'అమేథిని చూసి షాక్ కు గురయ్యాను' | Manohar Parrikar targets Rahul Gandhi over lack of development in Amethi | Sakshi
Sakshi News home page

'అమేథిని చూసి షాక్ కు గురయ్యాను'

Published Mon, May 5 2014 6:07 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

'అమేథిని చూసి షాక్ కు గురయ్యాను' - Sakshi

'అమేథిని చూసి షాక్ కు గురయ్యాను'

పానాజి: అభివృద్దికి నోచుకోని అమేథీ పట్టణాన్ని చూసి షాక్ గురయ్యానని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్ అన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథి నియోజకవర్గంలో ఇటీవల బీజేపీ అభ్యర్ధి స్మృతి ఇరానీ తరపున ప్రచారం నిర్వహించారు.
 
'అమేథిలో పర్యటించాను. నిజంగా షాక్ గురయ్యాను. అక్కడ కనీస వసతులైన నీరు, విద్యుత్ సౌకర్యాలు కూడా లేవు. కేవలం 3-4 గంటలు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది. సరైన నీటి సరఫరా లేదు' అని పరిక్కర్ అన్నారు. కేవలం 51 శాతం ఎంపీ నిధులు మాత్రమే వినియోగించారని ఆయన అన్నారు.
 
గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథిలో ముక్కోణపు పోరు నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున కుమార్ విశ్వాస్, బీజేపీ నుంచి స్మృతి ఇరానీ బరిలో ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement