లక్నో: అమేథి నియోజవర్గం విడిచి వెళ్లాలని, లేకుంటే బలవంతంగానైనా పంపిస్తామని పోలీసులు తన కుటుంబాన్ని బెదిరించారని, అక్కడ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుమార్ విశ్వాస్ ఆరోపించారు. జిల్లా పోలీసు అధికారులు సోమవారం రాత్రి కుమార్ విశ్వాస్ అద్దెకుంటున్న ఇంటికి వెళ్లినట్టు ఆప్ వర్గాలు తెలిపాయి. విశ్వాస్ భార్య, పిల్లలు, ఇతర బంధువులందరూ అమేథి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రచార గడువు ముగిసినందున నియోజకవర్గంలో ఓట్లులేనివారు, అభ్యర్థుల మద్దతుదారులు, ప్రచారకర్తలు నియోజకవర్గంలో ఉండరాదని ఓ ఉన్నతాధికారి చెప్పారు. పోలీసులు అర్ధరాత్రి తన ఇంటికి వచ్చి భార్య, సోదరిని బెదిరించారని కుమార్ విశ్వాస్ ట్వీట్ చేశారు. ధైర్యముంటే కాంగ్రెస్ కంపెయినర్ ప్రియాంక వాద్రా, ఆమె మద్దతుదారులపైనా ఇలాగే వ్యవహరించాలని సవాల్ చేశారు.
అమేథి వీడాలంటూ ఆప్ అభ్యర్థి కుటుంబానికి హుకుం
Published Tue, May 6 2014 11:10 AM | Last Updated on Sat, Sep 2 2017 7:00 AM
Advertisement