ధనవంతులే లబ్ధి పొందుతున్నారు!
సుల్తాన్‌పూర్(యూపీ): ప్రభుత్వ పథకాలతో ధనవంతులే లబ్ధి పొందుతున్నారని, పేదలకు లబ్ధి చేకూరడం లేదని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అన్నారు. ఆయన ఆదివారమిక్కడ వికలాంగులకు త్రిచక్ర వాహనాలు, తదితరాలను అందించారు. కొంతమంది ధనిక కుటుంబాల్లో దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలకు అందించే కార్డులు (బీపీఎల్) కూడా ఉన్నాయని వరుణ్ ఎద్దేవా చేశారు. దీంతో పేదలకు అందాల్సిన పెన్షన్లు వారికి సరిగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయాలు అనేవి ఒక్కసారి వచ్చే ఎన్నికలు కాదని, ప్రజలకు సేవ చేయడమే రాజకీయాల ప్రధాన ఉద్దేశమని వరుణ్ తెలిపారు. ఎంపీ ఫండ్ పై ప్రజలకు పూర్తి అధికారం ఉందని వరుణ్ ఈసందర్భంగా గుర్తు చేశారు.