అమేథిలో కేజ్రీవాల్ కు చేదు అనుభవం!
అమేథి: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నియోజకవర్గం అమేథిలో ఆమ్ ఆద్మీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు చేదు అనుభవం ఎదురైంది. అమేథీ నియోజకవర్గంలోని అయోధ్యనగర్ లో రోడ్ షో నిర్వహిస్తున్న కేజ్రీవాల్ కు మహిళల నుండి నిరసన వ్యక్తమైంది. కేజ్రీవాల్ ర్యాలీలో రాహుల్ గాంధీ జిందాబాద్, ఢిల్లీలో వెన్ను చూపిన కేజ్రీవాల్ వెనక్కి వెళ్లిపో అంటూ మహిళలు నినాదాలు చేశారు.
ఆప్ అభ్యర్థి కుమార్ విశ్వాస్ కు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో కేజ్రీవాల్ కు మహిళలను నల్లజెండాలతో స్వాగతం పలికారు. మే 7న జరిగే లోకసభ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి పోటీగా ఆప్ తరపున కుమార్ విశ్వాస్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే.