వరుణ్ చెప్పింది నిజమే: రాహుల్ గాంధీ | whatever Varun Gandhi has said is correct, says Rahul Gandhi | Sakshi
Sakshi News home page

వరుణ్ చెప్పింది నిజమే: రాహుల్ గాంధీ

Published Wed, Apr 2 2014 1:55 PM | Last Updated on Sat, Sep 2 2017 5:29 AM

వరుణ్ చెప్పింది నిజమే: రాహుల్ గాంధీ

వరుణ్ చెప్పింది నిజమే: రాహుల్ గాంధీ

రాయబరేలీ: తన నియోజకవర్గం అమేథీలో జరిగిన అభివృద్ధిని ఇతర పార్టీ నాయకులు ప్రశంసించడం పట్ల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. అమేథీలో అభివృద్ధి పనులు కొనసాగిస్తామని ఆయన చెప్పారు.

అమేథీలో జరిగిన అభివృద్ధి గురించి తన సోదరుడు, బీజేపీ నాయకుడు వరుణ్ గాంధీ చెప్పిందంతా నిజమేనని అంగీకరించారు. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల రాహుల్ సంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల, మహిళల సాధికారత కోసం వ్యూహాత్మకంగా పనిచేశామని వివరించారు. ఈ కార్యక్రమాలు మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement