूरे देश के नेताओं को इस मुद्दे पर सरकार का ध्यान आकृष्ट कराना चाहिए। बेरोज़गार नौजवानों को न्याय मिलना चाहिए,तभी देश शक्तिशाली बनेगा। मैं आभारी हूँ की रोजगार के ऊपर उठाए गए मेरे सवालों का @asadowaisi जी ने अपने भाषण में ज़िक्र किया। pic.twitter.com/MAqfTOtHKZ — Varun Gandhi (@varungandhi80) June 13, 2022 ఇది కూడా చదవండి: యూపీ సీఎం యోగిపై అసదుద్దీన్ ఒవైసీ షాకింగ్ కామెంట్స్ -
Sakshi Cartoon: పబ్లిక్ రంగసంస్థలన్నీ ఎప్పుడో ప్రయివేటీకరించాం.ఇంకా పబ్లిక్ ఏంటి సార్!
పబ్లిక్ రంగ సంస్థలన్నీ ఎప్పుడో ప్రయివేటీకరించాం.ఇంకా పబ్లిక్ ఏంటి సార్! -
కేంద్ర ప్రభుత్వంపై బీజేపీ నేత అసంతృప్తి
ఢిల్లీ: బీజేపీ నేత వరుణ్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను తీవ్రంగా తప్పుబట్టారు. పలు సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే.. వాటిల్లో ఉద్యోగం చేసేవారు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘బ్యాంకింగ్ రంగం, రైల్వేలను ప్రైవేటీకరణ చేస్తే.. సుమారు ఐదు లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఒక వ్యక్తి తన ఉపాధి కోల్పోయడంటే.. అతని కుటుంబంలోని మిగతా సభ్యులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. వారి భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని పెంపొందిస్తాయి కానీ, ప్రజల్లో ఆర్థిక అసమానతలను పెంచవు. పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహించవు’ అని వరుణ్ గాంధీ ట్వీటర్లో పేర్కొన్నారు. గతంలో వరుణ్ గాంధీ వ్యవసాయ చట్టాలు, లఖిమ్‌పూర్ ఖేరీ ఘటనలపై కేంద్రాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. केवल बैंक और रेलवे का निजीकरण ही 5 लाख कर्मचारियों को ‘जबरन सेवानिवृत्त’ यानि बेरोजगार कर देगा। समाप्त होती हर नौकरी के साथ ही समाप्त हो जाती है लाखों परिवारों की उम्मीदें। सामाजिक स्तर पर आर्थिक असमानता पैदा कर एक ‘लोक कल्याणकारी सरकार’ पूंजीवाद को बढ़ावा कभी नहीं दे सकती। — Varun Gandhi (@varungandhi80) February 22, 2022 -
మోదీ సర్కారుకు మరోసారి ప్రశ్నాస్త్రాలు
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి మోదీ సర్కారుపై ప్రశ్నాస్త్రాలు ఎక్కుపెట్టారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు లేవని, వారు ఎంతకాలం ఎదురు చూడాలని ప్రశ్నించారు. ‘ప్రభుత్వ ఉద్యోగాలే లేవు. ఒకవేళ అవకాశం వస్తే పేపర్ లీక్ అవడం, ఎగ్జామ్ పెట్టినా ఫలితాలు ప్రకటించకపోవడం, లేదంటే ఏదో స్కామ్ కారణంగా క్యాన్సిల్ కావడం జరుగుతోంది. 1.25 కోట్ల మంది యువకులు రైల్వే గ్రూప్ డి ఉద్యోగ ఫలితాల కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్ విషయంలోనూ అదే పరిస్థితి. భారతదేశంలోని యువత ఎప్పటి వరకు ఓపిక పట్టాలి?’ అని వరుణ్ గాంధీ ట్విటర్ వేదికగా కేంద్రాన్ని నిలదీశారు. ఆర్థిక, ఉపాధి సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని ఆయన విమర్శించారు. ఉత్తరప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (UPTET)ని రద్దు చేస్తూ గత నెలలో యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వరుణ్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్ష పేపర్ లీక్ అయినట్టు వార్తలు రావడంతో యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. (చదవండి: మేము లేకుండా బీజేపీని ఓడించలేరు) ‘యూపీ టెట్ పరీక్ష పేపర్ లీక్ అనేది లక్షలాది మంది యువత భవిష్యత్తుతో ఆడుకోవడం లాంటిది. కిందిస్థాయి అధికారులపై చర్య తీసుకోవడం ద్వారా దీనిని అడ్డుకోలేము. విద్యా మాఫియా, వారిని పోషిస్తున్న రాజకీయ నాయకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. చాలా విద్యాసంస్థలు రాజకీయ పలుకుబడి కలిగిన వారి ఆజమాయిషిలో ఉన్నాయి. వాటిపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు?’ అని వరుణ్ గాంధీ ప్రశ్నించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా కూడా ఆయన గళం వినిపించిన సంగతి తెలిసిందే. (చదవండి: గులాం నబీ అజాద్ సంచలన వ్యాఖ్యలు.. ఆ పరిస్థితి కనించటం లేదు) -
కనీస మద్దతు ధర డిమాండ్ నెరవేర్చండి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నప్పటికీ రైతులు కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌పై ఇంకా వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ శనివారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. రైతుల కనీస మద్దతు ధర డిమాండ్ నెరవేర్చాలని, లఖీమ్‌పూర్ ఖేరి హింసలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై చర్యలు తీసుకోవాలని ప్రధానిని ఆయన కోరారు. రైతుల డిమాండ్లు నెరవేర్చేవరకు వారి పోరాటం ఆగదని పేర్కొన్నారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయాన్ని ముందే తీసుకుని ఉండి ఉంటే 700 మంది రైతుల ప్రాణాలను కాపాడగలిగేవారని వ్యాఖ్యానించారు. మోదీకి రాసిన లేఖను వరుణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘రైతులు చేస్తున్న డిమాండ్లన్నీ నెరవేర్చేవరకు వారి ఉద్యమం ఆగదు. ఇప్పటికీ వారిలో ఆగ్రహావేశాలు ఉన్నాయి. అవి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రూపంలో బయటకి వస్తాయి. అందుకే కనీస మద్దతు ధరకి చట్ట బద్ధత కల్పించాలి’ అన్నారు. గత ఏడాదిగా జరిగిన రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి తలా రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని వరుణ్ డిమాండ్ చేశారు. వారిపై పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకోవాలన్నారు. రైతులు చేస్తున్న డిమాండ్లు ఇవే.. ► కనీస మద్దతు ధరకి చట్ట బద్ధత కల్పించాలి. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని అమలు చేయాలి. ► సంప్రదాయ ఆహార పంటల్ని కొనుగోలు చేస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలి ► మండీ వ్యవస్థను పరిరక్షించాలి ► విద్యుత్(సవరణ) బిల్లు–2020ను వెనక్కి తీసుకోవాలి. ► పంట వ్యర్థాల్ని తగలబెడుతున్నందుకు రైతులకు విధిస్తున్న జరిమానాలు, జైలు శిక్షలకు ఇకపై స్వస్తి పలకాలి. -
మరోసారి కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు, వీడియో వైరల్
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలకు చిరునామాగా నిలిచిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరో సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలమైన 1947 నాటి దేశ స్వాతంత్య్రాన్ని ఆమె ‘భిక్ష’గా అభివర్ణించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో సర్కార్ కొలువుతీరిన 2014 ఏడాదిలోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం సిద్ధించినట్లు భావించాలని ఆమె వ్యాఖ్యానించారు. ఒక ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో కంగన మాట్లాడిన వీడియోను పిలిభిత్ ఎంపీ, బీజేపీ నేత వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు.‘ 1947లో దేశం స్వాతంత్య్రం పొందలేదు. అది కేవలం ఒక భిక్ష. మనందరికి 2014లోనే అసలైన స్వాతంత్య్రం వచ్చింది. ఆనాడు భిక్షగా పొందిన దానిని మనం స్వాతంత్య్రంగా ఎలా భావిస్తాం?. దేశాన్ని కాంగ్రెస్‌కు వదిలేసి బ్రిటిషర్లు వెళ్లిపోయారు. బ్రిటిషర్ల పాలనకు మరో కొనసాగింపు రూపమే కాంగ్రెస్’ అని ఆ వీడియోలో ఉంది. ‘1857లోనే మనం తొలిసారిగా స్వాతంత్య్రం కోసం ఐక్యంగా పోరాడాం. కానీ ఆ ఉద్యమాన్ని బ్రిటిషర్లు అణిచివేశారు. దాదాపు శతాబ్దం తర్వాత బ్రిటిషర్లు ‘స్వాతంత్య్రం’ అనే దానిని గాంధీజీ భిక్ష పాత్రలో వేశారు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేశారు. వెల్లువలా విమర్శలు కంగన వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్, ఆప్, శివసేన ఇలా పార్టీలకతీతంగా విమర్శలు వెల్లువెత్తాయి. దేశద్రోహం సెక్షన్ల కింద కంగనపై కేసు నమోదుచేయాలని ఆప్ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ప్రీతి శర్మ మీనన్ ముంబై పోలీసులకు ఫిర్యాదుచేశారు. దేశప్రజలందరికీ కంగన బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ అన్నారు. ‘ గాంధీజీ, భగత్‌సింగ్, నేతాజీ లాంటి త్యాగధనులను అవమానించిన కంగన నుంచి పద్మశ్రీని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేదంటే కేంద్రం ఇలాంటి మరెంతో మందిని ప్రోత్సహిస్తోందని భావించాల్సిందే’ అని ఆయన అన్నారు. ‘కంగన మాటలను దేశద్రోహంగా భావించాలా? లేక పిచ్చిపట్టి మాట్లాడుతోంది అనుకోవాలా?. ఇలాంటి సిగ్గుమాలిన వ్యాఖ్యలను మనం కేవలం ఖండించి వదిలేస్తే సరిపోదు’ అని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఆగ్రహంగా మాట్లాడారు. कभी महात्मा गांधी जी के त्याग और तपस्या का अपमान, कभी उनके हत्यारे का सम्मान, और अब शहीद मंगल पाण्डेय से लेकर रानी लक्ष्मीबाई, भगत सिंह, चंद्रशेखर आज़ाद, नेताजी सुभाष चंद्र बोस और लाखों स्वतंत्रता सेनानियों की कुर्बानियों का तिरस्कार। इस सोच को मैं पागलपन कहूँ या फिर देशद्रोह? pic.twitter.com/Gxb3xXMi2Z — Varun Gandhi (@varungandhi80) November 11, 2021 How Dare she insult Our Martyrs like this .. What a SHAMEFUL COMMENT ‼️ Just PATHETIC ‼️‼️ pic.twitter.com/sF59i7Or2e — Aarti (@aartic02) November 10, 2021 .@AamAadmiParty member @PreetiSMenon filed a complaint with the @MumbaiPolice against actor #KanganaRanaut for her recent remarks on India's freedom struggle on a news channel. pic.twitter.com/ZiYgs1sd5x — Silverscreen.in (@silverscreenin) November 11, 2021 -
బీజేపీకి వరుణ్ గాంధీ షాక్: ఒకనాటి సంచలన వీడియో పోస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా గళం విప్పిన బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తగ్గేదే..లే అంటూ కేంద్రానికి మరోసారి షాకిచ్చారు. మాజీ ప్రధానమంత్రి, బీజేపీ అగ్రనేత దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రసంగానికి సంబంధించిన ఒక సంచలన వీడియోను తాజాగా పోస్ట్ చేశారు. రైతుల అణచివేతకు వ్యతిరేకంగా ఉన్న ఆయన ప్రసంగం క్లిప్‌ను గురువారం ట్విటర్లో పోస్ట్ చేశారు. ఒకప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రైతులకు మద్దతుగా నిలిచిన ఆయన ప్రసంగ వీడియో ఇపుడు వైరల్‌గా మారింది. చదవండి : మిశ్రాను పదవి నుంచి తప్పించండి మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా రైతుల సుదీర్ఘ ఉద్యమం, లఖీంపూర్ ఖేరిలో రైతులపై హింసాకాండ నేపథ్యంలో బీజేపీ నేత ట్విట్ చేసిన ఈ వీడియో సంచలనంగా మారింది. "పెద్ద మనసున్న నాయకుడి నోట తెలివైన మాటలు" అంటూ వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు అగ్రిచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన సందర్భంలో వాజ్‌పేయి ప్రసంగాన్ని షేర్ చేయడమంటే మోదీ సర్కార్‌కు షాకేనని భావిస్తున్నారు. వరుణ్ గాంధీ షేర్ చేసిన వీడియోలో చట్టలను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వం రైతులను అణచివేయడంపై వాజ్‌పేయి అప్పటి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. "రైతులను భయపెట్టొద్దు. వారు భయపడాల్సిన అవసరం లేదు. మేము రైతుల ఉద్యమాన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలనుకోవడం లేదు. కానీ అన్నదాతల శాంతియుత ఆందోళనను అణచివేయాలని చూస్తే మాత్రం వారికి అండగా నిలబడటానికి ఏమాత్రం వెనుకాడము" అని వాజ్‌పేయి కేంద్రాన్ని హెచ్చరించడం ఈ క్లిప్పింగ్‌లో చూడొచ్చు. చదవండి : Global Handwashing Day 2021: కరోనాకు చెక్ పెడదాం కాగా ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి హింసపై ఘాటుగా స్పందించిన ఏకైక బీజేపీ ఎంపీవరుణ్ గాంధీ. హత్యలతో వారి నోళ్లు మూయించలేరంటూ ఈ సంఘటన వీడియోను ట్వీట్ చేశారు. అమాయక రైతుల రక్తం చిందిన వైనానికి జావాబుచెప్పాలని, నలుగురు రైతుల మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వరుణ్ గాంధీ డిమాండ్ చేశారు. కారుతో ఢీకొట్టి మరీ రైతులను హత్య చేశారన్న ఆరోపణల్లో జూనియర్ హోం మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నిందితుడు. మరోవైపు కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులకు మద్దతుగా మాట్లాడిన నెల రోజులకు బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడుగా వరుణ్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. చదవండి : Love Your Eyes: ఆ కళ్లను ప్రేమిస్తున్నారా? అయితే ముందు మీ కళ్లను ప్రేమించండి! Wise words from a big-hearted leader… pic.twitter.com/xlRtznjFAx — Varun Gandhi (@varungandhi80) October 14, 2021 -
వరుణ్ గాంధీపై శివసేన ప్రశంసలు.. మీరూ మెచ్చుకోండి!
ముంబై: అన్నదాతలకు అండగా నిలిచి సొంత పార్టీ ఆగ్రహానికి గురైన బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీపై శివసేన పార్టీ ప్రశంసలు కురిపించింది. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలో రైతులకు దన్నుగా నిలిచిన ఆయనను అభినందించాలని ఉత్తరప్రదేశ్ రైతు సంఘాల నేతలకు సూచించింది. ఈ మేరకు శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో పేర్కొంది. లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండలో నలుగురు రైతులతో పాటు 8 మంది ప్రాణాలు కోల్పోయినా బీజేపీ ఎంపీలు స్పందించకపోవడాన్ని శివసేన తప్పుబట్టింది. ‘శత్రుత్వాన్ని వ్యాప్తి చేయడానికి చేసే ప్రయత్నాలను మన దేశం ఎప్పటికీ సహించదు. వరుణ్ గాంధీ (మాజీ ప్రధాని) ఇందిరా గాంధీ మనవడు, సంజయ్ గాంధీ కుమారుడు. లఖీమ్‌పూర్ ఖేరిలో కిరాతక ఘటన చూసిన తర్వాత ఆయన రక్తం మరిగింది. ఈ దారుణోదంతంపై తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వ్యక్తపరిచారు’ అని సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నారు. రాజకీయంగా తనకు ఎదురయ్యే ఆటుపోట్ల గురించి పట్టించుకోకుండా రైతుల హత్యలను ఖండించి ధైర్యంగా నిలబడ్డారని ప్రశంసించింది. ‘వరుణ్ గాంధీని ప్రశంసిస్తూ రైతు నాయకులు తీర్మానం చేయాల’ని శివసేన సలహాయిచ్చింది. లఖీమ్‌పూర్ ఖేరిలో అన్నదాతలను అత్యంత కిరాతకంగా కారుతో గుద్ది చంపడాన్ని వరుణ్ గాంధీ అంతకుముందు తీవ్రంగా ఖండించారు. అధికార మదంతో పేద రైతులను ఊచకోత కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ‘హిందూ వర్సెస్ సిక్కు యుద్ధం’గా చిత్రీకరించే కుట్రలు జరుగుతున్నాయని, ఇది చాలా ప్రమాదకర పరిణామమని హెచ్చరించారు. (చదవండి: వరుణ్ గాంధీకి బీజేపీ ఝలక్.. ఎందుకంటే..?) కాగా, అక్టోబర్ 3న చోటుచేసుకున్న లఖీమ్‌పూర్ ఖేరి దారుణోదంతం కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా శనివారం పోలీసులు ఎదుట లొంగిపోగా.. కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు అజయ్ మిశ్రా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. చదవండి: ఆ సమయంలో ఆశిష్ ఎక్కడ ఉన్నారు? -
వరుణ్ గాంధీకి బీజేపీ ఝలక్.. ఎందుకంటే..?
న్యూఢిల్లీ: వరుణ్ గాంధీకి భారతీయ జనతా పార్టీ(బీజేపీ) షాక్ ఇచ్చింది. తాజాగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో వరుణ్ గాంధీకి మొండిచేయి చూపింది. 80 సభ్యులతో కూడిన జాతీయ కార్యవర్గాన్ని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం ప్రకటించారు. వరుణ్ గాంధీ సహా ఆయన తల్లి మేనకా గాంధీకి కూడా కార్యవర్గంలో చోటు దక్కలేదు. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీ.. సొంత పార్టీకి కంట్లో నలుసులా మారారు. మేనకా గాంధీ.. మధ్యప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ ఎంపీగా ఉన్నారు. అందుకే చోటు దక్కలేదా? ఇటీవల కాలంలో మోదీ సర్కారు విధానాలను విమర్శిస్తూ వరుణ్ గట్టిగానే గళం విన్పిస్తున్నారు. ముఖ్యంగా రైతు చట్టాలు, ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరి ఘటన నేపథ్యంలో ఆయన స్వరాన్ని మరింత పెంచారు. లఖీమ్‌పూర్ ఖేరీలో శాంతియుతంగా నిరసన చేపట్టిన రైతులపై ఉద్దేశపూర్వకంగానే కారు ఎక్కించారని ఆరోపించారు. పోలీసులు తక్షణమే స్పందించి దోషులను అరెస్ట్ చేయాలన్నారు. హింసాకాండకు బాధ్యులైన వారిని చట్టప్రకారం శిక్షించాలని తాజాగా డిమాండ్ చేశారు. అన్నదాతల రక్తం కళ్లజూసిన వారిని బోనెక్కించాలని ట్విటర్ వేదికగా నినదించారు. ఈ నేపథ్యంలో విడుదల చేసిన బీజేపీ జాతీయ కార్యవర్గంలో వరుణ్, మేనకా గాంధీలకు చోటు దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జంబో కార్యవర్గం బీజేపీ తాజాగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు చోటు దక్కించుకున్నారు. 80 మంది సాధారణ సభ్యులతో పాటు 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 179 మంది శాశ్వత ఆహ్వానితులు(ఎక్స్‌ఆఫిషియో) సహా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, లెజిస్లేటివ్ పార్టీ నేతలు, మాజీ డిప్యూటీ సీఎం, జాతీయ అధికార ప్రతినిధి, నేషనల్ ఫ్రంట్ ప్రెసిడెంట్, స్టేట్ ఇన్చార్జి, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. (చదవండి: లఖీమ్‌పూర్ హింస.. సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా) అమిత్ షా, రాజనాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్, మాజీ మంత్రులు హర్షవర్థన్, ప్రకాశ్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్, ఎంపీలు, సీనియర్ నేతలకు బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది. బీజేపీ జాతీయ కార్యవర్గం వివిధ అంశాలపై చర్చిస్తుంది. పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన మార్గదర్శకాలను నిర్దేశిస్తుంది. కోవిడ్ -19 సంక్షోభం కారణంగా జాతీయ కార్యవర్గ సమావేశం చాలా కాలంగా జరగలేదు. -
రైతుల ఆందోళన: ఎంపీ వరుణ్ గాంధీ మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చని మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు బీజేపీ నేత, ఎంపీ వరుణ్ గాంధీ మద్దతు పలికారు. లక్షలాది మంది రైతులు ఆదివారం ముజఫర్‌నగర్‌లో ఒక చోటచేరి నిరసన చేపట్టారు. ‘రైతులు దేశానికి రక్త మాంసాలు. రైతులతో మర్యాద పూర్వకమైన విధానంలో చర్చలు జరుపుతాం. రైతుల బాధను వారికోణంలోనే తెలుసుకొని, వారితో కలిసి పనిచేయడానికి ఉమ్మడి వేదికను ఏర్పాటు చేస్తాం’ అని ట్విటర్లో వరుణ్ గాంధీ పేర్కొన్నారు. చదవండి: జన్ ఆశీర్వాద యాత్రతో ప్రతిపక్షాల్లో వణుకు దీంతో పాటు ఆయన ముజఫర్‌నగర్‌లో వందలాది రైతులు ‘కిసాన్ మహాపంచాయత్’ చేపటట్టిన నిరసన వీడియోను ట్విటర్లో షేర్చేశారు. భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకునే వరకు నిరసనలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. అయితే ఎంపీ వరుణ్ గాంధీ తన చేసిన ట్విట్లో ఎక్కడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రస్తావించలేదు. అయినప్పటికీ అధికారపార్టీ నుంచి రైతుల నిరసనకు మద్దతు పలికిన మొదటి నేత వరుణ్ గాంధీ కావటం గమనార్హం. Lakhs of farmers have gathered in protest today, in Muzaffarnagar. They are our own flesh and blood. We need to start re-engaging with them in a respectful manner: understand their pain, their point of view and work with them in reaching common ground. pic.twitter.com/ZIgg1CGZLn — Varun Gandhi (@varungandhi80) September 5, 2021 చదవండి: తండ్రిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు.. సమర్ధించిన ముఖ్యమంత్రి -
యూపీ ఎన్నికలు: కేంద్ర కేబినెట్ బెర్త్‌లు
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏసర్కార్ తాజా కేబినెట్ విస్తరణ తీవ్ర ఆసక్తిని రేపుతోంది. ఇటీవలి అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తగిలిన ఎదురు దెబ్బ నేపథ్యంలో తన మంత్రి వర్గాన్ని భారీగా విస్తరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొగ్గు చూపారు. ప్రధానంగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఒక సంవత్సరమే సమయం ఉండటంతో అటు కుల, ఇటు మిత్ర పక్షాలను సంతృప్తిపరచేలా వివిధ సమీకరణాలను మోదీ పరిశీలించినట్టు తెలుస్తోంది. 2022లో రానున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, ఈ రోజు కేంద్ర కేబినెట్లో చేరే అవకాశం ఉన్న యూపీకి చెందిన అభ్యర్థులను పరిశీలిస్తే వరుణ్ గాంధీ, అనుప్రియా పటేల్, రీటా బహుగుణ జోషిలకు మోదీ కొత్త మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. అనుప్రియా పటేల్ అప్నా దళ్ (సోనెలాల్) అధ్యక్షురాలు అనుప్రియా పటేల్‌ను కేంద్ర మంత్రివర్గంలో చేర్చడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. యూపీ అసెంబ్లీలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ కేబినెట్ విస్తరణలో అప్నా దళ్ (సోనెలాల్) కోటా 2019 ఆగస్టులో పెరగలేదు. వాస్తవానికి అనుప్రియా పటేల్ తన పార్టీ నుండి ఇద్దరు మంత్రులకు బెర్తులు పొందాలని భావించారు ఈ నేపథ్యంలో వారిని బుజ్జగించే క్రమంలో అనుప్రియకు అవకాశం రానుంది. వరుణ్ గాంధీ వచ్చే ఏడాది యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం రానుందని భావిస్తున్న కేంద్ర మాజీమంత్రి మేనకాగాంధీ కుమారుడు, వరుణ్ గాంధీకి అనూహ్యంగా మోదీ కేబినెట్లో ఛాన్స్ దక్కనుంది. ఇప్పటిదాకా దూకుడు నాయకుడిగా పేరొందిన వరుణ్‌గాంధీని పక్కన పెట్టిన మోదీ ఇపుడిక అవకాశాన్నివ్వనున్నారు.ముఖ్యంగా యూపీలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రియాంక గాంధీ వాద్రాకు, గాంధీ కుటుంబానికి చెక్ పెట్టేలా వరుణ్ గాంధీని రంగంలోకి దింపనుంది. రీటా బహుగుణ జోషి అలహాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ, ప్రొఫెసర్ రీటా బహుగుణ జోషి కూడా కేంద్ర మంత్రివర్గం రేసులో ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ తొలి మంత్రివర్గంలో పర్యాటక రంగంతో పాటు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి. బలమైన మహిళా బ్రాహ్మణ నాయకురాలిగా, విద్యావేత్తగా, రీటా బహుగుణ కీలకంగా ఉన్నారు. అజయ్ మిశ్రా ఉత్తరప్రదేశ్‌లోని బ్రాహ్మణ ఓటర్లను ఆకర్షించడానికి లఖింపూర్ ఖేరి ఎంపీ అజయ్ మిశ్రాను కేంద్రమంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం ఉంది. తద్వారా మోదీ 2.0 క్యాబినెట్లోకి యువతకు ప్రాధాన్యం అవకాశం సందేశాన్నివ్వనుంది. రామ్ శంకర్ కాథెరియా దళిత ఓటర్లను ఆకర్షించే బీజేపీ వ్యూహంలో భాగంగా దళిత నాయకుడు, ఇటావా ఎంపి రామ్ శంకర్ కాథెరియాకు అవకాశం దక్కనుంది. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ మాజీ ఛైర్మన్. ఇంతకుముందు ఆగ్రా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కాథెరియా, మోదీ తొలి కేబినేట్లో కూడా చోటు దక్కించుకున్నారు. -
'నా కూతురును చూస్తే గర్వంగా ఉంది'
పిలిభిత్ : బీజేపీ నేత, పిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీ తన కూతురును చూస్తే చాలా గర్వంగా ఉందంటూ ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. తన ముద్దుల కూతురు అనసూయ గాంధీ పాఠశాలలో మొదటి తరగతి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి రెండవ తరగతికి వెళ్లనుంది. అంతేగాక తన తరగతిలో అతి పిన్న వయస్కురాలిగా మొదటి తరగతి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. 'నా కూతురు అనసుయా ఈ రోజు 1 వ సంవత్సరం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇయర్ 2 కి వెళుతుంది. ఆమె తన తరగతిలో అతి పిన్నవయస్కురాలు అవడం నాకు గర్వంగా ఉంది' అంటూ లాఫింగ్ ఎమోజీతో ట్వీట్ చేశాడు. (భారత్‌కు ‘స్వావలంబన’తోనే మోక్షం!) 2014 ఆగస్టులో వరుణ్ గాంధీ, యామిని దంపతులకు జన్మించిన అనసూయ గాంధీ బ్లూ ఫ్రాక్ ధరించి దానికి తగినట్లుగా మ్యాచింగ్ గ్రాజ్యుయేషన్ క్యాప్‌పై ఏజీ( అనసూయ గ్రాడ్యుయేటడ్) ధరించి ఫోటోలకు ఫోజిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రతీ రాష్ట్రంలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశారు. వరుణ్ గాంధీ ఈ ఫోటోను గురువారం ఉదయం ట్విటర్లో షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ ఫోటోకు 16 వేల లైకులు వచ్చాయి. (ఫేక్ ప్రొఫైల్‌తో ఎన్నారైకి వల; మహిళ అరెస్టు) -
వాళ్లతో నా షూ లేసులు విప్పించుకుంటా..!
-
వాళ్లతో నా షూ లేసులు విప్పించుకుంటా..!
లక్నో : వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ సీనియర్ నేత మేనకా గాంధీ ఈసీ ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తనయుడు, సుల్తాన్పూర్ సిట్టింగ్ ఎంపీ వరుణ్‌గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. మేనకా తరపున సుల్తాన్‌పూర్‌లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకులపై విమర్శలు చేసేక్రమంలో నోరుజారారు. ప్రతిపక్ష నాయకులతో తన షూ లేసులు విప్పించుకుంటానని వ్యాఖ్యానించారు. తమది నెహ్రూ-గాంధీ ఫ్యామిలీ అని పరోక్షంగా చెప్పుకున్న వరుణ్ సుల్తాన్పూర్ బీఎస్పీ అభ్యర్థి చంద్ర భద్ర సింగ్‌ని టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మనం దేవుడికి తప్ప ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీకోసం నేనున్నా. నేను సంజయ్ గాంధీ తనయున్ని. మన పట్ల అగౌరంగా మాట్లాడేవారిని పట్టించుకోవద్దు. అలాంటి వారితో నా షూ లేసు విప్పించుకుంటా. నా ముందు మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. ప్రజలు మోనూ, సోనూలను చూసి భయపడొద్దు’ అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన చంద్ర భద్ర సింగ్‌ని స్థానికులు సోనూ సింగ్ అని పిలుస్తారు. ఆయన సోదరుడు మోనూ సింగ్‌కి స్థానికంగా పేరుంది. వరుణ్ గాంధీ ప్రసంగించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఓ రాజకీయ నేత అయివుండీ నోటికొచ్చినట్లు మాట్లాడటం కరెక్టు కాదని నెటిజన్లు మండిపడుతన్నారు. ఫ్రస్ట్రేషన్లో ఉండటం వల్లే ఇలా మాట్లాడుతున్నారని ఫైర్ అవుతున్నారు. వరుణ్ ఫిలిబిత్ నుంచి పోటీ చేస్తున్నారు. #WATCH BJP LS candidate from Pilibhit, Varun Gandhi in Sultanpur says, "Mai ek hi cheez aapko kehna chahta hoon, kisi se darne ki koi zarurat nahi hai....Mai khada hoon yaha pe, mai Sanjay Gandhi ka ladka hoon, mai in logon se apne jute khulvata hoon" (2.4.19) pic.twitter.com/LnA8kVDivu — ANI UP (@ANINewsUP) May 4, 2019 -
తల్లి బెదిరింపులు.. తనయుడి బుజ్జగింపులు
లక్నో : ‘‘ నా ముస్లిం సోదరులకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. మీరు నాకు ఓటేస్తే చాలా సంతోషిస్తా. ఒక వేళ ఓటు వేయకపోయినా నేను పట్టించుకోను. మీ కోసం పనిచేస్తా’’ ఆదివారం ఎన్నికల ప్రచార సభలో పిలీభిత్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి వరుణ్ గాంధీ అన్న మాటలివి. వరుణ్ గాంధీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ముస్లిం ఓటర్లను ఆకర్షించటానికి ప్రయత్నిస్తున్నారు. తల్లి కంచుకోటలో ఎలాగైనా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నారాయన. ఇదిలా ఉండగా వరుణ్ గాంధీ తల్లి కేంద్రమంత్రి మేనకా గాంధీ ఇందుకు పూర్తి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. సుల్తాన్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆమె కొద్ది రోజుల క్రితం ముస్లిం ఓటర్లను ఉద్దేశిస్తూ మాట్లాడారు‘‘ నేను గెలవబోతున్నాను. మీరు ఓటు వేసినా.. వేయకపోయినా.. మీరు 100 ఓట్లు వేయండి. 50 ఓట్లు వేయండి. మీరు నాతో పనిచేయించుకోవడానికి వచ్చినపుడు దాన్నే నేను దృష్టిలో పెట్టుకుంటాను.’’ అంటూ తనకు ఓటు వేయకపోతే ముస్లింలకు ఎలాంటి సహాయం చేసేది లేదని ఆమె చెప్పకనే చెప్పారు. ఒకరకంగా బెదిరింపులకు దిగారు. అయితే ఈ వ్యాఖ్యాలను ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఆమెపై రెండురోజుల పాటు ప్రచార నిషేదం విధించింది. ఉత్తరప్రదేశ్‌లోని పిలీభీత్ స్థానం నుంచి వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీ 1989 నుంచి ఆరుసార్లు విజయం సాధించి, ఈ స్థానాన్ని కంచుకోటగా మలుచుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 52 శాతం ఓట్లను సాధించి మేనకా గాంధీ విజయఢంకా మోగించారు. అంతకు ముందు 2009 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి వరుణ్ గాంధీ పోటీచేసి, మూడు లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో తల్లీ కొడుకులు తమ నియోజకవర్గాలను పరస్పరం మార్చుకోవడం విశేషం. ఈసారి మేనకా గాంధీ స్థానంలో ఆమె కుమారుడు వరుణ్ గాంధీ ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగారు. సుల్తాన్పూర్ నుంచి మేనకా గాంధీ పోటీ చేస్తున్నారు. -
తల్లి కంచుకోటలో కొడుకు గెలుపుబాట!
ఒకటీ రెండూ కాదు ఆరుసార్లు మేనకా గాంధీని పార్లమెంటుకు పంపిన ఉత్తరప్రదేశ్‌లోని పిలీభీత్ లోక్‌సభ స్థానం నుంచి ఈసారి ఆమె కుమారుడు వరుణ్ గాంధీ పోటీ చేస్తుండడంతో గెలుపెవరిని వరిస్తుందన్న చర్చ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. గాంధీ కుటుంబం నుంచి వచ్చి, గాం«ధీ కుటుంబేతర పార్టీ నుంచి తమకు తాముగా నాయకులుగా ఎదిగిన తల్లీ కొడుకులు ఉత్తరప్రదేశ్‌లో తమ విజయావకాశాలను పరీక్షించుకుంటున్నారు. స్థానం మారిన తల్లీకొడుకు ఉత్తరప్రదేశ్‌లోని పిలీభీత్ స్థానం నుంచి వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీ 1989 నుంచి ఆరుసార్లు విజయం సాధించి, ఈ స్థానాన్ని కంచుకోటగా మలుచుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 52 శాతం ఓట్లను సాధించి మేనకా గాంధీ విజయఢంకా మోగించారు. అంతకు ముందు 2009 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి వరుణ్ గాంధీ పోటీచేసి, మూడు లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో తల్లీ కొడుకులు తమ నియోజకవర్గాలను పరస్పరం మార్చుకోవడం విశేషం. ఈసారి మేనకా గాంధీ స్థానంలో ఆమె కుమారుడు వరుణ్ గాంధీ ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగారు. సుల్తాన్పూర్ నుంచి మేనకా గాంధీ పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో గెలుపు కైవసం చేసుకుని తల్లిపేరు నిలబెట్టాలని వరుణ్ పిలీభీత్లోని గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి, ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మోదీ ప్రస్తావనే లేకుండా ప్రచారం పశ్చిమ యూపీలోని ఈ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న వరుణ్ గాంధీ.. ప్రధాని మోదీ ప్రస్తావన, కేంద్ర ప్రభుత్వ విజయాల గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నియోజకవర్గ ఓటర్లలో ఒక వర్గం నరేంద్ర మోదీని చూసే బీజేపీకి ఓటు వేస్తామని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా 30 ఏళ్లుగా ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన గాంధీ కుటుంబీకులు తమ అభివృద్ధి కోసం కృషి చేసిన దాఖలాలు లేవని విమర్శలు గుప్పిస్తున్నారు. కూటమి అభ్యర్థి గట్టి పోటీ ఈ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ కూటమి నుంచి ఉమ్మడి అభ్యర్థి హేమరాజ్ వర్మ వరుణ్ గాంధీతో తలపడుతున్నారు. ఈయన ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉండగా మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. మూడు దశాబ్దాలకుపైగా తల్లీకొడుకులిద్దరూ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కానీ, కనీసం ఢిల్లీకి నేరుగా చేరుకునేందుకు రైల్వే సదుపాయం కానీ కల్పించలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను స్థానికుడిననీ, ఇక్కడి ప్రజలూ స్థానిక నాయకత్వాన్నే కోరుకుంటున్నారనీ, తల్లీ కొడుకులు ఒక నెల సెలవుపై ఎన్నికల కోసం వచ్చారనీ, తరువాత 11 నెలలూ ఢిల్లీలోనే ఉంటారనీ హేమరాజ్ అంటున్నారు. ఆకట్టుకుంటున్న వరుణ్ గాంధీ వరుణ్ గాంధీ నియోజకవర్గంలో విభిన్న రీతిలో ప్రచారం చేస్తూ తన విజయావకాశాలను మెరుగుపర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా ఆ గ్రామంలోని గ్రామస్తులను, పెద్దలను, ప్రముఖులను ప్రశంసిస్తూ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత గ్రామీణులను తమకే ఓటు వేయాలని సున్నితంగా కోరతారు. గ్రామంలో జరిగే సభలో కేవలం ఐదు నుంచి పది నిమిషాలు మాత్రమే క్లుప్తంగా మాట్లాడతారు. ఇలా ఆయన రోజూ 15 – 20 గ్రామాల్లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తనని మూడు లక్షలకు తగ్గకుండా మెజారిటీతో గెలిపిస్తే అందరికీ ఉద్యోగ, ఉపాధి, వైద్యావకాశాలను కల్పిస్తానని అంటున్నారు. బీజేపీ అధినాయకత్వంతో స్పర్థలు? వరుణ్‌గాంధీకి బీజేపీ నాయకత్వంతో స్పర్థలు పొడచూపినట్టు వార్తలు వస్తున్నాయి. అమిత్ షా బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టిన అనంతరం వరుణ్ గాంధీని బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి 2014లో తొలగించారు. స్టార్ క్యాంపెయినర్స్ లిస్టులో కూడా వరుణ్ గాంధీ పేరుని చేర్చలేదు. వరుణ్ గాంధీ వివిధ అంశాలపై చేస్తోన్న వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయనీ, అందుకే ఆయనను అమిత్‌షా దూరంగా ఉంచారనీ, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2014 ఎన్నికల చిత్రం గెలుపొందిన అభ్యర్థి మేనకా గాంధీ (బీజేపీ) మెజారిటీ 3,07,052 ఓడిపోయిన అభ్యర్థి బుధ్సేన్ వర్మ (ఎస్పీ) నియోజకవర్గంలో ఓటర్లు 10,50,342 లోక్‌సభలోని అసెంబ్లీ సెగ్మెంట్లు 4 -
బిల్లు ఎగ్గొట్టిన వరుణ్ గాంధీ.. బీఎస్ఎన్ఎల్ ఫిర్యాదు!
లక్నో : బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తమకు భారీ మొత్తంలో బిల్ ఎగ్గొట్టాడని బీఎస్ఎన్ఎల్ ఆరోపించింది. రూ.38,616ల ఫోన్ బిల్లు చెల్లించకుండా ఫిలిబిత్ లోక్‌సభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన వరుణ్ గాంధీపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారికి బీఎస్ఎన్ఎల్ ఫిర్యాదు చేసింది. 2009-14 మధ్య కాలంలో వరుణ్ గాంధీ ఫిలిబిత్ ఎంపీగా ఉన్న సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన నియోజకవర్గ ఆఫీసుకు సంబంధిన ఫోన్ బిల్లు రూ. 38,616 కట్టలేదని ఫిర్యాదులో పేర్కొంది. బీఎస్ఎన్ఎల్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోకుండానే వరుణ్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది . అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరూ.. ప్రభుత్వ సంస్థల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుని నామినేషన్ పత్రాలకు జతపర్చాలన్న విషయం తెలిసిందే. ఒక వేళ అభ్యర్థి ఈ నియమాలు పాటించకపోతే ఆ నామినేషన్ తిరస్కరిస్తారు. ఇక 2014 లో సుల్తాన్పూర్ లోక్‌సభ నుంచి పోటీ చేసి గెలుపొందిన వరుణ్ గాంధీ.. ఈ సారి ఫిలిబిత్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తల్లి మనేకా గాంధీ సుల్తాన్పూర్ నుంచి పోటీ చేస్తుండటంతో.. ఆయన మళ్లీ ఫిలిబిత్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. -
మోదీ ఎవరికోసం అవినీతి చేస్తారు..?
లక్నో : భారతదేశాన్ని ఓ గొప్ప శక్తిగా తీర్చిదిద్దిన నరేంద్ర మోదీ వంటి ప్రధానిని భారతావని ఇంతకుముందెన్నడూ చూడలేదని బీజేపీ ఎంపీ అభ్యర్థి వరుణ్ గాంధీ అన్నారు. తన కుటుంబ సభ్యుల్లో కొంతమంది ప్రధానులుగా పనిచేసినప్పటికీ మోదీ వంటి పాలన అందించలేకపోయారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని పిల్‌భిట్‌లో ఆయన ప్రసంగిస్తూ...‘ వాజ్‌పేయి సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన కఠిక పేదరికాన్ని మాత్రం అనుభవించలేదు. కానీ మోదీజీ ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగారు. మా కుటుంబంలో కూడా కొంతమంది ప్రధానులుగా పనిచేసిన వాళ్లున్నారు. కానీ మోదీలాగా వారు భారత దేశ ప్రతిష్టను ఇనుమడింపచేయలేకపోయారు’ అని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ప్రాణ త్యాగానికైనా సిద్ధం.. ‘ మోదీ తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేశారు. దేశం కోసం ప్రాణ త్యాగానికైనా ఆయన సిద్ధపడతారు. గత ఐదేళ్లలో ప్రధానిగా ఆయనపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదు. అయినా మోదీ ఎవరి కోసం అవినీతికి పాల్పడతారు. ఆయనకేమైనా కుటుంబం ఉందా. దేశం కోసం ప్రాణాలు సైతం అర్పించగల వ్యక్తి ఆయన’ అని వరుణ్ గాంధీ మోదీపై ప్రశంసలు కురిపించారు. కాగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున వరుణ్ గాంధీ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. సుల్తాన్పూర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన తన తల్లి మేనకా ప్రాతినిథ్యం వహించిన పిలిభిట్ నుంచి పోటీ చేస్తుండగా.. సుల్తాన్పూర్ నుంచి మేనకా ఎన్నికల బరిలో దిగుతున్నారు. మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 23న అక్కడ ఎన్నికలు జరుగనున్నాయి. -
అనంత్‌కుమార్ భార్యకు బీజేపీ షాక్
బెంగళూరు/లక్నో: ఆరు పర్యాయాలు ఎన్నికైన కేంద్రమంత్రి దివంగత అనంత్ కుమార్ స్థానం నుంచి ఆయన సతీమణి తేజస్వినికి బెంగళూరు(దక్షిణ)టికెట్ నిరాకరించిన బీజేపీ.. సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు పార్టీలో చేరిన కొద్ది గంటల్లోనే టికెట్టిచ్చింది. అనంత్ విజయాల వెనుక కీలకంగా ఉన్న తేజస్విని అందుకు తగినట్లుగా ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. కానీ, సోమవారం రాత్రి తేజస్వి సూర్య(28) అనే యువనేతకు బీజేపీ టికెట్ ఇచ్చింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప స్పందించారు. ‘ తేజస్విని పేరును మాత్రమే రాష్ట్ర కమిటీ ప్రతిపాదించింది. కానీ, అధిష్టానం పేరును మార్చివేసింది. ఇలా ఎందుకు జరిగిందో నాకూ తెలియదు’ అని అన్నారు. పార్టీ నిర్ణయం తనతోపాటు మద్దతుదారులను కూడా షాక్‌కు గురిచేసిందని తేజస్విని మీడియాతో అన్నారు. కాగా, టికెట్ కేటాయించిన సమాచారం తెలిసిన వెంటనే తేజస్వి సూర్య తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. 39 మందితో మరో జాబితా మంగళవారం బీజేపీ మరో 39 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితా విడుదల చేసింది. ఇందులో యూపీకి 29, బెంగాల్‌కు సంబంధించి 10 పేర్లు ఉన్నాయి. కేంద్ర మంత్రి మేనకా గాంధీకి సిట్టింగ్ స్థానం ఫిలిబిత్ బదులు సుల్తాన్‌పూర్‌ను కేటాయించింది. కొడుకు వరుణ్ గాంధీకి ఫిలిబిత్‌ను కేటాయించింది. కేంద్ర మంత్రి మనోజ్ సిన్హాను సిట్టింగ్ స్థానం ఘాజీపూర్ నుంచి, యూపీ మంత్రులు రీటా బహుగుణ జోషి, సత్యదేవ్ పచౌరీలను అలహాబాద్, కాన్పూర్‌ల నుంచి బరిలో నిలపనున్నట్లు బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. మంగళవారమే బీజేపీ కండువా కప్పుకున్న సినీ నటి, మాజీ ఎంపీ అయిన జయప్రదకు రాంపూర్ స్థానాన్ని కేటాయిస్తున్నట్లు తెలిపారు. -
నిర్వహణ కాదు.. నివారణ ముఖ్యం
ప్రకృతి వైపరీత్యాల రూపంలో ఏర్పడుతున్న సంక్షోభాలను నిర్వహిం చడం కంటే వాటిని నివారించడం ఎంతో కీలకమైన అంశం. ఒక చిన్న రాష్ట్రమైన కేరళ ఇటీవల కనీవినీ ఎరుగని వరదల బారినపడి రూ. 21వేల కోట్ల భారీ నష్టాన్ని చవిచూసింది. పశ్చిమకనుమల్లో పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన 3 ప్రాంతాల్లో 14 లక్షల చదరపుటడుగుల నేల క్షయమైపోవడంపై మాధవ్ గాడ్గిల్ నేతృత్వంలోని వెస్టర్న్ ఘాట్స్ ఎక్స్పర్ట్ ఎకాలజీ ప్యానెల్ చాలాకాలం క్రితమే తీవ్రంగా హెచ్చరించింది. ఈ కీలక ప్రాంతంలో నిర్మాణాలను, మైనింగ్ కార్యకలాపాలను తక్షణం నిషేధించాలని ప్యానెల్ సిఫార్సు చేసింది. కానీ దేశంలోని మిగతా రాష్ట్రాల్లో మాదిరే కేరళ ప్రభుత్వం మాధవ్ గాడ్గిల్ నివేదికను అలా తోసిపుచ్చింది. దీని ఫలితమే పెను వరద బీభత్సం. భారతదేశం ప్రకృతి వైపరీత్యాలకు నిలయం. దేశ భూభాగంలో 70 శాతం మేరకు సునామీలకు, తుపానులకు నిలయంగా ఉంటోంది. దాదాపు 60 శాతం భూమి భూకంపాల బారిన పడుతుండగా, 12 శాతం వరదల బారిన పడుతోంది. కానీ పట్టణ భారత్‌లో మాత్రం బహుళ అంతస్థుల భవనాలను విచ్చలవిడిగా కడుతున్నారు. ఇవి భూమిపై వేస్తున్న అదనపు భారాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా భూకంపాలకు సంబంధించిన ఇంజనీరింగ్ కోర్సును దేశంలో అతికొద్ది యూనివర్సిటీలు మాత్రమే నిర్వహిస్తుండటం గమనార్హం. ప్రకృతి బీభత్సం ఇంత ప్రమాదకర స్థాయిలో చెలరేగుతున్నప్పటికీ నష్ట నివారణ ప్రక్రియ ఇప్పటికీ దేశంలో శైశవదిశలోనే ఉంటోంది. దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలు కూడా రిస్క్ మేనేజ్మెంట్ రంగంలో నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి సైనిక బెటాలియన్ల ఏర్పాటుతోపాటు ప్రత్యేక బృందాలను ఎర్పర్చుకోవాలని కేంద్ర హోంశాఖ 2003లోనే ప్రతిపాదించింది. ప్రత్యేకించి కేరళ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి శిక్షణా సంస్థను నెలకొల్పుకోవాలని, పోలీసు బెటాలియన్లను సిద్ధం చేసుకోవాలని హోంశాఖ సూచిం చింది కానీ నేటికీ కేరళ ప్రభుత్వం స్పందించలేదు. ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడంలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం. కేదార్నాథ్ విషాదం జరిగి ఏళ్లు గడిచిపోయినప్పటికీ ఉత్తరాఖండ్ రాష్ట్రం మూడు నుంచి ఆరు గంటల ముందే కారు మేఘాల గురించి, అతిభారీ వర్షాల గురించి హెచ్చరించే డాప్లర్ రాడార్ల వ్యవస్థను చాలా పరిమితంగానే కలిగి ఉంది. తగిన సంఖ్యలో హెలిపాడ్లు సరే సరి.. వరద తాకిడికి గురయ్యే ప్రాంతాల్లో నిర్మాణాలు ఎలా జరగాలో సూచించే మార్గదర్శక సూత్రాలు, వరద సమయాల్లో సురక్షిత ప్రాంతాలను గుర్తించే మ్యాప్‌లు కూడా తగినన్ని లేకపోవడం విచారకరం. పర్వతప్రాంతాల్లో భారీ డ్యామ్‌లకు ఆమోదముద్ర తెలిపినప్పటికీ జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ –ఎన్‌ఎమ్‌డీఏ– మూగపోయినట్లు కనిపిస్తోంది. భారత్‌లోని 5 వేల డ్యామ్‌లకు సంబంధించి అతి కొద్ది రాష్ట్రాలు మాత్రమే అత్యవసర కార్యాచరణ పథకాలతో సంసిద్ధంగా ఉన్నాయి. ఇంతవరకు 200 డ్యామ్‌లను మాత్రమే ఇవి కవర్ చేయడం గమనార్హం. మిగిలిన 4,800 డ్యాముల అతీగతీ లేదు. కేవలం 30 రిజర్వాయర్లు, బ్యారేజీలకు మాత్రమే వరద ప్రవాహం గురించిన అంచనాలు సిద్ధంగా ఉన్నాయి ప్రధాన నగరాల్లో వరద ప్రమాదాల గురించిన అంచనా, ఉపశమన చర్యల ప్రాజెక్టుల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిదని కాగ్ దుయ్యబట్టింది కూడా. ఇక వరద ప్రాంతాల్లో ధ్వంసమైన ఇళ్లకు చెల్లిస్తున్న నష్టపరిహార మొత్తం దేశమంతా ఒకే విధానంతో ఉండటం సమస్యలను రెట్టింపు చేస్తోంది. నష్టతీవ్రతకు అనుగుణంగా పరిహారం అందించకుండా సమానత్వ ప్రాతిపదికన రూళ్లకర్ర సిద్ధాం తాన్ని అమలు చేస్తే ప్రభావిత ప్రాంతాలు కోలుకోవడం చాలా కష్టం. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, మత్స్య పరిశ్రమలు, పశుసంపద, హస్తకళలు వంటి వాటికి జరిగిన నష్టంపై ప్రత్యేక దృష్టి పెట్టకపోతే అవి కుప్పగూలడం తథ్యం. అన్నిటికంటే ముఖ్యంగా విపత్తులు సంభవిం చినప్పుడు సైన్యం, పారామిలటరీ బలగాలను మాత్రమే తరలించే పద్ధతి వల్ల రాష్ట్రాల్లో వరద సహాయక చర్యలు కుంటినడకతో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశం బలమైన విపత్తు నిర్వహణా సంస్థను తక్షణం నెలకొల్పాల్సిన అవసరముంది. ఇప్పుడు కావలసింది ప్రకృతి వైపరీత్యాల అత్యవసర నిర్వహణపై దృష్టి సారించడమే కానీ తాత్కాలిక చర్యలతో సరిపెట్టుకోవడం కాదు. ఈ విషయంలో రాష్ట్రాల స్వావలంబన చాలా ముఖ్యం. వరుణ్‌గాంధీ వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు ఈ–మెయిల్ : fvg001@gmail.com -
సంపన్న ఎంపీలకు వేతనం ఎందుకు..?
లక్నో : రాజకీయ నాయకులంటే మాటలకే పరిమితం కాదని ఆచరణలో చూపారు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ. గత తొమ్మిదేళ్లుగా సుల్తాన్పూర్ ఎంపీ వరుణ్ గాంధీ తన వేతనాన్ని విరాళంగా ఇచ్చేస్తూ ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదు. గతంలో ఆయన సుల్తాన్‌పూర్‌లో ఓ రైతుకు రూ 2.5 లక్షల ఆర్థిక సాయం చేశారు. కర్ణావటి యూనివర్సిటీలో ఇటీవల విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించిన వరుణ్ గాంధీ సంపన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ జీతాలను వదులుకోవాలని తాను చేసిన విజ్ఞప్తిని ఏ ఒక్కరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ 25 కోట్లు మించి ఆస్తులను ప్రకటించిన ఎంపీలు, ఎమ్మెల్యేలందరికి తాను లేఖలు రాశానని, చట్ట సభ సభ్యుడిగా మీకు వచ్చే వేతనాలను మీరు ఎందుకు వదిలివేయకూడదని తాను కోరానని ఆయన చెప్పుకొచ్చారు. మనం ఇలా చేస్తే ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ 480 కోట్లు మిగులుతాయని ఇది పెద్ద మొత్తమేనని వారికి వివరించానన్నారు. తన లేఖకు బదులుగా ఏ ఒక్కరి నుంచి ప్రత్యుత్తరం రాలేదని చెప్పారు. తాను ఈ ప్రతిపాదనను తేవడంపై కొందరు ఎంపీలు తనపై ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. -
పోషకాహార లేమిలో ప్రథమస్థానం
భారతదేశంలోని లోతట్టు ప్రాంతాల నుంచి వినిపిస్తున్న ఆకలికేకలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌లోని లక్ష్మీపూర్‌కి చెందిన 13 ఏళ్ల బాలిక రెండురోజులపాటు ఆకలి దప్పులకు గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి చనిపోయాడు. రోజుకూలీ అయిన అమ్మకు పని దొరకలేదు. అదే వారం కేరళలో ఒక గిరిజన యువకుడు దుకాణం నుంచి కిలో బియ్యం అపహరించాడన్న మిషతో జనం అతడిని కొట్టి చంపారు. గ్లోబల్ క్షుద్బాధా సూచి 2017 అంచనా ప్రకారం భారత జనాభాలో దాదాపు 14.5 శాతంమంది పోషకాహార లేమితో బతుకుతున్నారు. మన పిల్లల్లో 21 శాతం మంది తీవ్రమైన పోషకాహార లేమితో బాధపడుతున్నారు. అయిదేళ్ల లోపు పిల్లల్లో 38.4 శాతం మంది ఎదుగుదల లేమితో అల్లాడుతున్నారు. అయిదేళ్లలోపు పిల్లల్లో 5 శాతం మంది ఆకలితో మరణిస్తున్నారు. విషాదం ఏమంటే మన దేశం లోని పిల్లల ఎత్తు సబ్ సహారన్ ఆఫ్రికా ప్రాంత పిల్లల ఎత్తుకంటే తక్కువగా ఉంటోంది. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల అనంతరం కూడా 25 కోట్ల మంది భారతీయులకు ఆహార భద్రత లేదు. రోజుకు 2,100 కేలరీల ఆహారం కూడా వీరికి లభించడం లేదు. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ప్లానింగ్ కమిషన్ ఓ సందర్భంలో భారత్ దుర్భిక్ష దేశంగా ఉండకపోవచ్చు కానీ దీర్ఘకాలిక క్షుద్బాధా దేశంగా ఉందంటూ వ్యాఖ్యానించింది. విధాన నిర్ణేతలు ఈ సమస్యను గుర్తించలేదని కాదు. పనికి ఆహార భద్రత బిల్లుతోసహా గత దశాబ్ద కాలంలో సుప్రీంకోర్టు దేశప్రజలకు ఆహార భద్రత కల్పనపై 60 ఆదేశాలు జారీ చేసింది. కానీ న్యాయవ్యవస్థ క్రియాశీలత సైతం వీటిని క్షేత్రస్థాయిలో అమలు చేయించడంలో విఫలమైంది. దీనికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి. చట్టాలను విస్తృ తంగా చేపడుతున్నప్పటికీ, దేశవ్యాప్తంగా మెరుగైన ఆహార సరఫరాకు వీలిచ్చే సంస్కరణలను వ్యవస్థాగతంగా అమలు చేయడంలో వైఫల్యం. మన ఆహార విధానం తృణధాన్యాలను అందుబాటులో ఉంచడం పైనే శ్రద్ధ చూపుతోంది కానీ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాత్రం మన దేశ వ్యవసాయ ఉత్పత్తుల మిగులును గిడ్డంగుల్లోనే దాచి ఉంచుతూ అవి చెడిపోయేలా చేస్తోంది. చివరకు మహిళల సామాజిక స్థాయిని తగ్గించే సంస్కృతి వల్ల వారు పోషకాహార లేమిలో మగ్గుతున్నారు.పైగా బహిరంగ మలవిసర్జన స్త్రీలు, పిల్లల ఆరోగ్యాలను కూడా దెబ్బతీస్తోంది. ఈ సమస్య పరిష్కరించలేనిది కాదు. ప్రపంచంలో అనేక దేశాలు దీనికి పరిష్కారం చూపిం చాయి. భారతదేశంలాగే దక్షిణాఫ్రికా కూడా ఆహార హక్కుకు హామీ కల్పించింది. బ్రెజిల్ అయితే దేశ ప్రజలందరికీ రోజుకు మూడు సార్లు భోజనం అందించే పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీని కోసం ఆ దేశం 32 ఆహార సంక్షేమ పథకాలను చేపట్టింది. ఆకలిని మానవ హక్కుల ఉల్లంఘనగా భావిస్తూ న్యాయస్థానాల్లో వాదించడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా బ్రెజిల్ అనుమతించింది. ఇక ఉగాండా అయితే విశిష్ట పథకాన్ని చేపట్టింది. కుటుంబానికి ఆహార భద్రత కల్పించడం కుటుంబ పెద్ద బాధ్యతగా చేస్తూ కుటుంబ సభ్యులు పోషకాహార లేమికి గురైతే కుటుంబ పెద్దకే జరిమానా విధించే చట్టపరమైన బాధ్యతను మోపింది. మరోవైపున పట్టణ కేంద్రాల్లో సబ్సిడీ ధరలకు ఆహారాన్ని అందించే పథకాన్ని కూడా ఆదేశం అమలు చేస్తోంది. భారతదేశంలోని పలు రాష్ట్రాలు ప్రజా పంపిణీ వ్యవస్థను పునర్నిర్మించడం ద్వారా ఆహార భద్రతను మెరుగుపర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ మన ఆహార గిడ్డంగులలో 30 లక్షల టన్నుల ధాన్యాలను ఇప్పటికీ నిలవ ఉంచుతున్నాం కానీ ఇవి వర్షాలు, పురుగుల బారిన పడుతున్నాయి. మనం నిల్వ ఉంచిన ఆహార ధాన్యాలు ఒక మధ్యస్థాయి యూరప్ దేశానికి తిండి పెట్టడానికి సరిపోతాయి. పేదలకు మరింతగా ఆహార ధాన్యాలు అందించడం ఒక ఎల్తైతే, దుబారా, అవినీతిని అరికట్టటం ఒకెత్తుగా ఉంటోంది. ఇటీవలి గతంలో కూడా కుటుం బం వారీగా లబ్ధిదారులకు గోదుమ, వరిధాన్యాల్లో 44 శాతం మేరకు అందడం లేదని సర్వే. దేశంలో రెండేళ్ల లోపు వయసు పిల్లల్లో ఎదుగుదల సమస్యను అరికట్టడానికి బ్రెజిల్లో లాగా జీరో హంగర్ పథకాన్ని చేపట్టాల్సిఉంది. దీనికి వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపర్చడం, మహిళల సాధికారతను పెంచడం, పోషకాహార విద్య, సామాజిక రక్షణ పథకాలు వంటి బహుముఖ చర్యలను చేపట్టాల్సి ఉంది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఈ దిశగా కొన్ని చర్యలు చేపట్టాయి. వచ్చే దశాబ్దిలోపు దేశం నుంచి ఆకలిని నిర్మూలించే దిశగా దీర్ఘకాలిక రాజకీయ నిబద్ధతను మన పాలకులు ప్రదర్శించడంతోపాటు ఆహార కూపన్లను, నగదు మార్పిడి వంటి పధకాలను కూడా చేపట్టాలి. ఎన్ని పథకాలు ఉన్నా అమలు విషయంలో అలసత్వం ప్రదర్శించి నంత కాలం భారత్ క్షుద్బాధా దేశంగానే కొనసాగక తప్పదు. వ్యాసకర్త: వరుణ్ గాంధీ, పార్లమెంటు సభ్యులు ఈ–మెయిల్ : fvg001@gmail.com -
ప్రమాదంలో మీడియా స్వేచ్ఛ
పత్రికా స్వాతంత్య్రానికి ప్రమాదం, బెదిరింపులు అనేవి జర్నలిజం ప్రారంభ కాలం నుంచే మొదలవుతూవచ్చాయి. ఇవాళ, ప్రెస్పై అలాంటి దాడులు చిన్న చిన్న పట్టణాల్లో కూడా సర్వసాధారణమై పోయాయి. ప్రపంచ స్వేచ్ఛా సూచిక (రిపోర్ట్స్ వితౌట్ బోర్డర్స్, 2017)లో భారత్ స్థాయి 3 స్థానాలు పతనమై 136కి దిగ జారింది. దక్షిణాసియాలోనే అత్యంత స్వేచ్ఛాయుత మైన దిగా భారత్ మీడియాను పరిగ ణిస్తుంటాం. కానీ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలను చూస్తే మన మీడియా పాక్షికంగానే స్వేచ్ఛను కలిగి ఉన్నట్లు భావించాలి. గత ఏడాది దేశంలో 11 మంది జర్నలిస్టులు హత్యకు గురికాగా, 46 దాడులు జరిగాయి. పోలీసు స్టేషన్లలో విలేకరులపై 27 కేసులు నమోద య్యాయి. ఇవన్నీ క్షేత్రస్థాయిలో వార్తలను నివేదించిన సందర్భాల్లో జర్నలిస్టులకు ఎదురైన చిక్కులు మాత్రమే. 2017 సెప్టెంబర్ 5న బెంగళూరులో గౌరీ లంకేష్ హత్య ఘటన, పత్రికా స్వేచ్ఛ గురించి డబ్బా వాయిం చేవారిని తమ పగటి కలలనుంచి బయటపడేసింది. ఇలాంటి ఘటనలు దేశంలో సాధారణమైపోయాయి. గౌరీ లంకేష్ హత్య జరిగిన 2 రోజుల తర్వాత బిహార్ లోని అర్వాల్ జిల్లాలో రాష్ట్రీయ సహారా విలేకరి పంకజ్ మిశ్రాను బైక్‌మీద వచ్చిన ఇద్దరు హంతకులు కాల్చి చంపారు. గత దశాబ్ద కాలంలో జర్నలిస్టులను హత్య చేసినవారు ఏ శిక్షా లేకుండా తప్పించుకున్న వారి శాతం నూటికి నూరు శాతం పెరిగింది. 2016 గ్లోబల్ ఇంప్యు నిటీ ఇండెక్స్ (జర్నలిస్టుల సంరక్షణ కమిటీ) ప్రకారం భారత్ 13వ స్థానంలో ఉండటం హేయం. పత్రికా స్వాతంత్య్రానికి ప్రమాదం, బెదిరింపులు అనేవి జర్నలిజం ప్రారంభ కాలం నుంచే మొదలవుతూ వచ్చాయి. 1857 ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామ కాలంలోనే బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కన్నింగ్ గ్యాగింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ముద్రణా సంస్థల ఏర్పాటు, అవి ఏం ముద్రిస్తున్నాయి, సంబంధిత లైసెన్సులు వంటి వాటిని ప్రభుత్వమే ఈ చట్టం ప్రాతిపదికన క్రమబద్ధీక రిస్తూ వచ్చింది. బ్రిటిష్ రాజ్‌కు వ్యతిరేకంగా దేన్ని ప్రచురించినా ప్రభుత్వ ఉల్లంఘనగా పరిగణించారు. 1876–77 ధాతుకరువు గురించి స్థానిక పత్రికలు వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించిన ప్పుడు ప్రెస్ యాక్ట్ 1878ని తీసుకొచ్చి అమర్ బజార్ పత్రికతో సహా 35 స్థానిక పత్రికలపై చర్యలు తీసుకున్నారు. వలసప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకుగాను బాల గంగాధరతిలక్నే రెండుసార్లు జైల్లో పెట్టారు. ఇవాళ, ప్రెస్పై అలాంటి దాడులు చిన్న చిన్న పట్ట ణాల్లో కూడా సర్వసాధారణమై పోయాయి. ప్రాంతీయ పత్రికలు లేదా చానల్స్‌లో ఫ్రీలాన్స్ ప్రాతిపదికన పని చేస్తున్న విలేకరులే చాలావరకు బాధితులుగా మిగులు తున్నారు. స్టూడియోలో లేక పత్రికాఫీసులలో పనిచేసే వారి కన్నా క్షేత్రస్థాయిలో పనిచేసే విలేకరులే దాడుల పాలవుతున్నారు. ఒడిశాలో జీడిమామిడి ప్రాసెసింగ్ ప్లాంటులో బాలకార్మికులపై వార్త రాసి పంపిన తరుణ్ ఆచార్యను 2014లో కత్తుల్తో పొడిచారు. పంజాబ్ ఎన్ని కల నేపథ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించిన కారణంగా జర్నలిస్టు దేవిందర్ పాల్‌పై మద్యం బాటిల్స్‌తో దాడి చేశారు. ఇక అదే సంవత్సరం మార్చి 14న ఒక పాత్రి కేయురాలిపై సామూహిక అత్యాచారం జరిపారు. చట్టపరమైన రక్షణ పరిమితం కావడంతో పత్రికా స్వేచ్ఛ గణనీయస్థాయిలో ఆంక్షలకు గురవుతోంది. ఆన్ లైన్ దాడులు, లీగల్ నోటీసులు, సెక్షన్ 124 (ఎ) కింద జైలుకు పంపే ప్రమాదం వంటివాటితో పత్రికా స్వేచ్ఛ మరింత ప్రమాదంలో పడుతోంది. తమపై వ్యాఖ్యలు చేస్తున్న విలేకరులపై రాజకీయనేతలు, సెలబ్రిటీలు పరువు నష్టం కేసులు పెట్టడం సహజమైపోయింది. 1991–96 మధ్యలో జయలలిత ప్రభుత్వం ఒక్క తమి ళనాడులోనే 120 పరువు నష్టం కేసులు పెట్టింది. ఒక అనుకరణ ప్రదర్శనలో జయలలిత దుస్తులు ధరించి వచ్చినందుకు టెలివిజన్ యాంకర్ సైరస్ బరూచాపై కేసు పెట్టారు. చిన్న, మధ్యతరహా మీడియా సంస్థలు జర్నలిస్టులపై కేసులను పట్టించుకోక పోవడంతో కాసింత రక్షణ కూడా కోల్పోతున్నారు. క్రిమినల్ స్వభావం ఉన్న పరువునష్టం కేసులను రద్దు చేయడంపై జర్నలిస్టులు పోరాడాలి. అప్పుడే స్థానిక, ప్రాంతీయ పత్రికల విలేకరులు పరువునష్టం కేసుల భయం లేకుండా విధులు నిర్వర్తించే వీలుంది. సైద్ధాంతికంగా పత్రికా స్వేచ్ఛ అనేది అవధులు లేని పరిపూర్ణ భావన. కానీ ప్రస్తుత రాజ్యాంగ వ్యవస్థ పత్రికాస్వేచ్ఛపై గణనీయంగా ఆంక్షలు విధిస్తోంది. అధి కారిక రహస్యాల చట్టం దేశ రక్షణకు చెందిన వ్యవహా రాలపై వార్తలు రాయడాన్ని కూడా నిషేధిస్తోంది. పార్ల మెంట్ కనీసంగానైనా జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని తీసు కొచ్చి దేశద్రోహ చట్టాన్ని వారిపై ప్రయోగించ కూడా కట్టడి చేయడం అత్యవసరం. ఇతర దేశాల్లో పాత్రికేయు లకు రక్షణ కల్పిస్తూ రాజ్యాంగంలో మార్పులు చేస్తు న్నారు. జర్నలిస్టులు మొదట పంపిన వార్తా కథనాల్లో ఏవైనా అతిశయోక్తులు ఉంటే వాటిని తొలగించుకోవడా నికి, మార్పులు చేయడానికి కూడా కొన్ని దేశాల్లో అవ కాశమిస్తూ వారిని చట్టం కోరల నుంచి బయటవేసేలా చట్టాలు చేస్తున్నారు. జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నందున, కీల కాంశాలపై నాణ్యమైన, పరిణామాత్మకమైన కథనాలకు అవకాశాలు రానురాను హరించుకుపోతున్నాయి. బార్ కౌన్సిల్ లాగే భారత పత్రికా మండలి కూడా జర్నలిస్టుల స్థాయిని పెంచేందుకు, రక్షణ కల్పించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. జర్నలిస్టుల్లో అనైతిక, వృత్తి వ్యతిరేక ప్రవర్తనను అదుపు చేసే చర్యలు చేప ట్టాలి. అదేసమయంలో అన్ని రకాల మీడియాలకు మరింత రక్షణ కల్పించకపోతే, ప్రజాస్వామ్యం బల హీనపడే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యం భవిష్యత్తు కోసం జర్నలిస్టుల భద్రత విషయంలో ఏ మాత్రం రాజీపడకూడ దన్నదే కీలకం. వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు వరుణ్ గాంధీ fvg001@gmail.com -
ధనిక ఎంపీలు జీతాలు వదులుకోవాలి
న్యూఢిల్లీ: ధనిక పార్లమెంట్ సభ్యులు తమ జీతభత్యాలను వదులుకొని సరికొత్త ఉద్యమానికి నాంది పలకాలని బీజేపీ పార్లమెంట్ సభ్యుడు వరుణ్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చొరవ తీసుకోవాలని కోరారు. తద్వారా ప్రజాప్రతినిధులపై ప్రజలకు మరింత విశ్వాసం కలుగుతుందని, దేశవ్యాప్తంగా సానుకూల సంకేతం పంపినట్లవుతుందని స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని.. ప్రజాస్వామ్యానికి ఇది హానికర పరిణామమని హెచ్చరించారు. దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితులకు ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాలన్న వరుణ్.. ఇలాంటి నిర్ణయాలు కొంతమంది ఎంపీలకు ఇబ్బంది కలిగించవచ్చన్నారు. రూ.కోటి కన్నా ఎక్కువ ఆస్తులున్న ఎంపీలు ప్రస్తుతం 449 మంది ఉన్నారని, 132 మంది ఎంపీలు తమ ఆదాయం రూ.10 కోట్లకుపైగా ఉన్నట్లు ప్రకటించారన్నారు. -
దిగజారుతున్న విలువలు
సందర్భం పార్లమెంట్ చర్చలు అంటే శిఖరప్రాయులైన వక్తలు, అద్భుత వాదనా పటిమ, నిఖార్సయిన గణాంకాలు, గౌరవప్రదమైన ముగింపు అనే రోజులు పోయాయి. ఇప్పుడది పరస్పర ఘర్షణగా, దూషణల పర్వంగా దిగజారిపోయింది. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భద్రతకోసం ఒక రోజుకు రూ. 25వేలు ఖర్చుపెడుతున్నారంటూ రామ్మనోహర్ లోహియా 1963లో ఒక కరపత్రం రాశారు. అప్పట్లో రోజుకు 3 అణాపైసలపై బతుకీడుస్తున్న భారతీయ నిరుపేదల రోజువారీ దుర్భర జీవి తంతో పోలిస్తే ఇది చాలా పెద్ద వ్యత్యాసం. తర్వాత నెహ్రూ దానిపై పార్లమెంటులో చర్చిస్తూ, ప్రణాళికా సంఘం గణాంకాలను ప్రస్తావిస్తూ భారతీయుల రోజు వారీ ఆదాయం 15 అణాపైసలుగా ఎత్తిచూపారు. ఈ సందర్భంగా ఆర్థిక అసమానతలకు సంబంధించి లోహియా, నెహ్రూ గొప్ప చర్చకు నాంది పలికారు. ఈ మేటి చర్చకు ముగింపు పలకడం కోసం ఏంపీలు సీరియస్‌గా చర్చించారు. కానీ ఆ చర్చ అత్యంత నాగరిక రీతిలో సాగింది. శిఖరప్రాయులైన వక్తలు అత్యద్భుత వాదనా పటిమతో, నిఖార్సయిన గణాంకాలతో తమతమ వాదనలను వినిపించారు తప్పితే మొత్తం చర్చాక్రమంలో చిన్న అంతరాయం కానీ, దూకుడుతనాన్ని కానీ ప్రదర్శించడం జరగలేదు. కాని మన రాజకీయ చర్చలు క్రమేణా దిగజారుతూ వచ్చాయి. అలాగే హిందూ న్యాయ స్మృతి బిల్‌ని చూడండి. 1948లో బీఆర్ అంబేడ్కర్ ఆధ్వర్యంలో ఎంపిక కమిటీ రూపొందించిన దీని ముసాయిదా అత్యంత వివాదాస్పదమైంది. అది హిందువులు, జైనులు, బౌద్ధులు, ఆదివాసులకు వర్తించే పర్సనల్, స్థానిక పౌర చట్టాలను క్రోడీకరించిన చట్టంతో మార్చడానికి చేసిన ప్రయత్నం. కులానికి ఉన్న చట్టపరమైన ప్రాధాన్యతను తగ్గించడం, విడాకులను సులభతరం చేయడం, వితంతువులకు, మహిళలకు కూడా ఆస్తి హక్కులో భాగం కల్పించడం ఈ బిల్లులో ముఖ్యాంశాలు. హిందూ కోడ్ బిల్లుపై చర్చను ప్రారంభించిన మోషన్ తీర్మానంపై 50 గంటలపాటు చర్చ జరిగింది. పార్లమెంటులో, డాక్టర్ రాజేంద్రప్రసాద్ వంటి ప్రముఖులు సైతం ఈ బిల్లును రౌలట్ చట్టంతో పోల్చారు. కొంతమంది సభ్యులు హిందూ మతమే ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో అంబేడ్కర్ వంటివారు హిందూ సమాజం కాలానుగుణంగా పరిణమించాలని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీలు చేసిన గొప్ప ప్రసంగాలు పార్లమెంటుకే ప్రమాణంగా నిలిచిపోయాయి. 1949 నవంబర్‌లో అంబేడ్కర్ ‘అరాజకపు వ్యాకరణం’పై చేసిన ప్రసంగం.. ఇకనుంచి సహాయ నిరాకరణ, సత్యాగ్రహం, శాసనోల్లంఘన వంటి పోరాటరూపాలను పరి త్యజించాలని చెప్పడమే కాకుండా, సామాజిక, ఆర్థిక లక్ష్యాల సాధన కోసం రాజ్యాంగ విధానాలను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. తర్వాత భారత్ తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించిన సందర్భంలో ప్రముఖ పార్లమెంటేరియన్ పీలూ మోడీ, నాటి ప్రధాని ఇందిరాగాంధీని గుచ్చి గుచ్చి అడుగుతూ, ‘మేడమ్ ప్రైమ్ మినిస్టర్, మన శాస్త్రజ్ఞులు సాంకేతికరంగంలో గొప్ప విజయాలు సాధిస్తున్నారు. కానీ మన టెలిఫోన్లు ఎందుకు పనిచేయడం లేదో మీరు వివరిస్తే మేమంతా కాస్త సంతోషపడతాం’ అన్నారు. స్వాతంత్య్రానంతర భారత్ ఒక రకంగా చూస్తే అదృష్టవంతురాలు అనే చెప్పాలి. నెహ్రూ, పటేల్, లోహియా వంటి దిగ్గజ నేతలు దూషణలకు తావు లేకుండా అనేక అంశాలపై చర్చకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజాస్వామిక అభినివేశాన్ని ప్రోత్సహించాలని చూసేవారు. నెహ్రూ నుంచి వాజపేయి దాకా పార్లమెంటు కార్యకలాపాలను భక్తిభావంతో కొనసాగించడం కోసం అనేక ఉత్తమ సంప్రదాయాలను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి, శాసన సంబంధమైన లక్ష్యాల సాధనపై వీరు ప్రముఖంగా దృష్టి పెట్టేవారు. ఒకప్పుడు అద్భుత ప్రసంగాలకు, వాదనాపటిమకు తావిచ్చిన మన పార్లమెంటరీ చర్చాప్రక్రియ జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, సమస్యలపై ప్రత్యేక దృష్టిని పెట్టింది. ఈ చర్చా సంప్రదాయాన్ని వారసత్వంగా స్వీకరించడానికి బదులుగా, రానురానూ ఎంపీలు వాగాడంబరత్వానికి, అరువుతెచ్చుకున్న పదప్రయోగాలకు దిగజారిపోయారు. మృదు చర్చల స్థానంలో దూకుడుతనం ప్రవేశించింది. మన పార్లమెంటు ఎలాంటి చారిత్రక క్షణాలను ఆస్వాదించిందో ఒక్కసారి చూద్దాం. రాజాజీ ఒకసారి లోక్‌సభలో ప్రవేశపెట్టిన సవరణను సభ తిరస్కరించినప్పుడు నెహ్రూ ప్రసంగిస్తూ, ‘మెజారిటీ నా వైపే ఉంది రాజాజీ’ అన్నారు. దానికి రాజాజీ జవాబిస్తూ, ‘మెజారిటీ మీవైపే ఉండవచ్చు నెహ్రూజీ, కానీ తర్కం నా వైపే నిలిచింది’ అన్నారు. ప్రస్తుత పార్లమెంటులో ప్రమాణాలు పూర్తిగా అడుగంటిన చర్చాప్రక్రియను చూస్తుంటే పరస్పర ఘర్షణగా, రాత్రి 8 గంటల వార్తాప్రసార పోరాటాల స్థాయికి దిగ జారిపోయినట్లు అనిపిస్తుంది. ఒకప్పుడు పార్లమెంటులో రాకెట్ ప్రయోగాల గురించి చర్చ సాగితే ఇప్పుడు పురాతన చరిత్రపై ఏకపక్ష ప్రదర్శన జరుగుతోంది. ఒకప్పుడు గౌరవనీయ కళగా సాగిన రాజకీయ వాక్పటిమ నెహ్రూ, బర్క్, చర్చిల్ వంటి గొప్ప వక్తలను రూపొందించింది. ఇప్పుడు ఎన్నికలను ఎదుర్కోవడమే ప్రధానమైపోయింది. ఈ నేపథ్యంలో మురికి రాజకీయ తెట్టును శుద్ధి చేయాలంటే ఉత్తమశ్రేణి పార్లమెంటేరియన్లు మళ్లీ ఆవి ర్భవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరుణ్ గాంధీ వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు ఈ–మెయిల్ : fvg001@gmail.com -
కాంగ్రెస్‌లోకి వరుణ్ గాంధీ..?
న్యూఢిల్లీ: తన సోదరుడు, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీని తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తా కథనాలు వెలువడుతున్నాయి. వరుణ్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుణ్ గాంధీకి ముఖ్యమంత్రి అయ్యే నాయకత్వ లక్షణాలున్నా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కావాలనే ఆయనను పక్కన పెట్టిందని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు అనంతరం ముఖ్యమంత్రిగా వరుణ్ పేరును ప్రకటిస్తారని బీజేపీ కార్యకర్తలు అనుకున్నారని యూపీ కాంగ్రెస్ నాయకుడు జమీలుద్దీన్ చెప్పారు. కానీ, బీజేపీ నాయకత్వం యోగి ఆదిత్యనాథ్‌కు ఆ పదవిని కట్టబెట్టిందన్నారు. వరుణ్‌కు ఫాలోయింగ్ ఉన్నా ఆయనను కీలక స్థానంలో కూర్చొబెట్టడం ఇష్టం లేకే బీజేపీ ఇలా చేసిందని వ్యాఖ్యానించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల నాటికి వరుణ్ గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి చేరతారని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత మంజూర్ అహ్మద్ జోస్యం చెప్పారు. రాహుల్, వరుణ్‌లు ఇరువురూ కలసి కాంగ్రెస్‌ను ముందుకు నడిపిస్తారని అన్నారు. ప్రియాంక వాద్రాతో వరుణ్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. వరుణ్‌ను పార్టీలోకి తీసుకురావడంలో ఆమె కీలకపాత్ర పోషించనున్నారని వెల్లడించారు. మరోవైపు రాజకీయ నిపుణులు మాత్రం వరుణ్ కాంగ్రెస్‌లో చేరబోరని అంటున్నారు. బీజేపీ కేబినేట్లో మనేకా గాంధీ ఉండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. అంతేకాకుండా సోనియా గాంధీకి మనేకా కుటుంబంతో విభేదాలు కూడా ఉన్నాయి. -
కురువృద్ధ నేతల రాజకీయం
ప్రపంచంలో కొన్ని దేశాల్లో అతి పిన్న వయసులోనే ప్రధానమంత్రులు, దేశాధ్యక్షులుగా యువత ఎదుగుతుండగా భారత్‌లో వృద్ధ రాజకీయాలు బలంగా కొనసాగుతుండటం గమనార్హం. తరుణ భారత్‌కు తరుణ నేతలు ఎంతో అవసరం. ఆస్ట్రియా నూతన చాన్సలర్ సెబాస్టియన్ కుర్జ్ వయస్సు కేవలం 31 సంవత్సరాలు. న్యూజి లాండ్ నూతన ప్రధానమంత్రి జసిందా ఆర్డెర్న్ వయస్సు 37 సంవత్సరాలు మాత్రమే. పైగా ఈమె ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా నేత. ఇక టోనీ బ్లెయిర్, డేవిడ్ కేమరూన్ 43 ఏళ్ల ప్రాయంలో బ్రిటన్ ప్రధానులయ్యారు. 39 ఏళ్ల ఎమాన్యువల్ మెక్రాన్ ఇప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పార్టీ సగటు ఆయుర్దాయం కేవలం 43 సంవత్సరాలు మాత్రమే. రాజకీయ పార్టీల వయో దుర్బలత్వంతో ఓటర్లు విసిగిపోతుండటంతో అలాంటి పార్టీలన్నీ మనగలగడానికి కొత్త రక్తాన్ని తీసుకువచ్చి అధికారం కట్టబెడుతున్నారు. కానీ భారత్‌ను చూస్తే సీనియారిటీపట్ల, అధికారపు దొంతరపట్ల విధేయతను కొనసాగిస్తూ రాజకీయ పార్టీలు గడ్డకట్టుకుపోయినట్లు కనపడుతోంది. 2014లో, మన ప్రస్తుత పార్లమెంటులో 30ఏళ్ల వయస్సులోపు ఉన్న ఎంపీలు 12 మంది మాత్రమే. ఇక 55 ఏళ్ల ప్రాయంలో ఉన్న ఎంపీలు 53 శాతంమంది కాగా, ఎంపీల సగటు వయస్సు 50ఏళ్లకు పైబడి ఉంది. (బీజేపీ సగటు ఎంపీల వయస్సు 54 ఏళ్లుకాగా, కాంగ్రెస్ ఎంపీల వయస్సు 57 ఏళ్లు) జనాభాలో యువత శాతం పెరుగుతుండగా (మన యువత సగటు వయస్సు 25 ఏళ్లు), మన పార్లమెంటు సభ్యుల వయస్సు మాత్రం పెరుగుతోంది. తొలి లోక్‌సభ సగటు వయస్సు 46.5 ఏళ్లు కాగా, 10వ లోక్‌సభ నాటికి ఇది 51.4 ఏళ్లకు పెరిగింది. ఇక రిటైర్మెంటుకు దగ్గరపడిన రాజకీయ నేతలు వానప్రస్థ జీవితాన్ని జాప్యం చేస్తూ అధికారపు అంచులను పట్టుకుని వేలాడుతున్నారు. ఇతరులు తమ వారసులు ఎదిగి వచ్చేంతవరకు తమ పదవులను అంటిపెట్టుకుని ఉంటున్నారు. దీని ఫలితంగా భారత రాజకీయ పార్టీలలో చాలావరకు కుటుంబ వ్యాపారంలో ఉంటున్నాయి. రాజకీయ సాధికారత మన సమాజంలో పెద్దల ఇలాకాగా మారిపోయింది. అయితే దీంట్లోనూ మినహాయింపులున్నాయి. పలు సందర్భాల్లో, ప్రధానంగా రాజకీయ వారసత్వం కారణంగా కొంతమంది యువనేతలను బాధ్యతాయుత స్థానాల్లోకి ప్రోత్సహిస్తున్నారు. కానీ వీరి సంఖ్య తక్కువే. భారత రాజకీయాల్లో కొనసాగుతున్న ఈ పురాతన సంప్రదాయం కారణంగా నేను కూడా లబ్ధి పొందాను. అయితే రాజకీయ పార్టీలు భారతీయ యువతకు సభ్యత్వం ఇవ్వడం లేదని దీని అర్థం కాదు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు తమవైన యువజన, విద్యార్ధి సంఘాలు ఉంటున్నాయి. కానీ రాజకీయాల్లో వారి పెరుగుదల తగ్గుతున్నట్లు కనబడుతోంది. కొన్ని రాజకీయ పార్టీలు 75 ఏళ్లను రిటైర్మెంటుకు తగిన వయస్సుగా నిర్ధారించుకోవడం అభిలషణీయమే అయినా ఈ దిశగా చేయవలసింది చాలానే ఉంది. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం ఇప్పుడు సంపద, వారసత్వం, పరిచయాలు వంటివాటిపై ఆధారపడి ఉంది. పోతే, యువతను, వ్యక్తులను సాధికారతవైపు తీసుకోవడానికి ఇతర మార్గాలు ఉన్నాయి. సెర్బియా ఈ దిశగా 500 మంది యువ రాజకీయ నేతల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్మించడం కోసం యువ నేతలను గుర్తించి, ఎంపిక చేయడం ద్వారా యువత రాజకీయ భాగస్వామ్యం చేపట్టడాన్ని వేగవంతం చేస్తున్నారు. యంగ్ పొలిటికల్ లీడర్స్ ప్రోగ్రాం (యుఎన్‌డీపీ) 2.6 మిలియన్ డాలర్లతో ఒక జాతీయ యువ పౌర విద్యా కేంపెయిన్‌ను అమలు చేసింది. రాజకీయాల్లో యువ నేతల ఎంపిక దిశగా వారి వైఖరులలో మార్పు తీసుకురావడం, పౌరసమాజ విజ్ఞానాన్ని, కౌశలాలను పెంచడం దీని లక్ష్యం. కెన్యా అయితే 2001 నుంచి యువ రాజకీయ నాయకత్వ అకాడెమీని నిర్వహిస్తోంది. చర్చలు, సలహాలు వంటి అంశాలపై పార్టీలకు అతీ తంగా నిపుణతలను పొందడం, వాటిని తమ తమ పార్టీలలో అమలు చేయడానికి కృషి చేసేలా యువతను తీర్చిదిద్దుతున్నారు. యూనిసెఫ్ 2010, 2013 సంవత్సరాల మధ్యన కోసావోలో ఇన్నోవేషన్స్ ల్యాబ్ సంస్థకు నిధులు సమకూర్చింది. 2007–2009 మధ్య కాలంలో ఆసియన్ యంగ్ లీడర్స్ ప్రోగ్రాంకి యుఎన్‌డిపి ఆతిథ్యమిచ్చింది. జాతీయ, ప్రాంతీయ వర్క్‌షాపుల సమ్మిశ్రణ ద్వారా యువ ఆసియా నేతల్లో నాయకత్వ కుశలతలను పెంపొందించడం దీని లక్ష్యం. ఇలాంటి కార్యక్రమాలతోపాటు వ్యవస్థాగత జోక్యం కూడా తగువిధంగా తోడ్పడుతుంది. ప్రస్తుతం అనేక దేశాలు (మొరాకో, పాకిస్తాన్, కెన్యా, ఈక్విడార్ వగైరా) తమ చట్టసభల్లో యువనేతలకు నిర్దిష్టంగా చోటు కల్పిస్తున్నాయి. జాతి, కుల ప్రాతిపదిక బృందాలకు రిజర్వేషన్లు అందిస్తుండగా యువతకు వాటిని ఎందుకు కల్పించకూడదు? ఉదాహరణకు ఈక్వడార్, ఎల్‌సాల్వడార్, సెనెగల్, ఉగాండా, బురుండి వంటి ఇతర దేశాలు కూడా అన్ని చట్టసభల ఎన్నికలకు కనీస వయో పరిమితిని 18 ఏళ్లకు కుదించాయి. బోస్నియాలో ఎన్నికల్లో ఏ అభ్యర్థికీ ఆధిక్యత రాకపోతే అలాంటి స్థానాలను పోటీచేసిన వారిలో పిన్న వయస్కులకు కేటాయించాలని ఎన్నికల చట్టంలోని అధికరణం 13.7 ద్వారా నిర్దేశించింది. 18 ఏళ్ల వయసుకొస్తున్న యువత బాధ్యతలు నిర్వహించేలా ప్రోత్సహించడానికి ఎల్‌సాల్వెడార్ తన పాఠశాలల్లో కేంపెయిన్లు నిర్వహిస్తోంది. ఇక కెన్యా 2006లో జాతీయ వయోజన విధానాన్ని, 2009లో జాతీయ యువజన చట్టాన్ని ప్రకటించింది. ఈ రెండూ ఎన్నికల్లో మరింతగా పాల్గొనేలా యువతను ప్రోత్సహిస్తున్నాయి. వీటికి అదనంగా మన రాజకీయ వ్యవస్థ యువత రాజకీయ సాధికారతకు అనేక అవకాశాలను ప్రతిపాదించాల్సి ఉంది. క్షేత్ర స్థాయిలో అనుభవం కలిగిన వారు నేతలుగా ఎదగడానికి వారికి మునిసిపల్, పంచాయతీ ఎన్నికల్లో అవకాశం కల్పించాలి. ఇలాంటి నేతలు కాస్త అనుభవం పొందాక రాష్ట్రస్థాయిలో, కేంద్ర స్థాయి చట్టసభల్లో స్థానాలకు కూడా పోటీ పడగలరు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామిక వ్యవస్థల్లో నాయకులు ఇలాగే ఎదుగుతున్నారు. కానీ అంతర్గత పార్టీ ప్రజాస్వామ్యం క్షీణించడం, మునిసిపల్, పంచాయతీ, కార్పొరేషన్ ఎన్నికల్లో రిజర్వేషన్‌ను వంతుల ప్రకారం మార్చడం, ఎన్నికల ఖర్చు పెరగడం వంటివి యువనేతల ఆశలకు అవరోధాలను కలిగిస్తున్నాయి. రాజకీయ పార్టీలు తమ వంతుగా రాజకీయ నేపథ్యంలేని యువతకు రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి వృత్తి నిపుణులను రప్పించడానికి చొరవ తీసుకోవాలి. తరుణ భారత్ ఏం కోరుకుం టోంది, తమ ఆశలు, ఆకాంక్షలు ఏమిటి అనే అంశంపై యువ రాజకీయ నేతలకు అవగాహన ఉంటుంది. ఇలాంటి నేతలకు ప్రతిభ ఆధారంగా ఎదిగించే విషయంలో రాజకీయ పార్టీలు తగు చోటు కల్పించాలి. - వరుణ్ గాంధీ వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, fvg001@gmail.com -
నా ఇంటిపేరు ‘గాంధీ’ కాకపోయి ఉంటేనా...
గువాహటి : భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఇంటి పేరు కనుక గాంధీ కాకపోయి ఉంటే 29 ఏళ్లకే తాను ఎంపీని అయి ఉండేవాడినా? అని ఆయన ప్రశ్నించారు. గువాహటిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ సుల్తాన్పూర్ ఎంపీ పై వ్యాఖ్యలు చేశారు. ‘‘నా పేరు ఫెరోజ్ వరుణ్ గాంధీ. ఇంటిపేరులో గాంధీ లేకపోయి ఉంటే నేను ఇప్పుడు ఎక్కడ ఉండేవాడినో అందరికీ తెలుసు. ఇంటి పేరు,పేరు ప్రతిష్ఠలు ముఖ్యం కాదన్న ఆయన.. ప్రజలందరికీ సమానహక్కులు లభించాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు. అటువంటి దేశాన్నే తాను చూడాలనుకుంటున్నట్టు చెప్పారు. ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వారిని తొలగించే హక్కు ప్రజలకు ఇవ్వాలని సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఇందుకోసం 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని(ప్రైవేట్ బిల్లు ద్వారా) సవరించాలని వరుణ్ సూచించారు. ఒకవేళ అలాంటి అవకాశమే గనుక లభిస్తే రెండేళ్లలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చని ఎంపీలను 75 శాతం దాకా ప్రజలు తిరస్కరించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం రంగమేదైనా సామాన్యులకు మాత్రం అన్ని ద్వారాలు మూసుకుపోయిన పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెట్, వ్యాపారం, సినిమాలు.. ఇలా అన్నింటిలోనూ సామాన్యులకు అవకాశాలు అందకుండా పోతున్నాయని అన్నారు. ‘‘ఉదాహరణకు బ్రిటన్‌లో ప్రజల నుంచి లక్ష ఓట్ల సంతకాల సేకరణ ద్వారా ప్రజాప్రతినిధులను తొలగించే అంశంపై పార్లమెంట్లో చర్చ చేపట్టడం లాంటివి చేస్తారు. కానీ, ఇక్కడ అలాంటి పరిస్థితులు మచ్చుకైనా కనిపించటం లేదు. మొన్నామధ్య తమిళనాడు రైతులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఇక్కడ దేశ రాజధానిలో నిరసన ప్రదర్శనలు వ్యక్తం అయ్యాయి. కానీ, అక్కడి ప్రజా ప్రతినిధులంతా తమ జీతభత్యాలు పెంచుకునే విషయంపై ఒకరోజంతా చర్చించాయి. ఇది పరిస్థితి’’ అని వరుణ్ గాంధీ పేర్కొన్నారు. -
రోహింగ్యాలకు సపోర్ట్: వరుణ్‌పై కేంద్రం ఫైర్!
సాక్షి, న్యూఢిల్లీ : రోహింగ్యా శరణార్థులకు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి సొంత పార్టీ నుంచే ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అభిప్రాయాన్ని ఖండిస్తూ.. నరేంద్రమోదీ కేబినెట్‌కు చెందిన సీనియర్ మంత్రి హన్సరాజ్ అహిర్ సీరియస్‌గా స్పందించారు. రోహింగ్యా శరణార్థులను బహిష్కరించే విషయంలో బీజేపీ వైఖరిని తప్పుపడుతూ వరుణ్ గాంధీ 'నవ్‌భారత్ టైమ్స్'లో ఓ వ్యాసాన్ని రాశారు. మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలను శరణార్థులుగా పరిగణించాలని ఆయన ఈ వ్యాసంలో కోరారు. వరుణ్ గాంధీ వ్యాఖ్యలు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని హన్సరాజ్ స్పందించారు. రోహింగ్యాల విషయంలో కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్లడానికి వీలులేదంటూ వరుణ్ గాంధీని హెచ్చరించారు. రోహింగ్యా శరణార్థుల్లో కొంతమందిని పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూప్‌లు ఎరవేస్తున్నాయని కొన్ని రోజుల క్రితమే కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. వీరు అక్రమ వలసదారులని, శరణార్థులు కారని పేర్కొంది. ఈ ముస్లింల వల్ల జాతీయ భద్రతకు పెనుముప్పు ముంచి ఉందని కేంద్ర హోం శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. అంతేకాక వీరు భారత్‌లో మతహింసను ప్రేరేపించే అవకాశముందని చెప్పింది. అయితే రోహింగ్యాలకు శరణార్థుల గుర్తింపు కల్పించాలంటూ, ప్రభుత్వ వైఖరికి భిన్నంగా వరుణ్ గాంధీ కేంద్రాన్ని కోరుతున్నారు. ఆయన రాసిన వ్యాసంలో రోహింగ్యా శరణార్థులు, విదేశీ పాలసీ, దేశీయ రాజకీయాలకు బాధితులని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరికి పూర్తిగా భిన్నంగా తన అభిప్రాయాలు వెల్లడించారు. అంతర్జాతీయ ఒప్పందాల్లో భారత్ కూడా సంతకం చేసిందని, శరణార్థులకు సాయం చేసే మంచి సంప్రదాయాన్ని మనం కలిగి ఉన్నామంటూ వివరించారు. ఆర్టికల్ 17 ప్రకారం మానవతావాదంతో దేశం ఎవరినీ బహిష్కరించడానికి వీలులేందంటూ పేర్కొన్నారు. కానీ దేశప్రయోజాలను దృష్టిలో పెట్టుకున్న వారెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరంటూ అహిర్ మండిపడ్డారు. రోహింగ్యాల విషయంలో కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరూ కూడా వెళ్లడానికి వీలులేదంటూ హెచ్చరించారు. అహిర్ స్పందనను గౌరవిస్తూ, మరో బీజేపీ నేత షైనా కూడా ప్రభుత్వం తన జాబ్ తాను చేస్తుందనంటూ.. ఈ సమస్యను మోదీ ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పరిష్కరిస్తుందని, ఎవరైనా మానవతావాదాన్ని ఎత్తిచూపాలంటే, తొలుత సమస్యను అర్థం చేసుకోవాలని వరుణ్ గాంధీకి సూచించారు. -
రుణమాఫీతో అంత ప్రమాదమా?
విశ్లేషణ దేశీయ పేదరైతులకు ఆర్థిక ప్రయోజనాలు కలిగించే ఏ ప్రయత్నాన్ని అయినా భారతీయ ఆర్థిక విధాన పండితులు శోకన్నాలు పెడుతూ అడ్డుకుంటారు. అదే సమయంలో పరిశ్రమలకు ప్రభుత్వం కల్పించే భారీ ప్రయోజనాల పట్ల వీరు కిమ్మనకుండా ఉంటారు. అమెరికన్ అంతర్యుద్ధం 1865లో ముగిసిపోయినప్పుడు, అమెరికా పత్తి ఉత్పత్తి పునరుద్ధరణ జరిగి భారతీయ పత్తికి డిమాండ్ పడిపోయింది. బాంబే ప్రెసిడెన్సీలో రైతులు పత్తి పండించడం తగ్గిపోయింది. రైతులకు రుణం ఇవ్వడానికి వడ్డీ వ్యాపారులు తిరస్కరించేవారు లేదా అధిక వడ్డీరేట్లను విధించేవారు. దీంతో సెటిల్మెంట్ డిమాండ్లు పెరిగిపోయాయి. దీని ఫలితంగా పుణే సమీపంలోని సుపా గ్రామంలో 1875లో దక్కన్ తిరుగుబాటు జరిగింది. దాని ప్రేరణగా దీంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఆగ్రహోదగ్రులైన రైతులు, వడ్డీవ్యాపారులపై దాడులు చేసి వారి ఇళ్లు తగులబెట్టారు. ఈ తిరుగుబాటు 30 గ్రామాలను ప్రభావితం చేసింది. గ్రామాల్లోని పోలీసు గస్తీ కేంద్రాలు త్వరలోనే రైతులను లొంగదీసుకున్నాయి కానీ గ్రామీణ ప్రాంతంలో నెలల తరబడి తిరుగుబాటు కొనసాగింది. దీంతో బాంబే ప్రెసిడెన్సీ 1878లో దక్కన్ రయట్స్ కమిషన్ని నెలకొల్పింది. ప్రభుత్వం అంచనా ప్రకారం ఆహారం కోసం, విత్తనాలు, ఎద్దులు వంటి ఇతర అవసరాలకోసం రైతులు కొద్ది మొత్తంలో తీసుకునే రుణాలు ఎప్పుడో ఒకసారి చేసే వెళ్లి ఖర్చుల కంటే ఎక్కువగా వారిని అధిక రుణగ్రస్తులను చేస్తున్నాయని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. రైతుల రుణ భారాన్ని తగ్గించాలంటే, రుణాలు చెల్లించనివారిపై నిర్బం ధాన్ని నిషేధించాలని, రుణ బకాయి వసూలు కోసం రైతుల నివాస గృహాలను అమ్మకానికి పెట్టడం నుంచి మినహాయించాలని, రుణగ్రస్తుల నుంచి భారీ మొత్తాలను లాగేందుకు న్యాయస్థానాల్లో జరుగుతున్న విచారణ ప్రక్రియలను నిలిపివేయాలని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. భారత్‌లో రైతు దురవస్థ ఇప్పటికీ మారలేదనిపిస్తోంది. స్వాతంత్య్రానంతర భారతదేశంలో, రైతు అనుకూల విధానాలు కొత్తవేమీ కావు. 1989లో జనతాదళ్ ప్రభుత్వం ఒక్కో రైతుకు పదివేల రూపాయల వరకు రుణాల రద్దుకు అవకాశమిస్తూ వ్యవసాయ రుణాల మాఫీ పథకం ప్రవేశపెట్టింది. 1992లో ఇది 4.4 కోట్లమంది రైతులకు 6 వేల కోట్ల మేరకు రుణ మాఫీ చేసింది. 2008లో వ్యవసాయ రుణ మాఫీ, రుణ ఉపశమన పథకం ప్రవేశపెట్టగా 5 కోట్ల 97 లక్షల మంది పెద్ద రైతులతోపాటు 3 కోట్ల 69 లక్షలమంది సన్నకారు రైతులు 71,600 కోట్ల రూపాయల మేరకు ప్రయోజనం పొందారు. రాష్ట్ర స్థాయిల్లో కూడా ఇదేవిధమైన చర్యలు చేపట్టారు. ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం సన్నకారు, చిన్నకారు రైతులకు రుణమాఫీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లో ఈమధ్యే దిగిపోయిన ప్రభుత్వం రాష్ట్ర సహకార బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న 50 వేల కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసింది. తరువాత అవసరమైన రైతులకు మాత్రమే రుణాలను మాఫీ చేయాలని యూపీ నూతన ప్రభుత్వం నిర్ణయించడం స్వాగతించాలి. అయితే ఇది సరిపోదు. ఇలాంటి రుణమాఫీలను దేశవ్యాప్తంగా సన్నకారు, చిన్నకారు రైతులందరికీ వర్తింపచేయాల్సి ఉంది. భారత్‌లోని 12.1 కోట్ల వ్యవసాయ భూముల్లో 9.9 కోట్ల భూములు సన్నకారు రైతులవే అయి ఉంటున్నాయి. బహుళ పంటల విధానం ద్వారా ఇలాంటి రైతులు దేశంలో పండే కూరగాయల్లో 70 శాతం, తృణధాన్యాల్లో 52 శాతం పండిస్తున్నారు. నాణ్యమైన విత్తనాల అవసరం పెరగడంతో రైతులు విత్తన ధరల పెరుగుదల భారాన్ని మోయవలసివస్తోంది. అన్ని విత్తనాల ధరలు భారీగా పెరిగిపోయాయి. పాతకాలంలో మాదిరిగా రైతులు విత్తనాలను కులధనం లాగా తమ కుమారులకు వారసత్వంగా ఇచ్చే పరిస్థితి పోయింది. దీనికి తోడు ఎరువుల ధరలూ పెరిగాయి. వ్యవసాయ మెషినరీకి ప్రత్యామ్నాయంగా ఉండే కూలీలకయ్యే ఖర్చు కూడా తదనుగుణంగా పెరిగింది. పశువుల వాడకం ఖర్చు కూడా బాగా పెరిగింది. ఇక పురుగుమందుల ద్వారా పంట రక్షణ ఖర్చు చుక్కలనంటింది. మన రైతులు తమ పంటలకు మార్కెట్ విలువను గుర్తించడంలో విఫలమవుతున్నారు. 1972లో కలకత్తాలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ఒక కమలాపండును మార్కెట్లో వినియోగదారు కొనుగోలు చేసే ధరలో కేవలం 2 శాతం మాత్రమే దాన్ని పండించిన రైతుకు అందుతోందని తెలిసింది. పంటవిలువలో అధిక భాగాన్ని మండీలు, మార్కెట్లే మింగేస్తున్నాయి. మోదీ ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా, ఇంతవరకు దిగుమతి చేసుకుంటున్న వ్యవసాయ సామగ్రి, పరికరాలను దేశంలోనే తయారు చేయడంపై దృష్టి పెట్టింది కాబట్టి భారత వ్యవసాయ సామగ్రి విధానాన్ని కూడా పూర్తిగా మార్చవలసి ఉంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి మన వ్యవసాయ సామగ్రి, పరికరాలను ప్రామాణీకరించాల్సి ఉంది. మన వ్యవసాయ పాలసీ తెగుళ్లను, పురుగులను ఎదుర్కోవడానికి జీవ, రసాయన, యాంత్రిక, భౌతిక విధానాలను మిళితం చేయడంపై దృష్టి సారించాలి. పురుగుమందుల వాడకాన్ని తొలగిం చడం లేక గణనీయంగా తగ్గించడంపై దీర్ఘకాలిక దృష్టితో వ్యవహరించి తగు చర్యలు తీసుకోవాలి. భారతీయ ఆర్థిక విధాన పండితులు దేశీయ పేదరైతులకు ఆర్థిక ప్రయోజనాలు కలిగించే ఏ ప్రయత్నాన్నయినా శోకన్నాలు పెడుతూ అడ్డుకుంటారు. అదే పరిశ్రమలకు ప్రభుత్వం కల్పించే ప్రయోజనాల పట్ల వీరు కిమ్మనకుండా మౌనంగా ఉంటారు. వాస్తవాలను పరిశీలి ద్దాం. ఆర్బీఐ ప్రకారం 2000– 2013 కాలంలో దేశంలో లక్షకోట్ల రూపాయల విలువైన కార్పొరేట్ సంస్థల రుణాలను మాఫీ చేశారు. వీటిలో 95 శాతం రుణాలు బడా సంస్థల రుణాలే మరి. దీంతో పోలిస్తే ఎస్బీఐ ఇటీవల ట్రాక్టర్, వ్యవసాయ సామగ్రిపై రుణాలమీద 40 శాతం తగ్గింపుతో ఒక సెటిల్మెంట్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. 25 లక్షలవరకు రుణం తీసుకున్నవారికి 6 వేల కోట్ల రూపాయల వరకు లబ్ధి చేకూరుస్తూ రుణాలను తగ్గించారు. రైతులలో రుణ చెల్లింపు సంస్కృతి లేక పోవడం వల్ల భారత్‌లో మొండిబకాయిలు పేరుకోవడం లేదు. మొండి బకాయిల్లో 50 శాతం వరకు మధ్య, భారీ పరిశ్రమలకు ఇచ్చినవే. పిండదశలోని రుణ చెల్లింపు సంస్కృతిని ధ్వంసం చేస్తున్నారని ఆరోపించే ముందు విమర్శకులు వ్యవసాయ రుణాల చరిత్రను గుర్తిస్తే బాగుంటుంది. దేశంలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు, ఉబ్బిన కడుపులు, అనాధ పిల్లల రూపంలో దోపిడీ పరిణామాలు నాలో చాలా కాలం క్రితమే బలమైన ముద్రవేశాయి. దిద్దుబాటు చర్యలు లేకుంటే మన రైతుల విధి అనిశ్చితంగానే ఉంటుంది. వరుణ్ గాంధీ వ్యాసకర్త, బీజేపీ పార్లమెంటు సభ్యులు ఈ–మెయిల్ : fvg001@gmail.com -
రాజకీయ రుగ్మతలకు విరుగుడు
స్వేచ్ఛాయుతమైన, సక్రమమైన ఎన్నికలు పౌరులందరి హక్కు. తమ ప్రతినిధులపై ప్రజలు ఇక ఎంత మాత్రమూ విశ్వాసం ఉంచలేనప్పుడు, వారిని తొలగించే హక్కు సైతం ప్రజలకు ఉండాల్సిందే. రాజకీయవేత్తలు జవాబుదారీతనం వహించడం అనే వ్యవస్థపై ఆధారపడే నిజమైన అర్థంలో మనం ప్రజాస్వామ్యాన్ని సాధించుకోగలుగుతాం. వెనక్కు పిలిచే హక్కు ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతుంది. ప్రజాస్వామ్యాన్ని లోతుగా విస్తరించా లంటే, ఓటు చేసే హక్కుతో పాటూ వెనక్కు పిలిచే హక్కు కూడా ఉండాలి. ‘‘ప్రజా ప్రతినిధుల పేరిట కొందరు వ్యక్తులతో కూడిన సంస్థకు అధికా రాన్ని దఖలుపరిస్తే, వీలు చిక్కితే వారు కూడా మిగతా వారందరిలాగే తమ అధి కారాన్ని సమాజ హితం కోసం గాక, తమ సొంత బాగు కోసం ఉప యోగిస్తారనడంలో సందేహం లేదు.’’ – జేమ్స్ మిల్ క్రీస్తు పూర్వం 5వ శతాబ్దినాటి ప్రాచీన ఏథెన్స్వాసులకు తమదైన విశిష్ట ప్రజాస్వామ్యం ఉండేది. దానికొక విశిష్ట సామాజిక సంప్రదాయమూ ఉండేది. పరిపాలన కోసం ఉద్దేశించిన పది నెలల క్యాలెండర్‌ను అనుసరించి ఏడాదిలో ఆరవ లేదా ఏడవ మాసంలో (జనవరి లేదా ఫిబ్రవరి) ఏథెన్స్ వాసులంతా (పురుషులు) సమావేశమయ్యేవారు. ఎవరినైనా అభిశంసించి బహిష్కరించాలని అనుకుంటున్నారేమో వారిని అడిగేవారు. ఎవరినైనా బహి ష్కరించాలని వారు కోరితే (సాధారణంగా అధికారం నెరపే ప్రతినిధులు నియంతలుగా మారుతున్నారనిపించినప్పుడు), రెండు నెలల తర్వాత మరో సమావేశాన్ని నిర్వహించి కుండ పెంకు ముక్కలపై ఆ వ్యక్తి పేరును రాయడం ద్వారానో లేదా అవును, కాదు అనడానికి గుర్తుగా తెల్లటి, నల్లటి గులకరాళ్లను వేరు వేరు మట్టి పాత్రల్లో వేయడం ద్వారానో ఓటింగును నిర్వహించేవారు. అధికార మండలి అధ్య క్షుడు వాటిని లెక్కించేవాడు. అనుకూలంగా ఎక్కువ పెంకులు లేదా తెల్ల గులకరాళ్లు వస్తే ఆ ప్రతిపాదన నెగ్గినట్టు ప్రకటించేవాడు. అలా బహిష్కృతుడైన వ్యక్తిని (ఆస్ట్రకా) పదేళ్లపాటూ నగరంలో ప్రవేశించ కుండా వెలివేసేవారు. ప్రజాసభకు హాజరైన వారి సంఖ్య కనీసం 6,000కు తగ్గకుంటేనే ఓటింగును నిర్వహించేవారు. వ్యవస్థిత విచారణ, న్యాయ ప్రక్రి యలు లేకుండానే నియంతలు కాబోయేవారిని, అవినీతిపరులను అలాంటి పద్ధతుల ద్వారా నగర బహిష్కారానికి గురిచేసేవారు. ‘‘రాజధర్మం’’లోనూ ఉంది రీకాల్ ఆధునిక కాలపు ప్రజా ప్రతినిధులను ‘వెనక్కు పిలిచే హక్కు’ ఆ ప్రాచీన కాలపు పద్ధతుల వారసత్వ పరంపరలో ఏర్పడినదే. ఎన్నికైన ప్రజా ప్రతి నిధులను వారి పదవీ కాలం పూర్తిగాక ముందే ప్రత్యక్ష ఓటింగు ద్వారా వెనక్కు పిలవడం కోసం జరిపే ఓటింగును రికాల్ ఎలక్షన్ (వెనక్కు పిలిచే ఎన్నిక) అంటారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్ర శాసనసభ ఇలా వెనక్కు పిలిచే ఎన్నికలను 1995 నుంచి అధికారికంగా ప్రవేశపెట్టి, ఓటర్లకు తమ పార్లమెంటు (శాసనసభ) సభ్యులను వారి పదవుల నుంచి వెనక్కు పిల వాలని విజ్ఞప్తి చేసే హక్కును కల్పించింది. అలా రీకాల్ ఎన్నికల ద్వారా వెనక్కు పిలిచినది రాష్ట్ర ప్రధానే అయితే, త్వరలోనే ఆ స్థానానికి ఉప ఎన్నిక జరుపుతారు. అమెరికాలో కూడా ఇలాంటి రీకాల్ ఎన్నికలు శక్తిమంతమైన సాధనాలుగా ఉన్నాయి. అలాస్కా, జార్జియా, కన్సస్, మిన్నెసోటా, మోంటానా, రోడ్స్ ఐలాండ్, వాషింగ్టన్ రాష్ట్రాలు తప్పుడు నడవడిక, దుష్ప్ర వర్తనవల్ల ప్రజాప్రతినిధులను వెనక్కు పిలిచే హక్కు పౌరులకు ఉంది. మన భారతదేశానికి ఇది కొత్త భావనేం కాదు. మన ‘‘రాజధర్మ’’ అనే భావనలోనే సమర్థ పాలనను అందించని కారణంగా రాజును తొలగిం చడమనేది వేద కాలం నుంచి ప్రస్తావనకు వస్తూనే ఉంది. ప్రముఖ భారత మానవతావాది ఎమ్ఎన్ రాయ్ 1944లోనే ఈ విషయాన్ని చర్చకు తెచ్చారు. ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడాన్ని, వెనక్కు పిలవడాన్ని అనుమతించే వికేంద్రీకృత, సంక్రమిత రూప పరిపాలనకు మారాలని ఆయన ప్రతిపాదిం చారు. 1974లో జయప్రకాష్ నారాయణ్ సైతం వెనక్కు పిలిచే హక్కు గురించి విస్తృతంగా మాట్లాడారు. 1961 ఛత్తీస్‌గఢ్ నగర పాలకS చట్టాన్ని అనుసరించి 2008లో స్థానిక సంస్థల అధిపతులు ముగ్గురిని రీకాల్ ఎన్నిక ద్వారా వెనక్కు పిలిచారు. మధ్యప్రదేశ్, బిహార్లలో కూడా స్థానిక సంస్థల విషయంలో ఈ వెనక్కు పిలిచే హక్కు ఉంది. రాష్ట్ర శాసనసభల సభ్యులు, పార్లమెంటు సభ్యులు గణనీయమైన సంఖ్యలో తప్పుడు పద్ధతులకు పాల్ప డుతుండటమనే సమస్యకు పరిష్కారంగా... 2008లో నాటి లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ ‘‘వెనక్కు పిలిచే హక్కు’’ ప్రవేశపెట్టాలని కోరారు. స్థానిక సంస్థలైన మునిసిపాలిటీలు, జిల్లాలు, తాలూకాలు, గ్రామ పంచాయతీలకు ఎన్నికైన సభ్యులను వెనక్కు పిలిచే హక్కును కల్పించడానికి అవసరమైన సవరణలను ప్రవేశపెట్టాలని కోరింది (ఇండియన్ ఎక్స్‌ప్రెస్, జూన్ 2011). ఓటరు మెచ్చకపోతే గద్దె దిగాల్సిందే నిజమైన ప్రజాస్వామ్యం ఏదైనాగానీ ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కోసం అనే దృష్టినే కలిగి ఉంటుంది. దురదృష్టవశాత్తూ, ముందుగా ఎవరు విజయ సూచికను చేరుతారనేదాన్నే లెక్కలోకి తీసుకునే మన ఎన్నికల వ్యవస్థలో ఎన్నికైన ప్రతి ప్రతిని«ధీ నిజ ప్రజామోదాన్ని కలిగినవారే కారు. ప్రజలకు తమ ప్రతినిధులను ఎన్నుకునే అధికారం ఉండేట్టయితే, ఆ ప్రతి నిధులు తప్పుడు పనులకు పాల్పడినప్పుడు లేదా తమ విధులను పరిపూర్తి చేయడంలో విఫలమైనప్పుడు వారిని తొలగించే అధికారం కూడా ఉండాలి. ఇది తార్కికంగానే కాదు, న్యాయపరంగా కూడా అవసరం. ఇప్పటికైతే ప్రజా ప్రతినిధులను ఎన్నుకున్న పౌరులు వారి పట్ల అసంతుష్టితో ఉన్నా, చేయ గలిగినది ఏమీ లేదు. 1951 నాటి మన ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఎన్నికైన ప్రతినిధులు కొన్ని రకాల నేరాలకు పాల్పడినప్పుడే వారిని అధికారంలోంచి తొలగించే అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేతప్ప, ప్రతినిధుల సార్వత్రిక అస మర్థత లేదా ఎన్నుకున్న ఓటర్లు వారిపట్ల అసంతృప్తితో ఉండటం వంటి కారణాలతో తొలగించడానికి లేదు. అయితే వెనక్కు పిలిచే హక్కు వంటి చట్టాలను ప్రవేశపెట్టేటప్పుడు తప్పక తగు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కాలి ఫోర్నియా గవర్నర్‌ను వెనక్కు పిలిచే ఎన్నికల్లో ప్రత్యేక ప్రయోజనాల ప్రభావం బాగా ప్రాచుర్యం పొందింది. ప్రజా ప్రాతినిధ్య సవరణ బిల్లు (2016) ఒక పార్లమెంటు సభ్యునిగా నేను వెనక్కు పిలిచే హక్కును ప్రవేశపెట్టే క్రమాన్ని ప్రారంభించడం కోసం ప్రజాప్రాతినిధ్య సవరణ బిల్లును(2016) పార్లమెంటులో ప్రవేశపెట్టాను. పార్లమెంటు, శాసనసభలకు ఎన్నికైన ప్రతి నిధులను వెనక్కు పిలవడానికి విజ్ఞప్తి చేయడాన్ని అనుమతించాలని ఆ బిల్లు కోరింది. అలాంటి విజ్ఞప్తిని ఆమోదించడానికి ఆ ప్రజాప్రతినిధి ఎన్నికైన నియోజకవర్గ ఓటర్లలో కనీసం నాలుగింట ఒక వంతు సంతకాలు చేయాలనే నిబంధనను ఆ బిల్లు విధించింది. ఈ వెనక్కు పిలిచే క్రమం నిరర్థకమైనదిగా మారకుండటానికి హామీ ఉండాలి. అదేసమయంలో అది ఎన్నికైన ప్రజా ప్రతినిధులను వేధించడానికి అవకాశం కాకుండా జాగ్రత్త వహించాలి. అందువల్ల ఈ వెనక్కు పిలిచే క్రమానికి సంబంధించి అలాంటి విజ్ఞాపనపై సంతకాల సేకరణ నుంచి చివరికి ఎలక్ట్రానిక్ ఓటింగ్‌ను జరిపి తుది నిర్ణ యాన్ని వెల్లడించే వరకు పలు జాగ్రత్తలను అందులో ఇమడ్చాల్సి ఉంటుంది. విజ్ఞాపనా పత్రంపై చేసిన సంతకాలను సరిచూడాలని, తొలుత దానిపై సంబంధిత సభ స్పీకర్ సమీక్ష జరపాలని ఆ బిల్లు సూచించింది. అంతేగాక, ఒక ప్రతినిధిని ఓటర్లు అతి స్వల్ప ఆధిక్యతతోనే వెనక్కు పిలవకుండా, ఆ క్రమం ప్రజాభీష్టానికి ప్రాతినిధ్యం వహించేలా.. వెనక్కు పిలిచే విజ్ఞాపన గెలుపొందడానికి లభించాల్సిన ఆధిక్యత కూడా ఎక్కువగా ఉండాలి. ఈ క్రమాన్నంతటినీ పారదర్శకంగా, స్వతంత్రంగా నిర్వహించడం కోసం ఎన్ని కల కమిషన్ అధికారులనే చీఫ్ పిటిషన్ ఆఫీసర్లుగా నియమించాలి. ఈ అవ కాశాన్ని దుర్వినియోగపరచే వీలు ఉన్న దృష్ట్యా అలాంటి చర్యలకు తగు శిక్షలను విధించడానికి కూడా ఈ బిల్లు వీలును కల్పించింది. ఓటు చేసే హక్కున్నట్టేæవెనక్కు పిలిచే హక్కూ ఉండాలి వెనక్కు పిలిచే హక్కు ఉండటం, పై నుంచి కిందికి జవాబుదారీతనానికి హామీని కల్పిస్తుంది. అలాంటి హక్కు అవినీతి పాలిటి అంకుశమే కాదు, రాజ కీయాలు నేరమయమవుతున్న క్రమానికి అడ్డుకట్ట అవుతుంది. ప్రజా ప్రాతి నిధ్యానికి సంబంధించిన మన వ్యవస్థాగత చట్రాన్ని మార్చడం... ఎన్నికైన మన ప్రజాప్రతినిదులకు లభించే వ్యక్తిగత ప్రాబల్యాన్ని, సంపదను పెంపొం దింపజేసుకునే అవకాశాలు, ప్రోత్సాహకాలపై ప్రభావాన్ని చూపుతుంది. నిర్దిష్ట కాలపరిమితి వరకు మళ్లీ ఎన్నికల బరిలోకి దిగాల్సి రాని ప్రతినిధుల కంటే, తిరిగి ఎన్నిక కావాల్సి వచ్చేవారు భిన్నంగా ప్రవర్తిస్తారనే అంశాన్ని చాలా అధ్యయనాలు ప్రముఖంగా వెలుగులోకి తెచ్చాయి. మళ్లీ ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం ఉన్నవారి పాలనలో వృద్ధి విలక్షణంగా అధికంగా ఉండటం, పన్నులు, రుణ వ్యయాలు తక్కువగా ఉండటం కనిపి స్తుంది. స్వేచ్ఛాయుతమైన, సక్రమమైన ఎన్నికలు దేశ పౌరుల హక్కు. తమ ప్రతినిధులపై ప్రజలు ఇకనెంత మాత్రమూ విశ్వాసం ఉంచలేనప్పుడు... వారిని తొలగించే హక్కు ప్రజలకు తప్పక ఉండాలి. రాజకీయవేత్తలు జవాబు దారీతనం వహించడం అనే వ్యవస్థపై ఆధారపడే ప్రజాస్వామ్యాన్ని దాని నిజ అర్థంలో మనం సాధించుకోగలుగుతాం. పైగా ఇది ఎన్నికల వ్యయాలను పరిమితం చేస్తుంది కూడా. నైతిక ప్రవర్తన సక్రమంగా లేని అభ్యర్థులు... ఎన్నికైనా తిరిగి తమను వెనక్కు పిలిచే అవకాశం ఉండటమనే ప్రమాదాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఈ హక్కు మన దేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని పాదుకొల్పడానికి దోహదపడుతుంది. ప్రజలకు అవకా శాల అందుబాటును విశాలం చేస్తుంది, సమ్మిళితత్వాన్ని పెంపొందింప జేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని లోతుగా పెంపొందింపజేయాలంటే, ఓటు చేసే హక్కుతో పాటే వెనక్కు పిలిచే హక్కు కూడా ఉండాలి. - వరుణ్ గాంధీ వ్యాసకర్త బీజేపీ పార్లమెంటు సభ్యులు ఈ–మెయిల్: fvg001@gmail.com -
మా వాడు చాలా బిజీగా ఉన్నాడు, అందుకే..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని సుల్తానాపూర్ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటంపై ఆయన తల్లి, కేంద్ర మంత్రి మేనకా గాంధీ వివరణ ఇచ్చారు. తన కొడుకు తీరికలేకుండా ఉన్నారని, అందుకే ఎన్నికల ప్రచారం చేయలేదని చెప్పారు. వరుణ్ దేశ వ్యాప్తంగా తిరుగుతూ, పలు యూనివర్శిటీలను సందర్శిస్తూ, విద్యార్థులను కలుస్తున్నాడని తెలిపారు. యూపీ నుంచే లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మేనక కూడా ఎన్నికల ప్రచారంలో తక్కువగా పాల్గొన్నారు. సోమవారంతో యూపీలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇప్పటి వరకు ఆరు దశల్లో ఎన్నికలు జరిగాయి. చివరి, ఏడో దశ ఎన్నికలు జరగాల్సివుంది. ఈ నెల 11న కౌంటింగ్ జరగనుంది. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సహా చాలామంది అగ్రనేతలు ప్రచారం చేశారు. మోదీ 23 ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్నారు. కాగా వరుణ్ ఎక్కడా కనిపించలేదు. గతేడాది రక్షణ వ్యవహారాల రహస్యాలను తెలుసుకునేందుకు వరుణ్‌ను ట్రాప్ చేశారని ఆరోపణలు వచ్చినపుడు బీజేపీ అండగా నిలవలేదని ఆయన కినుక వహించడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. బీజేపీ తొలుత విడుదల చేసిన ప్రచారకర్తల జాబితాలో ఆయన పేరు లేదు. అయితే రెబెల్స్‌గా బరిలోకి దిగుతామని వరుణ్ మద్దతుదారులు హెచ్చరించడంతో ఆయన పేరును చేర్చారు. యూపీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటించాలని వరుణ్ ఆశించినా.. పార్టీ పెద్దలు ఆయనను పక్కనబెట్టారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది పార్టీ నిర్ణయిస్తుందని మేనక గాంధీ చెప్పారు. -
వరుణ్‌గాంధీ రాయని డైరీ
అమిత్ షా నాతో ఎప్పుడూ నేరుగా మాట్లాడరు. నేరుగా నావైపు చూడరు. ఆయనకు గాంధీజీ అంటే ఇష్టం లేదు. నెహ్రూజీ అంటే గౌరవం లేదు. నా ముఖంలో వాళ్లిద్దరూ కనిపిస్తారో ఏమో మరి! ఎటో చూస్తూ, ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా ఉంటారు.. నేనూ ఆయనా కలుసుకున్నప్పుడు, కలుసుకోవలసి వచ్చినప్పుడూ! ఎప్పుడూ నేరుగా మాట్లాడని మనిషి, ఎప్పుడూ నేరుగా చూడని మనిషి.. ఇవాళ నేరుగా నాకే ఫోన్ చేశారు! అమిత్.. అమిత్ అని ఫోన్ బ్లింక్ అవుతూ ఉంది. నేను లిఫ్ట్ చెయ్యలేదు. నా ముందు.. రైతు ఆత్మహత్యల డేటా ఉంది. రోహిత్ వేముల సూసైడ్ నోట్ ఉంది. గంగానదీ జలాల ప్రక్షాళన ఫైల్ ఉంది. ఈ రెండున్నరేళ్ల ప్రభుత్వ వైఫల్యాల జాబితా ఉంది. ముక్కలు ముక్కలుగా రాసిపెట్టుకున్న నా థాట్స్ ఉన్నాయి. ఈ ఏడాది తేబోతున్న నా మూడో కవితా సంకలనం ఉంది. ఇంతకీ.. నేనెక్కడ ఉన్నాను?! ఇండోర్లోనా, కొచ్చిలోనా, జమ్మూలోనా, హైదరాబాద్‌లోనా, రాజస్తాన్‌లోని చురూలోనా? కిటికీలోంచి బయటికి చూశాను. ఎక్కడైతేనేం? యూపీ అయితే కాదు! మళ్లీ అమిత్ షా కాల్! అమిత్ అమిత్ అని ఫోన్ బ్లింక్ అవుతోంది. బీజేపీని వదిలించుకుందామని యూపీని వదిలి తిరుగుతుంటే.. ఈ పెద్ద మనిషేంటీ వదలకుండా నా వెంట పడ్డాడు! ఫోన్ ఎత్తితే పనులన్నీ ఆగిపోతాయి. ఫోన్ ఎత్తకపోతే పనులన్నీ పాడైపోతాయి. బీజేపీలో ఉన్న గొప్పతనం అదే. దేన్నీ తిన్నగా సాగనివ్వదు. ఉన్నదాన్ని ఉన్నట్టూ ఉండనివ్వదు. ఫోన్ లిఫ్ట్ చెయ్యబోయాను. కట్ అయింది! పని మానేసి, ఫోన్ మళ్లీ అమిత్ అమిత్ అని బ్లింక్ అవడం కోసం చూశాను. బ్లింక్ అవలేదు. ఫోన్ చూడ్డం మానేసి పనిలో పడబోయాను. అప్పుడు మళ్లీ అమిత్ అమిత్ అని ఫోన్ బ్లింక్ అవడం మొదలుపెట్టింది. బీజేపీలో ఉన్న ఇంకో గొప్పదనం ఇదే! ఎక్స్పెక్ట్ చేసినట్లు ఉండదు. ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంచదు. ‘‘వరుణ్బాబూ.. యూపీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు యూపీ నుంచి వెళ్లిపోయావు. రేపు ఐదో విడత పోలింగ్. నీ నియోజకవర్గంలో కూడా నేనే కాంపెయిన్ చేసేశా. ఏమైపోయావు వరుణ్ బాబూ.. బీజేపీ నచ్చడం లేదా? మోదీజీ నచ్చడం లేదా?’’ అని అడిగారు అమిత్ షా. ‘‘ఎందుకలా అనుకుంటు న్నారు అమిత్జీ?’’ అన్నాను. ‘‘బీజేపీకి నచ్చని విషయాలన్నీ మాట్లాడుతున్నావంటే బీజేపీ నీకు నచ్చట్లేదనేగా’’ అన్నారు. నా మదిలో ఒక కవితాత్మక భావం మెదిలింది. అది మిస్ అవకుండా నోట్ చేసుకుంటున్నాను. ‘‘చెప్పు వరుణ్బాబూ. నీకు బీజేపీ నచ్చట్లేదా? మోదీజీ నచ్చట్లేదా’’ అని మళ్లీ అడిగారు అమిత్ షా. అమిత్ షా లోని గొప్పదనం అదే. వాళ్లు నచ్చట్లేదా, వీళ్లు నచ్చట్లేదా అని అడుగుతారు కానీ, నేను నచ్చట్లేదా అని అడగరు! - మాధవ్ శింగరాజు -
ఆత్మహత్య లేఖ చదివి ఏడ్చాను: వరుణ్
ఇండోర్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల రాసిన ఆత్మహత్య లేఖ చదివి ఏడ్చేశానని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తెలిపారు. ‘దళిత పరిశోధక విద్యార్థి రోహిత్ గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నారు. అతని లేఖ చదివి కన్నీటి పర్యంతమయ్యాను. తన పుట్టుకే ఒక పాపమని, అందుకే ఈ ఆఘాయిత్యానికి ఒడిగడుతున్నానని అతడు రాసిన వాక్యం నా హృదయాన్ని కోతపెట్టింది’ అని అన్నారు. వరుణ్ మంగళవారమిక్కడ ఓ స్కూల్లో ‘నవ భారత్ కోసం ఆలోచనలు’ అంశంపై ప్రసంగించారు. మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్‌లో గత ఏడాది ఓ స్కూల్లో చోటుచేసుకున్న వివక్షను కూడా ఆయన ప్రస్తావించారు. ‘మధ్యాహ్న భోజనాన్ని ఓ దళిత మహిళ వండినందుకు స్కూల్లోని 75 శాతం విద్యార్థులు తినేందుకు నిరాకరించారు. మన పిల్లలకు మనం ఏం నేర్పుతున్నాం? ఈ దేశం, ప్రపంచం ఏ దిశగా వెళ్తున్నాయి?’ అని ఆందోళన వ్యక్తం చేశారు. -
అవన్నీ పనికిమాలిన ఆరోపణలు: వరుణ్
న్యూఢిల్లీ: ఆయుధాల వ్యాపారి అభిషేక్ వర్మకు రక్షణ రహస్యాలు చెప్పారనే ఆరోపణలపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ స్పందించారు. అవన్నీ తప్పుడు, పనికిమాలిన ఆరోపణలని కొట్టిపారేశారు. కావాలని తన ప్రతిష్టను దెబ్బతీయాలనుకున్న వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2009లో డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ, డిఫెన్స్ కన్సలే్టటివ్ కమిటీల్లో సభ్యుడిగా నియమితుడైనప్పటి నుంచి కన్సలే్టటివ్ కమిటీ భేటీకి ఒక్కదానికీ తాను హాజరుకాలేదని తెలిపారు. ఎడ్మండ్స్ అలెన్ అనే అమెరికా న్యాయవాది వరుణ్ కీలకమైన రక్షణ రహస్యాలను అభిషేక్ వర్మకు వెల్లడించారని పీఎంవోకు రాసిన లేఖను స్వరాజ్ అభియాన్ నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర విడుదల చేయడం తెలిసిందే. ఎడ్మండ్‌ను తానెప్పుడూ కలవలేదని వరుణ్ పేర్కొన్నారు. ఇక అభిషేక్ తనకు ఇంగ్లండ్‌లో కాలేజీ స్నేహితుడని, అయితే అతన్ని కలసి చాలాకాలమైందని వరుణ్ వెల్లడించారు. -
వగలాడి వలలో వరుణ్..!
-
వరుణ్ గాంధీపై వగలాడి వల?
ఇందిరాగాంధీ మనవడు, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.. వగలాడి వలలో (హనీ ట్రాప్) చిక్కుకుని దేశ రక్షణ రహస్యాలను లీక్ చేశారా? విదేశీ వ్యభిచారిణులతో ఉన్న ఫొటోల ఆధారంగా ఆయనను బ్లాక్మెయిల్ చేసి ఈ రహస్యాలను కొందరు సంపాదించారంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యాలయానికి ఒక లేఖ వచ్చింది. అమెరికాకు చెందిన సి ఎడ్మండ్స్ ఎలెన్ అనే న్యాయవాది సెప్టెంబర్ 16న ఈ ఫిర్యాదు చేశారు. వివాదాస్పద ఆయుధ వ్యాపారి అభిషేక్ వర్మ ఈ వ్యవహారంలో ఉన్నాడని, అతడే వరుణ్ గాంధీని ఉపయోగించుకుని రక్షణ వివరాలను భారతదేశంతో కాంట్రాక్టులు కుదుర్చుకోవాలని ప్రయత్నిస్తున్న ఆయుధ తయారీదారులకు అందించాడని ఆ లేఖలో పేర్కొన్నారు. 2012 వరకు అభిషేక్ వర్మ, అలెన్ వ్యాపార భాగస్వాములు. పార్లమెంటరీ రక్షణ కమిటీ సభ్యుడిగా వరుణ్ గాంధీకి కొంత సమాచారం తెలుసని, అతడు జాతీయ భద్రతను పణంగా పెట్టి ఈ సమాచారం చేరవేశాడని ఎలెన్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను వరుణ్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇది ఏమాత్రం ఆధారాలు లేని నాన్సెన్స్ వ్యవహారమని ఆయన కొట్టిపారేశారు. ఈ ఆరోపణలకు ఏమైనా ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు. తాను గత 15 ఏళ్లలో ఎప్పుడూ అభిషేక్ వర్మను కలవలేదని చెప్పారు. అలాగే ఎలెన్ చెబుతున్న పార్లమెంటరీ కమిటీ సమావేశాలకు కూడా హాజరు కాలేదన్నారు. తాను వగలాడి వలలో చిక్కుకున్నట్లుగా వాళ్లు చెబుతున్న ఫొటోలు ఏవీ నిజమైనవి కావని, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తన పాత్రను తగ్గించాలన్న దురుద్దేశంతోనే ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. మనీలాండరింగ్‌కు, మోసానికి పాల్పడుతున్నారంటూ ఎలెన్, వర్మ పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో అప్పటివరకు కొనసాగిన వాళ్ల భాగస్వామ్య వ్యాపారం 2012 జనవరిలో ముగిసిపోయింది. ఆ తర్వాతి నుంచి అభిషేక్ వర్మ మీద పలు ఆరోపణలు చేస్తూ ఎలెన్ తరచు భారతదేశానికి పలు పత్రాలు సమర్పిస్తూనే ఉన్నారు. దాంతో పలు కేసుల్లో అభిషేక్ వర్మను అరెస్టుచేసి కొన్నాళ్లు జైల్లో కూడా పెట్టారు. తర్వాత ఆయనకు బెయిల్ మంజూరైంది. -
సమగ్ర విధానాలే సాగుకు రక్ష
రైతు ఆత్మహత్యలకు ప్రధాన కారణం రుణగ్రస్తతే. నికరాదాయం తగ్గిపోతున్నప్పటికీ, అనుత్పాదక ఉపయోగం కోసం అధిక వడ్డీతో రుణాలను తెచ్చుకునేందుకు రైతులు పూనుకుంటున్నారు. రైతులు తమను తాము చంపుకుంటున్నట్లు వర్గీకరించడం సబబు కాదు. పైగా అలాంటి పదజాలం ఒక అపప్రయోగం కూడా. వాస్తవానికి జీవించి ఉండటానికి జరిపే సుదీర్ఘ పోరాటంలో వారు ఓడిపోయారంతే. రైతు ఆత్మహత్యల వెనుక మానవ విషాదాన్ని అర్థం చేసుకోని ప్రభుత్వ పథకాలు వైఫల్యానికే బాటలు తీస్తుంటాయి. దేశంలో రైతుల ఆత్మహత్యలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. 1997-2006 దశాబ్దిలో ఇండియాలో 1,66,304 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. అయితే భూమిలేని గ్రామీణ కూలీలు, మహిళల ఆత్మహత్యలను దీంట్లో పొందుపర్చలేదు. జాతీయ నేర నమోదు బ్యూరో ప్రకారం గత ఏడాది 5,650 మంది రైతులు ఆత్మహత్యల పాలయ్యారు. దేశవ్యాప్తంగా రైతులు ఆత్మహత్యల్లో 90 శాతం వరకు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోనే నమోదు కావటం గమనార్హం. ఒక్క మహారాష్ట్రలోనే 2011-2013 మధ్యకాలంలో 10 వేల మంది పైగా రైతులు ఆత్మహత్యల బారిన పడ్డారు. ఈ రాష్ట్రంలోని మరట్వాడా ప్రాంతంలో ఈ సంవత్సరం ఇంతవరకు 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యలు ప్రతి ఏటా 2 శాతం పెరుగుతున్నాయి. దేశంలో ఆత్మ హత్య చేసుకుంటున్న ప్రతి ఐదు మంది పురుషుల ఆత్మహత్యల్లో ఒకటి రైతు ఆత్మహత్యగా నమోదవుతోంది. సంఖ్యల వెనుక మానవ విషాదం ఈ సంఖ్యల వెనుక దాగిన మానవ విషాదం చాలా బాధాకరమైంది. ఒక చిన్న ఉదాహరణ. ఈ ఏడాది మే 10న సీతాపూర్ జిల్లా నది గ్రామంలో ఉమేష్ చంద్ర శర్మ అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ బాధ భరించలేని ఆయన కుమారుడు వారం తర్వాత మామిడి చెట్టుకు ఉరివేసుకుని చని పోయాడు. బ్యాంకు రుణాలు చెల్లించలేక, మిల్లుల నుంచి చెల్లిపులు రాక బిజ్నోర్ జిల్లా షాపూర్ గ్రామంలోని చౌదరి అశోక్‌సింగ్ ఆత్మహత్య పాలయ్యాడు. బహ్రాయ్ జ్లిలా సర్సా గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న లక్ష్మీ నారాయణ్ శుక్లా కుటుంబాన్ని ఇటీవలే నేను కలిసి, సహాయం చేయగలిగాను. కుటుంబ పెద్దను కోల్పోయిన ఈ కుటుంబాల ప్రతినిధిగా ఎంపీగా ఐదేళ్లపాటు నేను పొందే వేతనం మొత్తాన్ని ఉత్తరప్రదేశ్‌లో రైతుల సంక్షేమానికి కేటాయించాను. ప్రస్తుతం దేశంలోని రైతులు తమను తాము చంపుకోవడానికి కాకుండా జీవించడానికి మరింత ధైర్యంతో ఉండవలసిన పరిస్థితులను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత్‌లో తీవ్రమైన వ్యవసాయ సంక్షోభమే రైతులకు అతికొద్ది స్థాయిలో ప్రత్యామ్నాయ జీవన అవకాశాలను కల్పిస్తూ, వారి జీవితాలను కల్లోలంలో ముంచెత్తుతోంది. దేశంలో వ్యవసాయ కమతాల పరిమాణం చాలా చిన్నది. దాదాపు 12 కోట్ల మంది సన్నకారు ైరైతుల వద్ద 44 శాతం భూమి మాత్రమే ఉంది. దేశంలోని మొత్తం రైతుల్లో మూడింట ఒకవంతు రైతుల వద్ద సగటున 0.4 హెక్టార్లకంటే తక్కువ భూమి మాత్రమే ఉంటోంది. 50 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయి. ప్రతి రైతుకు రూ.47 వేల మేరకు అప్పు భారం ఉంటోందని అంచనా. ఐదేళ్లలో ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు 33 శాతం పెరిగాయి. ఇదే సమయంలో ప్రభుత్వం వ్యవసాయ సబ్సిడీలను పరిమితం చేసింది. ఇలాంటి రైతులే ఇప్పుడు దారిద్య్రంలో మునిగిపోయారు. తగ్గు తున్న రాబడులు, పెరుగుతున్న భూ కమతాలు, క్షీణిస్తున్న పంట దిగుబ డులు మొత్తంగా రైతు జీవితానికి ఒక తార్కిక ముగింపు పలుకుతున్నాయి. నిజంగానే ఇప్పుడు వ్యవసాయం గౌరవప్రద మైనది కాకుండాపోయింది. పరిహారం తప్పనిసరి భారత్‌లో క్రమబద్ధంగా ఉండని పంటల విధానం, నష్టపరిహార వ్యవస్థ రైతుల వ్యథలను మరింతగా తీవ్రతరం చేస్తోంది. భూగర్భ జలాలు అడుగంటు తున్నప్పటికీ మెట్టప్రాంతాల్లో నివసించే రైతులను అధిగ దిగుబడినిచ్చే గోధుమ, వరి పంటలను పండించేలా ఒత్తిడి చేస్తున్నారు. దేశంలో 61 శాతం వ్యవసాయం భూగర్భజలాలమీదే ఆధారపడుతోం ది. రాజస్థాన్, మహారాష్ట్రలలో వ్యవసాయ స్వావ లంబన స్థాయి అడుగంటి పోయింది. ఈ రాష్ట్రాల్లోని అత్యధిక వ్యవసాయ మండలాలను ఇప్పటికే మోతాదుకు మించి సాగుభూములను పిండుతున్న ప్రాంతాలుగా గుర్తించారు. పంటలకు నష్టం కలిగితే ప్రస్తుతం అందిస్తున్న పరిహార విధానం భూ యజమానులకే ఎక్కువ ప్రయో జనం కలిగిస్తూ, వ్యవసాయ కూలీలకు నష్టదాయ కంగా మారింది. దీనికి తోడుగా పంటల నష్టంపై అంచనా విధానం, దానికనుగుణమైన నిధుల బదలాయింపు కూడా సంక్లిష్టంగా తయారయ్యాయి. పంటల నష్టంపై తగిన డాక్యుమెంటేషన్ లేమి, లంచగొండి అధికార వర్గం, అసమర్థ స్థానిక యంత్రాంగం కారణంగా నష్టపరిహారాన్ని అందిం చడం, సకాలంలో చౌక రుణాలను లేదా బీమాను కల్పించడం అనేవి సవా లుగా మారాయి. భూ యాజమాన్య హక్కులలో పారదర్శకతను పెంచడం, భూ సంబంధిత న్యాయ సంస్కరణలు చేపట్టడం వల్ల ఇలాంటి సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయవచ్చు. ఉపగ్రహ ఛాయాచిత్రాలను, చౌక వ్యయంతో కూడిన ద్రోన్లను సమర్థవంతంగా ఉపయోగించటం ద్వారా పంటల నష్టం అంచనాకు పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. రుణగ్రస్తత నుంచి ఉపశమనం రైతు ఆత్మహత్యలకు ప్రధాన కారణం రుణగ్రస్తతే. నికరాదాయం రానురాను తగ్గుముఖం పడుతున్నప్పటికీ, అనుత్పాదక ఉపయోగం కోసం అధిక వడ్డీతో రుణాలను తెచ్చుకునే తీవ్ర చర్యలకు రైతులు పూనుకుంటున్నారు. ఒకవైపు అధిక దిగుబడులను, పంటలకు అధిక ధరలను ఆశిస్తూ, మరోవైపు ఆత్మ హత్యలకు పాల్పడుతున్న రైతు కుటుంబాలు పేరుకుపోయిన రుణాల గురించే ఎక్కువగా ప్రస్తావిస్తున్నాయి. బీటీ కాటన్ ప్రవేశంతో ఉత్పాదక ఖర్చులు తారస్థాయికి చేరుకున్నాయి. బీటీ పత్తి పంట దిగుబడులు సాగునీటి లభ్యతపైనే ఎక్కువగా ఆధారపడుతుండగా, రైతులు మాత్రం బావులు, పంప్ సెట్లపై మదుపు చేస్తున్నారు. వర్షాలు తగ్గినప్పుడు, భూగర్భ జలాలు అడుగుకు వెళ్లిపోయిప్పుడు రైతులు పెట్టే ఈ రకం పెట్టుబడులు ప్రాణాం తకంగా మారుతున్నాయి. సాగునీటి వ్యవస్థ పెరుగుతున్నప్పటికీ వ్యవ సాయం రాన్రానూ అస్థిరంగా మారుతోంది. మార్కెట్ కానీ, వాతావరణం కానీ నిరాశపర్చిందంటే రైతులు మరింత దారిద్య్రంలోకి కూరుకు పోతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో వ్యవస్థీకృత పెట్టుబడులు రైతులకు సులభంగా అందుబాటులోకి తీసుకురావాలి. షావుకార్ల నుంచి రుణాలు తీసుకోవడాన్ని తగ్గించాలి. పదే పదే రుణవలయంలో కూరుకుపోవడాన్ని తగ్గించాలంటే నిధుల చెల్లింపుల సమయంలో రైతులకు మేలు కలిగించే నిబంధనలను సులభతరం చేయాలి. తమ ఆస్తులకు, ఆదాయాలకు మించి అధిక రుణాలు తీసుకున్న రైతుల వివరాలను గ్రామస్థాయిలో క్రమానుగతంగా రూపొందించి, రుణభారంతో ఆత్మహత్యల వైపు మొగ్గే అవకాశం కనిపిస్తున్న రైతులను గుర్తించగలగాలి. ఇలాంటి వారికి సకా లంలో రుణాలను కల్పించడానికి, బీమా క్లెయి ముల పరిష్కారానికి గాను సిద్ధంగా ఉన్న రైతుల జాబితాను ఉపయోగించవచ్చు. తద్వారా ఆత్మహ త్యలవైపు కొట్టుకుపోకుండా రైతులకు కౌన్సె లింగ్‌ను అందించవచ్చు. సాగునీటి పునర్వ్యవస్థీకరణ సాగునీటిని పునర్వ్యవస్థీకరించడం దేశంలో ఇప్పటికీ సంక్లిష్టంగా ఉంది. బిందు సేద్యం దీనికి ఒక స్పష్టమైన పరిష్కారంగా కనిపిస్తోంది. అవ్యవ స్థంగా ఉన్న భూ కమతాలకు, ఎగుడుదిగుడులుగా ఉండే వ్యవసాయ భూములకు బిందుసేద్యం చక్కటి సాధనం. బిందుసేద్యం ద్వారా నీటి విని యోగాన్ని 70 శాతం వరకు గరిష్టంగా ఉపయోగిం చుకోవచ్చు. దీంతో 230 శాతం వరకు అధిగ దిగు బడులను సాధించవచ్చు. ఎరువుల సమర్థ విని యోగాన్ని 30 శాతం మేరకు పెంచుకోవచ్చు. ప్రారంభ వ్యవసాయ పెట్టుబడి ఇప్పటికీ అత్యధికంగానే ఉండటం ప్రధాన అడ్డంకిగా మారింది. చిన్న కమతాలు ఎక్కు వగా ఉన్న దేశంలో ల్యాండ్ పూలింగ్ (భూములను ఒక్కటిగా చేయడం) ద్వారా రెతులు మరింత సమర్థవంతంగా వ్యవసాయం చేయడానికి, అధిక ప్రయోజనాలు పొందడానికి వీలు కలుగుతుంది. వీటికి తోడుగా ఎస్జీఎస్వై వంటి సబ్సిడీ పథకాలు ల్యాండ్ పూలింగ్ వంటి వ్యవ హారాలకు ఇతోధికంగా తోడ్పడతాయి. ఒకవేళ సబ్సిడీల మంజూరులో జాప్యం జరిగినట్లయితే వాటి మంజూరు, విడుదల కోసం పట్టుపట్టకుండా రైతులకు అవసరమైన రుణాలను వెంటనే అందించేలా ప్రభుత్వం బ్యాం కులను ప్రోత్సహించాలి. కుప్పకూలిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే తమను తాము చంపుకుంటున్నట్లు వారిని వర్గీకరించడం సబబు కాదు. పైగా అలాంటి పదజాలం ఒక అపప్రయోగం కూడా. వాస్తవానికి జీవించి ఉండ టానికి జరిపే సుదీర్ఘ పోరాటంలో వారు కేవలం ఓడిపోయారంతే. రైతులను కించపర్చే అభిప్రాయాలను, భావనలను మార్చడానికి ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో మరింత శ్రద్ధవహించి సన్నకారు వ్యవసాయానికి అవసరమైన నిర్దిష్ట అంశాలను పరిగణనలోకి తీసుకుని వాటిని వెంటనే అమలులో పెట్ట గలగాలి. అత్యంత నిరాశాజనకంగా మారిన రైతు ఆర్థిక వ్యవస్థను మార్చ డానికి, పునర్జీవింపజేయడానికి బలమైన సామాజిక, సంస్థాగత యంత్రాం గాలను నెలకొల్పడం ఎంతైనా అవశ్యం. వ్యాసకర్త బీజేపీ ఎంపీ వరణ్ గాంధీ fvg001@gmail.com -
ఖాకీవనంలో ప్రక్షాళన సాధ్యమా!
స్టేట్ సెక్యూరిటీ కమిషన్ల ఏర్పాటులో ప్రతిపక్ష నాయకుడిని భాగస్వామిని చేయవలసిన అవసరం ఉంది. అలాగే పదవిలో ఉన్న లేదా పదవీ విరమణ చేసిన సీనియర్ న్యాయమూర్తికి కూడా స్థానం కల్పించాలి. అయితే మన 26 స్టేట్ సెక్యూరిటీ కమిషన్లలో ఆరు ప్రతిపక్ష నేతను సభ్యునిగా ఎంపిక చేయనే లేదు. బిహార్ కమిషన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు డెరైక్టర్ జనరల్, హోంశాఖ కార్యదర్శి మాత్రమే సభ్యులు. నిజానికి పోలీసుల పనితీరు విధానాన్ని రూపొందించడానికి ఈ కమిషన్లను ఉపయోగించుకోవాలి. రాజకీయమయమైపోయిన మన అసమర్థ పోలీసు వ్యవస్థ దేశంలో హింస మీద క్రమంగా గుత్తాధిపత్యాన్ని సాధించింది. పోలీసు శాఖలో పెరిగిన పైశా చకత్వం, బలవంతపు వసూళ్లు, వారు చేస్తున్న ఇతర నేరాలు, పెరుగుతున్న నిర్బంధాల గురించి నిత్యం నమోదవుతున్న నివేదికలు భయం గొలుపుతు న్నాయి. 2014లో దేశం నలుమూలల నుంచి పోలీసులపై 47,774 ఫిర్యా దులు అందాయి. వీటిలో కేవలం 2,601 ఫిర్యాదులను క్రిమినల్ కేసులుగా మార్చారు. 1,453 మంది పోలీసులను మాత్రం అరెస్ట్ చేశారు. 20,126 ఫిర్యాదులను తప్పుడు ఆరోపణులుగా తేల్చారు. 2014లో మానవహక్కుల ఉల్లంఘన ఆరోపణలతో పోలీసుల మీద 108 కేసులు నమోదైనాయి. మళ్లీ వీటిలో 62 కేసులు తప్పుడు కేసులని కొట్టి పారేశారు. ముగ్గురు పోలీసులకు మాత్రమే శిక్షలు పడ్డాయి. 2014 లెక్కల ప్రకారం, పోలీసు నిర్బంధంలో ఉన్న ప్పుడు 93 మంది మరణించినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 25 కేసు లకు సంబంధించి న్యాయ విచారణలు జరిగాయి. 26 మంది పోలీసుల మీద చార్జిషీట్లు కూడా దాఖలు చేశారు. కానీ వీరిలో ఏ ఒక్కరికి శిక్ష పడలేదు. ఒక పక్క నేరాలు పెరుగుతుంటే (పెండింగ్‌లో ఉన్న భారత శిక్షాస్మృతి కేసులు- 94,8073. కొత్త కేసులు 2,851,563), మరో పక్క లాఠీచార్జీలు కూడా పెరిగి పోతున్నాయి (2014లో ఇలాంటివి 383 కేసులు నమోదు కాగా, ఇందులో గాయపడినవారు లేదా మరణించినవారు 262 మంది). ఇలా ఉండగానే, భారతీయ పోలీసుల ‘పశు ప్రవర్తన’ గురించి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. నిరసన ప్రదర్శన నిర్వహించిన ఉపాధ్యాయుల మీద, మరీ ముఖ్యంగా అం దులో పాల్గొన్న మహిళల మీద బిహార్ పోలీసులు జరిపిన లాఠీచార్జిని దృష్టిలో ఉంచుకుని అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. 1857 తిరుగుబాటు సమయంలో వలస ప్రభుత్వానికి అండగా నిలబడే ఒక అధికార పోలీసు వ్యవస్థను నిర్మించడానికి రూపొందించినదే మన పోలీస్ చట్టం (1861). ఈ చట్టంలోని మూడో సెక్షన్ ప్రకారం రాష్ట్ర పోలీసుల మీద ఆయా రాష్ట్రాలకు పర్యవేక్షణ అధికారం సంక్రమించింది. జిల్లా స్థాయిలో మా త్రం ద్వంద్వ విధానంతో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అజమాయిషీలో పోలీసు యంత్రాంగం పని చేస్తుంది. అయినా జిల్లా మేజిస్ట్రేట్ అదుపులోనే, నిర్దేశకత్వంలోనే జిల్లా పోలీసు యంత్రంగం పనిచేస్తుంది. అయితే పోలీస్ చట్టంలోని ఏడో సెక్షన్ ఆ శాఖలో కనిపించే పెత్తందారీ లక్షణం ఒక పరం పరగా కొనసాగేటట్టు చేస్తున్నది. ఉన్నతాధికారులకు కిందిస్థాయి అధికారులు ఒదిగి ఒదిగి ఉండక తప్పని స్థితిని కలిగిస్తున్నది ఇదే. స్వాతంత్య్రం రావడా నికి ముందు పోలీసులు వారి ఉన్నతాధికారులకీ, రాజకీయ ప్రభువులకీ తప్ప మరెవ్వరికీ జవాబుదారులు కాదు. మారని చట్టాలు స్వాతంత్య్రానంతర భారతదేశంలో పోలీసుశాఖ మార్పునకు అతీతమైన వ్యవస్థగా ఉండిపోయింది. వివిధ రాష్ట్రాలు పోలీసు చట్టాలను తెచ్చాయి (బాంబే పోలీస్ చట్టం 1951, కేరళ పోలీస్ చట్టం 1960 మొదలైనవి). కానీ ఇవన్నీ 1861 నాటి పాత చట్టం తరహాలోనే రూపొందాయి. పోలీసు వ్యవ స్థను ప్రజాస్వామికం చేయవలసిన అవసరం, పోలీసు శాఖను దుర్విని యోగం చేయకుండా నిరోధించే జాగ్రత్తలు వంటి అంశాలను ఈ చట్టాలు కూడా పట్టించుకోలేదు. 1979లో జాతీయ పోలీస్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఒక నమూనా పోలీసు చట్టంతో పాటు, ఎనిమిది నివేదికలను, నిర్ది ష్టమైన సిఫారసులను కూడా ఈ కమిషన్ చేసింది. అయితే వీటిలో దేనినీ స్వీకరించలేదు. తరువాత ఏర్పాటైన రెబిరో కమిటీ (1999), పద్మనాభయ్య కమిటీ (2000) పోలీసు శాఖలో సంస్కరణల గురించి దృఢమైన సిఫారసులు చేశాయి. ప్రకాశ్ సింగ్ వ్యాజ్యంలో తీర్పు వెలువరించిన (2006) సుప్రీంకోర్టు ఏడు మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించవలసిందని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసు శాఖలో చట్టవిరు ద్ధమైన రాజకీయ జోక్యం నివారించడం, పోలీసు డెరైక్టర్ జనరల్ నియామ కంలో పారదర్శకత, శాంతిభద్రతలు-నేరపరిశోధక వ్యవస్థల విభజన, ఫిర్యా దుల స్వీకరణ వంటివి ఆ ఏడు మార్గదర్శకాలలో ముఖ్యమైనవి. కానీ ఎప్పటి లాగే ఇవీ అమలుకు నోచుకోలేదు. పోలీసు శాఖలో రాజకీయ జోక్యాన్ని నివారించడం గురించి ఆలోచించా లంటే, ఆ శాఖ వ్యవస్థీకృత నిర్మాణాన్ని పరిగణనలోనికి తీసుకోవాలి. ఆ శాఖలో పదోన్నతులు అమ్మకానికీ, ప్రత్యేక ‘అర్హతలు’ కలవారికి లభిస్తు న్నాయి. ఇది ఉద్యోగులలో అనిశ్చితినీ, నైరాశ్యాన్నీ నింపుతోంది. పోలీస్ డెరై క్టర్ జనరల్, 3-4 సీనియర్ అధికారుల సహకారంతో పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తే అందరికీ న్యాయం చేసే రీతిలో పదోన్నతులు, పోస్టిం గులు ఇవ్వడానికి అది ఉపయోగపడుతుంది. యూపీఎస్సీ నియమించిన ముగ్గురు సీనియర్ సభ్యులతో కూడి న ప్యానెల్‌కు పోలీస్ డెరైక్టర్ జనరల్‌ను ఎంపిక చేసే బాధ్యతను అప్పగించాలి. సర్వీస్ రికార్డు, అనుభవం ఆధారంగా పదోన్నతి ఇవ్వాలి. పోలీస్ శాఖ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండాలంటూ పోలీస్ చట్టం (1861) ఇచ్చిన నిర్వచనం మేరకు ఆ శాఖ నిత్య విధులలో కూడా రాజ కీయ జోక్యం విపరీతం కావడానికి దోహదం చేసింది. అయితే పోలీస్ వ్యవస్థ మీద ప్రభుత్వ ఆధిపత్యం మితిమీరకుండా స్టేట్ సెక్యూరిటీ కమిషన్లు ప్రభు త్వానికీ, పోలీస్ శాఖకూ నడుమ వారధులుగా వ్యవహరించాలి. కామన్వెల్త్ పౌరహక్కుల వ్యవస్థ చేసిన సర్వే ప్రకారం (ఆగస్ట్ 2014) మన 26 రాష్ట్రాల లోనూ స్టేట్ సెక్యూరిటీ కమిషన్లు ఏర్పాటైనాయి. కానీ పని చేస్తున్నవి కేవలం 14. మళ్లీ 2007 నుంచి వీటి పనితీరును గమనిస్తే ఎక్కువ కమిషన్లు ఒకటి రెండుసార్లు మాత్రమే సమావేశమైనట్టు గమనిస్తాం. కాగా పోలీస్ శాఖకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఇప్పటికీ సవాలుగానే ఉన్నాయి. జవాబుదారీతనం కావాలి స్టేట్ సెక్యూరిటీ కమిషన్ల ఏర్పాటులో ప్రతిపక్ష నాయకుడిని భాగస్వామిని చేయవలసిన అవసరం ఉంది. అలాగే పదవిలో ఉన్న లేదా పదవీ విరమణ చేసిన సీనియర్ న్యాయమూర్తికి కూడా స్థానం కల్పించాలి. అయితే మన 26 స్టేట్ సెక్యూరిటీ కమిషన్లలో ఆరు ప్రతిపక్ష నేతను సభ్యునిగా ఎంపిక చేయనే లేదు. బిహార్ కమిషన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు డెరైక్టర్ జన రల్, హోంశాఖ కార్యదర్శి మాత్రమే సభ్యులు. నిజానికి పోలీసుల పనితీరు విధానాన్ని రూపొందించడానికి ఈ కమిషన్లను ఉపయోగించుకోవాలి. అవి పోలీసుల పనితీరును సమీక్షించాలి. ఈ కమిషన్ నిర్మాణం తీరు రెండు పక్షా లను సమన్వయం చేయగలిగే విధంగా, అదే సమయంలో పాలకుల పరిమి తులను నిర్వచించేదిగా ఉండాలి. పోలీసులు జవాబుదారీతనంతో ఉండరనీ, పోలీసు అరాచకాల బాధితులకు కూడా పరిహారం చెల్లించే తీరులో ఉండరనీ ప్రజల భావన. మంచి రేటింగ్ కోసం పోలీసులు నేరాల గణాంకాలను దాచి పెడుతున్నారు. పోలీసులలో అవినీతి వ్యవహారం కేసులను నమోదు చేసుకో వడానికి నిరాకరించే విధానానికి కూడా దారితీస్తోంది. ఇప్పుడు ప్రపంచ మంతా ఫిర్యాదుల స్వీకరణకు చట్టబద్ధ యంత్రాంగాన్ని నెలకొలుపుకునే విధానం వచ్చింది. పోలీసుల మీద వచ్చిన ఫిర్యాదులను పారదర్శకంగా, స్వతంత్రంగా విచారించే అధికారం ఆ విధానానికి కల్పిస్తున్నారు. మనకు కూడా శాఖాపరమైన దర్యాప్తు విధానానికి బదులుగా, ఇటు రాష్ట్రస్థాయిలో, అటు జిల్లాస్థాయిలో పోలీస్ ఫిర్యాదు అధి కారవ్యవస్థ ఏర్పాటు కావాలి. పునర్ నిర్మాణంపై దృష్టి పోలీసు వ్యవస్థ భారంగా మారుతోంది. ఉదాహరణకు నేర పరిశోధక విభా గాన్ని తీసుకుంటే, ఇవి చాలా సందర్భాలలో పేలవంగా రూపొందుతున్నా యి. పెద్దగా తర్ఫీదులేని వారి చేత చాలా మందగమనంతో సాగుతున్నాయి. ఇతర పనులతో, రాజకీయ బాధ్యతలతో దర్యాప్తులకు ఏళ్లూ పూళ్లూ పడు తోంది. ప్రత్యేక అంశాల మీద దృష్టి సారించడానికి, మొత్తంగా పనితీరు మెరు గుపడడానికి శాంతిభద్రతల విభాగాన్ని, పరిశోధక విభాగాన్ని వేరు చేయడం అనివార్యం. గ్రామీణ ప్రాంతంలో ఉండే పోలీస్ స్టేషన్ల పరిధి 150 కిలోమీ టర్లకు మించరాదు. పట్టణ ప్రాంతంలో జనాభాను ప్రాతిపదికగా చేసుకో వాలి (ఒక స్టేషన్ పరిధిలో 60,000 జనాభా ఉండేలా చూడాలి. ఈ స్టేషన్లో సంవత్సరానికి 700 నేరాలకు మించి నమోదైతే మరో స్టేషన్ ఏర్పాటు చేయాలి). కేంద్రీయ పోలీస్ కమిటీ నిర్వహణలో ఉండే విధంగా అఖిల భారత పోలీస్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటుచేయాలి. పీలియన్ సూత్రాల (రాబర్ట్ పీలే అనే బ్రిటిష్ అధికారి పోలీసులకు కోసం రూపొందించిన నైతిక సూత్రాలు) అమలు భారతదేశంలో దాదాపు నిలిచిపోయింది. దేశంలో బల మైన, కేంద్రీకృత పోలీస్ వ్యవస్థ కోసం, ఇంకా చెప్పాలంటే పట్టణ ప్రాంత నేరాలను అరికట్టడానికీ, సామాజిక క్షేమానికి పూచీపడే రీతిలో, రాజకీయంగా తటస్థంగా ఉండే పోలీస్ వ్యవస్థ కోసం ఉద్దేశించినవే ఈ సూత్రాలు. ఈ విధమైన దృక్పథాన్ని ఆకాంక్షించడం వల్లనే మన ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టమవుతుంది. పాలనా వ్యవస్థల మీద విశ్వాసం పెరుగుతుంది. వరుణ్ గాంధీ (వ్యాసకర్త బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి మనేకా గాంధీ కుమారుడు) ఈమెయిల్: fvg001@gmail.com -
ఉరిశిక్షపై వరుణ్ గాంధీ ఏమన్నారో తెలుసా?
మరణశిక్షను రద్దు చేయాలా.. వద్దా? ఈ అంశంపై కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీకి చెందిన ఎంపీ వరుణ్ గాంధీ ఇప్పుడు ఉరిశిక్షను రద్దుచేయాలని పోరాడేవాళ్ల జాబితాలోకి చేరిపోయారు. మరణశిక్ష వల్ల కేవలం పగ చట్టబద్ధం అయిపోతుందని వ్యాఖ్యానించారు. ఉరిశిక్ష వల్ల సమాజంలో అరాచకత్వం పెరిగిపోతుందన్నది యుగాలుగా రుజువు అవుతూనే ఉందన్నారు. 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ ఉరితీత నేపథ్యంలో వరుణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచంలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మరణశిక్షను నిషేధించాలని వరుణ్ గాంధీ చెప్పారు. అరుదైన వాటిల్లోకెల్లా అరుదైన కేసు అంటే ఏమిటన్న దానికి భారత న్యాయ వ్యవస్థలో స్పష్టమైన నిర్వచనం లేదని, న్యాయమూర్తి నిర్ణయాన్ని బట్టి, సామాజిక - రాజకీయ నమ్మకాలను బట్టి ఇది నిర్ణయం అవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో.. మరణశిక్ష మాత్రమే ఒక మాయని మచ్చగా ఉందన్నారు. వాస్తవానికి ఇప్పుడు బతుకుతున్న చాలామందికి చావుకు అర్హత ఉందని, చనిపోయిన కొంతమందికి బతికే అర్హత ఉందని వరుణ్ చెప్పారు. -
సుష్మ భర్తకు డెరైక్టర్ పదవి!
-
సుష్మ భర్తకు డైరెక్టర్ పదవి!
సొంత కంపెనీలో స్వరాజ్ కౌశల్‌కు డైరెక్టర్ షిప్ ఆఫర్ చేసిన లలిత్ మోదీ సోనియా ద్వారా నా ఇష్యూస్‌ని వరుణ్ గాంధీ సెటిల్ చేస్తానన్నారు మోదీ సంచలన ట్వీట్; ఖండించిన బీజేపీ నేత వరుణ్ న్యూఢిల్లీ: ‘లలిత్‌గేట్’లో మరో మలుపు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కుటుంబంతో ఐపీఎల్ స్కామ్‌స్టర్ లలిత్ మోదీకున్న సంబంధాలకు సంబంధించిన అంశమొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. లలిత్ తండ్రి కేకే మోదీ చైర్మన్, ఎండీగా ఉన్న ఇండోఫిల్ ఇండస్ట్రీస్ సంస్థలో డైరెక్టర్ పదవి ఇస్తామని సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్‌కు లలిత్ ప్రతిపాదించారన్న వార్త తాజా వివాదాన్ని మరింత పెంచింది. ఆ వార్త నిజమేనని, అయితే, తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించానని స్వరాజ్ కౌశల్ వివరణ ఇచ్చారు. అలాగే, సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పరిశీలనకు రాకముందే ఆ ప్రతిపాదనను లలిత్ వెనక్కి తీసుకున్నారని కేకే మోదీ వివరణ ఇచ్చారు. మోదీ, సుష్మ కుటుంబాల మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలను ఇది వెల్లడి చేస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. పోర్చుగల్ వెళ్లేందుకు లలిత్‌కు బ్రిటన్ నుంచి ట్రావెల్ డాక్యుమెంట్లు లభించేలా సుష్మ సహకరించిన కొన్ని నెలలకే ఆమె భర్త స్వరాజ్ కౌశల్‌కు డెరైక్టర్ పదవి ఆఫర్ చేశారని, ఇదంతా ఇద్దరికీ లబ్ధి చేకూరే డీల్‌లో భాగమేనని ఆరోపించింది. దీనిపై సుష్మా స్వరాజ్ వివరణ ఇవ్వాలని, ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికైన మౌనం వీడాలని డిమాండ్ చేసింది. విదేశాంగ మంత్రులుగా ఉండగా మాధవ్ సింగ్ సోలంకీ, నట్వర్ సింగ్‌లపై ఆరోపణలు వచ్చినప్పుడు.. తక్షణమే రాజీనామా చేయాలని వారిని కాంగ్రెస్ పార్టీ ఆదేశించిన విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జెవాలా గుర్తు చేశారు. యూకే హైకమిషనర్ జేమ్స్ బేవన్తో సుష్మా స్వరాజ్ లలిత్ మోదీ ట్రావెల్ డాక్యుమెంట్స్ గురించి చర్చించినప్పటి సమావేశం పూర్తి వివరాలను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఎవరైనా కేంద్ర మంత్రి బంధువుకు లలిత్ మోదీ ఇటీవల ఉద్యోగం ఆఫర్ చేశారా?, ఒకవేళ అదే నిజమైతే, అది ఎలాంటి జాబ్?’ అనే విషయంపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలన్నారు. ప్రధాని మోదీ శాశ్వత మౌన యోగాలో ఉన్నారని పార్టీ మరో అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఎద్దేవా చేశారు. ‘ఎంతమంది బీజేపీ నేతలకు, ముఖ్యమంత్రులకు లలిత్ మోదీతో స్నేహపూర్వక, మానవతావాద, కుటుంబ సంబంధాలున్నాయో ప్రధాని చెప్పాలి’ అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘సుష్మ, రాజేలను తొలగించండి’ పరారీలో ఉన్న నిందితుడు లలిత్ మోదీకి సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి సుష్మ, రాజస్తాన్ సీఎం వసుంధర రాజేలను తక్షణమే పదవుల్లోనుంచి తొలగించాలని సీపీఐ డిమాండ్ చేసింది. విద్యార్హతల విషయంలో పరస్పర విరుద్ధ విషయాలను వెల్లడించిన ఇరానీపై చర్యలు తీసుకోవాలంది. చండీగఢ్‌లో జరుగుతున్న పార్టీ జాతీయ మండలి సమావేశాల్లో ఆమోదించిన 4 తీర్మానాల్లో సుష్మ, రాజేల తొలగింపునకు సంబంధించిన తీర్మానమూ ఒకటి. రోజుకో కొత్త వార్త బయటపడుతున్న నేపథ్యంలో.. మొత్తం లలిత్ వ్యవహారంపై కోర్టు నియమిత ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఆరు కోట్ల డాలర్లు అడిగారు..! ‘లలిత్‌గేట్’లోకి తాజాగా వరుణ్‌గాంధీని లలిత్ మోదీ లాగారు. కొన్నేళ్ల క్రితం వరుణ్ లండన్‌లోని తన ఇంటికి వచ్చి, సోనియాగాంధీ ద్వారా తన సమస్యలను పరిష్కరిస్తానని ప్రతిపాదించారంటూ లలిత్ బుధవారం వరుస ట్వీట్లు వదలడంతో కొత్త వివాదానికి తెర లేచింది. ఆ వార్తలు నిరాధారమని, ఆ మతిలేని ఆరోపణలకు స్పందించడం తన స్థాయికి తగనిదంటూ వరుణ్ తీవ్రంగా స్పందించారు. ‘వరుణ్ కొన్నేళ్ల క్రితం లండన్‌లోని మా ఇంటికొచ్చారు. కాంగ్రెస్‌తో, తన ఆంటీ(పెద్దమ్మ) సోనియాగాంధీతో నా వ్యవహారాలను సెటిల్ చేస్తానని హామీ ఇచ్చారు. తన పెద్దమ్మ(సోనియా) సోదరిని కలవమని నాకు సూచించారు’ అని లలిత్ ట్వీట్ చేశారు. ‘ఆ తర్వాత ఆ ఇటలీ ఆంటీ 6 కోట్ల డాలర్లు(రూ. 381 కోట్లు) కావాలంటున్నారని మా కామన్ ఫ్రెండ్ నాకు చెప్పాడు. తర్వాత వరుణ్ నాకు ఫోన్ చేశారు. నేను కోపంగా ‘మీకు పిచ్చా? మీ పని మీరు చూసుకోండి’ అని చెప్పా. ఈ విషయాల్ని వరుణ్ ఖండించగలరా?’ అంటూ మరో ట్వీట్లో ఆరోపించారు. ‘మీ ఆంటీ(సోనియా గాంధీ) ఏం అడిగారో దయచేసి ప్రపంచానికి చెప్పండి. ప్రఖ్యాత జ్యోతిష్యుడైన, మనిద్దరికీ బాగా స్నేహితుడైన వ్యక్తే దీనంతటికి సాక్ష్యం. నిజం చెప్పండి. కొన్నేళ్ల క్రితం లండన్‌లోని రిట్జ్ హోటల్లో మీరున్నప్పుడు ఓసారి మా ఇంటికొచ్చారా, లేదా?’ అని వరుణ్‌ను ఉద్దేశించి మరో ట్వీట్ వదిలారు. ఈ ఆరోపణలను వరుణ్‌తో పాటు బీజేపీ కూడా ఖండించింది. ‘సోనియా, వరుణ్ వేర్వేరు పార్టీల వారు. వారిద్దరి కుటుంబాల మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో అందరికీ తెలుసు’ అని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు. లలిత్ ఆరోపణలపై సోనియా గాంధీ జవాబివ్వాలని బీజేపీ నేత శ్రీకాంత్ శర్మ డిమాండ్ చేశారు. -
మరో ట్వీట్ బాంబ్ పేల్చిన మోదీ..
న్యూఢిల్లీ : ట్వీట్ల మీద ట్వీట్లతో రాజకీయ నేతలకు గుబులు పుట్టిస్తున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ ...తన ఖాతాలోంచి మరో వికెట్ బయటకు తీశారు. మోదీ గేట్లో రోజుకొక పేరు బయటపెడుతూ గందరగోళం సృష్టిస్తున్న మోదీ మరో ట్వీట్ బాంబ్ పేల్చారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలోని అగ్ర నాయకులపై ట్విట్టర్ అస్త్రాలు సంధించిన లలిత్ తాజాగా బీజేపీ యువ నాయకుడు వరుణ్ గాంధీని టార్గెట్ చేశారు. వరుసగా కాంగ్రెస్ నాయకులు రాజీవ్ శుక్లా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై ఎక్కుపెట్టిన ట్వీట్ల బాణాన్ని ఇపుడు వరుణ్ పై గురిపెట్టారు. కొన్ని సంవత్సరాల క్రితం తనను వరుణ్ లండన్‌లో కలిశారని...మొత్తం వ్యవహారాన్ని సెటిల్చేయడానికి 60 మిలియన్ డాలర్లు డిమాండ్ చేశాడని తెలిపారు. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, తన ఆంటీ సోనియాగాంధీతో మాట్లాడతానన్నారంటూ ట్వీట్ చేశారు. సినిమా చాలా ఉంది. మెల్లమెల్లగా బయటపెడతా అని హెచ్చరిస్తూ వస్తున్న లలిత్ మోదీ నిన్నగాక మొన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక, అల్లుడు రాబర్ట్ వాద్రాలను గత ఏడాది లండన్‌లో కలిశానంటూ వివాదాన్ని రాజేశారు. గాంధీ కుటుంబ సభ్యులను వివాదంలోకి లాగి కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేశారు. అనేక నర్మగర్భ వ్యాఖ్యలు, పరోక్ష హెచ్చరికలతో లలిత్ మోదీ వరుస ట్వీట్లు సంధిస్తున్న సంగతి తెలిసిందే. -
అధోగతిలో ఉన్నత విద్య
విశ్లేషణ యూనివర్సిటీలు తమ అధ్యాపకులను డిగ్రీ కళాశాలల్లో బోధించకుండా నిరోధించి మేధోపరమైన పోషకాహార లోపాన్ని పెంపొందింపజేస్తున్నాయి. వృత్తి విద్యా సంస్థలకు లెసైన్సులను జారీ చేసే సంస్థలను నిషేధించి, వాటిని తిరిగి విశ్వవిద్యాలయాలకు అప్పగించాలి. వృత్తి విద్యలో ప్రత్యేకీకరణకు ప్రాధాన్యం ఇస్తూనే సమగ్ర బోధనాంశాలను చేర్చడం ద్వారా వివిధ రంగాల మధ్య జ్ఞాన వారధులను నిర్మించగలం. ఐటీఐలు, పాలిటెక్నిక్‌లకు తగు గుర్తింపునిచ్చి, వర్సిటీల పరిధిలోకి తేవాలి. కలకత్తా, అలహాబాద్ విశ్వవిద్యాలయాలు ఒకప్పుడు నోబెల్ బహుమతి గ్రహీతలను, ప్రధాన మంత్రులను అందించాయి. ప్రపంచ విశ్వవిద్యాల యాల ర్యాంకింగ్స్‌లో నేడు వాటి స్థానం 400కు పైగానే! బ్రిక్స్ దేశాల్లోని 20 అగ్రశ్రేణి వర్సిటీల్లో ఒక్కటి కూడా మనది లేదు. మన విశ్వవిద్యాలయాలు అతి వేగంగా ‘‘మునిసిపల్ ఉన్నత విద్యాలయాలు’’గా దిగజారిపోతున్నా యి. ప్రవేశాలకు, డిగ్రీలకు భారీగా కేపిటేషన్ ఫీజులను వసూలు చేస్తున్న అధిక భాగం ప్రైవేటు విద్యా సంస్థల పరిస్థితీ అదే. ఆలోచన, సృజనాత్మకత, పరిశోధన, నవకల్పనల ప్రాధాన్యాన్ని తగ్గించడం ద్వారా ఈ వ్యవస్థ మేధో పరమైన పిరికితనాన్ని ప్రోత్సహిస్తోంది. భారత విశ్వవిద్యాలయ వ్యవస్థ విఫలమైంది. ఫలితంగా తరాలు గడిచేకొద్దీ ప్రమాణాలు దిగజారుతు న్నాయి. మన ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో 19%, ఇతర పట్టభద్రుల్లో 5% మాత్రమే ఉద్యోగ నియామకాలకు అర్హులు. దేశవ్యాప్తంగా 5,000కు పైగా కళాశాలలు, 200కుపైగా యూనివర్సిటీలు ఉన్నాయి. వాటికి, వాటిని నియం త్రించే సంస్థలకు మధ్య ఆచరణలో పోషకులకు, సేవలందించే వారికి మధ్య ఉండే సంబంధం నెలకొంది. సంస్థాగతమైన క్షీణత మన విశ్వవిద్యాలయాలన్నీ అనిశ్చితిమయమైన మానవ వనరుల శాఖ నియంత్రణలో ఉన్నాయి. 2013లో ప్రవేశపెట్టిన ‘రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభి యాన్’ (ఆర్యూఎస్ఏ) పథకం వికేంద్రీకరణకు ఉద్దేశించినదే గానీ, అమ లులో అది వెనుకబడి ఉంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నేటికీ కొన్ని వందల వర్సిటీలను, వేల కళాశాలలను పర్యవేక్షిస్తోంది. ఇది నిజాయితీ, సృజనాత్మకతల గొంతు నులిమేస్తోంది. చైనాలోని ఉన్నత విద్యా విధానమే మనకంటే మరింత ఎక్కువ ప్రజాస్వామికమైనదనిపిస్తుంది. మొత్తంగా మన విశ్వవిద్యాలయ వ్యవస్థ్థను విప్లవాత్మకంగా, మౌలికంగా పునర్వ్యవస్థీకరించాల్సి ఉంది. యూనివర్సిటీ పరిమాణంపై (అనుబంధ కళా శాలలు సహా) గరిష్ట పరిమితి ఉండాలి. ఆరోగ్యకరమైన వ్యవస్థల ద్వారా జవాబుదారీతనాన్ని అమలుచేయాలి. వర్సిటీ పరిపాలనను పూర్తి స్వయం ప్రతిపత్తితో, ఆర్థిక సహాయానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా అకడమిక్ పరిధిలోనే ఉంచాలి. మానవ వనరుల శాఖ, యూజీసీలు... ఐఐటీ ఐఐఐఎమ్ల డెరైక్టర్లు, వైస్‌ఛాన్స్‌లర్ల ఎంపికకు దూరంగా ఉండి, విధాన రూపకల్పనపై దృష్టిని కేంద్రీకరించడం మంచిది. కృత్రిమ విభజన స్వాతంత్య్రానంతరం భారత యూనివర్సిటీల వ్యవస్థను విభజించారు. విశ్వ విద్యాలయాలను బోధనకే పరిమితం చేసి, పరిశోధన కోసం వేరే సంస్థలను ఏర్పాటు చేశారు. డిగ్రీ చదువుల వరకు ‘దిగువస్థాయి’ విద్యగా మిగిలిపో యింది. ఇక వృత్తి విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. సాంకేతిక కోర్సులను సంకుచితమైన, ఒకే దిశ మార్గానికి పరిమితం చేశారు. ఇది భారీగా సామా జిక, సాంస్కృతిక నష్టాన్ని కలిగించింది. ఇంజనీరింగ్ విద్యార్థులకు సమగ్ర విద్య కొరవడగా, వైద్య కళాశాలలు ఏకాకులుగా వృద్ధి చెందాయి. ప్రత్యేకీకర ణను లోతుగా విస్తరింపచేయాలనే లక్ష్యంతో కొన్ని రంగాలకు విడిగా విశ్వ విద్యాలయాల ఏర్పాటుకు ఇచ్చిన అవకాశంతో అనావశ్యకమైన క్యాటరింగ్, యోగ వ ర్సిటీలు సైతం పుట్టుకొచ్చాయి. బోధనా కార్యక్రమాల్లో లేదా వృత్తి కోర్సుల శాఖల రూపకల్పనలో వర్సిటీల మాటకు విలువే ఇవ్వడం లేదు. మన గ్రేడింగ్‌ల వ్యవస్థ సైతం అయోమయమే. మూల్యాంకన ం కొల బద్ధల్లో చాలా తేడాలుండి ఒకే డిగ్రీకి రెండు నుంచి ఆరు డివిజన్ల పద్ధతులు అమల్లో ఉన్నాయి. మధురై కామరాజ్ యూనివర్సిటీ మాస్టర్ డిగ్రీ స్థాయిలో ప్రథమ, ద్వితీయ శ్రేణులను మాత్రమే ఇస్తుంటే, గుజరాత్, ఉస్మానియా వర్సి టీలు మూడు డివిజన్లను అమలు చేస్తున్నాయి. గురు గోబింద్ సింగ్ ఇంద్ర ప్రస్థ వర్సిటీ మూడు విడివిడి ప్రథమ శ్రేణులు సహా ఐదు డివిజన్ల పథకాన్ని అమలు చేస్తోంది. ఇక కాలం చెల్లిన పరీక్షల విధానం చూడటానికి విద్యార్థి శక్తి సామర్థ్యాలను సర్టిఫై చేస్తున్నట్టుంటుంది. కానీ విద్యార్థికి, ఉద్యోగ అవసరా లకనుగుణంగా మలచుకునే ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కల్పించడం లేదు. సీనియర్ వర్సిటీ అధ్యాపకులను డిగ్రీ కళాశాలల్లో బోధించకుండా నిరోధిం చడం ద్వారా మన విశ్వవిద్యాలయాల వ్యవస్థ మేధోపరమైన పోషకాహార లోపాన్ని పెంపొందింపజేస్తోంది. వర్సిటీల అత్యుత్తమ బోధనా సిబ్బంది సేవలను అందించడం ద్వారా కళాశాలలతో వర్సిటీ అనుబంధాన్ని పెంపొం దింపజేయాలి. ప్రత్యేకీకరణకు ప్రాధాన్యం ఇస్తూనే సమగ్ర బోధనాంశాలను కూడా చేర్చడం ద్వారా వృత్తి విద్యలోని వివిధ రంగాల మధ్య జ్ఞాన వారధు లను నిర్మించగలం. వృత్తి విద్యా సంస్థలకు లెసైన్సులను జారీ చేసే మధ్యస్థ సంస్థలను నిషేధించి, ఆ సంస్థలన్నిటినీ విద్యాసంబంధ విషయాల్లోనూ, పరిపాలనాపరంగానూ కూడా తిరిగి విశ్వవిద్యాలయాలకు అప్పగించాలి. పారిశ్రామిక శిక్షణా సంస్థలకు, పాలిటెక్నిక్‌లను కూడా వర్సిటీల పరిధిలోకి తేవాలి. అప్పుడే సుదీర్ఘంగా నిర్లక్ష్యం చేస్తున్న సామాజిక న్యాయం, అసమా నతల వంటి సమస్యలను పరిష్కరించగలుగుతాం. బోధనాపరమైన నాణ్యత టీచర్ల విద్యలో వర్సిటీల ప్రమేయం కేవలం బీఈడీ డిగ్రీ కార్యక్రమానికే అంటే సెకండరీ పాఠశాలలకు మాత్రమే పరిమితమైంది. పాఠశాల పూర్వ, ప్రాథమిక స్థాయి విద్యలను దాన్నుంచి మినహాయించారు. కీలక స్థానాల నియామకాలు అరుదుగా మాత్రమే ప్రతిభ ఆధారంగా జరుగుతుంటాయి. సర్వీసు కాలాన్నిబట్టి ప్రమోషన్లు వచ్చేస్తుంటాయి, ప్రభుత్వోద్యోగులతో ముడిపడ్డ సాధారణ వేతన పద్ధతి ఉంటుంది. ఇవన్నిటినీ నిరంకుశాధికారి లాంటి పే కమిషన్ నిర్ణయిస్తుంది. యూజీసీ విద్యార్హతలకు అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో, వర్సిటీ అధ్యాపకులు ప్రమోషన్ల వేటలో ప్రమాణాలు తక్కువైనా ఎలాగోలా పీహెచ్‌డీలు సంపాదించుకోవాలని ఆరాటపడు తున్నారు. అందుకే మన విద్యావేత్తలు అత్యధిక విద్యార్హతలున్నా అత్యంత అనుత్పాతదకమైన ‘దొరబాబులు’గా ఉంటున్నారు. ఉన్నత విద్యావ్యవస్థలోని ఉపాధ్యాయ విద్య నాణ్యతను పెంపొందింప జేయాలి. బోధనా సిబ్బంది కళాశాలలను ప్రోత్సహించి, కొత్త ఉపాధ్యా యుల కోసం అవి పూర్తిస్థాయి శిక్షణ కోర్సులను రూపొందించేలా ప్రోత్స హించాలి. ప్రతిభకు పట్టంగట్టే మెరిటోక్రసీని ప్రోత్సహించడం కోసం విద్యా సంబంధమైన ఉత్పాదకతతో వేతనాలను, ఉద్యోగ కాలాన్ని విస్పష్టంగా వ్యవ స్థీకృతం చెయ్యాలి. పరిశోధనలకు నిధులు, గ్రాంట్లకు సంబంధించిన విధాన పరమైన చట్రాన్ని గణనీయంగా మార్చాలి. బోధనా సిబ్బంది నియామ కాలు, సమీక్షా వ్యవస్థ... పరిశోధనా ఫలితాలను వాటి నాణ్యతను తగు రీతిలో అంచనా వేయడంలో విఫలమౌతోంది. కాబట్టి బోధనా సిబ్బంది పరిశోధనకు, ప్రచురణలకు ప్రోత్సాహకాలను అందించడం అవసరం. ‘విద్యాసంబంధమైన పని’ కొలమానం ప్రాతిపదికపై పరిశోధన ను పాయింట్ల పద్ధతిలో లెక్కగట్టడాన్ని యూజీసీ ఇటీవల ప్రవేశపెట్టింది. పరిశోధనలకు అవి ప్రచురితమైన పత్రికల ర్యాంకింగ్‌లను బట్టి పాయింట్లు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ పత్రికల ర్యాంకింగ్‌ల ప్రాతిపదిక ‘‘శాన్ ఫ్రాన్సిస్కో డిక్లరేషన్ ఆన్ రీసెర్చ్ అసెస్మెంట్’’ పూర్తిగా తప్పని, దాన్ని వెం టనే ఎత్తేయాలని సూచించింది. పరిశోధనను దానికి దానిగానే అంచనా కట్టాలే తప్ప దాన్ని ప్రచురించిన పత్రికల ఆధారంగా లెక్కగట్టడ ం అందుకు ప్రత్యామ్నాయం కాజాలదని దుయ్యబట్టింది. కాబట్టి యూజీసీ భారతీయ ప్రచురణల కంటే ‘‘విదేశీ ప్రచురణ’’లకు, జాతీయ కాన్ఫరెన్స్లకంటే ‘‘అంతర్జాతీయ కాన్ఫరెన్స్’’లకు ప్రాధాన్యం ఇచ్చే పద్ధతికి స్వస్తి చెప్పాలి. పునరుజ్జీవం ప్రపంచ స్థాయి వర్సిటీలను రాత్రికి రాత్రే సృష్టించలేం. వాటికి విశ్వసనీయత గల బోధనా సిబ్బంది, అద్భుతమైన పరిపాలనావేత్తలు, మద్దతు సిబ్బంది అవసరం. అంతేకాదు, అవి పరిశోధనకు, విద్యకు మధ్య సున్నితమైన సంతులనాన్ని నెలకొల్పాల్సి ఉంటుంది. రష్యానే ఉదాహరణగా చూద్దాం (ప్రపంచంలోని అగ్రశ్రేణి 100 వర్సిటీల్లో 7 అక్కడున్నాయి). అది దేశంలోని ఉత్తమ వర్సిటీలను ఎంపిక చేసి, అందులోంచి ప్రపంచంలోని అగ్రశ్రేణి 100 జాబితాలో చేరేలా వాటిని అభివృద్ధి చేయడానికి పథకాన్ని చేపట్టింది. అంతర్జాతీయ నమూనాలను, పద్ధతులను ఉపయోగించి ఆ వర్సిటీలను లోతుగా పునర్నిర్మించింది. మనం కూడా దేశంలోని 50 అగ్రశ్రేణి వర్సిటీలను ఎంపిక చేసి, ప్రపంచ స్థాయికి చేరేలా వాటికి స్పష్టమైన అధికారాలు, నిధులు, వనరులను సమకూర్చాలి. అయితే సర్వోత్కృష్టత రోజువారీ మస్తర్లో సంతకం చేయడంతో సమకూరేది కాదు. ఉపాధ్యాయులను, అధ్యా పకులను జాగ్రత్తగా అందుకోసం తర్ఫీదుచేసి, అభివృద్ధిపరచడం అవసరం. అలా చేస్తే వ్యవస్థగా ఆ సర్వోత్కృష్ట స్థానాన్ని చేరలేకపోయినా మన విద్యా ర్థులు అలాంటి శిఖరాలను అందుకోగలుగుతారు. (వ్యాసకర్త కేంద్ర మంత్రి మనేకా గాంధీ కుమారుడు, బీజేపీ నేత) email: fvg001@gmail.com -
సంస్కరణల సైరన్ ఎప్పుడు!
వరుణ్ గాంధీ ఇప్పుడు పనిచేస్తున్నవారిలో 93 శాతం క్యాజువల్ వర్కర్లు, 66 శాతం నెలసరి జీతాలు తీసుకునే ఉద్యోగులు కూడా లిఖిత పూర్వక కాంట్రాక్టు పత్రాలు ఎరుగరు. అలాగే తాము వేతనంతో కూడిన సెలవు తీసుకుంటున్నట్టు నివేదించిన కార్మికులు 27.7 శాతం మాత్రమే. సామాజిక భద్రత, అందుకు సంబంధించిన చైతన్యం కలిగిన కార్మికులు కూడా దేశంలో చాలా తక్కువ. నిజానికి వేతనజీవులలో 41.1 శాతం, కాంట్రాక్ట్ కార్మికులలో 76.7 శాతం ఆ సౌకర్యానికి అర్హత లేనివారే. భారత ఆర్థిక వ్యవస్థనీ, ప్రభుత్వ పాలనా రంగాన్నీ తరచూ ఇక్కడి విశాల మైదానాలు అధిగమిస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. నిరంతరం పనిచేసే కర్మాగారాలలో అయితేనేమి, కొన్ని ప్రత్యేక సమయాలలో మాత్రమే పనిచేసే కర్మాగారాలలో అయితేనేమి; 1931 నాటికి దాదాపు 40 లక్షల మంది వాటిలో ఉద్యోగులుగా ఉండేవారు. 1980 దశకానికి కార్మిక సంఘాలలో చీలికల వల్ల, పారిశ్రామిక వివాదాల వల్ల- కార్మిక సంఘాలదే పైచేయి అయింది. అయితే ఇటీవల కార్మికశక్తి క్రమబద్ధీకరణ వృద్ధి వ్యతిరేక భావనకు చేరుకుంది. కానీ ఇప్పుడు కార్మిక వ్యవస్థకు సంబంధించి తరచూ జరుగుతున్న సంస్కరణలు మెరుగ్గా ఉన్నాయని అనిపిస్తుంది. జన విస్ఫోటనం ప్రపంచ కార్మికశక్తిలో దాదాపు 25 శాతం భార తదేశానిదే. 2025 నాటికి, 29 ఏళ్ల సగటు వయసు కలిగి, పనిచేయడానికి సిద్ధంగా ఉండే 30 కోట్ల మంది యువకులతో భారత జనాభా శక్తిమంతం కాబోతున్నది. గడచిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోని మొత్తం కార్మికశక్తి 49 కోట్లని అంచనా వేశారు. ఇది దేశ జనాభాలో దాదాపు 40 శాతం. అయితే వీరిలో కాయగూరల బండితో జీవనం గడిపే చిరువ్యాపారి మొదలు, వజ్రాల వ్యాపారి వరకు 93 శాతం అసంఘటిత రంగాలలోనే ఉన్నారు. కాబట్టి 2020 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రాబోతున్న యువశక్తి లోటును భారత్ తీర్చబోతున్నది. ఆ సంవత్సరానికి ఐదుకోట్ల అరవై లక్షల యువ కార్మికుల లోటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఉంటుందని అంచనా. కాని భారత్‌లో ఆ సంవత్సరానికే నాలుగు కోట్ల డెబ్బయ్ లక్షల యువకార్మికులు అదనంగా ఉంటారు. అయినా ఇది అందరికీ అందివచ్చే అవకాశం కాదు. ఎందుకంటే గడచిన దశాబ్దంలో కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (ఒక నిర్ణీతకాలంలో పెట్టుబడి పెరుగుదల రేటు) 0.5 శాతానికి వేగాన్ని తగ్గించుకుంది. కాబట్టి భారత కార్మికశక్తిలో ఉద్యోగార్హతను పెంపొందించడమే నేడు భారత మౌలిక విధానం ముందు ఉన్న పెద్ద సవాలు. వ్యవసాయ రంగం నుంచి వ్యవసాయేతర రంగాలకు శ్రామికశక్తిని బదలాయించడం (12 కోట్ల నిపుణులైన కార్మికుల అవసరాన్ని గుర్తిస్తూ) అత్యవసరం. ఈ క్రమంలోనే ఉద్యోగావకాశాలు పెంచడం, సామాజిక భద్రత అనే అంశాలు కూడా పరిగణనలోనికి తీసుకోవలసినవే. తక్కువ జీతాలు, పరిమిత భద్రత గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఇప్పటికీ సగటు దినసరి వేతనాలు చాలా తక్కువగానే ఉన్నాయి. సెప్టెంబర్ 2014 నాటి గణాంకాలను పరిశీలిస్తే అరక కూలి రోజుకు పురుషునికి రూ. 267.70, స్త్రీకి రూ. 187.17 చెల్లించినట్టు అర్థమవుతుంది. ఎలక్ట్రీషియన్లు రూ.367.16, నిర్మాణ రంగంలో పనిచేసే వారు రూ. 274.06 వంతున (సగటున) తీసుకుంటున్నారు. వ్యవసాయేతర రంగంలో పనిచేసే కార్మికులు మొత్తంగా సగటున రూ. 237. 20 వేతనానికి నోచుకుంటున్నారు. వడోదరలో కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న కార్మికునికి జౌళి పరిశ్రమ రూ. 6,488.09 చెల్లిస్తున్నది. అదే కోల్‌కతాలో రూ. 7,558. 52; చెన్నైలో రూ. 9,769.20 కొత్త కార్మికుడు ఆశించవచ్చు. వినియోగ ద్రవ్యో ల్బణమే ఈ తగ్గుదలకు కారణం. వినియోగదారుల ధరల సూచీలో రెట్టిం పయ్యే అంకెలు (2004లో 332, 2014లో 764) వ్యవసాయ, పారిశ్రామిక రంగాల కార్మికులను తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. మళ్లీ పరిశ్రమ లలో పనిచేసే కార్మికులలో మహిళల కష్టాలు వేరు. 1961 నాటి ప్రసూతి ప్రయోజన చట్టం, గర్భిణులకు ఇచ్చే క్రమబద్ధ వేతనాల ప్రయోజనం కూడా చాలా పరిమితంగానే ఉపయోగపడుతున్నాయి. 2012 సంవత్సరం వివరాలు చూస్తే, 84,956 కర్మాగారాలలో పనిచేసే మహిళలలో కేవలం 2,441 మంది మాత్రమే ఈ ప్రయోజనాలకు నోచుకున్నారు. భారతదేశంలో ఉన్న లక్షలాది కర్మాగారాలలో 3,289 చోట్ల మాత్రమే శిశు సంరక్షణ కేంద్రాలు (క్రెష్) ఏర్పాటు చేశారు. ఇలాంటివి గుజరాత్ మొత్తం మీద 58 మాత్రమే ఉండగా, అత్యధికంగా తమిళనాడులో 2,389 పనిచేస్తున్నాయి. సామాజిక భద్రతకు సంబంధించిన లోటు కూడా కార్మికశక్తికి పెద్ద లోపంగా పరిణమించింది. రైల్వే కార్మికులు 1,082, గని కార్మికులు 32 ప్రమాదాలను ఎదుర్కొన్నారు. ఇందులో ఎక్కువ తీవ్రమైనవే కావడం విశేషం. రైల్వేలో రూ. 2.6 లక్షలు, గనులలో రూ.9 లక్షలు నష్టపరిహారంగా ఇస్తున్నారు. ఇప్పుడు పనిచేస్తున్నవారిలో 93 శాతం క్యాజువల్ వర్కర్లు, 66 శాతం నెలసరి జీతాలు తీసుకునే ఉద్యోగులు కూడా లిఖిత పూర్వక కాంట్రాక్టు పత్రాలు ఎరుగరు. అలాగే తాము వేతనంతో కూడిన సెలవు తీసుకుం టున్నట్టు నివేదించిన కార్మికులు 27.7 శాతం మాత్రమే. సామాజిక భద్రత, అందుకు సంబంధించిన చైతన్యం కలిగిన కార్మికులు కూడా దేశంలో చాలా తక్కువ. నిజానికి వేతనజీవులలో 41.1 శాతం, కాంట్రాక్ట్ కార్మికులలో 76.7 శాతం ఆ సౌకర్యానికి అర్హత లేనివారే. ఇంకా చెప్పాలంటే, 12 శాతం కార్మికులకు ఇలాంటి సౌకర్యం ఒకటి ఉందన్న సంగతి కూడా తెలియదు. తక్కువ ఉత్పాదకత, పనికిరాని తనిఖీ నిబంధనలు, చట్రాల కారణంగా వ్యాపార సంస్థల ఆవిర్భావానికి ఆటంకాలు వచ్చి కార్మికులకు అవకాశాలు తక్కువ కావడం, ఇందుకు సిద్ధపడడం కూడా తగ్గుతోంది. 2012లో భారత కార్మికశాఖ కోటీ నలభై లక్షల దుకాణాలను, వాణిజ్య సంస్థలను తనిఖీ చేసింది. 89,520 ప్రాసిక్యూషన్లు ఆరంభించింది. 9.3 కోట్ల ఐఎన్ఆర్ను వసూలు చేసింది. ముఖ్యంగా చండీగఢ్‌లో 56,103 వాణిజ్య సంస్థలు ఉండగా వాటిలో 26,841 సంస్థలను ప్రాసిక్యూట్ చేసిన ప్పటికీ వాటి నుంచి వసూలు చేసినది రూ. 40.4 లక్షలు మాత్రమే. వందకు మించిన కార్మికులు ఉంటే, ఆ పరిశ్రమకు లేదా సంస్థకు పారిశ్రామిక ఉద్యోగ (స్టాండింగ్ ఆర్డర్స్)చట్టం (1946) వర్తించి తీరుతుంది. వాటిలో కార్మికుల నియామకాలను, తొలగింపులు, క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం, సెలవులు వంటి అంశాలను పర్యవేక్షించేది ఈ చట్టమే. అయితే 2014 సంవత్సరం జనవరి-సెప్టెంబర్ మధ్య పారిశ్రామిక వివాదాల కారణంగా 105 చోట్ల పని నిలిపివేసినట్టు నమోదయింది. దీనితో 3,60,535 మంది కార్మికులు, 17,88,613 పని దినాలను నష్టపోయినట్టు తేలింది. ఫలితాన్ని ఇచ్చే విధానం కావాలి దేశంలో కార్మికచట్టాలు ఎప్పుడూ పారిశ్రామికాభివృద్ధితోనూ, ఒడిదుడుకులు లేకుండా నడిచే వాణిజ్యంతో విభేదించే విధంగా ఉంటుంది. ఫలితాన్ని అందించే విధానమే మన కార్మిక రంగ సంస్కరణలలో విధిగా ఉండాలి. ఒడిదుడుకులు లేకుండా సాగే వాణిజ్యంతోను, వాణిజ్యాన్ని నిర్వహిం చడంలో నిర్వాహకులకు దోహదపడే విధంగాను ఆ సంస్కరణలు ఉంటే, మనకున్న మానవనరులను ఉత్పాదకత సంపద సృష్టిలో ఉపయోగించుకునే వీలు ఉంటుంది. కార్మికుల, చిన్న, మధ్యతరగతి వాణిజ్య సంస్థల క్షేమానికి ఉపయోగపడే రీతిలో ఉద్యోగ కల్పన విధానాన్ని రూపొందించుకోవాలి. కార్మిక చట్టాన్ని హేతుబద్ధం చేయడం కూడా అత్యవసరం. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని కనీస వేతనాలను నిర్ధారించడం ఇందులో తొలి మెట్టు. కనీస వేతన నిర్ధారణ సంఘాలను క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తూ, వార్షికంగా ఆ వేతనాలను సవరించడం అవసరం. కనీస వేతనాల నిబంధన లను ఉల్లంఘించకుండా చూడడం మరొకటి. అప్రంటీస్ షిప్ చట్టం మారాలి జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ చెబుతున్నదానిని బట్టి వ్యవసా యేతర రంగాలలో పన్నెండు కోట్ల మంది నిపుణులు మన ఆర్థిక వ్యవస్థకు అవసరమవుతారు. ఈ నేపథ్యంలో అప్రెంటిస్‌షిప్ చట్టానికి మార్పులను స్వాగతించాలి. నైపుణ్యాన్ని పెంచుకునే కాలాన్ని అనవసరంగా సాగదీసే పద్ధతి లేకుండా జాగ్రత్త పడడం అత్యవసరం. మహిళలకు కూడా చట్టం తేవాలి. ఇందిరా క్రాంతి పథం, అంగన్వాడీ మహిళలు ఇప్పటికీ ఇలాంటి చట్టాల పరిధిలోకి రావడం లేదు. సమీకృత శిశు అభివృద్ధి సేవల వ్యవస్థకు చెందిన కార్మికులు ఇప్పటికీ పదవీ విరమణానంతర ప్రయోజనాలకు నోచుకోవడం లేదు. పథకాల కోసం నియమించిన కార్మికులను కూడా రెగ్యులర్ ఉద్యోగులుగానే పరిగణించాలి. వారికి కూడా సామాజిక భద్రత పరిధిలో మంచి వేతనాలు, ప్రయోజనాలు కల్పించాలి. ఇన్స్పెక్టర్ల వైఖరి వల్ల గడచిన మూడు దశాబ్దాలలో రిజిస్టరైన కర్మాగారాలలో తనిఖీలు (1986లో 63 శాతం, 2011లో 18 శాతం) పడిపోయాయి. ఏడు కోట్ల డెబ్బయ్ లక్షల వాణిజ్య వ్యవస్థలలో కనీస వేతనాల చట్టం (1948) అమలు తీరును పర్యవేక్షిస్తున్న ఇన్స్పెక్టర్లు కేవలం 3,171 మంది. అంటే 2,428 సంస్థలకు ఒక ఇన్స్పెక్టర్ వంతున ఈ బాధ్యత నిర్వహిస్తున్నారన్నమాట. కర్మాగారాలకు వెళ్లడానికి నిర్ణీత సమయాలను ఎంపిక చేసుకుని, తనిఖీ వ్యవస్థను కేంద్రీకృతం చేయడం వల్ల ప్రతిభావంతంగా ఉంటుంది. 1981 నాటి ఐఎల్ఓ ఇన్స్పెక్టర్ల సమావేశంతో ప్రమేయం లేకుండా కార్మిక వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి. నిబంధనలను ఉల్లంఘించినవారి మీద విధించే జరిమానాను కనీసం రూ. 1,000కి పెంచాలి. ఉద్యోగాల నుంచి కార్మికులను తొలగించడం సామాజికంగా వారికి ఎప్పుడూ గడ్డు అనుభవంగానే మిగులుతూ ఉంటుంది. ప్రస్తుత మన కార్మిక విధానం కార్మికుల సంఖ్యను వందకు పరిమితం చేస్తూ, కాంట్రాక్ట్ కార్మికులను నియమించుకోవడానికి తక్కువ అవకాశం కల్పిస్తున్నది. వీరికి ఎలాంటి ఉద్యోగ, సామాజిక భద్రత లేదు. కానీ ఈ అసంబద్ధ చట్టాన్ని పునర్ నిర్మించాలి. సామాజిక భద్రతను కల్పిస్తూ, పనితో అనుసంధానించిన వేతనాలు ఇస్తూ ఎక్కువ మంది కార్మికులను సంస్థలలో నియమించుకునే అవకాశం పారిశ్రామికవేత్తలకు కల్పించేటట్టు ఆ చట్టాన్ని రూపొందించాలి. లేఆఫ్‌లను సరళం చేయడం, ఇందుకు చాలినంత సమయంతో నోటీసు ఇచ్చే అవకాశం ఇవ్వాలి. పట్టణీకరణ క్రమంలో తన వాణిజ్యం, కార్మికులు ఇద్దరి ఎదుగుదలకు అవసరమైన విధానం భారత్‌కు కావాలి. సామాజిక భద్రత, కార్మిక చట్టాలలో సరళతల మీద ఇది ఆధారపడి ఉంది. (వ్యాసకర్త ఎంపీ, కేంద్రమంత్రి మేనకా గాంధీ కుమారుడు) -
చేతులు కాలాక ఆకులు?
స్వైన్‌ఫ్లూ ప్రాణాంతకం కాదని, భయపడాల్సిన పనే లేదని అధికార యంత్రాంగం అభయమిస్తుండగా, అటు నిండు ప్రాణాలు గాలిలో కలసిపోవడం కొనసాగింది. స్వైన్‌ఫ్లూ మరణాల్లో ముందున్న గుజరాత్, రాజస్థాన్ల నుంచి తెలుగు రాష్ట్రాల వరకు అడుగడుగునా ప్రాణాంతక, ప్రమాదకర అంటువ్యాధుల నివారణ, నియంత్రణలో మన ప్రజారోగ్య వ్యవస్థ వైఫల్యం బట్టబయలైంది. ఈ నేపథ్యంలో సదా సన్నద్ధతను చూపగల సమర్థ ప్రజారోగ్య వ్యవస్థ, సమగ్ర జాతీయ అంటువ్యాధుల విధానం తక్షణ అవసరం. దేశవ్యాప్తంగా భయాందోళనలను రేకెత్తించిన స్వైన్‌ఫ్లూ మహమ్మారి ఇప్పు డిప్పుడే నెమ్మదిస్తోంది. మళ్లీ తిరిగి వచ్చిపడదని అనుకోలేం. 2009లో హెచ్1ఎన్1 వైరస్ (స్వైన్‌ఫ్లూ) మొదటిసారి మనల్ని గడగడలాడించింది. 2010 ఆగస్టు నాటికి అది దేశవ్యాప్తంగా 1,833 మందిని బలిగొన్నదని అధికారిక అంచనా. అప్పట్లోనే ‘టామిఫ్లూ’ అనే వ్యాధి చికిత్స ఔషధమూ, వ్యాధి నిరోధక వ్యాక్సిన్ వాడుకలోకి వచ్చాయి. అంతా ఆదమరచి ఉండగా మరోమారు విరుచుకుపడ్డ ఆ మహమ్మారి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 25,000 మందికి సోకి, 1,370 మందిని హతమార్చింది. తెలంగాణలో 63 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 15 మంది మరణించినట్టు అంచనా. ఈ దఫా ఇటు వైద్య నిపుణులు, అధికార యంత్రాంగం స్వైన్‌ఫ్లూ ప్రాణాంతకం కాదని, భయపడాల్సిన పనే లేదని అభయమిస్తుండగా, అటు నిండు ప్రాణాలు గాలిలో కలసిపోవడం కొనసాగింది. స్వైన్‌ఫ్లూ మరణాల్లో ముందున్న గుజరాత్, రాజస్థాన్ల నుంచి తెలుగు రాష్ట్రాల వరకు అడుగడుగునా ప్రాణాం తక, ప్రమాదకర అంటువ్యాధుల నివారణ, నియంత్రణలో మన ప్రజారోగ్య వ్యవస్థ వైఫల్యం బట్టబయలైంది. మరోవంక మరింత ప్రమాదకరమైన ఎబోలా అంటువ్యాధి ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఎలాం టి అంటువ్యాధులనైనా సకాలంలో నివారించడంలో, నియంత్రించడంలో సదా సన్నద్ధతను చూపగల సమర్థవంతమైన ప్రజారోగ్య వ్యవస్థ నిర్మాణం, సహేతుక, సమగ్ర జాతీయ అంటువ్యాధుల విధానం తక్షణ అవసరం. లేక పోతే చేతులు కాలాక ఆకుల కోసం తడుములాట తప్పదు. మహమ్మారి పాతదే జలుబు, తుమ్ముల రూపంలో మనుషులలో కనిపించే ఇన్ఫ్లుయెంజా వైరస్ లలో ‘ఏ’ రకానికి చెందిన హెచ్1ఎన్1... 1918లో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికి సోకగా పది కోట్ల మంది మరణించారు. బర్డ్‌ఫ్లూ పేరుతో ఏ/హెచ్5ఎన్1 వైరస్ 2006లో మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో కోళ్ల ఫారాలను చావుదెబ్బ తీసింది. 2008, 2009లలో అది పశ్చిమ బెంగాల్, అస్సాంలలోని పెరటి పెంపకం కోళ్లకు సైతం సోకింది. అయితే వ్యాధి కనిపించిన ప్రాంతానికి 3 కిలో మీటర్ల పరిధిలోని కోళ్లనన్నిటినీ పెద్ద ఎత్తున వధించడం ద్వారా అప్పట్లో అది మనుషులకు వ్యాప్తి చెందకుండా నిరోధించ గలిగాం. కానీ బర్డ్‌ఫ్లూ వల్ల అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా 262 మంది మృతి చెందారు. అది పక్షులను ఆశ్రయించి బతికే వైరస్ కాగా హెచ్1ఎన్1 మనుషు లలో వేగంగా వ్యాపించే అత్యంత ప్రమాదకర వైరస్. అభివృద్ధి చెందిన ఉత్తర అమెరికాలో సైతం ఇటీవల దాని వల్ల 833 మంది మరణించారు. ఈ దృష్ట్యా మన జాతీయ అంటువ్యాధుల విధానంపై చర్చకు ప్రాధాన్యం ఉంది. ఆర్థిక వ్యవస్థపై దుష్ర్పభావం స్వైన్‌ఫ్లూ లేదా ఎబోలా లేక మరేదైనా ప్రమాదకరమైన అంటువ్యాధి ప్రబలితే ఆర్థిక వ్యవస్థ హఠాత్ దుష్ర్పభావానికి గురవుతుంది. ప్రాణ నష్టానికి తోడు సామాజిక, ఆర్థిక విపరిణామాలు, అపరిమిత నష్టం సంభవిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మందులు, వైద్య సిబ్బంది, ఆసుపత్రి సౌకర్యాల కోసం ప్రభు త్వం భారీగా వ్యయం చేయాల్సివస్తుంది. దేశీయ వైమానిక, టూరిజం రం గాల రాబడి హఠాత్తుగా పడిపోతుంది. ప్రజలు మార్కెట్లకు, ఉద్యోగాలకు వెళ్లడం తగ్గిస్తారు. దీంతో వినియోగదారుల డిమాండు క్షీణిస్తుంది. ‘సార్స్’ అంటువ్యాధి వల్ల 2003లో చైనా స్థూల జాతీయోత్పత్తికి (జీడీపీ) 1,500 కోట్ల డాలర్లు, ప్రపంచ జీడీపీకి 3,300 కోట్ల డాలర్లు నష్టం వాటిల్లిందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ప్రమాదకర అంటువ్యాధి ప్రబలితే, దానికదే ప్రపంచ ఆర్థిక తిరోగమనానికి, రాజకీయ అస్థిరతకు, ఆరోగ్యపరమైన సంక్షో భానికి, భయోత్పాతానికి దారి తీయవచ్చు. అలాంటి ప్రజాసంక్షోభ సమ యాల్లో సహేతుక, ఆచరణయోగ్య ప్రజారోగ్య చట్టం, మౌలిక వసతులు ఉండటం అవసరం. అప్పుడే స్థానిక, అంతర్జాతీయస్థాయిల్లో ప్రజారోగ్యపర మైన అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ చర్యల చట్టపరమైన పరిధులు స్పష్టం గా ఉంటాయి. అలాంటి అత్యవసర పరిస్థితి ఉత్పన్నం కావడానికి ముందూ, తర్వాతా చేపట్టే చర్యలపై ఆచరణలో ఫలితాలనిచ్చేవిగా తేలిన సూచనలు ఉండటం అవసరం. పని ప్రదేశాల్లో వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వవచ్చా? ఇచ్చేట్టయితే ఏ నిర్దిష్ట వయో బృందాన్ని ఎంపిక చేసుకోవాలి? స్కూళ్ల మూసి వేత వ్యాధి వ్యాప్తిని అరికట్టగలుగుతుందా? ఫలితంగా పిల్లల సంరక్షణ ఖర్చులు పెరిగినా, వైద్య వ్యయాలు తగ్గుతాయా? అమెరికాలోని అన్ని కే-12 స్కూళ్లను రెండు వారాలు మూసేయడానికి 520 నుంచి 2,360 కోట్ల డాలర్ల వ్యయం అవుతుందని అంచనా. ప్రతి వానాకాలం, చలికాలం ఇలాంటి చర్యలు చేపట్టగలమా? ఇలాంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవాలంటే తగు ఆధారాల ప్రాతిపదికపై రూపొందిన ప్రజారోగ్య విధానం అవసరం. జాతీయ అంటువ్యాధుల విధానం మనకు ఇప్పటికే అంటువ్యాధుల సంసిద్ధత చట్టం (1897), పశుసంపద దిగుమతి చట్టం (1898), ఔషధాలు, సౌందర్యసాధనాల చట్టం (1940) వగైరా చట్టాలున్నాయి. ఇవన్నీ స్వభావరీత్యా ‘పోలీసు పని’ చేసేవే తప్ప ప్రజారోగ్యంపై దృష్టిని కేంద్రీకరించినవి కావు. ప్రమాదకర అంటువ్యాధి ప్రబ లినప్పుడు వైద్యపరంగా సంఘటితంగా ప్రతిస్పదించే వైఖరి కొరవడుతోంది. జిల్లా కలెక్టర్ మొత్తం ప్రభుత్వ చర్యలన్నిటికీ సమన్వయకర్తకాగా, చీఫ్ మెడి కల్ ఆఫీసర్ సహాయక పాత్రకు పరిమితం కావాల్సి ఉంటోంది. నిజానికి వారి విధులను, బాధ్యతలను ఇతరులకు బదలాయించడాన్నిస్పష్టంగా నిర్వచిం చాల్సి ఉంది. అంటువ్యాధుల చట్టం (1897) 117 ఏళ్లనాటి కాలంచెల్లినది. అది భారీ ఎత్తున ప్రబలే అంటువ్యాధులకు, అత్యవసర పరిస్థితులకు తగినది కాదు. పైగా అది వ్యాధి తీవ్రతవల్ల సామాజిక, ఆర్థికవ్యవస్థ విచ్ఛినమై తలెత్త గల అత్యవసర పరిస్థితులతో వ్యవహరించలేదు. అలాగే మానవ హక్కుల అంశాన్ని అది విస్మరించింది. ఇక మునిసిపల్ స్థాయిలో ఈ లోటుపాట్లు మరింత కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ప్రజారోగ్యపరమైన అన్ని చట్టాలను తక్షణం ఒకే చట్టం కిందికి తేవాల్సి ఉంది. ప్రభుత్వ చర్యల అమలులో ఎలాం టి ఆటంకాలు లేకుండా అది హామీని కల్పించాలి. ప్రజారోగ్య వ్యవస్థ సమర్థ వంతమైన ప్రభావాన్ని చూపగలగడానికి సరిపడే చట్టాలు ఉండాలి. వాటి అమ లును నియంత్రించే సంస్థ కూడా విడిగా ఉండాలి. బ్రిటన్‌లో ‘‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ క్లినికల్ ఎక్స్‌లెన్స్’’ వ్యాధి నియంత్రణ చర్యల అమలులో అనుసరించాల్సిన ప్రమాణాలను, ఏకరూపతను నిర్దేశిస్తుంది, దాన్ని పోలిన ‘‘ప్రజారోగ్య ప్రమాణాల సంస్థ’’ మనకూ అవసరం. ‘‘జాతీయ ఆరోగ్య బిల్లు-2009’’ త్వరితగతిన అమలులోకి తెచ్చే విషయమై రాష్ట్రాలతో సంప్రదింపులకు జాతీయాభివృద్ధి మండలి ఉపయోగపడుతుంది. పంచముఖ వ్యూహం అంటువ్యాధులు ప్రబలిన పరిస్థితుల నియంత్రణకు, రూపుమాపడానికి మన దేశం పంచముఖ వ్యూహంతో కూడిన ప్రణాళికను అనుసరించాలి. 1. మను షులలో వ్యాధులు ప్రబలే అకాశాలను తగ్గించడం ద్వారా వైరస్ లేదా రోగ వాహకులు తయారుకాకుండా నిరోధించవచ్చు. 2. వ్యాధి ప్రభావిత జిల్లాల, స్థానిక ఆరోగ్య అధికారులకూ, మంత్రిత్వశాఖకూ చికిత్సాపరమైన నమూ నాల సమాచారం అంతా అందుబాటులో ఉండేలా చూడాలి. అప్పుడే వేగంగా అంచనాలు వేయగలుగుతారు. అంటువ్యాధి ప్రబలినట్టు ప్రకటిం చిన వెంటనే వేగంగా దాని వ్యాప్తిని నిరోధించే చర్యల ప్రణాళికను రూపొం దించి, ముమ్మరంగా చర్యలు చేపట్టగలుగుతారు. తద్వారా వ్యాధి ఇతరులకు సోకడం తగ్గుతుంది. 4. స్థానిక వైద్య, ఆరోగ్య సదుపాయాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలతో అనుసంధానించాలి. తద్వారా వ్యాధిని అరికట్టడానికి, నిర్మూలించడానికి ప్రణాళికలను రూపొందించి, పరీక్షించాలి. స్థానిక, ప్రపంచ శాస్త్రీయ పరిశోధన, అభివృద్ధి కృషిని సమన్వ యించి, టీకా మందులకు హామీని కల్పించాలి. దాన్ని పరీక్షించి, త్వరితగతిన అందరికీ అందుబాటులో ఉండే ధరకు అందేలా చూడాలి. 5. ఎన్జీఓలను భూతాల్లా చూడటం మాని, పౌర సమాజాన్ని ఈ చర్యల్లో భాగస్వామిని చేయాలి. బ్రిటన్‌లోని జాతీయ అంటువ్యాధుల వ్యవస్థ ప్రభుత్వ విధానాల, ప్రణాళికల రూపకల్పనలో పౌర సమాజాన్ని భాగస్వామిని చేస్తుంది. తద్వారా ప్రజల సున్నిత భావాలను దృష్టిలో ఉంచుకొని వైద్యపరమైన ఎంపి కలకు వారి ముందు ఉంచడం సాధ్యమౌతుంది. పౌర సమాజం సలహాలు, సమాచారం తీసుకోవడం పౌర అశాంతిని తగ్గించడంలో కూడా తోడ్పడు తుంది. చట్టపరమైన వ్యవస్థలను, అలాంటి సంస్థలతో పూర్తిగా అనుసంధా నించడం.. ప్రజారోగ్య సంబంధ సంక్షోభ పరిస్థితుల్లో తగు ఆరోగ్య సేవలకు హామీని కల్పిస్తుంది. (వ్యాసకర్త బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి మనేకా గాంధీ కుమారుడు) ఈమెయిల్: fvg001@gmail.com వరుణ్ గాంధీ -
రైళ్లు ప్రైవేటు మార్గం పట్టాలి
ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ తన పరిధిని విస్తరించి రైల్వే మార్గాల విద్యుదీకరణ మీద, సిగ్నల్ వ్యవస్థ మీద దృష్టి సారించాలి. చేపట్టిన పథకాలను పూర్తి చేయడం ద్వారా వచ్చే ఐదేళ్లలో 14,000 కిలోమీటర్ల రైలు మార్గాన్ని విద్యుదీకరించవచ్చు. ఇందుకు అవసరమయ్యే నిధులను కార్పొరేషన్ మార్కెట్లో నిధుల సేకరణ ద్వారా, తన కరెంట్ కేటాయింపుల ద్వారా సమకూర్చవచ్చు. ప్రతి ఒక్క కిలోమీటరు కొత్త రైలు మార్గం వందలాది ఉద్యోగాలను కల్పించగలుగుతుంది. 200 కిలోమీటర్ల మేర నిర్మించే ఒక్క హైస్పీడ్ రైలు మార్గం భారత ఆర్థిక వ్యవస్థకు ఏటా 20 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని జమ చేయగలుగుతుంది. ఉత్పత్తిదారులకూ, వినియోగదారులకూ మధ్య భౌగోళిక అనుసంధానం కల్పించి, ఉత్పత్తిరంగంలో సమర్థనీయమైన విభజనను తెచ్చి ఆర్థిక వ్యవస్థ విస్తరణ మార్గాలను రైల్వేలు విస్తృతం చేస్తాయి. మేక్ ఇన్ ఇండియా ఆలోచనకు సమర్థ రైల్వే రవాణా అత్యవసరం. నగరాల మధ్య ప్రయాణాన్ని చౌకగా మార్చి, పర్యాటక, ఇతర సేవా రంగాల వృద్ధికి రైల్వే పునాదులు నిర్మిస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి రైల్వే వ్యవస్థ ఏటా 15 నుంచి 20 శాతం పెరుగుదల సాధించాలి. ఇప్పటికీ నత్తనడకే రైల్వే శాఖకు కొత్త మంత్రిని నియమించడంతో ఆధునీకరణకు, ఇతోధికంగా సంస్కరణలు తేవడానికి అవకాశం ఏర్పడింది. ప్రైవేటు వ్యవస్థలో సరుకు రవాణాకు, హైస్పీడ్ రైళ్ల ప్రాజెక్టులలో నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబ డుల అనుమతికి, కొత్త సిగ్నలింగ్ వ్యవస్థకు, రైలు మార్గాల విద్యుదీకరణకు అవకాశం కలుగుతోంది. వీటితోనే రైల్వేల అభివృద్ధి సాధ్యమౌతుంది. రైల్వే జోనల్ అధిపతులకు సంబంధించి మంత్రికి ఉన్న సాధికారత నిర్వహణ, ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడాలి. జవాబుదారీతనాన్ని పెంచడానికి ఉపకరించాలి. టెండర్ల మీద నిర్ణయాలను వేగవంతం చేయాలి. రైల్వే వ్యవస్థల అభివృద్ధికి సంబంధించి మనం ఇప్పటికీ ఎంతో వెనుక బడి ఉన్నాం. 2014 సంవత్సరానికే చైనా 11,000 కిలోమీటర్ల మేర హైస్పీడ్ రైలుమార్గం నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఆ విధంగా ఆ వ్యవస్థను కలిగి ఉన్న చాలా దేశాల కంటే చైనా ఎంతో ముందంజ వేసింది. ఈ మార్గాన్ని కిలో మీటరు ఒక్కంటికి 17 నుంచి 21 మిలియన్ డాలర్ల వ్యయంతో చైనా నిర్మిం చుకోగలిగింది. కానీ యూరప్ దేశాలు కిలోమీటరు ఒక్కింటికి 25- 39 మిలి యన్ డాలర్లు ఖర్చు చేశాయి. బాధ్యతాయుతమైన వ్యవస్థ, సాంకేతిక సామ ర్థ్యం, పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థల వల్ల చైనాలో ఇది సాధ్యమైంది. కానీ మన దేశంలో జరుగుతున్నది వేరు. దేశంలో 15,000 కిలోమీటర్ల హైవేలను నిర్మిం చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు ఏటా 2 బిలియన్ డాలర్లను ఖర్చు చేయాలని భావించాం. డీజిల్, పెట్రోల్‌లపై లీటరు ఒక్కింటికి రెండు రూపాయల వంతున ఎక్సైజ్ పన్నును విధించడం ద్వారా అందుకు అవస రమైన నిధులలో కొంతమేర సమకూర్చుకోవాలని నిర్ణయించుకున్నాం. కానీ ఆదాయంలో సన్నగిల్లుతున్న పెరుగుదల; వేతనాలు, పింఛన్లు, నిర్వహణ వ్యయాలు పెరిగిపోతూ ఉండడంతో రైల్వేల అభివృద్ధికి ఇదంతా పెద్ద ప్రతి బంధకంగా మారింది. భద్రతా ప్రమాణాలు, జవాబుదారీతనాన్ని పెంచు కోవడానికి తగిన రీతిలో పెట్టుబడులు పెట్టడానికి ఆటంకంగా మారుతోంది. రైల్వేల ఆధునీకరణ కోసం, అభివృద్ధి కోసం 340 ప్రాజెక్టులను చేపట్టడం జరి గింది. వీటి మీద రూ.1,72,934 కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించారు. కానీ వీటికి ఏటా కేటాయిస్తున్నది కేవలం రూ.10,000 కోట్లు. త్రిముఖ వ్యూహం అవసరం రైల్వేల అభివృద్ధికి త్రిముఖ వ్యూహం అవసరం. మొదటి వ్యూహంలో కొత్త మార్గాలను ప్రారంభించడం కోసం లెక్కకు మిక్కిలిగా నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలి. హైస్పీడ్ రైళ్లను, సరుకు కారిడార్‌ను ఏర్పాటు చేయాలి. రెండో వ్యూహంలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను సమీకరించాలి. మూడో వ్యూహం ప్రకారం రైల్వేలను సంపూర్ణంగా పునర్నిర్మించాలి. పెట్టుబడుల ప్రణాళిక, ప్రాజెక్టుల నిర్వహణలకు పూర్తిగా కొత్త రూపం ఇవ్వాలి. ఒక్కసారి భారత రైల్వే మార్గాలను చూపించే మ్యాప్‌ను చూడండి! వాటి ఉపయోగం చాలా అసమతౌల్యంతో కనిపిస్తుంది. వాటి మీద రాకపోకలు, సరుకు రవాణా తీరుతెన్నులు అసమంగా ఉంటాయి. మన నాలుగు మెట్రో నగరాలను కలిపే రైల్వే లైన్లు మొత్తం లైన్లలో 16 శాతం మాత్రమే. కానీ అవన్నీ వంద శాతం మించిన రద్దీతో ఉన్నాయి. మనం డిమాండ్‌ను బట్టి సామర్థ్యాన్ని పెంచుకో వాలి. కాబట్టే రైల్వే వ్యవస్థలో నిర్మాణాల అవసరం చాలా ఎక్కువ. ఢిల్లీ-ఆగ్రా మధ్య ఇటీవల ప్రయోగాత్మకంగా నిర్వహించిన హైస్పీడ్ రైలు యాత్ర విజయవంతమైన నేపథ్యంలో ఆ రైల్వే వ్యవస్థకు ఊతం ఇవ్వాలి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలోనే అయినా, కొత్త లైన్ల నిర్మాణానికి ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించాలి. స్టేషన్లను అభివృద్ధి చేయ డం, వినియోగంలో లేని రైల్వేల భూమిని వాణిజ్యావసరాల కోసం అభివృద్ధి చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. వచ్చే మూడేళ్ల కాలంలో రూ. 50,000 కోట్లతో 50 రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం చేపట్టే ప్రాజెక్టులలో ప్రైవేటు రంగం సహాయపడగలదు. నగరాల మధ్య ప్రైవేటు రైళ్లను నడపడానికి కూడా రైల్వే శాఖ అనుమతించాలి. రైలు మార్గాలను పరిశుభ్రంగా ఉంచడానికి స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని ఉపయోగించుకోవాలి. సరుకు రవాణాకు కనీస భరో సాను రైల్వేలు ఇవ్వాలి. సరుకు రవాణా ఉద్దేశంతోనే మన రైల్వేలు 30 నుంచి 40,000 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించవలసి ఉంది. రద్దీని తట్టుకోవడానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కోల్ ఇండియా, ఆసియా అభివృద్ధి బ్యాంక్, భారతీయ రైల్వేలు కలసి చేస్తున్న ప్రయత్నాలకు ఊతం ఇవ్వడం కూడా అవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కృష్ణపట్నం రైల్వే కంపెనీ, భారత రైల్వేలు ఉమ్మడిగా చేసిన ప్రయత్నం కూడా ప్రత్యేకమైనది. ఈ ఉమ్మడి కృషిలో తయారైన ప్రత్యేక వాహనాలను పరిగణనలోనికి తీసుకోవాలి. పరి మిత వ్యయంతో, నౌకాశ్రయాల అవసరాలకు చెందిన ఇలాంటి వాహ నాలను తయారు చేసుకోవాలి. పునర్నిర్మాణం అవసరం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ తన పరిధిని విస్తరించి రైల్వే మార్గాల విద్యుదీకరణ మీద, సిగ్నల్ వ్యవస్థ మీద దృష్టి సారించాలి. చేపట్టిన పథకా లను పూర్తి చేయడం ద్వారా వచ్చే ఐదేళ్లలో 14,000 కిలోమీటర్ల రైలు మార్గా న్ని విద్యుదీకరించవచ్చు. ఇందుకు అవసరమయ్యే నిధులను కార్పొరేషన్ మార్కెట్లో నిధుల సేకరణ ద్వారా, తన కరెంట్ కేటాయింపుల ద్వారా సమ కూర్చవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలోనే కాకుండా, ప్రభుత్వ రంగ సంస్థలు, నౌకాశ్రయ సంబంధిత కంపెనీలు, ప్రైవేటురంగం రైల్వే లైన్ల నిర్మాణం పథకాలలో పాలు పంచుకోవచ్చు. ఈ పథకాల నిర్మాణంలోనే కాకుండా, వాటి నిర్వహణలో కూడా ఈ వ్యవస్థలను భాగస్వాములను చేసే రీతిలో ఈ ప్రయత్నం జరగాలి. పెట్టుబడుల ప్రణాళిక, ప్రాజెక్టుల సమర్థ నిర్వహణలతో ఇది ప్రారంభం కావాలి. ఇంతవరకు సాంకేతిక సామర్థ్యమే ప్రధానంగా భావిస్తూ వచ్చిన రైల్వేలు ఇక వాణిజ్య కోణం నుంచి ఆలోచిస్తూ సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలు, మౌలిక వసతుల నిర్వహణ వంటి వాటి మీద దృష్టి పెట్టాలి. లాభాలను తెచ్చి పెట్టే ఈ తరహా ఆలోచన వల్లనే రైల్వేల ఆదాయం అంతర్జాతీయ స్థాయి రైల్వేల స్థాయికి చేరుతుంది. (వ్యాసకర్త బీజేపీ ఎంపీ / కేంద్రమంత్రి మేనకా గాంధీ కుమారుడు) -
సాగు కన్నీటి వాగేనా!
విశ్లేషణ ఆ రంగానికి చాలినంత విద్యుత్ కూడా అందడం లేదు. దేశంలో ఉపరితల నీటి పారుదల నిర్వహణ సమర్థంగా జరగడం లేదు. వ్యవసాయానికి అనువైన భూమిలో కేవలం 40 శాతమే అందుకు నోచుకుంటోంది. నిజానికి మరికొంత భూమిలో సేద్యం చేయగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ, వినియోగించుకోవడం లేదు. భూగర్భ జలాల పంపిణీ కూడా సమంగా సాగడంలేదు. ఆర్థికంగా శక్తి ఉండి, మంచి పరికరాలను, పంపులను ఉపయోగించుకుంటున్నవారు మాత్రమే భూగర్భ జలాలలో ఎక్కువ భాగాన్ని వినియోగించుకుంటున్నారు. ఏ కర్షకుడైనా తను పండించగలిగేది పండించవచ్చు. కాని తన శ్రమ ఫలితాన్ని మార్కెట్లో అమ్ముకోవడం దగ్గర మాత్రం అతడు దారుణమైన క్షోభకు గురౌతున్నాడు. 1980 - 2011 మధ్య భారతదేశంలో సేద్యమే వృత్తిగా ఉన్నవారి సంఖ్య దాదాపు యాభై శాతం ఉంది. ఎన్ఎస్ ఎస్ఓ (నేషనల్శాంపుల్ సర్వే ఆఫీస్) గణాంకాల ప్రకారం దేశంలోని 57.8 కోట్ల కుటుంబాలలో, గ్రామీణ ప్రాంతా లలోని 15.61 కోట్ల కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడినవే. సేద్యమే ఆధారంగా ఉన్న కుటుంబాలు సగటున నెలకు రూ. 6,426 ఆర్జిస్తున్నాయి. మొత్తం వ్యవ సాయ కుటుంబాలలో మళ్లీ 33 శాతం కుటుంబాలకు 0.4 హెక్టార్ల కంటె తక్కువ భూమే ఉంది. కేవలం ఒక్క హెక్టార్ భూమి కలిగి ఉండి, రోజు గడవడం కూడా కష్టంగా ఉన్న కుటుంబాలు 65 శాతం ఉన్నాయి. మొత్తం వ్యవసాయ కుటుంబాలలో సగం, అంటే 50 శాతం, రుణబాధతో గడు పుతున్నవే. ఆ కుటుంబాలన్నీ సగటున రూ.47,000 అప్పుతో సతమతమౌతున్నాయి. ఈ పరిస్థితులు రైతులం దరినీవడ్డీవ్యాపారుల బారినపడేటట్టు చేస్తున్నాయి. గ్రామీ ణ రుణభారంలో దాదాపు 26 శాతం ఇలాంటి రుణమే. వీరంతా 20 శాతం వడ్డీల కింద చెల్లిస్తూ దారిద్య్రం నుంచి ఎప్పటికీ బయటపడలేని దుస్థితిలో చిక్కుకుని ఉన్నారు. దిగుబడి మొత్తంలో 30 శాతం ఖర్చుల రూపంలో పోతోంది. ఎరువులు, కూలీరేట్లు విపరీతంగా పెరగడం వల్ల ఈ ఖర్చు మరింత పెరిగింది. గ్రామీణప్రాంతాలలో చెల్లించే కనీస వేతనం 2007 నుంచి బాగా పెరగడంతో ద్రవ్యోల్బ ణానికి దారి తీసింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఇజీఎస్) వల్ల గ్రామీణ ప్రాంత కూలీలకు ఎక్కువ వేతనాలను కోరే శక్తి పెరిగింది. వ్యవ సాయ రంగంలో ఖర్చులకు తగినట్టు, ఉత్పత్తి మీద రాబడి రావడం లేదు. దీనితో ద్రవ్యోల్బణం మరింత పెరు గుతోంది. రైతుకు మేలు చేయని వ్యవసాయోత్పత్తుల ధరలు ఈ మొత్తం వ్యవస్థ దొడ్డిదారి వ్యవహారాల వల్ల, దళారుల గుత్తాధిపత్య ధోరణులవల్ల చతికిలపడింది. దీనితో రైతు లకు ప్రయోజనం కూర్చని రీతిలో వ్యవసాయోత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పన సంపూర్ణంగా అభివృద్ధి చెందని కారణం గా (ఉదా: శీతల గిడ్డంగులు, రవాణా సదుపాయాలు లేక పోవడం) 25 శాతం దుబారా చోటుచేసుకుంటున్నది. అస మర్థ ప్రజాపంపిణీ వ్యవస్థ కారణంగా 40 శాతం వ్యవసాయోత్పత్తి వ్యర్థమవుతోంది. అలాగే సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు నిలకడ లేని ఆర్థిక వ్యవస్థకు కారణ మవుతున్నాయి. చాలని సాగు నీటి పారుదల సౌకర్యం సాగునీటి పారుదల వ్యవస్థ ద్వారా వ్యవసాయానికి లభిం చే నీరు అవసరాలకు చాలినంతగా లేదు. అలాగే నీటి పారుదల వ్యవస్థ వాతావరణ మార్పుల వల్ల సులభంగా ప్రభావితమయ్యే స్థితిలోనే ఉంది. ఆ రంగానికి చాలినంత విద్యుత్ కూడా అందడం లేదు. దేశంలో ఉపరితల నీటి పారుదల నిర్వహణ సమర్థంగా జరగడం లేదు. వ్యవ సాయానికి అనువైన భూమిలో కేవలం 40 శాతమే అం దుకు నోచుకుంటోంది. నిజానికి మరికొంత భూమిలో సేద్యం చేయగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ, వినియోగిం చుకోవడం లేదు. భూగర్భ జలాల పంపిణీ కూడా సమం గా సాగడంలేదు. ఆర్థికంగా శక్తి ఉండి, మంచి పరికరా లను, పంపులను ఉపయోగించుకుంటున్నవారు మాత్రమే భూగర్భ జలాలలో ఎక్కువ భాగాన్ని వినియోగించుకుం టున్నారు. నిజానికి వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతులతో చేయడానికి అవసరమయ్యే పెట్టుబడులలో రాయితీలు అందుబాటులో ఉన్నప్పటికీ రైతాంగం వాటిని అందుకునే స్థితిలో లేకపోవడంవల్ల కొత్త సాంకేతిక విధానాలను ప్రవేశపెట్టలేకపోతున్నారు. విద్యుత్‌ను ఆదా చేయాలి రైతాంగం పాత పంపుసెట్లను పక్కన పెట్టి, విద్యు త్ను 20 శాతం ఆదా చేయగలిగే కొత్త పరికరాలను తెచ్చు కోవాలి. వ్యవసాయ రంగానికి పరిమితంగా విద్యుత్ అందుతున్న ఈ నేపథ్యంలో ఇలాంటి పంపులను వినియోగించడం ద్వారానే పూర్తి అవసరాలు తీర్చుకోగలుగుతారు. అలాగే భూగర్భ జలాలు మరీ పాతాళంలోకి వెళ్లిపోతుంటే, పరి ష్కారం ఏమిటి? బిందుసేద్యమే ఇందుకు సమాధానం. ఉపరితల నీటిపారుదల వ్యవస్థను విస్తరించడం ద్వారా, బిందుసేద్యాన్ని ఆచరించేవారికి ఆర్థిక ప్రోత్సాహకాలను కల్పించడం ద్వారా నీటి అందుబాటు సౌకర్యాన్ని మరింత మెరుగుపరచవచ్చు. వర్షం నీటిని కాపాడుకోవడం, భూ గర్భ జలాలను పునరుద్ధరించుకోవడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకుని కూడా వ్యవసాయోత్పత్తిని పెంపొందించవచ్చు. సమన్వయం లేని క్రమబద్ధీకరణ పుణ్యమా అని వ్యవసాయ రంగం గందరగోళ పరిస్థితులను ఎదుర్కొం టున్నది. ఉదాహరణకి వ్యవసాయ ఉత్పత్తుల గిడ్డంగుల వ్యవహారమే తీసుకుందాం. ఆ రంగం ప్రయోజనం మేరకు ఉత్పత్తులను ప్రైవేటు వ్యక్తులు సయితం నిల్వ చేయడానికి అత్యవసర వస్తువుల చట్టం అనుమతిస్తున్నది. వ్యవసాయదారుల ప్రయోజనాల కోసం రహస్య బిడ్ల ద్వారా హోల్‌సేల్ మార్కెట్‌ను కూడా ప్రభుత్వం నిర్వహిం చవచ్చు. నిజానికి సిద్ధాంత పరంగా చూస్తే భారత వ్యవ సాయ విధానం మంచిదే. కాని దాని నుంచి ఫలితాలను రాబట్టుకోవడంలో వైఫల్యం ఎదురైంది. నాఫెడ్ ఏర్పాటు ఉద్దేశం అలాంటిదే. వ్యవసాయంలో పోటీ మార్కెట్లను పెంపొందించడం, రైతులకు మార్కెటింగ్‌లో, ప్రోసెసిం గ్లో సహకరించడం నాఫెడ్ లక్ష్యం. కానీ నిర్వహణా లోపంతో ఇటీవల కాలంలో వ్యవసాయ రంగంలో తలె త్తిన సంక్షోభాలను ఇది నివారించలేకపోయింది. ఉల్లి ధర అదుపులేకుండా పెరగడం ఇందుకు ఒక ఉదాహరణ. అటు సంప్రదాయం, ఇటు ఆధునిక విధానం సేద్యంలో ఎదురయ్యే ప్రమాదాల (రిస్క్) నుంచి రైతు లను కాపాడడంలో ప్రభుత్వం సాయపడవచ్చు. దేశంలో పంటల బీమా చాలా తక్కువ. ఇలాంటి రిస్క్‌ల నుంచి కాపాడుకోవడానికి, ఎరువులు, మందులు, కూలీల మీద వెచ్చించే ఖర్చులు తగ్గించడానికి రైతులు సంఘాలుగా ఏర్పడవచ్చు. దీర్ఘకాల గ్రామీణ రుణ విధానాన్ని ప్రవేశ పెట్టడం కూడా అవసరం. ఇందువల్ల బ్యాంకులకు కూడా ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెట్ ఒడిదుడుకులను కూడా ఈ విధానం కట్టడి చేస్తుంది. పంటల మార్పిడి, భూమిని చదునుచేయడం, కప్పడం వంటి సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు ఇప్పటికీ అవసరమైనవే. నిజానికి వీటి ప్రయో జనం ఏ మేరకో రైతులకు సంపూర్ణంగా తెలియకపోయినా ఈ పద్ధతుల వల్ల కొంత మేలు ఉంది. నిజానికి ఇలాంటి తక్కువ ఖర్చు పద్ధతుల వల్ల వ్యవసాయ పెట్టుబడులు తగ్గుతాయి. భూమి కోతను నివారించి, భూసారాన్ని పెం చుతాయి. అలాగే శ్రీవరి పద్ధతి (తక్కువ నీటి సౌకర్యంతో అవసరాల మేరకు పండించడం), ఫెర్టిగేషన్ (సూక్ష్మ సేద్య పరికరాలతో ఎరువులను సమంగా పంపిణీ చేయడం) విధానాలను ప్రోత్సహించాలి. పరిమితంగా ఉన్న వనరు లను, వాటి వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని, నీటిని సమర్థంగా ఉపయోగించుకుని పండించిన వ్యవసాయో త్పత్తులకు, అందులోని రకాలకు మేలైన మద్దతు ధరలను ప్రకటించడం ద్వారా అలాంటి వాటిని ప్రోత్సహించాలి. ఈ ప్రోత్సాహకాల ద్వారా అలాంటి విధానాలను రైతులు అవలంబించేటట్టు చేయాలి. 70 శాతం చేలకు దుర్భిక్ష ప్రమాదం వాతావరణంలో మార్పులు మన వ్యవసాయ రంగాన్ని దారుణంగా ప్రభావితం చేస్తున్నాయి. దేశంలో ఉన్న సాగు భూమిలో 70 శాతం దుర్భిక్షం పాలు కావడానికి అవకాశం ఉన్నదే. 12 శాతం భూమి వరదల వల్ల, 8 శాతం తుపాన్ల జోన్లలో ఉండడం వల్ల ఆ సాగు భూమి కరువుకాటకా లతో ప్రభావితమవుతోంది. ఉష్ణోగ్రతలలో కొద్దిపాటి పెరుగుదల కనిపించినా అది వ్యవసాయోత్పత్తులను తగ్గిస్తుంది. అయితే దేశంలో విడుదల అవుతున్న ఉద్గా రాలలో 20 శాతం వ్యవసాయ రంగానికి చెందినవే. అం దువల్ల ఒక విపత్తును ఒకటి పెంచుతూ ఇదంతా విషవల యంలా మారింది. అయితే వ్యవసాయరంగంలో నిలకడ సాధించే లక్ష్యంతో భారత్ ఇప్పటికే (ఎన్ఎంఎస్ఏ -నేష నల్ మిషన్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ ద్వారా) ప్రత్యేక కృషిని ప్రారంభించింది. వ్యవసాయ రంగం ఎదు ర్కొంటున్న సవాళ్లను గుర్తించినా, వైఫల్యాలను కనుగొ నడం దగ్గర, కొత్త విధానాలను పరిచయం చేయడం దగ్గర, సేద్యంలో ఇప్పటికీ కొనసాగుతున్న అసమర్థ విధా నాలను తొలగించే పనిలోను ఎన్ఎంఎస్ఏ కృషి నిరాశా జనకంగానే ఉంది. సాంకేతిక పురోగతి కావాలి భారత వ్యవసాయ రంగంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞా నాన్ని ప్రవేశపెట్టాలి. వారికి కొత్త విధానాలను అందుబా టులోకి తెచ్చి, ఆర్థిక ప్రోత్సాహకాలను కల్పించి మరింత ఆదాయాన్ని తెచ్చే పంటల వైపు దృష్టి మళ్లించే విధంగా చేయాలి. అంటే పండ్లతోటల పెంపకం వంటి వాటి మీద శ్రద్ధ పెట్టేలా చేయాలి. ఇలాంటి సంస్కరణలు భవిష్య త్తులో అయినా తక్కువ పెట్టుబడులకు ఆస్కారం కల్పిస్తా యి. తనను పట్టించుకునే స్వేచ్ఛా విఫణి వైపు రైతు నడవ డానికి ప్రోత్సహిస్తాయి. ధరవరలను నిర్ణయించుకునే వెసులుబాటు రైతుకు కలగడంతో పాటు, ఆహారభద్రతకు కూడా భరోసా ఏర్పడుతుంది. (వ్యాసకర్త బీజేపీ ఎంపీ / కేంద్ర మంత్రి మేనకా గాంధీ కుమారుడు) ఇకపై వరుణ్ గాంధీ ‘సాక్షి’ పాఠకుల కోసం వ్యాసాలు అందించనున్నారు. -
ధనవంతులే లబ్ధి పొందుతున్నారు!
సుల్తాన్పూర్(యూపీ): ప్రభుత్వ పథకాలతో ధనవంతులే లబ్ధి పొందుతున్నారని, పేదలకు లబ్ధి చేకూరడం లేదని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అన్నారు. ఆయన ఆదివారమిక్కడ వికలాంగులకు త్రిచక్ర వాహనాలు, తదితరాలను అందించారు. కొంతమంది ధనిక కుటుంబాల్లో దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలకు అందించే కార్డులు (బీపీఎల్) కూడా ఉన్నాయని వరుణ్ ఎద్దేవా చేశారు. దీంతో పేదలకు అందాల్సిన పెన్షన్లు వారికి సరిగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు అనేవి ఒక్కసారి వచ్చే ఎన్నికలు కాదని, ప్రజలకు సేవ చేయడమే రాజకీయాల ప్రధాన ఉద్దేశమని వరుణ్ తెలిపారు. ఎంపీ ఫండ్ పై ప్రజలకు పూర్తి అధికారం ఉందని వరుణ్ ఈసందర్భంగా గుర్తు చేశారు. -
తండ్రైన వరుణ్ గాంధీ
న్యూఢిల్లీ: బీజేపీ లోకసభ సభ్యుడు, మేనకా గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ దంపతులకు సోమవారం ఆడపిల్ల జన్మించింది. తన కుమార్తెకు అనసూయ అని నామకరణం చేశామని వరుణ్ గాంధీ ఓ ప్రకటనలో తెలిపారు. న్యూఢిల్లీలో సోమవారం మధ్యాహ్నం కూతురు జన్మించింది. 'నా భర్య యామిని, కుటుంబ సభ్యులలకు చెప్పలేనంత ఆనందంలో మునిపోయారు' అంటూ ఫిరోజ్ వరుణ్ గాంధీ సంతకంతో కూడిన ఓ ప్రకటన వెలువడింది. 2011లో యామిని రాయ్ చౌదరీ అనే గ్రాఫిక్ డిజైనర్ ను వరుణ్ గాంధీ పెళ్లాడారు. వరుణ్ గాంధీ మాజీ ప్రధాని ఇందిర గాంధీ మనవడు, సంజయ్ గాంధీ కుమారుడు అనే సంగతి తెలిసిందే. -
ముఖ్యమంత్రిగా మా అబ్బాయే ఉత్తమం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో చాలా ఏళ్ల తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో ముఖ్యమంత్రి పీఠంపై ఆ పార్టీ నాయకులు కన్నేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపంలో లేకపోయినా ఆశావహ అభ్యర్థుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. కేంద్ర మంత్రి మేనకా గాంధీ తన కుమారుడు, ఎంపీ వరుణ్ గాంధీ పేరును స్వయంగా ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వరుణ్ అత్యుత్తమ వ్యక్తి అవుతారని మేనక అన్నారు. ఉత్తరప్రదేశ్ లో సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మేనక అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మేనక్, వరుణ్ ఇద్దరూ యూపీ నుంచే లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం యూపీలో సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉంది. కాగా అత్యాచారాలు, నేరాలను అరికట్టడంలో విఫలమైన అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ అద్భుత ఫలితాలు సాధించడంతో ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రత్యేక దృష్టిసారిస్తోంది. మేనక ఆశలు నెరవేరాలంటే ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులు పొందాలి. -
గాంధీల ఇంట మాటల తూటా
వరుణ్‌పై మళ్లీ ప్రియాంక విమర్శలు కుటుంబానికి ద్రోహం చేస్తున్నాడు {పియాంక లక్ష్మణరేఖ మీరుతున్నారు: వరుణ్ అమేథీ/సుల్తాన్పూర్: ఎన్నికల నేపథ్యంలో గాంధీల కుటుంబంలో మాటల మంట రేగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ తన చిన్నాన్న కుమారుడు వరుణ్ గాంధీపై మరోసారి విమర్శల దాడి చేశారు. వరుణ్ చేష్టలన్నీ కుటుంబానికి ద్రోహం చేసేటట్టుగా ఉన్నాయని మండిపడ్డారు. అదే సమయంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి వరుణ్ గాంధీ కూడా తన అక్కకు ఘాటుగా బదులిచ్చారు. ప్రియాంక లక్ష్మణరేఖ దాటుతున్నారంటూ హెచ్చరించారు. ఈ మాటల యుద్ధం మంగళవారం వరుణ్ సుల్తాన్పూర్ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసే నేపథ్యంలో జరిగింది. అదే సమయంలో పక్క నియోజకవర్గం అమేథీలో రాహుల్ గాంధీ తరఫున ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రియాంక విలేకరులతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికలు కుటుంబ టీ పార్టీ కాదని, భావజాలాల మధ్య యుద్ధమని పేర్కొన్నారు. భావసారూప్యం లేని వాళ్లు రక్తసంబంధీకులైనాతనకు ప్రత్యర్థులేనని స్పష్టం చేశారు. ‘గత ఎన్నికల్లో వరుణ్ వెల్లడించిన భావాలను నేను పూర్తిగా వ్యతిరేకించాను. అవి నా కుటుంబానికి ద్రోహం చేసేవి. దేశ ఐక్యత కోసం నా తండ్రి ప్రాణాలర్పించాడు. నా పిల్లలకోసమైనా సరే దానిని నేను తక్కువ చేయలేను’ అని ప్రియాంక చెప్పారు. మర్యాద మీరుతున్నారు: అక్క వరుస విమర్శలపై మౌనం వీడిన వరుణ్ గాంధీ తన మర్యాదైన ప్రవర్తనను చేతగాని తనంగా ఎవరూ చూడొద్దని ప్రియాంకను పరోక్షంగా హెచ్చరించారు. మర్యాద అనే లక్ష్మణ రేఖను ఆమె దాటారని చెప్పారు. కొంతమంది తాను తప్పు దారి పట్టానని చెబుతున్నారని, తన దారి ముఖ్యం కాదని దేశానికి సరైన దిశానిర్దేశం చేయడం ముఖ్యమని చెప్పారు. మన్మోహనే సూపర్ పీఎం:సోనియా చేతిలో ప్రధాని కీలుబొమ్మగా పనిచేశారని ఆయన మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారు చెప్పడంపై మన్మోహన్, సోనియా ఇంకా మౌనం వీడలేదు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ, ప్రధాని కుమార్తె ఉపీందర్ సింగ్ ఆయనకు బాసటగా నిలిచారు. మన్మోహనే సూపర్ పీఎం అని ప్రియాంక, సంజయ్ తన తండ్రి నమ్మకాన్ని వమ్ముచేశారంటూ ఉపీందర్ పేర్కొన్నారు. -
ప్రియాంక గాంధీ లక్ష్మణ రేఖ దాటారు: వరుణ్
సుల్తాన్పూర్: గాంధీ నెహ్రూ కుటుంబ వారసుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మేనక గాంధీ కొడుకు, బీజేపీ యువనేత వరుణ్ గాంధీ తాజాగా అక్క ప్రియాంక గాంధీపై విరుచుకుపడ్డారు. ప్రియాంక హుందాతనం వీడి లక్ష్మణ రేఖ దాటారని వరుణ్ విమర్శించారు. దశాబ్ద కాలంగా కుటుంబ సభ్యుడిగా, ఓ రాజకీయ నేతగా తన ప్రసంగాల్లో ఎప్పుడూ అమర్యాదగా మాట్లాడలేదని, లక్ష్మణ రేఖ దాటలేదని పేర్కొన్నారు. స్వలాభం కంటే దేశ ప్రయోజనాలే మిన్నగా భావిస్తానని, తాను ఇదే బాటలో నడుస్తానని వరుణ్ చెప్పారు. వరుణ్, మేనక బీజేపీ తరపున లోక్‌సభకు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తరపున ప్రియాంక ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇరు కుటుంబాల మధ్య పరస్పర విమర్శలకు కారణమేంటంటే.. గత వారం అమేథిలో అన్న రాహుల్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన ప్రియాంక.. వరుణ్ దారి తప్పారని, అతను సరైన మార్గంలో నడవాలంటే ఓడించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. 'వరుణ్ మా కుటుంబ సభ్యుడే. అతను నాకు సోదరుడు. అయితే తమ్ముడు దారి తప్పాడు. ఓ కుటుంబంలో చిన్నవాళ్లు దారితప్పితే పెద్దలు సరైన మార్గంలో నడిపించాలి. వరుణ్‌ను సన్మార్గంలో నడిపించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా' అని ప్రియాంక అన్నారు. ఈ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన మేనక దీటుగా బదులిచ్చారు. వరుణ్ దారి తప్పాడా లేదా అన్నది ప్రజలు నిర్ణయిస్తారని, ప్రియాకం కాదన్నట్టుగా మేనక వ్యాఖ్యానించారు. వ్యక్తిగత విమర్శలు మాని ప్రజల సమస్యలపై మాట్లాడాలని వరుణ్ అన్నారు. విమర్శల పర్వం ఇంతటితో ముగుస్తుందో లేక మరింత తీవ్ర రూపం దాల్చుతుందో చూడాలి! -
తమ్ముడూ... ఇప్పటికైనా...
-
తమ్ముడు దారి తప్పాడు!
వరుణ్‌గాంధీపై ప్రియాంక సంచలన ఆరోపణలు ఎన్నికల్లో అతన్ని గెలిపించొద్దని ప్రజలకు విజ్ఞప్తి ఎవరు దారి తప్పారో ప్రజలే నిర్ణయిస్తారన్న వరుణ్ తల్లి న్యూఢిల్లీ: అసలే ఉప్పు, నిప్పుగా ఉండే సోనియాగాంధీ, మేనకాగాంధీ కుటుంబాలు రాజకీయంగా మరోసారి కత్తులు దూసుకున్నాయి. మాటల తూటాలు సంధించుకున్నాయి. తన చిన్నాన్న సంజయ్‌గాంధీ కుమారుడు, తనకు తమ్ముడయ్యే వరుణ్‌గాంధీపై ప్రియాంకా గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. వరుణ్ దారితప్పాడని ఆరోపణలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరుణ్‌ను ఎన్నికల్లో గెలిపించరాదని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శనివారం అమేథీ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీలోని ఫిల్బిత్ సిట్టింగ్ ఎంపీ అయిన వరుణ్ ఈసారి ఎన్నికల్లో అమేథీ పక్క నియోజకవర్గమైన సుల్తాన్పూర్ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. ‘‘వరుణ్‌గాంధీ కచ్చితంగా మా కుటుంబానికి చెందిన వ్యక్తే. అతను నాకు తమ్ముడే. కానీ అతను దారితప్పాడు. కుటుంబంలో అందరికన్నా చిన్నోడు తప్పుడు బాటను ఎంచుకుంటే పెద్దలే అతనికి సరైన మార్గాన్ని చూపుతారు. అందువల్ల నా తమ్ముడికి సరైన మార్గం చూపాలని కోరుతున్నా’’ అని ప్రియాంక వ్యాఖ్యానించారు. వరుణ్ రాజకీయంగా ముందుకు సాగాలంటే మంచి మనసుతో అందరినీ కలుపుకొని వెళ్లాలని సూచించారు. ‘‘దేశ ఐక్యత కోసం మనస్ఫూర్తిగా ఓటు వేయాలని కోరేందుకే నేను ఇక్కడకు (సుల్తాన్పూర్) వచ్చా. ఈసారి మీ నియోజకవర్గం గురించే కాకుండా యావత్ దేశం గురించి ఆలోచించండి. కుటుంబంలోని చిన్న వ్యక్తికి సరైన బాట చూపేలా తెలివిగా ఓటు వేయండి’’ అని కోరారు. ప్రజలే నిర్ణయిస్తారు: మేనక ప్రియాంక విమర్శలపై వరుణ్‌గాంధీ తల్లి, బీజేపీ నాయకురాలు మేనకాగాంధీ దీటుగా స్పందించారు. ఎవరు తప్పు దోవలో వెళ్లారో దేశమే నిర్ణయిస్తుందనిఆదివారం వ్యాఖ్యానించారు. దేశ సేవలో ఒకవేళ అతను తప్పుడు బాటలో పయనించి ఉంటే దేశమే దానిపై నిర్ణయిస్తుందన్నారు. మరోవైపు వరుణ్‌గాంధీకి బీజేపీ బాసటగా నిలిచింది. వరుణ్ సరైన దారిలోనే ప్రయాణిస్తున్నారని, దేశాన్ని ఎవరైనా తప్పుదోవ పట్టించారంటే అది కాంగ్రెస్ పార్టీయేనని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ విమర్శించారు.