ఖాకీవనంలో ప్రక్షాళన సాధ్యమా! | state security commisions is in worst manner, says varun gandhi | Sakshi
Sakshi News home page

ఖాకీవనంలో ప్రక్షాళన సాధ్యమా!

Published Wed, Aug 26 2015 1:09 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఖాకీవనంలో ప్రక్షాళన సాధ్యమా! - Sakshi

ఖాకీవనంలో ప్రక్షాళన సాధ్యమా!

స్టేట్ సెక్యూరిటీ కమిషన్ల ఏర్పాటులో ప్రతిపక్ష నాయకుడిని భాగస్వామిని చేయవలసిన అవసరం ఉంది. అలాగే పదవిలో ఉన్న లేదా పదవీ విరమణ చేసిన సీనియర్ న్యాయమూర్తికి కూడా స్థానం కల్పించాలి. అయితే మన 26 స్టేట్ సెక్యూరిటీ కమిషన్లలో ఆరు ప్రతిపక్ష నేతను సభ్యునిగా ఎంపిక చేయనే లేదు. బిహార్ కమిషన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు డెరైక్టర్ జనరల్, హోంశాఖ కార్యదర్శి మాత్రమే సభ్యులు. నిజానికి పోలీసుల పనితీరు విధానాన్ని రూపొందించడానికి  ఈ కమిషన్లను ఉపయోగించుకోవాలి.
 
రాజకీయమయమైపోయిన మన అసమర్థ పోలీసు వ్యవస్థ దేశంలో హింస మీద క్రమంగా గుత్తాధిపత్యాన్ని సాధించింది. పోలీసు శాఖలో పెరిగిన పైశా చకత్వం, బలవంతపు వసూళ్లు, వారు చేస్తున్న ఇతర నేరాలు, పెరుగుతున్న నిర్బంధాల గురించి నిత్యం నమోదవుతున్న నివేదికలు భయం గొలుపుతు న్నాయి. 2014లో దేశం నలుమూలల నుంచి పోలీసులపై 47,774 ఫిర్యా దులు అందాయి. వీటిలో కేవలం 2,601 ఫిర్యాదులను క్రిమినల్ కేసులుగా మార్చారు. 1,453 మంది పోలీసులను మాత్రం అరెస్ట్ చేశారు. 20,126 ఫిర్యాదులను తప్పుడు ఆరోపణులుగా తేల్చారు. 2014లో మానవహక్కుల ఉల్లంఘన ఆరోపణలతో పోలీసుల మీద 108 కేసులు నమోదైనాయి. మళ్లీ వీటిలో 62 కేసులు తప్పుడు కేసులని కొట్టి పారేశారు. ముగ్గురు పోలీసులకు మాత్రమే శిక్షలు పడ్డాయి. 2014 లెక్కల ప్రకారం, పోలీసు నిర్బంధంలో ఉన్న ప్పుడు 93 మంది మరణించినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 25 కేసు లకు సంబంధించి న్యాయ విచారణలు జరిగాయి.
 
 26 మంది పోలీసుల మీద చార్జిషీట్లు కూడా దాఖలు చేశారు. కానీ వీరిలో ఏ ఒక్కరికి శిక్ష పడలేదు. ఒక పక్క నేరాలు పెరుగుతుంటే (పెండింగ్‌లో ఉన్న భారత శిక్షాస్మృతి కేసులు- 94,8073. కొత్త కేసులు 2,851,563), మరో పక్క లాఠీచార్జీలు కూడా పెరిగి పోతున్నాయి (2014లో ఇలాంటివి 383 కేసులు నమోదు కాగా, ఇందులో గాయపడినవారు లేదా మరణించినవారు 262 మంది). ఇలా ఉండగానే, భారతీయ పోలీసుల ‘పశు ప్రవర్తన’ గురించి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. నిరసన ప్రదర్శన నిర్వహించిన ఉపాధ్యాయుల మీద, మరీ  ముఖ్యంగా అం దులో పాల్గొన్న మహిళల మీద బిహార్ పోలీసులు జరిపిన లాఠీచార్జిని దృష్టిలో ఉంచుకుని అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
 
 1857 తిరుగుబాటు సమయంలో వలస ప్రభుత్వానికి అండగా నిలబడే ఒక అధికార పోలీసు వ్యవస్థను నిర్మించడానికి రూపొందించినదే మన పోలీస్ చట్టం (1861). ఈ చట్టంలోని మూడో సెక్షన్ ప్రకారం రాష్ట్ర పోలీసుల మీద ఆయా రాష్ట్రాలకు పర్యవేక్షణ అధికారం సంక్రమించింది.  జిల్లా స్థాయిలో మా త్రం ద్వంద్వ విధానంతో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అజమాయిషీలో పోలీసు యంత్రాంగం పని చేస్తుంది. అయినా జిల్లా మేజిస్ట్రేట్ అదుపులోనే, నిర్దేశకత్వంలోనే జిల్లా పోలీసు యంత్రంగం పనిచేస్తుంది. అయితే పోలీస్ చట్టంలోని ఏడో సెక్షన్ ఆ శాఖలో కనిపించే పెత్తందారీ లక్షణం ఒక పరం పరగా కొనసాగేటట్టు చేస్తున్నది. ఉన్నతాధికారులకు కిందిస్థాయి అధికారులు ఒదిగి ఒదిగి ఉండక తప్పని స్థితిని కలిగిస్తున్నది ఇదే. స్వాతంత్య్రం రావడా నికి ముందు పోలీసులు వారి ఉన్నతాధికారులకీ, రాజకీయ ప్రభువులకీ తప్ప మరెవ్వరికీ జవాబుదారులు కాదు.
 
 మారని చట్టాలు
 స్వాతంత్య్రానంతర భారతదేశంలో పోలీసుశాఖ మార్పునకు అతీతమైన వ్యవస్థగా ఉండిపోయింది. వివిధ రాష్ట్రాలు పోలీసు చట్టాలను తెచ్చాయి (బాంబే పోలీస్ చట్టం 1951, కేరళ పోలీస్ చట్టం 1960 మొదలైనవి). కానీ ఇవన్నీ 1861 నాటి పాత చట్టం తరహాలోనే రూపొందాయి. పోలీసు వ్యవ స్థను ప్రజాస్వామికం చేయవలసిన అవసరం, పోలీసు శాఖను దుర్విని యోగం చేయకుండా నిరోధించే జాగ్రత్తలు వంటి అంశాలను ఈ చట్టాలు కూడా పట్టించుకోలేదు. 1979లో జాతీయ పోలీస్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఒక నమూనా పోలీసు చట్టంతో పాటు, ఎనిమిది నివేదికలను, నిర్ది ష్టమైన సిఫారసులను కూడా ఈ కమిషన్ చేసింది. అయితే వీటిలో దేనినీ స్వీకరించలేదు. తరువాత ఏర్పాటైన రెబిరో కమిటీ (1999), పద్మనాభయ్య కమిటీ (2000) పోలీసు శాఖలో సంస్కరణల గురించి దృఢమైన సిఫారసులు చేశాయి. ప్రకాశ్ సింగ్ వ్యాజ్యంలో తీర్పు వెలువరించిన (2006) సుప్రీంకోర్టు ఏడు మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించవలసిందని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసు శాఖలో చట్టవిరు ద్ధమైన రాజకీయ జోక్యం నివారించడం, పోలీసు డెరైక్టర్ జనరల్ నియామ కంలో పారదర్శకత, శాంతిభద్రతలు-నేరపరిశోధక వ్యవస్థల విభజన, ఫిర్యా దుల స్వీకరణ వంటివి ఆ ఏడు మార్గదర్శకాలలో ముఖ్యమైనవి. కానీ ఎప్పటి లాగే ఇవీ అమలుకు నోచుకోలేదు.
 
 పోలీసు శాఖలో రాజకీయ జోక్యాన్ని నివారించడం గురించి ఆలోచించా లంటే, ఆ శాఖ వ్యవస్థీకృత నిర్మాణాన్ని పరిగణనలోనికి తీసుకోవాలి. ఆ శాఖలో పదోన్నతులు అమ్మకానికీ, ప్రత్యేక ‘అర్హతలు’ కలవారికి లభిస్తు న్నాయి. ఇది ఉద్యోగులలో అనిశ్చితినీ, నైరాశ్యాన్నీ నింపుతోంది. పోలీస్ డెరై క్టర్ జనరల్, 3-4 సీనియర్ అధికారుల సహకారంతో పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తే అందరికీ న్యాయం చేసే రీతిలో పదోన్నతులు, పోస్టిం గులు ఇవ్వడానికి అది ఉపయోగపడుతుంది. యూపీఎస్‌సీ నియమించిన ముగ్గురు సీనియర్ సభ్యులతో కూడి న ప్యానెల్‌కు పోలీస్ డెరైక్టర్ జనరల్‌ను ఎంపిక చేసే బాధ్యతను అప్పగించాలి. సర్వీస్ రికార్డు, అనుభవం ఆధారంగా పదోన్నతి ఇవ్వాలి. పోలీస్ శాఖ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండాలంటూ పోలీస్ చట్టం (1861) ఇచ్చిన నిర్వచనం మేరకు ఆ శాఖ నిత్య విధులలో కూడా రాజ కీయ జోక్యం విపరీతం కావడానికి దోహదం చేసింది. అయితే పోలీస్ వ్యవస్థ మీద ప్రభుత్వ ఆధిపత్యం మితిమీరకుండా స్టేట్ సెక్యూరిటీ కమిషన్లు ప్రభు త్వానికీ, పోలీస్ శాఖకూ నడుమ వారధులుగా వ్యవహరించాలి. కామన్వెల్త్ పౌరహక్కుల వ్యవస్థ చేసిన సర్వే ప్రకారం (ఆగస్ట్ 2014) మన 26  రాష్ట్రాల లోనూ స్టేట్ సెక్యూరిటీ కమిషన్లు ఏర్పాటైనాయి. కానీ పని చేస్తున్నవి కేవలం 14. మళ్లీ 2007 నుంచి వీటి పనితీరును గమనిస్తే ఎక్కువ కమిషన్లు ఒకటి రెండుసార్లు మాత్రమే సమావేశమైనట్టు గమనిస్తాం. కాగా పోలీస్ శాఖకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఇప్పటికీ సవాలుగానే ఉన్నాయి.
 
 జవాబుదారీతనం కావాలి
 స్టేట్ సెక్యూరిటీ కమిషన్ల ఏర్పాటులో ప్రతిపక్ష నాయకుడిని భాగస్వామిని చేయవలసిన అవసరం ఉంది. అలాగే పదవిలో ఉన్న లేదా పదవీ విరమణ చేసిన సీనియర్ న్యాయమూర్తికి కూడా స్థానం కల్పించాలి. అయితే మన 26 స్టేట్ సెక్యూరిటీ కమిషన్లలో ఆరు ప్రతిపక్ష నేతను సభ్యునిగా ఎంపిక చేయనే లేదు. బిహార్ కమిషన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు డెరైక్టర్ జన రల్, హోంశాఖ కార్యదర్శి మాత్రమే సభ్యులు. నిజానికి పోలీసుల పనితీరు విధానాన్ని రూపొందించడానికి  ఈ కమిషన్లను ఉపయోగించుకోవాలి. అవి పోలీసుల పనితీరును సమీక్షించాలి. ఈ కమిషన్ నిర్మాణం తీరు రెండు పక్షా లను సమన్వయం చేయగలిగే విధంగా, అదే సమయంలో పాలకుల పరిమి తులను నిర్వచించేదిగా ఉండాలి. పోలీసులు జవాబుదారీతనంతో ఉండరనీ, పోలీసు అరాచకాల బాధితులకు కూడా పరిహారం చెల్లించే తీరులో ఉండరనీ ప్రజల భావన. మంచి రేటింగ్ కోసం పోలీసులు నేరాల గణాంకాలను దాచి పెడుతున్నారు. పోలీసులలో అవినీతి వ్యవహారం కేసులను నమోదు చేసుకో వడానికి నిరాకరించే విధానానికి కూడా దారితీస్తోంది. ఇప్పుడు ప్రపంచ మంతా ఫిర్యాదుల స్వీకరణకు చట్టబద్ధ యంత్రాంగాన్ని నెలకొలుపుకునే విధానం వచ్చింది. పోలీసుల మీద వచ్చిన ఫిర్యాదులను పారదర్శకంగా, స్వతంత్రంగా విచారించే అధికారం ఆ విధానానికి కల్పిస్తున్నారు. మనకు కూడా శాఖాపరమైన దర్యాప్తు విధానానికి బదులుగా, ఇటు రాష్ట్రస్థాయిలో, అటు జిల్లాస్థాయిలో పోలీస్ ఫిర్యాదు అధి కారవ్యవస్థ ఏర్పాటు కావాలి.
 
 పునర్ నిర్మాణంపై దృష్టి
 పోలీసు వ్యవస్థ భారంగా మారుతోంది. ఉదాహరణకు నేర పరిశోధక విభా గాన్ని తీసుకుంటే, ఇవి చాలా సందర్భాలలో పేలవంగా రూపొందుతున్నా యి. పెద్దగా తర్ఫీదులేని వారి చేత చాలా మందగమనంతో సాగుతున్నాయి. ఇతర పనులతో, రాజకీయ బాధ్యతలతో దర్యాప్తులకు ఏళ్లూ పూళ్లూ పడు తోంది. ప్రత్యేక అంశాల మీద దృష్టి సారించడానికి, మొత్తంగా పనితీరు మెరు గుపడడానికి శాంతిభద్రతల విభాగాన్ని, పరిశోధక విభాగాన్ని వేరు చేయడం అనివార్యం. గ్రామీణ ప్రాంతంలో ఉండే పోలీస్ స్టేషన్ల పరిధి 150 కిలోమీ టర్లకు మించరాదు. పట్టణ ప్రాంతంలో జనాభాను ప్రాతిపదికగా చేసుకో వాలి (ఒక స్టేషన్ పరిధిలో 60,000 జనాభా ఉండేలా చూడాలి. ఈ స్టేషన్‌లో సంవత్సరానికి 700 నేరాలకు మించి నమోదైతే మరో స్టేషన్ ఏర్పాటు చేయాలి). కేంద్రీయ పోలీస్ కమిటీ నిర్వహణలో ఉండే విధంగా అఖిల భారత పోలీస్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటుచేయాలి. పీలియన్ సూత్రాల (రాబర్ట్ పీలే అనే బ్రిటిష్ అధికారి పోలీసులకు కోసం రూపొందించిన నైతిక సూత్రాలు) అమలు భారతదేశంలో దాదాపు నిలిచిపోయింది. దేశంలో బల మైన, కేంద్రీకృత పోలీస్ వ్యవస్థ కోసం, ఇంకా చెప్పాలంటే పట్టణ ప్రాంత నేరాలను అరికట్టడానికీ, సామాజిక క్షేమానికి పూచీపడే రీతిలో, రాజకీయంగా తటస్థంగా ఉండే పోలీస్ వ్యవస్థ కోసం ఉద్దేశించినవే ఈ సూత్రాలు. ఈ విధమైన దృక్పథాన్ని ఆకాంక్షించడం వల్లనే మన ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టమవుతుంది. పాలనా వ్యవస్థల మీద విశ్వాసం పెరుగుతుంది.


వరుణ్ గాంధీ (వ్యాసకర్త బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి మనేకా గాంధీ కుమారుడు)

ఈమెయిల్: fvg001@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement