
మాజీ విశ్వసుందరి, నటి సుస్మితా సేన్, తాను డేటింగ్‌లో ఉన్నామని మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ గురువారం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించాడు. వీరిద్దరు మాల్దీవుల్లో షికార్లు చేసిన ఫొటోలు, లండన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా పిక్స్‌ను లలిత్ మోదీ షేర్ చేశాడు. ఈ సందర్భంగా సుస్మితాను తన బెటర్ హాఫ్(భార్య) అంటూ పరిచయం చేశాడు మోదీ. ఆ తర్వాత ప్రస్తుతం తాము డేటింగ్‌లో ఉన్నామనీ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశాడు.
చదవండి: ప్రముఖ నటుడు, నటి రాధిక మాజీ భర్త మృతి
దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహరం మీడియాలో, సోషల్ మీడియాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటి వరకు సుస్మితా దీనిపై స్పందించలేదు. ఈ క్రమంలో మాల్దీవ్స్‌లోని స్వీమ్మింగ్ ఫూల్‌లో ఆమె ఒక్కతే ఎంజాయ్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనికి బ్యాగ్రౌండ్‌లో ‘ఐ వాంట్ యు టూ నో.. యూ ఆర్ ద లవ్ ఆఫ్ మై లైఫ్’ అనే ఇంగ్లిష్ సాంగ్‌ను జత చేసింది. కాగా సుస్మితా గతంలో తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్ రోహ్మన్ షాతో మూడేళ్లు డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే.
చదవండి:
నెలకు రూ. 25 లక్షలు ఇస్తాను, భార్యగా ఉండమన్నాడు
మూడోసారి ప్రేమలో పడ్డ సుష్మితా సేన్, ప్రియుడు ఎవరో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment