‘లలిత్‌గేట్’లో మరో మలుపు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కుటుంబంతో ఐపీఎల్ స్కామ్‌స్టర్ లలిత్ మోదీకున్న సంబంధాలకు సంబంధించిన అంశమొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. లలిత్ తండ్రి కేకే మోదీ చైర్మన్, ఎండీగా ఉన్న ఇండోఫిల్ ఇండస్ట్రీస్ సంస్థలో డెరైక్టర్ పదవి ఇస్తామని సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్‌కు లలిత్ ప్రతిపాదించారన్న వార్త తాజా వివాదాన్ని మరింత పెంచింది. ఆ వార్త నిజమేనని, అయితే, తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించానని స్వరాజ్ కౌశల్ వివరణ ఇచ్చారు.