రాహుల్ గాంధీ మంచి యాక్టర్: కుమార్ విశ్వాస్ | Amethi has decided who to vote: Kumar Vishwas | Sakshi
Sakshi News home page

రాహుల్ గాంధీ మంచి యాక్టర్: కుమార్ విశ్వాస్

Published Tue, Apr 1 2014 12:46 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

రాహుల్ గాంధీ మంచి యాక్టర్: కుమార్ విశ్వాస్ - Sakshi

రాహుల్ గాంధీ మంచి యాక్టర్: కుమార్ విశ్వాస్

అమేథి: కాంగ్రెస్ పార్టీ 'యువరాజు' రాహుల్ గాంధీ, టెలివిజన్ తార స్మృతి ఇరానీలపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత, అమేథి అభ్యర్థి కుమార్ విశ్వాస్ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోశారు. రాహుల్ గాంధీ నటుడు ఇప్పటికే బరిలో ఉన్నారని.. అమేథి బరిలోకి మరో తార స్మృతి ఇరానీ వచ్చారు అని మీడియాతో మాట్లాడుతూ కుమార్ విశ్వాస్ వ్యాఖ్యలు చేశారు.
 
గత 40 రోజులుగా అమేథి లోకసభ నియోజకవర్గంలో పర్యటిస్తున్నాను. ఎవరికి ఓటు వేయాలో అనే అంశంపై ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు అని విశ్వాస్ అన్నారు. 
 
కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని, అందుకే అమేథిలో స్మృతి ఇరానీని బీజేపీ బరిలోకి దించిందని ఆయన ఆరోపించారు. అమేథి నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ 2004, 2009లో గెలుపొందిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement