'అమేథీలో యథేచ్చగా బూత్ ల ఆక్రమణ'
Published Wed, May 7 2014 12:43 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
అమేథి: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటి చేస్తున్న నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు బూత్ లను ఆక్రమించుకుంటున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ ఆరోపించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ అడ్డదారుల తొక్కుతోందని ఆయన అన్నారు.
అమేథీ నియోజకవర్గంలోని మహ్మమూద్ పూర్ లోని 42 నెంబర్ బూత్ లో బూత్ లను ఆక్రమించకున్నారని కుమార్ విశ్వాస్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. పెద్ద ఎత్తున బూత్ ల అక్రమణ జరుగుతోందని, దొంగ ఓట్ల వేస్తున్నారని, పోలింగ్ సిబ్బందిని బెదిరిస్తున్నారని ఆయన మరో ట్విట్ లో పేర్కొన్నారు. ఓటర్లకు ఎస్ఎంఎస్, ఈమెయిల్, మొబైల్ ఫోన్ లతో ప్రచారం నిర్వహిస్తున్నారని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
అయితే విశ్వాస్ ఆరోపణల్లో వాస్తవం లేదని.. ఎన్నికలు సజావుగానే సాగుతున్నాయని జిల్లా మెజిస్ట్రేట్ జగత్ రాజ్ త్రిపాఠి అన్నారు. అమేథిలో కుమార్ విశ్వాస్ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో రాహుల్ 3.70 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
Advertisement
Advertisement