Lalit Modi
-
61 ఏళ్ల వయసులో మరోసారి ప్రేమలో పడ్డ ‘ఐపీఎల్ సృష్టికర్త’!.. ఎవరీమె?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తొలి చైర్మన్, వ్యాపారవేత్త లలిత్ మోదీ(Lalit Modi) మరోసారి ప్రేమలో పడ్డాడు. రీమా బౌరీ(Rima Bouri)తో పాతికేళ్లుగా తనకున్న స్నేహం ప్రేమగా రూపాంతరం చెందిందని తెలిపాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఈ విషయాన్ని లలిత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.దేశం విడిచిపారిపోయికాగా వ్యాపార కుటుంబానికి చెందిన లలిత్ మోదీ ఢిల్లీలో జన్మించాడు. ఐపీఎల్(IPL) సృష్టికర్తగా పేరు ప్రఖ్యాతులు పొందిన అతడు.. అదే స్థాయిలో అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఆర్థిక అవకతవలకు పాల్పడి దేశం విడిచిపారిపోయే పరిస్థితికి చేరుకున్నాడు. ప్రస్తుతం లలిత్ మోదీ లండన్‌లో తలదాచుకుంటున్నట్లు జాతీయ మీడియా కథనాల ద్వారా వెల్లడైంది.భార్య కంటే తొమ్మిదేళ్లు చిన్నఇదిలా ఉంటే.. లలిత్ మోదీ వృత్తిగత జీవితం మాదిరే వ్యక్తిగత జీవితం కూడా సంచలనాల మయమే. వయసులో తనకంటే తొమ్మిదేళ్లు పెద్దదైన, డివోర్సీ మినాల్‌ను లలిత్ మోదీ ప్రేమించి పెళ్లాడాడు. ఆమె కోసం కుటుంబాన్ని ఎదిరించి మరీ ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చిన లలిత్.. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగాడు.ఇక లలిత్- మినాల్ దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె అలియా, కుమారుడు రుచిర్ మోదీ ఉన్నారు. వీరిద్దరితో పాటు మినాల్‌కు మొదటి వివాహం ద్వారా కలిగిన కుమార్తె కరీమా సంగ్రాణిని కూడా లలిత్ మోదీ చేరదీసినట్లు కథనాలు ఉన్నాయి. లలిత్ ప్రాణంగా ప్రేమించిన మినాల్ క్యాన్సర్‌తో పోరాడి దురదృష్టవశాత్తూ 2018లో కన్నుమూశారు.సుస్మితా సేన్‌తో ప్రేమలో ఉన్నట్లుఅప్పటి నుంచి ఒంటరి జీవితం గడుపుతున్న లలిత్ మోదీ గతేడాది.. విశ్వ సుందర్ సుస్మితా సేన్‌తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించి సంచలనానికి తెరదీశాడు. అనంతరం.. ఆమెను బెటర్ హాఫ్ అని సంబోధిస్తూ పెళ్లి వార్తలకు ఊతమిచ్చాడు. అయితే, ఆ తర్వాత ఇద్దరూ వీటిని ఖండించడంతో ఊహాగానాలకు చెక్ పడింది.అయితే, తాజాగా.. 61 ఏళ్ల లలిత్ మోదీ తాను మరోసారి ప్రేమలో పడ్డట్లు తెలపడం విశేషం. ‘‘ఒక్కసారి అదృష్టం అంటారు... మరి నేను మాత్రం రెండుసార్లు లక్కీ అయ్యాను. 25 ఏళ్ల స్నేహం ప్రేమగా రూపాంతరం చెందిన వేళ.. అవును ఇది రెండోసారి జరిగింది. మీ జీవితాల్లోనూ ఇలా జరిగే ఉంటుంది. హ్యాపీ వాలైంటైన్స్ డే’’ అంటూ రీమా బౌరీతో ఉన్న ఫొటోలతో కూడిన వీడియోను లలిత్ మోదీ షేర్ చేశాడు.జీవితాంతం నువ్వే నా ప్రేమఇందుకు స్పందిస్తూ.. ‘‘లవ్ యూ మోర్’’ అని రీమా పేర్కొనగా.. లలిత్.. ‘‘జీవితాంతం నువ్వే నా ప్రేమ’’ అంటూ రొమాంటిక్‌గా బదులివ్వడం విశేషం. కాగా రీమా బౌరీ వృత్తిరీత్యా మార్కెటింగ్ కన్సల్టెంట్‌గా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. 2022లో లలిత్ మోదీ తన కుమార్తె ఆలియా వివాహం జరిపించాడు. బ్రెట్ కార్ల్సన్ అనే విదేశీయుడిని ఆలియా పెళ్లి చేసుకున్నారు. ఇటలీలోని వెనిస్ నగరంలో వీరి వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఇదిలా ఉంటే.. 2008లో మొదలైన ఐపీఎల్ పదిహేనేళ్లుగా విజయవంతమైన లీగ్‌గా కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చి 21 నుంచి ఈ మెగా క్రికెట్ ఈవెంట్ మొదలుకానుంది.చదవండి: అప్పుడే ఆఫర్ వచ్చింది.. కానీ!.. వదిలేసిన ఫ్రాంఛైజీ జట్టుకే కెప్టెన్‌గా.. View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi) -
‘మిత్రమా.. మనకు అన్యాయం జరిగింది!’
బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్ విజయ్ మాల్యా.. లలిత్ మోదీ మధ్య ఎక్స్ వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. విజయ్ మాల్యాకు ఇవాళ లలిత్ మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయగా.. అందుకు విజయ్ మాల్యా తనదైన శైలిలో స్పందించారు. ఈ క్రమంలో చర్చ తాజా పరిణామాలపైకి దారి మళ్లింది.‘‘నా ప్రియమైన మిత్రుడు విజయ్‌మాల్యాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. మనిద్దరమూ అది చూశాం. అయ్యిందేదో అయ్యింది.. రాబోయే సంవత్సరం నీదే మిత్రమా. ప్రేమ.. చిరునవ్వులతో సంతోషంగా ఉండూ.. అంటూ పోస్ట్ చేశారు. దానికి విజయ్ మాల్యాస్పందిస్తూ.. థ్యాంక్యూ మై డియరెస్ట్ ఫ్రెండ్. దేశానికి మనం ఎంతో చేశాం.. అయినా మనకు అన్యాయమే జరిగింది అనే అర్థం వచ్చేలా బదులిచ్చారు.Wishing you my friend #vijaymallya a very #happybirthday - life sure has its ups and downs we have both seen it. This too shall pass. May the year ahead be your year. And you are surrounded by love and laughter. Big big hug 🤗🥰🙏🏽@TheVijayMallya pic.twitter.com/ca5FyMFnqr— Lalit Kumar Modi (@LalitKModi) December 18, 2024ఇదిలా ఉంటే.. భారత బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థులపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలిస్తున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. ఈ ఏడాది ఎగవేతదారుల నుంచి ఆస్తులను జప్తు చేసి బ్యాంకుల్లో జమ చేస్తున్నామని.. ఈ ఏడాది రూ.22,280 కోట్లు రాబట్టామని.. ఇందులో విజయ్ మాల్యాకు చెందిన రూ.14 వేల కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈ ప్రకటనపైనా విజయ్ మాల్యా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బాకీలు రూ.6,203 కోట్లు, వడ్డీ.. రూ. 1,200 కోట్ల వడ్డీ. కానీ, ఈడీ సాయంతో బ్యాంకులు 14,131 కోట్లు వసూలు చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంటే అప్పు కంటే రెట్టింపు వసూలు చేశారన్నమాట. అయినా నన్ను ఆర్థిక నేరస్థుడిగానే చూస్తున్నారు. నన్ను యధేచ్ఛగా విమర్శిస్తున్నవాళ్లు.. నాకు జరిగిన ఈ అన్యాయం మీద మాట్లాడగలరా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారాయన. అలాగే సీబీఐ తన మీద పెట్టిన కేసు గురించి.. జప్తు గురించి మరో ట్వీట్ చేశారు. ఈ జప్తు చర్యను ఈడీ, బ్యాంకులు చట్టబద్ధంగా సమర్థించుకోవాలి. లేకుంటే.. ఉపశమనం కోసం పోరాడే అర్హత నాకు ఉన్నట్లే! అని ట్వీట్ చేశారాయన. అయితే దానికి కూడా లలిత్ మోదీ స్పందిస్తూ.. ‘‘నా స్నేహితుడు దీనిని కూడా అధిగమిస్తాడు.. బర్త్‌డే శుభాకాంక్షలు’’ అంటూ మరో పోస్ట్ చేశారు. ఇక ఈ ఇద్దరి మధ్య సంభాషణపై నెటిజన్లు జోకులేస్తూ.. ట్రోల్ చేస్తున్నారు. మరికొందరేమో విజయ్ మాల్యా తీరుపై మండిపడుతున్నారు.This too shall pass my friend @TheVijayMallya and wish a very happy birthday today my friend https://t.co/HYJYKe1mcx— Lalit Kumar Modi (@LalitKModi) December 18, 2024 Government and my many critics say that I have CBI criminal cases to answer. What criminal cases filed by CBI ? Never borrowed a single rupee, never stole, but as guarantor of KFA debt I am accused by CBI together with many others including IDBI Bank officials of fraudulently…— Vijay Mallya (@TheVijayMallya) December 18, 2024Whatever I have stated about my liabilities as guarantor of KFA loans is legally verifiable. Yet more than Rs 8000 crores have been recovered from me over and above the judgement debt. Will anyone, including those who freely abuse me, stand up and question this blatant injustice…— Vijay Mallya (@TheVijayMallya) December 18, 2024 ఐపీఎల్ వ్యవస్థాపకుడైన లలిత్ మోదీ.. 2010లో పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కేసులో దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం లండన్‌లో నివాసముంటున్న విషయం తెలిసిందే. అయితే.. న్యాయపరమైన చిక్కుల వల్ల తాను దేశం వీడలేదని, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి బెదిరింపులు రావడం వల్లే దేశాన్ని వీడాల్సి వచ్చిందని ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో లలిత్ మోదీ వెల్లడించారు. ఇక.. ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశాలతో ఈడీ, బ్యాంకులు సంయుక్తంగా ఎగవేతదారుల ఆస్తులను జప్తు చేసి వేలం వేస్తున్నాయని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వివిధ కేసుల్లో ప్రత్యేక దర్యాప్తు సంస్థ చర్యలు తీసుకోవడంతో నష్టపోయిన బ్యాంకులు కొంత ఉపశమనం పొందాయన్నారామె. విజయ్ మాల్యాకు చెందిన రూ.14 వేల కోట్ల ఆస్తులను జప్తు చేసి బ్యాంకుల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆస్తులను విక్రయించి వెయ్యి కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ఆస్తుల నుంచి మరో రూ.2,566 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసి వేలం వేయబోతున్నట్లు ప్రకటించారామె. -
దావూద్ బెదిరింపుల వల్లే భారత్ వీడా
లండన్: 2010 నుంచి విదేశాల్లో గడుపుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోదీ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భారత్‌లో తనపై ఎలాంటి కేసులు లేవన్న లలిత్ మోదీ..చంపుతామంటూ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి వచ్చి,న బెదిరింపుల వల్లే విదేశాల్లో ఉంటున్నట్లు చెప్పుకున్నారు. ‘ఫిగరింగ్ ఔట్’అనే పాడ్ కాస్ట్లో రాజ్ షమానీకిచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల ఈ విషయాలను ఆయన వెల్లడించారు. ‘వాస్తవానికి, దేశం విడిచి పెట్టేటంతటి సీరియస్ కేసులేవీ నాపైన అప్పట్లో లేవు. దావూద్ ఇబ్రహీం నుంచి చంపేస్తామంటూ నాకు బెదిరింపులు వచ్చాయి. మ్యాచ్ ఫిక్సింగ్‌ను అస్సలు సహించను. అయితే, క్రికెట్ మ్యాచ్‌లు ఫిక్స్ చేయాలనుకున్న దావూద్ ఇబ్రహీం నాపై ఒత్తిడి పెంచాడు. అయితే, అవినీతికి వ్యతిరేకంగా ఆట సమగ్రతను కాపాడటంపైనే నా దృష్టంతా ఉంది. దీనికి తోడు వ్యతిరేక ప్రచారం నాపై ఎక్కువగా జరిగింది’అని లలిత్ పేర్కొన్నారు. ‘ఈ పరిస్థితుల్లో హిట్ లిస్ట్‌లో ఉన్నందున నాకు 12 గంటలపాటు మాత్రమే భద్రత కల్పించగలమని సీనియర్ పోలీసు అధికారులు చెప్పారు. నా వ్యక్తిగత సిబ్బంది సూచనమేరకు ముందు జాగ్రత్తగా ఎయిర్‌పోర్టు నుంచి వీఐపీ గేట్ ద్వారానే బయటకు వెళ్లా’అని వివరించారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు భారత్ వెళ్లగలనంటూ ఆయన..‘చట్ట పరంగా నేను పరారీలో ఉన్న నేరగాణ్ని కాను. అక్కడ ఏ కోర్టులోనూ నాపైన ఎలాంటి కేసులూ లేవు. అందుకే భారత్‌కు రేపు ఉదయం వెళ్లాలన్నా వెళ్లగలను. అందులో నాకెలాంటి సమస్యాలేదు’అని తెలిపారు. దావూద్ ఇబ్రహీం హిట్ లిస్ట్‌లో ఉన్న వాళ్లలో లలిత్ మోదీ ఒకరు. లలిత్‌ను చంపేందుకు తమ షార్ప్ షూటర్ల బృందం థాయ్‌ల్యాండ్ రాజధాని బ్యాంకాక్‌లో సిద్ధంగా ఉందంటూ కొన్నేళ్ల క్రితం దావూద్ సన్నిహితుడు చోటా షకీల్ వ్యాఖ్యా నించడం తెలిసిందే. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. విజయ్ మాల్యా కొడుకు పెళ్ళిలో లలిత్ మోదీ
మాజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చీఫ్, పరారీలో ఉన్న లలిత్ మోదీ.. ఇటీవల విజయ్ మాల్యాకు కొడుకు 'సిద్ధార్థ మాల్యా' వివాహంలో కనిపించారు. లండన్‌లోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని విజయ్ మాల్యాకు చెందిన ఎస్టేట్‌లో మోదీ ప్రత్యక్షమయ్యారు. ఈయన పెళ్ళిలో కాకుండా.. సన్నిహితులు & కుటుంబ సభ్యులు కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కనిపించారు.సిద్ధార్థ మాల్యా పెళ్ళికి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి వివాహం కొంతమంది సన్నితుల సమక్షంలో జరిగింది. ఏడాదికి పైగా డేటింగ్లో ఉన్న సిద్ధార్థ మాల్యా, జాస్మిన్ల నిశ్చితార్థం గతేడాది నవంబర్‌లో జరిగింది. అప్పట్లో జాస్మిన్ సోషల్ మీడియాలో కొన్ని చిత్రాలను పంచుకోవడం ద్వారా వారి నిశ్చితార్థ వార్తలను ప్రకటించింది. కాగా ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెట్టారు.సిద్ధార్థ్ మాల్యా & జాస్మిన్లు భార్యాభర్తలుగా ఉన్న మొదటి ఫోటో బయటకు వచ్చింది. ఇందులో సిద్ధార్థ్ ఆకుపచ్చ రంగు టక్సేడోలో ఉండగా, జాస్మిన్ తెల్లటి వెడ్డింగ్ గౌనులో వీల్‌తో మరియు ఆమె చేతిలో బొకేతో కనిపించారు. ఈ ఫోటోకు 'మిస్టర్ అండ్ మిసెస్ ముప్పెట్' అని క్యాప్షన్ కూడా ఇచ్చారు.Siddharth Mallya gets married in London.Indian middle class : “Yeh taufa humne tumko diya hai”pic.twitter.com/VYapa1ZoMe— Doctor (@DipshikhaGhosh) June 23, 2024 -
IPL: వేల కోట్లకు వారసురాలు.. ఇంతకీ ఎవరీ బ్యూటీ? (ఫొటోలు)
-
ఐపీఎల్ సృష్టికర్త కుమార్తె.. వేల కోట్లకు వారసురాలు! ఆమె ప్రత్యేకత ఇదే!
ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన టీ20 లీగ్‌గా పేరొందింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఈ క్యాష్ రిచ్ లీగ్ సృష్టికర్త లలిత్ కుమార్ మోదీ. సినీ సెలబ్రిటీలు, కార్పొరేట్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించి.. ప్రపంచ క్రికెటర్లందినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చిన ఘనత సొంతం చేసుకున్నాడు ఈ బిజినెస్‌మేన్.అప్పటి వరకు ఎన్ని వ్యాపారాలు ఉన్నా ఐపీఎల్‌తోనే పాపులర్ అయిన లలిత్ మోదీ.. క్రికెట్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగాడు. అయితే, ఆర్థిక లావాదేవీల విషయంలో అవకతవలకు పాల్పడి అదే స్థాయిలో అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. దేశం నుంచి పారిపోయి ఆర్థిక నేరగాడిగా ముద్రవేసుకున్నాడు.ఆ మధ్య సుస్మితా సేన్‌తో ప్రేమాయణంతో మళ్లీ వార్తల్లోకి వచ్చిన లలిత్ మోదీ.. ఇటీవల టీ20 ప్రపంచకప్-2024లో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ రేట్ల విషయమై ఐసీసీని విమర్శిస్తూ తెరమీదకు వచ్చాడు.ఈ నేపథ్యంలో లలిత్ మోదీ వ్యక్తిగత జీవితం, నెట్‌వర్త్, ఆయన వారసుల గురించి తాజాగా నెటిజన్లలో చర్చ మొదలైంది. తనకంటే వయసులో తొమ్మిదేళ్లు పెద్దదైన మినాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న లలిత్ మోదీకి కుమార్తె అలియా, కుమారుడు రుచిర్ ఉన్నారు.DNA ఇండియా నివేదిక ప్రకారం.. జూలై 2022 నాటికి లలిత్ మోదీ నికర ఆస్తుల విలువ 4,555 కోట్ల రూపాయలు. ఇక ఆయనకు సంబంధించిన మోది ఎంటర్ప్రైజెస్ విలువ రూ. 23,450 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.అలియా మోదీ.. ఆసక్తికర నేపథ్యంలలిత్ మోదీ ఆస్తులకు వారసురాలైన అలియాకు తన తమ్ముడు రుచిర్తో మంచి అనుబంధం ఉంది. తోబుట్టువులిద్దరు ఒకరికి ఒకరు అండగా ఉంటూ.. వ్యాపారంలో రాణిస్తున్నారు.అలియా మోదీ ఇంటీరియర్ డిజైనర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సొంతంగా రూ. 41 కోట్ల మేర ఆస్తి కలిగి ఉన్నట్లు సమాచారం. ఇక అలియా వ్యక్తిగత జీవితానికొస్తే.. 2022 మేలో ఆమె బ్రెట్ కార్ల్‌సన్‌ను పెళ్లి చేసుకున్నారు.ఇటలీలోని వెనిస్ నగరంలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో కూతురు- అల్లుడి ఫొటోలను షేర్ చేస్తూ లలిత్ మోదీ మురిసిపోయాడు. ఇక సెలబ్రిటీల జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న నెటిజన్లు ఈ ఫొటోలను తవ్వితీసి.. అలియా మోదీని హైలైట్ చేస్తున్నారు. అదీ.. ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ కుటుంబం సంగతి! -
IND vs PAK: ఒక్క టికెట్ రూ. 16 లక్షలా?.. ఐసీసీపై లలిత్ మోదీ ఫైర్
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభానికి సమయం సమీపిస్తోంది. జూన్ 1 ఈ ఐసీసీ ఈవెంట్‌కు తెరలేవనుంది. ఇక ఈ మెగా టోర్నమెంట్‌కు అమెరికా తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.వెస్టిండీస్‌తో కలిసి వరల్డ్‌కప్ నిర్వహణ హక్కులు దక్కించుకున్న యూఎస్ఏ.. ఇప్పటికే మ్యాచ్‌లు జరిగే స్టేడియాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనిలో మునిగిపోయింది.చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆరోజేఇదిలా ఉంటే.. టీమిండియా ఈ ఈవెంట్లో తమ లీగ్ మ్యాచ్‌లన్నీ యూఎస్ఏలోనే ఆడనుంది. జూన్ 5 న ఐర్లాండ్‌తో మ్యాచ్ ద్వారా తాజా ఎడిషన్‌లో తమ ప్రయాణం మొదలుపెట్టనున్న రోహిత్ సేన.. జూన్ 9న తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది.ఇక దాయాదుల పోరు అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఎప్పుడో రద్దు కాగా.. కేవలం ఆసియా కప్, ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లలో మాత్రమే టీమిండియా- పాక్‌లు ముఖాముఖి తలపడుతున్నాయి.ఈ నేపథ్యంలో ఈ హైవోల్టేజీ మ్యాచ్‌లకు మరింత ఆదరణ పెరిగింది. ఈ క్రమంలో ఐసీసీ ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో మరీ దారుణంగా ప్రవర్తిస్తోందంటూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సృష్టికర్త, మాజీ కమిషనర్ లలిత్ మోదీ మండిపడ్డాడు.లాభాలు దండుకోడానికి కాదుఇండియా- పాక్ మ్యాచ్‌కు వేదికైన న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ స్టేడియంలో టికెట్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు.. ‘‘వరల్డ్‌కప్‌లో ఇండియా- పాక్ మ్యాచ్ నేపథ్యంలో డైమండ్ క్లబ్ సీటు టిక్కెట్లను ఏకంగా 20000 డాలర్లకు అమ్ముతున్నారని తెలిసి షాకయ్యాను.అమెరికాలో వరల్డ్‌కప్ నిర్వహిస్తోంది క్రికెట్‌కు ఇక్కడ ఆదరణ పెంచడానికి, ఫ్యాన్ ఎంగేజ్మెంట్ కోసం మాత్రమే అనుకున్నాం. కానీ మీరు లాభాలు దండుకోడానికి కాదు’’ అంటూ ఐసీసీ తీరును లలిత్ మోదీ ఎక్స్ వేదికగా విమర్శించాడు. దాదాపు రూ. 16 లక్షలకు పైనే!కాగా 20 వేల అమెరికన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో ఈ మొత్తం దాదాపు రూ. 16 లక్షలకు పైనే! ఇక లలిత్ మోదీ ట్వీట్ చూసిన ఫ్యాన్స్ టికెట్ ధర తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే, ఈ ధరలకు సంబంధించి ఇంత వరకు అధికారిక సమాచారం మాత్రం లేదు.కాగా క్యాష్ రిచ్ లీగ్‌ను సృష్టించిన లలిత్ మోదీ ఆర్థిక అవకతవకలకు పాల్పడి దేశం నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు లండన్‌లో తలదాచుకుంటున్నట్లు సమాచారం.Shocked to learn that @ICC is selling tickets for Diamond Club at $20000 per seat for the #indvspak WC game. The WC in the US is for game expansion & fan engagement, not a means to make profits on gate collections. $2750 for a ticket It’s just #notcricket #intlcouncilofcrooks pic.twitter.com/lSuDrxHGaO— Lalit Kumar Modi (@LalitKModi) May 22, 2024 -
'పెళ్లైతే చేసుకుంటా.. కానీ మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో'.. హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది తాలి, ఆర్య-3 వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోని ప్రపంచసుందరి చాలాసార్లు డేటింగ్ రూమర్స్ వినిపించాయి. అంతే కాదు.. ఐపీఎల్ మాజీ ఛైర్మన్‌తో లలిత్ మోదీతో కొంత కాలం సుష్మిత డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది దీపావళి సందర్భంగా సుస్మిత తన మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్‌తో కనిపించింది. 2022లోనే వీరిద్దరికీ బ్రేకప్ అయినప్పటికీ.. చాలా సందర్భాల్లో జంటగా కనిపించారు. దీంతో మరోసారి సుస్మిత సేన్‌పై పెళ్లి వార్తలొచ్చాయి. దీంతో మరోసారి వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. మీ లైఫ్‌లో బ్రేకప్ అయినప్పుడు ప్రశ్నించగా.. సుస్మిత తనదైన శైలిలో సమాధానాలిచ్చింది. సుస్మిత మాట్లాడుతూ..'నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. నేను చాలా నిజాయితీగా, నిర్భయంగా జీవిస్తున్నా. గౌరవం అనేది మన జీవితంలో ఒక అంశం మాత్రమే కాదు. అది మీరంటే ఏంటో నిర్ణయిస్తుంది. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు బాధపెట్టాయా? లేదా ద్రోహం చేశాయా? లేదా మీరు మనం ఏదైనా తప్పు చేశామా? అన్నవి నేను పెద్దగా పట్టించుకోను. జీవితంలో ఎదురయ్యే వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడం.. ముందుకు సాగడమేనని' చెప్పుకొచ్చింది. ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే.. మాజీలతో స్నేహితులుగా ఉండగలరా? అని యాంకర్ ప్రశ్నించారు. దీనిపై సుస్మిత మాట్లాడుతూ..'కచ్చితంగా వారితో ఫ్రెండ్లీగానే ఉంటాను. కానీ కాస్తా కష్టంగానే ఉంటుందని భావిస్తున్నా. చాలా మంది తమ మాజీలతో అలానే ఉంటారు. కానీ ఇక్కడ వారితో లిమిట్స్ ఉంటాయా అనే విషయమైతే తెలియదు. కానీ అది సాధ్యమే. ఇలాంటివీ నేను చూశాను కూడా. ఎందుకంటే ప్రస్తుతం నా జీవితంలో సంతోషంగా ఉన్నా. పెళ్లి చేసుకోవడానికి కావాల్సింది సరైన సమయం, కారణం కాదు. నాకు తగినట్లుదా సరైన వ్యక్తి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటా' అని తెలిపింది. సుస్మితా సేన్ రిలేషన్స్ సుస్మిత సేన్ మొదట బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడాతో డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాతమోడల్ రోహ్మన్ షాల్‌తో 2018 నుండి 2021 వరకు మూడేళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించారు. ఆ తర్వాతవ్యాపారవేత్త, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. -
లలిత్ మోడీతో ప్రేమాయణం.. సుస్మితా సేన్ క్లారిటీ!
బాలీవుడ్ హీరోయిన్ సుస్మితా సేన్ ఇటీవలే ఆర్య -3 వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా.. అభిమానుల నుంచి విశేష ఆదరణ దక్కించుకుంటోంది. ఈ వెబ్ సిరీస్‌ను రామ్ మాధ్వని దర్శకత్వంతో తెరకెక్కించారు. అయితే తాజాగా ఇంటర్వ్యూకు హాజరైన సుస్మితా సేన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీతో తన ప్రేమయాణం గురించి నోరు విప్పింది. (ఇది చదవండి: కావాలయ్యా సాంగ్.. తమన్నా స్టెప్పు చెండాలం అంటూ నటుడి విమర్శలు) మీకు లలిత్ మోడీని పెళ్లి చేసుకోవాలనుకున్నారా ప్రశ్నించగా?..'నేను ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనుకంటే చేసుకుంటా. అంతే కానీ ఇలా ప్రయత్నించను. ఇష్టముంటే చేసుకుంటా అంతే. తనపై వచ్చిన మీమ్స్ చూస్తే చాలా ఫన్నీగా అనిపించాయి. మీరు ఎవరినైనా గోల్డ్ డిగ్గర్ అని పిలిచేముందు వాస్తవాలు తెలుసుకోండి. నేను బంగారం కంటే ఎక్కువగా వజ్రాలను ఇష్టపడతాను. మన నిశ్శబ్దంగా ఉంటే మౌనాన్ని బలహీనతగా భావిస్తారు. అందుకే వారికి తెలియజేయడానికి నేను ఒక పోస్ట్ పెట్టవలసి వచ్చింది.' అని అన్నారు. కాగా.. ఇటీవలే దీపావళి సందర్భంగా సుస్మిత తన మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్‌తో కనిపించింది. వీరిద్దరూ 2022లో బ్రేకప్ అయినప్పటికీ.. చాలా సందర్భాల్లో జంటగా కనిపించారు. దీపావళి సందర్భంగా సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
రక్తసంబంధం లేకున్నా ఆ పిల్లల కోసం సుస్మితా సేన్ ఏం చేసిందంటే
బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తాజాగా ‘తాలీ’ వెబ్ సీరిస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఇది జియో టీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సీరిస్ ట్రైలర్ విడుదలైనప్పుడు తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్న ఆమె ఇందులో ట్రాన్స్‌జెండర్‌గా అద్భుతంగా నటించి విమర్శించిన వారికి సమాధానం చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ జర్నీ ఎలా ముగిసింది. అప్పుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది. అనే అంశాలపై సుస్మిత కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సుస్మితా సేన్ తన కుమార్తె యొక్క ఆరోగ్య సమస్యల గురించే కాకుండా తన బిడ్డ పట్ల ఎలాంటి విధులను నిర్వహించింది అనే దాని గురించి మాట్లాడారు. ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ.. ఈ సంఘటనతో సినిమాలకు దూరం సుస్మితా సేన్‌కు 24 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక కుమార్తెను దత్తత తీసుకుంది. ఆ సమయంలో తన తల్లి వద్దని వారించినా మెండిగా నిర్ణయం తీసుకుంది. అప్పుడు ఆమెకు పలు భారీ సినిమా అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పలువురు సన్నిహితులు కూడా వద్దని చెప్పినా సుస్మిత మనుసు మార్చుకోలేదు. కుమార్తెను దత్తత తీసుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇలా చెప్పింది. 'రెనీ నా జీవితంలోకి వచ్చినప్పుడు తన ఆరోగ్యం మెరుగ్గాలేదు. అదే సమయంలో నేను కెనడాలో ఉన్నాను. అక్షయ్ కుమార్, కరీనాతో కలిసి ఒక సినిమా చిత్రీకరణలో ఉన్నాను. పాపను అలా వదిలి రావడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు.. కానీ తప్పలేదు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి) అలా షూటింగ్లో ఉండగా నా తండ్రి నుంచి ఫోన్ వచ్చింది. పాపకు సీరియస్‌గా ఉంది. ఆస్పత్రిలో చేర్పించామని నాన్న చెప్పాడు. అలాంటి సమయంలో నేను షూటింగ్లో పాల్గొనలేకపోయాను. తనను నేను నవమాసాలు మోసి కనకపోయినా అంతే సమానమైన బంధం రెనీతో ఉంది. దీంతో సినిమా షూటింగ్లో ఒక్క క్షణం ఉండలేకపోయాను.. సెట్లో అందరి ముందు విషయం చెప్పి కెనడా నుంచి తిరిగి ముంబయ్‌కు బయల్దేరాను. విదేశాల్లో షూటింగ్లో ఉన్న నేను సినిమాను మధ్యలో ఆపేసి వచ్చేశాను. ఆ క్షణమే నాకు తెలుసు నా సినిమా కెరీర్ ఇక్కడితో ముగిసిందని. అప్పట్లో నాకు కెరీర్‌పై సీరియస్‌నెస్ లేదని, అందుకే 24 ఏళ్లకే తల్లినయ్యానని కామెంట్స్ చేసేవారు ఎందరో. దీంతో నా పనిలో ఇంకా ఎక్కువ కష్టపడేదానిని కానీ, అప్పటికే నాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.’ అని సుస్మిత తెలిపింది. 1994లో విశ్వ సుందరిగా నెగ్గిన సుష్మితా సేన్ బాలీవుడ్‌తో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. తర్వాత ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. (ఇదీ చదవండి: అందరిలా నేనెందుకు ఆనందంగా లేనంటే: టాప్ హీరోయిన్) భారత మెగా టీ20 క్రికెట్ లీగ్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీతో కొంత కాలం సుష్మిత డేటింగ్లో ఉన్నారు. సుష్మితా సేన్ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా 2013లో మదర్ థెరిసా అంతర్జాతీయ అవార్డును ఆమె పొందింది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిద్దరూ కూడా దత్తత తీసుకున్నవారే కావడం విశేషం. -
లలిత్ మోదీతో బ్రేకప్.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన సుష్మితాసేన్!
మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్.. సినిమాలతో పాటు లవ్ ఎఫైర్లతోనూ బాగా ఫేమస్ అయింది. సినిమాల్లో హీరోయిన్గా రాణించిన సమయంలో ఎంతోమందితో ప్రేమాయణం నడిపింది. ఈ క్రమంలో తనకంటే చిన్నవాడైన రోహ్మన్ షాల్తోనూ లవ్వాయణం నడిపింది. కానీ తర్వాత అతడికి బ్రేకప్ చెప్పింది. కొంతకాలానికే ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీతో ప్రేమలో పడింది. వీరిద్దరూ డేటింగ్లో ఉన్న విషయాన్ని తెలియజేస్తూ లలిత్ మోదీ ట్విటర్లోనూ కొన్ని ఫోటోలు రిలీజ్ చేశాడు. ఇది చూసిన జనాలు.. డబ్బు కోసమే సుష్మిత అతడిని ప్రేమిస్తోందంటూ విమర్శలు గుప్పించారు. ఏదైనా అనుకోండి, డోంట్ కేర్ అయితే ఏమైందో ఏమో కానీ కొంతకాలానికే వీరిద్దరు కూడా బ్రేకప్ చెప్పుకున్నారని ప్రచారం జరిగింది. తాజాగా ఈ ట్రోలింగ్‌పై, బ్రేకప్‌పై క్లారిటీ ఇచ్చింది నటి. తాలి వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సమయంలో ఆమె మాట్లాడుతూ.. 'నా గురించి మీరెలా మాట్లాడుకున్నా మంచిదే! డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతానని అంటున్నారు.. ఈ అవమానాలను నేను స్వీకరించినప్పుడే అవమానం.. కానీ అలాంటివి నేనసలు పట్టించుకుంటే కదా! నేనిప్పుడు సింగిల్.. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత విషయాలంటూ కొన్నుంటాయి.. వాటితో మీకు సంబంధం లేదు. ప్రతిదాంట్లో దూరే హక్కు మీకు లేదు. ఇంకో విషయం చెప్పాలి, నేనిప్పుడు సింగిల్‌గా ఉంటున్నాను. దాని గురించి కూడా మీకనవసరం!' అని ఘాటుగా వ్యాఖ్యానించింది. లలిత్ మోదీతో బ్రేకప్ అయిన విషయాన్ని చెప్పకనే చెప్పింది సుష్మిత. కాగా ఈ నటి ఈ ఏడాది ఫిబ్రవరిలో గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరగా ఓ మేజర్ సర్జరీ జరిగింది. అప్పుడు సినిమాలకు విరామం పలికిన ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుని తిరిగి షూటింగ్లో పాల్గొంటోంది. ప్రస్తుతం ఆర్య 3, తాలి అనే వెబ్ సిరీస్‌లు చేస్తోంది. చదవండి: మా నాన్న ఎలా ఉంటాడో తెలియదు: ఏడ్చేసిన ధనరాజ్ -
వైరల్ అవుతున్న లలిత్ మోడీ ఆస్తుల విలువ.. ఎన్ని వేల కోట్లంటే?
ఐపీఎల్! వేల కోట్లలో లావాదేవీలు. పరుగు చేస్తే నోటు, బౌండరీ పడితే కట్ట..గెలిస్తే కోటితో వ్యవహారం అది..! కానీ ఓడినా కోట్లు, నోట్లు వస్తాయండోయ్ అదే ఐపీఎల్లో మజా. ఇటువంటి మజాను అందించేలా కార్పొరేట్ క్రికెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనుడే ఈ లలిత్ మోడీ! కానీ ఐపీఎల్‌ను తన సొంత అవసరాలకు వాడుకొని అప్రతిష్టను మూటగట్టుకున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. చివరికి పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌లో కేసులో దేశం విడిచి పారిపోయిన లలిత్ మోడీ 2010 నుంచి లండన్‌లో ఉంటున్నారు. ఎప్పుడూ వివాదాలు, కొత్త సంచలనాలను వెంట పెట్టుకొని తిరిగే లలిత్ మోడీకి ఆయన తల్లి బీనా మోడీ, ఇతర కుటుంబసభ్యులకు మధ్య ఆస్తి వివాదం కొనసాగుతోంది. ఈ వివాదంలో బీనా మోడీ తరుపు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీపై నోరు జారారు. సుప్రీం కోర్ట్ చివాట్లు పెట్టడంతో వెనక్కి తగ్గారు. ఈ తరుణంలో లలిత్ మోడీ ఎక్కడ ఉంటున్నారు? బిజినెస్‌లు ఏమైనా చేస్తున్నారా? చేస్తుంటే ఆయనకి ఎంత ఆస్తి ఉంది? అని నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు. (ఓర్నీ వయ్యారం..ఇదేమి ట్రైన్ భయ్యా! ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న వీడియో) ఐపీఎల్ కుంభకోణం వెలుగులోకి రావడంతో లలిత్ మోడీని బీసీసీఐ నిషేధించింది. కేసులు, విచారణనుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయినా అక్కడ కూడా దర్జాగా బతికేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మీడియా ఎప్పుడు ఆయనను పలికరించినా నేను గోల్డెన్ స్పూన్‌తో పుట్టానని చెప్పుకునే లలిత్.. క్రికెట్‌ను వదిలేసినా ఇతర వ్యాపార వ్యవహారాల్ని చక్క బెట్టుకుంటున్నారు. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన) లలిత్ మోడీ తన కెరీర్లో భారీ ఆస్తులే కూడబెట్టారు. పరారీలో ఉన్నప్పటికీ తన తండ్రికి చెందిన మోడీ ఎంటర్‌ప్రైజెస్‌కు అధిపతిగా కొనసాగుతున్నారు. సిగరెట్ తయారీ, విద్య, వ్యవసాయం,ఎంటర్టైన్మెంట్ ఇలా అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న మోడీ ఎంటర్‌ప్రైజెస్‌కు అధ్యక్షుడు కూడా. పలు నివేదికల ప్రకారం, 2021లో మోడీ కంపెనీ టర్నోవర్ రూ.1750 కోట్లు. నెలవారీ ఆదాయం దాదాపు రూ.16.5 కోట్లు కాగా, ఆయన వ్యక్తిగత ఆస్తులలో లండన్‌లో 5 అంతస్తుల విలాసవంతమైన ఇల్లు, రూ.12,000 కోట్ల భారీ వ్యాపారం, అనేక లగ్జరీ కార్లు ఉన్నాయని సమాచారం. 2023 నాటికి, భారత్‌లో అతని నికర ఆస్తుల విలువ రూ. 4555 కోట్లకు పైగా ఉందని సమాచారం. చదవండి👉 ‘మమ్మల్ని ఆదుకోండి సార్’.. రతన్ టాటాకు చేరిన పైలెట్ల పంచాయితీ! -
రాహుల్ గాంధీని కోర్టుకు ఈడుస్తా.. కాంగ్రెస్ నేతపై లలిత్ మోదీ ఫైర్..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ. ఆయనపై లండన్ కోర్టులో కేసు పెడతానని చెప్పారు. మోదీ ఇంటిపేరుపై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో సూరత్ కోర్టు ఆయనను దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. దేశంలోని దొంగల ఇంటిపేరు మోదీనే అని ఎందుకు ఉందని రాహుల్ 2019 ఎన్నికల సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే తాను ఇప్పటివరకు ఏ కేసులోనూ దోషిగా తేలలేదని, అలాంటప్పుడు దేశం వీడిపోయిన ఆర్థిక నేరగాడు అని ఎలా అంటారని లలిత్ మోదీ ప్రశ్నించారు. రాహుల్ అనుచరులు, కాంగ్రెస్ నేతలు ఏ ఆధారాలతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. రాహుల్‌పై యూకే కోర్టులో కేసు పెడతానని, ఆయన న్యాయస్థానం ముందు హాజరుకావాల్సిందేనని పేర్కొన్నారు. ఈమేరకు లలిత్ మోదీ ట్విట్టర్లో వరుస ట్వీట్లు చేసి రాహుల్, కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. 'పప్పు అనబడే రాహుల్ గాంధీ నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఓ కేసులో దోషిగా తేలారు. నేను మాత్రం గత 15 ఏళ్లలలో ఏ కేసులోనూ దోషిగా తేలలేదు అలాంటప్పుడు నన్ను నేరగాడు అని ఎలా అంటారు. నేనొక సాధారణ వ్యక్తిని. 100 బిలియన్ డాలర్లు విలువ చేసే అతిపెద్ద క్రీడా కార్యక్రమానికి ఆధ్యుడిని.' అని లలిత్ మోదీ ట్వీట్ చేశారు. i see just about every Tom dick and gandhi associates again and again saying i ama fugitive of justice. why ?How?and when was i to date ever convicted of same. unlike #Papu aka @RahulGandhi now an ordinary citizen saying it and it seems one and all oposition leaders have nothing… — Lalit Kumar Modi (@LalitKModi) March 30, 2023 చదవండి: సీబీఐ అప్పుడు నాపై ఎంతో ఒత్తిడి చేసింది: అమిత్ షా -
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీకి తీవ్ర అనారోగ్యం.. ఆస్పత్రిలో చికిత్స
ఐపీఎల్ మాజీ చైర్మెన్ లలిత్ మోదీ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆతడికి కరోనాతో పాటు న్యూమోనియా కూడా సోకింది. ఈ క్రమంలో లండన్‌లోని ఓ ఆసుపత్రిలో చేరి ఆక్సిజన్ సపోర్ట్‌పై మోదీ చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. రెండు వారాల్లో రెండు సార్లు కరోనా బారిన పడినట్లు లలిత్ మోదీ తెలిపాడు. అంతేకాకుండా న్యూమోనియా కూడా సోకినట్లు అతడు వెల్లడించాడు. మూడు వారాల పాటు క్వారంటైన్లో ఉన్నట్లు అతడు చెప్పాడు. అదే విధంగా ఆరోగ్యం విషమించడంతో మెక్సికో నుంచి ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో ఎయిర్ అంబులెన్స్ ద్వారా లండన్‌కు వచ్చి ఆసుపత్రిలో చేరినట్టు అతడు పేర్కొన్నాడు. తనకు ఆసుపత్రికి తరలించడానికి సహాయపడిన వాళ్లందరికీ మోదీ ధన్యవాదాలు తెలియజేశాడు. లలిత్ మోదీ పోస్ట్‌పై స్పందించిన పలువురు ప్రముఖులు అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చదవండి: చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల బాలుడు.. ఏకంగా 508 పరుగులు బాదిన యష్ -
ఇద్దరు మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో సుష్మితా సేన్ పార్టీ!
మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్, ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ విడిపోయారంటూ బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు సుష్మితా మొన్నటినుంచి తన మాజీ బాయ్‌ఫ్రెండ్ రోహ్మన్షాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. తాజాగా ఆమె కూతురు రినీ సేన్ బర్త్‌డే గ్రాండ్‌గా జరిగింది. ఈ పార్టీకి రోహ్మన్తో పాటు తన మరో మాజీ ప్రియుడు రితిక్ భాసిన్ కూడా వచ్చాడు. ఈ మేరకు పలు ఫొటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా వదిలింది. 'సెప్టెంబర్ 4న నా ఫస్ట్ లవ్ రినీ సేన్ 23వ పుట్టినరోజు జరుపుకుంది. నా కుటుంబసభ్యులు, రినీ ఫ్రెండ్స్‌తో రాత్రి పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేశాం. రినీ బర్త్‌డేను ఇంత అద్భుతంగా సెలబ్రేట్ చేసిన రితిక్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఐ లవ్యూ గయ్స్' అని రాసుకొచ్చింది. సుష్మిత కూతురు పుట్టినరోజున లలిత్ రాలేదు, కానీ ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్స్ రావడం ఏంటో? వారితో పార్టీ చేసుకోవడమేంటో అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) చదవండి: బిగ్‌బాస్ 6: నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే! ఐశ్వర్యపై నెటిజన్ల ప్రశంసలు -
మాజీ బాయ్‌ప్రెండ్‌తో సుష్మితా సేన్ షాపింగ్, వీడియో వైరల్
మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుష్మితా సేన్ వృత్తిపరమైన విషయాలకంటే కూడా వ్యక్తిగత విషయాలతోనే తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీతో లవ్‌లో పడ్డనాటి నుంచి సుష్మిత ప్రతి కదలిక మీద కన్నేసారు నెటిజన్లు. ఈ క్రమంలో పలుమార్లు తన మాజీ బాయ్‌ఫ్రెండ్ రోహ్మన్ షాతో షాపింగ్‌లు, సినిమాలకు వెళ్లడం చూసి ముక్కున వేలేసుకున్నారు. కొందరు మాత్రం బ్రేకప్ తర్వాత ఫ్రెండ్స్‌గా ఉండకూడదా? ఏంటని సుష్మితను సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ నటి తన కూతురు రినీ సేన్, మాజీ ప్రియుడు రోహ్మన్తో కలిసి షాపింగ్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా కెమెరా కంట పడ్డ ఈ బ్యూటీ రినీ, రోహ్మన్తో కలిసి ఫొటోలను పోజులిచ్చింది. కూతురు అలిషా బర్త్‌డే కోసం షాపింగ్ చేస్తున్నామని వెల్లడించింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు పలువిధాలుగా స్పందిస్తున్నారు. 'నువ్విలా నీ మాజీతో తిరుగుతుంటే అది చూసిన లలిత్ మోదీ ఏమైపోవాలి?', 'అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు'', 'అబ్బా.. వాళ్లిద్దరూ ఒకప్పుడు లవర్స్, ఇప్పుడు మంచి ఫ్రెండ్స్' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా సుష్మిత రినీ, అలిషా అనే ఇద్దరు కూతుళ్లను దత్తత తీసుకుని పెంచుకుంటోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె ఇటీవలే ఆర్య 2 వెబ్‌సిరీస్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే! View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: టాలీవుడ్లో విషాదం, సీనియర్ హీరో కన్నుమూత విజయ్‌కు తలపొగరు అన్నాడు, సారీ చెప్పాడు -
సుష్మితా సేన్ లైవ్ వీడియోలో మాజీ బాయ్‌ఫ్రెండ్.. లలిత్ ఎక్కడ?
Sushmita Sen Parties With Her Ex Boyfriend Rohman Shawl: గత కొద్ది రోజులుగా మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ వార్తల్లో ప్రధానంగా నిలుస్తూ వస్తోంది. సుష్మితా సేన్ తనతో డేటింగ్లో ఉందని వ్యాపారవేత్త, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ జులై 14న సాయంత్రం సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. లలిత్‌తో సుష్మితా డేటింగ్ చేయడాన్ని పలువురు విమర్శిస్తే, కొంతమంది ఆమెకు మద్దుతుగా నిలిచారు. ఇదిలా ఉంటే వారు డేటింగ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసినప్పటి నుంచి వీరిద్దరూ ఏం చేసిన హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా లలిత్ మోది ఎక్కడా అంటూ సుష్మితా సేన్‌పై ప్రశ్నల వర్షం కురింపించారు నెటిజన్లు. సుష్మితా సేన్ తల్లి సుభ్రా సేన్ ఆగస్టు 8న పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియోను పోస్ట్ చేసింది సుష్మితా సేన్. ఈ వీడియోలో సుష్మితా సేన్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ రోహ్మాన్ షా దర్శనమిచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు 'లలిత్ ఎక్కడ?', 'ఎక్కడ మోది?' అంటూ ప్రశ్నించారు. ఈ వీడియోలో సుష్మితా కూతుళ్లతో మాట్లాడుతూ కనిపించాడు రోహ్మాన్ షా. అలాగే సుష్మితా సేన్ లైవ్‌లో కనిపించమని అందరిని కోరినప్పుడు రోహ్మాన్ మాత్రం దూరంగా ఉండటాన్ని గమనించవచ్చు. కాగా తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్ రోహ్మన్ షాతో సుష్మితా సేన్ మూడేళ్లు డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Nikhil Rao (@bg0260) View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi) -
సుష్మితను బతకనివ్వండి.. ట్రోలర్స్‌కు డైరెక్టర్ కౌంటర్
పక్కింటి పుల్లకూర రుచి అన్న సామెత తెలిసిందే కదా! పక్కింట్లోని వంటలే కాదు, వారి జీవితాల్లో తొంగి చూడటం కూడా సర్వసాధారణమైపోయింది ఈ రోజుల్లో! మరీ ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల్లో కూడా సాధారణ జనాల జోక్యం ఎక్కువైపోయిందీ రోజుల్లో.. వారు ఏం చేసినా తప్పుపట్టడమే తరువాయి అన్న చందంగా తయారైంది సోషల్ మీడియా. గత కొద్ది రోజులుగా నటి సుష్మితా సేన్, లలిత్ మోదీల ప్రేమ గురించైతే ఎన్ని పోస్టులు, మీమ్స్ వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె నిర్ణయాన్ని విమర్శిస్తూ ఇద్దరినీ తిట్టిపోసినవారే ఎక్కువమంది. అయితే ఈ వైఖరి అంత మంచిది కాదని విమర్శించాడు దర్శకుడు మహేశ్ భట్. అదే సమయంలో సుష్మిత ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. 'ఆమె తనకు నచ్చినట్లుగా బతుకుతోంది. ఎలాంటి కట్టుబాట్లు విధించుకోకుండా స్వేచ్ఛగా జీవిస్తోంది. అంతటి గట్స్ ఆమెకున్నాయి. తనను ఇప్పటికీ అసాధారణమైన వ్యక్తిగానే గుర్తుంచుకున్నాను. తనకు నచ్చినట్లుగా బతుకుతున్న ఆమె గుండె ధైర్యానికి నేను సెల్యూట్ చేయాల్సిందే! ఇంకా ఆమెను వేధించకుండా ఆమె బతుకేదో ఆమెను బతకనివ్వండి' అని ట్రోలర్స్‌కు గట్టి కౌంటరిచ్చాడు. గతంలో విక్రమ్ భట్‌తో నడిపిన ప్రేమాయణం గురించి చెప్తూ.. 'దస్తక్ సినిమా చేద్దామనుకున్నాను. అందుకామె ఓకే చెప్పింది. తర్వాతేం జరిగిందో మీకందరికీ తెలుసు. దస్తక్ షూటింగ్ సమయంలో సుష్మితా సేన్, విక్రమ్ భట్ ప్రేమించుకున్నారు. విక్రమ్ నాకు కుడిభుజంలా ఉండేవాడు. అతడిని ఆధారంగా చేసుకునే నేను నా పని పూర్తి చేసేవాడిని. సెట్స్‌లో ఆమెతో సరదాగా కలిసిపోయేవాడు. అలా వాళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైంది' అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు మహేశ్ భట్. చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో సిద్దార్థ్ షికార్లు.. ఫొటోలు తీసినవారికి హీరో వార్నింగ్! క్యాస్టింగ్ కౌచ్ వల్ల పెద్ద పెద్ద ప్రాజెక్టులు వదులుకున్నా.. -
ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్స్‌గా ఉండకూడదా? పుట్టుకతోనే సంపన్నుడిని.. నన్నే అంటారా?
ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ.. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌తో తాను ప్రేమలో ఉన్నట్లు ప్రకటించి క్రీడా, సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాడు. సుస్మితను తన భాగస్వామి అని పేర్కొంటూ ఆయన షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు లలిత్ మోదీపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన లలిత్.. ఇప్పుడేమో కాలేజీ కుర్రాడిలా గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్నానంటూ ఫొటోలు షేర్ చేస్తున్నాడంటూ విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో సుస్మితతో తన రిలేషన్‌షిప్‌పై స్పందించిన లలిత్ మోదీ ఆదివారం ట్విటర్ వేదికగా విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. అదే విధంగా తన భార్య మినాల్ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారంటూ మండిపడ్డాడు. మధ్య యుగ కాలంలో ఉన్నామా? ఈ సందర్భంగా సుస్మితా సేన్, తన దివంగత భార్య మినాల్ మోదీ, కూతురు అలియా మోదీలతో పాటు నెల్సన్ మండేలా, దలైలామా, భారత ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా తదితర ప్రముఖులతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ కౌంటర్ ఇచ్చాడు. ఈ మేరకు.. ‘‘మనమింకా మధ్య యుగం కాలంలోనే నివసిస్తున్నామా? ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా ఉండకూడదా? ఒకవేళ వారి మధ్య కెమిస్ట్రీ కుదిరి కాలం కలిసి వస్తే.. అద్భుతం జరుగుతుంది కదా!.. నాదొక సలహా మీరు సంతోషంగా జీవించండి.. ఇతరులను కూడా వాళ్ల బతుకు వారిని బతకనివ్వండి. ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకుని వార్తలు రాయండి.. డొనాల్డ్ ట్రంప్ లాగా నకిలీ వార్తలు వ్యాప్తి చేయకండి’’ అంటూ మీడియాపై కూడా విరుచుకుపడ్డాడు. ఇక తన భార్య మినాల్ మోదీ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ప్రియమైన నా భార్య, దివంగత మినాల్ మోదీ.. మా పెళ్లి కంటే 12 ఏళ్ల ముందు నుంచి నాకు బెస్ట్ ఫ్రెండ్.. అందరూ అనుకుంటున్నట్లుగా తను మా అమ్మ స్నేహితురాలు కాదు. కొంతమంది వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి చెత్త వార్తలు రాస్తున్నారు. మెదడు తక్కువ పనులు చేయొద్దు. ఎవరైనా ఓ వ్యక్తి తన దేశం కోసం.. లేదంటే వ్యక్తిగత జీవితంలో ఏదైనా సాధిస్తే ఎంజాయ్ చేయండి. మీ అందరి కంటే నేను బెటర్.. మీకంటే గొప్పగా తలెత్తుకుని తిరిగే అర్హత నాకుంది’’ అంటూ లలిత్ మోదీ సుదీర్ఘ నోట్ షేర్ చేశాడు. అదే విధంగా తనను ఆర్థిక నేరగాడు అని పిలిస్తే పట్టించుకోనన్న లలిత్ మోదీ.. తాను డైమండ్స్పూన్తో పుట్టానని.. పుట్టుకతోనే సంపన్నుడినని పేర్కొన్నాడు. తన వల్లే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పుట్టుకొచ్చిందని.. దేశానికి తాను ఓ గొప్ప బహుమతి ఇచ్చానని చెప్పుకొచ్చాడు. కాగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్నాడు. ఇక సుస్మిత సేన్‌తో మాల్దీవుల్లో లలిత్ ఫొటోలు షేర్ చేస్తూ బెటర్ పార్ట్నర్ అనడంతో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. తాము ప్రేమలో ఉన్నామే తప్ప పెళ్లి చేసుకోలేదని వెల్లడించారు. కాగా సుస్మిత సైతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికపుడు తన అప్డేట్లు పంచుకుంటుందన్న సంగతి తెలిసిందే. చదవండి: Lalit Modi- Sushmita Sen: తనకంటే తొమ్మిదేళ్లు పెద్దది.. మినాల్‌ను పెళ్లాడేందుకు లలిత్ ఫైట్! చివరికి ఇలా! Too long to write so I put it on a picture slide. For those who don’t have instagram 🙏🏾 pic.twitter.com/v2sXCvyacn — Lalit Kumar Modi (@LalitKModi) July 17, 2022 View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
తనకంటే తొమ్మిదేళ్లు పెద్దదైన మినాల్‌ను పెళ్లాడేందుకు లలిత్ ఫైట్.. ఇప్పుడు ఇలా!
Lalit Modi Love Story With Minal: లలిత్ కుమార్ మోదీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సృష్టికర్తగా పేరు ప్రఖ్యాతులు పొందాడు. సినీ సెలబ్రిటీలు, కార్పొరేట్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించి.. ప్రపంచ క్రికెటర్లందినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి క్యాష్ రిచ్ లీగ్‌ను సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టీ20 లీగ్‌లు ఉన్నా ఐపీఎల్ విజయవంతం కావడంలో లలిత్ మోదీదే కీలకపాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన లలిత్ మోదీ.. ఒకప్పుడు ప్రపంచంలోని వంద శక్తిమంతుల జాబితాలో కూడా స్థానం సంపాదించడం విశేషం. అయితే, ఎంత వేగంగా కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నాడో అదే తరహాలో పాతాళానికి దిగజారిపోయాడు. ఆర్థిక అవకతవకలకు పాల్పడి దేశం నుంచి పారిపోయాడు. ప్రస్తుతం ఆయన లండన్‌లో తలదాచుకుంటున్నాడు. మాజీ విశ్వసుందరితో ప్రేమాయణం! ఇక ఇన్నాళ్లూ పెద్దగా లైమ్‌లైట్‌లో లేని 58 ఏళ్ల లలిత్ మోదీ.. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌తో డేటింగ్ అంటూ ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారాడు. ఆమెతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేస్తూ బెటర్ పార్ట్నర్ అంటూ చర్చకు తెరలేపాడు. PC: lalit modi Instagram ఈ క్రమంలో వీళ్లిద్దరి పెళ్లి అయి పోయిందని నెటిజన్లు ఫిక్సైపోగా అలాంటిదేమీ లేదని సుస్మిత, లలిత్ ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రేమలో మునిగితేలుతున్నామని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. కాగా 46 ఏళ్ల సుస్మితాసేన్ ఇప్పటికే ఎంతో మందితో డేటింగ్ చేసింది. సుస్మిత రూటు సెపరేటు! స్థాయి.. వయసుతో సంబంధం లేకుండా తన కంటే చిన్నవాళ్లూ, పెద్దవాళ్లతోనూ ప్రణయ బంధం కొనసాగించింది సుస్మిత. కానీ ఎవ్వరికీ తనను వివాహం చేసుకునే అవకాశం ఇవ్వలేదు. స్వేచ్ఛాయుత జీవనం గడపడానికే ఆమె ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుతం లలిత్‌తో ప్రేమ వ్యవహారం కూడా అలాంటిదేనా.. లేదంటే పెళ్లిదాకా వెళ్తారా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది. PC: lalit modi Instagram కాగా సుస్మిత ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుని తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఇక లలిత్‌తో సుస్మిత పరిచయం ఈనాటిది కాదు. లలిత్ మోదీ దివంగత భార్య మినాల్ మోదీకి కూడా ఆమె ఫ్రెండ్ కావడం విశేషం. వీళ్లు ముగ్గురూ కలిసి ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేవారట. ఇంతకీ మినాల్ ఎవరు? మినాల్ సంగ్రాణి నైజీరియాకు చెందిన సింధీ హిందూ వ్యాపారవేత్త పెసూ అస్వాని కుమార్తె. లలిత్ మోదీతో స్నేహానికి కంటే ముందే ఆమెకు వివాహమైంది. వ్యాపారవేత్త జాక్ సాంగ్రాణిని ఆమె పెళ్లాడింది. వారికి కూతురు సంతానం. అయితే, జాక్ ఓ స్కామ్‌లో ఇరుక్కోవడంతో జైలుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్నాళ్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకుంది. PC: lalit modi Instagram లలిత్ కంటే తొమ్మిదేళ్లు పెద్ద! భర్తకు విడాకులిచ్చిన మినాల్తో ప్రేమలో పడ్డ లలిత్ మోదీ ఆమెను పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. అయితే, మోదీ కుటుంబం ఇందుకు అంగీకరించలేదు. ఆమె డివోర్సీ కావడం ఒక అభ్యంతరమైతే.. లలిత్ కంటే మినాల్ వయసులో దాదాపు తొమ్మిదేళ్లు పెద్దది కావడం మరో కారణం. కుటుంబాన్ని ఎదిరించి! అయినా, అతడు ఆమె చేయిని వీడలేదు. కుటుంబంతో విభేదించాడు. 1991లో మినాల్‌ను పెళ్లిచేసుకున్నాడు. దీంతో తన ఫ్యామిలీకి దూరమయ్యాడు. తమను అందరూ దూరం పెట్టడంతో ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే లలిత్- మినాల్లకు ఇద్దరు సంతానం. PC: lalit modi Instagram కొడుకు రుచిర్, కూతురు అలియా ఉంది. వీరితో పాటు మినాల్ మొదటి కూతురు కరిమా సంగ్రాణిని కూడా చేరదీశాడని జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. కాగా క్యాన్సర్ బారిన పడ్డ మినాల్ ఆఖరి వరకు వ్యాధితో పోరాడి 64 ఏళ్ల వయస్సులో 2018లో కన్నుమూశారు. అప్పటి నుంచి ఒంటరి జీవితం గడుపుతున్న లలిత్ మోదీ సుస్మితతో ప్రేమాయణంతో అటు క్రీడా, ఇటు సినీ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. చదవండి: Ire Vs NZ 3rd ODI: మొన్న టీమిండియాను.. ఇప్పుడు న్యూజిలాండ్‌ను వణికించారు! వరుస సెంచరీలతో.. Ind Vs Eng 2nd ODI: తప్పంతా వాళ్లదే.. అందుకే భారీ మూల్యం.. మైండ్‌సెట్ మారాలి! మూడో వన్డేలో గనుక ఓడితే.. -
లేటు వయసులో ఘాటు ప్రేమ.. 9 ఏళ్లకు సుష్మిత రిప్లై?!
ప్రేమ పుట్టడాని ఒక్క క్షణం చాలు.. అన్న మాటకు ప్రత్యక్ష నిదర్శనంలా మారారు ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ, మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్. వీరి మధ్య ఉన్న పరిచయం కొత్తేమీ కాదు. ఎన్నో ఏళ్ల కిందటే ఒకరికొకరు తెలుసు. కానీ ఉన్నట్టుండి సడన్‌గా లవ్‌లో జారి పడ్డారు. ఒక్కరోజులోనే డేటింగ్ మొదలు పెట్టారు. పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అంటూ ఫొటోలు వదిలారు. ఇది చూసి సోషల్ మీడియా యూజర్స్ విస్తుపోయారు. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారా? త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారా? అంటూ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే కలిసి జీవితాన్ని పంచుకోబోతున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో లలిత్ మోదీ గతంలో చేసిన ట్వీట్ ఒకటి వైరల్‌గా మారింది. 2013లో లలిత్ మోదీ.. సుష్మితతో చాట్ చేసిన స్క్రీన్‌షాట్‌ను ట్విటర్లో షేర్ చేశాడు. ఇందులో మోదీ.. 'ఓకే ఐ కమిట్' అంటుంటే సుష్మిత మాత్రం.. 'మీరు చాలా మంచివారు. హామీలను నిలబెట్టుకోలేకపోవచ్చేమోగానీ కమిట్మెంట్లను మాత్రం గౌరవించాల్సిందే' అని రిప్లై ఇచ్చింది. మరో ట్వీట్లో సుష్మితను ట్విటర్లో కాకుండా ఎస్ఎమ్ఎస్ ద్వారా రిప్లై ఇవ్వమన్నాడు లలిత్. ఈ ట్వీట్ కాస్తా ఇప్పుడు వైరల్ కావడంతో నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. '9 ఏళ్లకు సుష్మిత కనికరించింది', 'లేటు వయసులో ఘాటు ప్రేమ', 'మోదీ గట్టిగానే ట్రై చేసినట్లున్నాడే', 'ఓపిక, పట్టుదల, కృషితో లలిత్ మోదీ విజయం సాధించాడు' అంటూ జోకులు పేలుస్తున్నారు. కాగా లలిత్ మోదీ 1991లో మినాల్ మోదీని పెళ్లాడాడు. క్యాన్సర్ కారణంగా మినాల్ 2018 డిసెంబర్ 10న మరణించింది. మనీలాండరింగ్ కేసులో భారత్ నుంచి పారిపోయిన లలిత్ మోదీ 2010 నుంచి లండన్‌లో నివసిస్తున్నాడు. Okay I commit 😋😋"@thesushmitasen: @LalitKModi u r too kind:)) however, promises are meant to be (cont) pic.twitter.com/JrgEwC1btR — Lalit Kumar Modi (@LalitKModi) April 27, 2013 @thesushmitasen reply my SMS — Lalit Kumar Modi (@LalitKModi) April 27, 2013 Just back in london after a whirling global tour #maldives # sardinia with the families - not to mention my #better looking partner @sushmitasen47 - a new beginning a new life finally. Over the moon. 🥰😘😍😍🥰💕💞💖💘💓. In love does not mean marriage YET. BUT ONE THAT For sure pic.twitter.com/WL8Hab3P6V — Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022 చదవండి: లలిత్ మోదీతో డేటింగ్‌పై స్పందించిన సుష్మితా సేన్ నన్ను పెళ్లి చేసుకుంటే నా ప్రియుడి చెల్లికి పెళ్లవదా? -
ఇంక ఆపుతారా? మాకింకా పెళ్లవలేదు: సుష్మితా సేన్
మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్, మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ లవ్‌లో ఉన్నామంటూ ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేశారు. అది కూడా ఒక్కరోజులోనే తమ మధ్య ప్రేమ చిగురించిందని, ప్రస్తుతం డేటింగ్లో ఉన్నప్పటికీ త్వరలో పెళ్లి కూడా చేసుకుంటామని సోషల్ మీడియా వేదికగా వారి మధ్య ఉన్న రిలేషన్‌ను బయటపెట్టాడు లలిత్ మోదీ. అయితే సుష్మితతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ ఆమెను భాగస్వామిగా పేర్కొన్నాడు. దీంతో అయోమయానికి లోనైన నెటిజన్లు ఆల్రెడీ వీళ్లు పెళ్లి చేసుకున్నారనుకుని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో లలిత్ మోదీ తమకింకా పెళ్లవలేదని ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చాడు. తాజాగా సుష్మితా సేన్ సైతం ఈ విషయంపై స్పందించింది. 'ప్రస్తుతం నేను నాకు నచ్చిన ప్రదేశంలో సంతోషంగా ఉన్నాను. ఇంకా ఉంగరాలు మార్చుకోలేదు, పెళ్లి అవలేదు. కేవలం ప్రేమలో మునిగి తేలుతున్నా.. ఈ వివరణ సరిపోతుందనుకుంటా.. ఇక నా పని నేను చూసుకుంటా.. నా సంతోషాన్ని పంచుకునేవారికి థ్యాంక్యూ.. ఎవరైతే పంచుకోరో.. వారికి నా గురించి అవసరం లేదు.. ఏదేమైనా లవ్ యూ గయ్స్..' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) చదవండి: నేనేమైనా ఉగ్రవాదినా? పెళ్లి చేసుకోకూడదా? మాజీ ఐపీఎల్ చైర్మన్‌తో సుష్మితా సేన్ డేటింగ్ -
లలిత్ మోదీ ప్రేమలో సుస్మితా.. ‘లవ్ ఆఫ్ మై లైఫ్’ అంటూ వీడియో..
మాజీ విశ్వసుందరి, నటి సుస్మితా సేన్, తాను డేటింగ్లో ఉన్నామని మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ గురువారం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించాడు. వీరిద్దరు మాల్దీవుల్లో షికార్లు చేసిన ఫొటోలు, లండన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా పిక్స్‌ను లలిత్ మోదీ షేర్ చేశాడు. ఈ సందర్భంగా సుస్మితాను తన బెటర్ హాఫ్(భార్య) అంటూ పరిచయం చేశాడు మోదీ. ఆ తర్వాత ప్రస్తుతం తాము డేటింగ్లో ఉన్నామనీ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశాడు. చదవండి: ప్రముఖ నటుడు, నటి రాధిక మాజీ భర్త మృతి దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహరం మీడియాలో, సోషల్ మీడియాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటి వరకు సుస్మితా దీనిపై స్పందించలేదు. ఈ క్రమంలో మాల్దీవ్స్‌లోని స్వీమ్మింగ్ ఫూల్లో ఆమె ఒక్కతే ఎంజాయ్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనికి బ్యాగ్రౌండ్లో ‘ఐ వాంట్ యు టూ నో.. యూ ఆర్ ద లవ్ ఆఫ్ మై లైఫ్’ అనే ఇంగ్లిష్ సాంగ్‌ను జత చేసింది. కాగా సుస్మితా గతంలో తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్ రోహ్మన్ షాతో మూడేళ్లు డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: నెలకు రూ. 25 లక్షలు ఇస్తాను, భార్యగా ఉండమన్నాడు మూడోసారి ప్రేమలో పడ్డ సుష్మితా సేన్, ప్రియుడు ఎవరో తెలుసా? View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi) -
మూడోసారి ప్రేమలో పడ్డ సుష్మితా సేన్, ప్రియుడు ఎవరో తెలుసా?
మాజీ విశ్వసుందరి, నటి సుష్మితా సేన్ మరోసారి ప్రేమలో పడింది. మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీతో డేటింగ్ చేస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు లలిత్. సుష్మితను తన భాగస్వామిగా పరిచయం చేస్తూ వీరిద్దరూ కలిసి ఉన్న పలు ఫొటోలను షేర్ చేశాడు. 'మాల్దీవుల్లో షికార్లు కొట్టాక లండన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా. నా జీవిత భాగస్వామి సుష్మిత సేన్‌తో కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని రాసుకొచ్చాడు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారేమోననుకున్న నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేశారు. కాసేపటికే లలిత్ మోదీ తమ పెళ్లి గురించి క్లారిటీ ఇస్తూ.. 'ప్రస్తుతానికి తామింకా డేటింగ్‌లోనే ఉన్నామని, ఒక్కరోజులోనే ఒకరితో ఒకరం ప్రేమలో పడిపోయాం' అని చెప్పుకొచ్చాడు. కాగా సుష్మితా సేన్ మొదట్లో పాక్ క్రికెటర్ వసీమ్ అక్రమ్‌తో ప్రేమాయణం నడిపింది. వీరిద్దరూ సహజీవనమూ మొదలుపెట్టారు. కానీ క్షణం తీరికలేని సుష్మితా షెడ్యూల్ వల్ల వసీమ్ తీవ్రమైన అభద్రతకు లోనయ్యాడట. అంతేకాదు ఆ అభద్రత అతనిలో ఆమె పట్ల అనుమానాలను రేకెత్తించి.. సుష్మితాను చిరాకు పరచే వరకు వెళ్లింది. దాంతో ఆ అనుబంధం పెళ్లి దాకా వెళ్లకుండానే బ్రేక్ అయింది. కొన్నాళ్ల తర్వాత.. సుష్మితా సేన్ ప్రముఖ మోడల్ రోహ్మన్తో ప్రేమలో పడింది. కానీ అది కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. Just back in london after a whirling global tour #maldives # sardinia with the families - not to mention my #betterhalf @sushmitasen47 - a new beginning a new life finally. Over the moon. 🥰😘😍😍🥰💕💞💖💘💓 pic.twitter.com/Vvks5afTfz — Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022 Just for clarity. Not married - just dating each other. That too it will happen one day. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾 pic.twitter.com/Rx6ze6lrhE — Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022 View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi) చదవండి: గ్లామర్ తప్ప యాక్టింగ్ రాదంటూ టార్చర్ పెట్టారు -
ఐపీఎల్ వ్యవస్థాపకుడి బయోపిక్‌ను తెరకెక్కించనున్న బాలయ్య నిర్మాత
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోడీ జీవితంపై స్పోర్ట్స్ జర్నలిస్ట్ బోరియా మజుందార్ 'మవెరిక్ కమిషనర్' ద ఐపీఎల్- లలిత్ మోడీ సాగా అనే పుస్తకాన్ని రచించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే పుస్తకం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. బాలయ్య సినిమాల సహా నిర్మాత ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన విష్ణువర్ధన్ ఇందూరి లలిత్ మోడీ బయోపిక్‌ను తెరకెక్కించనున్నట్లు ప్రకటించాడు. Winning the 83 World Cup was the tip of the iceberg. The book "Maverick Commissioner" by sports journalist @BoriaMajumdar is a fascinating account of the IPL and the Man behind it Lalit Modi. Elated to announce that we are adapting this book into a feature film. @SimonSchusterIN pic.twitter.com/tLEGGCkkxn — Vishnu Vardhan Induri (@vishinduri) April 18, 2022 విష్ణువర్ధన్ ఇందూరి.. తమిళనాడు ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీవితంపై తలైవీ అనే చిత్రాన్ని నిర్మించాడు. అలాగే స్పోర్ట్స్ డ్రామా 83 సినిమాకు కూడా ఆయనే నిర్మాతగా వ్యవహరించాడు. ఐపీఎల్ ప్రారంభమై నేటికి 15 సంవత్సరాలు (ఏప్రిల్ 18, 2008) అయిన సందర్భంగా విష్ణువర్ధన్ ఇందూరి లలిత్ మోడీ బయోపిక్ ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. ఈ బయోపిక్కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: ఉమ్రాన్ మాలిక్ స్పీడ్‌కు ఫిదా అయిన కేటీఆర్ -
ఆర్థిక నేరగాళ్లకు లండన్ స్వర్గధామం ఎలా ?
లండన్: విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, లలిత్ మోదీ, సంజయ్ భండారీ.. భారత్ బ్యాంకులకు కోట్లాది రూపాయలకు కుచ్చుటోపి పెట్టి బ్రిటన్‌కు పరారైన ఆర్థిక నేరగాళ్లలో వీరు కొందరు. మన దేశంలో నేరం చేసిన వారందరూ బ్రిటన్‌కే ఎందుకు ఉడాయిస్తున్నారు ? ఆర్థిక నేరగాళ్లకు లండన్ స్వర్గధామంగా ఎలా మారింది ? ఈ ప్రశ్నలకు జవాబుల్ని లండన్‌కు చెందిన జర్నలిస్టు దంపతులు డేనిష్ ఖాన్, రుహి ఖాన్లు ఒక పుస్తకం ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ‘ఎస్కేప్డ్ @ ట్రూ స్టోరీస్ ఆఫ్ ఇండియన్ ఫ్యుజిటివ్స్ ఇన్ లండన్’ అన్న పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు. సోమవారం విడుదల కానున్న ఈ పుస్తకంలో 12 కేసుల్ని విస్తృతంగా అధ్యయనం చేసి భారత్ నేరగాళ్లకి లండన్ ఎలా సురక్షితంగా మారిందో వివరించారు. రుణాల ఎగవేత దగ్గర్నుంచి హంతకుల వరకు అన్ని రకాల కేసుల్ని రచయితలు అధ్యయనం చేశారు. కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, భారత్ నావికాదళ మాజీ అధికారి రవి శంకరన్, మ్యుజీషియన్ నదీమ్ సైఫీ వంటి వారి గురించి ఈ పుస్తకంలో రాశారు. ఈ కేసులకు సంబంధించి కోర్టులో జరిగిన వాదోపవాదాలు, భారత్, బ్రిటన్ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందాలు, బ్రిటన్‌లో తలదాచుకోవడానికి వచ్చిన వారు ఇచ్చిన వివిధ ఇంటర్వ్యూలు, కొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులు అన్నింటిని విస్తృతంగా పరిశీలించి, అన్నింటినీ క్రోడీకరించి లండన్ ఏ విధంగా భారత్ నేరగాళ్లకు సురక్షితమో పుస్తకంలో చెప్పే ప్రయత్నం చేశామని డేనిష్ ఖాన్ తెలిపారు. ప్రధానంగా నేరస్తుల అప్పగింతకు సంబంధించిన కేసుల విచారణ బ్రిటన్ కోర్టుల్లో నత్తనడకన సాగుతుంది. ఆ ధీమాతోనే నేరస్తులందరూ లండన్‌కి పారిపోతూ ఉంటారన్న అభిప్రాయాలున్నాయి. భారత్, బ్రిటన్ మధ్య 1992లో నేరస్తుల అప్పగింత ఒప్పందం కుదిరితే ఇప్పటివరకు ఆ దేశం ఇద్దరిని మాత్రమే అప్పగించింది. మిగిలిన కేసులన్నీ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. -
లలిత్‌మోదీ, ఆయన భార్యకు స్విట్జర్లాండ్ నోటీసులు
న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్‌మోడీ, ఆయన భార్య మినాల్ మోడీలకు స్విట్జర్లాండ్ నోటీసులు జారీ చేసింది. నల్లధనంపై పోరులో భాగంగా ఈ దంపతుల డిపాజిట్ వివరాలు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం స్విట్జర్లాండ్‌ను కోరడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. 2010లో దేశం నుంచి లండన్‌కు పారిపోయిన లలిత్‌మోడీ ఇప్పటికే మనీల్యాండరింగ్ కేసులను ఎదుర్కొంటున్నారు. భారత ప్రభుత్వం కోరిన సమాచారం విషయంలో తమ స్పందన తెలియజేసేందుకు లలిత్‌మోడీ దంపతులకు స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ విభాగం పది రోజుల గడువు ఇచ్చింది. -
రాహుల్‌ను బ్రిటన్ కోర్టుకు లాగుతా : లలిత్ మోదీ
లండన్ : మోదీ పేరున్న వారంతా దొంగలేనంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయనను బ్రిటన్ కోర్టుకు లాగుతానని లలిత్ మోదీ హెచ్చరించారు. లలిత్ మోదీ, నీరవ్ మోదీ, ప్రధాని నరేంద్ర మోదీలను ప్రస్తావిస్తూ దొంగలందరి పేర్లలో మోదీ పేరు ఎందుకుందని, ఇంకా ఎంత మంది ఇలాంటి మోదీలు బయటికొస్తారో మనకు తెలియదని మహారాష్ట్రలో ఇటీవల ఓ ర్యాలీలో రాహుల్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాహుల్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బ్రిటన్‌లో తాను కోర్టును ఆశ్రయిస్తానని లలిత్ మోదీ ట్వీట్ చేశారు. ఐదు దశాబ్ధాల పాటు భారత్‌ను రాహుల్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. ఎవరు దొంగో..ఎవరు కాపలాదారో మీరే తేల్చుకోవాలని ప్రజలను కోరారు. ఐపీఎల్ మాజీ ఛైర్మన్‌గా వ్యవహరించిన లలిత్ మోదీ తనపై మనీల్యాండరింగ్ ఆరోపణలు రావడంతో భారత్‌ను విడిచిపెట్టి వెళ్లారు. మోదీలందరూ దొంగలని చెబుతున్న రాహుల్ గాంధీపై బ్రిటన్ కోర్టులో తాను కేసు వేస్తానని లలిత్ మోదీ హెచ్చరించారు.మరోవైపు తనపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ సైతం తప్పుపట్టారు. మోదీల పేరున్న వారంతా దొంగలేనంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు బీసీలను అవమానించడమేనని దుయ్యబట్టారు. -
నేరస్తుల గమ్యం.. లండన్
ఐపీఎల్ క్రికెట్ మాజీ సారథి లలిత్ మోదీ.. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధిపతి విజయ్ మాల్యా.. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. వేలకోట్ల రూపాయల కుంభకోణాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు వీరంతా. వీరందరి గమ్యం మాత్రం బ్రిటన్ దేశమే. వీరే కాకుండా వివిధ దేశాలకు చెందిన రాజకీయ వేత్తలు, అసమ్మతి నాయకులు, ప్రవాసంలో ఉన్న వారికి, సొంత దేశాల్లో ప్రాణ భయాన్ని ఎదుర్కొంటున్న వారికి బ్రిటన్ భద్రంగా తలదాచుకునే గమ్యస్థానంగా నిలుస్తోంది. ఒక్క 2013లో 5,500 మందికి పైగా భారతీయులు బ్రిటన్‌లో రాజకీయ ఆశ్రయం కోరుకున్నారు. వారికి శరణార్థి హోదా లభించడమే కాకుండా అక్కడ ఐదేళ్ల పాటు ఉండేందుకు అనుమతి లభిస్తుంది. మానవ హక్కులకు ప్రాధాన్యమెక్కువ పటిష్టమైన మానవ హక్కుల పరిరక్షణ చట్టాల కారణంగానే అనేక మంది ఇంగ్లండ్‌లో ఆశ్రయం పొందేందుకు తహతహలాడుతున్నారు. ప్రపంచంలోనే కట్టుదిట్టమైనదిగా బ్రిటన్ మానవ హక్కుల సంఘం పేరు గడించింది. మానవ హక్కులకు సంబంధించి ఐరోపా దేశాల ఒప్పందంలో బ్రిటన్ భాగస్వామిగా ఉంది. వివిధ దేశాలకు చెందిన రాజకీయవేత్తలు లేదా ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బ్రిటన్ నుంచి సొంత దేశానికి తిప్పి పంపిస్తే.. వారికి మరణశిక్ష పడడమో లేదా వారికి చిత్రహింసలు తప్పవనో భావిస్తే అక్కడి కోర్టులు స్వదేశాలకు పంపేందుకు అంగీకరించవు. రాజకీయ కారణాల వల్ల ఎవరినైనా వెనక్కి పంపించాలని ఆయా దేశాల నుంచి విజ్ఞప్తులు వచ్చినా.. తిరస్కరించే అవకాశాలే ఎక్కువ. ఓ పట్టాన తేలదు... తీవ్రవాద కార్యకలాపాల్లో పాత్ర కారణంగా 2004లో టైగర్ హనీఫ్‌ను.. అదే ఏడాది కుట్ర, చౌర్యం కేసుల్లో షేక్ సాదిక్‌ను.. ఫోర్జరీ కేసులో 2009లో రాజ్‌కుమార్ పటేల్‌ను.. ఫోర్జరీ, మోసానికి సంబంధించిన కేసుల్లో 2011లో రాజేశ్‌కుమార్‌ను.. లైంగికపరమైన నేరాల విషయంలో 2012లో అతుల్‌సింగ్‌ను.. బ్యాంకింగ్ రంగ మోసాలపై 2014లో జతీందర్ కుమార్, ఆశారాణి అంగురాల దంపతులను భారత్‌కు తిప్పి పంపాలని మన కేంద్ర ప్రభుత్వం బ్రిటన్ను కోరింది. ఈ విజ్ఞప్తులన్నీ కూడా అక్కడి కోర్టుల్లో ఇంకా పెండింగ్‌లోనే ఉండటం గమనార్హం. మోసాలు, అక్రమాలతో దేశానికి ఆర్థికంగా నష్టం కలిగించిన లలిత్‌మోదీ, విజయ్‌మాల్యా, నీరవ్ మోదీలను తిప్పి పంపించాలన్న విజ్ఞప్తులపై ఇంకా విచారణ సాగుతూనే ఉంది. వెనక్కొచ్చింది ఒక్కరే.. వివిధ కేసుల్లోని నిందితులు, దోషులను పరస్పరం అప్పగించుకునేలా 1992లో బ్రిటన్–భారత్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పటివరకు కేవలం సమీర్‌భాయ్ వినూభాయ్ పటేల్‌ను మాత్రమే బ్రిటన్ భారత్‌కు తిప్పి పంపింది. గుజరాత్ గోధ్రా ఘటన అనంతరం చోటుచేసుకున్న అల్లర్లలో ప్రమేయముందన్న ఆరోపణలున్న సమీర్భాయ్ను 2016లో అప్పగించింది. భారత అధికారులు జారీ చేసిన రెడ్‌కార్నర్ నోటీసులపై స్పందించి.. లండన్‌లో స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వివిధ కేసుల్లో బ్రిటన్ నుంచి పారిపోయి భారత్‌లో తలదాచుకుంటున్న నలుగురిని భారత్ తిప్పి పంపించింది. పలు కేసుల్లో నిందితులైన 57 మందిని భారత్‌కు అప్పగించాలంటూ చేసిన విజ్ఞప్తులను (ఒకటి మినహా) బ్రిటన్ తోసిపుచ్చింది. అప్పగింత ప్రక్రియ,ఇబ్బందులివీ.. వివిధ కేసుల్లో నిందితులైన వారిని భారత్‌కు తిప్పి పంపించే విషయంలో బ్రిటన్ న్యాయవ్యవస్థలోని పలు అంశాలు అడ్డంకిగా మారుతున్నాయి. అక్కడి సంక్లిష్టమైన ప్రక్రియ వల్లనే నిందితులను భారత్‌కు రప్పించడంలో జాప్యం జరుగుతోంది. ఆ అంశాలివీ.. - ఫలానా కేసులో ఫలానా వ్యక్తిని తిప్పిపంపాలంటూ భారత్ పంపించిన విజ్ఞప్తిని ఆమోదించాలా లేదా అన్నది బ్రిటన్ విదేశాంగశాఖ మంత్రి నిర్ణయించాలి. - ఆ నిర్ణయానికి అనుగుణంగా ఆ వ్యక్తి అరెస్ట్‌కు వారంట్ జారీ చేయాలా వద్దా అన్న దానిపై అక్కడి కోర్టు నిర్ణయిస్తుంది. తర్వాత సంబంధిత వ్యక్తిని అరెస్టు చేసి అక్కడి కోర్టు ఎదుట హాజరుపరుస్తారు. - ముందుగా ప్రాథమిక విచారణ జరుగుతుంది. అనంత రం స్వదేశానికి తిప్పిపంపే అంశంపై విచారణ ఉంటుంది. నిందితుడిని వెనక్కు పంపేందుకు న్యాయస్థానం సానుకూలంగా స్పందిస్తే.. దానిపై ఆదేశాలు ఇవ్వాలా వద్దా అన్న దానిపై విదేశాంగ మంత్రి నిర్ణయించాలి. - ఫలానా వ్యక్తిని తిప్పి పంపాలంటూ భారత్ పంపించిన వారంట్లో పేర్కొన్న అంశాలు, చేసిన నేరం స్వదేశానికి పంపించేంత తీవ్రమైనదా కాదా అన్న దానిపై కేసు విచారణ సందర్భంగా జడ్జి సంతృప్తి చెందాలి. - నిందితుడిని వెనక్కి పంపించడం సరైనదా కాదా అన్న అంశంపై జడ్జి నిర్ణయం తీసుకోవాలి. - తిప్పి పంపించడం వల్ల నిందితుడి మానవ హక్కులకు భంగం వాటిల్లుతుందా అన్నది జడ్జి పరిశీలిస్తారు ఉదాహరణకు ఏదైనా కేసులో ఓ వ్యక్తిని భారత్‌కు పంపించేందుకు విదేశాంగ మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి హైకోర్టులో సవాల్ చేయవచ్చు. దానిపై హైకోర్టు ఇచ్చే ఆదేశాలపై సుప్రీంను ఆశ్రయించొచ్చు. స్వదేశానికి పంపించే వ్యక్తి మరణశిక్షకు గురయ్యే అవకాశం ఉందంటే మాత్రం వెనక్కి పంపించేందుకు అంగీకరించరు. -
ఐపీఎల్: బీసీసీఐకి భారీ షాక్
సాక్షి, ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి ఎన్ఫోర్స్మెంట్ విభాగం(ఈడీ) షాకిచ్చింది. 2009 ఐపీఎల్ సీజన్ నిర్వాహణకు సంబంధించి బీసీసీఐకి భారీ జరిమానాను విధించింది. బీసీసీఐతోపాటు మాజీ సభ్యులకు కలిపి మొత్తం రూ. 121 కోట్ల జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేసింది. 2009 ఐపీఎల్ సీజన్‌ను సౌతాఫ్రికాలో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ.. విదేశీ ఖాతా తెరవకుండానే రూ. 243 కోట్లను టోర్నీ నిర్వహణ కోసం బీసీసీఐ సౌతాఫ్రికాకు బదిలీ చేసింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) అతిక్రమణ ఆరోపణలతో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేపట్టింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావటంతో భారీ జరిమానాను విధించింది. బీసీసీఐతోపాటు బోర్డు మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్‌తోపాటు ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ, ఇతరులకు కలిపి ఈడీ రూ.121 కోట్ల జరిమానా విధించింది. బీసీసీఐకు రూ. 82.66 కోట్లు శ్రీనివాసన్‌కు రూ.11.53 కోట్లు, లలిత్ మోదీకి రూ.10.65 కోట్లు, బోర్డు మాజీ కోశాధికారి పాండవ్‌కు రూ. 9.72 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ (ఎస్బీఐతో విలీనమైంది)కు రూ.7 కోట్లను జరిమానాగా విధించింది. ఈ జరిమానాను 45రోజుల్లోగా చెల్లించాలంటూ ఈడీ ఆదేశించింది. -
మాల్యాను అప్పగించండి
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి పరారైన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా, ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీని త్వరగా అప్పగించాలని బ్రిటన్‌కు భారత్ విజ్ఞప్తి చేసింది. అలాగే వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆచూకీ కనుగొనేందుకు సహకరించాలని విన్నవించింది. కశ్మీర్, ఖలిస్తాన్ వేర్పాటువాదులు బ్రిటన్ భూభాగంలో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు అనుమతించొద్దని కోరింది. బుధవారం ఢిల్లీలో జరిగిన మూడో ఇండో–యూకే హోం అఫైర్స్ సమావేశంలో హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ మేరకు బ్రిటన్‌కు విజ్ఞప్తి చేసింది. -
ఐ విల్ మిస్ యూ బ్రదర్: లలిత్ మోదీ
లండన్: మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి హిమాన్షు రాయ్ ఆత్మహత్య చేసుకోవడంపై ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న లలిత్ మోదీ.. హిమాన్షు రాయ్ ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీటర్ వేదికగా సంతాపం తెలిపారు. ‘ఐ రియల్లీ మిస్ యూ. నీ ఉద్యోగ ధర్మాన్ని చాలా చక్కగా నిర్వర్తించావు. కానీ నీ ఆత్మహత్యకు కారణాన్ని నేను అర్థం చేసుకోగలను. మా గుండెల్లో ఎప్పుడూ నీవు చిరస్థాయిగా ఉంటావు. ఇకనైనా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో..ఇక నీకు ఏ బాధ ఉండదూ. నీవు ఒక మెరిసే నక్షత్రానివి’ అని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. శుక్రవారం హిమాన్షు రాయ్ ముంబయిలోని తన నివాసంలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 1988 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హిమాన్షు రాయ్ ...2013లో సంచలనం సృష్టించిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణలో కీలకంగా వ్యవహరించారు. ఈ కేసులో బాలీవుడ్ నటుడు విందు దారా సింగ్‌ను అరెస్ట్ చేశారు. వీటితో పాటు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ డ్రైవర్ ఆరీఫ్ కాల్పులు కేసు, జర్నలిస్ట్ జాడే హత్యకేసు, విజయ్ పాలెండే, లైలా ఖాన్ డబుల్ మర్డర్ కేసుల విచారణలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. హిమాన్షు రాయ్ గత కొంతకాలంగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ‘మరాఠీ దినపత్రిక లోక్‌మఠ్’ పేర్కొంది. అంతేకాకుండా ఆయన డిప్రెషన్లో ఉన్నట్లు తెలుస్తోంది.కాగా, ఏడాదిన్నరగా మెడికల్ లీవ్‌లో ఉన్న హిమాన్షు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. May you #restinpeace my brother. I Really will miss u. You were doing so well but ...I understand.... you will always be in our heart. Go my brother and now rest. No more Pain. Just Love 😢💔 u were the brightest of the ⭐️ and it was truly a blessing to have u watch over us. 😢 pic.twitter.com/00Bf6GjHms — Lalit Kumar Modi (@LalitKModi) 11 May 2018 -
ఐపీఎల్ ప్లేయర్లు మ్యాచ్‌కు ఆరున్నర కోట్లు సంపాదిస్తారు
లండన్: భవిష్యత్తులో ఐపీఎల్ ఆడే ఆటగాళ్లు మ్యాచ్‌కు రూ. 6.5 కోట్లు (మిలియన్ డాలర్లు) సంపాదిస్తారని ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ చెప్పుకొచ్చారు. దశాబ్దం క్రితం మోదీ నేతృత్వంలో రూపొందిన ఈ లీగ్ అచిర కాలంలోనే విశ్వవ్యాప్తమైంది. ఇంటా బయటా ఇప్పుడున్న ఎన్నో లీగ్‌లకు ఐపీఎలే ప్రేరణ. ఐపీఎల్‌కు పదేళ్లు పూర్తయిన సందర్భంగా లలిత్ మోదీ స్థానిక దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఐపీఎల్ ఇప్పుడు ఉన్నత శిఖరంలో ఉంది. ప్రపంచంలోనే మేటి క్రికెట్ లీగ్‌గా ఎదిగింది. ఎంతో మంది ప్రేక్షకుల్ని, స్పాన్సర్లను ఆకట్టుకుంది. ఫ్రాంచైజీ యాజమాన్యాలు బాగా ఆర్జిస్తున్నాయి. భారత్‌లోని క్రికెట్ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు స్టోక్స్ సీజన్‌కు రూ. 12 కోట్లు (1.95 మిలియన్స్) సంపాదిస్తున్నాడు. త్వరలో రూ. 72 కోట్లు (12 మిలియన్స్) సంపాదిస్తాడు. క్రికెటర్లు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో ఫుట్‌బాలర్ల ఆదాయాన్ని అందుకోగలరు. ఇది ఇప్పుడు కాకపోయిన సమీప భవిష్యత్తులో సాధ్యమవుతుంది’ అని అన్నారు. లీగ్‌ల ప్రాచుర్యంతో సంప్రదాయ క్రికెట్‌కు గడ్డుకాలం తప్పదన్నారు. పెద్ద పెద్ద సిరీస్‌లే మూడు, నాలుగేళ్లకోసారి జరిగే పరిస్థితి వస్తుందని, ఐసీసీ ప్రాభవం కోల్పోతుందని చెప్పారు. టెస్టు చాంపియన్‌షిప్ నిర్వహిస్తేనే ఐదు రోజుల ఆట బతుకుతుందని విశ్లేషించారు. -
దర్జా దొంగలు
-
దోపిడీ బ్యాంక్ ఆఫ్ ఇండియా
-
ఐపీఎల్‌పై బాంబే హైకోర్టు ఫైర్..!
సాక్షి, ముంబై: ఐపీఎల్ పుణ్యమాని ఫిక్సింగ్, బెట్టింగ్‌లు బాగా ప్రాచుర్యం పొందాయని, మరి ఈ లీగ్‌తో క్రికెట్ ఆటకు ఒనగూరిన ప్రయోజనమెంటో చూడాలని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడిపై నమోదైన విదేశీ మారక నిల్వల (ఫెమా) కేసు విచారణ సందర్భంగా డివిజన్ బెంచ్‌లోని న్యాయమూర్తులు జస్టిస్ ధర్మాధికారి, భారతి దంగ్రే వ్యాఖ్యానిస్తూ ‘ఐపీఎల్‌ను విజయవంతం చేశారు సరే. గడిచిన పదేళ్లలో ఆర్థిక అవకతవకలు, కేసుల కంటే ఈ లీగ్ ఆటకెంత మేలు చేసిందో నిర్వాహకులు సమీక్షించుకోవాలి. ఇప్పటికే ఫిక్సింగ్–బెట్టింగ్‌లతో ఐపీఎల్ బాగా పాపులర్ అయింది. ఈ నేపథ్యంలో కేంద్రం, రిజర్వ్ బ్యాంక్, ఐపీఎల్ నిర్వాహకులు ఈ లీగ్ క్రికెట్ క్రీడ కోసమా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది’ అని అన్నారు. లలిత్ మోడిపై నమోదైన కేసు దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను తమ మార్గదర్శనంలో చేయాలని ఈడీని ఆదేశించింది. మార్చి 2న మొదలయ్యే ఈ ప్రక్రియను 31లోగా పూర్తి చేయాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. -
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు!
జైపూర్: ఐపీఎల్ మాజీ చైర్మన్, వివాదాస్పద వ్యాపారవేత్త లలిత మోదీ క్రికెట్‌తో తన అనుబంధానికి స్వస్తి పలికాడు. రాజస్థాన్‌లోని నాగౌర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు మూడు పేజీల లేఖను శుక్రవారం అర్ధరాత్రి రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌కు పంపించాడు. 'రాబోవు తరాలకు అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. అందుకు క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌కు గుడ్‌బై పలుకాలని నిర్ణయించాను' అని మోదీ తన లేఖలో పేర్కొన్నారు. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ ప్రస్తుతం భారత ఏజెన్సీల నుంచి తప్పించుకొని విదేశాల్లో ప్రవాసముంటున్న సంగతి తెలిసిందే. అతనికి వ్యతిరేకంగా అంతర్జాతీయ వారెంట్ జారీ చేయాలంటూ భారత్ ఇంటర్‌పోల్‌ను కోరినా.. ఇంటర్‌పోల్ అందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. నాగౌర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్‌లో లలిత్ మోదీ ఉండటంతో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌ను బీసీసీఐ నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో గత మూడేళ్లలో రాజస్థాన్ ఒక్క ఐపీఎల్ మ్యాచ్‌గానీ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌గానీ అతిథ్యం ఇవ్వలేకపోయింది. -
మాల్యా, లలిత్‌లను అప్పగించండి
►బ్రిటన్ ప్రధానిని కోరిన మోదీ ► జీ–20 సదస్సులో భాగంగా థెరిసా మేతో ప్రత్యేక భేటీ ► మలబార్ విన్యాసాలపై జపాన్ ప్రధానితో సమీక్ష ► పలు దేశాధినేతలతో వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు హాంబర్గ్: భారతదేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి బ్రిటన్‌లో ఆశ్రయం పొందుతున్న వారిని తిరిగి భారత్‌కు రప్పించటంలో సహకరించాలని ప్రధాని మోదీ కోరారు. జీ–20 సదస్సులో భాగంగా బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో భేటీ సందర్భంగా మద్యం వ్యాపారి విజయ్ మాల్యా, ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీలను భారత్ రప్పించటంలో సహకరించాలని కోరారు. భారత బ్యాంకుల్లో రూ.9వేలకోట్ల రుణాలు తీసుకుని గతేడాది మార్చిలో మాల్యా లండన్ పారిపోయారు. తనపై జారీ అయిన అరెస్టు వారెంటులనుంచీ తప్పించుకుంటున్నారు. మనీ లాండరింగ్ కేసులో విచారణ జరుగుతున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీనీ అప్పగించాలని థెరిసా మేను మోదీ కోరారు. ఉగ్రవాదంతోపాటుగా పలు ద్వైపాక్షిక అంశాలపైనా వీరి మధ్య చర్చ జరిగింది. జీ–20 సదస్సులో భాగంగా పలుదేశాల అధినేతలతో ప్రత్యేకంగా ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ‘మలబార్’పై సమీక్ష: భారత్–జపాన్ దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న మలబార్ సైనిక విన్యాసాలపై ఇరుదేశాల ప్రధానులు మోదీ, షింజో అబేలు చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలపైనా వీరిమధ్య చర్చ జరిగింది. జపాన్ సాయం చేస్తున్న ప్రాజెక్టుల పురోగతిపై మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. వాణిజ్యం, పెట్టుబడులపై చర్చలు భారత జాతీయ పెట్టుబడులు, మౌలికవసతుల నిధిలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని నార్వేను మోదీ కోరారు. నార్వే ప్రధాని ఎర్నా సోల్బర్గ్తో జరిగిన భేటీలో మోదీ ఈ ప్రతిపాదన చేశారు. దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ ఇన్, ఇటలీ ప్రధాని పాలో జెంటిలోనీ, అర్జెంటీనా అధ్యక్షుడు మౌరిషి యోతోనూ మోదీ వేర్వేరుగా భేటీ అయ్యారు. వియత్నాం ప్రధాని ఎన్గుయెన్ ఫుక్, సెనెగల్ అధ్యక్షుడు మేకీ సాల్తోనూ మోదీ భేటీ అయ్యారు. మోదీ ‘ఉగ్ర’ ప్రకటనకు భారీ స్పందన జీ–20 సదస్సులో ఉగ్రవాదంపై మోదీ చేసిన ప్రసంగంపై సభ్యదేశాల్లో సానుకూల స్పందన కనిపించిందని భారత్ వెల్లడించింది. జర్మన్ చాన్సెలర్ మెర్కెల్ సహా యూరోపియన్ నేతలు మోదీ అభిప్రాయాలతో ఏకీభవించారని భారత్ తెలిపింది. ఉగ్రవాద సంస్థలతోపాటుగా ఉగ్రవాదులకు ఆశ్రయం, ఆర్థిక సాయం చేస్తున్న వారిపైనా కఠినంగా వ్యవహరించే విషయంలో సంయుక్తంగా ముందుకెళ్లేందుకు మెజారిటీ దేశాలు ముందుకొచ్చాయని ఆయన వెల్లడించారు. జీ–20 సదస్సు పూర్తవటంతో ప్రధాని మోదీ భారత్ తిరుగుప్రయాణమయ్యారు. ‘మాటల్లో చెప్పలేనిది ఫొటో చెబుతుంది’ మోదీ, జిన్‌పింగ్ చర్చలపై భారత్ హాంబర్గ్: మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో శుక్రవారం బ్రిక్స్ సదస్సు సందర్భంగా జరిపిన అనధికారిక చర్చల వివరాలను వెల్లడించడానికి భారత్ నిరాకరించింది. వారిద్దరూ విస్తృత అంశాలపై చర్చించారని, అంతకుమించి చెప్పలేమని విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే తెలిపారు. మోదీ, జిన్‌పింగ్ నవ్వుతూ తీయించుకున్న ఫొటో.. ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తత తొలగిందనడానికి నిదర్శనమా అని విలేకర్లు అడగ్గా.. ‘మేం చెప్పాల్సింది చెప్పాం. ఫొటో విషయానికి వస్తే.. వెయ్యిమాటల్లో చెప్పలేనిది ఒక ఫొటో చెబుతుంది అన్న నానుడి ఉండనే ఉంది’ అని బదులిచ్చారు. -
లలిత్ మోదీకి చుక్కెదురు
జైపూర్: విదేశాల్లో ఉంటూనే రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్సీఏ)లో చక్రం తిప్పాలనుకున్న లలిత్ మోదీకి చుక్కెదురైంది. ఆర్సీఏ అధ్యక్షుడిగా పోటీచేసిన లలిత్ తనయుడు రుచిర్ మోదీ ఓటమిపాలయ్యారు. కోర్టు ఆదేశాల ప్రకారం శుక్రవారం వెల్లడైన ఆర్సీఏ ఎన్నికల ఫలితాల్లో.. మోదీ ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన సీపీ జోషి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో జోషి 19 ఓట్లు సాధించగా, రుచిర్ మోదీకి కేవలం 14 ఓట్లు మాత్రమే పొలయ్యాయి. అయితే ఆర్సీఏ కార్యదర్శి, కోశాధికారి పదవులు మాత్రం మోదీ అనునాయులకే దక్కడం గమనార్హం. సెక్రటరీగా రాజేంద్ర నందు, ట్రజరర్‌గా పింకేశ్‌జైన్‌లు ఎన్నికయ్యారు. ఐపీఎల్లో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడిన లలిత్ మోదీ అరెస్ట్ భయంతో కొన్నేళ్ళ కిందటే భారత్ నుంచి పారిపోయిన సంగతి తెలిసిందే. దేశం విడిచివెళ్లే క్రమంలో ఆయనకు పలువురు బీజేపీ నేతలు సహకరించారనే ఆరోపణలున్నాయి. -
ధోనీ జాబ్ వెనక వందల కోట్ల స్కామ్!
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఆఫర్ లెటర్ సోషల్ మీడియలో హల్ చల్ చేస్తోంది. ఇండియా సిమెంట్స్ ఓనర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ తన కంపెనీలో ధోనీకి ఉద్యోగం ఇచ్చిన వివరాలను ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ లీక్ చేశారు. ధోనీ, శ్రీనీకి మధ్య ఎన్నో కాంట్రాక్టులలో సంబంధాలు ఉన్నాయని ఈ జాబ్ వెనక అసలు ఉద్దేశమిదేనని అభిప్రాయపడ్డారు. ఏడాదికి వంద కోట్లు ధోనీకి ముట్టజెప్పడమే ఉద్యోగం ఇవ్వడానికి కారణమని లలిత్ మోడీ ఆరోపించారు. 2012 జూన్‌లో ధోనీని ఇండియా సిమెంట్స్ కంపెనీ మార్కెటింగ్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్‌గా నియమించినట్లు ఓ ఆఫర్ లెటర్‌ను మోడీ బయటపెట్టారు. దీని ప్రకారం చూస్తే ధోనీకి నెలకు బేసిక్ పే రూ. 43000, డీఏ రూ. 21,970, స్పెషల్ పే రూ. 20,000, ప్రత్యేక సదుపాయాల కోసం రూ. 60,000 సహా ఓవరాల్‌గా రూ.100 కోట్లు కంపెనీ అందిచనుంది. ఇండియా సిమెంట్స్‌లో పనిచేసిన ధోనీ శ్రీనివాసన్ కంపెనీ ఉద్యోగిగా వందల కోట్లు ఆర్జించానని అంగీకరిస్తాడా అని ప్రశ్నించారు. రాజస్థాన్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయనున్న లలిత్ మోడీ కుమారుడు రుచిర్ మోడీ ఈ ఆఫర్ లెటర్‌పై స్పందించారు. బీసీసీఐలో ఇలాంటివి జరగడంపై షాక్‌కు గురయ్యానని, చెన్నై సిమెంట్స్ ఉద్యోగిగా ధోనీ ఏడాదికి వందకోట్లు ఆర్జిస్తున్నాడని ట్వీట్ చేశారు. మరోవైపు రెండేళ్ల నిషేధం అనంతరం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఐపీఎల్ 11లో సందడి చేయనున్నాయి. -
మాల్యా తర్వాత.. అరెస్ట్ చేసేది ఆయన్నే
న్యూఢిల్లీ: బ్యాంకులకు దాదాపు 9 వేల కోట్ల రూపాయల బకాయిలను ఎగవేసి విచారణకు హాజరుకాకుండా లండన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్ అభ్యర్థన మేరకు బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేయడంపై పలువురు రాజకీయ నాయకులు స్పందించారు. మాల్యా తర్వాత ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీని అరెస్ట్ చేయవచ్చని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. 'మాల్యాను అరెస్ట్ చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మోదీ ఎప్పుడూ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతారు. మాల్యా జైలుకు వెళ్లే సమయం వచ్చింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ జాబితాలో తర్వాత లలిత్ మోదీ ఉండవచ్చు' అని సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. ఐపీఎల్లో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ.. ఈడీ విచారణకు హాజరుకాకుండా ఇంగ్లండ్‌లో తలదాచుకుంటున్నాడు. ఆయన్ను రప్పించేందుకు భారత్ ప్రయత్నించినా సాధ్యంకాలేదు. మాల్యాను అరెస్ట్ చేయడం భారత ప్రభుత్వం, ఆర్థిక శాఖ పెద్ద విజయమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. మాల్యాను భారత్‌కు రప్పిస్తామని మరో కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ అన్నారు. -
లలిత్ మోదీకి ఊరట
రెడ్ కార్నర్ నోటీసుల జారీకి ఇంటర్‌పోల్ తిరస్కరణ! న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలన్న భారత్ విన్నపాన్ని ఇంటర్‌పోల్ తిరస్కరించింది. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరు కాకుండా లండన్‌లో తలదాచుకుంటున్న లలిత్ మోదీకి ఊరట లభించినట్లైంది. ఐపీఎల్ చైర్మన్ హోదాలో లలిత్ మోదీ అధికార, నిధుల దుర్వినియోగానికి పాల్ప డ్డారంటూ ఆయనపై అభియోగాలు నమో దయ్యాయి. ఈడీ ఆయనపై కేసు నమోదు చేసి విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. లండన్‌లో ఉంటున్న మోదీ భారత్‌లో తనకు ప్రాణహాని ఉందని, అందువల్ల విచారణకు రాలేనంటూ తప్పించు కుంటున్నారు. ఈ నేపథ్యంలో లలిత్‌ను తమకు అప్పగించాల్సిందిగా భారత్ ఇంటర్‌పోల్ సాయం కోరింది. ఐపీల్ టీ20 క్రికెట్ టోర్నీ–2009 ఓవర్సీస్ టెలీకాస్ట్ హక్కుల కేటాయింపులో అవకతవకలకు పాల్పడ్డా రని లలిత మోదీపై 2010లో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఫిర్యాదుచేశారు. -
లలిత్ మోదీకి భారీ ఊరట
న్యూఢిల్లీ: ఈడీ విచారణకు హాజరుకాకుండా ఇంగ్లండ్‌లో తలదాచుకుంటున్న ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి భారీ ఊరట లభించింది. లలిత్ మోదీపై రెడ్ నోటీసు జారీ చేయాలన్న భారత్ విన్నపాన్ని ఇంటర్‌పోల్ తిరస్కరించింది. మోదీని తమకు అప్పగించాలన్న భారత్ అభ్యర్థన విషయంలో ఇంటర్‌పోల్ ఆయన్ను అరెస్ట్ చేయదు. ఐపీఎల్ చైర్మన్ హోదాలో లలిత్ మోదీ అధికార, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఈడీ ఆయనపై కేసు నమోదు చేసి విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. లండన్‌లో ఉంటున్న మోదీ భారత్‌లో తనకు ప్రాణహాని ఉందని, అందువల్ల విచారణకు రాలేనంటూ తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లలిత్‌ను తమకు అప్పగించాల్సిందిగా భారత్ ఇంటర్‌పోల్ సాయం కోరింది. అయితే భారత్ విన్నపాన్ని ఇంటర్‌పోల్ తిరస్కరించింది. -
అపోలో డేటా హ్యాక్? నెక్ట్స్ లలిత్ మోదీనే!
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, విజయ్ మాల్యా, ప్రముఖ జర్నలిస్టు బర్కా దత్ ల ట్విట్టర్ అకౌంట్లు, ఈ-మెయిళ్ల సర్వర్లు హ్యాక్ చేసిన లెజియన్ హ్యాకర్ల బృందం తాము అపోలో ఆసుపత్రికి చెందిన సర్వర్లను హ్యాక్ చేసినట్లు పేర్కొన్నారు. వాషింగ్టన్ పోస్టుకు ఇచ్చిన ఓ రహస్య ఇంటర్వూలో వారు ఈ విషయాన్ని వెల్లడించారు. అపోలోకు సంబంధించిన కీలక సమాచారం మొత్తం తమ వద్ద ఉందని చెప్పారు. వారికి లభ్యమైన డేటా వివరాలను బయటపెడితే భారతదేశ ప్రజలు ఆందోళనలకు గురయ్యే అవకాశం ఉంటడంతో వాటిని విడుదల చేయడం లేదని తెలిపారు. భారత్ లోని 40 వేల సర్వర్లకు చెందిన గిగాబైట్ల కొద్దీ సమాచారం తమ వద్ద ఉందని చెప్పారు. అంతేకాకుండా భారత రాజకీయ నాయకుల వ్యక్తిగత సమాచారం కూడా తమ ఉందని పేర్కొన్నారు. త్వరలో ఐపీఎల్ మాజీ అధ్యక్షుడు లలిత్ మోదీకి చెందిన వ్యక్తిగత సమాచారాన్ని విడుదల చేయనున్నట్లు చెప్పారు. బీజేపీ ప్రభుత్వానికి సన్నిహితులైన వారి సమాచారాన్ని కూడా హ్యాక్ చేసినట్లు వెల్లడించారు. -
లలిత్ మోదీకి షాక్
ముంబై: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీని యూకే నుంచి భారత్ కు రప్పించడానికి మార్గం సుగమం అయింది. లలిత్ మోదీని భారత్ కు పంపాలని యూకే ప్రభుత్వానికి లేఖ రాయాలని ఈడీ చేసిన అభ్యర్ధనకు కోర్టు అంగీకరించింది. లలిత్ మోదీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయి ఉన్నా ఆయన యూకేలో ఉండటంతో కేసు విచారణకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్నే కోర్టు లో ప్రస్తావించిన ఈడీ తరఫు న్యాయవాది.. మోదీని వెనక్కు పంపాలని యూకే ప్రభుత్వానికి కోర్టు లేఖ రాయాలని కోరారు. విజయ్ మాల్యా విషయంలో కూడా ఈడీ ఇలాంటి ప్రయత్నమే చేయగా అందుకు చట్టపరంగా అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో కోర్టు ద్వారా యూకే ప్రభుత్వానికి లేఖ పంపేదుకు ఈడీ సిద్ధమవుతోంది. -
అనురాగ్ పై లలిత్ మోదీ తీవ్ర వ్యాఖ్యలు
లండన్:ఆర్థిక నేరారోపణలతో దేశం విడిచి పారిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనురాగ్ ఠాకూర్ కు సంబంధించిన క్రికెటింగ్ పత్రాలు నకిలీవంటూ లలిత్ మోడీ విమర్శించారు. అసలు భారత క్రికెట్ లో ఫిక్సర్లు ఎవరైనా ఉన్నారంటే అది బోర్డు అధ్యక్షుడు అనురాగేనని ధ్వజమెత్తారు. లోధా కమిటీ సిఫారుసుల అమలు విషయంలో ఇప్పటికే బీసీసీఐ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే లలిత్ మోదీ ఆ అంశాన్ని తన ఆయుధంగా చేసుకుని అనురాగ్ పై విమర్శలు గుప్పించారు. ఒక సెలక్టర్ కావడానికి కేవలం ఒకే రంజీ ట్రోఫీ గేమ్ ఎలా ఆడావో అనే దానిపై సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నావా?అని లలిత్ చమత్కరించారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో అనురాగ్ రియల్ ఫిక్సర్ అయితే, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ఒక మోసగాడంటూ లలిత్ మోదీ విమర్శించారు. -
లలిత్ మోదీ వారసుడొస్తున్నాడు..
జైపూర్: ఐపీఎల్ బహిష్కృత చైర్మన్ లలిత్ మోదీ కుమారుడు రుచిర్ క్రికెట్ రాజకీయాల్లో క్రీయాశీలకం కానున్నాడు. ఇటీవల అల్వార్ జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన 22 ఏళ్ల రుచిర్.. రాజస్థాన్ క్రికెట్ సంఘం (ఆర్సీఏ) అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆర్సీఏ ఎన్నికల్లో గెలిస్తే లలిత్ మోదీ స్థానంలో రుచిర్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతాడు. ప్రస్తుతం ఆర్సీఏ అధ్యక్షుడు లలిత్ మోదీనే. కాగా ఐపీఎల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొన్న లలిత్ మోదీ ఆర్సీఏ అధ్యక్షుడు కావడంపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆర్‌సీఏను సస్పెండ్ చేసింది. మోదీ పదవి నుంచి తప్పుకున్న తర్వాతే సస్పెన్షన్‌ను ఎత్తివేస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. అంతేగాక మూడేళ్లుగా ఆర్సీఏకు అన్ని రకాల నిధులను ఆపివేసింది. ఈ నేపథ్యంలో మోదీ అనుచరులు రుచిర్ను తెరపైకి తీసుకువస్తున్నారు. ఆర్సీఏ అధ్యక్షుడిగా రుచిర్ ఎన్నికైతే బీసీసీఐ సస్పెన్షన్‌ను తొలగించకతప్పదని మోదీ మద్దతుదారులు భావిస్తున్నారు. లలిత్ మోదీ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉంటున్నాడు. -
లలిత్ మోదీ.. బ్రిటన్ టూ కరీబియన్!
లండన్:ఆర్థిక నేరారోపణలతో భారత్ నుంచి బ్రిటన్‌కు పారిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మాజీ చైర్మన్ లలిత్ మోదీ చట్టం నుంచి తప్పించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. భారత్ లో అతనిపై ఉచ్చు బిగుసుకోవడంతో బ్రిటన్ నుంచి కరీబియన్‌కు వెళ్లి అక్కడ పౌరసత్వాన్ని పొందేందుకు యత్నిస్తున్నారు. దీనిలో భాగంగా సెయింట్ లూసియా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ పెట్టుబడుల స్కీమ్ ద్వారా కరీబియన్ పౌరసత్వాన్ని పొందాలని భావిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత తక్కువ మొత్తంలో పన్ను చెల్లించే వెసులుబాటు సెయింట్ లూసియాలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. దాంతో పాటు సెయింట్ లూసియానాలో బ్యాంకింగ్ స్టాండర్డ్స్ అత్యంత గోప్యత కల్గి ఉండటం కూడా అక్కడ పౌరసత్వంపై మోదీ ఆసక్తి కనబరచడానికి మరో కారణం. తన కుటుంబంతో కలిసి సెయింట్ లూసియా పౌరసత్వానికి మోదీ దరఖాస్తు చేసినట్లు జాతీయ మీడియాలో వెలుగు చూసింది. కాగా, వివాదాస్పద లలిత్ మోదీ తమ దేశ పౌరసత్వానికి దరఖాస్తు చేయడంపై సెయింట్ లూసియా ఇంటర్ పోల్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అతనిపై ఏ విధమైన క్రిమినల్ కేసులు లేవని స్పష్టత వచ్చిన పక్షంలోనే తమ దేశ పౌరసత్వాన్ని ఇవ్వాలని సెయింట్ లూసియా భావిస్తోంది. -
లలిత్ మోదీ, ఆయన భార్యకు నోటీసులు
బెర్న్: భారత విచారణ బృందాలకు సమాచారం అందించే అంశంలో ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ, ఆయన భార్య మినాల్‌ల నుంచి సమాధానం కోరుతూ స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ విభాగం(ఎఫ్‌టీఏ) గెజిట్ నోటిఫికేషన్లను జారీచేసింది. దౌత్య సహకారం కోసం సోమవారం జారీ చేసిన ఈ నోటిఫికేషన్లలో ఒకటి లలిత్ మోదీకి, మరొకటి మినాల్ మోదీ అలియాస్ మినాలినీ మోదీకి పంపారు. వీటిపై స్పందించేందుకు వారికి పదిరోజుల గడువునిచ్చారు. స్విట్జర్లాండ్‌లో వారిద్దరికి సంబంధించిన అధికార ప్రతినిధుల పేర్లను తెలపాలంటూ అందులో కోరారు. మరికొద్ది రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ పర్యటన నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. -
'బీజేపీ మద్దతుతోనే మాల్యాకు ఎంపీ సీటు'
న్యూఢిల్లీ: బ్యాంకులను బురిడీ కొట్టించి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాను స్వదేశానికి రప్పించాలని రాజ్యసభలో విపక్షాలు గట్టిగా డిమాండ్ చేశాయి. ఆర్థిక మోసాలకు పాల్పడిన ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీని స్వదేశానికి తీసుకురావాలని సభలో ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారి జీరో అవర్ లో ఈ అంశాన్ని లేవనెత్తారు. బీజేపీ మద్దతుతోనే మాల్యా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన విషయాన్ని గుర్తు చేశారు. ఈ అంశంపై చర్చకు పట్టుబట్టారు. తర్వాత కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకువచ్చి నినాదాలు చేశారు. తివారి ఇచ్చిన నోటీసును రాజ్యసభ చైర్మన్ హమిద్ అన్సారీ తిరస్కరించారని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ తెలిపారు. ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి నివేదించినట్టు చెప్పారు. అయినా కాంగ్రెస్ సభ్యులు శాంతించలేదు. విజయ్ మాల్యా, లలిత్ మోదీలను స్వదేశానికి రప్పించాల్సిందేనని నినాదాలతో సభను హోరెత్తించారు. దీంతో ప్రశ్నోత్తరాలకు ముందే సభను కొద్ది నిమిషాల పాటు వాయిదా వేశారు. -
సీఎంకు, ఆమె తనయుడికి పెద్ద ఊరట
జైపూర్: ధోల్పూర్ రాజసౌధం వివాదంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కు ఊరట లభించింది. ఈ వివాదంపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ధోల్పూర్ రాజసౌధం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి అని దీనిపై సీబీఐ విచారణ జరపించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణకు ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ధోల్పూర్, లలిత్ గేట్ వివాదంలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్న ముఖ్యమంత్రికి, ఆమె కుమారుడు దుష్యంత్ కు పెద్ద ఊరట లభించిట్టే. కాగా ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీతో కుమ్మక్కయి దానిని భారీస్థాయి లగ్జరీ హోటల్‌గా మార్చారన్న కాంగ్రెస్ విమర్శించింది. ఆ సౌధం రాజస్తాన్ ప్రభుత్వ ఆస్తి అని రాజే మాజీ భర్త హేమంత్‌సింగ్ ఒక కోర్టులో అంగీకరించారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. అయితే దీన్ని ఈ విమర్శలను తిప్పి కొట్టిన బీజేపీ ధోల్ పూర్ ప్యాలెస్ వసుంధరా రాజే కుమారుడు దుష్యంత్ సింగ్ ఆస్తిగా స్పష్టం చేసింది. ఆ ప్యాలెస్ కు చెందిన డాక్యుమెంట్లను, కోర్టు, కుటుంబ సంబంధిత సెటిల్ మెంట్ పేపర్లను బీజేపీ మీడియా ఎదుట ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
ఆర్సీఏలోకి మళ్లీ లలిత్ మోడి!
జైపూర్: వివాదాస్పద ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి.. మళ్లీ రాజస్తాన్ క్రికెట్ సంఘం (ఆర్సీఏ) పగ్గాలు చేపట్టనున్నారు. ఈ మేరకు అతనిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని అమిన్ పఠాన్ బుధవారం అధికారికంగా వెనక్కి తీసుకున్నారు. ఈ విషయంపై జస్టిస్ జ్ఞాన్ సుధ మిశ్రా.. ఆర్సీఏ అధికారులతో కలిసి చర్చించారు. ‘క్రికెట్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 15 జిల్లా సంఘాలు, ముగ్గురు ఆఫీస్ బేరర్లు మోడిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇక నిబంధనల ప్రకారం తీర్మానంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నిబంధనల ప్రకారం ఎన్నికైన మోడి తిరిగి బాధ్యతలు స్వీకరించొచ్చు. ఈ సమావేశానికి అన్ని సంఘాలు, బేరర్లు హాజరయ్యారు. పఠాన్ దరఖాస్తును వెనక్కి తీసుకోవడానికి అందరూ మద్దతిచ్చారు’ అని మిశ్రా పేర్కొన్నారు. గతంలో ఆర్‌సీఏను తమ ఆధీనంలో తీసుకోవాలని పఠాన్ వర్గం... తీర్మానం సందర్భంగా మోడి గ్రూప్‌పై రాళ్ల వర్షం కురిపించింది. అయినప్పటికీ 2/3 మెజారిటీని సాధించడంలో విఫలమయ్యారు. -
నవంబర్ 29న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
నవంబర్ 29 హ్యాపీ బర్త్ డే రమ్య (నటి), లలిత్ మోడి (బిజినెస్‌మేన్), ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. ఇది గురుసంఖ్య కాబట్టి వీరు ఈ సంవత్సరమంతా సుఖ సంతోషాలతో, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. కార్యదక్షులుగా పేరుతెచ్చుకుంటారు. ఉద్యోగులకు మంచి సలహాదారులుగా గుర్తింపు వస్తుంది. సమాజంలో గౌరవం, కుటుంబంలో మీ మాటకు విలువ ఏర్పడతాయి. విద్యార్థులు వారు కోరుకున్న కోర్సులలో సీట్లు పొందుతారు. జ్యోతిష్యులు, న్యూమరాలజిస్టులు, వేదపండితులు గుర్తింపును, పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. రచయితలు, వక్తలు, సంగీత క ళాకారులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి. పుట్టిన తేదీ 29 ఇది చంద్రుని సంఖ్య కాబట్టి ఈ సంవత్సరం విదేశీ యానం, స్థిరాస్తుల కొనుగోలు లేదా అభివృద్ధి జరుగుతుంది. 29 సంవత్సరాలు దాటిన వారికి మంచి మార్పులు వస్తాయి. అయితే ఇతర కులస్థులతో ప్రేమలో ఉన్న వారికి అంతగా ఫలప్రదంగా ఉండదు కాబట్టి తగిన జాగ్రత్త అవసరం. రాజకీయాలలో ఉన్న వారికి పదవీ యోగం. ఉద్యోగస్థులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. వ్యాపారులకు ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు, సబ్సిడీలు అందుతాయి. లక్కీ నంబర్స్: 1,2,3,6,9; లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, క్రీమ్, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: సోమ, గురు, శుక్రవారాలు. సూచనలు: ఈశ్వరునికి రుద్రాభిషేకం, దక్షిణామూర్తి, సాయిబాబా, దత్తాత్రేయుడు వంటి వారిని ఆరాధించడం, పండితులను, మతగురువులను గౌరవించడం, అనాథలను, సోదరులను, తల్లిని ఆదరించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
ఆ మోదీ గురించి ఈ మోదీ ఏం చేస్తారు?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడు రోజుల పర్యటనకు బ్రిటన్ వెళ్లారు. మరి ఆయన కళంకిత క్రికెట్ బాస్ లలిత్ మోదీని భారత్‌కు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తారా? అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఐఎపీఎల్ అవినీతి వ్యవహారంలో దేశంలో పలు కేసులను ఎదుర్కొంటున్న లలిత్ మోదీ 2010 నుంచి లండన్‌లో నివసిస్తున్నారు. 'గత విదేశీ పర్యటనల ద్వారా సెల్ఫీలు తీసుకోవడం, బ్రాండ్ మోదీని పెంపొందించుకోవడం తప్ప దేశానికి సాధించింది ఏమీ లేదని విశ్లేషణలు చాటుతున్నాయి' అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా అన్నారు. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీని భారత్‌కు తిరిగి రప్పించకపోతే.. చిన్న మోదీకి పెద్ద మోదీ సహాయం చేస్తున్నారని దేశ ప్రజలు భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రయాణ పత్రాలు పొందడంలో లలిత్ మోదీకి విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ సహకరించారనే ఆరోపణలపై మరోసారి పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటారా? అన్న ప్రశ్నకు.. లలిత్ మోదీని భారత్‌కు తీసుకొచ్చి విచారణ జరిపితే.. ఆ అవసరం రాదని సుర్జేవాలా పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. -
’లలిత్ మోదీకి దావూద్‌తో సన్నిహిత సంబంధాలు’
-
'అతను మాకు కావాలి.. మీరు బహిష్కరించండి'
న్యూఢిల్లీ: దేశంలో సంచనలం సృష్టించిన లలిత్ గేట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు లలిత్ మోదీని వెంటనే బ్రిటన్ నుంచి బహిష్కరించాలని నాటి ఆర్థిక మంత్రి పీ చిదంబరం బ్రిటన్ కు లేఖ రాసినట్లు తెలిసింది. సమాచారం హక్కు చట్టం ద్వారా ఓ వ్యక్తి ఈ విషయంపై వివరణ కోరగా ఈ వివరాలు తెలిశాయి. భారీ కుంభకోణం అనంతరం 2010 నుంచి లలిత్ మోదీ బ్రిటన్ లోనే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే, ఆయనను వెనక్కి రప్పించేందుకునాటి కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నించిందని చిదంబరం లేఖ ద్వారా తెలుస్తోంది. ఆ లేఖలో.. తప్పు చేసిన అపరాధి అయిన మోదీని ఇక ఎక్కువ రోజులు బ్రిటన్‌లో ఎక్కువ రోజులు ఉండనివ్వాలని అనుకోవడం లేదని, అతడిని తిరిగి వెనక్కి రప్పించే కార్యకలాపాలు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉన్నందున వెంటనే బ్రిటన్ నుంచి బహిష్కరించాలని చిదంబరం విజ్ఞప్తి చేశారు. ఆయనపై ఉన్న తీవ్రమైన నేరాల కేసుల విచారణను భారత్ లోని కీలక విచారణ సంస్థలు పనిచేస్తున్నాయని కూడా అందులో ప్రస్తావించారు. ఆయన పాస్ పోర్టును చట్ట వ్యతిరేకమైనదిగా తాము గుర్తించినందున ఎక్కువకాలంపాటు ట్రావెలింగ్ డాక్యుమెంట్స్ పనిచేసే అవకాశం ఉండదని, అయినా అతడు బ్రిటన్ లో ఉంటున్నాడని, వెంటనే అక్కడి నుంచి బహిష్కరించాలని విన్నవించారు. ఇలాంటి తప్పిదాల పేరుతో గతంలో 3000మంది ఇండియన్స్ ను బ్రిటన్ నుంచి బహిష్కరించిన విషయం కూడా చిదంబరం గుర్తు చేశారు. దీనికి బ్రిటన్ స్పందించి తిరిగి బదులు సమాధానం కూడా ఇచ్చింది. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయినా, ఇప్పటివరకు బ్రిటన్ ఈ విషయంలో చర్యలు తీసుకోకపోవడం వెనుక మతలబు ఏమిటో తెలియాలి. -
'మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు ఎందుకు ?'
న్యూఢిల్లీ: ఇంటర్ పోల్ నుంచి ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు చుక్కెదురైంది. లలిత్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు ఎందుకు జారీ చేయాలనుకుంటున్నారో చెప్పాలని ఇంటర్ పోల్ ఈడీని ప్రశ్నించింది. ఈ మేరకు గత నెల 20న ఇంటర్ పోల్ నుంచి ఈడీకి ఓ లేఖ కూడా అందింది. ఆర్థిక నేరారోపణలతో విదేశాలకు పారిపోయిన ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి అతడిని తిరిగి వెనక్కి రప్పించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు ముందుకు కదిలిన విషయం తెలిసిందే. ఈడీ కూడా లలిత్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సీబీఐని కోరింది. దీంతో ఆ నోటీసులు జారీచేసే విషయంలో ఇంటర్ పోల్‌ను సంప్రదించింది. ఈ నేపథ్యంలో ఏప్రాతిపదికన ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తారో చెప్పాలంటూ ఇంటర్ పోల్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
మనోహర్‌తో మోదీ సంప్రదింపులు
ముంబై : ఐపీఎల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఇంగ్లండ్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న లలిత్ మోదీ.. తెర వెనుక మాత్రం తన ప్రయత్నాలు ఆపడం లేదు. తనకు బద్ద శత్రువుగా భావించే ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ వ్యతిరేకులతో నిత్యం సంప్రదింపులు చేస్తున్నట్టు వెల్లడయ్యింది. శ్రీనికి ముందు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న శశాంక్ మనోహర్‌తో ఈమెయిల్స్ ద్వారా మోదీ టచ్‌లో ఉన్నట్టు తేలింది. గురునాథ్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారం బయటపడినప్పుడు ఆ జట్టును రద్దు చేయాల్సిందిగా ఒత్తిడి పెంచాలని మనోహర్‌కు సూచించారు. ‘జరుగుతున్న వ్యవహారం మీకు తెలిసిందే. ‘సాహిబ్’ (శరద్ పవార్)కు కూడా లండన్‌లో ఈ విషయాలను తెలిపాను. నా అభిప్రాయం ప్రకారం చెన్నై, రాజస్తాన్ జట్లను లీగ్ నుంచి తొల గించాలని అంతా ఒత్తిడి తేవాలి. తిరిగి కొత్త యజమానుల కోసం తాజాగా వేలం జరగాలి’ అని 2013లో పంపిన మెయిల్లో మోదీ పేర్కొన్నారు. మనోహర్ నుంచి కూడా మెయిల్స్ వెళ్లినట్టు సమాచారం. అలాగే శ్రీనిపై సుప్రీం కోర్టులో కేసు వేసిన బిహార్ క్రికెట్ సంఘం కార్యదర్శి ఆదిత్య వర్మకు కూడా తాను ఆర్థిక సహాయం చేసినట్టు లలిత్ మోదీ గతంలోనే పేర్కొన్నారు. అయితే మనోహర్ మాత్రం తనకు మోదీ నుంచి ఎలాంటి మెయిల్స్ రాలేదని చెబుతున్నారు. -
స్పీకర్‌పై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది..
అందుకే సమావేశాల చివర్లో లలిత్ మోదీ అంశంపై చర్చ: కాంగ్రెస్ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా లలిత్ మోదీ అంశంపై పార్లమెంట్ సమావేశాల చివర్లో చర్చ చేపట్టిందని కాంగ్రెస్ విమర్శించింది. లలిత్‌గేట్, వ్యాపం స్కాంలపై ప్రతిపక్షాలు ఆందోళన చేస్తాయని తెలిసే ఆ విషయంపై చివరి వరకూ ప్రభుత్వం చర్చను చేపట్టలేదని ఆరోపించింది. ప్రభుత్వం ఒత్తిడి చేయబట్టే మరో రోజులో సమావేశాలు ముగుస్తాయనగా లలిత్ వ్యవహారంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్చకు అనుమతిచ్చారని విమర్శించింది. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మలికార్జున ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులామ్ నబీ ఆజాద్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వర్షాకాల సమావేశాలు ప్రారంభం నుంచి వాయిదా తీర్మానం ద్వారా తాము చర్చకు పట్టుబడితే తిరస్కరించిన స్పీకర్.. మరో రోజులో సమావేశాలు ముగుస్తాయనగా అదే వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతివ్వడం ఆశ్చర్యపరిచిందన్నారు. దీనిని బట్టే స్పీకర్‌పై ప్రభుత్వం ఏ మేరకు ఒత్తిడి తెచ్చిందనేది అర్థమవుతుందన్నారు. మంత్రి సుష్మ వినతి, మరో మంత్రి వెంకయ్య మద్దతుతో వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టారని చెప్పారు. ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో అప్పటికప్పుడు చర్చకు స్పీకర్ అంగీకరించారన్నారు. తమ సాయంతో పలు బిల్లులు పాస్ అయ్యాయని, కానీ ప్రభుత్వం ఇప్పుడు తమను లక్ష్యంగా చేసుకుందన్నారు. తమ పార్టీని బ్రిటిష్ సామ్రాజ్యమే ఏమీ చేయలేకపోయిందని, బీజేపీ ఎంతని పేర్కొన్నారు. -
'ఇటలీ మాఫియారాణికి డబ్బు ఇచ్చి ఉండాల్సింది'
పార్లమెంటులో చర్చ మొత్తం తనమీదే సాగుతున్న తరుణంలో.. లలిత్ మోదీ మరో బాంబు పేల్చారు. ఇటాలియన్ మాఫియా రాణికి తాను డబ్బు ఇచ్చి ఉండాల్సిందని, ఆ డబ్బును తనకు అప్పు ఇవ్వాల్సిందిగా వరుణ్ గాంధీని అడిగి ఉండాల్సిందని ట్వీట్ చేశారు. ఇటాలియన్ ఆంటీకి లలిత్ మోదీ 400 కోట్ల రూపాయలు ఇచ్చి ఉంటే.. ఈరోజు పార్లమెంటు సజావుగా సాగి ఉండేదంటూ ఓ ఫాలోవర్ ఇచ్చిన ట్వీట్‌కు సమాధానంగా లలిత్ మోదీ స్పందించారు. తనకు ఓ కప్పు టీ కోసం సంతకం చేసేంత శక్తి లేదని, కేవలం డబ్బు తీసుకొచ్చే శక్తి మాత్రమే ఉందని తెలిపారు. అయితే అలా తాను తెచ్చిన డబ్బును క్రికెట్ మాఫియా ఖర్చు పెడుతుందని వ్యాఖ్యానించారు. తాను 1987లో వ్యాపారం మొదలు పెట్టినప్పుడు.. శ్రేయోభిలాషులు ముందుగా వెళ్లి నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని కలిసి ఓ కప్పు టీ తాగాలని చెప్పారని లలిత్ మోదీ ట్వీట్ చేశారు. తనను అక్కడకు కెప్టెన్ సతీష్ శర్మ తీసుకెళ్లారని, కావాలంటే ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకోడానికి ప్రధానమంత్రి ఇంటి రికార్డులు సరిచూసుకోవచ్చని సవాలు చేశారు. తర్వాత కెప్టెన్‌కు సూట్‌కేసు ఇవ్వాల్సిందిగా చెప్పారని, తాను అలాగే ఇచ్చినని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు వ్యాపారం అలా చేస్తారని లలిత్ మోదీ తెలిపారు. కావాలంటే వాళ్లు దీన్ని ఖండించుకోవచ్చని.. అయితే ఏదైనా చేసేముందు ప్రధాని ఇంటి రికార్డులు చెక్ చేసుకోవాలని అన్నారు. తన ఎంట్రీ అందులో రికార్డు అయి ఉంటుందని స్పష్టం చేశారు. కావాలంటే కెప్టెన్ లేదా ఇటాలియన్ దీన్ని ఖండించుకోవచ్చన్నారు. ఇక ఎవరైనా ఢిల్లీలోని సతీష్ శర్మ ఇంటికి వెళ్తే, ఆయన వాళ్లను గర్వంగా ఒక గదిలోకి తీసుకెళ్లి చూపిస్తారని, అందులో కింద ఫ్లోర్ దగ్గర నుంచి సీలింగ్ వరకు అంతా డబ్బు నిండి ఉంటుందని లలిత్ మోదీ ఆరోపించారు. True. I should have asked @varungandhi80 to loan it to me. Then all would have been happy and Italian mafia queen -
లలిత్ మోదీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఐపీఎల్ బహిష్కృత చైర్మన్ లలిత్ మోదీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకాకుండా లండన్‌లో తలదాచుకుంటున్న మోదీని భారత్ రప్పించే ప్రయత్నాలను వేగవంతం చేశారు. మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఈడీ.. సీబీఐని కోరింది. ఈ విషయంపై సీబీఐ ఇంటర్‌పోల్‌ను సంప్రదించనుంది. త్వరలో మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే అవకాశముంది. ఇదే కేసులో ఇటీవల ప్రత్యేక పీఎమ్ఎల్ఏ కోర్టు మోదీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాక 2010లో మోదీ లండన్‌కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి భారత్‌కు తిరిగి రాని మోదీ ఈడీ విచారణకు సహకరించడం లేదు. -
ICCపై లలిత్ మోది తిరుగుబాటు!
-
ఐసీసీకి పోటీగా మరో వ్యవస్థ
బ్లూ ప్రింట్ సిద్ధంగా ఉంది లలిత్ మోదీ ప్రకటన లండన్: ఐపీఎల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రవాస జీవితం గడుపుతున్న లలిత్ మోదీ.. బీసీసీఐని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నాలు మానడం లేదు. బోర్డుచేత జీవిత కాల నిషేధం ఎదుర్కొంటున్న తను తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి సమాంతరంగా మరో వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు బ్లూప్రింట్ సిద్ధం చేసినట్టు ప్రకటించారు. అయితే ఇందులో టెస్టులు, టి20 ఫార్మాట్ మాత్రమే ఉంటుందని.. వన్డే క్రికెట్‌ను తొలగిస్తున్నట్టు చెప్పారు. ఈ కొత్త బాడీ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి అనుబంధంగా వ్యవహరిస్తుందని కూడా తెలిపారు. అయితే గతంలోనే ఐసీసీకి సమాంతరంగా మరో వ్యవస్థ రానుందని వార్తలు వచ్చినప్పుడు అందులో తన భాగస్వామ్యాన్ని మోదీ ఖండించారు. ‘నేనిప్పుడు మరో క్రికెట్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. బ్లూ ప్రింట్ కూడా సిద్ధంగా ఉంది. ఇప్పటికే నా ఆమోద ముద్ర కూడా పడిపోయింది. నేనిందులో పూర్తిగా భాగస్వామ్యమయ్యానని తొలిసారిగా చెబుతున్నాను. త్వరలోనే ఆమల్లోకి తెస్తాం. అయితే ఇందుకోసం వందల కోట్ల డాలర్లు ఖర్చు అవుతాయి. కానీ ఇది పెద్ద సమస్య కాదనే అనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పుడున్న ఐసీసీలో సంస్కరణలు ప్రారంభమైతేనే నా పథకం విఫలమవుతుంది. ఈ బ్లూ ప్రింట్ అమల్లోకి రావద్దనే ఆశిస్తున్నాను. అయితే ఐసీసీ మారకపోతే మాత్రం మేమనుకున్న కొత్త వ్యవస్థ సంచలనం సృష్టించడం ఖాయం’ అని ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత్ మోదీ స్పష్టం చేశారు. ఐసీసీ కూడా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) గుర్తింపు పొందాలని ఆయన సూచించారు. తానెప్పటి నుంచో ఈ మాట చెబుతున్నా వారు వినడం లేదని, ఐపీఎల్ కూడా తన మార్కెటింగ్ చాతుర్యంతోనే విజయవంతమయిందని మోదీ గుర్తుచేశారు. -
అందుకే తీసేశారా!
ఇటీవల భారత జట్టు జింబాబ్వేలో మూడు వన్డేలు, రెండు టి20ల సిరీస్ ఆడిన విషయం గుర్తిందిగా. ఆ పర్యటనకు అజింక్య రహానేను కెప్టెన్‌గా ఎంపిక చేసిన విషయమూ తెలిసిందే. తనలో నాయకత్వ లక్షణాలు ఎలా ఉన్నాయో పరిశీలించడానికి రహానేను ఎంపిక చేశామని ఆనాడు చెప్పారు. కానీ వాస్తవం అది కాదట. సురేశ్ రైనాను ఈ సిరీస్‌కు కెప్టెన్‌ను చేద్దామని తొలుత భావించారు. అయితే సరిగ్గా జట్టు ఎంపిక కోసం సెలక్టర్లు సమావేశమైన రోజే... ఓ వార్త బయటకు వచ్చింది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి రైనా, జడేజా, బ్రేవో డబ్బులు తీసుకున్నారంటూ లలిత్ మోదీ ఐసీసీకి ఓ లేఖ రాశారు. ఆ విషయం బయటకు రావడంతో సెలక్టర్లు రక్షణాత్మక ధోరణిలో వ్యవహరించారు. ఎందుకైనా మంచిదని రైనాకు విశ్రాంతి ఇచ్చి రహానేకు పగ్గాలు అప్పజెప్పారు. అయితే లలిత్ మోదీ లేఖలో వాస్తవాలు లేవంటూ ఐసీసీ దీనిని కొట్టి పారేసింది. కానీ పాపం రైనా. భారత జట్టుకు మరోసారి సారథిగా వ్యవహరించే అవకాశం కోల్పోయాడు. -
రైనా 'రెస్ట్' వెనుక 'పెద్ద' కథే నడిచిందట!
గత నెల జింబాబ్వేలో పర్యటించిన భారత జట్టులో సభ్యుల ఎంపిక, కెప్టెన్సీ ఎవరికి కట్టబెట్టాలనే నిర్ణయాల వెనుక పెద్ద కథే నడిచినట్లు తెలిసింది. నిజానికి ఆ పర్యటనకు టీమిండియా కెప్టెన్‌గా సురేశ్ రైనా పేరును సెలక్షన్ కమిటీ ఖరారు చేసింది. కానీ చివరి నిమిషంలో బీసీసీఐలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ పెద్ద మనిషి ఒత్తిడి మేరకు రైనాకు రెస్ట్ ఇచ్చి అజింక్యా రహానేను కెప్టెన్‌గా ప్రకటించింది. జింబాబ్వే టూర్‌కు జట్టును ఎంపిక చేసేందుకు సెలక్షన్ కమిటీ జూన్ 29న ముంబైలో సమావేశమైంది. సీనియర్లకు విశ్రాంతి కల్పించడంతోపాటు యువ జట్టును సిద్ధం చేసి.. వారికి సారధిగా రైనాను ఎంపికచేశారు. కానీ బీసీసీఐ పెద్ద రాకతో సీన్ రివర్సయింది. రైనాకు కెప్టెన్సీ వద్దని, ఇతర సీనియర్లలాగే అతనికి కూడా రెస్ట్ ఇవ్వమని సెలక్షన్ కమిటీని ఒత్తిడి చేశాడట ఆ పెద్దమనిషి. మరోదారిలేని సెలెక్టర్లు ఆయన చెప్పినట్లే రైనాకు విశ్రాంతినిచ్చారు. ఎందుకిలా చేశారంటే.. సెలక్షన్ కమిటీ సమావేశానికి సరిగ్గా రెండురోజుల ముందు ఐపీఎల్ స్కాంస్టర్ లలిత్ మోదీ ఓ సంచనల ట్వీట్ వదిలాడు. 'చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడే సురేశ్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, డ్వెయిన్ బ్రావోలు ఓ రియల్ ఎస్టేట్ దిగ్గజం నుంచి ముడుపులు తీసుకుని ఫిక్సింగ్ కు పాల్పడ్డారు' అని మోదీ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. దీంతో రైనాపై నమ్మకం సడలిందని, ప్రస్తుత పరిస్థితుల్లో అతనికి కెప్టెన్సీ కట్టబెట్టడం అంగీకారం కాదని బీసీసీఐ పెద్దలు భావించారట. అదే విషయాన్ని తమ సహచరుడి ద్వారా సెలక్షన్ కమిటీకి చెప్పించారట. ఆ సందర్భంలోనే 'సెలక్షన్ కమిటీ నిర్ణయాం వెనుక లలిత్ మోదీ ట్వీట్ ప్రభావమేమైనా ఉందా?' అనే ప్రశ్నకు బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ బదులిస్తూ 'రైనా అంతర్జాతీయ స్థాయి ఆటగాడు కనుక ఐసీసీయే అతడి వ్యవహార్ని పర్యవేక్షిస్తుంది' అని చెప్పడం, రైనా కూడా 'నేను ఎలాంటి తప్పుచేయలేదు. ఆటే ప్రాణంగా శ్వాసించాను' అని ప్రకటించడం తెలిసిందే. -
రెండు నెలలుగా మీడియాలో నాపై దుష్ప్రచారం
-
రెండు నెలలుగా మీడియాలో నాపై దుష్ప్రచారం
న్యూఢిల్లీ: లలిత్ గేట్ వ్యవహారంపై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ గురువారం లోక్‌సభలో ఆవేశంగా ప్రసంగించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆమె కొట్టి పారేశారు. లలిత్ మెదీ విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. లలిత్ మోదీ కోసం తాను బ్రిటన్ ప్రభుత్వానికి ఎలాంటి సిఫార్సు చేయలేదన్నారు. సిఫార్సు చేసిన ఆధారాటు ఉంటే బయటపెట్టాలని, తనపై ఆరోపణలకు సంబంధించి చర్చ జరగాలన్నారు. లలిత్ గేట్‌పై కాంగ్రెస్ తో చర్చకు తాను సిధ్దమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో చర్చకు తాను సిద్ధమే అని, వారి ప్రశ్నలకు సమాధానం ఉందని తెలిపారు. రెండు నెలలుగా తనపై మీడియాపై దుష్ప్రచారం జరుగుతుందని సుష్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆరోపణలను తన దగ్గర ధీటైన సమాధానం ఉందని పేర్కొన్నారు. తన స్థానంలో సోనియా గాంధీ ఉంటే ఏం చేసేవారని సుష్మా స్వరాజ్ ప్రశ్నించారు. లలిత్ మోదీకి సంబంధించిన అంశాన్ని బ్రిటన్ ప్రభుత్వానికే వదిలేశానని, సిఫార్స్ చేసినట్లు ఉన్న మెయిల్, లేఖ ఉంటే చూపించాలని సుష్మా స్వరాజ్ ప్రశ్నల వర్షం కురిపించారు. -
లలిత్ మోదీపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరుకాకుండా లండన్‌లో తలదాచుకుంటున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల విన్నపం మేరకు బుధవారం ప్రత్యేక పీఎమ్ఎల్ఏ న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది. ఐపీఎల్ కమిషనర్‌గా పనిచేసిన కాలంలో మోదీ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్ కేసులో ఈడీ మోదీపై కేసు నమోదు చేసింది. కాగా ఐపీఎల్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురికావడం, కేసులు నమోదు కావడంతో మోదీ లండన్ పారిపోయారు. 2010 నుంచి మోదీ లండన్‌లోనే ఉంటున్నారు. విచారణకు హాజరు కావాలని గతంలో ఈడీ సమన్లు పంపినా.. తనకు భారత్‌లో ప్రాణభయం ఉందంటూ మోదీ రాలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కోర్టు వారెంట్ జారీ చేసింది. -
లలిత్ కోసం సిఫారసు చేయలేదు
రాజ్యసభలో సుష్మా స్వరాజ్ స్పష్టీకరణ * సుష్మా ప్రకటనపై కాంగ్రెస్ అభ్యంతరం న్యూఢిల్లీ: లలిత్ మోదీ విషయంలో తనపై గత కొంతకాలంగా వస్తున్న విమర్శలమీద విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఎట్టకేలకు మౌనం వీడారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆమె సోమవారం రాజ్యసభలో ఖండించారు. వివాదాస్పదుడైన ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి ప్రయాణ పత్రాలు ఇవ్వాల్సిందిగా తాను బ్రిటన్ ప్రభుత్వానికి ఎలాంటి సిఫారసు చేయలేదని స్పష్టంచేశారు. ఈ విషయంలో విపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. లలిత్ అంశంపై కాంగ్రెస్ సభ్యులు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండగా, కొద్దిసేపు ఆమె మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. అయితే పెద్ద ఎత్తున గందరగోళం చెలరేగడంవల్ల రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను వాయిదా వేయడంతో ఆమె తన వాదనను పూర్తిగా చెప్పలేకపోయారు. అంతకు ముందు కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణివల్లే సభ సజావుగా సాగడం లేదని, లలిత్‌గేట్ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రధాని స్పష్టం చేసేవరకు సభ కుదుటపడదని అన్నారు. డిప్యూటీ చైర్మన్ జోక్యంచేసుకుని చర్చ ప్రారంభిస్తేనే ప్రధాని సమాధానం చెప్పడానికి వీలుంటుందని సూచించారు. గందరగోళం నడుమ సభ 12 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి మొదలయ్యాకా అదే పరిస్థితి కొనసాగడంతో ప్రశ్నోత్తరాలు మరోసారి వాయిదాపడ్డాయి. 2గంటలప్పుడు సభ తిరిగి మొదలయ్యాక పరిస్థితిలో మార్పు లేకపోవడంతో చెప్పుకోదగ్గ కార్యక్రమాలేమీ చేపట్టకుండానే రోజు మొత్తానికి వాయిదాపడింది. సుష్మా ప్రకటనపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తంచేసింది. నోటీసు ఇవ్వకుండానే మంత్రి ప్రకటన చేయడం నిబంధనలకు విరుద్ధమని, అది చెల్లదని, దానిని రికార్డుల్లోకి తీసుకోరాదని కాంగ్రెస్ సభ్యులు రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీని కోరారు. -
'మోదీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయండి'
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరుకాకుండా లండన్‌లో తలదాచుకుంటున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీని భారత్ రప్పించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. లలిత్ మోదీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రత్యక న్యాయస్థానాన్ని కోరింది. సోమవారం ప్రత్యేక పీఎమ్ఎల్ఏ న్యాయస్థానంలో ఈడీ తరపు న్యాయవాదులు ఈ మేరకు విన్నవించారు. ఐపీఎల్ కమిషనర్‌గా పనిచేసిన కాలంలో మోదీ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్ కేసులో ఈడీ మోదీపై కేసు కూడా నమోదు చేసింది. ఐపీఎల్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురికావడంతో పాటు కేసులు నమోదు కావడంతో మోదీ లండన్ పారిపోయారు. 2010 నుంచి మోదీ లండన్‌లో ఉంటున్నారు. విచారణకు హాజరు కావాలని గతంలో ఈడీ సమన్లు పంపినా.. తనకు భారత్‌లో ప్రాణభయం ఉందంటూ మోదీ తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోర్టును ఆశ్రయించింది. ఇదిలావుండగా, ఇటీవల లలిత్ మోదీ ట్వీట్లతో బీజేపీ తలనొప్పిగా మారాడు. లలిత్ గేట్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, కేంద్ర మంత్రి విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాంటూ డిమాండ్లు ఊపందుకున్నాయి. వీసా విషయంలో సుష్మా, వసుంధర.. లలిత్ మోదీకి సాయం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇక వసుంధర కుటుంబానికి ఆర్థిక ప్రయోజనం కలిగిందనే విమర్శలూ వచ్చాయి. -
లలిత్ మోదీ కోసం ప్రయాణ పత్రాలు కోరలేదు
సుష్మా స్వరాజ్ స్పష్టీకరణ న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీకి సాయం చేసినట్లు వచ్చిన ఆరోపణల విషయంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తనను సమర్థించుకున్నారు. మోదీకి ప్రయాణ పత్రాలు ఇవ్వాల్సిందిగా తాను ఎవరికీ విజ్ఞప్తి లేదా సిఫార్సు చేయలేదని శనివారం స్పష్టం చేశారు. ఈ విషయంలో విపక్షాలు తన రాజీనామాకు పట్టుబడుతున్న నేపథ్యంలో ఆమె పలు ట్వీట్లు చేశారు. బ్రిటన్‌లో తలదాచుకుంటున్న లలిత్ పోర్చుగల్ వెళ్లేందుకు అనుమతించాలంటూ బ్రిటన్ ఎంపీ కీత్ వాజ్‌తో తాను మాట్లాడినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. మానవతా దృష్టితోనే మోదీకి సాయం చేసినట్లు గతంలో చేసిన స్పందిస్తూ ‘బ్రిటన్ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునేలా ఆ దేశ ప్రభుత్వానికే వదిలేశాను. దీనిపై తొలి రోజునే ట్వీట్ చేశా. నేను ప్రతిరోజూ ప్రజలకు సాయం చేస్తా. అది కూడా ఒకే ట్వీట్ ద్వారా. ఆవిడ (లలిత్ మోదీ భార్య) గత 17 ఏళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్నారు. ఆమెకు కేన్సర్ తిరగబెట్టడం ఇది పదోసారి’ అని సుష్మ పేర్కొన్నారు. -
వారి తీరు దురదృష్టకరం
న్యూఢిల్లీ: పార్లమెంటులో ప్రతిపక్షాల ప్రవర్తన తీరు దురదృష్టకరమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. లలిత్ మోదీ వ్యవహారంపై విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ పార్లమెంటులో ప్రకటన చేస్తారని చెప్పిన కూడా వారు వినకుండా సభా కార్యక్రమాలు అడ్డుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలనీ సుష్మా చెప్తూనే ఉన్నారని, దానికి సంబంధించే ఓ స్పష్టమైన వివరణ ఇస్తానని చెప్తున్నా వినకుండా విపక్షాలు ప్రవర్తిస్తున్న తీరు నిజంగా దురదృష్టమే అని పార్లమెంటు వెలుపల విలేకరులతో చెప్పారు. మరోపక్క, కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాధిత్య సిందియా మాట్లాడుతూ తమ పార్టీ ఇతర పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీవంటివన్నీ కూడా లలిత్ మోదీ వ్యవహారంలో అవినీతికి పాల్పడిన మంత్రులు ఇద్దరు ముఖ్యమంత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం తప్ప తాము ఇంకే కోరడం లేదని అన్నారు. మొత్తం విపక్షమంతా కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా కోరుతున్నాయని అన్నారు. -
'నిజాయితీతో కూడిన తొలి నిర్ణయం'
లండన్: చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పై జట్లపై రెండేళ్ల నిషేధం విధించడాన్నిఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ సమర్ధించాడు. ఇది భారత్ క్రికెట్ లో నిజాయితీతో కూడిన తొలి నిర్ణయంగా పేర్కొన్నాడు. ఈ నిర్ణయం బీసీసీఐకి సిగ్గుచేటని ఎద్దేవా చేశాడు. ఆ రెండు జట్లపై రెండేళ్ల నిషేధం కాదు.. పూర్తిగా నిషేధిస్తే మరింత బాగుండేదన్నాడు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపీఎల్లో కోర్టులు జోక్యం చేసుకోవడంతోనే బీసీసీఐ వైఫల్యం కనబడుతోందన్నాడు. మంగళవారం చెన్నై, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తూ సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రాజేంద్ర మాల్ లోధా సారథ్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ తీర్పు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు నుంచే తీర్పు అమల్లోకి వస్తుందని వస్తుందని ప్రకటించింది. చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ భాగస్వామి రాజ్ కుంద్రాపై జీవితకాల నిషేధం విధించింది. వీరిద్దరూ క్రికెట్ సంబంధిత వ్యవహారాల్లో పాల్గొనకుండా నిషేధం పెట్టింది. మేయప్పన్, కుంద్రా బెట్టింగ్ వ్యవహారాలతో బీసీసీఐ, ఐపీఎల్ తో పాటు క్రికెట్ కు చెడ్డ పేరు వచ్చిందని లోధా కమిటీ పేర్కొంది. -
లలిత్‌కు ‘పద్మ’ సిఫార్సు!
మరో వివాదంలో రాజస్తాన్ సీఎం వసుంధర రాజే రాజేపై విరుచుకుపడ్డ కాంగ్రెస్.. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ జైపూర్: ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ కారణంగా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. లలిత్‌మోదీకి పద్మ పురస్కారం ఇవ్వాలంటూ ఆమె 2007లో కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు ఇప్పుడు బయటకు రావడంతో రాజేకు మరో తలనొప్పి ఎదురైంది. రాజస్తాన్‌లో క్రికెట్ అభివృద్ధికి, అలాగే క్రీడారంగానికి లలిత్ మోదీ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన పేరును పద్మ పురస్కారానికి సిఫార్సు చేయాలని రాజస్తాన్ రాష్ట్ర క్రీడా మండలి(ఆర్‌ఎస్‌ఎస్‌సీ)కి సూచించినట్టుగా బుధవారం వార్తలు వెలువడ్డాయి. అయితే ముఖ్యమంత్రి మీడియా సలహాదారు ఈ అంశంపై స్పందించేందుకు నిరాకరించారు. కాగా, దీనిపై రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్సీఏ) మాజీ గౌరవ కార్యదర్శి సుభాష్ జోషి స్పందిస్తూ.. అప్పట్లో ఆర్సీఏ అధ్యక్షునిగా, బీసీసీఐ ఉపాధ్యక్షునిగా ఉన్న లలిత్ మోదీ పేరును పద్మ అవార్డులకు సిఫార్సు చేసేందుకుగానూ ఆయనకు సంబంధించిన వివరాలు, పత్రాలు అందించాలని జూలై 27, 2007న ఆర్‌ఎస్‌ఎస్‌సీ నుంచి తమకు లేఖ అందిందని చెప్పారు. అనంతరం కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ప్రధాన కార్యదర్శికి ఆర్‌ఎస్‌ఎస్‌సీ పద్మ పురస్కారానికి లలిత్‌మోదీ పేరు సిఫార్సు చేస్తూ ప్రతిపాదన పంపిందని చెప్పారు. అయితే కేంద్రం రాజస్తాన్ ప్రభుత్వ సిఫార్సును పట్టించుకోలేదు. కాగా, ఈ వ్యవహారంలో వసుంధరా రాజేపై రాజస్థాన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సచిన్ పైలట్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో లలిత్‌మోదీ సంస్థాగత అవినీతికి పాల్పడ్డాడని, లలిత్‌మోదీ పేరును పద్మ అవార్డుకు సిఫార్సు చేయడంతో రాజేకు, లలిత్‌మోదీకి ఉన్న బంధం మరోసారి బయటపడిందని చెప్పారు. వసుంధర రాజే తక్షణం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
లలిత్ మోదీకి ఈడీ నోటీసులు
ఢిల్లీ:ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం సమన్లు జారీ చేసింది.మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి విచారణలో భాగంగానే మోదీకి ఈడీ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా బ్రిటన్ లో ఉంటున్న లలిత్ మోదీ.. అనేక మందిపై వివాదాస్పద ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. లలిత్ మోదీకి బ్రిటన్ ట్రావెల్ డాక్యుమెంట్స్ అందేందుకు సుష్మా స్వరాజ్, అంతకుముందు బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ విషయంలో వసుంధర రాజే సహకరించారన్న వార్తలు వెలుగులోకి రావడంతో భారత్ లో రాజకీయ దుమారం లేచిన విషయం తెలిసిందే. -
జీఎస్టీ, భూసేకరణ బిల్లులకు మద్దతివ్వండి..
వృద్ధి, పెట్టుబడుల జోరుకు ఈ చట్టాలు తప్పనిసరి... {పతిపక్షాలకు ఆర్థిక మంత్రి జైట్లీ విజ్ఞప్తి న్యూఢిల్లీ : పెండింగులో ఉన్న వస్తు, సేవల పన్ను(జీఎస్టీ), భూసేకరణ బిల్లులు ఆమోదం పొందేందుకు మద్దతివ్వాల్సిందిగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. వృద్ధి, పెట్టుబడులకు ఊతమివ్వడంతోపాటు భారీగా ఉద్యోగాల సృష్టి, పేదరిక నిర్మూలనకు ఈ రెండు చట్టాలు చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు. ఫేస్బుక్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో లలిత్ మోదీ స్కామ్ తీవ్ర ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ స్కామ్‌తో ఇద్దరు సీనియర్ బీజేపీ నేతల(సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే)కు సంబంధాలున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా, ఇతర విపక్షాలన్నీ మోదీ సర్కారుపై పార్లమెంటులో ధ్వజమెత్తేందుకు సిద్ధమవుతున్నాయి. వచ్చే నెల 13 వరకూ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. కాగా, జీఎస్టీ బిల్లు ప్రస్తుతం రాజ్యసభ సెలెక్ట్ కమిటీ పరిశీలనలో ఉండగా.. భూసేకరణ బిల్లుపై పార్లమెంటు జాయింట్ కమిటీ సంప్రతింపులు జరుపుతోంది. వర్షాకాల సమావేశాల్లోనే రెండు కమిటీలూ తమ నివేదికను అందించే అవకాశం ఉంది. సామాజిక సర్వేపై... గ్రామీణ భారతావనిలో ప్రజల జీవన పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉన్నాయంటూ తాజా సర్వేలో వెల్లడైన అంశాలపై జైట్లీ మాట్లాడుతూ.. ఆర్థిక వృద్ధి రేటును 8-10 శాతానికి పెంచడం కోసం తమ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. జీఎస్టీద్వారా ఏకీకృత మార్కెట్‌ను సృష్టించడం, వ్యాపారాలకు సానుకూల పరిస్థితుల కల్పన, పెట్టుబడులకు మెరుగైన వాతావరణం వంటివి ఇందులో ఉన్నాయని చెప్పారు. పేదలు, సామాజిక పథకాలపై ఆధారపడుతున్నవారికి చేదోడుగా నిలవాలంటే వృద్ధిరేటు పెంపు, ఆర్థిక సంస్కరణలే శరణ్యమన్నారు. బ్రిక్స్ బ్యాంక్ తొలి సమావేశానికి జైట్లీ... ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు రష్యా రాజధాని మాస్కోకు పయనమవుతున్నారు. బ్రిక్స్ బ్యాంక్(న్యూ డెవలప్మెంట్ బ్యాంక్) పాలక మండలి తొలి సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఆతర్వాత మంగళవారంనాడు బ్రిక్స్ దేశాల(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) ఆర్థిక మంత్రుల సమావేశానికి కూడా జైట్లీ హాజరవుతారు. ఈ నెల 8, 9 తేదీల్లో రష్యాలోని ఉఫా నగరంలో నిర్వహిస్తున్న బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు జైట్లీ కూడా పాల్గొంటారు. బ్రిక్స్ బ్యాంకుకు ప్రారంభ నిధులను సమకూర్చే అంశంపై సదస్సులో ప్రధానంగా దృష్టిపెట్టనున్నారు. ఈ బ్యాంకుకు తొలి సారథిగా భారతీయుడైన ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ ఎంపికైన సంగతి తెలిసిందే. -
సుష్మ, రాజే, లలిత్లపై ఫిర్యాదు
పట్నా: విదే శాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్‌మోదీకి వ్యతిరేకంగా పట్నాలోని జిల్లా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ భరత్సింగ్కు శుక్రవారం ఫ్రెండ్ ఆఫ్ బిహారీ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు వినయ్‌కుమార్ ఫిర్యాదు చేశారు. కానీ కోర్టు ఈ కేసులో వాదనలు వినేందుకు శనివారం అనుమతి ఇవ్వలేదు. ఈ కేసు విచారణార్హమా కాదా అనే విషయాన్ని మరో రోజు తేలుస్తామని కోర్టు తెలిపింది. లలిత్ అక్రమాలకు సంబంధించి తన ట్విటర్ ఖాతా ద్వారా ఒకరి పేరు తర్వాత మరొకరి పేరు వెల్లడిస్తూ దేశాన్ని అస్థిరపరచేందుకు ప్రయత్నిస్తున్నారని వినయ్ కుమార్ తన ఫిర్యాదులో ఆరోపించారు. దీనికోసం మీడియాలో వచ్చిన పలు కథనాలను పొందుపరుస్తూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000, ఐసీసీ 120, 124 సెక్షన్ల కింద ఆయన ఫిర్యాదు చేశారు. సుష్మా స్వరాజ్, వసుంధర రాజే, లలిత్ మోదీలపై కడమ్ కౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని వినయ్ కోర్టును అభ్యర్థించాడు. -
'నా ఆతిథ్యంతో రాహుల్ -వాద్రాలు లబ్దిపొందారు'
న్యూఢిల్లీ:ట్వీట్ల మీద ట్వీట్లతో రాజకీయ నేతలకు గుబులు పుట్టిస్తున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ ... తన ఖాతాలోంచి మరో వికెట్ బయటకు తీశారు. మోదీ గేట్లో రోజుకొక పేరు బయటపెడుతూ గందరగోళం సృష్టిస్తున్న లలిత్ మరో ట్విట్టర్ బాంబ్ పేల్చారు. అంతకుముందు బీజేపీ యువ నాయకుడు వరుణ్ గాంధీని టార్గెట్ చేసిన లలిత్ మోదీ.. ఇప్పుడు నేరుగా రాహుల్ గాంధీని కూడా వివాదంలోకి లాగారు. తన ఆతిథ్యంతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లబ్ధిపొందారని పేర్కొన్నాడు. రాహుల్ తో పాటు అతని బావ రాబర్ట్ వాద్రా కూడా తనను కలిసినట్లు స్పష్టం చేశాడు. ఈ మేరకు శుక్రవారం రాహుల్-వాద్రాలతో కలిసి దిగిన పలు ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ మండిపడ్డారు. లలిత్ అధికార పార్టీ బీజేపీ లబ్ది పొందే క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ నేతలపై టార్గెట్ చేస్తున్నాడని విమర్శించారు. -
ఎప్పుడూ తప్పు చేయలేదు
సురేశ్ రైనా స్పష్టీకరణ న్యూఢిల్లీ: వ్యాపారవేత్తనుంచి డబ్బులు తీసుకున్నానంటూ తనపై ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోది చేసిన ఆరోపణలను భారత క్రికెటర్ సురేశ్ రైనా ఖండించాడు. ఏ స్థాయిలో అయినా తాను ప్రాతినిధ్యం వహించిన జట్టు తరఫున నిజాయితీగా ఆడానని, ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడలేదని అతను అన్నాడు. తన మేనేజ్మెంట్ కంపెనీ రితి స్పోర్ట్స్ ద్వారా రైనా ఒక మీడియా ప్రకటనను విడుదల చేశాడు. ‘నా గురించి ఇటీవల మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో స్పందించాల్సి వస్తోంది. కెరీర్ ఆసాంతం నేను నిజాయితీగా, అంకిత భావంతో క్రికెట్ ఆడాను. ఏ దశలోనూ ఎలాంటి తప్పు చేయలేదు. నాపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవం. సదరు వ్యక్తిపై న్యాయపరమైన చర్యలు తీసుకునే ఆలోచన కూడా ఉంది’ అని రైనా వివరణ ఇచ్చాడు. రైనాతో పాటు జడేజా, బ్రేవో బయటి వ్యక్తులనుంచి లంచాలు తీసుకున్నారని ఇటీవల లలిత్ మోది వెల్లడించారు. అయితే ఐసీసీ, బీసీసీఐ ఈ విషయంలో ముగ్గురు ఆటగాళ్లకూ క్లీన్చిట్ ఇచ్చాయి. -
నేటి బలిపశువు.. సుధాంశు మిట్టల్
ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ మరో అస్త్రాన్ని బయటకు తీశారు. తాజాగా బీజేపీ నాయకుడు సుధాంశు మిట్టల్‌ను బలిపశువుగా చేశారు. ఆయన ఏమీ లేని స్థాయి నుంచి కోటీశ్వరుడిగా ఎలా ఎదిగారో త్వరలోనే 'లలిత్‌గేట్' ద్వారా వెల్లడిస్తానని ట్వీట్ చేశారు. ఒకప్పుడు టెంట్వాలాగా ఉండే సుధాంశు మిట్టల్ కథను వచ్చే వారం అందిస్తానని తెలిపారు. ఐపీఎల్ కుంభకోణంలో పీకల్లోతు మునిగిపోయిన లలిత్ మోదీ.. ఇప్పుడు తాజాగా హవాలా ఆపరేటర్ వివేక్ నాగ్‌పాల్‌తో మిట్టల్‌కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. 'బ్రేకింగ్ న్యూస్' అంటూ మొదలుపెట్టిన ట్వీట్లో.. వివేక్ నాగ్‌పాల్ అనే హవాలా ఆపరేటర్‌తో సుధాంశు మిట్టల్‌కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఆ తర్వాత వరుసపెట్టి మరో రెండు ట్వీట్ అస్త్రాలు సంధించారు. అటు కాంగ్రెస్ పార్టీని, ఇటు బీజేపీని రెండింటినీ టార్గెట్ చేస్తున్న లలిత్ మోదీ.. ఇంకా ఎవరెవరి పేర్లు బయటపెడతారో, ఎన్ని సంచలనాలకు దారితీస్తారోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. Wait 4 details on #racketeer #Tentwala @SudhanshuBJP Rags to #riches story coming live via #LALITGATE in next week pic.twitter.com/PhQbye1jud — Lalit Kumar Modi (@LalitKModi) July 1, 2015 BREAKING NEWS : WORLD EXCLUSIVE Bought to u by #LALITGATE 🇮🇳 wants to know @SudhanshuBJP what is your relationship pic.twitter.com/ZoB2OsZME9 — Lalit Kumar Modi (@LalitKModi) July 1, 2015 2/2 with master hawala racketeer and bagman #viveknagpal #Lalitgate #🇮🇳wantstoknowtruth from @SudhanshuBJP pic.twitter.com/oM5ckB1ibX — Lalit Kumar Modi (@LalitKModi) July 1, 2015